Eto Vellipoyindhi Manasu : సవతి తల్లి ప్రేమని తెలుసుకున్న కొడుకు.. భార్యతో ప్రేమగా ఉంటున్న సీతాకాంత్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -312 లో.....రామలక్ష్మి తెలివిగా భద్రాన్ని పట్టుకొని పోలీసుల ముందుకు తీసుకొని వస్తాడు. దాంతో శ్రీలత వాళ్ళు షాక్ అవుతారు. నా పేరుని నమ్మి వెంచర్ లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు అందరికి డబ్బు మీరే ఇవ్వండి అని సీతాకాంత్ పోలీసులకి చెప్తాడు. దాంతో పాటు ఈ ఫ్రాడ్ భద్రం గాడిని కూడా అప్పగిస్తున్నాను.. మీ వాళ్లే మీకు ఎందుకు ఇలా చేశారని మీడియా వాళ్ళు సీతాకాంత్ ని అడుగుతారు. దానికి సమాధానం రామలక్ష్మి చెప్తుంది. వాళ్లే ఇలా చేశారు. ఇంకా ఆవిడ అయితే తల్లి అనే పదానికి తలవంపులు తెచ్చిందంటూ శ్రీలత గురించి చెప్పబోతుంటే.. 'రామలక్ష్మి' అని పిలిచి సీతాకాంత్ ఆపుతాడు. ఇక జరిగింది నా మంచికే అనుకుంటూ నేనొక నిర్ణయం తీసుకున్నాను. నాకు నా భార్య రామలక్ష్మి ఈ కుటుంబంతో ఏ సంబంధం లేదని మీడియా ద్వారా చెప్తున్నామని సీతాకాంత్ చెప్తాడు. భద్రాన్ని పోలీసులు తీసుకొని వెళ్తుంటే. వాళ్ళు కూడా నాతో పాటు ఫ్రాడ్ చేశారంటూ ధన సందీప్ ల గురించి చెప్పగానే.. వాళ్ళను కూడా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు. దాంతో శ్రీలత.. నాన్న సీతా అంటూ పిల్వగానే.. రామలక్ష్మి ఇక ఎవరు లేరు.. నాకు నువ్వు.. నేను నేను అంటూ రామలక్ష్మిని తీసుకొని వెళ్ళిపోతాడు. శ్రీవల్లి బాధపడుతూ మీ కొడుకు అంటే ప్రేమ లేదా అంటూ శ్రీవల్లి మాట్లాడుతుంటే.. వాడు నా కన్నకొడుకు ఆ రామలక్ష్మి పని చెప్తానంటూ శ్రీలత ఎవరికో కాల్ చేస్తుంది. రామలక్ష్మి వంట చేస్తుంటే నేను చేస్తానంటూ సీతాకాంత్ వంట చేస్తాడు.  ఇద్దరు కలిసి భోజనం చేస్తారు. రామలక్ష్మి నిద్రలో కొంతమంది రౌడీలు వచ్చి సీతాకాంత్ ని పొడిచినట్లు కల వస్తుంది. దాంతో ఒక్కసారిగా బయపడి గట్టిగా అరుస్తుంది రామలక్ష్మి. ఏమైందని సీతాకాంత్ అడుగగా.. ఏం లేదని రామలక్ష్మి అంటుంది. ఏంటి ఇలా వచ్చిందని రామలక్ష్మి టెన్షన్ పడుతుంది. మరుసటిరోజు శ్రీలత లాయర్ ని తీసుకొని స్టేషన్ కి వెళ్తుంది. దాంతో ధన , సందీప్ లు హ్యాపీగా ఫీల్ అవుతూ.. మేము వెళ్తున్నామంటూ భద్రంతో చెప్తారు. మీరు వెళ్ళరన్నట్లు ఒక నవ్వు నవ్వుతాడు. అక్కడ సీతాకాంత్ ఫ్రెండ్ ఉంటాడు. నువ్వు సీతాకాంత్ ఫ్రెండ్ వి కదా ఈ బెయిల్ తీసుకొని వాళ్ళని వదిలి పెట్టమని శ్రీలత అంటుంది. అది కుదరదని సీఐ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu: కత్తిపట్టుకోవాల్సింది చేతులు కలుపుతున్నావంటే తేడా కొడుతుందిరా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-66 లో.. ధీరజ్, సాగర్ ఇద్దరు ప్రేమ, నర్మదలను వీపుపై ఎక్కించుకుని పందెంలో పోటీ పడతారు. అయితే ప్రేమను మోస్తూనే.. ఇంత పరువు ఉన్నావే ఏంటే రాక్షసి అని ధీరజ్ అంటాడు. దాంతో ప్రేమ.. నీ మీద ఎక్కినందుకు నాకు ఒళ్లు కంపరంగా ఉందిరా అని గిల్లి గిచ్చేస్తుంటుంది. చివరికి పోటీలో కూడా ధీరజ్, ప్రేమలే గెలుస్తారు. సాగర్, నర్మదలు రెండో స్థానంలో నిలుస్తారు. మా ఇద్దరు కోడళ్లు మా కుటుంబాన్నిగెలిపించారని తెగ సంబరపడిపోతుంది వేదవతి. అయితే తనని గిచ్చినందుకు ప్రేమను గట్టిగా గిచ్చుతాడు ధీరజ్. దానికి ఆమె పెద్దగా అరుస్తుంది. సరిగ్గా అప్పుడే భద్రవతి చూస్తుంది. ఆ రామరాజుగాడి కుటుంబంతో కలిసి పోవడం నేను భరించలేకపోతున్నాను. నువ్వు మమ్మల్ని చేసిన మోసాన్ని సహించలేకపోతున్నానని భద్రవతి రగిలిపోతుంది. ఇక ఆ తర్వాత తాడు లాగే కార్యక్రమం ప్రారంభమవుతుంది. వేదవతి వర్సెస్ భద్రవతి కుటుంబాలు ఈ తాడులాగే పోటీలో పోటీపడతారు. మేమ్ గెలుస్తామంటే మేమ్ గెలుస్తామని శపథాలు చేసుకుని తాడుని చాలాసేపు సాగదీస్తూనే ఉంటారు. ఇక భద్రవతి కుటుంబంపై వేదవతి కుటుంబం గెలుస్తుంది. అయితే ఈ తాడులాగే ప్రాసెస్‌లో భద్రవతి పడిపోబోతుంటే వేదవతి పట్టుకుంటుంది. అక్కాచెల్లెల్లు ఒకర్నొకరు ఆప్యాయంగా చూసుకుంటూ గతంలోకి వెళ్తారు. ఒకర్నొకరు పట్టుకుని ఎమోషనల్ అవుతారు. అక్కా అని వేదవతి పిలవబోతుండగా ఛీ ఛీ అని చెల్లెలి ప్రేమను ఛీకొట్టి వెళ్లిపోతుంది భద్రవతి. ఇక రామరాజు ఫ్యామిలీ.. మేమే గెలిచాం.. మేమే గెలిచాం అని గెలుపు సంబరాల్లో తేలిపోతుంటారు. అది చూసి విశ్వ సహించలేకపోతాడు. కాసేపట్లో ప్రభల తీర్థం ప్రారంభం కాబోతుంది. ఆ ధీరజ్ గాడు ప్రభను ఎత్తుకుని పోటీలోకి వస్తాడు. వాడ్ని అక్కడే వేసేయడానికి ఇదే మంచి అవకాశం.. వాడు ఎక్కడ దొరికితే అక్కడ వేసేయండి అని రౌడీ గ్యాంగ్‌తో విశ్వ చెప్తాడు. వాడు మా కత్తి వేటు నుంచి తప్పించుకోలేడు.. వాడ్ని చంపేస్తామని ఆ రౌడీలు అంటారు. ఇంతలో విశ్వకి ఎదురుపడతాడు ధీరజ్. అయితే విశ్వ.. హాయ్ బావా అని ధీరజ్‌ని పలకరిస్తాడు. ఏంటీ.. బావా అని నన్నేనా పిలిచేదని ధీరజ్ ఆశ్చర్యపోతాడు. అవును బావా.. నువ్వు నా మేనత్త కొడుకువి.. నా చెల్లెలి మొగుడివి. నువ్వు బావవే కదా బావా అని విశ్వ అంటాడు. ఏంట్రా తాడి చెట్టూ... మీ మాటల్లో ఏదో తేడా కనిపిస్తుందని ధీరజ్ అనగా.. నువ్వు ఎలా తీసుకుంటే అలా.. ఎలా అర్థం చేసుకుంటే అలా.. నీకు హ్యాపీ సంక్రాంతి అంటూ విశ్వ చేయి అందిస్తాడు. రేయ్ తాడి చెట్టూ నాకు తేడా కొడుతుందిరా.. నువ్వు నాపై కోపంతో చేతిలో కత్తి పట్టుకుని తిరగాలి కానీ చేతులు కలుపుతున్నావంటే ఏదో ఉందని అంటాడు. పండగ చేస్కో బావా.. ఈ పండగ నీకు చాలా స్పెషల్.. పెళ్లి చేసుకున్నావ్ కదా.. ఈ సంక్రాంతి పండుగ.. మీ కుటుంబానికి చాలా ఏళ్లు గుర్తుండిపోద్ది.. ఆల్ ది బెస్ట్ బావా అని విశ్వ హెచ్చరించి వెళ్తాడు. వీడు ఏదేదో మాట్లాడుతున్నాడు.. వీడి మాటల వెనుక మర్మం ఉందని ధీరజ్ అనుమానపడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో  తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : అనామిక ప్లాన్ కనిపెట్టేసిన ప్రియుడు.. కోర్టు నోటీసులు పంపించిన ధాన్యలక్ష్మి!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -629 లో.. అనామిక సామంత్ లు చెస్ ఆడతారు. ఆ నందు గాడిని లేకుండా చేసి రాజ్ కావ్యలని మరింత ప్రాబ్లమ్ లోకి నెట్టేసాం.. వాళ్ళ కుటుంబం మొత్తం కుళ్ళి కుళ్ళి ఏడవాలని అనామిక అంటుంది. ఆ తర్వాత ఆ ఆఫీస్ ని మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని అనామిక అంటుంది. అప్పుడు నీదే స్వరాజ్ గ్రూప్ ఇండస్ట్రీస్ అవుతుందని అనామిక అంటుంటే సామంత్ మురిసిపోతాడు. ఈ అనామికని నమ్ముకున్న వాళ్ళు ఎవరు చెడిపోరంటూ తన గురించి తనే గొప్పగా చెప్తుంది. ప్రకాష్ దగ్గరికి ధాన్యలక్ష్మి వచ్చి ఈ నోటీసులపై సంతకం చెయ్యండని అంటుంది. ఏంటి ఇవి అని ప్రకాష్ అడుగుతాడు. మన వాటా మనకి ఇవ్వమని కోర్ట్ ద్వారా నోటిసులు అని ధాన్యలక్ష్మి అనగానే వద్దని ప్రకాష్ అంటాడు. దాంతో ధాన్యలక్ష్మి కోపంగా నా మెడలో తాళిని తెంపుతారా లేక సంతకం చేస్తారా అని బెదిరించడంతో ప్రకాష్ సంతకం పెడతాడు. భర్త పక్కన ఉంటే ఏదైనా చేయోచ్చని చూపిస్తానని ధాన్యలక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరోవైపు కావ్య వాషింగ్ మిషన్ నుండి బట్టలు ఆరేయ్యడానికి బయటకు తీస్తూ ఉంటుంది. అదంతా చూస్తూ రాహుల్ .. ఇంకా నయం ధాన్యలక్ష్మి ని బట్టలు ఉతకమనలేదని రుద్రాణితో అంటాడు. ఈ కావ్యకి పర్మినెంట్ సొల్యూషన్ ప్లాన్ చేసాను.. కావ్యని లేపేస్తానని రుద్రాణితో రాహుల్ అంటాడు. వద్దురా అది మన మెడకి చుట్టుకుంటుందని రుద్రాణి టెన్షన్ పడుతుంది. అయిన రాహుల్ వినకుండా బయట కావ్య బట్టలు ఆరేసే తాడుకి రాహుల్ కరెంటు షాక్ వచ్చేలా సెట్ చేస్తాడు. కావ్య బట్టలు తీసుకొని బయటకు వస్తుంటే.. నువ్వు ఎందుకు పని చెయ్యడం అంటూ కావ్యతో స్వప్న అంటుంది. పర్లేదంటూ కావ్య ఆరేయ్యబోతుంటే అప్పుడే రాజ్ పిలుస్తాడు. దాంతో కావ్య లోపలికి వెళ్ళిపోతుంది. ఇక అక్కడ స్వప్న ఉంటుంది. అప్పుడే వీడేం ప్లాన్ చేసాడో చెప్పలేదంటూ రుద్రాణి బయటకు వస్తుంది. దాంతో స్వప్న చూసి అత్త ఈ బట్టలు ఆరేయ్.. నీకు డబ్బు ఇస్తాను.. ఎలాగు మీ దగ్గర డబ్బు లేవ్ కదా అంటుంది. ఎలాగా మా దగ్గర డబ్బు లేవ్ సరే.. డబ్బు ఇవ్వు అంటూ రుద్రాణి బట్టలు ఆరెస్తుంది. దాంతో తనకి షాక్ వస్తుంది. స్వప్న కర్రతో రుద్రాణిని కొడుతుంది. అది చూసిన రాహుల్ వెళ్లి స్విచాఫ్ చేస్తాడు. ఈ రోజు మీ అమ్మని నేనే కాపాడనని స్వప్న అంటుంది. తరువాయి భాగంలో ఇంటికి కోర్ట్ నుండి నోటీసులు వస్తాయి. ఎవరు పంపించారు అని సుభాష్ అంటాడు. మేమే పంపించామని ధాన్యలక్ష్మి అనగానే.. అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏం తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

కరెంట్ షాక్ తో కావ్య మర్డర్.. ఎంతకు తెగించార్రా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -628 లో..... కావ్య అన్న మాటలకి సుభాష్ బాధపడుతుంటే.. అప్పుడే ప్రకాష్ వచ్చి మాట్లాడతాడు. నలుగురిలో కావ్య అన్న మాటలకి భాదపడుతున్నావా అని ప్రకాష్ అడుగగా.. నలుగురెవరు మన ఇంట్లో వాళ్ళే కదా.. వాళ్ళ ముందు పరువుపోయిందని అనుకోను కానీ కావ్య అలా అనడానికి కారణం ఏంటని ఆలోచిస్తున్నానని సుభాష్ అంటాడు. తనకి ఎంత పెద్ద సమస్య వచ్చిందోనని సుభాష్ అనగానే.. నేను నీలాగా ఆలోచించలేను అన్నయ్య. నిన్ను వదిన అర్ధం చేసుకుంటుంది కానీ నా భార్య నన్ను అర్ధం చేసుకోదు.. ఇక నేనేం చెయలేనని ప్రకాష్ వెళ్ళిపోతాడు. అదంతా కావ్య వింటుoది. కావ్య భోజనం వడ్డీస్తుంటే.. ధాన్యలక్ష్మి ప్రకాష్ లు వద్దని అంటారు. మా అన్నయ్య, వదినలు రాలేదు అవమానం గా ఫీల్ అయి ఉంటారని రుద్రాణి అంటుంది. అప్పుడే సుభాష్ వస్తాడు.. పోనిలే మా వదినకి అయినా రోషం ఉందని రుద్రాణి అంటుంది. దాంతో రుద్రాణికి స్వప్న కౌంటర్ వేస్తూ మాట్లాడుతుంది. ఆ తర్వాత రుద్రాణి, ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తుంది. ఇప్పుడు నువ్వు అనుకున్నది చెయ్యొచ్చు ఎందుకంటే ప్రకాష్ అన్నయ్య నీ వైపు ఉన్నాడంటూ చెప్తుంది. అవునని ధాన్యలక్ష్మి అంటుంది. సుభాష్ భోజనం చేసి వెళ్తుంటాడు. "థాంక్స్ మావయ్య.. ఎవరు నన్ను అర్ధం చేసుకోలేదు.. మీరు అర్ధం చేసుకున్నారు.. నేనేం చేసినా దాని వెనకాల కారణం ఉందని అనుకుంటున్నారు" అని సుభాష్ తో కావ్య అంటుంది. నేను మాయ విషయంలో తప్పు చేసానని అందరు నమ్మినప్పుడు ఒక్క నువ్వు మాత్రమే నన్ను నమ్మావు అమ్మ అని కావ్యతో పాజిటివ్ గా సుభాష్ మాట్లాడతాడు. అపర్ణ భోజనం చెయ్యలేదని ఇందిరాదేవి భోజనం తీసుకొని వచ్చి అపర్ణకి తినిపిస్తుంది. కావ్య బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటే రాజ్ వస్తాడు. నందగోపాల్ బ్రతికి ఉంటే ఎవరికి నష్టం? ఎవరు ఇదంతా చేశారని కావ్య అంటుంది. అవును నేను ఈ కోణంలో అసలు అలోచించలేదు కనుక్కోవాలని రాజ్ అంటాడు. అనామిక సామంత్ లు చెస్ ఆడుతుంటారు. నంద గోపాల్ ని చంపించి రాజ్ వాళ్ళని ప్రాబ్లమ్ లోకి నెట్టావని అనామికతో సామంత్ అంటాడు. తరువాయి భాగంలో ఇక ప్లాన్ లు వద్దు.. పర్మినెంట్ సొల్యూషన్ చెప్తాను. ఆ కావ్యని లేపేస్తానని రుద్రాణితో రాహుల్ అంటాడు. కావ్య వాషింగ్ మిషన్ దగ్గర బట్టలు పిండేస్తుంటే కరెంటు షాక్ వచ్చేలా చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

సీతాకాంత్ మాస్టర్ ప్లాన్ సక్సెస్.. భద్రాన్ని తీసుకొచ్చాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto  Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -311 లో... బస్తీలో అందరిని భద్రం కన్పించడా అని రామలక్ష్మి అడుగుతుంది. అందరు లేదని చెప్పడంతో.. రామలక్ష్మి డిస్సపాయింట్ అవుతుంది. అప్పుడే పోలీసులు వస్తారు. రేపు మద్యాహ్నం కల్లా మీరు అడిగిన టైమ్ అయిపోతుందని చెప్తారు. రామలక్ష్మి, సీతాకాంత్ లు టెన్షన్ పడతారు. అప్పుడే సిరి ఫోన్ చేస్తుంది. మీరు అలా బాధపడుతుంటే చూడలేకపోతున్న అన్నయ్య.. మీకేం సాయం కావాలన్న చేస్తానని సిరి అనగానే.. సరే అంటూ సీతాకాంత్ సిరికి ఏదో చెప్తాడు. మరొకవైపు శ్రీలత మనిషి భద్రంకి ఫుల్ గా తాగిస్తాడు. నువ్వు, నేను చేతులు కలిపామనుకో బాగా దోచుకోవచ్చని అతనితో భద్రం చెప్తాడు సరే గానీ నువ్వు అసలు ఇక్కడ నుండి కదలకని అతను చెప్తాడు. మరి ఎవరైనా వస్తే అని భద్రం అనగానే.. ఎవరు రారు అని అతను చెప్తాడు. మరుసటి రోజు సీతాకాంత్ దగ్గరికి పోలీసులు వస్తారు. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను.. మా ఇల్లు అమ్మి వాళ్లకు డబ్బు ఇవ్వాలనుకుంటున్నానని సీతాకాంత్ చెప్తాడు. నువ్వేం అంటావ్ రామాలక్ష్మి అని సీతాకాంత్ అడుగగానే.. మీ నిర్ణయానికే ఏకీభవిస్తున్నానని రామలక్ష్మి అంటుంది. సీతాకాంత్ పోలీసులని తీసుకొని శ్రీలత ఇంటికి వెళ్తాడు. అమ్మ నేను ఈ ఇంటిని అమ్మి డబ్బు కట్టాలనుకుంటున్నానని చెప్తాడు. ముందు నీ భార్య రామలక్ష్మి నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాలని శ్రీలత అంటుంది. దాంతో రామలక్ష్మి కోప్పడుతుంది. ఇల్లు అమ్ముతున్నాం కదా ఒకసారి అంతా చూసుకొని వస్తానంటూ సీతాకాంత్ పైకి వెళ్లి భద్రాన్ని తీసుకొని వస్తాడు. అతన్ని చూసి అందరు షాక్ అవుతారు. వీడు ఇక్కడున్నాడని నాకు, సందీప్ కి మాత్రమే తెలుసు కదా అని శ్రీలత అనుకుంటుంది. ఆ తర్వాత సీతాకాంత్ కి భద్రం ఇంట్లో ఉన్నాడన్న విషయం చెప్పిన సంఘటన గుర్తుచేసుకుంటుంది శ్రీలత. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

సాయం కోసం శివన్నారాయణ దగ్గరికి వచ్చిన కాంచన, అనసూయ.. జ్యోత్స్న కన్నింగ్ ప్లాన్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -264 లో.....కార్తీక్ హాస్పిటల్ కి వచ్చేసరికి శౌర్య బెడ్ పై ఉండదు. దాంతో కార్తీక్ కంగారుపడుతూ అక్కడున్నా అందరిని అడుగుతాడు. దాంతో కార్తీక్ అక్కడున్నా డాక్టర్ నర్సులపై కార్తీక్ కోప్పడతాడు. కార్తీక్ వెతుకుతూ ఉంటే.. దేవుడికి మొక్కుతూ శౌర్యా కన్పిస్తుంది. దాంతో తమ దగ్గరికి వెళ్లి శౌర్యని హగ్ చేసుకొని కార్తీక్ ఎమోషనల్ అవుతాడు. చెప్పాలి కదా అని కార్తీక్ అడుగగా.. డాక్టర్ నాకు రేపేదో పెద్ద టెస్ట్ చేస్తానన్నాడు కదా అందుకే భయమేసి ఇక్కడ మొక్కుకుంటున్నానని శౌర్య అంటుంది. జ్యోత్స్న కాఫీ తాగుతూ.. ఆ దాస్ బ్రతకకూడదని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే దశరత్ వచ్చి జ్యోత్స్న ఇప్పుడు దాస్ గురించి ఆలోచిస్తుందనుకుంటా.. దాస్ త్వరగా కోలుకోవాలని దశరథ్ అనుకుంటాడు. అప్పుడే కాంచన, అనసూయలు శివన్నారాయణ ఇంటికి వెళ్తారు. కాంచనని చూసి దశరథ్ ఎమోషనల్ అవుతాడు. సుమిత్ర ని పిలుస్తాడు. ఎలా ఉండే దానివి ఎలా అయిపోయావని సుమిత్ర బాధపడుతుంది. నాన్న ఎక్కడ అని కాంచన అడుగుతుంది. అపుడే శివన్నారాయణ వచ్చి ఎవరు నువ్వు అంటూ తన మాటల్తో బాధపెడతాడు. నాకు సాయం కావాలని కాంచన అడుగుతుంది. నేను చెప్పాను కదా జ్యోత్స్న.. ఎప్పటికైనా నా దగ్గరికి వస్తారని అని శివన్నారాయణ అంటాడు. శౌర్యకి బాగోలేదు.. ఆపరేషన్ చెయ్యాలి.. లేకపోతే బ్రతకదని కాంచన చెప్పగానే.. అందరు షాక్ అవుతారు. అయ్యో చంటి దానికి నిజంగానే బాగోలేదా అని శివన్నారాయణ అంటాడు. అప్పుడే అదంతా నాటకం తాతయ్య నమ్మకండి.. ఇది దీప ప్లాన్ అంటు శివన్నారాయణకు జ్యోత్స్న నూరిపోస్తుంది. దాంతో జ్యోత్స్న చెప్పేది నిజమనుకుంటాడు శివన్నారాయణ. తను అలా మాట్లాడుతుంటే జ్యోత్స్నపై చెయ్యి ఎత్తుతాడు దశరథ్. నా మనవరాలిని కాపాడమని కాంచన అనగానే.. ఎవరు నీ మనవరాలు.. నీ కొడుకుకి పుట్టిందా అంటూ శివన్నారాయణ మాట్లాడుతుంటాడు. అప్పుడే కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

సంక్రాంతి పోటీలో దారుణం. ధీరజ్ ని పొడిచేసిన రౌడీ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -65 లో..... ధీరజ్, ప్రేమ ఇద్దరు పెళ్లి చేసుకున్న విషయం తెల్సి.. వాళ్ళ కాలేజీ ఫ్రెండ్స్ గుడిలో కలిసి ఆటపట్టిస్తారు. ఇలా చెయ్యండి ఆలా చేయండి అంటూ ఉంటే.. ప్రేమ, ధీరజ్ లకి కోపం వచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఏంటి ఇలా చేస్తున్నారని వాళ్ళ ఫ్రెండ్స్ అనుకుంటున్నారు. అప్పుడే తిరుపతి వచ్చి ఏంటి వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. అలా బిహేవ్ చేస్తున్నారని అనుకుంటున్నారా.. చిరాకు, చిలిపి, తగాధాలు ఉన్నచోటే ప్రేమ ఉంటుందని తిరుపతి వాళ్ళతో చెప్తాడు. అదంతా చూసిన కామాక్షి వీళ్ళ పెళ్లి వెనకాల ఏదో స్కామ్ వుంది అదేంటో కనిపెట్టాలని అనుకుంటుంది. మరొకవైపు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కానీ నువ్వు నన్ను దూరం పెడుతున్నావ్.. శోభనం రోజు నీకు తలనొప్పి లేవలేదు.. నీకు నేను అంటే ఇష్టం లేదని సాగర్ అంటుంటే.. అలా అనకు సాగర్ మా వాళ్ళని వదులుకొని నీ దగ్గరికి వచ్చానని నర్మద అంటుంది. నీకు కారణం చెప్పకూడదనుకున్న కానీ చెప్తానంటూ రామరాజు, వేదవతి లు చందు గురించి మాట్లాడుకున్న విషయం సాగర్ కి చెప్తుంది. బావ గారి గురించి అలోచించి ఇలా చేస్తున్నానని అనగానే.. నర్మదని సాగర్ హగ్ చేసుకుంటాడు. నా కుటుంబం గురించి ఇంత ఆలోచిస్తున్నావని సాగర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ధీరజ్ ఫోన్ మాట్లాడుతుంటే రామరాజు అక్కడ పక్కన ఒకతన్ని పిలుస్తాడు. ధీరజ్ తనను అనుకోని దగ్గరికి వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేస్తాడు కానీ రామరాజు మాట్లాడడు. ఆ తర్వాత సంక్రాతికి కొన్ని పోటీలు పెడతారు. భార్యని ఎత్తుకొని భర్త పరిగెత్తాలిమ అందులో విన్ అయిన వారికి బహుమతి అంటారు. దాంతో ధీరజ్, ప్రేమలని, సాగర్ నర్మదలని పోటీలోకి పంపిస్తుంది కామాక్షి. తరువాయి భాగంలో ఒక రౌడీ వచ్చి ధీరజ్ ని కత్తితో పొడుస్తాడు. ధీరజ్ నాన్న అంటూ గట్టిగా అరుస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

పుష్ప 3 స్టోరీ ఇలా ఉండబోతుందా ?

జబర్దస్త్ సరిపోదా శనివారం ఎపిసోడ్ లో బులెట్ భాస్కర్ స్కిట్ అదిరిపోయింది. పుష్ప 1 , 2 సిరీస్ చూసాం కానీ ఇక్కడ పుష్ప 3 ఎలా ఉండబోతోందో చూపించారు. పుష్ప కార్ యాక్సిడెంట్ లో చనిపోవడం శ్రీవల్లికి ఒక బాబు పుట్టాడు. వాడు పుట్టినదగ్గర నుంచి స్కూల్ కి వెళ్లకుండా సిండికేట్ డీలింగ్స్ చేస్తూ ఉంటాడు. ఇక జూనియర్ పుష్పగా నాటీ నరేష్ అతని తల్లిగా ఫైమా చేసింది. జూనియర్ పుష్పని పిచ్చకొట్టుడు కొడుతోంది. ఇక ఇందులో ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ గా సత్యశ్రీ చేస్తుంది. ఇక ఆమె పుష్ప డీటైల్స్ తీసుకోవడానికి వస్తుంది. వివరాలన్నీ అడుగుతూ ఉంటుంది. "మీకు ఆస్తులు ఉన్నాయా" అని అడుగుతుంది సత్యశ్రీ. దానికి బులెట్ భాస్కర్ రెచ్చిపోయి "బోడుప్పల్ లో రెండు కోట్ల విలువైన బిల్డింగ్ ఉంది..అది కూడా బఫర్ జోన్ లో ఉంది.. రేపో మాపో వాళ్లొచ్చి కూల్చేస్తారు" అన్నాడు. వెంటనే నాటీ నరేష్ భయపడిపోయి " ఒరేయ్ నువ్వు లేనిపోనివి చెప్పకురా...వాళ్ళు నిజంగానే అనుకుని వచ్చినా వస్తార్రా..." అన్నాడు. దీంతో నాటీ నరేష్ నిజంగానే బఫర్ జోన్ లో ఇల్లు కట్టుకున్నాడా అని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. ఎందుకంటే గత ఏడాది తెలంగాణ ప్రభుత్వం బఫర్ జోన్ లో నిర్మించిన నిర్మాణాలను కూల్చేసిన విషయం తెలిసిందే. ఇక ఫైమా ఐతే స్కూల్ లో వెళ్లమంటూ తన్నడం తిట్టడం ఈ స్కిట్ లో హైలైట్ అయ్యింది. నిజంగా ఈ మూవీ డైరెక్టర్ ఇది చూస్తే పుష్ప 3 ని చూసి నవ్వుకోకుండా ఉండడు.  

నా జీవితంలో కలర్ ఫుల్ డేస్ అంటే అవే..

  చలాకి చంటి అంటే చాలు ఒకప్పటి జబర్దస్త్ లో కామెడీ స్కిట్స్ గుర్తొస్తాయి. అప్పటిలో ధన్ రాజ్, చంటి, వేణు వండర్స్ వీళ్లంతా టీమ్ గా ఉండేవాళ్లు. ఇక ఇప్పుడు చంటి అసలు ఎక్కడా కనిపించడం లేదు. ఐతే రీసెంట్ గా నూకరాజు చంటితో చిన్న చిట్ చాట్ చేసాడు. ఆ విషయాలు చూద్దాం.  "నా ఫస్ట్ సినిమా నా ఫస్ట్  యాక్షన్  షాట్ జల్లు అనే మూవీ. నేను, ధన్ రాజ్, చిత్రం శీను, గ్రేట్ కమెడియన్ ఎంఎస్ నారాయణ గారితో కలిసి చేశా. నాకు డైలాగ్ చెప్పాలంటే ఫస్ట్ టైం కదా భయంగా ఉంది. అప్పుడు నారాయణ గారు పక్కకు తీసుకెళ్లి ఫస్ట్ డే ఫస్ట్ షాట్ అందులోనూ క్లోజ్ షాట్ దొరకడం చాల అదృష్టం. సినిమా ఆడినా ఆడకపోయినా ఒక్కసారి ఎవరైనా చూసినా కూడా నువ్వు ఎప్పటికీ ఈ ప్రపంచానికి గుర్తుండిపోతావ్ అన్నారు. అది ఫస్ట్ కలర్ ఫుల్ డే. ఇక జబర్దస్త్ అనే ప్రోగ్రాంలో ఫస్ట్ డే ఫస్ట్ స్కిట్ నేను గెలవడం నేనే కాలు పెట్టి స్టార్ట్ చేయడం అనేది సెకండ్ కలర్ ఫుల్ డే. ఇక నా పెళ్లి థర్డ్ కలర్ ఫుల్ డే. నా పెద్ద కూతురు పుట్టిన రోజు నా ఫోర్త్ కలర్ ఫుల్ డే. వేరే వాళ్ళు మనకు కాంపిటీషన్ అని ఎప్పుడూ అనుకోకూడదు. ఎవరి ట్రాక్ వాళ్ళది. లైఫ్ లో లేటుగా మెట్లెక్కే వాడే లాస్ట్ వరకు నిలబడతాడు. ఇక నాకు రష్మీ అంటే ఇష్టం. రెండేళ్ల క్రితం హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాక డబ్బుల కోసం బాగా ఇబ్బంది ఒక అబ్బాయికి ఫోన్ చేసి హెల్ప్ అడిగితె అబ్బా ఒక గంట ముందు ఫోన్ చేయాల్సింది అన్నాడు అంటే ఇక అతనికి ఫోన్ చేయకూడదు అన్న విషయం తెలుసుకున్నా . అలాంటి శ్యాడ్ డే జీవితంలో ఎవరికీ రాకూడదు అతనికి కూడా రాకూడదు అని ఆ దేవుడిని ప్రార్ధించా" అన్నాడు చలాకి చంటి.

Illu illalu pillalu : నర్మద, సాగర్ ల అనుబంధం.. పెద్దావిడ కళ నెరవేరింది!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -64 లో..... ప్రేమ, ధీరజ్ లతో వేదవతి పూజ చేపిస్తుంది. అది చూసి భద్రవతి, సేనాపతి లు కోపంగా ఉంటారు. వేదవతి తన మేనకోడలి కోసం నెక్లెస్ తీసుకొని వచ్చి తన మెడలో వేస్తుంది. ఇది నీ పెళ్లి కోసం తీసుకున్న కానీ ఇప్పుడు నా కోడలికి నా చేతుల మీదుగా వేస్తున్నానంటూ మురిసిపోతుంది. అదంతా చూస్తున్న పెద్దావిడ హ్యాపీగా ఫీల్ అవుతుంటే.. పక్కనున్న భద్రవతి మాత్రం కోపంతో రగిలిపోతుంది. పెద్దావిడ ప్రేమ, ధీరజ్ ల దగ్గరికి వచ్చి.. నా మనవడు, మనవరాలు అంటూ మురిసిపోతు త్వరగా ఆశీర్వాదం తీసుకోండి.. మళ్ళీ వాళ్ళు వస్తారని అంటుంది. ప్రేమ ధీరజ్ లు పెద్దావిడ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. నర్మద జాతరలో ఏది కొనివ్వమన్నా కూడా సాగర్ చిరాకుపడతాడు ఈ గాజులు బాగున్నాయని నర్మద అంటుంది. చిరాకుగా సాగర్ వెళ్లిపోతాడు.. అదంతా నర్మద పేరెంట్స్ చూస్తారు. వాడు నిన్ను బానే చూసుకుంటున్నాడంటూ కోపంగా మాట్లాడుతారు. లేదు నాన్న సాగర్ నన్ను బాగా చూసుకుంటున్నాడని నర్మద అంటుంది. అయినా మాకెంటి నిన్ను వద్దని అనుకున్నామని వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకు ఇలా చేసావ్ సాగర్ మా వాళ్ళు తప్పుగా అపార్ధం చేసుకొని.. నేను హ్యాపీగా లేనని బాధపడుతున్నారని నర్మద అనుకుంటుంది. అటుపక్కన తిరిగి చూసేసరికి నర్మదకి ఇష్టమైన గాజులు ఎవరో తీసుకుంటే.. అవి మా భార్యకి నచ్చాయి పెళ్లి అయ్యాక నేను ఇచ్చే మొదటి గిఫ్ట్ ఇవ్వండి అని వాళ్ళని రిక్వెస్ట్ చేసి గాజులు తీసుకుంటాడు. అదంతా చూసిన నర్మద.. సాగర్ దగ్గరికి వచ్చి నాకు తెలుసు నేను బాధపడితే చూడలేవని అంటుంది. నర్మద చేతికి సాగర్ గాజులు తొడుగుతాడు. ప్రేమ, ధీరజ్ ల క్లాస్ మేట్స్ అక్కడికి వస్తారు. మీరు పెళ్లి చేసుకున్నారా ఆ విషయం మాకు చెప్తే మేమే చేసేవాళ్ళం కదా అని ఆటపట్టిస్తారు. ఇద్దరు కలిసి ఫోటో తీసుకోండి అంటూ ప్రేమపై చెయ్ వెయ్ ఇలా దిగండి.. అలా దీగండి అంటూ ఫొటోస్ తీస్తుంటే ప్రేమ ధీరజ్ లు ఇబ్బందిపడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : ఆపరేషన్ చేస్తే గానీ శౌర్య బ్రతకదు.. తల్లిపై పడి ఏడ్చేసిన కార్తీక్ బాబు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -263 లో...శౌర్య దగ్గరికి వెళదామన్న దీపని ఏదో ఒకటి చెప్పి కార్తీక్ ఆపుతాడు. ఈ టైమ్ కి శౌర్య తిని పడుకుంటుంది. మనం భోజనం చేద్దామని దీపతో కార్తీక్ అంటాడు. మరుసటిరోజు కార్తీక్ కి హాస్పిటల్ నుండి ఫోన్ వస్తుంది. ఫిఫ్టీ పెర్సెంట్ అమౌంట్ ఈ రోజే పే చేయాలని చెప్తారు. సరే కట్టేస్తామని కార్తీక్ అంటుంటే.. అపుడే దీప వచ్చి ఎవరికి డబ్బు కట్టాలని అడుగుతుంది. అదేం లేదు ఇప్పుడు నన్నేం అడగొద్దని కార్తీక్ చెప్పి వెళ్ళిపోతాడు. అది చూసిన అనసూయ కార్తీక్ దగ్గరికి వెళ్లి.. శౌర్య ఎలా ఉందని అడుగుతుంది. మీరు ఏదో దాస్తున్నారని అనసూయ అనగానే శౌర్య బాగుంది ఇలా అడగకండి దీప వింటుందని కార్తీక్ అంటాడు. కార్తీక్ డబ్బు కోసం ఫైనాన్స్ ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఏదైనా ఆస్తులు తాకట్టు పెడితేనే ఇస్తామని అంటారు. అలా చాలా చోట్ల అప్పు కోసం తిరుగుతాడు చివరికి హాస్పిటల్ కి వెళ్తాడు. కాశీ తో మాట్లాడి లోపలున్న శౌర్య దగ్గరికి వెళ్తాడు. శౌర్యా నిద్ర పోతూ ఉంటుంది. నిన్ను ఎలాగైనా కాపాడుకుంటానని కార్తీక్ అనుకుంటాడు. నువ్వు ఇంటికి వెళ్ళమని కాశీతో కార్తీక్ అంటాడు స్వప్నకి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళానని చెప్తానని కాశీ అంటాడ.  కానీ నువ్వు వెళ్ళమని కాశీని ఇంటికి పంపిస్తాడు కార్తీక్. ఆ తర్వాత కార్తీక్ చీకట్లో ఒక దగ్గర ఆగి అందరు అప్పు ఇవ్వనన్న విషయం గుర్తుచేసుకొని గట్టిగ అరుస్తూ ఉంటాడు. ఆ తర్వాత అనసూయ, కాంచన లు బయట కూర్చొని ఉంటారు. అక్కడ కార్తీక్ చీకట్లో ఉండడం చూసి కాంచన పిలుస్తుంది. ఏమైందిరా శౌర్యని ఏ హాస్పిటల్ జాయిన్ చేసావని కాంచన అనగానే కార్తీక్ చిన్నపిల్లాడిలాగా కాంచనపై పడి ఏడుస్తాడు. శౌర్యకి ఆపరేషన్ చేయకుంటే బ్రతకదు.. అందుకే హాస్పిటల్ లో అడ్మిట్ చేశానని జరిగింది మొత్తం కాంచన అనసూయలకి చెప్పగానే వాళ్లు బాధపడతారు. అప్పుడే దీప వస్తుంది. అంత దీప వినేసిందని అనుకుంటారు కానీ దీప వినదు. నన్ను శౌర్య దగ్గరికి తీసుకొని వెళ్లమని అంటున్నా తీసుకొని వెళ్లట్లేదని దీప అంటుంది. కార్తీక్ డైవర్ట్ చేస్తూ వేడి నీళ్లు పెట్టు అంటూ లోపలికి వెళ్తాడు. మీరేం చెప్పరని కాంచన, అనసూయలతో దీప అంటుంది. దీప లోపలికి వెళ్ళిపోయాక కాంచన, అనసూయలు శౌర్య గురించి బాధపడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : భద్రం కోసం సీతాకాంత్ చేసిన ప్లాన్ ఫెయిల్.. సవతి తల్లి పట్టేసిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -310 లో.. రామలక్ష్మి, సీతాకాంత్ లు కలిసి లైవ్ ప్రోగ్రామ్ చేస్తారు. అందులో భద్రం ఫోటో చూపించి ఇతన్ని కలిసి సెల్ఫీ తీసుకొని పంపినవారికి తన చేత మీకు పెట్టుబడి పెట్టిస్తానంటూ సీతాకాంత్ చెప్తాడు. దాంతో కొంతమంది భద్రాన్ని వెతకాలని అనుకుంటారు. ఆ ప్రోగ్రాం అంత శ్రీలత వాళ్ళు చూస్తారు. బావగారి తెలివి మాములుగా లేదు కదా.. ఈ దెబ్బతో ఆ భద్రం గాడు దొరకడం ఖాయమంటూ శ్రీవల్లి అంటుంది. పాపం సీతాకాంత్.. నా గురించి వెతుక్కుంటున్నాడు కావచ్చు కానీ ఫోన్ స్విచాఫ్ చేసి రెండు రోజులు అవుతుందని భద్రం అనుకుంటాడు. అప్పుడే శ్రీలత మనిషి వచ్చి.. డోర్ కొడతాడు. భద్రం బయటకు వెళ్ళగానే భద్రo చూడకుండా లోపలికి వెళ్తాడు. ఎవరు లేరు కదా అని భద్రం లోపలికి రాగానే అతను ఎదరు పడతాడు. ఎవరు నువ్వు అని భద్రం అడుగగా.. నీ శత్రువు శత్రువుని అని అతను అంటాడు. అంటే నా మిత్రడివా అని భద్రం అంటాడు. అప్పుడే శ్రీలత ఫోన్ చేయడంతో బయటకి వచ్చి మాట్లాడతాడు. మళ్ళీ లోపలికి వెళ్లి.. నువ్వు ఇక్కడ ఉండడం సేఫ్ కాదు నాతో రా అని భద్రాన్ని తీసుకొని వెళ్తాడు. ఇంకా ఎవరు భద్రం గురించి కాల్ చెయ్యడం లేదని రామలక్ష్మి సీతాకాంత్ లు చూస్తారు. రామలక్ష్మి తన బస్తీలోని ఆడవాళ్లకి భద్రం ఫోటో చూపించి కన్పిస్తే చెప్పండి అని చెప్తుంది. రామలక్ష్మి సీతాకాంత్ లు భోజనం చేస్తుంటే శ్రీలత ఫోన్ చేసి.. ఆ భద్రం గాడు మీకు దొరకడు నా దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగమని శ్రీలత అంటుంది. ఆ తర్వాత సిరి వచ్చి శ్రీలతకి చివాట్లు పెడుతుంది. ఆ తర్వాత బస్తీలోని ఆడవాళ్లు రామలక్ష్మి వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు చెప్పిన అతను ఎక్కడ కన్పించలేదని చెప్పడంతో రామలక్ష్మి, సీతాకాంత్ లు డిస్సపాయింట్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : కలిసిపోయిన రాజ్, కావ్య.. ఇక ఇన్వెస్టిగేషన్ మొదలు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -627 లో.... కావ్యని రుద్రాణి తిడుతుంటే చూడలేక రాజ్ నిజం చెప్పాలని ప్రయత్నం చేయగా కావ్య వద్దని ఆపుతుంది. అవసరం ఉండి గెస్ట్ హౌస్ తాకట్టు పెట్టి పది కోట్లు అప్పు తీసుకున్నానని కావ్య చెప్తుంది.. చూసారా ఎలా చెప్తుందో వదిన.. నీ కొడుకుని డమ్మీని చేసి ఆడిస్తుందని అపర్ణతో రుద్రాణి అంటుంది. నువ్వు అగు రుద్రాణి, కావ్య ఎందుకు అలా చేసిందో కనుక్కుంటా అని సుభాష్ అంటాడు. ఎందుకు ఇలా చేసావ్ అని కావ్యని సుభాష్ అడుగుతాడు. తాతయ్య గారు ఆస్తులన్నీ నా పేరున రాశారని, అవి తాకట్టు పెడతాను లేదా అమ్ముకుంటాను.. అడిగే అధికారం ఇంట్లో ఎవరికి లేదని కావ్య కఠినంగా మాట్లాడేసరికి అందరు షాక్ అవుతారు. అపర్ణ అయితే ఏకంగా మీ మావయ్యని అలా అంటావా అంటూ కావ్యపై చెయ్ ఎత్తుతుంది. దాంతో సుభాష్ ఆపుతాడు. కావ్య పైకి వెళ్ళాక చూసారా మన వంశాన్ని బ్రష్టు పట్టించడానికి వచ్చిందని రుద్రాణి అంటుంది.  గదిలోకి వెళ్ళాక నాపై కోపంగా ఉందా అని రాజ్ ని కావ్య అడుగుతుంది. లేదు మన నిస్సహాయతపై కోపంగా ఉంది. నందగోపాల్ మీద కోపంగా ఉంది అంటూ కావ్యతో పాజిటివ్ గా మాట్లాడతాడు రాజ్. నీ భర్తగా ఇక నువ్వు బాధపడకుండా చూసుకుంటానని రాజ్ అనగానే కావ్య ఎమోషనల్ అవుతూ రాజ్ ని హగ్ చేసుకుంటుంది. మరొకవైపు నిన్ను ఆ అనామిక అలా అంది అంటూ అప్పుతో చెప్తూ కళ్యాణ్ బాధపడతాడు. భోజనం చెయ్యడు. దాంతో నేను కూడా భోజనం చెయ్యను. రేపు వెళ్ళాలి గుర్తుంచుకోమని అప్పు అనగానే కళ్యాణ్ భోజనం చేస్తాడు. కావ్య తనతో అలా మాట్లాడినందుకు సుభాష్ బాధపడుతుంటాడు. అప్పుడే ప్రకాష్ వచ్చి నాకు అవమానం జరిగితే.. నువ్వు ఉన్నావ్ అనుకున్న కానీ ఈ రోజు నీక్కూడా జరిగిందని ప్రకాష్ అంటాడు. అదంతా కావ్య వింటుంది. తరువాయి భాగంలో అందరూ భోజనం చేస్తుంటారు. అపర్ణ, సుభాష్ లు రాకపోవడంతో ఎలా వస్తారు.. అంత అవమానం జరిగినా తర్వాత అని రుద్రాణి అంటుంది. నందగోపాల్ ని ఎవరు షూట్ చేశారు. వాడు బ్రతికి ఉంటే ఎవరికి నష్టం దీని వెనకాల ఎవరో ఉన్నారని రాజ్ తో కావ్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu : భార్య నుదుటిన తిలకం దిద్దిన ధీరజ్.. వేదవతా మజాకా!

    స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -63 లో.....నేను ఒక ఆడపిల్ల జీవితం కాపాడడం కోసం మాత్రమే పెళ్లి చేసుకున్నాను.. ఇప్పుడు నాపై మీకు ఇంకా ద్వేషం పెరిగింది. ఇది నేను భరించలేకపోతున్నాను.. ఎప్పటికైనా ద్వేషం తగ్గి అర్థం చేసుకుంటారని ఎదురుచూస్తుంటాను నాన్న అని ధీరజ్ అనుకుంటాడు. ఆ కళ్యాణ్ నమ్మి వెళ్లినందుకు నాకు ఇంత పెద్ద శిక్ష వేసావ్ దేవుడా అంటు దేవుడికి మొక్కుకుంటుంది ప్రేమ. ప్రేమ దగ్గరున్నా కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నానని సేనాపతి బాధపడతాడు. ఎందుకు ఏడుస్తున్నావని సేనాపతిని భద్రవతి అడుగుతుంది. నా కూతురిని కళ్ళలో పెట్టుకుని చూసుకున్నందుకు తను ఇచ్చిన బహుమానమని సేనాపతి అంటాడు. ఎందుకు బాధపడుతున్నారు వెళ్ళాల్సిన ఇంటికి కోడలుగా వెళ్ళిందని పెద్దావిడ అంటుంది. అప్పుడే విశ్వ వచ్చి మీరేం బాధపడకండి.. చెల్లి మన ఇంటికి త్వరలోనే వస్తుందని అనగానే.. ఏంటి నిన్నటి నుండి ఇలాగే మాట్లాడుతున్నావ్.. వాళ్ళతో గొడవపెట్టుకుంటావా ఏంటని రేవతి అడుగుతుంది. మరోవైపు నర్మద జాతరలో ఏదైనా కొనివ్వమని సాగర్ ని అడుగుతుంది. సాగర్ చిరాకు పడుతుంటే.. నాకు తెలుసు సాగర్ నిన్ను దూరంగా ఉంచుతున్నానని కోపంగా ఉన్నావని కానీ కారణం ఎలా చెప్పాలని నర్మద అనుకొని.. సాగర్ వెంటపడుతు కొన్నివ్వమని అడుగుతుంది. ఏంటి రా అని చందు అడుగగా.. నాకు జాతరలో కోనివమంటే కొనట్లేదని నర్మద చెప్తుంది. కొనివ్వచ్చు కదా అని చందు, తిరుపతి అంటారు. తిరుపతి డబ్బులు తీసి సాగర్ కి ఇచ్చి.. ఏదైనా కోనివ్వమని చెప్తాడు. ఆ తర్వాత ఇకనుండి మీ భార్యాభర్తల జీవితం మొదలు పెట్టండి. పూజ చెయ్యండి అని ప్రేమ, ధీరజ్ లకి వేదవతి చెప్తుంది. వాళ్ళు ఒప్పుకోకపోవడంతో వేదవతి ఒప్పించి ఇద్దరిచే పూజ చేపిస్తుంది. అది భద్రవతి కుటుంబం చూసి కోపంతో రగిలిపోతుంటారు. తరువాయి భాగంలో ధీరజ్ దగ్గరికి విశ్వ వచ్చి బావ అంటూ మాట్లాడతాడు. ధీరజ్ పై ఎటాక్ చెయ్యడానికి రౌడీ రెడీగా ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : తెలివిగా సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసిన జ్యోత్స్న.. శౌర్య కోసం ఎమోషనల్ అయిన దీప!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -262 లో.....పోలీసుల ఎంక్వయిరీ లో నేనే దాస్ ని కొట్టానని తెలుస్తుందా అని జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. అప్పుడే పోలీసులు ఇంటికి వస్తారు. దాంతో జ్యోత్స్న టెన్షన్ మరింత పెరుగుతుంది. దాస్ గురించి కంప్లైంట్ ఇచ్చారు కదా అని ఇన్‌స్పెక్టర్ అనగానే.. అవును వాడు నా కొడుకు అని పారిజాతం అంటుంది. తనకి అయిన దెబ్బలు చూస్తుంటే అవి ఆక్సిడెంట్ అయిన దెబ్బలు లాగా లేవు.. ఎవరో బలవంతం గా కొట్టినట్లు ఉందని ఇన్‌స్పెక్టర్ అనగానే.. అందరు షాక్ అవుతారు. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా తన ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేస్తే చివరగా ఇక్కడ చూపించింది. తర్వాత సిగ్నల్ చూపించలేదని ఇన్‌స్పెక్టర్ అంటాడు. అతను చివరగా ఇక్కడికి వచ్చాడని ఇన్‌స్పెక్టర్ అనగానే లేదు ఇంటికి రాలేదని శివన్నారాయణ‌ అంటాడు. అవును వాడు రాలేదని పారిజాతం కూడా చెప్తుంది. అయితే ఒకసారి సీసీటీవీ పూటేజ్ చూపించండి అని ఇన్‌స్పెక్టర్ అనగానే ఇప్పుడు జ్యోత్స్న దొరికిపోతుంది అని దశరథ్ టెన్షన్ పడతాడు. మరొకవైపు దీప గుమ్మం దగ్గర ఉండి బాధపడుతుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు. శౌర్య గురించి దీప అడుగుతుంటే కార్తీక్ కవర్ చెయ్యలేక ఇబ్బంది పడుతాడు. మరోవైపు సీసీటీవీ ఫుటేజ్ లో దాస్ ఇంటికి వచ్చిన రోజు ఫుటేజ్ మిస్ అవుతుంది. అదేంటీ ఫుటేజ్ లేదని ఇన్‌స్పెక్టర్ అడుగగా.. నేనే డిలీట్ చేసాను అని జ్యోత్స్న తన మనసులో అనుకుంటుంది. సిస్టమ్ రిపేర్ కి ఇచ్చానని జ్యోత్స్న చెప్పగా.. సరేనని ఇన్‌స్పెక్టర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు.  చాలా తెలివిగా భయటపడ్డావని దశరథ్ అనుకుంటాడు. నువ్వే ఈ తప్పు చేసావని నాకు తెలుసు కానీ నాకూ తెలుసన్న విషయం నీకు తెలియదని దశరథ్ అనుకుంటాడు. దీప అందరికి భోజనం పెడుతుంది. శౌర్య త్వరగా రా అంటుంది. శౌర్యా లేదని కార్తీక్ గుర్తు చెయ్యడంతో దీప ఎమోషనల్ అవుతుంది. నాకు శౌర్యని చూడాలని ఉంది.. పదండి వెళదామని దీప అంటుంటే.. కార్తీక్ కి ఏం చెప్పాలో అర్థం కాదు. తను తినేసి పడుకుండి ఉంటుందని కార్తీక్ అంటాడు. నమ్మకం లేకపోతే ఫోన్ చేయమని కార్తీక్ అంటాడు. ఏదో అలా చెప్పాను. ఇప్పుడు ఫోన్ తీసుకొని కాల్ చేస్తే పరిస్థితేంటని కార్తీక్ టెన్షన్ పడులతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : లైవ్ లో భద్రం గురించి చెప్పిన సీతాకాంత్.. అది జరిగేనా!

    స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -309 లో..... ధన, సందీప్ లు చేసిన పనికి సీతాకాంత్ జనాలతో రాళ్ల దెబ్బలు పడ్డాడు. దాంతో పట్టరాని కోపంతో రామలక్ష్మిని తీసుకొని శ్రీలత ఇంటికి వెళ్తాడు సీతాకాంత్. బెల్ట్ తీసుకొని ధన, సందీప్ లని చితక్కొట్టుడు కొడుతాడు. నీకేం అధికారం ఉందని నా కొడుకు అల్లుడిని కొడుతున్నావని చెప్పి సీతాకాంత్ ని ఆపుతుంది శ్రీలత. వాళ్లేం చేసారో తెలుసా అని సీతాకాంత్ అనగా.. ఏం చేసిన సరే వాళ్ళని కొట్టే అధికారం లేదు.. వాడు నా కొడుకు అని శ్రీలత అంటుంటే.. సీతాకాంత్ షాక్ అవుతాడు. మీరు ఆస్తులు బాగా చూసుకుంటారనే కదా మీకు రాసిచ్చింది. ఇప్పుడు కంపెనీకి నాకు బ్యాడ్ నేమ్ తీసుకొని వస్తుంటే ఎలా ఊరుకుంటానని సీతాకాంత్ అంటాడు. దాంతో సీతాకాంత్ బాధపడేలా శ్రీలత మాట్లాడేసరికి సీతాకాంత్ వెళ్లిపోతాడు. భద్రం మాత్రం సీతాకాంత్ ని జనాలు రాళ్లతో కొట్టిన వీడియో చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరొకవైపు సందీప్ కి శ్రీవల్లి దెబ్బలకి మందు రాస్తుంది. ధన దగ్గరికి సిరి వచ్చి మందు రాయాలా అని అడుగుతుంది. అప్పుడు ఇంకా కొట్టమని చెప్పి ఇప్పుడు ఇలా అంటున్నావా అని ధన కోప్పడతాడు. మీరు నా డెలివరీ వరకు మారలేదో నేను మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతానంటూ సిరి అందరికి జలక్ ఇస్తుంది. ఆ తర్వాత శ్రీలత ఒకతనికి ఫోన్ చేసి మాట్లాడుతుంది. సీతాకాంత్ ఇంటికి వచ్చి కొట్టిన విషయం చెప్తుంది. వాడికి మూడు రోజుల టైమ్ ఉంది. ఈ లోపు భద్రం గాడు వాడి కంటపడకూడదు. సీతాకాంత్ రామలక్ష్మి గురించి తక్కువ అంచనా వెయ్యకని అతనితో శ్రీలత చెప్తుంది. సీతాకాంత్ జరిగింది గుర్తు చేసుకొని బాధపడుతుంటాడు. అది డైవర్ట్ చెయ్యడానికి రామలక్ష్మి ట్రై చేస్తుంది. మరుసటిరోజు ఉదయం అప్పుడే సన్నీ వచ్చి లైవ్ ప్రోగ్రాం చేద్దామని అంటుంది. వద్దని సీతాకాంత్ అనగానే.. చేద్దాం ఇలా లైవ్ లో భద్రం గురించి చెప్దామని రామలక్ష్మి అంటుంది. దాంతో సీతాకాంత్ సరే అంటాడు. లైవ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. మీరు వ్యాపారం చెయ్యాలనుకుంటున్నారా.. మీకు ఇతను పెట్టుబడి పెడతాడంటూ భద్రం ఫోటో చూపిస్తాడు. అతన్ని కలిసి అతనితో సెల్ఫీ తీసుకొని నాకు పంపిస్తే మీకు అతను పెట్టుబడి పెట్టెలా.. నేను చేస్తానని అనౌన్స్ మెంట్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : భార్యని అర్థం చేసుకున్న భర్త.. ఇదే కదా సరికొత్త బ్రహ్మముడి!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -626 లో.... రుద్రాణి ధాన్యలక్ష్మి లు గెస్ట్ హౌస్ తాకట్టు గురించి అడుగగా.. వచ్చాక చెప్తామని వాళ్ళతో రాజ్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్తాడు. ఇక రాజ్ , కావ్య నందగోపాల్ ని వెతుక్కుంటూ వెళ్తారు. అక్కడున్న రౌడీలని కావ్య తన ఎమోషనల్ మాటలతో గొడవ చేయకుండా ఆపుతుంది. వాళ్లు ఆగితే ఏంటి నేనున్నాను కదా అంటూ నందగోపాల్ రాజ్ ని కొట్టబోతాడు. దాంతో రాజ్ వాడిని కొడతాడు బయటకు పరిగెడుతుంటే చుట్టూ పోలీసులు వచ్చి చేరుతారు. నంద గోపాల్ కి తప్పించుకునే ఛాన్స్ ఉండదు. రాజ్, కావ్య లు హ్యాపీగా ఫీల్ అవుతారు. నంద గోపాల్ ని పోలీసులు తీసుకొని వెళ్తుంటే.. అప్పుడే ఒకతను బైక్ పై వచ్చి నంద గోపాల్ ని షూట్ చేసి పారిపోతాడు. కంగారు గా రాజ్ కావ్యలు వాడి దగ్గరికి పరిగెత్తకుంటూ వస్తారు. వీడు చనిపోయాడని పోలీసులు చెప్పగానే రాజ్, కావ్య షాక్ అవుతారు. మీరు త్వరగా ఇక్కడ నుండి వెళ్లిపోండి మీడియావాళ్ళు వస్తారని రాజ్ ఫ్రెండ్ అయిన పోలీస్ రాజ్ కి చెప్తాడు. దాంతో కావ్యని తీసుకొని రాజ్ బయల్దేరతాడు. ఎప్పుడెప్పుడు రాజ్, కావ్యలు వచ్చి నిజాలు భయటపెడుతారోనని రుద్రాణి ధాన్యలక్ష్మి ఇద్దరు వెయిట్ చేస్తుంటారు. ఇంటికి వస్తూ రాజ్ కావ్య ఇద్దరు టెన్షన్ పడతారు. అసలు ఇలా జరుగుతుంది అనుకోలేదు. అనవసరంగా ఇంట్లో వాళ్ళకి జరిగింది చెప్తానని చెప్పేశాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే భయంగా ఉందని రాజ్ టెన్షన్ పడతాడు. అందుకే అలా తొందరపడి మాటివ్వకూడదని కావ్య అంటుంది. ఇంట్లో అందరు కావ్య, రాజ్ కోసం చూస్తుండగా.. వాళ్లు ఎంట్రీ ఇస్తారు. ఇక చెప్పండి అసలేం జరిగింది.. ఎందుకు ఆస్తులన్నీ తాకట్టు పెడుతున్నారని ధాన్యలక్ష్మి నిలదీస్తుంది. ఇప్పుడేం చెప్పలేమని కావ్య అనగానే.. ఇదొక నాటకమంటూ రుద్రాణి అంటుంది. నా భార్యని ఎందుకు అలా అంటారు. మీ కోసం కాదు.. మా అమ్మ, నాన్నల కోసమైనా నిజం చెప్తాను.. నిజాన్ని విని తట్టుకునే ధైర్యం మీకుందా అని రాజ్ నిజం చెప్పబోతుంటే.. కావ్య ఆపుతుంది. తరువాయి భాగంలో మావయ్య గారికి ఎదురు మాట్లాడానని కావ్య ఎమోషనల్ అవుతుంటే.. నువ్వు బాధపడకు నీ గురించి నాకు పూర్తిగా అర్థమైంది.. నువ్వు బాధపడకుండా ఇక నేను చూసుకుంటానని రాజ్ అంటాడు. దాంతో రాజ్ ని కావ్య హగ్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu : ఉత్సవాల్లో రెండు కుటుంబాలు.. అతడిని చంపడానికి రౌడీలని సెట్ చేసిన విశ్వ!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -62 లో..... రామరాజు ఊళ్ళో తన పరువు పోయిందని సంక్రాతి ఉత్సవాలకి వద్దు అంటాడు. దాంతో ఇంట్లో వాళ్ళందరూ తనని ఒప్పిస్తారు. ఆ తర్వాత విశ్వ తన చెల్లిని మోసం చేసి ధీరజ్ పెళ్లి చేసుకున్నాడని కోపం తో కొంతమంది రౌడీలని కలిసి దీరజ్ ఫోటో చూపించి చంపమని చెప్తాడు. ఆ తర్వాత ఇరు కుటుంబాలు సంక్రాతి ఉత్సవాలకి వస్తారు. ఇద్దరు ఎదురు పడతారు. ప్రేమ తన పుట్టింటి వాళ్ళను చూసి బాధపడుతుంది. సేనాపతి కన్నకూతురిని చూసి ఎమోషనల్ అవుతాడు. రెండు కుటుంబాలు కలిసి వస్తుంటే ఒకతను రెండు కుటుంబాలు కలిసి పోయాయి అంటుంటే.. అది ఎప్పటికి జరగదు అని సేనాపతి అంటాడు. మరి అటు ఉండాల్సిన మీ కూతురు ఇటు ఉంది కదా అని అతను అంటుంటే.. భద్రవతికి కోపం వస్తుంది. దాంతో అతని చెంపచెల్లుమనిపిస్తుంది. అతను తిక్కతిక్కగా మాట్లాడుతుంటే.. రామరాజు కూడా అతని చెంపచెల్లుమనిపిస్తాడు.ఆ తర్వాత విశ్వ రౌడీలని సెట్ చేసి పెడతాడు. రామరాజు కుటుంబం పూజరి దగ్గరికి వెళ్లి అర్చన చేపిస్తారు. నర్మద, సాగర్ ల పేర్లు చెప్తాడు. దాంతో మనపై కోపం పోయిందని నర్మద, సాగర్ లు హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ ప్రేమ, ధీరజ్ ల పేర్లని రామరాజు చెప్పడు. దాంతో వేదవతి చూసి ప్రేమ, ధీరజ్ లా పేర్లు చెప్తుంది. తరువాయి భాగంలో మీకు ఇష్టం లేకున్నా ఇకనుండి మీరు భార్యాభర్తలు ఈ పూజ చెయ్యండి అంటూ వేదవతి దగ్గర ఉండి ప్రేమ, ధీరజ్ లచే పూజ చేయిస్తుంది. అది భద్రవతి కుటుంబం చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : శౌర్యని హాస్పిటల్ కి తీసుకొచ్చిన కార్తీక్.. ఏదో దాస్తున్నాడు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -261 లో.... కార్తీక్ హాస్పిటల్ కి వెళ్తాడు. శౌర్యని ఈ రోజే హాస్పిటల్ లో అడ్మిట్ చెయ్యమని చెప్తాడు. దాంతో కార్తీక్ ఇంటికి వెళ్లి శౌర్యని తన ఫ్రెండ్ ఇంట్లో ఉంచుతున్నానని దీపకి చెప్తాడు. దాంతో దీపకి ఇష్టం లేకున్నా బట్టలు సర్దుతు ఉంటుంది. కార్తీక్ డబ్బు తీసుకుంటుంటే ఇప్పుడు డబ్బు ఎందుకని దీప అడుగగా.. ఫ్రెండ్ కి ఇవ్వాలని కార్తీక్ అంటాడు. కానీ దీప డౌట్ గానే ఉంటుంది. శౌర్యని విడిచి ఉండలేను. నేను రానని చెప్పు శౌర్య అని దీప అంటుంది. నాన్నతో వెళ్తాను అమ్మ అని శౌర్య చెప్తుంది. శౌర్య, దీప ఇద్దరు ఎమోషనల్ అవుతారు. శౌర్యని తీసుకొని సైకిల్ పై హాస్పిటల్ కి బయల్దేరతాడు కార్తీక్. దారిలో గుడి దగ్గర ఆగి శౌర్యా, కార్తీక్ ఇద్దరు మొక్కుకుంటారు. మనం ఇప్పుడు వెళ్ళేది ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కాదు.. నేను ఒక ప్లేస్ కి తీసుకొని వెళ్తానని కార్తీక్ చెప్పగానే శౌర్యా సరే అంటుంది. అనసూయ, కాంచన ఇద్దరు కార్తీక్ గురించి మాట్లాడుకుంటారుమ చిన్నప్పుడు కార్తీక్ చేసిన మంచి పనిని అనసూయకి చెప్తుంది కాంచన. అందుకే కార్తీక్ ఏం చేసినా దాని వెనక ఒక కారణం ఉంటుంది. అందుకే నేను అడ్డు చెప్పనని కాంచన అంటుంది. ఇప్పుడు కార్తీక్ బాబు శౌర్య గురించి ఏదో దాస్తున్నాడు. తను ఒక్కడే ఆ బాధను భరిస్తున్నాడని అనసూయ అంటుంది. మరోవైపు శౌర్యని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాడు కార్తీక్. అక్కడ కాశీ ఉంటాడు. శౌర్యా వారం రోజులు నువ్వు ఇక్కడే ఉండాలి. ఇప్పుడు రోజు టాబ్లెట్ వేసుకుంటున్నావ్ కదా ఇక వేసుకునే అవసరం ఉండదని కార్తీక్ చెప్పగానే.. శౌర్య సరే అంటుంది. ఈ విషయం అమ్మ కి చెప్పొద్దూ.. నేను కాశీ మావయ్య ఉంటామని కార్తీక్ చెప్తాడు. దానికి శౌర్య సరే అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.