తెలంగాణ ప్రభుత్వానికి ఆ పశుపక్ష్యాదుల ఏడుపులు వినిపించడం లేదా ....ప్రశ్నించిన రష్మీ

  హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూ ఎంతలా వైరల్ అవుతోందో మనందరం చూస్తూనే ఉన్నాం. అక్కడ చనిపోతున్న పశువులు, పక్షుల హాహాకారాలు కూడా వింటూనే ఉన్నాం. దీనిపై ప్రకృతి ప్రేమికులు కూడా స్పందిస్తున్నారు. అలాగే రీసెంట్ గా యాంకర్ రష్మీ కూడా స్పందిస్తూ ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. "నేను డెవలప్మెంట్ కి విరుద్ధంగా ఈ వీడియోని పోస్ట్ చేయడం లేదు. హెచ్సియులో జరుగుతున్న పోరాటం గురించి అందరికీ తెలుసు. ఆల్ ఐస్ ఇన్ హెచ్సియు అని సోషల్ మీడియాలో చాలామంది  పోస్ట్ చేస్తున్నారు. నేనిప్పుడు కంఫర్టబుల్ గా నా అపార్ట్మెంట్ లో కూర్చుని ఈ వీడియో చేస్తున్నాను. ఐతే నాకు తెలుసు..ఈ అపార్ట్మెంట్ కట్టేటప్పుడు ఎన్ని చెట్లను నరికేసి ఉంటారో అని ఎన్ని జంతువులకు హాని చేశారో అని. ఇక్కడ కూర్చుని నేను ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్పడం ఈజీనే. ఐతే నాకు ఈ యూనివర్సిటీ వివాదం ఏంటో లీగల్ గా ఇష్యూస్ ఏంటో నాకు అవగాహన లేదు. ఒక సామాన్య పౌరురాలిగా నేను రాత్రి డెవలప్మెంట్ వీడియో చూసాను అందులో ఎన్నో పక్షులు, మూగజీవాల ఏడుపులు చూసాను. అక్కడ నెమళ్ళు, లేళ్ళు, పక్షులే కాకుండా ఆ అడవిని అంటి పెట్టుకుని ఎన్నో జీవజాతులు నివసిస్తున్నాయి. అసలు ఎండాకాలం ఇలాంటి సమయంలో మనం కూడా వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాటి ఇంటి నుంచి వాటినే తరిమేయడం ఎంతవరకు న్యాయం. ఒకసారి మీరే ఆలోచించండి. వాటికి పునరావాసం కల్పించే శక్తిసామర్ద్యాలు ఉన్నది మీ ఒక్కరికే సర్. మీరు ఆ పశుపక్ష్యాదులను దృష్టిలో పెట్టుకుని ఒక పాజిటివ్ అప్ప్రోచ్ తో నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను." అంటూ బాధాతప్త హృదయంతో చెప్పింది రష్మీ.

నాకు 44 ...రేపోమాపో పోతాను..ఫ్యూచర్ జనరేషన్ పిల్లలకు గాలి, నీరు అవసరం

  అడవి అంటే చిన్నప్పుడు చెప్పుకున్న చందమామ కథలే గుర్తొస్తాయి.. అడవిలో ఉండే పక్షులు, పశువులు, జింకలు, లేళ్ళు, నెమళ్ళు, చిలకలు వాటి గురించి విన్నప్పుడు మనం కూడా అలా స్వేచ్ఛగా ఉంటె బాగుంటుంది కదా అని అనుకోని పిల్లలు, పెద్దలు ఎవరూ ఉండరు. కానీ ఇప్పుడు అలాంటి ఒక అడవి ఆపదలో పడింది. నెమళ్ళ హాహాకారాలు చేస్తున్న వీడియో చూస్తున్న గుండెలు పగిలిపోయేంత బాధాగా ప్రతీ ఒక్కరూ కన్నీళ్లు పెడుతున్నారు. అదే ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్నా విషయం మీద సినీ సెలబ్రిటీస్ అంతా గళం విప్పుతున్నారు. రష్మీ దీని గురించి మాట్లాడగా ఇప్పుడు రేణు దేశాయ్ చెప్పిన మాటలు వింటే ఉఫ్...ఎవరికైనా మనసు చలించక మానదు. "ఒక తల్లిగా మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు ఎలాగో నా వయసు 44 ..రేపో మాపో పోతాను. కానీ నా పిల్లలు ఉన్నారు. వాళ్ళ లాంటి పిల్లలు ఎందరో ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు చాలా ఉంది. ఆక్సిజన్, నీళ్లు చాలా అవసరం అవుతాయి. డెవలప్మెంట్ అవసరం లేదు అని చెప్పడం లేదు..చాల అవసరం. మనకు మన బిల్డింగ్స్ కావాలి, ఐటి పార్కులు కావాలి..వీలయితే ఈ ఒక్క 400 ఎకరాలు వదిలేయమని మీ రాష్ట్ర పౌరురాలిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. మన దగ్గర చాలా బంజరు భూమి ఉంది డెవలప్ చేసుకోవడానికి. మీకు చెప్పేంత దాన్ని కాదు. మీరంతా ఎక్స్పర్ట్స్ ఇందులో. ఒక తల్లిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ముసలిదాన్ని ఐపోయాను. ఒక్కసారి మీరు మళ్ళీ దీని గురించి ఆలోచించండి. మనల్ని కాపాడుతున్న ఆ భూమి ఆ ఎకో సిస్టం ఎంతో అవసరం మనకు. మీరు మళ్ళీ మళ్ళీ ఒకసారి ఆలోచించండి. మంత్రులకు, నేతలకు మరొకసారి రిక్వెస్ట్ చేసి వేడుకుంటున్నాను...అది ఫాసిల్ ఐతే గనక ఆ భూమిని వదిలేయండి దయచేసి. మేమెప్పుడూ మీకు రుణపడి ఉంటాము." అంటూ రేణు దేశాయ్ ఎంతో హృదయవిదారకంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల గురించి వేడుకుంటూ ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో రిలీజ్ చేసింది.

Brahmamudi: కూతరు కోసం మాట మార్చుకున్న యామిని తండ్రి.. రాజ్, కావ్య కలుస్తారా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి(Brahmamudi)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-684లో.. రాజ్, కావ్య కలుద్దామని అనుకుంటారు. ఆ సమయంలోనే యామిని వాళ్ళ నాన్న దగ్గరికి రాజ్ వస్తాడు. అంకుల్ నా జీవితంలో ఇంకెవరినైనా నేను మిస్ అవుతున్నానా.. అంతకముందు నా గతంలో ఇంకెవరైనా ఉన్నారా.. అని అడిగినప్పుడు యామినీ తండ్రి నిజం చెప్పబోతాడు కానీ వైదేహి అడ్డుపడి.. ఎవరుంటారు బాబు.. యామినీతోనే నువ్వు ఎక్కువ తిరిగే వాడివి.. ఎక్కువగా ఉండేవాడివి. మాకు తెలియకుండా ఎవరుంటారని అబద్దం చెప్పి కవర్ చేస్తుంది. ఆ తర్వాత భర్తవైపు కోపంగా చూసిన వైదేహి‌.. నిజం చెప్పబోయాడని యామినీతో చెప్తుంది. ఏంటి డాడీ ఇది.. నా లైఫ్‌ని ఏం చెయ్యాలి అనుకుంటున్నావ్.. నేను ఎలాంటి పరిస్థితుల నుంచి బయటపడ్డానో తెలిసి కూడా నాకే ద్రోహం చెయ్యాలనుకుంటున్నావా అని యామినీ రెచ్చిపోతుంది. నేను నీ తండ్రిని బేబీ.. నీకు నేను ద్రోహం చేస్తానా అని అతను అంటాడు. మరి రామ్ అలా అడగ్గానే కావ్య గురించి ఎందుకు చెప్పాలనుకున్నావని అంటుంది. రాజ్ అలా బాధపడుతుంటే అని యామినీ తండ్రి చెప్తాడు. రాజ్ కాదు రామ్.. గుర్తు పెట్టుకో డాడీ.. రాజ్ కాదు రామ్ అంటూ అరుస్తుంది. అదే బేబీ.. అబ్బాయి వచ్చి నా ముందు అలా బాధపడుతూ అడుగుతుంటే ఏదో తప్పు చేసినా ఫీలింగ్ వచ్చింది. భార్యభర్తలను విడదీయడం పాపమనిపించింది. తనకు గతం గుర్తులేకపోయినా కావ్యను చూడగానే ఏదో తెలిసిన మనిషిలా ఫీల్ అవుతున్నాడంటే తన భార్యను ఎంతగా ప్రేమించి ఉండాలి. అందుకే గిల్టీగా అనిపించి అని యామినీ తండ్రి నసుగుతుంటే.. నిజం చెప్పేద్దామనుకున్నావ్ అంతే కదా.. రామ్ కళ్లల్లో ప్రేమని చూశావ్.. మరి నా పరిస్థితి నీకు కనిపించడం లేదా అని యామిని కోప్పడుతుంది. వెంటనే ఆవేశంగా చుట్టూ చూసి కత్తి చేత్తో పట్టుకుని.. డాడీ.. నా ప్రేమను అర్థం చేసుకోకపోయినా.. నా రామ్‌ని నా నుంచి దూరం చేయడానికి ప్రయత్నించినా.. వాళ్లను నేను క్షమించనంటూ యామిని ఊగిపోతుంది. బేబీ ఏం చేస్తున్నావ్ నువ్వు.. ఆయన మీ నాన్నా అని వైదేహి అంటుంది. కంగారు పడకు మమ్మీ.. తండ్రిని చంపేంత శాడిజం నాలో లేదు.. కానీ రామ్ దక్కకపోతే నన్ను నేను చంపుకోవడానికి కూడా అసలు ఆలోచించనని యామిని అంటుంది. నాకంటే ఆ రాజ్, కావ్యల ప్రేమే ఎక్కువ అనుకుంటున్నారుగా.. నన్ను చావనివ్వండి అని యామినీ అంటుండగా.. వెంటనే యామినీ తండ్రి ఆవేశంగా యామినీ చేతిలోని కత్తిలాక్కుని కిందపడేస్తాడు.  నాకు నా కూతురుకంటే ఏది ఎక్కువ కాదు బేబీ అని అరుస్తాడు. వెంటనే యామినీ ముఖంలో నవ్వు వస్తుంది. అవును బేబీ.. నీ తర్వాతే ఎవరైనా.. నీ మీద ఒట్టు.. రామ్‌తోనే నీ పెళ్లి అనేసి యామినీ తలపై ఒట్టు వేస్తాడు. దాంతో యామినీ సైకోలా నవ్వుకుంటుంది. మరోవైపు రేపు ఏం మాట్లాడాలి.. ఎలా మాట్లాడాలి.. ఏం అడగాలి?’ అని రాజ్ తపిస్తుంటే.. రేపు ఆయన ఏం అడుగుతారు.. ఏం మాట్లాడతారని కావ్య ఆలోచిస్తుంది. ఇక తెల్లారి రాజ్ రెడీ అయిపోయి మెల్లగా ఇంట్లోంచి జారుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ యామినీ తండ్రి, తల్లి రాజ్‌ని చూసి ఎక్కడికి బాబు అని అడుగుతారు. యామినీ ఏది ఆంటీ అని రాజ్ అడుగగా.. ఇంకా లేవేలేదు బాబు అని వైదేహీ అంటుంది. హమ్మయ్యా.. అని మనసులో అనుకున్న రాజ్.. నిన్నటి నుంచి మనసు ఏదోలా ఉంది ఆంటీ.. అమ్మ నాన్న గుర్తొచ్చారని అంటాడు. యామిని తల్లి షాక్ అవుతుంది. కాసేపు వెళ్లి సమాధుల దగ్గర కూర్చుని వచ్చేస్తానని రాజ్ అనగానే.. గతం గుర్తు రాలేదులే అని యామిని పేరెంట్స్ కూల్ అవుతారు. ఇక మరోవైపు కావ్య అందంగా రెడీ అయ్యి, మల్లెపూలు పెట్టుకుని ఆఫీస్‌కి వెళ్లొస్తానని అబద్దం చెప్పి ఇంటి దగ్గర నుంచి బయలుదేర్తుంది. అయితే కావ్య అబద్దం చెప్పిందేమోనని రాజ్ దగ్గరకు వెళ్తుందేమోననే అనుమానంతో రుద్రాణీ, రాహుల్ మరో కారులో కావ్యను ఫాలో చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu : చందు, శ్రీవల్లిల పెళ్ళి పత్రికలో వాళ్ళ పేర్లు.. మురిసిపోయిన వేదవతి!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -121 లో..... రామరాజు ఇంటికి వస్తుంటే ఉల్లిపాయలు అమ్మే వ్యక్తి తమ వీధిలోకి వస్తుంటాడు. అతని దగ్గరున్న మైక్ ని తీసుకొని భద్రవతి కుటుంబానికి వినపడేలా.... మా పెద్ద కొడుకు చందుకి పెళ్లి ఫిక్స్ అయింది.. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని సంబంధాలు చెడగొట్టినా మా వాడికి పెళ్లి జరగబోతుందని మైక్ లో మాట్లాడతాడు. ఆ మాటలు విని భద్రవతి కుటుంబం కోపంతో రగిలిపోతుంది. మన ఇంటి ఆడబిడ్డలని మోసం చేసి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్లారని భద్రవతి కోప్పడుతుంది. ప్రేమ వాడిని పెళ్లి చేసుకొని ఏం సంతోషంగా ఉందని రెస్టారెంట్ లో పని చేస్తుందని రేవతి బాధపడుతుంది. ప్రేమ, ధీరజ్ లు మామిడి తోరణం కడుతుంటే అప్పుడే ప్రేమ నానమ్మ శారదాంబ చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరే ఈ రెండు కుటుంబాలని కలపాలని అనుకుటుంది. ప్రేమ ధీరజ్ తోరణం కడుతుంటే ఇద్దరు పడిపోయి ఒకరిపై ఒకరు పడిపోతారు. ఇద్దరు రొమాంటిక్ గా చూసుకుంటారు.. నువ్వు నన్ను కావాలనే పడేసావని ధీరజ్ తో ప్రేమ గొడవపడుతుంది. ఆ తర్వాత రామరాజుతో సహా అందరు హాల్లో కూర్చొని ఉంటారు. నర్మద పెళ్లి పత్రిక చదువుతుంది. అందులో వేదవతి అమ్మనాన్నల పేర్లు ఉండడంతో వేదవతి హ్యాపీగా ఫీల్ అవుతుంది. మా అమ్మనాన్న పేర్లు కొట్టించారని వేదవతి అంటుంది. నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే కారణం మీ నాన్న అని రామరాజు అంటాడు. మావయ్యకి మా కుటుంబం అంటే ప్రేమ ఉంది కానీ వాళ్ళు పగ అంటూ కోపంగా ఉన్నారని ప్రేమ అనుకుంటుంది. మరొకవైపు నీకు కాబోయే భర్తకి ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మని చెప్పమని శ్రీవల్లితో భాగ్యం చెప్తుంది. చందుకి శ్రీవల్లి ఫోన్ చేసి.. కలవాలి.. మాట్లాడాలని అంటుంది. తరువాయి భాగంలో చందు,శ్రీవల్లిల పెళ్లి పత్రికలో నర్మద, సాగర్ ల పేర్లు రాసి నర్మద మురిసిపోతుంటే ప్రేమ వచ్చి చూస్తుంది. పెళ్లి పత్రిక అనేది ఒక జ్ఞాపకం.. అది మనకి అదృష్టం లేదని ప్రేమతో నర్మద చెప్తూ ఎమోషనల్ అవుతుంది. అదంతా వేదవతి చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : శివన్నారాయణ ముందు దీప పెట్టిన సాక్ష్యం.. రమ్య బిడ్డకి తండ్రి ఎవరంటే!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-320 లో.....దీప వెళ్తుంటే ఒక కార్ తన ముందు ఆగుతుంది. తీరా చూస్తే అందులో నుండీ శ్రీధర్ దిగుతాడు. ఎక్కడికి వెళ్తున్నావ్ ఇంకా ఏమైనా చెడగొట్టేటివి ఉన్నాయా పచ్చని కాపురంలో చిచ్చు పెట్టేవి ఉన్నాయా అని దీపతో శ్రీధర్ వెటకారంగా మాట్లాడతాడు. తనకి సమాధానం చెప్పి దీప వెళ్ళిపోతుంది. అయినా ఈ దీప ఈ ఏరియాలో ఉందేంటని శ్రీధర్ అనుకుంటాడు. ఆ తర్వాత శౌర్య స్కూల్ కి రెడీ అవుతుంటే కార్తీక్ వస్తాడు. దీప ఎక్కడ అని కార్తీక్ అడుగుతాడు. దీప ఇంటికి రాలేదని కాంచన అంటుంది. అయితే దీప ఎక్కడికి వెళ్లిందని ఆలోచిస్తాడు. శౌర్యా స్కూల్ బస్ వస్తుంది. నువ్వు వెళ్ళు అని బయటకు పంపిస్తాడు. అమ్మ దీప కన్పించడం లేదు రెస్టారెంట్ లో కూడా లేదని కాంచనతో కార్తీక్ చెప్తాడు. అయ్యో ఏమైందని కాంచన అడుగుతుంది. ఏముంది మీ నాన్న దీపని అనాల్సిన మాటలు అని వెళ్ళిపోయాడని కార్తీక్ చెప్తాడు. దీప వెళ్తుంటే గౌతమ్ మోసం చేసిన అమ్మాయి రమ్య ఎదరుపడుతుంది. తనతో గౌతమ్ గురించి చెప్తుంది. నువ్వు నాతో రావాలని తనతో జరిగింది చెప్తుంది.. అదంతా శ్రీధర్ చూసి ఇది మనకి ఉపయోగపడేలా ఉందని పారిజాతానికి ఫోన్ చేసి దీప ఎవరో అమ్మాయితో మాట్లాడతుందని చెప్తాడు. కానీ పారిజాతం ఫోన్ లిఫ్ట్ చేసింది జ్యోత్స్న.. శ్రీధర్ చెప్పింది అంత విని థాంక్స్ మావయ్య అని అంటుంది. దీప సాక్ష్యం తీసుకొని వస్తుంది కావచ్చని జ్యోత్స్న అనుకుంటుంది. రమ్యని తీసుకొని శివన్నారాయణ ఇంటికి వస్తుంది దీప. మీకు సాక్ష్యం కావాలన్నారు కదా ఇదిగో సాక్ష్యం ఈ అమ్మాయినే గౌతమ్ మోసం చేసాడు. ఇప్పుడు తన కడుపులో బిడ్డ కి తండ్రి గౌతమ్ అని దీప చెప్తుంది.. ఆ మాట నువ్వే చెప్పమని రమ్యకి దీప చెప్తుంది. ఎందుకు అంత సాగదీస్తున్నావని పారిజాతం అంటుంది. నా కడుపు లో బిడ్డకి తండ్రి అని రమ్య చెప్పబోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : రామలక్ష్మి కన్నకూతురని కనిపెట్టేస్తారా.. కేక్ కట్ చేసిన మాణిక్యం, సుజాత!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -367 లో... రామలక్ష్మిని తన పుట్టింటికి తీసుకొని వస్తాడు సీతాకాంత్. అక్కడ రామలక్ష్మిని సుజాత, మాణిక్యం చూసి షాక్ అవుతారు. నా కూతురు బ్రతికే ఉందని మాణిక్యం హ్యాపీగా ఫీల్ అవుతుంటే.. నేను మీ కూతురిని కాదు నా పేరు మైథిలీ అని చెప్తుంది. అయిన మాణిక్యం సుజాత వినిపించుకోకుండా రామలక్ష్మి అంటుంటారు. నువ్వు కూడా తను రామలక్ష్మి కాదని నమ్ముతున్నావా అని సీతాకాంత్ తో మాణిక్యం అంటాడు. తను రామలక్ష్మి అని మనసుకి తెలుసు కానీ తనే వినిపించుకోవడం లేదని సీతాకాంత్ అంటాడు. ఈ రోజు వాళ్ళ పెళ్లి రోజు వాళ్ళని బాధపెట్టకండి అని సీతాకాంత్ తన అత్తమామలకి బట్టలు తీసుకొని వచ్చి రామలక్ష్మి చేతుల మీదుగా వాళ్ళకి ఇప్పిస్తాడు. వెళ్లి మార్చుకోండి అని వాళ్ళను పంపిస్తాడు. మరొక వైపు రామ్ గేమ్ ఆడుతుంటాడు. ఎప్పుడు గేమేనా అంటూ శ్రీలత కోప్పడుతుంది. నేనంటే ఎందుకు ఇష్టం లేదని చెప్పావ్.. నీకు ఏం చేస్తే నచ్చుతానని రామ్ తో రమ్య అంటాడు. నువ్వు సీతా పక్కన సెట్ కావని రామ్ కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సీతాకి నీకు పెళ్లి ఎలా చెయ్యాలో తెలుసు.. ఎవరు చెప్తే వింటాడో కూడా తెలుసని శ్రీలత అంటుంది. సుజాత, మాణిక్యం ఇద్దరు కొత్త బట్టలు వేసుకొని వస్తారు. కేక్ కట్ చేస్తారు. ఆ తర్వాత రామలక్ష్మికి జ్యూస్ ఇవ్వబోతుంటే రామలక్ష్మిపై పడుతుంది. దాంతో నా కూతురు గదిలో డ్రెస్ ఉంది మార్చుకోమని సుజాత చెప్తుంది. సుజాతని ఎవరో పిలస్తే బయటకు వెళ్తుంది. రామలక్ష్మి గదిలోకి వెళ్లి బీరువా తాళం తీసి డ్రెస్ మార్చుకుంటుంది. రామలక్ష్మి డ్రెస్ వేసుకొని బయటకు రాగానే.. అదేంటీ గదిలో ఉన్నాయని చెప్పాను.. బీరువా తాళం ఎక్కడ ఉందో చెప్పలేదు కదా అని సుజాత అంటుంది. అయ్యో పొరపాటుగా తీసేసానంటూ బీరువా తాళం దానికే ఉందని రామలక్ష్మి కవర్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

శ్రీదేవి డ్రామా కంపెనీ రేటింగ్ పెరగాలంటే ఇంద్రజను తీసేయాలి

ప్రతీ ఆదివారం ఆడియన్స్ అలరిస్తున్న షో శ్రీదేవి డ్రామా కంపెనీ. ఈ షోలో ఫిక్స్డ్ గా హోస్ట్ రష్మీ ఉంది జడ్జ్ గా ఇంద్రజ ఉంది. ఐతే నూకరాజు ఇంద్రజాను పట్టుకుని అనరాని మాట అనేశాడు. ఈ షో లేటెస్ట్ ప్రోమో చూస్తే అసలు ఏమన్నాడో అర్ధమవుతుంది. నూకరాజు ఇందులో వాస్తు పండిట్ గా గెటప్ వేసుకుని వాస్తు చెప్పడానికి వచ్చాడు. రాగానే "ఇంద్రజ గారి ఇంటికి గుమ్మడికాయ కట్టా ఆవిడ 116 రూపాయలు ఇచ్చింది" అన్నాడు. సూపర్ కదా నిజంగా అంటూ పక్కనే ఉన్న నరేష్ అనేసరికి "ఏంటి సూపర్ అంటున్నావ్... గుమ్మడికాయకు 200 లు అయ్యింది" అంటూ నిష్ఠూరాలు పోయాడు నూకరాజు. "ఇప్పుడు ఈ షో రేటింగ్ అలా పెరిగిపోవాలంటే ఎం చేయాలి గురువుగారు" అన్నాడు నరేష్. "ఏముంది ఇంద్రజాను తీసేయాలి" అన్నాడు నూకరాజు. దానికి ఇంద్రజ షాక్ కొట్టినట్టు నోరెళ్లబెట్టింది. "తీసేయాలి మీన్స్ ఆమెను అక్కడి నుంచి తీసేసి ఇంకొంచెం ముందుకు తీసుకురావాలి ఆమె సీటును" అన్నాడు. తర్వాత కొన్ని డైలాగ్స్ ఇచ్చి ఆ డైలాగ్ ఎవరికీ సెట్ అవుతుందో అక్కడ వాళ్ళ ఫోటో పెట్టాలి అని రష్మీ చెప్పింది. ఐతే "ఆమె పాడితే కోయిల పట్టినట్టు ఉంటుంది" అన్న డైలాగ్ కి అంజలి పవన్ వెళ్లి ఇంద్రజ ఫోటో అంటించింది. వెంటనే ఇంద్రజ "కోయిల పాట బాగుందా " అనే పాటను పాడి అలరించింది.  ఇక ఈ షోకి తమన్నా భాటియా వచ్చి కొన్ని డైలాగ్స్ చెప్పి షోలో అందరినీ నవ్వించారు. తర్వాత ఆదర్శ్ ఛత్రపతి శివాజీ గెటప్ లో వచ్చి పెర్ఫార్మెన్స్ చేసేసరికి "ఒక కింగ్    ఉంటారంటే ఇలా ఉంటారేమో అనిపించింది" అంటూ ఆదర్శ్ ని మెచ్చుకున్నారు.

చెప్పు తెగుద్ది...అక్కా చెల్లెళ్ళు లేరా నీకు...రష్మీ వార్నింగ్..

జబర్దస్త్ నెక్స్ట్ వీక్ ప్రోమో చూస్తే ఫుల్ కామెడీగా ఉండబోతోంది అన్న విషయం అర్ధమవుతోంది. ఇందులో బులెట్ భాస్కర్ - వర్ష చేసిన కామెడీ కాస్తా రష్మీ మీదకు మళ్ళేసరికి బులెట్ భాస్కర్ కి గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది రష్మీ. భాస్కర్ - వర్ష స్కిట్ చేశారు. "మన పెళ్లికి ఖుష్బూ గారు, శివాజీ గారు వచ్చారు కానీ రష్మీ రాలేదేమిటి" అని వర్ష అడిగింది. దానికి బులెట్ భాస్కర్ "మన పెళ్లి మార్చ్ 1 న జరిగింది. అది పెన్షన్ తీసుకునే రోజు అని తెలుసు కదా. ఏ 2 నో 3 నో పెళ్లి చేసుకుంటే పిలిచే వాళ్ళం" అన్నాడు. దానికి రష్మీ కౌంటర్ వేసింది. అంటే మీరు కూడా మీ పెన్షన్ ని మిస్ అయ్యారన్నమాట అనేసింది. ఆ మాటకు వర్ష రష్మీకి ఒక ఫ్లైయింగ్ కిస్ ఇచ్చేసింది. తర్వాత బులెట్ భాస్కర్ పక్కకు రా అన్న లెక్కలో కళ్ళతో సైగ చేసాడు. ఆ సైగకు ఫుల్ ఫైర్ అయ్యింది రష్మీ. "చెప్పు తెగుద్ది. సిగ్గు సెరం లేదా.. మీ ఇంట్లో అక్కా చెల్లెల్లు లేరా." అని అడిగింది. "వదిన లేదని బాధపడుతున్నా" అన్నాడు భాస్కర్. దానికి రష్మీ, శివాజీ నవ్వేశారు. ఇక ఈ స్కిట్ లో నాటీ నరేష్ ఐతే భాస్కర్ ని పిచ్చకొట్టుడు కొట్టాడు. "తినే ప్రతీ మెతుకు మీద వాడి పేరు రాసి ఉంటుంది తెలుసా" అన్నాడు నరేష్.."దీని మీద బాస్మతి" అని రాసి ఉంది అంటూ కౌంటర్ వేసాడు భాస్కర్. ఆ మాటకు చెంపల మీద దబిడిదిబిడి వాయించాడు నరేష్. ఇక ఈ షో ప్రోమోలో రామ్ ప్రసాద్ స్కిట్ లో సీనియర్ కమెడియన్ షకలక శంకర్ కనిపించాడు. కానీ ఒక్క డైలాగ్ కూడా చెప్పినట్టు చూపించలేదు. దాంతో ఒక నెటిజన్ ఫైర్ అయ్యారు. సీనియర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వండి అంటూ కామెంట్ చేశారు.

Priyanka Jain Breakup : ప్రియుడు చెప్పిన బ్రేకప్ పై ప్రియాంక జైన్  సీరియస్.. సోషల్ మీడియాలో వైరల్!

ప్రియాంక జైన్ బిగ్ బాస్ షో తో తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైంది. ఇక ఆమె ప్రియుడు శివ్ కుమార్ తో కలిసి యూట్యూబ్ లో రెగ్యులర్ గా వ్లాగ్స్ చేస్తుంటారు. తాజాగా ఓ వ్లాగ్ చేసి ఓ‌ విషయంపై క్లారిటీ ఇచ్చారు. అదేంటంటే  ‘కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ 2’ షోకి శివ్ కుమార్ వెళ్లాడు. అక్కడ ప్రియాంక జైన్‌కి బ్రేకప్ చెప్తున్నట్టుగా ప్రాంక్ కాల్ చేశారు. ఈ విషయాన్ని పెద్ద వాళ్ల దృష్టికి తీసుకుని వెళ్తానంటూ ప్రియాంక జైన్ సీరియస్ అయ్యింది. ప్రాంక్ చేయమంటే.. నీకు బ్రేకప్ అనే మాట ఎలా వచ్చిందని ప్రియాంక జైన్ సీరియస్ అయిపోయింది. ఇది ప్రాంక్ అని ఎవరు చెప్పారు.. నేను సీరియస్‌గా చెప్తున్నానని అన్నాడు శివ్ కుమార్. నువ్వు సీరియస్‌గా చెప్పడం కాదు.. నేను సీరియస్‌గానే చెప్తున్నా.. ఇప్పుడు నేను నీకు నిజంగానే బ్రేకప్ చెప్తున్నా.. ఆల్ ది బెస్ట్ నీ బతుకు నువ్వు బతుకు అని శివ్ కుమార్‌కి ట్విస్ట్ ఇచ్చింది ప్రియాంక జైన్. అయితే వీళ్ల బ్రేకప్‌తో ‘కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ 2’ ప్రోమో ట్రెండింగ్ లోకి వెళ్ళింది. ప్రియాంక జైన్, శివ్ కుమార్‌ల బ్రేకప్ న్యూస్ నెట్టింట వైరల్ అయ్యింది. శివ్ కుమార్ ఆ వ్లాగ్ లో అసలేం జరిగిందో చెప్పాడు. నేను షూటింగ్‌కి వచ్చేసరికి రాత్రి 1 అయ్యింది. అప్పటికి ప్రియాంక గారు ఇంట్లో లేరు. మీ అందరికీ తెలుసు.. తనకి బ్రేకప్ చెప్తున్నట్టుగా ప్రాంక్ చేశారు. అది ప్రోమో కూడా వచ్చింది. స్టేజ్‌పై నుంచే ప్రియాంక గారికి ఫోన్ చేసి ప్రాంక్ చేయాలని అన్నప్పుడు.. వాళ్లు చెప్పినట్టే నేను ప్రాంక్ చేశాను. కానీ ప్రియాంక గారు దాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఫోన్ తీయడం లేదు. ఇప్పుడు ఆమెను కలిసి.. ఆమెతో మాట్లాడకపోతే.. నాకు నిద్ర పట్టదు. చాలా టెన్షన్ పడుతూ ఉన్నాను. ప్రోమోలో ఆమె చాలా సీరియస్ అయ్యారు. చూసే వాళ్లు కూడా నన్ను తిట్టుకోవద్దు. అది జస్ట్ ప్రాంక్‌లో భాగంగానే చేశాను. నేను ఆమెను చాలా ప్రేమిస్తున్నాను.. ఆమె అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఆమె షూట్ నుంచి వచ్చిన తరువాత.. ఆమె రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలని శివ్ చెప్పాడు.  ప్రియాంక ఇంటికొచ్చాక శివ్ మీద చాలా సీరియస్ అయ్యింది. నువ్వు నన్ను ముట్టుకోకు శివ్.. చిరాకు వస్తుందని ప్రియాంక అంది. అరే.. ఎందుకిలా చేస్తున్నావని ఆమె వెనుకే వెళ్లాడు శివ్. దాంతో ప్రియాంక.. ఇది కూడా ప్రాంక్ అంటూ పెద్దగా నవ్వేసింది. నువ్వు నాపై ప్రాంక్ చేశావ్ కాబట్టి నేను కూడా ప్రాంక్ చేశాను. ప్రాంక్ చేస్తే నాకు ఎలా అనిపించిందో నీకు అనిపించాలనే ఇలా చేశాను.. ఇదంతా కాదు కానీ.. బ్రేకప్ అని ఎందుకు చెప్పావ్.. నాకు ఎంత మండిందో తెలుసా అని ప్రియాంక అంది. వాళ్లు చేయమన్నారు పరీ.. సారీ అంటూ ప్రియాంకకు సారీ చెప్పేసి దగ్గరకు తీసుకున్నాడు శివ్. ఇక ఈ వ్లాగ్ చివరల్లో ఓ సలహా ఇచ్చారు.  కామెడీకి కూడా మీ లవర్స్‌కి బ్రేకప్ చెప్పొద్దు.. దానికి చాలా దారుణంగా పనిష్మెంట్ ఉంటుంది. ఉదయం నుంచి ఆమె ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నాకెంత భయం వేసిందో తెలుసా.. దయచేసి ఎవరూ ఇలా చేయొద్దంటూ శివ్, ప్రియాంక జైన్ చెప్పుకొచ్చారు.  

ఆఫ్టర్ ప్యాకప్ అంటే అదా... నా లైఫ్ లో బావా అని పిలిచింది అతన్నే

బుల్లితెర మీద సుధీర్ గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. సుధీర్ యాంకరింగ్ ని అలాగే సుధీర్ కి రష్మీకి ఆన్ స్క్రీన్ బాండింగ్ గురించి అందరికీ తెలుసు. సుధీర్ చాలా డౌన్ టు ఎర్త్ అంటూ నెటిజన్స్ కూడా ఆయన్ని పొగుడుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే చాలామంది యాంకర్స్ మీద రూమర్స్ వచ్చాయి కానీ సుధీర్ మీద ఒక్క నెగటివ్ రూమర్ కూడా ఇప్పటి వరకు రాలేదు. ఎందుకంటే అంత కరెక్ట్ గా ఇచ్చి పని చేసుకుని వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఫామిలీ స్టార్స్ కి యాంకరింగ్ చేస్తున్నాడు. అలాగే తన మరదళ్ళుగా అష్షు రెడ్డి, స్రవంతి కూడా చేస్తున్నారు. ఐతే సుధీర్ గురించి అష్షు కొన్ని సెన్సేషనల్ విషయాలను చెప్పింది. "నా జీవితం మొత్తంలో నేను ఇప్పటి వరకు బావా అని పిలిచింది ఒక్క సుధీర్ నే. నాకు అంత కనెక్షన్ మా ఫ్యామిలీలో కూడా ఎవరితో లేదు. బావా అని ఫామిలీ స్టార్స్ లో సుధీర్ ని పిలిచేసరికి ఒక్కోసారి పొసెసివ్ నెస్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఎవరికీ నచ్చినా నచ్చకపోయినా ఆయన గురించి చెప్పాలంటే ఆయన అసలు ఒక టీవీ పర్సన్ కానే కాదు. అతనొక హీరో పర్సనాలిటీ. డాన్స్ , యాక్టింగ్ ఎన్ని ఎమోషన్ ని క్యాచ్ చేసేస్తారు. ఆయన ఎవరితో ఐనా జోవియల్ గా మాట్లాడే మనిషి. ఇంట్లో మనిషిలా ఉంటారు.  ఆయన మాట్లాడితే చాలు జోక్ ఎం లేకపోయినా ఎవ్వరైనా ఎంటర్టైన్ అవుతారు. ఫామిలీ స్టార్స్ లో ఆఫ్టర్ ప్యాకప్ అనే మాట సుధీర్ అంటూ ఉంటే చాలా ఫన్నీగా ఉంటుంది. కానీ అదే మాట వేరే యాంకర్స్ అంటూ ఉంటే కోపం వస్తుంది అలాగే ఏంటి ఆఫ్టర్ ప్యాకప్ అంటున్నారు అనాలనిపిస్తుంది. నా జీవితంలో నేను ఇంతవరకు ఎవరినీ చూడలేదు ఇలా సుధీర్ అంత రిజర్వ్ పర్సన్. అంటే వాళ్ళ ఫామిలీ రూట్స్ కూడా అలాగే ఉంటుంది. పెరిగే విధానం కూడా ఒకటి ఉంటుందిగా... స్టేజి మీద పులి... అదే స్టేజి దిగాక ఈ సెట్ లో సుధీర్ గారు ఉన్నారా ? అని అనిపిస్తుంది. వచ్చామా పని చేసుకున్నాము వెళ్ళామా అన్నట్టు ఉంటారు. కుటుంబానికి ఎక్కువ వేల్యూ ఇచ్చే పర్సన్. అలాంటి వ్యక్తులు ఈరోజున చాలా అవసరం. ప్రొఫెషన్ పరంగానే సుధీర్ తెలుసు కానీ ఆ తరువాత పర్సనల్ గా సుధీర్ అంటే తెలీదు. సుధీర్ చాలా తక్కువ మాట్లాడతాడు." అంటూ అష్షు రెడ్డి చెప్పుకొచ్చింది.

ఫీలైన ప్రదీప్ :  గురువు గారు గురువు గారు అని ఢీలో నా ప్లేస్ నొక్కేసావుగా 

  అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ ప్రొమోషన్స్ ని బాగా చేస్తున్నాడు ప్రదీప్ . ఇక రీసెంట్ గా "అనగనగా ఈ ఉగాదికి" షోకి వచ్చాడు. రాగానే హోస్ట్ నందు భరతనాట్యం స్టైల్ లో గురువు గారు ప్రదీప్ కి వంగి నమస్కరించాడు. దాంతో ప్రదీప్ కూడా షాకయ్యాడు. "మీరు  గురువు గారు గురువు గారు అని ఢీలో నా ప్లేస్ నొక్కేశారు" అంటూ ప్రదీప్ నవ్వుతూనే ఫీలయ్యాడు. దానికి హోస్ట్ నందు ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకున్నాడు. "మిమ్మల్ని రీప్లేస్ చేయలేను కానీ మీ ప్లేస్ లో చేయడం చాలా ఆనందంగా ఉంది..ఇది ఆ దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నా..మీరు సినిమాలు చేయాలి అలాగే త్వరగా మళ్ళీ మీ షోకి తిరిగి రావాలి అని ఎదురు చూస్తున్నా" అన్నాడు నందు. "అయ్యో మీరు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే నాకే ఏంటోలా ఉంది" అన్నాడు ప్రదీప్. ఇక రష్మీ ఐతే "పిందే పండయ్యింది" అంటూ ప్రదీప్ ని చూపించేసరికి ఒక్కసారిగా షాకై ఐనా "నీ తెలుగు వేరు మా అందరి తెలుగు వేరు కాబట్టి అనొచ్చు పర్లేదు" అంటూ రష్మీ డైలాగ్ ని కవర్ చేసేసాడు. ప్రదీప్ ని రెండు రాష్ట్రాల అభిమానులు మిస్ అయ్యారు అంటూ ఆది చెప్పాడు. తర్వాత ఈ షోకి కాసేపు ప్రదీప్ యాంకరింగ్ చేసి ఇటు రీల్ జోడి టీమ్ నుంచి కావ్యతో అటు రియల్ జోడి టీమ్ నుంచి సోనియా సింగ్ తో కళ్ళకు గంతలు కట్టి మరీ ఉగాది పచ్చడి తయారు చేయించాడు ప్రదీప్. ఇదంతా చూసిన నందు కూడా ప్రదీప్ స్పాంటేనిటీకి ఫిదా ఐపోయాడు. "డార్లింగ్ చాలా రోజుల తర్వాత నువ్వు మా షోకి వచ్చి మమ్మల్ని ఎంటర్టైన్ చేసావ్. యూట్యూబ్ లో మీ డాన్స్ ని చూసి నేను చాలా సార్లు ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఈ విషయాన్ని నేను చాలా సార్లు ఆదితో షేర్ చేసుకున్నా కూడా. కానీ లైవ్ లో చూస్తున్నప్పుడు వచ్చే కిక్కుంది వేరే లెవెల్ లో ఉంది. నీ స్పాంటేనిటీకి, సమయస్ఫూర్తి సూపర్" అన్నాడు. అంతా మనవాళ్లే కాబట్టి స్పోర్టివ్ గా ఉంటారు కాబట్టి ఇంత ఫ్రీగా చేయగలిగాను చి చెప్పాడు ప్రదీప్.

జయం మూవీ రియల్ జంట వీళ్ళు.. 

  టాలీవుడ్ లో హీరో నితిన్ గురించి తెలియని వారు లేరు. జయం మూవీతో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. ఐతే ఈ సినిమాలో హీరోయిన్ సదా అన్న విషయం తెలుసు. కానీ అసలు హీరోయిన్ గా రష్మీ చేయాల్సి ఉంది అంటూ జయం మూవీ హీరో నితిన్ "అనగనగా ఈ ఉగాది" షోలో చెప్పేసరికి అందరూ అవాక్కయ్యారు. "రష్మీ గురించి నేను కొన్ని విషయాలు చెప్పాలి. నిజానికి నా ఫస్ట్ మూవీ జయంలో 90 పర్సెంట్ హీరోయిన్ ఆవిడే. లాస్ట్ మినిట్ వరకు తానే హీరోయిన్ గా చేసింది . కానీ  లాస్ట్  మినిట్ లో ఎం  జరిగిందో  తెలీదు. కానీ నా లైఫ్ లో ఒక అమ్మాయితో ఒక సీన్ ని రిహార్సల్ చేసింది మొదట రష్మీతోనే ..అందుకే  నా లైఫ్ లో నేను ఎప్పుడూ మర్చిపోలేని అమ్మాయి రష్మీ " అని చెప్పాడు నితిన్. ఇంతలో హోస్ట్ నందు వచ్చి ఫైనల్ గా మంచి అమ్మాయిని సెలెక్ట్ చేశారు అంటూ చెప్పేసరికి రష్మీ ఏయ్ అంటూ నందు మీద అరిచింది. తర్వాత రష్మీ - నితిన్ ఒక కాస్టింగ్ కాల్ మీద టాస్క్ చేశారు. "ఏంటి నితిన్ గారు బ్రేకప్ అంటున్నారు. మీరు నన్ను అలా ఎలా మర్చిపోతారు." అని అడిగింది. "చాలా ఈజీగా మర్చిపోతాను" అని చెప్పాడు నితిన్. "మీరు మర్చిపోతే ఏంటి ..మీరు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు" అని చెప్పింది. "కానీ నువ్వు అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలా అస్సలు లేవు" అని చెప్పాడు. తర్వాత రష్మీ "నాలో ఊహలకు నాలో ఊసులకుక్" అనే సాంగ్ పాడి నితిన్ ని ఎంటర్టైన్ చేసింది. ఐతే రష్మీ జయం మూవీలో చేసి ఉంటె స్టార్ హీరోయిన్ అయ్యేది...కానీ ఏదేమైనా బుల్లితెర ఆమెకు బాగా కలిసొచ్చి స్టార్ యాంకర్ అయ్యింది .  

Eto Vellipoyindhi Manasu : సీతాకాంత్ ప్లాన్ అదే.. కన్నకూతురిని మాణిక్యం కనిపెడతాడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -366 లో......సీతాకాంత్ రామలక్ష్మి దగ్గరికి వస్తాడు. ఎందుకు వచ్చారని రామలక్ష్మి అడుగుతుంది. రామ్ కి కొత్త టీచర్ ని అప్పాయింట్ చేస్తానన్నారు కదా అడగడానికి వచ్చానని సీతాకాంత్ అంటాడు. చేసానని రామలక్ష్మి చెప్తుంది. వారంలో లండన్ వెళ్ళిపోతామని ఫణీంద్ర అనగానే.. ఈ వారం రోజుల్లో రామలక్ష్మి తనంతట తానే బయటపడేలా చెయ్యాలని సీతాకాంత్ అనుకుంటాడు. రామలక్ష్మి బయటకు వెళ్తుంటే.. కార్ డ్రైవర్ లీవ్ లో ఉన్నాడని తెలుస్తుంది. మీరేం అనుకోనంటే మిమ్మల్ని నేను తీసుకొని వెళ్తానని సీతాకాంత్ అంటాడు. మొదట రామలక్ష్మి రానని చెప్తుంది. ఆ తర్వాత సరేనంటుంది. మరొకవైపు సుజాత దేవుడికి మొక్కుతుంటే.. ఎందుకు దేవుడిని మొక్కుతున్నావ్.. మన అమ్మాయిని మనకి దూరం చేశారు వాళ్ళు దేవుళ్ళా అని సుజాతపై మాణిక్యం కోప్పడతాడు. అప్పుడే ఒకతను వస్తాడు. మాణిక్యం డబ్బు ఇవ్వాలని వస్తాడు. సుజాత తన దగ్గరున్న డబ్బు ఇస్తుంది. అల్లుడు గారు వస్తానని చెప్పారు. ఆయన ముందు కొంచెం మర్యాదగా ఉండండి ఏమైనా అనుకుంటాడని సుజాత అంటుంది. మరోవైపు రామలక్ష్మి పని అయ్యేంత వరకు సీతాకాంత్ బయట వెయిట్ చేస్తాడు. మిమ్మల్ని మళ్ళీ తీసుకొని వెళ్తానని సీతాకాంత్ అంటాడు. రామలక్ష్మి కార్ ఎక్కుతుంది. సీతాకాంత్ మాణిక్యం ఇంటి సైడ్ వెళ్తుంటే.. మీరు వెళ్లే రూట్ కరెక్టేనా అని రామలక్ష్మి అడుగుతుంది. ఎందుకు అలా అడుగుతున్నారు.. మీకు ఈ రూట్ తెలుసా అని సీతాకాంత్ అడుగగా.. తెలియదని రామలక్ష్మి అంటుంది. సీతా గారు నన్ను బయటపడేలా చెయ్యడానికి ఇదంతా చేస్తున్నారు అసలు బయటపడొద్దని రామలక్ష్మి అనుకుంటుంది. రామలక్ష్మిని తీసుకొని మాణిక్యం ఇంటికి వస్తాడు సీతాకాంత్. మాణిక్యం, సుజాత ఇద్దరు రామలక్ష్మిని చూసి షాక్ అవుతారు. రామలక్ష్మి అంటూ మాట్లాడుతుంటే ఆంటీ, అంకుల్ అని రామలక్ష్మి పిలుస్తుంది. తను రామలక్ష్మి కాదు మైథిలి అని సీతాకాంత్ చెప్తాడు. అయినా వినకుండా తను నా కూతురు రామలక్ష్మి అని మాణిక్యం అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : రాజ్ కోసం హోటల్ లో వెయిట్ చేస్తున్న కావ్య.. వాళ్ళిద్దరు అతడిని చూస్తారా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -683 లో.... ఒకవైపు నుండి రాజ్ దగ్గరికి కావ్య వస్తుంటే.. మరోవైపు నుండి రాజ్ దగ్గరికి యామిని వెళ్లి హగ్ చేసుకొని థాంక్స్ బావ పెళ్లి కి ఒప్పుకున్నందు అని చెప్తుంది‌. అలా చెప్పగానే కావ్య, అప్పు ఇద్దరు షాక్ అవుతారు. నాన్న గురించి అలోచించి ఈ పెళ్లికి ఒప్పుకుంటే వద్దని యామిని అనగానే లేదు నాకు ఇష్టమే అని రాజ్ అంటాడు. ఆ తర్వాత అప్పు, కావ్య ఇంటికెళ్తారు అసలు అతను బావనే అని నమ్ముతున్నావా అని కావ్యని అప్పు అడుగుతుంది. నాకూ తెలుసు తాను మా ఆయనే అని కావ్య అంటుంది. అయితే వెళ్లి జరిగింది మొత్తం చెప్పమని అప్పు అంటుంది. తనకి గతం గుర్తు చేసే ప్రయత్నం చేస్తే ప్రమాదమని డాక్టర్స్ చెప్పారని కావ్య అంటుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది.. ఆక్సిడెంట్ అవ్వగానే యామిని తనని తన దగ్గరికి తీసుకొని వెళ్ళింది..‌ఇదంతా తన ప్లానేనా అని కావ్య అంటుంది. అసలేం జరిగిందో మొత్తం కనుక్కుంటానని అప్పు అంటుంది. ఆ లోపు ఆయన గురించి ఎవరికి చెప్పొద్దూ.. ఎందుకంటే అందరు తన దగ్గరికి వెళ్తారు. నువ్వు ఎవరికి అయిన చెప్తే ఒట్టే అంటు అప్పు దగ్గర మాట తీసుకుంటుంది కావ్య. మరొకవైపు యామిని వాళ్ళ నాన్న దగ్గరికి రాజ్ వచ్చి కూర్చుంటాడు. గతంలో నేను ఎవరైనా ప్రేమించాడమో అని.. నన్ను ఎవరైనా ప్రేమించడం జరిగిందా అని రాజ్ అడుగుతాడు. ఎందుకు అలా అడుగుతున్నావని యామిని వాళ్ళ నాన్న అంటాడు. ఒకవేళ వాళ్ళు నా ముందున్నా వాళ్ళని గుర్తుపట్టకుంటే బాధపడతారు కదా అని రాజ్ అనగానే అలా ఏం లేదని అతను చెప్తాడు. అప్పుడే వైదేహి వచ్చి డైవర్ట్ చేస్తుంది. మరొకవైపు కావ్య దేవుడికి తన బాధని చెప్తూ ఏడుస్తుంది. అప్పుడే రాజ్ మెసేజ్ చేస్తాడు. అంటే ఇలా మెసేజ్ చేస్తున్నాడంటే తనకి ఆ యామినిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇద్దరు చాట్ చేసుకుంటారు మళ్ళీ మీ చేతి వంట తినాలని ఉందని కావ్యకి రాజ్ మెసేజ్ చేస్తాడు వండినప్పుడు పంపిస్తానని కావ్య చెప్తుంది. ఒకసారి కలవాలని మెసేజ్ చెయ్యనా అని రాజ్ అనుకుంటాడు. తరువాయి భాగంలో కావ్య ఒక హోటల్ లో రాజ్ కోసం వెయిట్ చేస్తుంది. కావ్య తనలో తాను మాట్లాడుకుంటుంటే.. రాహుల్, రుద్రాణి ఇద్దరు కావ్యని వీడియో తీస్తారు. దీన్ని ఇంట్లో అందరికి చూపించాలని అనుకుంటారు. రాహుల్, రుద్రాణి వెళ్లిపోతుంటే రాజ్ అప్పుడే లోపలికి వస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2: వారిద్దరిని ఏకిపారేసిన శివన్నారాయణ.. దీప ఆ సాక్ష్యాలు సేకరిస్తుందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' కార్తీక దీపం2(Karthika Deepam2)'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-319 లో.. జ్యోత్స్న తన యాక్టింగ్ తో దశరథ్, పారిజాతం, సుమిత్రల సింపథీ పొందుతుంది. దీప రాత్రి అయిన అన్నం తినదు. అది తెలుసుకున్న కార్తీక్.. అన్నం కలిపి తీసుకొస్తాడు. దీపా.. ఈ పచ్చడి ఎలా ఉందో రుచి చూసి చెప్పు.. అనసూయగారు చేశారంటూ కలిపి ముద్ద పెట్టడానికి ట్రై చేస్తాడు. ఏంటి దీపా ఆలోచిస్తున్నావ్? చేతులు ఖాళీగా లేవనా? భార్యభర్తల్లో ఎవరో ఒకరి చేతులు ఖాళీగా ఉంటే చాలు.. మరొకరి ఆకలి తీర్చడానికి.. తిను దీపా.. నిన్ను ఏం ఇబ్బంది పెట్టను.. తినేసి నువ్వు శౌర్య బట్టలు ఇస్త్రీ చేసుకోమని కార్తీక్ అంటాడు‌. నాకిప్పుడు ఆకలిగాలేదు బాబు అని దీప అంటుంది. బాధ, ఆకలి రెండు శత్రువులు దీపా.. ఒకటి ఉన్నచోట మరొకటి ఉండదు.. బాధను తీసెయ్.. ఆకలి తెలుస్తుందని కార్తీక్ అంటాడు. బాధ ఎందుకని దీప అంటుంది. నేను అదే అడుగుతున్నా బాధ ఎందుకు అని కార్తీక్ అంటాడు. గౌతమ్ మంచివాడు.. వాడు జ్యోత్స్న భర్త అయితే ఏమైపోతుందో నాకు తెలుసు.. సాక్ష్యాలు కావాలంటే ప్రతిదానికి సాక్ష్యాలు ఎక్కడి నుంచి వస్తాయి? నేనేదో కావాలని జ్యోత్స్న మీద పగ బట్టినట్లు మాట్లాడుతున్నారంటూ దీప తన మనసులోని బాధ చెప్పుకుంటుంది. మేము బాగానే ఉన్నాం కాశీ అంటు కాశీతో దీప, కార్తీక్ నవ్వుతూనే మాట్లాడతారు. దీపా నీ వంటలన్నీ కాశీకి రుచి చూపించు.. నేను కస్టమర్స్‌ని చూసుకుంటానని ఒక్కొక్కరిని ఏం కావాలని మెను పట్టుకుని వెళ్లి అడుగుతూ ఓ పెద్దాయన ముందు మెను కార్డ్ పెడతాడు కార్తీక్. కాస్త విషం కావాలని పైకి లేస్తాడు ఆ పెద్దాయన. అతడు ఎవరో కాదు శివనారాయణే. అది చూసి దీప, కాశీ పరుగున అక్కడికి వెళ్తారు. ఇక శివనారాయణ.. కార్తీక్‌ని దీపని.. మధ్యలో మాటలకు అడ్డొచ్చిన కాశీని ఏకిపారేస్తుంటాడు. తినడానికి వచ్చిన వాళ్లంతా వినోదం చేస్తారు. దీపని శివన్నారాయణ ఇష్టం వచ్చినట్టు మాటలు అనేసి వెళ్లిపోయాక ఏడ్చుకుంటూ దీప అక్కడి నుండి వెళ్తుంది. కార్తీక్ తనకోసం హోటల్ అంతా వెతికినా ఎక్కడ కనపడదు. మేనేజర్ ని కార్తీక్ పిలుస్తాడు. దీప గారిని చూశావా అని కార్తీక్ అంటాడు. ఆవిడ వెళ్లిపోయారు సర్ అనడంతో.. ఇంటికి వెళ్లి ఉంటుందేమో అని కార్తీక్ అనుకుంటూ సరే నువ్వు చూసుకుంటూ ఉండు నేను ఇప్పుడే వస్తాను అనేసి బయల్దేరతాడు. అయితే అప్పటికే దీప.. ఆవేశంగా, కన్నీళ్లతో రోడ్డు మీద నడుచుకుంటూ సుమిత్ర అన్న మాటలు, శివనారాయణ అన్న మాటలు తలుచుకుని ఓ చోటికి వెళ్తుంది. అక్కడ ఓ వాచ్ మెన్‌ని ఏవో వివరాలు అడుగుతుంది. ఆ సీన్‌కి మొత్తం మ్యూజిక్కే వినిపిస్తూ ఉంటుంది. ఇక ఆ పేపర్ పట్టుకొని దీప రోడ్డు మీద వెళ్తుంటే ఒక కార్ తన ముందుకొస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu Illalu pillalu: చందుని శ్రీవల్లి నిజంగానే ప్రేమిస్తుందా.. రామరాజు ఫుల్ హ్యాపీ!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లాలు(Illu illalu pillalu)'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-120లో.. భాగ్యం తన కుటుంబాన్ని తీసుకొని గుడికి వెళ్తుంది. ఇక నీ పెళ్లి ఆగదని శ్రీవల్లితో భాగ్యం అంటుంది. మరి పెళ్ళి చేయాలంటే ధనలక్ష్మి కావాలి కదా అని భాగ్యం భర్య అడుగగా.. ఓస్ అదా.. మన అమ్మాయి పెళ్ళికి కర్త,కర్మ,క్రియ అన్నీ  మన అల్లుడు గారే అని భాగ్యం అంటుంది. అమ్మోయ్.. పాపమే.. బావ వట్టి అమాయకుడే.. ఆయన నాకు చాలా బాగా నచ్చారు. నాకు తెలియకుండానే ఇష్టం పెంచుకున్నాను. ఆయనతో నా పెళ్లైతే నా జీవితం బాగుంటుందనే నమ్మకంతో ఉన్నానే.. అట్టాంటి మనిషిని మోసం చేయడం తప్పు కదమ్మా అని శ్రీవల్లి అంటుంది. అస్సలు తప్పుకాదే అమ్మడూ.. నీకు పెళ్లి సంబంధం చూసినప్పుడే నీకు క్లియర్‌గా చెప్పా.. మీ అయ్యని నేను పెళ్లి చేసుకుని నేను బతుకుతున్న దరిద్రపు బతకుని బతకనీయను అని.. అందుకోసం నేను వంద అబద్ధాలు చెప్పడానికైనా వెయ్యి మోసాలు చేయడానికైనా వెనకాడనని భాగ్యం  తల్లి ప్రేమని చెప్పుకొస్తుంది‌. పేదరికం గురించి చెప్తే.. అయ్యో పాపం అని జాలిపడతారు తప్పితే.. నిన్ను కోడలిగా చేసుకోరు. నిన్ను ఆ ఇంటి కోడలిగా చేయడానికి నేను వెళ్తున్న రూటే కరెక్ట్. నీ మనసుని అటూ ఇటూ పట్టాలు తప్పించకుండా నా రూట్లోనే ఫాలోయింగ్ అయిపో’ అని అంటుంది. సరే మా అమ్మ ఎలాగంటే అలా అని ఊకొట్టేస్తుంది శ్రీవల్లి. అవునే అమ్మా.. అక్క పెళ్లికి డబ్బులెక్కడనుంచి వస్తాయే అని అంటే.. అన్నింటికీ కర్త, కర్మ, క్రియ బావగానే అని చెప్తున్నావ్.. అది ఎలాగో చెప్పడం లేదు.. అదెలాగే అని భాగ్యం చిన్నకూతురు అడగడంతో.. అదెలాగో చెప్తాగా చెప్తా అని అంటుంది భాగ్యం.  మరోవైపు రామరాజు హ్యాపీగా గుడికి వెళ్ళి శుభలేఖలు ఇచ్చి అర్చన చేయిస్తాడు. ఇక ఇంటికి తిరిగి వెళ్తూ ఓ దుకాణం దగ్గర ఆగుతాడు. మీ పెద్దోడికి పెళ్లి కావడం కష్టమే అని గతంలో తనని అవమానించిన చోటే ఆగి.. మా పెద్దోడి పెళ్లి ఫిక్స్ అయ్యింది.. మావాడికి మంచి సంబంధం చూశాను.. ఈ కాలంలో అలాంటి అమ్మాయి దొరకడం అరుదు అని రామరాజు చెప్తాడు. మొత్తానికి పట్టువదలని విక్రమార్కుడిలా మీ పెద్దోడి పెళ్లి చేస్తున్నావ్ అన్న మాట అని అంటారు అక్కడున్న వాళ్లు. నేను ఎవరికీ ద్రోహం చేయలేదండీ.. మరి నా కొడుక్కి ఆ దేవుడు ఎందుకు ద్రోహం చేస్తాడు.. శుభలేఖలు ఇంటికి వచ్చి ఇస్తానంటూ అక్కడ నుంచి రామరాజు ఇంటికి వెళ్లిపోతాడు. తరువాయి భాగంలో.. ధీరజ్, ప్రేమల మధ్య సీన్ బాగుంది. పుణ్యమేదో చేసి ఉంటానే.. నేను నిన్ను పొందానే.. నా ఫేవరేట్ నా పెళ్లమే అంటూ మెట్ల మీద నుంచి దొర్లుకుంటూ మరీ ధీరజ్, ప్రేమలు రొమాన్స్ చేసేస్తున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ఎంగేజ్మెంట్ నాతో ఐతే పెళ్లి అమరతో ఉన్నట్టుంది నాకు...విష్ణుప్రియని మిస్ అవుతున్నాం...

  చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. షోకి  వస్తూనే సుప్రీత యాదమ్మ రాజుతో కలిసి "ఊ అంటావా మావ" సాంగ్ కి మంచిగ డాన్స్ చేస్తూ వచ్చింది. కానీ ఇంతలో అమరదీప్, అంబటి అర్జున్ వచ్చి యాదమ్మ రాజును పక్కకు నెట్టేసి వాళ్ళు డాన్స్ చేశారు.  సుమ ఈ సీన్ చూసి "యాదమ్మరాజు సూపర్ డాన్స్ పెర్ఫార్మెన్స్ " అని కాంప్లిమెంట్ ఇవ్వడంతో రాజు కుళ్లిపోయాడు. "ఎంగేజ్మెంట్ నాతో ఐతే పెళ్లి అమరదీప్ తో ఉన్నట్టుంది నాకు" అంటూ అనకూడని మాట అనేశాడు. తర్వాత ప్రసాద్ బెహరా వచ్చాడు. "ఎక్కడో ఇన్స్టాగ్రామ్ లో ఇలాంటి జంటలను చూడడం తప్ప ఫస్ట్ టైం స్టేజి మీద మీలాంటి జంటను చూస్తున్నా అర్జున్ అండ్ అమరదీప్" అనేసరికి వాళ్ళు ఒక్కసారిగా షాకయ్యారు ఆ మాటకు అర్ధం తెలీక. మలబార్ పరోటా, పన్నీర్ బటర్ మసాలా  చేయాలి అంటూ సుమ టాస్క్ ఇచ్చేసరికి "అది ఏ బార్ లో దొరుకుతుంది" అంటూ దీపికా అడిగింది . దాంతో అందరూ నవ్వేశారు. తర్వాత "అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి" మూవీ ప్రొమోషన్స్ కోసం ప్రదీప్ - దీపికా పిల్లి వచ్చారు. కంటెస్టెంట్స్ చేసిన ఫుడ్ ఐటమ్స్ ని దీపికా-ప్రదీప్ టేస్ట్ చేశారు. అమరదీప్ దగ్గరకు వచ్చేసరికి పన్నీర్ కర్రీలో పసుపు కొంచెం ఎక్కువయ్యింది అని దీపికా పిల్లి చెప్పింది. "పసుపు యాంటిబయోటిక్" అని చెప్పబోయాడు వెంటనే ప్రదీప్ అందుకుని "అది ఆంటీబయోటిక్ కాదు యాంటిబయోటిక్" అని కరెక్షన్ చేసి మరీ నవ్వించాడు. ఫైనల్ గా యాదమ్మ రాజు గుమ్మడికాయ తెచ్చి మీ సినిమాకు దిష్టి తీయాలి అంటూ చెప్పాడు. ప్రదీప్ ఆ మూవీ పేరు చెప్పు అనేసరికి "అక్కడ అమ్మాయి, ఇక్కడ అమ్మాయి" అన్నాడు. దాంతో ప్రదీప్ కూడా సినిమా టైటిల్ కన్ఫ్యూజ్ చేసేసాడు అంటూ చెప్పి నవ్వించాడు. ఇక నెటిజన్స్ ఐతే విష్ణుప్రియ కావాలి, ఆమెను చాలా మిస్ అవుతున్నాం అని అడుగుతూ కామెంట్స్ చేస్తున్నారు.

రష్మితో గూడుపుఠాణి బాండింగ్...ట్రంప్ రెండో భార్య గురించైనా మాట్లాడేసుకుంటాం

  సుమ ఎంతలా ఆటపట్టిస్తూ మాట్లాడుతుందో ప్రదీప్ కూడా అలాగే ఆటపట్టిస్తూ నవ్విస్తూ యాంకరింగ్ చేస్తాడు. అలాంటి ప్రదీప్ తో సుమ ఒక చాట్ షోలో నలుగురు అమ్మాయిల గురించి అడిగింది. దానికి ప్రదీప్ వెరైటీ ఆన్సర్స్ ఇచ్చాడు. "ఒకరోజు కేజ్ అరెస్ట్ ఐతే గనక అది కూడా దీపికాపిల్లితోనా, అమృత అయ్యరితో అవుతావా" అని సుమా అడిగింది. దానికి ప్రదీప్ దీపికా పిల్లి అని ఆన్సర్ ఇచ్చాడు. "ఎందుకు అమృత ఆల్రెడీ నీతో సినిమా చేసేసింది అనా లేదంటే  ఇప్పుడు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ఆమెతో చేస్తున్నవానా" అని అడిగింది సుమ.  " లేదండి...అమృతకు తెలుగు బాగా వచ్చి. కానీ ఫోన్ అన్నా ఇంకేదన్నా వచ్చినా ఆవిడ తమిళ్, కన్నడ అన్ని భాషలూ మాట్లాడేస్తారు. దీపికా ఐతే మన తెలుగమ్మాయే కదా. ఏ టెన్షన్ ఉండదు" అని చెప్పాడు. "ఒకరోజు కేజ్ అరెస్ట్ ఐతే గనక అది కూడా శ్రీముఖితో, రశ్మితో అంటే ఎవరిని ఎంపిక చేసుకుంటావ్" అని మళ్ళీ అడిగింది. రష్మీ అని ఆన్సర్ చెప్పేసరికి "ఎందుకు శ్రీముఖి కేజ్ లో ఉంటే డేంజరా" అని అడిగింది సుమ. " శ్రీముఖికి పంజరం అవసరం లేదు. ఆమెను అంత తొందరగా మనం మచ్చిక చేసుకోలేము. శ్రీముఖిని ఒక పంజరంలో బంధించలేము..విచ్చలవిడిగా వదిలేస్తేనే సంపూర్ణంగా, పరిపూర్ణంగా ఉంటుంది. ఐనా కూడా శ్రీముఖి, రష్మీ నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ కూడా. శ్రీముఖి నాతోనే ఫస్ట్ షో స్టార్ట్ చేసింది..అదుర్స్ షో ద్వారానే కలిసి మా కెరీర్ ను స్టార్ట్ చేసాం. ఆ టైంకి మాకు ఏమీ తెలీదు. అన్ని విషయాలను కలిసే నేర్చుకున్నాం ఇద్దరం. శ్రీముఖి కూడా ఏమీ భయపడకుండా అన్ని విషయాలను నాతో షేర్ చేసుకునేది.. ఆ షో మొదలు ఇప్పటి వరకు శ్రీముఖి అదే ఎనేర్జి కంటిన్యూ చేస్తోంది. రష్మితో నా బాండింగ్ గూడుపుఠాణిలా ఉంటుంది...అన్ని రకాల గాసిప్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ప్రపంచంలో ఏ విషయం గురించైనా అది ట్రంప్ వాళ్ళ రెండో భార్య గురించైనా మేము మాట్లాడేసుకుంటాం."ఓ ఐతే నా గురించి ఎం మాట్లాడుకున్నారు అని సుమ ఆత్రంగా అడిగేసరికి ఐనా తెలిసినవాళ్లు గురించి మాట్లాడుకోము..ఒకవేల మాట్లాడుకున్న కూడా ఇప్పుడు చెప్తామా ఏంటి అని ప్రదీప్ కౌంటర్ వేసేశాడు.

ప్రదీప్ : అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీకి రెమ్యూనరేషన్ తీసుకోలేదు

  ప్రదీప్ మాచిరాజు బుల్లితెర మీద మోస్ట్ అమేజింగ్ యాంకర్ గా అమ్మాయిలకు మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ గా పేరు తెచ్చుకున్నాడు. చాలాకాలం పాటు యాంకరింగ్ చేసిన ప్రదీప్ రీసెంట్ గా ఒక మూవీ చేసాడు. ఐతే తనకు సంబందించిన ఎన్నో విషయాలను సుమతో జరిగిన చాట్ షోలో చెప్పుకొచ్చాడు. "అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాకు నేను రెమ్యూనరేషన్ తీసుకోలేదు. నాకు ఇచ్చే డబ్బులను హోల్డ్ చేస్తే ఒక మంచి టెక్నీషియన్ ని తెచ్చుకోవచ్చు ఒక మంచి లొకేషన్ లో షూట్ చేసుకోవచ్చు అని అనుకున్నా. అలా లిమిటెడ్ బడ్జెట్ లో లిమిటెడ్ మెంబర్స్ తో ఈ మూవీ చేసాను.. ఇదొక చందమామ కథలా ఉంటుంది. ఒక సాంగ్ ని లడక్ లో షూట్ చేసాం. త్వరలో ఆ సాంగ్ ఆడియన్స్ ముందుకు వస్తుంది. ఈ సాంగ్ షూటింగ్ కోసమే తక్కువ మందిమి కలిసి డబ్బులు పోగేసుకుని షూట్ చేసి వచ్చాము ఆ సాంగ్ ని" అని చెప్పాడు ప్రదీప్. ఇక లవ్ మ్యాటర్ కి వచ్చేసరికి బ్రేకప్ అయ్యింది...బ్రేకప్పులే అయ్యాయి. అలాగే తారక్ తో ఉన్న బాండింగ్ గురించి చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తారక్ అన్న తనతో మలేసియా తీసుకెళ్లాడని చెప్పుకొచ్చాడు. ఎందుకంటే తారక్ వాళ్ళ అమ్మగారికి తన షో అంటే ఎంతో  ఇష్టం అని చెప్పాడు. అందుకే ఎప్పుడు సమయం కుదిరినా తారక్ అన్న షూటింగ్ కి వెళ్లి ఆయనతో టైం స్పెండ్ చేస్తాను అని చెప్పుకొచ్చాడు ప్రదీప్. 2014 నుంచి తమ మధ్య అద్భుతమైన బాండింగ్ ఉందని ఢీ షోలో తారక్ తన మోకాలి మీద కూర్చున్న పిక్ అంటే తారక్ ఫాన్స్ కి ఎంతో ఇష్టం అని చెప్పుకొచ్చాడు ప్రదీప్.