ధోప్ కాన్సెప్ట్ డైరెక్టర్ శంకర్ దే...

  ఈ వారం సుమ అడ్డా షోకి "భైరవం" మూవీ టీమ్ వచ్చింది. ఇందులో రాజా రవీంద్ర, డైరెక్టర్ శంకర్ తనయ అదితి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వచ్చారు. ఐతే ఇందులో రామ్ చరణ్ పిక్ ని ప్లే చేసేసరికి అదితి ఫుల్ గా సిగ్గుపడిపోయింది. "మగధీర మూవీ నేను ఫస్ట్ టైం థియేటర్ లో చూసాను. రామ్ చరణ్ కి నేను బిగ్ ఫ్యాన్ ని. ఐతే ఈ మూవీ వచ్చిన కొత్తలో రామ్ చరణ్ పిక్స్ ని పేపర్ లో వచ్చినప్పుడు వాటిని కట్ చేసి స్టిక్కర్స్ గా ఇంట్లో అతికించుకునేదాన్ని. ఇప్పుడు చెప్పాలంటే ఆ విషయాలు కొంచెం ఎంబరాసింగ్ గా ఉంది.ఆయన అంటే చాలా గౌరవం, ప్రేమ రెండూ ఉన్నాయి " అంటూ తెగ సిగ్గుపడిపోయింది. ఇక అదితి ఈ గేమ్ చెంజర్ మూవీలో ధోప్ సాంగ్ పాడింది అని సుమ చెప్పింది. అదితితో ఆ సాంగ్ వి కొన్ని లైన్స్ పాడించింది. "సరే ధోప్ అని వదిలేయాలి అంటే ఎం వదిలేస్తారు" అని అదితిని అడిగింది. "నా కోపాన్ని వదిలేస్తాను. మా నాన్న ఈ ధోప్ కాన్సెప్ట్ ని ఇంట్లోనే ఇంట్రడ్యూస్ చేశారు." అని చెప్పింది. తర్వాత సందీప్ మీరేమి వదిలేస్తారు ధోప్ అని సుమ అడిగింది. "భూతుల్ని వదిలేస్తాను" అని చెప్పాడు. "సందీప్ నీకు బూతులు వచ్చా" అని అడిగింది ఆసక్తిగా సుమ. "పెళ్ళాయ్యాకే వాటిని వదిలేయడం స్టార్ట్ చేశా" అని చెప్పాడు. ఇక అదితి శంకర్  చాలా మందికి తెలిసిన అమ్మాయే. మెడిసిన్ చదివిన ఈమె లాస్ట్ ఇయర్ స్టార్ హీరో కార్తీ సరసన ‘విరుమన్’ సినిమాలో నటించి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం శివకార్తికేయన్ తో ‘మావీరన్’ మూవీలో హీరోయిన్ గా నటించింది.

బిగ్ బాస్ లో బద్ద శత్రువులు....ఇప్పుడు ఆదర్శ మిత్రులు

  ప్రియాంక జైన్-భోలే షావలి అంటే చాలు బిగ్‌బాస్ సీజన్-7లో జరిగిన గొడవే గుర్తొస్తుంది. అంతలా గొడవ పడిన వీళ్ళిద్దరూ ఇప్పుడు ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అదే  'భోలే అంటే హీరో' అనే టైటిల్‌ తో రాబోతోంది. ఇక రీసెంట్ వీళ్ళు ఫ్యామిలీ స్టార్స్ ఎపిసోడ్ షూటింగ్ కి వెళ్తూ కలిసి ఒక వీడియో చేశారు. దాన్ని ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు భోలే.   "హాయ్ ఒక్కసారి జస్ట్ కెమెరా అటు తిప్పుతా అంటూ ప్రియాంక జైన్ వైపు కెమెరా తిప్పి చూడండి  సాహసవీరుడు సాగరకన్య సినిమాలో హీరోయిన్‌లా మెరిసిపోతున్నావ్ .." అంటూ ప్రియాంకని పొగిడేసాడు భోలే. దీంతో ప్రియాంక కూడా "మీరెలా ఉన్నారు"  అంటూ పలకరించింది.   "హీరోనే కానీ  హీరోలా ఉన్నా అనొద్దు ...నువ్వు హీరోయిన్‌లా ఉన్నావ్.. కానీ నీ దగ్గర నేను హీరోలా ఉన్నా అనడానికి నాకు కొంచెం సిగ్గుగా ఉంది.. ఎందుకంటే నాకు అంత సీన్ లేదు.." అన్నాడు భోలే. దానికి ప్రియాంకా సెటైర్ వేసింది. " ఏంటి మీకు బుగ్గాలొచ్చాయి" అని అడిగింది. "  తగ్గడానికి ట్రై చేస్తున్నా.. నువ్వే నాకు  ఆదర్శం.. ఎందుకంటే ఇప్పుడు నేను  డైట్‌లో ఉన్నా.." అంటూ కొంచెం ఎక్కువగానే చెప్పాడు భోలే. తర్వాత తన సినిమా ప్రొడ్యూసర్ ని పరిచయం చేశాడు. "ఇతను పరిగి మల్లిక్ అన్నా.. ఆయన నిర్మాతగా నేను 'భోలే అంటే హీరో' అనే సినిమా చేస్తున్నా.. అన్న ఏం అంటున్నాడంటే భోలే.. ప్రియాంక హీరోయిన్‌గా చేస్తుందా అని  అడగవా ఒకసారి అన్నాడు.. కానీ నేను కూడా కొంచెం మంచిగా తయారై అప్పుడు అడుగుదామన్నా.. ఎందుకంటే ఇప్పుడు నన్ను ప్రియాంక ఒప్పుకునేలా లేదు.." అంటూ భోలే కొంచెం కామెడీ చేసాడు. ఇక ఈ మూవీ రాబోతోంది అందరం చూసి సపోర్ట్ చేద్దాం అంటూ ప్రియాంక జైన్ కంక్లూడ్ చేసేసింది.  

ఆడోల్లకు ఇన్విజిబుల్ పవర్ వస్తే మొగుళ్లను బతకనివ్వరు

  ఇష్మార్ట్ జోడి నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక నెక్స్ట్ వీక్ కి ఎంటర్టైన్మెంట్ థీమ్ ఇచ్చారు. దాంతో ఒక్కో జోడి ఒక్కో గెటప్ లో వచ్చి ఇరగదీసారు. ఇక యాంకర్ ఓంకార్ లాస్ట్ లో ఒక క్వశ్చన్ అడిగాడు.. "తేజు నీకు ఇన్విజిబుల్ పవర్ ఎం చేస్తావ్" అని అడిగాడు. వెంటనే అమర్ దీప్ మైక్ పట్టుకుని. "ప్రపంచకంలా ఆడోల్లకు ఇన్వి జిబుల్ పవర్ వస్తే అందరూ మొగుళ్ళ చుట్టే తిరుగుతారు. బాత్రూంకి పోయినా, కారెక్కిన వెనకాలే ఉంటది..షాపింగ్ పోయినా, వేరే అమ్మాయితో చిన్న కాఫీ మీటింగ్ కి పోయినా వెనకాలే ఉంటది. ఇడిసిపెట్టి యాడికి పోతాది సిన్న జోరీగ లెక్క చెవి కాడినే తిరగతా ఉంటాది. మొగుళ్లే ఊళ్లు పట్టి తిరగతారు. ఎవురూ సెప్పలేరు..నేను కాబట్టి సెప్పినా...పెళ్ళాం మాట మొగుడింటే ఎల్లా ఉంటదో ఈ ప్రెపంచకానికి చూపిస్తా" అన్నాడు అమరదీప్ చౌదరి. ఐతే ఇష్మార్ట్ జోడి స్టార్టింగ్ ఎపిసోడ్స్ లో చూసుకుంటే అమర్ - తేజు మధ్య వాళ్ళ మ్యారీడ్ లైఫ్ లో కొన్ని సమస్యలు ఉన్నాయన్న విషయం చెప్పారు. ఐతే వాటిని పరిష్కరించుకుంటూ వస్తున్నామని అలాగే ప్రేమతో ఉండడానికి ప్రయతిస్తున్నామని చెప్పారు. ఇక తేజో కూడా అంత తొందరగా ఎవరినీ నమ్మొద్దు అంటూ కూడా సలహా ఇచ్చింది. ఇక అమర్ తేజు కోసం ఒక ప్రేమలేఖ కూడా రాసి మెప్పించాడు. ఇలా వీళ్ళు ఈ షో ద్వారా కొంతవరకు వాళ్ళ సమస్యలను తీర్చుకున్నట్లు కూడా చెప్పుకొచ్చారు.  

Illu illalu pillalu : పోలీస్ స్టేషన్ లో రామరాజు.. భాదపడుతూ వెళ్ళిన ప్రేమ!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -86 లో..... రామరాజుని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వస్తారు. స్టేషన్ లో భద్రవతిని చూసి రామరాజు షాక్ అవుతాడు. ఆ తర్వాత రామరాజు కుటుంబంలో అందరికి విషయం తెలిసి అందరూ స్టేషన్ కి వస్తారు. ఎందుకు మా నాన్నని అరెస్ట్ చేశారని ధీరజ్ అడుగుతాడు. భద్రవతి గారి మేనకోడలు నగలు మీ నాన్న దొంగతనం చేశారు.. అందుకే అని సీఐ చెప్తాడు. మా నాన్న దొంగతనం చెయ్యడమేంటి వదిలెయ్యండి అని అందరు అడుగుతారు. నేనే అసలైన నేరస్తుడిని.. నిన్ను కన్నాను కదా అందుకే అని రామరాజు చిరాకుగా ధీరజ్ తో మాట్లాడతాడు. భద్రవతి చెప్పగానే సీఐ అందరికి బయటకు వెళ్ళమని చెప్తాడు. భద్రవతి వెళ్తుంటే వేదవతి మాట్లాడుతుంది. నా వాళ్ళ నా అక్క జీవితం అలా అయిందని చాల బాధపడ్డాను కానీ ప్రతీక్షణం మా కుటుంబం చెడిపోవాలని చూస్తావంటూ వేదవతి ఎమోషనల్ అవుతుంది. బంధం గురించి నువ్వు మాట్లాడకంటూ భద్రవతి కోప్పడుతుంది. అందరు రాత్రి అయిన స్టేషన్ ముందే కూర్చొని ఉంటారు.  ధీరజ్ బాధపడుతూ మా నాన్నకి భోజనం ఇస్తానంటూ కానిస్టేబుల్ ని రిక్వెస్ట్ చేస్తాడు. వద్దని అతను అంటాడు. ప్రేమని ధీరజ్ పక్కకు తీసుకొని వెళ్లి మాట్లాడతాడు. నువ్వు ఎవడితోనో లేచిపోతే మీ వాళ్ళు ఏం అవుతారోనని మా అమ్మ నా చేత నీ మెడలో తాళి కట్టించింది. ఇప్పుడు చూసావా ఏం చేసారోనని ధీరజ్ ఎమోషనల్ అవుతాడు. దాంతో ప్రేమ బాధపడుతూ.. తన ఇంటికి వెళ్తుంది. భద్రవతి కళ్ళు మూసుకొని ఉంటుంది . ప్రేమ వచ్చావా అని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : కార్తీక్, దీపలకి రెస్టారెంట్ ఇచ్చేసిన సత్యరాజ్.. తాత పంతాన్ని సవాలు చేసిన మనవడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -285 లో....సత్యరాజ్ రెస్టారెంట్ ని కొనడానికి జ్యోత్స్న వెళ్తుంది. తన ప్రపోజల్ సత్యరాజ్ ముందు పెట్టి.. బయట వెయిట్ చేస్తుంది. ఆ తర్వాత లోపలికి దీప, కార్తీక్ లు వెళ్తారు. నీ వల్లే నేను రెస్టారెంట్ దివాలా తీసి అమ్మే సిచువేషన్ వచ్చింది.. జ్యోత్స్న రెస్టారెంట్ కి మార్క్ క్రియేట్ చేసావని సత్యరాజ్ అంటాడు. అసలు మీరెందుకు వచ్చారని కార్తీక్, దీపలని అతను అడుగుతాడు. రెస్టారెంట్ కొనడానికి కాదు డెవలప్ చెయ్యడానికి అని కార్తీక్ అంటాడు. దీప ఒక వంటకం తన వెంట తీసుకొని వచ్చి సత్యరాజ్ కి తినమని ఇస్తుంది. అది తిని చాలా బాగుందంటూ సత్యరాజ్ మెచ్చుకుంటాడు. ఇది నేనే చేసాను చాలా వంటకాలు వచ్చు.. కార్తీక్ బాబుకి బిజినెస్ ని ఎలా రన్ చెయ్యాలో తెలుసు.. ఈ రెస్టారెంట్ మాకు ఇవ్వండి అని దీప అడుగుతుంది. కుదరదని సత్యరాజ్ అంటాడు. ప్లీజ్ సర్ అంటూ కార్తీక్, దీపలు రిక్వెస్ట్ చేస్తారు. సర్ మీ నిర్ణయం కోసం వెయిట్ చేస్తామని బయట వెయిట్ చేస్తారు. సత్యరాజ్ బయటకు వచ్చి నా రెస్టారెంట్ ని కార్తీక్ కి ఇస్తున్నానని చెప్పగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. కార్తీక్, దీపలు హ్యాపీగా ఫీల్ అవుతారు. జ్యోత్స్న పొగరుగా... నా కన్న వాళ్ళు ఎక్కువ డబ్బు ఇస్తానన్నారా అని అంటుంది. లేదు నా రెస్టారెంట్ ని వాళ్ళకి డెవలప్‌మెంట్ కి ఇస్తున్నానని  సత్యరాజ్ అనగానే. జ్యోత్స్న కోపంగా అక్కడి నుండి వెళ్తుంది. సత్యరాజ్ మనవడు తన దగ్గరికి వస్తాడు. ఈ బాబుని గుర్తు పట్టావా అని దీపని సత్యరాజ్ అడుగగా.. గుర్తుపట్టానని అంటుంది. ఎవరు అని కార్తీక్ అడుగుతాడు. దీప వల్లే నా మనవడు ఇలా ఉన్నాడు.. ఆ రోజు నా మనవడిని కాపాడావని సత్యరాజ్ తన కొడుకు ని కార్తీక్ దీపలకి పరిచయం చేస్తాడు. ఇందాకే నా కొడుకు దీప గురించి చెప్పాడని సత్యరాజ్ అంటాడు. ఆ తర్వాత దీపని కార్తీక్ తీసుకొని శివన్నారాయణ ఇంటికి వెళ్తాడు. బయట ఉండే ఇంట్లో వాళ్లని పిలుస్తాడు కార్తీక్. ఏంటి నువ్వు గెలిచావని చెప్పుకోవడానికి వచ్చావా అంటూ కార్తీక్ తో చులకనగా మాట్లాడుతాడు శివన్నారాయణ. తాత, మనవడి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : రామలక్ష్మి గతంలో షాకింగ్ నిజాలు.. అందుకే భర్తకి దూరంగా ఉంటుందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -332 లో.....  రామలక్ష్మి మైథిలీగా ఎలా మరాల్సి వచ్చిందో రామలక్ష్మి గుర్తు చేసుకుంటుంది. ఫణీంద్ర, సుశీల లు రామలక్ష్మిని ఉండమని చెప్తారు. నా భర్త దగ్గరికి వెళ్ళాలంటూ వెళ్తుంది. తనే మళ్ళీ ఇక్కడికి వస్తుందని సుశీలతో ఫణీంద్ర చెప్తాడు. రామలక్ష్మి నేరుగా స్వామి దగ్గరికి వెళ్తుంది. నా భర్త లేడు.. మీరు చెప్పినట్టు వినలేదని రామలక్ష్మి బాధపడుతుంది. నీ భర్త లేడని ఎవరు చెప్పారు.. బ్రతికే ఉన్నాడని స్వామి చెప్తాడు.  కానీ నువ్వు నీ భర్తతో కలిసి ఉండకూడదు.. దూరంగా ఉండాలని స్వామి చెప్పగానే రామలక్ష్మి షాక్ అవుతుంది. అలా అయితేనే నీ భర్త ప్రాణాలతో ఉంటాడు. నువ్వు ఎక్కడ ఉండాలో కూడా ఇది వరకే దారి చూపించాడు ఆ దేవుడు అని స్వామి అనగానే ఫణీంద్ర వాళ్ళు మాట్లాడిన విషయలు గుర్తు చేసుకుంటుంది రామలక్ష్మి. నువ్వు బ్రతికి ఉండగానే నీకు ఇంకొక జన్మ లభించిందని స్వామి చెప్తాడు. ఆ తర్వాత సీతాకాంత్ దగ్గరికి రామలక్ష్మి వెళ్తుంది. దూరం నుండి చూసి సీతా సర్ నేను చనిపోయానన్న భ్రమ లో ఉన్నాడు అలాగే ఉండనివ్వాలని రామలక్ష్మి వెనక్కి తిరిగి వెళ్తుంది  ఆ తర్వాత ఫణీంద్ర, సుశీల దగ్గరికి తిరిగి వెళ్లడంతో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నువ్వు ఇన్ని రోజులు కోల్పోయింది ఇక నుండి నీ చుట్టూ వాళ్ళకు తిరిగి ఇవ్వమని రామలక్ష్మితో ఫణీంద్ర అంటాడు. ఇదంతా రామలక్ష్మి జరిగిందని గుర్తు చేసుకుంటుంది. మరొకవైపు సీతాకాంత్, రామ్ లు కోపంగా ఇంటికి వస్తారు. సీతాకాంత్ పైకి వెళ్తాడు. రామ్ కోపంగా అన్ని వస్తువులు విసిరేస్తాడు. ఏమైందని శ్రీలత అడుగుతుంది. మా ప్రిన్సిపల్ మేడమ్ నాన్న ని కొట్టిందనగానే శ్రీలత వాళ్ళు షాక్ అవుతారు. ఎందుకు కొట్టిందని శ్రీలత వాళ్లు అడుగ్గా.. ఏమో అని రామ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : కళ్యాణ్ ఎదుగుదల కోసం రంగంలోకి దిగిన లేడీ పోలీస్.. సామంత్ చేతిలో అనామికకి చెంపదెబ్బ!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -649 లో.....ఇందిరాదేవి సీతారామయ్యలు కలిసి రుద్రాణి రాహుల్ లని ఇంట్లో నుండి పంపించాలని నిర్ణయం తీసుకుంటారు. దాంతో ఇక ఇగోకి పోతే నడవదని రుద్రాణి సీతారామయ్య కాళ్ళపై పడి రిక్వెస్ట్ చేస్తుంది. ఇన్ని రోజులు మీరే పెంచి పోషించారు.. ఇప్పుడు మమ్మల్ని బయటకు వెళ్ళమంటే ఎలా బ్రతుకుతాం.. స్వప్న తన కూతురు మొహం చూసి అయిన మమ్మల్ని వదిలి పెట్టండి అని రుద్రాణి అనగానే.. అంత లేదు మాకు తాతయ్య ఇచ్చిన ఆస్తులున్నాయ్.. మేం ఇక్కడే ఉంటాం.. వాళ్ళు వెళ్ళమనేది మిమ్మల్ని అని స్వప్న అంటుంది. అక్క నువ్వు సైలెంట్ గా ఉండు పాపకి తండ్రి కావాలని కావ్య అంటుంది. అయితే ఒక రాహుల్ ని ఉంచండి అని స్వప్న అంటుంది. ఈ ఒక్కసారి క్షమించండి అన్నట్లు సీతారామయ్యతో కావ్య చెప్తుంది. ఇక ఇంట్లో గొడవలకి కారణం అవ్వదు కదా అని ఇందిరాదేవి అనగానే.. అవ్వను.. ఇక నా వాళ్ల ఏ గొడవ జరగదని రుద్రాణి అనగానే ఇందిరాదేవి, సీతారామయ్య ఒప్పుకుంటారు. ఆ తర్వాత రుద్రాణి కోపంగా గదిలోకి వెళ్లి ఇంట్లో నుండి పంపిస్తారా అంటూ వస్తువులు విసిరేస్తుంటే రాహుల్ వచ్చి ఆపుతాడు. అప్పుడే స్వప్న వచ్చి తన స్టైల్ లో కౌంటర్ ఇచ్చి వెళ్తుంది. నువ్వు చాలా గ్రేట్ రా భార్యని పోలీస్ ఆఫీసర్ ని చేసావని కళ్యాణ్ ని రాజ్ మెచ్చుకుంటాడు. అప్పుడే ధాన్యలక్ష్మి వస్తుంది. ఊళ్ళో వాళ్ళని ఉద్దరించడం కాదు తను కూడ గొప్ప స్థాయిలో ఉండాలి.. పేపర్ లు చూసుకొని మురిసిపోకుండా తన గురించి గొప్పగా పేపర్ లో రావాలి.. ఒకరి కిందపని చేస్తే పనివాడు అంటాడు.. లేదంటే రాజు అంటారని ధాన్యలక్ష్మి అంటుంది. నువ్వేం బాధపడకురా పిన్ని గురించి తెలుసు కదా అని కళ్యాణ్ తో రాజ్ అంటాడు. అదంతా అప్పు వింటుంది. బయట కూర్చొని ఏడుస్తుంటే.. అప్పుడే కావ్య వచ్చి మాట్లాడుతుంది. ఆవిడ అన్న మాటల్లో కూడా న్యాయం ఉంది కదా అని అప్పు అంటుంది. కళ్యాణ్ లిరిక్ రైటర్ దగ్గర పని చెస్తున్నాడు కదా అతను తన దగ్గరే వర్క్ చెయ్యాలని అగ్రిమెంట్ రాయించుకున్నాడు. అలా అయితే కళ్యాణ్ ఎలా ఎదుగుతాడు. నువ్వు కళ్యాణ్ కి తెలియకుండా లిరిక్ రైటర్ పని చెప్పమని కావ్య చెప్పగానే.. వాడి సంగతి చెప్తానంటు అప్పు అంటుంది. మరొకవైపు నీ వల్ల.. నువ్వు చెప్పింది చేస్తూ కోట్లు పోగొట్టుకున్నానని అనామిక చెంపచెల్లుమనిపిస్తాడు సామంత్. దాంతో నీ సంగతి, ఆ రాజ్ సంగతి చెప్తానని అనామిక అనుకుంటుంది. ఆ తర్వాత కావ్య ఫ్రూట్స్ అన్ని ఒక బాస్కెట్ లో సర్దుతు ఉంటే అప్పుడే రాజ్ వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

శ్రీముఖి నువ్వే అలా బాలు మీదకు వచ్చేయకు

  ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఈ వారం షో ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగింది. ఇక ఇందులో శ్రీముఖి బాలుతో చేసిన చిలిపి చేష్టలూల్ భలే ముద్దుగా ఉన్నాయి. ఐతే ఒక విషయంలో శ్రీముఖి బాధపడింది. దాన్ని తీర్చడానికి మధ్యవర్తిత్వం చేయడానికి కార్తీక దీపం డాక్టర్ బాబుని పిలిచింది. ఐతే ముందుగా శ్రీముఖి వెళ్లి బాలుతో డాన్స్ చేసింది దాంతో బాలు శ్రీముఖిని లిఫ్ట్ చేయడానికి ట్రై చేసాడు. వెంటనే అవినాష్, హరి వచ్చి అడ్డుపడ్డారు. "అందరూ నన్నే అంటున్నారు. నువ్వే బాలు మీద ఇంటరెస్ట్ చూపిస్తున్నావు అని కాబట్టి ఈ పంచాయతీ తీర్చాలి. మీరే దగ్గరుండి మాట్లాడి ఐ లవ్ యు " చెప్పించండి అంటూ శ్రీముఖి సిగ్గుతో డాక్టర్ బాబుని అడిగింది. "బాలు నువ్వు ముందు శ్రీముఖిని లిఫ్ట్ చేసే బదులు వెళ్లి ఆ మూడు ముక్కలు చెప్పేయ్" అన్నాడు. ఇక శ్రీముఖి కూడా "ఆ త్రి మ్యాజికల్ వర్డ్స్ ఐ లవ్ యు   చెప్పేసేయ్ " అని అంది. తర్వాత ఇద్దరూ కలిసి "సామజవరగమనా" అనే సాంగ్ కి డాన్స్ చేశారు. ఐతే శ్రీముఖి బాలును తెగ గడ్డాలు, బుగ్గలు పట్టుకుంటూ ఉండేసరికి "నువ్వెందుకు ముందే వచ్చేస్తున్నావ్ అలా లాగేయకు బాలుని" అన్నాడు డాక్టర్ బాబు. దాంతో శ్రీముఖి నవ్వేసింది. శ్రీముఖి-బాలు మధ్య ఏదో ఉంది అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఏ షో ఐనా కానీ సైలెంట్ గా ఉన్న వాళ్ళను చూసి వాళ్ళతో నవించడానికి షోని రక్తి కట్టించడానికి శ్రీముఖి వాళ్ళతో ఇలా లవ్ గేమ్స్ ఆడిస్తూ ఉంటుంది.  

ఆదికి తడిసిపోయినట్టు ఉంది...ఎవరైనా డైపర్ వేయించండి

  ఢీ జోడి షోలో అశ్విని శ్రీ- ఆది, సోనియా-సిద్దు మధ్య ఈ వారం గట్టిగానే ఫైట్ అయ్యింది. షోకి రావడంతోనే అశ్విని ఆది మీద కంప్లైంట్ చెప్పింది. "ఆదిని పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఒక ముద్దు లేదు ముచ్చటా లేదు" అనేసింది. "నేను ముద్దు అడిగితే నువ్వు ఏమన్నావ్ మా అత్త అక్కడే కూర్చుంటుంది ఇవ్వడం కుదరదు అన్నావ్ కదా" అన్నాడు ఆది. తర్వాత స్టేజి మీదకు వచ్చిన సోనియా-సిద్ధుని చూసి ఆది కామెంట్స్ చేసాడు. "థియేటర్ ముందు మీ ఆవిడ ఇచ్చే రివ్యూస్ చాలా బాగుంటాయండి" అంటూ సోనియా గురించి చెప్పేసరికి సిద్దు ఒక రేంజ్ లో చూసాడు. తర్వాత సోనియా టీమ్ నుంచి డాన్స్ కంటెస్టెంట్స్ సూర్య తేజ - హంసను పంపించారు. "రేయ్ ఆది పేర్లు వినగానే తడిసిపోయిందా..ఐనా నువ్వెందుకురా ఇక్కడికి వచ్చి రోజూ..నోరు ముయ్యి " అని సోనియా ఆదిని టీజ్ చేసింది "చూసుకుందామా మా సైడ్ నుంచి చారి మాస్టర్  వస్తున్నాడు..ఐనా ఈ తెల్ల పందికొక్కును ఎవడురా షోకి తీసుకొచ్చింది " అన్నాడు ఆది కూడా. ఆ మాటకు సోనియా "ఏంటి మీ ఆవిడని తెల్ల పందికొక్కు అనడానికి సిగ్గు లేదు" అని అశ్వినిని సేవ్ చేయడానికి అన్నట్టుగా డైలాగ్ వేస్తె "ఏ చిరిగిపోయిన ప్యాంటు సైలెంట్ గా ఉండు" అంటూ అశ్విని సోనియా మీద రివర్స్ అయ్యింది. ఇక లాస్ట్ లో సోనియా సైడ్ నుంచి వెళ్లిన జోడి ఇరగదీసేసరికి "నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ కి ఎగరేసి తంతా" అని వార్నింగ్ ఇచ్చాడు ఆది. ఆది ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడని అందరినీ తిట్టేస్తున్నాడని తెలుసుకున్న సోనియా "ఎవరైనా కొంచెం హెల్ప్ చేయండి..ఆదికి తడిసిపోయినట్టు ఉంది...ఎవరైనా డైపర్ వేయించండి. " అన్నది. "ఆల్రెడీ మీ సిద్దు డైపర్ వేసుకున్నాడు..అది తీసేయ్ ఫస్ట్" అని రివర్స్ కౌంటర్ వేసాడు ఆది. "నోరు ముయ్యరా ఆది" అన్నది సోనియా.

Illu illalu pillalu : పెళ్ళి సంబంధం చెడగొట్టిన భద్రవతి.. రామరాజుని అరెస్ట్ చేసిన పోలీసులు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -85 లో.....తిరుపతి ఫోన్ చేయగానే ధీరజ్, ప్రేమ, సాగర్, నర్మదలు ఇంటికి వస్తారు. ఆ అమ్మాయి నగలు నువ్వు తీసుకొని వచ్చావా అంటూ ధీరజ్ పై రామరాజు విరుచుకుపడతాడు. దాంతో ప్రేమ ధీరజ్ లు టెన్షన్ పడతారు. నగలు తీసుకొని రాలేదంటే ఎక్కడ ప్రేమ విషయం బయటపడుతుందోనని తీసుకన్నానని చెప్పగానే.. అందరు షాక్ అవుతారు. వాళ్ళ నగలు వాళ్లకి ఇచ్చేయ్ అని రామరాజు అంటాడు. దాంతో నగలు లేవు పెళ్లికి ఖర్చు అయ్యాయంటూ అబద్ధం చెప్తాడు ధీరజ్. దాంతో ధీరజ్ పై రామరాజు కోప్పడతాడు. ఆ నగల విలువ ఎంత ఉంటుందో చెప్పు ఇస్తానని రామరాజు అనగానే.. ఒరేయ్ మాకే డబ్బులు ఇస్తానని అంటావా అని సేనాపతి, విశ్వలు గొడవకి వెళ్తారు. దాంతో వద్దని వాళ్ళిద్దరిని లోపలికి పిలుస్తుంది భద్రవతి. ప్రేమని ధీరజ్ పక్కకి తీసుకొని వెళ్లి.. నీ వల్లే ఇదంతా అని కోప్పడతాడు. మరొకవైపు మా అక్క అంత సైలెంట్ గా ఉందంటే ఏదో సమస్య చేయబోతుందని నర్మదతో వేదవతితో చెప్తూ బాధపడుతుంది. ఆ తర్వాత ఎందుకు ఇలా చేసావ్ అక్క ఇప్పుడు మంచి ఛాన్స్.. ప్రేమ కూడా మన ఇంటికి తిరిగి వచ్చేసేదని సేనాపతి అంటాడు. దాంతో భద్రవతి సీఐకి ఫోన్ చేసి ఫోన్ లో ఏదో చెప్తుంది. ఇప్పుడు అర్ధం అయ్యిందా నా వ్యూహం అని భద్రవతి అనగానే అర్థం అయిందంటు సేనాపతి నవ్వుతాడు. రామరాజు రైస్ మిల్ లో ఉంటాడు. ఒకతను చందుకి ఒక సంబంధం తీసుకొని వస్తాడు. వాళ్లతో రామరాజు మాట్లాడుతుంటే.. పోలీసులు వచ్చి మీరు నగలు దొంగతనం చేశారట అని రామరాజుని అరెస్ట్ చేస్తారు. దాంతో సంబంధం వాళ్ళు మీరు ఇలాంటి వాళ్ళ అంటు రామరాజు ని తిడతారు. రామరాజుని పోలీసులు అరెస్ట్ చేసీ స్టేషన్ కి తీసుకొని వెళ్తారు. ఆ విషయం సాగర్ కి తెలిసి అందరికి చెప్తాడు. రామరాజు స్టేషన్ కి వెళ్లేసరికి అక్కడ భద్రవతి ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : సత్యరాజ్ రెస్టారెంట్ ని కార్తీక్ సొంతం చేసుకుంటాడా.. 

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -284 లో..... దీప ప్రొద్దున్నే లేచి తులసి పూజ చేస్తుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు. ఇద్దరు కలిసి దీపం పెడతారు. ఏంటి ఏదో కోరుకున్నట్లున్నారని దీపని కార్తీక్ అడుగుతాడు. అవును మీరు మంచి స్థాయికి వెళ్ళాలని దీప అంటుంది. ఆ తర్వాత కార్తీక్ కి దీప కాఫీ తీసుకొని వస్తుంది. ఏంటి ఎక్కడికో వెళ్లినట్లున్నారు.. ఏమైందని అడుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా డబ్బు ఉండాలంటూ కార్తీక్ నిరాశగా మాట్లాడతాడు. అప్పుడే జ్యోత్స్న రెస్టారెంట్ లో వర్క్ చేసే ప్రభాకార్ కార్తీక్ దగ్గరికి వస్తాడు. ఏంటి ఇలా వచ్చారు ఏదైనా ప్రాబ్లమ్ ఆ అని కార్తీక్ అడుగుతాడు. అదేం లేదు సర్ జ్యోత్స్న రెస్టారెంట్ కి అప్పోజిట్ సత్యరాజ్ రెస్టారెంట్ ఉండేది కదా.. అది ఇప్పుడు దివాలా తీసింది అంట.. అమ్మకానికి రెడీగా ఉందట.. మీ వల్లే ఆ కంపెనీ దివాలా తీసింది. మీరు జ్యోత్స్న రెస్టారెంట్ కి ఒక మార్క్ క్రియేట్ చేశారు.. ఇప్పుడు మీరు ఆ రెస్టారెంట్ ని కొనండి. వాళ్లకి లాస్ లో నుండి ఎలా బయటకు రావాలో తెలియదు.. మీకు ఆ టాలెంట్ ఉంది.. అందుకే అంటున్నానని కార్తీక్ కి ప్రభాకర్ చెప్తాడు. నువ్వు ఆ జ్యోత్స్న రెస్టారెంట్ లో వర్క్ చేస్తూ ఇలా చెప్పడం ఏంటని ప్రభాకార్ ని కార్తీక్ అడుగుతాడు. అక్కడ నా లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సర్.. వాళ్ళు జాబ్ కోల్పోకూడదు అందుకే అని ప్రభాకర్ అంటాడు. అందుకు కార్తీక్ సరే అంటాడు. కార్తీక్ ఆ రెస్టారెంట్ గురించి మాట్లాడడానికి దీపని కూడా తీసుకొని వెళ్తాడు. మరొకవైపు సత్యరాజ్ రెస్టారెంట్ ని మనమే కొనాలి.. ఇక మార్కెట్ లో మనకి పోటీ ఉండరని జ్యోత్స్న శివన్నారాయణతో చెప్తుంది. ఆ కంపెనీ మనమే తీసుకొవాలని జ్యోత్స్నకి శివన్నారాయణ చెప్తాడు. దీప, కార్తీక్ లు సత్యరాజ్ ఆఫీస్ కీ వస్తారు. అక్కడ మేనేజర్ వాళ్ళను చూసి చులకనగా మాట్లాడతాడు. అప్పుడే జ్యోత్స్న అక్కడికి వస్తుంది. వాళ్ళని చూసి షాక్ అవుతుంది. కార్తీక్, దీపలు సత్యరాజ్ తో మాట్లాడటానికి వెయిట్ చేస్తారు. జ్యోత్స్న లోపలికి వెళ్లి డైరెక్ట్ పాయింట్ మాట్లాడుతుంది. ఓకే కానీ బయట ఇంకెవరో ఉన్నారు.. వాళ్లతో మాట్లాడి మీది ఫైనల్ చేస్తానని సత్యరాజ్ అంటాడు. దాంతో జ్యోత్స్న పొగరుగా వెళ్లి కూర్చుంటుంది. కార్తీక్, దీప లు లోపలికి వస్తారు. సత్యరాజ్ కార్తీక్ తో మాట్లాడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.    

Eto Vellipoyindhi Manasu : మైథిలీగా రామలక్ష్మి ఎందుకు మారింది.. ఆమెని మనవరాలిగా ఉండమని ఫణీంద్ర రిక్వెస్ట్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -331 లో......సీతాకాంత్ బాంబ్ ని దూరంగా విసిరేస్తాడు. బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. అందరు దాన్ని చూసి షాక్ అవుతారు. చాలా థాంక్స్ అండి అందరి ప్రాణాలు కాపాడారని మైథిలీ అంటుంది. దాంతో రామలక్ష్మి అంటూ సీతాకాంత్ హగ్ చేసుకుంటాడు. నన్ను హగ్ చేసుకుంటావా? ఎవరు నువ్వు అంటూ సీతాకాంత్ చెంపచెల్ళుమనిపిస్తుంది మైథిలీ. నువ్వు నా రామలక్ష్మివి అంటూ సీతాకాంత్ అంటాడు. అప్పుడే ఫణీంద్ర, సుశీల, రామ్ వస్తారు. మా నాన్నని కొడుతావా అని మైథిలీతో రామ్ అనగానే.. అతను మీ నాన్ననా అంటు రామలక్ష్మి షాక్ అవుతుంది. ఏదో మంచి వారు అనుకున్న కానీ ఇలా చేస్తారనుకోలేదు అని మైథిలీ అంటుంది. ఇలా చెయ్యడం తప్పు బాబు అని ఫణీంద్ర అంటాడు. అందరు అక్కడి నుండి వెళ్లిపోతారు.. మరొకవైపు శ్రీలత, సందీప్, శ్రీవల్లి లు ఆస్తులని అనుభవిస్తు తిని కూర్చొని ఉంటారు. చాలా బోరింగ్ గా ఉంది ఎక్కడికైనా వెళదాం.. ప్లాన్ చెయ్ అని శ్రీలత అంటుంది. దానికి సందీప్ సరే అంటాడు. రామలక్ష్మి అక్క చనిపోయి మంచి పని చేసింది. ఇప్పుడు చూడండి మనం ఎలా ఉన్నామోనని శ్రీవల్లి అంటుంది. ఆ తర్వాత మైథిలీ వాళ్ళు కార్ లో వస్తుంటారు. రామలక్ష్మి మైథిలీగా ఉండడానికి గల కారణం గుర్తు చేసుకుంటుంది. గాయలతో ఉన్న రామలక్ష్మిని ఫణీంద్ర, సుశీల ఇంటికి తీసుకొని వస్తారు. ఏం జరిగిందని ఫణీంద్ర అడుగగా.. రామలక్ష్మి జరిగింది మొత్తం చెప్తుంది. నేను మా అయన దగ్గరికి వెళ్తానని రామలక్ష్మి అంటుంది. అప్పుడే గోడపై ఉన్న ఫోటోని రామలక్ష్మికి చూపిస్తాడు. అక్కడ మైథిలీ ఫోటో ఉంటుంది. నా ఫొటో ఇక్కడ ఉంది ఏంటని రామలక్ష్మి అడుగుతుంది. నువ్వు కాదు నా మనవరాలు మైథిలీ. తను చనిపోయింది మళ్ళీ మీకు కొన్ని సంవత్సరాలకు ఎదురు పడుతుందని మా సిద్ధాంతి గారు చెప్పారు.. నువ్వు మా మనవరాలివి అని ఫణీంద్ర అంటాడు. నేను వెళ్ళాలంటూ రామలక్ష్మి అంటుంది. లేదు మేం ఇంకా బ్రతికుంది నీ రాక కోసమే అంటూ ఫణీంద్ర అంటాడు. లేదు నేను వెళ్ళాలంటూ రామలక్ష్మి వెళ్ళిపోతుంది. తన భర్తని ఎలా కాపాడుకోవాలన్న ఆలోచనతో మళ్ళీ ఇక్కడికే వస్తుందని ఫణీంద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : సీతారామయ్య కాళ్ళ మీద పడి రిక్వెస్ట్ చేసిన రుద్రాణి.. కంపెనీని తగలెడుతున్న అనామిక!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -648 లో....ఇక కుటుంబంలో ప్రాబ్లమ్ అంతా క్లియర్ అయినట్లే కదా అని అపర్ణ అనగానే.. లేదు అసలు సమస్య ఇంకా ఉంది. ఆస్తులు వాటా పంచాలని నిర్ణయం తీసుకున్నానని సీతారామయ్య అంటాడు. దాంతో ప్రకాష్ వద్దని రిక్వెస్ట్ చేస్తాడు. అందరు వద్దని అనడంతో సరే అందరు కలిసి ఉండాలి.. అందరు అంటే అప్పు, కళ్యాణ్ కూడా అని సీతారామయ్య అంటాడు. సరే అని ప్రకాష్ అంటాడు. నువ్వు అంటే సరిపోదు ధాన్యలక్ష్మి కూడా అనాలని సీతారామయ్య అనగానే.. నేను ఒప్పుకుంటున్నాను.. నా కొడుకు సంతోషంగా ఉండడం నాకు కావాలని ధాన్యలక్ష్మి అంటుంది. ఆ తర్వాత దాన్యలక్ష్మి దగ్గరికి రుద్రాణి వచ్చి ఏంటి ఇలా మారిపోయావని అడుగుతుంది. ఆస్తులలో వాటా కావాలని అడగలేదు అని రుద్రాణి అనగానే నువ్వు అడగొచ్చు కదా.. నేను అడిగితే అందరికి నెగిటివ్ అవుతున్నాను.. నేనేం చెయ్యాలో నాకు తెలుసని ధాన్యలక్ష్మి అంటుంది. మరొకవైపు కళ్యాణ్ అప్పుల దగ్గరికి ధాన్యలక్ష్మి, ప్రకాష్ లు వచ్చి తమతో రమ్మని రిక్వెస్ట్ చేస్తారు. దాంతో వాళ్ళు కూడా సరే అంటారు. స్వప్న దగ్గరికి రుద్రాణి వచ్చి కౌంటర్ వెయ్యాలని చూస్తుంది కానీ తనే  స్వప్నతో మాటలు పడుతుంది. అప్పుడే అప్పు, కళ్యాణ్ వస్తుంటారు. దాంతో కావ్యని స్వప్న హారతి తీసుకొని రమ్మంటుంది. కావ్య ఇద్దరిని గుమ్మంలోనే ఆపి హారతి ఇచ్చి.. మీరు మీ పేర్లు చెప్పి రండి అని కావ్య అంటుంది. దాంతో వాళ్ళు పేర్లు చెప్పి లోపలికి వస్తారు. ఆ తర్వాత వెనకలే వస్తున్న ధాన్యలక్ష్మి, ప్రకాష్ లని కావ్య ఆపి వాళ్ళని కూడా పేర్లు చెప్పి రమ్మని అంటుంది. వాళ్ళు పేర్లు చెప్పి లోపలికి వస్తారు. అందరు సరదాగా ఉంటారు. ఎన్నో గొడవలకి కారణం అయిన ఈ రుద్రాణిని తన కొడుకుని బయటకు పంపాలనుకుంటున్నానని ఇందిరాదేవి అనగానే.. దానికి అందరు ఒప్పుకుంటారు. నా వాటా నాకు ఇవ్వండి వెళ్తానని రుద్రాణి అనగానే.. నీ కళ్ళలో బాధ కనబడుతుందనుకున్న కానీ ఇలా వాటా అంటున్నావ్.. నా భార్య అన్న దాంట్లో తప్పేం లేదని సీతారామయ్య అంటాడు. మీకు ఆస్తులలో వాటా లేదు. ఇక బయల్దేరండి అని సీతారామయ్య అనగానే.. ఇగో పోతే అడుక్కొని తినాలని రుద్రాణి అనుకుని సీతారామయ్య కాళ్ళు పట్టుకొని రిక్వెస్ట్ చేస్తుంది. తరువాయి భాగం లో కంపెనీని తగలబెడుతున్నానని రుద్రాణికి అనామిక ఫోన్ చేసి చెప్తుంది. రాజ్ కీ ఆఫీస్ వాళ్ళు ఆ విషయం చెప్తారు. దాంతో రాజ్ కంగారుగా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

దీపికా పిల్లి ఏంటమ్మా ఇది ? పోలీసులు చూస్తున్నారా ?

  ప్రయోగాలు చేయొచ్చు కానీ మరీ దారుణంగా ఇలాంటి ప్రయోగాలు చేయడం వలన ఎం ఉపయోగం..ఇంతకు ఏంటి ఆ ప్రయోగాలు అనుకుంటున్నారా. దీపికా పిల్లి బుల్లితెర మీద సందడి చేసిన అమ్మడు ఇప్పుడు కార్ తో ప్రయోగాలు మొదలు పెట్టింది. సోషల్‌ మీడియా స్టార్‌గా, టిక్ టాక్ వీడియోస్ తో అభిమానులను సంపాదించుకొని యాంకర్ గా అవకాశం అందిపుచ్చుకుని  నటిగా ఎదిగింది దీపికా పిల్లి.  ఇప్పుడు దీపికా  సోలో హీరోయిన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.  యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజు హీరోగా నటిస్తున్న ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాలోనూ హీరోయిన్‌గా అవకాశం దక్కించుకుంది.     అలాంటి దీపికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక వీడియోని పోస్ట్ చేసింది. అది కార్ డ్రైవింగ్ వీడియో...ఐతే కార్ ఏమీ దీపికా పిల్లి నడపట్లేదు. కార్ ని స్లో మోషన్ లో ఉంచేసి దీపికా బయటకు వచ్చేసి కార్ అలా వెళ్తుంటే ఈమె ఆ కార్ పక్కన డాన్స్ లు వేస్తూ కనిపించింది. అందులో టేక్ 1 , 2 , 3 అంటూ కూడా పెట్టింది. ఐతే నెటిజన్స్ మాత్రం దీపికను బాగా తిడుతున్నారు. "పోలీసులు మీరంతా ఎక్కడున్నారు. ఇది చూస్తున్నారా ? అరెస్ట్ చేయండి అర్జెంట్ గా , మీ భద్రతా కోసమే చెప్తున్నాం..ఇక నుంచి ఇలాంటి రీల్స్ చేయకండి...పోలీసులు కేసు కట్టండి. తింగరి" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఐతే దీపికా , యాంకర్ ప్రదీప్ నటించిన  అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి మూవీ  ఆల్రెడీ షూటింగ్  పూర్తి చేసుకుంది.  త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఇంకా  అనౌన్స్ చేయలేదు. మరి ఈ సినిమాతో యాంకర్ ప్రదీప్ హీరోగా ఎలా మెప్పిస్తాడో చూడాలి.

అనసూయ : మనకు జీరో సివిక్ సెన్స్ ...అందుకే ఇలా ఉన్నాం 

  అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు. సోషల్ ఇష్యూస్ మీద ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటుంది. రీసెంట్ గా దేశంలో జారుకుంటున్న పరిస్థితుల మీద ఒక పోస్ట్ పెట్టింది. "భారత్ దేశం స్టిల్ డెవలపింగ్ కంట్రీ అని ఎందుకు అంటారంటే ఇందుకే..ఇక్కడ ఉండేవాళ్ళకు జీరో సివిక్ సెన్స్ కాబట్టి" అంటూ ఆ కిందనే ఇంకా ఇలా కూడా పోస్ట్ చేసింది. " నేనెప్పుడూ ఇలానే వివరించడానికి ప్రయత్నిస్తాను.. మనం నాగరికంగా ప్రవర్తించాలనే   ఉద్దేశ్యంతో చెప్తూ ఉంటాను... ఈ మనుషులు ఎలాంటి వాతావరణంలో పెరిగారో అని నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. ఐనా సమయం ఏమీ మించిపోయింది లేదు. ఏ పరిస్థితిలో ఐనా  ఇతరులను బాధించడం అనేది మీ హక్కు కాదు అనే విషయాన్నీ ముందుగా తెలుసుకోవాలి. ఏ పరిస్థితిలోనా ఐనా కానీ ప్రశాంతంగా, మంచిగా ఉండడం నేర్చుకోవాలి. ఇప్పటికైనా నేర్చుకోండి...మీ పిల్లల్ని చూస్తున్నారు." అంటూ అనసూయ ఒక పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది. జబర్దస్త్ ద్వారా అనసూయ బాగా పాపులర్ అయ్యింది. ఈ కామెడీ షోలో తన యాంకరింగ్ తో పాటు అందాలతోనూ ఆకట్టుకుంది ఈ చిన్నది. ఇక సినిమాల్లోనూ కీలక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తుంది ఈ బ్యూటీ. మోడ్రన్ డ్రెసెస్ లో  కొత్త ట్రెండ్ క్రియేట్ చేయాలనీ చూస్తో ఉంటుంది అనసూయ.. అందమైన తినేసేలా ఉండే  చూపులతో కటింగులు ఇచ్చే ఆటిట్యూడ్ తో ఎప్పుడూ రకరకాల ఫోటో షూట్స్ తో సందడి చేస్తూనే ఉంటుంది.  

రష్మీని చూస్తే తాగుబోతు రమేష్ కి కిక్కే కిక్కు...

  జబర్దస్త్ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గ రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోలో కావాల్సిన వాళ్లకు కావాల్సినంత డబుల్ మీనింగ్ డైలాగ్స్ ని వడ్డించి మరీ స్కిట్స్ వేశారు. తాగుబోతు రమేష్ రష్మీని చూసేసరికి గుర్రం సెకిలించే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేసేసరికి అందరూ నవ్వారు. "అబ్బా రష్మీ గారు ఎంత తాగినా ఎక్కదు కానీయండి మిమ్మల్ని చూస్తే మాత్రం ఫుల్ ఎక్కుతాది" అని అన్నాడు. దానికి రష్మీ కూడా పిలక సవరించుకుంటూ "ఆ మాత్రం ఉండాలిలే" అనేసరికి శివాజీ విరగబడి నవ్వేసాడు. ఇక ఇమ్ము స్కిట్ లో వర్ష పండుతో "తిన్నారా" అని అడిగేసరికి "తింటా రా" అన్నాడు. "నాకు చిరంజీవిగారు ఇష్టం..ఆయన ఒక సినిమాలో లుంగీ ఎత్తి కడతారు కదా అది కావాలి" అని వర్షా అనేసరికి "లుంగీ ఎత్తమంటారా" అంటూ పండు రెడీ ఐపోయాడు. ఇక యాదమ్మ రాజు స్కిట్ లో ఐతే యాదమ్మ రాజు లేడీ గెటప్ వేసుకుని వచ్చి "యాడున్నావ్..వచ్చేయి మా ఇంట్లో మా ఆయన లేడు" అని తన బాయ్ ఫ్రెండ్ పండును పిలిపించుకున్నాది. ఇక బులెట్ భాస్కర్ స్కిట్ లో భాస్కర్ కి హీరోయిన్ గా ముంబై నుంచి ఎవరూ రాకపోయేసరికి తన్మయ్ ని పిలిపించాడు. దానికి ఖుష్బూ "అంతే ఆ రేంజ్ నీకు" అంటూ కామెంట్ చేసింది. ఇక సినిమా పేరైతే "రాడ్..ఈ ఉగాదికి దింపుతున్నాం" అని పెట్టారు. అదేదో సంక్రాంతికి వస్తున్నాం అన్న రేంజ్ లో పెట్టారు. తర్వాత రాఘవ  "లడ్డూలో కిస్మిస్" అనే పేరుతో కొత్త ఛానల్ ని ఓపెన్ చేసాడు. ఇలా ఈ వారం జబర్దస్త్ వెరైటీ డైలాగ్స్ తో అలరించడానికి నెక్స్ట్ వీక్ మనముందుకు రాబోతోంది.  

Illu illalu pillalu : రామరాజుని అరెస్టు చేసిన పోలీసులు.. ధీరజ్ నిజం చెప్తాడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -84 లో..... రామరాజుకి ముళ్ళు గుచ్చుకుంటే అందరు నాకు ఆ ముళ్ళు తియ్యరాదు అంటుంటారు. నర్మదా మాత్రం తన కాళ్ళు పట్టుకొని ముళ్ళు తీస్తుంది. నేను ఏదైనా మీ ముందు మాట్లాడే హక్కు ఉందన్న ఆలోచనతో మీకు ఎదురు మాట్లాడాను.. నన్ను క్షమించండి మావయ్య అని రామరాజుతో నర్మద అంటుంది. అది విన్న వేదవతి మురిసిపోతుంది. రామరాజుకి కూడా తన మాటలు నచ్చుతాయి. కానీ సైలెంట్ గా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. చూసారా అత్తయ్య మావయ్య నన్ను క్షమించాడు అంటు నర్మాద వేదవతికి చెప్తుంది. చాల్లే కానీ మీరు ఇప్పుడు గుడికి వెళ్ళండి అంటూ నర్మద, సాగర్ ధీరజ్, ప్రేమ లకి వేదవతి చెప్తుంది. వాళ్ళు సరే అని గుడికి వెళ్తుంటే వేదవతి ఆపి ప్రేమ మెడలో గొలుసు వేస్తుంది. అదంతా భద్రవతి చూస్తుంటే.. చూసావా కొడలు అంటే వేదవతికి ఎంత ఇష్టమో అని పెద్దావిడ అంటుంది. దాంతో భద్రవతి కోపంగా పెద్దావిడని గదిలోకి తీసుకొని వెళ్లి ఒక్క గొలుసు వేస్తేనే ఎంత ఇష్టం అంటున్నావ్ మరి నేను ఎన్ని నగలు చేయించాను.. చూడు అంటూ భద్రవతి నగలు చూపెట్టేసరికి అందులో ఉండవు. వాడు ప్రేమతో పాటు నగలు తీసుకొని వెళ్ళాడంటూ భద్రవతి ఆవేశంగా రామరాజు ఇంటి ముందుకి వచ్చి పిలుస్తుంది. ఏం బ్రతుకురా.. నీ కొడుకు నా కోడలితో పాటు ఏడువారాల నగలు కూడా తీసుకొని వెళ్ళాడని రామరాజుతో భద్రవతి అనగానే అందరు షాక్ అవుతారు. నా కొడుకు అలా ఎప్పటికి చెయ్యడని రామరాజు అంటాడు. చిన్నోడికి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పమని తిరుపతికి రామరాజు చెప్పగానే.. ధీరజ్ కి ఫోన్ చేసి త్వరగా రండీ అని చెప్తాడు. ఆ తర్వాత ధీరజ్ వాళ్ళు వస్తారు. నువ్వు వాళ్ల నగలు తీసుకొని వెళ్ళావా అని రామరాజు అడుగగానే.. ధీరజ్ టెన్షన్ పడుతాడు. తరువాయి భాగంలో రామరాజుని పోలీసులు అరెస్ట్ చేస్తారు. మా అమ్మ నీ గురించి ఆలోచించందుకు మా పరిస్థితి చూసావా.. మీ వాళ్ళు ఏం చేసారో అంటు ప్రేమపై ధీరజ్ కోప్పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : అడిటర్ ని  కొనేసిన జ్యోత్స్న.. మెచ్చుకున్న శివన్నారాయణ!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -283 లో.....జ్యోత్స్న మేనేజర్ తో ఫోన్ లో మాట్లాడుతుంది. అప్పుడే దశరథ్ వచ్చి ఎన్ని అబద్ధాలు ఆడుతావ్ జ్యోత్స్న.. ఇలా అన్ని తప్పు మీద తప్పు చేస్తునే ఉంటావా అని దశరత్ అడుగుతాడు. డాడ్ ఏ విషయం గురించి ఇలా మాట్లాడుతున్నావని జ్యోత్స్న అడుగుతుంది. నువ్వు దేని గురించి అనుకుంటున్నావు చెప్పు అంటు జ్యోత్స్నని దశరథ్ కన్ఫ్యూషన్ చేస్తుంటాడు. నువ్వు అడిట్ లో ఏదో తప్పు అంటున్నావని దశరథ్ అంటాడు. దాస్ గురించి కాదని జ్యోత్స్న రిలాక్స్ అవుతుంది. నాకు నిన్ను డైరెక్ట్ అడగాలని ఉంది కానీ దాస్ నిజం చెప్పకుండా నిన్నేం అడగలేనని దశరథ్ అనుకుంటాడు. మరొకవైపు టిఫిన్ సెంటర్ పెట్టడానికి దీప ఒక బండి తీసుకొని క్లీన్ చేస్తుంటే.. అప్పుడే కార్తీక్ వస్తాడు. నాకూ చెప్పకుండా బండి తీసుకున్నారా.. నాకు ఒక మాట కూడా చెప్పలేదని కార్తీక్ అంటాడు. అదేం లేదు ఇక మీరు ఇక్కడికి రావద్దంటూ కార్తీక్ చెయ్ తీసి శౌర్య మీద వేస్తుంది. దాంతో కార్తీక్ కోపం గా లోపలికి వెళ్తాడు. వాడికి అర్ధమయ్యేలా చెప్పాలి కానీ అలా చెయ్యడం ఏంటని కాంచన అంటుంది. దీప లోపలికి వెళ్లి కార్తీక్ తో మాట్లాడుతుంది. మీరు ఇడ్లీ బండి దగ్గరే ఆగిపోవద్దు. అందుకే మీరు అక్కడికి రావద్దు.. అదంతా నేను చూసుకుంటాను.. మీ తాతయ్యకి మీ నాన్నకి సవాలు విసిరారని కార్తీక్ కి దీప అర్థయ్యేలా చెప్తుంది. మరొకవైపు పారిజాతం పంతులుని పిలిపిస్తుంది. ఎందుకు ఇప్పుడు అని జ్యోత్స్న అడుగగా... దాస్ గురించి, వాడు బాగోలేడు కదా హోమం జరిపిద్దామని పారిజాతం అంటుంది. ఇప్పుడు అవసరమా.. బాగై ఏం చేస్తాడని జ్యోత్స్న అంటుంది. అప్పుడే దశరథ్ వచ్చి దాస్ బాగవ్వాలని నీకు లేదా అని సెటైర్ వేస్తాడు. నాకు ఎందుకుండదంటూ జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. పిన్ని మంచి ముహూర్తం చూసి హోమం చేపించు.. దాస్ బాగుండాలని దశరథ్ అంటాడు. అప్పుడే శివన్నారాయణ వచ్చి.. ఇప్పుడే అడిటర్ ఫోన్ చేసాడు. రెస్టారెంట్ లాభంలో ఉందట, కీప్ ఇట్ అప్ జ్యోత్స్న అని శివన్నారాయణ మెచ్చుకుంటాడు. అదేంటి మొన్న లాస్ లో ఉంది కదా అంటే అడిటర్ ని కూడా జ్యోత్స్న కొనేసినట్లుందని దశరథ్ అనుకుంటాడు. చూసారా ఆ కార్తీక్ కంటే నా మనవరాలు గ్రేట్ అని పారిజాతం అంటుంటే.. వాడితో నా  మనవరాలిని పోల్చడమేంటని పారిజాతంపై శివన్నారాయణ కోప్పడతాడు. మరుసటి రోజు దీప ప్రొద్దునే తులసి పూజ చేస్తుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు. ఇద్దరు కలిసి దీపం పెడతారు. ఆ తర్వాత  ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : రంగా పెట్టిన బాంబుని కనిపెట్టేసిన ఆ ఇద్దరు.. రామలక్ష్మిని చూసి సీతాకాంత్ షాక్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto  Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -330 లో.....స్కూల్ అనివల్ డే కి కల్చరల్ ఆక్టివిటీస్ మొదలవుతాయి. అందులో భాగంగా ఒక బాబు వెళ్లి స్టేజ్ పై మాట్లాడుతుంటే.. వాళ్ల అమ్మ హెల్ప్ చేస్తుంటుంది. నీకు అలా అమ్మ ఉంటే హెల్ప్ చేసేదని ఫీల్ అవుతున్నావా అని రామ్ ని సీతాకాంత్ అడుగగా.. అలా ఏం లేదు నాకు నువ్వు ఉన్నావ్ కదా.. యూ ఆర్ ది బెస్ట్ నాన్న అని రామ్ అంటాడు. నువ్వు ఆలా అంటున్నావ్ కానీ నీకు బాధ ఉందని నాకు తెలుసని సీతాకాంత్ అనుకుంటాడు. స్టేజి పైకి మైథిలీ తాతయ్య ఫణీంద్ర, నానమ్మ సుశీల లతో కలిసి మైథిలీ స్టేజి పైకి వస్తుంది. అప్పుడే సీతాకాంత్ కి ఫోన్ రావడంతో పక్కకి వెళ్తాడు. ఫణీంద్ర, సుశీలలు మైథిలీని ప్రైజ్ లు ఇవ్వమని చెప్పి వాళ్ళు కిందకి వచ్చి కూర్చొని ఉంటారు. రామ్ ని ప్రైజ్ అందుకోవడానికి స్టేజ్ పైకి పిలుస్తారు. రామ్ స్టేజి పైకి వెళ్లి ఈ ప్రైజ్ మా నాన్న చేతుల మీదుగా అందుకుంటానని అనగానే సరే అని మైథిలీ అంటుంది. సీతాకాంత్ పక్కకు వెళ్లి ఫోన్ మాట్లాడుతుంటే అప్పుడే రౌడీ ఫోన్ లో రంగాతో బాంబు గురించి మాట్లాడుతుంటాడు. అదంతా విని సీతాకాంత్ వాడిని పట్టుకొని బాంబ్ ఎక్కడ పెట్టావని అడుగుతాడు. వెంటనే ఆ రౌడీ పారిపోతాడు. సీతాకాంత్ కి ఎం చెయ్యాలో తెలియక ఫణీంద్ర దగ్గరికి వెళ్ళి అతడిని పక్కకు తీసుకొని వెళ్లి ఇలా బాంబ్ పెట్టారట అని చెప్తాడు. ఇది ఆ రంగా గాడి పని అయి ఉంటుందని ఫణీంద్ర అంటాడు. ఇప్పుడు బాంబ్ ఉన్న విషయం ఎవరికి చెప్పొద్దూ.. అందరికి సైలెంట్ గా ఇక్కడ నుండి పంపాలని ఫణీంద్రకి సీతాకాంత్ చెప్తాడు. దాంతో సరే అని ఫణీంద్ర మైథిలీని పిలుస్తాడు. అసలు విషయం చెప్తాడు. దాంతో తను కూడా సీతాకాంత్ లాగే చెప్తుంది. తన కూడా ఇలాగే చెప్పాడని ఫణీంద్ర అనగానే.. ఎవరని మైథిలీ అడుగుతుంది. అతను అని సీతాకాంత్ ని చూపించబోతుంటే అందరు అడ్డుగా వస్తారు. ఆ తర్వాత మైథిలీ చాకచక్యంగా అందరిని బయటకు పంపిస్తుంది. స్టేజ్ దగ్గర ఒకవైపు మైథిలీ మరోకవైపు సీతాకాంత్ లు బాంబు గురించి వెతుకుతుంటారు. టైమర్ సౌండ్ రావడంతో ఇద్దరు ఒక్కసారి గా గిఫ్ట్ దగ్గరికి వెళ్లి పట్టుకుంటారు. మైథిలీని చూసి సీతాకాంత్ షాక్ అవుతాడు కానీ మైథిలీ.. హలో వదలండి అంటూ అడుగుతుంది. నేను పడేస్తానంటూ సీతాకాంత్ బాంబ్ ని పరిగెత్తుకుంటూ వెళ్లి దూరంగా పారేస్తాడు. ఆ బాంబ్ విసిరేసాక బ్లాస్ట్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.