బెట్టింగ్ యాప్స్ ని ఇక ప్రమోట్ చేయను.. సారీ...

  సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ కారణంగా చాలా మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. బుల్లితెర, సోషల్ మీడియా సెలబ్రిటీస్ వాటిని తెగ ప్రమోట్ చేస్తున్నారు. ఐతే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసేవాళ్లను పోలీసులు ఊరుకోవడం లేదు. వాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ ఇష్యూ మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫుల్ ఫోకస్ పెట్టాయి. ఇలాంటి టైములో సురేఖ వాని కూతురు సుప్రీతా హోలీ రోజున హోలీ కలర్స్ ఒళ్ళంతా పులుముకుని ఒక వీడియోని రిలీజ్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.    "కొంతమంది ఇన్‌ఫ్లుయన్సర్స్‌ తెలిసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు. అందులో నేను ఒకదాన్ని. కానీ ఇప్పుడు ప్రమోట్ చేయడం ఆపేసాను. ప్రమోట్ చేసినందుకు సారీ. ఎవరైనా ఇన్‌ఫ్లుయన్సర్స్‌ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేటప్పుడు మీరు చూసినా వాటికి అట్రాక్ట్ కావొద్దు.. ఈజీ మనీకి అలవాటు పడొద్దు. అలాంటి యాప్స్ ఏమన్నా ఉంటే డిలీట్ చేసేయండి. ఇంకా వాళ్ళను ఫాలో కూడా అవ్వొద్దు. అందరికీ థాంక్యూ అండ్ ఒన్స్ అగైన్ సారీ" అంటూ చెప్పిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అలాగే ఈ వీడియోని వి.సి. సజ్జనార్ కి కూడా ట్యాగ్ చేసింది.      తెలంగాణా ఆర్టీసీ ఎండి, ఐపిఎస్ సజ్జనార్ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళ మీద బాగా ఫోకస్ చేశారు. ఈ మధ్య కాలంలో ఎన్నో కుటుంబాలు బెట్టింగ్ యాప్స్ వలన సూసైడ్స్ చేసుకుంటున్నారు. అది కూడా బెట్టింగ్ యాప్స్ వలన అంటూ వీడియోస్ చేసి మరీ మరణిస్తున్నారు. దాంతో ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. అలాగే సోషల్ మీడియాలో ఇప్పుడు సే నో టు బెట్టింగ్ అనే హ్యాష్ టాగ్ బాగా సర్క్యులేట్ అవుతోంది.  

Karthika Deepam 2: ఫుడ్ పాయిజన్ స్కెచ్ ఫెయిల్.. పెళ్ళికి ఒప్పుకున్న జ్యోత్స్న!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం- 2 (Karthika Deepam 2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-305 లో.. మేడమ్ మీరు రండి, జరిగేది చూడటానికి అంటూ జ్యోత్స్నకి వినోద్ చెప్పడంతో.. విజయ్ కంపెనీకి వస్తుంది జ్యోత్స్న. అక్కడ కార్తీక్, దీప, విజయ్ కంపెనీ ఉద్యోగులకు ఫుడ్ వడ్డిస్తూ ఉంటే జ్యోత్స్న చాటుగా చూస్తూ.. ఇక వీళ్లంతా ఒకరి తర్వాత ఒకరు పడిపోతారు.. తర్వాత బావ, దీప అరెస్ట్ అయిపోతారు. సత్యరాజ్ రెస్టారెంట్ మూతపడిపోతుంది. బావ నావైపు వచ్చేస్తాడని ఊహించుకుంటుంది.    ఎంత సేపటికి ఎవరికి ఏమీ కాకపోయేసరికి, ఫుడ్ చాలా బాగుందని అందరు పొగిడేసరికి జ్యోత్స్న రగిలిపోతుంది. ఇక అక్కడే వడ్డిస్తున్న వినోద్‌ని కాల్ చేసి పక్కకు పిలుస్తుంది జ్యోత్స్న. వాడి కాలర్ పట్టుకుని.. అసలు మందు సరిగా కలిపావా లేదా అని జ్యోత్స్న అరుస్తూ ఉండగా.. అప్పుడే మన వంటలక్క ఎంట్రీ ఇస్తూనే.. సరిగానే కలిపాడని దీప అంటుంది. జ్యోత్స్న బిత్తరపోతుంది. నువ్వు ఎంత కలపమన్నావో అంతా కలిపాడని దీప అంటుంది. కానీ మధ్యలో చిన్న గ్యాప్ ఒకటి వచ్చింది. ఆ గ్యాప్‌లో ఏం జరిగిందంటే అని దీపక్క జరిగింది మొత్తం చెప్తుంది. వినోద్ చెంప పగలగొట్టిన సీన్ చూపిస్తారు స్క్రీన్ మీద. ఇక వినోద్ వైపు జ్యోత్స్న కోపంగా చూడగానే.. వినోద్ చెంప పట్టుకుని నిలబడతాడు. నీ డబ్బుకి అమ్ముడు పోయిన వినోద్ నా దెబ్బకు మారిపోయాడని దీపక్క అంటుంది. వినోద్ నువ్వు వెళ్లని అంటుంది.    నిజానికి కొట్టాల్సింది వాడ్ని కాదు.. నిన్ను.. తినే భోజనంలో మందు కలిపిస్తావా అంటూ జ్యోత్స్నని దీప లాగిపెట్టి కొట్టేస్తుంది. ఇంతలో కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. నా పేరు చెప్పి ఇంకొకటి పీకు అని కార్తీక్ అంటాడు. బావా అని జ్యోత్స్న అరుస్తుంది. నోర్ముయ్.. శౌర్య విషయంలో ఆధారం లేదని నిన్ను వదిలిపెట్టలేదు.. దానికి వేరే కారణం ఉందని దీప అరుస్తుంది. నీ చుట్టు మంచి వాళ్లు ఉండటం వల్ల ఇలా తప్పించుకుంటున్నావ్ కానీ, తాగి కారు యాక్సిడెంట్ చేసిన రోజే జైలుకి వెళ్లాల్సిన మనిషివి అని కార్తీక్ అంటాడు. ఏం బతుకు జ్యోత్స్నా ఇది.. ఏ కుటుంబంలో పుట్టావ్.. ఏం పనులు చేస్తున్నావని దీప అంటుంది.   ఇక జ్యోత్స్నకి మాట్లాడే ఛాన్స్ దీప, కార్తీక్ లు ఇవ్వరు. మారవా నువ్వు.. ఏంటి ఈ పనులు.. అసలు నువ్వు ఎవరికి కూతురివి.. ఇదేనా పద్దతి.. బుద్ధిగా పెళ్లి చేసుకుని మంచి జీవితానికి ఆహ్వానం పలుకు. మా జోలికి రావద్దు.. మరోసారి ఇలా జరిగితే ఈ పంచాయితీ మీ ఇంట్లో మీ తాత ముందు జరుగుతుంది.. పడాల్సినవి పడ్డాయిగా పో బుద్ధిగా ఇంటికి పోమంటూ కార్తీక్ కూడా జ్యోత్సకి గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. వెంటనే దీపను తీసుకుని వెళ్లిపోతాడు కార్తీక్. ఇక జ్యోత్స్న తెగ రగిలిపోతుంది. ఛ వేస్ట్ గాడ్ని నమ్మకుని పరువు మొత్తం పోగొట్టుకున్నానని జ్యోత్స్న అనుకుంటుంది.    ఇక దీప, కార్తీక్ ఇంటికి వచ్చి.. జ్యోత్స్న చేసిన కుట్ర, తప్పిన ప్రమాదం గురించి చెప్పడంతో.. మా నాన్నను అడిగేస్తా కడిగేస్తా.. మా పుట్టింటికి వెళ్దాం పదా.. మా వదినను కూడా నిలదీయ్యాలి. కూతుర్ని ఇలా నా కొడుకు మీద వదిలేసి ఏం చేస్తున్నారో అడుగుతాను.. అర్జెంట్‌గా దానికి పెళ్లి చేసి పంపించమని చెప్పాలని కాంచన రెచ్చిపోతూ ఉంటుంది. కార్తీక్, దీపలు సర్దిచెబుతూ ఉంటారు.    ఇంతలో కాంచనకు సుమిత్రతో కాల్ చేయిస్తాడు దశరథ్. జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకుంది.. త్వరలో ముహూర్తాలు పెట్టబోతున్నామని చెప్పు సుమిత్ర అని కాల్ చేయిస్తాడు. సుమిత్ర ఫోన్ లిఫ్ట్ చేసిన కాంచన.. చెప్పు వదిన అనకుండా.. నేను కాంచననే మాట్లాడుతున్నా.. ఏంటి ఫోన్ చేసిన వాళ్లు మాట్లాడటం లేదని కోపంగా అంటుంది. దాంతో సుమిత్ర బాధగా.. నీ కోడలు దీపను కొట్టినందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావని అర్థమైంది వదినా అని మనసులో అల్లాడిపోతూ... అదేంటి వదినా బంధం అనేది ఒకటి ఉంటుంది కదా అంటుంది. అలవాటుగానే బాధపెడుతున్నారుగా.. ఇందులో ఏముంది? ఎందుకు ఫోన్ చేశారో చెబితే బాగుంటుందని కాంచన అంటుంది. నిజానికి కాంచన కోపం.. జ్యోత్స్న చేసిన ఫుడ్ పాయిజన్ స్కెచ్ గురించి కానీ సుమిత్ర అనుకునేది దీప నేను కొట్టానన్న నిజం చెప్పేసినట్లుందని బాధపడుతుంది. వదినా జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకుంది. త్వరలో పెళ్లి అని సుమిత్ర చెప్తుంది. కాంచన వెంటనే సంతోషం ఉంటానని కాంచన ఫోన్ పెట్టేస్తుంది.    అయితే కాంచన స్పీకర్‌లో పెట్టి మాట్లాడటంతో కార్తీక్, దీప, అనసూయ అంతా వింటారు. కాంచన కూడా సంతోషిస్తుంది. వెంటనే దీప లోపలికి వెళ్లి స్వీట్స్ పట్టుకుని వచ్చి.. మనకు రెండు శుభవార్తలు. జ్యోత్స్నకు పెళ్లి కుదిరింది. అంటే మన జోలికి ఇక రాదు. రెండోది ఈ రోజు విజయ్ కంపెనీకి ఫుడ్ పట్టుకుని వెళ్లడంతో మన పేరు ఇంకా పెరిగిందని స్వీట్స్ అందిస్తుంది. అయితే కార్తీక్ మాత్రం జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకోవడం ఏంటా అన్నట్లు షాక్‌లో ఉంటూనే దీప ఇచ్చిన స్వీట్ తీసుకుని వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఏ‌ం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ఇది కుకింగ్ షోనా.. పచ్చబొట్ల షోనా... నాకింకా పెళ్లి కాలేదు తల్లో....

  చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే ఈ వీక్ ఎపిసోడ్ ఫుల్ ఫన్నీగా సాగింది. ఇందులో దీపికా ఎపిసోడ్ ఐతే మాములుగా లేదు. పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే.. అలా ఉంది. అది కూడా జడ్జ్ జీవన్ తో చేసిన అల్లరికి స్టేజి మొత్తం షేకయ్యింది. దీపికా షోలోకి వస్తూనే జీవన్ ని చూస్తూ సిగ్గుపడుతూ వచ్చింది. ఆ సిగ్గుపడే విషయాన్ని సుమ చెవిలో చెప్పేసింది. సుమ ఐతే జీవన్ కి కంగ్రాట్స్ కూడా చెప్పేసింది. దాంతో అసలు ఏం జరిగిందో తెలీక షాకయ్యాడు జీవన్. (Deepika Rangaraju)   అసలు ఇది నిజంగా పచ్చబొట్టేనా అని దీపికా చేయి పట్టుకుని అడిగింది సుమా. "జీవన్ గారు నాకు మంచి మార్కులు ఇవ్వాలని నేను ఇలా పచ్చబొట్టు వేసుకుని వచ్చా." అని చెప్పింది. "ఇదేంటి ఇది కుకింగ్ షో అన్నారు...ఏంటి ఈ పచ్చబొట్లు అంటున్నావు...నీకు దణ్ణం తల్లి..పెళ్లి కానీ వాడిని పట్టుకుని ఇలా నీ చేతుల మీద పేర్లు వేయించుకుంటే ఇక పెళ్లి కూడా కాదు నాకు" అని జీవన్ తెగ ఫీలైపోయాడు. ఇక విష్ణుప్రియ ఐతే ఇంకో గట్టి కౌంటర్ ఇచ్చింది. "ఇంకా పెళ్లి అవుతుంది అనుకుంటున్నారా ?" అని అడిగింది. ఆ మాటకు గుండెను గట్టిగా పట్టుకుని తెగ బాధపడ్డాడు జీవన్. "ఐపోయింది ఇక ఇదంతా బిస్కెట్ యాపరమే ఇదంతా..నీకో దణ్ణం తల్లి" అనేసి వెళ్ళిపోయాడు. "బ్యాచిలర్ గా ఉన్నప్పుడే కాదు మూడు నాలుగు పెళ్ళిళ్ళైనా వదలను...మార్కుల కోసం" అంటూ తన కుకింగ్ కి మార్కులు ఇవ్వకపోతే ఇక అంతే అన్న రేంజ్ లో దీపికా వార్నింగ్ ఇచ్చింది.    జీవన్ కరోనా సమయంలో ఎంతోమందికి ఉచితంగా భోజనం అందించాడు. ఇక జీవన్ ఫ‌ల‌క్‌నుమాదాస్, ఈ నగరానికి ఏమైంది, సవారి, జాతిరత్నాలు, ఏక్ మినీ కథ, పుష్ప, విరాటపర్వం, కీడా కోలా వంటి మూవీస్ లో రకరకాల రోల్స్ లో కనిపించి ఎంటర్టైన్ చేసాడు.  

Brahmamudi: సీఈఓ కుర్చీ కోసం రుద్రాణి స్కెచ్.. బావ ఆచూకీ కోసం అప్పు ప్లాన్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-669లో.. స్వప్న, అప్పు కూర్చుని బాధగా కావ్య పరిస్థితి గురించి మాట్లాడుకుంటారు. టైమ్‌కి ఫుడ్ రెడీ చేసి అందరిని భోజనం చేయమంటుంది. ఎవరైనా బావ చావు గురించి మాట్లాడుతుంటే కోప్పడుతుంది. అసలు అక్క ఏం చేస్తుందో తనకైనా తెలుస్తుందో లేదో నాకైతే ఏం అర్థం కావడం లేదు. అక్కని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. అసలు అక్క ధైర్యంగా ఉందా? ధైర్యంగా ఉన్నట్లుగా నటిస్తుందా? లేక మెంటల్‌గా డిస్ట్రబ్ అయ్యి అలా ప్రవర్తిస్తుందా? అని స్వప్నతో అప్పు అంటుంది. కావ్యను అలా చూసి అపర్ణా ఆంటీ ఇంకా కుమిలిపోతున్నారు. కావ్య పిచ్చిది అయిపోతుందేమోననిపిస్తోందని స్వప్న అంటుంది. ఎందుకైపోతుంది అక్కా పిచ్చిది ఎందుకైపోతుందని అప్పు అంటుంది. మరి ఏం అర్థం చేసుకోవాలి అప్పు అని స్వప్న అనగానే.. బావ నిజంగానే వస్తాడేమో అలా ఎందుకు అనుకోకూడదని అప్పు అంటుంది. ఎలా అనుకోమంటావే.. నీ చేతులతో నువ్వే రాజ్ బట్టలు వస్తువులు తెచ్చి చూపించావ్ కదా.. మరిచిపోయావా అని స్వప్న అనగానే.. అవును అక్కా నేను బావ వస్తువుల్ని బట్టల్ని తెచ్చాను కానీ తన బాడీ చూడలేదు కదా అని అప్పు అంటుంది. అంటే అని స్వప్న అనగానే.. ఈ విషయంలో ఇంకా డీప్‌గా ఆలోచించాలి. ప్రతి కోణంలోనూ ఇన్వెస్టిగేట్ చెయ్యాలి.. ఎక్కడో ఏదో తప్పు జరిగింది. దాని మూలాలు పట్టుకోవాలి. చిన్న క్లూ దొరికినా డొంకంతా లాగుతానని అప్పు అంటుంది.   రాజ్ ఆలోచనల్లో ఉంటే యామినీ అక్కడికి వస్తుంది. కాలేజ్‌లో నీ వెంట తిరిగేటప్పుడు నీతో కలిసి ఇలా ఏకాంతంగా గడపాలని అనుకున్నాను.. నువ్వెప్పుడూ నాకు ఆ అవకాశం ఇవ్వలేదు.. కానీ ఆ దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చి నా ఇంట్లోనే పడేశాడు.. నాది నిజమైన ప్రేమ కాకపోతే ఇదంతా ఎందుకు జరుగుతుంది. ఇక మిగిలింది నిన్ను నా వైపుకు తిప్పుకోవడమే రాజ్ అని యామిని అనుకుంటూ రాజ్ దగ్గరికి వెళ్తుంది. వెళ్లడం వెళ్లడమే రాజ్‌ని వెనుక నుంచి హత్తుకుంటుంది. రాజ్ భయపడి వదిలించుకుని తోసేస్తాడు. వెంటనే రాజ్ యామినీని చూసి.. మీరా..సారీ సారీ నువ్వా యామినీ.. నేను ఎవరో ఏంటో అనుకుని భయపడిపోయానని రాజ్ అంటాడు. అయినా ఈ ఇంట్లో నిన్ను పట్టుకునే ధైర్యం నాకు తప్ప ఇంకెవరికి ఉంటుంది బావా అని యామిని అంటుంది. రాజ్ మౌనంగా ఉంటాడు. ఏంటి బావా ఇంకా డల్‌గానే ఉన్నావ్.. నీ జ్ఞాపకాల్లో నేను లేను అంతే కదా.. పోనీ మా మీద నమ్మకం కలగడం లేదా అని యామిని అంటుంది. అయ్యో లేదు యామినీ.. నీ కళ్లల్లో నా మీద ఇష్టం కనిపిస్తోంది.. కానీ అని రాజ్ అంటాడు. సరే.. ఏదోకటి.. వదిలెయ్.. ఏదో బాధలో మాట్లాడేస్తున్నా.. నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో బావా అని రాజ్ తో అనగానే అతను తన గదిలోకి వెళ్లిపోతాడు. నీకు డోస్ చాలడం లేదు రాజ్.. నీ గతం, జ్ఞాపకం అన్నీ నేనే అని నమ్మిస్తానని యామిని మనసులో ఫిక్స్ అవుతుంది.    మరోవైపు రాహుల్‌కి రుద్రాణీ సూట్ వేస్తుంది. ఏంటి మామ్ అవసరమా ఇది అని రాహుల్ అంటాడు. అవసరమే.. అవకాశం దొరికినప్పుడే మనం ఆ సీఈవో కుర్చీని లాగేసుకోవాలి.. ఆ రాజ్ గాడు చచ్చి నీకు నేరుగా అవకాశం ఇచ్చాడు కదా. పైగా ఆ కావ్య పోయినా మొగుడు ఎప్పుడు తిరిగి వస్తాడని ఎదురు చూసి చూసి పిచ్చిదైపోతుంది. మనం మాత్రం ఏడుస్తున్నట్లు నటిస్తూ కంపెనీ బాధ్యతలు తీసుకుంటాం.. ఇదే రైట్ టైమ్.. నేను చెప్పింది చెప్పినట్లు చెయ్ చాలు అని రుద్రాణి చెప్పగానే రాహుల్‌ సరే అంటాడు‌.  ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

నువ్వు నన్ను నిద్ర పోనివ్వవా రష్మీ..!

  బుల్లితెర మీద యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జబర్దస్త్ షోకి, శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి యాంకర్ గా పని చేస్తోంది. అలాగే మూవీస్ లో హీరోయిన్ గా కూడా నటిస్తోంది. రష్మీ షోస్, ఈవెంట్స్ లో ఫుల్ ఎనర్జీతో ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. రకరకాల  వీడియోస్, ఫోటో షూట్స్ అన్నీ చేస్తూ అలరిస్తూ ఉంటుంది. (Rashmi Gautam)    హోలీ పండగ సందర్భంగా తాజాగా కొన్ని పిక్స్ ని పోస్ట్ చేసింది రష్మీ. వైట్ డ్రెస్ లో కలర్ ఫుల్ చున్నీలో ఎంతగా మెరిసిపోతోందో చెప్పక్కర్లేదు. మంచి క్యూట్ గా ఉన్న ఆ పిక్స్ చూసిన నెటిజన్స్ ఐతే కామెంట్స్ చేస్తున్నారు. ఒక నెటిజన్ కొంటెగా "నువ్వు నన్ను నిద్రపోనివ్వవా రష్మీ" అంటూ కామెంట్ పెట్టారు. మిగతా వాళ్ళైతే "హోలికే రష్మీ అందమైన రంగులు పూసింది. అందరూ చందమామను టెలీస్కోప్ లో చూస్తారు కానీ నేను నా చందమామను నా కళ్ళతో చూస్తాను." అంటూ రష్మీ గురించి క్యూట్ కామెంట్స్ చేస్తూ హ్యాపీ హోలీ అంటూ విషెస్ చెప్పారు. ఇక రష్మీ ఐతే "ఇలా నవ్వులతో, సంతోషంతో నా జీవితాన్ని రంగులమయం చేసుకుంటున్నా" అంటూ కామెంట్ పెట్టింది.    రీసెంట్ గా తన పెట్ చుట్కి అస్థికలను గోదావరిలో కలిపొచ్చింది రష్మీ. తన పెట్ తో గడిపిన క్షణాల వీడియోస్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. అలాగే రష్మీ రోడ్డు మీద కనిపించే మూగ జీవాలకు హెల్ప్ చేస్తుంది, వాటికీ షెల్టర్ ఏర్పాటు చేస్తూ, ఇంటరెస్ట్ ఉన్నవారి చేత కూడా చేయిస్తూ ఉంటుంది. అలాంటి రష్మీ ఇప్పుడు హోలీ పండగ రోజున అందంగా మెరిసిపోతోంది.  

దొంగలున్నారు జాగ్రత్త.. పట్టపగలే 20 లక్షలు కొట్టేశారు!

  బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి రివ్యూస్ తో ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు ఇష్మార్ట్ జోడి 3 లో తన వైఫ్ కవితతో పాటు స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా టాస్కులు ఆడి గట్టి పోటీ ఇస్తున్నాడు. అలాంటి ఆది.. పట్టపగలే 20 లక్షలు కొట్టేశారని, దొంగలు తిరుగుతున్నారు జాగ్రత్త అంటూ కొన్ని టిప్స్ చెప్పాడు. ఆ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసాడు. తన ఇంటి పక్కన ఉండే ఇంట్లో ఇద్దరు టీచర్స్ ఉన్నారట. వాళ్ళు వాళ్ళ పనికి వెళ్ళిపోయాక ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్నాక సైలెంట్ గా వచ్చి తలుపులు పగలగొట్టి 20 లక్షల బంగారాన్ని  ఎత్తుకుపోయారని చెప్పాడు. అది కూడా పట్టపగలు అని చెప్పాడు. (Adi Reddy)   ఇంట్లో ఎవరూ లేనప్పుడే ఇంట్లో ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయి అని ఆది చెప్పాడు. అలా కాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ చెప్పాడు. "మీరెప్పుడైనా ఊరు వెళ్లాల్సి వస్తే లోకల్ పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇస్తే మంచిది. అప్పుడు వాళ్ళు నిఘా పెడతారు. డోర్ కి సిసి కెమెరా ఏర్పాటు చేస్తారు. అప్పుడు ఇంటికి ఎవరైనా వస్తే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మనం వెంటనే అలెర్ట్ కావొచ్చు...ఇక ఇంకో విషయం ఏంటంటే ఇంట్లో ఖరీదైన వస్తువుల్ని పెట్టుకోవద్దు. బ్యాంకులో లాకర్ ఇస్తారు. అందులో ఎన్ని వస్తువులు కావాలంటే అన్ని దాచుకోవచ్చు అని చెప్పాడు. దానికి నెటిజన్స్ వెంటనే ఆన్సర్స్ ఇచ్చారు. "ముందు మీ ఇంటికి ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ వేయించుకోండి...ఇంతకు ఆ దొంగ దొరికాడా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.    

ఈ ఆదికి పొగరు చాలా ఎక్కువైంది.. ఢీ షోలో లిప్ కిస్సులు!

  ఢీ జోడి షో లేటెస్ట్ ప్రోమో చూస్తే ఆది కామెడీ మాములుగా లేదు. ఫుల్ జోష్ తో ఎంటర్టైన్ చేసాడు. ఇక నెక్స్ట్ వీక్ ప్రోమోగా ఓన్ థీమ్ అని ఇచ్చారు. అంటే వాళ్ళ ఇష్టమైన కాన్సెప్ట్ మీద డాన్స్ చేయడం అన్నమాట. ఆది ఈ ఎపిసోడ్ కి పోలీస్ డ్రెస్ లో రాబోతున్న విషయం ప్రోమో ద్వారా తెలుస్తోంది. ఇక నందు ఐతే ఆదిని తెగ తిట్టుకున్నాడు. ఆదికి చాలా పొగరు ఎక్కువయిందని అనుకున్నాడు. ఆదికి ప్రేమించడానికి అసలు అమ్మాయే దొరక్కుండా చేస్తా అంటూ శపధం చేసాడు.    నందు మాటలు విన్న ఆది ఒక భారీ డైలాగ్ చెప్పాడు. 2 వేలు ఉంటే ఇందిరానగర్ కట్ట దగ్గర వెయిట్ చేస్తా, 5 వేలు ఉంటే కేపీహెచ్బీ దగ్గర వెయిట్ చేస్తా. ఎవరినీ ప్రేమించమని అడిగేది లేదు...ఎవరి దగ్గర చేయి చాచేది లేదు. సింగం సింగం అంటూ నటుడు సూర్య పాటను తెగ పాడేసాడు. నా కోరిక ఒకటే నందు "నా ఎదురుగా అమ్మాయి ఉన్నప్పుడు నా చేయి ఆ అమ్మాయి భుజం మీద ఉండాలి.. నా ముఖంలో చిరునవ్వు ఉండాలి... కెమెరాలు ఆఫ్ లో ఉండాలి "అంటూ ఒక డైలాగ్ చెప్పాడు.    ఆ తర్వాత సోనియా-సిద్దు దగ్గర వచ్చాడు. సోనియాని స్టేజి మీద పడుకోబెట్టి సిద్దుని గాల్లో హ్యాంగ్ చేసి ఊపుతూ వచ్చి బుగ్గ మీద, లిప్ కిస్ ఇచ్చేలా చేశారు. దాంతో స్టేజి మీద ఉన్న అందరూ చూసి నవ్వేశారు. ఇక డాన్స్ పెర్ఫార్మెన్సెస్ ఐతే మంచి హాట్ గా ఉన్నాయి.    ఇక ఈ షోని తిట్టే నెటిజన్స్ ఉన్నారు.. అలాగే పొగిడే నెటిజన్స్ ఉన్నారు. కొన్ని కామెంట్స్ ఐతే ఈ షోలో డాన్స్ ఎక్కడ ఉంది అని అడుగుతూ ఉంటే ఇంకొంతమంది మాత్రం ఢీ షోలో డాన్స్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  

Illu Illalu Pillalu : అత్త పొగడ్తలకి కోడలు ఎమోషనల్.. రామరాజుకి ఎదురుతిరిగిన ప్రేమ!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu Illalu Pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -105 లో... నర్మద అన్న మాటలు సాగర్ వేదవతికి చెప్పగానే.. నా కోడలు ఎంత గొప్ప మనసు గలది అని అనుకుంటుంది. సాగర్ చెప్పింది రామరాజు కూడా వింటాడు. సాగర్ అక్కడ నుండి వెళ్ళిపోయాక.. చూసారా మన కోడలు ఎంత మంచిదో గవర్నమెంట్ జాబ్ ఉంది. నా కొడుకుని ఎలా ఆడిస్తుందో అనుకున్నాను కానీ నా కోడలు బంగారం.. ఇలా అయితే అందరు హ్యాపీగా ఉంటారని వేదవతి అంటుంది. హ్యాపీగా ఉన్నదాన్ని పాడు చెయ్యడానికి ఉన్నాడు కదా మీ చిన్న కొడుకు అని రామరాజు అంటాడు. వాడు చాలా మంచివాడు. వాడు ఇలా పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఇలాంటి కొడలు వచ్చిందని వేదవతి అంటుంది. వీడు దగ్గరుండి చేసాడు కాబట్టి చేసుకున్నాడు లేదంటే నా మాటకి ఎదురివ్వడని రామరాజు అంటాడు.    మరొకవైపు ప్రేమ వర్క్ చేసే కాఫీ షాప్ దగ్గరికి భద్రవతి వాళ్ళు వస్తారు. అక్కడ తనని చూసి షాక్ అవుతారు. ఓనర్ ప్రేమపై కోప్పడుతుంటే భద్రవతి వెళ్ళాలని చూస్తుంది కానీ ప్రేమ ఆపుతుంది. భద్రవతి వాళ్ళు బాధపడుతూ ఇంటికి వెళ్తారు.   మరొకవైపు నర్మద కోసం వెయిట్ చేస్తుంది వేదవతి. స్కూటీ పై తనని ఎక్కించుకొని తీసుకొని వెళ్తుంటే అందరు ఎవరు ఆ పిల్ల అని అడుగుతారు. నా కోడలు అంటూ నర్మద గురించి వేదవతి గొప్పగా చెప్తుంటే.. నర్మద ఎమోషనల్ అవుతుంది.   ఆ తర్వాత ప్రేమ ఇంటికి రాగానే భద్రవతి.. రామరాజు వాళ్ళని పిలుస్తుంది. నా మేనకోడలిని కాఫీ షాప్ లో వర్క్ చెయ్యడానికి పంపిస్తున్నారంటూ కోప్పడుతుంటే నేను వెళ్లే విషయం వాళ్లకు తెలియదు.. ఇప్పటికే మావయ్య వాళ్ళని చాలా బాధపెట్టారు.. ఇక అనొద్దంటు చెప్పి ప్రేమ లోపలికి వెళ్తుంది.    తరువాయి భాగంలో జాబ్ మానేయమని రామరాజు అంటాడు. నేను మానేయనని ప్రేమ అంటుంది. మా నాన్నకి ఎదరుతిరుగుతున్నావంటూ  ప్రేమపై ధీరజ్ కోప్పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoindi Manasu : డైరీలో రామలక్ష్మి గురించి రాసింది చూసి షాకైన సవతి తల్లి!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు' (Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -351 లో... తనే రామలక్ష్మి అన్న నిజం బయటపెట్టాలని సీతాకాంత్ అనుకొని.. మీరు లండన్ లో ఎక్కడ ఉంటారు.. ఈ సారి లండన్ వచ్చినప్పుడు మీరే అంతా తిరిగి చూపించాలని అంటాడు. కావాలనే నన్ను టెస్ట్ చేస్తున్నారు కదా అసలు బయటపడననుకుంటుంది రామలక్ష్మి. ఇదిగోండి నా విజిటింగ్ కార్డు అని రామలక్ష్మి ఇవ్వగానే సీతాకాంత్ షాక్ అవుతాడు.   సీతాకాంత్ రాత్రి రామలక్ష్మి గురించి డైరీ రాస్తుంటాడు. ఎప్పుడు బాధగా డైరీ రాసే బావగారు ఇప్పుడేంటి ఇలా సంతోషంగా రాస్తున్నారని శ్రీవల్లి అనుకుటుంది. సీతాకాంత్ రామ్ ని పడుకోపెడుతుంటాడు. ఎప్పుడు రామలక్ష్మి అంటావ్ ఎవరామె అని రామ్ అడుగుతాడు. సరే చెప్తానంటూ రామలక్ష్మి గురించి చెప్తుంటే రామ్ పడుకుంటాడు. సీతాకాంత్ కూడా పడుకుంటాడు. సీతాకాంత్ రాసిన డైరీనీ శ్రీవల్లి తీసుకొని.. అందులో రామలక్ష్మి గురించి రాసింది చూసి షాక్ అవుతుంది. రామలక్ష్మి నిన్ను మళ్ళీ నా భార్యని చేసుకుంటానని అందులో రాసి ఉంటుంది. వెంటనే శ్రీలత, సందీప్ లకి శ్రీవల్లి చూపిస్తుంది. వాళ్ళు కూడా షాక్ అవుతారు. నేను అనుకున్నట్లే అవుతుందని శ్రీవల్లి అంటుంది.   మరొకవైపు రామలక్ష్మి, సుశీల, ఫణీంద్రలు మాట్లాడుకుంటారు. నేను ఇలాగే సీతా సర్ కళ్ల ముందు ఉంటే నా నుండి నిజం బయటపడేలా చెయ్యాలనుకుంటారు. నేను రేపటి నుండి సీతా సర్ కి దూరంగా ఉంటానని రామలక్ష్మి అంటుంది. మరుసటిరోజు సీతాకాంత్ రామ్ ని తీసుకొని రామలక్ష్మి ఇంటికి వస్తాడు. దాంతో ఎందుకిలా మాటిమాటికి వస్తున్నారు. మీ అబ్బాయికి చదువు వచ్చు.. యాక్టింగ్ చేస్తున్నాడు.. మీరే చెప్పండి చదువు మీ బాబుకి అని రామలక్ష్మి కోపంగా మాట్లాడుతుంది. దాంతో రామ్ నేనేం యాక్టింగ్ చెయ్యట్లేదని బాధగా వెళ్ళిపోతాడు. సీతాకాంత్ తన వెనకాలే వెళ్తాడు. తన మీద కోపం ఆ బాబుపై చూపించడం తప్పు అని ఫణీంద్ర, సుశీల ఇద్దరు రామలక్ష్మితో అంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam 2 : వంటల్లో పాయిజన్ కలిపించిన జ్యోత్స్న.. దీప కనిపెట్టగలదా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -304 లో... గౌతమ్ తాను ప్రేమించిన అమ్మాయిని కడుపు తీయించుకోమని డబ్బులు విసిరేస్తుంటే.. దీప చూసి కోప్పడుతుంది. నీకు ఇది అవసరం లేని విషయమని గౌతమ్ దీపపై అరుస్తాడు. దాంతో దీప కోపంగా వెళ్ళిపోతుంది.    మరొకవైపు జ్యోత్స్న అయితే పెళ్లికి ఒప్పుకుంది కానీ ఇప్పుడు మన చేతుల్లో గౌతమ్ సంబంధం తప్ప మరేం లేదని శివన్నారాయణ అంటాడు. గౌతమ్ కూడా మంచివాడే అని అనుకుంటారు. అప్పుడే జ్యోత్స్న వస్తుంది. ఏంటి అబ్బాయిని కలిసావా అని సుమిత్ర ఆత్రంగా అడుగుతుంటే.. లేదని జ్యోత్స్న చెప్తుంది. అందరు డిస్సాపాయింట్ అవుతారు. నేను కలవడమెందుకు మీరు అంతా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు కదా.. ఇక నేనేందుకు చూడడం మీరు అన్ని ఎరేంజ్ చేసుకోండి.. నేను తల వంచుకొని తాళి కట్టించుకుంటానని జ్యోత్స్న అనగానే.. అందరు హ్యాపీగా ఫీలవుతారు.    మరొకవైపు దీప గౌతమ్ ని గుర్తు చేసుకొని కోపంగా ఉంటుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు. జరిగింది మొత్తం దీప చెప్తుంది. నీకొక గుడ్ న్యూస్ విజయ్ కంపెనీ ఎప్పుడు జ్యోత్స్న రెస్టారెంట్ కి ఆర్డర్ ఇచ్చేది.. ఇప్పుడు మనకి ఇచ్చిందని కార్తీక్ చెప్పగానే దీప హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు జ్యోత్స్న వాళ్ళు ఎంత కోపంగా ఉన్నారోనని కార్తీక్ అంటాడు.   జ్యోత్స్నపై శివన్నారాయణ కోప్పడతాడు. నీ అసమర్ధత వల్లే అన్నీ ఇలా మిస్ అవుతున్నాయంటూ కోప్పడతాడు. జ్యోత్స్న నీపై నాకు నమ్మకం ఉంది అన్ని వదిలేసి రెస్టారెంట్ పై దృష్టి పెట్టమని సుమిత్ర చెప్తుంది. ఇప్పుడు ఆ సత్యరాజ్ రెస్టారెంట్ పని అయిపోతుందని పారిజాతంతో జ్యోత్స్న మాట్లాడుతుంది.    మరొకవైపు విజయ్ కంపెనీకి సంబంధించిన అన్ని ఆర్డర్స్ రెడీ చేసి తీసుకొని వెళ్తుంటారు. అక్కడ ఒక వెయిటర్  వంటల్లో ఏదో కలుపుతాడు. ఆ తర్వాత జ్యోత్స్నతో ఫోన్ మాట్లాడతాడు. అప్పుడే దీప వచ్చి ఎవరితో మాట్లాడుతున్నావని అడుగుతుంది. మా సిస్టర్ తో అని అతను చెప్తాడు. అన్ని వంటలు కంపెనీకి తీసుకొని వెళ్లి ఎంప్లాయిస్ కి సర్వ్ చేస్తారు. జ్యోత్స్న చాటు నుండి చూస్తూ ఫుడ్ పాయిజన్ అయి వాళ్ళు హాస్పిటల్ కి.. దీప బావలు స్టేషన్ కి అని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : రాజ్ గతంలో యామిని ఒక్కతే ఉన్నట్టు డ్రామా.. హాస్పిటల్ లో కావ్య!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -668 లో... రాజ్ లేడు, రాడని మీరు చెప్పట్లేదని రుద్రాణి అనగానే.. నీకు అసలు బుద్ధి ఉందా.. అంత దుఃఖంలో ఉన్న వాళ్ళని ఓదార్చాలిసింది పోయి ఇంకా బాధపెడతావా‌‌..‌ నువ్వు మారవు అని ఇందిరాదేవి రుద్రాణిని తిడుతుంది.    మరొకవైపు యామిని రాజ్ తో ఎంగేజ్ మెంట్ అయినట్లు మంచిగా క్రియేట్ చేసిందని ఫొటోస్ చూస్తూ యామిని వాళ్ల నాన్నతో ఆమె తల్లి చెబుతుంది. అప్పుడే యామిని వస్తుంది. ఇలా మాయాజాలంలో ఉండడం నాకూ నచ్చడం లేదని యామిని వాళ్ల నాన్న అంటాడు. కాలేజీ డేస్ లో ఇలాగే చేసావ్.. అప్పుడు కూడా ఇలా చెయ్యొద్దన్నాను వినలేదు.. మత్తుకి బానిసై మళ్ళీ బాగై వచ్చి ఇలా చేస్తున్నావని వాళ్ల నాన్న అంటాడు. రాజ్ కి గతంలో నేను మాత్రమే ఉన్నట్లు నమ్మించే ప్రయత్నం చేస్తున్నాను.. మీరు అడ్డు రాకండి అని యామిని అంటుంది. తన జీవితం తనకి నచ్చినట్లు ఉండనివ్వండి అని వాళ్ల అమ్మ అంటుంది.   ఆ తర్వాత కావ్య భోజనం చేయడానికి అందరిని పిలుస్తుంది. రాజ్ లేడన్న విషయం తెలిసి బాధలో మాకు తినాలి అనిపించడం లేదని చెప్పండి అని రుద్రాణి అనగానే.. అలా ఏం కాదు మా ఆయన ఉన్నాడు.. మీరు నమ్మండి అంటూ అందరిని భోజనం దగ్గరికి తీసుకొని వెళ్తుంది కావ్య.   ఆ తర్వాత రాజ్ తో కలిసి యామిని వాళ్ళు భోజనం చేస్తుంటారు. నువ్వు యామినిని ఎంతగానో ప్రేమించావని యామిని వాళ్ల అమ్మ అంటుంది. నాకు ఎందుకో చీకటిగా ఉంది. ఏం అర్థం అవ్వడం లేదని రాజ్ అనగానే.. యామిని లైట్స్ ఆఫ్ చేస్తుంది. కాండిల్ లైట్ ఎరేంజ్ చేసి.. చీకట్లో ఉన్నానని ఫీల్ అవుతున్నావ్ కదా బావ.. ఇద్దరం కలిసి నడవచ్చని తన చెయ్ ఇస్తుంది. దాంతో రాజ్ తన చేతిలో చెయ్ వేస్తాడు. ఇక యామిని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రాజ్ భోజనం చేస్తుంటాడు. మరొకవైపు కావ్య అందరికి భోజనం వడ్డీస్తుంది. అపర్ణ మాత్రం నా వాళ్ళ కాదు అంటూ తినకుండా వెళ్ళిపోతుంది. అందరు ఒక్కొక్కరుగా తినకుండా వెళ్లిపోతారు.    తరువాయి భాగంలో రాజ్ వెళ్తుంటే కావ్య చూసి రాజ్ కార్ వెనకాలే పరుగెడుతుంది. రాజ్ దగ్గరికి రాగానే కావ్య కళ్ళు తిరిగిపడిపోతుంది. దాంతో కావ్యని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాడు రాజ్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ఓంకార్ మీద మండిపడ్డ అమర్....నీకు ఆ హక్కు లేదంటూ గట్టిగా వార్నింగ్

  బుల్లితెర మీద ఇష్మార్ట్ జోడి కొత్త సీజన్ 3 దుమ్ము రేపుతోంది. ఐతే ఇప్పటి వరకు ఎలిమినేషన్స్ సరదాసరదాగా గడిచిపోయింది కానీ ఇప్పుడు మాత్రం కొంచెం గట్టిగానే ఫైట్ కాబోతోంది అన్న విషయం ప్రోమో ద్వారా తెలుస్తోంది. రీసెంట్ గా రిలీజయిన ప్రోమోలో అమర్ దీప్ బాగా ఫైర్ అవడం అలాగే యాంకర్ ఓంకార్ కూడా సీరియస్ కావడం చూడొచ్చు.. ఒక టీమ్ గ్రీన్ డ్రెస్ లు, ఇంకో టీమ్ ఎల్లో డ్రెస్ లు వేసుకొచ్చారు. ఎప్పటిలాగే జోక్స్, నవ్వులు అన్నీ మామూలుగానే జరిగాయి. రాజేష్ , సుజాత బాగా నవ్వించారు. ఇక ఇక్కడ జోడీస్ కి సంబందించిన వాళ్ళ పేరెంట్స్ కూడా షోకి వచ్చారు. ఇక వాళ్ళ ఫామిలీ మెంబర్స్ ని పిలిచి ఈ షో మీద ఉన్న ఒపీనియన్ ని అడిగాడు ఓంకార్. ఫామిలీ అంటే ఎలా ఉండాలి, ఎలా కలిసి ఉండాలి .. ఈ షో సొసైటీకి మంచి మెసేజ్ ని ఇస్తోంది. అలాగే వైఫ్ ని ఎలా ట్రీట్ చేయాలి, ఎలా రెస్పెక్ట్ చేయాలి అనేది కూడా ఈ షో ద్వారా తెలుస్తోంది. వైఫ్ అండ్ హజ్బెండ్ ఎలా కనెక్టెడ్ గా ఉండాలో చాలామంది నేర్చుకుంటున్నారు. ఇక ఓంకార్ ఐతే భర్తల చేతులకు కోన్స్ ఇచ్చి భార్యల చేతులకు గోరింటాకు పెట్టించాడు. తర్వాత మ్యూజికల్ ఆరెంజ్స్ అనే గేమ్ టాస్క్ ఇచ్చాడు.  ఐతే ఇక్కడే చిక్కొచ్చింది..అమర్ దీప్ వాళ్ళ టీమ్ ని రంజీ టీమ్ గా పోల్చి తమ టీమ్ కి ఛాంపియన్స్ టీమ్ అని పెట్టుకున్నాడు. "నే చెప్పనా రంజీ ట్రోఫీ ఓడిపోతావ్ ఛాంపియన్స్ ట్రోఫీ సెకండ్ ఇన్నింగ్స్ " అంటూ కామెంట్ చేసేసరికి అమర్ దీప్ కి కోపం వచ్చేసింది. "మనలో ఒకడు గెలిచాడని ఎలా సంతోష పెడతామో మన పక్కన వాడు పడిపోయినప్పుడు అలాగే బాధపడాలి" అంటూ సీనియర్ నటుడు ప్రదీప్ మీద ఏంటన్నా ఆ డైలాగ్ అంటూ ఫుల్ ఫైర్ అయ్యాడు. మధ్యలో ఆది వచ్చి "అంతా ఐపోయాక అందరూ వెళ్లి మాట్లాడతారు బ్రో" అన్నాడు. "ఆది నేను నీ గురించి మాట్లాడలేదు" అన్నాడు అమర్. "పెర్సొనాలిటీని ఒక్క సీన్ తో అలా జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు" అంటూ అభయ్ వైఫ్ రాకింగ్ రాకేష్ కి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఇంతలో ప్రేరణ వచ్చి ఏదో దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే ఎలా అనేసరికి...అక్కానీకు సంబంధం లేదు .. నువ్వుండక్కా అంటూ అమర్ మండిపోయాడు. ఇక ప్రదీప్ వచ్చి "మరి ఎవరికీ సంబంధం ఉంది" అంటూ రెచ్చిపోయాడు. తర్వాత ఓంకార్ కూడా అమర్ దీప్ వాళ్ళను ఉద్దేశించి "మీరు ఒక స్ట్రాటజీతో ఉన్నారు. అది మిస్ అవడం వల్ల..ఏదో డిస్టర్బ్ అయ్యి ఏదేదో మాట్లాడుతున్నారు. వాళ్ళ సెలబ్రేషన్ ని నాతో సహా ఆప్ హక్కు ఎవరికీ లేదు" అంటూ ఘాటుగా వార్నింగ్ ఇచ్చాడు.  

కథ వేరుంటాది కుర్రాడా ? 

  బిగ్ బాస్ హౌస్ లో "కథ వేరుంటాది" అనే ఊత వాక్యంతో బాగా పాపులర్ అయ్యాడు సయ్యద్ సోహైల్. హౌస్ లో కొంచెం రొమాంటిక్ గా, అగ్రెసివ్ గా , మంచిగా టాస్కులు ఆడుతూ ఉండేవాడు. అలాంటి సోహైల్ కొన్ని రోజులుగా మీడియాలో ఎక్కడా కనిపించడం లేదు. తన ఇన్స్టాగ్రామ్ లో మాత్రం ఫుల్ అప్డేట్ గా ఉంటున్నాడు. రకరకాల ఫోటో షూట్స్ తో అలాగే వేరే ప్లేసెస్ కి వెళ్తూ ఫొటోస్ వీడియోస్ ని పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇక ఫుడ్ వండుతూ కూడా వీడియోస్ ని స్టేటస్ గా పెడుతూ ఉంటాడు. ఐతే సయ్యద్ ఒక్కసారిగా చాలా క్యూట్ గా ట్రాన్సఫార్మ్ ఐపోయాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో సయ్యద్ లుక్ చూసి నెటిజన్స్ ఫుల్ ఫిదా అవుతున్నారు. సోహైల్ "బూట్ కట్ బాలరాజు, మిస్టర్ ప్రెగ్నెంట్ , లక్కీ లక్ష్మణ్" లాంటి మూవీస్ లో నటించాడు. ఇక కొన్ని నెలల క్రితం కళింగపట్నం అనే రెస్టారెంట్ ని స్టార్ట్ చేసాడు. ఐతే కొంత కాలం క్రితం తన మూవీస్ ని చూడాలంటూ సయ్యద్ సోహైల్ ఆడియన్స్ ని కోరాడు. కానీ మూవీస్ తనకు కలిసి వచ్చినట్టు కనిపించడం లేదు. ఇక సయ్యద్ కి అఖిల్ సార్థక్, విజె సన్నీ, మెహాబుబ్ దిల్ సే వీళ్లంతా బెస్ట్ ఫ్రెండ్స్ కూడా..వీళ్ళు కూడా బుల్లితెర మీద వాళ్ళ సత్తా చాటుతూ ఉంటారు. ఇప్పుడు సోహైల్ కొత్త లుక్ లో సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్నాడు.. ఇన్నాళ్లు పెంచిన గడ్డాన్ని తీసేసరికి ఎవరీ కొత్త హీరో అని అందరూ అనుకునేలా ఉన్నాడు. ఇక నెటిజన్స్ ఐతే ఈ కొత్త లుక్ కి ఫిదా ఐపొతూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ లుక్ లో కదా మిమ్మల్ని చూడాలని అనుకుంటున్నది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

శ్రీముఖి ఇంట్లో వండిపెట్టేది...నేను తినేదాన్ని

  తమన్నా సింహాద్రి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శ్రీముఖికి బెస్ట్ ఫ్రెండ్. ఎప్పుడు చూసిన తమన్నా సింహాద్రి శ్రీముఖి ఇంట్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఎక్కడికి వెళ్లినా కూడా శ్రీముఖి, అవినాష్, తమన్నాసింహాద్రి వీళ్ళే ఎక్కువగా వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ వీడియోస్ ని కూడా శ్రీముఖి ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటుంది. అవినాష్ కానీ తమన్నా కానీ శ్రీముఖి ఇంటికి వెళ్ళినప్పుడల్లా తానె ఇంట్లో వంట చేసి పెడుతూ ఉంటుంది. ఆ వీడియోస్ ని, రీల్స్ ని కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఇప్పుడు తమన్నా సింహాద్రి తెగ ఫీలైపోతోంది. అమ్మా వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అన్నీ అమ్మే చేసిపెట్టేది..కాబట్టి ఎలాంటి శ్రమ ఉండేది కాదు. కానీ ఇప్పుడు తాను వంట చేసుకోవాలంటే చాలా బాధగా ఉందని చెప్పింది. తనకు ఇప్పుడు శ్రీముఖి ఇల్లే గుర్తొస్తోందని చెప్పింది. శ్రీముఖి ఇంట్లో ఉన్నప్పుడు అన్నీ తానె చూసుకునేది అని కావాల్సినవి వండిపెట్టేది అని...హ్యాపీగా టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ తినేదాన్ని అని చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు తన ఇంట్లో తాను వాడుకోవాలంటే మాత్రం చాలా కష్టంగా ఉంది అంటూ పాపం బాధపడుతూ చెప్పింది. తమన్నా సింహాద్రి బుల్లితెర మీద అడపాదడపా కనిపించేది కానీ ఇప్పుడు అసలు కనిపించడంలేదు. ఇక ఈమె పాలిటిక్స్ లోకి ఎంట్రీ కూడా ఇచ్చింది. ఈమె జనసేనలో పని చేసింది. జనసేన తరపున మంగళగిరి సీటు రాకపోయేసరికి ఆమె ఇండిపెండెంట్ గా పోటీ చేసింది. ఈ విషయంగా ఆమె అప్పట్లో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు...ఇక బిగ్ బాస్ సీజన్ 3 లోకి ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటింది తమన్నా సింహాద్రి.  

ప్రస్తుతం అమ్మతనాన్ని ఎంజాయ్ చేస్తోంది.. త్వరలో కెరీర్ మీద ఫోకస్

  బుల్లితెర మీద బ్రహ్మముడి మానస్ చాలా ఫేమస్. మానస్ సీరియల్స్ లో నటిస్తూ ఉంటాడు. అలాగే ఈవెంట్స్ లో ఇంకా రకరకాల ఆల్బమ్స్ లో కనిపిస్తూ ఉంటాడు. కోయిలమ్మ, మానసిచ్చి చూడు వంటి సీరియల్స్ తో పేరు తెచ్చుకున్నాడు అలాగే నీతోనే డాన్స్ 2 .0  లో కూడా ఫైనల్స్ వరకు వెళ్ళాడు. ఇప్పుడు డాన్స్ ఐకాన్ లో సాధ్వి అనే డాన్సర్ కి మెంటార్ గా ఉన్నాడు. అలాగే విష్ణుప్రియతో కలిసి కొన్ని డాన్స్ ఆల్బమ్స్ కూడా చేసాడు. ఐతే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పాడు. 'విష్ణుప్రియకు, నాకు అలా సెట్ ఐపోయింది. జరీ జరీ పంచె కట్టు సాంగ్ చేసాం . అది 70 మిలియన్ వ్యూస్ వెళ్లాయి. తర్వాత వచ్చిన గంగులు ఆల్బం సాంగ్ కూడా బాగా హిట్ అయ్యింది. "మా కాంబినేషన్ అలా హిట్ అయ్యింది. వేరే ఏదొచ్చినా చేస్తాం" అని చెప్పాడు మానస్. విష్ణు ప్రియా ఏదైనా చేయగలదు. ఆమె ఎంత ప్యాషనేట్ పర్సన్ అనేది బిగ్ బాస్ షో ద్వారా ఆడియన్స్ కి కూడా బాగా తెలిసి వచ్చింది. ఇక మా అబ్బాయి ఆరు నెలల పిల్లాడు. పేరు ధ్రువ.. తనతో బాగా టైం స్పెండ్ చేస్తున్నా...ఎంత వర్క్ ఉన్నా ధ్రువకి కూడా టైం కేటాయిస్తూ ఉంటాను. ఇంటికి వెళ్ళాక వాళ్ళతోనే ఇక అన్నాడు. అలాగే  మానస్ తన వైఫ్ శ్రీజ గురించి కూడా చెప్పాడు. ప్రస్తుతం ఆమె అమ్మతనాన్ని ఎంజాయ్ చేస్తోంది. కొంతకాలం అయ్యాక ఆమె తన కెరీర్ మీద ఫోకస్ చేస్తుంది. ఈరోజున యూత్ అంతా తమను తాము ప్రూవ్ చేసుకోవడానికి ఇష్టపడుతూ వెళ్తున్నారు. త్వరలో శ్రీజ కూడా బాబు కొంచెం ఒక ఏజ్ కి రాగానే తన కెరీర్ మీద ద్రుష్టి పెడుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. బుల్లితెర మీద బ్రహ్మముడి సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయ్యాడు మానస్.

Illu illalu pillalu : కోడలి నిర్ణయాన్ని మెచ్చుకున్న వేదవతి.. రామరాజుపై భద్రవతి ఫైర్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -104 లో.....ప్రేమ ధీరజ్ లు అసలు ఎమన్నా తిన్నారో లేదోనని పాలు తీసుకొని వచ్చి ధీరజ్ కి ఇస్తుంది వేదవతి. కానీ వేదవతితో ధీరజ్ మాట్లాడడానికి ఇష్టపడడు. మీరు మాట్లాడకపోయిన పర్వాలేదు కానీ ఆ పాలు అయినా తాగండి అంటూ వేదవతి బాధపడుతూ వెళ్ళిపోతుంది. వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ లేదు దూరం ఉంది.. సఖ్యత లేదని వేదవతి బాధపడుతుంది. అప్పుడే నర్మద, సాగర్ లు వేరువేరుగా పడుకోవడం చూసి వీళ్ళకి ఏమైందని వేదవతి అనుకుంటుంది. మరుసటిరోజు భాగ్యం తన భర్తని ఇడ్లీ అమ్మడానికి పంపిస్తుంది. శ్రీవల్లి ఉప్మా ప్లేట్ లో బావ అని రాసి ఫోటో తీసి చందుకి పంపిస్తుంది. అది చూసి చందు ఫోన్ చేస్తాడు. చందు ఫోన్ చెయ్యగానే శ్రీవల్లి మెలికలు తిరుగుతుంది. మిమ్మల్ని బావ అనొచ్చా అని శ్రీవల్లి అనగానే అనొచ్చు అని చందు అంటాడు. దాంతో శ్రీవల్లి సిగ్గుపడుతుంది అదంతా చుసిన భాగ్యం అబ్బాయి దార్లోకి వస్తున్నాడని అనుకుంటుంది. శ్రీవల్లి పంపిన ఫోటోని తిరుపతి చూసి చందుని ఆటపట్టిస్తాడు. ఆ తర్వాత వేదవతి కిచెన్ లో ఉండగా.. నర్మద వచ్చి టీ అడుగుతుంది. వేదవతి టీ ఇస్తుంది. సాగర్ కి నీకు ఏదైనా గొడవ జరిగిందా.. వేరువేరుగా పడుకున్నారని వేదవతి అడుగగా.. మాకేం గోడవలు లేవని చెప్పి నర్మద ఆఫీస్ కి వెళ్తుంది. అప్పుడే సాగర్ వస్తాడు.. మీకేం గొడవ అయింది చెప్పకుంటే నాపైన ఒట్టేనని సాగర్ తో వేదవతి అనగానే.. అన్నయ్యకి పెళ్లి కాకుండా మనం పిల్లలిని కంటే బాగోదని నర్మదా చెప్పిందని వేదవతితో సాగర్ అంటాడు. చిన్నపిల్ల అయిన బాగా ఆలోచించిందని వేదవతి అంటుంది. అదంతా రామరాజు వింటాడు. తరువాయి భాగంలో ప్రేమ కాఫీ షాప్ లో పని చెయ్యడం భద్రవతి వాళ్ళు చూస్తారు. ఇంటికి వచ్చి రామరాజుపై గొడవకి దిగుతారు. నువ్వే నా కోడలిని పంపిస్తున్నావంటు రామరాజుపై భద్రవతి విరుచుకుపడుతుంది. ఆ తర్వాత ఎం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాలిసిందే.  

Karthika Deepam2 : పనిమనిషిని ప్రెగ్నెంట్ చేసిన గౌతమ్.. అతడిని జ్యోత్స్న పెళ్ళి చేసుకుంటుందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -303 లో.....కార్తీక్ దగ్గరికి శ్రీధర్ వచ్చి.. మీ తాత, మీ అమ్మకి నీకు అన్యాయం చేసాడు. ఈ పేపర్ పై సంతకం పెట్టు కోర్ట్ కి ఈడుద్దామని శ్రీధర్ అంటాడు. అవసరం లేదని కార్తీక్ అంటాడు. వాళ్ళు ఆస్తులు ఇవ్వకపోయిన మాకు బంధువులే.. నీకు తాతపై ఉన్న కోపం ఇలా తీర్చుకోవాలనుకుంటున్నావు కానీ వద్దని కార్తీక్ అంటాడు. నువ్వు అయిన చెప్పు దీప అని దీపతో శ్రీధర్ అనగానే కార్తీక్ మాటే తన మాటఅన్నట్లు దీప చెప్తుంది. దాంతో శ్రీధర్ కోపంగా.. మీరు వదిలేసినా, నేను వదలను.. మామ ఈ అల్లుడు అంటే చూపిస్తానని శ్రీధర్ అనుకుంటాడు. మరొకవైపు దాస్, స్వప్న, కాశీలు భోజనం చేస్తుంటారు. కాంచన అత్తయ్యకి అన్యాయం జరిగిందని కాశీ అంటాడు. కార్తీక్ అన్నయ్యకి జరిగింది.. ఇప్పుడు ఆస్తులకి అసలైన వారసురాలు జ్యోత్స్న అని స్వప్న అనగానే.. దాస్ కి గతం గుర్తు వచ్చి అసలైన వారసురాలు ఏంటి అది.. ఆపాలి అంటూ వెళ్ళబోతుంటే అప్పుడే ఏదో సౌండ్ వస్తుంది. దాంతో మళ్ళీ గతం మర్చిపోతాడు. కార్తీక్ అన్నయ్యకి అన్యాయం జరిగిందని అలా అన్నాడేమో అని స్వప్న, కాశీలు దాస్ మాట్లాడినదాన్ని గురించి మాట్లాడుకుంటారు. ఆ తర్వాత జ్యోత్స్న దగ్గరికి సుమిత్ర వచ్చి పెళ్లి చేసుకోమని అడుగగా.. వద్దని తను అంటుంది. అందరు వచ్చి రిక్వెస్ట్ చేస్తారు.. పెళ్లి చేసుకుంటే ఆస్తులన్నీ నీ పేరున రాస్తా అని సుమిత్ర అనగానే జ్యోత్స్న సరే అంటుంది. గౌతమ్ చాలా మంచివాడు పైగా నీ ఫ్రెండ్ అని సుమిత్ర అంటుంది. సరే నేను వెళ్లి గౌతమ్ తో మాట్లాడి నిర్ణయం చెప్తాన జ్యోత్స్న అనగానే అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. మరొకవైపు గౌతమ్ వాళ్ళింట్లో పనిమనిషితో లవ్ ట్రాక్ నడుపుతాడు. తాను ప్రెగ్నెంట్ అని అమ్మాయి పేరెంట్స్ గౌతమ్ దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేస్తారు. అప్పుడే దీప గౌతమ్ ఆర్డర్ చేసిన ఫుడ్ తీసుకొని వస్తుంది. అక్కడ ఏదో గొడవ జరుగుతుందని డౌట్ వచ్చి ఏమైందని అడుగుతుంది. నీకు అవసరం లేదని దీపపై గౌతమ్ కోప్పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : కోట్ల డీలింగ్ వదిలిపెట్టి మైథిలి కోసం వెళ్లిన సీతాకాంత్...

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -350 లో..... ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్య నువ్వు ఇక్కడ ఉండకూడదు.. లండన్ వెళ్ళిపోమని రామలక్ష్మితో ఫణీంద్ర అంటాడు. మిమ్మల్ని ఇలా వదిలేసి.. నేను వెళ్ళలేనని రామలక్ష్మి అంటుంది. సీతాకాంత్ రామలక్ష్మి గురించి ఆలోచిస్తూ తనలో తాను మాట్లాడుకుంటాడు. రామలక్ష్మి కూడా సీతాకాంత్ గురించి ఆలోచిస్తుంటుంది  మరుసటి రోజు ఉదయం శ్రీవల్లి కాఫీ తీసుకొని వచ్చి సందీప్, శ్రీలత కి షేర్ చేస్తుంది. ఒకే కాఫీ సగం సగం చేసుకోవాలా అని శ్రీలత అంటుంది. అప్పుడే సీతాకాంత్ రామ్ ని తీసుకొని రెడీ అయి వస్తాడు. ఎక్కడికి అని శ్రీలత అంటుంది. రామ్ వాళ్ళ మిస్ ని కలవడానికి అని సీతాకాంత్ అంటాడు. ఎందుకు నువ్వు పని మానుకొని వెళ్తున్నావని శ్రీలత అడుగుతుంది. నాన్న నన్ను రమ్మని ఒక్కటే గోల అని సీతాకాంత్ చెప్పగానే.. నేనెక్కడ గోల చేశానని రామ్ అంటాడు. అన్నయ్య ఈ రోజు మీటింగ్ ఉందని సందీప్ అంటున్నా వినకుండా సీతాకాంత్ రామ్ ని తీసుకొని వెళ్తాడు. అన్నయ్య ఎందుకు కోట్ల డీలింగ్ ని వదిలి మైథిలి కోసం వెళ్తున్నాడని సందీప్ అంటాడు.ఇక మైథిలి, బావగారు పెళ్లి చేసుకుంటే మన పరిస్థితి అంతేనని శ్రీవల్లి అంటుంది. అలా జరగనివ్వను.. నా కంట్రోల్ లో ఉన్న అమ్మాయిని తీసుకొని వచ్చి సీతాకి పెళ్లి చేస్తాను.. అప్పుడు మైథిలి వెంట పడడు అని శ్రీలత అంటుంది. మరొకవైపు మైథిలి వాళ్ళు భోజనం చేస్తుంటారు. అప్పుడే పనిమనిషి డబ్బు అడుగుతుంది. మొన్నే ఇచ్చాను కదా అని మైథిలి అంటుంది. సరిపోవడం లేదని పనిమనిషి అనగానే ఒక పని చెయ్ రెండు గల్లాలు పెట్టుకో.. ఒకరి సంపాదన అందులో వేస్తే మీకు అవసరం ఉన్నప్పుడు ఉపయోగపడుతుందని చెప్తుంది. గతంలో సీతాకాంత్ తో అలాగే అన్నది రామలక్ష్మి గుర్తుచేసుకుంటుంది. అదే సమయంలో సీతాకాంత్ రామ్ ని తీసుకొని వచ్చి బయట ఉండి పనిమనిషికి రామలక్ష్మి చెప్పింది వింటాడు. నువ్వు నా  రామలక్ష్మివే నాకు తెలుసు ఎలా బయటపెట్టాలని సీతాకాంత్ అనుకుంటాడు. ఇక సీతాకాంత్ ఇంట్లోకి వెళ్ళగానే టిఫిన్ చెయ్యమని ఫణీంద్ర వాళ్ళు అనగానే.. వాళ్ళతో కలిసి టిఫిన్ చేస్తాడు సీతాకాంత్. వెకేషన్ కి లండన్ వెళ్ళాలనుకుంటున్నాం.. మీరు అక్కడే చదివి వచ్చారు కాబట్టి మీకు అన్ని ప్లేస్ లు ఐడియా ఉంటాయని సీతాకాంత్ అనగానే.. మైథిలి ఏదో చెప్పి కవర్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : రాజ్ మనుసుని యామిని మార్చనుందా.. అతన్ని వెతుక్కుంటూ కావ్య!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -667 లో.....రాజ్ లేడని అందరు చెప్తున్న కావ్య వినిపించుకోదు. ఉన్నాడు.. నాకు నమ్మకం ఉంది.. నేను వెళ్లి వెతుకుతానంటూ కావ్య గట్టిగా అరుస్తుంది. డాక్టర్ వచ్చి ఏంటి అందరికి డిస్టబెన్స్.. ఇప్పుడు పేషెంట్ బాగానే ఉంది డిశ్చార్జ్ చేస్తున్నామని డాక్టర్ అంటాడు. చెయ్యండి డాక్టర్... వెళ్లి నా భర్తని వెతుక్కుంటానని కావ్య అంటుంది. ఒకవైపు కావ్య డిశ్చార్జ్ అయి వెళ్తుంటే.. మరొక వైపు రాజ్ ని యామిని వాళ్ళు డిశ్చార్జ్ చేసి తీసుకొని వెళ్తారు. యామిని రాజ్ ని ఇంటికి తీసుకొని వెళ్తుంది. ఇంటికి వెళ్లేసరికి గోడ నిండా రాజ్ తన ఫొటోస్ ఉంటాయి. చూడు బావ మనకి ఎంగేజ్మెంట్ కూడా అయిందని యామిని చెప్తుంటుంది. చిన్నప్పటి నుండి నువ్వే ప్రాణం అనుకుంటుంది బాబు అని యామిని వాళ్ళ అమ్మ అంటుంది. రాజ్ ని యామిని గదిలోకి తీసుకొని వెళ్తుంది. అక్కడ కావాలనే వాళ్ళు కాలేజీలో దిగిన ఫొటోస్ అన్ని కలపి ఒక ఆల్బమ్ లాగా పెడుతుంది. అదంతా రాజ్ చూస్తాడు. మళ్ళీ యామిని వచ్చి.. ఇప్పుడు అవన్నీ ఎందుకు రెస్ట్ తీసుకోమని రాజ్ ని పడుకోబెడుతుంది. మరొకవైపు కావ్య డిశ్చార్జ్ అయి ఇంటికి వస్తుంది. రాజ్ ఫోటోని తీసుకొని మీరు ఎక్కడో ఒకచోట ఉన్నారు.. ఇప్పుడు మీకు ఆకలి అవుతుందేమోనని కావ్య ఫోటో చూస్తూ మాట్లాడుతుంటే అందరు తనని చూసి బాధపడుతారు. మీరేం అధైర్యపడకండి అత్తయ్య.. మీ అబ్బాయిని నేను తీసుకొని వస్తానని అపర్ణకి కావ్య చెప్తుంది. ఫోటో తీసుకొని కావ్య లోపలికి వెళ్తుంది  ఇలానే వదిలేస్తే పిచ్చిది అయ్యేలా ఉంది.. రాజ్ లేడని చెప్పండి అని రుద్రాణి అనగానే ఇందిరాదేవి తన చెంపచెల్లుమనిస్తుంది. నేను అన్నదాంట్లో తప్పేముంది మనకి తెలుసు ఆ విషయం.. తనకి అర్థమయ్యేలా చెప్పాలి కదా.. చేయవలసిన కార్యక్రమలు చెయ్యాలి కదా అని రుద్రాణి అంటుంటే.. రాజ్ ఉన్నాడని తను నమ్ముతుందంటు రుద్రాణికి బుద్ది చెప్తుంది ఇందిరాదేవి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.