Eto Vellipoyindhi Manasu : మూడు రోజుల టైమ్ ఇచ్చిన పోలీసులు.. మోసం చేయలేదని సీతాకాంత్ నిరూపిస్తాడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu ). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -308 లో...... మాణిక్యం వచ్చి ఆఫీస్ దగ్గర అందరు గొడవ చేస్తున్నారని చెప్పడం తో రామలక్ష్మి, మాణిక్యం సీతాకాంత్ లు ఆఫీస్ కి బయల్దేర్తారు. అప్పుడే రామలక్ష్మి కి శ్రీలత ఫోన్ చేస్తుంది. జరుగుతున్న దానికి తనకు ఏదో సంబంధం ఉండే ఉంటుంది లిఫ్ట్ చేసి మాట్లాడమని మాణిక్యం అంటాడు. దాంతో రామలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. ఇదంతా కావాలని మీరే చేయించారా అని రామలక్ష్మి అడుగగా.. మరి లేనిది ఉన్నట్టు ఎలా అవుతుంది. అంతా నేనే చేశానని శ్రీలత అంటుంది. రామలక్ష్మి వార్నింగ్ ఇస్తుంటే అవన్నీ చెప్పకు.. నీతో పాటు మీ ఆయన్ని కాపాడుకోమని శ్రీలత అంటుంది. ఫోన్ కట్ చేసాక ఇదంతా అత్తయ్య గారే చేశారట అని సీతాకాంత్ కి చెప్తుంది రామలక్ష్మి. అత్తయ్య నా మీద ఆయన మీద దాడి చేయించాలని చూస్తుందని మాణిక్యానికి చెప్తుంది రామలక్ష్మి . వాళ్ళ సంగతి నేను చూసుకుంటా మీడియా వాళ్ళ సంగతి మీరు చూసుకోండి అని మాణిక్యం చెప్తాడు. శ్రీలత ఆఫీస్ దగ్గర గొడవ చేసే వాళ్లలో కొంతమంది రౌడీలని పెట్టింది. వాళ్లు రాగానే నేను చెప్పినట్టు చెయ్యండని చెప్తుంది. అప్పుడే రామలక్ష్మి, సీతాకాంత్, మాణిక్యం లు ఆఫీస్ కి వస్తారు. అందరు గొడవ చేస్తుంటే ఆపే ప్రయత్నం చేస్తారు కానీ వాళ్లు వినరు. పైగా వాళ్ళు సీతాకాంత్ ని రాళ్లతో కొడతారు.  గొడవ జరుగుతుంటే పోలీసులు వచ్చి వాళ్ళని ఆపుతారు. నాకు టైం ఇవ్వండి నేను అందరి డబ్బు ఇచ్చేస్తానని సీతాకాంత్ చెప్తాడు. మీపై కంప్లైంట్ వచ్చింది సర్ అరెస్ట్ చేస్తామని సీతాకాంత్ తో పోలీసులు అంటారు. నేను ఏ తప్పు చెయ్యలేదని నిరూపించు కోవడానికి అయినా నాకు టైమ్ కావాలని సీతాకాంత్ రిక్వెస్ట్ చెయ్యగా.. సరే మూడు రోజులు టైమ్ ఇస్తున్నామని పోలీసులు చెప్పి వెళ్లిపోతారు. రామలక్ష్మిని తీసుకొని శ్రీలత దగ్గరికి వెళ్తాడు సీతాకాంత్. ఇక బెల్ట్ తీసుకొని సందీప్, ధనలని కొడతాడు సీతాకాంత్ .  శ్రీలత వాళ్లు ఎంత ఆపిన సీతాకాంత్ ఆపడు. నన్ను కొట్టి వాళ్ళని కొట్టమని శ్రీలత అనగానే సీతాకాంత్ ఆపుతాడు.. నా కొడుకుని, అల్లుడిని కొట్టె హక్కు నీకు ఎక్కడిదని శ్రీలత అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : నందగోపాల్ ని మర్డర్ చేయించిన అనామిక.. కావ్య, రాజ్ లకి తప్పని తిప్పలు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -625 లో... నిన్ను చూస్తే మేడమ్ సర్ మేడమ్ అంతే అనాలనిపిస్తుందని కావ్యతో రాజ్ అంటాడు. కావ్య మురిసిపోతు మీరు తిట్టిన బాగుంటుంది కానీ పొగిడితేనే ఏదో అవుతుందని అంటుంది. అప్పుడే రాజ్ కి తన ఫ్రెండ్ కాల్ చేసి.. నందగోపాల్ ఎక్కడున్నాడో తెలిసిందని చెప్పగానే వస్తున్నామని రాజ్ చెప్తాడు. వాడిని పట్టుకొని మన డబ్బు మనం సొంతం చేసుకుందామని కావ్యతో రాజ్ చెప్తాడు. ఇక ఇద్దరు బయలుదేరి కిందకి వస్తారు. వాళ్ళని చూసిన ధాన్యలక్ష్మి ఆగమని చెప్తుంది. తన చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ సుభాష్ కి ఇచ్చి చదవమంటుంది. అందులో ఏముందో చెప్పండి బావగారు అని ధాన్యలక్ష్మి అంటుంది. సుభాష్ సైలెంట్ గా ఉండడంతో మీరు మీ కోడలు గురించి ఏం చెప్పరు.. నేనే చెప్తాను మావయ్య గారు నమ్మి తనకు ఆస్తులు అప్పజెప్పితే దుగ్గిరాల పరువుతీస్తూ గెస్ట్ హౌస్ తాకట్టు పెట్టి డబ్బు తీసుకుందని చెప్పగానే.. అందరు షాక్ అవుతారు. రాజ్ నీకు ఈ విషయం తెలుసా అని ఇందిరాదేవి అడుగుతుంది. తెలుసు నాకు చెప్పకుండా కావ్య ఏం పని చెయ్యదని రాజ్ అంటాడు. వాళ్లు ఏదో అవసరం వచ్చి పెట్టి ఉంటారని ఇందిరాదేవి సమర్థిస్తుంటే.. రుద్రాణి చూడలేక ఇంత సింపుల్ గా తీసేస్తావేంటని అంటుంది. ఆ తర్వాత వాళ్ళు నిజం ఎందుకు చెప్తారు.. చెప్పరంటూ అపర్ణ కోపంగా మాట్లాడుతుంది. ఇప్పుడు నాకు అసలు నిజం తెలియాలని ధాన్యలక్ష్మి పట్టు పట్టుకొని కూర్చొని ఉంటుంది. దాంతో మేము అర్జెంట్ గా బయటకు వెళ్తాన్నాం.. వచ్చాక చెప్తామని రాజ్ చెప్తాడు. ఆ తర్వాత రాజ్, కావ్య వెళ్ళిపోయాక.. అసలు మీకు ఈ డాక్యుమెంట్స్ ఎలా వచ్చాయి అత్త.. మీరు రాజ్, కావ్య వెనకాల ఏదైనా గూఢచారిలా చేస్తున్నారా ఈ విషయం కూడా తెలుసుకోవాలని స్వప్న అనగానే.. రాహుల్, రుద్రాణిలు పైకి వెళ్తారు. రాజ్, కావ్యలు నందగోపాల్ ఉన్నా చోటుకి వెళ్తారు. రాజ్ రౌడీ లని కొట్టడానికి రెడీ అవుతుంటే.. మీరు ఆగండీ అంటూ కావ్య రౌడీలతో కూల్ గా మాట్లాడి డీల్ చేస్తుంది. తరువాయి భాగంలో నందగోపాల్ ని పోలీస్ లకి పట్టిస్తారు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పడానికి సమాధానం దొరికిందా అని రాజ్ అనగానే దొరికినట్లే ఉందని కావ్య అంటుంది. కళ్ళు ముందే కన్పిస్తుంది కదా అని రాజ్ అంటాడు. అంతలోనే పోలీసులు తీసుకొని వెళ్తున్న నందగోపాల్ ని ఒకతను వచ్చి షూట్ చేస్తాడు. ఇక నందగోపాల్ ని చూసి సారీ రాజ్.. నంద గోపాల్ చనిపోయాడని తన పోలీస్ ఫ్రెండ్ చెప్తాడు. రాజ్, కావ్య ఇద్దరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu : రామరాజుకి ఎదురుతిరిగిన కొడుకు.. వాడిని చంపడానికి విశ్వ స్కెచ్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -61 లో..... నీ ముద్దుల కొడుకు వల్ల నలుగురిలో పరువు పోయిందని రామరాజు అంటుంటే ధీరజ్ మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. దాంతో మాట్లాడకని రామరాజు అనగానే.. నేను మాట్లాడతాను నాన్న.. నలుగురు ఏం అనుకుంటారో అంటున్నారు. ఎవరు ఆ నలుగురు ఇరవై అయిదు సంవత్సరాల క్రితం మీరు అమ్మని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ నలుగురు మీకు సాయంగా ఉండి.. ఒక పూట భోజనం పెట్టారా.. ఎందుకు నలుగురి గురించి అలోచించడం అని ధీరజ్ అంటుంటే.. రామరాజుకి ఇంకా కోపం వస్తుంది. చూసావా ఎలా ఎదురు తిరిగి మాట్లాడుతున్నాడోనని వేదవతితో రామరాజు అంటాడు. కాసేపటికి ధీరజ్ బయటకి వెళ్లి బాధపడతాడు. వేదవతి తన దగ్గరికి వెళ్లి.. ఎందుకు మీ నాన్నకి ఎదురు మాట్లాడుతున్నావంటూ అడుగుతుంది. దాంతో దీరజ్ ఎమోషనల్ అవుతూ.. నాన్న బాధపడడానికి కారణం నువ్వు కదా.. ఆ రోజు ప్రేమ మెడలో తాళి కట్టమన్నావ్.. నాన్న గురించి ఆలోచించలేదని ధీరజ్ అంటాడు. ఒక జీవితం నాశనం కాకుండా కాపాడాలన్న ఒక ఆలోచన మాత్రమే నాకు ఉండెనని వెధవతి అంటూ కళ్ళు తిరిగి పడిపోబోతుంటే.. ధీరజ్ పట్టుకొని కూర్చొపెట్టి నీళ్లు తాగిస్తాడు. నువ్వు టెన్షన్ పడకు అమ్మ.. కుటుంబం గురించి నేను చూసుకుంటానని వేదవతితో ధీరజ్ చెప్తాడు. కాసేపటికి ఊరు పెద్దలు కొంతమంది రామరాజు ఇంటికి.. కొంతమంది భద్రావతి ఇంటికి వెళ్తారు‌. సంక్రాతి ఉత్సవాలకి మీ చేతులు మీదుగా జరగాలి అంటారు. ముందు ఇరు కుటుంబాల వాళ్ళు రామనే అంటారు. చందు చెవిలో వస్తామని చెప్పమని ధీరజ్ చెప్తాడు. దాంతో  మేము వస్తామని చందు చెప్తాడు. ఆ తర్వాత విశ్వ కూడా మేము వస్తామని చెప్తాడు. కాసేపటికి ఎందుకు వద్దని భద్రవతి అనగానే.. వాళ్ళ ముందు మనం వెళ్లకుంటే మన పరువుపోతుందని విశ్వ అంటాడు. దాంతో భద్రవతి సరే అంటుంది. ఇప్పుడు మొదలు అవుతుంది ఆట, వేట అని విశ్వ మనసులో అనుకుంటాడు. మరొకవైపు నేను రానని చెప్తుంటే నువ్వెందుకు అలా చెప్పావని చందుతో రామరాజు అంటాడు. వెళదాం బావ అని తిరుపతి అనగానే.. నా మాటకి ఎదరు చెప్పడం వాడికి అలవాటే కదా.. వాడు పెద్దోడి చెవిలో ఏదో చెప్పడం నేను చూసానని రామరాజు అంటాడు.ఎప్పటిలాగే మన కుటుంబంతో కలిసి పండుగ చేసుకోవాలని ధీరజ్ వాళ్ళు అంటారు. తరువాయి భాగంలో ధీరజ్ ని చంపమని రౌడీకి చెప్తాడు విశ్వ. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : కన్నతండ్రినే చంపాలనుకున్న జ్యోత్స్న.. అతనిది యాక్సిడెంట్ కాదని డౌట్ పడ్డ దీప!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీకదీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -260 లో..... దాస్ ని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొని వస్తారు. ఆ సిచువేషన్ లో దాస్ ని చూసి పారిజాతం ఎమోషనల్ అవుతుంది. నిన్ను ఎవరు కొట్టారో వాళ్ళ చేతులు విరిగిపోను అంటూ పారిజాతం తిడుతుంటే జ్యోత్స్న రియాక్ట్ అవుతుంది. తమలో ఇలాంటి ప్రేమలు కూడా ఉన్నాయా అని జ్యోత్స్నని ఉద్దేశించి కార్తీక్ అంటాడు. మీరు వెళ్ళండి నేను ఉంటానని జ్యోత్స్న అందరిని బయటకు పంపిస్తుంది. మీ నాన్న అంటే ఎంత ప్రేమనే అని పారిజాతం అనుకుంటుంది. అందరిని వెళ్ళమని చెప్పింది నిన్ను చంపెయ్యడానికే అని జ్యోత్స్న అనుకుంటుంది. అందరు గదిలో నుండి బయటకు వస్తారు. నువ్వు బ్రతికితే నాకు ప్రాబ్లమ్ అని జ్యోత్స్న  పిల్లో తీసుకొని దాస్ పై పెట్టబోతుంటే దాస్ కళ్ళు తెరుస్తాడు. దాంతో జ్యోత్స్న భయపడి గట్టిగా అరుస్తుంది. అందరు వస్తారు ఎందుకు అరిచావని అడుగగా.. కళ్ళు తెరిచాడని జ్యోత్స్న చెప్తుంది. ఈ పిల్లో ఏంటి కింద ఉందని స్వప్నకి డౌట్ వస్తుంది. తల కింద పెడదామనుకున్న కానీ కళ్ళు తెరిచేసరికి భయపడ్డాను.. దాంతో అక్కడ పడిపోయిందని జ్యోత్స్న చెప్తుంది. ఇక మేము బాబాయ్ ని మా ఇంటికి తీసుకొని వెళ్తామని జ్యోత్స్న అంటుంది. వద్దని పారిజాతం అంటుంది. నేను నాన్నని ఎక్కడికి పంపనని కాశీ చెప్తాడు.  జ్యోత్స్న ని తీసుకొని పారిజాతం వెళ్ళిపోతుంది. దశరత్ తన డాక్టర్ ఫ్రెండ్ కి కాల్ చేసి.. దాస్ ని సేవ్ చేసినందుకు థాంక్స్ చెప్తాడు. అప్పుడే పారిజాతం జ్యోత్స్న వాళ్లు వస్తారు. దాస్ కళ్ళు తెరిచాడని పారిజాతం చెప్పగానే దశరత్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. జ్యోత్స్న టెన్షన్ పడుతుంటే.. తనకి సింక్ అయ్యేలా దశరథ్ మాట్లాడుతుంటాడు. దాంతో జ్యోత్స్న ఇంకా కంగారుపడుతుంది. కార్తీక్, దీప ఇద్దరు అక్కడ నుండి బయటకు వచ్చి మాట్లాడుకుంటారు. బాబాయ్ ని ఎవరైనా కొట్టారా? ఆక్సిడెంట్ అయిందా? మీరేం అనుకుంటున్నారని కార్తీక్ ని దీప అడుగుతుంది. నేను ఒక అంచనాకి రాలేకపోతున్నానని కార్తీక్ అంటాడు. అప్పుడే కార్తీక్ కి డాక్టర్ ఫోన్ చేసి.. శౌర్య గురించి మాట్లాడానికి స్పెషలిస్ట్ వచ్చాడు రండీ అని చెప్తాడు. దాంతో కార్తీక్ కంగారుగా దీపని ఆటో ఎక్కించి ఇంటికి వెళ్ళమని చెప్తాడు. కార్తీక్ బాబు ఎందుకు టెన్షన్ పడుతున్నాడని దీప అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : కొత్త వ్యక్తితో కలిసి శ్రీలత మాస్టర్ ప్లాన్.. టీవీలో వచ్చింది చూసి వాళ్ళిద్దరు షాక్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -307 లో... రామలక్ష్మి ఆకలి అంటూ గట్టిగా అరుస్తుంటాడు సీతాకాంత్. అప్పుడే రామలక్ష్మి భోజనం తీసుకొని వస్తుంది. బాగుందంటూ సీతాకాంత్ ఫాస్ట్ గా తింటుంటే మెల్లగా తినండి అంటుంది రామలక్ష్మి. మీరు ఎక్కడున్నా రాజే అండి అని పెద్దావిడ అన్న మాటలు గుర్తుచేస్తుంది రామలక్ష్మి. నువ్వు నా పక్కన ఉంటేనే నేను ఇంత హ్యాపీగా ఉన్నాను. నన్ను గొప్పగా చేసి నిన్ను నువ్వు తక్కువ చేసుకోకని సీతాకాంత్ అంటాడు. ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేస్తుంటారు. శ్రీలత ఒకతనికి ఫోన్ చేస్తుంది. ఏంటి ఇన్ని రోజులకి గుర్తుకువచ్చానా అని అతను అనగానే.. నిన్ను మర్చిపోతేనా కదరా గుర్తుకురావడానికి అని శ్రీలత అంటుంది. ఒక సమస్య వచ్చిందంటూ జరిగిందంతా చెప్తుంది. ఇంకా సీతాకాంత్ గాడిని వదిలించుకోలేదా అని అతను అంటాడు. వాడి భార్య మమ్మల్ని టార్చర్ పెడుతుంది దాన్ని వదిలించుకోవాలని శ్రీలత అంటుంది. నేను చూసుకుంటా ముందు ఆ భద్రం గాడి ఫోటో పంపు అని అతను అంటాడు. శ్రీలత పంపిన భద్రం ఫోటో చూసి వీడు నాకూ తెలుసు కానీ వాడికి నేను తెలియదని అతను చెప్పాగానే అయితే పని మరింత సులువుగా అవుతుందని శ్రీలత అంటుంది. ఆ తర్వాత శ్రీలత పదే పదే గుమ్మం వంక చూస్తూ ఉంటుంది. ఎందుకు అలా చూస్తున్నారని శ్రీవల్లి అడుగుతుంది. కాసేపటికి రామలక్ష్మి వచ్చి నా కాళ్ళ మీద పడుతుంది.. ఇదే నా మాస్టర్ ప్లాన్ అని శ్రీలత చెప్తుంది. రామలక్ష్మి తల స్నానం చేసి రెడీ అవుతుంటే సీతాకాంత్ వచ్చి ఇంకా నీ జుట్టు అరలేదంటూ జుట్టుని తుడుస్తూ ఉంటాడు. అప్పుడే ఒక పెద్దావిడ వచ్చి రామలక్ష్మి.. నీ గురించి టీవీలో వస్తుందని తన ఇంటికి తీసుకొని వెళ్తుంది. తీరా చుస్తే.. శ్రీలత వాళ్ళింటికి రామలక్ష్మి వెళ్ళినప్పుడు మాట్లాడిన మాటలు ఎడిట్ చేసి అందులో వచ్చేలా చేస్తుంది. సీతాకాంత్ పేరుని అడ్డం పెట్టుకొని ఇదంతా చేస్తే అందరు ప్లాట్ తీసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళని మోసం చెయ్యొచ్చని ఎడిట్ చేస్తారు. అది టీవీలో వస్తుంది. దాన్ని చూసి రామలక్ష్మి, సీతాకాంత్ లు షాక్ అవుతారు. శ్రీవల్లి వాళ్ళకి టీవీలో వచ్చేది శ్రీలత చూపిస్తుంది. ఇక ప్రాబ్లమ్ మీది కాదు రామలక్ష్మి, సీతాకాంత్ లది అని సందీప్ వాళ్ళకి చెప్తుంది శ్రీలత. ఆ తర్వాత ఎందుకు అక్కడికి వెళ్ళావంటూ రామలక్ష్మి పై సీతాకాంత్ కోప్పడతాడు. నీ వల్ల ఇన్ని రోజులు సంపాదించుకున్న పేరు మొత్తం పోయేలా ఉందని సీతాకాంత్ అంటాడు. అప్పుడే మాణిక్యం వచ్చి ఆఫీస్ దగ్గరికి జనాలు వచ్చి గొడవ చేస్తున్నారని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : కావ్య గెస్ట్ హౌస్ తాకట్టు పెట్టిన విషయం చెప్పేసిన ధాన్యలక్ష్మి!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -624 లో.....ఇంట్లో ఏం జరుగుతుంది. మీకు వచ్చిన సమస్య గురించి చెప్పమని అపర్ణ అడిగితే కావ్య చెప్పదు. దాంతో అపర్ణ కావ్యతో మాట్లాడడం మానేస్తుంది. కావ్య కాఫీ తీసుకొని వచ్చినా కూడా అపర్ణ తీసుకోదు. అప్పుడే రాజ్ వస్తాడు. మీకు దమ్ముంటే ఈ కాఫీ తీసుకొని వెళ్లి అత్తయ్యకి ఇవ్వండి అని అంటుంది. రాజ్ కాఫీ తీసుకొని అపర్ణ గదిలోకి వెళ్తాడు. కాసేపటికి కాఫీ కప్ పగిలిన సౌండ్ ఇంకా రాజ్ చెంప చెల్లుమనిపించిన సౌండ్ వస్తుంది. ఇక రాజ్ బయటకి వచ్చి ఏదో కవర్ చేస్తాడు. ఈసారి కావ్య వెళ్లి ఇస్తుందని రాజ్ అంటాడు. రాజ్ ఏదో సౌండ్ వచ్చిందని ఇందిరాదేవి అనగానే రాజ్ డైవర్ట్ చేసీ.. కాఫీ చేస్తున్న కావ్య దగ్గరికి వెళ్తాడు. కావ్య, రాజ్ లు కాఫీ తీసుకొని బయట కూర్చొని ఉన్న అపర్ణ దగ్గరికి వచ్చి తన కాళ్ళ మీద పడి.. ఒకరికి మించి ఒకరు వాళ్ళ కవిత్వంతో పోటీపడుతూ అపర్ణని రిక్వెస్ట్ చేసి పైకి చూసేసరికి.. టీ తాగుతూ ఇందిరాదేవి ఉంటుంది. మమ్మీ ఎక్కడ అని రాజ్ అడుగగా.. ఎప్పుడో వెళ్ళిపోయిందని ఇందిరాదేవి చెప్తుంది. దాంతో ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. మరొకవైపు అప్పు, కళ్యాణ్ లు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే ఒక దొంగ సామంత్ పర్సు దొంగతనం చేయబోతుంటాడు. అప్పు చూసి ఆపుతుంది. సామంత్ ని చూసి ఇద్దరు షాక్ అవుతారు. అప్పుడే అనామిక వచ్చి.. ఏం పని లేక ఇలా దొంగలని పట్టుకుంటున్నారన్నమాట ఎంత తీసుకుంటున్నారు అంటూ తక్కువ చేసి మాట్లాడుతుంది. నా అప్పు త్వరలోనే పోలీస్ కాబోతుందని కళ్యాణ్ చెప్పగానే.. జోక్ బాగుంది అంటూ అనాకిక నవ్వుతుంది. త్వరలోనే అప్పుని పోలీస్ డ్రెస్ లో చూస్తావని కళ్యాణ్ చెప్పి అప్పుని తీసుకొని వెళ్లిపోతాడు. నిజంగానే పోలీస్ అవుతుందా.. ఆ కావ్య, రాజ్ పై పోకస్ చేసి వీళ్ళ గురించి మర్చిపోయానని అనామిక అనుకుంటుంది. మరోవైపు ధాన్యలక్ష్మి దగ్గరికి రుద్రాణి వస్తుంది. కావ్య గెస్ట్ హౌస్ ని తాకట్టు పెట్టి డబ్బు తీసుకుందన్న విషయం చెప్తూ.. వీళ్ళు ఆస్తులు కాదు అప్పులు వాటాలు ఇచ్చేలా ఉన్నారంటూ రుద్రాణి రెచ్చగొడుతుంది. దాంతో విషయం ఏంటో తేలుస్తానని ధాన్యలక్ష్మి అంటుంది. రాజ్ రెడీ అవుతుంటే.. ఇంకా రెడీ అవ్వలేదా ఎన్ని పనులు చేసి నేను ఎలా రెడీ అయ్యానంటూ రాజ్ కు కావ్య సూట్ తోడిగిస్తూ అంటుంటే.. నిన్ను చూస్తే ఒక మాట అనాలనిపిస్తుందని రాజ్ అనగా.. ఏంటని కావ్య అడుగుతుంది. మేడం సర్ మేడం అంతే అని రాజ్ అంటాడు. తరువాయి భాగంలో కావ్య గెస్ట్ హౌస్ తాకట్టు పెట్టిన విషయం ధాన్యలక్ష్మి ఇంట్లో వాళ్ళకి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu : నిజాన్ని బయటపెట్టిన రామరాజు.. వేదవతితో సహా అందరు షాక్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -60 లో.... రామరాజు ఎక్కడ అంటూ వేదవతి ఇంట్లో అంతా వెతుకుతుంటుంది. ఎక్కడా కన్పించకపోవడంతో వేదవతి టెన్షన్ పడుతూ అందరికి చెప్తుంది. ఆ తర్వాత నాన్న ఎక్కడున్నాడో నేను చూసి వస్తానంటూ చందు వెళ్తాడు. చందు అంతా వెతికి చివరికి మిల్ కి వెళ్తాడు. అక్కడ నేలపైన రామరాజు పడుకొని ఉండటం చందు చూస్తాడు. అలా రామరాజుని ఆ సిచువేషన్ లో చూసి చందు ఎమోషనల్ అవుతాడు. చందు వెళ్లి రామరాజుని లేపి మీరు ఇక్కడున్నారేంటని అడుగగా.. మరేం చెయ్యాలి నా స్థాయి ఇదేనంటూ రామరాజు బాధపడతాడు. ముగ్గురు కొడుకులు నా మాట వింటారని చాలా మురిసిపోయాను కానీ నడిపోడు, చిన్నడు నా పరువు తీశారంటూ రామరాజు బాధపడుతాడు. కాసేపటికి నాన్న ఇంటి దగ్గర అమ్మ ఏడుస్తుందని చందు చెప్పగానే.. అవునా పదా వెళదామంటూ రామరాజు అంటాడు. ఇక ఇద్దరు ఇంటికి వస్తారు. రామరాజుని చూసి ఇంట్లో అందరు హ్యాపీగా ఫీలవుతారు. అలా ఎందుకు వెళ్లారండని వేదవతి అడుగగా.. నీ వల్లే వెళ్ళాను.. నీ వల్లే వాడు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నువ్విచ్చిన ధైర్యం వల్లే పెళ్లి చేసుకున్నాడని రామారాజు అనగానే.. వేదవతి, నర్మద, ధీరజ్, ప్రేమ వాళ్లు నిజం తెలిసిపోయిందని కంగారుపడతారు.  ఆ తర్వాత రామరాజు లోపలికి వెళ్తాడు. పదండి అత్తయ్య లోపలికి వెళదామని నర్మద అనగానే.. నేను రాను అంటూ వేదవతి భయపడుతుంది. లోపలికి వెళ్ళకు.. అంత నీవల్లే కదా ఎప్పుడు వెనకేసుకొని వచ్చావ్.. ఇంట్లో వద్దంటే మళ్ళీ గొడవ చేసి ఇంట్లోకి రప్పించావ్.. నేను తిట్టిన ప్రతిసారీ మా అమ్మ నా వెనకాల ఉందని అనుకునేవాడు.. బాగా గారాబం చేసావని రామరాజు అంటాడు‌. హమ్మయ్య నిజం తెలియదని వేదవతి వాళ్లు రిలాక్స్ అవుతారు. ఆ తర్వాత ధీరజ్ మాట్లాడుతుంటే.. నువ్వు నాతో మాట్లాడకని రామరాజు అంటాడు. నేను మాట్లాడతానని ధీరజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : దీప మీద అరిచేసిన కార్తీక్.. దాస్ గురించి జ్యోత్స్న టెన్షన్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -259 లో.....కాంచన, అనసూయ, శౌర్యలు సరదాగా మాట్లాడుకుంటారు. కార్తీక్ బాబు ఇంకా రాలేదని దీప అనగానే.. వాడు ఇందాకే వచ్చాడని కాంచన చెప్తుంది. దీప గదిలోకి వెళ్తుంది. అక్కడ అలమరాలో డబ్బు కన్పిస్తుంది. ఇంత డబ్బు ఎక్కడిదని దీప అనుకుంటుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు. ఇంత డబ్బు ఎక్కడిది అని దీప అడుగగా.. రెస్టారెంట్ కి అని చెప్పాను కదా అని కార్తీక్ చెప్తాడు. అయిన దీప గుచ్చిగుచ్చి అడుగుతుంటే దీపపై అరుస్తాడు కార్తీక్. కార్తీక్ గట్టిగా అరవడంతో అప్పుడే కాంచన వచ్చి.. ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావని అడుగుతుంది. అదేం లేదని కార్తీక్ అంటాడు. అదేంటీ డబ్బు గురించి రెస్టారెంట్ గురించి వాళ్ళ అమ్మతో చెప్పాడం లేదని దీప అనుకుంటుంది. అప్పుడే  దాస్ కన్పించడం లేదన్న విషయం కాంచన, దీపలకి చెప్తాడు కార్తీక్. ఆ తర్వాత సారీ దీప, శౌర్య గురించి చెప్తే తట్టుకోలేవు.. అందుకే చెప్పడం లేదని కార్తీక్ అనుకుంటాడు. మరొకవైపు శ్రీధర్ తన అందం గురించి తానే పొగుడుకుంటూ ఉంటాడు. అప్పుడే కావేరి వచ్చి వియ్యంకుడు కన్పించడం లేదంట ఒకసారి వెళదామని అంటుంది. దాంతో శ్రీధర్ తనపై చిరాకుపడతాడు. ఆ తర్వాత స్వప్న, కాశీలు కార్తీక్ ఇంటికి వస్తారు. నాకూ ఒక సాయం చేస్తావా మూడు రోజుల నుండి కార్తీక్ బాబు తేడాగా కన్పిస్తున్నారు.. తన ఫ్రెండ్ దగ్గర అయిదు లక్షలు తెచ్చాడని దీప అనగానే.. అవి నా దగ్గర తీసుకున్నాడు కానీ చెప్పొద్దన్నాడు అని కాశీ అనుకుంటాడు. కార్తీక్ బాబు ఏదో దాస్తున్నాడు ఆ డబ్బు గురించి నీకేమైనా తెలుసా అని దీప అడుగుతుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు. కాసేపటికి కాశీకి కానిస్టేబుల్ కాల్ చేసి మీ నాన్న హాస్పిటల్ లో ఉన్నాడని చెప్తాడు. దాంతో కార్తీక్, కాశీలు హాస్పిటల్ కి వెళ్తారు. మరొకవైపు దాస్ హాస్పిటల్ లో ఉన్న విషయం పారిజాతం ఇంట్లో వాళ్లకు చెప్తుంది. దాంతో జ్యోత్స్న కంగారుపడుతుంది. నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావని దశరథ్ అంటాడు. పారిజాతం వెళ్తుంటే నేను వస్తానంటూ జ్యోత్స్న వెళ్తుంది. మరొకవైపు దాస్ ని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసి తీసుకొని వెళ్తారు. అక్కడ డాక్టర్.. దశరథ్ సేవ్ చేసిన విషయం చెప్పడు. ఆ తర్వాత దాస్ ని ఇంటికి తీసుకొని వెళ్తారు. దాస్ ని చూసి పారిజాతం ఎమోషనల్ అవుతూ.. తనని కొట్టినవాళ్ళని తిడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : భద్రం మోసగాడని తెలుసుకున్న శ్రీలత... సొల్యూషన్ అదేనా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -306 లో.....  భద్రం చేసిన మోసాన్ని శ్రీలత వాళ్ళకి చెప్తుంది రామలక్ష్మి. వాడొక పెద్ద ఫ్రాడ్.. వాడిని నమ్మి మోసపోయారని రామలక్ష్మి చెప్తుంది. రేపటి వరకు అందరి డబ్బు ఇవ్వకపోతే అందరిని తీసుకొని వచ్చి గొడవ పెడతానంటూ రామలక్ష్మి అందరికి వార్నింగ్ ఇస్తుంది. మరొకవైపు మురళి దగ్గరికి సీతాకాంత్ వెళ్లి భద్రం పెద్ద మోసగాడు.. కావాలంటే టెస్ట్ చెయ్యండి.. ఇప్పుడు పెట్టే పెట్టుబడి మొత్తం బ్యాంకు ట్రాన్సక్షన్స్ కావాలని అనండి అని సీతాకాంత్ చెప్పగానే..  భద్రంకి మురళి ఫోన్ చేసి అలాగే ట్రాన్సక్షన్స్ కావాలని అంటాడు. దానికి భద్రం సరే అంటాడు. మీరు ఇప్పుడు చెప్పారు కదా మాటల్లో సరే అన్నాడు.. చేస్తాడేమో చూడండి. అప్పుడు మీకు అర్ధం అవుతుందని సీతాకాంత్ అనగానే ఇదొక్కసారి నీ మాట వింటానని మురళి అంటాడు. ఆ తర్వాత ఈ ఆలోచన మురళిది కాదు కచ్చితంగా ఆ సీతాకాంత్ వెళ్లి ఉంటాడు. ఇక నేను ఆలస్యం చెయ్యకూడదు త్వరగా ఈ డబ్బుతో వెళ్ళిపోవాలి అనుకుంటాడు. ఆ తర్వాత భద్రంకి శ్రీలత కాల్ చెయ్యమని సందీప్ ధన లకి చెప్తుంది. వాళ్లు ఫోన్ చేస్తుంటే భద్రం లిఫ్ట్ చెయ్యడు. ఆ తర్వాత కాసేపటికి భద్రం ఫోన్ లిఫ్ట్ చేసి నేను కావలసినంత డబ్బు సంపాదించుకున్నాను.. ఇక నేను వెళ్లిపోతున్నానని డైరెక్ట్ గా చెప్పేస్తాడు. దాంతో అందరు షాక్ అవుతారు. ఇప్పుడేం చెయ్యాలంటూ అందరు కంగారుపడతారు.. అన్నింటికి ఒకడే సొల్యూషన్ అతనెవరో నాకూ తెలుసు ఎక్కడుంటాడో నాకూ తెలుసని శ్రీలత అంటుంది. మరొకవైపు త్వరగా భోజనం తీసుకొని రా అంటూ సీతాకాంత్ అరుస్తుంటాడు. అప్పుడే రామలక్ష్మి భోజనం తీసుకొని వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : సామంత్ నిజస్వరూపం బయటపడిందిగా.. అనామిక బ్రహ్మాస్త్రం అదేనా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -623 లో.....ఇంట్లో అందరికి నిజం చెప్పెద్దామని రాజ్ అనగానే.. అప్పుడు ఇంట్లో జరిగే యుద్ధం గురించి రాజ్ కి కావ్య ఉహించి చెప్తుంటే రాజ్ వద్దని భయపడతాడు. మనమే పగలు ఆఫీస్ లో కష్టపడి రాత్రంత ఆ నందగోపాల్ ని వెతికే పనిలో ఉందాం.. అప్పుడు ఆ వంద కోట్లు కట్టే పని ఉండదని కావ్య అమగానే ఒకవేళవాడు దొరకకపోతే అని రాజ్ నెగటివ్ గా మాట్లాడుతుంటే.. కావ్య తనపై విరుచుకుపడుతుంది. మరొకవైపు రాహుల్, రుద్రాణిలు ధాన్యలక్ష్మిని ని రెచ్చగొట్టే పనిలో పడతారు. ఇదంతా వీళ్ళ ప్లాన్ అయిదు లక్షలు కూడా లేవా ఇదంతా సుభాష్ అన్నయ్య అపర్ణ వదినలు వెనకాల వుండి నడిపిస్తున్నారని రుద్రాణి అనగానే ధాన్యలక్ష్మి ఇంకా రెచ్చిపోతుంది. మరొకవైపు రాజ్ వాళ్లు అప్పులు చేస్తున్నారని సామంత్ అనామిక లు హ్యాపీగా ఫీల్ అవుతారు. దీన్ని ఇంకా పెద్దది చేసి ఎంజాయ్ చేద్దామని అనామిక అనగానే వద్దు ఇప్పుడు ఇంట్లో వాళ్లకి తెలిస్తే అందరు రాజ్ కి సపోర్ట్ గా ఉంటారు. కంపెనీని దక్కించుకుంటారని సామంత్ అనగానే వాళ్లు సంతోషంగా ఉండొద్దు నాకు కంపెనీ ముఖ్యం కాదని అనామిక అనగానే ఇదేంటి ఇలా అంటుంది కంపెనీని సొంతం చేసుకోవాలనే కదా నేను దీంతో చేరిందని సామంత్ అనుకుంటాడు. మరోవైపు రుద్రాణికి అనామిక ఫోన్ చేసి కావ్యని ఇంట్లో నుండి బయటకు పంపే బ్రహ్మాస్త్రాన్ని పంపిస్తున్నానని చెప్పగానే.. తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత రుద్రాణి హ్యాపీగా ఫీల్ అవ్వడం చూసి.. ఏంటీ ఏంటి ఏదో చేస్తున్నట్టున్నారని స్వప్న అంటుంది. ఆ తర్వాత కావ్యకి ఇందిరాదేవి నగలు ఇవ్వగా.. వద్దు ఇప్పుడు కంపెనీలో ఏం ప్రాబ్లమ్ లేదని కావ్య అంటుంది. నాకు ఇప్పుడు రిలీఫ్ గా ఉంది ఏదైనా ప్రాబ్లెమ్ ఉంటే నువ్వు ఈ నగలు తీసుకునే దానివి అని ఇందిరాదేవి అంటుంది. నేను భయటపడలేదని కావ్య అనుకుంటుంది. ఆ తర్వాత కళ్యాణ్ దగ్గరికి అప్పు వచ్చి సర్ ప్రైజ్ ఇస్తుంది. మరొకవైపు అపర్ణకి కావ్య కాఫీ ఇస్తుంది కానీ తను తీసుకోదు. తరువాయి భాగంలో మీకు ధైర్యం ఉంటే అత్తయ్య చేత కాఫీ తాగించండి అని కావ్య అనగానే రాజ్ కాఫీ తీసుకొని అపర్ణ దగ్గరికి వెళ్తాడు. గదిలో నుండీ కాఫీ విసిరేసిన సౌండ్ ఇంకా చెంపదెబ్బ సౌండ్ కావ్య, ఇందిరాదేవిలకి వినిపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

బట్టలు పొట్టిగా ఉన్నప్పుడు అలా ఎలా చేస్తారు ?

ఫ్యామిలీ స్టార్ ఈ వీక్ షోలో బులెట్ భాస్కర్ ప్రియాంక జైన్ తో సరిదిద్దుకోలేని తప్పు చేసేసాడు. వద్దన్నా వినకుండా తప్పు చేసాడు. ఆమెతో కలిసి డాన్స్ వేసాడు. ఐతే ప్రియాంక పొట్టి డ్రెస్ వేసుకొచ్చింది. కానీ డాన్స్ చేసేటప్పుడు తనను లిఫ్ట్ చేయొద్దు డ్రెస్ బాలేదు అని చెప్పింది.  అదే విషయాన్నీ పవిత్ర కూడా చెప్పింది. కానీ బులెట్ భాస్కర్ వినీ విననట్టు బిల్డప్ ఇచ్చి ఆమె ఎత్తుకుని మరీ డాన్స్ చేసాడు. దాంతో ప్రియాంకకు మండిపోయింది. ఇద్దరి మధ్య గట్టిగా మాటల యుద్ధం జరిగిపోయింది. 'భాస్కర్ గారు మీకు రెస్పెక్ట్ ఇస్తాను. కానీ ఇలా చేస్తారని అనుకోలేదు' అంటూ సీరియస్ గా స్టేజి దిగి వెళ్ళిపోయింది. దాంతో దొరబాబు స్టేజి మీదకు వచ్చి "ఐనా చూసుకోవాలి ఆడోల్లతో డాన్స్ చేసేటప్పుడు" అన్నాడు. తర్వాత స్రవంతి, పవిత్ర అందరూ బుజ్జగించి ఆమెను స్టేజి మీదకు తెచ్చారు. "ఇలా చేయడం కరెక్ట్ కాదు. మీ మాట విధానం బాలేదు. అలా మాట్లాడ్డం నాకు నచ్చలేదు"..  అంటూ ప్రియాంక సీరియస్ గా అనేసరికి  వెంటనే భాస్కర్ "ఎవరైనా ఇంట్లో స్క్రిప్ట్ రాసుకొచ్చి ఎత్తుకుంటారా , అమ్మా నీకో నమస్కారం, నీ పెర్ఫార్మెన్స్ కి ఒక నమస్కారం., సారీ, సారీ, సారీ" అని చెప్పాడు. " నేను ఇక ఇక్కడ ఉండకూడదు అనుకుంటున్నా..మీరు ఇలా సారీ చెప్పడం నచ్చలేదు.  వాళ్ళు చెప్పమంటే సారీ చెప్పడం ఏంటి మనసులోంచి రావాలి కానీ" అంటూ ప్రియాంక సతాయించేసింది. "ఏంటయ్యా సారీని యాక్సెప్ట్ చెయ్యట్లేదు వీళ్ళు. మీ కాళ్ళు పట్టుకుని చెప్పాలా..ఇందాక ఎత్తినట్టు ఎత్తి చెప్పాలా సారీ" అన్నాడు సీరియస్ గా. వెంటనే పవిత్ర వచ్చి "నేను స్టార్టింగ్ చూస్తున్న నీ కళ్లన్నీ ప్రియాంక మీదనే ఉన్నాయి" అంది. వెంటనే ప్రియాంక "నాకు సారీ వద్దు ..ఏమీ వద్దు. సుధీర్ గారు ఏంటండీ అక్కడ కూర్చుని షో చూస్తున్నారా.. ఇలాంటి ప్రాంక్స్ మీరే చేయొచ్చు అనుకుంటున్నారేమో మేము కూడా  చేయొచ్చు కూడా అప్పుడప్పుడు..అసలే నా ఫస్ట్ ఎపిసోడ్ " అంది.  "నీకు ఫస్ట్ ఎపిసోడ్ కానీ జనాలకు కోపం వస్తే నాకు లాస్ట్ ఎపిసోడ్ చేస్తారు " అంటూ భాస్కర్ భయం నటించాడు. ఫైనల్ గా  అది ప్రాంక్ అని తెలిసేసరికి అందరూ హ్యాపీ అయ్యారు.  

శాంతి స్వరూప్ ని ఇటు అల్లు అర్జున్ అటు...విజయ్ దేవరకొండ కొరికారట

  శాంతి స్వరూప్ కి ఇంత ఫాలోయింగ్ ఉంటుంది అని అస్సలు జనాలు అనుకుని ఉండరు. ఇంతకు శాంతి స్వరూప్ ఏంటి, ఫాలోయింగ్ ఏంటి అనుకుంటున్నారా. నిజమే రీసెంట్ గా ప్రసారమైన ఫామిలీ స్టార్స్ షో చూస్తే తెలుస్తుంది. యాంకర్ సుధీర్ ని  రకరకాలుగా ఆడేసుకున్నారు ఈ షోకి వచ్చిన శ్రీకర్ కృష్ణ, అష్షు రెడ్డి, బులెట్ భాస్కర్, లిరిష అలియాస్ వకీల్ సాబ్ మూవీ సూపర్ విమెన్. ఇక జబర్దస్త్ కమెడియన్ శాంతి స్వరూప్ ఐతే మరీను. సుధీర్ శాంతి స్వరూప్ ని స్టేజి మీద పలకరించేసరికి ముద్దు పెట్టడానికి వచ్చేసాడు. దాంతో సుధీర్ "బాబోయి ఇప్పుడు వద్దు" అన్నాడు. "సిగ్నేచర్ మూమెంట్ ఏదో ఒకటి ఉండాలి కదా" అనేసరికి తర్వాత చేద్దాం అని తప్పించుకున్నాడు సుధీర్. "ఏమిటి ఇందాక నుంచి చూస్తున్నా అందరినీ మిత్రవింద మిత్రవిందా అంటున్నవ్..ఎక్కడ కనబడుతోంది మిత్రవింద. ఎం నాలో కనిపించడం లేదా ఇటు చూడు ఈ  వైపు నడుమును విజయ్ దేవరకొండ కొరికాడు, ఆ వైపు నడుమును అల్లు అర్జున్ కొరికాడు" అని చెప్పేసరికి సుధీర్ షాకయ్యాడు. ఇక సూపర్ విమెన్ తో చిట్ చాట్ చేసాడు. "ఏంటి ఈ మధ్య డైటింగ్ చేస్తున్నట్టున్నారు..ఆకలిని ఎలా చంపుకుంటున్నారండి" అనేసరికి "నీ యాంకరింగ్ వీడియోస్ చూసాకే..నేనే కాదు మా వాళ్లందరికీ నీ యాంకరింగ్ వీడియోస్ పంపిస్తున్నా" అంటూ లిరిష కౌంటర్ ఇచ్చింది.  

నూకరాజు - పంచ్ ప్రసాద్ కి మధ్య గొడవ...అసలేం జరిగిందంటే ?

  శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఇందులో నూకరాజుకి, పంచ్ ప్రసాద్ కి పెద్ద గొడవే అయ్యింది. పంచ్ ప్రసాద్ కి ఒంట్లో బాగోనప్పుడు కానీ హాస్పిటల్ లో చేర్పించినప్పుడు కూడా నూకరాజు దగ్గరుండి అన్నీ చూసుకున్నాడు. వాళ్ళతో కలిసి వీడియోస్ చేసి వాటిని యూట్యూబ్ లో పెట్టి పంచ్ ప్రసాద్ కి ఆర్థికంగా కూడా సాయం చేయమని కోరాడు. పంచ్ ప్రసాద్ కి నూకరాజు ఒక బ్యాక్ బోన్ లా ఉండి ఎంతో సాయం చేసాడు. ఇక కోలుకున్నాక కూడా నూకరాజు, ప్రసాద్ కలిసి మంచి స్కిట్స్ చేస్తున్నారు అటు జబర్దస్త్ లో, ఇటు శ్రీదేవి డ్రామా కంపెనీలో. ఏమయ్యిందో ఏమో కానీ ఇప్పుడు ఇద్దరి మధ్యా గొడవొచ్చింది. "బేసిక్ గా నూకరాజు నాకు బ్రదర్ కంటే ఎక్కువ. అసలు అతను నాతో మాట్లాడడం మానేసాడు. ఎందుకు మాట్లాడ్డం లేదో నాకు తెలియాలి" అన్నాడు పంచ్ ప్రసాద్. ఆ మాటలకూ నూకరాజు స్టేజి మీదకు వచ్చి "ఒక మనిషికి దూరంగా ఉంటున్నామంటే అదేంటో నాకు తెలుసు" అన్నాడు. "తెలిసినప్పుడు చెప్పారా అన్నాడు" ప్రసాద్ . "ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఇక్కడెందుకు ఆ విషయం" అన్నాడు. " హా లేదు లేదు..అందరికీ తెలియాలి ఆ విషయం" అని అన్నాడు. ఆ వెంటనే ఇద్దరి మధ్య గట్టిగానే మాటల యుద్ధం జరిగినట్టు ప్రోమోలో కనిపిస్తోంది.  ఆ సిట్యుయేషన్ అని ప్రసాద్ అంటూ ఉంటె..వద్దు నాకు చెప్పకు అని నూకరాజు..హి విను ముందు అంటూ ప్రసాద్ ఇలా గట్టిగా స్టేజి మీద పోట్లాడేసుకున్నారు. ఇక వీళ్ళను విడదీయడానికి అటు రష్మీ ఇటు రామ్ ప్రసాద్ ఇద్దరూ వచ్చారు. అసలు ఏమయ్యిందో కానీ గట్టిగానే గొడవ జరిగింది. ఇంతకు ఆ గొడవ ఎందుకు జరిగింది ? అసలు నిజమైన గొడవ ? లేదంటే ఫన్నీ కాన్సెప్ట్ ఆ ? ఈ షో చూస్తే కానీ తెలీదు.

Illu illalu pillalu : రామరాజు మిస్సింగ్.. షాక్ లో ఫ్యామిలీ!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-59 లో.....అసలు ప్రేమ అంటే పడదు కదా ఎలా పెళ్లి చేసుకున్నావని ఇంట్లో వాళ్లు అడుగుతుంటే.. ఎక్కడ ధీరజ్ నిజం చెప్తాడోనని నర్మద వచ్చి కవర్ చేస్తుంది. నాకైనా చెప్పి ఉండాల్సిందని చందు, తిరుపతి అంటుంటే దానికి కూడా నర్మద సమాధానం చెప్తుంది. ఏంటి వాడిని అడుగుతుంటే.. నువ్వు సమాధానం చెప్తున్నావని కామాక్షి అంటుంది. మీకు ఎవరు చేప్తే ఏంటి సమాధానం కావాలి కదా అని నర్మద అంటుంది. వాడిని అడిగితే తను సమాధానం చెప్తుంది ఇందులో ఏదో మతలబు ఉందని కామాక్షి అనుకుంటుంది.    ఆ తర్వాత వేదవతిని భద్రవతి చూసి.. కావాలనే ఇదంతా ప్లాన్ ప్రకారం చేశారు.. నా లాగే నా మేనకోడలికి మీరంటే ఇష్టం లేదు.. ఎలా నా కోడలిని రప్పించుకోవాలో నాకు తెలుసని భద్రవతి అంటుంది. మరొకవైపు సేనాపతికి పెద్దావిడ కాఫీ తీసుకొని వస్తుంది. తను తీసుకోడు. ఇప్పుడు నా కూతురు ఎలా ఉందోనని రేవతి బాధపడుతుంటే.. వేదవతి కూతురు లాగా చూసుకుంటుంది.. ఎప్పటికైనా ఈ రెండు కుటుంబంలు కలిసేవే కదా అని పెద్దావిడ అంటుంది. దాంతో విశ్వ కోపంగా ఎప్పటికి కలవవని అంటాడు. కాసేపటికి కోపంగా ధీరజ్ దగ్గరికి విశ్వ వెళ్లి గొడవ పెట్టుకుంటాడు. నా చెల్లికి మాయమాటలు చెప్పి తీసుకొని వెళ్ళావంటూ గొడవ పడుతుంటే.. నా తమ్ముడు జోలికి రాకని సాగర్, చందులు విశ్వకి వార్నింగ్ ఇస్తారు.   ఆ తర్వాత ధీరజ్ గదిలోకి వస్తాడు. ప్రేమ నిద్రపోతుంటుంది. బయట అంత గొడవ జరుగుతుంటే ఎంత బాగా నిద్రపోతున్నావంటూ లేపుతాడు. ఇక ప్రేమ నిద్రలేచి కాఫీ అని అంటుంది. ధీరజ్ ని చూసి నువ్వు మా ఇంట్లో ఏంటి అని ప్రేమ అనగానే .. ఒకసారి జరిగింది గుర్తుచేసుకోమని ధీరజ్ చెప్తాడు. దాంతో ప్రేమ అంత గుర్తు చేసుకుంటుంది. కాఫీ కావాలని అంటుంది. అప్పుడే నర్మద వచ్చి ధీరజ్ ని తీసుకొని వెళ్లి తనతో ప్రేమకి కాఫీ పంపిస్తుంది. ఆ తర్వాత రామరాజు ఇంట్లో ఎక్కడ కన్పించకపోయేసరికి అందరు టెన్షన్ పడుతుంటారు. మీ నాన్న గారు ఇంట్లో నుండి వెళ్లి పోయారని వేదవతి అనగానే.. అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

చాటుగా వినేసిన దశరథ్.. పోలీస్ కంప్లైంట్ ఇచ్చామనడంతో జ్యోత్స్న టెన్షన్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-258 లో.... శౌర్య హాస్పిటల్ ఖర్చు గురించి కార్తీక్ తన ఫ్రెండ్ ని అప్పు అడుగుతాడు. తన ఫ్రెండ్ అప్పు ఇవ్వకుండా తనని తక్కువ చేసి మాట్లాడతాడు. ఆ తర్వాత అదంతా చూసిన కాశీ.. కార్తీక్ దగ్గరికి వస్తాడు. శౌర్య సిచువేషన్ గురించి కాశీకి చెప్తాడు కార్తీక్. మరి నన్నెందుకు అడగలేదని కాశీ అనగానే.. మీ సిచువేషన్ చూసి ఎలా అడుగుతానని కార్తీక్ అంటాడు. నా దగ్గరున్నాయ్ ఇస్తానని కాశీ అనగానే.. మనసు వద్దని అంటుంది కానీ అవసరం తీసుకోమంటుందని సరే అని కార్తీక్ అంటాడు. నువ్వేంటి ఇక్కడున్నావని కాశీని కార్తీక్ అడుగుతాడు. నాన్న నిన్నటి నుండి కనిపించడం లేదని కాశీ చెప్తాడు. అవునా సరే పోలీస్ కంప్లైంట్ ఇద్దామని కార్తీక్ అంటాడు. దానికి కాశీ సరే అంటాడు.    మరొకవైపు దాస్ గురించి జ్యోత్స్న టెన్షన్ పడుతుంటే.. అప్పుడే పారిజాతం వస్తుంది. నా కొడుకుని ఏం చేసావే ఫోన్ కలవడం లేదని అడుగుతుంది. నీ కొడుకు గురించి నాకేం తెలుసని జ్యోత్స్న అంటుంది. మొన్న దాస్ కాళ్ళు పట్టుకున్నావని పారిజాతం అంటుంది. అదంతా దశరథ్ వింటాడు. దాస్ కాళ్ళు జ్యోత్స్న ఎందుకు పట్టుకుందని దశరథ్ అనుకుంటాడు. ఆ తర్వాత నీ కొడుకు గురించి నాకేం తెలియదని పారిజాతంతో జ్యోత్స్న అంటుంది. మరొకవైపు దీప వస్తుంటే దార్లో కొందరు రౌడీలు పిల్లాడిని ఎత్తుకొని వెళ్తుంటే.. రౌడీల కళ్ళలో దీప కారం కొట్టి బాబుని కాపాడి తన పేరెంట్స్ కి ఇస్తుంది. దాంతో వాళ్లు దీపకి థాంక్స్ చేప్పి ఏదైనా సాయం చేస్తామంటే దీప వద్దని చెప్తుంది.   మరొకవైపు శివన్నారయణ జ్యోత్స్న లు రెస్టారెంట్ గురించి మాట్లాడుకుంటుంటే.. అప్పుడే కాశీ వస్తాడు. మా నాన్న కన్పించడం లేదని అంటాడు. దాంతో పారిజాతం టెన్షన్ పడుతుంది కానీ శివన్నారాయణ‌ మాత్రం ఎక్కడ తిరుగుతున్నాడోనని అంటాడు. ఆ తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చానని కాశీ అనగానే జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత కాశీ వెళ్ళిపోయాక పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు దాస్ గురించి తెలుస్తుంది. దాస్ బాగై అసలు నిజం చెప్పేవరకు దాస్ గురించి ఎవరికి తెలియనివ్వొద్దు.. ఇప్పుడేం చెయ్యాలని దశరథ్ ఆలోచిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ఆమెను కాలేజీలో జాయిన్ చేయించిన సీతాకాంత్.. భద్రం ఫ్రాడ్ అని చెప్పిన రామలక్ష్మి!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు' (Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-305 లో... ఒక అమ్మాయిని పెద్దావిడ చదువుకొమ్మని రిక్వెస్ట్ చేస్తుంటే చదువుకోనని ఆ అమ్మాయి అంటుంది. దాంతో రామలక్ష్మి, సీతాకాంత్ లు తమ దగ్గరికి వస్తారు. ఎందుకు చదువుకోనంటున్నావంటూ అడుగుతారు. ఇప్పటికే మా నానమ్మ నన్ను కష్టపడి చదివించింది. ఇప్పుడు మళ్ళీ తనని కష్టపెట్టలేను.. ఇంజినీరింగ్ లో మంచి సీట్ వచ్చింది కానీ రెండు లక్షలు డబ్బు కట్టమన్నారని అమ్మాయి శృతి అంటుంది. దాంతో నేను చూసుకుంటా నాతో రండి అని శృతి ఇంకా పెద్దావిడని తీసుకొని  సీతాకాంత్ కాలేజీకి వెళ్తాడు.   మరొకవైపు రామలక్ష్మి ఆఫీస్ కి వెళ్తుంది. వెళ్లేసరికి అక్కడ వెంచర్ లో ల్యాండ్ తీసుకున్న వాళ్ళందరూ గొడవ చేస్తుంటారు. రామలక్ష్మి వాళ్లకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది అయినా వినిపించుకోకుండా పోలీస్ కంప్లైంట్ అంటారు. కానీ నేను మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తానని రామలక్ష్మి మాటిస్తుంది. మరొకవైపు సీతాకాంత్ ని లోపలికి రానివ్వకుండా సెక్యూరిటీ అడ్డుపడతాడు. అది సీసీ టీవీలో చూసిన ఎండీ సీతాకాంత్ దగ్గరికి వచ్చి లోపలికి తీసుకొని వెళ్తాడు. ఇది మీ కాలేజీ సర్ అంటూ సీతాకాంత్ గురించి గొప్పగా మాట్లాడతాడు. బయటున్న అమ్మాయి పేరు శృతి. తను ఈ కాలేజీలో చదవాలనుకుంటుందని చెప్తాడు. శృతి, పెద్దావిడలని లోపలికి పిలుస్తాడు. మీరు ఇక్కడ చదవండి డబ్బు కట్టనవసరం లేదని అంటాడు. పెద్దావిడ అక్కడ సీతాకాంత్ ఫోటో చూసి మీ ఫోటో ఇక్కడ ఉందని అడుగగా.. సీతాకాంత్ నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు.   ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ లు ఒకేసారి ఇద్దరు ఫోన్ చేసుకుంటారు కానీ కల్వదు. ఆ తర్వాత రామలక్ష్మి ఆఫీస్ దగ్గర జరిగింది సీతాకాంత్ కి చెప్తుంది. ఆ తర్వాత శ్రీలత ఇంటికి రామలక్ష్మి వెళ్లి ధన, సందీప్ ఎక్కడ అని అడుగుతుంది. ధన, సందీప్ రాగానే మీరు చేసిన వెంచర్ కి గవర్నమెంట్ అప్రూవల్ ఉందా అని అడుగుతుంది. అదంతా భద్రం చూసుకుంటాడని సందీప్, ధన చెప్పగానే.. వాడు ఒక పెద్ద ఫ్రాడ్ అని రామలక్ష్మి చెప్తుంది. దాంతో వాళ్లు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : నగలు కావ్యకి ఇచ్చేసిన ఇందిరాదేవి.. వాళ్ళ పరువుతీయాలని అనామిక స్కెచ్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-622 లో....రాహుల్, రుద్రాణి కలిసి కావ్య నగలు తాకట్టు పెట్టి హాస్పిటల్ బిల్ కట్టిందని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటే మీరు చూడలేరా అని రుద్రాణి పై రాజ్ కోప్పడతాడు.    ఇక కావ్య అందరి ముందు తప్పు చేసిందానిలాగా ఉండకూడదని నేనే నగలు తాకట్టు పెట్టమని చెప్పాను.. అకౌంట్స్ అన్ని హోల్డ్ లో ఉన్నాయ్ కదా అందుకే అలా చెప్పానని అపర్ణ చెప్తుంది. ఏం చాకచక్యంగా సమాధానం చెప్పావని అపర్ణని అంటుంది రుద్రాణి. నీకేం హక్కు ఉందని నిలదీస్తున్నావ్ రుద్రాణి.. గేంటెస్తే బయటకు వెళ్లిపోతావంటూ రుద్రాణికి చివాట్లు పెడుతుంది అపర్ణ. మరి నగల గురించి అడిగినప్పుడే ఎందుకు చెప్పలేదని ధాన్యలక్ష్మి అడుగుతుంది. నాకు సెన్స్ ఉంది.. అప్పుడే చెప్తే ఈ రుద్రాణి అప్పుడే గొడవ చేసేదని అపర్ణ చెప్తుంది. ఆ తర్వాత రాహుల్, రుద్రాణిలు అవమానంగా ఫీల్ అయ్యి అక్కడ నుండి వెళ్లిపోతారు.    ఆ తర్వాత  అపర్ణ, ఇందిరాదేవి కావ్య ఇంటికి వచ్చి మాట్లాడుకుంటారు. ఇప్పుడు అసలు నిజం చెప్పమని కావ్యని నిలదీస్తుంది అపర్ణ. కానీ కావ్య డైవర్ట్ చేస్తుంది. కావ్య చెప్పేది అయితే ఎప్పుడో చెప్పేది.. నువ్వు సైలెంట్ గా ఉండమని అపర్ణతో ఇందిరాదేవి అంటుంది. నాకేం జరిగుతుందోనని టెన్షన్ గా ఉంది నిజం చెప్పమని అపర్ణ అంటుంది. అయినా కావ్య చెప్పకపోవడంతో.. ఇక నువ్వు నాతో మాట్లాడకని అపర్ణ కోపంగా వెళ్లిపోతుంది. అసలు సమస్య ఏంటో ఇంటిపెద్దగా నేను కనుక్కోవాలని ఇందిరాదేవి అనుకుంటుంది.   ఆ తర్వాత రాజ్, కావ్య లు జరిగింది గుర్తుచేసుకుంటారు. ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ వచ్చిందని రాజ్ అంటాడు. ఏంటని కావ్య అడుగగా.. ఇక నిజం అంతా ఇంట్లో వాళ్ళకి చెప్పేద్దామని అంటాడు. దానికి రుద్రాణి, ధాన్యలక్ష్మి లు ఎలా మాట్లాడుతారో కావ్య ఉహించుకొని చెప్తుంది. దాంతో వద్దని రాజ్ అంటాడు.    తరువాయి భాగంలో నీకు తోడుగా ఉంటానని ఇందిరాదేవి నగలు కావ్యకి ఇస్తుంది. మరొకవైపు రాజ్ వాళ్ళు అప్పులు చేస్తున్నారని ఈ విషయం మీడియాకి చెప్పి లైవ్ ని ఎంజాయ్ చేద్దామని సామంత్ తో చెప్తుంది అనామిక. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

సుమ వార్నింగ్ మెసేజ్...జాగ్రత్తగా లేకపోతె అంతే

సోషల్ మీడియా ఊపు పెరిగాక బుల్లితెర స్టార్స్ ని సిల్వర్ స్క్రీన్ స్టార్స్ ని టార్గెట్ చేస్తూ వాళ్లకు ఎన్ని ఆస్తులు ఎక్కడ ఉన్నాయి, ఎం ఉన్నాయి వాటి ఖరీదు ఎంత ఉండొచ్చు లాంటి ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు చాలా మంది. ఆ ఫేక్ న్యూస్ బారిన పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది నవ్వుకుని వదిలేస్తారు కొందరు డిబేట్స్ పెడతారు కొంతమంది సరదా వీడియోస్ చేసి ఫుల్ ఛిల్ల్ అవుతుంటారు యాంకర్ సుమలా. ఇప్పుడు చెప్తోంది ఆమె గురించే. ఆమె కూడా ఆ ఫేక్ న్యూస్ బారిన పడింది. కానీ లైట్ తీసుకుంది. ఐతే ఈ న్యూస్ ఎదో బాగుందే అనుకుందో ఏమో సరదాగా ఒక వీడియో చేసి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. కేరళలో రూ.278 కోట్లతో స్టార్ యాంకర్ సుమ ఒక లగ్జరీ ఇల్లు కట్టుకున్నట్లుగ ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో  ఒక పెద్ద లగ్జరీ హౌస్ ను చూపిస్తూ.. వెనుక ఒక వాయిస్ ఓవర్ కూడా వినిపిస్తూ ఉంటుంది. ఇక సుమ ఇంట్లో 500 సీసీ కెమెరాలు ఉన్నాయని, 10 మంది బాడీ గార్డులు ఉన్నారని వాయిస్ ఓవర్ లో వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ  వీడియోపై సుమ రియాక్ట్ అయ్యింది. "ఎవర్రా మీరంతా .. నేనెప్పుడు కట్టానురా ఇంత ఇల్లు. నేను కేరళలో ఎలాంటి ఇల్లు కట్టించలేదు. ఫేక్. ఏమనుకుంటున్నావమ్మా  అసలు  రూ.278 కోట్లలో ఎన్ని సున్నాలు ఉంటాయమ్మా..? నేనేమైనా అంబానీ ఫ్యామిలీ అనుకుంటున్నావా ? 500 సీసీ టీవీ కెమెరాలా ? ఉదాహరణకు  ఒక హౌస్ లో 5 రూమ్ లు ఉంటే ఒక్కో రూమ్ లో 5 కెమెరాలు పెట్టినా 25 కెమెరాలు ఉంటాయి . ఇన్ని  కెమెరాలు ఎక్కడ పెడతారండి ? అదేమైనా బిగ్ బాస్ హౌస్ నా?’ ‘ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే ? ఇలాంటి ఫేక్ వీడియోస్ లో ముఖ్యంగా నేను కనిపించకుండా నా ఫొటోస్ ను కోలాడ్ చేసి.. ఎక్కడో థాయ్ ల్యాండ్ లోనో, గోవాలోనో ఉన్న ఇళ్లను వాయిస్ ఓవర్ తో వచ్చే  వీడియోలన్నీ ఫేక్. మేము సెలబ్రిటీస్.. మా అంతట మేమే వచ్చి మాట్లాడితే తప్ప నమ్మకండి. అసలే  ఏఐ టెక్నలాజి కూడా వచ్చింది. మా లిప్స్ కూడా జాగ్రత్తగా గమనించండి. నిజంగా మేమే మాట్లాడుతున్నామా , లేదా అని నిర్దారించుకోండి" అంటూ ఒక వార్నింగ్ అలెర్ట్ ఇచ్చింది సుమ.  

బుల్లితెర మీద కొత్త జోడి... సుధీర్ - రష్మీకి పోటీగా శ్రీముఖి- బాలు...

  బుల్లితెర మీద ఆన్ స్క్రీన్ లవర్స్ ఎక్కువైపోయారు. ఆన్ స్క్రీన్ లవబుల్ జోడీస్ లో సుధీర్ - రష్మీ జోడి ఉన్నంత క్యూట్ గా ఎవరు ఉండరు. ఐతే ఇప్పుడు బుల్లితెర మీద ఆ జోడిని బీటౌట్ చేయడానికి కొత్త జోడి పుట్టుకొచ్చింది. వాళ్ళే హోస్ట్ శ్రీముఖి - బాలు. ఇక ఈ జోడి లాస్ట్ వీక్ షో నుంచి సంక్రాంతి షోలో ఇక ఇప్పుడు ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో కూడా తెగ అల్లరి చేస్తూ కనిపించారు. శ్రీముఖికి బాలు అంటే పిచ్చ లైకింగ్ అన్న విషయం తెలిసిపోతోంది. భర్త లాగా ఫీలవుతూ అతని మీద పడుతూ హగ్ చేసుకుంటూ ముద్దులు పెట్టుకుంటూ  స్వీట్స్ తినిపిస్తూ డాన్స్ లు వేసేస్తోంది. ఇక ఈ వారం ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో శ్రీముఖి బాలుతో ఆడిన సరసాలు భలే క్యూట్ గా అనిపించాయి. ఇక శ్రీముఖి "మా ఆయనకు స్వీట్ తినిపిస్తాను" అంటూ లడ్డూ తినిపించింది. బుగ్గ గిల్లింది. ఇక జ్యోతక్క వచ్చి "ఎం ఇష్టమా శ్రీముఖి అంటే" అని అడిగింది. "శ్రీముఖి అంటే అందరికీ ఇష్టం" అన్నాడు. "ఆ ఇష్టం కాదు ..పెళ్లి చేసుకుంటుందట నిన్ను" అన్నది. దానికి బాలు సిగ్గుపడిపోయాడు. "సిగ్గుపడ్డాడంటే నేనంటే బాలుకి ఇష్టమే" అని నవ్వేసింది శ్రీముఖి. ఇక మొదటి సారి శ్రీముఖి - బాలు కలిసి మనీ రూమ్ లోకి వెళ్లి డబ్బులు పెట్టె తెచ్చారు. ఇన్నేళ్ల ఈ షోలో ఇంతవరకు హోస్ట్ వెళ్ళింది లేదు. కానీ ఇప్పుడు శ్రీముఖి వెళ్ళింది. ఇక లోపలి వెళ్లి కొంటె మాటలు మాట్లాడింది. "బాలు ఫస్ట్ టైం ఇద్దరం ఒక రూమ్ లోకి వచ్చాము. కాసేపు కెమెరా ఆపేస్తే బాగుంటుంది. " అంటూ బాలుకి చాటుగా నిలబడి ముద్దిస్తున్నట్టు ఫోజ్ పెట్టేసరికి బయట ఉన్నవాళ్ళంతా గట్టిగా అరిచారు. తర్వాత మనీ బాక్స్ తీసుకెళ్ళాక హరి చూసి అసలు మీరిద్దరూ కపూల్సేనా అసలు ఇద్దరూ..శ్రీముఖిని దగ్గరకు లాక్కో బాలు...ఒక ముద్దు పెట్టు" అంటూ యాంకర్ ఓంకార్ మాట్లాడే స్టైల్ లో ఇమిటేట్ చేసేసరికి శ్రీముఖి షాకైపోయింది.