Brahmamudi : వాళ్ళిద్దరిని పట్టేసుకున్న ధాన్యలక్ష్మి.. శోభనం గదిలో రాజ్, కావ్య!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -733 లో.....అప్పు, కళ్యాణ్ ల శోభనం కోసం రాజ్, కావ్య ఏర్పాట్లు చేస్తుంటారు. అప్పు, కళ్యాణ్ ఇద్దరు కలసి కావ్య రాజ్ దగ్గరికి వస్తారు. నేను అర్జెంట్ గా స్టేషన్ కి వెళ్ళాలి. లేదంటే నా జాబ్ పోతుందని అప్పు చెప్తుంది. అందరు కలిసి దానికి సొల్యూషన్ ఆలోచిస్తారు. అందరు మిమ్మల్ని శోభనం గదిలోకి పంపిస్తారు కదా.. లోపలికి వచ్చాక వెనకాల డోర్ నుండి అప్పు, కళ్యాణ్ వెళ్లిపోండి. మళ్ళీ త్వరగా వచ్చి మీ గదిలో ఉండండి అని రాజ్ చెప్తాడు. దానికి వాళ్ళు ఒప్పుకుంటారు. ఆ తర్వాత అప్పు, కళ్యాణ్ ఇద్దరు హాల్లోకి వస్తారు. గదిలో ఉండకుండా అక్కడ ఏం చేస్తున్నారని ధాన్యలక్ష్మి అడుగుతుంది. రెడీ అయ్యాం అలా గార్డెన్ లోకి వెళ్ళామని కళ్యాణ్ అంటాడు. అప్పుని పాల గ్లాస్ తో కళ్యాణ్ దగ్గరికి ఇంట్లో వాళ్ళు పంపిస్తారు. సారీ కళ్యాణ్ నిన్ను బాధపెడుతున్నానని అప్పు అంటుంది. అప్పుడే వెనకాల డోర్ నుండి రాజ్, కావ్య వచ్చి అప్పు కళ్యాణ్ ని బయటకు పంపిస్తారు. అప్పు, కళ్యాణ్ కావ్య గదిలో నగలు పెట్టి మాములు డ్రెస్ లో వాళ్ళు బయటకు వెళ్తారు. అదంతా రాహుల్ చూసి ఇది కదా కరెక్ట్ టైమ్ అని అనుకుంటాడు. ఆ తర్వాత కళ్యాణ్, అప్పు వెళ్తుంటే దూరం నుండి ధాన్యలక్ష్మి చూసి..కళ్యాణ్ లా ఉన్నాడేంటని అనుకుంటుంది‌. తరువాయి భాగం లో అప్పు, కళ్యాణ్ ఇంటికి వచ్చి ఎవరు చూడకుండా పైకి వెళ్ళాలనుకుంటారు. అప్పుడే ధాన్యలక్ష్మి చూస్తుంది. ఆ తర్వాత అందరు కలిసి రాజ్ కావ్య ఉన్న గదిలోకి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

అమ్మ నాన్న పెళ్లి రోజుకు శ్రీవారి విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చిన అఖిల్

  అఖిల్ సార్థక్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా అందరికీ తెలిసిన యాంకర్ , యాక్టర్ కూడా. అంత పెద్ద ఫేమ్ లేకపోయినా కానీ బిగ్ బాస్ ద్వారా ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. అలాంటి అఖిల్ రీసెంట్ గా వాళ్ళ పేరెంట్స్ కి 42 వ వివాహ మహోత్సవ కార్యక్రమానికి ఒక సర్ప్రైజ్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇక దాన్ని చూసి వాళ్ళ అమ్మైతే ఫుల్ ఫిదా ఐపోయింది. ఆ గిఫ్ట్ మరేదో కాదు.  నిలువెత్తు శ్రీవారు. శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని వాళ్లకు బహుమతిగా ఇచ్చాడు. ఇక వాళ్ళ అమ్మ ఆ సడెన్ సర్ప్రైజ్ గా వచ్చిన గిఫ్ట్ ని చూసి అసలు ఏముందా అందులో అంది ఆశ్చర్యపోతూ  గిఫ్ట్ ప్యాక్ ని ఓపెన్ చేసి చివరికి షాకయ్యింది. వేంకటేశ్వరుడి నిలువెత్తు విగ్రహం చూసేసరికి వాళ్ళ నాన్న దండాలు పెట్టుకుంటూనే ఉన్నాడు. ఇక వాళ్ళ మ్యారేజ్ డే సందర్భంగా అఖిల్   పేరెంట్స్ ని విష్ చేసాడు. కేక్ కట్ చేయించి తినిపించాడు. ఇక ఆ వేంకటేశ్వరుడి పక్కన వాళ్ళ పేరెంట్స్ ని అటు ఇటు నిలబెట్టి పిక్స్ తీసి తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకున్నాడు. ఇక అఖిల్ రీసెంట్ గా వేరే లెవెల్ ఆఫీస్ అనే ఓటిటి మూవీలో నటించాడు. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు మోనాల్ గుజ్జర్ తో ఎక్కువగా ఫ్రెండ్ షిప్ చేసేవాడు. ఆమె మాత్రం అభిజిత్ తో ఎక్కువగా మాట్లాడేది. అది అఖిల్ కి ఎక్కువగా నచ్చేది కాదు. కానీ తర్వాత బిగ్ బాస్ నుంచి వచ్చాక ఎవరి దారులు వారివి వేరైపోయాయి. అఖిల్ ఎక్కువగా టెంపుల్స్ ని సందర్శించడం అలాగే జిమ్ లో ఎక్కువగా ఉండడం చేస్తూ ఉన్నాడు. ఆ పిక్స్ ని, వీడియోస్ ని ఎక్కువగా తన ఇన్స్టాగ్రామ్ లో చేస్తూ ఉంటాడు.

ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి మరీ వాళ్ళను తిడతా

కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్  ఫ్రెండ్ షిప్ థీమ్ తో రాబోతోంది. ఈ షోలో ఉన్న బాయ్స్ అండ్ గర్ల్స్ వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ ని షోలోకి ఇన్వైట్ చేశారు. స్టేజి మీదకు తేజస్విని మడివాడ తన బెస్ట్ ఫ్రెండ్ అఖిల్ సార్థక్ ని తీసుకొచ్చింది. "నన్ను ఎవరన్నా ఏదన్న మాట అంటే అఖిల్ ఫస్ట్ ఫీలవుతాడు" అని తేజు ముద్దుగా గోముగా చెప్పేసరికి "అంతే కదా..తను నాకు ఫ్రెండ్ కాబట్టి నేనే ఫీలవుతాను" అని చెప్పాడు అఖిల్. "ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి మరీ వాళ్ళను తిడతా" అని చెప్పాడు అఖిల్. తర్వాత సుహాసిని - అంబటి అర్జున్ కలిసి వచ్చారు. "అసలు ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఈ ఫ్రెండ్ షిప్" అని అడిగింది శ్రీముఖి. "దేవత స్టార్ట్ అయ్యాక" అని అర్జున్ చెప్తుండగా "నీ లైఫ్ లో కి ఒక దేవత వచ్చింది కదా" అంది శ్రీముఖి. దానికి అర్జున్ "అంత సీన్ లేదు" అని చెప్పేసరికి సుహాసిని సడెన్ అర్జున్ ముఖం చూసింది. "అబ్బాయిలు బెస్టా...అమ్మాయిలు బెస్టా ఫ్రెండ్ షిప్" అని శ్రీముఖి అమరదీప్ ని అడిగేసరికి "ఫ్రెండ్ షిప్పే బెస్ట్..అది అమ్మాయా, అబ్బాయా అని కాదు" అని చెప్పాడు. ఐతే అమరదీప్ ఫ్రెండ్ శోభా శెట్టి వచ్చింది స్టేజి మీదకు అలాగే విష్ణు ప్రియా కోసం రీతూ చౌదరి వచ్చింది...అలాగే జడ్జ్ అనసూయ కోసం ఆమె బెస్ట్ ఫ్రెండ్ వచ్చింది. హమీద కోసం కాజల్ ఆర్జే, నిఖిల్ విజయేంద్ర సింహ కోసం దేత్తడి హారిక అలియాస్ అలేఖ్య హారిక వచ్చింది. ఇక ప్రేరణ కోసం ఆమె ఫ్రెండ్ ప్రీతల్ "నువ్వు బ్రష్ చేసుకోలేదు యాక్" అంటోంది అనేసరికి ప్రేరణ శ్రీముఖి దగ్గరకు వచ్చి ఇంకేం చెప్పేద్దు అని చేతులు పట్టుకుంది. ఇలా రాబోయే వారం షో ఫ్రెండ్ షిప్ థీమ్ గా రాబోతోంది.  

తేజు బిగ్ బాస్ కి వెళ్తోందా? డివోర్స్ అన్నప్పుడు డాడీ ఉంటే బాగుండు అనిపించింది

  కాకమ్మ కథలు న్యూ ప్రోమో రిలీజ్ ఐపోయింది. ఈ న్యూ ఎపిసోడ్ కి యాంకర్ రవి, తేజస్విని గౌడ వచ్చారు. ఇక ఈ షోలో తేజస్విని గౌడ డివోర్స్ విషయం మీద కొన్ని విషయాలు నడిచాయి. "తేజు బిగ్ బాస్ కి వెళ్తోందా" అని హోస్ట్ అడిగేసరికి ఒక్కసారి ఊపిరి బిగబట్టి కూర్చుంది తేజు. "మీరు అమర్ తో డివోర్స్ తీసుకుంటున్నారా" అని మళ్ళీ హోస్ట్ అడిగింది. "రీసెంట్ టైమ్స్ లో కొన్ని సిట్యువేషన్స్ ఫేస్ చేసినప్పుడు అనిపించింది ఈ సందర్భంలో డాడీ ఉండి ఉంటే..అదొక్కటే నేను డాడీని నా లైఫ్ లో మిస్ ఐన టైం అంతే" అనే ఎమోషనల్ అయ్యేసరికి హోస్ట్ వెళ్లి ఆమెను ఓదార్చింది. తరువాత యాంకర్ రవిని అడిగింది హోస్ట్ " మీరు కెరీర్ లో తీసుకున్న ఒక రాంగ్ డెసిషన్ ఏమిటి" అనేసరికి "కొంతమంది చెప్పారు ఎంత చెప్పినా నాకు ఎక్కలేదు. దాంతో కొన్ని రాంగ్ షోస్ చేసాను. ఐతే తేజస్విని గౌడ విషయంలో ఇష్మార్ట్ జోడిలో అమరదీప్ తేజు డివోర్స్ విషయం మీద కొన్ని విషయాలు తెలిసాక సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ కూడా జరిగింది. కానీ ప్రతీ ఒక్కరి మ్యారీడ్ లైఫ్ ఇలాంటి కొన్ని పరిస్థితులు వస్తాయి కానీ దానికే డివోర్స్ తీసుకోవాలా...కాదు సర్దుకుపోవాలి అని కూడా చెప్పింది. తర్వాత హోస్ట్ ఒక ప్రశ్న వేసింది "యాంకరింగ్ తక్కువ యాక్టింగ్ ఎక్కువ అని ఎవరిని చూస్తే అనిపిస్తుంది" అని అడిగేసరికి "తేజు" అని ఆన్సర్ ఇచ్చాడు రవి. తేజస్విని మడివాడ యాంకరింగ్ కంటే యాక్టింగ్ అలాగే ఫన్ ఎక్కువగా క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇక ఇందులో కొన్ని పదాలు ఇచ్చి వాటితో స్టోరీ అల్లమని చెప్పింది..అందులో మంచు అనే పదం వచ్చేసరికి "ఇప్పుడు మంచు లక్ష్మి అక్క వస్తుంది ఓకే నా" అని అడిగాడు. "ప్లీజ్ కథ మధ్యలోకి అక్కను తీసుకురావద్దు" అని తెగ పగలబడి నవ్వుతూ చెప్పింది హోస్ట్ తేజు. ఇక తేజస్విని-అమరదీప్ ప్రతీ షోలో కనిపిస్తూ ఉంటారు. వీళ్ళు కనిపించని షో అంటూ ఏదీ ఉండదు.  

30 రోజుల్లో యాంకరింగ్ నేర్చుకోవడం ఎలా ? 

  ఫ్యామిలీ స్టార్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోని సమ్మర్ హాలిడేస్ స్పెషల్ థీమ్ గా రాబోతోంది. ఇక పిల్లలందరూ కలిసి ఈ షోకి వచ్చారు. సుధీర్ అడిగిన ప్రశ్నలకు పిల్లలు కొంటెగా జవాబులు కూడా ఇచ్చి నవ్వించారు. ఇక పవిత్ర ఐతే టోటల్ గా జోకర్ గెటప్ లో వచ్చి డాన్సులు చేసి పిల్లలను, పెద్దలను అలరించింది. ఈ షోకి గెస్టులుగా "సారంగపాణి జాతకం" మూవీ టీమ్ నుంచి ప్రియదర్శి, రూప వచ్చారు. వాళ్ళు కూడా ఫుల్ గా ఈ షోని ఎంజాయ్ చేశారు. వాళ్ళతో లెమన్ అండ్ స్పూన్ ఆడించాడు హోస్ట్ సుధీర్. సుధీర్ మరదలి చేస్తున్న స్రవంతి కూడా చిన్నపిల్లలనే నటించింది. "బావా నెమలీకలు పిల్లల్ని పెట్టాయి..ఎం చెయ్యను" అని అడిగింది. "డైపర్లు వేసి స్కూల్ కి పంపించు" అంటూ ఇంకా కొంటెగా ఆన్సర్ ఇచ్చాడు సుధీర్. ఇక లిటిల్ సింగర్ వాగ్దేవిని పిలిచి "అమ్మ వాగ్దేవి ఒక పక్షి తన గూట్లోని గుడ్ల మీద ఎందుకు కూర్చుంటుంది" అని అడిగేసరికి "వాటికి మనలా సోఫాలు ఉండవు కదా" అని చెప్పేసరికి మిగతా పిల్లలు చప్పట్లు కొట్టి అబ్బా ఎం చెప్పింది అంటూ పొగిడేశారు. ఆ తర్వాత జువేరియాని పిలిచాడు. ఈమె అలీ అన్న కూతురు అంటూ పరిచయం చేసాడు. ఆమె ఒక బుక్ తీసుకొచ్చి సుధీర్ చేతికి ఇచ్చింది. "నా కోసం ఒక గిఫ్ట్ తెచ్చింది" అంటూ గిఫ్ట్ ఓపెన్ చేసేసారికి షాకయ్యాడు "30 రోజుల్లో యాంకరింగ్ నేర్చుకోవడం ఎలా" అనే బుక్ చూసేసరికి షాకయ్యాడు. ఇదేంటమ్మా అని అడిగేసరికి "ఇంకో బుక్ ఉంది...నెక్స్ట్ ఇయర్ తెస్తాలే...60 రోజుల్లో ఆర్టిస్ట్ ఎలా అవ్వాలా" అనే బుక్ అని కౌంటర్ ఇచ్చింది. ఇక ప్రియదర్శితో కూడా పిల్లలతో పాటు లెమన్ అండ్ స్పూన్ ఆడిగాడు సుధీర్. పవిత్ర జోకర్ గెటప్ లో వచ్చేసరికి నెటిజన్స్ కూడా జోకర్ లా నవ్వించడం అంతా ఈజీ కాదు పవిత్ర బాగా చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  

Illu illalu pillalu: శ్రీవల్లికి ఇచ్చిపడేసిన నర్మద.. గొడవని ఆపిన అత్త!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -169 లో... రామరాజుకి శ్రీవల్లి ఫొటోస్ చూపించడంతో సాగర్ , నర్మద రాగానే తిడతాడు. చెప్పిన పని చెయ్యకుండా భార్యతో కలిసి షికారు అంటూ తిరుగుతావా అని సాగర్ పై రామరాజు విరుచుకుపడతాడు. చిన్నోడికి బాధ్యత తెలియదు.. నీకు నా మాట అంటే విలువ లేదని సాగర్ ని రామరాజు తిడతాడు. ప్రేమ గదిలోకి వచ్చేసరికి నర్మద ఉండదు.. కోపంతో ఎక్కడికైనా వెళ్ళిందేమోనని వేదవతితో ప్రేమ చెప్తుంది. ఎక్కడికి వెళ్ళదు.. నాకూ తెలుసు ఎక్కడికి వెళ్లి ఉంటుందో అని కిచెన్ లోకి తీసుకొని వెళ్తుంది వేదవతి. అక్కడ నర్మద కోపంతో అరిసెలు తింటుంది. అది చూసి ప్రేమ నవ్వుకుంటుంది. అసలు మావయ్య గారికి ఫోటోస్ ఎవరు చూపించారని నర్మద అడుగుతుంది. వేదవతి చెప్పకంటున్నా కూడా ప్రేమ వినకుండా శ్రీవల్లి పేరు చెప్పగానే ఆవేశంగా శ్రీవల్లి దగ్గరికి వెళ్తుంది నర్మద. మావయ్య గారికి ఎందుకు ఫోటోస్ చూపించావని శ్రీవల్లిని నర్మద అడుగుతుంది. ప్రతీదాంట్లో ఎందుకు దూరతావని నర్మద అడుగుతుంది. నేను ఈ ఇంటికి పెద్దకోడలిని అని శ్రీవల్లి అంటుంది. ఇద్దరు గొడవ పెట్టుకుంటుంటే వేదవతి వచ్చి ఆపుతుంది. మీరు ఎందుకు ఇలా గొడవ పెట్టుకుంటున్నారని అడుగుతుంది. ఇంకొకసారి నా విషయంలో జోక్యం చేసుకోకని చెప్పండి అని వేదవతితో నర్మద చెప్తుంది. ఆ తర్వాత రాత్రివేళ ధీరజ్ ని ఆట పట్టిస్తుంది ప్రేమ. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : అనసూయని నిలదీసిన దీప.. తను నిజం చెప్పనుందా!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -368 లో..... కార్తీక్ వెళ్తుంటే దీప వద్దని చెప్తుంది. ఎందుకు ఇదంతా చేస్తున్నారని దీప నిలదీస్తుంది. దాంతో దీపని ఆవేశంగా పక్కకి తీసుకొని వెళ్తాడు కార్తీక్‌. నువ్వు సుమిత్ర, దశరథ్ ల సొంత కూతురివి.. నువ్వే నా మరదలివి అని కార్తీక్ చెప్పగానే దీప షాక్ అవుతుంది. ఏంటి మీరు మాట్లాడేదని దీప అడుగుతుంది. అవును దీప నేను చెప్పేది నిజం.. ఇదంతా దాస్ మావయ్య చెప్పాడని కార్తీక్ అంటాడు. ఆయనకే గతం గుర్తులేదు.. మీరు ఆయన చెప్పేది నమ్ముతున్నారా అని దీప అంటుంది. ఆయనకు అంతా తెలుసు.. అందుకే అయన ఎక్కడ నిజం బయట పెడతాడో అని దాస్ మావయ్యని కొట్టింది జ్యోత్స్న. మరి జ్యోత్స్న ఎవరని దీప అడుగుతుంది. దాస్ మావయ్య కూతురు జ్యోత్స్న. పారిజాతం ఇదంతా చేసిందని కార్తీక్ జరిగింది మొత్తం చెప్తాడు. ఇప్పుడు నా ముందు రెండు ఉన్నాయ్.. ఒకటి నిన్ను ఆ కుటుంబానికి దగ్గర చెయ్యడం.. రెండు జ్యోత్స్న నోటితోనే అన్ని నిజాలు చెప్పించాలని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత దీప కుబేర్ ఫోటో దగ్గరకి వచ్చి ఏడుస్తుంది. అనసూయ దగ్గరికి దీప వెళ్లి.. అత్తయ్య నేను నీకు ఎప్పటి నుండి తెలుసని అడుగుతుంది. చిన్నప్పటి నుండి అని అనసూయ అంటుంది. అమ్మకి పురుడు పొసేటప్పుడు ఎక్కడ ఉన్నవని దీప అడుగుతుంది. బయట ఉన్నానని అనసూయ కంగారుగా చెప్తుంది. అప్పుడే కుబేర్ ఫొటోని దీప తీసుకొని వచ్చి.. ఈ ఫోటోపై అనసూయ చెయ్ పెడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : శోభనం కాదనుకొని స్టేషన్ కి వెళ్ళిన అప్పు.. ధాన్యలక్ష్మి చూస్తుందా!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -732 లో....అప్పు స్టేషన్ కి వెళ్ళడానికి రెడీ అవుతుంది. అప్పుడే కళ్యాణ్ వస్తాడు. ఈ ఫస్ట్ నైట్ ప్లాన్ అంతా నీదే కదా.. నిన్న నైట్ శోభనం అన్నావ్.. బయటకు వచ్చేసరికి అత్తయ్య ఉంది.. మార్నింగ్ పంతులిని పిలిచి ముహూర్తం పెట్టించిందని అప్పు అనగానే.. లేదు నాకేం తెలియదని కళ్యాణ్ అంటాడు. ఆ తర్వాత ధాన్యలక్ష్మి వస్తుంది. ఖచ్చితంగా ఈ రోజు మీకు శోభనం జరుగుతుంది. వెళ్లి స్వప్న గదిలో ఉండు.‌ మీ అక్కలు రెడీ చేస్తారని ధాన్యలక్ష్మి అంటుంది. మరొకవైపు ఈ రోజు నీ చెల్లికి శోభనం కదా తనకి నీ నగలతో రెడీ చెయ్ అని స్వప్నతో రాహుల్ అంటాడు. అదేంటి ఎన్నడు లేనిది ఇలా అంటున్నావ్.. అయిన నా నగలు లాకర్ లో ఉన్నాయని స్వప్న అంటుంది కానీ నువ్వు చెప్పేది ఈ సారి వినాలనిపిస్తుంది.. వెళ్లి నగలు తీసుకొని వద్దామని స్వప్న అంటుంది. ఆ తర్వాత రాహుల్ తన గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి మాట్లాడతాడు. మరోవైపు కావ్య, రాజ్ కలసి శోభనం ఏర్పాట్లకి కావల్సిన లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. స్టేషన్ కి ఒక పిల్లాడు వెళ్తాడు. రౌడీ చెప్పినట్లు కానిస్టేబుల్స్ తాగే టీలో ఏదో టాబ్లెట్ కలుపుతాడు. ఆ టీ తాగి అందరు స్పృహ తప్పి పడిపోతారు. మరోవైపు అప్పుని స్వప్న తన నగలతో అందంగా రెడీ చేస్తుంది. రాహుల్ వచ్చి అన్ని నగలు పెట్టి రెడీ చెయ్ అంటాడు. ఆ తర్వాత స్టేషన్ నుండి కానిస్టేబుల్ అప్పుకి ఫోన్ చేసి సెల్ లో ఉన్న అతను తప్పించుకున్నాడని చెప్తాడు. దాంతో  కళ్యాణ్ దగ్గరికి అప్పు వచ్చి.. నేను ఇప్పుడు స్టేషన్ కి వెళ్ళాలి లేదంటే నా జాబ్ పోతుందని చెప్తుంది. రాజ్ అన్నయ్య హెల్ప్ కావాలా అని కళ్యాణ్ అంటాడు. అదే సమయంలో రాజ్, కావ్య ఇద్దరు శోభనానికి ఏర్పాట్లు చేస్తుంటారు. తరువాయి భాగంలో అప్పు, కళ్యాణ్ బయటకు వెళ్తారు. శోభనం గదిలో రాజ్, కావ్య ఉంటారు‌. అప్పుడే ధాన్యలక్ష్మి లోపలికి వస్తుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

సొంత ఇంటి కల నెరవేర్చుకున్న ఆర్జే కాజల్...

  ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కాజల్ ఆర్జే కనిపిస్తోంది. రీజన్ ఏంటంటే ఈమె ఒక కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. అలా ఈమె కొత్త ఇంటి కలను నెరవేర్చుకుంది. ఇక గృహ ప్రవేశ వేడుకను గ్రాండ్ గా నిర్వహించింది. ఈ ఫంక్షన్ కి సిరి హన్మంత్, సింగర్ లిప్సిక, ప్రియాంక జైన్, ప్రియాంక సింగ్ వంటి వాళ్లంతా వెళ్లి ఆమెను విష్ చేశారు.ఇక కాజల్ ఐతే ఆమె కూతురు సోనా పుట్టినరోజు సందర్భంగా కొత్త ఇంటిని తీసుకోవాలని నిర్ణయించుకుని తీసుకున్నట్లు చెప్పింది..ఇక ప్రియాంక సింగ్ ఐతే తన ఇన్స్టాగ్రమ్ లో కాజల్ గురించి రాసుకొచ్చింది. "కాజల్ అక్క ఎంతో కష్టపడింది. వాళ్ళ ఫామిలీ ఎంతో ప్రేమతో ఉంటుంది. కాజల్ అక్క సిస్టర్స్ పేరెంట్స్ అందరూ తెలుసు. నన్ను చాలా బాగా చూసుకున్నారు. నన్ను ఆశీర్వదించారు" అంటూ రాసుకొచ్చింది. ఇక సిరి హన్మంత్ ఐతే "మేము రోజూ మాట్లాడుకుంటూనే ఉంటాము..ఐనా కానీ ప్రతీ సారి ఫ్రెష్ గానే అనిపిస్తుంది. ఇంకా చివరికి నువ్వు అనుకున్నది చేసావు. సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నావు. చాల గర్వంగా ఉంది" అంటూ చెప్పింది. ఇక మానస్ నాగులాపల్లి ఫామిలీ అలాగే యానీ మాష్టర్ కూడా ఈ ఫంక్షన్ కి వచ్చారు. ఇక నెటిజన్స్ కూడా కాజల్ ఫామిలీకి కొంత ఇంటితో పాటు వాళ్ళ కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నారు. కాజల్ బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్ గా వెళ్ళింది. ఈమె ఆర్జేగా తన కెరీర్ ని స్టార్ట్ చేసింది.

మరోసారి తల్లి ఐన అంజలి పవన్..

  బుల్లితెర మీద అంజలి పవన్ గురించి తెలియని వాళ్ళు లేరు. అంజలి యాంకర్ గా, సీరియల్ యాక్టర్ గా ఆడియన్స్ కి దగ్గరయింది. "మొగలి రేకులు" సీరియల్ ద్వారా ఆమె బాగా పాపులర్ అయ్యింది. ఈమె ప్రతీ షోలో భర్త పవన్ , కూతురు ధన్విక అలియాస్ చందమామతో కలిసి అంజలి వస్తోంది. అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తోంది. ఐతే రీసెంట్ గా ఆమె తన ఇన్స్టాగ్రమ్ లో అలాగే యూట్యూబ్ లో ఒక విషయాన్ని రివీల్ చేసింది. శ్రీసత్య అంజలి ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుసుకుని ఒక్క సారి షాక్ అయ్యింది. శ్రీసత్యకి చందమామ అంటే చాలా ఇష్టం. దాంతో వీళ్ళు ఒక పందెం వేశారు. మదర్ ఎవరు అని అడిగేసరికి ఇద్దరూ అని చెప్పింది తెలివిగా. ఇక అందరూ కలిసి షాపింగ్ చేశారు. తర్వాత పవన్, పల్లవి ప్రశాంత్ అందరూ కలిసి భోజనాలు చేశారు. పల్లవి ప్రశాంత్ తో కలిసి పని చేయకపోయినా కూడా కలిసి చాల సంతోషంగా ఉంటాడు. ఏది మాట్లాడినా వింటాడు. చాలా ప్రేమ చూపిస్తాడు అంటూ చెప్పుకొచ్చింది అంజలి. "హ్యాపీ ప్రెగ్నెంట్ డే టు యు" అంటూ పవన్ , చందమామ కలిసి కేక్ కట్ చేసి అంజలికి తినిపించారు. ఐతే బుల్లితెర మీద నటించే అంజలి ఫ్రెండ్స్ అంతా కూడా అమ్మాయి ఉందిగా బాబు పుడితే బాగుండు అంటూ విష్ చేస్తున్నారు. ముందు ప్రెగ్నెంట్ అంటే అందరూ అదొక ప్రాంక్ అనుకున్నారు. ప్రియాంక జైన్ కూడా అలాగే అనుకుంది. పిల్లో పెట్టుకుని ప్రాంక్ చేస్తున్నావా అని అడిగింది కూడా. కానీ కాదు సీరియస్ చందమామ పుట్టింది కాబట్టి సూరీడు రాబోతున్నాడు అంటూ చెప్పింది అంజలి. ఇక అర్జున్ కళ్యాణ్ కూడా విష్ చేసాడు.

Illu illalu pillalu : తోడికోడళ్ళ మధ్య రచ్చ.. ప్రేమ ఆ పని చేయగలదా!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ', ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -168 లో.....నర్మద, సాగర్ ఇద్దరు హైదరాబాద్ లో బాగా ఎంజాయ్ చేస్తున్నారని శ్రీవల్లి రామరాజుకి వాళ్ళ ఫొటోస్ చూపిస్తుంది. అవి చూసి వీళ్ళు వెళ్ళింది అందుకేనా అంటూ రామరాజు కోప్పడతాడు. హమ్మయ్య నేను అనుకున్నది జరిగింది అంటూ శ్రీవల్లి కిచెన్ లోకి వెళ్లి డాన్స్ చేస్తుంది. అప్పుడే ప్రేమ వెళ్లి నీకు అవసరమా అక్కా.. మావయ్య నిన్ను ఏమైనా అడిగాడా అని ప్రేమ కోప్పడుతుంది. అడిగితేనే చెప్తారా ఏంటని శ్రీవల్లి అంటుంది. అప్పుడే వేదవతి వస్తుంది. నువ్వు అనవసరమైన విషయల్లో జోక్యం చేసుకుంటున్నావని అంటుంది. దాంతో అందరు ఒక్కటే.. నేనే వేరు అన్నట్లుగా శ్రీవల్లి యాక్టింగ్ చేస్తుంది. మరుసటి రోజు నర్మద, సాగర్ ఇద్దరు ఇంటికి వస్తారు వేదవతి ప్రేమ దగ్గర వెళ్లి ప్రేమగా మాట్లాడుతారు. రామరాజు వచ్చి ఫోన్ ఎందుకు ఎత్తలేదంటు కోప్పడతాడు. నేను చెప్పిన పని ఏం చేసావని రామరాజు కోప్పడుతాడు. ట్రై చేసాను నాన్న కానీ వాళ్ళు కలవలేదని సాగర్ చెప్తాడు. అయిన రామరాజు కోప్పడతాడు. తరువాయి భాగంలో మావయ్య గారికి మా ఫొటోస్ ఎందుకు చుపించావని శ్రీవల్లితో గొడవపెట్టుకుంటుంది నర్మద. ఇద్దరు తోడికోడళ్లు నువ్వెంత అంటే నువ్వెంత అంటూ గొడవ పడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : నువ్వే అసలైన వారసురాలివి.. దీపకి నిజం చెప్పిన కార్తీక్!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -367 లో..... జ్యోత్స్న తనకున్న శాడిజంతో కార్తీక్ ని బానిసలాగా చేసుకొని తనకి నచ్చిన పని చేయించుకుంటుంది. అవన్నీ వీడియో తీసి దీపకి పంపిస్తుంది జ్యోత్స్న. దీప ఆ వీడియోస్ చూసి బాధపడుతుంది. ఏంటి అవి అని కాంచన కూడా వాటిని చూసి ఏడుస్తుంది. కార్తీక్ షూస్ క్లీన్ చేస్తున్న వీడియో చూసి కాంచన చాలా బాధపడుతుంది. అప్పుడే కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. ఏం చూస్తున్నారని అడుగుతాడు. నువ్వెందుకు అక్కడికి వెళ్ళావ్.. ఎందుకు ఇదంతా చేస్తున్నావని కాంచన బాధపడుతుంది. వాళ్ళకి అసలు నిజం చెప్పలేక కార్తీక్ ఇబ్బంది పడతాడు.ఆ తర్వాత దీపకి జ్యోత్స్న ఫోన్ చేస్తుంది. నేను అనుకున్నది సాధించానని గర్వం తో జ్యోత్స్న మాట్లాడుతుంది. బావని నా చుట్టూ తిప్పుకుంటున్నానని జ్యోత్స్న అంటుంటే దీపకి కోపం వస్తుంది. మరుసటి రోజు కార్తీక్ ఇంటి నుండి బయటకు వెళ్తుంటే దీప అడ్డుపడుతుంది. ఎక్కడికి వెళ్తున్నారో నాకు తెలుసు.. మీరు ఎక్కడికి వెళ్లొద్దని దీప అంటుంది. అసలు మీరు ఎందుకు ఆ పేపర్స్ పై సంతకం చేసారని దీప అంటుంది. నీ కోసం.. నిన్ను ఆ కుటుంబానికి దగ్గర చెయ్యడం కోసమని కార్తీక్ అంటాడు. నన్ను ఎందుకు దగ్గర చెయ్యడమని దీప అంటుంటే.. చెప్తానంటూ తనని కార్తీక్ పక్కకి తీసుకొని వెళ్తాడు. ఎందుకు అంటే నువ్వు నా మరదలివి.. సుమిత్ర దశరత్ ల సొంత కూతురివి.. అసలైన వారసురాలివి నువ్వే అని కార్తీక్ అనగానే.. దీప షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi: అటు కవి శోభనం.. ఇటు కావ్యకి రాజ్ ప్రపోజ్!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -731 లో.....రాహుల్ కంగారుగా గదిలో నుండి బయటకు వస్తుంటే స్వప్న చూసి.. ఏంటి అలా చెమటలు పడుతున్నాయని అడుగుతుంది. తనకి డౌట్ వచ్చి తన నగలు చెక్ చేసుకుంటుంది అన్ని ఉన్నాయి.. మరి నువ్వు ఎందుకు అలా కంగారు పడుతున్నావని రాహుల్ ని స్వప్న అడుగుతుంది. నీకు నేను ఎలా కన్పిస్తున్నానంటూ రాహుల్ అడుగుతాడు. ఇక అతను ఏదో ఒకటి కవర్ చేస్తాడు. మరుసటి రోజు రాజ్ కోసం అపర్ణ ఇందిరాదేవి వెయిట్ చేస్తారు. రాజ్ పంతులు గారు ఒకటే సారి వస్తారు. పంతులుని ఎందుకు తీసుకొని వచ్చావని ఇందిరాదేవి అడుగుతుంది. రాజ్ తీసుకొని రాలేదు నేను పిలిపించానని ధాన్యలక్ష్మి అంటుంది. ఎందుకని అందరు అడుగుతారు. శోభనం ముహూర్తం పెట్టడానికి అని ధాన్యలక్ష్మి అనగానే ప్రకాష్ సిగ్గుపడతాడు. ఈ వయసులో మీకెందుకు శోభనం.. అప్పు, కళ్యాణ్ కి అని ధాన్యలక్ష్మి అంటుంది. ఇప్పుడే ఎందుకు మాకు కొంచెం టైమ్ కావాలని అప్పు అంటుంది. ఇక టైం లేదని ధాన్యలక్ష్మి ముహూర్తం పెట్టిస్తుంది. ఈ వంకతో కావ్య గారికి ప్రపోజ్ చెయ్యాలని రాజ్ అనుకుంటాడు. ఆ తర్వాత అపర్ణ, ఇందిరాదేవి ఇద్దరు రాజ్ ని పక్కకి తీసుకొని వెళ్లి అసలు నువ్వేం చెయ్యాలనుకుంటున్నావని అడుగుతారు. అప్పు, కళ్యాణ్ శోభనం ఏర్పాట్లు చేసేటప్పుడు తనకి ప్రపోజ్ చేస్తానని రాజ్ అంటాడు. ఆ తర్వాత యామిని, రుద్రాణి ఫోన్ మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ఇమ్మానుయేల్ లైఫ్ లో ఇన్ని కన్నీళ్లా..!

  చార్లీ చాప్లిన్ ఎంతోమందిని ఎంటర్టైన్ చేసాడు...కానీ అతని జీవితమే కష్టాల కడలి. జబర్దస్త్ లో ఉన్న ఇమ్మానుయేల్ లైఫ్ కూడా ఇంచుమించు ఇంతే. అతని జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఈ వేదిక మీద నిలబడ్డాడో అతని స్టోరీ ద్వారా అర్ధమవుతోంది.    "మాది అమరావతి దగ్గర వైకుంఠపురం గ్రామం. నా జీవితంలో అనుకోనిది ఏదైనా జరిగింది అంటే అది నేను ఆర్టిస్ట్ ని అవ్వడమే. నేను డిగ్రీ వరకు చదువుకున్నా. చదువుకు తగ్గ జాబ్ దొరకలేదు. దాంతో కొన్ని నెలలు తాపీ బొచ్చెలు మోయడానికి వెళ్లాను. వేళ్ళ చివర్లు బొబ్బలెక్కిపోయాయి. దాంతో నేను అమ్మ దగ్గర ఏడ్చేవాడిని. నేను దేవుడిని నమ్మను. తినడానికి తిండి లేని ఫామిలీలో ఎలా పుట్టించావు. తిండి లేకపోతే మనుషులు ఎలా బతుకుతారు అని బాధపడేవాడిని. వర్షం వస్తే మా ఇంట్లో నన్ను మా అన్నను పడుకోబెట్టి అమ్మా నాన్న మా మీద నీళ్లు పడకుండా గోనె పట్టాలు పట్టుకునేవారు. చుట్టాలు కూడా ఎవరూ హెల్ప్ చేసేవాళ్ళు కాదు. అప్పుడే దేవుడిని ఒక్కటే అడిగా నాకు డబ్బు వద్దు నేను స్టేజి మీద కామెడీ చేయాలి.. దానికి ఒక్క దారి చూపించు అని అడిగా.  అప్పుడు యూట్యూబ్ లో ఒక షోకి ఆడిషన్స్ ఉన్నాయి అని చూసి వెళ్ళా.. 2 వేల మందిలో 20 మందిని సెలెక్ట్ చేస్తే అందులో నేను ఉన్నాను. దాంతో ఆ షోలో కొన్ని ఎపిసోడ్స్ చేసాక ఊరెళితే ఏరా ఇదంతా ఎందుకు నీకు మీ నాన్న చదివించాడు జాబ్స్ చేసుకోక అని అన్నారు. నువ్వేమన్నా హీరోవా నిన్ను అందరూ గుర్తుపట్టేస్తారని అనుకుంటున్నావా అనేసరికి మా నాన్నకు ఈ మాటలు చెప్పా.. ఎవరి మాటలు వినకుండా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకో అన్నాడు. మా ఊరిలో మా నాన్నతో మాట్లాడే విధానం నాకు నచ్చేది కాదు. అందుకే మా నాన్నకు నేను రెస్పెక్ట్ తీసుకురావాలి అనుకున్నా. నేను చర్చికి వెళ్తే అక్కడి నుంచి బయటకు రావడానికి మూడున్నర గంటలు పట్టింది. ఎవరైతే మమ్మల్ని అన్నారో వాళ్ళే సెల్ఫీ ఇవ్వరా అని అడిగారు. మా నాన్న డిగ్రీలో చిన్న ఇల్లు కట్టించాడు. దాన్ని నేను అలాగే ఎక్స్టెండ్ చేసి ఇప్పుడు త్రి ఫ్లోర్స్ తో పెద్ద ఇల్లు కట్టించాను. అందులో అమ్మ నాన్న మాత్రమే ఉంటారు. అద్దెకిద్దాం, ఇన్ని ఫ్లోర్స్ ఊడ్చలేకపోతున్నా అని అమ్మ అంటున్న కూడా నేను వాళ్లనే ఉండమని చెప్పాను" అంటూ తన లైఫ్ లో జరిగిన కష్టాలను కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ షోలో చెప్పాడు ఇమ్మానుయేల్.    ఇక ఇమ్ము స్టోరీని వింటూ కన్నీళ్లు పెట్టుకున్న డెబ్జాన్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇన్ని కష్టాలు ఉన్నాయా ఇమ్ముని ఎప్పుడూ ఇలా చూడలేదు కదా అందుకే అంటూ వెళ్లి ఇమ్ముని హగ్ చేసుకుంది.  

లేడీ ఇన్ బ్లాక్ లో వంటలక్క.. బుక్ పోజ్ అదిరింది!

  వంటలక్క ఒక బుక్ పట్టుకుని నిలబడిన పిక్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతొంది. వంటలక్క అంటే తెలియని తెలుగు ఆడియన్స్ ఎవరూ లేరు. కార్తీక దీపం సీరియల్ హీరోయిన్.. అదేనండి ప్రేమీ విశ్వనాధ్. ఇప్పుడు కార్తీక దీపం 2 లో కూడా డాక్టర్ బాబుతో కలిసి నటిస్తోంది. అలాంటి వంటలక్క ఇప్పుడు ఒక కొత్త లుక్ లో ఆకర్షిస్తోంది. ఒక లైబ్రరీ స్టాండ్ ముందు లేడీ ఇన్ బ్లాక్ లో అందంగా మెరిసిపోతూ చేతిలో ఒక బుక్ పట్టుకుని దీర్ఘంగా చదివిస్తోంది. ఆ బుక్ ఏంటో తెలుసా "మై స్టోరీ బై కమల దాస్" . కమల దాస్ గారి ఆటో బయోగ్రఫీ బుక్ అది. ప్రేమి విశ్వనాధ్ బుక్ లవరో కాదో తెలీదు కానీ మంచి బుక్ చదువుతూ తన ఫాన్స్ ని నెటిజన్స్ మాత్రం ఆకర్షిస్తోంది.    ప్రపంచంలో చాలా విషయాలు తెలియాలి అంటే బయోగ్రఫీ రీడింగ్ వల్లనే సాధ్యం అని పెద్దలు అంటూ ఉంటారు. విడిగా కథలు చదవక్కర్లేదు.. ఒక్కొక్కరి బయోగ్రఫీ చదివితే అందులోనే ఎన్నో కథలు వచ్చేస్తాయి. ఇప్పుడు వంటలక్క కూడా అదే చేస్తోంది. ఈ పిక్ ని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకుంది. ఇక నెటిజన్స్ ఐతే వంటలక్క ఈ బుక్ పోజ్ ని మాత్రం తెగ వర్ణించేస్తూ ఎమోజీలతో రిప్లైస్ ఇస్తున్నారు.    సీరియల్ లో పొందిగ్గా కాటన్, సిల్క్ చీరల్లో కనిపించి అలరించే వంటలక్క మాములుగా తన ఓన్ లైఫ్ లో రకరకాల కాస్ట్యూమ్స్ వేసుకుని కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ అబ్బాయితో కలిసి రీల్స్ చేస్తూ పోస్టులు పెడుతూ ఉంటుంది. ఇక డాక్టర్ బాబుతో కలిసి షూటింగ్స్ మధ్యలో అల్లరి చేస్తూ ఉంటుంది. ఏదేమైనా వంటలక్క మాత్రం తెలుగు ఆడియన్స్ లో ఒక స్పెషల్ క్రేజ్ ని సంపాదించుకుంది. కార్తీక దీపం-1 2017 లో స్టార్ట్ అయ్యి 2023 లో సుమారు 1500 ఎపిసోడ్స్ కి పైగా కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు కార్తీక దీపం 2 కూడా రేటింగ్స్ లో దూసుకెళుతోంది.  

Illu illalu pillalu : వాళ్ళిద్దరిని ఇరికించిన శ్రీవల్లి.. సాగర్ ని తిట్టిన రామరాజు!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -167 లో....నర్మద, సాగర్ ఇద్దరు కాఫీ తాగడానికి బయటకి వెళ్తారు. అక్కడ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఫొటోస్ తీసుకుంటారు. ఈ ఫొటోస్ ప్రేమకి పంపిస్తానని నర్మద పంపిస్తుంటే.. వద్దు ఇంట్లో ఇంకా ఎవరైనా చూస్తారని సాగర్ భయపడతాడు. ఏం కాదని నర్మద పంపిస్తుంది.   ఆ తర్వాత ఆ ఫొటోస్ చూసి ప్రేమ హ్యాపీగా ఫీల్ అవుతుంది.‌ వెంటనే వేదవతి కి చూపిస్తుంది. అవి చూసి ఎంత బాగున్నాయో అని తను అంటుంది. అదంతా చూస్తున్న శ్రీవల్లి అవేంటో కనుక్కోవాలనుకుంటుంది కానీ శ్రీవల్లి వెళ్ళగానే వాళ్ళు టాపిక్ డైవర్ట్ చేస్తారు. మళ్ళీ నన్ను పరాయి దానిలాగా చూస్తున్నారని యాక్టింగ్ చేస్తుంది. అదేం లేదమ్మ అంటూ శ్రీవల్లి కి నర్మద ఫొటోస్ చూపిస్తుంది. ఆ ఫొటోస్ చూసి ఓర్వలేక వీళ్ళ సంగతి చెప్పాలని శ్రీవల్లి అనుకుంటుంది. ఆ తర్వాత రాత్రి అందరు భోజనం చేస్తుంటారు. సాగర్ ఫోన్ స్విచ్చాఫ్ వస్తుందని రామరాజు అంటాడు. వాళ్ళు ఏమైనా ఫోన్ చేసారా అని రామరాజు అంటాడు. చెయ్యలేదు కానీ ఫొటోస్ పంపిందని శ్రీవల్లి చెప్తుంది. ఏంటి ప్రేమ ఫొటోస్ చూపించని శ్రీవల్లి అంటుంది.   ప్రేమ ఫొటోస్ చూపిస్తుంది. ఫొటోస్ చూసి వాడు ఫోన్ అఫ్ చేసి పెళ్ళాం తో షికారుకి వెళ్లిండు.. బాధ్యత తెలియదంటూ రామరాజు కోప్పడతాడు. తరువాయి భాగం లో సాగర్, నర్మద ఇంటికి వస్తారు. ఫోన్ ఎందుకు ఎత్తట్లేదని సాగర్ ని తిడతాడు రామరాజు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

గోదావరి పార్ట్ 2.. సుమంత్ కథ అదిరిపోయింది...

  ఆహాలో కాకమ్మ కథలు ఈ వీక్ ఎపిసోడ్ మస్త్ ఫన్నీగా ఉంది. ఈ ఎపిసోడ్ కి "అనగనగా" మూవీ టీమ్ నుంచి హీరో సుమంత్ కుమార్, స్కూల్ ప్రిన్సిపాల్ గా చేసిన అవసరాల శ్రీనివాస్ వచ్చారు. ఇక హోస్ట్ తేజస్విని మడివాడ ఇంట్రావర్ట్స్ గా కాకుండా తన షోలో తిక్కతిక్క సమాధానాలు చెప్పాలి అంటూ ప్రమాణం చేయించింది. "మినిమం డిగ్రీ ఉండాలి" అనే సెగ్మెంట్ లో ఇద్దరికీ చెరొక ఐదు పదాలు ఇచ్చి దాంతో ఒక స్టోరీ క్రియేట్ చేయమని టాస్క్ ఇచ్చింది. ఆ ఐదు పదాలు ఏమిటి అంటే " పున్నమి వెన్నెల్లో, గోదావరి, మళ్ళీ రావా, చక్కని చుక్క, ఏమో గుర్రం ఎగరావచ్చు" వంటివి ఇచ్చింది.    దాంతో సుమంత్ కూడా ఒక ఇంటరెస్టింగ్ కథను అల్లేశాడు. అదేంటో తెలుసా "పున్నమి వెన్నెల్లో నాకు ఒక చక్కని చుక్క కనిపించింది. తను నా దగ్గరకు వచ్చి గోదావరి పార్ట్ 2 చేయొచ్చు కదా అని అడిగింది. సో నేను శేఖర్ కమ్ముల దగ్గరకు వెళ్లి మళ్ళీ రావా చేద్దాము అని అడిగాను...ఏమో గుర్రం ఎగరావచ్చు అని చెప్పారు" అని సుమంత్ చెప్పడంతో అవసరాల శ్రీనివాస్, తేజస్విని చప్పట్లు కొట్టారు. చాలా బాగా చెప్పారు అంటూ తేజు పొగిడేసరికి సుమంత్ కూడా థ్యాంక్యూ అని చెప్పాడు. గోదావరి పార్ట్ 2 చేయమంటూ చాలా మంది చక్కని చుక్కలే వచ్చి అడుగుతూ ఉంటారు అని చెప్పుకొచ్చాడు ఫన్నీగా.    సుమంత్ నటించిన "అనగనగా" మూవీ మాత్రం అద్దిరిపోయే రేటింగ్స్ తో అందరినీ ఆకట్టుకుంటోంది. అందులో ఫాదర్ అంటే ఎలా ఉండాలి అనే పాయింట్ కి ప్రతీ ఒక్కరూ కనెక్ట్ అయ్యారు. ఐతే సుమంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ రీసెంట్ గా కొన్ని కామెంట్స్ వచ్చాయి కానీ వాటిని ఇగ్నోర్ చేయమని చెప్పాడు. సింగల్ గా ఉండడం ఇష్టం అని చెప్పాడు.  

Karthika Deepam 2 : జ్యోత్స్న చేతిలో కీలుబొమ్మలా కార్తీక్.. దశరథ్ తనని ఆపగలడా!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -366 లో.... కాంచన దగ్గరికి దీప వచ్చి.. కార్తీక్ బాబుని జ్యోత్స్న పనివాడిని చేసింది. అన్ని పనులు చేయిస్తుందని ఏడుస్తుంది. దాంతో కాంచనకి కోపం వస్తుంది. మనవరాలిని పెంచే పద్దతి ఇదేనా అంటూ నిలదియ్యాలి.. మా నాన్న దగ్గరికి వెళ్తానని కాంచన అంటుంటే వద్దని దీప అంటుంది.   మరొకవైపు మన రెస్టారెంట్ కి ఆర్డర్స్ బాగా వస్తున్నాయ్.. ఇక ఇలా అయితే మన రెస్టారెంట్ త్వరలోనే మల్లి ఫస్ట్ కి వస్తుందని దశరత్ తో శివన్నారాయణ అంటాడు. అప్పుడే జ్యోత్స్న వస్తుంది. బ్యాగ్ ఏదే అని పారిజాతం అడుగుతుంది. నా అసిస్టెంట్ తీసుకొని వస్తున్నాడని జ్యోత్స్న అంటుంది. అప్పుడే కార్తీక్ జ్యోత్స్న బ్యాగ్ తీసుకొని వస్తాడు. జ్యోత్స్న చెప్పినట్టు కార్తీక్ చేస్తుంటే దశరథ్ తప్ప మిగిలిన వాళ్లంతా నవ్వుకుంటారు. వీడు నువ్వు చెప్తే చేస్తున్నాడంటే నేను నమ్మడం లేదని పారిజాతం అంటుంటే.. నిన్ను నమ్మించాలంటే ఏం చెయ్యాలి.. నువ్వు వెళ్లి తాత షూస్ తీసుకొని రా అని జ్యోత్స్న అనగానే పారిజాతం తీసుకొని వస్తుంది. బావ ఆ షూ క్లీన్ చెయ్ అని జ్యోత్స్న అనగానే సరే అని కార్తీక్ క్లిన్ చేస్తాడు. ఎందుకురా ఇదంతా అని దశరత్ అంటాడు. ఇది సంతకానికి ఉన్న పవర్ మావయ్య అని కార్తీక్ అంటాడు. అదంతా జ్యోత్స్న వీడియో తీస్తుంది.   ఆ తర్వాత కార్తీక్ ని అందరికి భోజనం వడ్డించమని జ్యోత్స్న చెప్తుంది. దాంతో కార్తీక్ ఆలాగే చేస్తాడు. ఆ తర్వాత కార్తీక్ ని జ్యోత్స్న తన రూమ్ కి తీసుకొని వెళ్లి.. ఏసీ ఆన్ చెయ్యమంటుంది. బెడ్ సెట్ చేయమంటుంది. పడుకో జ్యోత్స్న కొన్ని రోజులే కదా ప్రశాంతంగా పడుకునేది అని కార్తీక్ అనేసి వెళ్లిపోతాడు. బావకి ఏదైనా నిజం తెలిసి ఉంటుందా.. ఛాన్స్ లేదు.. ఈ వీడియో ఇప్పుడు దీపకి పంపాలని జ్యోత్స్న అనుకుంటుంది. మరొకవైపు కార్తీక్ అలా చేస్తుంటే చూడలేకపోతున్నాను.. మనమే ఇది ఆపాలని సుమిత్రతో దశరథ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : అప్పు, కళ్యాణ్ ల శోభనం.. కావ్యకి రాజ్ ప్రపోజ్ చేయగలడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -730 లో.....అప్పు దగ్గరికి కళ్యాణ్ వెనకాల నుండి వచ్చి హగ్ చేసుకుంటాడు. మనకి ఫస్ట్ నైట్ జరగలేదు గుర్తు ఉంది కదా అని అప్పు అంటుంది. కళ్యాణ్ చెంపపై అప్పు ముద్దు పెట్టి బయటకు పరిగెడుతుంది. తన వెనకాలే కళ్యాణ్ వస్తాడు. ఎదురుగా ధాన్యలక్ష్మి ఉంటుంది. అప్పు కంగారుగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. కళ్యాణ్ తడబడుతూ అంటే అమ్మ.. ఫ్రెండ్ శోభనం గురించి మాట్లాడుకుంటున్నామని ధాన్యలక్ష్మితో కళ్యాణ్ అంటాడు. ఆ తర్వాత వీడిని ఏం అడగలేదు.. లేదు అంటే వీళ్ళకి శోభనం జరగలేదా.. నా కొడుకు కి ఏ సుఖం లేకుండా చేస్తుంది ఆ అప్పు అని ధాన్యలక్ష్మి కోపంగా అంటుంది. ఆ తర్వాత రాజ్ ఇంటికి వస్తాడు. ఏంటి బావ అంత హుషారుగా ఉన్నావని యామిని అడుగుతుంది. ఏంటి బాబూ ఎప్పుడు వెళ్తున్నావో ఎప్పుడు వస్తున్నావో ఏం అర్ధం కావడం లేదు.. నీ కోసం ఇంట్లో వెయిట్ చేసేవాళ్ళు ఉంటారు కదా అని యామిని వాళ్ళ నాన్న రాజ్ తో అంటాడు. రాజ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. బావ ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నాడో నాకు తెలుసు.. రేపు ఆ కావ్యకి ప్రపోజ్ చేస్తున్నాడని యామిని అంటుంది. ఆ తర్వాత ధాన్యలక్ష్మి దగ్గరికి రుద్రాణి వస్తుంది. ఆ అప్పు నా కొడుకుని దూరంగా ఉంచుతుందని ధాన్యలక్ష్మి చెప్తుంది. నేను చెప్పినట్టు చెయ్.‌ దాంతో అది ఉద్యోగం మానేస్తుంది. నీకు చేతిలో మనవడిని పెడుతుంది. నువ్వు అర్జెంట్ గా శోభనానికి ముహూర్తం పెట్టమని రుద్రాణి చెప్తుంది. మరొకవైపు రేపు రాజ్ నీకు ప్రపోజ్ చేస్తున్నాడు కదా అని కావ్యని స్వప్న, అప్పు ఆటపట్టిస్తారు.. ఆ తర్వాత స్వప్న నగలు తనకి తెలియకుండా రాహుల్ దొంగతనం చేస్తాడు. తరువాయి భాగంలో కావ్యని రాజ్ కలిసి మాట్లాడతాడు దూరంగా ఉంటే ప్రేమగా మాట్లాడుతావు.. ఇలా దగ్గరగా ఉంటే కంగారుపడతావని కావ్యతో రాజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.