Brahmamudi : సామంత్, అనామికకి వార్నింగ్.. ఆస్తి పంపకం వద్దని పెద్దాయన డెసిషన్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -647 లో..... టైం కి అప్పు నందగోపాల్ ని తీసుకొని రావడం తో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అందుకు సీతారామయ్య అప్పుకి థాంక్స్ చెప్తాడు. ఇదంతా చేసింది ఎవరో కాదు.. ఆ అనామిక, సామంత్ లు అని అప్పు అంటుంది. వాళ్ళ సంగతి చెప్తానంటూ రాజ్ కోపంగా వెళ్తుంటే.. కావ్య వెనకే వెళ్తుంది. మరొకవైపు సామంత్ తో ప్రాజెక్ట్ డీలింగ్ పెట్టుకోవడానికి వేరొక కంపెనీ నుండి ఇద్దరు వస్తారు. సామంత్ గదిలో ఉండగా అనామిక వెళ్లి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు పదా అని అంటుంది. అయిదు కోట్లు అప్పు చేసి వాళ్ళని ఇక్కడికి రప్పించాను కానీ ఇప్పుడు వాళ్ళు ఒకే అంటారో లేదో అని సామంత్ టెన్షన్ పడుతుంటే.. వాళ్ళు ఒప్పుకుంటారు. నేను అంతా చూసుకుంటానని అనామిక అంటుంది. అప్పుడే ఎవరో ఫోన్ చేసి నందగోపాల్ రాజ్ కి దొరికాడని చెప్పగానే సామంత్ షాక్ అవుతారడు. ఆ విషయం అనామికకి చెప్పగానే తను షాక్ అవుతుంది. అలా ఎలా జరిగిందని అనామిక అంటుంది. ఆ రాజ్ అసలు ఊరుకోడని సామంత్ టెన్షన్ పడుతుంటే.. అది తర్వాత చూసుకుందాం ముందు వాళ్ళు వెయిట్ చేస్తున్నారని అనామిక సామంత్ ని కిందకి తీసుకుని వెళ్తుంది. వాళ్ళతో డీలింగ్ మాట్లాడుతుంటే.. అప్పుడే రాజ్ వచ్చి సామంత్ ని కొడతాడు. నీ కంపెనీ కొనే ఛాన్స్ వచ్చినా నేను కొనలేదు కానీ ప్రతిసారీ ఇలానే చేసావని రాజ్ అంటుంటే.. సామంత్ ని వదులు అంటూ అనామిక అంటుంది. దాంతో తనపై కూడ రాజ్ కోప్పడతాడు. అనామిక చెంప చెల్లుమనిపిస్తుంది కావ్య. ఇద్దరికి రాజ్, కావ్య వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు. మీరు ఏదో మంచి వారు అనుకున్నాము కానీ ఇలాంటి వారని తెలియదంటూ డీలింగ్ కి వచ్చిన వాళ్ళు వద్దని వెళ్ళిపోతారు. దాంతో సామంత్ ఇంకా అవమానంగా ఫీల్ అవుతాడు. మరొకవైపు అప్పు చేసిన పనికి కళ్యాణ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. రాజ్, కావ్య ఇంటికి వస్తారు. ఇన్ని రోజులు వీళ్ళని తప్పుగా అర్థం చేసుకున్నామని అపర్ణ అంటుంది. నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఆస్తులు వాటాలు పంచాలనుకుంటున్నానని సీతారామయ్య అంటాడు. వద్దని కావ్య అంటుంది. ముసలోడు మంచి నిర్ణయం తీసుకున్నాడని రుద్రాణి అనుకుంటుంది. నన్ను క్షమించండి నాన్న.. అందరం కలిసి ఉందామని సీతారామయ్య కాళ్ళ పై పడి అడుగుతాడు ప్రకాష్. తరువాయి భాగంలో అప్పు, కళ్యాణ్ లు తిరిగి ఇంటికి వస్తారు. వాళ్ళకి కావ్య హారతి ఇచ్చి ఆహ్వానిసిస్తుంది. ఇక ఈ చీడపురుగులు అయిన రాహుల్, రుద్రాణి లని ఇంట్లో నుండి పంపేద్దామని ఇందిరాదేవి అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

నందగోపాల్ ని పట్టుకున్న అప్పు.. ఆస్తులు పంచిస్తానన్న సీతారామయ్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -646 లో.....దుగ్గిరాల ఇంట్లోని వారందరూ నగలు తీసుకొని హాల్లో పెడతారు. కావ్య పక్కకి వెళ్లి అప్పుకి ఫోన్ చేసి ఆ నందుగాడు దొరికాడా అని అడుగుతుంది.. ఇప్పుడే అక్కడికి వెళ్తున్నామని అప్పు చెప్తుంది. అందరు నగలు పెడతారు కానీ రుద్రాణి ఒక్కతే నగలు దాచుకుంటుంది. వెళ్లి తీసుకొని రా అంటూ అందరు అంటారు. నేను తీసుకొని రాను.. అసలు మాటకి వస్తే నాకు నగలు లేవని రుద్రాణి అంటుంది. తాతయ్య గారు నీ పెళ్లికి చాలానే నగలు పెట్టారంట కదా..మర్యాదగా తీసుకొని రా అని స్వప్న అంటుంది. నాకేం నగలు లేవు.. నాకు ఈ ఇంటికి ఏం సంబంధం లేదు.. నా వంశం వేరే వెళ్ళది వేరే అని రుద్రాణి అనగానే.. అందరు షాక్ అవుతారు. ఆస్తులలో వాటా అడిగినప్పడు ఇలా అనలేదని రుద్రాణిపై అపర్ణ విరుచుకుపడుతుంది. నా నగల గురించి ఎందుకు బయటపెట్టావ్.. నీ నగల గురించి బయట పెడతాను.. వెళ్లి బెడ్ కింద దాచిన నగలు తీసుకొని రా అని ధాన్యాలక్ష్మి అంటుంది. దాంతో స్వప్న వెళ్లి నగలు తీసుకొని వస్తుంది..అన్ని ఆస్తులు నగలు బ్యాంక్ వాళ్ళు లెక్కలు చూసుకుంటారు. మరొక వైపు సీఐ నందగోపాల్ ని కలుస్తాడు. అదంతా అప్పు వీడియో తియ్యమని కానిస్టేబుల్ కి చెప్తుంది. సీఐకి నందగోపాల్ డబ్బులు ఇస్తాడు. వెంటనే అప్పు వాళ్ళ దగ్గరికి వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటుంది. మరోవైపు బ్యాంక్ వాళ్ళు పేపర్స్ పై సీతారామయ్యని సంతకం చేయమని చెప్తారు. సీతారామయ్య సంతకం చేయబోతుంటే అప్పు నందగోపాల్ ని తీసుకొని వస్తుంది. మీరు వెతుకుతున్న నందగోపాల్ వీడే.. అప్పు కట్టాల్సింది వీడే అని బ్యాంకు వాళ్ళకీ చెప్పగానే వాడి ప్రాపర్టీ మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని బ్యాంకు వాళ్లు వెళ్ళిపోతారు. అందరు అప్పుకి థాంక్స్ చెప్తారు. నా నగలు నాకు ఉన్నాయంటూ రుద్రాణి హ్యాపీగా ఫీల్ అవుతుంది. తరువాయి భాగం లో ఇన్ని రోజులు ఎన్ని అవమానాలు భరించారని కావ్య, రాజ్ లతో అపర్ణ అంటుంది. ఇక ప్రాబ్లెమ్ క్లియర్ అని అపర్ణ అంటుంటే.. ఇంకా అసలు ప్రాబ్లెమ్ ఉంది.. ఆస్తులు పంచాలని నిర్ణయం తీసుకున్నానని సీతారామయ్య అనగానే.. అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత  ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

స్కూల్ లో బాంబ్ పెట్టిన రంగా.. కొత్తగా ప్రిన్సిపల్ బాధ్యతలు తీసుకున్న రామలక్ష్మి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -329 లో.... స్కూల్ ఆనివల్ డే కీ మైథిలి వస్తుంది. అందరు తనకి గ్రాండ్ గా వెల్ కమ్ చెప్తారు. పెద్దాయన మైథిలిని అందరికి పరిచయం చేస్తాడు. తను నా మనవరాలు. మైథిలి గ్రూప్ ఆఫ్ కంపేనీస్ కి ఏకైక వారసురాలని చెప్తాడు. ఇక నుండి ఈ స్కూల్ ప్రిన్సిపల్ తనే అని పెద్దాయన చెప్పగానే.. స్కూల్ ఎండింగ్ లో కాకుండా నెక్స్ట్ ఇయర్ వస్తే బాగుండేదని అక్కడున్నా అతను అంటాడు. ఈ గ్యాప్ లో నేను అన్ని విషయాలు తెలుసుకొని నెక్స్ట్ ఇయర్ కి పర్ఫెక్ట్ గా ఉండాలి. అందుకే ఇలా అని మైథిలి చెప్పగానే.. అందరు ఇంప్రెస్ అవుతారు. అదే స్కూల్ కి సీతాకాంత్ రామ్ ని తీసుకొని వస్తాడు. సీతాకాంత్ ఫోన్ మాట్లాడుతుంటే రామ్ పరిగెత్తుకొని వెళ్లి పడిపోతాడు. అది చూసి మైథిలి వచ్చి రామ్ ని లేపి దెబ్బ ఎక్కడ తగిలిందంటూ అడుగుతుంది. రామ్ మాట్లాడుతుంటే.. తన మాటలకి మైథిలి ఇంప్రెస్ అవుతుంది. మా నాన్నని చూడాలంటూ రామ్ వెళ్ళిపోతాడు. సీతాకాంత్ కి వెళ్లి తను పడిపోయిన విషయం చెప్తాడు. మరొకవైపు పెద్దాయన మైథిలి బాధ్యతలు చేపడుతున్నందుకు చాల హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే రియల్ ఎస్టేట్ రంగా వచ్చి ఈ ల్యాండ్ నాకు ఇవ్వండి స్కూల్ కూల్చేసి బార్ పెడతానంటూ అడుగుతాడు. దానికి పెద్దాయన ఒప్పుకోడు. దాంతో రంగా బయటకు వచ్చి ఇప్పుడు అందరు పిల్లలున్నారు. బాంబ్ పెట్టు అందరు చనిపోతారని రంగా తన మనిషికి చెప్తాడు. ఆ తర్వాత స్కూల్ ఆనివల్ డే కి అందరు పేరెంట్స్ వస్తారు. కల్చరల్ ఆక్టివిటీస్ మొదలవుతాయి. రౌడీ బాంబ్ ని గిఫ్ట్ రూపంలో ప్యాక్ చేసి అక్కడ పెడతాడు. ఒక అబ్బాయి స్టేజ్ పైకి వెళ్లి మాట్లాడుతుంటే.. వాళ్ళ అమ్మ హెల్ప్ చేస్తుంది. అది చూసి నీకు అమ్మ లేదని భాదపడుతున్నావా అని రామ్ ని సీతాకాంత్ అడుగుతాడు. అదేం లేదు నువ్వు నాకు బెస్ట్ నాన్నవి అంటూ సీతాకాంత్ గురించి రామ్ గొప్పగా చెప్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

దాస్ రాసినవి చూసేసిన దశరథ్.. షాక్ లో జ్యోత్స్న!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -282 లో..... నీ కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడని శ్రీధర్ ని వాళ్ళ ఫ్రెండ్ అడుగగానే.. శ్రీధర్ దగ్గుతాడు. అప్పుడే కార్తీక్ ని వాటర్ తీసుకొని రమ్మని చెప్తాడు. వాటర్ ఇస్తున్న కార్తీక్ ని చూసి శ్రీధర్ షాక్ అవుతాడు. అక్కడే ఉన్న పారిజాతం, జ్యోత్స్నలు ఆశ్చర్యంగా చూస్తారు. మీరు ఇప్పుడు మా మావయ్యని మీ కొడుకు ఎక్కడ అని అడిగారు కదా ఇదిగో అతనే మా బావ అని జ్యోత్స్న చెప్తుంది. శ్రీధర్ అవమానంగా ఫీల్ అవుతాడు. మరి ఇలా ఇలా చేస్తున్నాడు ఎంటని అతను అనగానే.. అదిగో ఆ వంటమనిషి ని చేసుకొని ఇలా తయారయ్యాడంటూ జ్యోత్స్న చెప్తుంది. ఇదంతా మీ భార్యకి తెలుసా అని అతను అడగానే.. ఏ భార్యకి అంటూ పారిజాతం ఇంకా శ్రీధర్ పరువు తీసే లాగా మాట్లాడుతుంది. అప్పుడే శ్రీధర్ ఫ్రెండ్ వాళ్ళ భార్య వచ్చి.. వంటలు చాలా బాగున్నాయంట అందరు చెప్తున్నారని అంటుంది. దాంతో కార్తీక్, దీప లు హ్యాపీగా ఫీల్ అవుతుంటే.. జ్యోత్స్న, పారిజాతం ల మొహం వాడిపోతుంది. మంచి జోడి అని అతను కార్తీక్ , దీప లని మెచ్చుకొని పేమెంట్ కాల్ చేసిన నెంబర్ కి పంపిస్తానని అతను చెప్పగానే కార్తీక్, దీపలు వెళ్లిపోతారు. చిరాకుగా శ్రీధర్ పారిజాతం, జ్యోత్స్న వెళ్ళిపోతారు అవమానించాలన్న ప్రతిసారీ ఇలా జరుగుతుందని పారిజాతంతో జ్యోత్స్న చెప్తుంది. మరొకవైపు దాస్ దగ్గర డాక్టర్ వచ్చి చెక్ చేస్తాడు. స్పృహలోకి వచ్చినప్పుడల్లా ఇలా పేపర్స్ పై రాస్తున్నాడంటూ స్వప్న, కాశీ లు చెప్తారు. త్వరలోనే మీ నాన్న రికవరీ అవుతాడని డాక్టర్ చెప్పి వెళ్లిపోతాడు. ఆ తర్వాత పారిజాతం, జ్యోత్స్నలు మాట్లాడుకుంటారు. ఎవరైనా నువ్వు వీళ్ళ కూతురు కాదని చెప్తే పరిస్థితి ఎంటని పారిజాతం అనగానే.. అలా ట్రై చేసినందుకే కదా నీ కొడుకుకి ఆ పరిస్థితి వచ్చిందని సడెన్ గా అంటుంది. అంటే దాస్ ని కొట్టింది నువ్వా అని పారిజాతం అనగానే.. లేదంటు కవర్ చేస్తుంది. కార్తీక్ ఇంటికి వచ్చి అక్కడ జరిగింది మొత్తం చెప్పి శ్రీధర్, జ్యోత్స్న, పారిజాతంపై కోపంగా ఉంటాడు. ఆ తర్వాత దశరథ్ కి డాక్టర్ ఫోన్ చేసి.. దాస్ సిచువేషన్ ఇప్పుడు పర్వాలేదు కానీ పేపర్ పై ఏదో రాస్తున్నాడని ఆ రాసినవి డాక్టర్ దశరథ్ కి పంపిస్తాడు. అవి ధశరథ్ చూస్తాడు. అందులో వారసురాలు.. నిజం చెప్పాలి అంటూ రాసి ఉంటుంది. కచ్చితంగా ఏంటో కనుక్కోవాలని దశరథ్ అనుకుంటాడు. ఆ తర్వాత జ్యోత్స్న కి మేనేజర్ ఫోన్ చేసి రెస్టారెంట్ లాస్ లో ఉంది.. మీరేమో ఆడిట్ లో లాభం చూపించామంటున్నారని అంటాడు. నేను చూసుకుంటానని జ్యోత్స్న ఫోన్ లో మాట్లాడడం దశరథ్ వింటాడు. ఎన్ని అబద్ధాలు ఆడుతావ్ జ్యోత్స్న అంటూ దశరథ్ అడుగగా.. జ్యోత్స్న కంగారుపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 పెళ్ళి సంబంధం చూడటం వద్దన్న రామరాజు కొడుకు.. కోడలిని కోప్పడిన అత్త!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -83 లో.....అమ్మాయి తండ్రి రామరాజుని అవమానించి పంపిస్తాడు. దాంతో రామరాజు కుటుంబం మొత్తం బాధగా ఇంటికి వస్తుంది. ఏం జరిగిందని ధీరజ్ అడుగుతాడు. వాళ్ళు నాన్నని అవమానించారని ధీరజ్ కీ చందు చెప్తాడు.. దాంతో ధీరజ్ బాధపడతాడు.సాగర్ దగ్గరికి నర్మద వస్తుంది. నువ్వు కావాలనే ఇదంతా చేసావ్ కదా అని సాగర్ అడుగుతాడు. నేనెందుకు కావాలని చేస్తానని నర్మద అంటుంది. మా నాన్న మన పెళ్లిని ఇంకా ఒప్పుకోలేదని, ఇలా మా నాన్న మాటలు పడేలా చేసావని సాగర్ కోప్పడుతుంటే.. నీకు ఏమైనా బుద్ది ఉందా ఎందుకు ఇలా అంటున్నావని నర్మద అంటుంది. ఏం అన్నావంటూ నర్మద పైకి సాగర్ చెయ్ ఎత్తుతాడు అప్పుడే రామరాజు వచ్చి నీకు బుద్ది ఉందా అమ్మాయిపై అలా చెయ్ ఎత్తుతావా అని సాగర్ పైకి రామరాజు చెయ్ ఎత్తితే నర్మద ఆపుతుంది. తనకి పెళ్లి అయింది చిన్న పిల్లాడు కదా.. మీరు కొడితే బాధపడుతారంటూ నర్మద అనగానే.. ఏంటి మీ మావయ్యకి ఎదురు తిరుగుతావా అని నర్మదపై వేదవతి కోప్పడుతుంది.ఆ తర్వాత రామరాజు దగ్గరికి చందు వెళ్లి.. నా పెళ్లి వల్ల ఇన్ని ఇబ్బందులున్నాయ్.. నాకు పెళ్లి సంబంధం చూడడం మానెయ్ అంటూ బాధపడతాడు. దాంతో రామరాజు ఎమోషనల్ అవుతాడు. మరొకవైపు ప్రేమ ధీరజ్ లు గొడవపడతారు. మీ వళ్లే.. ఏదో చేశారు అందుకే ఇలా అని  ప్రేమతో ధీరజ్ అంటాడు. మా వాళ్ళు అలా ఏం చెయ్యరని ప్రేమ అంటుంది. నర్మద కోపంగా కిచెన్ లోకి వెళ్లి అరిసెలు తింటుంటే వేదవతి వస్తుంది. నువ్వు కోపంగా వస్తే ఏం చేస్తున్నావనుకున్నా నువ్వు చేసేది ఇదా అని వేదవతి అంటుంది. ప్రేమ ధీరజ్ ల గొడవ విని.. వేదవతి వెళ్లి నచ్చజెప్పుతుంది. ఆ తర్వాత రామరాజు కి ముళ్ళు గుచ్చుకుంటుంది. దాంతో వేదవతి లోపలకి వెళ్లి మందు తీసుకొని వచ్చేలోపు నర్మద రామరాజు కాలు పట్టుకొని ముళ్ళు తీస్తుంటుంది. దాంతో వేదవతి మురిసిపోతుంది. తరువాయి భాగంలో నీ కొడుకు నా మేనకోడలితో పాటు ఏడువారాల నగలు తీసుకొని వెళ్ళాడని చెప్తుంది. అప్పుడే ధీరజ్ వస్తాడు. నువ్వు తీసుకొని వచ్చావా అని అడుగగానే.. కాదని చెప్తే అసలు నిజం బయటకు వస్తుందని తీసుకున్నానని ధీరజ్ చెప్పగానే.. అందరు షాక్ అవుతారు. వాళ్ళ నగలు వాళ్ళకి ఇవ్వమని రామరాజు అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

దిష్టి తగులుతుంది అని బాయ్ ఫ్రెండ్ ని రివీల్ చెయ్యట్లేదు

   బుల్లితెర మీద టిక్ టాక్ భాను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవక్కర్లేదు.. శ్రీదేవి డ్రామా కంపెనీలో కొంతకాలం బాగా కనిపించింది. పల్సర్ బైక్ రమణ కూడా ఈటీవీ షోస్ కి వచ్చినప్పుడల్లా  భాను మీద సాంగ్స్ పాడుతూ ఉండేవాడు. ఒక ఈటీవీ ఫెస్టివల్ ఈవెంట్‌లో పాడుతూనే  భానుకి ప్రపోజ్ చేశాడు  కానీ భాను మాత్రం పెద్దగా రియాక్ట్ కాలేదు. ఐతే ఆ ఎపిసోడ్‌ మాత్రం బాగా  హైలెట్ అయ్యింది మంచి రేటింగ్ కూడా వచ్చింది. ఇక ఈ మధ్య కాలంలో ఆమె ఎక్కడా కనిపించడం లేదు. అలాంటి భాను ఇన్స్టాగ్రామ్ లో మాత్రం ఫుల్ అప్డేట్ గా ఉంటుంది. ఐతే లవర్స్ డే సందర్భంగా ఒక పిక్ ఐతే పోస్ట్ చేసింది. ఐతే అందులో తన లవర్ ఎవరో రివీల్ చేయలేదు. అందులో ఎర్ర గులాబీలు, రెండు చేతులు, రెండు ఐస్ క్రీములు తప్ప ఇంకేం కనిపించలేదు. "మా బంధానికి అంతం లేదు" అనే అర్ధం వచ్చేలా "ఎండ్ లెస్ అజ్" అని కాప్షన్ పెట్టుకుంది అలాగే మైన్ అనే హ్యాష్ టాగ్ కూడా పెట్టుకుంది. ఈ పిక్స్ కి పాగల్ పవిత్ర ఐతే హే కంగ్రాట్యులేషన్స్ బేబ్స్ అని మెసేజ్ పెట్టింది. ఇక మరో నెటిజన్ ఐతే "అంత భయం ఉన్నప్పుడు ఎందుకు లవ్ చేయడం" అని అడిగేసరికి ఇంకో నెటిజన్ రిప్లై ఇచ్చారు. "అది భయం కాదు. దిష్టి తగులుతుంది అని. సమాజంలో ఎవరైనా మంచి ఉంటే ఓర్వలేరుగా బ్రో...కొన్ని విషయాలు పర్సనల్ గా ఉంటేనే బెటర్ అందరికీ తెలియాల్సిన అవసరం లేదు కదా" అని ఆన్సర్ ఇచ్చారు. ఇక భాను రకరకాల ఫోటో షూట్స్ తో నెటిజన్స్ ని సోషల్ మీడియాలో ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది. టిక్‌టాక్‌తో వచ్చిన క్రేజ్ వల్లే జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షో  ఛాన్సులు కొట్టేసింది.. అలానే అప్పుడప్పుడూ ఈటీవీలో జరిగే కొన్ని ఈవెంట్స్, షోస్ కి వస్తూ ఎంటర్టైన్  చేస్తోంది టిక్ టాక్ భాను.

బెటర్ పొజిషన్ లో ఉన్న హీరోస్ దగ్గరకు స్క్రిప్ట్స్ వెళ్లిపోతున్నాయి...

  ఢీ షోకి హోస్ట్ గా చేస్తున్న నందు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్రికెట్ కామెంటరీ చెప్తాడు అలాగే హోస్టింగ్ కూడా చేస్తాడు. అలాంటి నంది కొన్ని చిట్ చాట్ ప్రశ్నలకు ఆన్సర్స్ ఎం ఇచ్చాడో చూద్దాం.." పెళ్ళాం చెప్తే వినకపోతే ఎలాంటి సందర్భాలు ఉంటాయో నాకు తెలుసు పర్సనల్ గా అడగండి చెప్తాను" అన్నాడు. "ఇక లవ్ ప్రొపోజల్ ఎవరు ముందుగా చేశారు అనేదానికంటే నేనే గీతాతో ఐ లవ్ యు అని చెప్పించాను. ఢీ జడ్జెస్ లో శేఖర్ మాష్టర్ స్పాంటేనియస్ జోక్స్ వేస్తారు. హన్సిక చాలా తొందరగా కలిసిపోతారు. గణేష్ మాష్టర్ పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద పెద్ద స్టార్స్ కి కొరియోగ్రఫీ చేసాను అన్న అహం ఉండకుండా అందరికీ హెల్ప్ చేస్తుంటారు. విజయ్ బిన్నీ మాష్టర్ క్లారిటీగా  జడ్జ్మెంట్ ఇస్తారు. 2014 ఫిబ్రవరి 9 న పెళ్లయ్యింది. ఇంత మంచి పెళ్ళాన్ని ఇచ్చినందుకు ఏడుకొండల స్వామికి థ్యాంక్స్ చెప్పుకున్నా. ఐపిఎల్ కామెంటరీ, హోస్టింగ్ అనేవి రెండూ కష్టమే. రెండిట్లో స్పాంటేనిటీ అవసరం. బుల్లితెర మీద మోస్ట్ ఎంటర్టైనింగ్ పర్సన్ ఆది. నేను ఇష్టపడే ఫుడ్ ఇంట్లో చేసే ముద్దపప్పు ఆవకాయ, పొటాటో ఫ్రై, టమాటో ఆనియన్ కూర ఇష్టం, బెండకాయ కూర ఇష్టం. కొరివి కారం, టమాటో పచ్చడి చాలా ఇష్టం. నా లైఫ్ లో నా ఫామిలీ, గీత మోస్ట్ సపోర్టివ్ పర్సన్స్. నేను అనుకున్న స్క్రిప్ట్స్ నేను చేయలేకపోయాను..జనాలకు నచ్చే స్క్రిప్ట్స్ నా వరకు రావట్లేదు. కొంచెం అదృష్టం కూడా ఇక్కడ ఉండాలి. బెటర్ పొజిషన్ లో ఉన్న హీరోస్ దగ్గరకు స్క్రిప్ట్స్ వెళ్లిపోవడం జరుగుతోంది. దాంతో ఆడియన్స్ కి నేను దగ్గర కాలేకపోతున్న అన్న ఫీలింగ్ వచ్చి సినిమాలు చేయడం మానేశా. ఆడియన్స్ కి దగ్గరవ్వాలంటే క్రికెట్ కామెంటరీ, ఢీ స్టేజి అనిపించి ఇటు వైపుకు వచ్చేసా. ఐతే సినిమాల ద్వారా ఇంకాకా దగ్గరవ్వాలని కోరుకుంటున్నా" అని చెప్పాడు నందు.  

పెళ్లి కావాలని నువ్వు అనుకోవట్లేదుగా శ్రీముఖి ...ఇంకేం దీవిస్తాను

  ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. మధ్యాహ్నం మెగాస్టార్స్ వెర్సస్  సాయంత్రం సూపర్ స్టార్స్ అనే కాన్సెప్ట్ ని శ్రీముఖి తీసుకొచ్చింది. అలాగే ఈ షోకి బ్రహ్మానందం ఆయన కొడుకు వచ్చారు. వీళ్ళు "బ్రహ్మా ఆనందం" అనే మూవీలో నటించాడు. ఇక ఈ షోలో శ్రీముఖిని బ్రహ్మానందం బాగా ఆడేసుకున్నారు. శ్రీముఖి రాగానే బ్రహ్మానందం కాళ్ళ మీద పడి బ్లెస్సింగ్స్ తీసుకుంది. "మీ బ్లెస్సింగ్స్ తర్వాత అన్నా పెళ్లి అవ్వాలి అని కోరుకుంటున్నా" అంది శ్రీముఖి. దానికి బ్రహ్మానందం "ఎప్పటిలోపు పెళ్లి చేసుకోవాలని ఉందో చెప్పు" అని అడిగారు. "వయసైపోతోంది కదా పెళ్లి చేసేసుకో చేసేసుకో అంటున్నారు అందుకే" అని శ్రీముఖి నసిగింది. "అందరూ అనుకుంటున్నారు కానీ నువ్వు అనుకోవట్లేదు కదా" అని గట్టిగానే కౌంటర్ ఇచ్చేసారు. దానికి శ్రీముఖి షాక్ అయ్యింది. ఇక ప్రోమో ఫైనల్ లో బ్రహ్మానందానికి చిరు సత్కారం చేశారు. హరి, అవినాష్ ఇద్దరూ కలిసి బ్రహ్మానందం  కాళ్ళు కడిగారు. అలాగే డాక్టర్ బాబు, అవినాష్ కలిసి  ఆయనకు షాల్ కప్పింది. "సజీవ నదిలా సాగిపోయే ఒక అందమైన సినిమా...దానిలో ప్రయాణించిన ప్రతీ ఒక్కరికీ చక్కని గమ్యం దొరుకుతుంది." అని చెప్పుకొచ్చారు. ఇక గౌతమ్ మాట్లాడుతూ "తనకు అమ్మ సైడ్ కానీ నాన్న సైడ్ కానీ తాత అంటే ఎలా ఉంటాడో తెలీదు. కానీ ఈ మూవీతో ఆ కోరిక తీరిపోయింది. అలాగే   ఈ మూవీ మొత్తం నాన్నతో కలిసి బాగా ఎంజాయ్ చేశా" అని చెప్పుకొచ్చాడు. గౌతమ్ 2004లో పల్లకిలో పెళ్లి కూతురు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా మంచి విజయమే సాధించింది. ఆ తర్వాత 2011 లో వారెవా, 2014 లో బసంతి, 2016 లో చారుశీల, 2018 లో మను లాంటి చిత్రాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఈ సినిమాలేవీ కమర్షియల్ గా హిట్ కాలేదు.  

Ilu illalu pillalu : భద్రవతి ఫోన్ తో పెళ్ళి సంబంధం క్యాన్సిల్..  ఎమోషనల్ అయిన రామరాజు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -82 లో.....నర్మద చందుకి సంబంధం తీసుకొని వస్తుంది. దాంతో అందరు అమ్మాయిని చూడడానికి వెళ్తారు. అక్కడ అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు ఇష్టం అనుకుంటారు. అదే సమయంలో అమ్మాయి తండ్రికి ఫోన్ వస్తుంది. దాంతో తను మాట్లాడడానికి వెళ్తాడు. మరొకవైపు దీరజ్ దగ్గరకి ప్రేమ వచ్చి.. ఏం తింటావో చెప్పు అత్తయ్య వంట చేయమందని అడుగుతుంది. నేను ఏం తినను అంటూ దీరజ్ అంటాడు. నీకు ఒక విషయం తెలుసా.. భార్య చేసిన వంట తింటే భర్తలకి వాళ్ళపై ప్రేమ పుడుతుంది. అందుకే మీ నాన్న మీ అమ్మ చేసిన వంట తింటాడు కాబట్టి.. వాళ్ళు ఇద్దరు ఎంత ప్రేమ గా ఉంటారు.. అందుకే నేను వంట చేస్తానని ప్రేమ రివర్స్ గేమ్ ప్లే చేస్తుంది. దాంతో వద్దమ్మ నాకు నీ పై ప్రేమ వద్దు.. ఏం వద్దు నేను వండుకొని తింటానని కిచెన్ లోకి వెళ్లి ధీరజ్ ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. పక్కనే ప్రేమ ఉండి తనతో ఒక ఆట ఆడుకుంటుంది. మరొక వైపు అమ్మాయి తండ్రికి వేదవతి ఫోన్ చేసి.. మీకు వచ్చిన సంబంధం మంచిది కాదు. వాడు వాళ్ళ కొడుకుతో డబ్బున్న అమ్మాయిలని చూపించి అలా లేచిపోయాలా చేసాడు. అంతేకాదు వాడొక అనాధ.. ఊరు, పేరు లేదని అనగానే అమ్మాయి తండ్రి షాక్ అవుతాడు. మరొకవైపు ధీరజ్ చేసిన వంటని ప్రేమకి కూడా తీసుకొని వచ్చి తినమని చెప్తాడు. ఇద్దరు తింటుంటారు మళ్ళీ అక్కడ కూడా ప్రేమ ఏదో ఒకటి అంటూ ధీరజ్ కి కోపం తెప్పించడం చేస్తుంటుంది. అమ్మాయి తండ్రి రామరాజు వాళ్ళ దగ్గరికి వచ్చి.. మీరు ఇక్కడ నుండి వెళ్లిపోండి. ఈ సంబంధం మాకు ఇష్టం లేదు అంటూ రామరాజుని అవమానిస్తాడు. మీకు ఆల్రెడీ అన్ని విషయాలు చెప్పాను కదా అని నర్మద అంటుంది. అయిన అతను అలాగే అంటుంటాడు. దాంతో అందరూ బాధపడతారు. సాగర్ నార్మద వంక కోపంగా చూస్తాడు. అందరు ఇంటికి బాధగా వస్తారు. నీకు గొప్ప సంబంధం తీసుకొని రాలేకపోతున్నానని చందు తో రామరాజు అంటూ బాధపడతాడు. ధీరజ్ కి అక్కడ జరిగింది తెలిసి బాధపడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : బర్త్ డే పార్టీకి కేటరింగ్ చేస్తున్న కార్తీక్.. అక్కడ చూసి షాకైన శ్రీధర్ !

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -281 లో....శ్రీధర్ ఏదో వెతుకుతుంటాడు అప్పుడే కావేరి వచ్చి.. మీరు కార్తీక్ ఇచ్చిన నోట్ గురించి వెతుకుతున్నారు కదా అని అడుగుతుంది. అవునని అనగానే.. అది మీకెందుకు అన్నట్లు కావేరి పొగరుగా సమాధానం చెప్తుంది. అప్పుడే శ్రీధర్ ఫ్రెండ్ కాల్ చేసి తన మనవడి బర్త్ డే కి రమ్మని చెప్తాడు. సరే అని శ్రీధర్ ఫోన్ కట్ చేసి.. బర్త్ డే కి వెళదామని అంటాడు. నేను రానని కావేరి చెప్పి వెళ్ళిపోతుంది. రాకు నేను ఒక్కడినే వెళ్తానని శ్రీధర్ అనుకుంటాడు. దీప పేపర్ పై ఏదో లెక్కలు వేస్తుంది. శౌర్య అడిగితే చెప్పదు. కార్తీక్ వచ్చి ఏంటని అడుగుతాడు. మనం చిట్టీలు వేస్తే వచ్చే డబ్బుతో రెస్టారెంట్ పెట్టగలం.. అలాగే అప్పు తీర్చగలం.. అలా రోజుకి మనం ఇంత సంపాదించాలని లెక్కలు చెప్తుంది. కార్తీక్ ఆశ్చర్యంగా చూస్తూ.. చాలా బాగా చెప్పావని అంటాడు. అప్పుడే ఒకతను వచ్చి బర్త్ డే ఉందని చెప్పి, పార్టీకి కేటరింగ్ ఇవ్వాలని అంటాడు. సరే మేం చేస్తామని కార్తీక్ అడ్వాన్స్ తీసుకుంటాడు. ఎందుకు అలా మాటిచ్చారు.. మనకి వీలు అవ్వదు.. టిఫిన్ సెంటర్ , శౌర్య  ఉందని దీప అంటుంది. మేం కూడా హెల్ప్ చేస్తామని అనసూయ, కాంచన అంటారు. దీప సరే అంటుంది. అందరు వంటలు పూర్తిచేసి అన్ని కూడా ఆటోలోకి ఎక్కిస్తారు. దీప, కార్తీక్ లు ఆటో వెనకాల ఎక్కి వెళ్తుంటారు. కార్తీక్ పడిపోతుంటే దీప పట్టుకుంటుంది . కార్తీక్ ఎలా ఉండేవాడు.. ఎలా అయ్యాడంటూ కాంచన బాధపడుతుంది. బర్త్ డే కి శ్రీధర్ వెళ్లి తన ఫ్రెండ్ తో మాట్లాడతాడు. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడని అతను అడుగగా.. వాడికి అసలు విషయం తెలియదు కదా అని మా వాడు చాల బిజీ అంటూ శ్రీధర్ గొప్పలు చెప్తుంటాడు. అదే బర్త్ డే అని కార్తీక్, దీప లు కేటరింగ్ కి వస్తారు. శ్రీధర్ తన ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే.. అప్పుడే జ్యోత్స్న, పారిజాతం వస్తారు. మీ కొడుకు మేనకోడలిని కాకుండా వేరొకరిని పెళ్లి చేసుకున్నాడన్నావ్.. ఇప్పుడు మీ అబ్బాయి ఎవరిని చేసుకున్నాడని అతను అనగానే.. శ్రీధర్ కి దగ్గు వస్తుంది. దాంతో వాటర్ తీసుకొని రా బాబు అని అతను పిలవగానే కార్తీక్ వాటర్ తీసుకొని వచ్చి.. శ్రీధర్ కి ఇస్తాడు. కార్తీక్ ని చూసి శ్రీధర్ షాక్ అవుతాడు. బావ ఇక్కడికి కేటరింగ్ కి వచ్చాడా అని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Eto Vellipoyindhi Manasu : మామ అల్లుడిని చూసి షాకైన కుటుంబం... రామలక్ష్మిని సీతాకాంత్ చూస్తాడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -328 లో..... మైథిలి షటిల్ ఆడి ఓడిపోతుంది. ఏంటి అమ్మ గెలిచే అవకాశం ఉన్నా ఓడిపోయావని వాళ్ళ తాతయ్య అడుగుతాడు. మనం గెలవడం కంటే వేరే వాళ్ళని గెలిపించడంలోనే సంతోషం ఉంటదని మైథిలి చెప్పడంతో పెద్దోళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. నువ్వు వెళ్లి ఫ్రెషప్ అవు.. నీకు సర్ ప్రైజ్ అని మైథిలికి తన గ్రాండ్ పేరెంట్స్ చెప్తారు. మరొకవైపు సిరి కొడుకు రామ్ ఎనిమిది సంవత్సరాల వాడు అవుతాడు. సీతాకాంత్ ని ఆట పట్డిస్తుంటాడు. శ్రీలత, శ్రీవల్లి, సందీప్ లని పేరు పెట్టి పిలస్తూ ఒక ఆట ఆడుకుంటాడు. సీతాకాంత్ ని నాన్న అని పిలుస్తాడు. తన లాగే ఓసీడిలాగా ప్రవర్తిస్తుంటాడు. మరొకవైపు మైథిలి రెడీ అయి కిందకి వస్తుంది. ఈ రోజు నీ పుట్టినరోజు కదా అందుకే పూజ చేసామంటూ వాళ్ళ నానమ్మ మైథిలీకి చెప్తుంది. మైథిలి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. మీరు తీసుకున్న నిర్ణయం ఏంటని మైథిలి తన తాతయ్యని అడుగుతుంది. ఇకనుండి మన ఆఫీస్ మొత్తం నువ్వే చూసుకోవాలని పెద్దాయన చెప్తాడు. " అంత పెద్ద బాధ్యతలు వద్దు తాతయ్య.. నేను ముందు అన్ని నేర్చుకోవాలి. ముందు మీరు మొదలు పెట్టిన స్కూల్ నుండి అన్ని నేర్చుకోవడం స్టార్ట్ చేస్తాను" అని మైథిలి అంటుంది. దాంతో వాళ్ళ తాతయ్య హ్యాపీగా ఫీల్ అవుతాడు. సీతాకాంత్, రామ్ ఇద్దరు రెడీ అయి వస్తుంటే.. శ్రీలత వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఈ రోజు స్కూల్ అన్యూవల్ డే అని రామ్ సూట్ వేసుకుంటాడు. మాకెందుకు చెప్పలేదని శ్రీలత అంటుంది. చెప్పాలనిపించలేదని రామ్ అంటాడు. రామ్, సీతాకాంత్ లు వెళ్తుంటే వాళ్ళని చూస్తుంటే.. మామ అల్లుడులాగా ఉన్నారా.. తండ్రి కొడుకుల్లా ఉన్నారని వాళ్ళు అంటారు. బావగారు వాడి వాళ్లే రామలక్ష్మి అక్కని మర్చిపోయి మళ్ళీ ఇంత సంపాదించగలిగారని శ్రీవల్లి అంటుంది. రామలక్ష్మి గుర్తురానంత వరకు వాడు హ్యాపీగా ఉంటాడు. మనం హ్యాపీగా ఉంటాం.. రామలక్ష్మిని గుర్తుచేసుకోకుండా మనం చెయ్యాలని శ్రీలత అంటుంది. సీతాకాంత్, రామ్ లు వెళ్తుంటే.. దారిలో ఒక పెద్దావిడ పడిపోతుండటం చూసి.. రామ్ వెళ్లి వాటర్ ఇస్తాడు. అదంతా వెనకాల కార్ లో ఉన్న మైథిలి చూస్తుంది. సీతకాంత్ గుండె వేగంగా కొట్టుకుంటూ.. నాకు దగ్గరగా నాకు కావల్సిన వాళ్ళున్నారు అనిపిస్తుందని అనుకుంటాడు. సీతకాంత్, రామలక్ష్మిలు దగ్గరున్నా ఒకరికొకరు చూసుకోరు. రామ్ కార్ ఎక్కగానే సీతాకాంత్ వెళ్ళిపోతాడు. మరొకవైపు స్కూల్ లో పెద్దాయన వాళ్ళు మైథిలి కోసం చూస్తుంటారు. అప్పుడే మైథిలీ వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : ఇక్కడ అందరు సంతకాలు.. అక్కడ నందగోపాల్  కోసం అప్పు ఛేజింగ్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -645 లో.... అప్పుకి కళ్యాణ్ లంచ్ బాక్స్ తీసుకొని వస్తాడు. అది చూసి స్టేషన్ లోని వాళ్ళంతా మాట్లాడతారు. ఇలా మీరు భార్య భోజనం తీసుకొని రావడం గ్రేట్ అంటూ కళ్యాణ్ ని పొగుడుతారు. దాంతో అప్పు జెలస్ గా ఫీల్ అయి.. వాళ్ళని తిట్టి పంపిస్తుంది. ఎందుకు ఆలా కోప్పడుతున్నావ్ అని కళ్యాణ్ అంటాడు. మరి నా ముందు నిన్ను పొగుడుతుంటే నాకూ సిగ్గుగా ఉందంటూ అప్పు సిగ్గు పడుతుంది. మరోవైపు శృతి స్టాలు సెట్ చేస్తుంది‌. ఇది ఒకసారి వీడియో తీసి మేడమ్ కి పంపాలని శృతి వీడియో తీస్తుంటే.. నందగోపాల్ ఫోన్ మాట్లాడుతూ అడ్డు వస్తాడు. దాంతో పక్కకు జరగండి అంటూ శృతి చెప్తుంది. శృతి తీసిన వీడియోలో నందగోపాల్ ఉంటాడు. మరొకవైపు ధాన్యలక్ష్మి బట్టలు సర్దుకుంటుంది. ఏం చేస్తున్నావంటూ ప్రకాష్ అడుగుతాడు. పెళ్లి అయినప్పటి నుండి ఇంతవరకు నా జీవితం ఎటు పోతందో అర్ధం అవడం లేదని ధాన్యలక్ష్మి అంటుంది. ఎప్పుడు ఆస్తులు అవేనా.. రాజ్, కావ్య ఇంట్లో వాళ్ళు, చివరికి పనిమనిషి శాంత కూడా అందరు బాగుండాలని కోరుకుంటున్నారు.. నువ్వు తప్ప అంటు ధాన్యలక్ష్మితో ప్రకాష్ కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు. రేపు బ్యాంక్ వాళ్ళు ఇంటిని జప్తు చేస్తారని కావ్య బాధపడుతుంది. అప్పుడే కావ్యకి శృతి ఫోన్ చేస్తుంది.  స్టాలు వీడియో పంపాను ఒకసారి చూడండి మేడమ్ అని అంటుంది. సరే అని కావ్య అంటుంది. రేపు ఆఫీస్ ని కూడా వాళ్లకు అప్పజెప్పాలని వాళ్ళకి తెలియక సిన్సియర్ గా వర్క్ చేస్తున్నారని కావ్య అంటుంది. శృతి పంపిన వీడియో ఓపెన్ చేయగానే అందులో నందగోపాల్ కన్పిస్తాడు. అతన్ని చూసి షాక్ అయి రాజ్ కి చూపిస్తుంది. అయితే వీడు చనిపోలేదా ఎవరో ఇదంతా చేస్తున్నారు. మా ఫ్రెండ్ అబద్దం చెప్పాడు. ఈ నందగోపాల్ ని  ఎలాగైనా పట్టుకోవాలని రాజ్, కావ్య అనుకుంటారు. రాజ్ కావ్య లు అప్పుని కలిసి జరిగిందంతా చెప్తారు. తన పోలీస్ ఫ్రెండ్ ఇలా అబద్దం చెప్పాడని రాజ్ చెప్తాడు. సరే నేను వాడిని పట్టుకుంటానని అప్పు అంటుంది.ఆ తర్వాత కానిస్టేబుల్  సీఐ కాల్ లిస్ట్ తీసుకొని వచ్చి అప్పుకి ఇస్తుంది. అందులో నందగోపాల్ , సీఐ లు డబ్బు గురించి మాట్లాడుకుంటారు. వాళ్ళు మీట్ అవుతున్న విషయం అప్పుకి తెలుస్తుంది. అప్పుడే సీఐ అప్పు దగ్గరికి వచ్చి లీవ్ కావాలని అడుగగా.. తను సరే అంటుంది. దుగ్గిరాల కుటుంబం మొత్తం హాల్లో ఉంటారు. బ్యాంక్ వాళ్ళు వచ్చి ఈ ఆస్తులకు అమౌంట్ సెట్ అవట్లేదు. ఇంట్లో నగలు తీసుకొని రమ్మని చెప్తారు. మరొకవైపు అప్పు సీఐని ఫాలో అవుతుంది. అందరు మెడలోని నగలు తీసి అక్కడ పెడతారు. కావ్య పక్కకి వెళ్లి అప్పుకి కాల్ చేస్తుంది. తరువాయి భాగంలో ఇచ్చిన మాట కోసం సర్వస్వం వదిలేస్తున్నావ్.. నువ్వు గ్రేట్.. నువ్వు ఎక్కడ ఉంటే నేను నేను అక్కడే ఉంటానని  సీతారామయ్యతో ఇందిరదేవి అంటుంది. సీతారామయ్య సంతకం పెడుతుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

బిగ్ బాస్ పై సెన్సేషనల్ కామెంట్స్...విన్నర్ అవ్వాలంటే...

  సోనియా ఆకుల బుల్లితెర మీద ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతున్న పేరు. సోనియా కూడా అన్ని రకాల షోస్ లో కనిపిస్తోంది. ఇష్మార్ట్ జోడి 3 లో భర్త యష్ తో వచ్చి టాస్కులు ఆడుతోంది. మిగతా జోడీస్ కి కూడా టఫ్ ఫైట్ ఇస్తోంది. అలాంటి సోనియా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో "మీరు నా గురించి ఎం తెలుసుకోవాలనుకుంటున్నారు" అంటూ నెటిజన్స్ ని అడిగింది. దానికి ఒక నెటిజన్ "బిగ్ బాస్ సీజన్ 9 కి అవకాశం వస్తే వెళ్ళండి అక్కా మిమ్మల్ని ఫస్ట్ లేడీ విన్నర్ గా చూడాలని ఉంది" అని అడిగారు "బిగ్ బాస్ అనుకుంటేనే తప్ప విన్నింగ్ అన్నది ఎవరి చేతుల్లోనూ ఉండదుమా" అని సోనియా ఆన్సర్ ఇచ్చింది. అలాగే ఫాక్ట్స్ ఆఫ్ ది షో అనే హాష్ టాగ్ కూడా పెట్టింది. ఐతే సోనియా యూపిఎస్సి యాస్పిరెంట్ కూడా..ఐతే ఒక నెటిజన్ ఐతే "హాయ్ అక్క మీరు ఎన్నిసార్లు యూపిఎస్సి అటెంప్ట్స్ ఇచ్చారు. మళ్ళీ ఎందుకు ఇవ్వలేదు. సజెషన్స్ చెప్పండి " అని అడిగేసరికి "రెండు అటెంప్ట్స్ ఇచ్చా ఐతే మైన్స్ కి వెళ్ళలేపోయా. ఫైనాన్సియల్ గా వీక్ కాబట్టి నేను సంపాదించుకోవాలి, చదువుకోవాలి .. దాంతో అటెంప్ట్ చేయలేకపోయా" అని చెప్పింది. "విరాట్ వాళ్ళ అమ్మ గారి గురించి మీరు బాగా చెప్పారు" అని ఒక నెటిజన్ అనేసరికి "నిజంగా వాళ్ళ అమ్మ గారంటే చాల గౌరవం నాకు." అని చెప్పింది. బిగ్‌ బాస్‌ తెలుగు 8 షోతో పాపులర్‌ అయిన సోనియా ఆకుల ఇటీవల వ్యాపారవేత్త యష్‌ ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరి వివాహం చాలా గ్రాండ్‌గా  జరిగింది. వీళ్ళ పెళ్ళికి బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్లు, ఇతర సెలబ్రిటీలు పాల్గొన్నారు. సినిమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ సోనియా ముందుంటుంది. ఆసా అనే స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి ఎంతో మంది అనాథ పిల్లలకు అదుకుంటుంది. ప్రాజెక్ట్ ప్రేరణ పేరుతో ఆడపిల్లలకు అండగా ఉంటోంది సోనియా.

సమంత గనక ఈ రీల్ చూస్తేనా ..?

  బుల్లితెర మీద జెస్సి అలియాస్ జెశ్వంత్ ఒకప్పుడు బాగా ఫేమస్. జబర్దస్త్ లో శ్రీదేవి డ్రామా కంపెనీలో, ఢీ షోలో కనిపించేవాడు. బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్ గా వెళ్ళాడు.  అతనో ఫ్యాషన్ డిజైనర్.. ర్యాంప్ వాకర్.. మోడలింగ్.. ఫ్యాషన్.. యాక్టింగ్‌ పై ఇంటరెస్ట్ తో ముందుగా  మోడలింగ్‌లో ట్రైనింగ్ తీసుకున్నాడు. బెంగుళూరులో జరిగిన కొన్ని  ఫ్యాషన్ షోలలో పాల్గొని అవార్డ్స్ తీసుకున్నాడు. మిస్టర్ ఏపీ ట్రెడిషనల్ ఐకాన్‌గా ఎంపిక అయ్యాడు. ఆ తరువాత మోడల్ హంగ్ సీజన్ 2 విజేత అయ్యాడు. అలాంటి జెస్సి కొంత కాలంగా బుల్లితెరకు దూరంగా ఉంటున్నాడు. ఇన్స్టాగ్రామ్ పేజీలో మాత్రం అప్డేట్స్ పెడుతూనే ఉన్నాడు. ఇక లవర్స్ డే సందర్భంగా ఒక రీల్ చేసాడు. "ఫ్రెండ్స్ పండగ చేసుకుందాం అంటే నాకు లవర్ లేరు. మీకు లవర్ ఉంటే పండగ చేసుకోండి ఫ్రెండ్స్. చూడని నా బాధ ఎలా ఉందో" అంటూ ఉన్న రీల్ అది. లవర్ లేదని చెప్తూనే సమంతని చూపిస్తూ ఆ పిక్ ని నెమలి పింఛాలతో తడుముతూ "లవ్ యు సామ్" అంటూ పోస్ట్ పెట్టాడు. ఇక నెటిజన్స్ ఊరుకుంటారా "సమంత మేడం గనక చూస్తే ఎగిరి తంతాది బ్రో జాగ్రత్త" అంటున్నారు. ఫ్యాషన్ రంగంలో తిరుగులేని పేరు సంపాదించిన జస్వంత్‌కి యాక్టింగ్ అంటే మక్కువ ఉండటంతో.. 2017లో జెమిని టీవీ సప్త మాత్రిక సీరియల్‌‌తో నటనలోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత  2020లో ‘ఎంతమంచి వాడవురా’ సినిమాలో నటించాడు.  

సీనియర్ నటుడి మీద సోనియా ఫైర్

  స్టార్ మాలో ప్రసారమవుతున్న ఇస్మార్ట్ జోడి సీజన్-3 లో ఈ వారం ఎలిమినేషన్స్ రౌండ్ చాలా గట్టిగానే  ఉండబోతోంది అన్న విషయం తెలుస్తోంది. ఈ నామినేషన్స్ లో భాగంగా సోనియాకి, ప్రదీప్ కి మధ్య వాదోపవాదాలు జరిగాయి.  "ఈ నలుగురిని నేను పిల్లలు అనుకుంటే ఇప్పుడు ఆ నలుగురే వచ్చి మమ్మల్ని ఎలిమినేట్ చేయడం అనేది నాకు కొంచెం అబ్నార్మల్ గా అనిపించింది. ఇప్పుడు సొసైటీలో నడుస్తున్న ట్రెండ్ ఇదే...మేము  సోనియాని ఒక నాలుగు సార్లు నామినేట్ చేయాలని అనిపించినా నా బిడ్డ లాంటిది  అని ఈ నలుగురిలో ఎవరిని నామినేట్ చేసినా బాధపడతారు అని మేము అనుకున్నాం. కానీ మీరు అయ్యో పెద్దవాళ్ళు, తల్లితండ్రుల లాంటి వాళ్ళు..వాళ్ళను నామినేట్ చేస్తే బాధపడతారు అని ఈ తరం అనుకోలేదు" అని ప్రదీప్ కాస్త సీరియస్ గా అన్నారు. దానికి సోనియా ప్రదీప్ మీద ఫుల్ ఫైర్ అయ్యింది. "ఎలిమినేషన్ అనేది టాస్క్ బేస్డ్ గా ఉంది కాబట్టి మెం నలుగురు కలిసి నామినేట్ చేసాము. ఇదేమీ ట్రెండ్ కాదు. ఇప్పటి మా ట్రెండ్ ఏంటంటే మేము ఈరోజు ఏదైనా నేర్చుకుంటే దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాం అదే మా ట్రెండ్ " అని సోనియా చాలా ఘాటుగా జవాబు ఇచ్చింది. ఇప్పుడు ఈ ప్రోమో బాగా వైరల్ అవుతోంది. అమర్‌దీప్- తేజు, యష్-సోనియా, అభయ్ నవీన్-భవానీ, అనిల్ గీలా-ఆమని జోడీలు కలిసి ప్రదీప్-సరస్వతి జంటని నామినేట్ చేశాయి. దీంతో ప్రదీప్ చాలా హర్ట్ అయ్యారు. మరి ఇంకా ఎలా రియాక్ట్ అయ్యారో చూడాలంటె కొన్ని గంటలు ఆగాలి.  

Illu illalu pillalu : మామయ్యకి ఎదురుతిరిగిన కొత్త కోడలు.. రామరాజుతో పాటు కుటుంబమంతా షాక్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్నా సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -81 లో.....నర్మద తన ఫ్రెండ్ తో చందు గురించి చెప్తుంది. మా పిన్ని వాళ్ళ అమ్మాయి ఉంది.. నేను వాళ్ళతో చెప్పి కాల్ చేస్తానని తను నర్మద తో అంటుంది. ఆ తర్వాత నర్మద ఆఫీస్ నుండి ఇంటికి వస్తుంది.  తన ఫ్రెండ్ కాల్ చేసి మా వాళ్లకి సంబంధం గురించి చెప్పాను.. వాళ్లు ఒకే అన్నారని నర్మద ఫ్రెండ్ అనగానే.. మరి మా పెళ్లిళ్ళు గురించి చెప్పావా అని నర్మద అడుగుతుంది. చెప్పానని తను అనగానే నర్మద హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ విషయం ఇంట్లో వాళ్లకు చెప్పాలనుకోని హాల్లోకి వస్తుంది. అందరు అక్కడే ఉండడంతో బావగారికి ఒక సంబంధం వచ్చిందని చెప్తుంది. వద్దు నేను పెళ్లి సంబంధం చూస్తానని రామరాజు అనడంతో మీరు ఎందుకు వద్దని అంటున్నారో నాకు తెలుసు మావయ్య.. కానీ మా పెళ్లిళ్ల గురించి ఆల్రెడీ మా ఫ్రెండ్ వాళ్ళకి చెప్పిందట.. అందుకే మీకు చెప్తున్నానని అనగానే అందరు రామరాజుని ఒప్పిస్తారు. మరుసటి రోజు వేదవతి రెడీ అవుతుంది. రామరాజు గతంలో పెళ్లి చూపులు జరిగినప్పుడు వాళ్ళు అన్న మాటల గురించి బాధపడుతుంటే.. ఈ సారి అలా ఏం కాదని వేదవతి చెప్తుంది. మరొకవైపు నర్మద కుటుంబం గురించి ఆలోచిస్తున్నందుకు సాగర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత అందరు రెడీ అయి హాల్లోకి వస్తారు. నేను వంట చేయలేదు మీరే చేసుకోండని ప్రేమకి వేదవతి చెప్తుంది. అందరు కలిసి వెళ్తుంటే అదంతా చూసిన భద్రవతి.. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో కనుక్కోమని విశ్వకి చెప్తుంది. ఆ తర్వాత రామరాజు కుటుంబం పెళ్లిచూపులకి వెళ్తారు. అది విశ్వ చూసి భద్రవతికి ఫోన్ చేసి చెప్పగానే.. వాళ్ళ ఫోన్ నెంబర్ డీటెయిల్స్ కావాలని భద్రవతి విశ్వకి చెప్తుంది. మరొకవైపు అమ్మాయి, అబ్బాయిలు ఇష్టమని చెప్తారు. మాకు అన్ని విషయలు నర్మద ఫ్రెండ్ పద్మ చెప్పిందని  అనగానే.. రామరాజు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు.అప్పుడే అమ్మాయి తండ్రి మళ్ళీ వస్తానంటూ వెళ్తాడు. తరువాయి భాగంలో అమ్మాయి తండ్రి వచ్చి ఈ సంబంధం వద్దు.. ఊరు, పేరు లేనోడి ఇంటికి నా కూతురిని ఇవ్వను అని అనగానే.. రామరాజు కుటుంబం వెళ్లిపోతారు. ఆ తర్వాత సాగర్, నర్మదలు గొడవ పడతారు. సాగర్ నర్మదపై చెయ్ ఎత్తుతాడు. అది చూసి రామరాజు కోప్పడతాడు. సాగర్ పై రామరాజు చెయ్ ఎత్తుతుంటే నర్మద ఆపుతుంది. దాంతో అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : కావేరిని చిన్నమ్మ అని పిలిచిన కార్తీక్.. తండ్రికిచ్చిన మాటని నిలబెట్టుకుంటాడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -280 లో.....కాంచన, దీపలు కావేరికి కృతజ్ఞతలు చెప్పాడానికి తన ఇంటికి వెళ్తారు. నిన్ను నా ప్రవర్తనతో బాధపెట్టాను కానీ నువ్వు నా మనవరాలి ప్రాణం కాపాడవని కావేరికి కాంచన థాంక్స్ చెప్తుంది. దాంతో కావేరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే అక్కడికి శౌర్యని తీసుకొని వస్తాడు కార్తీక్. తాతయ్య చిన్న నానమ్మ అంటు కావేరి దగ్గరికి శౌర్య వస్తుంది. నాకు మీరు ఏదో హెల్ప్ చేశారు అంట కదా నాన్న థాంక్స్ చెప్పన్నాడని శౌర్య అంటుంది. నేను కొంచెం వీళ్ళతో మాట్లాడాలని శౌర్యని తీసుకొని కాంచన, దీప లని కార్తీక్ వెళ్ళమని చెప్తాడు. దాంతో వాళ్ళు వెళ్ళిపోతారు కానీ కార్తీక్ ఏం మాట్లాడతాడో అని దీప బయట ఉండి చూస్తూ ఉంటుంది. మీరు నా కూతురు ప్రాణం కాపాడారు.. మీరు చేసిన సాయాన్ని మరొకరిది అని చెప్తున్నారు.. అలాంటి వాళ్ళని దరిద్రలు అంటారు అని ఇండైరెక్ట్ గా శ్రీధర్ ని అంటాడు. మిమ్మల్ని ఎప్పుడు ప్రేమగా పలకరించేలేదు కానీ అందరి కంటే ఎక్కువ నా బాధ ని అర్థం చేసుకున్నారని థాంక్స్ చెప్తాడు. ఇది మీ దగ్గర నేను నలభై అయిదు లక్షలు అప్పు తీసుకున్న అని నోట్.. ఇది తీసుకోండి అని కార్తీక్ ఇస్తుంటే నాకూ వద్దు నేను అప్పు ఇవ్వలేదని కావేరి అంటుంది. మా అమ్మపై ఏ మాత్రం అభిమానం ఉన్నా తీసుకోండి అని కార్తీక్ తన చేతిలో పెడతాడు సంవత్సరం లోపు మీకు అప్పు చెల్లిస్తానని శ్రీధర్ కి చెప్పి కార్తీక్ వెళ్తాడు. దాంతో నువ్వే వాళ్ళని నా వాళ్ళు అనుకుంటున్నావు.. వాళ్ళు కాదు అనుకుంటే పిన్ని అని పిలిచే వాడు కదా అని శ్రీధర్ అంటాడు. మళ్ళీ కార్తీక్ వచ్చి ఒక విషయం చెప్పడం మర్చిపోయాను.. నా కూతురు చిన్న నాన్నమ్మ ఎప్పుడు మన ఇంటికి వస్తుందని, మీరు ఎప్పుడు అయినా మన ఇంటికి వచ్చి వెళ్లొచ్చు చిన్నమ్మ అని కార్తీక్ అంటాడు. నీ కూతురు ఇంటికి వెళ్లినట్లు నీ కొడుకు ఇంటికి రావచ్చు.. ఉంటాను చిన్నమ్మ అనగానే కావేరి మొహం వెలిగిపోతుంది. శ్రీధర్ మొహం మాడిపోతుంది. అదంతా చూస్తున్న దీప హ్యాపీగా ఫీల్ అవుతుంది. కార్తీక్ వెళ్ళిపోతాడు. అంటే మీరందరు ఒకటే.. నేను ఒక్కడినే వేరే అని శ్రీధర్ కోపంగా అనుకుంటాడు.  ఆ తర్వాత కార్తీక్ దీప ఇంటికి వెళ్తారు. నువ్వు వస్తావని అనుకోలేదు రా అని కాంచన అనగానే.. నీ కొడుకిని కదమ్మా నాకు కృతజ్ఞతలు చెప్పాలనిపించింది.. శౌర్య విషయం చెప్తే దీప ఎలా బాధపడుతుందని దీపకి నేను చెప్పాకుండా దాచానో, తను కూడా డబ్బు ఎవరిచ్చారో చెప్తే నేను బాధపడుతానని చెప్పలేదని కార్తీక్ అంటాడు. దీపని అర్ధం చేసుకుంటాడు. నోట్ రాసిచ్చానన్నావ్ అంత డబ్బు ఎలా కడతావని కాంచన అనగానే.. కడతారు, తాతయ్యకి ఇచ్చిన మాట కాదు.. తండ్రికి ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకుంటారని దీప చెప్తుంది. అందరికి నా గెలుపుతోనే సమాధానం చెప్తానని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : సీతాకాంత్ కి బాబుని అప్పగించిన శ్రీలత..  ఆ మైథిలీ ఎవరంటే!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -327 లో.... రామలక్ష్మికి పిండప్రధానం చెయ్యాలని శ్రీలత పంతులిని పిలిపిస్తుంది. నువ్వే పిండప్రధానం చెయ్యాలని శ్రీలత సీతాకాంత్ తో అనగానే.. నా చేతులతో నేను ఎలా చెయ్యాలి అంటూ సీతాకాంత్ బాధపడుతుంటాడు‌‌. అక్కకి ఆత్మ శాంతిస్తుందని శ్రీవల్లి అంటుంది‌. దాంతో సీతాకాంత్ ఒప్పుకుంటాడు.నేను ఒప్పుకోనంటూ మాణిక్యం ఎంట్రీ ఇస్తాడు.. నా కూతురు చనిపోతే తన బాడీ అన్న దొరకాలి కదా.. నా కూతురు చనిపోలేదని మాణిక్యం అంటాడు. చనిపోయింది అని సీతాకాంత్ అంటాడు. వీళ్ళే చంపేశారు.. మిమ్మల్ని కూడ ఏదో చేస్తారు.. నాతో రండీ అల్లుడు అని మాణిక్యం అంటుంటే.. నా వాళ్ళను అనుమానిస్తున్నావ్ నేను అసలు రాను అని సీతాకాంత్ అంటాడు. నా కొడుకుని తీసుకొని వెళ్తానంటూ మాణిక్యం ధనని మాణిక్యం తీసుకొని వెళ్తూ‌‌‌.. నా అల్లుడిని కూడా నేను కాపాడుకుంటానని మాణిక్యం వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి ధనని తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత రామలక్ష్మి ఫోటో చూస్తూ సీతాకాంత్ బాధపడుతుంటాడు అప్పుడే శ్రీలత వాళ్లు బాబుని తీసుకొని తన దగ్గరికి వస్తారు. నువ్వు ఇలా బాధపడితే ఎలా సిరి పురిటిలోనే చనిపోయింది‌ రామలక్ష్మి చనిపోయింది. నువ్వు ఇలా ఉంటే బాబుని ఎవరు చూసుకుంటారని అంటుంది. బాబుని నువ్వే దగ్గరికి తీసుకోవాలని శ్రీలత అంటుంది. సీతాకాంత్ బాబుని ఎత్తుకొని మా నాన్న ప్రేమలో రామలక్ష్మి ప్రేమని చూసుకుంటానని సీతాకాంత్ అంటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అంటూ ఈ సీరియల్ ముందుకు సాగుతుంది. ఒక పెద్దింట్లో పెద్దావిడ, పెద్దాయన ఎంట్రీ ఇస్తారు. తన మనవరాలు మైథిలి(రామలక్ష్మి) షెటిల్ ఆడుతూ ఉంటుంది. ఆ గేమ్ చివరలో మైథిలి ఓడిపోతుంది. ఏంటి అమ్మ ఓడిపోయావని వాళ్ళు అడుగగా.. మనం గెల్వడం కన్నా పక్కవాళ్ళని గెలిపిస్తేనే సంతోషంగా ఉంటుందని రామలక్ష్మి అంటుంది. దాంతో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : సీతారామయ్య నిర్ణయంతో రుద్రాణి షాక్.. కుటుంబం విచ్ఛిన్నం అవుతుందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -644 లో.... ఆస్తుల్లో మా వాటాలు మాకిచ్చి మీరు ఏమైనా చేసుకోండి అంటూ ధాన్యలక్ష్మి కఠినంగా మాట్లాడుతుంటే.. అప్పుడే ఇందిరాదేవి, సీతారామయ్య వస్తారు. నా మాటకి విలువ లేనప్పుడు.. నా ఆస్తులు ఎందుకని సీతారామయ్య ముక్కుసూటిగా మాట్లాడతాడు. అంటే మీ వారసుల గురించి ఆలోచించరా అని ధాన్యలక్ష్మి అనగానే.. మాటకి విలువ ఇవ్వనివారు ఎలా వారసులు అవుతారని ఇందిరాదేవి అంటుంది. రాజ్ నువ్వు ఆస్తులు అమ్మి ఆ అప్పు కట్టు అంటూ రాజ్ కి సీతారామయ్య చెప్తాడు. పేపర్స్ అన్ని లాకర్ లో ఉన్నాయ్ రేపు సబ్ మిట్ చేస్తానని రాజ్ అనగానే.. సరే రేపు వస్తామంటూ బ్యాంక్ వాళ్ళు వెళ్ళిపోతారు. మనిషికో దారిని చూసుకుందామంటూ రుద్రాణి కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. రుద్రాణి, రాహుల్ లు బయట కూర్చుని అనుకున్నది ఒకటి.. అయింది ఒకటి అన్న బ్యాక్గ్రౌండ్ సాంగ్ వేసుకొని బాధపడుతుంటారు. అప్పుడే స్వప్న వచ్చి రుద్రాణి చేతిలో ఒక గిన్నె పెట్టి ఇప్పుడు మీ సిచువేషన్ ఇదే అని ఎగతాళి చేస్తూ ఉంటుంది. ఒకసారి మీరు ముష్టి ఎత్తుతున్నట్లు ఉహించుకోండి అనగానే ఇద్దరు ఆడుక్కున్నట్టు ఉహించుకొని టెన్షన్ పడతారు. మరొకవైపు ప్రకాష్, సుభాష్ ఇందిరాదేవి, అపర్ణ లు మాట్లాడుకుంటారు. ప్రకాష్ పూర్తిగా ధాన్యలక్ష్మి చెప్పినట్టు వింటున్నాడని ఇందిరాదేవి, అపర్ణ లు అంటుంటారు. ప్రకాష్ సైలెంట్ గా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. వాడు మళ్ళీ మారేలా లేడని ఇందిరాదేవి బాధపడుతుంది. రాజ్, కావ్యలు ఇంట్లో జరిగిన దానికి బాధపడుతుంటారు. మరొకవైపు కుటుంబం విచ్ఛిన్నం అవుతుందని సీతారామయ్య ఇందిరదేవితో చెప్తూ బాధపడతాడు. అప్పు స్టేషన్ లో ఉండగా కళ్యాణ్ తనకి క్యారేజ్ తీసుకొని వస్తాడు. దాంతో అప్పు ఆశ్చర్యంగా చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.