అజ్ణాతంలో వల్లభనేని వంశీ .. గాలిస్తున్న పోలీసులు?
Publish Date:Dec 29, 2025
చేసిన తప్పులకు శిక్ష అనుభవించక తప్పదంటారు. చేసిన పాపం ఊరికే పోదని కూడా నానుడి. ఆంధ్రప్రదేశ్ లో 2019 నుంచి 204 వరకూ వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
నాడు చేసిన తప్పులన్నీ ఇప్పుడు కేసుల రూపంలో వెంటాడుతున్నాయి. ఒకరు ఇద్దరే అని కాదు గత వైసీపీ హయాంలో అధికారం అండ చూసుకుని చెలరేగిపోయిన నేతలంతా ఇప్పుడు కేసులను ఎదుర్కొంటున్నారు. కొందరు అరెస్టై జైళ్లలో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. మరి కొందరు అరెస్టై ఆ తరువాత బెయిలుపై విడుదలయ్యారు. ఇంకా కొందరు అరెస్టు అవుతామన్న భయంతో వణికి పోతున్నారు. కొందరైతే అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. అలాంటి నేతలలో వల్లభనేని వంశీ ఒకరు.
వైసీపీ హయాంలో వల్లభనేని వంశీ చేసిన తప్పిదాలకు సంబంధించి పలు కేసులు ఉన్నాయి. వివిధ కేసుల్లో నమోదైన అభియోగాలపై ఆయన ఇప్పటికే అరెస్టై.. నెలల తరబడి రిమాండ్ ఖైదీగా ఉన్న వల్ల భనేని వంశీ కొద్ది కాలం కిందట బెయిలుపై విడుదలయ్యారు. బెయిలుపై విడుదలైనా ఆయన రాజకీయాలకు దూరంగా దాదాపుగా ఏకాంత వాసం అనుభవిస్తున్నట్లుగా మెలుగుతున్నారు.
అయితే తాజాగా ఇప్పుడు ఆయన అజ్ణాతంలోకి వెళ్లిపోయినట్లు మీడియా, సోషల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తగా తనపై నమోదైన కేసులో అరెస్టు భయంతోనే ఆయన అజ్ణాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. సునీల్ అనే వ్యక్తిపై హత్యాయత్నం కేసులో విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్లో వంశీపై తాజాగా కొత్త కేసు నమోదైంది. జూన్ 2024లో వంశీ తన అనుచరులతో సునీల్ ను హత్య చేయడానికి కుట్రపన్నారన్నది ఆ కేసు. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు ఇవ్వాలని కోరుతూ వంశీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు వంశీ ముందస్తు బెయిలు పిటిషన్ ను కొట్టివేసింది.
ఈ నేపథ్యంలోనే విచారణకు రావాల్సిందిగా పోలీసులు వంశీకి నోటీసులు అందించడానికి ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. అరెస్టు భయంతో ఆయన అజ్ణాతంలోకి వెళ్లారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే వంశీ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే వల్లభనేని వంధీ కిడ్నాప్, బెదరింపులు, ఎస్సీఎస్టీ అట్రాసిటీస్, తెలుగుదేశం గన్నవరం కార్యాలపంపై దాడి తదితర కేసులను ఎదుర్కొంటున్నారు. ఆ కేసులలో అరెస్టై బెయిలపై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజా కేసులో అరెస్టు భయంతో వల్లభనేని వంశీ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ లో ఉన్నట్లు చెబుతున్నారు.
కేసీఆర్ హాజరు సంతకం అనే లాంఛనం కోసమేనా?
Publish Date:Dec 29, 2025
అసెంబ్లీలో సుహృద్భావ వాతావరణం.. కేటీఆర్ తీరు పంటి కింద రాయి తీరు!
Publish Date:Dec 29, 2025
జగన్ చేసి కూడా చెప్పుకోలేకపోయిన పనులేంటో తెలుసా?
Publish Date:Dec 29, 2025
కేసీఆర్ కు రేవంత్ షేక్ హ్యాండ్
Publish Date:Dec 29, 2025
వైసీపీ వారికి అప్పనంగా వైకుంఠ ద్వార దర్శనాలు!?
Publish Date:Dec 30, 2025
వడ్డించేవాడు మనవాడైతే భోజనానికి చివరి పంక్తిలో కూర్చున్నా ఫరవాలేదన్నది సామెత. అయితే ఇప్పుడు తెలుగుదేశం కూటమిలో ఆ సామెతను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు తెలుగు తమ్ముళ్లు, కూటమి భాగస్వామ్య పక్షాల నాయకులు. ఇప్పుడు ఆ సామెతను వడ్డించేవాడు మనవాడే ఉన్న మొదటి మొదటి పంక్తిలో కూర్చున్నా లాభం లేని పరిస్థితి ఏర్పడిందని మార్చుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జగన్ హయాంలో తిరుమల పవిత్రతకు, ప్రతిష్ఠకు పంగనామాలు పెట్టి మరీ యధేచ్ఛగా వ్యవహరించిన చరిత్ర వైసీపీ నేతలది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తిరుమలలో వారి హవాయే కొనసాగుతోంది. కూటమి సర్కార్ తీరు అయిన వాళ్లకి ఆకుల్లో.. అన్న చందంగా తయారైందంటున్నారు. ఔను తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాల విషయంలో వైసీపీయులదే హవా అంటున్నారు. వైసీపీ లీడర్లకు ఉత్తర ద్వార దర్శనాలను తిరుమల అడిషనల్ ఈవో దగ్గరుండి మరీ చేయిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా విడుదల చేస్తున్నారు.
తెలుగుదేశం కూటమి సర్కార్ లో కార్పొరేషన్ చైర్మన్లుగా నియమితులైన వారికి దక్కని వైకుంఠ ద్వార దర్శనాలు వైసీపీ నేతలకు మాత్రం అధికారులు దగ్గరుండి మరీ తీసుకువెళ్లి దర్శనం చేయించ డమేంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ నుంచి వచ్చినదేవినేని అవినాష్, మల్లాది విష్ణుతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి వారు మంగళవారం (డిసెంబర్ 30)న తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. సరే పెద్దిరెడ్డి అంటే లోకల్. మరి మల్లాది, దేవినేని సైతం వైకుంఠ ద్వారా దర్శనాలు అలవోకగా ఎలా చేసుకోగలిగారని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా వైసీపీ వారి మాటే ఇంకా తిరుమలలో చెల్లుబాటు అవుతోందనడానికి ఇంత కంటే నిరద్శనం ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఏబీ వెంకటేశ్వరరావు వంటి వారు.. అధికారం కోల్పోయినా వైసీపీ వారి పనులు యథేచ్ఛగా నడుస్తున్నాయంటూ చేసిన వ్యాఖ్యలు వాస్తవమేననడానికి వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైసీపీయులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు దగ్గరుండి మరీ ఉత్తరద్వార దర్శనాలను కల్పించడమే నిదర్శనమని అంటున్నారు.
140 ఏళ్ల ప్రస్థానం.. కాంగ్రెస్ లో జోషెదీ.. కార్యకర్తల్లో ఉత్సాహమెక్కడ?
Publish Date:Dec 29, 2025
చట్టంతో గేమ్స్.. జగన్ కు అబ్బిన అనువంశిక విద్య!
Publish Date:Dec 26, 2025
క్రిస్మస్ వేడుకలకూ జనసమీకరణేనా జగన్?
Publish Date:Dec 26, 2025
మోడీ మౌనం దేనికి సంకేతం?
Publish Date:Dec 24, 2025
మాట మార్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
Publish Date:Aug 28, 2025
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని వ్యాఖ్యానించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇవాళ మాట మార్చారు. 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని నేను ఎవరికీ చెప్పలేదు అన్నారు. 75 ఏళ్ల తర్వాత కూడా చురుగ్గా పనిచేసే శక్తి ఉందని ఆయన తెలిపారు.సంఘ్ ఎలా చెప్తే అలా నడుచుకుంటామని వెల్లడించారు.
కేంద్రం, ఆర్ఎస్ఎస్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. . రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని విషయాల్లో అభిప్రాయ బేధాలు ఉండొచ్చు.. వివాదం కాదంటూ చెప్పుకొచ్చారు. దేశ ప్రయోజనాలే ఇద్దరి ప్రాధాన్యతగా పేర్కొన్న మోహన్ భగవత్.. బీజేపీ అధ్యక్షుడి ఎన్నికను ఆర్ఎస్ఎస్ శాసించదన్నారు. ‘మేం సలహా ఇవ్వగలం .. తుది నిర్ణయం వారిదేని తెలిపారు.
నూతన విద్యా విధానానికి మేం మద్దతిస్తున్నాం. ఇంగ్లీష్ నేర్చుకోవడంలో తప్పులేదు’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ తరఫున ఆర్ఎస్ఎస్ నిర్ణయాలు తీసుకుంటుందని ప్రతిపక్షాల నుండి వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలతో తమకు మంచి సమన్వయం ఉందని మోహన్ భగవత్ వెల్లడించారు.
రాహుల్ టార్గెట్ గా అరవింద్ విమర్శల వర్షం.. మర్మమేంటంటే?
Publish Date:Aug 28, 2025
కల్వకుంట్ల వారసుల సెపరేట్ అజెండాలు.. క్యాడర్లో కన్ఫ్యూజన్
Publish Date:Jul 25, 2025
సీబీఎన్.. ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియం!
Publish Date:Apr 19, 2025
కడప మహానాడులో బాంబులు పేలనున్నాయా..?
Publish Date:Apr 8, 2025
ఎంతో సంతోషంగా ఉన్న భార్యాభర్తల బంధాన్ని కూడా నాశనం చేసే విషయాలు ఇవి..!
Publish Date:Dec 29, 2025
భార్యాభర్తల బంధం చాలా అపురూపమైనది. జీవితాంతం కలిసి ఉండాల్సిన బంధం అది. కానీ నేటికాలంలో ఈ బంధం పలుచబడిపోతోంది. చాలామంది పెళ్లిళ్లు ఎంత గ్రాండ్ గా చేసుకుంటున్నారో.. అంత త్వరగా విడిపోతున్నారు. అలాగని వీటికి పెద్ద కారణాలు ఉన్నాయా అంటే అది కూడా లేదు. పెద్ద కారణాలు, గొడవలు జరిగినప్పుడే విడిపోవడానికి దారి తీస్తుందని అనుకుంటే పొరపాటే.. పైకి కనిపించకుండానే భార్యాభర్తల బంధం పెళుసుబారుతుంది. ఎంతో సంతోషంగా ఉన్న జంట కూడా కొన్ని తప్పులు చేయడం వల్ల తమ బంధాన్ని నాశనం చేసుకుంటారు. ఇంతకీ భార్యాభర్తల బంధాన్ని నాశనం చేసే తప్పులు ఏంటో తెలుసుకుంటే..
అనుమానం..
ఏ సంబంధానికైనా అనుమానం అతిపెద్ద శత్రువు. లైఫ్ పార్ట్నర్ ఫోన్‌ను చెక్ చేయడం, పదే పదే అనుమానించినట్టు చూడటం చేస్తుంటే, వారిపై నిఘా పెడుతుంటే లేదా అనవసరమైన ప్రశ్నలు అడుగుతుంటే జాగ్రత్తగా ఉండాలి. నమ్మకం లేకుండా ప్రేమ అనే భవనం నిలబడదు. అనుమానం పెనుభూతం అనే మాట వినే ఉంటారు. అనుమానం అనేది ఒక సంబంధాన్ని లోపల నుండి క్షీణింపజేసే చెదపురుగుల లాంటిది.
ఎగతాళి..
ఎగతాళి చేయడం చాలామందికి అదొక కామెడీ ఆటగా ఉంటుంది. కోపంతో లేదా హాస్యంగా ఎగతాళి చేయడం సర్వసాధారణంగా అనిపించవచ్చు, కానీ అది అవతలి వ్యక్తి హృదయంలో లోతైన గాయాన్ని కలిగిస్తుంది. "నీకు ఏమీ తెలియదు" లేదా "నువ్వు ఎప్పుడూ అలాగే చేస్తావు" వంటి మాటలు భాగస్వామి మనస్సులో నెమ్మదిగా ద్వేషాన్ని పెంచుతాయి. అంతేకాదు.. బాడీషేమింగ్ గురించి, రూపం గురించి చేసే ఎగతాళి మరింత మానసిక గాయం చేస్తుంది. ఇవి చాలా తప్పు.
పోలిక..
భార్యాభర్తలు ఎప్పుడూ తమ భాగస్వాములను ఇతరులతో పోల్చి దెప్పిపొడచకూడదు. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఎవరికి వారు ప్రత్యేకం. ఇతరులతో ఏ విషయంలో పోలిక పెట్టి మాట్లాడటం చాలా తప్పు. ఇతరులతో పోల్చి మాట్లాడేటప్పుడు తమతో బంధం ఎందుకు అని భావించేవారు ఉంటారు. ఇది వ్యక్తి ఆత్మగౌరవాన్ని నాశనం చేస్తుంది.
పంతం..
నేను చెప్పిందే నిజం, నేను చెప్పిందే పైనల్.. లాంటి మాటలు మాట్లాడుతుంటే మాత్రం జాగ్రత్త పడాల్సిందే. తాను కరెక్ట్ అని తన భాగస్వామి తప్పని నిరూపించడానికి ట్రై చేస్తుంటారు. వారి అహం వారిని అలా చేయిస్తుంది. కానీ ఇది బందం నాశనం కావడానికి కారణం అవుతుంది.
మౌనం..
భార్యాభర్తల మధ్య గొడవ జరిగినప్పుడు మౌనంగా ఉండటం మంచిదే. కానీ భార్యాభర్తల మధ్య గౌడవ కేవలం మౌనంతో పరిష్కారం కాదు. కొందరు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడానికి మౌనాన్ని ఆయుధంగా వాడతారు. అలా చేయడం వల్ల అపార్టాలు మరింత పెరుగుతాయి.
పాత విషయాలు..
భార్యాభర్తల మధ్య గొడవ జరిగినప్పుడు చాలామంది చేసే పని పాత విషయాలు బయటకు తీసి వాటి గురించి మాట్లాడతారు. ఇలా జరిగిపోయిన విషయాలను బయటకు తీసి మాట్లాడుతుంటే గొడవ వల్ల బందంలో ఏర్పడిన గాయం ఎప్పటికీ మానదు. ఎప్పటి గొడవలు అప్పుడే వదిలేయాలి.
మొబైల్..
నేటి కాలంలో బంధాలలో దూరం పెరగడానికి మొబైల్ ఫోన్ లే కారణం. భార్యాభర్తలు ఇద్దరూ ఇంట్లోనే ఉన్నా, ఇద్దరూ కలిసి పక్కన పక్కన కూర్చొన్నా ఫోన్ లో నిమగ్నమవుతుంటారు. దీని వల్ల ఒకరిని ఒకరు పట్టించుకోలేని పరిస్థితికి వస్తారు. ఒకరి ప్రదాన్యత ఇలా తగ్గిపోతుంది. ఇది విడిపోవడానికి కారణం అవుతుంది.
స్పేస్..
భార్యాభర్తల మధ్య ప్రేమ ఎక్కువైనా కష్టమే. ప్రేమ పేరుతో అతుక్కుపోవడం చాలా ఇబ్బందికరమైన విషయం. 24గంటలు అతుక్కుని ఉండటం, భాగస్వామి మీద ఆంక్షలు విధించడం, స్నేహితులను, బంధువులను కలవనివ్వకపోవడం వంటివి చేస్తే అలాంటి బంధాన్ని ఎప్పుడెప్పుడు వదులుకుందామా అనుకుంటారు. ఇలాంటి బందం ఒక పక్షిని గట్టిగా చేతిలో బంధించినట్టే ఉంటుంది.
సంతోషకరమైన సంబంధాన్ని బిల్డ్ చేసుకోవడం రాకెట్ సైన్స్ కాదు. ఒకరినొకరు గౌరవించుకోవాలి, నమ్మకంగా ఉండాలి, క్షమించడం నేర్చుకోవాలి.. పైన పేర్కొన్న ఈ ఎనిమిది విషయాలను దృష్టిలో ఉంచుకుంటే బంధాన్ని నిలబెట్టుకోవచ్చు.
*రూపశ్రీ.
మనసులోని మాటను దైర్యంగా బయటకు చెప్పలేకపోతున్నారా... ఈ నిజం తెలుసుకోండి..!
Publish Date:Dec 27, 2025
ఈ రూల్స్ ఫాలో అయితే న్యూ ఇయర్ లో పిల్లల సక్సెస్ పక్కా..!
Publish Date:Dec 26, 2025
క్రిస్మస్ ను డిసెంబర్ 25నే ఎందుకు జరుపుకుంటారు?
Publish Date:Dec 25, 2025
ఐస్లాండ్ దేశంలో ఆశ్చర్యపోయే నిజం.. ఇక్కడ శాంతా క్లాజ్‌ల గురించి తెలుసా?
Publish Date:Dec 24, 2025
శీతాకాలంలో ఉసిరికాయతో ఈ కాంబినేషన్లు ట్రై చేయండి.. ఇమ్యూనిటీ పెరుగుతుంది..!
Publish Date:Dec 29, 2025
ప్రకృతి ప్రసాదించిన అద్బుతమైన ఆహారాలు ఎన్నో ఉన్నాయి. సీజన్ వారిగా లభిస్తూ ఇవి ఆరోగ్యాన్ని ఎంతో గొప్పగా సంరక్షిస్తాయి. అలాంటి వాటిలో ఉసిరి కాయ ప్రధానమైనది. ఉసిరికాయను ఆయుర్వేదం అమృత ఫలం అని అంటుంది. ఉసిరికాయ రోగనిరోధక శక్తిని పెంచుతుంది, జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. శీతాకాలంలో ఉసిరిని క్రమం తప్పకుండా తీసుకోవడం జలుబు, దగ్గు, ఫ్లూ వంచివి దరిచేరవు. కేవలం సీజనల్ ఇన్పెక్షన్లు నివారించడమే కాదు.. ఫ్యాట్ బర్నర్ గా కూడా సహాయపడుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిని మెరుగుపరుస్తుంది, రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. కొలెస్ట్రాల్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది.
విటమిన్ స, యాంటీఆక్సిడెంట్లు ఉసిరిలో పుష్కలంగా ఉంటాయి. ధమనులలో ఫలకం పేరుకుపోకుండా ఉండటానికి , ధమనులలో ఫలకం సమస్య తగ్గించడానికి సహాయపడుతుంది. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను కూడా తగ్గిస్తుంది. మొత్తం రోగనిరోధక శక్తి, హృదయనాళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఉసిరిని పొడి రూపంలో కూడా తీసుకోవచ్చు. కానీ శీతాకాలంలో ఉసిరికాయలు సమృద్దిగా దొరుకుతాయి. ఉసిరికాయలను కొన్ని కాంబినేషన్లలో తీసుకుంటే ఇమ్యూనిటీ మరింత పెరుగుతుంది. ఇంతకూ ఉసిరికాయతో బెస్ట్ కాంబినేషన్ ఏంటో తెలుసుకుంటే..
ఉసిరి-తేనె..
తేనె కాంబినేషన్ లో ఉసిరి తీసుకుంటే ఉసిరిలో ఉండే విపరీతమైన పులుపు, వగరు రుచి తగ్గుతుంది. పైగా బోలెడు ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఉసిరి ఇమ్యూనిటీని పెంచుతుంది., మరోవైపు తేనె గొంతు సమస్యలు తగ్గిస్తుంది. గట్ ఆరోగ్యానికి సహాయపడుతుంది. శరీరానికి శక్తిని అందిస్తుంది. తేనె-ఉసిరి కాంబినేషన్ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది, మంటను తగ్గిస్తుంది, శ్వాసకోశ ఆరోగ్యానికి సపోర్ట్ ఇస్తుంది.
ఎలా తినాలి..
టీస్పూన్ ఉసిరి పొడి లేదా తాజా ఉసిరి రసం 1 టీస్పూన్ తీసుకోవాలి. దీన్ని సమాన పరిమాణంలో తేనెతో ఖాళీ కడుపుతో తీసుకోవాలి.
ఉసిరి-పసుపు..
ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇవి రెండు కలిసినప్పుడు రోగనిరోధక శక్తి సూపర్ గా పెరుగుతుంది, మంటను తగ్గిస్తుంది, శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది. ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి, తెల్ల రక్త కణాల పనితీరును పెంచడానికి, శ్వాసకోశ ఆరోగ్యాన్ని సహాయపడతుంది
ఎలా తీసుకోవాలి..
స్పూన్ ఉసిరి రసాన్ని గ్లాసు నీటిలో వేసి అందులో కాసింత మంచి పసుపును కలిపి తాగాలి. లేదంటే ఒక ఉసిరికాయ, ఒక ఒక ఇంచ్ తాజా పచ్చి పసుపును మిక్సీ వేసి జ్యూస్ చేసుకుని తాగాలి. ఇందులో కాసింత కరివేపాకు కూడా వేసుకుని జ్యూస్ చేసుకోవచ్చు. అలాగే క్యారెట్ లాంటివి వేసుకోవచ్చు.
ఉసిరి-అల్లం..
అల్లంను ఉసిరితో కలపి తీసుకున్నా ఇమ్యూనిటీ మెరుగవుతుంది. అల్లం శరీరంలో వేడిని పెంచుతుంది. ఉసిరి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. శరరానికి వేడిని అందించడం ద్వారా అల్లం రక్త ప్రసరణను పెంచుతుంది, ఇన్ప్లమేషన్లతో పోరాడుతుంది. ఉసిరిలో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్ల కంటెంట్ శరీర సహజ రక్షణ వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
ఎలా తీసుకోవాలి..
2 టేబుల్ స్పూన్ల తాజా ఉసిరి రసాన్ని 1/2 టీస్పూన్ తురిమిన అల్లం రసం తీసుకోవాలి. వీటిని 1/2 కప్పు నీటితో కలిపి తీసుకోవచ్చు. కొన్ని చుక్కల తేనె జోడిస్తే మరీ మంచిది. దీన్ని ఉదయాన్నే తీసుకోవాలి.
ఉసిరి-బెల్లం..
ఉసిరికాయను బెల్లంతో కలిపి తీసుకోవచ్చు. ఇది చాలా రుచిగా ఉండటమే కాకుండా మెరుగైన ఆరోగ్యాన్ని చేకూర్చుతుంది. ఉసిరి-బెల్లం కలిపి మురబ్బా తయారు చేసుకోవచ్చు.ఈ కాంబో జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ఐరన్ శోషణను పెంచుతుంది. శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తుంది.
ఎలా తీసుకోవాలి..
ఉసిరిని ఆవిరి పట్టి వాటిని విత్తనాలు తీసివేసి , ఆపై వాటిని బెల్లం సిరప్ లో ఉడికించి, ఉప్పు, మిరియాలు, జీలకర్ర పొడితో కలిపి తీసుకోవాలి. చాలా మంచి ఇమ్యునిటీ ఇస్తుంది.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
వాల్నట్స్ తింటే ఈ వ్యాధులు అన్నీ మాయం..!
Publish Date:Dec 27, 2025
గ్యాస్ సమస్యను పెంచే స్నాక్స్.. సాయంత్రం 6గంటల తర్వాత వీటిని అస్సలు తినకూడదు..!
Publish Date:Dec 26, 2025
రోజూ బ్రేక్ ఫాస్ట్ లో బ్రెడ్ తింటున్నారా?.. అయితే ఈ నిజం తెలుసుకోండి!
Publish Date:Dec 25, 2025
ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం మంచిదా కాదా? వైద్యులు చెప్పిన షాకింగ్ నిజాలు ఇవీ..!
Publish Date:Dec 24, 2025