ఎక్కువ మాట్లాడొద్దు.. ప్రియాంకకు ముమైత్ వార్నింగ్!

  డాన్స్ ఐకాన్ సీజన్ 2 నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమోలో చూస్తే అద్దిరిపోయే ఒక వైల్డ్ ఫైర్ తో వైల్డ్ కార్డు ఎంట్రీతో వచ్చేసారు. ఆ మెంటార్ ఎవరో కాదు ముమైత్ ఖాన్. ముమైత్ ఖాన్ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. "ఇప్పటికింకా నా వయసు నిండా 16 " సాంగ్ తో ఉర్రూతలూగించింది. ఆ ముమైత్ ఖాన్ తన కంటెస్టెంట్ అన్షికాతో వచ్చి డాన్స్ ఇరగదీసింది. ఇక దీపికా ఐతే "ఇది ముమైత్ ఖాన్ కాదు..ముంబై నుంచి వచ్చిన డాన్ " అంటూ చెప్పింది. గత ఎపిసోడ్ లో బ్రహ్మముడి మానస్ కి అలాగే ప్రాకృతికి జరిగినట్టు.. రావడంతోనే ప్రియాంక జైన్ కి ముమైత్ ఖాన్ కి మధ్య ఎలిమినేషన్ వార్ జరిగింది.    "ముమైత్ ని అన్షికాని నామినేట్" చేయాలనీ అనుకుంటున్నా అంటూ ప్రియాంక చెప్పింది. ఎందుకు అని ముమైత్ కూడా అడిగేసరికి వైల్డ్ కార్డ్స్ గా వచ్చి మీరు జనాల్లోకి వెళ్లిన తర్వాత మీకు మీ స్ట్రెంత్ తెలిస్తే బాగుంటుంది అని" అని చెప్పేసరికి "ఇది డాన్స్ షో నా పర్సనల్ షోనా" అని ఫైర్ అయ్యింది ముమైత్. "నిజంగా చెప్తున్నా ఇది మొత్తం ఎక్స్క్యూజెస్" అంది..."ఇది ఎక్స్క్యూజెస్" కాదు అని చెప్పింది ప్రియాంక. "నేను మీకు మేడం అని చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా" అంటూ ప్రియాంక అనేసరికి "వద్దు నువ్వు ఏటో చూస్తే నువ్వు నన్ను మేమ్ అని అంటున్నావ్" అనేసరికి "లేదు అలా ఎం లేదు..మీరు అంటున్నది కరెక్ట్ కాదు " అంటూ చెప్పింది ప్రియాంక. "నువ్వు నన్ను క్వయిట్ గా ఉండమంటున్నావ్ నువ్వెందుకు ఉండడం లేదు...ఇక్కడ డాన్స్ కావాలి..అంతకు మించి ఎక్కువగా మాట్లాడొద్దు  " అంటూ ముమైత్ గట్టిగానే అరిచింది.  

నా పెళ్లా.. అవదండి... అలియా భట్ నా క్రష్!

  విజె సన్నీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పుడూ కూల్ గా ఉండే వ్యక్తి. రీసెంట్ గా ఫుడ్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అలాంటి సన్నీ చిట్ చాట్ లో కొన్ని సమాధానాలు ఇలా చెప్పాడు.  "నేను థియేటర్ ఆర్ట్స్ చేసాను. నా జర్నీ ఒక జర్నలిస్ట్ గా స్టార్ట్ అయ్యింది. తర్వాత యాంకర్, సీరియల్ యాక్టర్ , బిగ్ బాస్, ఇప్పుడు మూవీస్ , వెబ్ సిరీస్ చేసాను. అలాగే నా లైఫ్ లో ఒక ఎంటర్ ప్రెన్యూర్ కావాలనుకున్నా..సెలూన్ బిజినెస్ స్టార్ట్ చేశా ఇప్పుడు ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసా. థియేటర్స్ చేసేటప్పుడు అల్లాఉద్దీన్ రోల్ చేసాను. ఇదొక బెస్ట్ మెమొరీ నా జీవితంలో..అది వన్ టైం షాట్. రవీంద్ర భారతిలో నా మొట్టమొదటి థియేటర్ ప్లే అది. ఫ్యూచర్ లో అలాంటి ఒక అడ్వెంచరస్ రోల్స్ వస్తే చేయడానికి రెడీగా ఉన్నాను. నా జీవితంలో ఒక కలర్ ఫుల్ డే కోసం నేను వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే నేను అక్కడ కూడా సక్సెస్ కొట్టాలని చూస్తున్న.  అలియా భట్ ఒక్కటే నా సెలెబ్రిటీ క్రష్. నా పెళ్లి ఇప్పుడు అవదండి..అవదు..ఇప్పట్లో అవదు..అది తెలీదు ఇంకా నాకు...కళ్యాణం వచ్చిన, కక్కొచ్చినా ఆగదు అంటారు కదా. అలా వచ్చినప్పుడు నేను అప్డేట్ చేస్తాను. సహనం ఉంటె ఏమైనా చేయొచ్చు..చేస్తున్న హార్డ్ వర్క్ ఇంకా టైం రాలేదు అనుకుంటున్నాను. నేను నమ్మేది ఒక్క దేవుడినే..ఆయనే హనుమంతుడు ఆయన్నే నమ్ముతాను. రియలిస్టిక్ జానర్ మూవీస్ అంటే నాకు చాల ఇష్టం. పొజిషన్ తో సంబంధం లేకుండా హ్యాపీగా ఉండడమే ఇష్టం. " అంటూ చెప్పుకొచ్చాడు విజె సన్నీ.  

Karthika Deepam 2 : దీపపై కుటుంబమంతా కోపం పెంచుకునేలా చేసిన జ్యోత్స్న!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -318 లో... దీప దగ్గరికి సుమిత్ర వచ్చి బాధపడేలా మాట్లాడి వెళ్ళిపోతుంది. ఏది ఏమైనా కూడా నువ్వు అందరి ముందు గౌతమ్ ని కొట్టి తప్పు చేసావని కాంచన అంటుంది.    అవును దీప నువ్వు చేసింది తప్పే ఒక అమ్మాయిని మోసం చేసాడని ముందు నువ్వు నాకు చెప్పాలిసిందని కార్తీక్ అంటాడు. అప్పుడే ఇక రింగ్ తొడుగుతున్నాడు.. మరేం చెయ్యమంటారని దీప అంటుంది. రింగ్ తొడిగిన ఇంకా పెళ్లి మాత్రం అవ్వలేదు కదా ఒకవేళ పెళ్లి అయినా కూడా వేసిన ముళ్లు ఇప్పించే వాడిని అని కార్తీక్ అంటాడు. ఇప్పుడు అందరి ముందు నువ్వు మాటలు పడ్డావంటూ దీపతో కార్తీక్ అంటాడు. నీ ఆవేశం వల్ల చెడ్డోళ్ళకి మంచి జరిగింది.. మంచోళ్ళకి చెడు జరిగిందని దీపతో అనసూయ అంటుంది. దీప కుబేర్ ఫోటో చూసి ఎమోషనల్ అవుతుంది.    మరొకవైపు శ్రీధర్ డాన్స్ చేస్తూ ఇంట్లోకి వస్తుంటే.. ఏం జరిగింది ఇంత హ్యాపీగా ఉన్నారని కావేరి అంటుంది. ఎంగేజ్ మెంట్ ఆగిపోయిందంటూ శ్రీధర్ జరిగింది అంతా కావేరికి చెప్తాడు. మరొక వైపు జ్యోత్స్న అందరిని తన మాయమాటలతో తనపై జాలి కలిగేలా దీపపై కోపం వచ్చేలా మాట్లాడుతుంటే.. అందరు దీపపై కోపం పెంచుకుంటారు. ఆ తర్వాత దీప బాధపడుతుంటే కార్తీక్ తనకి భోజనం తీసుకొని వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoindi Manasu : శ్రీవల్లిని దొంగని చేసిన రామలక్ష్మి.. సీతాకాంత్ కనిపెడతాడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు' (Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -365 లో... ఏం చేసినా మైథిలి అని చెప్తున్న రామలక్ష్మి బయటపడడం లేదు. ఈ వారం రోజుల్లో రామలక్ష్మి తనంతట తానే బయటపడేలా చెయ్యాలని సీతాకాంత్ అనుకుంటాడు.    మరొక వైపు శ్రీవల్లి రామ్ ని తీసుకొని రామలక్ష్మి దగ్గరికి వస్తుంది. మా రామ్ మిమ్మల్ని చూడాలని బెంగ పెట్టుకుంటే తీసుకొని వచ్చాను.. మా బావగారు చాలా బిజీగా ఉన్నారు.. అందుకే నేను తీసుకొని వచ్చానని శ్రీవల్లి చెప్తుంది. రామ్ డ్రాయింగ్ వేసుకుంటాడు. మీ ఇల్లు చూపించండి అని రామలక్ష్మిని శ్రీవల్లి అడుగుతుంది. అత్తయ్య ఏదో ప్లాన్ తోనే నిన్ను పంపించింది.. నీ సంగతి చెప్తానని రామలక్ష్మి మనసులో అనుకుటుంది.    ఇల్లు తిరిగి చూస్తూ మీ బెడ్ రూమ్ చూపించమని శ్రీవల్లి అడుగుతుంది. రామలక్ష్మి బెడ్ రూమ్ లోకి వెళ్తారు. వెక్కిళ్లు వచ్చినట్లు శ్రీవల్లి యాక్టింగ్ చేస్తుంది. దాంతో రామలక్ష్మి వాటర్ కోసం వెళ్తుంది. సీతా బావ గారికి సంబంధించినవి ఏమైనా ఉంటాయో అని శ్రీవల్లి రూమ్ మొత్తం వెతుకుతుంది. రామలక్ష్మి, సీతాకాంత్ ఇద్దరు ఉన్న లాకెట్ శ్రీవల్లికి కప్ బోర్డు లో దొరుకుతుంది.    నాకు సీతా గారికి సంబంధించిన లాకెట్ ఒకవేళ శ్రీవల్లి చుస్తే ప్రాబ్లమ్ అవుతుందని రామలక్ష్మి వస్తుంది అప్పుడే శ్రీవల్లి లాకెట్ ఓపెన్ చెయ్యబోతుంటే రామలక్ష్మి వచ్చి ఆపుతుంది. మీరు దొంగతనం చెయ్యడానికి వచ్చారా అంటూ శ్రీవల్లిపై రామలక్ష్మి  కోప్పడుతుంది. అదేంటీ నేనొక ప్లాన్ తో వస్తే వాళ్ళు నన్ను దొంగ అనుకుంటున్నారు ఏంటని శ్రీవల్లి అనుకుంటుంది. ఫణీంద్ర, సుశీల వాళ్ళు చూసి.. ఇదేం బుద్ది అని శ్రీవల్లిని తిడుతారు.    మరొకవైపు శ్రీవల్లి ఏదో సాధించుకొని వస్తుందని శ్రీలత రమ్య ఎదురుచూస్తుంటారు. ఇక శ్రీవల్లి ఇంటికి వస్తుంది. మనం రామలక్ష్మి అని కనిపెట్టలేం.. బావగారి వల్లే అవుతుందని శ్రీవల్లి చెప్తుంది. మరోవైపు ఆ శ్రీలత ఇప్పుడు కావాలనే నువ్వు బయటపడేలా చేస్తుంది.. జాగ్రత్తగా ఉండమని రామలక్ష్మికి సలహా ఇస్తాడు ఫణీంద్ర. అప్పుడే రామలక్ష్మి వాళ్ళ దగ్గరికి సీతాకాంత్ వస్తాడు. మేమ్ ఇంకోవారంలో లండన్ వెళ్లిపోతున్నామని ఫణీంద్ర చెప్పగానే.. అమ్మ నాకు ఇచ్చిన గడువు కూడా వారం రోజులే.. ఈ సమయాన్ని అసలు వృధా చేసుకోనని సీతాకాంత్ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu : వారి ఎంగేజ్ మెంట్ లో ధీరజ్ ని క్షమించిన రామరాజు.. టెన్షన్ లో భాగ్యం!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-119 లో... ఏంటి ఇంటింటికి తిరిగి వాటర్ క్యాన్ లు వేస్తున్నావా అని ధీరజ్ గురించి భాగ్యం ధీర్గాలు తీసి మాట్లాడుతుంటుంది. పని చేస్తున్నారు తన కష్టంతో బ్రతకాలని అనుకుంటాన్నాడు అయితే తప్పేముంది ఎందుకు అలా మాట్లాడుతున్నారని భాగ్యం కి తన మాటలతో బుద్ది చెప్తుంది ప్రేమ. పెళ్లి అయ్యాక నా కూతురు ఆ ఇంట్లో అడుగుపెట్టాకా దీని సంగతి కూడా చెప్పాలని భాగ్యం ప్రేమ గురించి అనుకుంటుంది.   ధీరజ్ కి సపోర్ట్ గా ప్రేమ మాట్లాడడంతో వేదవతి, నర్మద హ్యాపీగా ఫీల్ అవుతారు. ధీరజ్ వెళ్లిపోతుంటాడు‌‌.‌ వచ్చావ్ కదా ఈ ఫంక్షన్ అయ్యే వరకు ఉండు ఈ మెమోరీస్ గుర్తుంటాయని ధీరజ్ ని ప్రేమ ఆపుతుంది. తమ్ముడు ఉంటాడు నాన్న అని సాగర్, చందు ఇద్దరు రామరాజుని రిక్వెస్ట్ చేస్తుంటే సైలెంట్ గా వెళ్లిపోతాడు. నాన్న ఏం అనలేదు అంటే ఒప్పుకున్నట్లే ఉండు.. మన ముగ్గురికి సేమ్ బట్టలు తీసుకొని వచ్చామని చందు అంటాడు. ముగ్గురు సేమ్ బట్టలు వేసుకొని డాన్స్ చేస్తూ ఉంటారు. అందరు సంతోషం గాడాన్స్ చేస్తారు. ఇప్పటివరకు ఎలా ఉండేవాళ్ళు నీ రాకతో ఎంత హ్యాపీగా ఉన్నారు.. నువ్వు రావడం నాకు సంతోషమే చిన్నోడా కానీ ఎందుకు నా పరువు తీసే పనులు చేస్తున్నావని రామరాజు అనుకుంటాడు.   ఆ తర్వాత ఎంగేజ్ మెంట్ అయితే జరిగింది కానీ పెళ్లి ఎలా జరుగుతుందో అని భాగ్యం వాళ్ళు టెన్షన్ పడతారు. మరొకవైపు చందు, సాగర్, ధీరజ్ రామరాజు దగ్గరికి వచ్చి తమ్ముడిని క్షమించండి అని రామరాజుని చందు రిక్వెస్ట్ చేస్తారు. పెళ్లి లో ఏ గొడవలు రాకుండా వీడి వల్ల ఏ ఇబ్బంది లేకుండా ఉంటే క్షమిస్తానని రామరాజు అనగానే.. ముగ్గురు రామరాజుని హగ్ చేసుకుంటారు. ఆ తర్వాత ప్రేమ దగ్గరికి ధీరజ్ వెళ్లి.. మా నాన్న ఈ పెళ్లి నా వల్ల ఏ గొడవలు లేకుండా జరిగితే నన్ను క్షమిస్తారు.. అందుకు నీ హెల్ప్ కావాలని అడుగుతాడు.    తరువాయి భాగంలో రామరాజు కుటుంబం మొత్తం పెళ్లి హడావిడి లో బిజీగా ఉంటారు. అందరు హ్యాపీగా ఉంటారు.. మరొకవైపు ఈ పెళ్లి ఎలా చెయ్యాలని భాగ్యం కుటుంబం టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : భార్య ముందే రాజ్ ని హగ్ చేసుకున్న యామిని.. షాక్ లో ఆ ఇద్దరు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -682 లో... యామిని వాళ్ళ నాన్నకి హార్ట్ ఎటాక్ రావడంతో రాజ్ హాస్పిటల్ కి తీసుకొని వస్తాడు. నాకు నా కూతురు పెళ్లి గురించి టెన్షన్ గా ఉందని యామిని వాళ్ళ నాన్న అంటాడు. మీరేం టెన్షన్ పడకండి అంకుల్ అని రాజ్ అంటాడు. నా కూతురిని పెళ్లి చేసుకుంటానని మాటివ్వమని రాజ్ తో అతను అంటాడు.    మరొకవైపు కావ్య, అప్పు ఇద్దరు అదే హాస్పటల్ కి డాక్టర్ దగ్గరికి వస్తారు. వాళ్ళు వచ్చేసరికి డాక్టర్ నర్స్ తో రొమాన్స్ చేస్తుంటాడు. కావ్య వాళ్ళు వెళ్ళగానే డాక్టర్ నర్సుని పంపిస్తాడు. రాజ్ గురించి కావ్య అడుగగా మాకేం తెలియదని డాక్టర్ చెప్తాడు. ఇప్పుడు నువ్వు నిజం చెప్పలేదో.. నువ్వు ఇందాక నర్స్ తో చేసిన రొమాన్స్ వీడియో తీసాను.. ఇది నీ పెళ్ళాంకి చూపిస్తానని అప్పు అతన్ని బ్లాక్ మెయిల్ చేస్తుంది. దాంతో బయపడి డాక్టర్ అసలు నిజం చెప్తాడు. రాజ్ ఆక్సిడెంట్ వల్ల గతం మర్చిపోయాడు.. దాన్ని అవకాశంగా తీసుకొని యామిని వాడుకుంటుంది. ఆమెనే అసలైన సూత్రధారి.. నేను కేవలం పాత్రదారిని మాత్రమే అని డాక్టర్ చెప్తాడు. ఇక అసలు నిజం తెలుసుకున్న అప్పు, కావ్య.. అతను రాజే అని కన్ఫమ్ చేసుకుంటారు.    మరొకవైపు యామిని వాళ్ళ నాన్నకి యామినిని పెళ్లి చేసుకుంటానని రాజ్ మాటిస్తాడు. ఇక రాజ్ వెళ్లిపోయాక ప్లాన్ సక్సెస్ అంటూ యామిని, వైదేహి హ్యాపీగా ఫీల్ అవుతారు. మరోవైపు చూసావా అప్పు.. నా నమ్మకం నిజం అయిందని అప్పు, కావ్య మాట్లాడుకుంటారు. అప్పుడే రాజ్ ఒక దగ్గరికి వస్తాడు. అప్పుకి రాజ్ ని చూపిస్తుంది కావ్య. అప్పు రాజ్ ని చూసి షాక్ అవుతుంది. ఇంకేంటి అక్క తాను బావే కదా వెళ్లి జరిగిందంతా చెప్పమని అప్పు అంటుంది. కావ్య వెళ్తుంటే రాజ్ దగ్గర కి యామిని వచ్చి హగ్ చేసుకొని చాలా థాంక్స్ బావ పెళ్లికి ఒప్పుకున్నందుకని అంటుంది. అదంతా చూస్తున్న అప్పు, కావ్య షాక్ అవుతారు.    తరువాయి భాగం లో కావ్య బాధని చెప్పుకుంటూ దేవుడికి మొక్కుతుంది. నువ్వే ఈ సమస్యకి పరిష్కారం చూపించాలని దేవుడికి మొక్కుకుంటుంది. మరొకవైపు నన్ను ప్రేమించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని యామిని వాళ్ళ నాన్నని రాజ్ అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

అమరదీప్ - అనుష్క అవుట్...స్టేజి మీద అనుష్క కన్నీళ్లు

  డాన్స్ ఐకాన్  సీజన్ 2 ఈ వారం ఎపిసోడ్ కొంచెం ఎమోషనల్ గా సాగింది. ఈ సీజన్ లో ముందుగా ఢీ షోలో చేసిన జాను మెంటార్ గా వచ్చింది తొందరగానే ఎలిమినేట్ ఐపోయింది. ఆమె ప్లేస్ లోకి ప్రియాంక జైన్ వచ్చింది. తర్వాత మానస్ ఎలిమినేట్ అయ్యాడు ఆయన ప్లేస్ లోకి అమర్ దీప్ వచ్చాడు. ఇక ఈ వారం ఎపిసోడ్ లో అమర్ దీప్ ఎలిమినేట్ ఐపోయాడు. ఈ వారం ఎపిసోడ్ థీమ్ వచ్చి "డాన్స్ విత్ సీజన్ 1 డాన్స్ ఐకాన్స్". అంటే సీజన్ 1 కంటెస్టెంట్స్ వచ్చి ఈ సీజన్ వాళ్ళతో డాన్స్ చేశారు. ఇక 6 లక్షల 14 వేల 502 ఓట్లతో టాప్ పొజిషన్ లో ప్రాకృతి - బర్కత్ ఉన్నారు..తర్వాత ప్రియాంక జైన్ - కాంచి షాకి 3 లక్షల 86 వేల 027  ఓట్లు వచ్చాయి.. ఇలా ఈ రెండు జోడీస్ సేఫ్ జోన్ లో ఉన్నారు. ఇక మెంటార్ అమర్ దీప్ - అనుష్క  3 లక్షల 84 వేల ఓట్లతో ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ షోకి కోర్ట్ మూవీ టీమ్ వచ్చింది. జాబిల్లి- చందు కలిసి డాన్స్ చేసారు. అలాగే జాబిల్లికి బర్కత్ ఎంతో బాగా నచ్చేయడంతో ఇద్దరూ హగ్ చేసుకున్నారు.. అలాగే ఇద్దరికీ ఒక కానవొకేషన్ చేసి పంపించాడు. ఎలిమినేట్ ఐపోయిన కంటెస్టెంట్ అనుష్క ఐతే బాగా ఏడ్చేసింది షోలో. ఇక అమరదీప్ ఆమెను ఊరడించాడు. ఇక్కడ ఎలిమినేట్ మాత్రమే అవుతున్నావు..డాన్స్ నీ నుంచి విడిపోవడంలేదు. బాధ ఉంటుంది కానీ ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అంటూ ఆమెకు ధైర్యం చెప్పాడు అమర్.

Illu illalu pillalu : ధీరజ్ కి సపోర్ట్ గా ప్రేమ.. రామరాజు ఏం చేయనున్నాడు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -118 లో....ధీరజ్ ని వాటర్ క్యాన్ ఆర్డర్ వచ్చింది వెళ్ళమని తన ఓనర్ పంపిస్తాడు. మరొకవైపు శ్రీవల్లి రెడీ అవుతుంటే కాaమాక్షి, నర్మద వాళ్ళు వస్తారు. ఇవ్వన్నీ బంగారమేనా అని శ్రీవల్లిని కామాక్షి అడుగుతుంది. అవునండి బంగారమే అని శ్రీవల్లీ చెల్లెలు చెప్తుంది. మరి అయితే హల్ మార్క్ లేదేంటని నర్మద అడుగుతుంది. మాకు బంగారం చేసే అతను మర్చిపోయి ఉంటాడు అని శ్రీవల్లి అంటుంది. బంగారం బాగుందని మా నాన్నని అడిగి చేయించుకుంటాను.. ఎక్కడో చెప్పండి అని కామాక్షి అడుగుతుంది.. దొరికిపోయామని శ్రీవల్లి టెన్షన్ పడుతుంటే అప్పుడే ముహూర్తం టైమ్ అయిందని భాగ్యం వస్తుంది. మాకు ఈ నగలు బాగా నచ్చాయి.. మీకు చేసిన అతని నెంబర్ చెప్పండి అని కామాక్షి అడుగుతుంది. నెంబర్ ఫోన్ లో ఉంది..  ఫోన్ మా ఆయన దగ్గర ఉందని భాగ్యం అంటుంది. వీళ్ళ మాటల్లో ఏదో తేడా కొడుతుందని నర్మదకి డౌట్ వస్తుంది.  ప్రేమని భాగ్యం చూసి అమ్మాయి ఒకతే వచ్చింది. తన భర్త రాలేదా అని అడుగుతుంది. ఏదో పని ఉండి రాలేదని  వేదవతి చెప్తుంది. ఆ తర్వాత ఎంగేజ్ మెంట్ జరుగుతు ఉంటుంది. ధీరజ్ కూడా అదే గుడికి వాటర్ క్యాన్ తీసుకొని వస్తాడ.  తన అన్న ఎంగేజ్ మెంట్ ని కళ్ళారా చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత చందు, శ్రీవల్లి ఎంగేజ్ మెంట్ జరుగుతుంది. అది చూసి రామరాజు హ్యాపీగా ఫీల్ అవుతాడు. ధీరజ్ వాటర్ క్యాన్ తీసుకొని వెళ్తుంటే.. భాగ్యం కి డాష్ ఇస్తాడు. నువ్వు రామరాజు చిన్న కొడుకువి కదా అని భాగ్యం అడుగుతుంటే.. ధీరజ్ అటు పక్క చూస్తాడు. రామరాజు వాళ్ళందరిని పిలుస్తుంది భాగ్యం. మీకు అంత ఆస్తులు ఉండి మీ కొడుకు ఇంటింటికి వాటర్ క్యాన్ లు వేస్తున్నాడని భాగ్యం అంటుంది. చిన్నోడా నువ్వు ఈ పని చేస్తున్నావా అని వేదవతి అడుగుతుంది. నువ్వు ఈ పని చెయ్యడం ఏంటని భాగ్యం అడుగుతుంది. చెయ్యకూడదా చేస్తే తప్పేంటి? అన్యాయం చెయ్యడం లేదు కదా.. న్యాయంగా కష్టం చేసి సంపాదిస్తున్నాడని ప్రేమ సమాధానం చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : జ్యోత్స్న ప్లాన్ సక్సెస్.. దీప అసహ్యించుకున్న ఆ ఇంటి వాళ్ళు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -317 లో.... జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ ఆగిపోవడానికి కారణం దీప అని దీప దగ్గరికి సుమిత్ర వస్తుంది. నీకు నా కూతురు ఏం అన్యాయం చేసింది.. ఎందుకు ఇలా పగ బట్టావని దీప ని సుమిత్ర తిడుతుంది‌. వాడు నిజంగానే మంచివాడు కాదు అమ్మ అని దీప అంటుంటే.. అందుకు సాక్ష్యం ఏమైనా ఉందా అని సుమిత్ర అడుగుతుంది. దీప సైలెంట్ గా ఉండడంతో సాక్ష్యం లేదు కదా అన్ని ఇలాంటి పనులే చేస్తావ్.. అందరిని బాధపెడుతావని సుమిత్ర తిడుతుంది. నిన్ను నా కూతురు కన్నా ఎక్కవగా నమ్మాను.. నా గుండెల మీద తన్నావ్ అని సుమిత్ర కఠినంగా మాట్లాడుతుంది. అప్పుడే దశరథ్ ఎంట్రీ ఇస్తాడు. ఇక్కడికి ఎందుకు వచ్చావ్ అని సుమిత్రని అడుగుతాడు. నా కూతురు నీకు ఏం అన్యాయం చేసిందని అడగడానికి వచ్చానని సుమిత్ర అంటుంది. నువ్వు ఇలా అడిగినంత మాత్రాన ఆగిపోయిన ఎంగేజ్ మెంట్ జరగదు కదా.. పదా వెళదామని సుమిత్రని తీసుకొని వెళ్తు.. నీ కోడలిని బాధపెట్టి ఉంటే క్షమించు అని కాంచనతో దశరత్ అనగానే.. కాంచన బాధపడుతుంది. మరొకవైపు జ్యోత్స్నకి జ్యూస్ తీసుకొని వస్తుంది పారిజాతం. గౌతమ్ గురించి ఆ దీప చెప్పింది నిజమేనా అని అడుగుతుంటే నన్ను ఇర్రిటేట్ చెయ్యకని పారిజాతాన్ని పంపిస్తుంది. నిజమేనా ఏంటి గ్రానీ.. నిజమే ఇదంతా నా ప్లాన్.. ఆ రోజు గౌతమ్ తో మాట్లాడడానికి వెళ్ళినప్పుడే వాడి గురించి తెలిసింది. అక్కడ పనిమనిషితో మాట్లాడ్డం దాన్ని దీప అడ్డుకోవడం అంతా చూసాను.. అంతా తెలిసి ఇక్కడ వరకు తీసుకొని వచ్చాను కావాలనే క్యాటరింగ్ దీప వాళ్ళకి ఇచ్చాను.. వాళ్ళు ఎంగేజ్ మెంట్ కి వచ్చేలా చేసాను అత్తని పిలవడానికి తాతను పంపాను. ఇదంతా ఎందుకంటే నాపై ఎవరికి డౌట్ రాదు.. ఇదంతా దీప కావాలని చేసిందని అందరు తనని ఛీ కొడుతారు. సో నేను అనుకున్నట్లే అయింది.. ఇదంతా నా బావ కోసం అని జ్యోత్స్న నవ్వుకుంటూ రాక్షసనందం పొందుతుంది. మరొకవైపు దీప బాధపడుతుంటే శౌర్య వచ్చి.. ఏమైంది అంటుంది.‌ శౌర్యని లోపలికి తీసుకొని వెళ్తుంది అనసూయ. నువ్వు అందరిలో గౌతమ్ ని కొట్టి ఉండాల్సింది కాదని కాంచన అంటుంది. జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ ఆపితే నాకేం వస్తుందని దీప బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : సీతాకాంత్ కి వారం రోజుల గడువు పెట్టిన సవతి తల్లి.. రామలక్ష్మి షాక్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -364 లో..... సీతాకాంత్ ని రామలక్ష్మి ఫోటో దగ్గరికి తీసుకొని వెళ్తాడు రామ్.. మా మిస్ ఇంకా నీ భార్య రామలక్ష్మి ఒకేలా ఉండడం వల్లే కదా.. నువ్వు మా మిస్ వెంట పడుతున్నావని రామ్ అనగానే నా బాధ నీకు అర్థం అయింది.. ఇక తనకెప్పుడు అర్ధమవుతుందోనని సీతాకాంత్ అనుకుంటాడు. ఆ తర్వాత శ్రీలత వాళ్లు టిఫిన్ చెయ్యడానికి కూర్చుంటారు. అప్పుడే సీతాకాంత్ వస్తాడు. రమ్యని పెళ్లి చేసుకోమని సీతాకాంత్ ని శ్రీలత అడుగుతుంది. ఇక ఆ టాపిక్ వదిలెయ్యండి అని సీతాకాంత్ అంటాడు. అంటే ఇప్పుడు రమ్య పరిస్థితేంటి? ఇంతవరకు వచ్చి ఇలా జరిగిందంటే అందరు చిన్నచూపు చూస్తారని శ్రీలత అంటుంది. నేను ముందే రమ్యతో అన్ని చెప్పిన.‌ తను ఒప్పుకుంటేనే ఎంగేజ్ మెంట్ వరకు వచ్చానని సీతాకాంత్ అంటాడు. అయిన ఇప్పుడు తన గురించి కూడా ఆలోచించాలి కదా అని శ్రీలత అంటుంది. నా భార్యకి తప్ప ఎవరికి చోటు లేదని సీతాకాంత్ చెప్తాడు. దాంతో రమ్య ఏడుస్తూ డోర్ వేసుకుంటుంది. సీతాకాంత్ టెన్షన్ పడుతూ డోర్ నెట్టి లోపలికి వెళ్తాడు. రమ్య ఏదో టాబ్లెట్ వేసుకోబోతుంటే ఆపుతాడు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడ నేను పెళ్లి చేసుకోనని సీతాకాంత్ అనగానే.. ఇక నా మాట కూడా విను.. ఈ వారం రోజులు టైమ్ ఇస్తున్నా‌‌‌.‌ ఈ లోపు రమ్య ని పెళ్లి చేసుకోవాలి లేదంటే నేను చచ్చిపోతానని శ్రీలత అనగానే సీతాకాంత్ షాక్ అవుతాడు. ఆ తర్వాత మన ప్లాన్ సక్సెస్ అంటూ శ్రీలత, శ్రీవల్లి, రమ్య లు హ్యాపీగా ఫీల్ అవుతారు. రామలక్ష్మికి శ్రీలత ఫోన్ చేసి.. రమ్య ఇలా సుసైడ్ చేసుకోబోయింది నేను సీతాకి వారం రోజులు టైమ్ ఇచ్చానని శ్రీలత చెప్పగానే రామలక్ష్మి షాక్ అవుతుంది. అయితే నాకేంటి మీ ఫ్యామిలీ విషయాలు నాకెందుకు చెప్తున్నారని రామలక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది. తను మైథిలీనో కాదో నేను తెలుసుకుంటాను.. ఒకవేళ రామలక్ష్మి అయితే తన గదిలో బావగారికి సంబంధించినవి ఉంటాయి కదా అని శ్రీలత వాళ్ళతో అంటుంది. రామ్ ని తీసుకొని వెళ్లి నా ప్లాన్ అమలు చేస్తానని శ్రీవల్లి అంటుంది. మరొకవైపు ఎందుకు రమ్య ఇలా చేస్తుందని సీతాకాంత్ ఆలోచిస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : యామిని వాళ్ళ నాన్నకి హార్ట్ ఎటాక్.. పెళ్లికి ఒప్పుకున్న రాజ్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -681 లో.....కావ్య పంపిన భోజనం రాజ్ తింటుంటాడు. చాలా బాగుందని లోట్టలేసుకొని తింటుంటే యామినికి కోపం వస్తుంది. ఇంత ఆయిల్ ఉన్న ఫుడ్ తినకూడదని డాక్టర్ చెప్తేనే కదా నీకు రోజు లైట్ ఫుడ్ చేస్తున్నానని యామిని అంటుంది. ఈ ఒక్క రోజే కదా అని రాజ్ తింటాడు. దాంతో యామిని కోపంగా అక్కడ నుండీ వెళ్ళిపోతుంది. ఈ ఒక్కరోజే కదా తినండి అంకుల్ అని యామిని వాళ్ళ నాన్నతో రాజ్ అంటాడు. నేను చేసిన వంట నచ్చిందో లేదో అని కావ్య టెన్షన్ పడుతుంది. మరొకవైపు కళావతి గారు చేసిన వంటలు చాలా బాగున్నాయి. ఆ విషయం ఇప్పడు తనకేలా చెప్పాలని రాజ్ ఆలోచిస్తాడు. క్యారేజ్ కి ఉన్న పేపర్ ని యామిని చింపేసింది.. గుర్తు చేసుకొని డస్ట్ బిన్ లో నుండి తీసి పేపర్ పై ఉన్న నెంబర్ తీసుకొని వంటలు చాలా బాగున్నాయంటూ కావ్యకి రాజ్ మెసేజ్ చేస్తాడు. దాంతో కావ్య చాలా ఎక్సైట్ అవుతుంది. అదంతా రుద్రాణి చూసి దీనికేం అయింది.. ఇలా చేస్తుంది అనుకుటుంది. మరొకవైపు రాజ్ కావ్యతో చాటింగ్ చేయడం యామిని చూసి ఇక నేను ఇలా ఉంటే నడవదు.. నేనంటే ఏంటో చుపిస్తానని యామిని అనుకుంటుంది. ఆ తర్వాత కావ్య దగ్గరికి అప్పు వచ్చి ఆ క్యారేజ్ ఎవరికి పంపావని అడుగుతుంది. మీ బావగారికి అంటూ జరిగింది మొత్తం అప్పుకి కావ్య చెప్తుంది. అసలు ఆ డాక్టర్ , యామిని కలిసి ఇదంతా చేస్తున్నారని కావ్య అంటుంది. రేపు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్లి అసలు ఏం జరిగిందో కనుకోవాలని అప్పు, కావ్య ఇద్దరు అనుకుంటారు. ఆ తర్వాత యామిని వాళ్ళ నాన్న జాగింగ్ చేసి వచ్చి రాజ్ తో మాట్లాడుతుంటే. హార్ట్ ఎటాక్ వస్తుంది. రాజ్ వెంటనే హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాడు. అతను బానే ఉంటాడు. నాకు ఏమైనా అయితే నా కూతురు పరిస్థితి ఏంటి వెంటనే నీకు యామినికి పెళ్లి చెయ్యాలని అతను అంటాడు. తరువాయి భాగంలో యామినిని పెళ్లి చేసుకుంటానని రాజ్ తన తండ్రికి మాటిస్తాడు. మరొకవైపు అప్పు, కావ్య ఇద్దరు యామిని నటించమని చెప్పిన డాక్టర్ దగ్గరికి వచ్చి అసలు నిజం తెలుసుకుంటారు. యామిని రాజ్ ని హగ్ చేసుకొని థాంక్స్ పెళ్లికి ఒప్పుకున్నందుకని చెప్పడం కావ్య విని షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

సుడిగాలి సుధీర్ పెళ్లి చేసుకోడు... ధన్ రాజ్ వైఫ్ శిరీష

జబర్దస్త్ తో పాటు సిల్వర్ స్క్రీన్ మీద ధన్ రాజ్ ఎంతో పాపులర్ అన్న విషయం అందరికీ తెలుసు. ధనరాజ్ ఎన్నో మూవీస్ లో నటించాడు. రీసెంట్ గా సముద్రఖనితో కలిసి "రామం రాఘవం" సినిమాలో  కూడా చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఐతే ఆయన వైఫ్ శిరీష సుడిగాలి సుధీర్ గురించి కొన్ని ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసింది. సుధీర్ పెళ్లి చేసుకోడు అని అతనికి ఒక దగ్గర అలా స్టక్ ఐపోయి ఉండడం అంటే అస్సలు ఇష్టం లేదు అని చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు ఐతే సుధీర్ ఆలోచన ఇలా ఉంది అని మరి ఫ్యూచర్ లో ఎం చేస్తాడో తెలీదు..ఆలోచన మారి పెళ్లి చేసుకోవచ్చేమో అని చెప్పుకొచ్చింది. గెటప్ శీను, చంద్ర, సుధీర్, రాంప్రసాద్  వేణు వీళ్లంతా ఎక్కుగా తమ ఇంట్లోనే ఉండేవాళ్ళు అని వీళ్లంతా ఒకే కంచంలో తిని ఒకే దగ్గర నిద్రపోయేవారని వాళ్ళ మధ్య అంత బాండింగ్ ఉందని చెప్పుకొచ్చింది. సుధీర్ ఎక్కువగా ముక్కుసూటిగా ఉంటాడు. కాబట్టి తనకు అలా ఉండేవాళ్ళంటే ఇష్టం అని చెప్పింది. సుధీర్ సైలెంట్ గా ఉంటాడు కానీ ఫోన్ చేయగానే లిఫ్ట్ చేసి చక్కగా సమాధానం చెప్తాడు. అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా మంచిగా రెస్పాండ్ అవుతారు అని చెప్పింది. సుధీర్ బయట అందరూ అనుకునేంతగా నెగటివ్ గా ఏమీ ఉండడు.. అలాగే వేణు, చంద్ర వాళ్ళ భార్యలు పద్దు, లతా అంతా క్లోజ్ అని చెప్పుకొచ్చింది. తామంతా బాగా క్లోజ్ అని రెగ్యులర్ గా కలుస్తూనే ఉంటాం అని చెప్పుకొచ్చింది. అలాగే తాను ఎవరి మీద డిపెండ్ కాకుండా సిరి ఈవెంట్స్ పేరుతో ఈవెంట్స్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చింది.

ప్రియాంక జైన్ తో బ్రేకప్ చేసుకున్న శివ్....మీ అమ్మగారితో మాట్లాడాక చెప్తా నీ పని

కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2 కూడా మంచి హాట్ గా అలాగే మంచి ఫైట్స్ తో రచ్చ రంబోలా చేసేలాగే కనిపిస్తోంది. ఈ షోలో అదిరిపోయే డాన్సులు ఉన్నాయి..స్కిట్స్, టాస్కులు అన్నీ అలరించబోతున్నాయి. ఇక లేటెస్ట్ గా రిలీజయిన ప్రోమో చూస్తే మాత్రం ఎవ్వరైనా షాకవ్వాల్సిందే. ఎందుకంటే ప్రియాంక జైన్ కి బ్రేకప్ చెప్పాడు శివ్..ఈ కొత్త ప్రోమో ఎండింగ్ లో చూస్తే అనకూడని మాట అనేశాడు. హోస్ట్ శ్రీముఖి "పరి కదా" అనేసరికి శివ్ ఐతే మరీ ఘోరంగా "తొక్కలో పరి..."అన్నాడు దాంతో అనసూయ, హమీద, శ్రీముఖి, తేజస్విని మడివాడ, శేఖర్ మాష్టర్ అంతా ఒక్కసారిగా  నోరెళ్లబెట్టారు. మరో వైపు పరి అలియాస్ ప్రియాంక జైన్ ఆన్లైన్ లోకి వచ్చింది..ఆ మాటల్ని ఆమెతోనే చెప్పేసాడు. "ఈ షో అయ్యేవరకు, బాయ్స్ మళ్ళీ గెలిచేవరకు నేను నీతో బ్రేకప్ చేసుకోవాలనుకుంటున్నా" అని చెప్పేసాడు. ఆ మాటకు ప్రియాంక జైన్ కూడా షాకయ్యింది. ఆన్లైన్ లో అంత మంది ఆడియన్స్ చూస్తుండగా బ్రేకప్ అన్న మాట వినేసరికి స్క్రీన్ మీద రంగులు కూడా మారిపోయాయి. "సరే నేను మీ అమ్మ గారికి ఫోన్ చేసి ఈ బ్రేకప్ విషయం గురించి మాట్లాడతాను..ఈ చెత్త మాటలు మొత్తాన్ని కూడా నువ్వే క్లియర్ చేయాలి..లేదంటే" అన్నట్టుగా సీరియస్ గా ఆన్లైన్ వీడియోని కట్ చేసేసింది. వెంటనే శ్రీముఖి "పరి పరి సారీ " అని చెప్పినా కూడా ప్రియాంక జైన్ వినిపించుకోలేదు. ప్రియాంక జైన్, శివ్ మౌనరాగం సీరియల్ నుంచి ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ గా ఉంటున్నారు. త్వరలో పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నారు. ఐతే ఏమయ్యిందో ఏమో కానీ శివ్ మాత్రం ఈ షోలో పరికి బ్రేకప్ చెప్పడంతో ఇప్పుడు అందరూ షాకయ్యే మాటలు చెప్పారు. మరి ఇది నిజమా కాదా అన్నది తెలియాలంటే షో చూడాల్సిందే.

Brahmamudi : రాజ్, కావ్య చాటింగ్.. యామిని వారిమధ్య బ్రహ్మముడిని తీసేయగలదా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -680 లో....రాజ్ దగ్గర నుండి కావ్య వెళ్ళిపోతుంది. ఏంటి వచ్చినావిడకి మర్యాదలు చేస్తున్నారని యామిని తన పేరెంట్స్ పై కోప్పడుతుంది. రాజ్ హెల్ప్ చేసాడని థాంక్స్ చెప్పడానికి వచ్చింది.. చాలా పద్ధతిగా ఉంది మంచి పిల్లలాగా ఉందని యామినితో వైదేహి అంటుంది. మంచి పిల్ల కాదు ముంచే పిల్ల అని, తను కావ్య అని.. రాజ్ భార్య అని చెప్పగానే యామిని పేరెంట్స్ షాక్ అవుతారు. ఆ విషయం మరి ఎందుకు చెప్పలేదని వైదేహి అడుగుతుంది. మనం ఏం చేసిన రాజ్ చూడనంత వరకే అని యామిని అంటుంది. రాజ్ గతం మర్చిపోయాడు.. మరి తను బానే ఉంది కదా.. గతం గురించి రాజ్ తో ఎందుకు మాట్లాడడం లేదని వైదేహి అనగానే‌.. తను మాములు ఆడది కాదు వెళ్ళేటప్పుడు రాజ్ అని మళ్ళీ రామ్ అని అంది. మెల్లిగా రాజ్ కి గతం గుర్తు చెయ్యాలని ట్రై చేస్తుందని తన పేరెంట్స్ తో యామిని అంటుంది.‌ ఆ తర్వాత రాజ్ కోసం కావ్య వంటలు చేస్తుంది.. అదంతా చూస్తారు రాహుల్, రుద్రాణి. ఇదేంటీ ఇంత హుషారుగా చేస్తుందని రుద్రాణి అనగానే.. ఎన్ని మాటలు అన్నా కూడా దైర్యంగా ముందుకు వెళ్తుందని రాహుల్ అంటాడు. కావ్య దగ్గరికి రుద్రాణి వస్తుంది. మరొకవైపు రాజ్ దగ్గరికి యామిని, తన పేరెంట్స్ వచ్చి పెళ్లి గురించి మాట్లాడతారు. నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదని చెప్పి అక్కడ నుండి రాజ్ వెళ్తాడు. కావ్య క్యారేజ్ కట్టి రాజ్ కి పంపిస్తుంది. దానిపై హెల్ప్ చేసినందుకు కృతజ్ఞతతో అని రాస్తుంది. క్యారేజ్ తీసుకొని ఒకతను రాజ్ దగ్గరికి వెళ్తాడు. కళావతి పంపించిందని అతను చెప్పగానే అవునా అంటూ రాజ్ తీసుకుంటాడు. దానిపై రాసి ఉన్న పేపర్ ని రాజ్ చదువుతాడు. ఆ పేపర్ ని యామిని విసిరేస్తుంది  కావ్య పంపిన భోజనాన్ని యామిని వడ్డిస్తుంది. బాగుందంటూ రాజ్ తింటాడు. యామినికి కోపం వస్తుంది. మరొకవైపు అందరు భోజనం చేస్తుంటారు. ఇన్ని వంటలు ఎందుకు చేసావని కావ్యని ప్రకాష్ అడుగగా.. చెయ్యాలనిపించి చేసానని కావ్య అంటుంది. రాజ్ కి క్యారేజ్ కట్టి పంపిందని రుద్రాణి అంటుంది. దాంతో అందరు ఆశ్చర్యంగా చూస్తారు. అదేం లేదని కావ్య కవర్ చేస్తుంది. తరువాయి భాగంలో కావ్యకి రాజ్ మెసేజ్ చేస్తాడు. ఇద్దరు చాటింగ్ చేసుకుంటుంటే యామిని చూస్తుంది. ఇక నేను కూల్ గా డీల్ చేస్తే అవ్వడం లేదు.. ఇక నేనేంటో చూపిస్తానని యామిని అనుకుటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోయిన గౌతమ్.. దీపకి నిందలు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -316 లో.....ఈ దీప నన్ను కొడుతున్నా అందరు సైలెంట్ గా ఉన్నారంటే ఈ వంట మనిషి చెప్పేది మీరు నమ్ముతున్నారా.. జ్యోత్స్న తన బావని ప్రేమించింది అయిన నాకు జ్యోత్స్న ఇష్టం కాబట్టి పెళ్లికి ఒప్పుకున్నాను.. అక్కడ నిల్చున్న మీ అల్లుడిని ఎందుకు దూరం పెట్టారో నాకు తెలుసు.. అయినా సైలెంట్ గా ఉన్నా.. ఇన్ని తప్పులు మీ దగ్గర పెట్టుకొని ఇలా అవమానిస్తారనుకోలేదని గౌతమ్ ఎంగేజ్ మెంట్ రింగ్ విసిరేస్తాడు. ఈ నిశ్చితార్థం కదా పెళ్లి కూడా అవ్వదని గౌతమ్ కోపంగా వెళ్లిపోతాడు.‌ మీకు మీ సంబంధానికి ఒక దండం అంటూ గౌతమ్ పేరెంట్స్ వెళ్ళిపోతారు. ఇక ఎంగేజ్ మెంట్ క్యాన్సల్ అయినందుకు దీపపై కోప్పడతాడు శివన్నారాయణ. ఒకరకంగా జ్యోత్స్నకి మంచే జరిగింది. వాడు మంచి వాడు కాదు తాతయ్య అని శివన్నారాయణతో దీప చెప్తున్నా కూడ వినిపించుకోడు. నీకేం అన్యాయం చేసాను దీపా.. నా బావని నాకు కాకుండా చేసావ్.. అన్ని మర్చిపోయి గౌతమ్ ని పెళ్లి చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఇలా చేసావని జ్యోత్స్న ఎమోషనల్ అవుతుంది. అందరు కలిసి నా పరువు తీసారని శివన్నారాయణ అంటాడు. దీపని మెడ పట్టుకొని పారిజాతం బయటకు గెంటేస్తుంది. జ్యోత్స్న ఏడుస్తుంటే సుమిత్ర కూడా బాధపడుతుంది. ఇక సుమిత్ర పట్టరాని కోపంతో దీప దగ్గరికి వస్తుంది. ఎందుకు నా కూతురు జీవితంతో ఆడుకుంటున్నావంటూ అడుగుతుంది. అమ్మ నాకు అన్నం పెట్టిన ఇల్లు.. మీరు బాధపడేలా నేనేందుకు చేస్తాను.. నిజంగానే వాడు మంచి వాడు కాదని దీప అంటుంది. అందుకు సాక్ష్యం ఉందా అని సుమిత్ర అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Eto Vellipoyindhi Manasu : నీ పక్కన రమ్య ఉండటం ఇష్టం లేదు.. మా మిస్ నీకు సూట్ అవుతుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -363 లో.....రామ్ కి ఏదో చెప్పి నువ్వు పంపించేసావ్.. ఏం చెప్పావ్ రామ్ కి అంటూ శ్రీలత వాళ్ళు రామలక్ష్మిని నిలదీస్తుంటారు. ఇప్పుడు ఇదంతా డిస్కషన్ ఎందుకు.. ముందు రామ్ ని వెతకాలి అంటూ ఒకవైపు రామలక్ష్మి, మరొక వైపు సీతాకాంత్ లు రామ్ ని వెతికే పనిలో పడతారు. రామలక్ష్మికి ఎవరో ఫోన్ చెయ్యగానే ఫణీంద్ర వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. వెళ్లేసరికి ఫణింద్ర వాళ్ళ దగ్గర రామ్ ఉంటాడు. రామ్ ని చూసి రామలక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతుంది. సీతాకాంత్ టెన్షన్ పడుతాడేమోనని రామలక్ష్మి తనకి ఫోన్ చేస్తుంది. రామ్ ఉన్నాడని చెప్పగానే సీతాకాంత్ కూల్ అవుతాడు. వెంటనే రామ్ దగ్గరికి సీతాకాంత్ వెళ్తాడు. ఎక్కడికి వెళ్ళావ్ నాన్న ఎవరికి చెప్పకుండా అని రామ్ ని సీతాకాంత్ అడుగగా.. నీ పక్కన రమ్య ఉండడం నాకిష్టం లేదు.. అందుకే అని రామ్ అనగానే.. సీతాకాంత్ షాక్ అవుతాడు. ఆ తర్వాత రామ్ ని తీసుకొని సీతాకాంత్ ఇంటికి వస్తాడు. ఎక్కడికి వెళ్ళావ్ రా అంటూ రామ్ పై కోప్పడుతుంది శ్రీలత.నాన్నని ఏం అనకు అని శ్రీలతపై సీతాకాంత్ కోప్పడతాడు. ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళాడన్న కోపంతోనే శ్రీలత గారు అలా అన్నారు.. నేను కూడా బాబు విషయంలో తొందరపడ్డానని రమ్య అంటుంది. అసలు ఎందుకు వెళ్ళావని శ్రీవల్లి అడుగగా.. నాకు ఈ రమ్య ఇష్టం లేదు, అందుకే అని రామ్ అనగానే.. అందరు షాక్ అవుతారు. ఇక్కడితో ఈ విషయం వదిలెయ్యండి అని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత అసలు ఎందుకు రమ్య ఇష్టం లేదని రామ్ ని సీతాకాంత్ అడుగుతాడు. నీకు సూట్ అవ్వదని రామ్ చెప్తాడు. మరి ఎవరు సూట్ అవుతారని సీతాకాంత్ అడుగగా.. మా మిస్ అని రామ్ అంటాడు. ఎందుకని సీతాకాంత్ అనగా... సీతాకాంత్ ని తీసుకొని రామలక్ష్మి ఫోటో దగ్గరికి రామ్ వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : గుడిలో ఎంగేజ్ మెంట్ చేస్తున్న భాగ్యం.. కొడుకు రాలేదని వేదవతి బాధ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -117 లో.....రామరాజు తన కుటుంబంతో గుడికి వస్తాడు. భాగ్యంకి ఫోన్ చేసి ఫంక్షన్ హల్ ఎక్కడో చెప్పండి అని రామరాజు అడుగుతాడు. మీరు అయితే ముందు గుడి లోపలికి రండీ అంత చెప్తానని భాగ్యం అంటుంది. ఫంక్షన్ హల్ ఎక్కడో చెప్పమంటే లోపలికి రమ్మంటుంది ఏంటని రామరాజు అనుకుంటాడు. అందరు లోపలికి వస్తారు.. లోపలికి వెళ్ళగానే ఎంగేజ్ మెంట్ ఏర్పాట్లు చూసి ఆశ్చర్యపోతారు. ఎంగేజ్ మెంట్ ఇక్కడే అని భాగ్యం అంటుంది. అదేంటీ ఫంక్షన్ హల్ లో గ్రాంఢ్ గా చేస్తామన్నారు కదా అని వేదవతి అంటుంది. చెయ్యడానికి మాకేం ప్రాబ్లమ్ లేదు కానీ వచ్చిన వాళ్లంతా మీకూ కాబోయే అల్లుడు మర్డర్ కేసులో స్టేషన్ కి వెళ్ళాడట కదా అంటుంటే బాగోదు కదా అందుకే మాకు పరువుతో సంబంధం లేదు ఎంగేజ్ మెంట్ గ్రాంఢ్ గా కావాలని అంటే ఇప్పుడే ఫంక్షన్ హల్ కి వెళదామని భాగ్యం అంటుంది. దాంతో ఇక్కడే జరిపించండి అని రామరాజు అంటాడు. ఎంగేజ్ మెంట్ కి ధీరజ్ లేడని వేదవతి పక్కకి వెళ్లి బాధపడుతుంది. రామరాజు ఏమైందని అడుగుతాడు. పెద్దోడి ఎంగేజ్ మెంట్ కి చిన్నోడు లేడు నా బాధకి కారణం మీరే అని రామరాజుపై వేదవతి కోప్పడుతుంది. నాకు మాత్రం బాధ ఉందా కానీ ఏదో ఒక ప్రాబ్లమ్ అవుతుందని ఇలా రావద్దని చెప్పానని రామరాజు అంటాడు. ఆ తర్వాత ప్రేమ ఒంటరిగా కూర్చొని ధీరజ్ రాలేదని బాధపడుతుంది. అప్పుడే నర్మద వచ్చి నువ్వు చాలా చేంజ్ అయ్యావ్.. ఈ మధ్య ధీరజ్ గురించి ఆలోచిస్తున్నావు అంటుంది. మరొకవైపు సాగర్, చందు, ఇద్దరు ధీరజ్ రాలేదని బాధపడతారు. ధీరజ్ చందు ఎంగేజ్ మెంట్ కి రాలేదని బాధపడతాడు. అప్పుడే  వాటర్ క్యాన్ లు గుడిలో వెయ్యమని ఓనర్ ధీరజ్ తో చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

యాదమ్మ రాజు - స్టెల్లా కాపురంలో సుప్రీతా చిచ్చు..షోకి వచ్చి గొడవ చేసిన స్టెల్లా

  చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే ఈ వీక్ ఎపిసోడ్ ఫుల్ జోష్ తో ఎంటర్టైన్ చేసింది. ఉగాది స్పెషల్ గా వచ్చిన ఈ షోలో మంచి కామెడీతో ఆడియన్స్ ని అలరించింది. ఐతే యాదమ్మ రాజు - స్టెల్లా మధ్యలో చిచ్చు పెట్టింది సుప్రీతా. దాంతో షోకి స్టెల్లా వచ్చి గొడవ పెట్టుకుంది. ఈ ఉగాది సందర్భంగా చెఫ్ జీవన్ ఐతే బూందీ లడ్డు అలాగే మామిడికాయ పులిహోర రెడీ చేయమని చెప్పాడు. దాంతో కంటెస్టెంట్స్ అంతా పోటీ పడ్డారు. ఇక సుమ ఐతే ఈ షోలో వడ్డాణం పెట్టుకుని కాసేపు అలరించింది. రాజీవ్ కనకాల తన భార్య సుమకి వడ్డాణం కొనిపెడితే దీపికా వచ్చి "సుమ గారు రాజా గారిని అడిగి నాకు ఒక నెక్లెస్ కొనమనండి" అని ముద్దుగా అడిగేసరికి "ఇంకా నయం ఒక మొగుడిని అడగలేదు" అంటూ సుమ కౌంటర్ వేసింది. వెంటనే జీవన్ కూడా సుమ గారు మీకు ఈ వడ్డాణం సూటయ్యింది అని కాంప్లిమెంట్ ఇచ్చాడు. దాంతో కుళ్లిపోయిన యాదమ్మ రాజు "దయచేసి ఆ వడ్డాణం తీసేయండి...నా పెళ్ళాం చూస్తే అది కావాలి అంటుంది" అన్నాడు సీరియస్ గా. "ఐనా అందరూ రాజీవ్ కనకాలలా ఉంటారా ఏమిటి ఐనా నువ్వు పది సార్లు స్టెల్లా నాకు షోకి వచ్చేస్తుందేమో"అన్నది సుమ. "అంత సీన్ లేదులే" అని యాదమ్మ రాజు అనే లోపు షోలోకి వచ్చేసింది స్టెల్లా. "ఆంటీ ఏమయ్యింది" అని భార్యను ఆంటీ అని పిలిచేసరికి ఆమెకు కోపం వచ్చేసింది. "సుప్రీతాతో పరిచయం అవగానే నేను ఆంటీని ఇపోయానా..ఇంట్లో నన్ను వదిలేసి వచ్చి ఇక్కడ మంచిగా వంట చేస్తున్నావా...నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు సుమక్క ఏ రోజు నాకు వంట చేసి పెట్టలేదు..అడిగానని ఆ వంట మొత్తాన్ని నాశనం చేసేవాడు దాన్ని తీసుకెళ్లి చెత్తలో పారేసేదాన్ని" అని చెప్పింది. "ఐనా నేను నీతో కలిసి వంట చేయాలా...అది ఇల్లు ఇది షో" అని కౌంటర్ వేసాడు రాజు. "సుప్రీతా కోసం వడ్డాణం కూడా అడిగాడు" అంటూ సుమ కూడా చెప్పేసరికి "ఈ చైన్ కి లాకెట్ కొనమని చాల రోజుల నుంచి అడుగుతున్నా ..కొన్నివ్వట్లేదు" అని చెప్పింది "సంసారం మొత్తాన్ని షోలోకి తెచ్చావ్" అని తిట్టాడు రాజు. దీపికా ఐతే " ఆ స్టెల్లా ఒక డొల్ల..సుప్రీతా సూపర్" అంటూ యాదమ్మ రాజు మా దగ్గర చెప్తున్నాడు అంది. దాంతో ఆ గొడవ కాస్త పెర్సొనలైజ్ ఐపోతోంది తెలిసి సుమ వెళ్లి కలిసిపోండి ఇద్దరు అంది. అక్కా ఇది ప్రాంక్ అని చెప్పేసింది స్టెల్లా.  

Illu illalu pillalu : చందు, శ్రీవల్లిల ఎంగేజ్ మెంట్.. వాటర్ క్యాన్ లు మోస్తూ చూసిన ధీరజ్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -116 లో.....శ్రీవల్లి చందు గురించి మంచిగా చెప్తుంటే కోడలు అంటే నువ్వమ్మ.. నీలా ఉండాలి.. నాకు బాగా నచ్చావని శ్రీవల్లిని పొగుడుతుంది వేదవతి. అందరు మన బుట్టలో పడిపోయారు.. నా కూతురు అత్త కూడా నా కూతురు వైపు ఉంది. ఇంటికి వచ్చాక చక్రం తిప్పడమే అని భాగ్యం అంటుంది. అందరు చందు, శ్రీవల్లి ఇద్దరిని మధ్యలో పెట్టి డాన్స్ చేస్తుంటారు. ఆ తర్వాత నర్మద టీ తాగుతుంటే అప్పుడే వేదవతి వచ్చి.. నాకు ఒక టీ పెట్టు అంటుంది. నర్మద మాత్రం టీ పెట్టకుండా అటు ఇటు తిరుగుతుంది. ఏమైందని వేదవతి అడుగుతుంది. ఇంకా కోడలుగా మీ పెద్ద కోడలు ఇంట్లో అడుగే పెట్టలేదు అప్పుడే నా కోడలు బంగారం అంటూ ముద్దాడుతున్నారు.. ఇన్ని రోజులు అవుతుంది ఇంటికి వచ్చి ఎప్పుడైనా నాతో సరిగ్గా మాట్లాడారా అంటూ నర్మద అనగానే నర్మదని వేదవతి హగ్ చేసుకొని నా కోడలు బంగారం అని చెప్తుంది. ఇక చాలా అని వేదవతి అనగానే.. మీరు నాకు ముద్దు పెట్టాలని ఇలా చేసానని నర్మద అంటుంది. ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటారు. మరుసటి రోజు అందరూ ఎంగేజ్ మెంట్ కి రెడీ అవుతారు. ధీరజ్ ని వద్దని రామరాజు చెప్తాడు. వీడి వల్ల ఏదో ఒక గొడవ అవుతుందని అంటాడు నా ఎంగేజ్ మెంట్ కన్నా నా తమ్ముళ్లు నాతో ఉండడం కావాలని చందు అంటాడు కానీ నాకు ఇష్టం లేదని రామరాజు అంటాడు. దాంతో ధీరజ్ లోపలికి వెళ్తాడు. అందరు వెళ్తుంటే ప్రేమ అక్కడే ఉంటుంది. రా అని ప్రేమని తీసుకొని వెళ్తాడు రామరాజు. ఆ తర్వాత ఎంగేజ్ మెంట్ గుడిలో ఏర్పాట్లు చేస్తుంది భాగ్యం. ఫంక్షన్ హల్ ఎక్కడ అని భాగ్యాన్ని రామరాజు అడుగుతాడు. మీరు గుడికి రండీ అని భాగ్యం వాళ్లతో చెప్తుంది. ఇప్పుడు ఏం గొడవ జరుగుతుందోనని శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. తరువాయి భాగంలో చందు, శ్రీవల్లిల ఎంగేజ్మెంట్ గుడిలో జరుగుతుంది. అక్కడికి వాటర్ క్యాన్ లు మొయ్యడానికి ధీరజ్ వస్తాడు. వాళ్ళ ఎంగేజ్ మెంట్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ధీరజ్ క్యాన్ లు మోస్తూ భాగ్యం కి డాష్ ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.