ప్రియమైన దీపిక ...అంటూ అద్భుతమైన లేఖ రాసిన యాంకర్
డాన్స్ ఐకాన్ సీజన్ 2 ప్రతీ వారం ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ వస్తోంది. ఇక ఈ షోలో దీపికా అందించే ఫన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె ఉంటె ఆ షో మొత్తం కూడా ఒక వెలుగు వెలిగిపోతూ ఉంటుంది. కానీ ఈ వారం దీపికా తన కంటెస్టెంట్ సహా ఎలిమినేషన్ లోకి వచ్చేసింది. ఇక డాన్స్ ఐకాన్ షోని అంత స్పెషల్ గా మార్చేసిన దీపికకు యాంకర్ ఓంకార్ ఒక లేఖ రాసాడు అదేంటో చూద్దాం...
ప్రియమైన దీపిక ...
డాన్స్ ఐకాన్ యొక్క ఉత్తేజకరమైన ప్రయాణంలో నీ ప్రెజన్స్ కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఒక మెంటార్ గా మీ కంటెస్టెంట్ కి మార్గనిర్దేశం చేయడమే కాకుండా, స్టేజి మొత్తాన్ని కూడా ఒక ఎనర్జీని అందిస్తారు. మీరొస్తే చాలు ఆ స్టేజి వెలుగులతో ఎక్కడలేని శక్తిని పుంజుకున్నట్టు వెలిగిపోతూ ఉంటుంది. మీ నవ్వు, మీ ఉత్సాహం, స్పోర్టివ్ నెస్ వలన అది కేవలం డాన్స్ షో మాత్రమే కాదు ఒక సంతోషాన్ని పంచే షో అనే విషయాన్ని అందరూ అర్ధం చేసుకున్నారు.
మీ పాజిటివ్ థింకింగ్ తో అందరినీ ఇన్స్పైర్ చేస్తారు. మీరు అందరికీ అంతులేని శక్తిని అందిస్తారు. డాన్స్ ఐకాన్ లోకి మీ రాక ఎన్నో రంగుల్ని నింపింది. దాంతో ఈ షో మరింత అట్రాక్టివ్ గా , డైనమిక్ గా మారిపోయింది. మీ అన్స్టాపబుల్ ఎనర్జీతో, అందరికీ అంతులేని ఆనందాన్ని పంచుతూ అందరికీ సపోర్ట్ ఇస్తూ డాన్స్ ఐకాన్ షోని మరింత ముందుకు తీసుకొచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మీరు కేవలం మెంటార్ మాత్రమే కాదు, మీరు ట్రూ ఎంటర్టైనర్, మిగతా వారిలో ఇన్స్పిరేషన్ ని కలిగించే ఒక పవర్ హౌస్ కూడా" అంటూ డాన్స్ ఐకాన్ సీజన్ 2 షో యాంకర్ ఓంకార్ మెంటార్ దీపికకు ఒక అందమైన లేఖను అలాగే ఒక గులాబీని బహుకరించారు. ఇక దీపికా ఐతే "నన్ను నమ్మి ఈ షోలోకి వచ్చే అవకాశాన్ని కల్పించినందుకు థ్యాంక్స్" అంటూ ఈ లెటర్ ని తన మాటల్ని ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది.