వారానికి రెండు సార్లు బీర్లు తాగుతా..రాయడం బర్డెన్ గా అనిపించి వచ్చేసా

  చాలామంది ఇండస్ట్రీకి రాగానే చెడు అలవాట్లకు ఎక్కువగా బానిసలవుతూ ఉంటారు. కానీ చమ్మక్ చంద్ర మాత్రం వాటికి చాలా దూరంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు ఒక ఇంటర్వ్యూలో. అలాగే చాలా విషయాలు కూడా చెప్పాడు. "మొదట్లో నాకు మందు అలవాటు అన్నది లేదు. కానీ నాలుగేళ్ల నుంచి బీర్లు తాగే అలవాటు అయ్యింది. వారానికి రెండు సార్లు బీర్లు తాగుతూ ఉంటా, అంటే టు డేస్ సిట్టింగ్ డే 5 డేస్ డైట్. కొంతమంది మందు అలవాటు చేసుకుని కెరీర్ ని నాశనం చేసుకున్న వాళ్ళను చూసాను. అందుకే నాకు చాలా భయం. అందుకే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని అనుకున్నా. లిమిట్ దాటుతున్న అంటే నాకు నేను అలెర్ట్ అవుతాను. పబ్బులకు వెళ్లాలంటే భయం. నా గోల్ డీవియేట్ అవుతుందని భయం. అందుకే జబర్దస్త్ లోని వాళ్ళను వాళ్ళ పిల్లలను నేనే ఇంటికి పిలిచి వండి పెడుతూ ఉంటాను. అదే ఎంజాయిమెంట్. నేను ధన్ రాజ్, తాగుబోతు రమేష్ ఎక్కువగా ఫ్రెండ్లీగా ఉంటాం. ఏ ఫంక్షన్ ఐనా కానీ మేమె ఎక్కువగా వెళ్తూ ఉంటాం. ఎప్పుడైనా ఆలోచిస్తే ఒక్కటే ఆలోచించే వాడిని. ఆరోజున టీమ్ లీడర్ గా ఛాన్స్ మిస్ చేసుకుని ఉంటె నా పరిస్థితి ఏమిటా అనుకుంటూ ఉంటాను. నేను అప్పటికప్పుడు తయారు చేసే స్కిట్ ని అసలు చేయలేను. వన్ వీక్ ముందే నేను స్కిట్ రాసుకుంటా. అలా ఉంటే నేను స్కిట్ చేయగలుగుతాను. రాయడం కొంచెం బర్డెన్ గా అనిపించి నేను జబర్దస్త్ నుంచి వచ్చేసా" అని చెప్పాడు చమ్మక్ చంద్ర.

Illu illalu pillalu: ప్రేమే ఈ గొడవలకు కారణం.. కొడుకుని చూసి రామరాజు ఎమోషనల్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఇల్లు ఇల్లాలు పిల్లలు'(illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -72 లో.... నా చెల్లిని ఎలాగైనా నా ఇంటికి తీసుకొని వస్తాను. ఇన్ని రోజులుగా అత్తయ్య విషయంలో మీరు ఎంత బాధపడుతున్నారు. ఆ బాధ నేను పడలేనని విశ్వ అంటాడు. విశ్వ అంత కోపంగా మాట్లాడడంతో రేవతి ఇంకా పెద్దావిడలు అతడిపై కోప్పడతారు. ప్రేమ జీవితం బాగుండేలా చూడు దేవుడా అని పెద్దావిడ బాధపడుతుంది. ధీరజ్ ని చూసి తన చెల్లి అమూల్య బాధపడుతుంది. అప్పుడే ప్రేమ వస్తుంది. మా అన్నయ్య తప్పు ఒక్కడిదేనా, మా అన్నయ్యని కొట్టాడు. ఈవిడ కూడా మన కుటుంబంపై పగ తీర్చుకోవడానికే ఇలా చేస్తుందని అమూల్య కోపంగా మాట్లాడుతుంటే.. నర్మద వచ్చి అలా మాట్లాడడం తప్పు.. ప్రేమ చాలా మంచిది తనే కదా ఇప్పుడు మీ అన్నయ్యని కాపాడిందని చెప్తుంది. ధీరజ్ లోపలకి వెళ్లి నొప్పులతో బాధపడుతుంటే.. అప్పుడే ప్రేమ వచ్చి అమూల్య అన్న దాంట్లో కూడా న్యాయం ఉంది కదా నా వల్లే ఇదంతా అనుకుంటుంది. వెళ్లి నొప్పిగా ఉందా అని ప్రేమ అడుగ్గానే ధీరజ్ వెటకారం గా అంటున్నావా అని గొడవపడతాడు. ఇద్దరు కాసేపు టామ్ అండ్ జెర్రీ లాగా గొడవపడతారు. ఆ తర్వాత ధీరజ్ దగ్గరికి వేదవతి వచ్చి.. ఇదంత నా వల్లే అంటూ బాధపడుతుందిమ నువ్వు మంచి చెయ్యాలనుకున్నావ్ అంతే అని ధీరజ్ బాధపడుతాడు. సాగర్, చందు లు ధీరజ్ గురించి బాధపడుతుంటే.. మీ తమ్ముడు గురించి ఆలోచించడం ముచ్చటేస్తుందని తిరుపతి అంటాడు. అప్పుడే ధీరజ్ వచ్చి.. ఇక్కడే మీతో పడుకుంటానని  అంటాడు. తరువాయి భాగంలో అందరు పడుకున్నాక ధీరజ్ దగ్గరికి రామరాజు వచ్చి బాధపడతాడు. తన కంట్లో నీళ్లు ధీరజ్ చెయ్ పై పడతాయి. రామరాజు వెళ్ళిపోయాక ధీరజ్ లేచి నాన్న వచ్చాడని సాగర్ తో చెప్తూ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత రామరాజు విశ్వక్ దగ్గరికి వెళ్లి కొడుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 :  శౌర్యకి ఆపరేషన్.. డబ్బు కట్టింది ఎవరంటే!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -271 లో..... శౌర్యకి నిజం గానే బాగోలేదు తనని హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు.. అత్తయ్య చెప్పింది నిజమే కాకపోతే నేనే ఇంట్లో వాళ్ళకి అబద్దం చెప్పాను.. దీప దగ్గరికి వెళ్లి ఆఫర్ ఇచ్చాను.. ఇప్పుడు నీ కూతురిని కాపాడేది నేనే.. డబ్బు ఇస్తాను బావని వదిలేసి పొమ్మన్నా కానీ దీప పేపర్స్ మోహన కొట్టింది బావ కూడా తిట్టాడని జ్యోత్స్న అంటుంది. ఇక వచ్చేప్పుడు ఫోన్ చెయ్ అని చెప్పానని పారిజాతంతో జ్యోత్స్న చెప్తుంది. ఇలా చిన్న పిల్లల ప్రాణంతో చెలగాటం ఆడుతున్నావని ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఇంకేమైనా ఉందా అని పారిజాతం అనగానే.. మరొక అబద్దం చెప్తాను. నాకు నా బావ కావాలని జ్యోత్స్న మరి కఠినంగా మాట్లాడతుంది. మరోవైపు కావేరి హాస్పిటల్ కి డబ్బు తీసుకొని వస్తుంది. దీప, కార్తీక్ లు డబ్బు కోసం చెయ్యని ప్రయత్నం ఉండదు. దీప బాధపడుతుంటే.. దీప దగ్గరికి కావేరి వస్తుంది. ఇద్దరు బయటకు వచ్చి మాట్లాడుకుంటారు. శౌర్య నా మనవరాలని కావేరి అంటుంది. అలా అనకూడదా అని కావేరి అంటుంటే.. నాకు కాంచన గారు ఎలాగో మీరు అలాగే అని దీప హ్యాపీగా ఫీల్ అవుతుంది. కావేరి డబ్బు కట్టిన విషయం దీపకి చెప్పదు. నా మనవరాలికి ఏం కాదని దీపకి దైర్యం చెప్తుంది. ఇలా నేను హాస్పిటల్ కి వచ్చినట్లు కార్తీక్ కి చెప్పకని చెప్పి కావేరి వెళ్ళిపోతుంది. కార్తీక్ ఏం చెయ్యలేక ఎమోషనల్ అవుతుంటాడు.. దీప ఏడుస్తూ ఉంటుంది. ఇద్దరు శౌర్య దగ్గరికి వెళ్తారు. వెళ్లేసరికి తను వుండదు అప్పుడే నర్సు వచ్చి ఎక్కడికి వెళ్లారు. తీసుకొండి అంటూ శౌర్య చైన్ బ్యాంగిల్స్ ఇస్తారు. ఇవి ఎందుకు తీశారు శౌర్య ఎక్కడ అని దీప అడుగుతుంది. ఆపరేషన్ థియేటర్ లో ఉందని నర్సు చెప్తుంది. డబ్బు అని కార్తీక్ అనగానే.. కట్టారు కదా అని నర్సు అంటుంది. అప్పుడే డాక్టర్ వచ్చి గ్రేట్ కార్తీక్ టైమ్ కి డబ్బు కట్టావ్ అని లోపలికి వెళ్తాడు. డబ్బు ఎవరు కట్టారని రిసెప్షన్ లో  అడిగితే తెలుస్తుంది కదా అని కార్తీక్, దీప ఇద్దరు అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : ప్రాణహాని ఉందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన రామలక్ష్మి.. సవతి తల్లి కుట్ర అదేనా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -318  లో..... నన్ను క్షమించండి అంటూ సీతాకాంత్, రామలక్ష్మిలని రమ్మని రిక్వెస్ట్ చేస్తుంది శ్రీలత. నా కూతురు ప్రాణాలు కాపాడమని రామలక్ష్మిని శ్రీలత బ్రతిమిలాడుతుంది. నేను నమ్ముతున్నా మా అమ్మ అంత రిక్వెస్ట్ చేస్తుంది.. ఎందుకు ఇలా మొండిగా ఉంటున్నావని రామలక్ష్మిపై సీతాకాంత్ కోప్పడతాడు. నా మాట విని రమ్మని ధన రిక్వెస్ట్ చేస్తాడు. రేపు మేము వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తామని శ్రీలత వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకు ఆలా చేస్తున్నావ్ వాళ్ళు అంతలా ప్రాధేయపడుతున్నారు. నా వాళ్ళు అక్కడ బాధపడుతుంటే నేనెలా ఇక్కడ హ్యాపీగా ఉండగలను. నువ్వు ఎంతో నాకు వాళ్ళు కూడా అంతే అయినా నువ్వు ఇక్కడే ఉందామంటే ఉంటాను కానీ ఒక జీవ్వచ్చవంలాగా అనగానే.. మీరు సంతోషంగా ఉండడం కావాలి.. నేను ఒప్పుకుంటున్నానని రామలక్ష్మి అంటుంది. మరుసటి రోజు శ్రీలత వాళ్ళు వాళ్ళని తీసుకొని వెళ్ళడానికి వస్తారు. చాలా సంతోషంగా ఉందని శ్రీలత అంటుంది. ఇక బస్తీ వాళ్ళ అందరికి చెప్పి వెళ్తారు. మీరు వెళ్ళండి నేను వస్తానని రామలక్ష్మి వాళ్ళని పంపిస్తుంది. ఇక రామలక్ష్మి స్టేషన్ కి వెళ్లి.. నాకు మా ఆయనకు ప్రాణహాని ఉంది.. దగ్గర వాళ్లే ఇలా చేస్తున్నారంటూ సీతాకాంత్ ఫ్రెండ్ సీఐకి రామలక్ష్మి కంప్లైంట్ ఇస్తుంది. మరోవైపు రామలక్ష్మి వస్తే ఇద్దరం ఒకేసారి ఇంట్లోకి వస్తామని సీతాకాంత్ వెయిట్ చేస్తాడు. అప్పుడే రామలక్ష్మి వస్తుంది ఇద్దరు లోపలికి వస్తుంటే.. శ్రీవల్లి ఆపుతుంది. హారతి ఇస్తుంది. ఆ హారతి చీరపై పోస్తుంది. దాంతో అది అంటుకుంటుంది. రామలక్ష్మి ఇంకా భయపడుతుంది. అవన్నీ పట్టించుకోకుండా లోపలికి రండి అని శ్రీలత అనగానే.. రామలక్ష్మి వాళ్ళు లోపలికి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : అత్తకు చురకలు వేసిన అల్లుడు.. వాళ్ళని రుద్రాణి పెట్టుకుంటుందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -635 లో....రాజ్, కావ్య అమెరికాకి వెళ్లి సెటిల్ అవ్వాలనుకుంటున్నారని రుద్రాణి ధాన్యలక్ష్మిలు ఇంట్లో గొడవ మొదలుపెడతారు. ఇదంతా ఎందుకు వాళ్ళు ఇంటికి వస్తారు కదా అప్పుడు అడుగుదామని వాళ్ళకి సమాధానం చెప్తుంది అపర్ణ. మరోవైపు రాజ్, కావ్యల దగ్గరికి వాళ్ళ డిజైన్ కొన్న అతను వస్తాడు. వచ్చి రెండు కోట్లు క్యాష్ ఇస్తాడు. మాకు ట్రాన్స్ఫర్ చెయ్యండి అని రాజ్ అనగానే.. ఇప్పుడు వీలవదు అర్ధం చేసుకోండి అని అతను అనగానే.. సరే అని క్యాష్ తీసుకుంటాడు. ఎప్పుడెప్పుడు రాజ్ , కావ్య వస్తారా నిలదియ్యాలంటూ రుద్రాణి, ధాన్యలక్ష్మి ఇద్దరు వెయిట్ చేస్తుంటారు. అప్పుడే స్వప్న వచ్చి వాళ్ళకి చురకలు అంటించినట్లు మాట్లాడుతంటుంది. చిన్నా, పెద్ద తేడా లేకుండా ఏంటి ఆ మాటలు అని స్వప్నపై ధాన్యలక్ష్మి కోప్పడుతుంది. కోడలిని భయంలో పెట్టుకోలేదని రుద్రాణితో ధాన్యలక్ష్మి అనగానే.. నీ కోడలు దూరంగా ఉంది కాబట్టి నువ్వు ఇలానే మాట్లాడుతావని రుద్రాణి అంటుంది. మరోవైపు అప్పుకి కళ్యాణ్ ఫోన్ చేసి.. ప్రొడ్యూసర్ తనని మెచ్చుకున్నాడన్న విషయం చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతాడు. అందరు భోజనం చేస్తుంటారు. రాజ్, కావ్య వస్తారు. ఎందుకు డబ్బు అంత డాలర్ లాగా మార్చాలనుకుంటున్నావు.. రుద్రాణి, ధాన్యలక్ష్మిల ఆస్తులు అమ్మి ఎందుకు అలా చేస్తున్నావని అపర్ణ అందరి ముందు అంటుంది. నేను ఆస్తులు అమ్మడం ఏంటి? డాలర్ లోకి మార్చడం ఏంటని రాజ్ అంటాడు. మరి ఎందుకు అమెరికా వెళ్ళాలనుకుంటున్నారు.. వీసా ఎందుకు తీస్తున్నారని రుద్రాణి అడుగుతుంది. అక్కడ క్లయింట్ కి మన డిజైన్స్ నచ్చాయి.. వచ్చి డెమో ఇమ్మన్నారు.. అందుకే వెళ్తున్నామంటూ రాజ్ కోప్పడి వెళ్తాడు. మరి ఆస్తులు తాకట్టు పెట్టి డబ్బు అంతా ఏం చేస్తున్నారని రుద్రాణి, రాహుల్ లు అనుకుంటారు. ఆ తర్వాత రాజ్ కావ్య తమ గదిలో క్లయింట్ ఇచ్చిన డబ్బు లెక్కపెడుతుంటారు. తరువాయి భాగంలో రాజ్, కావ్య డబ్బు లెక్కపెట్టడం రాహుల్ చూసి రుద్రాణికి చెప్తాడు. ఇప్పుడు వాళ్ళని రెడ్ హండెడ్ గా పట్టిస్తానంటు రాహుల్ కి రుద్రాణి ఏదో చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

రక్తంతో అమ్మానాన్నల చిత్రం...కన్నీళ్లు పెట్టుకున్న జబర్దస్త్ కమెడియన్ తల్లి

  జబర్దస్త్ కమెడియన్  అజర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జబర్దస్త్ మొదలైన దగ్గర నుంచి ఎంతోమంది కమెడియన్స్ ఈ షోకి వస్తూ పోతూ ఉన్నారు. అందులో పాత వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటె కొత్త వాళ్ళు వస్తూ ఉన్నారు. అజర్ కూడా అలాగే వచ్చాడు. ఐతే కామెడీ పెద్దగా చేయలేడు కానీ ఏదో స్కిట్ కి ఒక హ్యాండ్ ఒక సపోర్ట్ అన్నట్టుగా ఉంటాడు. మొదట్లో రీతూ చౌదరితో కలిసి చాలా స్కిట్స్ చేసేవాడు. తర్వాత రీతూ జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయి తన సాంగ్స్ చేసుకుంటూ ఉంది. ఇక అజర్ ఇక్కడ జబర్దస్త్ లో కంటిన్యూ అవుతున్నాడు. అలాంటి అజర్ తన పేరెంట్స్ కి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఐతే ఇచ్చాడు. నిజంగా ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ చూసి అజర్ వాళ్ళ అమ్మ కొడుకుని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఐతే ఇంతకు ఎం గిఫ్ట్ అనుకుంటున్నారా. చూద్దాం. ఒకప్పుడు ప్రేమ అంటే చాలు రక్తంతో ప్రేమలేఖలు రాసేవాళ్లు 80 స్, 90 స్ లో లవర్స్ ఇలా బ్లడ్ తో లవ్ లెటర్స్ రాసుకుని తమ ప్రేమను వ్యక్తపరుచుకునే వారు. ఇప్పుడు అజర్ కూడా అదే కాన్సెప్ట్ ఫాలో అవుతున్నాడు. వచ్చే ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తన రక్తంతో వాళ్ళ అమ్మానాన్న బొమ్మలను గీయించి దాన్ని లామినేషన్ చేయించి వాళ్లకు గిఫ్ట్ గా ఇచ్చాడు. ప్రేమంటే లవర్స్ మధ్యనే కాదు ఉండేది..పేరెంట్స్ మీద ఉండొచ్చు అంటూ చెప్పాడు. నెక్స్ట్ వీక్ శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో "ప్రేమలు" అనే కాన్సెప్ట్ ప్రో

ఆమె యాంకరింగ్ వదిలి వెళ్ళదు..శ్రీదేవి డ్రామా కంపెనీకి అదృష్ట దేవత రష్మీ  

శ్రీదేవి డ్రామా కంపెనీ స్టార్ట్ అయ్యి నాలుగేళ్లు అవుతున్న సందర్భంలో ఈ ఎపిసోడ్ మొత్తం రష్మీ యాంకరింగ్ చేస్తుందా లేదా ? శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ యాంకర్ ఎవరు ? అన్న కాన్సెప్ట్ మీద జరిగింది. ఐతే రష్మీ తప్ప వేరే యాంకర్ వద్దు అంటూ ఆది చెప్పాడు. "యాంకర్ గా రష్మీ చాలా బాగా చేస్తుంది. ఒక కంటెంట్ క్రియేట్ చేయాలన్నా, ఒక జోక్ క్రియేట్ చేయాలన్నా ఎంత కష్టమో రష్మీకి తెలుసు. అందుకే రష్మీ ఎప్పుడూ ఎవరితో కూడా ఈ జోక్ వద్దు ఆ జోక్ వద్దు అంటూ చెప్పదు. ప్రతీ జోక్ ని చాలా ఈజీగా తీసుకుంటుంది. అలాగే చిన్న, పెద్ద ఆర్టిస్ట్ అన్న తేడా లేకుండా అందరినీ సమానంగా పలకరిస్తుంది. మా శ్రీదేవి డ్రామా కంపెనీకి రష్మీ వచ్చాక చాలా చాలా కలిసొచ్చింది. ఒక ఇంట్లోకి మహాలక్ష్మి అడుగుపెడితే ఎలా ఉంటుందో..మా సెట్ లోకి రష్మీ అలా అడుగుపెట్టింది. సీరియస్ గా చెప్పాలంటే రష్మీ జోడీగా సుడిగాలి సుధీర్ తో చేసినప్పటి కంటే సోలోగా డీల్ చేసినప్పుడు రేటింగ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. రష్మీ చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. సోలో యాంకరింగ్ లో రష్మీ సూపర్.  రష్మీ రిలేటెడ్ కంటెంట్ ఏది చేసినా ఆ రేటింగ్ ఎప్పుడూ మిస్ అవలేదు." అంటూ ఆది రష్మీ గురించి చెప్పేసరికి రష్మీ ఏడుస్తూ "నా గురించి మంచి మాటలు చెప్పినందుకు థ్యాంక్స్. నాకు తెలుసు నేను పర్ఫెక్ట్ కాదు అని..కానీ అందరిలో తప్పులు ఉంటాయి. పర్సనల్ లైఫ్ లో కావొచ్చు, జాబ్ లో కావొచ్చు పర్ఫెక్ట్ నెస్ కోసం ట్రై చేస్తూ ఉంటాము. కానీ అన్నిసార్లు జరగదు" అంటూ చెప్పింది. ఇక ఫైనల్ లో మిగతా యాంకర్స్ అంతా వచ్చి అసలు మేమేదో శ్రీదేవి డ్రామా కంపెనీకి యాంకర్స్ అవుదామని వస్తే ఇలా చేస్తారా అంటూ సౌమ్య, ఆర్జే కాజల్, మృదుల, నేహా చౌదరి అందరూ అడిగారు. దానికి ఆది ఇలా చెప్పాడు. "మా రష్మీ గొంతు పోయింది కాబట్టి యాంకర్స్ అంతా తలా ఒక మాట మాట్లాడేస్తే ఎపిసోడ్ ఐపోతుంది" అని పిలిచాం అంటూ షాకిచ్చాడు.

రష్మీని యాంకరింగ్ బాధ్యతల నుంచి తప్పిస్తున్నారా ?

నిజంగా ఒకప్పుడు సుమ యాంకరింగ్ నుంచి తప్పుకోవాలంటూ బుల్లితెర మీద చాలా మంది కామెంట్స్ చేసారు. ఇక ఇప్పుడు రష్మీ మీద అలాంటి కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో యాంకరింగ్ నుంచి రష్మీని తప్పించే ప్లాన్ కనిపిస్తోంది. ఐతే చాలామంది రష్మీకి సపోర్ట్ చేస్తూ నిలబడ్డారు. ముఖ్యంగా రాకెట్ రాఘవ మాత్రం మందు బోటిల్ చేతిలో పట్టుకుని వచ్చి మరీ రష్మీ గురించి చెప్పాడు. వస్తూనే పుష్పలో శ్రీవల్లి డైలాగ్ ని చెప్పించాడు రాఘవ.. ఒకతన్ని నిలబెట్టి నువ్వెవరు అంటే రష్మీ గారి రైటర్ ని అన్నాడు ఇంకోకతన్ని చూపించేసరికి రష్మీ డ్రైవర్ అని చెప్పాడు. ఇంకో వ్యక్తిని అడిగితె రష్మీ మేకప్ మ్యాన్ అని చెప్పాడు. "అదిరా రష్మీ అంటే పేరు కాదురా బ్రాండ్..అలాంటి రష్మీని తీసేద్దామనుకుంటున్నారా మీరు ..అసలు రష్మీ అంటే ఎవరనుకుంటున్నారా..పెన్షన్ తీసుకోవాల్సిన వయసులో ఫంక్షన్ కి వెళ్లే అమ్మాయిలా తయారై వచ్చి అల్లరి చేస్తూ ఎంటర్టైన్ చేస్తోంది  " అంటూ తాగిన మైకంలో రష్మీ గురించి చెప్పాడు. ఇక రష్మీ గురించి ఒక బ్రేకింగ్ న్యూస్ కూడా వేశారు. రష్మీని యాంకరింగ్ బాధ్యతల నుంచి తొలగిస్తున్నారని తెలియడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విషాద ఛాయలు అలుముకుంటున్నాయని ఆ న్యూస్ లో చెప్పుకొచ్చారు. ఇక ఆమె పరిస్థితి తెలుసుకుని పలువురు సినీప్రముఖులు పరామర్శిస్తున్నారు. అని చెప్పారు. దాంతో రష్మీ కన్నీళ్లు పెట్టుకుంది.  

త్వరలో జబర్దస్త్ కమెడియన్ పెళ్లి...అందరికీ ఇన్విటేషన్ ఇస్తాం అంటూ...

  ఈ మధ్య కాలంలో మూవీ యాక్టర్స్ తో సమానంగానే బుల్లితెరపై న‌టించే వారికి కూడా మంచి  క్రేజ్ వస్తోంది. అలాంటి వారిలో యంగ్ క‌మెడీయ‌న్ నూక‌రాజు కూడా ఒక‌డు. సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ను బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు. అలాగే తన లవర్ ఆసియాతో కూడా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాడు. ’పటాస్’ షోలో చేస్తున్న దగ్గర  నుంచి ఆసియాతో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఇక యూట్యూబ్ వీడియోల్లో ఈ జంట సంద‌డి చేస్తూ ఉంటారు. ఇక ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీలో వీళ్ళు ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పారు. ఐతే ముందు నూకరాజు ప్రభ అనే అమ్మాయితో కలిసి వాళ్ళ ట్రెండింగ్ సాంగ్ కి పాట పాడి డాన్స్ చేసాడు. "గుట్ట కింద " సాంగ్ కి అద్దిరిపోయే వాయిస్ తో పాట పాడాడు. ఆ తర్వాత రష్మీ ఆసియాని స్టేజి మీదకు పిలిపించింది. దాంతో నూకరాజు మళ్ళీ ఆ లిరిక్స్ పడడంతో ఆసియా డాన్స్ చేసింది. ఇక ఇంద్రజ, హైపర్ ఆది వాళ్ళ పాటకు, డాన్స్ కి ఫిదా ఇపోయారు. ఇక ఇంటికి వెళ్లి దిష్టి తీయించుకోండి అని సలహా ఇచ్చింది. అలాగే మరి ఇద్దరూ కలిసి గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తారు అంటూ కూడా అడిగింది. ప్రతీ ఒక్కరికి కార్డు ఇచ్చి మరీ గుడ్ న్యూస్ చెప్తాము రెండు, మూడు నెలల్లో అని చెప్పాడు నూకరాజు. ఐతే రెండు మూడు నెలల్లో ఇద్దరికీ పెళ్లి కాబోతోంది అన్న విషయాన్నీ నూకరాజు ఇన్డైరెక్ట్ గా చెప్పేసాడు.  

మీరు వెళ్ళింది భక్తి కోసమా,ఇన్‌స్టా స్టోరీ కోసమా...లాస్యకి నెటిజన్ కౌంటర్

  ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా జరుగుతున్న విషయం తెలిసిందే. భక్తులు కూడా కోట్ల మంది వెళ్లి పుణ్యస్నానాలు చేసుకుంటూ వస్తున్నారు. సామాన్యులు మాత్రమే కాదు దేశ విదేశాల నుంచి సెలబ్రిటీలు కూడా ఈ వేడుకలకు హాజరవుతున్నారు. ఇక రీసెంట్ గా   యాంకర్ లాస్య తన ఫ్యామిలీతో కలిసి మహా కుంభమేళాలో సందడి చేసింది. లాస్య అక్కడ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసింది. మహాకుంభమేళలో తమ  పర్యటనకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. "సంగమంలో ఒక పవిత్ర మునక వేసేసరికి నాలో ఏదో పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టుగా  అనిపించింది " అంటూ కామెంట్ చేసింది. ఇక ఈ పిక్స్ చూసాక నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. "అక్కడ కూడా ఫోటో షూట్స్ అవసరమా. మీరు వెళ్ళింది భక్తి కోసమా లేక ఇన్స్టా స్టోరీల కోసమా" అంటూ ఒక నెటిజన్ ఘాటుగా అడిగాడు. ఇంకొంతమంది ఐతే "అక్కడికి వెళ్లడానికైనా అదృష్టం ఉండాలి. సూపర్. ఆ నీటిలో చేపలు ఉన్నాయా..? అక్కడ పరిస్థితి ఎలా ఉందో చెప్పండి...అక్కడికి వెళ్లిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ? కార్ పార్కింగ్ ఎక్కడ చేసుకున్నారో చెప్పండి ? అంటూ అడుగుతున్నారు. ఐతే ఈ మధ్య సెలబ్రిటీస్ అంతా కూడా భక్తిని ఇలా వీడియోస్ పిక్స్ తీసి పబ్లిక్ కి షేర్ చేస్తున్నారు. షేర్ చేయడంలో తప్పు లేదు కానీ. కొన్ని అంశాల్లో మరీ ఇలాంటి వాటికి దూరంగా ఉండడమే బెటర్. డివోషనల్ ప్లేస్ కి వెళ్ళినప్పుడు మనసు దేవుడి మీద లగ్నం చేస్తే కొంచెం మనఃశాంతి దక్కుతుంది.

రష్మీ ప్రేమను మొదటిసారి రిజెక్ట్ చేసిన జబర్దస్త్ కమెడియన్ ఎవరో తెలుసా ?

  యాంకర్ గా రష్మీ వద్దు ఇక చాలు అంటూ కొంతమంది ఆమె ప్లేస్ లో రావడానికి తెగ ట్రై చేస్తూనే ఉన్నారు. ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీలో యాంకర్ రష్మీకి పోటీ ఇవ్వడానికి ఆర్జే కాజల్, నేహా చౌదరి, మృదుల వంటి వాళ్లంతా కూడా వచ్చారు. అలాగే కన్నడ పాప యాంకర్ సౌమ్య కూడా పోటీకి వచ్చింది. ఐతే ఆది మాత్రం రష్మీకి సపోర్ట్ చేసాడు. కానీ నాటీ నరేష్ సపోర్ట్ చేయలేదు. పైపెచ్చు ఒకప్పుడు రష్మీ లవ్ చేసిన నరేష్ ఇప్పుడు ఆ రష్మీనే  వద్దు అంటూ రిజెక్ట్ చేసాడు. అంతే కాదు  ఫుల్ ఫైర్ అయ్యాడు. ఆదిని కూడా తిట్టేసాడు. "పోరా పిల్లనాయాలా కొత్తవాళ్లను రానివ్వరా..రష్మిని నాలుగేళ్ల నుంచి చూస్తున్నాం. శ్రీదేవి డ్రామా కంపెనీకి కొత్త యాంకర్స్ ని రానివ్వరు..రష్మీ నాకు పడదు..కొత్తవాళ్లను కూడా పడనివ్వరా... రష్మీ చూపించింది ప్రేమా కాదు ఏమీ కాదు" అనేసరికి రష్మీ ఫీలైపోయింది. "ఇప్పుడు భాదపడుతున్నావా రష్మీ..ఎప్పుడూ నువ్వు నన్ను రిజెక్ట్ చేసేదానివి..ఇప్పుడు ఫస్ట్ టైం నేను నిన్ను రిజెక్ట్ చేస్తున్నా.." అన్నాడు ఇక భాస్కర్ వచ్చి "రష్మీ బాగుంటుంది..బిర్యానీలా ఉంటుంది..అలా అని రోజూ బిర్యానీ తింటే మోషన్స్ అవుతాయి..ఏదైనా రష్మీ నేను నీకు 1116 లు పింఛన్ ఇప్పిస్తా" అంటూ రష్మీ పరువు తీసేసాడు. ఇక అందరూ సౌమ్య మీద పడ్డారు. ఆమె మీద సెటైర్స్ వేశారు. సౌమ్య ఇచ్చిన డైలాగ్ కి ఇంకో మూడేసి చెప్తుంది. నువ్వు ఒక్కటి కూడా సరిగా చెప్పలేవు అని అందరూ రష్మీ పాపం ఏడిపించేసారు.

ఇంద్రజ స్లిమ్ గా ఉండడానికి కారణం తెలుసా..? 

  ఇంద్రజ ఇప్పటికీ స్లిమ్ గా ఉండడానికి కారణమేంటో తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఈఎఫెక్స్ యంత్రాన్ని తీసుకుని దాని మీద చెమటలు పట్టేంత వరకు వ్యాయామం చేస్తోంది. లేడీస్ కి ఫిట్ నెస్ చాలా ఇంపార్టెంట్. ఈ యంత్రం మీద బాడీ మొత్తం కదులుతుంది. కాబట్టి కొంచెం డబ్బులు సేవ్ చేసుకుని ఈ యంత్రం తీసుకోండి అని చెప్పింది. బ్లైండ్ గా ఈ యంత్రం తీసుకుని 20 నిమిషాల నుంచి అరగంట వర్కౌట్ చేయండి. అంతే మీకు ఆరోగ్యం వస్తుంది, మీ కుటుంబాన్ని చూసుకోగలుగుతారు అంటూ సజెస్ట్ చేసింది.    ఇక నెటిజన్స్ ఐతే కామెంట్స్ చేస్తున్నారు. జబర్దస్త్ తన్మయ్ , రష్మీ గౌతమ్ ఇద్దరూ కూడా సూపర్ అని మెసేజ్ చేశారు. "మీరు ఈ వయసులో కూడా వ్యాయామం చేస్తున్నారు. ఆరోగ్యంపై ఎంత శ్రద్ద ..సూపర్ మేడం గారు ..గుడ్ జాబ్ ...మీరెప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.    ఇక శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇంద్రజాను, రష్మీని పక్కపక్కన పెట్టి చూస్తే ఇద్దరిదీ సేమ్ ఏజ్ అన్నట్టుగా ఉంటారు. అందంలో రష్మీతో పోటీ పడుతూ ఉంటుంది ఇంద్రజ. ఏదైనా వ్యాయామం ఆరోగ్యానికి మంచిది అని అంటోంది ఇంద్రజ. తెలుగుతో పాటు, తమిళం, మలయాళం, కన్నడలోనూ సినిమాలు చేసి మెప్పించింది. అప్పట్లో స్టార్‌ హీరోయిన్‌గా తన హవా చూపించింది.    

Illu illalu pillalu : విశ్వక్ చెంప చెల్లుమనిపించిన వేదవతి.. కొడుకుని పట్టించుకోని రామరాజు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు '(illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -71 లో... ఒంటి నిండా దెబ్బలతో ఉన్న ధీరజ్ ని చూసి వేదవతి షాక్ అవుతుంది. అసలు ఏమైందంటూ ఏడుస్తుంది. ధీరజ్ సైలెంట్ గా ఉంటాడు కానీ సాగర్ చెప్తాడు. ఎదరింటి విశ్వక్ గాడు తమ్ముడిని చంపబోయాడని చెప్పగానే అందరు షాక్ అవుతారు.    ఇక వేదవతి కోపం కట్టలు తెంచుకుంటుంది. ఆవేశంగా ఎదురింటికి వెళ్లి అందరిని బయటకు పిలుస్తుంది. ఏంటే ఎంత దైర్యమే నీకు నా ఇంటికి వచ్చి ఇలా మాట్లాడుతున్నావంటూ వేదవతిని భద్రవతి అడుగుతుంది. నా కొడుకుని చంపాలనుకుంటారా అని వేదవతి అనగానే.. ఏం మాట్లాడుతున్నావ్ మేమే మా అమ్మాయిని తీసుకొని వెళ్లారని కోప్పడతామని, మీరే ఒక ప్లాన్ తో వచ్చారా అని రేవతి అంటుంది. నీ కొడుకు నా కొడుకుని చంపాలనుకున్నాడని వేదవతి అంటుంది. విశ్వక్ రాగానే తన చెంప చెల్లుమనిపిస్తుంది. వాళ్లకు సమాధానం చెప్పురా లేదంటే ఊళ్ళో మన పరువు తీసేలా ఉన్నారని విశ్వక్ తో భద్రవతి అంటుంది. విశ్వక్ సైలెంట్ గా ఉండడంతో తను తప్పు చేసాడని అందరికి అర్థమవుతుంది.   అప్పుడే రామరాజు వస్తాడు. వేదవతిని లోపలికి రమ్మని అంటాడు. అందరు లోపలికి వెళ్తారు. ధీరజ్ పై ఎటాక్ జరిగిందని వేదవతి చెప్తున్నా.. అసలు కనీసం ధీరజ్ ని కన్నెత్తి కూడా చూడడు రామరాజు. దాంతో వేదవతి, ధీరజ్ లు బాధపడతారు. మరొకవైపు అలా ఎందుకు చేసావంటూ విశ్వక్ ని భద్రవతి కొడుతుంది. మీ చెల్లి విషయంలో మీరు తప్పు చేసారు కానీ నేను అలా చెయ్యలేనని విశ్వ అంటాడు. తరువాయి భాగంలో ధీరజ్, ప్రేమ ఇద్దరు టామ్ అండ్ జెర్రీలాగా కొట్టుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

గుర్రం ముఖందానా.. సోనియా పరువు తీసేసిన ఆది

  ఢీ జోడి లేటెస్ట్ ప్రోమోలో గెటప్ రౌండ్ ఇవ్వండంతో ఇటు ఆది, అటు సిద్దు వాళ్ళు డైలాగ్స్ తో ఫుల్ ఎంటర్టైన్ చేశారు. ఆది, సిద్దు రాజు గెటప్స్ లో వచ్చారు. సోనియా ఆదిని చూసి "నువ్వు రాజువంటే నేను నమ్మాలా ఇప్పుడు" అంటూ కామెడీ డైలాగ్ వేసింది. దానికి ఆది కౌంటర్ ఇచ్చాడు. "ఏ ఆ లంగా వేసుకున్నోడు రాజు అంటే నమ్మలేదా నువ్వు " అంటూ సిద్దు రాజు గెటప్ గురించి చెప్పేసరికి సిద్దు పెద్ద ఫూల్ అయ్యాడు. "కాదు సిద్దు మన గుర్రానికి అస్వస్థత వచ్చింది. దానికి ఎం పెట్టినా తినట్లేదు" అంది సోనియా. "రాదా మరి..ఈ గుర్రం ముఖాన్ని చూస్తే గుర్రానికి కూడా అస్వస్థతే వస్తుంది" అంటూ ఆది కౌంటర్ ఇచ్చాడు.    ఇక ఆది రాజు గెటప్ ని చూసి "ఎవడు వీడు పగటి వేషగాడిలా ఉన్నాడు" అని హోస్ట్ నందు అన్నాడు. "హే వేషగాడు కాదు వేటగాడు అంది" అశ్విని. దానికి ఆది "నువ్వు అంత సిగ్గుపడుతూ చెప్పకు. నేను నిన్ను నిజంగా వేటాడాను అనుకుంటారు" అనేసరికి అశ్విని పెద్ద ఫూల్ అయ్యింది. "ఏమాటకు ఆ మాటా మా ఆవిడ అధరాలు ఉంటాయి." అన్నాడు ఆది. "ఏవండీ ప్లీజ్ అండి అవన్నీ నమ్మకండి అవన్నీ ఉత్తి మాటలు" అంది. "అది ఆధారాలు కాదే. అధరాలు" అంటూ అశ్విని పరువు తీసేసాడు ఆది.  

భర్త కాళ్ళు పట్టుకున్న మరిది.. అయోమయంలో భార్య..!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -317 లో... సీతాకాంత్, రామలక్ష్మిల గొప్పతనం గురించి సిరి మాట్లాడుతుంది. సీతాకాంత్ అన్నయ్య వాళ్ళు ఇక్కడికి రావాలి లేదంటే నేనే వాళ్ళ దగ్గరికి వెళ్తానని సిరి ఎమోషనల్ అవుతూ కింద పడిపోతుంది.    మరొకవైపు సీతాకాంత్ వాళ్ళని స్టేషన్ నుండి విడిపించాడని రామలక్ష్మి మాట్లాడడం మానేస్తుంది. దాంతో సీతాకాంత్ బుజ్జగిస్తు ఉంటాడు. అప్పుడే శ్రీలత, సందీప్, ధన వాళ్ళు సీతాకాంత్ దగ్గరికి వస్తారు. వాళ్ళని చూసి సీతాకాంత్ ఆశ్చర్యంగా.. మీరెందుకు వచ్చారు అని అడుగుతాడు. మమ్మల్ని క్షమించండి అన్నయ్య అంటూ సీతాకాంత్ కాళ్ళ మీద పడి సందీప్ రిక్వెస్ట్ చేస్తాడు. మీరే ఇప్పుడు మమ్మల్ని కాపాడాలంటూ సందీప్ అంటాడు. నన్ను క్షమించు సీతా.. ఇప్పుడు సిరికి బాగాలేదు. నువ్వు ఎలాగైనా ఇంటికి రావాలని శ్రీలత బ్రతిమిలాడుతుంది.    అసలు మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని రామలక్ష్మి అడుగుతుంది. నేను సీతాని చంపాలనుకోవడం తప్పే.. ఇప్పుడు ప్రాధేయపడుతున్నానని శ్రీలత అనగానే.. అసలు సిరికి ఏమైందని సీతాకాంత్ అడుగుతాడు. ఇక శ్రీలత జరిగింది అంత చెపుతుంది. డాక్టర్ వచ్చి సిరిని చెక్ చేసి ఇప్పుడు ఈవిడ ప్రశాంతంగా లేకపోతే తల్లి బిడ్డకి ఇద్దరికి ప్రమాదన్న విషయం చెప్తుంది. మీరేం చెప్పినా మేము నమ్మే సిచువేషన్ లో లేమని రామలక్ష్మి అంటుంది. నేను నమ్ముతానని సీతాకాంత్ అనగానే.. రామలక్ష్మి షాక్ అవుతుంది. రామలక్ష్మిని కూడా శ్రీలత రిక్వెస్ట్ చేస్తుంది. ఇది నిజమా, అబద్ధమా తేల్చుకోలేకపోతున్నానని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

బావని నాకు ఇచ్చేస్తే డబ్బులిస్తా.. జ్యోత్స్న కన్నింగ్ తెలిసి షాకైన పారిజాతం!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -270 లో..... శౌర్య గురించి దీప బాధపడుతుంటే.. అప్పుడే కార్తీక్ వస్తాడు. డబ్బు కట్టారా అని దీప అడగ్గానే కట్టాను కానీ నాలుగు లక్షలు కట్టానని కార్తీక్ అనగానే.. మరి మిగతా నలభై ఒక్క లక్ష ఎలా అని దీప బాధపడుతుంది.    అప్పుడే నర్స్ వచ్చి పాప ఏడుస్తుందని చెప్పగానే ఇద్దరు శౌర్య దగ్గరికి వెళ్తారు. ఎందుకు ఏడుస్తున్నావని ఇద్దరు అడుగుతారు. నేనేం ఏడవట్లేదు నాకు ఇంజక్షన్ వేస్తానంటున్నారు. భయం వేసిందని శౌర్య ఎమోషనల్ గా మాట్లాడేసరికి.. కార్తీక్, దీపలు బాధపడతారు. ఆ తర్వాత ఇక ట్రీట్మెంట్ ఆపేస్తాం.. మీరు ఇంకా డబ్బు కట్టలేదని కోప్పడుతుంటే కార్తీక్ రిక్వెస్ట్ చేస్తాడు. ఎలాగైనా ఆపరేషన్ టైమ్ కి కట్టేస్తానని కార్తీక్ చెప్తాడు. దాస్ ని చూడడానికి కావేరి వస్తుంది. ఆ తర్వాత కాసేపటికి శ్రీధర్ వస్తాడు. ఇక ఎప్పటిలాగే స్వప్న, శ్రీధర్ ల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. దాస్ గురించి కాశీని అడుగుతాడు శ్రీధర్.   అనసూయ, కాంచనలు గుడికి వెళ్లి.. శౌర్య గురించి మొక్కుకుంటారు. సుమిత్ర, దశరథ్ ల దగ్గరికి కాశీ వెళ్లి.. నిజంగానే శౌర్య కి బాలేదు.. ఇప్పుడు ఆపరేషన్ చెయ్యకపోతే బ్రతకదని చెప్తాడు. దాంతో మనం సాయం చెయ్యాలని సుమిత్ర అనగానే..‌అంత డబ్బు నాన్నకి తెలియకుండా అంటే కష్టమని దశరథ్ అంటాడు. మరోవైపు దీప ఫోన్ చేస్తుందేమోనని జ్యోత్స్న చూస్తూ ఉంటుంది. అప్పుడే పారిజాతం వస్తుంది. నిజంగానే శౌర్యకి బాలేదు.. ఆ విషయం నిజమేనని తెలిస్తే ఇంట్లో వాళ్ళు సాయం చేస్తారని చెప్పలేదని జ్యోత్స్న అనగానే.. పారిజాతం షాక్ అవుతుంది. బావని నాకు ఇవ్వమని అడిగాను.. డబ్బులు ఇస్తానన్నానని జ్యోత్స్న పారిజాతానికి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ఫరియా బాయ్ ఫ్రెండ్ హైట్ తెలుసా..?

  ఆహా ప్లాట్‌ ఫామ్‌ మీద డాన్స్ ఐకాన్ సీజన్ 2 కలర్ థీమ్ తో మన ముందుకు ప్రేమికుల రోజున రాబోతోంది. ఇక ఈ సీజన్ ప్రోమో చూస్తే ఫుల్ జోష్ తో ఉంది. హోస్ట్ గా యాంకర్ ఓంకార్ ఉన్నారు. ఇక జడ్జెస్ గా ఫరియా అబ్దుల్లా, శేఖర్ మాస్టర్ వచ్చారు. యష్ మాష్టర్, జానులూరి, బ్రహ్మముడి మానస్, దీపిక రంగరాజు, ‘మిస్‌ తెలంగాణ- 2024’ టైటిల్‌ విజేత ప్రకృతి కంబం, రోహిణి వచ్చారు.    ఇక ఫరియా హైట్ ఎంతో తెలుసు కదా 6 ఫీట్ ఉంటుంది. అంత హైట్ ముందు అదే హైట్ అబ్బాయి ఉంటేనే కనిపిస్తారు. దాంతో ఓంకార్ కి డౌట్ వచ్చి "మీకు రియల్ లైఫ్ లో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా" అంటూ ఒక చిన్న రెడ్ పప్పీ బొమ్మను ఇస్తూ అడిగాడు. దానికి ఫరియా సిగ్గు పడుతూ ఉన్నాడు అని చెప్పింది. "మీ బాయ్ ఫ్రెండ్ హైట్ ఎంత" అని అడిగాడు "ఆల్మోస్ట్ సిక్స్" అని చెప్పింది. తర్వాత యష్ మాస్టర్ వచ్చారు. "నువ్వు ఇప్పటి వరకు ఎంతమందిని కిస్ చేసావ్" అని అడిగాడు ఓంకార్. "15 ఏళ్ళ క్రితం ఫస్ట్  కిస్ చేసాను" అని చెప్పేసరికి . "సర్ నేను వెళ్ళిపోతా..ఈ అబద్దాలు నమ్మను" అంటూ చెప్పాడు శేఖర్ మాష్టర్.      ఇక దీపికా రంగరాజు నాన్ సింక్ స్టెప్స్ తో డాన్స్ చేస్తూ వచ్చింది. ఓంకార్ చాక్లెట్ ఇవ్వగా, అది తీసుకుని తింటూ శేఖర్ మాస్టర్ కి తినిపించబోయేసరికి భయపడి పారిపోయాడు. తర్వాత దీపికా నడుమును వర్ణించమంటూ మానస్ కి చెప్పాడు ఓంకార్. "యష్ మాష్టర్ అంత దగ్గర నుంచి చూస్తూ ఆయనే వర్ణించలేకపోతున్నాడు నేనేం వర్ణిస్తాను" అన్నాడు. "యష్ మాష్టర్ నడుమును చూడమంటే వేరే ఎక్కడో చూస్తున్నాడు" అని యష్ పరువు మొత్తం తీసేసింది దీపికా.  

ఇంట్లో వాళ్ళని అప్పుల పాలు చేసి ఫారెన్ లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారా?

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -634 లో... రాజ్ వీసా అప్లై చేయమని ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతుంటే.. రుద్రాణి వింటుంది. వీళ్ళు ఇంట్లో వాళ్ళని అప్పుల పాలు చేసి ఫారెన్ లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారని అనుకుంటుంది. అప్పుడే కావ్య ఇంగ్లీష్ డిక్షనరీ చదువుతూ కన్పిస్తుంది. దగ్గరికి వెళ్లి ఏం చేస్తున్నావని రుద్రాణి అడుగగా.. ఇంగ్లీష్ నేర్చుకుంటున్నానని కావ్య చెప్తుంది. కావ్య వచ్చి రాని ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే.. రుద్రాణి వినలేకపోతుంది.    మీ గుట్టురట్టు చేస్తానని ధాన్యలక్ష్మి దగ్గరికి రుద్రాణి వెళ్లి.. వాళ్ళు అమెరికాకి వెళ్ళాలనుకుంటాన్నారని చెప్తుంది. అది విన్న ధాన్యలక్ష్మి.. నువ్వు చెప్పింది విని అందరిని వెళ్లి అడగాలి. అప్పుడు వాళ్ళు ఏదో ఒకటి చెప్పి డైవర్ట్ చేస్తారు. అక్కడ వెర్రిదాన్ని అయ్యేది నేనే.. అందుకే మూడు నెలల టైమ్ అడిగారు కదా.. అందుకే అప్పటివరకు సైలెంట్ గా ఉందామనుకుంటున్నానని ధాన్యలక్ష్మి అనగానే.. దీన్ని నా వైపుకి తిప్పుకోవాలనుకున్న ప్రతీసారి నన్నే బాధపెడుతుందని రుద్రాణి అనుకుటుంది.    ఆ తర్వాత కావ్య ఆఫీస్ కి వెళ్తూ.. బ్రోకర్ వస్తాడు.. ఈ ఫైల్ ఇవ్వమని స్వప్నకి ఫైల్ ఇచ్చి వెళ్తుంది. అది చూసి ఏం ఫైల్ అంటూ రుద్రాణి లాక్కొని చూస్తుంటే.. స్వప్న తన దగ్గర నుండి లాక్కుంటుంది. మరోవైపు లిరిక్ రైటర్ దగ్గరికి కళ్యాణ్ పాట రాసుకొని తీసుకొని వస్తాడు. అది చూసి చాలా బాగుందని కళ్యాణ్ ని ఆ రైటర్ మెచ్చుకుంటాడు. అప్పుడే ప్రొడ్యూసర్ వచ్చి పాట తీసుకొని బాగుందని అంటాడు. ఇక్కడ ఈ వర్డ్ వస్తే బాగుండని ప్రొడ్యూసర్ అంటాడు. ప్రొడ్యూసర్ వెళ్తుంటే.. కళ్యాణ్ వెళ్లి ఆ వర్డ్ దగ్గర ఇది ఈ వర్డ్ పెట్టండి అని చెప్పగానే.. చాలా బాగుంది ఈ పాట నువ్వే రాసావ్.. నాకు తెలుసని కళ్యాణ్ ని మెచ్చుకుంటాడు.   రాజ్, కావ్య వెళ్తుంటే.. రాజ్ ఫ్రెండ్ ఫోన్ చేసి నంద గోపాల్ ని షూట్ చేసింది ఎవరో ఇంకా తెలియలేదని చెప్తాడు. ట్రాఫిక్ సిగ్నల్ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కనుకోవచ్చని అతను చెప్పగానే రాజ్ సరే అంటాడు. కావ్య చెప్పిన బ్రోకర్ ఇంటికి వస్తాడు. స్వప్న ఫైల్ ఇస్తుంది. ఎందుకు అవి అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. వీసాకి అని చెప్తాడు. చూసావా ధాన్యలక్ష్మి నేను చెప్తే వినలేదని రుద్రాణి అంటుంది.    తరువాయి భాగంలో ఏంటి రాజ్.. రుద్రాణి, ధాన్యలక్ష్మి ల ఆస్తులన్నీ డాలర్ లో మార్చి అక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నావా అని అపర్ణ అనగానే.. రాజ్, కావ్య షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

బికినీ వేసుకున్నా, బట్టలిప్పి తిరిగినా నా ఇష్టం.. సెక్స్ పై అనసూయ షాకింగ్ కామెంట్స్!

  అనసూయ భరద్వాజ్ గురించి కొత్తగా పరిచయమవసరం లేదు. తెలుగులో ముఖ్యంగా ఈటీవీలో ప్రసారమైన జబర్ధస్త్ కామెడీ షో యాంకర్‌గా పాపులర్ అయింది. ఆ తర్వాత సినిమాల్లో ప్రవేశించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అనసూయ రెగ్యులర్ గా ఇన్ స్టాగ్రామ్ లో హాట్ ఫోటోస్ పెడుతూ వైరల్ గా నిలుస్తుంది. అయితే తాజాగా ఓ ప్రైవేటు ఇంటర్వ్యూలో కొన్ని బోల్డ్ కామెంట్లు చేసింది అనసూయ.     మొన్న రీసెంట్‌గా ఒక సర్వే జరిగింది.. ఈ జనరేషన్ బాయ్స్ దాదాపు 70 శాతం మంది.. తమకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్లతో కోరుకుంటున్నారట. వీళ్ల వయసు 20-25 ఉంటుంది కానీ.. వాళ్లు వాళ్లకంటే ఎక్కువ వయసు ఉన్న 30-35తో ఉండాలని అనుకుంటున్నారట అని తన ప్రశ్నని యాంకర్ అడుగుతుండగా.. ‘సెక్సువల్‌గానా’ అని అడిగింది అనసూయ. అంటే.. అది సెక్సువల్ అని కాదు.. లస్ట్ (కామం) అని అన్నాడు యాంకర్. దాంతో అనసూయ.. లస్ట్ అంటే సెక్సే కదా అని అనేసింది. అంటే నేను వల్గర్ వే‌లో చెప్పకూడదని అలా అన్నా అని ఆ యాంకర్ అనడంతో.. అది వల్గర్ ఏం కాదు.. సెక్స్ అనేది చాలా అవసరం. దాన్ని జనం ఎందుకు అలా ఫీల్ అవుతారో అర్థం కావడం లేదు. అలాగని బహిరంగంగా సెక్స్ చేసుకోవాలి.. బహిరంగంగా మాట్లాడుకోవాలని కాదు.. కాకపోతే అయ్యయ్యో అని తప్పుపట్టాల్సిన పనిలేదు. అది అవసరం. దాని గురించి సిగ్గుపడాల్సిన పనిలేదు. అది మంచిదే అని పచ్చిగా ఆన్సర్ ఇచ్చింది అనసూయ. అంటే.. నిండా 20 ఏళ్లు కూడా రాని నిబ్బా గాళ్లంతా కామంతో తనకంటే పెద్ద వాళ్లైన ఆడాళ్లతో సెక్స్ చేయడం తప్పేం కాదు అన్నకోణంలో అనసూయ చెప్పడం విమర్శలకు తావిస్తోంది.    అంతేకాదు, "నన్ను ఆంటీ అని కామెంట్స్ చేసేవాళ్ళు.. సెక్సువల్ అప్రోచ్ తోనే చూస్తారు అనిపిస్తుంది. నేను మా ఆయన ఆడదాన్ని. నేను బికినీ వేసుకున్నానా, బట్టలు విప్పి తిరిగానా? అనేది నా ఇష్టం. మనుషుల్లా బిహేవ్ చేయండి." అంటూ అనసూయ ఘాటు వ్యాఖ్యలు చేసింది.   ఇక అననసూయ మామూలుగా మాట్లాడితేనే కామెంట్ల మోత మోగుతుంది. కానీ సెక్స్ గురించి ఇప్పుడు ఏ మాత్రం సిగ్గు పడకుండా మాట్లాడింది. దాంతో సోషల్ మీడియాలో ఈ ఇంటర్వ్యూ  ఫుల్ వైరల్ గా మారింది. అనసూయ చేసిన కామెంట్స్ పై సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ ఓ రేంజ్ లో వస్తున్నాయి.