Karthika Deepam2 : శివన్నారాయణ ఇంటికి దీప.. జ్యోత్స్నకి కార్తీక్ వార్నింగ్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -274 లో...... కార్తీక్, దీప లు శౌర్య దగ్గరికి వెళ్లి మాట్లాడతారు. ఇక నువ్వు టాబ్లెట్ వేసుకునే అవసరం లేదని శౌర్యకి చెప్తాడు కార్తీక్. అప్పుడే డాక్టర్ వచ్చి.. పాపకి ఇంకేం ప్రాబ్లమ్ లేదని చెప్పగానే దీప, కార్తీక్ లు హ్యాపీగా ఫీల్ అవుతారు. శౌర్యని తీసుకొని ఇంటికి వెళ్ళగానే అనసూయ హారతి ఇస్తుంది. ఇంట్లోకి వచ్చిన శౌర్యని కాంచన ప్రేమగా దగ్గర కి తీసుకుంటుంది. అందరు శౌర్యని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంటే.. దూరం నుండి జ్యోత్స్న వచ్చి చూసి వెళ్లడం కార్తీక్ చూసి మళ్ళీ వస్తానంటూ వెళ్తాడు. జ్యోత్స్న కార్ కి కార్తీక్ సైకిల్ అడ్డుగా వదిలేస్తాడు. దాంతో జ్యోత్స్న కార్ ఆపుతుంది. నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావంటూ కార్తీక్ తన విశ్వరూపం చూపిస్తాడు. నువ్వు కావాలి బావ అని జ్యోత్స్న అనగానే.. కానీ నాకు నువ్వు వద్దని కార్తీక్ ఘాటుగా సమాధానం చెప్తాడు. నన్ను బాధపెడుతున్నావ్ బావ అని జ్యోత్స్న అంటుంది. ఇంతకు డబ్బు ఎవరు కట్టారని అనగానే కార్తీక్ అని కార్తీక్ చెప్తాడు. దాంతో జ్యోత్స్న షాకింగ్ గా చూస్తుంది. కాంచన వాళ్ళు టీ తాగుతుంటే.. అప్పుడే కార్తీక్ చిరాకుగా వస్తాడు. కాంచన తన టీ ఇస్తుంది. ఒరేయ్ శౌర్య హాస్పిటల్ లో ఉన్నప్పుడు పూజ చేపిస్తానని మొక్కుకున్నానని కాంచన అనగానే.. సరే అమ్మ నా కూతురు బాగుంది అది చాలు అని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత కాంచన అనసూయకి ఏదో చెప్పబోతు.. దీప ఉందని ఆగిపోతుంది. దీప వెళ్ళాక ఏంటి ఏదో చెప్పాలనుకున్నావని కాంచనని అనసూయ అడుగుతుంది. నేను ఇంట్లో చిన్న బర్త్డే చేసుకున్నా కూడా మా వాళ్లు వస్తారు. అలాంటిది ఇప్పుడు మా వాళ్ళు దూరం అయ్యారంటూ కాంచన ఎమోషనల్ అవుతుంది. నువ్వు బాధపడకు చెల్లి త్వరలోనే మీ వాళ్ళు కలుస్తారని కాంచనతో అనసూయ అంటుంది. అదంతా దీప వింటుంది. సుమిత్ర బంగారం తాకట్టు పెట్టి డబ్బు ఇచ్చి ఉంటుందా అని జ్యోత్స్న సుమిత్ర నగలు ఉన్నాయా లేవా అని చూస్తుంది. నగలు ఉండడంతో మరి వాళ్లకి డబ్బు ఎక్కడ నుండి వచ్చిందని జ్యోత్స్న అనుకుంటుంది. అప్పుడే సుమిత్ర వచ్చి.. నేనేం ఇవ్వలేదు.. నగలు తాకట్టు పెట్టి ఇచ్చానని చూస్తున్నావా అని సుమిత్ర అంటుంది. ఎవరు సాయం చేసారో కనుక్కుంటానని జ్యోత్స్న అంటుంది. అందరు హాల్లో ఉంటారు. శివన్నారాయణ ఇంటికి దీప వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : ప్రాణహాని ఉందన్న సీఐ.. భార్యని తప్పుగా అర్థం చేసుకుంటున్నాడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -321 లో..... ఇంట్లో ఏం జరిగిన సరే శ్రీలత వాళ్ళని రామలక్ష్మి అనుమానిస్తూ ఉంటుంది. దాంతో శ్రీలత బాధపడి వెళ్ళిపోతుంది. అత్తయ్యగారు నిజంగానే మారిపోయారు అక్క.. నాతో చెప్పిందని రామలక్ష్మితో శ్రీవల్లి అంటుంది. అమ్మ పూర్తిగా మారిపోయింది వదిన.. నువ్వు పూర్తిగా అమ్మని అపార్ధం చేసుకుంటున్నావని సిరి అంటుంది. ఇంక ఇది రిపీట్ కానివ్వను.. నువ్వు బాధపడకూ అని సిరితో రామలక్ష్మి చెప్తుంది. శ్రీలత బాధపడుతూ ఉంటుంది. దాంతో సీతాకాంత్ వచ్చి సందీప్ ధన మీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను.. ఎవరైతే అమ్మని నవ్విస్తారో వాళ్ళకి గిఫ్ట్ అని చెప్తాడు. దాంతో సందీప్, ధనలు శ్రీలతని నవ్వించే ప్రయత్నం చేస్తారు కానీ శ్రీలత నవ్వదు సీతాకాంత్ కూడా ట్రై చేస్తాడు శ్రీలత నవ్వదు. అప్పుడే రామలక్ష్మి, సిరి, శ్రీవల్లి వస్తారు. శ్రీవల్లి ట్రై చేసినా శ్రీలత నవ్వదు. దాంతో మీ కోసం అయిన తనని నవ్విస్తానని రామలక్ష్మి అనుకుని మొదట సీతాకాంత్ కి చెక్కిలి గింతలు పెడుతుంది. ఆ తర్వాత శ్రీలతకి చెక్కిలి గింతలు పెట్టగానే.. తను నవ్వుతుంది. మళ్ళీ ఒక్కసారిగా ఎమోషనల్ అవుతుంది. నేను మారాను అన్న కూడా వినట్లేదని అంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి నగలు  శ్రీలత ఇస్తుంది. అప్పుడే సీతాకాంత్ ఫ్రెండ్ సీఐ ఇంటికి వస్తాడు. మీతో మాట్లాడాలని సీతాకాంత్ ని పక్కకి రమ్మని చెప్తాడు. ఇక్కడే చెప్పండి అని సీతాకాంత్ అనగానే.. మీ భార్య మీకు హాని ఉందంటూ శ్రీలత, సందీప్, ధనలపై కంప్లైంట్ ఇచ్చిందనగానే అందరు షాక్ అవుతారు. సీతాకాంత్ తన ఫ్రెండ్ తో మాట్లాడి పంపిస్తాడు. నువ్వు ఎందుకు మా వాళ్ళు మారారు అంటే నమ్మట్లేదని రామలక్ష్మిపై సీతాకాంత్ కోప్పడతాడు. నువ్వు నమ్మాలి అంటే ఏం చెయ్యాలి వదిన అని సందీప్ అంటాడు. మీరు నమ్మాలి అంటే ఏం చెయ్యాలో నాకు తెలుసు అంటూ శ్రీలత పైకి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi :  పోలీస్ గా అప్పు.. పాపతో దుగ్గిరాల ఇంట హ్యాపీ మూమెంట్స్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -638 లో..... రాజ్, కావ్య ఆఫీస్ లో ఉండగా అప్పుడే అపర్ణ ఫోన్ చేసి.. మీ అక్కకి పాప పుట్టిందని చెప్తుంది. దాంతో రాజ్, కావ్య ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు. స్వప్న తన బిడ్డతో హాస్పటల్ నుండి ఇంటికి వస్తుంది. కావ్య హారతి ఇచ్చి మరి ఆహ్వానిస్తుంది. అందరు పాపని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంటే రాహుల్, రుద్రాణి మాత్రం ఏం పట్టనట్టు ఉంటారు. ఇందిరాదేవి స్వప్న కూతురుతో ముద్దాడుతూ ఉంటుంది. ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని మురిసిపోతంటే.. ఇప్పటికైనా ఎవరి ఆస్తులు వాళ్లకు వస్తే అందరు హ్యాపీ అని ధాన్యలక్ష్మి అంటుంది. వారసుడు వస్తాడనుకుంటే పాపని తెచ్చిందంటూ రుద్రాణి నిరాశగా మాట్లాడుతుంటే.. నువ్వు ఆడదానివే కదా అంటూ ఇందిరాదేవి రుద్రాణిని కోప్పడుతుంది. అప్పుడే రాజ్ కి డాక్టర్ ఫోన్ చేసి.. మీ తాతయ్య కోమాలో నుండి బయటకు వచ్చాడని చెప్పగానే అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. మహాలక్ష్మి అడుగుపెట్టింది ఇలా జరిగిందని కావ్య అంటుంది. రాజ్, కావ్య, ఇందిరాదేవిలు సీతారామయ్య దగ్గరికి వెళ్లి మాట్లాడతారు. మరొకవైపు అప్పు పోలీస్ అయి కనకం దగ్గరికి వస్తుంది. ముందు తనని ఫ్రాంక్ చేస్తుందని అనుకుంటుంది కానీ అప్పు నిజం గానే పోలీస్ అయిందన్న విషయం కళ్యాణ్ చెప్తాడు. దాంతో కృష్ణమూర్తి, కనకంలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వెళ్లి మీ పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండని అప్పు, కళ్యాణ్ లకి కనకం చెప్తుంది. మరొకవైపు స్వప్న పాపకి బారసాల చెయ్యాలని ఇందిరాదేవి అంటుంది. ఆ బాధ్యత రాజ్, కావ్య చూసుకుంటారని సుభాష్ అంటాడు. తరువాయి భాగంలో స్వప్న పాప ఏడుస్తుంటే.. కావ్య ఎత్తుకొని పాట పాడుతూ పాప బజ్జోపెడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిదో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

వాళ్లని ఒక్కటి చెయ్యాలని చూస్తున్న వేదవతి.. కొడుకు గురించి తెలుసుకున్న రామరాజు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -74 లో.... విశ్వ దగ్గరికి రామరాజు వచ్చి ఇంకొకసారి నా కొడుకు జోలికి వస్తే చంపేస్తానని వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత ధీరజ్ టాబ్లెట్ కోసం వెతుకుతు ఉంటాడు. అప్పుడే ప్రేమ వచ్చి ఏం కావాలి చెప్పు హెల్ప్ చేస్తానని ప్రేమ అనగానే నువ్వు హెల్ప్ చేస్తావా అంటూ ధీరజ్ వెటకారంగా మాట్లాడతాడు. ఆ తర్వాత ధీరజ్ టాబ్లెట్ వేసుకుంటూ వాటర్ తీసుకొని రమ్మని వేదవతిని పిలుస్తాడు. వేదవతి వాటర్ తీసుకొని వస్తుంటే.. నర్మద ఆపుతుంది. ధీరజ్ పనులు కూడా మీరే చేస్తే ప్రేమ, ధీరజ్ లు ఎప్పుడు ఒకటి అవుతారు. ప్రేమ తీసుకొని వెళ్తుంది ఆగండి అంటూ నర్మద ఆపుతుంది. ధీరజ్ వాటర్ అని పిలుస్తుంటే ప్రేమ వాటర్ తీసుకొని వెళ్తుంది. దీరజ్ తీసుకోడు ప్రేమ కోపంగా అక్కడ పెట్టి వెళ్ళిపోతుంది. దాంతో దీరజ్ గదిలో నుండి బయటకు వస్తాడు. కింద పడిపోతుంటే ప్రేమ పట్టుకుంటుంది. అది చూసి నర్మద వేదవతి లు హ్యాపీగా ఫీల్ అవుతారు. విశ్వ కోపంగా ఇంటికి వస్తాడు. జరిగింది మొత్తం చెప్పగానే భద్రవతి కోపంగా రామారాజుని పిలుస్తుంది. ఎందుకు నా అల్లుడిపై చెయ్ వేసావని అడుగుతుంది. నా కొడుకు జోలికి ఇంకోసారి వస్తే  మర్యాదగా ఉండదు పెంపకం అలాగే ఉంటుందా అని రామరాజు కోప్పడతాడు. పెంపకం గురించి నువ్వే మాట్లాడాలి ఇద్దరు లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. పెద్దోడు ఒక అమ్మాయిని ప్రేమించిన తాగి పడిపోతున్నాడు అనగానే అందరు షాక్ అవుతారు. తరువాయి భాగంలో ప్రేమపై కోపం తో ధీరజ్ పడుకోవడానికి బయటకు వెళ్తాడు. తిరుపతి వాళ్ళు మళ్ళీ గదిలోకి పంపిస్తారు. ప్రేమ కోపంగా చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : శౌర్య ఆపరేషన్ సక్సెస్.. కార్తీక్, దీపలు ఎమోషనల్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'( karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -273 లో..... అసలు ఎవరు సాయం చేసి ఉంటారని కాశీతో కార్తీక్ అనగానే..మావయ్య గారు అయి ఉంటారని కాశీ అంటాడు. అయన అంత సీక్రెట్ గా సాయం చేసి వెళ్లిపోయే రకం కాదు.. అయిన అలాంటి వాళ్ళ సాయం అవసరం లేదని కార్తీక్ అంటాడు. సాయం చేసింది మీ పిన్ని అని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారోనని దీప అనుకుంటుంది. నీకు ఏమైనా తెలుసా అక్క అని దీపని కాశీ అడుగుతాడు. తనకి ఏం తెలుసుస్తుంది. తన టెన్షన్ లో తను ఉందని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత శౌర్య ఆపరేషన్ గురించి దీప టెన్షన్ పడుతుంది. అప్పుడే డాక్టర్ వచ్చి ఆపరేషన్ సక్సెస్ అని చెప్పగానే.. దీప, కార్తీక్ ల ఆనందానికి అవధులు లేకుండా పోతాయ్. మరొకవైపు కావేరి ఎక్కడికి వెళ్ళిందని శ్రీధర్ టెన్షన్ పడుతుంటాడు. అప్పుడే కావేరి వస్తుంది. ఎక్కడికి వెళ్ళావని అడుగగా.. పూజ సామాను కొనడానికి అని అబద్దం చెప్తుంది. కావేరి కంగారుపడుతుంటే తనకి అబద్ధం చెప్పిందని శ్రీధర్ కి అర్థమవుతుంది. కార్తీక్, దీపలు ఇంతవరకు వాళ్ళు పడ్డ బాధని గుర్తుచేసుకుంటారు. కార్తీక్ ఏడుస్తు.. శౌర్యకి ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఎమోషనల్ అవుతాడు. శౌర్యకి నాన్నని అవ్వడం కోసం నీ మెడలో తాళి కట్టాను.. అది నాన్న అని మొదటి సారి పిలిచినప్పుడు తన కంట్లో మెరుపు చూసాను.. తను బతుకుతుందని  నమ్మకం వచ్చిందంటూ కార్తీక్ బాధపడతాడు. కార్తీక్ చిన్నపిల్లాడిలాగా దీప, కాళ్ళపై తల వాల్చి పడుకుంటాడు. అప్పుడే నర్సు వచ్చి పాప స్పృహలోకి వచ్చిందని చెప్పగానే.. ఇద్దరు శౌర్య దగ్గరికి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : భర్తకి పొంచి ఉన్న ప్రమాదం.. సవతి తల్లి కపటప్రేమ సీతాకాంత్ తెలుసుకోగలడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -320 లో.... మమ్మల్ని క్షమించావ్ అది చాలు అని సందీప్ అనగానే.. ఎవరు మిమ్మల్ని క్షమించింది మిమ్మల్ని ఎప్పటికి క్షమించనని సీతాకాంత్ అనగానే.. అందరు షాక్ అవుతారు. మరి ఏంటి మిమ్మల్ని ఎప్పుడో క్షేమించాను.. ఇక జరిగింది అంత అందరు మర్చిపోండి అంటూ సీతాకాంత్ అందరి దగ్గర మాట తీసుకుంటాడు . శ్రీలత అందరికి వంట చేస్తుంది. అందరూ బాగుంది అంటూ తింటు ఉంటారు. అప్పుడే రామలక్ష్మికి ఫోన్ వస్తుంది. దాంతో ఫోన్ తీసుకొని పక్కకి వస్తుంది. ఏంటి స్వామి అంటూ మాట్లాడుతుంది. స్వామి రమ్మని చెప్పడంతో రామలక్ష్మి వెళ్తుంది. రామలక్ష్మి స్వామి దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంది. మీకు ప్రమాదం మొదలైందని చెప్పగానే రామలక్ష్మి షాక్ అవుతుంది. దానికి పరిష్కారం చెప్పండి అని రామలక్ష్మి అడుగగా.. నీ భర్తని నువ్వు కాపాడుకోవాలి.. శక్తి మిమ్మల్ని కాపాడుతుంది. మీరు ఇక మరింత జాగ్రత్తగా ఉండండి అని స్వామి చెప్తాడు. మరొకవైపు సిరికి ధన ఫ్రూట్స్ తినిపిస్తూ ఉంటాడు. ఇంకా చాలు అంటుంటే ప్రేమగా కోసిరి కోసిరి తినిపిస్తూ ఉంటాడు. అప్పుడే సీతాకాంత్ జ్యూస్ తీసుకొని వస్తాడు. పైన సందీప్ ఫోన్ మాట్లాడుతూ చూసుకోకుండా పూలకుండికి తాకిస్తాడు. దాంతో అది సీతాకాంత్ పై పడిపోబుతుంటే సీతాకాంత్ ని పక్కకి లాగుతుంది శ్రీలత. అదంతా రామలక్ష్మి చూస్తుంది.సందీప్ త్వరగా వచ్చి అన్నయ్య నేను చూసుకులేదంటూ కాళ్ళు పట్టుకొని రిక్వెస్ట్ చేస్తాడు. ఇదే అతి వినయం వద్దని చెప్పాను.. మీరు కావాలనే ఇదంతా చేస్తున్నారని రామలక్ష్మి అనగానే అందరు షాక్ అవుతారు. మీరు మారలేదు అంటుంటే వాళ్ళు మారారు. నువ్వు అలా అపార్ధం చేసుకొకని సీతాకాంత్ అంటాడు. నేను నిజంగానే మారాను అమ్మ అంటూ శ్రీలత ఏడుస్తు వెళ్ళిపోతుంది. అమ్మ మారిపోయిందని సిరి, శ్రీవల్లిలు అంటుంటే రామలక్ష్మి ఎటు తేల్చుకోలేకపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే  

Brahmamudi : స్వప్నకి పాప పుట్టినవేళ.. సీతారామయ్య కోమాలోంచి బయటకొచ్చాడు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -637 లో.... రాజ్, కావ్య డబ్బు డిపాజిట్ చెయ్యడానికి వెళ్తుంటారు. దారిలో రాజ్ కి వెక్కిళ్లు వస్తాయి. రాజ్ కి కావ్య ముద్దు పెడుతుంది. ఏంటి ఇది సినిమా అనుకున్నావా ముద్దు పెట్టగానే వెక్కిళ్లు ఆగిపోవడానికి అంటూ వాటర్ కోసం షాప్ దగ్గర ఆగగా రాజ్ వెళ్లడం చూసి రౌడీ వచ్చి డబ్బు తీసుకొని వెళ్తాడు. రాహుల్ కార్ లో పడేసి పారిపోతాడు. రౌడీని రాజ్ , కావ్య పట్టుకుంటారు. నిన్ను ఎవరు ఇలా చెయ్యమన్నారని బెదిరించగా రాహుల్ అని రౌడీ చెప్తాడు. దాంతో రాజ్, కావ్య షాక్ అవుతారు. ఇంటికి వెళ్లి రాహుల్ సంగతి చెప్పాలని రాజ్ అనగానే.. మీరు వెళ్ళండి. ఇప్పుడు నాకు మొత్తం అర్ధం అయింది.. నేను వస్తానంటూ కావ్య అంటుంది. ఇంటికి వెళ్లి రాజ్ రాహుల్ ని కొడతాడు. రెండు కోట్ల డబ్బు కొట్టేసాడని రాజ్ అనగానే అందరు షాక్ అవుతారు. అసలు నీ దగ్గర డబ్బు లేదన్నావ్.. నన్ను షేర్ మార్కెట్ వాళ్ళు బెదిరిస్తుంటే కూడా సైలెంట్ గా ఉన్నావని రుద్రాణి అంటుంది. అప్పుడే కావ్య రుద్రాణిని బెదిరించిన వాళ్ళని తీసుకొని వస్తుంది. వీళ్లేనా అంటూ కావ్య అనగానే.. రుద్రాణి షాక్ అవుతుంది. వీళ్ళు జూనియర్ ఆర్టిస్ట్ లని కావ్య చెప్తుంది. వాళ్ళు కూడా నిజం ఒప్పుకొని వెళ్ళిపోతారు. ఎందుకు ఇలా దిగజారి ప్రవర్తిస్తున్నావ్ రుద్రాణి అంటూ ఇందిరాదేవి కోప్పడుతుంది. ఇదంతా రాజ్, కావ్య నిజస్వరూపం బయట పెట్టాలని చేసాను.. ఇన్ని రోజులు డబ్బు లేదంటూ ఇంత డబ్బు ఎందుకు దాచిపెట్టుకున్నారని రుద్రాణి అడుగుతుంది. నేనేం చేసిన కంపెనీ కోసమే.. ఏదైనా మూడు నెలల గడువు అడిగాను కదా.. అప్పటి వరకు ఆగండి అని రాజ్ చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మూడు నెలల టైమ్ గడుస్తూ ఉంటుంది. స్వప్నకి నొప్పులు మొదలవుతాయి హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు. కావ్యకి అపర్ణ ఫోన్ చేసి నువ్వు పిన్నివి అయ్యావ్.. స్వప్నకి పాప పుట్టిందని చెప్తుంది. తరువాయి భాగంలో స్వప్న బిడ్డతో హాస్పిటల్ నుండి ఇంటికి వస్తుంది. అప్పుడే డాక్టర్  రాజ్ కి ఫోన్ చేసి మీ తాతయ్య స్పృహలోకి వచ్చాడని చెప్పగానే అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

బాలకృష్ణకు ఫోన్ చేసిన విశ్వక్..షాకైన సుమ

  సుమ అడ్డా షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి లైలా మూవీ టీమ్ వచ్చింది.హీరో విశ్వక్ సేన్ , హీరోయిన్ ఆకాంక్ష శర్మ, డైరెక్టర్ రామ్ నారాయణ్, డిజె టిల్లు ఫేమ్ ప్రణీత్ రెడ్డి వచ్చారు. ఈ షో ప్రోమో ఫైనల్ లో బాలకృష్ణ మాట్లాడారు..ఎందుకు మాట్లాడారో చూద్దాం. ఐతే రీసెంట్ గా లైలా మూవీ టీజర్ రిలీజ్ సందర్భంలో బాలకృష్ణ అటు డిజె టిల్లుకి, ఇటు విశ్వక్ సేన్ కి ముద్దులు పెట్టేసారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. సుమ ఆ వీడియో ప్లే చేసి  చూపించింది. "అదేం లేదు మేడం మేమందరం కలిసి కాఫీ తాగుతూ అలా ఎంజాయ్ చేసాం" అని కవర్ చేసాడు విశ్వక్. కానీ వెనక బ్యాక్ గ్రౌండ్ లో మాన్షన్ బోటిల్ మూత తీసిన చప్పుడు వినిపించేసరికి "ఆ మాకు అర్ధమయ్యింది" అంది సుమ..కానీ మీ ప్రేమలు చూస్తుంటే నాకు చాలా కుళ్ళుగా ఉంది" అంది సుమ. సరే "ఒక్కసారి బాలకృష్ణ గారికి ఫోన్ కొడతారా"  అని విశ్వక్ ని అడిగింది సుమ. "ఎవరు చేయమన్నారు అని అడిగితే నేను సుమ గారి పేరే చెప్తా" అన్నాడు. "అమ్మో నా పేరు చెప్పొద్దూ" అంటూ సుమ కంగారు పడింది. కానీ ఈలోపు విశ్వక్ బాలకృష్ణకి ఫోన్ చేసాడు. సెట్ లో ఫోన్ రింగ్ అయినా శబ్దం కూడా వినిపించింది. ఫోన్ తీసిన బాలకృష్ణ "ఎవరు" అని అడిగేసరికి సుమ ఒక్క నిమిషం షాకైపోయింది. నిజానికి సెలబ్రిటీస్ ఫోన్స్ అంటే ఎప్పుడూ బిజీ రావడమే వాళ్ళ పిఆర్ వాళ్ళు మాట్లాడడమో చేస్తారు. కానీ ఇక్కడ బాలకృష్ణ ఫోన్ రింగ్ అవడం స్వయంగా ఆయనే మాట్లాడ్డం తో సుమ ఖంగు తిన్నది.  

చైనాలో, అమెరికాలో కూడా నూకరాజు వీడియోస్ వైరల్

  జబర్దస్త్ నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో నూకరాజు మంచి జోష్ తో స్కిట్ చేసాడు. తాగుబోతు రమేష్, నూకరాజు స్కిట్ లో చాలా కామెడీ చూపించారు. ఐతే రీసెంట్ గా నూకరాజు "గుట్టకింద " అనే సాంగ్ పాడి ఆసియాతో కలిసి వీడియో సాంగ్ కూడా చేసాడు. ఆ సాంగ్ దాదాపు 11 మిలియన్ వ్యూస్ సంపాదించుకున్నాయి. సోషల్ మీడియా ఈ సాంగ్ ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. అలాగే నూకరాజు డాన్స్ స్టెప్స్ కూడా బాగా వైరల్ అయ్యాయి. ఏ షో ఎపిసోడ్ లో ఐనా కూడా నూకరాజు ఈ సాంగ్ తో ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పుడు జబర్దస్త్ లో కూడా ఇదే సాంగ్ తో ఎంట్రీ ఇచ్చాడు. రాగానే తాగుబోతు రమేష్ కూడా డాన్స్ వేసాడు. "ఈ పాట పాడింది నువ్వేనారా" అని అడిగాడు. "అవును సర్ ..ఈ పాటలో మేల్ సింగర్ ని నేనే సర్..రెస్పాన్స్  ఎలా వచ్చిందో తెలుసా సర్. అందరూ మా వీడియోలే చూస్తున్నారు. చైనాలో మా వీడియోలే అంతెందుకు అమెరికాలో కూడా మా వీడియోలే సర్ " అన్నాడు. దానికి తాగుబోతు రమేష్ "రాత్రి అమెరికా వీడియోలు చూసానే నీ వీడియో లేదయ్యా" అన్నాడు. " సర్ మీరు గుట్ట కింద వీడియో కాకుండా గుట్ట వెనకాల వీడియోలు చూసుంటారు సర్" అన్నాడు. ఆ ఒక్క డైలాగ్ తో తాగుబోతు రమేష్ పరువు తీసేసాడు నూకరాజు.  

కుంభమేళాలో మెరిసిన బిందు మాధవి..  వాళ్లకి చివాట్లు.. ఈమెకు పొగడ్తలు!

  బిగ్ బాస్ అన్ని సీజన్లో  లేడి కంటెస్టెంట్స్ లలో ఎవరైతే చివరి వరకు ఉండి టాప్-5 లో ఉంటారో వారే ఎక్కువ క్రేజ్ ని తెచ్చుకుంటారు. వారిలో ప్రియాంక జైన్, ఇనయా ఉండగా ఓటీటీ సీజన్ లో సత్తా చాటిన బిందు మాధవి ఒకరు. ఆడపులిగా ఆట ఆడి.. అఖిల్‌ని ఆడ.. అంటూ ఓ ఆట ఆడించి.. ఫైనల్‌లో అతన్ని మట్టికరిపించి బిగ్ బాస్ నాన్ స్టాప్ విజేతగా నిలిచింది బిందు మాధవి. నీ ముందే టైటిల్ గెలుస్తా.. నా సత్తా ఏంటో చూపిస్తానంటూ నటరాజ్ మాస్టర్ ముందు సవాల్ చేసి అన్నట్టుగానే అతని ముందే టైటిల్ గెలుచుకుంది. అయితే బిందు మాదవి బిగ్ బాస్ తర్వాత ఎక్కువగా కనపడలేదు. అడపాదడపా సినిమాల్లో, సిరీస్ లలో కనపడినా పెద్దగా స్కోప్ లేకుండా పోయింది. అయితే తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది ఈ భామ. ప్రయాగలో జరుగుతున్న మహాకుంభమేళాకి ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు వచ్చారు. ఇక తాజాగా బిందు మాధవి అక్కడికి వెళ్ళి గంగలో స్నానం చేసింది.  అయితే దానికి డిఫరెంట్ కామెంట్లు వస్తున్నాయి. రీసెంట్ గా  యాంకర్ లాస్య తన ఫ్యామిలీతో కలిసి మహా కుంభమేళాలో సందడి చేసింది. లాస్య అక్కడ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసింది. మహాకుంభమేళలో తమ  పర్యటనకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. "సంగమంలో ఒక పవిత్ర మునక వేసేసరికి నాలో ఏదో పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టుగా  అనిపించింది " అంటూ కామెంట్ చేసింది. ఇక దీనికి నెటిజన్లు కామెంట్ల మోత మోగించారు. అక్కడ కూడా ఫోటో షూట్స్ అవసరమా. మీరు వెళ్ళింది భక్తి కోసమా లేక ఇన్స్టా స్టోరీల కోసమా అంటూ ఒక నెటిజన్ ఘాటుగా అడిగాడు. అయితే బిందు మాధవి చేసిన ఈ పోస్ట్ లకి మాత్రం చాలావరకు పాజిటివ్ కామెంట్లు వస్తున్నాయి. అంటే ఇక్కడ మన బిహేవియర్ బట్టి ఎదుటివారి కామెంట్లు ఉంటాయి. భక్తి శ్రద్ధలతో చేయాల్సిన పూజలని ఫోటల కోసం, వ్లాగ్స్ కోసం చేస్తున్న కొంతమంది లాస్య, ప్రియాంక జైన్ లాంటి వారిని నెటిజన్లు తిడుతూనే ఉంటారు. బిందు మాధవి తన ఇన్ స్టాగ్రామ్ లో.. థాంక్ యూ అమిత్ ఫర్ కాప్చరింగ్ దిస్ ప్రెసియస్ మూమెంట్ అనే ట్యాగ్ లైన్ ఇచ్చి పోస్ట్ చేసింది. మొత్తంగా బిందు మాధవి మూడు ఫోటోలని షేర్ చేయగా థర్డ్ ఫోటో గురించి కాస్త నెగెటివ్ కామెంట్లు వస్తున్నాయి.  

సిరి హనుమంతు, దీప్తి సునైన హగ్గులు.. వీడియోపై షన్ను ఫ్యాన్స్ ఫైర్! 

  బిగ్‌బాస్‌ ద్వారా లాభమోచ్చిన వారికంటే నష్టపోయిందే ఎక్కువ మంది. అయితే నష్టపోయిన వారిలో షణ్ముఖ్ జస్వంత్ ఫస్ట్ బెంచ్ లో ఉంటాడు. ఎందుకంటే యూట్యూబ్, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా వచ్చిన భారీ పాపులారిటీతో బిగ్‌బాస్ సీజన్-5లోకి అడుగుపెట్టాడు షణ్ముఖ్(Shanmuk Jashwanth). అయితే హౌస్‌లోకి వెళ్లిన తర్వాత సిరి హనుమంతుతో తన బిహేవియర్ కారణంగా దారుణంగా ట్రోల్స్ కి గురయ్యాడు. దీంతో బిగ్‌బాస్ కప్పుపోయింది.. బయటికొచ్చిన తర్వాత లవర్ దీప్తి సునైన బ్రేకప్ చెప్పేసింది. అయితే షన్ను ఫ్యాన్స్ సిరి హనుమంతు, దీప్తి సునైనలపై ఫైర్ అయ్యారు. తాజాగా తన లవర్ శ్రీహన్ తో సిరి ఓ బిజినెస్ మొదలుపెట్టింది. తన సొంతూరు వైజాగ్‌లో ఓ బ్యూటీ క్లినిక్ స్టార్ట్ చేసింది. HK పర్మనెంట్ మేకప్ క్లినిక్ పేరుతో ఫిబ్రవరి 2న దీన్ని గ్రాండ్‌గా ప్రారంభించారు. ఈ ఓపెనింగ్‌కి బిగ్‌బాస్ సెలబ్రెటీలు చాలా మంది హాజరయ్యారు. అయితే అందులో దీప్తి సునైన కూడా ఉంది. నిజానికి షన్నుతో దీపూ బ్రేకప్ చెప్పడానికి ప్రధాన కారణం సిరి అన్నది అందరికి తెలిసిందే. అలాంటిది సిరి ఆహ్వానించగానే దీపూ ఇలా వైజాగ్‌లో వాలిపోవడం.. ఈ మేకప్ క్లినిక్‌ ప్రారంభోత్సవానికి రావడం అందరిని ఆశ్చర్యపరచింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియోల్లో సిరికి కంగ్రాట్స్ చెప్తూ హగ్గు ఇస్తూ దీప్తి సునైన(Deepthi sunaina) తెగ సంతోషంగా కనపడింది. ఇక ఈ వీడియోని దీప్తి సునైన, సిరి హనుమంతు తమ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ వీడియోలు చూసిన షణ్ముఖ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. నువ్వు బ్రేకప్ చెప్పడానికి రీజన్ అయిన సిరితో ఎలా సంతోషంగా నవ్వుతున్నావంటూ దీపూని సూటిగా అడుగుతున్నారు. మీరూ మీరూ ఒక్కటైపోయి షన్నుని మధ్యలో ఎర్రిపప్పని చేశారుగా అంటూ కామెంట్లలో తిట్టుకుంటున్నారు. ఇక ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

రైతును ఎంత చీప్ గా చూస్తున్నారో..ఆదిరెడ్డి ఫైర్

    ఇష్మార్ట్ జోడి 3 నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ వారం "ఛాలెంజ్ థీమ్" ఇచ్చారు. ఐతే ఇందులో యాంకర్ ఓంకార్ అడిగిన ప్రశ్నకు ఆదిరెడ్డి ఫుల్ ఫైర్ అయ్యాడు. ఆది మంచి ఫైర్ మీద మాట్లాడిన మాటలకు అందరికీ కన్నీళ్లు వచ్చేసాయి. "మీ ఫామిలీస్ లో ఫేస్ చేసిన ఛాలెంజ్ సిట్యుయేషన్ ఏంటి ? దాన్ని ఎలా అధిగమించారు " అని అడిగాడు. అంతే వెంటనే ఆదిరెడ్డి మైక్ తీసుకుని ఆపకుండా మాట్లాడాడు. " మా నాన్న జీవితం మొత్తం ఎక్కడ వేలు పెట్టినా లాస్ అన్నా. అగ్రికల్చర్ లోన్లు 11 .50 లక్షలు ఉన్నాయి 2012 లో. ఇది మా ఒక్కరిదే కాదన్నా..రైతు అన్న ప్రతీ ఒక్కరూ ఫేస్ చేసిన ప్రోబ్లం ఇది. నాకు కోపం వస్తూ ఉంటుంది. ఏ ఆఫీస్ కన్నా వెళ్ళు. రైతుల్ని చాలా చీప్ గా చూస్తారు. పోయి ఆడ కూర్చో. ఇట్రా..ఇక్కడుండు ..ఎన్నిసార్లు చెప్పా నీకు అంటూ చీదరించుకుని మాట్లాడతారు. ఫస్ట్ సర్ అని రైతును...గౌరవం ఇవ్వాలంటే ఫస్ట్ రైతుకు తర్వాత సైనికుడికి ఇవ్వాలి. కానీ అందరికీ గౌరవం ఇస్తూ వాళ్ళ ఇద్దరినీ వదిలేస్తూ ఉన్నారు అందరూ" అంటూ చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు. ఆ మాటలకు జోర్దార్ సుజాత కన్నీళ్లు పెట్టేసుకుంది. ఆ తర్వాత ఆదిరెడ్డి మాటలకు ఓంకార్ కూడా మాట్లాడాడు. "ప్రతీ ఒక్క రైతుకు గౌరవం ఇస్తే నిజంగా మనం తినే ప్రతీ మెతుకు ఒక అర్ధం..పరమార్ధం ఉంటుంది" అని ఆ ప్రోమోలో చెప్పాడు.  

ఏంటి రోహిణి గారు ప్రేమలో ఏమైనా పడ్డారా?

  బుల్లితెర మీద జబర్దస్త్ కామెడీ షో ద్వారా లేడీ కమెడియన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది రౌడీ రోహిణి. రోహిణి ఎక్కడ ఉంటె అక్కడ నవ్వులే నవ్వులు. ఈ మధ్య జబర్దస్త్ లోనే కాదు అన్ని షోస్ లో కనిపిస్తోంది. బలగం మూవీ, సేవ్ ది టైగర్స్ వంటి సినిమాలు, వెబ్ సిరీసులలో టైమింగ్ ఉన్న కామెడీ చేస్తూ నవ్విస్తోంది. ఐతే రోహిణి బిగ్ బాస్ సీజన్ 3 కి వెళ్లి వచ్చింది. అలాగే చాన్నాళ్లకు బిగ్ బాస్ 8  కి కూడా వెళ్లి వచ్చింది. ఐతే ఇంతకుముందు బిగ్ బాస్ కి వెళ్లినా రానంత పేరు ఈ సీజన్ 8 కి బాగా వచ్చింది. దాంతో ఇప్పుడు ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోకి అవినాష్, హరితో కలిసి వచ్చి మరీ ఎంటర్టైన్ చేస్తోంది. ఇక ఇప్పుడు రోహిణి బ్లాక్ శారీతో చేసిన ఒక రీల్ ఫుల్ వైరల్ అవుతోంది. అందాల రాముడు మూవీలో ఆర్తి అగర్వాల్ డాన్స్ చేసిన "చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి" అనే సాంగ్ కి అదిరిపోయే డాన్స్ చేసింది. దాంతో నెటిజన్స్ ఫుల్ ఫిదా ఐపోతున్నారు. "బ్లాక్ శారీలో సూపర్ గా ఉన్నారు. ఈ సాంగ్ తో ఆర్తి అగర్వాల్ ని గుర్తు చేశారు. ఏంటి రోహిణి గారు ఈ మధ్య మంచి జోష్ మీద రీల్స్ చేస్తున్నారు ప్రేమలో ఏమైనా పడ్డారా??? ..హాయ్ అక్కా మీ డాన్స్ చాలా బాగుంటుంది. రాక్ స్టార్ రోహిణి..రోహిణి గారు ఎందుకో నాకు కొత్తగా కనిపిస్తున్నారు...ఇంతకు పెళ్ళెప్పుడు...బరువు బాగా తగ్గారు ఎలా..శారీ ఎక్కడ తీసుకున్నారు" అంటూ బోల్డు ప్రశ్నలు అడిగేస్తున్నారు.

సిక్స్ ప్యాక్ కోసం ఆదిరెడ్డి కష్టాలు...మనకెందుకన్నా ఇలాంటి సాహసాలు..

  యూట్యూబ్ లో బిగ్ బాస్ రివ్యూస్ చెప్పే ఆదిరెడ్డి ఇప్పుడు బుల్లితెర స్టార్ ఐపోయాడు. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొన్న ఆదిరెడ్డి ఫైనల్ కి వెళ్లి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చాక సెలెబ్రిటీ హోదాతో టీవీ షోస్ కి వస్తున్నాడు. అలాగే తన భార్య కవితను కూడా షోస్ కి తీసుకొస్తున్నాడు. అలాగే విజయవాడలో ప్రముఖ సెలూన్ కంపెనీ జావేద్ హబీబ్ బ్రాంచ్ తీసుకొని ప్రారంభించాడు. ఇప్పుడు లేటెస్ట్ గా ఇష్మార్ట్ జోడి 3 కి తన భార్యతో కలిసి వచ్చాడు. ఇలా ఆదిరెడ్డి షోస్ అన్నిట్లో పాల్గొంటూ తన సత్తా చాటుతున్నాడు. ఇక ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో రీసెంట్ ఒక డంబెల్ తో వర్కౌట్ చేస్తున్న వీడియోని పోస్ట్ చేసాడు. ఐతే పాపం సిక్స్ ప్యాక్ కోసం తెగ కష్టపడుతున్నాడు. దాని గురించే ఆ పోస్ట్. "కనీసం ఈసారైనా ఆపకుండా చేయాలని కోరుకుంటున్నా.. ఇక్కడ పోస్ట్ చేయడానికి  కారణం పోస్ట్ చేసా కాబట్టీ అయినా ఆపకుండా చేస్తా అని నా లైఫ్ లో అనుకున్నవి అన్నీ చేయాలిగా కానీ.. ఈ ఒక్క బాడీ మ్యాటర్ లో ఫెయిల్ అవుతూనే ఉన్నా.. ప్రతి సంవత్సరం స్టార్ చేయటం స్టాప్ చేయటం.. నా శరీరంలో బలహీనమైన భాగం నా చేతులు చిన్నపాటి నుంచీ చాలా ఇన్ఫెరియారిటీ కాంప్లెక్స్ ఉండేది నాకు. ఆ ఫోబియా పోవాలని కూడా ఈ పోస్ట్ పెడుతున్నా..2018లో  50 కిలోలు బరువుతో  6.3 ఎత్తు ఉండేవాణ్ణి.. అలా అక్కడ నుండి ఇప్పుడు 88 కిలోలకు  వచ్చా.. ఏదో ట్రై చేస్తున్నా చూద్దాం... కానీ ప్రతీరోజూ అప్డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను" అని చెప్పాడు ఆదిరెడ్డి. ఇక నెటిజన్స్ ఐతే "ఆల్ ది బెస్ట్ ఆది... మొదటి రోజే మాకు ఈ సిక్స్ ప్యాక్ చూపించెయ్యాలా?? ఎయిట్ ప్యాక్ కోసం వెయిటింగ్...ఇంట్లో కుదరదు..జిమ్ కి వెళ్ళండి...ఫిట్ నెస్ మీద ఫోకస్ చేయడం బాగుంది..ఫిజికల్ గా మెంటల్ గా ఇవన్నీ అయ్యే పనులా కనిపించడం లేదు...మనకెందుకన్నా ఇలాంటి సాహసాలు.." అంటూ కొందరు పాజిటివ్ గా కొందరు నెగటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.  

Illu illalu pillalu : విశ్వ గొంతుపట్టుకొని వార్నింగ్ ఇచ్చిన రామరాజు.. అవమానించిన భద్రవతి!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -73 లో.......సాగర్, చందు, తిరుపతి లు మాట్లాడుకుటంటే.. అప్పుడే ధీరజ్ వస్తాడు. నేను ఈ రోజు ఇక్కడే పడుకుంటానని అంటాడు. అప్పుడే నర్మద వచ్చి.. టైమ్ చాలా అవుతుంది. పడుకోరా అని సాగర్ దగ్గరికి వస్తుంది. నర్మద ఈ ఒక్క రోజు ఇక్కడే పడుకుంటానని అనగానే సరే అంటు నర్మద వెళ్ళిపోతుంటుంది. నర్మదని ఎలా రిక్వెస్ట్ చేస్తున్నావ్ రా అంటూ తిరుపతి సాగర్ ని ఆట పట్టిస్తాడు. ముందు ఎవరు ప్రేమించారని సాగర్ ని తిరుపతి అడుగగా.. నేను కాదు, ముందు తనే నన్ను ప్రేమించమని వెంటపడిందని సాగర్ బిల్డప్ ఇస్తూ ఉంటాడు. అదంతా నర్మద విని నీ సంగతి చెప్తానని అనుకుటుంది. నువ్వు చెప్పేదేది నమ్మాలనిపించడం లేదని సాగర్ ని అటపట్టిస్తాడు తిరుపతి. ఆ తర్వాత అందరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. రాత్రి అందరు పడుకున్నాక ధీరజ్ దగ్గరికి రామరాజు వచ్చి.. తన దెబ్బలు చూసి ఎమోషనల్ అవుతాడు. తన కన్నీటి చుక్క ధీరజ్ చెయ్ పై పడుతుంది. ఆ తర్వాత ధీరజ్ లేచి నాన్న ఇక్కడికి వచ్చాడు.. నా దగ్గరికి వచ్చాడంటూ సాగర్ కి చెప్తూ ఎమోషనల్ అవుతాడు. మరుసటి రోజు ఉదయం నర్మద ముగ్గు వేస్తుంటే.. సాగర్ వచ్చి మాట్లాడతాడు. రాత్రి ఏదో అంటున్నావంటూ సాగర్ ని సరదాగా బెదిరిస్తూ ఉంటే అప్పుడే చందు వస్తాడు. అన్నయ్య నర్మదకి ముగ్గు ఎలా వెయ్యాలో చెప్తున్నానని సాగర్ అంటుంటే.. అంత చూసానులే అంటూ చందు అంటాడు. రామరాజు వెళ్తుంటే విశ్వ తన ఫ్రెండ్స్ తో కన్పిస్తాడు. దాంతో రామరాజు వెళ్ళి విశ్వ గొంతు పట్టుకొని.. నా కొడుకు జోలికి ఇంకొకసారి వస్తే బాగుండదంటు వార్నింగ్ ఇస్తాడు. తరువాయి భాగంలో రామరాజుని భద్రవతి పిలిచి.. ఎంత దైర్యంరా నా అల్లుడు గొంతు పట్టుకోవడానికి అంటుంది. అదేనా పెంపకమని రామరాజు అనగానే.. నీదేనా పెంపకం.. నీ పెద్ద కొడుకు ఒక అమ్మాయిని ప్రేమించాడు.. తాగి రోడ్డుపై పడిపోతున్నాడు. ఆ విషయం మిగతా కొడుకులకి కూడా తెలుసని భద్రవతి అనగానే.. రామరాజు షాక్ అవుతాడు. ఇక బాధతో లోపలికి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : శౌర్య ఆపరేషన్ కి సాయం చేసిన కావేరి.. గిల్టీగా ఫీల్ అయిన శివన్నారాయణ!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -272 లో.... శౌర్య ఆపరేషన్ కి కావాల్సిన డబ్బుని కావేరి కడుతుంది. డబ్బులు ఎవరు కట్టారని కార్తీక్, దీపలు రిసెప్షన్ కి వెళ్లి అడుగుగా అక్కడ కార్తీక్ కట్టారని ఉంటుంది. దాంతో వాళ్ళు షాక్ అవుతారు. నా పేరు మీద ఎవరు కట్టి ఉంటారని కార్తీక్ అనుకుంటాడు. అప్పుడే దూరంగా ఉన్న కావేరిని దీప చూస్తుంది. కార్తీక్ కి  నేను వచ్చిన విషయం చెప్పకన్న విషయం దీప గుర్తుచేసుకుంటుంది. దీప బయటకు వచ్చి.. కావేరిని కలుస్తుంది. మీరే కదా డబ్బు కట్టిందని అడుగుతుంది. ఎవరైతే ఏంటి నీ కూతురు బాగుంటే చాలు అని కావేరి అంటుంది. మీకు కట్టాల్సిన అవసరం ఏంటని దీప అడుగ్గా.. మీరు ఇలా బాధపడడానికి కారణం నేనే.. నేనే కనుక శ్రీధర్ ని పెళ్లి చేసుకోకపోయుంటే శివన్నారాయణ కాంచన అక్కని దూరం పెట్టేవాడు కాదు.. మీకు ఈ పరిస్థితి వచ్చేది కాదని కావేరి అంటుంది. నా కూతురిని కాపాడారు.. మీకు ఎప్పుడు రుణపడి ఉంటానని దీప అంటుంది. ఈ విషయం ఎవరికి చెప్పొద్దని  దీపకి చెప్తుంది కావేరి. మరోవైపు దీప డబ్బు కోసం ఫోన్ చెయ్యడం లేదని జ్యోత్స్న నే దీపకి ఫోన్ చేస్తుంది. నా కూతురికి ఆపరేషన్ జరుగుతుంది కార్తీక్ బాబు డబ్బు కట్టాడని దీప అనగానే.. జ్యోత్స్న షాక్ అవుతుంది. అప్పుడేనా.. ఏంటి శౌర్యకి ఆపరేషన్ జరుగుతుందా అని సుమిత్ర వస్తుంది. శివన్నారాయణ వచ్చి అదంతా అబద్ధమని అన్నావని జ్యోత్స్న ని అడుగుతాడు. అబద్ధం అనుకున్నా కానీ నిజం అంట.. నాకు ఇప్పుడే తెలిసింది.. సాయం చేద్దామని దీప కి కాల్ చేసానని జ్యోత్స్న యాక్టింగ్ చేస్తుంది. శివన్నారాయణ గిల్టీగా ఫీల్ అవుతుంటే.. ఏంటి నాన్న సాయం చేసి ఉంటే బాగుండు అనుకుంటున్నారా.. మనుషుల నుండి మనం దూరంగా వెళ్తున్నామనిపిస్తుందని దశరథ్ బాధగా అంటాడు. మరొకవైపు ఎవరు డబ్బు కట్టి ఉంటారు.. మావయ్య గారు అయి ఉంటారా అని కాశీ అనగానే.. అయన అంత సీక్రెట్ గా కట్టి వెళ్ళేవాడు కాదని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : సవతి తల్లి కొత్త ప్లాన్.. వారి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -319 లో.... రామలక్ష్మి, సీతాకాంత్ లు ఇంట్లోకి వస్తారు. వాళ్ళని చూసి సిరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎప్పుడు కలిసి ఉండాలి అన్నయ్య.. మీరు ఎక్కడికి వెళ్ళకూడదని అనగానే.. మేము ఎక్కడికి వెళ్ళాము. నువ్వు హ్యాపీగా ఉండడం కావాలని రామలక్ష్మి అంటుంది. అన్నయ్య వాళ్ళు ఇంటికి వచ్చేలా చేసినందుకు.. చాలా థాంక్స్ అమ్మ అని సిరి శ్రీలతతో సిరి చెప్తుంది. నాకు చాలా ఆకలిగా ఉందని సిరి అనగానే ఉండు నీకు ఇష్టమైన వంట చేస్తానని శ్రీలత కిచెన్ లోకి వెళ్తుంది. కుట్రలతో ఉండే అత్తయ్య ఇలా సడెన్ గా మారడం ఏంటని శ్రీవల్లి ఆలోచనలో పడుతుంది. రామలక్ష్మి, సీతాకాంత్ లు తమ గదిలోకి వస్తారు. తమ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉంటారు. సీతాకాంత్ రామలక్ష్మిని సోఫా లో కూర్చోపెట్టి తను కింద కూర్చొని ఉంటాడు. రామలక్ష్మిపై తన ప్రేమని చెప్తాడు. రామాలక్ష్మి కూడా తన ప్రేమని చెప్తుంది. మరొక వైపు శ్రీలత కిచెన్ లో వంట చేస్తూ ఉంటుంది. అప్పుడే శ్రీవల్లి వస్తుంది.. ఎక్కడ తనని హెల్ప్ చెయ్యమంటుందో అని వెళ్లి పోతుంటే శ్రీలత చూసి రమ్మని హెల్ప్ చెయ్యమంటుంది. అత్తయ్య ఇక్కడ ఎవరు లేరు.. మీరు ఇదంతా యాక్ట్ చేస్తున్నారు కదా మారలేదు కదా అని శ్రీవల్లి అనగానే.. శ్రీవల్లి చెంప చెల్లుమనిపిస్తుంది శ్రీలత. నేను పూర్తిగా మారిపోయాను ఇన్ని రోజులు వాళ్ళని ఇబ్బంది పెట్టానని శ్రీవల్లితో శ్రీలత అంటుంటే.. అదంతా రామలక్ష్మి వింటుంది. ఆ తర్వాత శ్రీలత కూరలో ఉప్పు వేస్తూ.. కన్నింగ్ గా ఒక నవ్వు నవ్వుతుంది. దాన్ని బట్టి తెలుస్తుంది మళ్ళీ ఏదో ప్లాన్ లో ఉందని...ఆ తర్వాత అందరు భోజనం చెయ్యడానికి వస్తారు. సీతాకాంత్ ఎప్పటిలాగ హుందాగా పై నుండి కిందకి వస్తుంటే నా దిష్టి తగిలేలా ఉందని రామలక్ష్మి అనుకుంటుంది. మమ్మల్ని క్షమించి వచ్చినందుకు థాంక్స్ అని సందీప్ సీతాకాంత్ తో అనగానే.. మిమ్మల్ని నేను క్షమించలేదని సీతాకాంత్ అంటాడు. అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : డబ్బు కాజేయాలనుకుంది రాహుల్ అని తెలుసుకున్న రాజ్.. కుమ్మేసాడుగా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -636 లో....రాజ్, కావ్య కలిసి క్లయింట్ ఇచ్చిన డబ్బు లెక్కిస్తూ ఉంటారు. అనవసరం అయిన డౌట్స్ అడుగుతు.. కావ్య రాజ్ కి చిరాకు తెప్పిస్తుంది. ఈ డబ్బు దాచిపెట్టమని కావ్యకి రాజ్ చెప్తాడు. అదంతా రాహుల్ చూసి వీళ్ళ దగ్గర రెండు కోట్లు ఎక్కడివి  అనుకుంటాడు. మరొకవైపు నీ మాటలు వింటే అందరి ముందు నా పరువు పోతుందంటూ రుద్రాణిపై ధాన్యలక్ష్మి కోప్పడుతుంది. అప్పుడే స్వప్న వచ్చి.. ధాన్యలక్ష్మితో పాటు తను కూడా రెండు మాటలు అంటుంది. కాసేపటికి రుద్రాణి దగ్గరికి రాహుల్ వచ్చి.. రాజ్, కావ్యల దగ్గర రెండు కోట్లు ఉన్నాయని చెప్తాడు. వాళ్లని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని రాహుల్ కి రుద్రాణి ప్లాన్ చెప్తుంది. మరుసటి రోజు రాజ్, కావ్య ఆఫీస్ కి వెళ్తారు‌‌. రుద్రాణి, రాహుల్ లు తన మనుషులని రప్పిస్తారు. వాళ్ళు రుద్రాణి అంటూ గట్టిగా అరుస్తూ ఉంటారు. అందరు హాల్లోకి వస్తారు. నాకు ఈ రుద్రాణి రెండు కోట్లు ఇవ్వాలని చెప్పగానే.. అందరు షాక్ అవుతారు. అంత డబ్బు ఎందుకు తీసుకున్నావని ఇంట్లో వాళ్ళు అడుగుతారు. షేర్ మార్కెట్ లో పెట్టాను.. లాస్ వచ్చిందని రుద్రాణి చెప్తుంది. నా డబ్బు కట్టు అంటూ రుద్రాణి మనుషులు రుద్రాణిని బెదిరిస్తారు. దాంతో రాజ్ నువ్వు ఏదో ఒకటి చేసి కట్టమని రుద్రాణి రిక్వెస్ట్ చేస్తుంది‌‌. అంత డబ్బు లేదని రాజ్ కావ్య చెప్పేసి వెళ్లిపోతారు. వాళ్ళు డబ్బు కట్టాలి.. లేదంటే ఏం చేస్తామో తెలియదని రుద్రాణి మనుషులు బెదిరించి వెళ్ళిపోతారు. దాంతో అన్నయ్య నువ్వు ఎలాగైనా రాజ్ తో మాట్లాడమని సుభాష్ ని రుద్రాణి రిక్వెస్ట్ చెయ్యగానే.. తను సరే అంటాడు. రాజ్ , కావ్యలు రుద్రాణి గురించి మాట్లాడుకుంటారు. రాహుల్ దగ్గరికి ఒక రౌడీ వస్తాడు. నేను చెప్పినట్లు రాజ్, కావ్య వాళ్ళ కార్ లో డబ్బు బ్యాగ్ ఉంది. అది తీసుకొని నా కార్ లో విసిరేసి వెళ్ళమని చెప్తాడు. తరువాయి భాగంలో రౌడీ రాజ్ కార్ లో ఉన్న బ్యాగ్ తీసుకొని రాహుల్ కార్ లోకి విసిరేస్తాడు. దాంతో రాజ్ రౌడీ ని పట్టుకొని ఎవరు చేయించారని అడుగగా.. రాహుల్ పేరు చెప్తాడు. ఇంటికి వచ్చి రాహుల్ ని రాజ్ కొడతాడు. రుద్రాణి రప్పించిన మనుషులని తీసుకొని వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

బిగ్ బాస్ హౌస్ ఎలా ఉంటుందో కూడా తెలీదు

  బుల్లితెర మీద వర్షిణి అంటే తెలియని వారు ఉండరు. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన  వర్షిణి  ఎన్నో బ్రాండ్లకు పని చేసింది.  'చందమామ కథలు' అనే తెలుగు సినిమాతో నటిగా మారింది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లోనూ నటించినా వర్షిణికి పేరు రాలేదు.  శంభో శివ శంభో చిత్రంలో చిన్నరోల్  చేసింది. ఐతే ఆమె నటించిన లవర్స్, కాయ్ రాజా కాయ్, బెస్ట్ యాక్టర్స్ వంటి మూవీస్ ఆమెకు పెద్దగా పేరు తెచ్చపెట్టలేదు.  'ఢీ' షోలో మెంటర్‌గా పని చేసింది ఆ తర్వాత 'పటాస్' షోతో వర్షిణి యాంకర్‌గా మారింది. అప్పటి నుంచి ఈ అమ్మడు పలు ఛానెళ్లలో ప్రసారమైన ఎన్నో షోలను హోస్ట్ చేస్తూ వస్తోంది.  'కామెడీ స్టార్స్' షో తర్వాత హోస్టింగ్‌కు గ్యాప్ ఇచ్చింది. తర్వాత   సమంత నటించిన  'శాకుంతలం'లో వర్షిణి కీలక పాత్రలో  నటించింది.  ఇప్పుడు వర్షిణి చాలా చిత్రాల్లో హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తోంది. టీవీలో కొన్ని షోలలోనూ కనిపిస్తూనే ఉంటోంది.  ఐతే బిగ్ బాస్ కి వెళ్తారా అన్న ప్రశ్నకు..అసలు అది తెలీదు. ఎప్పుడు వెళ్తానో కూడా ఏమీ అనుకోలేదు. చాలా సార్లు బిగ్ బాస్ టీమ్ వాళ్ళు నన్ను రమ్మని పిలిచారు కానీ నేనే వెళ్ళలేదు. బిగ్ బాస్ ఎలా ఉంటుందో కూడా తెలీదు. వెళ్ళడానికి ముందు ధైర్యం సరిపోలేదు అని చెప్పింది. ఏ చిన్న పండగ వచ్చినా కూడా స్టార్ మాలో కానీ జీలో కానీ ఎదో ఒక షోకి హోస్ట్ చేస్తూనే ఉంటుంది. ఐతే సుధీర్ తో లేదంటే రవితో హోస్టింగ్ చేస్తూ కనిపిస్తుంది.