Illu illalu pillalu : ఒక్కటైన ఇద్దరు కోడల్లు.. బావకి సంబంధం చూసిన నర్మద!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -80 లో..... వేదవతి, నర్మదలు కలిసి ప్రేమ కాలేజీకి వెళ్ళడానికి ఒప్పిస్తారు. ప్రేమ రెడీ అయి వస్తుంది. ఇద్దరు కలిసి వెళ్ళండి అని నర్మదతో వేదవతి చెప్తుంది. అలా అంటారేంటి ప్రేమ, దీరజ్ లు ఒకటే కాలేజీ కదా.. వాళ్ళని ఇద్దరిని పంపిస్తే దగ్గరవుతారు కదా అని నర్మద సలహా ఇస్తుంది. దంతో వేదవతి.. ప్రేమని తీసుకొని వెళ్ళమని ధీరజ్ తో చెప్తుంది. ధీరజ్ బైక్ పై ప్రేమెక్కుతుంది. భద్రవతి వాళ్లు అదంతా చూస్తుంటారు‌. దాంతో ప్రేమ భయపడి బైక్ దిగుతుంది. వేదవతి వచ్చి బైక్ ఎక్కమని చెప్పి దిష్టి తీస్తుంది.. ధీరజ్ ఇల్లు దాటాక ప్రేమ ని దింపేసి వెళ్ళిపోతాడు. దాంతో ప్రేమ బస్టాండ్ కి వెళ్తుంది. అక్కడ నర్మద కలుస్తుంది. ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తుంటే నర్మద వాళ్ళ అమ్మ కనిపిస్తుంది. దగ్గరికి వెళ్లి నర్మద మాట్లాడితే తను కోపంగా మాట్లాడుతుంది. దాంతో నర్మద బాధపడుతుంది. అప్పుడే సేనాపతి అటుగా వెళ్తాడు. ప్రేమ మాట్లాడబోతుంటే తను కోపంగా వెళ్లిపోతాడు. దాంతో ప్రేమ బాధపడుతుంది. మరొకవైపు పెద్దోడికి సంబంధం క్యాన్సిల్ అయిందని రామరాజు తిరుపతితో చెప్తూ బాధపడుతుంటాడు. నర్మద పెళ్లి తర్వాత ఆఫీస్ కి వెళ్ళింది కాబట్టి అందరు తనకి విషెస్ చెప్తారు. నర్మద ఫ్రెండ్ తన దగ్గరికి వస్తుంది. మా బావ గారికి సంబంధం చూస్తున్నామని నర్మద అనగానే మా రెలెటివ్స్ ఉన్నారని తను నర్మదతో అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : సవతి దగ్గరకి కాంచన.. అందరు ఇలా మారిపోతున్నారేంటి!

  స్టార్ మా టీవిలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -279 లో....కార్తీక్ దగ్గరికి దీప వస్తుంది. తనని చూడడానికి కూడా కార్తీక్ ఇష్టపడడు. ఈ వారం రోజుల్లో మనకి సాయం చేసిన మనిషి గురించి ఎవరు ఎవరు అంటూ డిస్కషన్ చేసుకున్నాం.. ఒక్కసారి కూడా నీకు చెప్పాలి అనిపించలేదా అని కార్తీక్ అంటాడు. కావేరి గారు ఎవరికి చెప్పొద్దని మాట తీసుకున్నారని దీప అనగానే.. ఇప్పుడు నేను అందరి ముందు మాట పడాల్సి వచ్చింది. నన్ను ఇంట్లో నుండి గెంటేసారు. ఇప్పుడు నేనే నీ కూతురికి సాయం చేసానని చెప్తున్నాడంటూ కార్తీక్ బాధపడుతాడు. అప్పుడే కాంచన వస్తుంది. కావేరి గారు నాకు సాయం చేసిన విషయం మొదట నాక్కూడా తెలియదంటూ దీప జరిగింది మొత్తం చెప్తుంది. అందరి కంటే ఎక్కువగా మీ గొప్పతనం ఆవిడకే తెలుసని దీప అంటుంది. దీప చెప్పింది విన్నాం కదా.. అందులో తన తప్పు కూడా ఏం లేదని కాంచన అంటుంది. మరొకవైపు మమ్మీ డాడ్ ఎక్కడికి వెళ్లారంటూ పారిజాతాన్ని జ్యోత్స్న అడుగుతుంది. గుడికి అనుకుంటా అని పారిజాతం అనగానే.. అప్పుడే సుమిత్ర, దశరథ్ లు వస్తారు. ఎక్కడికి వెళ్లారని జ్యోత్స్న అడుగుతుంది. నీకు చెప్పాలిసిన అవసరం లేదంటూ సుమిత్ర వెళ్ళిపోతుంది. దశరథ్ కూడా ఏదో కౌంటర్ ఇచ్చి వెళ్లిపోతాడు. చూసావా తాతయ్య వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు.. వాళ్ళు కచ్చితంగా దీప చేస్తున్న పూజ దగ్గరికి వెళ్లారని జ్యోత్స్న అనగానే.. నాకు ఇంకా అర్థం కాలేదు అనుకున్నావా అని శివన్నారాయణ అంటాడు. మరేం అనడం లేదని జ్యోత్స్న అనగానే.. చెప్తే వినని వాళ్ళతో ఏం అనగలం అని వెళ్లిపోతాడు. అదేంటి అందరు ఇలా మారిపోతున్నారని జ్యోత్స్న పారిజాతంలు టెన్షన్ పడతారు. కాంచన , దీప లు కావేరి ఇంటికి వస్తారు. లోపలికి రావచ్చా అని కాంచన అనగానే.. వద్దని శ్రీధర్ అంటాడు. మీరు రండి అంటూ కావేరి లోపలికి పిలుస్తుంది. నువ్వు నా మనవరాలిని కాపాడవంటూ కావేరి చేతులు పట్టుకొని కాంచన మాట్లాడుతుంటే.. కావేరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : స్పృహలోకి వచ్చిన సీతాకాంత్.. రామలక్ష్మి డెడ్ బాడీ దొరుకుతుందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏటో వెళ్లిపోయింది మనసు'(Eto  Vellipoyindhi Manasu).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -326 లో..... లాయర్ సందీప్ వాళ్ళ దగ్గరకి వస్తాడు. ఇక ఆస్తి మా పేరున రాయడానికి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు కదా అని సందీప్ అనగానే.. అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. సీతాకాంత్ , రామలక్ష్మి లు చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్ తీసుకొని రావాలని లాయర్ అనగానే.. వాళ్ళను చంపించిన వాళ్ళం.. అది తీసుకొని రావడం మాకు పెద్ద సమస్య కాదని సందీప్ అంటాడు. అప్పుడే సీతాకాంత్ ఫ్రెండ్ సీఐ ఇంటికి వస్తాడు. రామలక్ష్మి,  సీతాకాంత్ ల ఫోన్ కలవడం లేదు. అందుకే వచ్చాను ఎక్కడికి వెళ్లారని సీఐ వాళ్ళపై డౌట్ గా అడుగుతాడు. పొరపాటుగా వాళ్ళు ఆక్సిడెంట్ లో చనిపోతే మేము కారణమా అని శ్రీలత అనగానే.. ఏంటి సీతా, రామలక్ష్మిలు చనిపోయారా అంటూ ఆశ్చర్యంగా అడుగుతాడు. ఏదో నా మనసుకి అనిపించింది అన్నానని శ్రీలత కవర్ చేస్తుంది. అప్పుడే సీఐకి ఫోన్ వస్తుంది. సరే వస్తున్న అంటూ శ్రీలత వాళ్ళని హాస్పిటల్ తీసుకొని వెళ్తాడు సీఐ.. హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న సీతాకాంత్ ని చూసి శ్రీలత వాళ్ళు షాక్ అవుతారు. ఈ పని మీరే చేశారని నాకు తెలుసు అని సీఐ అంటాడు. సీఐతో గతం లో రామలక్ష్మి మా వాళ్లే మమ్మల్ని చంపాలని చూస్తున్నారని చెప్పిన విషయం గుర్తుచేసుకుంటాడు. మాకేం తెలియదని శ్రీలత వాళ్లు అంటారు. సీతాకాంత్ స్పృహలోకి వచ్చిన విషయం వాళ్లతో చెప్పగానే.. సీతాకాంత్ దగ్గరికి వెళ్తారు. నా రామలక్ష్మి లేకుండా నేను ఉండలేనంటూ సీతాకాంత్ ఏడుస్తూ ఉంటాడు. ఇదంతా ఎవరో కావాలనే చేపించారని సీతాకాంత్ అనగానే.. ఎవరో కాదు మీ వాళ్ళే అని సీఐ అంటాడు. వాళ్ళు మారారు అలా ఏం చెయ్యరని సీతాకాంత్ నమ్మడు. నా రామలక్ష్మిని చూడాలని సీతాకాంత్ అంటాడు. ఇంకా డెడ్ బాడీ దొరకలేదని సీఐ చెప్తాడు. త్వరలోనే అసలు నేరస్థులని పట్టుకుంటామని సీఐ అంటాడు. ఆ తర్వాత శ్రీలత పంతులిని పిలిపిస్తుంది. సీతాకాంత్ పై నుండి కిందకి వస్తాడు. రామలక్ష్మికి పిండప్రధానo కోసం రప్పించానని శ్రీలత అంటుంది. నా చేతితో ఎలా చెయ్యాలంటూ సీతాకాంత్ బాధపడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : అసలు నిజం తెలుసుకున్న అపర్ణ.. ఆస్తి కోసం ధాన్యలక్ష్మి పంతం!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -643 లో.... ఆస్తుల గురించి మనం అడగాలని ప్రకాష్ కళ్యాణ్ లకి ధాన్యలక్ష్మి చెప్తుంది ఇప్పుడున్న పరిస్థితి ఏంటి మీరు ఆలోచించేది ఏంటని కళ్యాణ్ అంటాడు. దాంతో ధాన్యలక్ష్మి కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నేను మా అన్నయ్య దారిలో నడిచి తప్పు చేసానని ఫీల్ అవుతున్నాను.. నువ్వు అలాగే చేస్తున్నావ్.. ఆ తప్పు చెయ్యకు అని కళ్యాణ్ తో ప్రకాశ్ చెప్తాడు. మరొకవైపు రుద్రాణి, రాహుల్ లు స్వప్న దగ్గరికి వచ్చి తనని రెచ్చ గొట్టే ప్రయత్నం చేస్తారు. ఇంట్లో సిచువేషన్ చూస్తున్నావ్ కదా కావ్య అప్పు చేసింది.. అది తీర్చడానికి అన్ని ఆస్తులు అమ్ముతారు.. మా నాన్న నీకు ఇచ్చిన ఆస్తి కూడా అమ్ముతారని స్వప్నతో రుద్రాణి చెప్పి వెళ్ళిపోతుంది. దాంతో స్వప్న ఆలోచనలో పడుతుంది. ఇందిరాదేవి హాస్పిటల్ లో ఉన్న సీతారామయ్య దగ్గరికి వెళ్లి ఇంట్లో జరుగుతున్న సంఘటనలు చెప్తుంది. మరొకవైపు అప్పు స్టేషన్ కి వెళ్తుంది. అక్కడ తనదైనా స్టైల్ లో ఇంటరాగేషన్ చేసి దొంగని కనిపెడుతుంది. దుగ్గిరాల ఇంటికి బ్యాంకు వాళ్ళు వస్తారు. ఇంటిని జప్తు చేస్తున్నామని వాళ్ళు అంటారు. దాంతో రుద్రాణి, ధాన్యలక్ష్మి లు రెచ్చిపోతారు. అప్పు చేసి కోట్ల డబ్బులు అన్ని మీ వాళ్లకు ఇచ్చావా అవన్నీ తీసుకొని వచ్చి అప్పు కట్టమని రుద్రాణి అనగానే.. నా కోడలు కొడుకు ఏ అప్పు చెయ్యలేదు.. ఆఫీసర్స్ మా వాళ్ళు అప్పు చేసారా అని సుభాష్ అడుగగా.. లేదని వాళ్ళు చెప్తారు. జరిగింది మొత్తం సుభాష్ అందరికి చెప్తాడు. నాన్నగారు ఇచ్చిన మాట పోకూడదని వాళ్ళు ఇలా చేశారని సుభాష్ చెప్తాడు. దాంతో అపర్ణ గిల్టీ గా ఫీల్ అవుతూ.. నాతో పాటు అందరం వాళ్ళని తప్పుగా అర్థం చేసుకున్నామని అంటుంది. మీరు ఏమైనా చేసుకోండి నాకు ఆస్తిలో వాటా కావాలని ధాన్యలక్ష్మి అడుగుతుంది. ఇంట్లో అందరు దాని గురించి డిస్కషన్ చేస్తుంటారు. రుద్రాణి ధాన్యలక్ష్మి ఇద్దరు మాత్రం ఎవరు ఎంత చెప్పినా వినరు. అప్పుడే సీతారామయ్య, ఇందిరాదేవిలు వస్తారు. తరువాయి భాగంలో తాతయ్య గారు సంపాదించిన ఆస్తి ఎవడో మోసం చేస్తే వదులుకోవాల్సి వస్తుందని రాజ్ తో కావ్య అంటుంది. అప్పుడే శృతి వచ్చి.. మేడమ్ మన  స్టాలు రెడీ అయింది ఒకసారి పంపించాను చూడండి అని అంటుంది. కావ్య ఓపెన్ చేసి చూస్తుంటే అందులో నందగోపాల్ ఫోన్ మాట్లాడుతూ కన్పిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

చూసింది, విన్నదే మాట్లాడా...తప్పేంటి...నా మాటలను వక్రీకరిస్తే....

  అనసూయ పెట్టే ట్వీట్స్ ఎప్పుడూ వైరల్ అవుతూ ఉంటాయి. రీసెంట్ గా ఆమె పెట్టిన ఒక ట్వీట్ కూడా అలాగే వైరల్ అయ్యింది. "నాకు ఎదురైన అనుభవాన్ని, నేను చూసిన సంఘటనలను మాత్రమే షేర్ చేసుకున్నా తప్ప ఎవరిని నేను బ్లేమ్ చేసే ఉద్దేశం లేదు. అందరికీ అవగాహన కల్పించడం కోసమే మాట్లాడాను. ఆడియన్స్ కి, మీడియాకి నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఒక్కటే దయచేసి ఎవరూ కూడా నా మాటలను వక్రీకరించి, నేను అనని మాటలను నేను అన్నట్టు ట్రోల్ చేయొద్దు. ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది. నన్ను అర్థం చేసుకున్న వారికి మాత్రమే నా ప్రేమను అందిస్తాను.. ఇలాంటి మాటలు నా క్యారెక్టర్ ని డిసైడ్ చేయలేవు ” అంటూ ట్వీట్ పెట్టింది. ఐతే ఈ ట్వీట్ ని అనసూయ రీసెంట్ ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ కి సోషల్ మీడియాలో జరిగిన రచ్చకి సంబంధించి పెట్టింది. అనసూయ తన డ్రస్సింగ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. బికినీ వేసుకుంటా లేదంటే మరొకటి చేస్తా మీకెందుకు అంటూ మాట్లాడిన విషయం తెలిసిందే. అనసూయ ఏది చేసినా, ఎం మాట్లాడినా బోల్డ్ గానే ఆన్సర్స్ ఇస్తూ ఉంటుంది. జబర్దస్త్ ద్వారా అనసూయ బాగా పాపులర్ అయ్యింది. రంగస్థలం, పుష్ప, విమానం, రజాకార్ వంటి మూవీస్ లో స్ట్రాంగ్ రోల్స్ చేసింది. మాట్లాడేటప్పుడు ఎలాంటి ఇన్హిబిషన్స్ ని పెట్టుకోదు...అనుకున్నది చెప్పేస్తుంది.

సౌమ్యానా ? సౌందర్యానా ?

సౌందర్య అంటే చాలు తెలుగింటి ఆడపడుచులా ఉంటుంది. ఆమె నటన పొందికైన చీర కట్టినట్టు ఉంటుంది. అలంటి సౌందర్య  మనకు దూరమై చాలా ఏళ్ళే ఐపోతోంది. ఆ తర్వాత ఇప్పుడు బుల్లితెర మీదకు జూనియర్ సౌందర్య అని నెటిజన్స్ తో పిలిపించుకుంటున్న సౌమ్య వచ్చింది. సౌమ్య జబర్దస్త్ షోకి కొంతకాలం యాంకరింగ్ చేసింది. ఆ తర్వాత ఆమె మాట్లాడే తెలుగు కారణంగా ఆమెను  తీసేసారు. ఇక ఇప్పుడు పట్టుబట్టి తాను కన్నడ అమ్మాయి ఐనా కూడా తెలుగు నేర్చుకుని తెలుగు షోస్ లో చేస్తోంది.  శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు ఇంకా కొన్ని షోస్ లో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక పింక్ శారీ వేసుకుని సముద్రం దగ్గర నిలబడి దేవర సాంగ్ కి డాన్స్ చేస్తూ కనిపించింది. ఈ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. "చీరను క్యారీ చేయడం కంటే డాన్స్ చేయడం చాలా ఈజీ" అంటూ కాప్షన్ పెట్టింది. ఇక ఈ పింక్ డాల్ డాన్స్ కి నెటిజన్స్ ఫిదా ఐపోతున్నారు. "అంతఃపురం మూవీలో సౌందర్యను గుర్తు చేశారు..అచ్చం సౌందర్యలా ఉన్నారు. బ్యూటిఫుల్ గా ఉన్నారు..అందంగా డాన్స్ చేశారు. సోమ్య గారు మీరు సేమియా లాగా ఉన్నారు. హీరోయిన్ మెటీరియల్..అందమైన అమ్మాయికి చీర చాలా అందంగా ఉంది" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతఃపురం మూవీలో సౌందర్య నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అందులో సౌందర్య నటనకు పోటీగా జగపతి బాబు, ప్రకాష్ రాజ్ నటన ఇంకా హైలైట్ గా ఉంటుంది. సినీ ఇండస్ట్రీని ఏలింది సౌందర్య. ఏ స్టార్ హీరో పక్కనైనా  సౌందర్య హీరోయిన్ గా నటించేది . స్టార్  హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేసిన సౌందర్య ఎంతోమందికి ఫెవరెట్ హీరోయిన్ కూడా. హీరోలతో  సమానంగా రెమ్యునరేషన్ అందుకున్నారు ... తెలుగులోనే కాదు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు సౌందర్య.  

అరుణాచల క్షేత్రం మోక్ష మార్గంలో టేస్టీ తేజా...భయంతో వణికిపోయానంటూ ..

  టేస్టీ తేజ బుల్లితెర మీద ఎంతో సందడి చేస్తూ ఉంటాడు. సెలబ్రిటీస్ తో ఫుడ్ వ్లాగ్స్ చేస్తూ ప్రమోషన్స్ చేస్తూ ఉంటాడు. అలాంటి టేస్టీ తేజ రీసెంట్ గా అరుణాచలం వెళ్ళాడు. ఇక అక్కడ తేజ చేసిన పని చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే అరుణాచలంలో ఉండే మోక్ష మార్గం గుండా తేజ రావడం చూస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. ఆ వీడియొని ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. ముందు ఆ రెండు రాళ్ళ మధ్య నుంచి రావడానికి ట్రై చేసాడు కానీ అతని వల్ల కాలేదు. "నేను మోక్ష మార్గం దగ్గరకు వెళ్లినప్పుడు నాలో ఒక భయం వచ్చింది. నేను ఆ రెండు రాళ్ళ మధ్య పడతానో లేదో..అటు నుంచి ఇటు జాగ్రత్తగా రాగలనో లేదో అనుకున్నా..ఆ భయంతో నేను మధ్యలోనే ఆగిపోయాను. ఆ తర్వాత నేను మనస్ఫూర్తిగా ఓం నమః శివాయ అని తలుచుకుని చేయగలను అనుకున్నాను వెంటనే అటు నుంచి ఇటు వచ్చేసాను..దీన్ని బట్టి నాకు ఒకటి అర్ధమయ్యింది. మనం ఏదన్నా చేయగలము, చేస్తాము అని నమ్మితే కచ్చితంగా ఆ పని చేస్తాం" అని మోక్ష మార్గంలో తన జరిగిన ఎక్స్పీరియెన్స్ ని చెప్పుకొచ్చాడు. ఇక ఈ వీడియొని చూసిన నెటిజన్స్ కూడా కామెంట్స్ పెడుతున్నారు. "మొత్తానికి సాధించారు !  శుభం .. హర హర మహాదేవ శంభో శంకర.. సాధించావు ఎలాగైనా...దైవం ముందు పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే హర హర హర మహాదేవ శంభో శంకరా" అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఐకానిక్ స్టార్ మనసు ఎంత గొప్పదో....యాంకర్స్ కి థ్యాంక్స్ చెప్పడం ఆయన సంస్కారం

  చిన్న నవ్వు...ఒక్క థ్యాంక్స్ నిజంగా ఒక మనిషిని మార్చేస్తాయి..వాళ్ళను జీవితాంతం గుర్తు పెట్టుకునేలా చేస్తాయి...అలాంటి డౌన్ టు ఎర్త్ పర్సన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అలాంటి వాళ్ళల్లో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గురించి కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక సినిమా ఈవెంట్ జరిగితే ప్రతీ ఒక్కరినీ పేరుపేరునా ప్రస్తావిస్తూ థ్యాంక్స్ చెప్తారు. ఐతే ఎంత పెద్ద ఈవెంట్ ని ఐనా, ప్రొమోషన్ ని ఐనా, ఒక షోని ఐనా, లీడ్ చేసేది అందరితో మాట్లాడించి వాళ్ళను ఎంటర్టైన్ చేసేది యాంకర్. ఫంక్షన్ అంతా ప్రశాంతంగా జరిగిపోతుంది...ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ యాంకర్ ని ఎవరూ పట్టించుకోరు... యాంకర్ అంటే ఒక హీరోకి ఆడియెన్ కి మధ్య ఒక వారధి లాంటి వారు అని చెప్పొచ్చు. అలాంటి యాంకర్స్ ని సాధారణంగా ఎవరూ పట్టించుకోరు. కానీ అల్లు అర్జున్ మాత్రం అలా కాదు.   యాంకర్స్ కి ప్రత్యేకంగా స్టేజి మీద థ్యాంక్స్ చెప్తారు. ఆ విషయాన్నీ యాంకర్స్ కూడా చెప్తున్నారు. ఇక వాళ్ళ ఆనందానికి అంతే ఉండదు. బాగా చేస్తే థ్యాంక్స్  అని, తప్పు చేస్తే సారీ అని చెప్పడం నిజంగా పెద్ద సంస్కారం..చిన్న పదాలే కదా ఈ రెండు అనుకుంటాం కానీ వాటిల్లోనే మన వ్యక్తిత్వం బయటపడుతుంది. ఇప్పుడు అదే జరిగింది.  పెద్ద యాంకర్స్ కి మాత్రమే చాలామంది స్టార్స్ కానీ మూవీ యూనిట్ కానీ  థ్యాంక్స్ చెప్తూ ఉంటారు. చిన్న చిన్న , అప్ కమింగ్ యాంకర్స్ ని అసలు పట్టించుకోరు.. కానీ అల్లు అర్జున్ అలా కాదు..ఆయనకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఈవెంట్‌కి ఎవరు యాంకరింగ్ చేసినా కూడా అల్లు అర్జున్ గుర్తుపెట్టుకుంటారు. థాంక్యూ అండీ.. యాంకరింగ్ చాలా బాగా చేశారని అంటారు. అదీ ఆయన సంస్కారం. యాంకర్లను గుర్తించే ఫస్ట్ యాక్టర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అలాంటి వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు.  హరితేజ, ఉదయభాను, మంజూష, వింధ్యకు అల్లు అర్జున్‌ థాంక్స్ చెప్పిన విషయాలను గుర్తు చేశారు యాంకర్ వింధ్య విశాఖ.  హరితేజని కూడా ఆయన విష్ చేశారు. బిగ్ బాస్ లో చూసాను బాగా చేశారు అని మెచ్చుకున్నారు.

Illu illalu pillalu : జాబ్ కి వెళ్తానని మామయ్యని ఒప్పించిన కోడలు.. తను కాలేజీకి వెళ్తుందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -79 లో..... సాగర్, ధీరజ్ లు కలిసి చందు దగ్గరికి వచ్చి.. నీ కంటే ముందు మేం పెళ్లి చేసుకొని తప్పు చేసాం అన్నయ్య, మమ్మల్ని క్షమించమని బాధపడతారు. అవి అన్ని అనుకోకుండా అయిపోయాయి దాని గురించి బాధపడకండి అని తముళ్లిద్దరిని దగ్గరికి  తీసుకుంటాడు చందు. మీరు ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలని తిరుపతి అంటాడు. మరుసటి రోజు నర్మద రెడీ అవుతుంది. ఎక్కడికి అని సాగర్ అడుగుతాడు. మా పుట్టింటికి అంటూ కాసేపు సరదాగా ఆటపట్టిస్తుంది. నిజంగానే సాగర్ టెన్షన్ పడుతూ ఇప్పుడు పుట్టింటికి ఏంటి నువ్వు లేకుండా నేను ఉండనని రిక్వెస్ట్ చేస్తాడు. మా పుట్టింటికి కాదు ఆఫీస్ కి అని చెప్తుంది. నర్మద కిచెన్ లోకి వెళ్లి అక్కడున్నా వేదవతిని ఆఫీస్ కి వెళ్లడానికి పర్మిషన్ అడుగుతుంది. సరేనని వేదవతి అంటుంది. ఈ విషయం మావయ్యతో చెప్పి ఒప్పించండి అని నర్మద అనగానే.. ఎప్పుడు తెలివైన దానివి అనుకుంటావ్ కదా వెళ్లి నువ్వు ఒప్పించమని వెధవతి అంటుంది. నర్మద రామరాజుకి టీ తీసుకొని వెళ్లి.. మావయ్య ఆఫీస్ కీ వెళ్ళాలి.. మీరు పర్మిషన్ ఇస్తే అని అనగానే మీ జీవితానికి సంబందించి మీరు నిర్ణయం తీసుకున్నారు. వెళ్తే వెళ్ళు అనగానే థాంక్స్ మావయ్య అంటూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదంతా వేదవతి చూస్తూ ఉంటుంది. చందు, ధీరజ్ తో మాట్లాడతాడు. ఎన్ని రోజులు ఇలా ఉంటావ్.. కాలేజీకి వెళ్ళమని చెప్తాడు. మరొకవైపు నర్మద, వేధవతి లు ప్రేమ  కాలేజీకి వెళ్ళడానికి ఒప్పిస్తారు. ఆ తర్వాత నర్మద ఆఫీస్ కి వెళ్తు వేదవతి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటంది. ప్రేమ కాలేజీకీ వెళ్లడానికి రెడీ అయి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : శ్రీధర్ నిజం చెప్పడంతో‌ ముక్కలైన కార్తీక్ మనసు.. దీపని క్షమిస్తాడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీకదీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -278 లో...కార్తీక్, దీపలు పూజ చేస్తారు. పిలవకుండానే శ్రీధర్ పూజ కు వస్తాడు. పూజ పూర్తయ్యాక కార్తీక్, శ్రీధర్ ల మధ్య గొడవ అవుతుంది. నీ కూతురు ఆపరేషన్ కు డబ్బు ఎవరు ఇచ్చారో తెలుసా అని శ్రీధర్ అంటాడు. తెలియదని కార్తీక్ అనగానే నాకు తెలుసని శ్రీధర్ అంటాడు ఎవరో చెప్పి వెళ్ళిపో అని కార్తీక్ చిరాకుగా అంటాడు. ఎక్కడ తన పేరు చెప్తాడో అని కావేరి భయపడుతుంది. ఎవరు అంటే నేనే అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. అబద్దం చెప్పకండి అని కావేరి అంటుంది. డబ్బు, నగలు ఏం చేసావని నీ  చెంపపగులగొట్టాలి కానీ అది చెయ్యడం లేదు నా కొడుకుతో.. నీ కూతురు కాని కూతురు ప్రాణాలు కాపాడింది నేనే ని చెప్పడం కోసం అలా చెయ్యడం అని శ్రీధర్ అంటాడు. అంతేకాదు నా పెళ్ళాం నన్ను మోసం చేసినట్టు.. నీ పెళ్ళాం కూడ నిన్ను మోసం చేసింది. శౌర్య ఆపరేషన్ కు కావేరి డబ్బు ఇచ్చిన విషయం నీ పెళ్ళానికి తెలుసు కానీ నీకు చెప్పలేదని శ్రీధర్ అనగానే కార్తీక్ మనసు ముక్కలు అవుతుంది. నిజమేనా దీప అనగానే.. నిజమే అని దీప అంటుంది. దాంతో కార్తీక్ షాక్ అవుతాడు. ఆ తర్వాత శ్రీధర్ తన మనసులోని కుట్రని బయట పెడతాడు. శ్రీధర్, కావేరి, స్వప్నలు కార్ దగ్గరికు వస్తారు. ఎందుకు అన్నయ్య ని బాధపెట్టావని శ్రీధర్ తో స్వప్న గొడవ పెట్టుకుంటుంది. శ్రీధర్ మరి శాడిస్ట్ లాగా బిహేవ్ చేస్తాడు. దాంతో స్వప్నకు కోపం వస్తుంది. కూతురు అని చూడకుండా తనని కూడా ఇష్టం వచ్చినట్లు మాటలు అనేస్తాడు. ఆ తర్వాత కార్తీక్ దగ్గరికి దీప వస్తుంది. మీ చూపులు నాకు చెంప పెట్టులాగా అనిపిస్తున్నాయని కార్తీక్ తో దీప అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే  

Eto Vellipoyindhi Manasu : కొడుకు, కోడలిని చంపించించిన సవతి తల్లి... ఆస్తులు వస్తాయా మరి!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -325 లో.... సిరికి నొప్పులు మొదలు అయ్యాయని ధన ఫోన్ చెయ్యగానే సీతాకాంత్ వెళ్ళబోతుంటే రామలక్ష్మి ఆపుతుంది. ఎందుకు వద్దని అంటున్నావ్.. అక్కడ నా చెల్లి కడుపులో మా నాన్న పుట్టబోతున్నాడని సీతాకాంత్ అనగానే.. సీతాకాంత్ కు ప్రమాదం ఉందని స్వామి చెప్పిన విషయాన్ని రామలక్ష్మి చెప్తుంది. మరి నాకు ఎందుకు చెప్పలేదని సీతాకాంత్ అడుగగా.. మీరు మీ గురించి కాకుండా నా గురించి ఆలోచిస్తారని చెప్పలేదని రామలక్ష్మి అంటుంది. చచ్చిపోయేది ఉంటే ఎక్కడున్నా చచ్చిపోతాను.. ఇప్పుడు నేను వెళ్ళాలి.. నన్ను ఆపితే నేను చచ్చినంత ఒట్టే అని అంటాడు. నువ్వు ఇక్కడే ఉండమని రామలక్ష్మిని అనగానే.. లేదు వస్తానంటూ సీతాకాంత్ తో రామలక్ష్మి వెళ్తుంది. ఇద్దరు వెళ్తుంటే దారిలో రౌడీ లు ఉంటారు. రౌడీ లు సీతాకాంత్, రామలక్ష్మిలని షూట్ చేస్తారు. నువ్వు చెప్పిన మాట వినలేదు రామలక్ష్మి అని సీతాకాంత్ అంటాడు. ఇద్దరు వెంటనే చనిపోతారు. మరొకవైపు సిరికి ఆపరేషన్ జరుగుతుంటుంది. ఆపరేషన్ థియేటర్ బయట శ్రీలత వాళ్ళుంటారు. అప్పుడే రాజీవ్ వచ్చి ఇక ఆస్తులు మీ సొంతం రామలక్ష్మి సీతాకాంత్ లేరని చెప్తాడు. ఇంత అన్యాయం చేస్తారా అని ధన కోప్పడతాడు. నువ్వు కూడ మాతో ఆస్తి కోసం ఉన్నావ్ కదా అని శ్రీలత అంటుంది. అప్పుడే డాక్టర్ వచ్చి.. బాబు పుట్టాడు కానీ మీ కూతురు చనిపోయిందని చెప్తాడు. శ్రీలత ఏడుస్తుంది. సిరి దగ్గరికి ధన వెళ్లి ఎమోషనల్ అవుతాడు. మీరు చేసిన పాపం వళ్లే ఇలా అయిందని శ్రీవల్లి అంటుంది. ఆ తర్వాత శ్రీలత సిరి ఫోటో చూస్తూ బాధపడుతుంది. అప్పుడే సందీప్ లాయర్ వస్తాడు. ఇక ఆస్తులు మొత్తం మాకే కదా అని సందీప్ అనగానే.. లేదు దానికి పెద్ద ప్రాసెస్ ఉందని లాయర్ అంటాడు. దాంతో సందీప్ ఆశ్చర్యంగా చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : ఇంటికొచ్చిన సీతారామయ్య.. ఆస్తిలో వాటాలు ఇవ్వమన్న ధాన్యలక్ష్మి!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -642 లో... బారసాల ఫంక్షన్ లో అందరు సంతోషంగా ఉంటారు. అప్పుడే అనామిక ఎంట్రీ ఇస్తుంది. రాజ్, కావ్యలు ఇంట్లో ఎవరికి తెలియకుండా వందకోట్లు అప్పు చేశారని చెప్తుంది. దాంతో అందరు షాక్ అవుతారు. ఆ అప్పు తీర్చడం కోసం ఆస్తులు తాకట్టు పెట్టారని చెప్తుంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని అనామిక ఇంట్లో వాళ్లకి ఇస్తుంది. ఇంత అప్పు చేసి ఆ డబ్బేం చేసారని ధాన్యలక్ష్మి అడుగుతుంది. అంత మెల్లగా అడుగుతావేంటని ధాన్యలక్ష్మిని రుద్రాణి ఇంకా రెచ్చగొడుతుంది. ఇంట్లో గొడవ రాజేశానంటూ అనామిక వెళ్ళిపోతుంది. కావ్య ఏదో చెప్పబోతుంటే రాజ్ ఆపి ఈ విషయం లో కావ్య ఏం చేసిన నాకూ తెలిసే చేసింది.. అప్పు మాట నిజమే కానీ మేం అప్పు తీరుస్తాం. ఇప్పటికే ఇరవై అయిదు కోట్లు తీర్చామని రాజ్ చెప్తాడు. మేం ఇప్పుడేం జరిగిందని చెప్పే సిచువేషన్ లో లేము.. వినే సిచువేషన్ లో మీరు లేరని రాజ్ చెప్పి కావ్యని తీసుకొని వెళ్ళిపోతాడు. అసలేం జరుగుతుందో అంత తెలుసుకుంటానని ధాన్యలక్ష్మి అంటుంది. మరొకవైపు రాజ్ , కావ్య లు ఎందుకు అప్పు చేశారుని అపర్ణ, సుభాష్ లు ఆలోచిస్తుంటారు. అసలు అనామికకి దీని గురించి ఎలా తెలుసని రాజ్ తో కావ్య అంటుంది. ఇంకా నయం తాతయ్య గురించి నిజం బయటపడలేదు. ఈ లోపు మిగతా అప్పు కూడా తీర్చేయ్యాలని రాజ్ అంటాడు. అనామిక తను చేసిన పనికి హ్యాపీగా ఫీల్ అవుతూ సామంత్ కి చెప్తుంది. రేపు బ్యాంకు నుండి ఆఫీసర్స్ వెళ్లి ఇంటిని జప్తు చేస్తారు. అప్పుడు ఆఫీస్ ని తక్కువ రేట్ కి మనం తీసుకుంటామని అనామిక ప్లాన్ చేస్తుంది. ప్రకాశ్, కళ్యాణ్ లకి ఆస్తుల గురించి మాట్లాడాలంటూ ధాన్యలక్ష్మి చెప్తుంటుంది. ఇంట్లో ఇంత జరుగుతుంది.. ఆస్తులు వాటా అంటున్నారు అంటూ ధాన్యలక్ష్మి పై కళ్యాణ్ అరుస్తాడు. తరువాయి భాగంలో బ్యాంకు వాళ్ళు వస్తారు. టైమ్ కి అప్పు కట్టలేదు కాబట్టి ఇంటిని జప్తు చేస్తామని అంటారు. సుభాష్ వచ్చి నందగోపాల్ మోసం చేసిన విషయం చెప్తాడు. మాకు రావల్సిన ఆస్తులు మాకు ఇవ్వండి అని ధాన్యలక్ష్మి కోపంగా మాట్లాడుతుంది. అప్పుడే సీతారామయ్య, ఇందిరాదేవిలు వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

బుల్లితెర మీద మోనాలిసా...పూసలమ్ముకుంటూ వచ్చిన వర్ష..

  బుల్లితెర మీద కొత్త మోనాలిసా వచ్చిందండి పూసలు అమ్ముకుంటూ..ఎవరు అనుకుంటున్నారా వర్షా. ఐతే సోషల్ మీడియాలో కుంభమేళా అంటే చాలు తేనే కాళ్ళ మోనాలిసా పేరుతో ఒక  పూసలు అమ్ముకునే అమ్మాయి తెగ వైరల్ అయ్యింది. ఓవర్ నైట్ ఆమె పిక్స్, వీడియోస్ వైరల్ అయ్యేసరికి ఆమెకు మూవీ ఆఫర్స్ కూడా క్యూ కట్టాయి. ఇప్పుడు ఈ టాపిక్ ని వర్ష, ఇమ్మానుయేల్ తీసుకుని జబర్దస్త్ స్కిట్ వేయడానికి రెడీ అయ్యారు. ఆ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో ముందు వర్ష "పూసలమ్మ పూసలు" అని అమ్ముకుంటూ వస్తుంది. శివాజీ ఇది చూసి పర్ఫెక్ట్ గా  సరిపోయావ్" అంటూ కామెంట్ చేసాడు. అది చూసిన ఇమ్ము వచ్చి వర్షతో మాట్లాడాడు. "ఏవండీ శివాజీ గారు రాత్రి 12 గంటలు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ కి వచ్చి దుప్పటి ఇచ్చారు..అడిగితే ఎవరికీ ఏమీ చెప్పొద్దన్నారు" అని చెప్పేసరికి "ఆయన అంతే ఏది చేసినా రెండో కంటికి తెలియనివ్వడు" అన్నాడు. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చేసి పెట్టడంతో అవన్నీ వైరల్ అయ్యాయంటూ   కొంతమంది వర్ష దగ్గరకు వచ్చేసరికి ఇమ్ము అది విని తెగ ఫీలైపోయాడు. ఆ తర్వాత డాన్సర్  పండు ఎంట్రీ ఇచ్చి "వర్ష గారికి నేను మేనేజర్ ని ఇపోయా" అంటూ చెప్పుకున్నాడు. "పూసలమ్ముకునేదానికి నువ్వు మేనేజర్ ఏంటి" అనేసరికి తలుపు వెనక నుంచి  వర్ష మంచి బ్లాక్ షార్ట్ స్కర్ట్ తో ఎంట్రీ ఇచ్చింది.  అది చూసిన ఇమ్ము ఎవరో హీరోయిన్ వచ్చేసిందంటూ హడావిడి చేసాడు. అప్పుడు వర్ష "స్టిక్కర్లే..బొట్టుబిళ్లలే" అనేసరికి నువ్వా అని ఆశ్చర్యపోయాడు.  

బాలకృష్ణ గారు పెట్టింది ఫస్ట్ ముద్దేమీ కాదు.అందరికీ సీనియర్ ఎన్టీఆర్ అంటేనే ఇష్టం

  మాస్‌ కా దాస్ విశ్వక్‌ సేన్‌ హీరోగా రూపొందిన 'లైలా' సినిమా ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ వారం ఫామిలీ స్టార్స్ ఎపిసోడ్ కి ఈ లైలా టీమ్ మూవీ ప్రమోషన్స్ కోసం వచ్చి గేమ్స్ కూడా ఆది ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది.  ఐతే ఇందులో యాంకర్ సుధీర్ అడిగిన ప్రశ్నలకు విశ్వక్ సేన్ ఆన్సర్స్ ఇచ్చాడు.  "రియల్ లైఫ్ లో నా  లైలా కోసం నేను ఇంకా వెతుకుతున్నా...ఐతే బాలకృష్ణ గారికి ముందుగా పద్మభూషణ్ వచ్చినందుకు కంగ్రాట్యులేషన్స్. ఐతే ఆ తర్వాత లైలా మూవీ సెలెబ్రేషన్స్ లో అప్పుడే అందరం కాఫీ తాగాం. బాలకృష్ణగారు టక్కున ముద్దు పెట్టారు. ఐతే అదేం ఫస్ట్ ముద్దు కాదు. ఐతే ఇప్పటికైనా ఎప్పటికైనా నేను బ్రో అని బాలకృష్ణ గారిని పిలుస్తాను. ఐతే నాకు బాలకృష్ణ గారు, జూనియర్ ఎన్టీఆర్ కన్నా కూడా సీనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం వాళ్లకు కూడా సీనియర్ ఎన్టీఆర్ గారే ఇష్టం. నేను సినిమాల్లోకి రావడానికి చాలా ట్రై చేసాను. ఒకటే సినిమాకు ఏడెనిమిది సార్లు ఆడిషన్స్ ఇచ్చాను. ఆ తర్వాత అనిపించింది నాకు నిజంగా యాక్టింగ్ రాదేమో అనుకున్నా...ఆ తర్వాత రాంగ్ డైరెక్షన్ లో ఏమన్నా వెళ్తున్నామేమో అనుకున్నా. అదే టైంలో నన్ను ఒకతను పది నిమిషాలు చూసి నన్ను లీడ్ గా పెట్టి సినిమా తీసాడు అతనే తరుణ్ భాస్కర్. లైఫ్ లో నేను ఏ స్టేజి కి వెళ్లినా ఈ విషయాన్నీ అస్సలు మర్చిపోను. ఆ టైములో నన్ను వేలు పెట్టి చూపించి మరీ విశ్వక్ ని పెట్టుకుంటే ఐపోతావ్ అన్నారు.. ఈరోజు నా లైఫ్ బాగుంది అంటే ఒకటి తరుణ్ భాస్కర్ రెండోది ఫలక్నుమా దాస్ మూవీ"  అని చెప్పాడు. ఐతే లైలా మూవీ మీద కొన్ని నెగటివ్ ట్రోల్స్ కూడా జరుగుతున్న విషయం తెలిసిందే. ఏదేమైనా మూవీని అందరూ థియేటర్ వచ్చి చూస్తే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని చెప్పాడు విశ్వక్

హాస్పిటల్ లో రష్మీ...భుజానికి సర్జరీ...

  జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ యాంకర్ రష్మీ ఇప్పుడు అనుకోని పరిస్థితిని ఎదుర్కుంటోంది. రష్మీ ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ వరుస పోస్టులు  పెడుతూ  ఉంటుంది. ఇక ఇప్పుడు కూడా అలాంటి ఒక పోస్ట్ ని ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది.  అదొక ఎమోషనల్ పోస్టు. “నేను సర్జరీ చేయించుకోవడానికి రెడీ అయ్యాను. నా భుజాన్ని సెట్ చేసుకోవడానికి వెయిట్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే భుజానికి తగిలిన ఆ గాయం నా డాన్స్ మూమెంట్స్ కి ఇబ్బంది కలిగిస్తోంది. వాటన్నింటినీ నేను మిస్ అవుతున్నాను. డాన్స్ మూవ్స్ లో భుజం పట్టేసింది.  ఆ సర్జరీ అయ్యాక మళ్ళీ అంత సెట్ అవుతుందని భావిస్తున్నాను” అంటూ హాస్పిటల్ బెడ్ మీద సర్జరీ డ్రెస్ లో సెల్ఫీ తీసుకుని  ఆ ఫోటోని స్టేటస్ లో పెట్టింది.  ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రష్మీ  అభిమానులు అసలు ఆమెకు ఏమైందో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు. రష్మీ త్వరగా కోలుకొని మళ్ళీ మామూలుగానే ఇండస్ట్రీలో బిజీ కావాలని కోరుకుంటూ ఉండడం గమనార్హం. ఉదయ్ కిరణ్ నటించిన ‘హోలీ’ మూవీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది ఇక తర్వాత యువ అనే సీరియల్ లో నటించింది రష్మీ. తెలుగులోనే కాదు కన్నడ, హిందీ, తమిళ్ లో కూడా సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అయ్యయ్యో బ్రహ్మముడి సీరియల్ టైమింగ్ మార్చి ఎంత తప్పు చేశారో..స్టూడెంట్స్ ఆవేదన  

స్టార్ మా సీరియల్స్ ఒక రేంజ్ లో ఉంటాయి. చూసే కొద్దీ చూడబుద్దేసేలా ఉంటాయన్నమాట. ఐతే కార్తీక దీపం సీరియల్ ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యిందో మీకు తెలుసు కదా. ఆ సీరియల్ ఐపోయాక ఆ సీరియల్ స్లాట్ లో బ్రహ్మముడి సీరియల్ ని తీసుకొచ్చారు. ఈ సీరియల్ సూపర్ గా ఉంది మంచి రేటింగ్ వస్తోంది అనుకుంటున్నా టైములో ఈ సీరియల్ టైం స్లాట్ ని మార్చేశారు. ఈ బ్రహ్మముడి సీరియల్ రాత్రి 7 .30 కి ప్రసారం అయ్యేది. గత ఏడాది నవంబర్ రెండో వారం నుంచి ఈ సీరియల్ మధ్యాహ్నం 1 గంటకు ప్రసారం చేయడం స్టార్ట్ చేసింది. మంచిగా రేటింగ్ వచ్చే సీరియల్స్ ని అలా ఉంచరు టైమింగ్స్ మార్చేసి కలగాపులగం చేసేసి మళ్ళీ కొన్ని రోజులు పోయాక మళ్ళీ పాత టైం స్లాట్ కి తీసుకొస్తారు. అప్పటికి ఆడియన్స్ అందరికీ కూడా చిరాకొచ్చేసి ఆ సీరియల్ ని చూడడమే మానేసే పరిస్థితికి వస్తుంది. ఐతే ఇప్పుడు దీని మీద ఒక ఫ్యాన్ చాలా బాధపడ్డారు. బ్రహ్మముడి సీరియల్ కావ్య అలియాస్ దీపికా కోయ అమ్మాయి గెటప్ లో ఒక ట్రెండింగ్ సాంగ్ కి డాన్స్ వేసిన రీల్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఐతే కావ్య డాన్స్ ని గెటప్ ని నెటిజన్స్ అంతా మెచ్చేసుకుంటున్నారు. ఐతే ఒక అభిమాని మాత్రం "బ్రహ్మముడి సీరియల్ టైమింగ్ మార్చేశారు. అక్కా సీరియల్ చూద్దాం అంటే కాలేజీ అడ్డొస్తోంది" అంటూ కామెంట్ చేశారు. మిగతా నెటిజన్స్ ఐతే "వస్తారు ట్రెండ్ సెట్ చేసి పోతారు.. దీపికా క్యూట్ లుక్" అంటున్నారు.  

Illu illalu pillalu: నీ వల్లే మా అన్నయ్య పెళ్ళి ఆగిపోయింది.. రామరాజు ఫైర్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -78 లో.... అమ్మాయి తండ్రికి భద్రవతి ఫోన్ చేసి.. రామరాజు కుటుంబం గురించి తప్పుగా చెప్తుంది. దాంతో రామరాజుకి అమ్మాయి తండ్రి ఫోన్ చేసి.. ఈ సంబంధం వద్దని అనుకుంటున్నాము.. మీ కొడుకులు లేచిపోయి పెళ్లి చేసుకున్నారంట కదా అని అనగానే.. రామరాజు బాధపడతాడు. అప్పుడే సాగర్, నర్మద, ప్రేమ, ధీరజ్ ల ఫోటో షూట్ తిరుపతి జరిపిస్తుంటాడు. తిరుపతి వచ్చి సంబంధం ఏమైందంటూ అడిగేసరికి తన చెంప చెల్లుమనిపిస్తాడు రామరాజు. అదంతా చూస్తున్న భద్రవతి.. నీ కొడుకుకి పెళ్లి కాకుండా చేస్తాను. నువ్వు బాధపడేలా చేస్తానని అనుకుంటుంది. రామరాజు లోపలికి వెళ్తాడు. చందు వచ్చి ఏం జరిగింది అని అడుగుతాడు. మంచి సంబంధం చూసాను కానీ వీళ్ళ వాళ్ళ క్యాన్సల్ అయిందంటూ రామారాజు కోప్పడతాడు. నాకు అర్థమవట్లేదు నాన్న.. మీరేం అంటున్నారోనని సాగర్ అడుగుతాడు. అన్నకి కాకుండా తమ్మళ్ళు పెళ్లి చేసుకున్నారు. అది పెంపకం అంటూ అవమానించారని రామరాజు అంటాడు. నాన్న నా తమ్ముళ్ళని ఏం అనకు నేను బాధపడుతానని చందు అంటాడు. ఆ తర్వాత నేను పెళ్లి చేసుకోకుండా ఉండాలిసిందంటూ సాగర్ బాధపడుతుంటే నర్మద కూడా బాధపడుతుంది. మరొకవైపు ఇదంతా నీ వళ్లే అంటూ  ప్రేమపై ధీరజ్ అరుస్తాడు. చందు దగ్గరికి సాగర్ ధీరజ్ లు వచ్చి.. మా వళ్లే ఇదంతా అని బాధపడతారు.తరువాయి భాగం లో ధీరజ్ కాలేజీ కి వెళ్తుంటే.. ప్రేమని కూడా తీసుకొని వెళ్ళమని వేదవతి చెప్తుంది. దాంతో ఇద్దరు కాలేజీకి బండిపైన వెళ్ళడానికి సిద్ధమవుతారు. అప్పుడే భద్రవతి కుటుంబం చూస్తూ ఉండడంతో ప్రేమ బండి మీద నుండి దిగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : పూజ పూర్తిచేసిన కార్తీక్, దీప.. ఆపరేషన్ కి డబ్బులు ఇచ్చింది ఎవరో శ్రీధర్ చెప్పనున్నాడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -277 లో.....శ్రీధర్ తన ఫ్రెండ్ కి కాల్ చేసి కావేరికి సంబంధించిన ఎఫ్ డి లు గురించి తెలుసుకుంటాడు. ఆమె యాభై లక్షలు డ్రా చేసిందని అతను చెప్పగానే.. శ్రీధర్ షాక్ అవుతాడు. కావేరి నా మాట దాటావ్.. మీ అందరికి ఎలా బుద్ది చెప్పాలో నాకు తెలుసు.. రేపు పూజకి పిలిచారు కదా వస్తా అని శ్రీధర్ అనుకుంటాడు. మరుసటి రోజు కార్తీక్ పూజకి సంబంధించిన ఏర్పాట్లు చేస్తాడు. కార్తీక్, దీప లు పీటలపై కూర్చొని ఉంటారు. మీ పుట్టింటివారు. మీ కోడలు పుట్టింటి వారు బట్టలు పెట్టాలని అనగానే.. కాంచన బాధపడుతుంది. మా అమ్మకి నేనే పుట్టిల్లు.. నేనే బట్టలు పెడతానని కార్తీక్ అనగానే ఒకసారి ఆలోచించండి అని అనసూయ, దీపలు అంటారు. అప్పుడే సుమిత్ర, దశరథ్ లు వస్తారు. వాళ్ళని చూసి అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. నువ్వు పిలిచావా అని కార్తీక్ అనగానే.. మీరే కావలసిన వాళ్ళను పిలవమని చెప్పారు కదా అందుకే పిలిచానని దీప అంటుంది. దశరథ్ ని చూసి కాంచన ఎమోషనల్ అవుతుంది. మేమే ఇద్దరి తరుపున పుట్టింటి వాళ్ళమని సుమిత్ర చెప్పగానే అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు.అప్పుడే కావేరి ఎంట్రీ ఇస్తుంది. అందరు తనని చూసి షాక్ అవుతారు. ఈవిడ తనకి సవతి అంటూ అక్కడున్న వాళ్ళు అనుకుంటూ ఉంటే.. అందరు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. తనని పిలిచి ఉండకూడద దశరథ్ అంటాడు. అప్పుడే శ్రీధర్ ఎంట్రీ ఇస్తాడు. మీరు ఎందుకు వచ్చారని శ్రీధర్ ని కావేరి అడుగుతుంది. శ్రీధర్ తన వెటకారపు మాటలతో అందరిని బాధపెడతాడు. ఆ తర్వాత సుమిత్ర, దశరథ్ లు కాంచనకి కార్తీక్, దీప లకి బట్టలు పెడతారు. పూజ పూర్తవుతుంది  సుమిత్ర, దశరత్ లు అక్కడ నుండి వెళ్ళిపోతారు. కార్తీక్ చిరాకుగా లోపలికి వెళ్తాడు. తన వెనకాలే శ్రీధర్ వెళ్తాడు. శ్రీధర్ తో కార్తీక్ గొడవపడతాడు. అసలు నీ కూతురు ఆపరేషన్ కి డబ్బు ఎవరు ఇచ్చారని శ్రీధర్ అనగానే.. ఒక మనసు ఉన్నవాళ్ళని కార్తీక్ అంటాడు. నేను చెప్పాలా అని శ్రీధర్ అనగానే.. దీప, కావేరీ ఇద్దరు టెన్షన్ పడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : చెల్లెలికి నొప్పులు.. భర్తని వెళ్ళొద్దన్న భార్య!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -324 లో...... రామలక్ష్మి, సీతాకాంత్ ని గుడికి తీసుకొని వెళ్తుంది. అక్కడ సీతాకాంత్ ఒక్కడి పేరున అర్చన చేపిస్తుంటే.. ఇద్దరం వచ్చాము కదా ఒక్కరికి అర్చన చేపిస్తున్నావని సీతాకాంత్ అడుగుగా.. మనం ఇద్దరం వేరు వేరు కాదని రామలక్ష్మి అంటుంది. మరొకవైపు శ్రీలత సందీప్ లు లాయర్ తో మాట్లాడుతుంటారు. ఈ ఆస్తులన్ని మీ పేరున రావాలంటే సీతాకాంత్ రామలక్ష్మిలు చనిపోవాలి. చావు కూడ సాధారణంగా ఉండాలి. అప్పుడే ఆస్తులు కుటుంబ సభ్యులు అయినా మీకూ వస్తుందని లాయర్ చెప్తాడు. రామలక్ష్మి, సీతాకాంత్ లు హారతి తీసుకుంటుంటే అప్పుడే హారతి పోతుంది. దాంతో రామలక్ష్మి టెన్షన్ పడుతుంటే.. గాలికి వెళ్ళిందని సీతాకాంత్ చెప్తాడు. రామలక్ష్మి మాత్రం టెన్షన్ పడుతూ దేవుడికి మొక్కుకుంటుంది. గుడి మూసేసే టైమ్ అవుతుంది వెళ్ళండి అని పంతులు అనగానే.. మేమ్ ఈ రోజు ఇక్కడే పడుకుంటామని రామలక్ష్మి చెప్పగానే.. పంతులు సరే అంటాడు. సిరికి శ్రీవల్లి జ్యూస్ తీసుకొని వస్తుంది. వద్దని సిరి అంటుంటే ధన నేను తాగిస్తానని అంటాడు. రామలక్ష్మి, సీతాకాంత్ లు గుడి లో పడుకుంటారు. రామలక్ష్మికి సీతాకాంత్ కథ చెప్తుంటాడు. దాంతో రామలక్ష్మి నిద్రలోకి జారుకుంటుంది. మరొకవైపు సిరికి నొప్పులు మొదలవుతాయి. ధన సీతాకాంత్ కి ఫోన్ చేసి విషయం చెప్తాడు. దాంతో సీతాకాంత్ కంగారుగా వెళదాం పదా అని రామలక్ష్మి అంటుంటే.. వద్దని రామలక్ష్మి అంటుంది. ఈ ఒక్క రోజు ఆగండి అంటూ రామలక్ష్మి రిక్వెస్ట్ చేస్తుంది. సీతాకాంత్ కోప్పడడంతో స్వామి చెప్పిన విషయం సీతాకాంత్ కి రామలక్ష్మి చెప్తుంది. ఆ తర్వాత ఏం  జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.