llu illalu pillalu : భద్రవతి మాటలని భాగ్యం అనుకూలంగా మార్చుకోనుందా.. రామరాజు ఏం చేయనున్నాడు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -108 లో..... పెళ్లి ముహూర్తం గురించి రామరాజు కుటుంబం, భాగ్యం కుటుంబాలు గుడిలో మాట్లాడుకుంటారు.‌ మా ఆచారం ప్రకారం అబ్బాయి ఇంటి వాల్లే పెళ్లి నిశ్చితార్థం జరిపించాలని భాగ్యం అంటుంది. దాంతో అలా ఎలా జరుగుతుంది. సంప్రదాయం ప్రకారం అమ్మాయి ఇంటి దగ్గర పెళ్లి జరగాలని రామరాజు అంటాడు. మా ఆచారం ప్రకారం అబ్బాయి ఇంటి దగ్గర జరుగుతుందని భాగ్యం అంటుంది. అది కుదరదని వేదవతి ఖచ్చితంగా చెప్తుంది. దాంతో ఇక తెగేదాకా లాగొద్దని భాగ్యం వాళ్ల ఆయన భాగ్యంతో అనగానే సరే పెళ్లి మా ఇంటి దగ్గర జరిపిస్తామని భాగ్యం చెప్తుంది. దాంతో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఎలా అని భాగ్యం వాళ్ల ఆయన అంటాడు. మనకి సాయం చెయ్యడానికి ఎవరో ఒకరు వస్తారులే అని భాగ్యం అంటుంది. అప్పుడే భద్రవతి, సేనాపతి ఇద్దరు భాగ్యం దగ్గరికి వస్తారు. మీరు సంబంధం కుదర్చుకున్న వాళ్లు మంచి వాళ్ళు కాదు.. నగల కోసం మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు వాళ్ల చిన్న కొడుకు అని భద్రవతి అంటుంది.  నువ్వు చెప్పేది మేమ్ ఎందుకు నమ్మాలని భాగ్యం అంటుంది. ఆ పెళ్లి చేసుకుంది నా మేనకోడలిని కాబట్టి ఆ విషయం లో స్టేషన్ కి కూడా వెళ్ళాడు ఆ రామరాజు. మీ కూతురిని ఆ ఇంటికి ఇచ్చి గొంతు కొయ్యకు అని భాగ్యంతో భద్రవతి చెప్పి వెళ్తుంది. మనకి సాయం చేసేటోళ్లు వస్తారని చెప్పాను కదా.. ఇప్పుడు ఆ రామరాజు తల నా చేతిలో ఉందని భాగ్యం వాళ్ల ఆయనతో అంటుంది. మరొకవైపు ప్రేమ బాధపడుతుంటే నర్మద వచ్చి దైర్యం చెప్తుంది. ఆ తర్వాత రామరాజు మిల్ దగ్గర ఉండగా భాగ్యం తన భర్తని తీసుకొని వస్తుంది. మీ చిన్నకొడుకు నగల కోసం పెళ్లి చేసుకున్నాడంట.. మీరు స్టేషన్ కి వెళ్లారట ఈ విషయం చెప్పనేలేదు.. ఈ విషయం ఆ పిల్ల మేనత్త, అ పిల్ల నాన్న చెప్పారు. ఇప్పుడు నా కూతురిని మీ ఇంటికి ఇవ్వాలంటే భయంగా ఉందని రామరాజుతో భాగ్యం అంటుంది. తరువాయి భాగం లో ధీరజ్ భోజనం బయట నుండి తీసుకొని వస్తారు. ప్రేమ ధీరజ్ లు ఆ భోజనం తింటుంటే వేదవతి బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika deepam2 : గౌతమ్ ని దీప గుర్తుపడుతుందా.. జ్యోత్స్నకి పెళ్ళిచూపులు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -307 లో..... కార్తీక్ రెస్టారెంట్ కి వెళ్తుంటే మేమ్ కూడా వస్తామని కాంచన అంటుంది. టిఫిన్ సెంటర్ కి సెలవు ఇచ్చింది.. మీరు రెస్ట్ తీసుకోవడానికి అక్కడికి తీసుకొని వెళ్ళడానికి కాదని కార్తీక్ అనగానే.. మరి ఇంట్లో బోర్ గా ఉంటుందని అనసూయ అనగానే అయితే బూజు కర్రపట్టుకొని ఇల్లంతా క్లీన్ చెయ్యండి అని శ్రీధర్ ఎంట్రీ ఇస్తాడు. అది సరిపోకపొతే మా ఇంట్లోకి వెళ్లి క్లీన్ చెయ్యండి అని శ్రీధర్ అంటాడు. ఇంట్లో బుజు ఏంటి ఒంటికి పట్టిన బూజు కూడా క్లీన్ చేస్తారని కార్తీక్ అంటాడు. ఎందుకు వచ్చారో చెప్పండి అని కార్తీక్ అడుగుతాడు. మీరు వచ్చి నాకు స్వీట్స్ ఇవ్వాలిసింది పోయి మీకే స్వీట్ ఇస్తున్నానని శ్రీధర్ అంటాడు. ఎందుకని కార్తీక్ అడుగుతాడు‌. నిన్న కావేరితో గుడ్ న్యూస్ అంటూ స్వప్న చెప్తుంది కదా అంటే ఆస్తులలో మీ తాత వాటా రాశాడానే కదా అని శ్రీధర్ అంటాడు. అలా అని మీరు అనుకుంటున్నారు స్వప్న గుడ్ న్యూస్ అంది జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకున్నందుకు అని కార్తీక్ చెప్పగానే శ్రీధర్ షాక్ అవుతాడు. అంత బాగుంటే జ్యోత్స్నని పెళ్లి చేసుకొని ఆస్తుల అన్నిటికి నువ్వే వారసుడువి అయ్యేవాడివి.. ఈ మహాతల్లి ని చేసుకున్నావ్ తను నీ జీవితంలోకి వచ్చినప్పటి నుండి నీకు అన్నీ కష్టాలే అని దీపని శ్రీధర్ అంటాడు. కార్తీక్ చూడలేక అమ్మ ఆతన్ని ఇక్కడ నుండి వెళ్ళమని చెప్పు లేదంటే భార్య కోసం తండ్రి మీద చెయ్ చేసుకున్నాడని అంటారని కార్తీక్ అనగానే శ్రీధర్ వెళ్ళిపోతాడు.  ఆ తర్వాత కార్తీక్, దీప వెళ్తుంటే శ్రీధర్ అన్న మాటలకి దీప బాధపడుతుంది. కార్తీక్ ఫోన్ మాట్లాడతాడు. అప్పుడే గౌతమ్ ఒక అమ్మాయితో క్లోజ్ గా ఉండడం దీప చూస్తుంది. దీప కోపంగా వాళ్ల కార్ పైకి రాయి విసిరుతుంది. ఆ లోపే కార్ వెళ్తుంది. ఎవరు వాళ్ళు అని కార్తీక్ అడుగుతాడు. మొన్న చెప్పాను కదా పనిమనిషికి కడుపు చేసి డబ్బులతో కొనాలని అనుకున్నాడు అన్న కదా వాడే అని దీప చెప్తుంది. ఎంత మందిని అని మనం ఆపగలమని కార్తీక్ అంటాడు. అమ్మాయిలు మరి ఇలాంటి వాళ్ళను నమ్ముతున్నారని దీప అంటుంది. మరొకవైపు జ్యోత్స్నకి పెళ్లి చూపులు జరుగుతాయి ముందు గౌతమ్ వాళ్ల పేరెంట్స్ వస్తారు. ఆ తర్వాత గౌతమ్ ఎంట్రీ ఇస్తాడు. అమ్మానాన్న లతో వచ్చేవాడిని కానీ టెంపుల్ కి వెళ్లి వచ్చేసరికి లేట్ అయింది అని గౌతమ్ అనగానే ఎంత మంచివాడు అని పారిజాతం అంటుంది. జ్యోత్స్న రెడీ అయి కిందకి వస్తుంది. తనని చూసి గౌతమ్ ఫ్లాట్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : సిరి ఫోటో దగ్గర ఏడ్చేసిన రామ్.. సవతి తల్లిని రామలక్ష్మి నిలదీస్తుందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -354 లో..... రామ్ ని చూడడానికి రామలక్ష్మి వస్తుంది. ఎందుకు వచ్చారని శ్రీలత అడుగుతుంది. రామ్ కి జ్వరం అని తెలిసి చూడడానికి వచ్చానని రామలక్ష్మి అంటుంది. ఇప్పుడు రామ్ కి ఎలా ఉందని రామలక్ష్మి సీతాకాంత్ ని అడుగుతుంది. ఇప్పుడు కొంచెం పర్లేదని సీతా చెప్తాడు. ఒకసారి నేను రామ్ ని చూడాలని రామలక్ష్మి లోపలికి వెళ్తుంది. ఈ మైథిలి బావగారి కోసం వచ్చిందా లేక బాబు కోసం వచ్చిందా అని శ్రీలతతో శ్రీవల్లి అంటుంది. రామలక్ష్మిని చూడగానే రామ్ కోపంగా మొహం తిప్పుకుంటాడు. మీరు నన్ను తిట్టారని రామ్ అంటాడు. నేను నీ కోసం బోలెడు చాక్లెట్లు తెచ్చాను ఆడుకోవాలని వచ్చానని రామలక్ష్మి అంటుంటే.. అవునా సరేనని రామ్ మాములు అయిపోతాడు. ఫ్రెష్ అయి రా భోజనం రెడీ చేస్తానని రమ్య అంటుంది. ఆ తర్వాత నాన్న అంటూ సీతాకాంత్ ని రామ్ పిలుస్తుంటాడు. ఇక్కడే ఉన్నారు సమాధానం చెప్పకుండా అలా ఉన్నారని శ్రీలతని రామ్ అనగానే.. ఏంట్రా నాన్న అంటున్నావ్.. వాడు నీకు మేనమామ అంతే.. పుట్టగానే తల్లిని, నా కూతురిని పొట్టన పెట్టుకున్నావు. వాడిని నువ్వు నాన్న అని పిలవడం వల్లే వాడికి పెళ్లి అవ్వడం లేదు. ఇంకోసారి అలా పిలిచావో నీ సంగతి చెప్తానని రామ్ పై శ్రీలత కోప్పడుతుంది. మరొకవైపు రమ్య కిచెన్ లో వంట చేస్తుంటే రామలక్ష్మి వెళ్లి హెల్ప్ చేస్తుంది. మీరెవరని రమ్యని రామలక్ష్మి అడుగుతుంది. సీతా సర్ మోటివేషన్ వల్ల ఇప్పుడు జనరల్ మేనేజర్ అయ్యాను.. సర్ ఛాన్స్ ఇస్తే తన లైఫ్ లోకి వెళ్ళాలనుకుంటున్నానని రమ్య అనగానే.. సీతా సర్ తన వైఫ్ జ్ఞాపకాలతో ఉన్నాడు.. మీరు అత్యాశ పడకండి అని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత రమ్య, రామలక్ష్మి లు భోజనం చేయమని రామ్ ని పిలుస్తుంటే.. రామ్ సిరి ఫోటో దగ్గర ఏడుస్తుంటాడు. అప్పుడే రామలక్ష్మి, రమ్య, సీతాకాంత్ లు ఏమైందని అడుగుతారు. దాంతో ఏడుస్తూ రామ్ మళ్ళీ బయటకి వస్తాడు. నాకు చెప్పు ఏం జరిగిందో అని రామలక్ష్మి అడుగగా శ్రీలత అన్న మాటలు మొత్తం చెప్తాడు. దాంతో కోపంగా రామలక్ష్మి రామ్ ని తీసుకొని శ్రీలత దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : రాజ్ బ్రతికే ఉన్నాడంటూ కావ్య ఛాలెంజ్.. అతను పిండప్రధానం చేయగలిగాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -671 లో... రాజ్ వెళ్తున్న కార్ వెనకాలే కావ్య పరిగెత్తుకొని వెళ్తుంది. రాజ్ ఒక దగ్గర ఆగుతాడు. యామిని కార్ దిగి షాప్ కి వెళ్తుంది. కావ్య సరిగా రాజ్ దగ్గరికి వచ్చి స్పృహ కోల్పోతుంది. దాంతో రాజ్ తన కార్ లో హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాడు. తనెవరో తెలియదని డాక్టర్ కి రాజ్ చెప్తాడు. యామిని ఫోన్ చేసి ఎక్కడికి వెళ్ళావ్ త్వరగా రా.. నువ్వు ఇక్కడికి వచ్చేవరకు నేను ఇక్కడే ఉంటానని యామిని అనడంతో రాజ్ బిల్ కట్టేసి వెళ్ళిపోతాడు. కావ్య స్పృహలోకి వచ్చి రాజ్ గురించి అడగ్గా ఇప్పుడే బిల్ కట్టి వెళ్ళారని రిసెప్షన్ లో చెప్తారు. ఆ తర్వాత రాజ్ చనిపోయాడని కావ్యకి అర్థమయ్యేలా చెప్పండి అని రుద్రాణి ఇంట్లో వాళ్ళతో అంటుంటే.. లేదు మా ఆయన బ్రతికే ఉన్నాడని కావ్య అంటుంది. ఎవరు నమ్మలేదు కదా చివరకు నా నమ్మకం నిజం అయింది. నా సంకల్పo గెలిచింది.. ఇందాక మా ఆయనని చూసానని కావ్య చెప్తుంటే అందరు ఆశ్చర్యంగా చూస్తారు. నేను స్పృహ తప్పి పడిపోతే, ఆయనే నన్ను హాస్పిటల్ లో చేర్పించారని కావ్య అంటుంది. నిన్ను చూసినవాడు. ఇంటికి రాకుండా ఎలా ఉంటాడు. ఇక పిచ్చి బాగా ముదిరింది వెంటనే హాస్పిటల్ కి తీసుకొని వెళ్లి ట్రీట్ మెంట్ చేపించాలి లేదంటే చాలా కష్టమని రుద్రాణి అంటుంది. కావ్య చెప్తుంటే అందరు కావ్య అయ్యో పాపం అంటు దీనంగా చూడడం తప్ప ఎవరు నమ్మరు. మా ఆయన బ్రతికే ఉన్నాడని చెప్తే ఎవరు నమ్మట్లేదు కదా ఆయనను తీసుకొని రాకుంటే నా పేరు కావ్యనే కాదని కావ్య ఛాలెంజ్ చేస్తుంది. యామిని దగ్గరికి తన పేరెంట్స్ వస్తారు. ఏం చేస్తున్నావని వాళ్ల నాన్న అడుగగా.. రాజ్ ఐడెంటిటీ మారుస్తున్నానని యామిని అంటుంది. ఐడెంటిటీ మార్చినంత మాత్రనా రాజ్ మారుతాడా.. గతం గుర్తు వస్తే క్షమించడు అని వాళ్ళ నాన్న అంటాడు. అందుకే ఫారెన్ తీసుకొని వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నానని యామిని అంటుంది. తరువాయి భాగంలో రాజ్ కి సుభాష్ పిండప్రధానం చేస్తుంటే.. కావ్య వచ్చి నా భర్త బ్రతికే ఉన్నాడు. తండ్రి అయినా సరే మీకు అర్హత లేదని కావ్య సుభాష్ తో అంటుంది. రాజ్ ఫోటోని కావ్య అక్కడ నుండి తీస్తుంది. ఆ తర్వాత  ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

అక్కడ షో మానేసి ఇక్కడ స్టార్ మాలో ఎంట్రీ...పల్లవితో ముచ్చట్లు, డాన్స్ లు  

  ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్ చేసింది. అందులోనూ ఇమ్మానుయేల్ - పల్లవి ఎపిసోడ్ ఫుల్ జోష్ తో సాగింది. హోలీ స్పెషల్ ప్రోగ్రాంగా ప్రసారమైన ఈ ఎపిసోడ్ లో ఒక్కొక్కరి మీద రంగులు వేసుకున్నారు లేదు పూసుకున్నారు. ఈ ఎపిసోడ్ లో ఇమ్ము షో మొత్తాన్ని కబ్జా చేయడానికి ట్రై చేసాడు. ఐతే ఇమ్ముని స్పెషల్ గా ట్రీట్ చేసింది శ్రీముఖి. "ఇమ్ము నీతో నేను ఫ్రెష్ గా మాట్లాడాలి. ఏంటి అక్కడ షోలో మానేసావని తెలిసింది..వెల్కమ్ టు స్టార్ మా..ఇక్కడ చేస్తున్నావంటే అక్కడ మానేసినట్టే కదా. ఈ ఛానెల్ లోకి వచ్చావ్. అంటే ఇక నీకు రంగులే  " అని చెప్తూ ఇన్వైట్ చేసింది. ఆ మాటలకు షాకయ్యాడు ఇమ్ము. ఐతే షోలో ఉన్న ఐదుగురు అమ్మాయిల్లో పల్లవి అంటే ఇష్టం అని చెప్పేసరికి "పెళ్ళెప్పుడు..అసలే జుట్టు మొత్తం ఊడిపోతోంది" అని అడిగింది శ్రీముఖి. పెళ్లి త్వరలో ఈ స్టేజి మీదనే జరుగుతుంది అని చెప్పాడు ఇమ్ము. ఇక రోహిణి బాగా చూసుకుంటాను అని చెప్పి అక్కడ నుంచి ఇక్కడికి తెచ్చింది అంటూ చెప్పాడు ఇమ్ము. ఇక సాంగ్స్ టాస్క్ లో గెలిచినందుకు యాదమ్మ రాజు, ఇమ్ముని వెళ్లి రంగులు పోయామని చెప్పేసరికి రాజు వెళ్లి పల్లవి బుగ్గ మీద రంగు పూశాడు. దాంతో ఇమ్ముకి ఫుల్ కోపం వచ్చేసింది. రాజు, ఇమ్ము నా పిల్ల అంటే నా పిల్ల అంటూ అర్జున్ రెడ్డిలా ఫీలవుతూ కాసేపు అరుచుకున్నారు. "పల్లవి నీ కోసం అన్నీ మానేసి వచ్చా ఇదన్నా ప్లీజ్ ..చూసేవాళ్ళందరికీ వీడికి అక్కడ బానే ఉంది అని అనుకోవాలి కదా" అన్నాడు. ఇమ్ము తన బుగ్గకు రంగు రాసుకుని పల్లవితో డాన్స్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేసాడు.

చిరంజీవి, ఏఆర్ రెహ్మాన్, చిత్రమ్మకు క్షమాపణలు చెప్పిన రాకేష్....

  ఇష్మార్ట్ జోడి సీజన్ 3 నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఐతే ఈ ప్రోమో మొత్తం కూడా రాకేష్ కబ్జా చేసేసాడు. అత్తా-కోడళ్ళు అదేనండి రాకేష్ వాళ్ళ అమ్మ - భార్య సుజాత కలిసి రాకేష్ ని టార్చెర్ పెట్టారు. దాంతో చిరంజీవికి, సారీ చెప్పాల్సి వచ్చింది. అదేంటో చూద్దాం...రాకేష్ వాళ్ళ అమ్మ స్టేజి మీద వచ్చి చిరు సాంగ్ "దాయి దాయి దామ్మా"కి డాన్స్ చేసారు. దాంతో రాకేష్ ఆపండి అంటూ అరిచాడు. "చిరంజీవి గారు క్షమించాలి..మా ఫ్యామిలీ మీకు తెలుసు. ఎన్నోసార్లు మీ దగ్గరకు వచ్చి బ్లేసింగ్స్ తీసుకున్నా..మళ్ళీ వచ్చి తీసుకుంటా." అన్నాడు..తర్వాత సుజాత మాములుగా ఏడిపించలేదు. రోజా మూవీ నుంచి "నా చెలి రోజావే" సాంగ్ కి ముందు వచ్చే గాత్రాన్ని ఇమిటేట్ చేయమని సుజాతకు ఓంకార్ చెప్పేసరికి రాకేష్ షాకయ్యాడు. వెంటనే నిలబడి "ఏఆర్ రెహ్మాన్ సర్ ..నేను మీకు తెలీదు. ఇలాంటి తప్పు మళ్ళీ జరక్కుండా చూసుకోవడానికి మాక్స్ ట్రై చేస్తున్నా సర్ ..చిత్రమ్మా నేను మీకు తెలుసు. అమ్మా నేను నీ కొడుకు లాంటి వాడిని.. మీ కోడలు ఇంత దారుణం చేస్తుంటే చూడలేకపోయానమ్మా " అంటూ అందరికీ క్షమాపణలు చెప్పుకుంటూ వచ్చాడు. ఇక రాకేష్ చెప్పిన ఫన్నీ క్షమాపణలకు అందరూ నవ్వేశారు. ఇక ఈ గ్రాండ్ ఫినాలేలో పార్టిసిపేట్ చేసిన జోడీస్ అందరికీ రకరకాల టాస్కులు ఇచ్చాడు ఓంకార్. ఇక అమర్ మాట్లాడుతూ "ఇష్మార్ట్ జోడి ఈజ్ ది బెస్ట్ ఇన్ మై లైఫ్ ..ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ ఫామిలీ మెంబర్స్ ఐ లవ్ యు ఆల్" అంటూ అరిచి మరీ గట్టిగా చెప్పాడు. తర్వాత సీనియర్ నటుడు ప్రదీప్ కూడా మాట్లాడారు "36 ఏళ్ళ నుంచి ప్రేమ ఉంటుంది కాబట్టి టెక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా ఉంటాం. నా భార్యే కదా అర్ధం చేసుకుంటుందిలే అనుకుంటాం. ఇలాంటి వేదిక ఉంటే ఐ లవ్ యు సరస్ "అని చెప్పడం ఆనందంగా ఉంది అని చెప్పారు.    

ఓంకార్ కాళ్ళ మీద పడిన అమర్

  ఇష్మార్ట్ జోడి సీజన్ 3 ఆదివారం ఎపిసోడ్ ఫుల్ జోష్ తో సాగింది. ఇక గ్రాండ్ ఫినాలేకి కొన్ని జోడీస్ సెలెక్ట్ అయ్యాయి. అమర్ - తేజు, ప్రదీప్ - సరస్వతి, ఆదిరెడ్డి - కవిత, రాకేష్ - సుజాత, ప్రేరణ - శ్రీపధ్, సోనియా - యష్ జంటలు గ్రాండ్ ఫినాలేలోకి ఎంట్రీ ఇచ్చాయి. ఇందులో లాస్య-మంజునాథ్, అభయ్ - భవాని ఓడిపోయారు. ఐతే అపోజిట్ టీమ్ వాళ్ళు గెలిచి సెలబ్రేషన్ చేసుకుంటూ ఉండగా అమర్ ఫుల్ ఫైర్ అయ్యాడు. గెలిచినప్పుడే కాదు ఓడిపోయినప్పుడు వాళ్లను చూసి పలకరించాలి అంటూ మండిపడ్డాడు. దానికి యాంకర్ ఓంకార్ కూడా ఫుల్ ఫైర్ అయ్యాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం గట్టిగానే జరిగింది. "అందరూ రండి అన్నప్పుడు నువ్వు ఓడిపోయిన వాళ్ళ దగ్గరకు వెళ్లకుండా ఆదిరెడ్డి బాగా ఆడాడు అంటూ ఎందుకు అతని దగ్గరకు వెళ్ళావ్ మరి" అంటూ ఓంకార్ అడిగాడు. "ఇండియా వాళ్ళు గెలిచినప్పుడు వెళ్లి పాకిస్తాన్ వాళ్ళను కావలించుకుంటామా మన ప్లేయర్స్ ని కావలించుకుంటామా" అంటూ సీనియర్ నటుడు ప్రదీప్ కూడా అమర్ మీద ఫైర్ అయ్యాడు. తర్వాత ఎదురుగా ఉన్న ఆడియన్స్ చప్పట్లు కొడుతున్నా కూడా "కొట్టు కొట్టు కొట్టు" అంటూ అమర్ కొంచెం ఎక్కువగానే రియాక్ట్ అయ్యాడు. దాంతో ఓంకార్ కూడా "ఏమిటి అమర్ వాళ్ళను సెలెబ్రేట్ చేసుకోవద్దు అంటావ్, అభిమానులను క్లాప్స్ కొట్టద్దు అంటావ్..మరి ఎం చేయాలి...మీరు ఒక స్ట్రాటజీతో ఉన్నారు " అని అడిగాడు. "అన్నా ఈశ్వరుడి మీద ఒట్టేసి చెప్తున్నా ఏ స్ట్రాటజీ లేదు అన్నా..." అన్నాడు అమర్.."ఎవరి సెలబ్రేషన్ ని ఆపే హక్కు నాతో సహా ఎవరికీ లేదు...ఇష్మార్ట్ జోడిలో లాస్ట్ లో ఇలా ప్రీ-ఫైనల్ లో ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. నాకే బాధగా ఉంది. ఇలా మాట్లాడుకుంటామని అనుకోలేదు. నేను కూడా నీ వల్ల ఈరోజు కోప్పడాల్సి వచ్చింది. నేను కోపాన్ని ఎవరి మీద చూపించలేదు..తప్పు చేస్తే నేను తట్టుకోలేను..అందులోనూ నా తమ్ముడి లాంటి అమర్ తప్పు చేసాడని అరిచాను...నేను తప్పు చేసి ఉంటే నన్ను కూడా క్షమించు" అన్నాడు ఓంకార్. వెంటనే అమర్ వెళ్లి "అన్నా ఊరుకో..ఇంత దూరం తీసుకొచ్చింది నువ్వు...తిట్టినా, కొట్టినా నువ్వే ..ప్రేమగా ఉండేది నువ్వు, ప్రేమగా మాట్లాడేది నువ్వే" అంటూ ఓంకార్ కాళ్ళ మీద పడ్డాడు. ప్రదీప్ గారు అమర్ మనవాడు రండి అందరూ కలిసి మాట్లాడుకోండి అంటూ ఓంకార్ అందరినీ కలిపేసాడు. ఈ గొడవ కూడా ఒకందుకు మంచిదే...ఇలా ఎన్ని గొడవలు వచ్చినా బంధం తెగేవరకు లాక్కోకూడదు..అంటూ చెప్పాడు ఓంకార్. ఎవరో ఒకరు తగ్గి క్షమాపణ అడిగితే ఆ ప్రేమ మళ్ళీ కొనసాగుతుంది అంటూ చెప్పాడు.

Eto Vellipoindi Manasu : రమ్య, సీతాకాంత్ లు క్లోజ్ గా ఉండటం చూసిన రామలక్ష్మి..! 

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు' (Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -353 లో... రామలక్ష్మి అన్నమాటలకి రామ్ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే శ్రీవల్లి, శ్రీలత లు వచ్చి.. ఏమైంది డల్ గా ఉన్నావని అడుగుతారు. మా మిస్ నన్ను తిట్టింది.. ఇక మా మిస్ తో మాట్లాడనని కోపంగా పైకి వెళ్ళిపోతాడు. రామ్ ఆ మిస్ ని కలవకుండా ఉంటేనే కదా బావగారు తనని చూడరని శ్రీవల్లి, శ్రీలతలు హ్యాపీగా ఫీల్ అవుతారు. మరొకవైపు రామలక్ష్మి అన్నమాటలు సీతాకాంత్ గుర్తుచేసుకొని బాధపడతాడు.   రామలక్ష్మి తను సీతాకాంత్  తో కఠినంగా మాట్లాడిన తీరు గుర్తుచేసుకొని నేను త్వరగా లండన్ వెళ్ళిపోవాలని అనుకుంటుంది. సీఐకి ఫోన్ చేసి నేను లండన్ వెళ్ళాలి.. ఆ రంగా కేసు ఎంత వరకు వచ్చిందని మాట్లాడుతుంది. అప్పుడే సుశీల, ఫణీంద్రలు వస్తారు. నువ్వు కఠినంగా ఉండడం ఏమో గాని పిల్లాడు బాధపడుతున్నాడని అంటారు. అవును తాతయ్య మా ఆయన తర్వాత సిరి అంటే చాలా ఇష్టం.. అలాంటిది నేనే జాగ్రత్తగా చూసుకోవాలి కానీ నేనే బాధపడుతున్నానని రామలక్ష్మి ఫీల్ అవుతుంది. సీతాకాంత్ రామ్ దగ్గరికి వచ్చేసరికి చలి జ్వరంతో వణికిపోతుంటాడు. అది చూసి సీతాకాంత్ అమ్మ అని పిలుస్తుంటే రమ్య వస్తుంది. తనే దగ్గర ఉండి రామ్ కి టాబ్లెట్ వేసి పడుకోబెడుతుంది.   రామ్ మీ కోసం బెంగ పెట్టుకున్నాడు. జ్వరం వచ్చిందని రామలక్ష్మికి సీతాకాంత్ మెసేజ్ చేస్తాడు. మళ్ళీ డిలీట్ చేస్తాడు కానీ ఆ మెసేజ్ రామలక్ష్మి చూస్తుంది. మరుసటి రోజు వామప్ చేద్దామంటూ సీతాకాంత్ ని రమ్య గార్డెన్ లోకి తీసుకొని వెళ్తుంది. అప్పుడే రామలక్ష్మి వస్తుంది. రామలక్ష్మిని సీతాకాంత్ చూసి ఇప్పుడు రమ్యతో క్లోజ్ గా ఉంటేనన్న రామలక్ష్మి బయటపడుతుందేమో చూడాలని అనుకుంటాడు. రమ్య, సీతాకాంత్ లని చూసి రామలక్ష్మి జెలస్ ఫీల్ అవడం శ్రీలత, శ్రీవల్లి వాళ్ళు చూస్తారు. ఏంటి ఇలా వచ్చారు అని రామలక్ష్మిని వాళ్ళు అడుగుతారు. రామ్ కోసమని రామలక్ష్మి సమాధానం చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam 2: ఆమె పెళ్ళిచూపులకి నగలిచ్చిన శివన్నారాయణ.. దీప ఉండకూడదని జ్యోత్స్న ఫిక్స్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం 2 (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-306లో.. జ్యోత్స్న మారిందని దీప నిజంగానే నమ్ముతుంది. నువ్వు అన్నట్లు నిజంగానే జ్యోత్స్న మారితే మంచిదే. కానీ పెళ్లి కూడా ఒక ప్లాన్ అయితే అప్పుడేం చేస్తాం.. ఏమో దీపా.. నాకైతే నమ్మకంలేదని కార్తీక్ అనేసి వెళ్లిపోతాడు. అయితే దీప మాత్రం.. లేదు బాబు మీరు నమ్మి తీరాలి. జ్యోత్స్నలో మార్పు మొదలైంది. తను నిజంగానే పెళ్లి చేసుకోబోతుందని మనసులో అనుకుంటుంది.    మరోవైపు శ్రీధర్ ముందు కావేరీ కూర్చుని అతడి తలపై చేయి పెట్టి.. మీరు ఇక మూడో పెళ్లి చేసుకోవాల్సిందే.. నేను మిమ్మల్ని బాగా చూసుకోలేకపోతున్నాను.. నా ఆస్తి మొత్తం మీకే రాసేసి.. నేను అక్క దగ్గరకు వెళ్లిపోతాను.. మీరు మాత్రం మూడో భార్యతో సంతోషంగా ఉండండి చాలు అని అంటుంది. నాకు మూడో పెళ్లేంటి కావేరీ.. వద్దు అని శ్రీధర్ అంటాడు. మీరు కాదు, వద్దు అంటే నేను చచ్చిపోతానని కావేరి అంటుంది. ఇక కావేరీ అలా అనేసరికి.. సరే కావేరీ నీ ఇష్టమే నా ఇష్టం.. నువ్వు ఎలా అంటే అలానే చెయ్ అంటూ మూడో పెళ్లికి శ్రీధర్ ఓకే అంటాడు. వెంటనే అతడికి ఓ డౌట్ వస్తుంది. మరి నా మూడో పెళ్లికి మొదటి భార్యను పిలుస్తావా? అదే కాంచనను పిలుస్తావా అని శ్రీధర్ అనగానే.. దానికి కావేరీ సమాధానం చెప్పదు. దాంతో శ్రీధర్ నిద్రపోతూ కల కంటున్న సీన్ చూపిస్తారు. కావేరీ కావేరీ.. చెప్పు.. నా మూడో పెళ్లికి మొదటి భార్యను పిలుస్తావా అని కావేరీని పిల్చుకుంటూ తడుముకుంటూ లటుక్కున కిందపడతాడు. వెంటనే ఓహో ఇదంతా కలనా అని శ్రీధర్ అనుకుంటాడు.   ఇక శ్రీధర్ లేచి నిలబడి చుట్టూ చూసేసరికి పక్క గదిలో కావేరీ.. స్వప్నతో ఫోన్ మాట్లాడుతుంటుంది. మీ మావయ్యగారికి ఎలా ఉంది స్వప్న అని కావేరీ అడగ్గా.. బాగానే ఉంది మమ్మీ.. త్వరలోనే కోలుకుంటారు.. అది సరే కానీ మమ్మీ, ఇంతకీ నీకో విషయం చెప్పలేదు.. జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకుందని స్వప్న అంటుంది. అవునా ఇది నిజంగానే శుభవార్తే.. పోనీలే ఇక కార్తీక్ కష్టాలు పోయినట్లే అవుతాయని కావేరి అంటుంది. అదంతా శ్రీధర్ వినేసి.. ఏంటా శుభవార్తా? ఏంటా కార్తీక్ జరిగే మంచి అని తలపట్టుకుంటాడు. ఈ విషయం డాడీకి చెప్పు మమ్మీ అని స్వప్న అంటుంది. మీ డాడీ రెండు పెగ్గులేసి పడుకున్నారులే.. అయినా ఇలాంటి శుభవార్తలు మీ డాడీకి చెప్పకూడదని కావేరి అంటుంది. ఇక కావేరి ఫోన్ పెట్టేసి వంట చేసుకుంటుంది. ఇక శ్రీధర్ తెగ రగిలిపోతాడు. శుభవార్త.. కార్తీక్ కష్టాలు తీరతాయంటే.. బహుశా నా శివ మామ.. కార్తీక్ వాళ్లకి ఆస్తి రాసి ఉంటాడు.. అది నాకు చెబితే నేను వెంటనే బాకీ తీర్చమంటాను కాబట్టి నాకు చెప్పాలని వీళ్లు అనుకోలేదు.. అయినా కార్తీక్ గాడికి సలహా ఇచ్చిందే నేను.. నాకు థాంక్స్ చెప్పాలిగా వాడు.. చెప్పే దాకా ఎదురు చూస్తా.. చెప్పకపోతే వదిలిపెడతానా అని శ్రీధర్ అనుకుంటాడు.   తన మొదటి భార్య నగలన్నీ జ్యోత్స్న రెడీ అయ్యే దగ్గరకు తెప్పిస్తాడు శివన్నారాయణ. అమ్మా సుమిత్రా.. ఇవన్నీ మీ అత్తయ్యగారి నగలమ్మా.. బతికి ఉంటే మీ అత్తయ్యే జ్యోత్స్నకు స్వయంగా అలంకరించేది.. వీటిని పెట్టమ్మా తనకి అంటాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మావయ్యగారని సుమిత్ర అంటుంది. ఇలాంటప్పుడే తీసుకోవాలి సుమిత్రా.. ఇవన్నీ నీ కూతురికే అని పారిజాతం అంటుంది. సుమిత్రా.. పెళ్లి వాళ్లు రావడానికి టైమ్ ఉంది కదా.. ఈలోపు వీటిని అలంకరించమ్మా అని శివన్నారాయణ అంటాడు. థాంక్స్ తాతా అని జ్యోత్స్న అంటుంది. ఇవన్నీ ఈ ఇంటి వారసురాలికి చెందాల్సినవే అమ్మా అని శివన్నారాయణ అంటాడు. అంటే దీపవి అన్న మాట అని జ్యోత్స్న అనుకుంటుంది. నీకు ఏవి కావాలంటే అవి పెట్టుకో.. ఇవన్నీ నీకే అనేసి పారిజాతాన్ని తీసుకుని శివన్నారాయణ వెళ్లిపోతాడు. అవును.. అన్నీ నాతోనే ఉండాలంటే దీప ఉండకూడదు. దీపని బతకనివ్వకూడదని జ్యోత్స్న ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu Illalu Pillalu : రామరాజుని బుట్టలో పడేసిన శ్రీవల్లి.. దానికి వాళ్ళు అంగీకరిస్తారా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu Illalu Pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-107లో.. శ్రీవల్లితో నిశ్చితార్థం కోసం రామరాజు ఫ్యామిలీ మొత్తం గుడికి వస్తారు. ఇంతలో శ్రీవల్లి.. బావోయ్ అంటూ పెద్దోడ్ని పలకరిస్తుంది. ఆ పిలుపు విని అంతా షాక్ అయిపోతారు. ఏంటీ.. అప్పుడే బావోయ్ అంటుంది ఎవర్నీ అని వేదవతి అడుగగా.. ఇంకెవర్నీ బావగారినే మీ పెద్ద కోడలు చాలా ఫాస్ట్ అని నర్మద అంటుంది. ఇంతలో శ్రీవల్లి.. చందు బావా.. రండి రండి.. అమ్మ వాళ్లు మీకోసం ఎదురుచూస్తున్నారని అంటుంది. ఒరేయ్ పెద్దోడా.. నిన్ను బావా అని పిలిచేటంత కెమిస్ట్రీ-ఫిజిక్స్ ఎప్పుడు డెవలప్ అయ్యాయ్ రా అని తిరుపతి పంచ్‌లు వేస్తాడు. మామగారండి. మర్చిపోయానండి అంటూ రామరాజు కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకుంటుంది శ్రీవల్లి. నా పెద్ద కోడలికి ఎంత గౌరవమో చూసి నేర్చుకోండి గవర్నమెంట్ ఉద్యోగి గారు అని నర్మదతో వేదవతి అంటుంది. అంటే ఏంటి? ఇప్పుడు నేను కూడా మీ కాళ్లకి నమస్కారం పెట్టాలా ఏంటీ.. నేను కాళ్లకి నమస్కారం పెట్టే టైప్ కాదు.. మా అత్తకి ముద్దు పెడతానంటూ నర్మద చెప్తుంది.   బుజ్జమ్మా.. మన పెద్దోడి అమాయకత్వాన్ని సరిగ్గా సరిపోయే అమ్మాయి దొరికిందని రామరాజు అంటాడు. అదే సమయంలో గుడిలో పంతులుకి సైగ చేస్తుంది భాగ్యం. మరో రెండు రోజుల్లో నిశ్చితార్థానికి దివ్యమైన ముహూర్తం ఉందని, ఖాయం చేసేయమంటారా అని భాగ్యంని అడుగుతాడు. అయ్యో రెండు రోజులంటే.. ఏర్పాట్లు చేసుకోవడం కష్టం అవుతుందేమోనని రామరాజు అంటాడు. మీరు భలే ఉన్నారు అన్నయ్య గారూ.. రాజు తలచుకుంటే దెబ్బలకి కొదువా? మనలాంటి డబ్బున్న వాళ్లకి రెండు రోజుల్లో నిశ్చితార్థం చేయడం పెద్ద కష్టమేమీ కాదండీ.. అన్నీ ఫోన్‌లలో తెగ్గొట్టేద్దామని భాగ్యం అంటుంది. పంతులు గారూ.. మీరు చెప్పిన ముహూర్తానికే నిశ్చితార్థం ఖాయం చేసేయండని భాగ్యం అంటుంది. దాంతో పంతులు ముహూర్తం పెట్టేస్తాడు.   అన్నయ్య గారూ.. మరి ముఖ్యమైన విషయాలు ఏం మాట్లాడుకోలేదు కదా అని భాగ్యం అంటుంది. మాకు కట్నకానుకలేం వద్దని చెప్పాం కదమ్మా.. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటని రామరాజు అడుగుతాడు. అదే అన్నయ్య గారూ.. నిశ్చితార్థం, పెళ్లి ఏర్పాట్లు గురించి మాట్లాడుకోలేదు కదా అని భాగ్యం అంటుంది. ఇందులో మాట్లాడుకోవడానికి ఏం ఉంది.. ఆచారం ప్రకారం పెళ్లి, నిశ్చితార్థం ఆడపిల్ల వారే జరిపించాలి కదా అని రామరాజు అంటాడు. అంటే అన్నయ్య గారండీ.. మా ఇళ్లలో నిశ్చితార్థం ఆడపిల్ల వాళ్లు జరిపిస్తారు.. పెళ్లి మగ పెళ్లి వారే జరిపించుకోవాలని అంటుంది. ఆ మాటతో రామరాజు, వేదవతిలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటుంటారు. చెప్పండి అన్నయ్య గారూ.. పెళ్లి జరిపించేస్తారు కదా అని అంటుంది. కమింగ్ అప్ లో భాగ్యం, భద్రవతి కలుసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi: రాజ్ ని చూసి షాకైన కావ్య.. దుగ్గిరాల కుటుంబానికి గుడ్ న్యూస్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-670లో... రాజ్ లేడని దుగ్గిరాల కుటుంబం అంతా తీవ్రంగా బాధపడుతుంటారు. ఇక స్వప్న పాలు తీసుకొని కావ్య దగ్గరికి వస్తుంది. నిన్నటి నుండి ఏం తినలేదు కనీసం పాలు అయిన తాగమని కావ్యకి స్వప్న ఇస్తే వద్దని అంటుంది. ఇంటికి పెద్ద అనుకున్న కొడుకే లేనప్పుడు తిండి ఎందుకని అపర్ణ అంటుంది. అప్పుడే ఫోరెన్సిక్ రిపోర్టు తీసుకొని కానిస్టేబుల్ వచ్చి అప్పుకి ఇస్తాడు. రాజ్ షర్ట్ మీద బ్లడ్ సాంపుల్ ని టెస్ట్ కి పంపించానని అది రాజ్ బావదేనని రిపోర్ట్ వచ్చిందని అప్పు చెప్తుంది‌‌. దాంతో దుగ్గిరాల కుటుంబమంతా ఎమోషనల్ అవుతారు. ఇక కావ్య ఆ రిపోర్ట్ పేపర్స్ తీసుకొని చింపేస్తుంది. నా రాజ్ బ్రతికే ఉన్నాడంటూ చెప్తుంది. రాజ్ ఎక్కడున్నా నేను తీసుకొస్తానంటూ కావ్య బయటకు వెళ్లిపోతుంది.    మరోవైపు యామిని ఫోన్ లో తన ఫ్రెండ్ తో మాట్లాడతుంది. ఎంగేజ్ మెంట్ అయినట్టు భళే ఎడిట్ చేశావ్ రా అంటు మాట్లాడుతుంటే అప్పుడే రాజ్ వస్తాడు. ఇక టాపిక్ డైవర్ట్ చేసి మాట్లాడుతుంది యామిని. తన గతంలో యామిని లేదని, సాక్ష్యాలు మాత్రమే ఉన్నాయంటూ రాజ్ డౌట్ గా అనడంతో మన ప్రేమ పెళ్ళిదాకా వచ్చిందంటూ యామిని చెప్తుంది. తనకు కాస్త ఫ్రీడమ్ కావాలని, గడువు కావాలని రాజ్ అనగా యామిని సరేనంటుంది. ఇక యామిని, రాజ్ కలిసి కార్ లో సిటీ అంతా తిరుగుతుంటే అప్పుడే కావ్య కారులో వెళ్తుంటుంది. ఇక రాజ్ ని కారులో వెళ్తుండగా చూస్తుంది‌. వెంటనే కారు దిగి పరుగెడుతుంది.    మరోవైపు దుగ్గిరాల కుటుంబమంతా రాజ్ లేడనే బాధలో ఉండగా.. రాహుల్ కంపెనీకి వెళ్తానని రెడీ అయి వస్తాడు. ఇక రుద్రాణి తన స్టైల్ లో మాయమాటలు చెప్పడానికి ప్రయత్నిస్తుంది. అందరు ఇక్కడే ఉంటే కంపెనీ లాస్ లోకి వెళ్తుంది‌. అందుకే రాహుల్ ఆఫీస్ కి వెళ్తాడని రుద్రాణి అనగానే.. మా వీక్ నెస్ ని అవకాశంగా తీసుకోవాలని ప్రయత్నించకు ఆఫీస్ కి నేను ప్రకాష్ వెళ్తామని సుభాష్  అంటాడు. అదేంటి అన్నయ్య మీరంతా బాధలో ఉన్నారు కదా మేమేదో సహాయం చేద్దామని రాహుల్ ని కంపెనీకి పంపిద్దామని అనుకుంటున్నానని రుద్రాణి అంటుంది. రాజ్ లేడని అందరు బాధలో ఉంటే మీరేమో కంపెనీ గురించి ఆలోచించారా అని స్వప్న అంటుంది‌. ఇక అందరు కలిసి రుద్రాణిని తిట్టిపోస్తారు.    మరోవైపు కావ్య తన కార్ దిగి రాజ్ వెళ్తున్న కార్ వెంబడి పరిగెడుతుంది‌‌. కొంతసేపటికి కార్ ఒక దగ్గర ఆగుతుంది. ఇక కావ్య పరుగెత్తుకుంటూ రాజ్ దగ్గరి దాకా వెళ్ళి అలసిపోయి పడిపోతుంది. ఇక కమింగ్ అప్ లో కావ్యని రాజ్ హాస్పిటల్ లో జాయిన్ చేస్తాడు. నన్ను జాయిన్ చేసిన ఆయన ఎక్కడున్నారని డాక్టర్ వాళ్ళని అడుగగా.. బిల్ కడుతున్నారని వాళ్ళు చెప్తారు. తీరా అక్కడి వెళ్ళగా రాజ్ వెళ్ళిపోతాడు. మరోవైపు ఇంట్లో ఉన్న రుద్రాణి అందరితో మాట్లాడుతుంది. రాజ్ ఇక రాడు.. లేడు అని రుద్రాణి అనగా అప్పుడే ఉన్నాడు అంటూ కావ్య వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

పెళ్లి లేదు గిల్లి లేదు.. పవన్ కళ్యాణ్ తో అవకాశం వస్తే నటిస్తా!

  బుల్లితెర మీద నిఖిల్, కావ్య గురించి తెలియని వారు లేరు. అలాంటి వాళ్ళు ప్రెజెంట్ విడిపోయారు. బిగ్ బాస్ కి వెళ్లేముందే వీళ్ళు ఒకరికి ఒకరు కాదు, మేము వేరు వేరు అంటూ చెప్పేసారు. అలాగే ఎవరి సోషల్ మీడియాస్ పేజెస్ లో వాళ్ళు ఇంకొకరిని  అన్ ఫ్రెండ్ కూడా చేసేసుకున్నారు. ఇప్పుడు ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు.    ఇక ఇప్పుడు కావ్య కొన్ని చిట్ చాట్ ప్రశ్నలకు సమాధానం చెప్పింది. "నాకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. నేను ఈ స్టేజికి వచ్చాక హ్యాపీగా ఫీలయ్యింది మా అమ్మ. మా అమ్మకు నన్ను ఎప్పుడూ ఆన్ స్క్రీన్ లో చూడాలని ఆశపడేది. అప్పుడప్పుడు వంట చేస్తాను..కానీ ఎవరూ తినరు. పర్టిక్యూలర్  గా ఇది అని కాదు వెజిటేరియన్ లో ఏదైనా ఓకే నాకు. ఎవరైనా పిల్లలు వాళ్ళు ఉన్నప్పుడు షూటింగ్ టైమ్స్ లో జోక్స్ చేసుకోవడం ఆడుకోవడం ఇష్టం. ఏ పర్సన్ ఐనా నన్ను కేరింగ్ గా చూసుకుంటే చాలు..కోపం పీక్స్ లో ఉన్నప్పుడు డైరెక్ట్ గా వెళ్లి తిట్టేయడమో, ఏడ్చేయడమో చేసేస్తాను. నవ్వుతూ కవర్ చేయడం మాత్రం నాకు రాదు. ఏ హీరోతో ఆఫర్ వచ్చినా మూవీ చేస్తాను కానీ నా ఫెవరేట్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు.. ఆయన ఛాన్స్ వస్తే చేస్తాను. పరిస్థితిని బట్టి డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది. ఏదైనా ప్లేస్ కి వెళ్ళేటప్పుడు వెస్ట్రన్ డ్రెస్ వేసుకుంటా, టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు హోమ్లీ డ్రెస్ లో వెళ్తాను. సీరియల్స్ ని ముందుగా ప్రిఫర్  చేస్తాను. ఎందుకు అంటే సీరియల్స్ చేయడం వల్లనే ఈవెంట్స్ కి ఛాన్సెస్ వస్తాయ్.. ముందుగా బేస్ సీరియల్స్ కాబట్టి సీరియల్స్ ఇష్టం. నాకు పచ్చగా ఉండే ప్రాంతాలంటే చాలా ఇష్టం.. కూర్గ్ లాంటి ప్రాంతాలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాను. అలాగే అవుటాఫ్ కంట్రీ అంటే స్విట్జర్లాండ్ అలా ఇష్టం. లవ్ మ్యారేజ్ లేదు అరేంజ్డ్ మ్యారేజ్ కూడా లేదు. నో మ్యారేజ్ అంతే. ఇర్రిటేషన్ అనే పర్సన్ కొన్ని రోజుల క్రితం వరకు ఉండేవాళ్లు కానీ ఇప్పుడు మైండ్ లో అలాంటిది ఏమీ లేదు. మా ఫామిలీని తలుచుకుంటే నా ఫేస్ లో స్మైల్ వస్తుంది. నాకు నా ఫామిలీ అంటే ఇష్టం. నా జీవితంలో నేను నేర్చుకున్న అతి పెద్ద పాఠం ఏంటంటే  ఎవరినీ మోసం చేయకూడదు, ఎవరినీ బాధపెట్టకూడదు అనేది నేర్చుకున్నా" అంటూ కావ్య చాలా విషయాలు చెప్పేసింది. ఐతే నెటిజన్స్ మాత్రం కావ్య నిఖిల్ మళ్ళీ కలవాలి అంటూ కింద కామెంట్స్ చేస్తున్నారు.  

Eto Vellipoindi Manasu : సీతాకాంత్ దగ్గరికి రమ్య.. ఆమె కోసం సవతి తల్లి ప్లాన్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్ళిపోయింది మనసు' (Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-352 లో.. రామ్ ని తిట్టి పంపించేస్తుంది రామలక్ష్మి. దాంతో ఇక రామ్ చదువుకోనంటూ వెళ్తుంటే సీతాకాంత్ అడ్డుపడి.. మేడమ్ నిన్ను అనలేదని అంటాడు. ఆ తర్వాత రామ్ కి సీతాకాంత్ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. అదే సమయంలో ఫణీంద్ర, సుశీలలు ఇద్దరు కలిసి రామలక్ష్మితో మాట్లాడతారు. నువ్వు రామలక్ష్మివి కాదని చెప్తూనే నువ్వు బయటపడుతున్నావ్.. నా మనవరాలు మైథిలి అయితే ఒక ప్రిన్సిపల్ గా ఉండేది కానీ నువ్వు రామ్, సీతాకాంత్ లని మైథిలి స్థానంలో ఉండి చూడలేదని చెప్తారు.   ఇక సీతాకాంత్ దగ్గరికి రామలక్ష్మి వచ్చి మాట్లాడాలని చెప్తుంది. చెప్పు రామలక్ష్మి సారీ మైథిలి అని సీతాకాంత్ అనగానే.. మీరు పదే పదే అదే పేరుతో పిలిచి నన్ను డిస్టబ్ చేస్తున్నారు. మీ వల్ల నా ఫీలింగ్స్ అన్నీ కంట్రోల్ చేసుకొని బ్రతుకుతున్న.. ఎందుకంటే ఎక్కడ కనపడితే నువ్వు రామలక్ష్మి అని అంటావో అని సీతాకాంత్ తో కోపంగా మైథిలి అంటుంది‌‌. దాంతో సీతాకాంత్ కి ఏంఅర్థం కాదు. ఇంకోసారి నా జోలికి రావద్దని మైథిలి చెప్పగానే.. తనని నేను ఇబ్బంది పెడుతున్నానా.. తను రామలక్ష్మి కాదా అని సీతాకాంత్ అనుకుంటాడు.    మరోవైపు శ్రీలత, శ్రీవల్లి మెట్లు దిగి వస్తుంటే అప్పుడే రమ్య ఎంట్రీ ఇస్తుంది. గిఫ్ట్ బ్యాగ్స్ మోసుకొచ్చిన రమ్య.. సీతాకాంత్, రామ్ లని పిలుస్తుంది. అప్పుడు సీతాకాంత్, రామ్ ఇద్దరు వస్తుంటారు‌. వారిని చూసిన రమ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక తనకి ప్రమోషన్ వచ్చిందంటూ రమ్య చెప్పగానే సీతాకాంత్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. శ్రీలత, శ్రీవల్లిలు రమ్యని చూసి మనసులో తిట్టుకుంటారు. ఇక రమ్యని తమ ఇంట్లోనే సీతాకాంత్ ఉండమనడంతో శ్రీలత వాళ్ళు డిజప్పాయింట్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu Illalu Pillalu: వేదవతిని ఇరకాటంలో పెట్టిన రామరాజు.. నిజం చెప్పేస్తుందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu Illalu Pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-106లో.. ప్రేమ వెయిటర్ గా పనిచేయడం చూసిన భద్రవతి ఫ్యామిలీ భాదపడతారు. మార్చేశారు అక్కా.. నా కూతుర్ని మొత్తం మార్చేశారు.. ఆ రామరాజుగాడి మాయమాటలతో ప్రేమను మార్చేశారు. ఇన్నాళ్లూ పెంచిన మనం..ఇప్పుడు శత్రువులు అయిపోయామని సేనావతి కన్నీళ్లు పెట్టుకుంటాడు. అవునండీ.. మన బాధ మన కూతురికి అర్థం కావడం లేదు. మహారాణిలా పుట్టి పెరిగిన నా కూతురుకి ఎంగిలి కంచాలు ఎత్తే దుస్థితి పట్టిందని ప్రేమ తల్లి భోరున ఏడుస్తుంది.    ఏది ఏమైనా ప్రేమను మన ఇంటికి మనం తెచ్చేసుకోవాలి అక్కా.. లేదంటే మన బిడ్డని కష్టపెట్టడమే కాదు.. మనకి శాశ్వతంగా దూరం చేస్తాడని సేనాపతి అంటాడు. అంత వరకు రాకుండా ఏదోటి చేయాలిరా అని భద్రవతి అనగానే అవును అత్తా ఇన్నాళ్లూ మనం ఆ ధీరజ్ గాడి వైపు నుంచి నరుక్కుంటూ వచ్చాం కానీ ఇప్పుడు మనం చేయాల్సింది.. ప్రేమ వైపు నుంచి నరుక్కుంటూ రావాలి. రేపటి నుంచి అదే పనిలో ఉంటాను. ఏం చేసైనా సరే.. ప్రేమను మన ఇంటికి తీసుకొస్తాను ఈసారి మన ప్లాన్ మిస్ కాదని విశ్వ అంటాడు.    మరోవైపు వేదవతి ఆలోచిస్తుంటుంది. దీనంతటికీ కారణం నేనే.. వెళ్లి ఆయనకి నిజం చెప్పేస్తానంటూ రామరాజు దగ్గరకు వెళ్తుంది. ఈ విషయాన్ని ఇంకా దాచిపెడితే ధీరజ్‌కి వాళ్ల నాన్నకి మధ్య ఇంకా దూరం పెరుగుతుంది. అందుకే ఆయన నన్ను ఏమనుకున్నా పర్లేదు.. జరిగింది ఆయనతో చెప్పేస్తానని ఆవేశంగా వెళ్తుంది. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత రామరాజు తుస్సుమనిపిస్తాడు.   రామరాజుకి నిజం చెప్పడానికి వెళ్తే.. రామరాజే తిరిగి ప్రశ్నిస్తాడు. ఎందుకిలా చేశావ్.. నిజంగా నీకు ధీరజ్, ప్రేమల పెళ్లి గురించి తెలియదా? తెలిసి కూడా నాకు చెప్పకుండా మోసం చేస్తున్నావా? నాకు వాళ్ల పెళ్లిపై చాలా అనుమానాలు ఉన్నాయి? వాడు అసలు ప్రేమని ప్రేమించాడా? ప్రేమించి ఉంటే వాళ్ల అన్నయ్యలతో చెప్పేవాడు. వాడు కనీసం నీకైనా చెప్తాడు. వాడు నీకు చెప్పలేదంటే ఏదో జరిగి ఉంటుంది‌‌. అన్నింటికంటే ముఖ్యంగా.. మిమ్మల్ని గుడికి పంపినరోజే వాడు పెళ్లి చేసుకుని వచ్చాడంటే అదే రోజు ఏదో జరిగింది. మన ఇంట్లో జరిగే గొడవలన్నింటికీ ఆ పెళ్లే కారణం. ఆ కారణమే వాడిపై ఉన్న ప్రేమ.. ద్వేషంగా మారింది. వాడ్ని జన్మలో క్షమించలేను. నిన్ను ఈ విషయం గురించి అడిగి బాధపెట్టి ఉంటే క్షమించు బుజ్జమ్మా.. నీకు ఏదైనా తెలిస్తే ముందు నాకే చెప్తావ్.. నువ్వు చెప్పలేదంటే నీకు తెలియదనే అర్థం. నన్ను ఎవ్వరు మోసం చేసినా నా బుజ్జమ్మ నన్ను మోసం చేయదనే నమ్మకం ఉందని.. బుజ్జమ్మ నోరు నొక్కేసేట్టుగా రామరాజు మాట్లాడతాడు. ఇంకేముంది.. చెప్పేస్తా.. చెప్పేస్తా అంటు వెళ్లిన బుజ్జమ్మ ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

బెట్టింగ్ యాప్స్ ని ఇక ప్రమోట్ చేయను.. సారీ...

  సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ కారణంగా చాలా మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. బుల్లితెర, సోషల్ మీడియా సెలబ్రిటీస్ వాటిని తెగ ప్రమోట్ చేస్తున్నారు. ఐతే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసేవాళ్లను పోలీసులు ఊరుకోవడం లేదు. వాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ ఇష్యూ మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫుల్ ఫోకస్ పెట్టాయి. ఇలాంటి టైములో సురేఖ వాని కూతురు సుప్రీతా హోలీ రోజున హోలీ కలర్స్ ఒళ్ళంతా పులుముకుని ఒక వీడియోని రిలీజ్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.    "కొంతమంది ఇన్‌ఫ్లుయన్సర్స్‌ తెలిసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు. అందులో నేను ఒకదాన్ని. కానీ ఇప్పుడు ప్రమోట్ చేయడం ఆపేసాను. ప్రమోట్ చేసినందుకు సారీ. ఎవరైనా ఇన్‌ఫ్లుయన్సర్స్‌ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేటప్పుడు మీరు చూసినా వాటికి అట్రాక్ట్ కావొద్దు.. ఈజీ మనీకి అలవాటు పడొద్దు. అలాంటి యాప్స్ ఏమన్నా ఉంటే డిలీట్ చేసేయండి. ఇంకా వాళ్ళను ఫాలో కూడా అవ్వొద్దు. అందరికీ థాంక్యూ అండ్ ఒన్స్ అగైన్ సారీ" అంటూ చెప్పిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అలాగే ఈ వీడియోని వి.సి. సజ్జనార్ కి కూడా ట్యాగ్ చేసింది.      తెలంగాణా ఆర్టీసీ ఎండి, ఐపిఎస్ సజ్జనార్ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళ మీద బాగా ఫోకస్ చేశారు. ఈ మధ్య కాలంలో ఎన్నో కుటుంబాలు బెట్టింగ్ యాప్స్ వలన సూసైడ్స్ చేసుకుంటున్నారు. అది కూడా బెట్టింగ్ యాప్స్ వలన అంటూ వీడియోస్ చేసి మరీ మరణిస్తున్నారు. దాంతో ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. అలాగే సోషల్ మీడియాలో ఇప్పుడు సే నో టు బెట్టింగ్ అనే హ్యాష్ టాగ్ బాగా సర్క్యులేట్ అవుతోంది.  

Karthika Deepam 2: ఫుడ్ పాయిజన్ స్కెచ్ ఫెయిల్.. పెళ్ళికి ఒప్పుకున్న జ్యోత్స్న!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం- 2 (Karthika Deepam 2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-305 లో.. మేడమ్ మీరు రండి, జరిగేది చూడటానికి అంటూ జ్యోత్స్నకి వినోద్ చెప్పడంతో.. విజయ్ కంపెనీకి వస్తుంది జ్యోత్స్న. అక్కడ కార్తీక్, దీప, విజయ్ కంపెనీ ఉద్యోగులకు ఫుడ్ వడ్డిస్తూ ఉంటే జ్యోత్స్న చాటుగా చూస్తూ.. ఇక వీళ్లంతా ఒకరి తర్వాత ఒకరు పడిపోతారు.. తర్వాత బావ, దీప అరెస్ట్ అయిపోతారు. సత్యరాజ్ రెస్టారెంట్ మూతపడిపోతుంది. బావ నావైపు వచ్చేస్తాడని ఊహించుకుంటుంది.    ఎంత సేపటికి ఎవరికి ఏమీ కాకపోయేసరికి, ఫుడ్ చాలా బాగుందని అందరు పొగిడేసరికి జ్యోత్స్న రగిలిపోతుంది. ఇక అక్కడే వడ్డిస్తున్న వినోద్‌ని కాల్ చేసి పక్కకు పిలుస్తుంది జ్యోత్స్న. వాడి కాలర్ పట్టుకుని.. అసలు మందు సరిగా కలిపావా లేదా అని జ్యోత్స్న అరుస్తూ ఉండగా.. అప్పుడే మన వంటలక్క ఎంట్రీ ఇస్తూనే.. సరిగానే కలిపాడని దీప అంటుంది. జ్యోత్స్న బిత్తరపోతుంది. నువ్వు ఎంత కలపమన్నావో అంతా కలిపాడని దీప అంటుంది. కానీ మధ్యలో చిన్న గ్యాప్ ఒకటి వచ్చింది. ఆ గ్యాప్‌లో ఏం జరిగిందంటే అని దీపక్క జరిగింది మొత్తం చెప్తుంది. వినోద్ చెంప పగలగొట్టిన సీన్ చూపిస్తారు స్క్రీన్ మీద. ఇక వినోద్ వైపు జ్యోత్స్న కోపంగా చూడగానే.. వినోద్ చెంప పట్టుకుని నిలబడతాడు. నీ డబ్బుకి అమ్ముడు పోయిన వినోద్ నా దెబ్బకు మారిపోయాడని దీపక్క అంటుంది. వినోద్ నువ్వు వెళ్లని అంటుంది.    నిజానికి కొట్టాల్సింది వాడ్ని కాదు.. నిన్ను.. తినే భోజనంలో మందు కలిపిస్తావా అంటూ జ్యోత్స్నని దీప లాగిపెట్టి కొట్టేస్తుంది. ఇంతలో కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. నా పేరు చెప్పి ఇంకొకటి పీకు అని కార్తీక్ అంటాడు. బావా అని జ్యోత్స్న అరుస్తుంది. నోర్ముయ్.. శౌర్య విషయంలో ఆధారం లేదని నిన్ను వదిలిపెట్టలేదు.. దానికి వేరే కారణం ఉందని దీప అరుస్తుంది. నీ చుట్టు మంచి వాళ్లు ఉండటం వల్ల ఇలా తప్పించుకుంటున్నావ్ కానీ, తాగి కారు యాక్సిడెంట్ చేసిన రోజే జైలుకి వెళ్లాల్సిన మనిషివి అని కార్తీక్ అంటాడు. ఏం బతుకు జ్యోత్స్నా ఇది.. ఏ కుటుంబంలో పుట్టావ్.. ఏం పనులు చేస్తున్నావని దీప అంటుంది.   ఇక జ్యోత్స్నకి మాట్లాడే ఛాన్స్ దీప, కార్తీక్ లు ఇవ్వరు. మారవా నువ్వు.. ఏంటి ఈ పనులు.. అసలు నువ్వు ఎవరికి కూతురివి.. ఇదేనా పద్దతి.. బుద్ధిగా పెళ్లి చేసుకుని మంచి జీవితానికి ఆహ్వానం పలుకు. మా జోలికి రావద్దు.. మరోసారి ఇలా జరిగితే ఈ పంచాయితీ మీ ఇంట్లో మీ తాత ముందు జరుగుతుంది.. పడాల్సినవి పడ్డాయిగా పో బుద్ధిగా ఇంటికి పోమంటూ కార్తీక్ కూడా జ్యోత్సకి గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. వెంటనే దీపను తీసుకుని వెళ్లిపోతాడు కార్తీక్. ఇక జ్యోత్స్న తెగ రగిలిపోతుంది. ఛ వేస్ట్ గాడ్ని నమ్మకుని పరువు మొత్తం పోగొట్టుకున్నానని జ్యోత్స్న అనుకుంటుంది.    ఇక దీప, కార్తీక్ ఇంటికి వచ్చి.. జ్యోత్స్న చేసిన కుట్ర, తప్పిన ప్రమాదం గురించి చెప్పడంతో.. మా నాన్నను అడిగేస్తా కడిగేస్తా.. మా పుట్టింటికి వెళ్దాం పదా.. మా వదినను కూడా నిలదీయ్యాలి. కూతుర్ని ఇలా నా కొడుకు మీద వదిలేసి ఏం చేస్తున్నారో అడుగుతాను.. అర్జెంట్‌గా దానికి పెళ్లి చేసి పంపించమని చెప్పాలని కాంచన రెచ్చిపోతూ ఉంటుంది. కార్తీక్, దీపలు సర్దిచెబుతూ ఉంటారు.    ఇంతలో కాంచనకు సుమిత్రతో కాల్ చేయిస్తాడు దశరథ్. జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకుంది.. త్వరలో ముహూర్తాలు పెట్టబోతున్నామని చెప్పు సుమిత్ర అని కాల్ చేయిస్తాడు. సుమిత్ర ఫోన్ లిఫ్ట్ చేసిన కాంచన.. చెప్పు వదిన అనకుండా.. నేను కాంచననే మాట్లాడుతున్నా.. ఏంటి ఫోన్ చేసిన వాళ్లు మాట్లాడటం లేదని కోపంగా అంటుంది. దాంతో సుమిత్ర బాధగా.. నీ కోడలు దీపను కొట్టినందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావని అర్థమైంది వదినా అని మనసులో అల్లాడిపోతూ... అదేంటి వదినా బంధం అనేది ఒకటి ఉంటుంది కదా అంటుంది. అలవాటుగానే బాధపెడుతున్నారుగా.. ఇందులో ఏముంది? ఎందుకు ఫోన్ చేశారో చెబితే బాగుంటుందని కాంచన అంటుంది. నిజానికి కాంచన కోపం.. జ్యోత్స్న చేసిన ఫుడ్ పాయిజన్ స్కెచ్ గురించి కానీ సుమిత్ర అనుకునేది దీప నేను కొట్టానన్న నిజం చెప్పేసినట్లుందని బాధపడుతుంది. వదినా జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకుంది. త్వరలో పెళ్లి అని సుమిత్ర చెప్తుంది. కాంచన వెంటనే సంతోషం ఉంటానని కాంచన ఫోన్ పెట్టేస్తుంది.    అయితే కాంచన స్పీకర్‌లో పెట్టి మాట్లాడటంతో కార్తీక్, దీప, అనసూయ అంతా వింటారు. కాంచన కూడా సంతోషిస్తుంది. వెంటనే దీప లోపలికి వెళ్లి స్వీట్స్ పట్టుకుని వచ్చి.. మనకు రెండు శుభవార్తలు. జ్యోత్స్నకు పెళ్లి కుదిరింది. అంటే మన జోలికి ఇక రాదు. రెండోది ఈ రోజు విజయ్ కంపెనీకి ఫుడ్ పట్టుకుని వెళ్లడంతో మన పేరు ఇంకా పెరిగిందని స్వీట్స్ అందిస్తుంది. అయితే కార్తీక్ మాత్రం జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకోవడం ఏంటా అన్నట్లు షాక్‌లో ఉంటూనే దీప ఇచ్చిన స్వీట్ తీసుకుని వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఏ‌ం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ఇది కుకింగ్ షోనా.. పచ్చబొట్ల షోనా... నాకింకా పెళ్లి కాలేదు తల్లో....

  చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే ఈ వీక్ ఎపిసోడ్ ఫుల్ ఫన్నీగా సాగింది. ఇందులో దీపికా ఎపిసోడ్ ఐతే మాములుగా లేదు. పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే.. అలా ఉంది. అది కూడా జడ్జ్ జీవన్ తో చేసిన అల్లరికి స్టేజి మొత్తం షేకయ్యింది. దీపికా షోలోకి వస్తూనే జీవన్ ని చూస్తూ సిగ్గుపడుతూ వచ్చింది. ఆ సిగ్గుపడే విషయాన్ని సుమ చెవిలో చెప్పేసింది. సుమ ఐతే జీవన్ కి కంగ్రాట్స్ కూడా చెప్పేసింది. దాంతో అసలు ఏం జరిగిందో తెలీక షాకయ్యాడు జీవన్. (Deepika Rangaraju)   అసలు ఇది నిజంగా పచ్చబొట్టేనా అని దీపికా చేయి పట్టుకుని అడిగింది సుమా. "జీవన్ గారు నాకు మంచి మార్కులు ఇవ్వాలని నేను ఇలా పచ్చబొట్టు వేసుకుని వచ్చా." అని చెప్పింది. "ఇదేంటి ఇది కుకింగ్ షో అన్నారు...ఏంటి ఈ పచ్చబొట్లు అంటున్నావు...నీకు దణ్ణం తల్లి..పెళ్లి కానీ వాడిని పట్టుకుని ఇలా నీ చేతుల మీద పేర్లు వేయించుకుంటే ఇక పెళ్లి కూడా కాదు నాకు" అని జీవన్ తెగ ఫీలైపోయాడు. ఇక విష్ణుప్రియ ఐతే ఇంకో గట్టి కౌంటర్ ఇచ్చింది. "ఇంకా పెళ్లి అవుతుంది అనుకుంటున్నారా ?" అని అడిగింది. ఆ మాటకు గుండెను గట్టిగా పట్టుకుని తెగ బాధపడ్డాడు జీవన్. "ఐపోయింది ఇక ఇదంతా బిస్కెట్ యాపరమే ఇదంతా..నీకో దణ్ణం తల్లి" అనేసి వెళ్ళిపోయాడు. "బ్యాచిలర్ గా ఉన్నప్పుడే కాదు మూడు నాలుగు పెళ్ళిళ్ళైనా వదలను...మార్కుల కోసం" అంటూ తన కుకింగ్ కి మార్కులు ఇవ్వకపోతే ఇక అంతే అన్న రేంజ్ లో దీపికా వార్నింగ్ ఇచ్చింది.    జీవన్ కరోనా సమయంలో ఎంతోమందికి ఉచితంగా భోజనం అందించాడు. ఇక జీవన్ ఫ‌ల‌క్‌నుమాదాస్, ఈ నగరానికి ఏమైంది, సవారి, జాతిరత్నాలు, ఏక్ మినీ కథ, పుష్ప, విరాటపర్వం, కీడా కోలా వంటి మూవీస్ లో రకరకాల రోల్స్ లో కనిపించి ఎంటర్టైన్ చేసాడు.  

Brahmamudi: సీఈఓ కుర్చీ కోసం రుద్రాణి స్కెచ్.. బావ ఆచూకీ కోసం అప్పు ప్లాన్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-669లో.. స్వప్న, అప్పు కూర్చుని బాధగా కావ్య పరిస్థితి గురించి మాట్లాడుకుంటారు. టైమ్‌కి ఫుడ్ రెడీ చేసి అందరిని భోజనం చేయమంటుంది. ఎవరైనా బావ చావు గురించి మాట్లాడుతుంటే కోప్పడుతుంది. అసలు అక్క ఏం చేస్తుందో తనకైనా తెలుస్తుందో లేదో నాకైతే ఏం అర్థం కావడం లేదు. అక్కని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. అసలు అక్క ధైర్యంగా ఉందా? ధైర్యంగా ఉన్నట్లుగా నటిస్తుందా? లేక మెంటల్‌గా డిస్ట్రబ్ అయ్యి అలా ప్రవర్తిస్తుందా? అని స్వప్నతో అప్పు అంటుంది. కావ్యను అలా చూసి అపర్ణా ఆంటీ ఇంకా కుమిలిపోతున్నారు. కావ్య పిచ్చిది అయిపోతుందేమోననిపిస్తోందని స్వప్న అంటుంది. ఎందుకైపోతుంది అక్కా పిచ్చిది ఎందుకైపోతుందని అప్పు అంటుంది. మరి ఏం అర్థం చేసుకోవాలి అప్పు అని స్వప్న అనగానే.. బావ నిజంగానే వస్తాడేమో అలా ఎందుకు అనుకోకూడదని అప్పు అంటుంది. ఎలా అనుకోమంటావే.. నీ చేతులతో నువ్వే రాజ్ బట్టలు వస్తువులు తెచ్చి చూపించావ్ కదా.. మరిచిపోయావా అని స్వప్న అనగానే.. అవును అక్కా నేను బావ వస్తువుల్ని బట్టల్ని తెచ్చాను కానీ తన బాడీ చూడలేదు కదా అని అప్పు అంటుంది. అంటే అని స్వప్న అనగానే.. ఈ విషయంలో ఇంకా డీప్‌గా ఆలోచించాలి. ప్రతి కోణంలోనూ ఇన్వెస్టిగేట్ చెయ్యాలి.. ఎక్కడో ఏదో తప్పు జరిగింది. దాని మూలాలు పట్టుకోవాలి. చిన్న క్లూ దొరికినా డొంకంతా లాగుతానని అప్పు అంటుంది.   రాజ్ ఆలోచనల్లో ఉంటే యామినీ అక్కడికి వస్తుంది. కాలేజ్‌లో నీ వెంట తిరిగేటప్పుడు నీతో కలిసి ఇలా ఏకాంతంగా గడపాలని అనుకున్నాను.. నువ్వెప్పుడూ నాకు ఆ అవకాశం ఇవ్వలేదు.. కానీ ఆ దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చి నా ఇంట్లోనే పడేశాడు.. నాది నిజమైన ప్రేమ కాకపోతే ఇదంతా ఎందుకు జరుగుతుంది. ఇక మిగిలింది నిన్ను నా వైపుకు తిప్పుకోవడమే రాజ్ అని యామిని అనుకుంటూ రాజ్ దగ్గరికి వెళ్తుంది. వెళ్లడం వెళ్లడమే రాజ్‌ని వెనుక నుంచి హత్తుకుంటుంది. రాజ్ భయపడి వదిలించుకుని తోసేస్తాడు. వెంటనే రాజ్ యామినీని చూసి.. మీరా..సారీ సారీ నువ్వా యామినీ.. నేను ఎవరో ఏంటో అనుకుని భయపడిపోయానని రాజ్ అంటాడు. అయినా ఈ ఇంట్లో నిన్ను పట్టుకునే ధైర్యం నాకు తప్ప ఇంకెవరికి ఉంటుంది బావా అని యామిని అంటుంది. రాజ్ మౌనంగా ఉంటాడు. ఏంటి బావా ఇంకా డల్‌గానే ఉన్నావ్.. నీ జ్ఞాపకాల్లో నేను లేను అంతే కదా.. పోనీ మా మీద నమ్మకం కలగడం లేదా అని యామిని అంటుంది. అయ్యో లేదు యామినీ.. నీ కళ్లల్లో నా మీద ఇష్టం కనిపిస్తోంది.. కానీ అని రాజ్ అంటాడు. సరే.. ఏదోకటి.. వదిలెయ్.. ఏదో బాధలో మాట్లాడేస్తున్నా.. నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో బావా అని రాజ్ తో అనగానే అతను తన గదిలోకి వెళ్లిపోతాడు. నీకు డోస్ చాలడం లేదు రాజ్.. నీ గతం, జ్ఞాపకం అన్నీ నేనే అని నమ్మిస్తానని యామిని మనసులో ఫిక్స్ అవుతుంది.    మరోవైపు రాహుల్‌కి రుద్రాణీ సూట్ వేస్తుంది. ఏంటి మామ్ అవసరమా ఇది అని రాహుల్ అంటాడు. అవసరమే.. అవకాశం దొరికినప్పుడే మనం ఆ సీఈవో కుర్చీని లాగేసుకోవాలి.. ఆ రాజ్ గాడు చచ్చి నీకు నేరుగా అవకాశం ఇచ్చాడు కదా. పైగా ఆ కావ్య పోయినా మొగుడు ఎప్పుడు తిరిగి వస్తాడని ఎదురు చూసి చూసి పిచ్చిదైపోతుంది. మనం మాత్రం ఏడుస్తున్నట్లు నటిస్తూ కంపెనీ బాధ్యతలు తీసుకుంటాం.. ఇదే రైట్ టైమ్.. నేను చెప్పింది చెప్పినట్లు చెయ్ చాలు అని రుద్రాణి చెప్పగానే రాహుల్‌ సరే అంటాడు‌.  ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

నువ్వు నన్ను నిద్ర పోనివ్వవా రష్మీ..!

  బుల్లితెర మీద యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జబర్దస్త్ షోకి, శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి యాంకర్ గా పని చేస్తోంది. అలాగే మూవీస్ లో హీరోయిన్ గా కూడా నటిస్తోంది. రష్మీ షోస్, ఈవెంట్స్ లో ఫుల్ ఎనర్జీతో ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. రకరకాల  వీడియోస్, ఫోటో షూట్స్ అన్నీ చేస్తూ అలరిస్తూ ఉంటుంది. (Rashmi Gautam)    హోలీ పండగ సందర్భంగా తాజాగా కొన్ని పిక్స్ ని పోస్ట్ చేసింది రష్మీ. వైట్ డ్రెస్ లో కలర్ ఫుల్ చున్నీలో ఎంతగా మెరిసిపోతోందో చెప్పక్కర్లేదు. మంచి క్యూట్ గా ఉన్న ఆ పిక్స్ చూసిన నెటిజన్స్ ఐతే కామెంట్స్ చేస్తున్నారు. ఒక నెటిజన్ కొంటెగా "నువ్వు నన్ను నిద్రపోనివ్వవా రష్మీ" అంటూ కామెంట్ పెట్టారు. మిగతా వాళ్ళైతే "హోలికే రష్మీ అందమైన రంగులు పూసింది. అందరూ చందమామను టెలీస్కోప్ లో చూస్తారు కానీ నేను నా చందమామను నా కళ్ళతో చూస్తాను." అంటూ రష్మీ గురించి క్యూట్ కామెంట్స్ చేస్తూ హ్యాపీ హోలీ అంటూ విషెస్ చెప్పారు. ఇక రష్మీ ఐతే "ఇలా నవ్వులతో, సంతోషంతో నా జీవితాన్ని రంగులమయం చేసుకుంటున్నా" అంటూ కామెంట్ పెట్టింది.    రీసెంట్ గా తన పెట్ చుట్కి అస్థికలను గోదావరిలో కలిపొచ్చింది రష్మీ. తన పెట్ తో గడిపిన క్షణాల వీడియోస్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. అలాగే రష్మీ రోడ్డు మీద కనిపించే మూగ జీవాలకు హెల్ప్ చేస్తుంది, వాటికీ షెల్టర్ ఏర్పాటు చేస్తూ, ఇంటరెస్ట్ ఉన్నవారి చేత కూడా చేయిస్తూ ఉంటుంది. అలాంటి రష్మీ ఇప్పుడు హోలీ పండగ రోజున అందంగా మెరిసిపోతోంది.