బిగ్ బాస్ కి నాగార్జున అన్ ఫిట్..ఆయనకు ఇంగ్లీష్ రాదు..

బిగ్ బాస్ హోస్ట్ అనేది మేజర్ రోల్...హోస్ట్ కి ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. హోస్ట్ రోస్ట్ చేయొచ్చు కానీ ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా రోస్ట్ చేయకూడదు అంటూ బిగ్ బాస్ హోస్ట్ సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున మీద బిగ్ బాస్ కంటెస్టెంట్ సోనియా ఆకుల ఫైర్ అయ్యింది. "నాకు తెలిసి రానా గారు హోస్ట్ ఐతే బాగుంటుంది అనుకుంటున్నా. అతనొక ట్రెండీ పర్సన్. ఫామిలీ రిలేషన్స్, ఫ్రెండ్ షిప్స్ గురించి అప్డేట్ గా ఉండే వ్యక్తి. మళ్ళీ నాగార్జున గారే హోస్ట్ గా వస్తే నేను బిగ్ బాస్ కి వెళ్ళను..బిగ్ బాస్ హౌస్ లో అంత సీన్ లేకపోయినా గౌతమ్ మీద నాగార్జున గారు మండిపడ్డారు. కానీ రానా కొంచెం ఆలోచించి కామెంట్ చేసే పర్సన్ అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన చేసిన నంబర్ వన్ యారి వంటి షోస్ చూస్తే ఆయన పర్సెప్షన్స్ చాలా బాగుంటాయి, క్లారిటీగా ఉంటాయి. 20 సినిమాలు చేసినా రాని గుర్తింపు ఒక్క బిగ్ బాస్ తో వచ్చింది. ప్రజలతో కనెక్ట్ అయ్యే అవకాశం వచ్చింది. కానీ నాగ్ సర్ వస్తే బిగ్ బాస్ హౌస్ కి మళ్ళీ అవకాశం వచ్చినా వెళ్ళను. ఆయన నేచర్ సాఫ్ట్. కానీ ఏ విషయాన్నీ సరిగా అనలైజ్ చేయరు. చాల పదాలు మింగేస్తారు...మాటలు మార్చేస్తారు. నేను అనని వాటిని తప్పుగా హైలైట్ చేసి చూపించారు. ఆయన వల్లే నేను మధ్యలో ఎలిమినేట్ అయ్యి బయటకు రావాల్సి వచ్చింది. నాగ్ సర్ నా భర్త పేరు అడిగారు. నేను యాష్ వీరగోని అని చెప్పా. కానీ ఆయన యష్ వీర్ అని యశ్వి అంటారు. నాకేమో యష్మి గురించి మాట్లాడుతున్నారేమిటా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో నా భర్త పేరు చూస్తే యష్ వీర్ అనే కనిపిస్తుంది. ఇక నా విషయంలో అడల్ట్ రేటెడ్ కామెడీ అన్న పాయింట్ సోషల్ మీడియా బాగా హైలైట్ చేసేసింది. ఐకే కామెడీ షోస్ లో హుకింగ్ అనేది కామన్. ఒక అమ్మాయి అబ్బాయి కలిసి నడుస్తూ వెళ్ళేటప్పుడు చేసే వల్గర్  కామెడీని హుకింగ్ అంటారు. అది చాల సెన్సిటివ్ ఇష్యూ. ఆ పదాన్ని విష్ణు ప్రియా విషయంలో వాడాను. దాన్ని నాగ్ సర్ పెద్ద ఇష్యూ చేసేసారు. నేను అనని మాటలను అన్నట్టుగా హైలైట్ చేశారు..హోస్ట్ గా రానా బెటర్ అనేది నేను అనుకుంటున్నా" అంటూ చెప్పింది సోనియా ఆకుల.  

Illu illalu pillalu : తెలివితో చందుని అరెస్ట్ చేపించిన భద్రవతి‌.. ఆ పెళ్ళి క్యాన్సిల్ !

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -112 లో.... రామరాజు పై చెయ్ వేసినందుకు విశ్వని కొడుతాడు ధీరజ్. తనతో పాటు చందు కూడా విశ్వని కొడుతాడు. ఇద్దరిని తిరుపతి ఆపుతాడు. ఇక మీదట మాజోలికి వస్తే ప్రాణం తీసేస్తా అంటూ ధీరజ్ వార్నింగ్ ఇస్తాడు... ఒళ్ళంతా దెబ్బలతో విశ్వ ఇంటికి వస్తాడు. ఏమైందని భద్రవతి అడుగుతుంది. జరిగింది మొత్తం విశ్వ చెప్తాడు. నా కొడుకు పై చెయ్ వెయ్యడానికి ఎంత దైర్యమని రామరాజు ఇంటి మీదకి సేనాపతి వెళ్తుంటే భద్రవతి ఆపుతుంది. మనం చెయ్యాల్సింది గొడవ కాదు.. ఇప్పుడు ఆలోచించాల్సింది ఆ చందు గాడి గురించి త్వరలో పెళ్లి అని ఆ రామరాజు మురిసిపోతున్నాడు వాడి సంగతి చెప్పాలి.. నేను చెప్పినట్టు చెయ్ అంటు విశ్వకి భద్రవతి చెప్తుంది. మరొకవైపు రామరాజు, వేదవతి ఇద్దరు భాగ్యం దగ్గరికి వస్తారు. చందు, శ్రీవల్లి పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చామని రామరాజు అంటాడు. నేను ఆలోచిస్తానని చెప్పాను కదా అని భాగ్యం అంటుంది. ఈ పెళ్ళి ఎలాగైనా జరగాలంటూ రామరాజు రిక్వెస్ట్ చేస్తాడు. దాంతో భాగ్యం సరే అంటుంది. ఆ తర్వాత చందు తిరుపతి వస్తుంటే పోలీసులు ఆపి చందుని అరెస్ట్ చేస్తారు. ఎందుకు అని చందు అడుగగా.. విశ్వ అనే అతన్ని కొట్టారట అందుకే అని చందుని తీసుకొని వెళ్తారు పోలీసులు. తిరుపతి కంగారుపడుతూ ధీరజ్, సాగర్ లకి చందు అరెస్ట్ గురించి చెప్తాడు. మరొకవైపు పెళ్లికి భాగ్యం ఒప్పుకుందని రామరాజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ధీరజ్ చాల మంచివాడు మీరు తప్పుగా అపార్ధం చేసుకుంటున్నారని వేదవతి అంటుంది. అప్పుడే తిరుపతి వచ్చి చందు అరెస్ట్ గురించి చెప్తాడు. దాంతో అందరు షాక్ అవుతారు. మరుసటిరోజు స్టేషన్ దగ్గరికి భాగ్యం వాళ్ళు వెళ్తారు. మీ కొడుకుకి నా కూతురినిచ్చి గొంతు కొయ్యలేను ఈ పెళ్లి జరగదని  రామరాజుతో భాగ్యం చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi: రాజ్ ని యామినితో చూసేసిన కావ్య.. అంతా మాయ చేస్తున్నారుగా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-675 లో.. అప్పూ దారిలో దిగిపోతూ.. అక్కా నువ్వు అనుకున్నట్లుగా ఆసుపత్రిలో ఆరోజు బావ నిన్ను జాయిన్ చేశాడంటున్నావ్ కాబట్టి సమాచారం తెలుసుకో జాగ్రత్తగా ఇంటికి వెళ్లు. సారీ అక్కా అని కావ్యకు మరీ మరీ చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు రాజ్.. ఆ రోజు నేను కాపాడిన అమ్మాయిని చూస్తే నాకు ఎక్కడో కలిసిన ఫీలింగ్ ఎందుకొచ్చింది. తనని కలిస్తే నా గతం గురించి తెలుసుకోవచ్చేమో.. తను ఆసుపత్రిలో ఉండి ఉంటుందా.. తనని ఎలా కలవాలి.. యామినీకి తెలియకుండానే తన వివరాలు తెలుసుకోవాలని రాజ్ మనసులో ఫిక్స్ అవుతాడు. మరోవైపు యామినీ కూడా కావ్య గురించి తెలుసుకోవాలని అనుకుంటుంది. ఆమెకు డౌట్ ఉంది. రాజ్.. ఆ రోజు ఆసుపత్రిలో జాయిన్ చేసిన అమ్మాయి గురించి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నాడు.. ఎందుకు అంత స్పెషల్‌గా ఫీల్ అవుతున్నాడు. కొంపదీసి ఆమె కానీ రాజ్ భార్య అయ్యి ఉంటుందా.. ఎలా అయినా ఈ విషయం రాజ్‌కి తెలియకుండా తెలుసుకోవాలని యామినీ కూడా ఫిక్స్ అవుతుంది. మరోవైపు డాక్టర్ అపాయింట్‌మెంట్‌ తీసుకుని రాజ్, యామినీ ఇద్దరు ఆసుపత్రి హాల్లో కూర్చుని ఎదురు చూస్తుంటారు. మనసులో మాత్రం ఒకరికి తెలియకుండా ఒకరు ఆ రోజు ఆసుపత్రిలో జాయిన్ చేసిన అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు. రాజ్ వాష్ రూమ్ అని అబద్దం చెప్పి అలా వెళ్లగానే.. యామినీ రిసెప్షన్ దగ్గరకు వెళ్తుంది. రెండు రోజుల క్రితం మా బావ జాయిన్ చేసిన ఆ అమ్మాయి వివరాలు కావాలని అడుగగా.. సరే అని రిసెప్షన్ లో ఉన్న అతను వెతుకుతుంటాడు. అప్పుడే కావ్య ఆ ఆసుపత్రి దగ్గర కారు దిగుతుంది. మరోవైపు రాజ్ చాలా దూరం నుంచి యామినీని గమనిస్తుంటాడు. అయ్యో నేను వెళ్లాల్సిన చోట యామినీ ఉందే.. ఇప్పుడు ఎలా.. అవును ఆ రోజు ఆ అమ్మాయి(కావ్య)కి ట్రీట్‌మెంట్ ఇచ్చిన డాక్టర్ శ్యామల గారిని కలుద్దామనుకుంటూ రాజ్ ఆమెను వెతుక్కుంటూ వెళ్తాడు. యామిని వివరాల కోసం ఆ రిసెప్షన్ లో ఉన్న అతడిని కంగారు పెట్టగా.. అతను సర్వర్ స్లోగా ఉందని చెప్తాడు. సరే అయితే వివరాలు తీసి ఉంచమని చెప్పి రాజ్ దగ్గరికి యామిని వెళ్తుంది. ఇక కాసేపటికి కావ్య వచ్చి  రాజ్ వివరాలు అడుగుతుంది. ఆ రిసెప్షన్ లో ఉన్నతను రాజ్ అటువైపు వెళ్ళాడని చెప్తాడు. దాంతో కావ్య అతడిని వెతుక్కుంటూ వెళ్తుంది. ఇక రాజ్ ని యామిని చూస్తుంది. తను సెట్ చేసిన డాక్టర్ దగ్గరికి రాజ్ ని తీసుకొని వెళ్తుంది యామిని. అదే సమయంలో రాజ్ ని కావ్య చూస్తుంది. ఇక యామిని, డాక్టర్ లు మాట్లాడే మాటల్ని కావ్య వింటూ ఉంటుంది. చూడండి రామ్ మీరు ఆరునెలలుగా కోమాలో ఉండటంతో మీ బాడీ రియాక్ట్ అయ్యే విధానం అంతా స్లో అయిపోయింది.. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ అంటాడు. డాక్టర్ మాటలు విన్న కావ్య.. అదేంటీ ఆరు నెలలుగా కోమాలో ఉన్నారా.. మొన్నేగా యాక్సిడెంట్ అయ్యింది.. అంటే వీళ్లు ఆయన్ని ఏదో మాయ చెయ్యాలని చూస్తున్నారా అని కావ్య మనసులో అనుకుంటుంది. నాకు గతం తెలుసుకోవాలని ఉంది డాక్టర్.. నేను ఎవరో నాకో క్లారిటీ కావాలి. ఎంత ఆలోచించినా నాకేదీ గుర్తురావడం లేదు.. ఎక్కువ ఆలోచిస్తే నాకు తలనొప్పి వస్తుంది. నాకు త్వరగా గతం గుర్తురావాలి.. ప్లీజ్ ఏదొకటి చేయండి డాక్టర్ అని రాజ్ ఆవేదనగా అంటాడు.  ఇదే డాక్టర్ ఇదే.. ఇలాగే క్షణం కూడా రిలాక్స్‌గా ఉండటం లేదు.. మళ్లీ తనకు ఏదైనా అవుతుందేమో అని భయంగా ఉంది డాక్టర్ అని యామిని అంటుంది. నిజమే యామినీ గారు.. అంత తీవ్రంగా ఆలోచించి గతాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తే మళ్లీ కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది.. జాగ్రత్తగా ఉండాలి.. రామ్ గుర్తుపెట్టుకోండి అనే డాక్టర్ కూడా నటిస్తాడు. అంతా విని కావ్య ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Eto Vellipoyindhi Manasu : సీతాకాంత్ నాటకం ఆడుతున్నాడని చెప్పేసిన సవతి తల్లి.. రమ్య ఎవరంటే!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -358 లో....... సీతాకాంత్ కి నేనంటే ఇష్టం లేదు కేవలం రామలక్ష్మి నో మైథిలి నో కన్ఫమ్ చేసుకోవడానికి నాతో ఈ పెళ్లి నాటకం ఆడుతున్నాడని చెప్పగానే శ్రీలత వాళ్ళు షాక్ అవుతారు. మనం ఇప్పటి వరకు ఏం చేసిన కూడా కేవలం డబ్బు కోసం చేసాం... ఇప్పుడు కూడా అలాగే చేద్దాం.. సీతా అనుకుంటున్నాడు కానీ అలా జరగకూడదు.. రమ్యని పెళ్లి చేసుకోవాలని శ్రీవల్లి, సందీప్, రమ్యలతో శ్రీలత అంటుంది. మరొకవైపు ఎందుకు సీతాకాంత్ ఎంగేజ్ మెంట్ కి వస్తానని చెప్పావని సుశీల, ఫణీంద్ర ఇద్దరు అడుగుతారు.. మరేం చేయమంటావ్ ఇక సీతా సర్ ని తనివి తీరా చూడడం కోసం అటు మైథిలిగా ఇటు రామలక్ష్మిగా సీతా సర్ కి దగ్గర కాలేకపోతున్నానని రామలక్ష్మి బాధపడుతుంది. అప్పుడే శ్రీలత వస్తుంది. గుమ్మం దగ్గర రామలక్ష్మి వాళ్ళని చూస్తూ ఉంటుంది. అంతా వినేసిందా అనుకుని రామలక్ష్మి టెన్షన్ పడుతుంది కానీ శ్రీలత ఏం వినదు శ్రీలత లోపలికి వచ్చి.. మైథిలీ నీతో మాట్లాడాలంటూ బయటకి తీసుకొని వెళ్తుంది. సీతా, రమ్యతో ఎంగేజ్ మెంట్ అని నాటకం ఆడుతున్నాడు.. నువ్వు రామలక్ష్మి వో మైథిలి వో తెలుసుకోవడానికి ఇదంతా ప్లాన్ అని శ్రీలత చెప్పగానే.. రామలక్ష్మి షాక్ అవుతుంది. మా సీతా రమ్యని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలి. ఇక నువ్వు రేపు ఎంగేజ్ మెంట్ కి వస్తావో రావో ఇక నీ ఇష్టమని శ్రీలత చెప్పి వెళ్తుంది. ఆ తర్వాత శ్రీలత వెళ్ళిపోయాక రామలక్ష్మి ఇంట్లోకి వెళ్తుంది. శ్రీలత మాట్లాడింది మొత్తం ఫణీంద్ర వాళ్ళకి రామలక్ష్మి చెప్తుంది. అదంతా విని తన మాటల బట్టి తనేలాంటిదో తెలుస్తుందని సుశీల అంటుంది. అసలు ఈ రమ్య ఎవరు అని రామలక్ష్మి అంటుంది. నేనొక నంబర్ ఇస్తాను అతన్ని కలిసి విషయం చెప్పు.. నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తాడని ఫణీంద్ర అంటాడు. దాంతో రామలక్ష్మి అతన్ని వెళ్లి కలిసి రమ్య ఫోటో చూపిస్తుంది. అప్పుడే రమ్య వెళ్తుంటుంది. తన గురించి తెలుసుకోవడానికి ఇద్దరు చాటుగా తనని చూస్తారు. రమ్య ఇల్లు కొనడానికి అడ్వాన్స్ తో వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2: జ్యోత్స్న మాటలకి దిగొచ్చిన శివన్నారాయణ.. కాంచన దగ్గరికి మొత్తం వచ్చేసారుగా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం2(Karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-311లో..  జ్యో అడిగిన ప్రశ్నకు శివనారాయణ ఆవేశం రెట్టింపు అయిపోతుంది. దాంతో పొలమారి అతడికి తీవ్రమైన దగ్గు వస్తుంది. వెంటనే దశరథ్, సుమిత్ర కంగారుపడి.. నాన్నా.. మావయ్యగారు అని అతడ్ని పట్టుకుంటారు. జ్యోత్స్న వెంటనే పరుగున వెళ్లి వాటర్ బాటిల్ తెచ్చి కొంచెం తాగు అంటుంది. వాటర్ బాటిల్‌ని తోసేస్తూ.. వాటర్ తాగకపోతే దగ్గు ఆగుతుంది. కానీ నిన్ను ఆపకపోతే వాడు ఆగేలా లేడు అని తిడుతూనే ఉంటాడు. కాసేపటికి అతడి దగ్గు ఆగుతుంది. లేదు తాతా.. నేను ఏ తప్పు చేయలేదు.. రేపు నిశ్చితార్థంలో అత్త ఫ్యామిలీ లేకపోతే జనం ఏం అనుకుంటారు? శివనారాయణ గారు కూతుర్ని తరిమేశారు.. ఆస్తిలో వాటా కూడా ఇవ్వలేదట అని చెప్పుకుంటారు. అప్పుడు పోయేది ఎవరి పరువు.. వాళ్లదా.. మనదా.. అలా అని నేరుగా అత్తను పిలిస్తే వస్తుందా అంటే.. రాదు. అత్త రావాలని మమ్మీ డాడీ కోరుకుంటున్నారు. ఆల్రెడీ నిన్ను అడిగారు.. కానీ నువ్వు వద్దు అన్నావని జ్యోత్స్న మాట్లాడుతూ ఉంటుంది. మరి అప్పుడైనా అర్థం  కదా వాళ్లు రావడం నాకు ఇష్టం లేదని శివన్నారాయణ అంటాడు. చెల్లెలికి మనం తప్ప ఇంకెవరున్నారు నాన్నా అని దశరథ్ అంటాడు. మనకు ఏమైనా వంద మంది ఉన్నారా. .అంతా కలిస్తే ఒక పది మంది కూడా లేరు.. ఉన్నవాళ్లనైనా కూతురికి ఫంక్షన్‌కి పిలుచుకోవాలని తల్లిగా నేను ఆశపడతాను కదా మావయ్యగారని సుమిత్ర అంటుంది. ఇవన్నీ కాదు తాతా.. నా నిశ్చితార్థానికి అత్త బావ రావాలని కోరుకుంటున్నాను.. నా కోరిక నువ్వు తీరుస్తావా లేదా అంటూ జ్యోత్స్న మాట్లాడుతుంటే తాత కాస్త శాంతించి వింటూ ఉంటాడు. నువ్వు వెళ్లి పిలుస్తావా.. డాడీ వెళ్లి పిలుస్తారా ఇవన్నీ నాకు తెలియదు.. నేను మీ మాట విని.. బావని వదులుకుని మీరు చూసిన సంబంధం చేసుకోవడానికి సిద్ధమయ్యాను.. అలాంటి మీకోసం నేను నా బావనే నేను వదులుకున్నప్పుడు నా కోరిక తీర్చడానికి నువ్వు నీ పంతాన్ని వదలుకోలేవా? కలిసిపొమ్మనడం లేదు. పిలవమంటున్నాను.. అత్తా బావా అధికారికంగా వస్తే దీప క్యాటరింగ్‌కి వంట మనిషిలా వస్తుంది.. పైగా బావ రన్ చేస్తున్నా రెస్టారెంట్‌ నుంచి ఫుడ్ తెప్పించుకుంటే మనం అంతా కలిసిపోయామని.. మన మధ్య ఏ గొడవలు లేవు అని నాకు కాబోయే అత్తమామలు అనుకుంటారు కదా.. అంటూ జ్యో చెబుతూ ఉంటుంది. శివనారాయణ శాంతంగా వింటుంటే.. జ్యోత్స్న మాట్లాడుతూ ఉంటుంది. తప్పదు తాత నువ్వు నా కోరిక తీర్చాల్సిందే.. నా నిశ్చితార్థానికి దీప క్యాటరింగ్ చెయ్యాలి. అత్తా బావా అక్షింతలు వేయడానికి రావాలి . ఏమంటావ్ తాతా అని జ్యోత్స్న అంటుంది. వెంటనే శివనారాయణ మాట్లాడుకుండానే అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మావయ్యగారు ఏం మాట్లాడకుండా వెళ్లిపోయారేంటని సుమిత్ర అనగా.. కొన్ని మనమే అర్థం చేసుకోవాలి మమ్మీ.. తాత మౌనమే నేను కోరుకున్న సమాధానం.. క్యాటరింగ్ వద్దని అనలేదు కదా? వాళ్లకు కాల్ చేసి ఓకే అని చెబుతానని జ్యోత్స్న అంటుంది. మరి వదినను కార్తీక్‌ని పిలిచే విషయమంటూ సుమిత్ర అనుమానంగా అంటుంటే.. ఇప్పుడేగా మమ్మీ తాతను వరం అడిగాను.. కాస్త ఆలోచించుకోనీ మమ్మీ.. రిజల్ట్ పాజిటివ్‌గానే వస్తుందని జ్యోత్స్న అంటుంది. మరోవైపు కార్తీక్, దీపలు క్యాటరింగ్ విషయంలో జరిగిన మోసం గురించి పారిజాతం చేసిన పని గురించి కాంచనకు చెప్పడంతో అంటే ఆ జ్యోత్స్న ఇంకా మారలేదని మాట.. ఏంట్రీ అది.. పళ్లు రాలగొట్టాల్సిందిరా దానికి అని రెచ్చిపోతూ ఉంటుంది. ఇంతలో జ్యోత్స్న ఫోన్ చేయడంతో కార్తీక్ లిఫ్ట్ చేసి స్పీకర్‌లో పెడతాడు. మీరే ఈ క్యాటరింగ్ చేస్తున్నారు. ముందు అనుకున్నట్లే మీరే సప్లై చెయ్యాలి.. ఇందులో ఏమైనా మార్పు ఉందా అని జ్యోత్స్న అంటుంది. మేము క్యాటరింగ్ అని కార్తీక్ మాట పూర్తి కాకుండానే దీప ఫోన్ లాక్కుంటుంది. మేము ఈ క్యాటరింగ్ చేస్తున్నాం.. ఆర్డర్ తీసుకున్నాక మీ వల్ల ఆగాలి కానీ మా వల్ల ఎప్పుడూ ఆగదు, ఉంటానని దీప కట్ చేసేస్తుంది. అలా ఎందుకు చెప్పావ్ దీపా అని కాంచన అనగా‌.. అమ్మా దీని వల్ల మనకు ఏ నష్టం లేదు.. పైగా మన రెస్టారెంట్‌కి ఫుల్ పబ్లిసిటీ అవుతుంది.. ఎందుకంటే జ్యోత్స్న రెస్టారెంట్ సీఈవో గారి నిశ్చితార్థానికి సత్యరాజ్ రెస్టారెంట్‌ నుంచి క్యాటరింగ్ తెప్పించుకున్నారంటే మనకే లాభం కదా.. పైగా అంతమంది ముందు మనల్ని అవమానిస్తే తాతకే అవమానం.. అలా జరగదు భయపడకు  అని కార్తీక్ అనేసి వెళ్లిపోతాడు. కుటుంబాలు కలవడానికి ఇదే మార్గం అమ్మా.. వద్దనకండి అని కాంచనతో దీప చెప్తుంది. ఇక మరుసటి రోజు కార్తీక్ రెడీ అయ్యి రెస్టారెంట్‌కి వెళ్లడానికి సిద్ధమవుతుంటే.. కాంచన మాత్రం పదేపదే గుమ్మం వైపు చూస్తూ ఉంటుంది. దశరథ్, సుమిత్రలు వస్తారేమోనన్న ఆశతో.. మొత్తానికీ వాళ్లొస్తారు. రేయ్ కార్తీక్.. మా అన్నయ్య నాకోసం వచ్చాడురా.. మా వదిన కూడా వచ్చిందని కాంచన సంబరపడుతుంటే.. దశరథ్, సుమిత్రల పక్కకు వచ్చి నిలబడి కేవలం అన్నయ్యే కాదు.. స్వయంగా మీ నాన్న కూడా వచ్చారంటూ పారిజాతం నవ్వుతూ పక్కకు తప్పుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది...హీరోయిన్ లైలాకి మహేశ్వరీ కౌంటర్

  సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ సీజన్ 4 నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కి వింటేజ్ బ్యూటీగా మహేశ్వరీ వచ్చింది. నీకోసం, పెళ్లి వంటి మూవీస్ తో హిట్ కొట్టి ఆడియన్స్ ని మెస్మోరైజ్ చేసిన హీరోయిన్..ఆమె ఇన్నాళ్లకు బుల్లితెర మీదకు ఎంట్రీ ఇచ్చింది. అలాగే మరో క్యూట్ అండ్ బబ్లీ హీరోయిన్ లైలా...1997 లో "ఎగిరే పావురమా" మూవీతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఘన విజయం సాధించి ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ షో హోస్ట్ రవి ఐతే మహేశ్వరితో ఒక డైలాగ్ వేసాడు. "పెళ్లి మీద ఎలాంటి అభిప్రాయం లేని నాకు మీరు నటించిన పెళ్లి మూవీ వలన పెళ్లి మీద ఒక మంచి అభిప్రాయం వచ్చింది" అని చెప్పాడు. అలాగే ఇక మహేశ్వరీ ఐతే ఇంకో డైలాగ్ చెప్పింది. "వర్షం పడడానికి చేస్తారు యాగం..ఈరోజు పక్కా గెలిచేది మా పడమటి సంధ్యా రాగం" అంటూ మంచి ఫోర్స్ తో డైలాగ్ చెప్పింది. తర్వాత ఈ షో స్టేజి మీదకు లైలా వచ్చి "హలో రవి" గారు అనేసరికి ఎంత క్యూట్ గా మాట్లాడుతున్నారో అంటూ పొంగిపోయాడు. అమ్మాయిగారు టీమ్ ని గెలిపించడానికి లైలా వచ్చింది. ఇక రవికిరణ్ ఎక్కడ ఉన్నాడో చూపించాలంటూ హోస్ట్ రవి ఒక టాస్క్ ఇచ్చాడు. ఈ స్టేజి మీద ఇక మహేశ్వరీ వెర్సెస్ లైలా అని రవి చెప్పాడు. "నా దగ్గర రేస్ గుర్రాలు ఉన్నాయి" అని చెప్పింది లైలా. "అయ్యో పాపం లైలా నా దగ్గర గెలుపు గుర్రాలున్నాయి" అంటూ మహేశ్వరీ కౌంటర్ డైలాగ్ వేసింది. ఐతే లాస్ట్ లో రెండు  సీరియల్స్ కంటెస్టెంట్స్ కలిసి టాస్కులు ఆడుతుంటే మహేశ్వరీ సీరియస్ గానే వాళ్ళను ఫాలో అవుతూ ఉంది కానీ లైలా మాత్రం మొబైల్ మునిగిపోయి కనిపించింది. "లైలా గారు" అంటూ రవి గట్టిగ అరిచేసరికి లైలా ఒక్కసారిగా ఉలిక్కిపడి రవి వైపు చూసింది. "మా సీరియల్ వాళ్ళు గెలిచాక ఎలా సెలెబ్రేట్ చేసుకోవాలా అని గూగుల్ లో సెర్చ్ చేస్తున్నా" అని చెప్పింది. వెంటనే మహేశ్వరీ "ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది" అంటూ కౌంటర్ వేసింది.

కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసిన మసూద మూవీ నటుడు తిరువీర్

  సిల్వర్ స్క్రీన్ మీద తిరువీర్ అనే నటుడు ఇప్పుడిప్పుడే తన మార్క్ వేసుకుంటూ వెళ్తున్నాడు. పలాస మూవీలో అలాగే జార్జి రెడ్డి చిత్రంలో తిరువీర్ నటన అద్భుతంగా పండింది. నవరసాలను పండించడంలో ఆయనకు ఆయనే సాటి. ఐతే సిన్ అనే మూవీలో నటన తనకు మంచి గుర్తింపు తెచ్చింది. అలాగే మసూద అనే థ్రిల్లర్ మూవీలో ఐతే ఆయన నటనకు ఫుల్ మార్క్స్ పడ్డాయి. అలాంటి తిరువీర్ సెలెక్టీవ్ గా మంచి మూవీస్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇక ఇప్పుడు "ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో" అనే మూవీలో ఫోటోగ్రాఫర్ రోల్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అలాంటి తిరువీర్ రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో కొన్ని పిక్స్ పెట్టాడు. "రెండు దశాబ్దాల కల, అమ్మ చివరి కోరిక" అని పోస్ట్ చేసి సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నా అన్న ఫీలింగ్ ని ఎక్స్ప్రెస్ చేసాడు. తన కొత్త ఇంటికి గృహప్రవేశం ఫొటోస్ ని పోస్ట్ చేసాడు. నెటిజన్స్ కూడా కంగ్రాట్యులేషన్స్ అంటూ విషెస్ చెప్పారు. ఇక యాంకర్ గాయత్రీ భార్గవ్ కూడా కామెంట్ చేసింది. "ఇల్లు కటి చూడు, పెళ్లి చేసి చూడు. అంత శుభమే జరుగుతుంది. హ్యాపీ హోమ్" అని చెప్పింది. అలాగే జబర్దస్త్ కమెడియన్ అభి కూడా కంగ్రాట్యులేషన్స్ చెప్పాడు. స్టేజి షోస్ , నాటకాల్లో నటిస్తూ సిల్వర్ స్క్రీన్ మీదకు అడుగుపెట్టాడు తిరువీర్ . ఇక "ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో"  అనే మూవీలో తిరువీర్ ఒక ఫోటోగ్రాఫర్ రోల్ లో నటిస్తున్నారు. రాహుల్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఈ మూవీ వస్తోంది. ఐతే ఇది పూర్తి కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతోందన్న విషయం చెప్పాడు తిరువీర్.. ఇప్పుడు ఈ నటుడు బ్యాక్ టు బ్యాక్ కొన్ని సెలెక్టీవ్ అండ్ ఆడియన్స్ కి హార్ట్ టచ్ అయ్యే మూవీ కంటెంట్ తో రాబోతున్నాడు.

సుప్రీతా డ్రెస్ మీద యాదమ్మ రాజు కామెంట్స్...

  చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే ఈ వారం షోలో యాదమ్మ రాజు - సుప్రీతా కామెడీ మాములుగా లేదు. యాదమ్మ రాజు నార్మల్ గా ఫుల్ డ్రెస్ వేసుకొచ్చాడు. కానీ సుప్రీతా మాత్రం చాలా పొట్టి డ్రెస్ వేసుకొచ్చింది. దాంతో యాదమ్మ రాజు ఆమె డ్రెస్సింగ్ స్టైల్ మీద కామెంట్స్ చేసాడు. "ఏంటి డాన్స్ మొత్తం హుషారుగా చేసి అంత డల్ ఇపోయావ్" అని అడిగింది సుమ. "మొన్న ఇక్కడ నా వంటకు సెకండ్ ప్లేస్ ఇచ్చారు. ఇదే ఊపుతో ఇంటికి వెళ్లి వంట చేసి మా ఆవిడకు పెట్టాను..ఇప్పటికి మూడు రోజులయ్యింది మాట్లాడక" అన్నాడు బాధపడుతూ యాదమ్మ రాజు. "ఎవ్వరైనా సరే నీ వంట తిన్నవాళ్ళు నీతో మాట్లాడరు" అని చెప్పింది సుమ. దానికి యాదమ్మ రాజు "అర్జెంటుగా డ్రెస్ మార్పించండి" అన్నాడు. దానికి సుమ "నా డ్రెస్సా" అన్నది. మీది కాదు ఈమెది అంటూ సుప్రీతా వైపు చూపించాడు. "ఆమె డ్రెస్సు ఆమె ఇష్టం ఆమెకు ఎం కావాలో అది వేసుకుంటుంది" అంది సుమ. "అసలు కెమెరా మ్యాన్ ఒకటో రెండో క్లోజులు నాకు పెడుతున్నాడు. ఈ సుప్రీతా ఇలాంటి డ్రెస్సులు వేసుకొస్తే అప్పుడు ఫోకస్ మొత్తం అటే పెడతారు" అంటూ ఫీలయ్యాడు. తర్వాత సుప్రీతా యాదమ్మ రాజు భుజం మీద చెయ్యేసి గారంగా, ముద్దుగా "రాజు ఫీలవ్వకు రాజు" అంది. సరే మన ఆడియన్స్ కోసం ఒక ప్రాణం చెయ్యి రాజు..అంటూ అతనితో ప్రమాణం చేయించింది. " యాదమ్మ రాజు అనే నేను ఇన్నాళ్లు సుప్రీతా టాలెంట్ వల్ల, అందం వల్ల గెలిచామని..ఈరోజు మేం గెలవకపోతే నేను పచ్చి మంచినీళ్ళైనా ముట్టుకోను అని" రాజు చెప్పేసరికి "పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టనని చెప్పావ్" అని సుమ బాగా ఎగ్జాయిట్ అయ్యేసరికి "అంటే మందు తెచ్చాను" అని కౌంటర్ వేసాడు. దాంతో వెళ్ళిపో ఇక్కడి నుంచి అంటూ చెప్పి వల్ల పోడియం దగ్గరకు పంపేసింది.  

Illu illalu pillalu : విశ్వని కొట్టిన ధీరజ్.. చందుని అరెస్ట్ చేసిన పోలీసులు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -111 లో....విశ్వ కోపంగా ప్రేమని కొట్టబోతుంటే అది రామరాజుకి తగులుతుంది. అందరు షాక్ అవుతారు. మా నాన్ననే కొడతావా అని విశ్వ పైకి ధీరజ్ వెళ్తుంటే అందరు ఆపుతారు. రామరాజు గొడవని సర్దుమనిచి లోపలికి వెళ్తాడు. అయినా ధీరజ్ మాత్రం నా తండ్రిపై చెయ్యేస్తావా అంటూ కోపంగా ఉంటాడు. విశ్వ బయటకి వెళ్తుంటే తన వెనకాల ధీరజ్ వెళ్తుంటాడు. అది చూసి తిరుపతి టెన్షన్ పడుతూ ఏం జరుగుతుందో అని వెనకాలే వెళ్తాడు. అన్ని గొడవలకి కారణం నేనే అంటూ ప్రేమ బాధపడుతుంది. వేదవతి వచ్చి ప్రేమతో మాట్లాడుతుంది. ఆ తర్వాత నర్మద వచ్చి ప్రేమతో మాట్లాడుతుంది. నాకు వంటలో హెల్ప్ చేయమంటు డైవర్ట్ చేస్తుంది. ఆ తర్వాత తిరుపతి చందుకి ఫోన్ చేసి విశ్వ దగ్గరికి ధీరజ్ కోపంగా వెళ్తున్నాడని చెప్తాడు. దాంతో ధీరజ్ దగ్గరికి చందు బయల్దేరతాడు. ధీరజ్ విశ్వ దగ్గరికి వెళ్లి గొడవపడతాడు. తిరుపతి ఎంత ఆపినా కూడా దీరజ్ ఆగడు. మరొక వైపు ప్రేమ, నర్మద  కబుర్లు చెప్పుకుంటూ వంట చేస్తుంటారు.  ధీరజ్ గొడవ పడుతున్న దగ్గరికి చందు వస్తాడు. తను కూడా దీరజ్ ని ఆపుతాడు అయినా వినకుండా విశ్వని కొడతాడు. తరువాయి భాగంలో తిరుపతి, చందు ఇద్దరు వస్తుంటే పోలీసులు చందుని అరెస్ట్ చేస్తారు. మీరు విశ్వ అనే అబ్బాయి ని కొట్టారని కంప్లైంట్ ఇచ్చారని పోలీసులు చెప్తారు. దాంతో తిరుపతి వెంటనే రామరాజుకి ఫోన్ చేసి విషయం చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika deepam 2 : కాబోయే పెళ్లి కూతురు  ఆర్డర్.. శివన్నారాయణ వార్నింగ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika deepam 2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -310  లో..... కార్తీక్ రెస్టారెంట్ కి పారిజాతం వెళ్లి జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ కోసం ఫుడ్ ఆర్డర్ ఇస్తుంది. అప్పుడే కార్తీక్, దీప వస్తుంటారు. వాళ్ళు రాకముందే పారిజాతం వెళ్లి కార్ లో కూర్చుంటుంది. మేనేజర్ కార్తీక్ కి ఆర్డర్ గురించి చెప్తాడు. ఎవరు ఇచ్చారని కార్తీక్ అడుగగా పేపర్ పై శివన్నారాయణ అని రాసి ఉంటుంది. అది చూసి కార్తీక్ ఆశ్చర్యపోతాడు. వచ్చిందెవరని కార్తీక్ అడుగగా పేరు అడగలేదని మేనేజర్ చెప్తాడు. కార్తీక్ ఫోన్ లో పారిజాతం ఫోటో చూపిస్తూ ఈవిడేనా అని అడుగుతాడు. ఆవిడే అని మేనేజర్ చెప్తాడు. నాకు చెప్పకుండా ఎందుకు ఆర్డర్ తీసుకున్నావని మేనేజర్ ని కార్తీక్ అడుగుతాడు. ఇప్పుడు ఏం చేద్దామని దీప అంటుంది. ఆర్డర్ క్యాన్సిల్ చేస్తే అమౌంట్ డబుల్ ఇవ్వాలి. వెళ్లి మెనూ కనుక్కుందామని దీపని వెంటేసుకొని శివన్నారాయణ ఇంటికి వెళ్తాడు కార్తీక్. జ్యోత్స్నకి చీరలు సెలక్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు. పారిజాతం చూసి కంగారు పడుతుంది. సుమిత్ర చూసి రారా లోపలికి అంటుంది. ఇప్పుడు నేను సత్యరాజ్ రెస్టారెంట్ తరుపున వచ్చాను.. మీరు మెనూ చెప్తే వెళ్తానని కార్తీక్ అనగానే సుమిత్ర, దశరథ్ ఇద్దరు ఆశ్చర్యంగా చూస్తారు. మెనూ ఏంటని వాళ్ళు అడుగుతారు. జ్యోత్స్న ఎంగేజ్మెంట్ కి ఫుడ్ ఆర్డర్ చేసింది జ్యోత్స్న అని కార్తీక్ చెప్తాడు. జ్యోత్స్న చెప్పింది చేసానని పారిజాతం అంటుంది. అంటే వాళ్ళు ఎంగేజ్ మెంట్ కి ఈరకంగా అయినా వస్తారని ఇలా చేసానని జ్యోత్స్న అనగానే.. బుద్ది లేకుండా మాట్లాడకు వాళ్ళు రావలసింది ఈ ఇంటికి ఆడపడుచుగా కేటరింగ్ గా కాదని జ్యోత్స్నపై సుమిత్ర కోపడుతుంది. కాంచనతో మాట్లాడానని దశరత్ అంటాడు. మాట్లాడినప్పుడు అక్కడే ఉన్నాను కానీ మీరు కుటుంబంతో రండీ అని పిలవలేదు.. అందుకు మా అమ్మా ఎంత బాధపడిందో మీకేం తెలుసని కార్తీక్ అంటుంటే సుమిత్ర, దశరత్ ఇద్దరు బాధపడుతారు. ఆధారాలు తీసుకొని వస్తాన్నానవ్ ఏమైందని దీపని సుమిత్ర అడుగుతుంది. అది వదిలేయండి అని దీప అనగానే అంటే లేవనేగా.. నాకు తెలుసు నా కూతురు తప్పు చెయ్యదని సుమిత్ర అంటుంది. దీప నా మాట విని ఆ విషయం వదిలేసింది అని దశరథ్ అనుకుంటాడు. అప్పుడే శివన్నారాయణ వస్తాడు. ఎందుకు వచ్చారని కార్తీక్ ని అడుగుతాడు. కాబోయే పెళ్లి కూతురు మాకు ఆర్డర్ ఇచ్చిందనగానే శివన్నారాయణ షాక్ అవుతాడు. మెను కోసం వచ్చామని కార్తీక్ చెప్తాడు. మెనూ ఫోన్ లో చెప్తాము.. జ్యోత్స్న నువ్వు లోపలికి రా అని శివన్నారాయణ కోపంగా పిలుస్తాడు. ఆ తర్వాత కార్తీక్, దీప ఇద్దరు బయటకి వస్తుంటారు‌. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏం సాధించామని కార్తీక్ తో దీప అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : మనసులో మాట చెప్పేసిన సీతాకాంత్.. నిజం తెలిసి షాకైన శ్రీలత!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -357 లో.... సీతా నీకు ఈ పెళ్లి ఇష్టమేనా అని శ్రీలత అడుగుతుంది. రామలక్ష్మి, మైథిలి ఒక్కరే అని బయటపెట్టడానికి ఈ పెళ్లి నాటకం ఆడక తప్పదని సీతాకాంత్ మనసులో అనుకొని సరే అంటాడు కానీ రామ్ ఒప్పుకోవాలని సీతాకాంత్ అంటాడు. నాన్న రామ్ నీకు సీతా హ్యాపీగా ఉండడం ఇష్టమే కదా ఈ పెళ్లికి ఒప్పుకోమని శ్రీలత అంటుంది. దానికి రామ్ కొద్దిసేపు అలోచించి సరే అంటాడు. దాంతో శ్రీలత వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. వీడు ఒప్పుకున్నాడు కాబట్టి బెటర్ అయింది లేదంటే మన పరిస్థితి ఏంటని సందీప్ తో శ్రీలత అంటాడు. ఆ తర్వాత రమ్యని సీతాకాంత్ పక్కకి పిలిచి.. నీపై నాకు ఏ ఉద్దేశ్యం లేదు.. ఇది కేవలం మైథిలీ రూపంలో ఉన్న రామలక్ష్మిని బయటకి తేవడం కోసమని సీతాకాంత్ చెప్పగానే.. రమ్య షాక్ అవుతుంది. నా భార్యకి తప్ప ఎవరికి చోటు లేదు ఒకవేళ తను రామలక్ష్మి కాదని తెలిసినా తన జ్ఞాపకాలతో బ్రతికేస్తా తప్ప.. పెళ్లి చేసుకోను ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చెయ్యమని రమ్యని సీతాకాంత్ రిక్వెస్ట్ చేస్తాడు. రమ్య సరే అంటుంది. మరొకవైపు రామలక్ష్మి లండన్ వెళ్లాడనికి ఏర్పాట్లు చేసుకుంటుంది. ఇక మన ప్రయత్నం ఎవరు ఆపలేరని ఫణీంద్ర అంటాడు. అప్పుడే సీతాకాంత్, రామ్ ఇద్దరు ఎంట్రీ ఇస్తారు. ఎందుకు వచ్చారని రామలక్ష్మి కోప్పడుతుంది. ఎల్లుండి నా ఎంగేజ్ మెంట్ రండి అని సీతాకాంత్ అనగానే రామలక్ష్మి షాక్ అవుతుంది. నేను లండన్ వెళ్తున్నాను రానని చెప్తుంది. రామలక్ష్మిని రమ్మని రామ్ రిక్వెస్ట్ చేస్తాడు. మీరు నాతో ఉన్న జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటా.. మీరు రావాలని రామ్ అంటుంటే సిరిని గుర్తు చేసుకొని రామలక్ష్మి వస్తానఙటుంది. ఆ తర్వాత పెళ్లికి సీతా ఒప్పుకున్నాడని శ్రీవల్లి, శ్రీలత, సందీప్ ముగ్గురు హ్యాపీగా ఫీల్ అవుతుంటే.. రమ్య వెళ్లి డబ్బు వస్తుందని ఆశతో మీరు చెప్పినట్టు చేసాను కానీ సీతా సర్ మనసులో రామలక్ష్మికి తప్ప ఎవరికి చోటు లేదంటు సీతాకాంత్ మాట్లాడింది. మొత్తం వాళ్లకు రమ్య చెప్తుంది. వాళ్ళు టెన్షన్ పడుతారు. ఏది ఏమైనా మనకి కావలసింది డబ్బు కదా.. మనం చెయ్యాలిసింది. మనం చేద్దామని శ్రీలత అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : రాజ్, కావ్య కలుస్తారా.. ఒకే హాస్పిటల్ కి ఇద్దరు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -674 లో.....రాజ్ విషయంలో ఛాన్స్ తీసుకోను.. డాడీ గతంని గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను కానీ ఆ గతంలో నేను మాత్రమే ఉన్నానని క్రియేట్ చేస్తాను.. అప్పుడే రాజ్ నాతో క్లోజ్ గా ఉండడం స్టార్ట్ చేస్తాడని తన పేరెంట్స్ తో యామిని అంటుంది. అప్పుడే రాజ్ వచ్చి ఏం డిస్కస్ చేసుకుంటున్నారని అడుగుతాడు. ఏం లేదు రామ్.. రేపు నువ్వు హాస్పిటల్ కి వెళ్ళాలి కదా దాని గురించి అని యామిని కవర్ చేస్తుంది. ఆ అమ్మాయిని కూడా అదే హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాను కదా.. అక్కడికి వెళ్తే తన గురించి ఏమైనా తెలిసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు ఆ అమ్మాయి నాకూ పదేపదే గుర్తుకుస్తుంది తెలుసుకోవాలని రాజ్ అనుకుంటాడు. మరోకవైపు కావ్య పరిస్థితి చూసి ఇందిరాదేవి, అపర్ణ ఇద్దరు బాధపడతారు. రోజు, రోజు కి ఇలా ప్రవర్తిస్తుందని అనుకుంటారు. కావ్య దగ్గరికి స్వప్న, అప్పు ఇద్దరు వెళ్తారు. ఇంట్లో వాళ్ళు నిన్ను అలా అంటున్న ఏం పట్టించుకోవా అని స్వప్న అడుగుతుంది. ఏం అంటారు పిచ్చి పట్టింది అంటారు అంతేగా అని కావ్య అంటుంది. పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావని స్వప్న అనగానే నువ్వు కూడా అలాగే అంటున్నావని కావ్య అంటుంది. అక్క అంత అంటున్నప్పుడు బావ ఉన్నాడని ఎందుకు అనుకోకూడదు.. బావ గురించి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేస్తానని అప్పు అంటుంది. అప్పు ఇన్వెస్టిగేషన్ చేసేలోపు మా ఆయనని ఇంటికి తీసుకొని వస్తానని కావ్య అంటుంది. రాహుల్, రుద్రాణి ఇద్దరు కంపెనీని సొంతం చేసుకోవాలని అందుకు అడ్డుగా ఉన్న కావ్యని తొలగించాలని ప్లాన్ చేస్తారు. రుద్రాణి, రాహుల్ కలిసి రాజ్ ఫోటో దగ్గరికి వెళ్లి దీపం పెట్టాలని చూస్తుంటే కావ్య పరిస్థితి గురించి తెలిసే ఇలా చేస్తున్నావా అంటూ ఇందిరాదేవి కోప్పడుతుంది. అయినా వినకుండా రుద్రాణి దీపం పెడుతుంటే.. అప్పుడే కావ్య వచ్చి రుద్రాణి చెయ్ ఆపుతుంది. మీకు చెప్తే వినపడడం లేదా అంటూ రుద్రాణి గొంతు పట్టుకుంటుంది కావ్య. తరువాయి భాగంలో హాస్పిటల్ లో అడ్మిట్ చేసిన అమ్మాయి డీటెయిల్స్ అంటూ రాజ్ హాస్పిటల్ కి వెళ్లి అడుగుతాడు. అదే హాస్పిటల్ కి కావ్య వెళ్లి నన్ను అడ్మిట్ చేసిన అతని డీటెయిల్స్ అంటూ కావ్య అడుగుతుంది అతను ఇక్కడే ఉన్నాడని రిసెప్షన్ లో చెప్పగా.... డాక్టర్ తో మాట్లాడుతున్న రాజ్ ని కావ్య చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ఇమ్మూకి సాయి పల్లవి లాంటి అమ్మాయి కావాలట...

బుల్లితెర మీద ఉగాది సెలెబ్రేషన్స్ మొదలయ్యాయి. మా ఇంటి పండగ పేరుతో రీసెంట్ గా ఒక ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షో బుల్లితెర నటీనటులు వాళ్ళ కుటుంబాల వాళ్ళు వచ్చారు. అందులో ఇమ్మానుయేల్ తన ఫామిలీ తో ఎంట్రీ ఇచ్చాడు. ఇక వాళ్ళ అమ్మ ఐతే ఇమ్ము పెళ్లి విషయం గురించి ఆసక్తికరమైన కామెంట్ చేశారు. ఇప్పటివరకు వర్ష, ఇమ్ము ఫ్రెండ్స్ అని తర్వాత ఒకరంటే ఒకరికి ఇష్టం అని అలాగే పెళ్లి చేసుకునే వరకు వెళ్తుంది వీళ్ళ బంధం అన్నట్టుగా ఉండేవాళ్ళు. అలాగే కోడలు వస్తోంది అని మీ అమ్మకు చెప్పు ఇమ్ము అంటూ వర్ష గతంలో వేసిన డైలాగ్స్..అల్లుడొస్తున్నదంటూ మీ ఇంట్లో చెప్పు వర్షా అంటూ ఇమ్ము వేసిన డైలాగ్స్ అన్నీ కూడా మనం బుల్లితెర మీద చూసాం. మరి ఏమయ్యిందో ఏమో కానీ ఇప్పుడు విడిపోతున్నట్టుగా కొన్ని సంకేతాలు ఇచ్చారు. అలాగే ఈ మధ్య ఇమ్ము కూడా స్టార్ మా షోస్ లో కనిపిస్తున్నాడు. ఇక ఉగాదికి ప్రసారం కాబోయే మా ఇంటి పండగలో కూడా కనిపించాడు. అందులో ఇమ్ము పెళ్లి విషయం గురించి వాళ్ళ అమ్మ చెప్పింది. హరి ఐతే "ఆంటీ ఇమ్ముకి పెళ్ళెప్పుడు చేస్తున్నారు" అని అడిగాడు. "మంచి అమ్మాయి దొరకాలిగా" అంటూ ఇమ్ము వాళ్ళ అమ్మా చెప్పింది. దానికి హోస్ట్ విష్ణు ప్రియా "ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి" అని అడిగింది. "సాయి పల్లవి అంత క్వాలిటీ ఉండాలి" అని మొహమాటం లేకుండా చెప్పేసింది ఇమ్ము వాళ్ళ అమ్మ. ఆ మాటకు ఇమ్మునే షాకైపోయాడు. ఇక ప్రోమో ఫైనల్ లో  షోకి స్పెషల్ అట్రాక్షన్ గా రాములమ్మ విజయశాంతి వచ్చింది. ఆమెతో పాటు కళ్యాణ్ రామ్ కూడా వచ్చాడు. వీళ్ళిద్దరూ కలిసి అర్జున్ S / O వైజయంతి అనే మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Brahmamudi : రాజ్ ని తీసుకొస్తానంటూ కావ్య శపథం.. యామిని తనని మార్చగలదా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahamamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -673 లో....రాజ్ చనిపోయడని దుగ్గిరాల కుటుంబం మొత్తం నమ్ముతుంది. కర్మకాండ జరిపిస్తూ ఉంటుంది. ఒకవైపు ఇందిరాదేవి మరొకవైపు అపర్ణ ఇద్దరు రాజ్ ని తలుచుకుంటు ఏడుస్తుంటారు. సుభాష్ చేతుల మీదుగా కార్యక్రమం జరుగుతుంటుంది. కావ్య నిద్ర నుండి లేచేసరికి ఏదో మంత్రాలూ వినిపిస్తున్నాయని కిందకి వెళ్తుంది. అక్కడ జరుగుతున్న కార్యక్రమం చూసి కావ్య షాక్ అవుతుంది. నా భర్త బ్రతికే ఉన్నాడు.. ఎందుకు ఇలా బ్రతికున్నవారికి ఇలా చేస్తున్నారంటూ కావ్య అంటుంది. భర్తని పోగొట్టుకొని మతిస్థిమితం లేనిదానిలాగా చేస్తున్నావంటూ కావ్యతో అపర్ణ అంటుంది. నన్ను నమ్మండి ప్లీజ్ మీరు ఇలా చేస్తే అక్కడ మా అయనకి ఏదైనా హాని కలుగుతుందని మోరపెట్టుకున్నా ఎవరు వినరు. దాంతో అక్కడున్న వస్తువులన్నీ విసిరేసి రాజ్ ఫొటో తీసుకుంటుంది కావ్య. దాంతో అందరూ షాక్ అవుతారు. నా భర్త బ్రతికే ఉన్నాడు. మీరు ఇక మీదట ఇలాంటి చేస్తే బాగోదంటూ అందరికి చెప్పి వెళ్తుంది కావ్య. కావ్య అంతలా చెప్తుంటే మనమే మూర్ఖంగా చేస్తున్నామని అపర్ణ అంటుంది. కావ్య చెప్పేది నాకు ఏం అర్ధం అవడం లేదని ఇందిరాదేవి అంటుంది. కావ్య చెప్పింది నిజం అయితే రాజ్ తనని చూసి ఎందుకు వదిలేసిపోతాడని సుభాష్ అంటాడు. మరొకవైపు యామిని తన పేరెంట్స్ తో మాట్లాడుతుంది. రాజ్ అని వైదేహి అంటుంటే రాజ్ అనకు ఎన్నిసార్లు చెప్పాలి.. తను రామ్ అని వైదేహిపై యామిని కోప్పడుతుంది. బావ ఎవరో అమ్మాయిని చూసానని అంటున్నాడు. ఆ అమ్మయి తన ఫ్యామిలీ మెంబెరే అయి ఉంటుందా అని యామిని అంటుంది. తన ఫ్యామిలీ మెంబర్ అయి ఉంటే రామ్ కి గతం గుర్తు లేదు కానీ తనకి గుర్తుంటుంది కదా.. తను అయినా రామ్ ని గుర్తు పట్టాలి కదా అని యమిని నాన్న అంటుంటే.. ఒకవేళ ఆ అమ్మాయికి మాట్లాడే సిచువేషన్ రాలేదేమో అని యామిని అంటుంది. తరువాయి భాగంలో  రాజ్ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తానని కావ్యతో అప్పు చెప్తుంది. ఆ లోపే నా భర్తని నేను తిరిగి తీసుకొని వస్తానని కావ్య అంటుంది. మరొకవైపు కంపెనీ ని గుప్పెట్లోకి తీసుకోవాలని, అందుకోసం కావ్యని అడ్డు తొలగించాలని రాహుల్ రుద్రాణి అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Eto Vellipoyindhi Manasu : లండన్ కి వెళ్తాననుకున్న రామలక్ష్మి.. రామ్ ఒప్పుకుంటాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -356 లో..... శ్రీలత దగ్గర కి రామ్ ని రమ్య తీసుకొని వస్తుంది. నీకు థాంక్స్ అండ్ సారీ నాన్న.. సీతా పెళ్లి చేసుకుంటే వాడు హ్యాపీగా ఉంటాడు. వాడు హ్యాపీగా ఉండడం నీకు ఇష్టమే కదా అని శ్రీలత రామ్ ని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది కానీ రామ్ సైలెంట్ గా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. రామలక్ష్మి ఫోటో ఉన్న గదిలోకి సీతాకాంత్ వెళ్తాడు.తన మనసులో ఉన్న బాధని చెప్పుకుంటూ ఎమోషనల్ అవుతాడు. అసలు ఆ గదిలో ఏముందంటూ రామ్ డోర్ దగ్గరికి వచ్చి చూస్తుంటే అప్పుడే శ్రీవల్లి వచ్చి రామ్ ని పిలుస్తుంది. దాంతో రామ్ వెనక్కి వెళ్తాడు. ఆ తర్వాత శ్రీలత దగ్గరికి రామ్ వచ్చి సీతా ఎందుకు ఆ గదిలోకి వెళ్తాడు. అక్కడ ఏముందని రామ్ అడుగగా.. ఏం లేదని ఏదో ఒకటి చెప్పి పంపిస్తుంది. ఆ తర్వాత శ్రీవల్లి దగ్గరికి వెళ్లి అదే అడుగుతాడు. అది సీక్రెట్ ఆ విషయలు చెప్పకూడదని శ్రీవల్లి అనగానే రామ్ మళ్ళీ రమ్య దగ్గర కి వెళ్లి అడుగుతాడు. దాని గురించి సీతా గారికి మాత్రమే తెలుసు. అందుకే ఆయననే అడుగమని రమ్య చెప్తుంది. రామ్ ఆలోచిస్తుంటే సీతాకాంత్ తన దగ్గరికి వెళ్తాడు. ఆ గదిలో ఏముంది అని రామ్ అడుగగా రామలక్ష్మి ఉంటుంది. తనే గనుక ఉంటే నిన్ను బాగా చూసుకునేదని సీతాకాంత్ అంటాడు. మరి నాకు తనని చూపించమని రామ్ అనగానే.. చూపిస్తాను త్వరలోనే అని సీతాకాంత్ అంటాడు. మరొకవైపు ఎంత త్వరగా లండన్ వెళ్తే అంత మంచిదని రామలక్ష్మితో ఫణీంద్ర మాట్లాడతాడు. ఇక అక్కడికి వెళ్లి హ్యాపీగా ఉండొచ్చని ఫణీంద్ర అంటాడు. ఆ తర్వాత సీతాకాంత్, రమ్య లకి పెళ్లి చెయ్యడానికి ముహూర్తం చూడడానికి శ్రీలత పంతులు గారిని పిలిపిస్తుంది. మైథిలి, రామలక్ష్మి ఒకటేనని తెలుసుకునేందుకు నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నానని సీతాకాంత్ అనుకుంటాడు. ఈ పెళ్లి ఇష్టమే కదా అని శ్రీలత అడుగుతుంది. ఇష్టమే కానీ రామ్ కూడా ఒప్పుకోవాలని సీతాకాంత్ అంటాడు. రామ్ సీతా హ్యాపీగా ఉండడం నీకు ఇష్టమే కదా నువ్వు చెప్పు అని రామ్ ని శ్రీలత అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika deepam2 : ఎంగేజ్ మెంట్ కి వాళ్ళు వస్తారా.. జ్యోత్స్న టెన్షన్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika deepam 2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -309 లో... కాంచనని ఎంగేజ్ మెంట్ కి పిలవమని శివన్నారాయణతో దశరథ్ అంటాడు. వద్దు నేను పిలవలేనని శివన్నారాయణ ఖచ్చితంగా చెప్పి వెళ్ళిపోతాడు. దాంతో దశరథ్, సుమిత్ర ఇద్దరు బాధపడుతారు. మీరేం బాధపడకండి నేను తాతయ్యని ఒప్పిస్తానని జ్యోత్స్న అంటుంది. ఏంటి నువ్వు అనేదని సుమిత్ర అంటుంది. అవును నేను ఇప్పుడే అత్తయ్య ఇంటి నుంచి వస్తున్నాను. నాతో బాగా మాట్లాడింది. మీరు పిలవండి ఆఫీషియల్ గా తాతయ్య పీల్చేలా నేను ఒప్పిస్తానని జ్యోత్స్న అంటుంది. ఇన్ని రోజులు బాధపెట్టావ్.. ఇప్పుడు హ్యాపీగా ఉంచుతున్నావని జ్యోత్స్నని చూసి సుమిత్ర మురిసిపోతుంది. జ్యోత్స్న లో ఈ మార్పు నాకు డౌట్ గానే ఉంది.. దాస్ ని ఎందుకు చంపాలననుకుందో తెలిసేవరకు ఏం అర్ధం కాదని దశరథ్ అనుకుంటాడు. ఆ తర్వాత కార్తీక్ కి దీప కాఫీ తీసుకొని వస్తుంది. దీప వెళ్తుంటే కార్తీక్ కొంగు పట్టుకొని ఆపుతాడు. దాంతో దీప టెన్షన్ పడుతుంది. కొంగు కి ఏదో ఉంది అంటూ తుడుస్తాడు. ఆ తర్వాత కాంచనకి దశరథ్ ఫోన్ చేసి మాట్లాడతాడు. నేను నీ కూతురు ఎంగేజ్ మెంట్ కి రాకపోవచ్చు కానీ నా మేనకోడలకి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని కాంచన బాధపడుతుంది. అదంతా కార్తీక్, దీప వింటారు. కార్తీక్ అక్కడ నుండి వెళ్ళిపోయాక.. మీరు మీ మేనకోడలిని కోడలిని చేసుకోనందుకు ఎంత బాధడుతున్నరో తెలుస్తుందని దీప అంటుంది. నువ్వే నా మేనకోడలు అనుకుంటానని కాంచన అంటుంది. ఆ తర్వాత దీప బాధపడుతుంటే.. నువ్వెందుకు బాధపడుతున్నావ్.. మా అమ్మా నిన్ను మేనకోడలు అనుకుంటుంది కదా అని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత జ్యోత్స్న పారిజాతం కలిసి కార్తీక్ రెస్టారెంట్ కి వస్తారు. నేను చెప్పినట్టు చెయ్ అని పారిజాతంని లోపలికి పంపిస్తుంది జ్యోత్స్న. లోపలికి వెళ్లి పారిజాతం ఎంగేజ్ మెంట్ ఫుడ్ ఆర్డర్ ఇస్తుంది. డబ్బు కూడా అడ్వాన్స్ గా అక్కడ మేనేజర్ కి ఇస్తుంది. అప్పుడే కార్తీక్, దీప ఇద్దరు వస్తుంటే జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu: కొడుకు కోసం నిలబడ్డ రామరాజు.. ఆ ఇద్దరి మధ్య మాటల యుద్ధం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu)'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-110లో.. ధీరజ్ కష్టపడి వాటర్ క్యాన్లు మోసి సంపాదించిన డబ్బుతో ప్రేమకోసం ఫుడ్ తీసుకుని వస్తాడు. అయితే ప్రేమ వద్దని మొదటి బెట్టు చేస్తుంది కానీ తర్వాత ఆ ఫుడ్ కాస్ట్ ఎంతో అడిగి లెక్కలు రాస్తుంది. ఏంటి రాస్తున్నావని ధీరజ్ అడిగితే.. నువ్వు నాకు పెట్టినది తిరిగి ఇచ్చేయాలి కదా.. అందుకే అది ఎంతో రాస్తున్నా అని రూ.120 లెక్కల్ని ప్రేమ పుస్తకంలో రాస్తుంది. డబ్బులు తిరిగి ఇవ్వడమేంటని ధీరజ్ అడుగగా.. నువ్వు నాపై ఎంత ఖర్చుపెట్టావో ప్రతి రూపాయి తిరిగి ఇచ్చేస్తాను. రేపటి రోజున నువ్వు పదే పదే నీకు తిండి పెట్టావని అంటావ్. ఇప్పటికే నా జీవితాన్ని కాపాడటానికి నా మెడలో తాళి కట్టానని పాట పాడుతూనే ఉన్నావ్. నన్ను చంపుతూనే ఉన్నావ్. నీ టార్చర్ నేను పడలేనురా నాయనా అంటూ ప్రేమ దండంపెట్టేస్తుంది. ఆ తరువాత ధీరజ్ తెచ్చిన ఫ్రైడ్ రైస్‌ని తింటుంది. ధీరజ్ నోట్లో ముద్దుపెట్టుకుంటూ తండ్రి అన్న మాటని గుర్తు చేసుకుని బాధపడతాడు. తిండి ఎలా సహిస్తుందిరా అన్న మాటే ధీరజ్‌ని మరింత బాధపెడుతుంది. ఈ తిండి నేను సంపాదించుకున్నదేనని గర్వంగా తింటాడు. ఇక పెద్దోడు పెళ్లి విషయంలో చిచ్చు పెట్టేసిన భద్రవతి.. రామరాజు కోసం గుమ్మంలో ఎదురుచూస్తుంటుంది. ఇంతలో రామరాజు దిగులుగా నడుచుకుంటూ వస్తాడు. అది భద్రవతి, సేనాపతి, విశ్వలు చూసి ఆనందపడతారు. అక్కా ఆ రామరాజు గాడు వచ్చాడు వాడ్ని చూడు.. మొహంలో నెత్తురు చుక్క లేదు.. ప్రాణం ఉన్న జీవశ్చవంలా ఉన్నాడు చూడని భద్రావతితో సేనాపతి అంటాడు. అప్పుడే ఏమైంది సేనా.. కొద్ది రోజులు పోతే పెద్ద కొడుక్కి పెళ్లి కావడం లేదనే బాధలో చచ్చినా చస్తాడని భద్రవతి అంటుంది. అది విన్న రామరాజు.. ఎదుటి వాళ్లని హింసపెట్టి ఆనందపడే వాళ్లని రాక్షసులని అంటారు. మీరు కూడా అలాంటి జాతేనని నిరూపించుకున్నారు కదరా అని రామరాజు అంటాడు. ఏంట్రా వాగుతున్నావని సేనాపతి దూసుకుని రావడంతో రామరాజు తిరగబడతాడు. ఇంతకు ముందు నా పెద్ద కొడుక్కి చూసిన సంబంధాలన్నీ కుదిరినట్టే కుదిరి చెడిపోతుంటే కారణమేంటో తెలియక చాలా బాధపడ్డాను.. కానీ ఆ సంబంధాలన్నీ మీరే చెడగొట్టారని ఈరోజే అర్థం అయ్యిందిరా.. ఇంతకు ముందు వరకూ మీపై నాకు కోపం మాత్రమే ఉంది.. మీరు నా కొడుకు పెళ్లి సంబంధాలను చెడగొడుతున్న నీఛులని తెలిసిన తర్వాత అసహ్యం వేస్తుందని రామరాజు అంటాడు. ఏంట్రా వాగుతున్నావని భద్రవతి వస్తుంది. ఏయ్ ఛీ ఆపు.. పాతికేళ్లుగా నువ్వు నన్ను ఎన్ని మాటలు అన్నా.. ఎంతగా అవమానించినా భరించాను. కేవలం నా భార్యకి అక్కవి అనే కారణంతో వదిలేశాను. అసలు నువ్వు మనిషివే కాదని నిరూపించుకున్నావ్.. ఒక మనిషి ఎన్ని తప్పులు చేసినా సరే.. ఏనాటికైనా బుద్ది తెచ్చుకుంటాడు. కానీ మీరు నన్ను పాతికేళ్లుగా క్షోభపెడుతూనే ఉన్నారు. మీ తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. పాతికేళ్లుగా నాకు నరకం చూపిస్తున్నారు.. అది చాల్లేదా? ఇప్పుడు నా పెద్ద కొడుకు జీవితంతో కూడా ఆడుకోవాలా అని రామరాజు అని నిలదీస్తాడు. ఇంతలో వేదవతి వచ్చి.. ఏమైందండీ.. వీళ్లు పెద్దోడి జీవితంతో ఆడుకోవడమేంటని అడుగుతుంది. పెద్దోడికి, శ్రీవల్లితో కుదిరిన పెళ్లి సంబంధం చెడిపోయిందని.. వీళ్లే చెడగొట్టేశారు. ఈ సంబంధం ఒక్కటే కాదు బుజ్జమ్మా.. ఇంతకు ముందు సంబంధాలను చెడగొట్టింది కూడా వీళ్లేమని వేదవతితో రామరాజు చెప్తాడు. అసలు మీరు మనుషులేనా? నా పెద్ద కొడుకు జీవితంతో ఆడుకుంటారా అని వేదవతి అడుగుతుంది. మా బతుకేదో మేం బతుకుతున్నాం.. పాతికేళ్లుగా నాపై పగ సాధిస్తూనే ఉన్నారు. మీ కోసం చల్లారకపోతే నాపై చూపించండి. అంతేకానీ అమాయకుడైన నా పెద్ద కొడుకుపై చూపించడం ఎందుకు.. వాడి జీవితంతో ఆడుకోవడం ఎందుకని రామరాజు ఎమోషనల్ అవుతాడు. ఏంట్రా తెగ ఫీల్ అయిపోతున్నావ్.. నీ పిల్లలది మాత్రమే జీవితమా.. ఎదుటి వాళ్ల పిల్లలది జీవితం కాదా.. నీ కొడుకుది మాత్రమే భవిష్యత్.. నా మేనకోడలది భవిష్యత్ కాదు.. నీ కొడుకు పెళ్లి సంబంధం చెడిపోయినందుకే నీకు అంత బాధగా ఉంటే.. తెల్లారితే పెళ్లి అనగా.. నా మేనకోడల్ని లేపుకుని వెళ్లాడు నీ చిన్న కొడుకు.. మరి నాకెంత బాధ ఉండాలని ధీరజ్, ప్రేమల గురించి మాట్లాడుతుంది. నా కూతుర్ని మహారాణిలా పెంచానురా.. కానీ నీ కొడుకు దాన్ని ఎంగిలి కప్పులు ఎత్తే పరిస్థితికి తీసుకొచ్చాడు. మా బిడ్డ గురించి మాకు కడుపుకోత ఉండదా అని సేనాపతి అంటాడు. ఇక సమాధానం చెప్పలేక అక్కడ నుంచి వెళ్లిపోతుంటాడు రామరాజు. దాంతో భద్రవతి.. రేయ్ రామరాజూ గుర్తు పెట్టుకో.. ఇదే కాదు.. నీ పెద్దకొడుక్కి నువ్వు తెచ్చే ప్రతి సంబంధాన్ని చెడగొడుతూనే ఉంటాను.. నీ కొడుక్కి పెళ్లి కాకుండా చేసి నువ్వు కుళ్లి కుళ్లి ఏడ్చేలా చేస్తానని అంటుంది. దాంతో వేదవతి.. మీరు నిజంగా రాక్షసులే.. అని ఆవేదన చెందుతుంది. ఇక రామరాజు, వేదవతి ఇంటికి వచ్చేస్తారు. రేయ్ నువ్వు జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు.. ఏదైనా ఉందంటే.. అది నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే అని ధీరజ్ తో రామరాజు అంటాడు. ఆ మాటతో ధీరజ్, ప్రేమ ఇద్దరు ఎమోషనల్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ప్రేమ అంటే ఏంటో తెలుసా ? ఇస్తే మళ్ళీ తిరిగి తీసుకోవాలి

అఖిల్ సార్థక్ గురించి ఎవరు అడిగినా ఇట్టే చెప్పేస్తారు. అలాంటి అఖిల్ సార్థక్ బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా వెళ్ళాడు. ఆ సీజన్ లో రన్నర్ గా నిలిచాడు. అలాంటి అఖిల్ బిగ్ బాస్ తర్వాత అసలు బుల్లితెర కనిపించడమే లేదు. ఇన్స్టాగ్రామ్ పేజీలో తన అప్డేట్స్ పెడుతూ ఉంటాడు. ఐతే రీసెంట్ గా ఒక పోస్ట్ పెట్టాడు అఖిల్. అదేంటంటే "ప్రేమ అంటే ఏమిటి ? " అంటూ ఒక కాప్షన్ ని తన రీల్ లో పోస్ట్ చేసాడు. అలాగే పక్కనే ఇంకో పోస్ట్ కూడా పెట్టాడు. " నువ్వు ఎప్పుడూ ప్రేమ గురించే ఎందుకు మాట్లాడుతున్నావని ప్రజలు నన్ను అడుగుతున్నారు.  కనీసం దాని గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు సంతోషంగా అనిపిస్తుంది.  నిజమైన ప్రేమ మీ కష్ట సమయాల్లో నిన్ను తెలుసుకుంటుంది. కానీ మనం దానికి విలువ ఇవ్వం. ప్రేమ సరైన సమయంలో దొరకదు..అలాగే మనం సరైన సమయంలో తప్పుడు  వ్యక్తులను, రాంగ్ టైములో సరైన  వ్యక్తులను ఎన్నుకుంటూ ఉంటాం.." అంటూ ఒక వేదాంతం చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్ కి సయ్యద్ సోహైల్ కామెంట్ చేసాడు. "ఏ ఊర్కో భయ్యా రిటర్న్ ఇవ్వకపోతే నువ్వే ప్రేమించేసి...నువ్వే ప్రేమ చూపించి నువ్వే వెంటపడుతున్నప్పుడు నీ మీద ప్రేమ ఎవరు చూపించకపోతే ఇంకా అదేం ప్రేమ..? మన పుట్టుక అమ్మ ప్రేమతో నాన్న బాధ్యతలతో పెరిగాం, అలాంటి ప్రేమ అట్లీస్ట్ అందులో 50% ప్రేమ అమ్మాయి నుండి లేదా అబ్బాయి నుండి కూగా అందకపోతే ఇంకెందుకు బ్రో లవ్ చేసి... మనం కూడా తిరిగి ఆశించాలి. ఎందుకంటే మనకు ఎన్ని సమస్యలు ఉన్నా మన పక్కన లైఫ్ పార్టనర్ ఉంటె అన్నీ మార్చిపోవాలి అప్పుడే ప్రేమకి నిర్వచనం ఉంటుంది. అండ్ హ్యాపీగా ఉంటాం, నాక్కూడా హ్యాపీనెస్ కావాలి రిటర్న్ లో, లేకపోతే చల్ లవ్ లేదు తొక్కలేదు, సింగిల్ లైఫ్ బెటర్.. " అంటూ రిప్లయ్ ఇచ్చాడు. ఏదేమైనా ప్రేమ ఇస్తే తిరిగి ఆశించాలి అన్నదే ఇక్కడ తెలుస్తోంది.

కావ్య మంచి ఫైర్ లా ఉందిగా...ఆమెతో సిగరెట్ వెలిగించుకుందామని

  సుమ అడ్డా నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కి శ్రీకర్ కృష్ణ, కావ్య, బ్రహ్మముడి మానస్, వీరేన్ వచ్చారు. దేవుడు నీ ముందు ప్రత్యక్షమైతే ఎం కోరిక కోరుకుంటావ్ అంటూ సుమ అడిగింది. ఆయన్ని చూసేసరికి నాకు ఏమీ గుర్తురాదు అందుకే నేను ఎం కోరుకుంటే అది జరగాలని కోరుకుంటా అని చెప్పింది. దానికి సుమ "నిన్ను చూస్తుంటే అలా అనిపించట్లేదు. మీరు మళ్ళీ ఇంకో సారి వస్తారా " అని అడిగేలా ఉంది. అనేసరికి కావ్య నవ్వేసింది. ఇక మానస్, శ్రీకర్ కృష్ణ ఇద్దరూ కూడా సమ్మర్ బాచిలర్ పార్టీ చేసుకున్నారు. మందేస్తూ స్టేజి మీద చిందేశారు. వీరేన్ - కావ్య ఒక జోడిగా వచ్చారు. ఇక శ్రీకర్ వచ్చి "మేడం మీరు నా కోసం సిగరెట్ వెలిగిస్తారా ? అని అడిగాడు. ఇంతలో వీరేన్ వచ్చి "హలో హలో నా వైఫ్ నీకు సిగరెట్ ఎందుకు వెలిగిస్తుంది ?" అంటూ శ్రీకర్ ని అడిగాడు. "అంటే మేడం చూడడానికి ఫైర్ లా ఉన్నారు కదా. ఆ ఫైర్ తో సిగరెట్ వెలిగించుకుందామని" అనేసరికి కావ్య కూడా నవ్వేసింది. ఇక సుమ రాపిడ్ ఫైర్ రౌండ్ లో కావ్యని ఒక ప్రశ్న అడిగింది. "జీవితంలో ఎలాంటి లైఫ్ లీడ్ చేయడం బెటర్...లవ్ లైఫ్ ఆర్ మ్యారేజ్ లైఫ్ " అని అడిగింది. ఆ కపుల్ మీద ఆ విషయం డిపెండ్ అయ్యి ఉంటుంది. మ్యారేజ్ లైఫ్ ఐనా లవ్ లైఫ్ ఐనా కూడా ప్రేమ ఉంటె ఏ లైఫ్ ఐనా లీడ్ చేయొచ్చు " అని ఆన్సర్ ఇచ్చినట్టుగా ఆమె లిప్ సింక్ ద్వారా తెలుస్తోంది. ఇక ఈ ప్రోమోలో ఫైనల్ గా సుమ కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసారు. సుమ బర్త్ డే సెలెబ్రేషన్స్ చేశారు అంతా కలిసి. అలాగే సుమ వాళ్ళ అమ్మను కూడా ఈ షోకి తీసుకొచ్చారు. ఈరోజు తాను ఇలా ఉంది అంటే దానికి కారణం తన తల్లి అని చెప్పుకొచ్చింది సుమ.