రతికతో పులిహార కలిపినప్పుడు భయమేసింది

బుల్లితెర నటులు ప్రియాంక జైన్ - శివ కుమార్ ఇద్దరూ కలిసి ఈ మధ్య కొత్తగా ఒక కాన్సెప్ట్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి ఒక ప్లాన్ కనిపెట్టారు. అదేంటంటే మిగతా సెలబ్రిటీస్ తో వాళ్లకు నచ్చిన వంటల్ని వాళ్ళతోనే చేయించడం. ఇక ముందుకా బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్ తో వంట చేయించారు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ తో వంట చేయించారు. ఇక ప్రియాంక - శివ్ - ప్రియాంక వాళ్ళ అమ్మ అంతా కూడా పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఇంటికి వచ్చారు. ఇక ప్రశాంత్ వాళ్ళ నాన్న ప్రియాంక వాళ్ళను చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యాడు. ఇక ప్రియాంక వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రశాంత్ ఫొటోస్ ని చూపించింది. ఇక పల్లవి వాళ్ళ నాన్న ఐతే "మీరు వెళ్ళినప్పుడు బిగ్ బాస్ చాల బాగుంది ..ఇప్పుడు ఇంతకు ముందు లెక్క లేదు.." అంటూ కామెంట్స్ చేసాడు. అలాగే పల్లవి బిగ్ బాస్ హౌస్ లో పల్లవి కలిపిన పులిహోర గురించి మాట్లాడాడు. రతికాతో పల్లవి పులిహోర కలిపినప్పుడు చాల భయం వేసింది అని చెప్పాడు. తర్వాత పల్లవి ప్రశాంత్ ఇంటికి వచ్చాక అందరూ కలిసి బిగ్ బాస్ ఆల్బం ని చూసి బిగ్ బాస్ మెమోరీస్ ని మళ్ళీ రికలెక్ట్ చేసుకున్నారు. ఇక శివ్ కుమార్ ఐతే తనకు పల్లవి వాళ్ళ ఇల్లు ఆ పల్లె వాతావరణం బాగా నచ్చిందని చెప్పాడు. ఇక అందరూ కలిసి పల్లవి వాళ్ళ పొలం లోకి వెళ్లి కుంపటి పెట్టి అక్కడ అన్నం, పప్పు, రోటి పచ్చడి చేయాలనీ డిసైడ్ అయ్యారు. అలాగే పొలంలో ఫ్రెష్ గా పండిన టొమాటోస్ ని ప్రియాంక కోసింది. వాటితో అక్కడ వంట చేసింది. తర్వాత శివ్ అందరికీ వడ్డించాడు.

Illu illalu pillalu : ధీరజ్ ని తిట్టిన రామరాజు.. భాగ్యం ఇంటికి కుటుంబమంతా పయనం!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -99 లో.. నా మాట అంటే విలువ లేనివాడివి.. నా సొమ్ము ఎలా తింటున్నావని రామరాజు అనగానే.. ప్రేమ తినే దగ్గర నుండి లేస్తుంది. ఎన్ని అబద్ధాలు నమ్మిన ప్రతిసారీ వమ్ము చేస్తున్నావ్.. మొన్న నగలు అంటే అమ్మి పెళ్లికి ఖర్చు చేసుకున్నామన్నావ్.. ఇప్పుడు ఎలా వచ్చాయి నగలు అని రామరాజు అడుగుతుంటే.. ధీరజ్ ఏం సమాధానం చెప్పలేకపోతాడు. ఏం అనకండి అని వేదవతి రిక్వెస్ట్ చేస్తుంది. కన్నందుకు ఒక ముద్ద పడేస్తాను కానీ మీకు ఈ ఇంటికి ఏం సంబంధం లేదు.. మీ కష్టం మీరే పడండి అని రామరాజు అనేసి వెళ్ళిపోతాడు. ధీరజ్ బాధపడుతుంటే వేదవతి వస్తుంది. అన్ని సమస్యలు ఒకేసారి ఆయన చుట్టూ చేరేసరికి ఆయన బాధలో ఉండి అలా అన్నాడని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇది జరిగింది అని చెప్పాలని ఉంది కానీ చెప్పలేని సిచువేషన్ ఇలా ప్రతిసారీ నాన్నకి కోపం తెప్పించే పని చేస్తున్నానని ధీరజ్ బాధపడతాడు. అదంతా విని నర్మద బాధపడుతుంది. మరొకవైపు ప్రేమ తన ఇంటివైపు చూస్తూ తన వాళ్ళు ప్రేమగా అన్నం తినిపించే జ్ఞాపకాలు గుర్తుచేసుకొని బాధపడుతుంది. తరువాయి భాగం లో రామరాజు ఇంట్లో అందరిని తీసుకొని భాగ్యం ఇంటికి బయల్దేరతాడు. ప్రేమ ధీరజ్ లు ఇద్దరు కాలేజీకి వెళ్తుంటే ఇలా ఉండకురా.. నాతో మాట్లాడమని ధీరజ్ ని వేదవతి అడుగుతుంది. అయిన పట్టించుకోకుండా ప్రేమని తీసుకొని ధీరజ్ కాలేజీకి వెళ్తాడు. మధ్యలో ప్రేమని దింపి ధీరజ్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : వారసురాలిని చంపాలని చూస్తున్న జ్యోత్స్న.. కార్తీక్ హోటల్ కి శ్రీధర్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -298 లో......నువ్వే నా ప్రాణధాత అని చెప్పట్లేదు.. అలాంటప్పుడు నేనేందుకు బయటపడాలి. నీ అంతటా నువ్వే చెప్పేవరకు నేను బయటపడనని కార్తీక్ అనుకుంటాడు. మరొకవైపు జ్యోత్స్న దగ్గరికి పారిజాతం వచ్చి ఆ దీప ఏదో వచ్చి వాగుతుంటే.. మీ అమ్మ భలే చేసిందని పారిజాతం అంటుంది. నువ్వు ఏ తప్పు చేయలేదు అలాంటప్పుడు ఆధారాలు ఎక్కడ నుండి తీసుకొని వస్తుంది. అసలు అంత పెద్ద అబద్ధం ఎలా ఆడాలనిపించిందని పారిజాతం అంటుంది. దీప చెప్పింది అంత నిజమే.. ఇంట్లో నా స్థానం లాక్కోవాలని చూస్తే ఊరుకుంటానా అని జ్యోత్స్న అనగానే పారిజాతం షాక్ అవుతుంది. ఇంట్లో నీ స్థానం ఏంటి అని పారిజాతం అనగానే.. అయ్యో మళ్ళీ నోరు జారానా అంటూ ఆ ఇంట్లో బావ పక్కన నేను ఉండాలి కదా అని కవర్ చేస్తుంది. ఆ దీప కార్తీక్ ని వదిలిపెట్టదు.. నిన్ను వదిలిపెట్టదని పారిజాతం అంటుంది. దానికి ఆధారాలు దొరకవని జ్యోత్స్న అంటుంది. అవన్నీ ఎందుకు నువ్వు పెళ్లి చేసుకో ఆస్తులన్నీ నీ పేరున రాస్తారని పారిజాతం అంటుంది. దీప ఎక్కడ అసలైన వారసురాలు అని తెలుస్తుందోనని భయంతో.. అలా జరగకూడదని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. కార్తీక్ కి దీప కొత్త షర్ట్ తీసుకొని వస్తుంది. మీరు ఇప్పుడు రెస్టారెంట్ ఓనర్.. అలాగే బట్టలు వేసుకోవాలని దీప అంటుంది. శౌర్య వస్తుంది. కార్తీక్ ప్రాణధాత గురించి మాట్లాడతాడు. ప్రాణధాత మీ అమ్మలాగా ఉంటుందని ఎక్కడైనా కన్పిస్తే చెప్పమని కార్తీక్ అంటుంటే దీప తెలిసిపోయిందా అన్నట్లు చూస్తుంది కానీ కార్తీక్ తెలివిగా భయటపడడు. ఆ తర్వాత రెస్టారెంట్ కి శ్రీధర్, కావేరి వస్తారు. శ్రీధర్ ఏదో ఒక రకంగా దీప ని బాధపెట్టే ప్రయత్నం చేస్తాడు. శ్రీధర్, కావేరి భోజనం చేస్తారు. బిల్ హాఫ్ మీ ఒక్కరిదే కట్టండి అని కార్తీక్ అంటాడు. చూసేసరికి పర్సు ఉండదు. అలాగే శ్రీధర్ ఫోన్ మర్చిపోయి వస్తాడు. కావేరి నువ్వు కట్టమని శ్రీధర్ అనగానే.. ఇప్పటివరకు దీపని తిట్టావ్ కదా నీ సంగతి చెప్తానంటూ నా ఫోన్ కూడా మర్చిపోయానని కావేరి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : సీతాకాంత్ కి రామలక్ష్మి వార్నింగ్.. తను ఊటీ బ్రాంచ్ కి వెళ్ళిపోతుందట!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -345 లో.... సీఐ సీతాకాంత్ ఇంటికి వస్తాడు. తనని చూసి రామలక్ష్మి మైథిలి వేరు వేరు అని చెప్తాడో.. ఒకవేళ మైథిలి రామలక్ష్మిలు ఒకరే అని చెప్తాడో అని శ్రీలతతో శ్రీవల్లి అంటుంది. సీఐ తో రామలక్ష్మి రావడం చూసి ఇంకా టెన్షన్ పడతారు. తను ఎందుకు వస్తుంది. నేనే రామలక్ష్మిని.. వాళ్ళు నన్ను చంపాలని చూసారని చెప్తుందేమోనని శ్రీవల్లి అంటుంది. రామలక్ష్మి కోపంగా లోపలికి వస్తుంది. రామ్ ఎదరుపడి మేమే వస్తుంటే మీరే వచ్చారని అంటాడు. నువ్వు వెళ్లి కార్ లో కూర్చోమని రామ్ ని పంపిస్తుంది. సీతాకాంత్ గారు అంటు గట్టిగా అరుస్తుంది. సీతాకాంత్ కిందకి వస్తాడు. మీకు ఎంత దైర్యం ఉంటే నాపై ఎంక్వయిరీ చేపిస్తారు. నేను మైథిలినీ కావాలంటే ఇవి చూడండి అంటూ పాస్ పోర్ట్ తను లండన్ లో చదువుకున్న సర్టిఫికెట్ చూపిస్తుంది. అందరు వాటిని చూస్తారు. మీపై పరువు నష్టం దావా వేస్తానని రామలక్ష్మి అనగానే సందీప్ వద్దని రిక్వెస్ట్ చేస్తాడు. సీఐ కూడా  తను మైథిలీనే అని రామలక్ష్మి కాదని చెప్తాడు. దాంతో సీతాకాంత్ బాధపడతాడు. మీరు ప్రతిసారీ స్కూల్ కీ వచ్చి డిస్టబ్ చేస్తున్నారు.. అందుకే ఇక మీ బాబుకి టీసీ ఇస్తున్నానని రామలక్ష్మి చెప్తుంది. ఆ మాట రామ్ వింటాడు. రామలక్ష్మి కోపంగా అక్కడ నుండి వెళ్లిపోతుంది. సీతాకాంత్ షాక్ లోనే ఉండిపోతాడు రామలక్ష్మి, ఫణీంద్రలు కార్ లో వెళ్తుంటారు. జరిగింది గుర్తు చేసుకొని రామలక్ష్మి బాధపడుతుంది. ఇలా సీతా సర్ కి దగ్గరగా ఉండి దూరంగా ఉండడం నా వళ్ళ కాదు.. నేనొక నిర్ణయం తీసుకున్నానని రామలక్ష్మి అనగానే ఏంటి అది అని ఫణీంద్ర అంటాడు. నేను ఉటీలోని బ్రాంచ్ కి వెళ్లి అక్కడే ఉంటాని రామలక్ష్మి అనగానే.. సరేనని ఫణీంద్ర అంటాడు. దానికి ఏర్పాట్లు చెయ్యండి అని రామలక్ష్మి చెప్తుంది. మరొకవైపు రామ్ లేడు అంటూ శ్రీవల్లి అందరితో చెప్పగానే అందరు రామ్ గురించి వెతుకుతారు. గదిలో ఒక మూలాన కూర్చొని ఏడుస్తుంటాడు. ఏమైందని సీతాకాంత్ అడుగగా.. నువ్వు మిస్ ని ఏదో అన్నావ్.. అందుకే నన్ను స్కూల్ నుండి పంపించిందని రామ్ బాధపడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : భార్య గురించి మాజీ ప్రేయసికి గొప్పగా చెప్పిన రాజ్.. పిల్లల కోసం కావ్య మొక్కు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -662 లో.....స్వప్న పాప ఏడుస్తుంటే కావ్య వచ్చి జోలపాట పడి ఊరుకోపెడుతుంది. మరి నువ్వు ఎప్పుడు పిల్లల్ని కంటావని కావ్యని ఇందిరాదేవి అడుగుతుంది. ఆ విషయం మీ మనవడిని అడగండి అని కావ్య అంటుంది. ఎప్పుడు ఆఫీస్ అంటూ ఆలోచిస్తాడు. అలాంటోడికి ఏం చెప్తాము. తన ఆశయానికి అడ్డు చెప్పనని కావ్య అంటుంది. మరొకవైపు యామిని దగ్గరికి రాజ్ వస్తాడు. అప్పటికే రాజ్ పేరు తన పేరు లవ్ సింబల్ తో డెకరేషన్ చేస్తుంది యామిని. అది చూసి రాజ్ చిరాకుపడతాడు. యామిని వచ్చి తన ప్రేమని జ్ఞాపకాలని గుర్తుచేస్తుంది. ప్రేమ అంటే నా భార్యది అందరి బాధ తన బాధ అనుకుంటుంది. అందరికోసం ఆలోచిస్తుందని కావ్య గురించి రాజ్ గొప్పగా చెప్తాడు. నువ్వు ఏదో బ్లాక్ మెయిల్ చేస్తే నేను ఇక్కడికి రాలేదు.. ఈ చిన్న విషయం కూడా నా భార్యకి తెలియొద్దని వచ్చానని రాజ్ అంటాడు. ఇంకెప్పుడు నా జీవితంలోకి రావొద్దని వార్నింగ్ ఇచ్చి  వెళ్తాడు. తను ఉందని ఇలా నన్ను వద్దని అంటున్నావ్ కదా తనని లేకుండా చేస్తానని యామిని అంటుంది. మరొకవైపు అప్పు మొదటి శాలరీతో ధాన్యలక్ష్మి, ప్రకాష్ కి బట్టలు తీసుకొని వస్తుంది. అవి ధాన్యాలక్ష్మికి ఇస్తుంటే వద్దు ఇలా చేసి నన్ను నీవైపుకి మార్చుకోవాలని చూస్తున్నావా.. అది కుదరదంటూ ధాన్యలక్ష్మి మాట్లాడుతుంది. అప్పు మాత్రం కూల్ గా సమాధానం చెప్తుంది. అదంతా అపర్ణ విని ఎక్కడ కోప్పడతావోనని అనుకున్న కూల్ గా సమాధానం చెప్పావని అప్పుతో అపర్ణ అంటుంది. అప్పుడే ఇందిరాదేవి అపర్ణ దగ్గరికి వచ్చి.. నీకు నీ కోడలు కొడుకు గురించి పట్టదు. వాళ్ళు పిల్లల్ని కనడం నీకు ఇష్టం లేదా.. నీ కొడుకు నువ్వు చెప్పాలి కదా .. వెళ్లి వాడిని ఒప్పిద్దామని ఇందిరదేవి అంటుంది. రాజ్ ఇంటికి రాగానే అందరు రాజ్ ని చుట్టూ ముడతారు. తరువాయి భాగంలో నాకు మొక్కు ఉందని కావ్య అనగానే.. సరే ముందు శ్రీశైలం వెళదాం ఆ తర్వాత మనాలి వెళదామని రాజ్ అంటాడు. మరోవైపు కావ్య ఫోటోని రౌడీకీ ఇచ్చి చంపెయమని యామిని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

తుక్కుగూడ కరాటే రాజుగా ఆది

  ఢీ షో ఈవారం ఆడియన్స్ ని బాగా అలరించింది. ఇక ఇందులో ఆది యాక్షన్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకున్నాడు. అంటే కరాటే డ్రెస్ అన్నమాట..మళ్ళీ ఒక బెల్ట్ కూడా పెట్టేసాడు. బ్యాక్ గ్రౌండ్ లో "లుక్ ఎట్ మై ఫేస్ " అనే పవన్ కళ్యాణ్ సాంగ్ వస్తోంది. ఇక ఆది వామప్ చేస్తూ ఉన్నాడు. నందు ఐతే తుక్కుగూడ కరాటే రాజు గారు కమాన్ అంటూ ఎంకరేజ్ చేసాడు. ఇక ఆది ఐతే స్టేజి మీద అటు ఇటు తిరిగాడు. రెండు కుర్చీల మధ్య ఇటుక పలకలు పెట్టారు. అలాగే కర్రలకు కుండలు వేలాడదీశారు. వామప్ చేసాక ఆది అలిసిపోయేసరికి నందు గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఎవరైనా ఎక్సర్ సైజ్ చేసాక అలిసి పోతారు. నువ్వెంటి వామప్ చేసాక అలిసిపోయావ్ అన్నాడు. ఇక ఆ ఫ్రస్ట్రేషన్ భరించలేక గట్టిగా అరుస్తూ ఆ ఇటుక పలకలను చేత్తో విరగ్గొట్టాడు.దీంతో జడ్జెస్ కూడా చాల ఇంప్రెస్ అయ్యారు. ఇక కుండల్ని పగలగొట్టాల్సిన సమయం వచ్చింది. నందు ఐతే కొంచెం ముందుకువచ్చి కుండను పట్టుకుని కాలితో కొట్టాడు. అంటే గట్టిగ దెబ్బ తగిలినట్లుంది. అది ఒరిజినల్ అంటూ గట్టిగ అరిచాడు. ఎలాగో ఫైనల్ గా ఒక కుండను పగలగొట్టారు. ఇంకో కుండ ఉంది.. మీ మోచేతులతో పగలగొట్టండి అంటూ నందు సలహా ఇచ్చాడు. తర్వాత రెండో కుండను పగల గొట్టలేకపోయాడు. ఐతే ఆ కుండను తలతో పగలగొట్టాలంటూ హన్సిక మరీ గారంగా అడిగింది. ఇప్పుడు ఆ కుండను నా తలతో కొడితే తర్వాత ఆ కుండతో నా చుట్టూ తిరుగుతారు అంటూ కామెడీ చేసాడు. తర్వాత నందు మోకాళ్ళ మీద పగలగొట్టడానికి రెండు టైల్స్ ఇచ్చాడు. ఆది కూడా పగలగొట్టి ఫైనల్ గా నొప్పి భరించలేకపోయాడు. ఇక అశ్విని శ్రీ ఐతే ఈ టైల్ ప్లేట్స్ ని కాళ్ళ మీద పెట్టుకుని పగలగొట్టేసింది. ఇలా ఈ వారం ఆది కరాటే మ్యాన్ గెటప్ లో ఎంటర్టైన్ చేసాడు.

Illu illalu pillalu : భాగ్యంకి దిమ్మతిరిగే షాకిచ్చిన రామరాజు.. ఇక నీకు నాకు ఏ సంబంధం లేదు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు '(illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -98 లో..... భాగ్యం రామరాజు ఇంటికి వస్తుంది. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా మరి ఇప్పుడు నీ చదువు ఖర్చు మీ పుట్టింటివాళ్ళు చూసుకుంటున్నారా లేక మీ మావయ్య గారు చూసుకుంటున్నారా అని భాగ్యం ప్రేమని అడుగుతుంది. ప్రేమ సైలెంట్ గా ఉంటుంది. మీ పెద్దమ్మాయి మేం వచ్చామని వచ్చిందా లేక ఇక్కడే ఉంటుందా అని భాగ్యం అనగానే.. మాది పక్క వీధినే అని కామాక్షి అంటుంది. కూతురు దగ్గర ఉండాలని ఇక్కడే ఇచ్చాడేమో మీ నాన్న అని భాగ్యం అంటుంది. నాకు ఇల్లంతా ఒకసారి చూడాలని ఉందని భాగ్యం అంటుంది. కామాక్షి వెళ్లి ఇల్లు చూపిస్తుంది. ఈ అమ్మాయికి కొంచెం పొగరు ఎక్కువలాగా ఉంది కట్ చెయ్యాలని భాగ్యం అనుకుంటుంది. ఇది మా అమ్మ నాన్నల బెడ్ రూమ్.. నడిపోడి బెడ్ రూమ్ ఇది.. చిన్నోడి బెడ్ రూమ్ అని కామాక్షి చెప్తుంది.. ఇవే ఇక అని కామాక్షి అనగానే మరి నా కూతురికి బెడ్ రూమ్ ఎక్కడ అని మనసులో అనుకుంటుంది రామరాజు వాళ్ల దగ్గరికి వెళ్లి అందరికి రూమ్ లు ఉన్నాయ్.. నా కూతురు అల్లుడికి లేదా అని అనగానే కట్టిస్తామని రామరాజు అంటాడు. ల్యాండ్ ల గురించి అడిగి తెలుసుకుంటుంది భాగ్యం. మీరు వచ్చారు.. మేమ్ కూడా వస్తామని రామరాజు అంటాడు. మీరెందుకని భాగ్యం కంగారు పడుతుంది. నా కొడుకు విషయం లో జాగ్రత్తగా ఉంటాను.. అన్నీ తెలుసుకొని ముందడుగు వేస్తానని రామరాజు అనగానే.. ఇక ఏం చెయ్యలేక ఇబ్బందిగానే సరే అంటుంది భాగ్యం. ఆ తర్వాత టైమ్ కి నగలు తీసుకొని వచ్చవ్ రా అంటూ చందు సాగర్, తిరుపతి లు ధీరజ్ ని మెచ్చుకుంటారు. అందరు భోజనం చేస్తుంటే నీకు తిండి ఎలా సహిస్తుందిరా.. నాన్న మాట అంటే విలువ లేదు.. నా సొమ్ము ఎలా తింటున్నావని అనగానే ప్రేమ బాధగా అక్కడ నుండి లేస్తుంది. ఎందుకు తినేటప్పుడు అలా అంటారని వేదవతి అంటుంది. తరువాయి భాగంలో ఇక నీకు నాకు ఏ సంబంధం లేదు.. నీ భార్య నువ్వు కష్టం చేసుకొని బ్రతకండి.. మీకు కావాల్సింది మీరే చూసుకోండి అని రామరాజు చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.    

Karthika Deepam2 : జ్యోత్స్న గురించి కూపీలాగుతున్న దశరథ్.. తన ప్రాణధాత దీపే అని చెప్తాడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -297 లో..... జ్యోత్స్న దగ్గరికి దీప వెళ్లి తిరిగి వస్తుంటే కార్తీక్ ఎదురుపడతాడు. ఆ జ్యోత్స్నకి బుద్ది చెప్పి వచ్చానని దీప అంటుంది. నువ్వు చెప్తే అక్కడ ఒక అత్త తప్ప ఎవరు నమ్మరని కార్తీక్ అంటాడు. ఇప్పుడు ఆవిడా కూడా నమ్మలేదు ఆధారాలు కావాలట.. ఎక్కడ నుండి తీసుకొని వస్తామని దీప అంటుంది. అయితే పోలీస్ కంప్లైంట్ ఇద్దామని కార్తీక్ అనగానే దశరథ్ అన్న మాటలు దీప గుర్తు చేసుకుంటుంది. నాకు మీ లాగే ఉంది కానీ అక్కడ నుండి వస్తుంటే మీ మావయ్య గారు నన్ను ఆపి నిన్ను నా కూతురు అనుకొని అడుగుతున్నా.. ఈ విషయం ఇక్కడితో వదిలేయమని చెప్పాడు. ఇక కోపం, ఆవేశం ఎక్కడ ఉంటాయని దీప అంటుంది. నా కూతురుపై ఎటాక్ చేసిందని తన కూతురిని కొట్టినందుకు సుమిత్ర గారు నన్ను కొట్టారని దీప అనగానే.. కార్తీక్ షాక్ అవుతాడు. ఆవిడ కొట్టిన దెబ్బల కంటే తను అన్న మాటలు గట్టిగా తాకాయని దీప బాధపడుతుంది. పద ఇంటికి వెళదాం.. నీకోక విషయం చెప్పాలని దీపని ఇంటికి తీసుకొని వెళ్తాడు కార్తీక్. మరోవైపు దీప ఇంటికి వచ్చి నా మనవరాలిని కొడుతుందా అని శివన్నారాయణ కోపంగా ఉంటాడు. నా ప్రాణాలు కాపాడిందని సైలెంట్ గా ఉన్నాను.. నా కూతురుని నా ముందే కొడుతుందా అని సుమిత్ర అంటుంది. ఒకవేళ జ్యోత్స్న నిజంగానే తప్పు చేస్తే అని దశరథ్ అనగానే.. దీప చేస్తానన్న పని నేనే చేసేదాన్ని పోలీసులకి పట్టించేదాన్ని అని సుమిత్ర అంటుంది. అసలు జ్యోత్స్న నిజం గానే దీప, శౌర్యలని చంపాలని చూస్తుందని అనుకుందాం.. దాస్ ని చంపాలి అనుకున్నదానికి దీనికి ఎమన్నా సంబంధం ఉందా అని దశరథ్ అనుకుంటాడు. దీప, కార్తీక్ లు ఇంటికి వెళ్తారు. ఎక్కడికి వెళ్లారని కాంచన అడుగుతుంది. కాంచనకి జరిగింది ఏం చెప్పరు. శౌర్యని తీసుకొని రావడానికి మనం వెళ్ళాలిసిన అవసరం లేదు.. స్కూల్ బస్ వస్తుంది. అందులో వెళ్ళమని శౌర్యకి కార్తీక్ చెప్తాడు. ఆ తర్వాత శౌర్యతో దీప మాట్లాడుతుంది‌. నువ్వు చూసింది జ్యోత్స్నని కాదు ఎక్కడ అలా అనకు అంటూ తన మైండ్ ని డైవర్ట్ చేస్తుంది దీప.. అప్పుడే కార్తీక్ వస్తాడు. నేను లాకెట్ పారెసుకున్నానని శౌర్య అనగానే నా ప్రాణధాత ఎప్పుడు నా పక్కనే ఉంటుందని ఇండైరెక్ట్ గా కార్తీక్ మాట్లాడతాడు. కార్తీక్ లాకెట్ చూపించాగానే శౌర్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. దీప తనే ప్రాణధాత అని బయటపడకపోయేసరికి నేనెందుకు బయటపడతానని కార్తీక్ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.    

Eto Vellipoyindhi Manasu : రామలక్ష్మి కోసం సీతాకాంత్ కొత్త వ్యూహం.. రామ్ ఆమె కోసం వెళ్తాడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -344 లో..... మైథిలి రామలక్ష్మి కాదని స్వామి ఇండైరెక్ట్ గా స్వామి చెప్తాడు. నేను రామలక్ష్మిని కాదని రామలక్ష్మి కోపంగా చెప్పి వెళ్లడంతో సీతాకాంత్ బాధపడుతాడు. కానీ శ్రీలత వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. రామ్ ని సందీప్ తో పంపించి సీతాకాంత్ డల్ గా కూర్చొని ఉంటాడు. ఏంటి సీతా తను మన రామలక్ష్మి కాదు.. నువ్వు ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు.. నీకు డౌట్ ఉంటే నీ ఫ్రెండ్ సీఐ ఉన్నాడు కదా.. తనతో ఎంక్వయిరీ చేయించమని శ్రీలత చెప్పగానే అవునంటూ సీఐకి ఫోన్ చేస్తాడు. మనకి తను మైథిలి అని కన్ఫమ్ గా తెలుసు కదా మీరు చెప్పొచ్చు కదా అని శ్రీవల్లి శ్రీలత తో అంటుంది. మనకి తెలుసు కానీ ఏదో ఒక మూలన డౌట్ ఉంది కదా ఈ దెబ్బతో మనకి క్లారిటీ వస్తుందని శ్రీలత అంటుంది. రామలక్ష్మి ఇంటికి వచ్చి బాధపడుతుంటే.. సుశీల ఫణీంద్ర ఇద్దరు తన దగ్గరికి వచ్చి.. ఏం జరిగిందని అడుగుతారు. రామలక్ష్మి గుడిలో జరిగింది మొత్తం చెప్తుంది స్వామికి నా గురించి తెలుసు కాబట్టి అబద్ధం చెప్పారు.. ఒకవేళ నేనే రామలక్ష్మిని అని తెలిస్తే అంటూ రామలక్ష్మి బాధపడుతుంది. ఇన్ని రోజులు చేసిన కష్టం మొత్తం వృథా అవుతుంది. నువ్వు భయటపడకు అని ఫణీంద్ర అంటాడు. మరొకవైపు రామలక్ష్మి ఫోటో ఉన్న గదిలోకి సీతాకాంత్ వెళ్తాడు. వెనకాలే రామ్ వెళ్తుంటే.. శ్రీవల్లి అపి తన గదిలోకి తీసుకొని వెళ్తుంది. ఎందుకు నాన్న ఒక్కడే ఆ గదిలోకి వెళ్తాడు. నన్ను ఎందుకు వెళనివ్వరని శ్రీవల్లిని రామ్ అడుగుతాడు. నువ్వు వెళ్ళకూడదు.. ఒక మీ నాన్ననే అందులోకి వెళ్తాడు. నువ్వు పెద్ద అయ్యాక వెళ్ళాలని రామ్ కి శ్రీవల్లి చెప్తుంది. మరోవైపు రామలక్ష్మి ఫోటో చూస్తూ సీతాకాంత్ తన బాధని చెప్పుకుంటాడు. మరుసటి రోజు రామ్ అందరికంటే ముందు నిద్ర లేచి రెడీ అయి టిఫిన్ త్వరగా రెడీ చెయ్ అని శ్రీవల్లికి చెప్తాడు. రామ్ వచ్చేసరికి శ్రీవల్లి టిఫిన్ తో రెడీ గా ఉంటుంది. వాడు అప్పుడే లేవడు కదా అని శ్రీలత అంటుంది. ఏమో అత్తయ్య ఈ రోజు త్వరగా లేచాడు. చుడండి రెడీ అయి వస్తున్నాడని శ్రీవల్లి చెప్తుంది. ఎందుకు త్వరగా రెడీ అయ్యావని రామ్ ని శ్రీలత అడుగగా.. నాకు మిస్ క్లాస్ చెప్తుంది కదా అందుకే అని రామ్ అంటాడు. అప్పుడే సీతాకాంత్ వస్తాడు. డ్రైవర్ తో వెళ్ళమని రామ్ తో సీతాకాంత్ అనగానే.. నువ్వు రావాలి త్వరగా రెడీ అవ్వు నిన్ను రెడీ చేస్తానంటూ సీతాకాంత్ కి డ్రెస్ ఇచ్చి త్వరగా స్నానం చేసి రమ్మని చెప్తాడు. సీతాకాంత్ ఫ్రెండ్ సీఐ ఇంటికి వస్తుంటాడు. అతన్ని చూసి వాడు ఇప్పుడు రామలక్ష్మి మైథిలి.. వేరు వేరు తను మైథిలీ అని చెప్తాడని శ్రీవల్లి, శ్రీలతలు అనుకుంటారు. ఒకవేళ వాడికి మనం అంటే కోపం ఉండి బావగారు బ్రతికి ఉన్నట్లు రామలక్ష్మి కూడా బ్రతికి ఉందని చెప్తే ఎలా అని శ్రీవల్లి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi :యామిని దగ్గరికి రాజ్.. నా జీవితంలో కావ్య తప్ప ఎవరు లేరు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -661 లో.... యామిని రాజ్ కి ఫోన్ చేస్తుంది. హాలో ఒక సర్ ప్రైజ్ ఉంది. అది నువ్వు మాత్రమే చూడాలని అంటుంది. దాంతో రాజ్ ఎవరు హాల్లోకి రాకముందు వెళ్తాడు. అక్కడ యామినితో  కలిసి ఉన్న ఫొటోస్ చూసి షాక్ అవుతాడు. ఎవరైనా వస్తారేమోనని అన్ని ఫోటోస్ తీస్తాడు. అప్పుడే అందరు హాల్లోకి వస్తారు. ఏమైంది రాజ్ అని పక్కకి జరగమని సుభాష్ అంటాడు. రాజ్ ఫొటోస్ పై కూర్చొని ఉంటాడు. నాకు నడుం నొప్పిగా ఉంది.. నేను లేవనని అంటాడు. కావ్య కిచెన్ లోకి వెళ్తుంటే.. అప్పుడే రాజ్ కి యామిని మెసేజ్ చేస్తుంది. మరి కిచెన్ లో పెట్టిన ఫొటోస్ సంగతి ఏంటనగానే రాజ్ కావ్యని పిలిచి పైన ఫోన్ ఉంది తీసుకొని రమ్మని చెప్తాడు. కావ్య పైకి వెళ్తుంది. రాజ్ త్వరగా కిచెన్ లోకి వెళ్లి అక్కడున్నా ఫొటోస్ తీసుకుంటాడు. ఆ తర్వాత రాజ్ బయటకు వచ్చి హాస్పిటల్ కి ఫోన్ చేస్తాడు. మీ హాస్పిటల్ లో డ్రగ్ ఎడిక్ట్ పేషెంట్ ఉండాలి కదా అని అడుగుతాడు. తను క్యూర్ అయి డిశ్చార్జ్ అయింది. మీరు ఫోన్ చేస్తారని చెప్పి మీకు అడ్రెస్ చెప్పమంది. ఈ నెంబర్ కి తన అడ్రెస్ పంపిస్తున్నానని అతను రాజ్ కి అడ్రెస్ పంపిస్తాడు. రాజ్ టెన్షన్ పడుతుంటాడు. రాజ్ యామిని దగ్గరికి వెళ్తు గతాన్ని గుర్తుచేసుకుంటాడు. రాజ్ కాలేజీ డేస్ లో యామిని తనని ఇష్టపడుతుంది. తన మాటలతో రాజ్ ని ఇంప్రెస్ చేస్తుంది. రాజ్ కూడా తనని ప్రేమిస్తాడు. ఒకరోజు రాజ్ తన ఫ్రెండ్ తో క్లోజ్ గా ఉండడం చూసిన యామిని తనపై ఎటాక్ చేయిస్తుంది. అది తెలుసుకున్న రాజ్.. యామినిని కొడతాడు. నువ్వు నాకు మాత్రమే సొంతం.. వేరొకరితో క్లోజ్ గా ఉంటే నాకు నచ్చాదని యామిని అనడంతో.. నువ్వు ఇంత శాడిస్ట్ లా ఉన్నావ్.. నాకు నువ్వు వద్దు అంటూ రాజ్ వెళ్ళిపోతాడు. నువ్వు నన్ను ప్రేమించకపోతే కాలేజీ పైనుండి దూకుతానంటూ బెదిరిస్తుంది. తను కిందకి వచ్చేవరకు చూసిన రాజ్ వెంటనే పోలీసులకి పట్టిస్తాడు. ఆ తర్వాత రాజ్ ఉండే హాస్టల్ కి వెళ్లి అక్కడ చెయ్ కోసుకుంటుంది. తనని దూరం పెట్టాలని రాజ్ ఎవరికీ చెప్పకుండా అక్కడ నుండి హైదరాబాద్ వచ్చేస్తాడు. యామిని డ్రగ్స్ కి అలవాటు అయి హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటుంది క్యూర్ అవుతుందని తెలిసి పోనిలే అన్ని మర్చిపోయి బాగుంటుందనుకున్నా కానీ ఇలా మళ్ళీ నా లైఫ్ లోకి వచ్చిందని రాజ్ అనుకుంటాడు. తరువాయి భాగంలో రాజ్ వెళ్లేసరికి యామిని తమ పేర్లని పూలతో లవ్ సింబల్ లో డెకరేషన్ చేసి ఉంచుతుంది. నువ్వు నాకు కావాలి అని యామిని అంటుంది. కావ్య తప్ప నా జీవితం లో ఎవరు లేరని రాజ్ అంటాడు అది ఉంటేనే కదా నన్ను వద్దని అంటున్నావ్. దాన్ని లేకుండా చేస్తానని యామిని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

మహిళలు..మహారాణులు...ఉమెన్స్ డే ఎపిసోడ్

వచ్చే ఆదివారం మహిళా దినోత్సవం..ఇక ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుల్లితెర మీద మొత్తం లేడీస్ మాత్రమే ఎక్కువగా కనిపిస్తున్నారు. లేడీ బేస్డ్ షోస్ అన్నీ ఆ రోజు అలరించబోతున్నాయి. ఇక ఇప్పుడు ఆదివారం విత్ స్టార్ మా పరివారం నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక నెక్స్ట్ వీక్ ఉమెన్స్ డే స్పెషల్ గా రాబోతోంది. ఇందులో చాలా మంది బుల్లితెర నటీమణులు వచ్చారు. అలాగే కార్తీక దీపం సీరియల్ లో నటించే చైల్డ్ ఆర్టిస్ట్ చైత్ర లక్ష్మి కూడా వచ్చింది. "హ్యాపీ ఉమెన్స్ డే" అందరికీ అని చెప్పింది. ఇక శ్రీముఖి ఐతే మీ మీ లైఫ్స్ లో ఇన్స్పిరేషన్ అనే ఎవరని చెప్తారు అంటూ అడిగింది. "నాకు మా అమ్మ ది బెస్ట్ ..ఆడోల్లు మీకు నిజంగానే జోహార్లు " అని ప్రియాంక జైన్ చెప్పింది. తర్వాత జ్యోతక్క వంతు వచ్చింది. "మనం జీవితంలో ఎంత లో ఐనా కూడా స్ట్రాంగ్ గ నిలబడాలి అంటే అమ్మ. అన్ని బంధాలను పట్టుకుని నిలబెట్టింది మా అమ్మ" అని చెప్పింది. "నాకు జన్మ ఇచ్చింది నా తల్లి అంటే ఆ జీవితానికి ఒక అర్ధం ఇచ్చింది నా కూతురు" అంటూ ఫైర్ బ్రాండ్ కస్తూరి చెప్పింది. ఇక ఈ షోకి విష్ణు ప్రియా కూడా వచ్చింది. రీసెంట్ గా తన తల్లిని కోల్పోయింది. ఇక రోహిణి అలాగే సీనియర్ నటీమణులు కూడా వచ్చారు. ఇక విష్ణు ప్రియా కూడ ఈ షోకి వచ్చేసరికి నెటిజన్స్ ఫుల్ ఖుషీ ఐపోతున్నారు. అలాగే కొంతమంది నెటిజన్స్ ఐతే తెచ్చినవారినే కాదు కొత్త కొత్త వాళ్ళు చాలామంది కూడా ఉన్నారుగా వాళ్ళను కూడా తీసుకురండి అంటూ ప్రోమో కింద కామెంట్స్ పెడుతున్నారు.    

సుమకి రణబీర్ కపూర్ ఫోన్....ఎందుకంటే ఆదివారం రాత్రి 6 .30 కి

  సుమ అడ్డా షో బుల్లితెర మీద మస్త్ పాపులర్ షో. ఐతే ఈ షో గురించి లేటెస్ట్ ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఇంతకు ఎందుకు అనుకుంటున్నారా. ఇంతకు ఆ ప్రోమో ఏంటో తెలిస్తే విషయం తెలిసిపోతోంది. ముందు సుమ షో కోసం రెడీ అవుతూ మేకప్ వేసుకుంటూ ఉంటె...తన శ్రీవారు రాజా ఫోన్ చేసి ఆదివారం షాపింగ్ అంటే కుదరదు అంటుంది... తర్వాత శ్రీను గారు ఫోన్ చేసారు. "వీసా అపాయింట్ మెంట్ కోసం ఆదివారం రావాలా కుదరదు" అని ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత రన్బీర్ కపూర్ కూడా కాల్ చేశారు. "హా రన్బీర్ జి..ఆలియా అచ్చా హై...ప్రీ రిలీజ్ ఈవెంట్ ..కబ్..ఆదివారం ..అయ్యయ్యో.. నహీ హోతా.. నహి హోతా..సారీ, సారీ..కుదరదు కుదరదు  " అంటూ ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం ఎవరో కాల్ చేయడం ఆదివారం అనేసరికి పెట్టేయడం ఇలా కాల్స్ రావడం ఆదివారం అనేసరికి సుమ నో నో అని చెప్పడం జరిగిపోయింది. తర్వాత సుమ అసిస్టెంట్ "ఎందుకు మేడం ఆదివారం సాయంత్రం కుదరదు అంటున్నారు" అని అడిగాడు. ఎందుకంటే ఇక ఈ షో టైం చేంజ్ ఐపోతోంది. అవును ఇక మంగళవారం నుంచి ఆదివారానికి మారిపోతోంది. అది కూడా ఆదివారం రాత్రి 6 .30 కి .  ఈ టైం చేంజ్ ప్రోమో భలే వెరైటీగ డిజైన్ చేసారు. ఇక ఈ ప్రోమోలో కొత్త కొత్త సెలబ్రిటీస్ ని తీసుకొచ్చారు. కావ్య కూడా కనిపించింది. ఇక ఆదివారం ఖాతాలో ఇప్పుడు మరో షో యాడ్ అయ్యిందన్నమాట

షో లో  కన్నీళ్లు పెట్టుకున్న సుడిగాలి సుధీర్...

  ఫ్యామిలీ స్టార్స్ షో నెక్స్ట్ వీక్ ప్రోమో సీనియర్ లేడీ యాక్టర్స్ తో మంచి కలర్ ఫుల్ గా సాగింది. అలనాటి అందాల లేడీ కమెడియన్స్ శ్రీలక్ష్మి, వై.విజయ, కృష్ణవేణి, శివపార్వతి వచ్చారు. రాగానే స్టేజి మీద ధర్నా చేయడం మొదలు పెట్టారు. వై.విజయ ఐతే  "బావ మారాలి, భర్తగా రావాలి" అని ధర్నా చేసింది.  అది చూసిన హోస్ట్ సుడిగాలి సుధీర్ వీళ్ళను చూసి షాకయ్యాడు. తర్వాత షోలో కొంతమంది సీనియర్ నటులకు పవన్ కళ్యాణ్, ప్రభాస్ పిక్స్ చూపించి వాళ్ళ మూవీ డైలాగ్స్ ని చెప్పించాడు. తర్వాత వాళ్లతో లవ్ లెటర్స్ ని రాయించాడు. ఇక వై.విజయ ఐతే చక్కని లవ్ లెటర్ రాసింది. "ఆయన మంచితనం చూసి నేను నాలుగేళ్లు ప్రేమించాను. కానీ ఆయన ఒకే చెప్పలేదు. ఐ లవ్ యు అమ్ము" అంటూ ముద్దులిచ్చేసింది. తర్వాత ఆమె తెగ సిగ్గుపడిపోయింది. ఈమె ప్రేమను చూసిన సుధీర్ "అరే ఆవిడ బ్లష్ అవుతున్నారు" అని చెప్పి మరి ఇంకా సిగ్గుపడేలా చేసాడు. తర్వాత చొక్కారావు స్రవంతి కూడా సుద్ధేర్ ని అడిగింది. "నువ్వు లవ్ లెటర్ రాయక్కర్లేదు..రాయాలనుకుంటే ఎవరికీ రాస్తావో చెప్పు" అన్నది. అంతే ఆ మాటకు ముఖంలో కన్నీళ్లు వచ్చేసేలా అనిపించాయి.వాటిని దాచుకోవడానికి అన్నట్టు తలదించుకుని "నేను ఒక వేళా లవ్ లెటర్ రాయాల్సి వస్తే కచ్చితంగా వాళ్ళకే" అంటూ ఆపేసాడు. ఇక ఫైనల్ గా కృష్ణవేణి, అనంత్ బాబు కలిసి ఒక స్కిట్ చేసారు. ఈరోజున కొడుకులు ఎలా ఉన్నారో చెప్పడానికి ఆ స్కిట్ వేశారు. ఇలా ఈ వారం షో రాబోతోంది.

Illu illalu pillalu : నగలు తీసుకొచ్చిన ధీరజ్.. రామరాజు ఇంటికి భాగ్యం!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -97 లో..... భాగ్యం వాళ్లు పక్కింటి అతని కార్ లో రామరాజు ఇంటికి వెళ్తారు. రామరాజుని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తుంటే.. అప్పుడే ధీరజ్ ప్రేమ వాళ్ళు నగలు తీసుకొని వస్తారు. గడువులోగా నగలు తీసుకొని వచ్చామని ధీరజ్ సీఐతో చెప్తాడు . ఇక కళ్యాణ్ దగ్గర నుండి ధీరజ్ నగలు తీసుకున్న విషయం గుర్తు చేసుకుంటాడు. ప్రేమ నగలు తీసుకొని వచ్చి భద్రవతికి ఇస్తుంది. ప్రేమ ఇప్పటికైనా ఇక్కడికి రా.. వాళ్ళు మంచి వాళ్ళు కాదని భద్రవతి అంటుంది. ఏం జరిగిందో మీకు తెలియదు.. నేను చెప్పుకోలేనని ప్రేమ బాధపడుతూ.. ధీరజ్ వాళ్ల దగ్గరికి వెళ్తుంది. ఇప్పటికైనా మా నాన్న పరువు తియ్యడం ఆపండి. నేను అసలు ఊరుకోనని భద్రవతి వాళ్ళకి ధీరజ్ వార్నింగ్ ఇస్తాడు. దాంతో సీఐ భద్రవతి దగ్గరికి వెళ్లి కేసు కొట్టివేస్తున్నామని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడే భాగ్యం వాళ్ళు వస్తారు. ఏంటి అందరు బయటున్నారని అడుగుతారు. రామరాజు ఇబ్బంది పడుతుంటే.. మా కోసమే కదా అని భాగ్యం అంటుంది. అందరు ఇంట్లోకి వెళ్తారు. ఈ ఇల్లు మీదేనా బాగుంది.. బానే సంపాదించారు కదా అని అని భాగ్యం అనుకుంటుంది. ప్రేమ, ధీరజ్ లు లని భాగ్యం చూసి ఎవరు వీళ్ళు అని అడుగుతుంది. రామరాజు సైలెంట్ గా ఉండడంతో నా చిన్న కొడుకు కోడలు అని వేదవతి చెప్తుంది. ఏం చేస్తున్నావని  ప్రేమని భాగ్యం అడుగగా.. చదువుకుంటున్నానని ప్రేమ చెప్తుంది. చదువు ఖర్చు ఎవరు పెడుతున్నారు. మీ మావయ్య గారేనా.. మీ వాళ్ళా అని భాగ్యం అడుగుతుంది. దాంతో ప్రేమ సైలెంట్ గా ఉంటుంది. తరువాయి భాగంలో ధీరజ్ భోజనం చేస్తుంటే.. నా కష్టార్జితం ఎలా తినాలనిపిస్తుంది.. ఇక నుండి మీకు నాకు ఎలాంటి సంబంధం లేదని రామరాజు అంటుంటే.. ప్రేమ, ధీరజ్ లు బాధపడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : జ్యోత్స్నకి సపోర్ట్ గా సుమిత్ర.. కంగుతిన్న దీప!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -296 లో... తనని తన కూతురిని జ్యోత్స్న చంపాలనుకుందని దీప కోపంగా జ్యోత్స్న దగ్గరికి వచ్చి రెండు చెంపలు వాయిస్తుంది. ఎందుకు నా కూతురిని కొడుతున్నావని సుమిత్ర అనేసి.. దీపని కొడుతుంది. నా కూతురు ఒంట్లో బాగోలేక ప్రొద్దున నుండి ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటుందని సుమిత్ర అంటుంది. తన నిజంగానే నన్ను నా కూతురుని చంపాలనుకుందని దీప ఆవేశంగా మాట్లాడుతుంది. గతంలో ఇలా ఒకసారి జరిగింది అప్పుడు నీ మాజీ భర్త ఇలా చేసాడు. ఇప్పుడు కూడా వాడే చేసి ఉంటాడని శివన్నారాయణ అంటాడు. ప్రొద్దున నుండి జ్యోత్స్న ఇంట్లోనే ఉంది కదా.. లేదంటే దీప మాటలని నమ్మేవాడిని అని దశరథ్ అనుకుంటాడు. నువ్వు నన్ను కాపాడవ్ అన్న ఒకే ఒక కారణంతో నిన్ను వదిలిపెడుతున్నా.. అసలు నా కూతురు ఇదంతా చేసింది అనడానికి ఆధారం ఏమైనా ఉన్నాయా అని దీపతో సుమిత్ర కఠినంగా మాట్లాడుతుంది. నా కూతురు చూసింది అంటే నమ్మడం లేదు కదా.. ఆధారాలతో వస్తానని దీప ఆవేశంగా బయటకు వస్తుంది. వెనకాలే దశరథ్ వచ్చి.. దీప ఏం జరిగిందో తెలియదు కానీ నువ్వు ఆధారాలు తీసుకొని వస్తే ఒకవేళ జ్యోత్స్న నిజంగానే తప్పు చేస్తే ఇక ఈ రెండు కుటుంబాలు ఎప్పటికి కలవవు.. జ్యోత్స్న పెళ్లితో ఈ రెండు కుటుంబాలని కలపాలని ట్రై చేస్తున్నాను.. నువ్వు ఇలా చేస్తే ఇక ఎప్పుడు ఈ కుటుంబాలు ఎప్పటికి కలవవు.. నిజంగానే నా కూతురు తప్పు చేసి ఉంటే తన తరుపున నేను క్షమాపణ అడుగుతున్నానని దీపని దశరథ్ రిక్వెస్ట్ చేస్తాడు. దీప ఇంటికి వస్తుంటే కార్తీక్ ఎదురు పడుతాడు. శౌర్య చెప్పింది ఇదంతా చేసింది జ్యోత్స్ననే అంట కదా.. పద వెళదాం.. అడుగుదామని దీపతో కార్తీక్ అంటాడు. అక్కడ నుండే వస్తున్నా తన సంగతి చూసే వస్తున్నానని దీప అంటుంది. నువ్వు వెళ్లి చెప్తే అక్కడ అందరు నమ్ముతారా ఒక అత్త తప్ప ఎవరు నమ్మరని కార్తీక్ అనగానే.. ఇప్పుడు ఆవిడ కూడా నమ్మలేదు. నా కూతురు ఇలా చేసింది అనడానికి ఆధారాలు ఏంటని ఆవిడ అడుగుతున్నారు. ఎక్కడ నుండి తీసుకొని వస్తామని దీప అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : స్వామి మాటతో సీతాకాంత్ డిస్సప్పాయింట్.. రామలక్ష్మి కాదని చెప్పేశాడుగా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -343 లో.... సీతాకాంత్ రామలక్ష్మి నోటితోనే నేనే రామలక్ష్మిని అని చెప్పించాలని ప్లాన్ చేస్తాడు. రామలక్ష్మి, సీతాకాంత్, రామ్ లు మాట్లాడుకుంటారు. రామ్ రామలక్ష్మిని మిస్ అంటుంటే శ్రీలత వాళ్ళు విని రామ్ అంటున్నా ప్రిన్సిపల్ తనేనేమో సీతాని కొట్టింది కూడా తనేనేమో.. వాళ్లకు ఆల్రెడీ పరిచయం ఉందని శ్రీలత అంటుంది. కానీ బావగారికి మనలాగే ఇంకా డౌట్ ఉందేమోనని శ్రీవల్లి అంటుంది. రామ్ పూజ చేస్తుంటే మీ మామ్ రాలేదా అని రామలక్ష్మి అడుగుతుంది. ఇప్పుడు మమత ఆంటీ గురించి ఎందుకు అడుగుతుందని రామ్ అనుకుంటాడు. రాలేదు తనకి ఇలాంటివి అన్నీ ఇష్టం ఉండదని రామ్ చెప్తాడు. అంటే బాబుని సీతాగారే చూసుకుంటారన్నమాట. అయినా ధన, సిరిలు ఎక్కడ వాళ్ళ గురించి అడిగితే నేనే రామలక్ష్మి అని తెలిసిపోతుంది. సైలెంట్ గా ఉండడం బెటర్ అని రామలక్ష్మి అనుకొని.. ముందుకూ వస్తుంటే అక్కడ శ్రీవల్లి అక్క అంటూ రామలక్ష్మితో మాట్లాడుతుంది. ఎవరు నీకు అక్కా.. ఇంకా నాకు పెళ్లి కాలేదని రామలక్ష్మి అంటుంది. అయితే పెళ్లి సంబంధాలు  చూస్తున్నారా? ఎలాంటి వారు కావాలని శ్రీవల్లి అడుగగా.. సీతా గారి లాంటి వారు కావాలని రామలక్ష్మి అంటుంది. వాళ్ళు షాక్ అవుతారు. ఈవిడ సీతా బావ గారి పై మనసుపడిందేమోనని శ్రీవల్లి అంటుంది. ఆ తర్వాత సీతాకాంత్ రామలక్ష్మితో మాట్లాడతాడు. నువ్వు నా రామలక్ష్మివే కదా అని సీతాకాంత్ అడుగగా.. లేదని రామలక్ష్మి అంటుంది. అదంతా శ్రీలత వాళ్ళు చూస్తుంటారు. మాక్కూడా ఒక క్లారిటీ వస్తుందనుకుంటారు. ఆ తర్వాత రామలక్ష్మిని స్వామి దగ్గరికి తీసుకొని వస్తాడు. స్వామి గతం లో రామలక్ష్మితో మాట్లాడిన మాటలు గుర్తుచేసుకుంటాడు.ఎక్కడ స్వామి నిజం చెప్తాడోనని రామలక్ష్మి భయపడుతుంది. మనది అనుకున్నప్పుడే బంధం.. అలా అనుకోనప్పుడు అపరిచితులే అవుతారని స్వామి అనగానే.. విన్నారుగా నేను మీ రామలక్ష్మిని కాదని రామలక్ష్మి అక్కడ నుండి వెళ్లిపోతుంది. సీతాకాంత్ డిస్సపాయింట్ అవుతాడు. శ్రీలత వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : రాజ్ బయటకు రావడంతో సంబరాల్లో ఫ్యామిలీ.. యామిని రాకతో అతను షాక్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -660 లో..... రాజ్ కోర్ట్ లో గెలిచి ఇంటికి రాగానే కావ్య హారతి ఇచ్చి స్వాగతం పలుకుతుంది. ఇక అందరు హాల్లో కూర్చొని సరదాగా మాట్లాడుకుంటుంటే.. అది ఓర్వలేకపోతుంది. మొన్న ఇలాగే సంతోషంగా ఉన్నాం రాజ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇలా ఉంటే ప్రాబ్లమ్ ఏ రూపం లో వస్తుందోనని భయంగా ఉందని రుద్రాణి అనగానే..నీ నోటికి మంచిమాటలు రావా అంటూ ఇంట్లో వాళ్లు కోప్పడతారు. మరొకవైపు యామిని ఒక్కప్పుడు రాజ్ ని ప్రేమించిన అమ్మాయి.. తను అమెరికా నుండి ఇంటికి వస్తుంది. యామిని రాకతో తన తల్లితండ్రులు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకు ఇంత లేట్ అయిందని యామిని తల్లిదండ్రులు అడుగుతారు. దారిలో ఫ్రెండ్ కనిపిస్తే ఆగానని యామిని అంటుంది. ఇన్ని రోజుల తర్వాత పేరెంట్స్ కాకుండా ఫ్రెండ్ కి ఇంపార్టెంట్ ఇచ్చావ్.. ఇదేం బాలేదు అని వాళ్ల డాడ్ అంటాడు. ఇన్ని రోజులు మిమ్మల్ని చాలా బాధపెట్టాను.. ఇక బాధపెట్టనని యామిని అంటుంది. అయితే పెళ్లి చేసుకుంటావా అని వాళ్ల అమ్మ అడగ్గానే.. ఎందుకు చేసుకోనంటూ రాజ్ ఫోటో చూపిస్తుంది. వాళ్ళు అది చూసి షాక్ అవుతారు. ఏంటి రాజ్ ఫోటో చూపిస్తున్నావ్.. తను వద్దన్నుందుకే కదా చావు అంచుల వరకు వెళ్లి వచ్చావని వాళ్ల డాడ్ అంటాడు. నేను అమెరికా వెళ్ళింది నా అలవాట్లు మార్చుకోవడానికి.. ప్రేమని కాదు అని యామిని అంటుంది. సరే రాజ్ పేరెంట్స్ తో మాట్లాడుతామని వాళ్ళ అమ్మ అనగానే మాట్లాడాల్సింది వాళ్ళ పేరెంట్స్ తో కాదు.. రాజ్ భార్య కావ్యతో అనగానే వాళ్ళు షాక్ అవుతారు. నాకు రాజ్ కావాలి.. తనని దక్కించుకోవడానికి ఏదైనా చేస్తానని యామిని అంటుంది. మరొకవైపు కన్పించింది యామినీనే అని రాజ్ డైలామాలో ఉంటాడు. అప్పుడే కావ్య వస్తుంది. కావ్య చెయ్యి పట్టుకొని దగ్గరికి తీసుకుంటాడు రాజ్. ఎవరైనా వస్తారని కావ్య అంటుంది. ఎవరు రారు ఒకవేళ వచ్చిన యముడికి అయినా అడ్డం తిరిగి మళ్ళీ నన్ను సొంతం చేసుకుంటావ్ కదా అని రాజ్ అంటాడు. యామిని పేరెంట్స్ డాక్టర్ తో మాట్లాడతారు. తను సెట్ అయింది అనుకుంటే మళ్ళీ రాజ్ అంటుందని అనగానే చిన్నప్పటి నుండి తనేం కావాలని అనుకుంటుందో అది దక్కకపోతే భరించలేదు. తనకి కావల్సింది పొందడానికి ఏం అయినా చేస్తుంది లేదా చచ్చిపోతుంది ఇప్పుడు మీరు చెయ్యాల్సింది తనని అర్థం చేసుకున్నట్లు ఉండి మెల్లగా తనలో మార్పు తీసుకొని రావాలని యామిని పేరెంట్స్ తో డాక్టర్ చెప్తాడు. మరోవైపు కావ్య ఫోటో కాల్చేస్తుంది యామిని. మరుసటి రోజు రాజ్ కి యామిని వాయిస్ మెసేజ్ చేస్తుంది. అది విని రాజ్ షాక్ అవుతాడు. కోర్ట్ దగ్గర చూసాను‌ అలా చూస్తూ ఉండాలనిపించిందని యామిని అంటుంది. ఒక సర్ ప్రైజ్ హాల్లో ఉంది.. నువ్వు తప్ప ఎవరు చూడకూడదు.. వెళ్ళు త్వరగా అని యామిని అంటుంది. తరువాయి భాగం లో రాజ్ హాల్లో ఉన్న కవర్ తీసుకుంటాడు. అందులో యామిని, రాజ్ కలిసి ఉన్న ఫొటోస్ ఉంటాయి. అది ఎవరు రాకముందే రాజ్ త్వరగా తీసుకుంటాడు. అదే సమయంలో ఎవరో ఫోన్ చేసి రాజ్ తో మాట్లాడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ప్రియాంక గురించి ఓంకార్..వైల్డ్ కార్డు ఎంట్రీ

  ఇస్మార్ట్ జోడి సీజన్ 3 నెక్స్ట్ వీక్ ప్రోమో చూస్తే చాలా ఇంటరెస్టింగ్ విషయాలను ఎపిసోడ్ లో మిక్స్ చేయబోతున్నాడు ఓంకార్ అన్న విషయం అర్ధమవుతోంది. ఇక ఈ షోకి మళ్ళీ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా లాస్య- మంజునాథ్ ని మళ్ళీ తీసుకొచ్చాడు.  ఇక లాస్య మాట్లాడుతూ "లక్ లేక ఎలిమినేట్ అయ్యాను ఐతే అదే లక్ తో మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉంది" అని చెప్పింది.  ఎందుకంటే లాస్ట్ వీక్ షో ఎలిమినేషన్స్ లో అనిల్ గీలా - ఆమనీ ఎలిమినేట్ ఇపోయారు. అలాగే రీల్ అండ్ రియల్ జోడీఎస్ ని ఈ షోలోకి తీసుకొచ్చాడు ఓంకార్. ఇక ఆడియన్స్ కి నెక్స్ట్ వీక్ షో అంతా కూడా ఫుల్ ఫన్ లా డిజైన్ చేశారు. ఏఏ సీరియల్స్ నుంచి ఎవరెవరు వస్తున్నారో చూద్దాం. నువ్వుంటే నా జతగా.. సీరియల్ నుంచి టాప్ లీడ్స్ అర్జున్ కళ్యాణ్, అనుమిత దత్త, మామగారు.. సీరియల్ నుంచి  సుహాసిని , ఆకర్ష్ బైరాముడి, మగువ ఓ మగువ.. సీరియల్ నుంచి  శ్రవణ్ కుమార్ , కృతిక ఉమాశంకర్, బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్, శివ కుమార్, చిన్ని.. సీరియల్ నుంచి  కావ్య, వీరేన్ శ్రీనివాస్, పలుకే బంగారమాయెరా.. సీరియల్ నుంచి  నిఖిల్ నాయర్ , సంధ్య రామచంద్రన్ , ఇక సీరియల్ నటుడు మహేష్ వీళ్లంతా వచ్చారు. ఇక ప్రియాంక జైన్ - శివ కుమార్ వచ్చినప్పుడు ఓంకార్ ఒక ప్రశ్న అడిగాడు "పెళ్లి తర్వాత ఎంజాయ్ చేయాల్సినవన్నీ కూడా పెళ్ళికి ముందే అంటే" అని చెప్తూ లాస్య వాళ్ళను చూసి "మీరు కూడా ఏదో గుర్తు చేసుకుంటున్నారనుకుంటా" అన్నాడు. "అన్నా మీరు ఏది అనుకున్నారో మేము కూడా అదే అనుకున్నాం" అని చెప్పింది లాస్య. తర్వాత కావ్య వచ్చేసరికి ఆమెను కూడా అడిగాడు "లవ్ డెఫినిషన్" అనేసరికి "లవ్ అంటే లవ్ అంతే..మళ్ళీ ట్రస్ట్ అది ఇది అంటూ నేను చెప్పను" అంది కావ్య.  

కిరణ్ అబ్బవరం ప్రెగ్నెంట్...ఎం మాట్లాడుతున్నావు దీపికా..

  డాన్స్ ఐకాన్ సీజన్ 2 నెక్స్ట్ వీక్ ప్రోమో ఫుల్ కలర్ ఫుల్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో బ్రహ్మముడి కావ్య వేసే ఏ కంటెంట్ కామెడీ డైలాగ్స్ మాములుగా లేవు. ఎవర్రా దీపికాని ఈ షోకి తెచ్చింది అంటూనే ఆమె డైలాగ్స్ ని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ కి కిరణ్ అబ్బవరం రాబోతున్నాడు. ఇక స్టేజి మీదకు రాగానే ఓంకార్ బొకే ఇచ్చి ఇన్వైట్ చేసాడు. ఇక్కడి వరకు బానే ఉంది. తర్వాతే దీపికా టార్చర్ మొదలయ్యింది. "రహస్యంగా మిమ్మల్ని ఒకటి అడగాలి..రహస్య గారు ఎలా వున్నారు" అంది గుసగుసలాడుతూ.."బాగున్నారండి బాగున్నారు" అంటూ కిరణ్ కూడా రిప్లై ఇచ్చాడు. "మీరు ప్రెగ్నెంట్ గా ఉన్నారు కదా" అని అడిగేసింది. ఇక శేఖర్ మాష్టర్ ఐతే "ఏయ్ ఎం మాట్లాడుతున్నావ్" అన్నాడు. "నేను కాదండి. తను ప్రెగ్నెంట్" అన్నాడు కిరణ్. తర్వాత మళ్ళీ దీపికా "సర్ మీరిప్పుడు చూడలేదా..కపుల్స్ ఎవరైనా ప్రెగ్నెంట్ గా ఉంటే వి ఆర్ ప్రెగ్నెంట్ అని పెడుతున్నారు" అంటూ ఉన్న నిజాన్ని కామెడీగా చెప్పేసింది. "అవునా అండి...నేను చూడలేదు" అని చెప్పాడు కిరణ్ అబ్బవరం. ఇక ఈ ప్రోమోలో మాష్టర్లు, మెంటార్లు కలిసి డాన్స్ చేశారు. దానికి కిరణ్ "మాష్టర్ షో నుంచి బయటకు వెళ్లిపోయిన తర్వాత ఎక్కడైనా డాన్స్ స్కూల్ ఉంటే అక్కడ జాయిన్ అవుతా మాష్టర్ " అనేసరికి అందరూ నవ్వేశారు. "సర్ ఆ మాత్రం నాతో డాన్స్ చేయకుండా మీరు వెళ్ళిపోతే ఎలా" అని అడిగింది దీపికా. "అదొక్కటి వద్దమ్మా" అంటూ దీపికా డాన్స్ కి కిరణ్ అబ్బవరం కూడా భయపడిపోయారు. తర్వాత ఇద్దరూ కలిసి డాన్స్ చేసారు.