Brahmamudi : రాహుల్ కి వార్నింగ్.. వాళ్ళిద్దరు వందకోట్ల అప్పు చేశారు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -641 లో.....అనామిక, రుద్రాణి ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకుంటారు. నేను రేపు జరగబోయే బారసాల ఫంక్షన్ కి వచ్చి.. పెద్దబాంబు పేల్చబోతున్న అని అనామిక అంటుంది. ఏంటని రుద్రాణి అడుగగా.. ఇప్పుడు చెప్పను. రేపు నువ్వే చూస్తావ్ కదా అని అనామిక ఫోన్ కట్ చేస్తుంది. ఏం చేస్తే ఏంటిలే ఆస్తులు మాకు రావాలని రుద్రాణి అనుకుంటుంది. మరుసటి రోజు బారసాలకి అన్ని ఏర్పాట్లు చేస్తారు. అప్పు, కావ్యలు ఉయ్యాలా డెకరేషన్ చేస్తుంటారు. అప్పుడే ఇందిరాదేవి వస్తుంది. వాళ్ళతో సరదాగా మాట్లాడుతుంది. అదంతా చూస్తున్న రుద్రాణి, ధాన్యలక్ష్మి ఓర్వలేకపోతారు. రాహుల్ ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతుంటే.. రాజ్, కళ్యాణ్ లు వస్తారు. ఇప్పుడు నువ్వు ఒక బిడ్డ తండ్రివి అని అనగానే.. అలా ప్రతీసారి నన్ను అంకుల్ అని గుర్తు చేయకండి అని రాహుల్ అంటాడు. ఇక నుండి ఇంతకు ముందులా ఉన్నట్లు ఉంటే కుదరదని రాజ్ అనగానే.. నేను అంత రోమియో ని కాదని రాహుల్ అంటాడు. నువ్వు ఏంత రోమియోవో మాకు తెలుసు గానీ వెళ్లి రెడీ అవ్వమని రాజ్, కళ్యాణ్ అంటారు. ఆ తర్వాత కనకం బారసాల ఫంక్షన్ కి వస్తుంది కనకాన్ని అవమానించాలని రుద్రాణి చూస్తుంది కానీ కనకమే తనని అవమానిస్తుంది. కనకం స్వప్న పాప దగ్గరికెళ్ళి ముద్దాడుతుందే ఇందిరాదేవి వచ్చి.. రండీ టైమ్ అవుతుందని పిలవగానే అందరు ఉయ్యాలా దగ్గరికి వెళ్తారు. ఇందిరాదేవి ఉయ్యాలలో పాపని పడుకోబెట్టి ఆశీర్వదిస్తుంది. ఆ తర్వాత అనామిక ఎంట్రీ ఇస్తుంది. ఎందుకు వచ్చవంటూ అందరు అడుగుతారు. ఇక్కడున్న అమాయకులానికి మేలుకోల్పడానికి అని అనామిక అంటుంది. కావ్య, రాజ్ లు వెళ్ళమని చెప్తారు. రాజ్ కావ్య లు మీ దగ్గర ఒక పెద్ద విషయం దాచారని అనామిక చెప్తుంది. తరువాయి భాగంలో.. రాజ్, కావ్య వంద కోట్లు అప్పు చేశారు. అప్పు కట్టమని నోటిసులు పంపించారని అనామిక డాకుమెంట్స్ ఇస్తుంది. అది చూసి సుభాష్ షాక్ అవుతాడు. ఎందుకు అప్పు చేశారంటూ అపర్ణ గట్టిగా నిలదీస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

మరదలి ప్రేమలో పటాస్ ప్రవీణ్...దీవించిన ఇంద్రజ

  సోషల్ మీడియాలో పటాస్ ప్రవీణ్ ఫైమా జోడి ఒకప్పుడు కలిసి వీడియోస్ చేసేవాళ్ళు. ఐతే వీళ్ళిద్దరూ తర్వాత విడిపోయారు. ప్రవీణ్ ఐతే నిజంగా లవ్ చేశాను ఫైమాని అని చెప్తే ఫైమా మాత్రం జస్ట్ ఫ్రెండ్ అనేసరికి ప్రవీణ్ తట్టుకోలేకపోయాడు. ఇక ఇప్పుడు తన మరదలితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. ఐతే తన మరదలుకి తానేంటో ఎంతో ఇష్టం అని చెప్పుకొచ్చాడు. ఐతే ఈ విషయాన్ని ఈ ఆదివారం ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో బయటపెట్టాడు. అలాగే ప్రవీణ్ తన మరదలిని కూడా ఈ షోకి తీసుకొచ్చాడు. ఐతే రాంప్రసాద్ వచ్చి "ఏంటి ప్రవీణ్ సెటిల్ అయ్యావంట.. కొత్త అమ్మాయిని చూసుకున్నావట..పెళ్లి చేసుకోబోతున్నావట" అని అడిగాడు. దానికి ఇంద్రజ అది తన డెసిషన్ అని చెప్పారు. "ప్రవీణ్ నన్ను తల్లిగా స్థానంలో ఉంచి ఎక్కువగా అభిమానిస్తాడు..అలా తన సమస్యను చెప్పుకున్నాడు. ఐతే నేను కూడా ప్రవీణ్ నిజమైన ప్రేమకు ఎవరైనా మంచి అమ్మాయి ఉంటే బాగుండు అనుకున్నా. ఆ అమ్మాయికి కూడా ప్రవీణ్ అంటే ఇష్టం..అందుకే వాళ్లకు ఈ షోకి నేను ఇన్వైట్ చేసాను" అన్నారు. ఇక రష్మీ "ఏంటి ఇది రియలా ? అని అడిగింది. " అవును ..వంశికకి ఫాదర్ లేడు..ఫామిలీని ఈ అమ్మాయే పోషిస్తుంది. అందుకే వంశిక అంటే ఇష్టం" అన్నాడు ప్రవీణ్. "ప్రవీణ్ అందరినీ బాగా చూసుకుంటాడు...చాలా ప్రేమగా ఉంటాడు..అందుకే ఇష్టం" అని చెప్పింది వంశిక.

ఉదయభాను పిల్లలకు సర్ప్రైజ్ గిఫ్ట్ పంపించిన బాలయ్య ఫ్యామిలీ!

  సినిమా హీరోయిన్స్ కి మాత్రమే కాదు యాంకర్స్ కి మంచి ఫ్యాన్ బేస్ ఉంటుంది. అలాంటి వాళ్ళల్లో అలనాటి అందాల యాంకర్ సుమ, ఉదయభాను, ఝాన్సీ ఇలాంటి వాళ్ళ గురించి చెప్పుకోక తప్పదు. ఐతే ఝాన్సీ ఇప్పుడు యాంకరింగ్ చెయ్యట్లేదు కానీ రవీంద్ర భారతిలో నాటకాలు రచించడం, ప్రదర్శించడం వంటివి చేస్తోంది. ఉదయభాను, సుమ యాంకరింగ్ చేస్తున్నారు. ఐతే రీసెంట్ గా బాలకృష్ణ గురించి ఒక విషయాన్ని షేర్ చేసుకుంది.    బాలయ్య బాబు తన పిల్లలకు గిఫ్ట్ గా ఒక వయోలిన్ ని పంపించారని చెప్తూ ఆ వయోలిన్ ని తన పిల్లలకు ఇచ్చి సర్ప్రైజ్ చేసింది ఉదయ భాను. "ఒక స్పెషల్ పర్సన్ మీకు గిఫ్ట్ పంపించారు. బాలయ్య మామ అంటే ఎవరికీ ఇష్టం ఇక్కడ" అంటూ తన ట్విన్ డాటర్స్ ని అడిగింది. మాకిష్టం అంటూ ఇద్దరూ పిల్లలు చేతులెత్తారు. దాంతో మీకు ఎంతో ఇష్టమైన వయోలిన్ పంపించారు అంటూ ఆ వయోలిన్ ని వాళ్లకు ఇచ్చింది. అది చూసాక ఆ ఇద్దరి పిల్లల్లో ఆనందం వేరే లెవెల్ లో ఉంది. దానికి ఆ ఇద్దరు పిల్లలు థ్యాంక్యూ బాలయ్య మామ అని చెప్పారు. ఉదయభాను అటు బాలయ్యకు ఇటు నారా బ్రాహ్మణికి థ్యాంక్స్ చెప్పింది. ఇక నెటిజన్స్ ఐతే "బాలయ్య బంగారం.. తండ్రికి తగ్గ కూతురు బ్రాహ్మణి నారా... జై బాలయ్య మా నందమూరి బిడ్డ కదా అలానే ఉంటది" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.      యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉదయభాను వన్స్ మోర్ ప్లీజ్, సాహసం చేయరా డింబకా, డ్యాన్స్ బేబీ డ్యాన్స్, రేలారే రే రేలా, ఢీ రియాలిటీ డ్యాన్స్ షో, జాణవులే నెరజాణవులే, పిల్లలు పిడుగులు ఇలా  పాపులర్ షోస్ చేసింది. ఇక యాంకర్ గానే కాదు సినిమాల్లోనూ నటించింది. ఉదయభాను మొదటి సినిమా ఎర్ర సైన్యం. తర్వాత లీడర్ లో ఒక సాంగ్ చేసింది.   

ఆరియానా పతివ్రత స్టాండర్డ్స్ మాములుగా లేవు!

  సోషల్ మీడియాలో హాట్ గా హీట్ పుట్టించే భామ ఆరియానా. రకరకాల రీల్స్ చేస్తూ వీడియోస్ ని పోస్ట్ చేస్తూ అందరినీ తన వైపుకు తిప్పుకుంటుంది. ఐతే త్వరలో ప్రేమికుల దినోత్సవం రాబోతోంది. దాంతో ఇక మూవీలో ఉన్న ప్రేమ, పెళ్లి సీన్స్ ని బయటకు తీసి రీల్స్ గా చేసి  ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ అందాల భామ కూడా అలాంటి ఒక రీల్ చేసిందండోయ్...ఆ డైలాగ్ మావిచిగురు మూవీలో శ్రీలక్ష్మి, బాబు మోహన్, బ్రహ్మానందం మధ్యన జరిగే "నా మనసు నాకు ఇచ్చేయ్ గోపి" అనే మోస్ట్ ఫన్నీ డైలాగ్. ఇక ఈ ముగ్గురి ప్లేస్ లో ఎవరెవరు చేశారో తెలుసా ఆరియానా, ముక్కు అవినాష్ తమ్ముడు అజయ్, రోల్ రైడా.      "గోపి నువ్వు సచ్చావునుకుని ఈ అడ్డగాడిదను చేసుకున్నాను..నేనిప్పుడు వీడి భార్యను... పతివ్రతా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాను...మనిషిని వీడి దగ్గర ఉన్నా కానీ మనసు నీ దగ్గర బ్లాక్ ఐపోయింది" అంటూ సినిమాలో శ్రీలక్ష్మి చాలా ఎమోషనల్ గా చెప్పింది. ఇదే డైలాగ్ తో ఆరియానా టీమ్ రీల్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇక నెటిజన్స్ ఐతే ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. "ఇచ్చేయ్ గోపి..ఎందుకు మనకు ఇదంతా...అక్కా సంపేశావ్ ...పతివ్రత స్టాండర్డ్స్ గురించి మీరే చెప్పాలి. సూపర్ గా చేశారు" అంటూ చెప్తున్నారు. ఆరియానా  డైరెక్టర్ ఆర్జీవీతో కలిసి  చేసిన రచ్చ ఓ రేంజిలో క్రేజ్ ఆమెకు క్రేజ్ తీసుకొచ్చింది. బుల్లితెరపై సందడి చేస్తూనే సినిమాల్లోనూ కనిపిస్తోంది ఈ అమ్మడు.  

డైరెక్టర్ గా రామ్ ప్రసాద్.. స్టార్ హీరోలతో ఆది!

  జబర్దస్త్ లో ఆటో రామ్ ప్రసాద్, హైపర్ ఆది వీళ్ళ జోడితో వచ్చే స్కిట్స్ బాగా పేలుతూ ఉంటాయి. ఇక వీళ్ళు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఇతరత్రా అన్ని షోస్ లో కనిపిస్తూనే ఉంటారు. ఐతే ఇటు బుల్లి తెర మీద అటు సిల్వర్ స్క్రీన్ మీద కూడా మెరుస్తూ ఉంటారు. ఆది తరచూ మూవీస్ లో కనిపిస్తాడు కానీ ఆటో రాంప్రసాద్ తక్కువ. ఇప్పుడు వీళ్ళు ఫుల్ బిజీగా ఉన్నారు. ఐతే రీసెంట్ గా ఒక వీడియోలో కొన్ని ఇంటరెస్టింగ్ పాయింట్స్ చెప్పారు.    ముందుగా ఆది మాట్లాడుతూ..."ప్రస్తుతానికి నేను మూడు సినిమాలు చేస్తున్నా. రవితేజ గారితో, సందీప్ కిషన్ గారితో, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారితో సినిమాల్లో నటిస్తున్నా. వీళ్ళ మూవీస్ లో ఫన్ రోల్ లో చేస్తున్నా. నెట్ ఫ్లిక్స్ లో ఒక వెబ్ సిరీస్ కూడా చేస్తున్నా. ఈ వెబ్ సిరీస్ మంచి ఫన్ గా ఇంటరెస్టింగ్ గా ఉంటుంది. పెళ్లి తొందరగా చేసుకోవాల్సిన అవసరం ఏముంది... నెమ్మదిగానే చేసుకుంటాలే" అన్నాడు.    ఇక తర్వాత రామ్ ప్రసాద్ మాట్లాడుతూ  "నేను జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ చేస్తూనే ఒక వెబ్ సిరీస్ కి కమిట్ అయ్యాను. నాకు రైటర్ గా ఉండడం ఇష్టం. అందుకే మూవీస్ కి ఫ్రీలాన్స్ గా రాస్తూ ఉంటాను. అలాగే త్వరలో డైరెక్టర్ కాబోతున్నా. ట్రైల్స్ లో ఉన్నాను. ఆల్మోస్ట్ ఓకే ఐపోయింది. ఈ ఇయర్ ఒక ఫామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీని డైరెక్ట్ చేయబోతున్నా." అన్నాడు.   ఐతే ఇప్పుడు జబర్దస్త్ నుంచి వెళ్లిన వాళ్లంతా కూడా డైరెక్టర్స్ గా, స్క్రిప్ట్ రైటర్స్ గా , హీరోస్ గా మారిపోతున్నారు. సుధీర్ హీరోగా కొన్ని మూవీస్ చేసాడు, వేణు వండర్స్ డైరెక్టర్ గా బలగం సినిమా తీసి ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్నాడు. అలాగే ఇప్పుడు రామ్ ప్రసాద్ కూడా డైరెక్టర్ గా ఒక మూవీ తీయబోతున్నట్లు చెప్పారు. ఆడియన్స్ అంతా కూడా తనకు సపోర్ట్ చేయాలంటూ చెప్పుకొచ్చాడు.  

తండేల్ మూవీ చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్న పవిత్ర!

  రీసెంట్ గా రిలీజయిన అక్కినేని నాగ చైతన్య నటించిన తండేల్ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. ఐతే ఎంతో మంది అమ్మాయిల చేత కన్నీళ్లు పెట్టించే సీన్స్ కూడా ఇందులో ఉన్నాయి. లవర్స్ కి బాగా కనెక్ట్ అయ్యే మూవీ. ఐతే ఈ మూవీ చూసి వెక్కి వెక్కి ఏడ్చింది పాగల్ పవిత్ర. నాగ చైతన్య కన్నీళ్లు పెట్టుకునే సీన్ ని చూపిస్తూ తానూ కూడా కన్నీళ్లు పెట్టుకుని అది వీడియో తీసి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది.    "కొన్ని సీన్స్ గురించి చెప్పడం కంటే ఫీల్ కావాల్సిందే. ఇప్పుడు అలానే నేను కూడా ఫీలవుతున్నా. ఈ సీన్ తో గతంలో నా హార్ట్ బ్రేక్ సీన్ నాకు గుర్తొచ్చింది" అంటూ కాప్షన్ పెట్టుకుంది. ఇక పవిత్ర కన్నీటి వీడియోని చూసిన నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. "నిజంగా ఆ సీన్ చూసినప్పుడు చాల ఎమోషనల్ గా అనిపించింది అక్క. ఎంత ఎమోషనల్ అయినావు బేటా?..మూవీ సూపర్. నువ్వు బెస్ట్ ఎంటర్టైనర్ వి.. ఎమోషనల్ అవ్వొద్దు. బేబీ ఏమైంది నీకు ఏడుస్తున్నావ్?" అని కామెంట్స్ చేస్తున్నారు.     ఇక లాస్ట్ ఇయర్ పవిత్ర సంతోష్ బ్రేకప్ చెప్పుకున్నారు. ఇక ఎవరి దారి వారిది అంటూ విడిపోయారు. ఐతే వీళ్ళు కలిసి షోస్ కి వచ్చారు. తర్వాత రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఏమయ్యిందో కానీ ఇద్దరూ విడిపోయారు. లాస్ట్ ఇయర్ ఇదే నెలలో విడిపోయారు. వీళ్ళు విడిపోయి కరెక్ట్ గా ఏడాది అయ్యింది. ఇప్పుడు తండేల్ మూవీతో తన ఓల్డ్ లవ్ స్టోరీను గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకుని పవిత్ర.  

భార్య ముందే వేరొక అమ్మాయికి ప్రపోజ్ చేసిన భర్త!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -323 లో.....రామలక్ష్మికి స్వామి ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. శ్రీలత ఒక్కతే కిచెన్ లో వంట చేస్తూ కష్టపడుతుంటే.. అప్పుడే సందీప్, ధన , శ్రీవల్లి వచ్చి ఎందుకు అమ్మ ఇలా కష్టపడుతున్నావని అడుగుతారు. మనం మారామని వాళ్ళకి కూడా అర్ధమవ్వాలి అన్నట్లు శ్రీలత మాట్లాడుతుంది. తన తల్లిలో వచ్చిన మార్పు చూసి సిరి హ్యాపీగా ఫీల్ అవుతుంది. సిరి నువ్వు ఇక్కడే కూర్చొ నీకు టిఫిన్ రెడీ చేసి తీసుకొని వస్తానంటూ ధన అంటాడు. అందరు కిచెన్ లో వర్క్స్ చేస్తూ ఉంటే.. రామలక్ష్మి, సీతాకాంత్ లు వస్తారు. మీరేంటి పనులు చేస్తున్నారని అడగగా మన పనులు మనం చేసుకోవడంలో తప్పేముందని సందీప్ అంటాడు. ఇన్ని రోజులు మీరు మా గురించి అలోచించి మీ గురించి అలోచించలేదు.. అందుకే ఇక మీరు పిల్లల్ని కనే పనిలో ఉండండి.. నాకు నా చేతిలో మానవడినో, మానవరాలినో ఇస్తే నేను హ్యాపీగా ఉంటానని శ్రీలత అంటుంది. అవునని సిరి అంటుంది. ఇప్పటికి వరకు ఆలోచించలేదు ఇక ఆలోచిస్తామని సీతాకాంత్ కాస్త సిగ్గు పడుతూ అంటాడు. రామలక్ష్మి, సీతాకాంత్ లు బయటకు వస్తారు. ఇద్దరు సరదాగా మాట్లాడకుంటూ.. ఒక గేమ్ ఆడుతారు ట్రూత్ ఆర్ డేర్ ఆడుతారు. సీతాకాంత్ కి రామలక్ష్మి ఒక రోజ్ ఇచ్చి తను ఒక అమ్మాయిని చూపించి ప్రపోజ్ చెయ్యమని చెప్తుంది. దంతో సీతాకాంత్ ఇబ్బంది పడ్డా కూడా వెళ్లి ఆ అమ్మాయి కి రోజ్ ఇస్తాడు. ఆ తర్వాత రామలక్ష్మి వంతు కాగా.. ఇప్పుడు నువ్వు నిజం చెప్పు నన్ను ఎందుకు ప్రపోజ్ చెయ్యమన్నావ్.. నిజం చెప్పు అంటాడు. నేను లేకపోతే మీరు వేరొకరితో ఉంటారో లేదోనని రామలక్ష్మి అంటుంది. ఏంటని సీతాకాంత్ కాస్త కోపంగా అనగానే.. రామలక్ష్మి కవర్ చేస్తుంది. శ్రీలత, సందీప్ లు లాయర్ ని పిలిపించి మాట్లాడతారు. శ్రీలత ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఏంటి అత్తయ్య గారు ఏం చేస్తున్నారని శ్రీవల్లికి అర్ధం కాదు. వాళ్ళు మాట్లాడేది కూడా శ్రీవల్లికి వినిపించదు. మరొక వైపు రామలక్ష్మి, సీతాకాంత్ లు గుడికి వెళ్తారు. ఆ  తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

జ్యోత్స్న  ఊహించిందే జరిగింది.. కావేరి సాయం చేసిందని తెలుసుకున్న శ్రీధర్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -276 లో.... కావేరి దగ్గరికి దీప వచ్చి.. పూజకి రమ్మని ఆహ్వానిస్తుంది. అదంతా దూరం నుండి శ్రీధర్ చూస్తాడు. దీప వెళ్ళిపోయాక వచ్చి.. ఎవరో వచ్చినట్లు ఉన్నారని అడుగుతాడు. అవును పూజకి రమ్మని పిలిచారని కావేరి అంటుంది. ఎవరని శ్రీధర్ అడుగగా.. ఏదో సమాధానం చెప్పి వెళ్ళిపోతుంది. శౌర్య ఆపరేషన్ కి డబ్బు ఎవరు ఇచ్చారని జ్యోత్స్న ఆలోచిస్తూ పేపర్ పై అందరి పేర్లు రాస్తుంది. అప్పుడే పారిజాతం వస్తుంది. ఎందుకు అలా రాసావని అడుగుతుంది. డబ్బు ఎవరు ఇచ్చారని ఒక ఐడియా కోసమని జ్యోత్స్న అంటుంది. తాత ఇవ్వడు. డాడ్ తాతయ్యకి తెలియకుండా ఇవ్వడు.. మమ్మీ ఇవ్వలేదు.. కాశీ స్వప్నలకి అంత సీన్ లేదు. కావేరి ఇవ్వలేదు.. శ్రీధర్ మావయ్య ఇచ్చే ఛాన్స్ ఉందని జ్యోత్స్న గెస్ చేసి పారిజాతానికి చెప్తుంది. మరోవైపు కాంచన, అనసూయలు పూజకి కావల్సిన ఏర్పాట్లు చేస్తారు. అప్పుడే దీప వస్తుంది. అందరిని పిలిచానని చెప్తుంది. స్వప్న, కాశీ లు హాల్లో మాట్లాడుకుంటారు. వాళ్ళు జ్యోత్స్న అంటూ మాట్లాడుతుంటే దాస్ విని ఒక్కసారిగా లేచి బయటకు వెళ్తు.. అసలైన వారసురాలు అంటు ఉంటాడు. దాస్ ని స్వప్న, కాశీలు చూసి.. నాన్న ఎక్కడికి వెళ్తున్నావంటూ లోపలికి తీసుకొని వెళ్తారు. దాస్ పరిస్థితి చూసి కాశీ బాధపడతాడు. మరొకవైపు శ్రీధర్ డ్రింక్ చెయ్యడానికి సిద్ధమవుతుంటే అప్పుడే జ్యోత్స్న ఫోన్ చేసి మాట్లాడుతుంది. తండ్రి, కొడుకులు ఒక్కటయ్యారు కదా కార్తీక్ కి యాభై లక్షలు ఇచ్చావ్ కదా అని అడుగుతుంది. అదేం లేదు నేను ఇవ్వలేదని శ్రీధర్ అనగానే మరి ఎవరు ఇచ్చి ఉంటారు.. అంత డబ్బు మీ ఇంటి నుండే సాయం అంది ఉందని అనుకుంటున్నాను.. కాంచన అత్త పూజ చేస్తుందంట, దీప పిలవడానికి వచ్చిందని జ్యోత్స్న అంటుంది. అక్కడికి కూడా వచ్చిందా అని శ్రీధర్ అంటాడు. అంటే అక్కడికి వచ్చిందా అని జ్యోత్స్న అడుగుగా లేదని శ్రీధర్ అంటాడు. ఆ తర్వాత కావేరిని పిలవడానికి దీప ఎందుకు వచ్చినట్లు అంటూ శ్రీధర్ బీరువా దగ్గరికి వెళ్లి డబ్బు ఉందో లేదో చూస్తాడు. లేకపోవడంతో బ్యాంక్ లో పని చేసే తన ఫ్రెండ్ కి కాల్ చేసి కావేరి ఎఫ్ డి కనుక్కుంటాడు. ఈ రోజే యాభై లక్షలు డబ్బు డ్రా చేసిందని చెప్పగానే.. శ్రీధర్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

భద్రవతి ఫోన్ తో పెళ్ళి వద్దనుకున్నారు.. రామరాజు షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -77 లో.....రామరాజు, వేదవతి లు చందుకి అమ్మాయిని చూడడానికి రెడీ అవుతారు. అన్నయ్య మంచోడు తనకి మంచి అమ్మాయి ని చుడండి అని సాగర్, ధీరజ్ లు చెప్తారు. నాన్న ఎలాగ కట్నం వద్దని అంటాడు కాబట్టి ఆడపడుచు కట్నం కంపల్సరీ అని చెప్పమని కామాక్షి అనగానే నువ్వు నీ ఆడపడుచు కట్నం అంటూ చిరాకు పడుతారు. ఇద్దరు బయలుదేరి వెళ్తుంటే.. అందరు నవ్వుతూ బై చెప్తుంటారు. అదంతా భద్రవతి చూడాలేకపోతుంది. రామరాజు అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తారు. అమ్మాయి బాగుందని వేదవతి చెప్తుంది. రామరాజు ఉన్న విషయం దాచిపెట్టకుండా ఇద్దరు కొడుకులు ప్రేమ వివాహం చేసుకున్నారని చెప్తాడు. అందులో తప్పేముందని అమ్మాయి తండ్రి పాజిటివ్ గా మాట్లాడతాడు. అమ్మాయికి చందు ఫోటో చూపించిగానే తను సిగ్గు పడుతుంది. మా వాడు నచ్చాడా అని వేదవతి అంటుంది. ఇద్దరు సంబంధం ఒకే అనుకుంటారు. మరొకవైపు ప్రేమ, ధీరజ్ లకి తిరుపతి ఫోటో షూట్ ఏర్పాటు చేస్తాడు. రామరాజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. పెద్దోడు చాలా మంచోడు తనకి మంచి సంబంధం వచ్చిందని మురిసిపోతాడు. ఆ తర్వాత భద్రవతి అమ్మాయి తండ్రి కి ఫోన్ చేసి సంబంధం ఒకే అయిందా అని అడుగుతుంది. ఒకే అయింది అని అతను చెప్పగానే.. ఆ రామరాజు డబ్బు ఉన్న అమ్మాయి లకి తన కొడుకులచే ఎర వేసి లేచిపోయి పెళ్లి చేసుకునేలా చేస్తాడు. ఇద్దరు కొడుకు లు లేచిపోయి పెళ్లి చేసుకున్నారు అంటూ పూర్తిగా రామరాజు గురించి తప్పుగా చెప్తుంది. రామరాజు, వేదవతిలు ఇంటికి వస్తారు. అప్పుడే అమ్మాయి తండ్రి ఫోన్ చేసి.. మీ సంబంధం మాకు వద్దని చెప్తాడు. రామరాజు షాక్ అవుతాడు. వెనకాల నుండి భద్రవతి చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

లేడీ విత్ బ్లాక్ క్యూట్ గా కొబ్బరిబోండాలు కొట్టడం చూస్తుంటే ...

  రీతూ చౌదరి.. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుల్లితెరపై షోలు, సీరియల్స్‌, ఈవెంట్స్ లో కనిపిస్తూ ఫుల్  ఫేమస్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఇక కుర్రాళ్లకైతే ఈవిడ సోషల్ మీడియా పోస్టులు నిద్రలేకుండా చేస్తుంటాయి. ఎప్పటికప్పుడు హాట్ హాట్ అందాలతో ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్ చేస్తుంది రీతూ చౌదరి. తాజాగా ఆమె పెట్టిన ఓ పోస్ట్, అందులో ఆమె చేసిన పని చూస్తే వావ్ అనకుండా ఉండరు. టోటల్ గా బ్లాక్ శారీ, నల్ల కళ్ళజోడు, బ్లాక్ బ్యాంగిల్స్, బ్లాక్ టాటూతో ఎగురుతూ దూకుతూ స్టెప్పులేసుకుంటూ జింక పిల్లలా చిందులేస్తూ ఒక రీల్ చేసింది. ఏదైనా డాన్స్ చేస్తుందో లేదా అటు ఇటు తిరుగుతూ రీల్ కంప్లీట్ చేస్తుందేమో అనుకుంటే ఫైనల్ గా ట్విస్ట్ ఇచ్చింది. కొబ్బరి బోండాన్ని కత్తితో కొట్టుకుని మరీ తాగేసింది. ఈ రీల్ చూసాక నెటిజన్స్ ఐతే "క్యూట్, సూపర్ , చీరలో ముద్దుగా ఉన్నారు, మేడం సర్ మేడం అంతే, చూపు తిప్పుకోలేకపోతున్నాం, నేచురల్ బ్యూటీ" అంటూ కామెంట్స్ ఇస్తున్నారు. రీతూ చౌదరి ఇటీవలే కొన్ని వివాదాల్లో చిక్కుకుని సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఈ వివాదాలను, గొడవలను పట్టించుకోకుండా రీతూ తనకు నచ్చినట్టు రీల్స్ చేసుకుంటూ పోతావుంది.  

ఐ లవ్ యు..ఇక్కడ అందరూ ఉన్నారు కట్ చెయ్యి...నందుకు గీతా సీక్రెట్ ప్రపోజ్

  వాలెంటైన్స్ డే వచ్చేస్తోంది. దాంతో బుల్లితెర మీద సందడి మొదలయ్యింది. ఏ షో చూసినా ఇప్పుడు అంతా ప్రేమికుల దినోత్సవమయమే  ఐపోయింది. ఇక ఇప్పుడు ఢీ షో కూడా ప్రేమికుల రోజు కాన్సెప్ట్ తో వచ్చిన డాన్స్ లు మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ ఎపిసోడ్ కంప్లీట్ గా వాలంటైన్స్ డే స్పెషల్ గా రాబోతోంది. ఇక ఈ షోలో హైపర్ ఆది నందుకి ఒక ఛాలెంజ్ ఇచ్చాడు. "నువ్వు ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా గీతా మాధురికి ఫోన్ చేసి ఐ లవ్ యు" అని చెప్పు..అన్నాడు. ఇక నందు కూడా గీతకు ఫోన్ చేసాడు. తీసి చెప్పు అంది గీతా. దానికి నందు  "ఐ లవ్ యు" అన్నాడు. గీతా  "ఆ ఆ" అనేసి అసలు వినకుండానే కట్ చేసింది. ఫోన్ కట్ చేసేసింది ఇటు ఆది అటు హన్సిక పగలబడి నవ్వారు. దాంతో నందు ఈగో హర్ట్ అయ్యింది. ఐతే వెంటనే మళ్ళీ గీతా ఫోన్ చేసింది నందుకు..నందు ఫోన్ లిఫ్ట్  చేసి "ఐ లవ్ యు " అన్నాడు. " ఐ లవ్ యు టూ ఇక్కడ అందరూ ఉన్నారు. కట్ చెయ్" అంటూ గుసగుసగా చెప్పి పెట్టేసింది. ఆ మాటతో అందరూ ఫిదా ఇపోయారు. ఇక నందు ఐతే ఫుల్ జోష్ గా ఉన్నాడు.  టాలీవుడ్ క్యూట్ కపుల్స్ లో సింగర్ గీతామాధురి, నటుడు నందు జంట ఎప్పుడూ ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు.  రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా  ఉంటారు. నందు – గీతామాధురి 2014లో ప్రేమ వివాహం చేసుకున్నారు. 2019లో వీరికి ఒక పాప పుట్టింది. ఆ పాపకు దాక్షాయణి ప్రకృతి అనే పేరుని పెట్టారు. ఆ తర్వాత వీళ్లకు ఒక బాబు పుట్టాడు. ఆ పిల్లాడి పేరును ‘ధృవధీర్ తారక్’ అని పేరు పెట్టుకున్నారు.  

బాలకృష్ణ గారు ఇష్టమా, జూనియర్  ఎన్టీఆర్ గారు ఇష్టమా ? విశ్వక్ కి షాక్ ఇచ్చిన సుధీర్

  ఫ్యామిలీ స్టార్ ప్రోమోలో యాంకర్ సుడిగాలి సుధీర్ విశ్వక్ ని అడిగిన ప్రశ్నకు ఒక్కసారిగా షాకయ్యాడు. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజున "లైలా" మూవీతో  ఆడియన్స్‌ని పలకరించబోతున్నాడు విశ్వక్ సేన్.  విశ్వక్ హీరోగా ఒక లేడీ గెటప్‍‌ లో కనిపించబోతున్నాడు . ఈ మూవీ ప్రమోషన్స్ కోసం లైలా మూవీ టీమ్ ఫామిలీ స్టార్స్ సెట్ కి వచ్చారు. ఇక ఈ  షోలో సుధీర్‌తో పాటు యాంకర్ స్రవంతి, అషూ రెడ్డి కూడా సందడి చేశారు. వీళ్ళ ఇద్దరితో కలిసి స్టెప్పులు వేశాడు విశ్వక్. ఇక ప్రోమో చివరిలో బాలకృష్ణ  విశ్వక్‌ సేన్ కి ముద్దు పెడుతున్న పిక్  చూపించి ఇంట్రెస్టింగ్ కొశ్చన్ అంటూ అడిగాడు  సుధీర్. "ఆ టైమ్‌లో టక్ మని బాలయ్య మీకు ముద్దు పెట్టగానే మీకు ఏం అనిపించింది" అంటూ సుధీర్ అడిగాడు. ముందుగా ఆయనకు పద్మభూషణ్ వచ్చినందుకు కంగ్రాట్స్ అని చెప్పాడు విశ్వక్. "మీరు ఇప్పటికీ ఆయన్ని బ్రో" అనే పిలుస్తారా అనేసరికి అవును అన్నాడు.. ఆ మాటకు ఇక సుదీర్ "మాదొకటే సర్ జై బాలయ్య" అని అరిచాడు. తర్వాత " బాలకృష్ణ గారు ఇష్టమా, జూనియర్  ఎన్టీఆర్ గారు ఇష్టమా" అంటూ సుధీర్ అడిగాడు. దాంతో ఎం ఆన్సర్ చెప్పాలో విశ్వక్ కి అర్థంకాక అసలు ఏ టైంలో ఎం ప్రశ్న అడిగావు సుధీర్ అంటూ ఒక లుక్ ఇచ్చాడు విశ్వక్. మరి ఇంతకు ఎం ఆన్సర్ ఇస్తాడో ఎపిసోడ్ లోనే చూడాలి. ఐతే సుధీర్ ఇంకోటి కూస విశ్వక్ ని అడిగాడు "సార్.. టీజర్ లాస్ట్‌లో ఒకావిడ వచ్చింది కదా.. ఆవిడ నంబర్ ఉంటే ఇస్తారా" అంటూ కొంటెగా అడిగాడు. అప్పుడు కూడా విశ్వక్ ఒక రేంజ్ లో చూసాడు.    

Illu illalu pillalu : ఇంట్లో కొత్త కోడలి ఫోటోషూట్.. బామ్మర్దిని ఈడ్చికొట్టిన రామరాజు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -76 లో.....ధీరజ్, తిరుపతి వాళ్ళతో పడుకోవడానికి బయటకు వస్తాడు. దాంతో ప్రేమ ఒక్కతి గదిలో భయపడుతుంది.. వెళ్లి లోపల పడుకోమని తిరుపతి, చందులు బలవంతంగా ధీరజ్ ని లోపలికి పంపిస్తారు. ధీరజ్ గదిలోకి వెళ్లేసరికి ప్రేమ కోపంగా ఉంటుంది. నేను బెడ్ పైన పడుకుంటానని ధీరజ్ అంటాడు. నేను ముందు అంటే ఏదో అన్నట్లున్నావ్ అంటు తన మాట తనకే చెప్తుంది ప్రేమ‌. ఆ తర్వాత ధీరజ్ నొప్పులతో నేలపైన పడుకుంటాడు. మరొకవైపు సాగర్, నర్మదలు రామరాజుతో చందు మాట్లాడిన మాటలు గుర్తుచేసుకుంటారు. నిజంగా బావగారు చాలా గ్రేట్ అని నర్మద అంటుంది. మరి నేను గ్రేట్ కాదా అని సాగర్ అంటాడు. ఇద్దరు కాసేపు ప్రేమగా మాట్లాడుకుంటారు. మరుసటి రోజు ప్రేమ తన ఇంటి ముందుకి వచ్చి.. తన తల్లి రేవతిని పిలుస్తుంది. అయిన రేవతి పలకదు. లోపలికి వెళ్లి రేవతి ఏడుస్తూ ఉంటుంది. మరొకవైపు ప్రేమ కూడా బాధపడుతుంటే.. అప్పుడే నర్మద వచ్చి బాధపడకని చెప్తుంది. ఆ తర్వాత రామరాజు, వేదవతిలు చందుకి అమ్మయిని చూడడానికి వెళ్తారు. తరువాయి భాగంలో ఇద్దరు వెళ్తుంటే.. భద్రవతి చూస్తూ ఉంటుంది. పెళ్లి చూపులకి వెళ్లి అమ్మాయి బాగుందని వేదవతి చెప్తుంది. రామరాజు, వేదవతిలు ఇంటికి వచ్చేసరికి ప్రేమ, ధీరజ్ లకి తిరుపతి ఫోటోషూట్ జరిపిస్తాడు. దాంతో రామరాజు కోపంగా తిరుపతి చెంప చెళ్లుమనిపిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : పూజకి శివన్నారాయణని ఆహ్వానించిన దీప.. జ్యోత్స్నతో మాటల యుద్ధం!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'( karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -275/ లో.... అసలు దీపకి డబ్బు ఎవరు ఇచ్చారు.. అది నేను చెయ్యాల్సిన పని.. ఇప్పుడు దీప ఎదురు అయితే ఎలా ఫేస్ చెయ్యాలని సుమిత్ర అనుకుంటుంది. అప్పుడే దీప ఇంటి గుమ్మం ముందు వచ్చి ఉంటుంది. తనని చూసి అందరు షాక్ అవుతారు. రెండు ప్రశ్నలకి సమాధానం చెప్పి లోపలకి రా అని శివన్నారాయణ అంటాడు. ఏంటని దీప అడుగుతుంది. శౌర్యా ఎలా ఉంది మొదటి ప్రశ్న.. ఇప్పుడు బాగుందని దీప చెప్తుంది. రెండవది డబ్బుల కోసం వాళ్ళు వచ్చారు.. నువ్వు ఎందుకు రాలేదని శివన్నారయణ అడుగగా.. అందరికి తెలిసాక నాకు తెలిసింది శౌర్య పరిస్థితి అని దీప చెప్తుంది. నీ భర్త నా ఇంట్లో అడుగుపెట్టను అన్నాడు.. ఇప్పుడు నువ్వు లోపలికి వస్తావా అని అనగానే.. దీప రాకుండా బయటే ఉంటుంది. ఇంతకు ఎందుకు వచ్చావని శివన్నారాయణ అడుగుతాడు. శౌర్య బాగుంటే కాంచన గారు పూజ చెయ్యాలని మొక్కుకున్నారంట.. పూజ చేస్తున్నాం.. మీరు రావాలని దీప అంటుంది. డబ్బుకి నువ్వు రావాలిసింది.. వాళ్ళు వచ్చారు.. ఇప్పుడు పూజకి పిలవాల్సింది మీ అత్త కానీ నువ్వు పిలుస్తున్నావ్ అంటూ అందులో నెగిటివ్ గా శివన్నారాయణ అంటాడు. దీప గడపకి బొట్టు పెట్టి ఆహ్వానిస్తుంది. ఆ తర్వాత దీప వెళ్లిపోతుంటే.. నేను మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయని దీప దగ్గరికి జ్యోత్స్న వెళ్తుంది. ఇద్దరి మధ్యలో మినీ మాటల యుద్ధం జరుగుతుంది. ఇంతకు డబ్బు ఎవరు ఇచ్చారని జ్యోత్స్న అడుగగా.. చెప్తే ఏం చేస్తావని దీప అడుగుతుంది. సన్మానం చేద్దామని జ్యోత్స్న అనగానే.. అయితే విను అని కార్తీక్ పేరు అంటుంది. ఇప్పుడు రెడీ చేసుకో సన్మానానికి క్యాటరింగ్ ఉంటే చెప్పు.. కార్తీక్ టిఫిన్ సెంటర్ ఫోన్ ఎప్పుడు అందుబాటులో ఉంటుందని దీప అంటుంటే.. జ్యోత్స్నకి ఇంకా కోపం వస్తుంది. ఇప్పుడే ఇలా మాట్లాడుతుంటే తనే అసలైన వారసురాలని తెలిస్తే ఇంకా ఎలా పొగరు ఉంటుందోనని జ్యోత్స్న అనుకుటుంది. ఆ తర్వాత కావేరి దగ్గరికి దీప వెళ్లి పూజకి పిలుస్తుంది. దీపని శ్రీధర్ చూసి.. ఎందుకు వచ్చిందని అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : ఆస్తి పేపర్లు తిరిగిచ్చేసిన సవతి తల్లి.. భర్త కోసం యాగం చేపిస్తున్న భార్య!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -322 లో... సీతాకాంత్ కి హాని ఉందని రామలక్ష్మి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన విషయం తెలిసి అందరు షాక్ అవుతారు. మా అమ్మవాళ్ళు మారారు అంటూ సీతాకాంత్ తనపై కోప్పడతాడు. మేమ్ ఏం చేస్తే మీరు నమ్ముతారని సందీప్ అంటాడు. మీరేం చేస్తే నమ్ముతారో నాకు తెలుసని శ్రీలత పైకి వెళ్లి ఆస్తుల పేపర్స్ తీసుకొని వచ్చి.. దీని కోసమే మేమ్ మిమ్మల్ని చంపాలి అనుకుంటున్నామని నువ్వు అనుకుంటున్నావ్ కదా.. అని డాక్యుమెంట్స్ రామలక్ష్మికి ఇస్తుంది శ్రీలత. నాక్కూడా ఆస్తులు వద్దు వదిన.. నన్ను కూడా అలాగే అనుకుంటదని సిరి అంటుంది. శ్రీలత ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటుంది. ఆస్తులు వద్దు ఏం వద్దు ఇంట్లో ఉండనిచ్చి ఒక పూట భోజనం పెట్టండి అని శ్రీలత అంటుంది. దాంతో బాధపడకు అమ్మ అని శ్రీలతని సీతాకాంత్ అక్కడ నుండి తీసుకొని వెళ్తాడు. రామలక్ష్మి మాత్రం అసలేం అర్థం కాదు. అత్తయ్య వాళ్ళు నిజంగా మారారు.. నేనే తప్పుగా అర్థం చేసుకుంటున్నానా అని అనుకుంటుండగా.. తన అంతరాత్మ బయటకు వచ్చి అలా మంచిగా మారానని చెప్పినంత మాత్రాన మారినట్టు కాదు.. వాళ్ళ బుద్ది వంకరే అని అంటుంది. సీతా గారు ఇక నీకు దూరం అవుతారని అంతరాత్మ చెప్తుంది. అనవసరం గా అత్తయ్య వాళ్ళ గురించి అలోచించి.. నేను సీతా గారితో ఉండాలిసిన టైమ్ వేస్ట్ చేస్తున్నానని రామలక్ష్మి అనుకుటుంది. మరొకవైపు అమ్మ నువ్వు గతంలో చేసిన తప్పులకి వదిన నిన్ను నమ్మడం లేదు.. ఇకనైనా అందరు బాగుండండి అంటూ సందీప్, ధన, శ్రీలతలకి సిరి చెప్తుంది. సీతాకాంత్ నిద్ర లేచేసరికి రామలక్ష్మి నృత్యం చేస్తుంది. ఏంటి ఇది అని సీతాకాంత్ అడుగగా.. నాకు ఇష్టం అందుకే చేస్తున్నా.. నాకు ఒక కోరిక ఉంది. ఈ రోజు మొత్తం మనం ఇద్దరమే ఉండాలని రామలక్ష్మి అనగానే.. సీతాకాంత్ సరే అంటాడు. ఆ తర్వాత రామలక్ష్మికి స్వామి ఫోన్ చేసి.. ఇప్పుడే యాగం మొదలైంది. రేపటి వరకు జరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి అని స్వామి చెప్పగానే రామలక్ష్మి కంగారుపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : ఇంటిపెద్ద ఆశీర్వాదం తీసుకున్న వాళ్ళిద్దరు.. పాప బారసాలలో అనామిక ప్లాన్ ఏంటంటే!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -639 లో.....అప్పు దుగ్గిరాల ఇంటికి వస్తుంది. తనని చూసి కావ్య చాల హ్యాపీగా ఫీల్ అవుతుంది. మా చెల్లి ఎస్సై అయిందని కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏంటి ఈ వేషం గెటప్ బాగుందని రుద్రాణి వెటకారంగా ఇక్కడ తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చెయ్యడానికి వచ్చావా అంటూ మాట్లాడుతుంటుంది. నా భార్య ఎస్సై అయింది. పెద్దల ఆశీర్వాదం తీసుకుందామని వచ్చామని కళ్యాణ్ అంటాడు. కాసేపటికి ముందుగా ఇందిరాదేవి ఆశీర్వాదం తీసుకుంటారు. అమ్మ, నాన్న ఆశీర్వాదం తీసుకోమని అపర్ణ అనగానే.. అంటే తనకి ఇష్టం ఉందో లేదో అని కళ్యాణ్ అంటాడు. నాకు నీ సంతోషం ముఖ్యమని ఆశీర్వాదం తీసుకోండి అన్నట్లుగా ముందు కి వస్తుంది. దాంతో అప్పు, కళ్యాణ్ లు ధాన్యలక్ష్మి, ప్రకాష్ ల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఇకనైనా ఇక్కడే అందరం కలిసి ఉందామని ఇందిరాదేవి అంటుంది. ఇంకా కళ్యాణ్ అనుకున్నది సాధించలేదు కదా.. అయినా ఎలా వస్తాడంటూ రుద్రాణి అనగానే.. చూసారా ఈ ఇంట్లో మా అమ్మతో పాటు ఇద్దరికి మేమ్ రావడం ఇష్టం లేదు.. అందుకే అందరు మనస్ఫూర్తిగా ఒప్పుకున్న రోజు మేమ్ వస్తామని కళ్యాణ్ అంటాడు. రేపు స్వప్న కూతురు బారసాల ఉంది.. కావ్య, రాజ్ తో పాటు మీరు దగ్గర ఉండి జరిపించండి అని ఇందిరాదేవి అనగానే కళ్యాణ్ సరే అంటాడు. ఆ తర్వాత ముగ్గురు అక్క చెల్లెలు కలిసి బారసాలకి ఏర్పాట్లు చేస్తూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే స్వప్న కూతురు ఏడుస్తూ ఉంటుంది. స్వప్న ఎంత ఎత్తుకున్నా కూడా పాప ఏడుపు ఆపదు. దాంతో కావ్య ఎత్తుకొని జోకొడుతూ పాట పాడుతుంది. దాంతో పాప నిద్రపోతుంది. ముగ్గురు అక్కచెల్లెళ్ళు సరదాగా ఉండడం అపర్ణ, ఇందిరాదేవిలు చూసి మురిసిపోతారు. వాళ్ళని చూస్తుంటే నేను పెళ్లి అయిన కొత్తలో ఇక్కడికి వచ్చిన రోజులు గుర్తు వస్తున్నాయ్.. రాజ్ ని అందరు గారాబం చేసేవాళ్ళని అపర్ణ అంటుంది. కానీ ఇప్పుడు డబ్బు వల్ల కుటుంబం విచ్చినం అన్న ఆలోచన వస్తుందని ఇందిరాదేవి అంటుంది. తరువాయి భాగంలో రుద్రాణి, అనామికలు ఫోన్ లో మాట్లాడుకుంటారు. రేపు బారసాలకి నేను ఎంట్రీ ఇస్తున్నాను.. నేను చేయబోయే దానికి అందరు బాధపడతారు.. చూడడానికి రెడీ గా ఉండమని రుద్రాణికి అనామిక చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

అమర్ బావ విత్ మనోభావాలు పాపా..విష్ణు ప్రియతో కంటే సుబ్బు- అమర్ దీప్ కాంబో సూపర్  

  అమర్ దీప్ చౌదరి డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డాన్స్ ఇరగదీసేస్తాడు. సీరియల్స్ తో బుల్లి తెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు . ఇక బిగ్ బాస్ షోతో అమర్ దీప్‌కు మంచి క్రేజ్ వచ్చింది.  చివరకు రన్నర్ గా బయటకు వచ్చేశాడు. అమర్ దీప్ తన సహ సీరియల్ నటి తేజస్వినిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఈ జంట ఇష్మార్ట్ జోడి 3 లోకి ఎంట్రీ ఇచ్చారు. అలాగే మరో వైపు బిగ్ బాస్ శుభశ్రీతో కలిసి స్టెప్పులేస్తున్నాడు. రీసెంట్ గా శేఖర్ మాష్టర్ "కు..కు..కుమారి" అంటూ విష్ణు ప్రియా, అమర్ దీప్ తో కలిసి చేసిన వీడియో సాంగ్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ఈ సాంగ్ రిలీజయిన మూడు వారాళ్ళూ 4 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది. అలాంటి ఈ సాంగ్ కి అమర్ దీప్ సుబ్బుతో కలిసి ఇన్-డోర్  స్టూడియోలో చేసిన డాన్స్ కూడా అదే రేంజ్ లో వైరల్ అవుతోంది. ఈ సాంగ్ ని సునీల్ సున్నపు కొరియోగ్రాఫ్ చేసాడు. ఐతే సుబ్బు, అమర్ దీప్ డాన్స్ కి నెటిజన్స్ ఐతే అద్దిరిపోయే కామెంట్స్ ఇస్తున్నారు. ఈ డాన్స్ కి అర్జున్ కళ్యాణ్, తేజస్విని ఐతే ఫైర్ ఎమోజిస్ పెట్టారు. అమరదీప్ హెయిర్ స్టైల్ మీద ఒక నెటిజన్ క్రేజీ కామెంట్ చేశారు. "అన్నా మీ ఓల్డ్ హెయిర్ స్టైల్ బాగుంది. ఇది బాలేదు" అంటూ చెప్పుకొచ్చారు. కొంతమందైతే విష్ణుప్రియతో కంటే సుబ్బుతో డాన్స్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  

నీకు ఖర్చులకు పైసలు యాడ నుండి వస్తాయి బ్రో...కౌశల్ కి షాకిచ్చిన నెటిజన్  

  బుల్లితెర మీద కౌశల్  మందా గురించి  తెలియని వారు ఎవరూ ఉండారు. మూవీస్ లో, సీరియల్స్ లో, షోస్ లో నటిస్తూ ఉంటాడు. బిగ్ బాస్ కి వెళ్లి తనకంటూ సెపరేట్ ఆర్మీని  ఏర్పాటు చేసుకున్న నటుడు. అలాంటి కౌశల్ ని ఒక క్రేజి నెటిజన్ ఒక ప్రశ్న అడిగాడు రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో. కౌశల్ ఊరుకుంటాడా. గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. "మనలో మన మాట బ్రో ..నీకు ఖర్చులకు పైసలు యాడ నుండి వస్తాయి" అని అడిగాడు ఒక నెటిజన్.. " నా చెమట నుంచి " అని రిప్లై ఇచ్చాడు కౌశల్. వెంటనే ఆ నెటిజన్ మళ్ళీ " సాల్ట్స్, ఎలెక్ట్రోలైట్స్, మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్, ఎమినో ఆసిడ్స్, ఫెరొమోన్స్, అండ్ బాక్టీరియా గురించి కాదు అడిగింది " డబ్బుల గురించి" అని మళ్ళీ కౌంటర్ క్వశ్చన్ వేసాడు. ఇంకో క్రేజి నెటిజన్ ఐతే "అన్నో ఆ పాత బిగ్ బాస్ కప్ ఏది అన్నా ? అది పక్కలో ఉంటాదిగా ? అన్నాడు"..ఐతే కౌశల్ తన కార్ ని ఒక బెడ్ గా మార్చే ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. "నా కార్ ని ఎలా ట్రావెల్ బెడ్ గా మార్చానో" అంటూ చూపించాడు. ఆ బెడ్ మీద పడుకుని ప్రశాంతంగా ట్రావెల్ చేయొచ్చు..లగేజ్ సీట్స్ కింద పెట్టేసాం అని చెప్పుకొచ్చాడు. ఐతే కొంతమంది నెటిజన్స్ ఐతే ఇలా బెడ్ గా ప్రిపేర్ చేసుకుని ట్రావెల్ చేయడం సేఫ్ కాదు అంటూ కామెంట్ చేసారు. బిగ్ బాస్ 2 లో కౌశల్ ఒక సెన్సేషన్.  

Illu illalu pillalu : ప్రేమ కోసం ధీరజ్ ఆ పని చేయగలడా.. అత్తకు కోడలు భరోసా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -75 లో.... రామరాజుపై ఉన్న కోపంతో చందు లవ్ ఫెయిల్యూర్ అయ్యాడని, అందుకు తాగుతున్నాడని రామరాజుతో చెప్తుంది. దాంతో రామరాజు బాధపడుతూ లోపలకి వెళ్ళిపోతాడు.రాత్రి చందు బాధపడుతుంటే రామరాజు తన దగ్గరికి వెళ్తాడు. ఇంత బాధపడుతున్నావ్.. వాళ్ళలాగా నన్ను మోసం చెయ్యాలి అనిపించలేదా అని రామరాజు అడుగుతాడు. లేదు నాన్న నాకు నా ప్రేమ కంటే మీ ప్రేమ గొప్పదని రామరాజు గురించి గొప్పగా చందు మాట్లాడతాడు. నాకు నువ్వు అందరిలో మాట్లాడే ధైర్యం ఇచ్చావ్ రా.. నువ్వు అసలైన కొడుకు అంటే అని రామరాజు గర్వంగా మాట్లాడతాడు. అదంతా సాగర్, ధీరజ్,  వేదవతి లు వింటుంటారు. అదంతా విని సాగర్, ధీరజ్ లని వేదవతి పక్కకి తీసుకొని వచ్చి.. నేను ముందు నుండే అడుగుతున్నా పెద్దోడు ఎందుకు అలా ఉన్నాడని మీరే చెప్పలేదని కోప్పడుతుంది. అప్పుడే నర్మద వచ్చి.. అత్తయ్య.. వాళ్లకి మీకు చెప్పే దైర్యం లేదు. మీరు బాధపడకండి.. మేమ్ అందరం బావ గారి బాధకు కారణం అయ్యాం కనుక మేమే దగ్గరుండి బావ గారి పెళ్లి జరిపిస్తామని వేదవతికి నర్మద చెప్తుంది. నవ్వండి అత్తయ్య అంటూ నర్మద వేదవతిని నవ్విస్తుంది. మరొకవైపు ప్రేమ, ధీరజ్ లు ఒకరికొకరు కోపంగా చూసుకుంటూ ఉంటారు. ప్రేమ నేలపై పడుకుంటూ ఉంటుంది. నీకు నొప్పి ఉంది కదా పైన పడుకోమని అనగానే నువ్వు ఎందుకు అలా అంటున్నావో నాకు తెలుసు.. అందరి ముందు బిల్డప్ ఇచ్చుకోవడానికా అని ధీరజ్ అంటాడు. దాంతో ప్రేమకి కోపం వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.