Illu illalu pillalu : కొడుకుని గాయాలతో చూసి తల్లడిల్లిన తల్లి.. అది చేసిందెవరో ప్రేమ చెప్పనుందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -70 లో.... చిన్నోడు, ప్రేమ ఇంకా ఇంటికి రాలేదని ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడతారు. వాడు ఎప్పుడు అంతే నా పరువు తీసే పనులే చేస్తాడు.. ఇప్పుడు కూడా నా పరువు తీసాడని ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నాడోనని రామరాజు అంటాడు. చిన్నోడు ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తాడని వేదవతి అంటుంది. వస్తాడులే గాని లోపలికి వెళ్ళండి అందరు అని రామరాజు అంటాడు. ధీరజ్ ని హాస్పిటల్ కి తీసుకొని వస్తుంది ప్రేమ. బానే ఉన్నాడు రేపు డిశ్చార్జ్ చేస్తామని అక్కడి డాక్టర్ చెప్తాడు. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. వాళ్ళ నంబర్ నా దగ్గర లేదని దీరజ్ ఫోన్ నుండి సాగర్ కి ఫోన్ చేస్తుంది ప్రేమ‌. దాంతో నర్మదకి చెప్పకుండా చందుని తీసుకొని హాస్పిటల్ కి వస్తాడు సాగర్. ధీరజ్ ని ఆ పరిస్థితిలో చూసి అన్నలు ఇద్దరు ఎమోషనల్ అవుతారు. ఎవర్రా నిన్ను కొట్టిందని చందు అడుగగా.. ఏమో అన్నయ్య వాళ్ళని చూడలేదని ధీరజ్ అంటాడు కానీ ప్రేమ మాత్రం మా అన్నయ్య విశ్వక్ అని చెప్పగానే.. వాళ్ళు షాక్ అవుతారు. వాడి సంగతి చెప్తామంటూ ఆవేశపడుతుంటే వద్దని ధీరజ్ సముదాయిస్తాడు. నర్మద ఏం జరిగిందోనని టెన్షన్ పడుతుంది. సాగర్ కి ఫోన్ చెయ్యడంతో విశ్వక్  ఎటాక్ చేసాడని చెప్తాడు. మరుసటి రోజు ఉదయం ధీరజ్ ని తీసుకొని ఇంటికి వస్తారు. ధీరజ్ ని దెబ్బలతో చూసి అందరు షాక్ అవుతారు. వేదవతి ఏడుస్తూ నా కొడుకుని ఎవరు కొట్టారంటూ ఎమోషనల్ అవుతుంది. అందరు సైలెంట్ గా ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika deepam2 : కోలుకున్న దాస్.. దీప, కార్తీక్ ల బంధం ఇదే!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika deepam 2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -269 లో.... దీప దగ్గరికి జ్యోత్స్న వచ్చి.. నీ కూతురిని కాపాడతాను.. నా బావని నాకు ఇచ్చేయమంటూ ఢీల్ పెడుతుంది. ఈ పేపర్స్ పై సంతకం చెయ్.. నీకు బావకి సంబంధం లేదని దీపని ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది జ్యోత్స్న. ఇక కార్తీక్ డబ్బు కోసం చేస్తున్న ప్రయత్నాలు దీప గుర్తు చేసుకుంటుంది.. అంత డబ్బు మీరు ఏర్పాటు చెయ్యలేరు.. నేనే ఇప్పుడు నీ పాలిట దేవతని అని దీపని జ్యోత్స్న బలవంతపెడుతుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు. దూరంగా ఉండి అంత చూస్తూ ఉంటాడు. దీప చెయ్ బలవంతంగా పట్టుకొని సంతకం చెయ్ అంటుంది జ్యోత్స్న. దాంతో దీప చెయ్ నెట్టేసి పేపర్స్ చింపేస్తుంది. నువ్వు కార్తీక్ బాబుకి వెల కట్టావ్.. నేను గుడి కట్టానే అని జ్యోత్స్న పై దీప విరుచుకుపడుతుంది. కార్తీక్ గురించి దీప గొప్పగా చెప్తుంటే కార్తీక్ చూసి గర్వంగా ఫీల్ అవుతాడు. అప్పుడే కార్తీక్ ని చూసిన దీప.. చుడండి బాబు మీరు కావాలంటుంది.. మీకు తనతో ఉండడం ఇష్టమా అని దీప అడుగుతుంది. నా గురించి నీకు తెలుసు కదా అని కార్తీక్ అంటాడు. నాకు తనని అనాలన్నంత కోపం వస్తుంది. కానీ నీ సమాధానం వినాలని ఆగిన అని దీపకి సపోర్ట్ గా కార్తీక్ మాట్లాడతాడు. దీప మంచిగా సమాధానం చెప్పింది. ఇప్పుడు నువ్వు వెళ్ళు లేకపోతే ఏం చేస్తానో నాకే తెలియదని జ్యోత్స్నతో కార్తీక్ అంటాడు. నువ్వు మనసు మార్చుకుంటే ఫోన్ చెయ్.. నా ఫోన్ ఎప్పుడు ఆన్ లోనే ఉంటుందని దీపకి జ్యోత్స్న చెప్పి వెళ్తుంది. మరొకవైపు దాస్ ఇంట్లో నుండి బయటకు వస్తాడు. అప్పుడే కాశీ వచ్చి లోపలికి తీసుకొని వచ్చి పడుకోపెడతాడు. అక్కడ ఒక పేపర్ దొరుకుతుంది. అందులో మోసం.. తప్పు.. కొట్టారు.. వదలను అనే పదాలు రాసి ఉంటాయి. ఏంటి ఇలా రాసాడని స్వప్నతో కాశీ అనగానే.. తను ఏదో పేపర్ లో రాసాడులే అని లైట్ తీసుకుంటుంది కానీ కాశీ ఆలోచనలో పడుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : జైలు నుండి బయటకు తీసుకొచ్చింది మా అన్నయ్యే.. షాక్ లో శ్రీలత!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -316 లో.... సందీప్ ధన ఇద్దరు బయటకుకి వస్తారు. నేను చేసిన ప్రయత్నం ఫలించిందని రాజీవ్ అంటాడు. అంటే మమ్మల్ని బయటకు తీసుకొని వచ్చింది మీరా అని సందీప్ అంటాడు. అవునని చెప్పగానే రాజీవ్ కి ఇద్దరు థాంక్స్ చెప్తారు. సరే మళ్ళీ కలుద్దామంటూ రాజీవ్ వెళ్ళిపోతాడు. ధన, సందీప్ లు ఆటో కోసం చూస్తుంటే అప్పుడే రామలక్ష్మి వస్తుంది. వాళ్ళని చూసి షాక్ అవుతుంది. ఏంటి వీళ్ళు బయటకు వచ్చారని అనుకుంటుంది. వెళదాం పదా మనలాంటి వాళ్ళు డబ్బు ఇస్తేనే కదా వాళ్ళ కడుపు నిండేది అని ధనతో సందీప్ అంటాడు. ఇద్దరు రామలక్ష్మి ఆటో ఎక్కుతారు. మేము ఏం తప్పు చెయ్యలేదు అందుకే బయటకు వచ్చాము.. మమ్మల్ని మీరు తప్పుగా అపార్ధం చేసుకున్నారని రామలక్ష్మితో ధన అంటాడు. ఇల్లు రాగానే రామలక్ష్మి సడెన్ గా బ్రేక్ వేస్తుంది. ఏంటి అంటూ సందీప్ అనగానే.. మీ కొంప వచ్చిందని రామలక్ష్మి అంటుంది. డబ్బులు ఇవ్వండి అని రామలక్ష్మి అనగానే.. వాళ్ళ దగ్గర ఉండవు. ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. ఆ తర్వాత సీతాకాంత్ ఇంటికి రాగానే వాళ్ళని బయటకు తీసుకొని వచ్చింది మీరే కదా అని సీతాకాంత్ పై రామలక్ష్మి విరుచుకుపడుతుంది. మరేం చేయమంటావ్ నా చెల్లి తన భర్తని విడిపించమని రిక్వెస్ట్ చేసిందని సీతాకాంత్ అంటాడు. వాళ్ళు మారరని.. సీతాకాంత్ కి ఏదయినా హాని తలపెడతారోనని రామలక్ష్మి భయపడుతుంది. ధన, సందీప్, శ్రీలత, రాజీవ్, శ్రీవల్లి లు మాట్లాడుకుంటారు. ఆ రామలక్ష్మి, సీతకాంత్ లకి టార్చర్ చూపించాలని సందీప్ అనగానే సిరి వచ్చి.. సందీప్ చెంప చెల్లుమనిపిస్తుంది. అన్నయ్య వదిన గురించి తప్పుగా మాట్లాడితే మర్యాదగా ఉండదు. మిమ్మల్ని బయటకు తీసుకొని వచ్చింది అన్నయ్యనే అని సిరి అనగానే.. నీకు ఎలా తెలుసని శ్రీలత అంటుంది. నాకు తెలుసని సిరి అంటుంది. అది నిజమేనా అని రాజీవ్ ని శ్రీలత అడుగగా.. అవునని రాజీవ్ తల ఊపుతాడు. దాంతో అందరు షాక్ అవుతారు. ఇప్పటికైనా అర్థమైందా అని సిరి వాళ్లకి క్లాస్ తీసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : బిజినెస్ పనిమీద అమెరికాకి కావ్య, రాజ్.. ఆస్తులన్నీ దోచుకున్నారంటూ రుద్రాణి గొడవ!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -633 లో....కావ్య వేసిన డిజైన్స్ బాగున్నాయని రాజ్ మెచ్చుకుంటాడు. ఇప్పుడు ఈ డిజైన్ ఎలా చేస్తానో చూడమని ఒకతనికి కాల్ చేసి డిజైన్ పంపిస్తాడు. అక్కడ వేళంపాట జరుగుతుంది. ఈ డిజైన్ వాళ్ళకి చూపించి.. ఇది స్వరాజ్ గ్రూప్ ఇండస్ట్రీస్ నుండి వచ్చింది ఒకటే పీస్ అని అక్కడున్నా వాళ్ళకి చెప్తాడు. అందరు పోటీ పడి మరి ఈ డిజైన్ కి వేళం పాడతారు. అదంతా రాజ్ కావ్య ఫోన్ లో వింటూ ఉంటారు. ఆ డిజైన్  కోటిన్నరకి అమ్ముడుపోతుంది. చూసావా దాని కాస్ట్ ఇరవై అయిదు లక్షలు కానీ ఎంతకీ ప్రమోట్ చేసానో చూసావా.. ఇది బిసినెస్ అంటే.. ఇప్పుడు చెప్పు డిజైనర్ గొప్పనా బిజినెస్ మ్యాన్ గొప్పనా అని రాజ్ అనగానే.. మీరే గొప్ప అని ఒప్పుకుంటున్నానని కావ్య అంటుంది. స్వప్నకి రెంట్ డబ్బులు రెండు లక్షలు వస్తాయి. ఆ విషయం రుద్రాణి, రాహుల్ లకి తెలిసి మాకు డబ్బు కావాలి ఇవ్వమని అడుగుతారు. ఇవ్వనని స్వప్న చెప్పడంతో దీని అకౌంట్ లోని డబ్బు నా అకౌంట్ లోకి ఎలా రప్పించుకోవాలో నాకు తెలుసని రుద్రాణితో రాహుల్ అంటాడు. రాహుల్ తెలివిగా స్వప్న ఫోన్ కి ఒక లింక్ పంపిస్తాడు. అది ఓపెన్ చెయ్యగానే మన అకౌంట్ లోకి డబ్బు వస్తుందని రాహుల్ అంటాడు. అనుకున్నట్లుగానే స్వప్న లింక్ క్లిక్ చెయ్యగానే తన డబ్బు మొత్తం రాహుల్ అకౌంట్ లోకి పడిపోతుంది. అది చూసుకొని అయ్యో డబ్బు ఎలా మా అయిందని స్వప్న కంగారుగా రాహుల్, రుద్రాణి దగ్గరికి వచ్చి నా అకౌంట్ లో డబ్బుపోయింది అంటుంది. అందుకే అన్ని లింక్స్ ఓపెన్ చెయ్యొద్దని రాహుల్ అంటాడు. నేను లింక్ ఓపెన్ చేసినట్లు తనకేల తెలుసు.. రాహుల్ ఈ పని చేసి డబ్బు లేకుండా చేసాడని స్వప్న అనుకుంటుంది. రాజ్ దగ్గరికి తన ఫ్రెండ్ వస్తాడు. మీరు వేసిన డిజైన్స్ వాళ్లకి బాగా నచ్చాయి. అందుకే అమెరికాలో మీటింగ్ ఏర్పాటు చేసాను. నువ్వు కావ్య వెళ్ళాల్సి ఉంటుందని అతను చెప్పగానే అమెరికానా అంటూ కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. తనని మోసం చేసి డబ్బు తీసుకున్నారని స్వప్నకి అర్థమవుతుంది. రాహుల్ మళ్ళీ తన ఫ్రెండ్ దగ్గర డబ్బు అడిగానని రుద్రాణికి చెప్తాడు. రుద్రాణి దగ్గరికి రాహుల్ వచ్చి.. నాకు ఒక యాభై వేలు కావాలని అంటుంది. లేవు ఇందాక మేము అడిగితే ఇచ్చావా అని రుద్రాణి అంటుంది. దాంతో నన్నే మోసం చేస్తారా అంటూ తను కూడా ఒక లింక్ రాహుల్ కి పంపిస్తుంద. అది రాహుల్ క్లిక్ చెయ్యగానే తన డబ్బు మొత్తం స్వప్న అకౌంట్ లోకి వస్తుంది. ఎందుకు అలా చేసావ్ రా దాని డబ్బుతో పాటు మన డబ్బు కూడా పోయిందని రాహుల్ తో రుద్రాణి అంటుంది. స్కామార్స్ ఉంటారు కదా చూసుకోవాలి కదా అంటూ స్వప్న అనగానే.. ఈ పని చేసింది స్వప్ననే అని వాళ్ళకి అర్ధమవుతుంది. తరువాయి భాగంలో  రాజ్ వీసా గురించి ఫోన్ లో మాట్లాడడం విన్న రుద్రాణి... అందరి ముందుకి వచ్చి ఆస్తులు తాకట్టు పెట్టి మరి అమెరికాకి వెళ్లి సెటిల్ అవ్వాలనుకుంటున్నారని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu : భర్తని కాపాడుకున్న ప్రేమ.. వేదవతి విశ్వరూపం!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -69 లో.... రామరాజుని హారతి ఇవ్వమని పూజరి పిల్వగానే.. అది చూడలేక వాడికి ఊళ్ళో ఏం విలువ ఉందని ఇలా చేస్తున్నారు. వాడి లాగే వాడి కొడుకులు అంటూ భద్రవతి సేనాపతి ఇద్దరు అవమానిస్తుంటారు. అది చూడలేక వేదవతి ఎదరు తిరుగుతుంటే తనని రామరాజు ఆపి తీసుకొని వెళ్తాడు. ధీరజ్ రాత్రి నడుచుకుంటూ వెళ్తుంటే.. తన వెనకాల కొంతమంది రౌడీలు ఫాలో అవుతూ ఉంటారు. ధీరజ్ కోసం ప్రేమ చూస్తుంది. తను వెళ్లడం చూసి సైలెంట్ గా ఉంటుంది. ధీరజ్ ని రౌడీ లు ఎటాక్ చేసి పక్కకి తీసుకొని వెళ్తారు. ఆ ధీరజ్ గాడు చచ్చిపోవాలని  రౌడీలతో విశ్వ మాట్లాడడం ప్రేమ విని షాక్ అవుతుంది. ధీరజ్ వెనకల కొంతమంది వెళ్ళడం చుసిన విషయం ప్రేమ గుర్తుచేసుకుంటుంది. వాళ్ళు రౌడీలా అని అనుకుంటుంది. ధీరజ్ కోసం ప్రేమ వెతుకుంటూ ఉంటుంది. ధీరజ్ దగ్గరికి విశ్వ వెళ్లి కొడుతుంటాడు. మరోవైపు ప్రేమకి ఒక దగ్గర ధీరజ్ కంకణం కన్పిస్తుంది. దాన్ని పట్టుకొని ధీరజ్ దగ్గర కి వస్తుంది. అప్పుడే విశ్వ కత్తి తో ధీరజ్ ని పొడవబోతుంటే ప్రేమ చూసి ఆపుతుంది. నిన్ను లేపుకుని వెళ్లి తప్పు చేసాడని విశ్వ అంటాడు. అయితే అందులో నా తప్పు కూడా ఉందని ప్రేమ అంటుంది. అయిన విశ్వ వినడు. ముందు నేను పొడుచుకుంటానని ప్రేమ కత్తి పట్టుకుంటుంది. దాంతో వద్దని రౌడీలని తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు విశ్వ. ఇక అదే సమయంలో ధీరజ్ ఫోన్ లిఫ్ట్ చెయ్యకపోవడంతో వేదవతి వాళ్ళు టెన్షన్ పడుతుంటారు. వాడెప్పుడు అంతే అంటూ రామారాజు కోప్పడతాడు. మరోవైపు ధీరజ్ ని ప్రేమ హాస్పిటల్ కి తీసుకొని వెళ్తుంది. తరువాయి భాగంలో వేదవతి కోపంగా భద్రవతి ఇంటికి వెళ్లి నా కొడుకుని చంపాలని చూస్తావా అని విశ్వ చెంపచెల్లుమనిపిస్తుంది. అప్పుడే రామరాజు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2: శౌర్య కోసం కోటి రూపాయలు ఇస్తానన్న జ్యోత్స్న.. బదులుగా కార్తీక్ కావాలని కండిషన్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -268 లో....శౌర్యకి ఏదైనా అయితే నువ్వు బ్రతకవని తెలిసి నిజం చెప్పలేదని దీపతో కార్తీక్ చెప్తాడు. ఆపరేషన్ కి డబ్బు కావాలి కదా అని దీప అడుగుతుంది. వస్తాయని కార్తీక్ సమాధానం చెప్తాడు. అసలేం జరుగుతుంది.. ఎవరిని నమ్మాలో అర్ధం కావడం లేదని సుమిత్ర అంటుంది. ఒకసారి దీపకి ఫోన్ చెయ్ అని దశరథ్ అంటాడు. జ్యోత్స్న చెప్పింది కదా అని సుమిత్ర అనగానే.. తను చెప్పింది నిజమని మనం ఎందుకు అనుకోవాలి.. ఎవరిని నమ్మాలో అర్థం కావడం లేదు అన్నావ్ కదా దీప కి ఫోన్ చెయ్ అని దశరథ్ అంటాడు. దీపకి ఫోన్ చేస్తుంది సుమిత్ర. కానీ తను లిఫ్ట్ చెయ్యదు. కాంచనకి ఫోన్ చేస్తుంటే తను కూడా అంత అవమానం తర్వాత ఎలా మాట్లాడుతుందని దీప లిఫ్ట్ చెయ్యదు. కార్తీక్ కి దీప ఫోన్ చేస్తుంది. ఇప్పుడు లిఫ్ట్ చేస్తే అంత చెప్పాలి.. బాధపెట్టడం తప్ప ఏం లేదని కార్తీక్ లిఫ్ట్ చెయ్యడు. ఎవరు లిఫ్ట్ చెయ్యడం లేదని సుమిత్ర బాధపడుతుంటే.. దీన్ని బట్టి వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అర్థం అవుతుందని దశరథ్ అంటాడు. ఇల్లు తీసుకొని డబ్బు ఇవ్వండి అని తన ఊళ్ళో వాళ్ళని అనసూయ అడుగుతుంది. ఇల్లు దీప పేరున ఉంది అయినా అంత డబ్బు ఒకేసారి అంటే కష్టమని వాళ్ళు అంటారు. కార్తీక్ దగ్గరికి డాక్టర్ వచ్చి.. డబ్బు ఇంకా కట్టలేదు.. కడితేనే ట్రీట్ మెంట్ నడుస్తుందని అంటాడు. డబ్బులు ఎలా వస్తాయని దీప అడుగుతుంది. వస్తాయని కార్తీక్ అనగానే.. నాతో అబద్దం చెప్తున్నారని దీప అంటుంది. నా దగ్గర ఇప్పుడు అబద్ధాలు తప్ప ఏం లేవని కార్తీక్ డబ్బు గురించి తన ప్రయత్నం గురించి చెప్తాడు. వెళ్లిన పని అవ్వలేదంటూ కాంచనతో అనసూయ చెప్తూ బాధపడుతుంది. దీప దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది. అప్పుడే జ్యోత్స్న వచ్చి.. నేను డబ్బు ఇస్తానంటూ కోటి రూపాయల చెక్కు ఇస్తుంది. అరకోటి నీ బిడ్డ ప్రాణం కోసం.. అరకోటి నా ప్రాణం అయిన బావ కోసం నీ తాళిని నాకు ఇచ్చేయమని జ్యోత్స్న అడుగుతుంది. ఇందులో బావకి నీకు సంబంధం లేదు అన్నట్లు రాసి ఉంది.. దాంట్లో సంతకం చెయ్.. మిగతాది మొత్తం నేను చూసుకుంటానని జ్యోత్స్న అనగానే.. దీప షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : అతడిని బెదిరించి ధన, సందీప్ లని విడిపించిన సీతాకాంత్.. ఆమె తెలుసుకుంటుందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -315 లో....భద్రం తన నోటితోనే ధన, సందీప్ లు తప్పు చెయ్యలేదని చెప్పాలంటే వాడి డిఫెక్ట్స్ నాకు తెలియాలని భద్రం ఆఫీస్ కి వెళ్తాడు సీతాకాంత్. అక్కడ పిఏ సీతాకాంత్ ని చుసి పారిపోతుంటే.. సీతాకాంత్ పట్టుకొని భద్రం గురించి అన్ని విషయాలు తెలుసుకుంటాడు. తను ఇప్పటివరకు చేసిన స్కామ్ లు అన్ని తెలుసుకొని ఈ విషయాలన్నీ నేను ఎక్కడ చెప్పమంటే అక్కడ చెప్పాలని సీతాకాంత్ అనగానే.. అతను సరే అంటాడు. అక్కడ సీతాకాంత్ ఆటో చూసిన రామలక్ష్మి... సీతా సర్ ఇక్కడున్నాడేంటి? ధన, సందీప్ లని విడిపించడానికి ఏదైనా ప్లాన్ చేస్తున్నాడా అని అనుకుంటుంది అప్పుడే సీతాకాంత్ వస్తాడు. ఏంటి ఇక్కడున్నారని రామలక్ష్మి అడుగుతుంది. ప్యాసింజర్స్ ని తీసుకొని వచ్చానని అతను చెప్తాడు. రాజీవ్ స్టేషన్ కి వెళ్లి.. ధన, సందీప్ లు బయటకు రావాలంటే సీఐ కి ఏంత కావాలని కానిస్టేబుల్ ని అడుగుతాడు. అప్పుడే సీఐ వస్తాడు. ఏంటని అడుగుతుంటే. నా వస్తువు పోయింది కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చానని కవర్ చేస్తాడు రాజీవ్. సీతాకాంత్ వచ్చి సీఐతో  నేను పర్సనల్ గా భద్రంతో మాట్లాడాలని అనగానే సరేనని సీఐ పంపిస్తాడు. నీ తప్పులు మోసాలన్నీ తెలుసంటూ భద్రం పిఏని పిలిపిస్తాడు. నువ్వు ఇప్పుడు ధన, సందీప్ లది ఏ తప్పు లేదని చెప్తే సరే.. లేదంటే నువ్వు చేసిన మోసాలన్నీ చెప్తే ఇక లైఫ్ లాంగ్ జైల్లో నే ఉంటావని సీతాకాంత్ అనగానే.. భద్రం భయపడి సీఐతో నాదే తప్పు వాళ్లదేమీ లేదని చెప్తాడు. నేనే వాళ్ళని విడిపించానని చెప్పొద్దని సీఐతో సీతాకాంత్ చెప్తాడు. అదంతా రాజీవ్ విని ఇది మన అకౌంట్ లో వేసుకుందామని అనుకుంటాడు. ఇక శ్రీలతతో నేనే విడిపించానని చెప్తానని రాజీవ్ అనుకుంటాడు. మరోవైపు శ్రీలత ఇంటికి సీతాకాంత్ వెళ్తాడు. ఎందుకు వచ్చావ్ వాళ్ళని స్టేషన్ లో పెట్టావ్.. విడిపించమంటే నువ్వు నీ భార్య కలిసి సిరిని బాధపెట్టి పంపించారని శ్రీలత కోప్పడుతుంది. అమ్మ సిరి అంత నువ్వు కోరుకున్నట్లు జరుగుతుందని చెప్పి సీతాకాంత్ వెళ్ళిపోతాడు. అన్నయ్య అలా అంటున్నాడు విడిపించాడా అని సిరి అనుకుంటుంది. ధన, సందీప్ లు బయటకు వస్తారు. హమ్మయ్య నేను చేసిన ప్రయత్నం పలించింది అని రాజీవ్ అనగానే.. ఏంటి నువ్వు మమ్మల్ని బయటకు తీసుకొని వచ్చింది నువ్వా అని ధన, సందీప్ లు అంటారు. అవునని రాజీవ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : మూడు నెలల గడువు అడిగిన కావ్య.. రాహుల్ కి కొత్త భాద్యత!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -632 లో.... రుద్రాణి మాయలో పడిపోయి ధాన్యలక్ష్మి దుగ్గిరాల ఇంట్లో ఆస్తుల పంచాయతి మొదలు పెట్టింది.. అందుకు భర్తని కూడా ఒప్పించింది కోర్ట్ నుండీ నోటిసులు రావడం లాయర్ ఇంటికి రావడం నడుస్తుంది. ఇక అదంతా చూసిన కావ్య.. వాళ్ళు కేసు వేస్తే ఎలా తీసుకుంటారు. అసలైన వారసుడు వెయ్యాలి కదా అని లాజిక్ గా మాట్లాడుతుంది. కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చి నేను కేసు వెయ్యనంటూ ధాన్యలక్ష్మికి దిమ్మతిరిగే షాక్ ఇస్తాడు. నాకు బంధాలు కావాలి. ఈ కుటుంబం కావాలంటూ ముక్కుసూటిగా మాట్లాడతాడు. అది విన్న ఇందిరాదేవి.. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాకు ఒక మూడు నెలల టైమ్ కావాలి. అంత మీకే తెలుస్తుందంటు కావ్య చెప్పగానే ధాన్యలక్ష్మి చిరాకుగా వెళ్ళిపోతుంది. ఇక కొడుకు తనని ఎదిరించాడని ధాన్యలక్ష్మి కోపంగా గదిలో ఉన్న వస్తువులు విసిరేస్తుంది. రుద్రాణి వచ్చి ఇంకా రెచ్చగొడుతుంది. ఇప్పుడు మనం చెయ్యాలిసింది ఇది కాదు.. మూడు నెలల వరకు ఎందుకు? రోజు ఆస్తులు పంచమని గొడవ చేద్దామని రుద్రాణి అంటుంది. ధాన్యలక్ష్మి అక్కడ నుండి వెళ్ళిపోయాక రాహుల్ వస్తాడు. ఎప్పుడు ఎలా ఉంటుందో ఈ ధాన్యలక్ష్మికి తెలియదు. ఫుల్ గ్రిప్ లో ఉంచాలని రాహుల్ తో అంటుంది రుద్రాణి. అసలు రాజ్, కావ్య మూడు నెలలు ఎందుకు టైమ్ అడిగారు తెలుసుకోమని రాహుల్ తో రుద్రాణి చెప్తుంది. వాళ్లపైనే నా పోకస్ ఉంటుందని రాహుల్ అంటాడు. రాజ్, కావ్య ఆఫీస్ కి వెళ్తారు. కళ్యాణ్ ని రప్పించే ముందు నాకు చెప్పాలి కదా అంటాడు రాజ్. ఒకవేళ కళ్యాణ్ రాకపోతే ఇంకా టెన్షన్ పడేవాళ్ళమని కావ్య చెప్తుంది. ఆ తర్వాత డిజైన్స్ గురించి మాట్లాడుకుంటారు. అపర్ణ ఆలోచిస్తుంటే ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావ్.. ప్రాబ్లమ్ సాల్వ్ అయింది కదా  అని సుభాష్ అంటాడు. ఎక్కడ సాల్వ్ అయింది అసలు ప్రాబ్లమ్ ఏంటో చెప్పలేదు కదా అని అపర్ణ అంటుంది. కావ్య నే కళ్యాణ్ ని రప్పించి ఉంటుందని సుభాష్ అంటాడు. మరోవైపు రాజ్ కి కావ్య డిజైన్స్ చూపించగా.. చాలా బాగున్నాయని రాజ్ చెప్తాడు. అవునా నేనే వేసానని కావ్య అనగానే.. బాలేవని రాజ్ అంటాడు. మీరు వేస్తే బాగున్నాయి.. నేను వేస్తే బాగోలేవా అని కావ్య అంటుంది. బాగున్నాయ్ ఎలా చేసావని రాజ్ అడుగుతాడు. అవి స్పెషల్ డిజైన్స్ అంటూ కావ్య వాటి గురించి చెప్తుంది ఈ డిజైన్స్ గురించి కస్టమర్ ఒపీనియన్ కనుక్కుంటానని రాజ్ అనగానే.. ఎలా అని కావ్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : భద్రవతికి గట్టి వార్నింగ్ ఇచ్చిన వేదవతి.. ధీరజ్ ని ప్రేమ కాపాడుకుంటుందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -68 లో......సంక్రాతి ఉత్సవాలలో  పోటీలు జరుగుతాయి. అందులో ధీరజ్ పై విశ్వ రౌడీలతో ఎటక్ చేపిస్తాడు. అది ఫెయిల్ అయి రామరాజు కుటుంబం గెలుస్తుంది. భద్రవతి కుటుంబం ఓడిపోతుంది. అది అవమానంగా ఫీల్ అవుతాడు విశ్వ. అసలు ఈ ధీరజ్ గాడు ఎలా బ్రతికాడని విశ్వ అనుకుంటాడు. అప్పుడే ధీరజ్ వచ్చి ఓడిపోయామని భాదపడుతున్నావా.. చాకచక్యంగా ఉండాలి.. అప్పుడే గెలుస్తామని ధీరజ్ అంటాడు. నువ్వు నాకు హ్యాపీ సంక్రాతి చెప్పావ్ కదా.. నేను కూడా చెప్పాలి కదా హ్యాపీ సంక్రాతి బామ్మర్ది అని ధీరజ్ చెప్పి వెళ్ళిపోతాడు.  రౌడీలని విశ్వ కలిసి ఫెయిల్ చేశారంటూ కోప్పడతాడు. ఒకవైపు పూజ జరుగుతుంటే మరొకవైపు పక్కకి వెళ్లి ప్రేమ బాధపడుతుంది. ఏంటి ఇక్కడ ఉన్నావ్.. రా పిలుస్తున్నారని ధీరజ్ పిలుస్తాడు. నేను రాను నిన్ను పెళ్లి చేసుకున్నానని మా వాళ్ళు బాధపడుతున్నారని ప్రేమ అనగామ. మా నాన్న కుడా బాధపడుతున్నాడని ధీరజ్ చెప్తాడు. గుడిలో పూజ జరుగుతుంటే పూజారి రామరాజుని హారతి ఇవ్వమంటే.. వాడికి ఏం విలువ ఉందని ఇవ్వమంటున్నావ్.. వాడు లేచిపోయి పెళ్లి చేసుకున్నాడు.. వాడి కొడుకులు అంతే అని భద్రవతి అవమానంగా మాట్లాడుతుంది. మా నాన్న నాకు ఘనంగా పెళ్లి చేస్తాడని చందు అంటాడు. పెద్దోడ్ని వదిలిపెట్టి చిన్నోళ్లు పెళ్లి చేసుకున్నారంటూ భద్రవతి కోప్పడుతుంటే.. ఆపండి అంటూ వేదవతి గట్టిగా అరుస్తుంది. తరువాయి భాగంలో  రౌడీలతో ధీరజ్ ని చంపేయండి అంటూ రౌడీలతో విశ్వ మాట్లాడడం ప్రేమ వింటుంది. ధీరజ్ ని కొట్టి విశ్వ కత్తితో పొడవబోతుంటే ప్రేమ వెళ్లి ఆపుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : ఎమోషన్స్ తో అల్లాడించిన దీప, కార్తీక్.. జ్యోత్స్న కట్టుకథ సక్సెస్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -267 లో... నా కూతురిని చూస్తానంటూ దీప పరిగెత్తుకుంటూ వెళ్తుంటే కార్తీక్ వెనకాలే వెళ్తాడు. నువ్వు ఇలా బాధపడుతూ ఏడుస్తుంటే.. శౌర్యా ఏమవుతుందని కార్తీక్ అంటాడు. శౌర్యకి ఏమని చెప్పారు.. ఏదో చెప్పారు.. ఈ ఆపరేషన్ అంటూ ఏం చెప్పలేదు. నువ్వు శౌర్య ముందు ఏడవనని నాకు మాటివ్వమని దీపతో కార్తీక్ అంటాడు. దీప ఏడుస్తుంటుంది. కార్తీక్ మళ్ళీ మళ్ళీ అంటుంటే దీప మాటిస్తుంది. మరోవైపు శివన్నారాయణ దగ్గరికి దశరథ్ వస్తాడు. చెల్లి ఆస్తులన్నీ వదిలేసి అప్పుకోసం ఇక్కడికి వచ్చింది. తనకి హెల్ప్ చెయ్యాలి అని దశరథ్ అంటాడు. ఇది నువ్వు అంటున్నావా నీ వెనకాలున్న వాళ్ళు అనిపిస్తున్నారా అని సుమిత్రని ఉద్దేశించి శివన్నారాయణ అంటాడు. నన్ను క్షమించండి మావయ్య నేను ఎప్పటికి పరాయిదాన్నే కానీ కాంచన మీ కూతురని సుమిత్ర అంటుంది. అప్పుడే జ్యోత్స్న వస్తుంది. అందరూ కలిసి హెల్ప్ చేసేలా ఉన్నారు. ఈ సిచువేషన్ లో అందరు ఒక్కటైనా ఆశ్చర్యపొనవసరం లేదు.. ఇప్పుడు నాకు నచ్చినట్లు కథని అల్లుతాను.. శౌర్య ఆరోగ్యం బాలేదని వీళ్లకి చెప్పొద్దని జ్యోత్స్న అనుకుంటుంది. వాళ్లకి సాయం చెయ్యాల్సిన అవసరం లేదు.. ఎందుకు అంటే శౌర్య హాస్పిటల్ లో లేదు.. వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉంది నేను దీప ఇంటికి వెళ్లేసరికి మంచిగా పిండి కలుపుకుంటూ ఉంది. ఎందుకు ఇలా అందరిని మా ఇంటికి డబ్బు కోసం పంపావంటే అందులో మా అత్త వాటా కూడా ఉందనని దీప చెప్పిందంటు జ్యోత్స్న అనగానే.. చూసావా అంటూ శివన్నారాయణ కోపంగా వెళ్ళిపోతాడు. దశరథ్ బాధగా వాళ్ళనేం అనలేక వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మంచి పని చేసావని జ్యోత్స్నని మెచ్చుకుంటుంది పారిజాతం. దీప హాస్పిటల్ కి వెళ్తుంది. శౌర్య నీకొక సర్ ప్రైజ్ అంటూ దీపని కార్తీక్ చూపించగానే.. శౌర్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. జ్యోత్స్న ఎమోషనల్ అవుతుంది. శౌర్య ముందు తన బాధని బయటకు కన్పించనివ్వదు. బయటకు వచ్చి దీప ఏడుస్తుంటే అప్పుడే కార్తీక్ వచ్చి.. శౌర్య గురించి నీకెలా తెలిసిందని అడుగుతాడు. జ్యోత్స్న చెప్పిందని దీప అనగానే.. జ్యోత్స్నపై కార్తీక్ కోపంగా ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Eto Vellipoyindhi Manasu : భర్తకి ప్రాణగండం.. చెల్లెలి కోసం వాడిని సీతాకాంత్ బయటకు తీసుకొస్తాడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu ). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -314 లో.....రామలక్ష్మి స్వామి దగ్గరికి వెళ్తుంది. నీ భర్తకి మరణగండం ఉందని చెప్పగానే.. రామలక్ష్మి షాక్ అవుతుంది. దీనికి సొల్యూషన్ చెప్పండి అని రామలక్ష్మి అనగానే.. త్వరలోనే చెప్తాను కానీ మీరు జాగ్రత్తగా ఉండాలని స్వామి చెప్తాడు. సీతాకాంత్  దగ్గరికి సిరి వస్తుంది. అన్నయ్య ఈ టైమ్ లో నా భర్త నా దగ్గర ఉండాలి అనుకుంటా కదా దయచేసి నా భర్తని విడిపించమని సిరి రిక్వెస్ట్ చేస్తుంది. అప్పుడే రామలక్ష్మి వచ్చి.. వద్దు వాళ్ళు ఇప్పటికే చాలా తప్పులు చేశారు. నా భర్తని చంపాలనుకున్నారని రామలక్ష్మి కఠినంగా మాట్లాడుతుంది. కనీసం నాకు డెలివరి అయ్యేవరకు అయినా ధనని నాతో ఉండేలా చూడమని సిరి అనగానే.. కుదరదని రామలక్ష్మి అంటుంది. మళ్ళీ వాళ్ళని నమ్మి బయటకు తీసుకొని వస్తే మళ్ళీ హాని చెయ్యరని నమ్మకం లేదు.. మాకు హాని కలిగించాలని చూసిన వాళ్ళ పేర్లు కూడా మాకు వినపడడానికి వీల్లేదని రామలక్ష్మి చెప్పగానే.. సిరి వెళ్ళిపోతుంది. మరోవైపు రాజీవ్ తో శ్రీలత మాట్లాడుతుంది. ఆ భద్రం గాడు సందీప్, ధనలని కూడా కేసులో ఇరికించాడని చెప్తుంది. ఎలాగైనా వాళ్ళని బయటకు తీసుకొని రా అని చెప్తుంది. అప్పుడే సిరి వస్తుంది. ఏమైంది ఆ రామలక్ష్మి కుదరదని చెప్పింది కదా అని శ్రీలత అంటుంది. దాంతో సిరి లోపలికి వెళ్తుంది. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు వాళ్ళు బయటకు రావాలని రాజీవ్ తో శ్రీలత చెప్తుంది. శ్రీలత లోపలికి వెళ్తుంది. శ్రీవల్లి వచ్చి నువ్వు ఎవరు.. నిన్ను ఎప్పుడు చూడలేదని రాజీవ్ ని అడుగుతుంది. నేను తనకి కావాలసిన వాడిని.. నా పేరు రాజీవ్ అని చెప్తాడు. అప్పుడే శ్రీలత నగలు తీసుకొని వచ్చి వీటితో మా వాళ్ళని బయటకు తీసుకొని రా అని చెప్తుంది. సిరితో రామలక్ష్మి అన్న మాటలు సీతాకాంత్ గుర్తుచేసుకొని బాధపడతాడు. రామలక్ష్మి పక్కకి వస్తే దూరం వెళ్తాడు. నాపై కోపంగా ఉంది కానీ ఇదంతా మీకోసం చేసాను. తప్పు అయితే క్షమించండి అని రామలక్ష్మి సీతాకాంత్ చేతులు పట్టుకొని తన చెంపలని కొట్టుకుంటుంటే.. వద్దని ప్రేమగా దగ్గర కి తీసుకుంటాడు సీతాకాంత్. మరుసటి రోజు సీతాకాంత్ తన ఫ్రెండ్ అయిన సీఐ దగ్గరికి వెళ్లి ధన, సందీప్ లు బయటకు తీసుకొని రమ్మని అంటాడు. అది కుదరదు భద్రం తనే స్వయంగా వాళ్ళు ఏ తప్పు చెయ్యలేదని చెప్తేనే వాళ్ళు బయటకు వస్తారని సీఐ చెప్తాడు. సరేనని సీతాకాంత్ అంటాడు. ఎలాగైనా సీతా సర్ వాళ్ళని బయటకు తీసుకొని రావడానికి ట్రై చేస్తుంటాడని రామలక్ష్మి అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : ఆస్తిలో వాటా కోసం ధాన్యలక్ష్మి తాపత్రయం.. కన్నకొడుకే తిరస్కరించాడుగా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -631 లో... సుభాష్ దగ్గరికి కావ్య వచ్చి.. మీరేదో ఒకటి చేసి చిన్న మావయ్యని కోర్ట్ కి వెళ్లకుండా ఆపండి అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. చేసిందంతా చేసి ఇప్పుడు ఇలా మాట్లాడితే ఎలా అని అపర్ణ కావ్యపై విరుచుకుపడుతుంది. ఏం అడిగినా ఈ కుటుంబం కోసం అంటావ్ కానీ అసలు ఏంటని చెప్పవని అడుగుతుంది. ఏది అయితే అది అవుద్ది ఇక్కడ నుండి వెళ్ళమని అపర్ణ కఠినంగా మాట్లాడడంతో కావ్య అక్కడ నుండి వెళ్ళిపోతుంది. పరిస్థితి మన చెయ్ జరిపోయిందని కావ్యతో రాజ్ అంటాడు. ఇంట్లో జరుగుతున్న వాటికి ఇద్దరు బాధపడతారు. ఇంట్లో ఇక చిచ్చు రాజుకుంది.. ఆస్తులలో మనకి వాటా వస్తుందంటూ రాహుల్ , రుద్రాణి హ్యాపీగా ఫీల్ అవుతూ డ్రింక్ చేస్తూ డాన్స్ చేస్తుంటారు. అప్పుడే స్వప్న వచ్చి.. ఏం చేసిన మీకు ఆస్తులలో వాటా రాదంటూ డిస్సపాయింట్ గా మాట్లాడుతుంది‌. అయినా వాళ్ళు అదేం పట్టించుకోకుండా చిల్ అవుతారు. ప్రకాష్ ఇంట్లో వాళ్ళని ఎదిరించానని బాధపడుతుంటే ధాన్యలక్ష్మి వస్తుంది. కాసేపట్లో లాయర్ వస్తున్నాడని చెప్తుంది. ఇప్పటికే ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నారు వద్దని ప్రకాష్ అంటాడు. అలా ఏం ఆలోచించకండి అని ప్రకాష్ ని కిందకి తీసుకొని వెళ్తుంది ధాన్యలక్ష్మి. అప్పుడే లాయర్ వస్తాడు. మేమే లాయర్ ని పిలిపించామని ధాన్యలక్ష్మి చెప్తుంది. తాత సంపాదించిన ఆస్తులలో వారసులుగా మనవళ్ళకి హక్కు ఉంటుంది కానీ వీళ్ళు కేసు వేస్తే మీరు ఎలా తీసుకున్నారని లాయర్ ని కావ్య అడుగుతుంది. అవును తన మనవళ్ళు వెయ్యాలని లాయర్ అంటాడు. మేమ్ వేసింది చెల్లకపోతే నా కొడుకు చేత వేయిస్తానని ధాన్యలక్ష్మి అనగానే అప్పుడే కళ్యాణ్ ఎంట్రీ ఇస్తాడు. నేను వెయ్యనంటూ ముక్కుసూటిగా చెప్పేస్తాడు. తాతయ్య ఆ పరిస్థితి లో ఉంటే మీరు ఇలా చేస్తున్నారంటూ కోప్పడతాడు. నాన్న నీ బాధకి తప్పక ఒప్పుకున్నాడని ధాన్యలక్ష్మితో కళ్యాణ్ అంటాడు. నాకు ఆస్తులపై ఇష్టం లేదు.. నన్ను బలవంతం చేసే హక్కు మీకు ఎవరిచ్చారంటూ కళ్యాణ్ తన తల్లిని నిలదీస్తాడు. తరువాయి భాగంలో రాజ్ ఎవరితోనో కావ్య వీసా గురించి మాట్లాడతాడు. అది రుద్రాణి విని ధాన్యలక్ష్మికి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : వారిది ప్రేమ పెళ్ళి కాదని కనిపెట్టేసిన కామాక్షి!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు '(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -67 లో....చందు తను ప్రేమించిన అమ్మాయి కన్పించడంతో తనని చూసి బాధపడుతుంటే దీరజ్ వచ్చి మాట్లాడతాడు. ఇన్నిరోజులు అయిన ఆ అమ్మాయిని మర్చిపోలేదంటే నువ్వు ఎంతగా తనని ప్రేమించావో అర్థమవుతుంది. నువ్వు బాధపడకు వెళ్ళమని చందుని రామరాజు వాళ్ళ దగ్గరికి పంపిస్తాడు ధీరజ్. రామరాజు దగ్గరికి చందు వస్తాడు. కలశం తీసుకొని రాలేదంటుంటే ధీరజ్ వెళ్ళడని చందు చెప్తాను. వాడికి ఎందుకు చెప్పావ్.. వాడికి బాధ్యతలు తెలియవంటూ అతనిపై రామరాజు కోప్పడతాడు. వాడు తీసుకొని వస్తాడంటూ చందు వేదవతి ఇద్దరు కలిసి ధీరజ్ గురించి మంచిగా చెప్తారు. మరోవైపు ధీరజ్ ని చంపడానికి రౌడీలతో మాట్లాడతాడు విశ్వ. ధీరజ్ కలశం తీసుకుంటాడు. ఇంకా వాడు రావట్లేదని రామరాజు కోప్పడతాడు. వస్తాడంటూ వేదవతి చెప్తుంది. పెద్ద పోటుగాడిలాగా అన్నింట్లో దూరేస్తాడని ధీరజ్ కి ప్రేమ ఫోన్ చేస్తుంది. రౌడీ అప్పుడే ధీరజ్ పై కత్తి విసురుతాడు. అప్పుడే ప్రేమ ఫోన్ చేయడంతో ధీరజ్ ఫోన్ కింద పడిపోతుంది అది పట్టుకుంటాడు. దాంతో రౌడీ విసిరిన కత్తి గురి తప్పుతుంది. ఈ దెయ్యం నాకు ఎందుకు ఫోన్ చేస్తుందని ధీరజ్ అనుకొని ఫోన్ కట్ చేస్తాడు. ఇంకా వాడు రాలేదంటూ రామరాజు కోప్పడుతుంటే.. అప్పుడే ధీరజ్ కలశం తీసుకొని వస్తాడు. ఏంటి నాకు ఫోన్ చేసావంటూ ప్రేమతో ధీరజ్ గొడవ పడుతుంటాడు. అది కామాక్షి చూసి అసలు వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారా అంటూ వేదవతి వాళ్ళతో చెప్తుంది. వాళ్ళేం మాట్లాడకూతున్నారో నేను లిప్ సింక్ ద్వారా చెప్తానంటూ ప్రేమ, ధీరజ్ లు మాట్లాడుకునేది దూరం నుండి చెప్తాడు తిరుపతి. వాళ్ళు గొడవపడుతుంటే తిరుపతి ప్రేమగా మాట్లాడుకున్నట్లు చెప్తాడు. మరొకవైపు అందరు పోటీకి రెడీగా ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : కార్తీక్ కాలర్ పట్టుకొని నిలదీసిన దీప.. చెంపదెబ్బ కొట్టిన అనసూయ!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -266 లో....కాంచన బాధపడుతూ వెళ్ళిపోయిందని సుమిత్ర బాధపడుతుంది. ఇంటి ఆడబిడ్డ నవ్వుతు ఉండాలి కానీ ఇలా శాపాలు పెట్టి వెళ్లిపోయేలా చేసారు. మీరేం అనలేదంటూ సుమిత్ర ఎమోషనల్ అవుతుంది. నాకు బాధగానే ఉందని దశరథ్ అంటాడు. కార్తీక్, కాంచన వాళ్ళు ఇంటికి వస్తారు. దీపకి ఏం తెలియొద్దు అంటూ కార్తీక్ వాళ్ళకి చెప్పి లోపలికి వస్తాడు. లోపలికి వెళ్లేసరకి.. దీప కింద కూర్చొని ఉంటుంది. ఏమైందని కార్తీక్ అడుగగా.. కళ్ళు తిరిగాయని దీప అంటుంది. మీరు ఎక్కడ నుండి వస్తున్నారని దీప అడుగగా అమ్మ వాళ్ళు తెలిసినా వాళ్ళ ఇంటి నుండి వస్తున్నారు. నాకు ఇక్కడే కలిశారు. అందరం కలిసి లోపలికి వచ్చామంటాడు కార్తీక్. ఇందాక శౌర్య ఉన్న వర్ష వాళ్ళ పేరెంట్స్ వచ్చారని దీప అనగానే దీపకి నిజం తెలిసిందా అని కార్తీక్ అనుకుంటాడు. ఇక శౌర్యా అక్కడ ఉండే అవసరం లేదు కదా మనం వెళ్లి శౌర్యని తీసుకొని వద్దామని దీప అంటుంది. వద్దని కార్తీక్ అంటాడు. అయిన దీప వినదు.. మనం వెళ్ళడానికి శౌర్య ఉంది.. నా ఫ్రెండ్ ఇంట్లో కాదు హాస్పిటల్ లో అంటూ శౌర్య ప్రాబ్లమ్ గురించి చెప్పగానే దీప ఎమోషనల్ అవుతూ.. కార్తీక్ షర్ట్ పట్టుకొని ఇంత జరిగితే నాకు చెప్పకుండా ఉన్నారంటూ ఏడుస్తూ ఉంటుంది. దాంతో అనసూయ దీప చెంపపగులగోడుతుంది. ఎవరిని పట్టుకొని అలా అడుగుతున్నావ్.. ఆ విషయం తెలిసినప్పటి నుండి కార్తీక్ బాబు నరకం అనుభవసున్నాడు. ఇన్ని రోజులు శౌర్యకి చేసినవి అన్ని నీకు చెప్పే చేశాడా అంటూ దీపపై అనసూయ కోప్పడుతుంది. నన్ను క్షమించండి బాబు అంటూ కార్తీక్ కి దీప చెప్తుంది. శౌర్య మన కూతురు.. తన కోసం మా అమ్మ తన పుట్టింటికి కూడా వెళ్ళింది.. నేను ఎలాగైనా నా కూతురిని కాపాడుకుంటానని కార్తీక్ అంటాడు. దీప తన దగ్గరున్న డబ్బు ఇస్తుంది. ఇది కాదు యాభై లక్షలు అవుతుందని చెప్పగానే దీప షాక్ అవుతుంది. నేను ముందు నా కూతురు ని చూడాలంటూ దీప హాస్పిటల్ కి వెళ్తుంది. తన వెనకాలే కార్తీక్ వెళ్తాడు. మరోవైపు ఊళ్ళో ఉన్న ఇల్లు అమ్మేస్తానంటు కాంచనకి చెప్పి అనసూయ వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : భర్తకి మరణగండం ఉందని తెలుసుకున్న భార్య.. జాగ్రత్తగా ఉండమన్న స్వామి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu ). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -313 లో..... శ్రీలత, శ్రీవల్లిలు ధన, సందీప్ లని బయటకు తీసుకొని రావడానికి స్టేషన్ కి లాయర్ ని తీసుకొని వెళ్తారు. అక్కడ సీఐ సీతాకాంత్ ఫ్రెండ్ తనని చూసి నువ్వు సీతా ఫ్రెండ్ కదా.. వాళ్ళని వదిలేయ్ అని శ్రీలత అనగానే.. పరిచయాలు ఇక్కడ పని చెయ్యవు అని సీఐ అంటాడు. బెయిల్ తీసుకొని వచ్చామని శ్రీలత అనగానే.. బెయిల్ రాదు జనాలని ఫ్రాడ్ చేసిన కేసు ఇది అని అతను చెప్తాడు. అదంతా చూస్తూ భద్రం నవ్వుకుంటాడు. మా వాళ్ళకేం తెలియదు కావాలనే వాళ్ళని ఆ భద్రం కేసులో ఇరికించాడని శ్రీలత అంటుంది. వాళ్ళు కూడా తప్పు చేశారంటూ అన్నిటిలో భద్రంతో వాళ్ళ సంతకాలు ఉన్నాయంటూ సీఐ చూపిస్తాడు. ఇప్పుడు మేము రిచ్ దేనికైనా ఒక రేట్ ఉంటుంది. మీకు ఎంత కావాలని శ్రీవల్లి అనగానే.. నాకే లంచం ఇస్తావా ఆవిడని అరెస్ట్ చెయ్యండి అని సీఐ అనగానే.. వద్దు అని శ్రీవల్లి, శ్రీలత రిక్వెస్ట్ చేస్తారు. ఇంకోసారి అలా మాట్లాడితే బాగుండదంటూ సీఐ వార్నింగ్ ఇస్తాడు. శ్రీలత వెళ్తు సందీప్, ధనలని పలకరిస్తుంది. మిమ్మల్ని ఎలాగైనా బయటకు తీసుకొని వస్తామని శ్రీలత వాళ్లతో చెప్తుంది. రామలక్ష్మి రాత్రి వచ్చిన కల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నాకేం కాదు నువ్వు భయపడకు అంటూ సీతాకాంత్ చెప్తాడు. శ్రీలత, శ్రీవల్లి ఇంటికి వస్తారు. వాళ్ళు ఎక్కడ అని సిరి అడుగుతుంది. బెయిల్ రాదట అని శ్రీలత బాధపడుతుంది. సీతా అన్నయ్య వాళ్ళని బయటకు తీసుకొని వస్తాడని సిరి అనగానే.. ఇప్పుడు వాడు మన మాట వినేలా లేడు భార్య మాట వింటాడని శ్రీలత అంటుంది. నేను చెప్తే కచ్చితంగా అన్నయ్య వింటాడని సిరి సీతాకాంత్ దగ్గరికి వెళ్తుంది. ధన సందీప్ లు బయటకు రావాలంటే ఏం చెయ్యాలో నాకు తెలుసంటూ నవ్వుతుంది శ్రీలత. రామలక్ష్మి టెన్షన్ గా స్వామి దగ్గరికి వస్తుంది. తనకి మరణగండం ఉందని స్వామి చెప్పగానే రామలక్ష్మి భయపడుతుంది. దీనికి సొల్యూషన్ చెప్పండి అని రామలక్ష్మి అనగానే.. నేను త్వరలోనే చెప్తాను. మీరు జాగ్రత్తగా ఉండండి అని స్వామి చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : ఇందిరాదేవి రిక్వెస్ట్.. రంగంలోకి దిగిన కవి!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -630 లో.... కావ్యని చంపాలని రాహుల్ ప్లాన్ చేస్తాడు. ఆది ఫెయిల్ అయి రివర్స్ గా రుద్రాణికి షాక్ వస్తుంది. దాంతో స్వప్న కాపాడుతుంది. అప్పుడే రాహుల్ వస్తాడు. స్వప్న అక్కడ నుండి వెళ్ళిపోయాక అది కావ్య కోసం రాహుల్ వేసిన ప్లాన్ అని రుద్రాణికి తెలిసి రాహుల్ ని తిడుతుంది. మరోవైపు అప్పు ట్రైనింగ్ కి వెళ్తుంటే కళ్యాణ్ బ్యాగ్ సర్దుతాడు. అప్పుడే అపర్ణ కాల్ చేస్తుంది. కళ్యాణ్ పక్కకి వచ్చి మాట్లాడతాడు. మీ వదిన నీతో గెస్ట్ హౌస్ తాకట్టు గురించి ఏమైనా చెప్పిందా అని అడుగుతుంది. నాతో ఏం చెప్పలేదు పెద్దమ్మ.. అయిన ఏమైంది అంటూ ఆశ్చర్యంగా కళ్యాణ్ అడుగుతాడు.  ఏం లేదు కానీ నువ్వు ఈ విషయం కావ్యతో అనకు అని చెప్పి అపర్ణ ఫోన్ కట్ చేస్తుంది. కళ్యాణ్ మాత్రం షాక్ లోనే ఉంటాడు. అప్పు వస్తుంది. ఏమైందని అడుగగా.. ఏం లేదు ట్రైన్ కి టైమ్ అవుతుంది పదా అంటూ అప్పుని తీసుకొని కళ్యాణ్ వెళ్తాడు. అందరు హాల్లో కూర్చొని ఉంటారు. కోర్ట్ నుండి నోటీస్ వస్తుంది. అది చూసి కావ్య షాక్ అవుతుంది. కోర్ట్ నుండీ నోటిసులని చెప్పగానే ఎవరు పంపారని సుభాష్ అడుగుతాడు. మేమే పంపించామని ధాన్యలక్ష్మి, ప్రకాష్ లు అంటారు. ఆస్తులలో మా వాటా కావాలని ఇలా చేసామని ధాన్యలక్ష్మి అనగానే అందరు షాక్ అవుతారు. ఏంటి రా ఇది అని ప్రకాష్ ని సుభాష్ అడుగుతాడు. నీ భార్యకి బుద్ది లేదు నీకేమైందని అపర్ణ కోప్పడుతుందిమ నా భర్త అలా ఉంటే మీకు ఇలా చెయ్యడానికి సిగ్గుగా లేదా అంటూ వాళ్లపై ఇందిరాదేవి విరుచుకుపడుతుంది.  నేను ఒక పరిస్థితికి కట్టుబడి ఉన్నాను అంతే తప్ప ఈ ఆస్తులన్నీ నా పుట్టింటికి తీసుకొని వెళ్ళను కదా అని కావ్య నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. అయినా వాళ్ళు వినరు. సుభాష్, అపర్ణల దగ్గరికి కావ్య వచ్చి.. మీరు ప్రకాష్ మావయ్య కి చెప్పండి అని కావ్య సుభాష్ ని రిక్వెస్ట్ చేస్తుంది. చేసిందంతా చేసి ఇప్పడు ఇలా అంటున్నావా అని కావ్యతో అపర్ణ అంటుంది. తరువాయి భాగంలో లాయర్ ఇంటికి వస్తాడు. తాత ఆస్తులకి మనవళ్ళు వారసులు కదా.. వీళ్ళు చెప్తే నోటీసులు ఎలా పంపారని లాయర్ ని కావ్య అడుగుతుంది. మా కొడుకు చేతనే నోటీసులు పంపిస్తామని ధాన్యలక్ష్మి అనగానే.. ఆపండి అంటూ కళ్యాణ్ ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ముద్దులే ముద్దులు...ప్రేరణను ఫ్యామిలీ గెలిచేసింది

  ఇష్మార్ట్ జోడి 3 ఈ వారం ఎపిసోడ్ లో ప్రేరణ అండ్ శ్రీపాద్ ఎంట్రీ ఇచ్చారు. అనిల్ జీల - అవని ఫామిలీని వేరే గ్రూప్ లోకి పంపించేసి..బిగ్ బాస్ లో ప్రేరణకు ఓంకార్ మాట ఇవ్వడంతో దాన్ని ఇప్పుడు ఫుల్ ఫిల్ చేసుకోవడానికి వాళ్లకు పిలిచాడు హోస్ట్ ఓంకార్. ఇక ఇద్దరూ పెళ్లి బట్టల్లో వచ్చారు అలా ఇద్దరి మధ్య ముద్దుల పోటీ పెట్టాడు. ఆ పోటీలో శ్రీపాద్ గెలిచాడు. ఇక తర్వాత వాళ్ళ రెండు కుటుంబాల వాళ్ళను స్టేజి మీదకు పిలిపించి వాళ్ళ పెళ్లి వీడియోని కూడా చూపించాడు. ఆ తరువాత ఆ ఐదు జంటలకు గేమ్ పెట్టాడు. ఇక పేరెంట్స్ కూడా జోష్ తో ఉండాలని ఓంకార్ చెప్పాడు. దాంతో పీలింగ్స్ సాంగ్ కి అలీరెజా వాళ్ళ నాన్న, రాకేష్ వాళ్ళ అమ్మ కలిసి డాన్స్ ఇరగదీసారు. ఇక ఫైనల్ గా ఫామిలీస్ అందరికీ స్కూల్ లో ఆడించే అప్ అండ్ డౌన్ గేమ్ ఆడించాడు. ఇందులో ప్రేరణ ఫ్యామిలీ విన్ అయ్యింది. దాంతో ఒక ఉంగరాన్ని ప్రేరణకు ఇచ్చాడు. దాన్ని శ్రీపాద్ వెలికి తొడిగింది ప్రేరణ. అలాగే తమ ఫ్యామిలీని గెలిపించినందు శ్రీపాద్ వాళ్ళ చెల్లెకి, ప్రేరణ వాళ్ళ చెల్లికి ముద్దులిచ్చారు. ఇలా ఈ వారం ఫ్యామిలీ థీమ్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీతో వచ్చి మరీ గెలిచేసింది ప్రేరణ.

శీఘ్రమేవ కల్యాణ ప్రాప్తిరస్తు...శ్రీముఖికి నెటిజన్స్ ఇస్తున్న విషెస్

  టాలీవుడ్ స్టార్ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టీవీ షోస్, ఈవెంట్స్  చేస్తూ బుల్లితెర మీద ఎప్పుడూ బిజీగా ఉంటూ ఉంటుంది. అలాంటి శ్రీముఖి రీసెంట్ గా తిరుమల వెళ్ళింది. అలాగే ఇప్పుడు అరుణాచల శివుడిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేసింది.  ఐతే "సంక్రాంతికి వస్తున్నాం" ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో యాంకర్ శ్రీముఖి రామ లక్ష్మణ్ ను ఫిక్షనల్ క్యారెక్టర్ అనడం పై చాలామంది ఫైర్ అయ్యారు. అయితే వెంటనే క్షమాఫణలు చెప్పడంతో వివాదం అక్కడితో ముగిసిపోయింది. తర్వాత శ్రీముఖి మాములుగా తన షోస్ చేసుకుంటూ వెళ్తోంది. ఇక ఇప్పుడు ఆమె డివోషనల్ మోడ్ లోకి వెళ్ళింది. వరసగా అన్ని దేవాలయాలను సందర్శిస్తూ ప్రశాంతతను కోరుకుంటోంది శ్రీముఖి. ఇక ఈ పిక్స్ ని, వీడియోస్ ని కూడా ఆమె తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేస్తూ వస్తోంది. దాంతో నెటిజన్స్ కూడా రియాక్ట్ అవుతున్నారు. హర హర మహాదేవ, శీఘ్రమేవ కల్యాణ ప్రాప్తిరస్తు, ఈశ్వరానుగ్రహం ప్రాప్తిరస్తు...ఓం నమో అరుణాచల శివ, వైదీశ్వరన్ కోయిల్ కి రా అక్క అక్కడ నాడీ జ్యోతిష్యం చెప్తారు" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చెప్పాలంటే ఈ మధ్య కాలంలో శ్రీముఖి మూవీ ఈవెంట్స్ చేయడం మానేసింది. సుమ మాత్రమే చేస్తోంది. శ్రీముఖి  టీవీ షోలతో చాలా బిజీ ఐపోయింది.  

Karthika Deepam2: త్వరలో శౌర్య  చచ్చిపోతుందన్న జ్యోత్స్న.. ఏడ్చేసిన దీప! 

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika deepam 2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -265 లో.....శౌర్య ప్రాణాలు కాపాడానికి సాయం కోసం శివన్నారాయణ ఇంటికి వెళ్తుంది కాంచన. అతను సాయం చెయ్యకపోగా అవమానిస్తాడు. నా మనవరాలిని కాపాడమని కాంచన రిక్వెస్ట్ చేస్తుంటే.. అది నీ కొడుకుకి పుట్టిందా అని శివన్నారాయణ అంటుంటే.. అప్పుడే కార్తీక్ వస్తాడు. ఎందుకు ఇక్కడికి వచ్చావ్ అమ్మ ఎలా మాట్లాడుతున్నారో చూసావ్ కదా అని కార్తీక్ అంటాడు. కార్తీక్ మాటలకి ఇంకా రెచ్చిపోయిన శివన్నారాయణ తన కూతురికి బాగోలేకపోతే తనే రావాలి కదా.. మిమ్మల్ని పంపించి బయట ఉందా అని వెటకారంగా మాట్లాడతాడు.. ఈ విషయం దీప కి తెలియదు.. ప్లీజ్ నాన్న సాయం చెయ్యండి అని శివన్నారాయణని కాంచన అడుగుతుంది. దాంతో సరే చేస్తాను. ఆ దీపని అడగమని చెప్పండి ఇస్తానని శివన్నారాయణ అంటాడు. నా భార్య వచ్చి బ్రతిమాలితే ఇస్తావా అని కార్తీక్ కోపంగా మాట్లాడతాడు. శివన్నారాయణ ఇంకా అవమానిస్తే నీకు పుట్టగతులు ఉండవ్ నాన్న అని కాంచన అనేస్తుంది. దాంతో శివన్నారాయణ ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత నేనేదో నోరు జారాను నాన్న అని కాంచన రిక్వెస్ట్ చేస్తుంది. నా ప్రాణం అడ్డు పెట్టి అయిన సరే నా కూతురుని కాపాడుకుంటానని కార్తీక్ అంటాడు. ఇంకొకసారి ఇలా రాకండి అని శివన్నారాయణ అనగానే.. మీరు అవసరం ఉండి వస్తారు అంతే కానీ ఈ గుమ్మం తొక్కమని కాంచన వాళ్ళని తీసుకొని వెళ్తాడు కార్తీక్. మరొక్కసారి మన కంటే ఆ దీప ఎక్కవ అని నిరూపించారని శివన్నారాయణ అంటాడు. ఈ విషయం దీపకి తెలియదా అని చెప్పాలని దీప దగ్గరికి జ్యోత్స్న వస్తుంది. నీ కూతురు గురించి నిజం చెప్తానంటూ శౌర్య గురించి జ్యోత్స్న చెప్తుంది. ఇక ఆపరేషన్ చెయ్యకపోతే బ్రతకదు. ఇప్పుడే డబ్బుల కోసం మా అత్త మీ అత్త మా ఇంటికి వచ్చారు.. బావ కూడా వచ్చాడు. ఇప్పుడు శౌర్య హాస్పిటల్ లో ఉందని జ్యోత్స్న చెప్పగానే.. దీప షాక్ అవుతుంది. జ్యోత్స్న వెళ్లిపోయాక దీప ఏడుస్తూ కార్తీక్ మాటలు గుర్తుచేసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.