కన్నీళ్లు పెట్టుకున్న లేడీ ఆటో డ్రైవర్స్...ఆటో డ్రైవర్ కాన్సెప్ట్ తో శ్రీదేవి డ్రామా కంపెనీ

  శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో ఫుల్ ఎమోషనల్ గా ఉంది. ఈ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ అంతా కూడా ఆటో డ్రైవర్ థీమ్ తో రాబోతోంది. ఐతే ఈ ఎపిసోడ్ కి యాంకర్ రవి వచ్చాడు. ఐతే రవిని చూసిన నూకరాజు "ఏ మీటర్ లేకుండా నువ్వు రావు కదా" అనేసరికి "ఆటో డ్రైవర్ లు పడే కష్టాలను ఆడియన్స్ కి చూపించడం కోసం నేను వచ్చాను" అని చెప్పాడు రవి. అంటే ఎపిసోడ్ మొత్తం కూడా ఆటో డ్రైవర్ ల కష్టాలు, డాన్స్, పెర్ఫార్మెన్స్, స్కిట్స్ , సింగింగ్, ఎమోషన్స్ అన్నీ కూడా ఇదే థీమ్ మీద జరిగింది. ఐతే తాగుబోతు రమేష్, పంచ్ ప్రసాద్ వచ్చి ఆటో మీద జోక్స్ వేశారు. "నా ఆటో మీద మంచి కొటేషన్స్ రాసినా ఎవరూ ఎక్కడం లేదు" అని తాగుబోతు రమేష్ అనడంతో..ఇంతకు ఎం రాసావు అని ప్రసాద్ అడిగాడు. "లోకంలో లేవు కాకులు...నా ఆటోకు లేవు బ్రేకులు" అని రాసినట్లు చెప్పాడు. బ్రేకులు లేని ఆటోలో ఎలా ఎక్కుతారు అంటూ ప్రసాద్ కౌంటర్ వేసాడు. ఇక ఈ షోకి రియల్ లైఫ్ లోని కొంతమంది లేడీ ఆటో డ్రైవర్స్ వచ్చారు. "మా ఆయన చనిపోయి 18 ఏళ్ళు అయ్యింది. నేను అప్పటి నుంచి ఆటో నడుపుకుంటూ ఇద్దరు పిల్లలను చూసుకుంటున్నా" అంటూ ఒకావిడా చెప్పారు. " నేను 2014 నుంచి ఆటో వేయడం స్టార్ట్ చేసాను..నువ్వు ఛస్తే చావు కానీ మా డబ్బులు ఇవ్వండి " అంటారంటూ ఇంకొకావిడ చెప్పుకొచ్చారు. ఇంకో కుర్రాడైతే "మార్నింగ్ డిగ్రీ చదువుకుంటూ సాయంత్రం ఆటో నడుపుకుంటున్నా" అని చెప్పాడు. తర్వాత ఆదర్శ్ వచ్చి ఆటో డ్రైవర్ గా డాన్స్ చేసాడు. అలాగే ఇంకో ఇద్దరు లేడీ డాన్సర్స్ వచ్చి ఆటో డ్రైవర్ గెటప్స్ లో డాన్స్ చేసి ఎంటర్టైన్ చేశారు.ఇక ఈ ప్రోమోలో ధరణి ప్రియా విమెన్ సెల్ఫ్ డిఫెన్సె యాక్ట్ చేసి చూపించింది. అలాగే తన చంకలో ఒక బిడ్డతో వచ్చి కత్తి తీసుకుని దుండగుల మీద ఎలా అటాక్ చేయాలి అనేది చేసి చూపించింది. ఫైనల్ గా కొరియోగ్రాఫర్ సుదర్శన్ మాష్టర్ వచ్చి రియల్ లైఫ్ ఆటో డ్రైవర్ ఎమోషన్స్ ఎలా ఉంటాయో చేసి చూపించాడు. ఒక ఆటో డ్రైవర్ కి లైఫ్ లో కష్టాలు ఎలా ఉంటాయి అనేది చేసాడు. అంటే అప్పులు, వడ్డీలు, స్కూల్ ఫీజులు, ఇంటి రెంట్, ఇంట్లో తినడానికి ఇవన్నీ కూడా చేసి చూపించాడు. "నేను ఈరోజు గర్వంగా చెప్పుకుంటాను...నేనొక ఆటో డ్రైవర్ కొడుకుని అని" అంటూ చెప్పుకొచ్చాడు.  

ఫస్ట్ నైట్ ప్రాప్తిరస్తూ... ఐ లవ్ యు శ్రీముఖి

ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఈ ఆదివారం షో ఫుల్ జోష్ తో సాగింది. ఈ షోకి ఇల్లు, ఇల్లాలు, పిల్లలు సీరియల్ నుంచి రామరాజు ఫామిలీ, భద్రావతి ఫామిలీ వచ్చారు. ఇక రామరాజుకు సీరియల్ లో ముగ్గురు కొడుకులు ఉంటారు. చందు, సాగర్, ధీరజ్ వచ్చారు. ఐతే మీ పెద్దబ్బాయికి పెళ్లి ఎప్పుడు చేస్తారు..నేను ఉన్నా చూడండి...మా జంటను ఒకసారి ఎలా ఉంటామో చెప్పండి అనేసరికి రామరాజు చందుని, శ్రీముఖిని పక్కపక్కన పెట్టి పిన్ని పక్కన నిలబడినట్టు ఉంది పక్కకు రా అనేశాడు. దానికి శ్రీముఖి గట్టిగా నవ్వేసింది. తర్వాత సాగర్ దగ్గరకు వెళ్ళింది శ్రీముఖి. వెంటనే సాగర్ శ్రీముఖి కాళ్లకు దణ్ణం పెట్టేసరికి "అయ్యో నేను మీకంటే చిన్నదాన్ని" అనేసింది. తర్వాత సాగర్ తన వైఫ్ అంటూ చూపించాడు. వెంటనే శ్రీముఖి వాళ్లకు బ్లేసింగ్స్ ఇచ్చి రామరాజు గారిని తాతయ్యను చేయాలి అంటూ చెప్పింది. వెంటనే సాగర్ దగ్గరకు రామరాజు వచ్చి "వాడికి పెళ్లయ్యింది కానీ ఇంకేం జరగలేదు. చందు పెళ్ళైతే కానీ సాగర్ ఫస్ట్ నైట్ జరగదు" అంటూ చెప్పుకొచ్చాడు. వెంటనే శ్రీముఖి పెళ్ళైపోతుందిలే .. ఫస్ట్ నైట్ ప్రాప్తిరస్తూ అంటూ వాళ్ళను దీవించింది. ఇక ఈ సీరియల్ లో మెయిన్ లీడ్ చేస్తున్న ఆమని ఈ షోకి ఫస్ట్ టైం వచ్చింది. ఇక శ్రీముఖి ఐతే "హే భద్రావతి రావే చూసుకుందాం" అంటూ గట్టిగా చిటికేసి మరీ పిలిచింది. తర్వాత భద్రావతి ఫామిలీ రానే వచ్చింది. అందులో విశ్వాని చూసి ఫుల్ జోక్స్ వేసింది శ్రీముఖి. విశ్వాకి షేక్ హ్యాండ్ ఇచ్చి త్వరలో పెళ్లి కావాలని కోరుకుంటున్నా ఇంతకు ఎలాంటి అమ్మాయి కావాలి అంటూ అడిగింది. దానికి ఆ విశ్వా ఐతే "నీలాంటి అమ్మాయి కావాలి" అంటూ శ్రీముఖిని చూపించేసరికి ఆమె తెగ సిగ్గుపడిపోయింది. అందరికీ "నేనే కావాలి" అంటూ తెగ ముచ్చటపడిపోయింది. తర్వాత రామరాజుని చూసిన శ్రీముఖి ఒక రిక్వెస్ట్ అంటూ "రామరాజు గారిలా గంభీరంగా కాకుండా ప్రభాకర్ గారిలా ఉంటే బాగుందనిపిస్తోంది" అనేసరికి "అలా ఐతే ఐ లవ్ యు శ్రీముఖి" అంటూ ప్రభాకర్ వెంటనే చెప్పేసాడు.  

ఇస్మార్ట్‌ జోడీ  జోడి 3 ఫినిష్...టైటిల్ విన్నర్ ప్రేరణ - శ్రీపద్

  ఇస్మార్ట్‌ జోడీ  జోడి సీజన్ 3 గ్రాండ్ ఫినాలే పూర్తయ్యింది. ఇందులో రకరకాల టాస్కులు ఇచ్చి మరీ ట్విస్టులు ఇచ్చాడు యాంకర్ ఓంకార్. కూరగాయలు కట్ చేయించి వెయిట్ వేయించి కొంతమందిని ఎలిమినేట్ చేసాడు. ఇక ఫైనల్స్ కి శ్రీపద్ - ప్రేరణ, ఆదిరెడ్డి - కవిత వెళ్లారు. ఫైనల్ టాస్క్ లో ఆదిరెడ్డి జోడి ఓడిపోయింది. దాంతో శ్రీపద్ - ప్రేరణ జోడీ సీజన్ టైటిల్ గెలిచారు. ఇక వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఆదిరెడ్డి - కవిత జోడి రన్నరప్ గా నిలిచారు. ఇక స్టేజి మీద ఆదిరెడ్డి ఇష్మార్ట్ జోడి మీద రివ్యూ చెప్పు అని ఓంకార్ అడిగేసరికి "వెరీ ట్రాన్స్పరెంట్ షో ఇది. ఈ షో చూడనివాళ్లే నెగటివ్ గా మాట్లాడతారు గాని లేదంటే ఎవరూ నెగటివ్ గా మాట్లాడరు..ఈ షోలో ఉన్న జంటల నుంచి చూసి ఏదో ఒక పాయింట్ ని జనాలంతా నేర్చుకుని ఉంటారు. మాకు ఈ షో ద్వారా మంచి మెమోరీస్ ఇచ్చారు" అంటూ మంచి రివ్యూ ఇచ్చాడు. ఇక ప్రేరణ- శ్రీపద్ ఈ షో విన్నర్ అయ్యారు. ఇక అతి భారీ కప్ ని అలాగే 15 లక్షల క్యాష్ ప్రైజ్ ని అందించాడు ఓంకార్. ఇక ఈ షో ఇంత సక్సెస్ కావడానికి కారణం అన్ని జోడీస్ అని చెప్పాడు ఓంకార్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి తమ్ముళ్లు, చెల్లెల్లు స్టార్ మా సపోర్ట్ ఉంది. ఎంతో ఇష్టంతో అందరూ ఈ ఎపిసోడ్స్ ఎడిట్ చేయడం వలనే సక్సెస్ ఫుల్ అయ్యింది. ఇక ప్రేరణ ఐతే తీన్మార్ స్టెప్పులేసింది. టైటిల్ గెలవడం ఎప్పటికీ గుర్తుండిపోతుంది అంటూ చెప్పింది. అలాగే సర్టిఫికెట్ మీద తన పేరు చూసుకుని సంబరపడిపోయింది. అలాగే ఇక ప్రేరణ వాళ్ళ అమ్మ వచ్చి ఇప్పటి వరకు ఎలాంటి మ్యారేజ్ ఫొటోస్ లేవు అని షోలో ఇచ్చిన ఫోటో చాల బాగుందని చెప్పింది. ఇక ప్రేరణ ఐతే బిగ్ బాస్ సీజన్ 8 లో కూడా బాగా టాస్కులు ఆడింది దాంతో ఆ ఎక్స్పీరియెన్స్ ఇష్మార్ట్ జోడిలో బాగా ఉపయోగపడింది. ఇలా ఈ ఇష్మార్ట్ జోడి సీజన్ 3 పూర్తయ్యింది.

Illu Illalu Pillalu : పోలీస్ స్టేషన్ లో చందు.. విశ్వ కేసు వాపస్ తీసుకుంటాడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu Illalu Pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -113 లో.. రామరాజు దగ్గరికి తిరుపతి వచ్చి చందుని పోలీసులు అరెస్ట్ చేసారని చెప్పగానే రామరాజు వెంటనే స్టేషన్ కి వెళ్తాడు. ఎందుకు అరెస్ట్ చేసారని అక్కడ సీఐని రామరాజు అడుగుతాడు. మీ అబ్బాయి విశ్వ అనే అతన్ని కొట్టాడని కేసు పెట్టారని సీఐ చెప్తాడు.    మరొకవైపు ఆ రామరాజుతో ఏం మాట్లాడినా మనం అనుకున్నది మాత్రం అయ్యేలా లేదని ఇంట్లో వాళ్ళతో భాగ్యం అంటుంది. అప్పుడే భద్రవతి ఫోన్ చేస్తుంది. వాళ్ళ గురించి చెప్పినా వినకుండా సంబంధం ఖాయం చేసుకున్నారు కదా.. మీకు కాబోయే అల్లుడు స్టేషన్ లో ఉన్నాడని భద్రవతి చెప్తుంది. అసలు ఏం జరిగి ఉంటుంది.. అక్కడికి వెళ్ళాక మీరేం మాట్లాడకండి అని తన కూతురు శ్రీవల్లి ఇంకా తన భర్తకి భాగ్యం చెప్తుంది.    ఆ తర్వాత రామరాజు తరపున లాయర్ స్టేషన్ కి వస్తాడు కానీ అది అటెంప్టివ్ మర్డర్ కేసు కాబట్టి బెయిల్ ఉండదని చెప్పడంతో అందరు బాధపడుతారు. భాగ్యం స్టేషన్ దగ్గరికి వెళ్తుంది. మీరేదో మంచివారు అనుకొని సంబంధం ఖాయం చేసుకున్నాం కానీ ఇలాంటి వాళ్ళని తెలియదు.. మీ ఇంటికి నా కూతురిని ఇచ్చి దాని గొంతు కొయ్యలేనని భాగ్యం చెప్పి వెళ్ళిపోతుంది.   ఆ తర్వాత స్టేషన్ దగ్గర తిరుపతి, ధీరజ్, సాగర్ ఉంటారు. సాగర్ మీద పడి ధీరజ్ ఏడుస్తుంటాడు. ధీరజ్ ఇంటికి వెళ్ళాక నీ వల్లే వాడికి ఈ పరిస్థితి వచ్చిందంటూ ధీరజ్ ని రామరాజు కొడుతాడు. ధీరజ్ ఎంత చెప్పినా వినకుండా తనని అసహ్యహించుకుంటాడు రామరాజు.    తరువాయి భాగంలో విశ్వపై ప్రేమ కేసు పెడుతుంది. ఇంతటితో ఈ గొడవ సర్దుమనగాలంటే నువ్వు చందుపై పెట్టిన కేసు వాపస్ తీసుకోవాలని విశ్వకి సీఐ చెప్తాడు.. అందుకు విశ్వ ఒప్పుకోడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoindi Manasu : రమ్య ప్లాన్ తెలుసుకున్న రామలక్ష్మి.. అతడికి నిజం చెప్పనుందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు' (Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -359 లో... రమ్య ఇల్లు కొనడానికి అడ్వాన్స్ ఇవ్వడం రామలక్ష్మి చూస్తుంది. రమ్య వెళ్ళిపోయాక అడ్వాన్స్ తీసుకున్నఅతని దగ్గరికి రామలక్ష్మి వచ్చి.. రమ్య గురించి అడుగుతుంది. ఇల్లు కొంటానంటే నీకు అంత సీన్ లేదన్న అందుకే పొగరుగా వచ్చి డబ్బు ఇచ్చి వెళ్తుందని అతను చెప్తాడు. అంత డబ్బు ఎలా వచ్చిందంటారని రామలక్ష్మి అతన్ని అడుగగా.. చూస్తే తెలియడం లేదా నిన్న నడుచుకుంటూ వచ్చింది.. ఇప్పుడు కార్ లో వచ్చింది.. ఎవడో బకరాని పట్టిందని అతను అంటాడు.   ఆ తర్వాత రామ్ కి రమ్య భోజనం తినిపిస్తుంది. నిన్ను అందరిలాగే పేరు పెట్టి పిలుస్తానని రామ్ అనగానే సరే అని రమ్య అంటుంది. అదంతా సీతాకాంత్ చూస్తుంటాడు. రమ్య నాపై ప్రేమతో రామ్ ని బాగా చూసుకుంటుంది.. నేనే తనని అవసరం కోసం వాడుకుంటున్నానని అనుకుంటాడు. మీరు ఇలా నాపై జాలి చూపిస్తేనే కదా మీరు నాకు దగ్గర అయ్యేదని రమ్య అనుకుంటుంది. రమ్య చూసారా తన నటనతో బావ గారిని ఎలా పడేస్తుందోనని శ్రీలతతో శ్రీవల్లి అంటుంది. మరొకవైపు రామలక్ష్మి దగ్గరికి ఫణీంద్ర మనిషి వచ్చి రమ్య గురించి ఇన్ఫర్మేషన్‌ ఇస్తాడు. తాను డబ్బు కోసం ఇదంతా చేస్తుంది. సందీప్ అకౌంట్ నుండి తన అకౌంట్ లోకి డబ్బులు ట్రాన్స్ ఫర్ అయ్యాయని చెప్తాడు. నా అనుమానమే నిజం అయిందన్నమాట అని రామలక్ష్మి అనుకొని సీతాకాంత్ కి ఫోన్ చేస్తుంది.   మరోవైపు నా రామలక్ష్మి రేపు బయటపడుతుందనుకుంటే ఈ రోజే బయటపడుతుంది. ఎందుకు కలవాలని ఫోన్ చేసింది.. ఇప్పటికైనా ఒప్పుకుంటుందేమో అని సీతాకాంత్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరొకవైపు సీతాకాంత్ దగ్గరికి రామలక్ష్మి వచ్చి శ్రీలత, రమ్య నాటకం గురించి చెప్పినట్లు దాంతో నువ్వే రామలక్ష్మివి అని సీతాకాంత్ అన్నట్లు.. దాంతో ఏం చేయలేక రామలక్ష్మి నిజం ఒప్పుకున్నట్లు ఉహించుకుంటుంది. ఇక రామలక్ష్మి వస్తుంటుంది..‌అలా  సీతాకాంత్ దగ్గర వరకు వచ్చి అలా కాకుడదని వెళ్లిపోతుంటుంది. ఇక అప్పుడే రామలక్ష్మిని సీతాకాంత్ చూసి ఎందుకు రమ్మన్నారని అడుగుతాడు. కొంచెం బిజీ అందుకే వెళ్తున్నానని వెళ్తుంది. ఇప్పుడు కాకపోయినా రేపైనా బయటపడాలి కదా అని సీతాకాంత్ అనుకుంటాడు. శ్రీలత, శ్రీవల్లి, రమ్య ముగ్గురు నగలు సెలెక్ట్ చేసుకుంటుంటే రామలక్ష్మి వెళ్తుంది. తనని చూసి అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.    

Karthika Deepam 2 : జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ కోసం శివన్నారాయణ పిలుపు.. దీపని పట్టించుకోని అమ్మ!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -312 లో... శివన్నారాయణ, పారిజాతం సుమిత్ర, దశరథ్ లు నలుగురు కాంచన దగ్గరికి వస్తారు. మా నాన్న వచ్చాడని కాంచన సంతోషానికి అవదులు లేకుండా పోతాయ్.. కానీ శివన్నారాయణ మాత్రం గుమ్మం బయటే ఉండి మాట్లాడతాడు. నీ కొడుకు నాకు సవాలు విసిరాడని పాత విషయాలు బయటకు తీస్తాడు. అయినా అవన్నీ ఇప్పుడు పట్టించుకోకుండా నా మనవరాలి ఎంగేజ్ మెంట్ కి పిలవడానికి వచ్చానని శివన్నారాయణ లోపలికి వస్తాడు.   కూర్చో నాన్న అని కాంచన అనగానే నీ మర్యాదల కోసం ఏం రాలేదని శివన్నారాయణ అంటాడు. అంటే ఈ పేదింట్లో  కూర్చుంటే నీ విలువ తగ్గుతుందనా అని కాంచన అనగానే.. అంటే ఆస్తుల్లో నీ వాటా ఇవ్వలేదని ఇండైరెక్ట్ గా అంటున్నావా అని పారిజాతం అంటుంది. ఇప్పుడు ఆస్తుల గురించి ఎవరు అడిగారు.. తల్లి, కొడుకులకి ఆస్తుల గురించి ఉండదని అనసూయ అంటుంది. ఆ తర్వాత జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ కి రమ్మని శివన్నారాయణ పిలుస్తాడు. సుమిత్ర, దశరథ్ లని పిలవమని చెప్తాడు. దాంతో సుమిత్ర కాంచనికి బొట్టు పెట్టి ఎంగేజ్ మెంట్ కి పిలుస్తుంది.   ఇంకా పిలవాల్సిన వాళ్ళు ఎవరు లేరా అని సుమిత్రని అడుగుతాడు కార్తీక్. ఒక్కప్పుడు ఉండే వాళ్ళు ఇప్పుడు లేరని దీపని ఉద్దేశించి మాట్లాడుతుంది సుమిత్ర. తప్పకుండా ఎంగేజ్ మెంట్ కి రమ్మని కాంచన, కార్తీక్ ఇద్దరికి చెప్పి వెళ్తుంది సుమిత్ర. వదిన ఏంటి దీప అంటే పట్టనట్టు వెళ్తుంది.. ఏం జరిగిందని కాంచన అడుగుతుంది. శౌర్యపై ఎటాక్ జరిగినప్పుడు జరిగింది అత్త దీప ని కొట్టిన విషయం అమ్మకి తెలియదు కదా అని కార్తీక్ అనుకుని డైవర్ట్ చేస్తాడు. మనకి రెస్టారెంట్ లో పని ఉందంటూ దీపని తీసుకొని వెళ్తాడు కార్తీక్. మరొకవైపు జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ కి వెళ్ళాలని శ్రీధర్ అనుకుంటాడు. నేను మాత్రం రానని కావేరి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : మా ఆయనకి నాకు తెలియని గతం ఉందా.. షాక్ లో కావ్య!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -676 లో... యామిని చెప్పినట్లే రాజ్ తో డాక్టర్ చెప్తాడు. నువ్వు గతం మర్చిపోయావ్.. గతాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తే, నీ ప్రాణానికే ప్రమాదమని రాజ్ తో డాక్టర్ చెప్తాడు. అదంతా దూరం నుండి కావ్య వింటుంది. అంటే ఇప్పుడు మా ఆయనకి గతం గుర్తులేదా.. ఇప్పుడు నేనెదురు పడినా గుర్తుపట్టడా.. నేను గతం గుర్తు చేసే ప్రయత్నం చేసిన ప్రమాదమా అని కావ్య అనుకుంటుంది.   ఆ తర్వాత యామిని రాజ్ ని బయటకు తీసుకొని వస్తుంది. బావ నీకు గతం గుర్తు చేసే ప్రయత్నం చెయ్యను కానీ గతాన్ని అంతటా నీకే గుర్తు వచ్చే చోటుకి తీసుకొని వెళ్తానని  రాజ్ తో యామిని అంటుంటే.. కావ్య వింటుంది. మా ఆయనకి నాకు తెలియని గతం ఉందా.. అదేంటో తెలుసుకోవాలని కావ్య వాళ్ళని ఫాలో చేస్తుంది.    మరొక వైపు అపర్ణకి జ్యూస్ తీసుకొని వస్తుంది ఇందిరాదేవి. నిద్రపోతున్న అపర్ణని ఇందిరాదేవి లేపుతుంది. ఎంత పిలిచిన అపర్ణ లేవకపోవడంతో కంగారు గా సుభాష్ ని పిలుస్తుంది. సుభాష్ వచ్చి చాలాసార్లు పిలవగా అపర్ణ లేస్తుంది. రాజ్ ని గుర్తు చేసుకొని అపర్ణ ఏడుస్తుంది. ఆ పిచ్చి కావ్య వల్లే వదిన ఇలా తయారు అవుతుందని రుద్రాణి అంటుంటే అందరూ రుద్రాణిపై విరుచుకుపడతారు.    ఆ తర్వాత యామిని రాజ్ ని ఒక స్కూల్ కి తీసుకొని వెళ్తుంది కానీ కావ్య వెళ్తుంటే సెక్యూరిటీ తనని ఆపుతాడు. కావ్య సెక్యూరిటికి ఏదో ఒకటి చెప్పి లోపలికి వెళ్తుంది. అక్కడ స్కూల్లో మేడమ్ యామినికి ఫేవర్ గా మాట్లాడుతుంది. చిన్నప్పటి నుండి నీ మరదలకి నువ్వు అంటే చాలా ఇష్టం.. ఎప్పుడు నీకు చదువు మీద ఇంట్రెస్ట్ ఉండేదంటూ మేడమ్ మాట్లాడుతుంటే అదంతా కావ్య వింటుంది.    తరువాయి భాగంలో కావ్య కోసం డాక్టర్స్ ని పిలిపిస్తుంది రుద్రాణి. ఎందుకిలా చేస్తున్నావని  రుద్రాణిని సుభాష్ తిడతాడు. నెల రోజుల్లో మా ఆయనని తీసుకొని వస్తానంటూ ఇంట్లో వాళ్లకు కావ్య ఛాలెంజ్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

జీవన్ అన్నా..అదిరిపోయే రూత్ లెస్ విలన్ క్యారెక్టర్ చెయ్యి అన్నా...ఒక నెటిజన్ సలహా

  నటుడు జీవన్ ఇంతకు ముందు ఎవరో తెలీదు కానీ ఇప్పుడు బుల్లితెర మీద అందరికీ తెలుసు. ఎందుకంటే సుమతో కలిసి చెఫ్ గా చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే అనే షో చేస్తున్నాడు. అందులో గుండుతో కనిపిస్తూ రకరకాల వంటల టాస్కులు ఇస్తూ జోడీస్ చేసే వంటలు తింటూ వంకలు పెడుతూ టేస్టో మీటర్ లో మార్క్స్ వేస్తూ ఉంటాడు. అలాంటి జీవన్ లో చాలా కోణాలు ఉన్నాయి. మంచి వంటలు చేస్తాడు, కష్టాల్లో ఉన్నవాళ్లకు సహాయం చేసే గుణం ఉన్నవాడు, మంచి కమెడియన్ అలాగే జిమ్ లో మంచి వర్కౌట్ చేస్తూ అందరినీ మెస్మోరైజ్ చేస్తూ ఉంటాడు. ఇక రీసెంట్ గా జీవన్ ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. అందులో జిమ్ లోకి వెళ్లి వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ కనిపించాడు . ఇక నెటిజన్స్ ఐతే ఆ వీడియో చూసి షాకయ్యారు. "ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు...జీవన్ అన్ననా మజాకా...సిక్స్ ప్యాక్ ట్రై చెయ్యి..." అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొంతమంది ఐతే "అన్నా ఒక మాస్ విలన్ రోల్ చెయ్యి..అన్నా బీస్ట్ మోడ్ లో ఉన్నావ్...రూత్ లెస్ విలన్ క్యారెక్టర్ చెయ్యి అన్నా" అంటూ సలహాలు ఇస్తున్నారు. ఇక జీవన్ గురించి చెప్పాలంటే.."ఈ నగరానికి ఏమైంది" అనే మూవీతో జీవన్ ప్రయాణం మొదలయ్యింది. అలాగే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన "జాతి రత్నాలు" మూవీలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన చేసే రెస్టారెంట్ ఫుడ్ బిజినెస్ ద్వారా కరోనా సమయంలో ఎంతో మందికి భోజనం అందించాడు. అలాంటి జీవన్ రీసెంట్ గా బెట్టింగ్ యాప్స్ చేసే నష్టాన్ని వివరిస్తూ ఒక వీడియో కూడా చేసాడు. పావ‌లా శ్యామ‌లా గారి పరిస్థితి చూసి ఆమెకు కూడా కొంతవరకు సాయం చేసాడు జీవన్. అలా జీవన్ బుల్లితెర మీద సిల్వర్ స్క్రీన్ మీద కూడా తన సత్తా చాటుతున్నాడు.

ఫైర్ ఐన మంచు మనోజ్.. ఒక అమ్మాయిని లవ్ చేసి చీట్ చేసావ్ శివ 

  "అనగనగా ఈ ఉగాదికి" అంటూ ఈటీవీలో త్వరలో ప్రసారం కాబోయే షో నెక్స్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో యాంకర్ శివకి ఇచ్చిపడేశాడు మంచు మనోజ్. ఆల్రెడీ యాంకర్ శివకి ఈరోజు ప్రాణగండం ఉంది అంటూ ఆది సెటైర్ వేసాడు. ఐతే శివ కూడా మనోజ్ అన్నా ఒక క్వశ్చన్ అన్నా అనేసరికి "ఏ రెండో క్వశ్చన్ కి నువ్వు ఉండవా" అని కౌంటర్ వేసాడు. ఆ తర్వాత మనోజ్ "కావాలని ప్లాన్ చేసుకుని వచ్చి అలా కాంట్రోవర్సిగా చెప్తారో ఏమో....మరి మీ తప్పులు కూడా బయట పెట్టాలిగా.. నువ్వెండేది పిఆర్సినే కదా.. అందులో ఒక అమ్మాయిని లవ్ చేసి చీట్ చేసావ్ ..ఆ అమ్మాయి పేరు..." అంటూ మంచు మనోజ్ ఫుల్ ఫైర్ అయ్యాడు. ఇక యాకర్ శివ ఏమీ సమాధానం చెప్పలేక కూర్చున్నాడు. అసలు ఇంతకు శివ ఎం అడిగాడో ప్రోమోలో కట్ చేసేసారు. కానీ మంచు మనోజ్ అన్న ఘాటైన మాటల్ని మాత్రం ప్రోమోలో చూపించారు. ఈ ప్రోమో మొత్తం కూడా ఫుల్ జోష్ తో సాగింది. అలాగే త్వరలో రిలీజ్ కాబోయే రాబిన్ హుడ్ మూవీ నుంచి హీరో నితిన్ వచ్చాడు. అలాగే నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ప్రదీప్ మాచిరాజు వచ్చారు. ఐతే హోస్ట్స్ గా నందు, రష్మీ చేశారు. "మనోజ్ అన్న గురించి యూట్యూబ్ లో ఏది వచ్చినా అది వైరల్ అవుతుంది" అని నందు చెప్పేసరికి.."రేయ్ ఎవర్రా నువ్వు" అంటూ పెద్ద డైలాగ్ వేసాడు మనోజ్. ఇంతలో నందు ఆదిని చూపించి "వాడే ఎలుగుబంటోడు" అన్నాడు. దానికి "ఓయ్ ఎలుగుబంటు" అంటూ ఆది మీద సెటైర్ వేసాడు మనోజ్. ఇక ప్రదీప్ మీద ఒక డైలాగ్ వేసింది రష్మీ. "పిండే పండయ్యింది" అంటూ అరుంధతి మూవీ డైలాగ్ ని ప్రదీప్ మీద వేసేసరికి ప్రదీప్ షాకైపోయాడు.

బెట్టింగ్ యాప్స్ ప్రొమోషన్ లో శ్రీముఖి ?

  సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసిన బెట్టింగ్ యాప్స్ మీదనే కథంతా నడుస్తోంది. సినీ, బుల్లితెర నటీనటులంతా కూడా ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ వలలో చిక్కారు. దాంతో పోలీసులు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన వాళ్ళ మీద కేసులు ఫైల్ చేస్తున్నారు. ఐతే సోషల్ మీడియాలో శ్రీముఖి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. ఐతే శ్రీముఖి వాళ్ళ నాన్న చెప్పిన మాటలు  కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఐతే శ్రీముఖికి ఒక అమ్మాయి కాల్ చేసిందట. ఆ టైంకి శ్రీముఖి షూటింగ్ లో ఉందని, ఆ నంబర్ ఎవరిదో తెలుసుకోవాలని శ్రీముఖి చెప్పిందన్నారు. ఐతే ఒక వీడియో బైట్ ఇవ్వాలని చెప్తూ శ్రీముఖి ఫ్రెండ్ వేరే వాళ్ళతో కో-ఆర్డినేట్ చేశాడంటూ చెప్పుకొచ్చాడు శ్రీముఖి వాళ్ళ నాన్న. ఐతే అవతల వ్యక్తి నుంచి స్క్రిప్ట్ రావడంతో ఒక వీడియో చేసి పంపింది కానీ శ్రీముఖి అసలు తాను చేసిన వీడియోని పోస్ట్ చేయలేదు అని ఐతే ఇప్పుడు ఆ వీడియో తీసుకున్నట్టు చెప్పుకొచ్చాడు. అలాగే కొన్ని రోజులుగా చూస్తే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ బుల్లితెర మీద నటించే, విష్ణుప్రియ, టేస్టీ తేజ, రీతూ చౌదరి, సుప్రీతా, వర్షిణి, సిరి హన్మంత్, సోబాశెట్టి, నాయని పావని వంటి వాళ్ళ మీద పోలీసులు కేసు ఫైల్ చేసిన వార్తల్ని మనం చూస్తూనే ఉన్నాం. ఐతే ఈ బెట్టింగ్ యాప్స్ తో ఎంతో మంది సాధారణ ప్రజలు వేలు, లక్షలు పోగొట్టుకుని ఇంటిని, ఒంటిని గుల్ల చేసుకుంటూ రోడ్డున పడుతున్నారు. ఇప్పుడు పోలీసులు ఈ విషయం మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది.  

 బిగ్ బాస్ కి నాగార్జున అన్ ఫిట్..ఆయనకు ఇంగ్లీష్ రాదు..

బిగ్ బాస్ హోస్ట్ అనేది మేజర్ రోల్...హోస్ట్ కి ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. హోస్ట్ రోస్ట్ చేయొచ్చు కానీ ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా రోస్ట్ చేయకూడదు అంటూ బిగ్ బాస్ హోస్ట్ సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున మీద బిగ్ బాస్ కంటెస్టెంట్ సోనియా ఆకుల ఫైర్ అయ్యింది. "నాకు తెలిసి రానా గారు హోస్ట్ ఐతే బాగుంటుంది అనుకుంటున్నా. అతనొక ట్రెండీ పర్సన్. ఫామిలీ రిలేషన్స్, ఫ్రెండ్ షిప్స్ గురించి అప్డేట్ గా ఉండే వ్యక్తి. మళ్ళీ నాగార్జున గారే హోస్ట్ గా వస్తే నేను బిగ్ బాస్ కి వెళ్ళను..బిగ్ బాస్ హౌస్ లో అంత సీన్ లేకపోయినా గౌతమ్ మీద నాగార్జున గారు మండిపడ్డారు. కానీ రానా కొంచెం ఆలోచించి కామెంట్ చేసే పర్సన్ అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన చేసిన నంబర్ వన్ యారి వంటి షోస్ చూస్తే ఆయన పర్సెప్షన్స్ చాలా బాగుంటాయి, క్లారిటీగా ఉంటాయి. 20 సినిమాలు చేసినా రాని గుర్తింపు ఒక్క బిగ్ బాస్ తో వచ్చింది. ప్రజలతో కనెక్ట్ అయ్యే అవకాశం వచ్చింది. కానీ నాగ్ సర్ వస్తే బిగ్ బాస్ హౌస్ కి మళ్ళీ అవకాశం వచ్చినా వెళ్ళను. ఆయన నేచర్ సాఫ్ట్. కానీ ఏ విషయాన్నీ సరిగా అనలైజ్ చేయరు. చాల పదాలు మింగేస్తారు...మాటలు మార్చేస్తారు. నేను అనని వాటిని తప్పుగా హైలైట్ చేసి చూపించారు. ఆయన వల్లే నేను మధ్యలో ఎలిమినేట్ అయ్యి బయటకు రావాల్సి వచ్చింది. నాగ్ సర్ నా భర్త పేరు అడిగారు. నేను యాష్ వీరగోని అని చెప్పా. కానీ ఆయన యష్ వీర్ అని యశ్వి అంటారు. నాకేమో యష్మి గురించి మాట్లాడుతున్నారేమిటా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో నా భర్త పేరు చూస్తే యష్ వీర్ అనే కనిపిస్తుంది. ఇక నా విషయంలో అడల్ట్ రేటెడ్ కామెడీ అన్న పాయింట్ సోషల్ మీడియా బాగా హైలైట్ చేసేసింది. ఐకే కామెడీ షోస్ లో హుకింగ్ అనేది కామన్. ఒక అమ్మాయి అబ్బాయి కలిసి నడుస్తూ వెళ్ళేటప్పుడు చేసే వల్గర్  కామెడీని హుకింగ్ అంటారు. అది చాల సెన్సిటివ్ ఇష్యూ. ఆ పదాన్ని విష్ణు ప్రియా విషయంలో వాడాను. దాన్ని నాగ్ సర్ పెద్ద ఇష్యూ చేసేసారు. నేను అనని మాటలను అన్నట్టుగా హైలైట్ చేశారు..హోస్ట్ గా రానా బెటర్ అనేది నేను అనుకుంటున్నా" అంటూ చెప్పింది సోనియా ఆకుల.  

Illu illalu pillalu : తెలివితో చందుని అరెస్ట్ చేపించిన భద్రవతి‌.. ఆ పెళ్ళి క్యాన్సిల్ !

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -112 లో.... రామరాజు పై చెయ్ వేసినందుకు విశ్వని కొడుతాడు ధీరజ్. తనతో పాటు చందు కూడా విశ్వని కొడుతాడు. ఇద్దరిని తిరుపతి ఆపుతాడు. ఇక మీదట మాజోలికి వస్తే ప్రాణం తీసేస్తా అంటూ ధీరజ్ వార్నింగ్ ఇస్తాడు... ఒళ్ళంతా దెబ్బలతో విశ్వ ఇంటికి వస్తాడు. ఏమైందని భద్రవతి అడుగుతుంది. జరిగింది మొత్తం విశ్వ చెప్తాడు. నా కొడుకు పై చెయ్ వెయ్యడానికి ఎంత దైర్యమని రామరాజు ఇంటి మీదకి సేనాపతి వెళ్తుంటే భద్రవతి ఆపుతుంది. మనం చెయ్యాల్సింది గొడవ కాదు.. ఇప్పుడు ఆలోచించాల్సింది ఆ చందు గాడి గురించి త్వరలో పెళ్లి అని ఆ రామరాజు మురిసిపోతున్నాడు వాడి సంగతి చెప్పాలి.. నేను చెప్పినట్టు చెయ్ అంటు విశ్వకి భద్రవతి చెప్తుంది. మరొకవైపు రామరాజు, వేదవతి ఇద్దరు భాగ్యం దగ్గరికి వస్తారు. చందు, శ్రీవల్లి పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చామని రామరాజు అంటాడు. నేను ఆలోచిస్తానని చెప్పాను కదా అని భాగ్యం అంటుంది. ఈ పెళ్ళి ఎలాగైనా జరగాలంటూ రామరాజు రిక్వెస్ట్ చేస్తాడు. దాంతో భాగ్యం సరే అంటుంది. ఆ తర్వాత చందు తిరుపతి వస్తుంటే పోలీసులు ఆపి చందుని అరెస్ట్ చేస్తారు. ఎందుకు అని చందు అడుగగా.. విశ్వ అనే అతన్ని కొట్టారట అందుకే అని చందుని తీసుకొని వెళ్తారు పోలీసులు. తిరుపతి కంగారుపడుతూ ధీరజ్, సాగర్ లకి చందు అరెస్ట్ గురించి చెప్తాడు. మరొకవైపు పెళ్లికి భాగ్యం ఒప్పుకుందని రామరాజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ధీరజ్ చాల మంచివాడు మీరు తప్పుగా అపార్ధం చేసుకుంటున్నారని వేదవతి అంటుంది. అప్పుడే తిరుపతి వచ్చి చందు అరెస్ట్ గురించి చెప్తాడు. దాంతో అందరు షాక్ అవుతారు. మరుసటిరోజు స్టేషన్ దగ్గరికి భాగ్యం వాళ్ళు వెళ్తారు. మీ కొడుకుకి నా కూతురినిచ్చి గొంతు కొయ్యలేను ఈ పెళ్లి జరగదని  రామరాజుతో భాగ్యం చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi: రాజ్ ని యామినితో చూసేసిన కావ్య.. అంతా మాయ చేస్తున్నారుగా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-675 లో.. అప్పూ దారిలో దిగిపోతూ.. అక్కా నువ్వు అనుకున్నట్లుగా ఆసుపత్రిలో ఆరోజు బావ నిన్ను జాయిన్ చేశాడంటున్నావ్ కాబట్టి సమాచారం తెలుసుకో జాగ్రత్తగా ఇంటికి వెళ్లు. సారీ అక్కా అని కావ్యకు మరీ మరీ చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు రాజ్.. ఆ రోజు నేను కాపాడిన అమ్మాయిని చూస్తే నాకు ఎక్కడో కలిసిన ఫీలింగ్ ఎందుకొచ్చింది. తనని కలిస్తే నా గతం గురించి తెలుసుకోవచ్చేమో.. తను ఆసుపత్రిలో ఉండి ఉంటుందా.. తనని ఎలా కలవాలి.. యామినీకి తెలియకుండానే తన వివరాలు తెలుసుకోవాలని రాజ్ మనసులో ఫిక్స్ అవుతాడు. మరోవైపు యామినీ కూడా కావ్య గురించి తెలుసుకోవాలని అనుకుంటుంది. ఆమెకు డౌట్ ఉంది. రాజ్.. ఆ రోజు ఆసుపత్రిలో జాయిన్ చేసిన అమ్మాయి గురించి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నాడు.. ఎందుకు అంత స్పెషల్‌గా ఫీల్ అవుతున్నాడు. కొంపదీసి ఆమె కానీ రాజ్ భార్య అయ్యి ఉంటుందా.. ఎలా అయినా ఈ విషయం రాజ్‌కి తెలియకుండా తెలుసుకోవాలని యామినీ కూడా ఫిక్స్ అవుతుంది. మరోవైపు డాక్టర్ అపాయింట్‌మెంట్‌ తీసుకుని రాజ్, యామినీ ఇద్దరు ఆసుపత్రి హాల్లో కూర్చుని ఎదురు చూస్తుంటారు. మనసులో మాత్రం ఒకరికి తెలియకుండా ఒకరు ఆ రోజు ఆసుపత్రిలో జాయిన్ చేసిన అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు. రాజ్ వాష్ రూమ్ అని అబద్దం చెప్పి అలా వెళ్లగానే.. యామినీ రిసెప్షన్ దగ్గరకు వెళ్తుంది. రెండు రోజుల క్రితం మా బావ జాయిన్ చేసిన ఆ అమ్మాయి వివరాలు కావాలని అడుగగా.. సరే అని రిసెప్షన్ లో ఉన్న అతను వెతుకుతుంటాడు. అప్పుడే కావ్య ఆ ఆసుపత్రి దగ్గర కారు దిగుతుంది. మరోవైపు రాజ్ చాలా దూరం నుంచి యామినీని గమనిస్తుంటాడు. అయ్యో నేను వెళ్లాల్సిన చోట యామినీ ఉందే.. ఇప్పుడు ఎలా.. అవును ఆ రోజు ఆ అమ్మాయి(కావ్య)కి ట్రీట్‌మెంట్ ఇచ్చిన డాక్టర్ శ్యామల గారిని కలుద్దామనుకుంటూ రాజ్ ఆమెను వెతుక్కుంటూ వెళ్తాడు. యామిని వివరాల కోసం ఆ రిసెప్షన్ లో ఉన్న అతడిని కంగారు పెట్టగా.. అతను సర్వర్ స్లోగా ఉందని చెప్తాడు. సరే అయితే వివరాలు తీసి ఉంచమని చెప్పి రాజ్ దగ్గరికి యామిని వెళ్తుంది. ఇక కాసేపటికి కావ్య వచ్చి  రాజ్ వివరాలు అడుగుతుంది. ఆ రిసెప్షన్ లో ఉన్నతను రాజ్ అటువైపు వెళ్ళాడని చెప్తాడు. దాంతో కావ్య అతడిని వెతుక్కుంటూ వెళ్తుంది. ఇక రాజ్ ని యామిని చూస్తుంది. తను సెట్ చేసిన డాక్టర్ దగ్గరికి రాజ్ ని తీసుకొని వెళ్తుంది యామిని. అదే సమయంలో రాజ్ ని కావ్య చూస్తుంది. ఇక యామిని, డాక్టర్ లు మాట్లాడే మాటల్ని కావ్య వింటూ ఉంటుంది. చూడండి రామ్ మీరు ఆరునెలలుగా కోమాలో ఉండటంతో మీ బాడీ రియాక్ట్ అయ్యే విధానం అంతా స్లో అయిపోయింది.. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ అంటాడు. డాక్టర్ మాటలు విన్న కావ్య.. అదేంటీ ఆరు నెలలుగా కోమాలో ఉన్నారా.. మొన్నేగా యాక్సిడెంట్ అయ్యింది.. అంటే వీళ్లు ఆయన్ని ఏదో మాయ చెయ్యాలని చూస్తున్నారా అని కావ్య మనసులో అనుకుంటుంది. నాకు గతం తెలుసుకోవాలని ఉంది డాక్టర్.. నేను ఎవరో నాకో క్లారిటీ కావాలి. ఎంత ఆలోచించినా నాకేదీ గుర్తురావడం లేదు.. ఎక్కువ ఆలోచిస్తే నాకు తలనొప్పి వస్తుంది. నాకు త్వరగా గతం గుర్తురావాలి.. ప్లీజ్ ఏదొకటి చేయండి డాక్టర్ అని రాజ్ ఆవేదనగా అంటాడు.  ఇదే డాక్టర్ ఇదే.. ఇలాగే క్షణం కూడా రిలాక్స్‌గా ఉండటం లేదు.. మళ్లీ తనకు ఏదైనా అవుతుందేమో అని భయంగా ఉంది డాక్టర్ అని యామిని అంటుంది. నిజమే యామినీ గారు.. అంత తీవ్రంగా ఆలోచించి గతాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తే మళ్లీ కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది.. జాగ్రత్తగా ఉండాలి.. రామ్ గుర్తుపెట్టుకోండి అనే డాక్టర్ కూడా నటిస్తాడు. అంతా విని కావ్య ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Eto Vellipoyindhi Manasu : సీతాకాంత్ నాటకం ఆడుతున్నాడని చెప్పేసిన సవతి తల్లి.. రమ్య ఎవరంటే!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -358 లో....... సీతాకాంత్ కి నేనంటే ఇష్టం లేదు కేవలం రామలక్ష్మి నో మైథిలి నో కన్ఫమ్ చేసుకోవడానికి నాతో ఈ పెళ్లి నాటకం ఆడుతున్నాడని చెప్పగానే శ్రీలత వాళ్ళు షాక్ అవుతారు. మనం ఇప్పటి వరకు ఏం చేసిన కూడా కేవలం డబ్బు కోసం చేసాం... ఇప్పుడు కూడా అలాగే చేద్దాం.. సీతా అనుకుంటున్నాడు కానీ అలా జరగకూడదు.. రమ్యని పెళ్లి చేసుకోవాలని శ్రీవల్లి, సందీప్, రమ్యలతో శ్రీలత అంటుంది. మరొకవైపు ఎందుకు సీతాకాంత్ ఎంగేజ్ మెంట్ కి వస్తానని చెప్పావని సుశీల, ఫణీంద్ర ఇద్దరు అడుగుతారు.. మరేం చేయమంటావ్ ఇక సీతా సర్ ని తనివి తీరా చూడడం కోసం అటు మైథిలిగా ఇటు రామలక్ష్మిగా సీతా సర్ కి దగ్గర కాలేకపోతున్నానని రామలక్ష్మి బాధపడుతుంది. అప్పుడే శ్రీలత వస్తుంది. గుమ్మం దగ్గర రామలక్ష్మి వాళ్ళని చూస్తూ ఉంటుంది. అంతా వినేసిందా అనుకుని రామలక్ష్మి టెన్షన్ పడుతుంది కానీ శ్రీలత ఏం వినదు శ్రీలత లోపలికి వచ్చి.. మైథిలీ నీతో మాట్లాడాలంటూ బయటకి తీసుకొని వెళ్తుంది. సీతా, రమ్యతో ఎంగేజ్ మెంట్ అని నాటకం ఆడుతున్నాడు.. నువ్వు రామలక్ష్మి వో మైథిలి వో తెలుసుకోవడానికి ఇదంతా ప్లాన్ అని శ్రీలత చెప్పగానే.. రామలక్ష్మి షాక్ అవుతుంది. మా సీతా రమ్యని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలి. ఇక నువ్వు రేపు ఎంగేజ్ మెంట్ కి వస్తావో రావో ఇక నీ ఇష్టమని శ్రీలత చెప్పి వెళ్తుంది. ఆ తర్వాత శ్రీలత వెళ్ళిపోయాక రామలక్ష్మి ఇంట్లోకి వెళ్తుంది. శ్రీలత మాట్లాడింది మొత్తం ఫణీంద్ర వాళ్ళకి రామలక్ష్మి చెప్తుంది. అదంతా విని తన మాటల బట్టి తనేలాంటిదో తెలుస్తుందని సుశీల అంటుంది. అసలు ఈ రమ్య ఎవరు అని రామలక్ష్మి అంటుంది. నేనొక నంబర్ ఇస్తాను అతన్ని కలిసి విషయం చెప్పు.. నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తాడని ఫణీంద్ర అంటాడు. దాంతో రామలక్ష్మి అతన్ని వెళ్లి కలిసి రమ్య ఫోటో చూపిస్తుంది. అప్పుడే రమ్య వెళ్తుంటుంది. తన గురించి తెలుసుకోవడానికి ఇద్దరు చాటుగా తనని చూస్తారు. రమ్య ఇల్లు కొనడానికి అడ్వాన్స్ తో వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2: జ్యోత్స్న మాటలకి దిగొచ్చిన శివన్నారాయణ.. కాంచన దగ్గరికి మొత్తం వచ్చేసారుగా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం2(Karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-311లో..  జ్యో అడిగిన ప్రశ్నకు శివనారాయణ ఆవేశం రెట్టింపు అయిపోతుంది. దాంతో పొలమారి అతడికి తీవ్రమైన దగ్గు వస్తుంది. వెంటనే దశరథ్, సుమిత్ర కంగారుపడి.. నాన్నా.. మావయ్యగారు అని అతడ్ని పట్టుకుంటారు. జ్యోత్స్న వెంటనే పరుగున వెళ్లి వాటర్ బాటిల్ తెచ్చి కొంచెం తాగు అంటుంది. వాటర్ బాటిల్‌ని తోసేస్తూ.. వాటర్ తాగకపోతే దగ్గు ఆగుతుంది. కానీ నిన్ను ఆపకపోతే వాడు ఆగేలా లేడు అని తిడుతూనే ఉంటాడు. కాసేపటికి అతడి దగ్గు ఆగుతుంది. లేదు తాతా.. నేను ఏ తప్పు చేయలేదు.. రేపు నిశ్చితార్థంలో అత్త ఫ్యామిలీ లేకపోతే జనం ఏం అనుకుంటారు? శివనారాయణ గారు కూతుర్ని తరిమేశారు.. ఆస్తిలో వాటా కూడా ఇవ్వలేదట అని చెప్పుకుంటారు. అప్పుడు పోయేది ఎవరి పరువు.. వాళ్లదా.. మనదా.. అలా అని నేరుగా అత్తను పిలిస్తే వస్తుందా అంటే.. రాదు. అత్త రావాలని మమ్మీ డాడీ కోరుకుంటున్నారు. ఆల్రెడీ నిన్ను అడిగారు.. కానీ నువ్వు వద్దు అన్నావని జ్యోత్స్న మాట్లాడుతూ ఉంటుంది. మరి అప్పుడైనా అర్థం  కదా వాళ్లు రావడం నాకు ఇష్టం లేదని శివన్నారాయణ అంటాడు. చెల్లెలికి మనం తప్ప ఇంకెవరున్నారు నాన్నా అని దశరథ్ అంటాడు. మనకు ఏమైనా వంద మంది ఉన్నారా. .అంతా కలిస్తే ఒక పది మంది కూడా లేరు.. ఉన్నవాళ్లనైనా కూతురికి ఫంక్షన్‌కి పిలుచుకోవాలని తల్లిగా నేను ఆశపడతాను కదా మావయ్యగారని సుమిత్ర అంటుంది. ఇవన్నీ కాదు తాతా.. నా నిశ్చితార్థానికి అత్త బావ రావాలని కోరుకుంటున్నాను.. నా కోరిక నువ్వు తీరుస్తావా లేదా అంటూ జ్యోత్స్న మాట్లాడుతుంటే తాత కాస్త శాంతించి వింటూ ఉంటాడు. నువ్వు వెళ్లి పిలుస్తావా.. డాడీ వెళ్లి పిలుస్తారా ఇవన్నీ నాకు తెలియదు.. నేను మీ మాట విని.. బావని వదులుకుని మీరు చూసిన సంబంధం చేసుకోవడానికి సిద్ధమయ్యాను.. అలాంటి మీకోసం నేను నా బావనే నేను వదులుకున్నప్పుడు నా కోరిక తీర్చడానికి నువ్వు నీ పంతాన్ని వదలుకోలేవా? కలిసిపొమ్మనడం లేదు. పిలవమంటున్నాను.. అత్తా బావా అధికారికంగా వస్తే దీప క్యాటరింగ్‌కి వంట మనిషిలా వస్తుంది.. పైగా బావ రన్ చేస్తున్నా రెస్టారెంట్‌ నుంచి ఫుడ్ తెప్పించుకుంటే మనం అంతా కలిసిపోయామని.. మన మధ్య ఏ గొడవలు లేవు అని నాకు కాబోయే అత్తమామలు అనుకుంటారు కదా.. అంటూ జ్యో చెబుతూ ఉంటుంది. శివనారాయణ శాంతంగా వింటుంటే.. జ్యోత్స్న మాట్లాడుతూ ఉంటుంది. తప్పదు తాత నువ్వు నా కోరిక తీర్చాల్సిందే.. నా నిశ్చితార్థానికి దీప క్యాటరింగ్ చెయ్యాలి. అత్తా బావా అక్షింతలు వేయడానికి రావాలి . ఏమంటావ్ తాతా అని జ్యోత్స్న అంటుంది. వెంటనే శివనారాయణ మాట్లాడుకుండానే అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మావయ్యగారు ఏం మాట్లాడకుండా వెళ్లిపోయారేంటని సుమిత్ర అనగా.. కొన్ని మనమే అర్థం చేసుకోవాలి మమ్మీ.. తాత మౌనమే నేను కోరుకున్న సమాధానం.. క్యాటరింగ్ వద్దని అనలేదు కదా? వాళ్లకు కాల్ చేసి ఓకే అని చెబుతానని జ్యోత్స్న అంటుంది. మరి వదినను కార్తీక్‌ని పిలిచే విషయమంటూ సుమిత్ర అనుమానంగా అంటుంటే.. ఇప్పుడేగా మమ్మీ తాతను వరం అడిగాను.. కాస్త ఆలోచించుకోనీ మమ్మీ.. రిజల్ట్ పాజిటివ్‌గానే వస్తుందని జ్యోత్స్న అంటుంది. మరోవైపు కార్తీక్, దీపలు క్యాటరింగ్ విషయంలో జరిగిన మోసం గురించి పారిజాతం చేసిన పని గురించి కాంచనకు చెప్పడంతో అంటే ఆ జ్యోత్స్న ఇంకా మారలేదని మాట.. ఏంట్రీ అది.. పళ్లు రాలగొట్టాల్సిందిరా దానికి అని రెచ్చిపోతూ ఉంటుంది. ఇంతలో జ్యోత్స్న ఫోన్ చేయడంతో కార్తీక్ లిఫ్ట్ చేసి స్పీకర్‌లో పెడతాడు. మీరే ఈ క్యాటరింగ్ చేస్తున్నారు. ముందు అనుకున్నట్లే మీరే సప్లై చెయ్యాలి.. ఇందులో ఏమైనా మార్పు ఉందా అని జ్యోత్స్న అంటుంది. మేము క్యాటరింగ్ అని కార్తీక్ మాట పూర్తి కాకుండానే దీప ఫోన్ లాక్కుంటుంది. మేము ఈ క్యాటరింగ్ చేస్తున్నాం.. ఆర్డర్ తీసుకున్నాక మీ వల్ల ఆగాలి కానీ మా వల్ల ఎప్పుడూ ఆగదు, ఉంటానని దీప కట్ చేసేస్తుంది. అలా ఎందుకు చెప్పావ్ దీపా అని కాంచన అనగా‌.. అమ్మా దీని వల్ల మనకు ఏ నష్టం లేదు.. పైగా మన రెస్టారెంట్‌కి ఫుల్ పబ్లిసిటీ అవుతుంది.. ఎందుకంటే జ్యోత్స్న రెస్టారెంట్ సీఈవో గారి నిశ్చితార్థానికి సత్యరాజ్ రెస్టారెంట్‌ నుంచి క్యాటరింగ్ తెప్పించుకున్నారంటే మనకే లాభం కదా.. పైగా అంతమంది ముందు మనల్ని అవమానిస్తే తాతకే అవమానం.. అలా జరగదు భయపడకు  అని కార్తీక్ అనేసి వెళ్లిపోతాడు. కుటుంబాలు కలవడానికి ఇదే మార్గం అమ్మా.. వద్దనకండి అని కాంచనతో దీప చెప్తుంది. ఇక మరుసటి రోజు కార్తీక్ రెడీ అయ్యి రెస్టారెంట్‌కి వెళ్లడానికి సిద్ధమవుతుంటే.. కాంచన మాత్రం పదేపదే గుమ్మం వైపు చూస్తూ ఉంటుంది. దశరథ్, సుమిత్రలు వస్తారేమోనన్న ఆశతో.. మొత్తానికీ వాళ్లొస్తారు. రేయ్ కార్తీక్.. మా అన్నయ్య నాకోసం వచ్చాడురా.. మా వదిన కూడా వచ్చిందని కాంచన సంబరపడుతుంటే.. దశరథ్, సుమిత్రల పక్కకు వచ్చి నిలబడి కేవలం అన్నయ్యే కాదు.. స్వయంగా మీ నాన్న కూడా వచ్చారంటూ పారిజాతం నవ్వుతూ పక్కకు తప్పుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది...హీరోయిన్ లైలాకి మహేశ్వరీ కౌంటర్

  సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ సీజన్ 4 నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కి వింటేజ్ బ్యూటీగా మహేశ్వరీ వచ్చింది. నీకోసం, పెళ్లి వంటి మూవీస్ తో హిట్ కొట్టి ఆడియన్స్ ని మెస్మోరైజ్ చేసిన హీరోయిన్..ఆమె ఇన్నాళ్లకు బుల్లితెర మీదకు ఎంట్రీ ఇచ్చింది. అలాగే మరో క్యూట్ అండ్ బబ్లీ హీరోయిన్ లైలా...1997 లో "ఎగిరే పావురమా" మూవీతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఘన విజయం సాధించి ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ షో హోస్ట్ రవి ఐతే మహేశ్వరితో ఒక డైలాగ్ వేసాడు. "పెళ్లి మీద ఎలాంటి అభిప్రాయం లేని నాకు మీరు నటించిన పెళ్లి మూవీ వలన పెళ్లి మీద ఒక మంచి అభిప్రాయం వచ్చింది" అని చెప్పాడు. అలాగే ఇక మహేశ్వరీ ఐతే ఇంకో డైలాగ్ చెప్పింది. "వర్షం పడడానికి చేస్తారు యాగం..ఈరోజు పక్కా గెలిచేది మా పడమటి సంధ్యా రాగం" అంటూ మంచి ఫోర్స్ తో డైలాగ్ చెప్పింది. తర్వాత ఈ షో స్టేజి మీదకు లైలా వచ్చి "హలో రవి" గారు అనేసరికి ఎంత క్యూట్ గా మాట్లాడుతున్నారో అంటూ పొంగిపోయాడు. అమ్మాయిగారు టీమ్ ని గెలిపించడానికి లైలా వచ్చింది. ఇక రవికిరణ్ ఎక్కడ ఉన్నాడో చూపించాలంటూ హోస్ట్ రవి ఒక టాస్క్ ఇచ్చాడు. ఈ స్టేజి మీద ఇక మహేశ్వరీ వెర్సెస్ లైలా అని రవి చెప్పాడు. "నా దగ్గర రేస్ గుర్రాలు ఉన్నాయి" అని చెప్పింది లైలా. "అయ్యో పాపం లైలా నా దగ్గర గెలుపు గుర్రాలున్నాయి" అంటూ మహేశ్వరీ కౌంటర్ డైలాగ్ వేసింది. ఐతే లాస్ట్ లో రెండు  సీరియల్స్ కంటెస్టెంట్స్ కలిసి టాస్కులు ఆడుతుంటే మహేశ్వరీ సీరియస్ గానే వాళ్ళను ఫాలో అవుతూ ఉంది కానీ లైలా మాత్రం మొబైల్ మునిగిపోయి కనిపించింది. "లైలా గారు" అంటూ రవి గట్టిగ అరిచేసరికి లైలా ఒక్కసారిగా ఉలిక్కిపడి రవి వైపు చూసింది. "మా సీరియల్ వాళ్ళు గెలిచాక ఎలా సెలెబ్రేట్ చేసుకోవాలా అని గూగుల్ లో సెర్చ్ చేస్తున్నా" అని చెప్పింది. వెంటనే మహేశ్వరీ "ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది" అంటూ కౌంటర్ వేసింది.

కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసిన మసూద మూవీ నటుడు తిరువీర్

  సిల్వర్ స్క్రీన్ మీద తిరువీర్ అనే నటుడు ఇప్పుడిప్పుడే తన మార్క్ వేసుకుంటూ వెళ్తున్నాడు. పలాస మూవీలో అలాగే జార్జి రెడ్డి చిత్రంలో తిరువీర్ నటన అద్భుతంగా పండింది. నవరసాలను పండించడంలో ఆయనకు ఆయనే సాటి. ఐతే సిన్ అనే మూవీలో నటన తనకు మంచి గుర్తింపు తెచ్చింది. అలాగే మసూద అనే థ్రిల్లర్ మూవీలో ఐతే ఆయన నటనకు ఫుల్ మార్క్స్ పడ్డాయి. అలాంటి తిరువీర్ సెలెక్టీవ్ గా మంచి మూవీస్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇక ఇప్పుడు "ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో" అనే మూవీలో ఫోటోగ్రాఫర్ రోల్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అలాంటి తిరువీర్ రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో కొన్ని పిక్స్ పెట్టాడు. "రెండు దశాబ్దాల కల, అమ్మ చివరి కోరిక" అని పోస్ట్ చేసి సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నా అన్న ఫీలింగ్ ని ఎక్స్ప్రెస్ చేసాడు. తన కొత్త ఇంటికి గృహప్రవేశం ఫొటోస్ ని పోస్ట్ చేసాడు. నెటిజన్స్ కూడా కంగ్రాట్యులేషన్స్ అంటూ విషెస్ చెప్పారు. ఇక యాంకర్ గాయత్రీ భార్గవ్ కూడా కామెంట్ చేసింది. "ఇల్లు కటి చూడు, పెళ్లి చేసి చూడు. అంత శుభమే జరుగుతుంది. హ్యాపీ హోమ్" అని చెప్పింది. అలాగే జబర్దస్త్ కమెడియన్ అభి కూడా కంగ్రాట్యులేషన్స్ చెప్పాడు. స్టేజి షోస్ , నాటకాల్లో నటిస్తూ సిల్వర్ స్క్రీన్ మీదకు అడుగుపెట్టాడు తిరువీర్ . ఇక "ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో"  అనే మూవీలో తిరువీర్ ఒక ఫోటోగ్రాఫర్ రోల్ లో నటిస్తున్నారు. రాహుల్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఈ మూవీ వస్తోంది. ఐతే ఇది పూర్తి కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతోందన్న విషయం చెప్పాడు తిరువీర్.. ఇప్పుడు ఈ నటుడు బ్యాక్ టు బ్యాక్ కొన్ని సెలెక్టీవ్ అండ్ ఆడియన్స్ కి హార్ట్ టచ్ అయ్యే మూవీ కంటెంట్ తో రాబోతున్నాడు.

సుప్రీతా డ్రెస్ మీద యాదమ్మ రాజు కామెంట్స్...

  చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే ఈ వారం షోలో యాదమ్మ రాజు - సుప్రీతా కామెడీ మాములుగా లేదు. యాదమ్మ రాజు నార్మల్ గా ఫుల్ డ్రెస్ వేసుకొచ్చాడు. కానీ సుప్రీతా మాత్రం చాలా పొట్టి డ్రెస్ వేసుకొచ్చింది. దాంతో యాదమ్మ రాజు ఆమె డ్రెస్సింగ్ స్టైల్ మీద కామెంట్స్ చేసాడు. "ఏంటి డాన్స్ మొత్తం హుషారుగా చేసి అంత డల్ ఇపోయావ్" అని అడిగింది సుమ. "మొన్న ఇక్కడ నా వంటకు సెకండ్ ప్లేస్ ఇచ్చారు. ఇదే ఊపుతో ఇంటికి వెళ్లి వంట చేసి మా ఆవిడకు పెట్టాను..ఇప్పటికి మూడు రోజులయ్యింది మాట్లాడక" అన్నాడు బాధపడుతూ యాదమ్మ రాజు. "ఎవ్వరైనా సరే నీ వంట తిన్నవాళ్ళు నీతో మాట్లాడరు" అని చెప్పింది సుమ. దానికి యాదమ్మ రాజు "అర్జెంటుగా డ్రెస్ మార్పించండి" అన్నాడు. దానికి సుమ "నా డ్రెస్సా" అన్నది. మీది కాదు ఈమెది అంటూ సుప్రీతా వైపు చూపించాడు. "ఆమె డ్రెస్సు ఆమె ఇష్టం ఆమెకు ఎం కావాలో అది వేసుకుంటుంది" అంది సుమ. "అసలు కెమెరా మ్యాన్ ఒకటో రెండో క్లోజులు నాకు పెడుతున్నాడు. ఈ సుప్రీతా ఇలాంటి డ్రెస్సులు వేసుకొస్తే అప్పుడు ఫోకస్ మొత్తం అటే పెడతారు" అంటూ ఫీలయ్యాడు. తర్వాత సుప్రీతా యాదమ్మ రాజు భుజం మీద చెయ్యేసి గారంగా, ముద్దుగా "రాజు ఫీలవ్వకు రాజు" అంది. సరే మన ఆడియన్స్ కోసం ఒక ప్రాణం చెయ్యి రాజు..అంటూ అతనితో ప్రమాణం చేయించింది. " యాదమ్మ రాజు అనే నేను ఇన్నాళ్లు సుప్రీతా టాలెంట్ వల్ల, అందం వల్ల గెలిచామని..ఈరోజు మేం గెలవకపోతే నేను పచ్చి మంచినీళ్ళైనా ముట్టుకోను అని" రాజు చెప్పేసరికి "పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టనని చెప్పావ్" అని సుమ బాగా ఎగ్జాయిట్ అయ్యేసరికి "అంటే మందు తెచ్చాను" అని కౌంటర్ వేసాడు. దాంతో వెళ్ళిపో ఇక్కడి నుంచి అంటూ చెప్పి వల్ల పోడియం దగ్గరకు పంపేసింది.  

Illu illalu pillalu : విశ్వని కొట్టిన ధీరజ్.. చందుని అరెస్ట్ చేసిన పోలీసులు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -111 లో....విశ్వ కోపంగా ప్రేమని కొట్టబోతుంటే అది రామరాజుకి తగులుతుంది. అందరు షాక్ అవుతారు. మా నాన్ననే కొడతావా అని విశ్వ పైకి ధీరజ్ వెళ్తుంటే అందరు ఆపుతారు. రామరాజు గొడవని సర్దుమనిచి లోపలికి వెళ్తాడు. అయినా ధీరజ్ మాత్రం నా తండ్రిపై చెయ్యేస్తావా అంటూ కోపంగా ఉంటాడు. విశ్వ బయటకి వెళ్తుంటే తన వెనకాల ధీరజ్ వెళ్తుంటాడు. అది చూసి తిరుపతి టెన్షన్ పడుతూ ఏం జరుగుతుందో అని వెనకాలే వెళ్తాడు. అన్ని గొడవలకి కారణం నేనే అంటూ ప్రేమ బాధపడుతుంది. వేదవతి వచ్చి ప్రేమతో మాట్లాడుతుంది. ఆ తర్వాత నర్మద వచ్చి ప్రేమతో మాట్లాడుతుంది. నాకు వంటలో హెల్ప్ చేయమంటు డైవర్ట్ చేస్తుంది. ఆ తర్వాత తిరుపతి చందుకి ఫోన్ చేసి విశ్వ దగ్గరికి ధీరజ్ కోపంగా వెళ్తున్నాడని చెప్తాడు. దాంతో ధీరజ్ దగ్గరికి చందు బయల్దేరతాడు. ధీరజ్ విశ్వ దగ్గరికి వెళ్లి గొడవపడతాడు. తిరుపతి ఎంత ఆపినా కూడా దీరజ్ ఆగడు. మరొక వైపు ప్రేమ, నర్మద  కబుర్లు చెప్పుకుంటూ వంట చేస్తుంటారు.  ధీరజ్ గొడవ పడుతున్న దగ్గరికి చందు వస్తాడు. తను కూడా దీరజ్ ని ఆపుతాడు అయినా వినకుండా విశ్వని కొడతాడు. తరువాయి భాగంలో తిరుపతి, చందు ఇద్దరు వస్తుంటే పోలీసులు చందుని అరెస్ట్ చేస్తారు. మీరు విశ్వ అనే అబ్బాయి ని కొట్టారని కంప్లైంట్ ఇచ్చారని పోలీసులు చెప్తారు. దాంతో తిరుపతి వెంటనే రామరాజుకి ఫోన్ చేసి విషయం చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.