వెనుక నుంచి వచ్చి ఆ అబ్బాయి హగ్ చేసుకున్నాడు...గుండె పగిలిపోయింది

  బుల్లితెర మీద అమరదీప్ -తేజస్విని ఒక మంచి జోడిగా అందరికీ తెలుసు. రీసెంట్ గా అమరదీప్ కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ కి లవ్ థీమ్ ఇచ్చింది శ్రీముఖి. అందులో అమరదీప్ తన హార్ట్ బ్రేక్ లవ్ స్టోరీ చెప్పాడు. "దగ్గరుండి అప్లికేషన్ ఫిల్లప్ చేయించి బస్ ఎక్కించి పంపించిన అమ్మాయి వేరే అబ్బాయిని లవ్ చేస్తే ఎలా ఉంటుంది. అది మన కళ్ళతో చూస్తే మనకు ఎలా ఉంటుంది. ఎప్పుడూ వచ్చే అమ్మాయి ఆ బస్సులోంచి దిగుతుంది కదా అని ఎదురు చూసే టైములో వెనక నుంచి ఒక అబ్బాయి వచ్చి హగ్ చేసుకున్నాడు. నా కళ్ళ ముందు నేను అది చూసాను." అని తన బ్రేకప్ లవ్ స్టోరీ చెప్పాడు. "జానకి కలగనలేదు" అనే సీరియల్ తో బుల్లితెర ఆడియన్స్ కి దగ్గరయ్యాడు అమరదీప్.  రామ పేరుతో మంచి పేరు సంపాదించుకున్నాడు అమర్ దీప్ చౌదరి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7  లో అమరదీప్ బాగా గేమ్స్ ఆడాడు అలాగే ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసాడు. అలాగే అరియానా, సొహైల్, అషు రెడ్డి, అవినాష్ వీళ్లంతా అమర్ దీప్‌కి మంచి ఫ్రెండ్స్ కూడా. రీసెంట్ గా అమరదీప్ - తేజస్విని గౌడ ఇద్దరూ కూడా ఇష్మార్ట్ జోడికి కూడా వెళ్లారు. అలాంటి అమరదీప్ ఐరావతం, రాజు గారి కిడ్నాప్ అనే మూవీస్ లో నటించాడు. ఇక ఇప్పుడు "సుమతి శతకం" అనే మూవీలో నటిస్తున్నాడు. అమర్ దీప్ చౌదరి సరసన సాయిలీ చౌదరి హీరోయిన్ గా చేస్తోంది.  

Illu illalu pillalu : నర్మద ట్రైనింగ్ కి రామరాజు గ్రీన్ సిగ్నల్.. శ్రీవల్లి ప్లాన్ ఫెయిల్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -158 లో... ప్రేమ, నర్మద, వేదవతి ముగ్గురు కలిసి రామరాజుని ట్రైనింగ్ వెళ్ళడానికి ఒప్పించాలని ముందే ప్లాన్ చేసుకుంటారు. ఇక రాత్రి అందరు ఒక దగ్గర కూర్చొని ఉంటారు. నాకు ఒక మొక్కు ఉంది అందరం వెళ్ళాలని వేదవతి టాపిక్ స్టార్ట్ చేస్తుంది అయితే అందరం వెళదామని రామరాజు అనగానే నాకు ఇప్పుడు వీలు అవ్వదని నర్మద అంటుంది. ఎందుక వేదవతి అడుగుతుంది. అంటే నాకు హైదరాబాద్ లో రెండు రోజులు ట్రైనింగ్  ఉందని చెప్తుంది. అలా ఎలా అవుద్దని వేదవతి కావాలనే యాక్టింగ్ చేస్తుంది. ఇన్ని రోజులు కష్టపడ్డ జాబ్ ఎందుకు పోగొట్టుకోవడమని ప్రేమ అంటుంది. సరే నేను ఒప్పుకుంటున్నానని వేదవతి అంటుంది. అయిన అయన కూడా ఒప్పుకోవాలి కదా అని వేదవతి అంటుంది. మావయ్య గారు వద్దని అంటారని శ్రీవల్లి అంటుంది. ఆయన మాత్రం ఎందుకు ఒప్పుకోరని వేదవతి అనగానే సరే అని రామరాజు అంటాడు. అయినా ఒక్కతి ఎలా వెళ్తుందని శ్రీవల్లి అనగానే.. మన నడిపోడు ఉన్నాడు కదా ఇద్దరు కలిసి వెళ్తారని వేదవతి అంటుంది. నర్మద ట్రైనింగ్ కి వెళ్ళడానికి శ్రీవల్లి ఎంత ఆపాలని చూసిన తన ప్లాన్ ఫెయిల్ అవుతుంది. నర్మద, సాగర్ వెళ్ళడానికి రామరాజు ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ప్రేమ, నర్మద, వేదవతి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత మీరు ముగ్గురు ఒకటి మీ సంగతి చెప్తానని భాగ్యంకి ఫోన్ చేసి శ్రీవల్లి జరిగిందంతా చెప్తుంది. నువ్వు మెల్లగా మీ అత్తని నీ గుప్పిట్లోకి తెచ్చుకోమని భాగ్యం సలహా ఇస్తుంది. మరోవైపు ధీరజ్ ఆలోచిస్తుంటే ప్రేమ తన దగ్గరికికి వస్తుంది. ఈ రెండు వేల్లల్లో ఒక వేలు పట్టుకోమని ధీరజ్ అనగానే ప్రేమ పట్టుకుంటుంది. ఇదొక వింత మన ఇద్దరి ఆలోచనలు కలిసాయని ధీరజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : పారిజాతం తీసుకొచ్చిన ఫోన్ రికార్డ్ చూసి జ్యోత్స్న షాక్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -357 లో.... దీప ఇంటి దగ్గర సిచువేషన్ ఎలా ఉందో కనుక్కోమని పారిజాతాన్ని పంపిస్తుంది జ్యోత్స్న. పారిజాతం చెత్త వేరుకునే గెటప్ లో దీప ఇంటికి వస్తుంది. తనని చూసి ఏంటి ఏం కావాలని అనసూయ అడుగుతుంది. హమ్మయ్య గుర్తు పట్టలేదని పారిజాతం అనుకుంటుంది. నీ వాయిస్ ఎక్కడో విన్నానని అనసూయ అనగానే ఎవరి వాయిస్ అమ్మ అని పారిజాతం అడుగుతుంది . ఒకావిడ అంటు పారిజాతాన్ని అనసూయ తిడుతుంది.  అప్పుడే దాస్, కాశీ, స్వప్న ఇంటికి వస్తారు. పారిజాతం వాళ్ళని చూసి టెన్షన్ పడుతుంది. వాళ్ళు లోపలికి వెళ్లి దీపని పరామర్శిస్తారు. అసలు ఇంటికి వచ్చి పొడిచే అంత దైర్యం ఉందంటే వాడిని వదులొద్దని దాస్ అంటాడు. దాస్ గతం గుర్తుకు వచ్చినట్లు మాట్లాడుతుంటే అన్నయ్య మిమ్మల్ని కొట్టింది ఎవరు అని కాంచన వాళ్ళు అడుగుతారు. ఎవరంటే అని దాస్ చెప్పబోతుంటే కార్తీక్ తన భుజంపై చెయ్ వేసి ఆపుతాడు. మళ్ళీ గతం మర్చిపోయినట్లు యాక్టింగ్ చేస్తాడు. అదంతా పారిజాతం ఫోన్ లో రికార్డు చేస్తుంది. ఆ తర్వాత దాస్ ని కార్తీక్ బయటకు తీసుకొని వచ్చి.. మావయ్య మీరు ఇప్పుడే నిజం చెప్పకండి కొన్ని రోజులు ఇలా యాక్టింగ్ చెయ్యండి అని చెపుతాడు. అప్పుడే కాశీ వస్తాడు. విన్నాడేమోనని ఇద్దరు అనుకుంటారు కానీ కాశీ వాళ్ళ మాటలు వినలేదు. ఆ తర్వాత జ్యోత్స్న దగ్గరికి పారిజాతం వెళ్లి.. ఫోన్ లో రికార్డు చేసిన ఆ రికార్డు చూపిస్తుంది. అదంతా చూసి షాక్ అవుతుంది. అంటే దాస్ కి గతం గుర్తుకి వచ్చినట్లుంది బావకి ఏదైనా నిజం తెలిసినట్లుంది. అందుకే ఆ రోజు అలా మాట్లాడాడు అని జ్యోత్స్న అనుకుంటుంది. రేపు దాస్ ని మనమిద్దరం కలవాలని పారిజాతంతో జ్యోత్స్న అంటుంది. మరొకవైపు దీపకి టాబ్లెట్ ఇచ్చి కార్తీక్ మాట్లాడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : కావ్య వెంటపడుతున్న రాజ్.. షాక్ లో ఆ ఇద్దరు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -721 లో...... కళ్యాణ్ అప్పు, ఇందిరాదేవి, స్వప్న అపర్ణ అందరు కలిసి రాజ్ కావ్య వెంటపడేలా చెయ్యాలని ప్లాన్ చేస్తారు. అందులో భాగంగా రాజ్ ని కలవాలని కళ్యాణ్ ఫోన్ చేస్తాడు. రాజ్ ఒప్పుకుంటాడు. సీన్ కట్ చేస్తే అందరు రాజ్ దగ్గరికి వస్తారు. అపర్ణ మాట్లాడుతుంటే మిమ్మల్ని అమ్మ అనుకుని కేక్ కట్ చేయించాను కానీ మీరు నన్ను మోసం చేసారని రాజ్ అంటాడు. అంటే కావ్య నా గురించి నీకు చెప్పలేదు ఏం అలోచించి చెప్పలేదో నాకు తెలియదు కదా అందుకే సైలెంట్ గా ఉన్నానని అపర్ణ అంటుంది. అయిన మా కావ్య మోసం చేయలేదు నిజం దాచి అబద్ధం చెప్పింది అంతే మోసం చెయ్యలేదని ఇందిరాదేవి అంటుంది. కావ్య నిన్ను ఇష్టపడుతుంది అందుకే నీ వెంటపడింది.. నీకు క్యారేజ్  పంపింది.. షర్ట్ గిఫ్ట్ పంపిందని అందరు కావ్య గురించి చెప్పగానే రాజ్ సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతాడు. నిజంగానే కళావతి గారు నన్ను ప్రేమిస్తున్నారా అని అంటాడు. కానీ నీకు యామినితో పెళ్లి కదా అని అపర్ణ అడుగుతుంది. నాకు ఆ పెళ్లి ఇష్టం లేదు కళావతి గారి మనసులో ఏముందో తెలుసుకుని ఆ విషయం యామినికి చెప్పాలని చూస్తున్న అని రాజ్ అంటాడు. కళావతి తనంతటా తానే బయటపడేలా చెయ్యాలని అందరు రాజ్ కి చెప్తారు. దానికి రాజ్ సంతోషంగా ఒప్పుకుంటాడు. ఆ తర్వాత రాజ్ ని ఇంటికి తీసుకొని వెళ్లి భోజనం వడ్డీస్తారు. రాజ్ ఆలా సంతోషంగా ఉంటే సుభాష్, ప్రకాష్ హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే పై నుండి కావ్య కిందకి వస్తుంది. మిమ్మల్ని రావద్దని చెప్పాను కదా ఎందుకు వచ్చారని కావ్య అనగానే.. సరే వెళ్తాను కానీ మళ్ళీ రేపు వస్తాను వస్తునే ఉంటానని రాజ్ అంటాడు. అదంతా చూసి రాహుల్, రుద్రాణి షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ప్రతీ తల్లీ ఒక భరతమాతే..వాళ్ళ కోసం ఈ పాట అంకితం

  బిగ్ బాస్ సీజన్ 1 ద్వారా నటి హరితేజలోని టాలెంట్ అంతా బయటకు వచ్చింది. ఈ మొదటి సీజన్ లో ఆమె చాలా హైలైట్ అయ్యింది. టాస్కులు ఆడింది. బుర్ర కథలు, హరికథలు చెప్పింది. ఐతే ఈ మధ్య హరితేజ బుల్లితెర మీద ఎక్కువగా కనిపించడం లేదు. ఆమె యాంకర్ గా, సీరియల్ నటిగా చేసింది. రక్త సంబంధం, కన్యాదానం, మనసు - మమతా, అభిషేకం వంటి సీరియల్స్ లో ఆమె నటించింది. ఇక మూవీస్ విషయానికి వస్తే అఆలో సమంతతో కలిసి నటించింది. అలాగే ఆడవారి మాటలకు అర్థాలు వేరులే, అత్తారింటికి దారేది, విన్నర్, దువ్వాడ జగన్నాధం, నేనే రాజు నేనే మంత్రి వంటి ఎన్నో మూవీస్ లో కూడా నటించింది. అలాంటి హరితేజ రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక పోస్ట్ పెట్టింది. ఒక ఎత్తైన కొండ మీద వాన పడుతూ ఉండగా అక్కడ భరతనాట్యం చేస్తూ కనిపించింది. పరదేశి మూవీ నుంచి "జగతి సిగలో జాబిలమ్మకు" అనే సాంగ్ కి నృత్యం చేసింది. "భరతమాత సంరక్షణ కోసం తన పిల్లలను సరిహద్దుల్లో నిలిపిన ప్రతీ తల్లీ ఒక భారతమాతే.. ఆ తల్లులకు ఈ పాట అంకితం. మేమంతా మీకు సెల్యూట్ చేస్తున్నాం, మీ వైపు నిలబడి ఉన్నాం..జైహింద్ " అంటూ ఒక టాగ్ కూడా పెట్టింది. నెటిజన్స్ ఐతే హరితేజను తెగ పొగిడేస్తున్నారు. "హరితేజ మల్టిటాలెంటెడ్... రియల్ ట్రిబ్యూట్, మీరు ఎక్కడ డాన్స్ చేసి స్లిప్ అవుతారో అని భయపడ్డాను... సూపర్బ్... నెమలిలా నాట్యం చేశారు..ఈ ప్లేస్ ఎక్కడ. సెల్యూట్" అంటూ మెసేజెస్ పెట్టారు.  

లవ్ లో సెకండ్ ఛాన్స్ ఇస్తావా ? ఇవ్వవా ? ...రీజన్ ఏంటో చెప్తే ఓకే

  కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ నెక్స్ట్ వీక్ ప్రోమో ఫుల్ కలర్ ఫుల్ గా రిలీజ్ అయ్యింది. ఐతే లవ్ థీమ్ కాన్సెప్ట్ తో నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ రాబోతోంది. ఇందులో కంటెస్టెంట్స్ జోడీస్ గా కనిపించారు. మానస్ - డెబ్జానీ జోడిగా వచ్చేసరికి యాంకర్ శ్రీముఖి షాకయ్యింది. "ఏంటి నువ్వు జోడిగా వచ్చావు" అని అడిగింది. "మొత్తం సీజన్ సింగల్ సింగల్ గా పోటీ చేస్తే మీలాగా మొత్తం లైఫ్ కూడా  సింగల్ గా మిగిలిపోతుంది" అంటూ శ్రీముఖి మీద కౌంటర్ వేసింది. "ఆమ్మో నాకే కౌంటర్ వేసిందా" అని తెలుసుకుని నవ్వుకుంది. తర్వాత ప్రేరణ - అంబటి అర్జున్ తో కలిసి జోడిగా వచ్చింది. ఈ జోడిని చూసి జడ్జ్ అనసూయ కామెంట్ చేసింది. "ప్రేరణ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది కానీ అర్జున్ కాకపోతే బాగుండేది. కొన్ని కంబినేషన్స్ చాలా డెడ్లీగా ఉంటాయి" అని చెప్పింది. ఇక ఈ లవ్ థీమ్ షోకి నిఖిల్ మాత్రం సింగల్ గా వచ్చాడు. "నిఖిల్ అనే పర్సన్ సెకండ్ ఛాన్స్ ఇన్ లవ్ అనేది ఆయన సైడ్ నుంచి  ఇస్తాడా, ఇవ్వడా ?" అంటూ శ్రీముఖి నిఖిల్ నే అడిగింది. "వై, ఎందుకు అనే దానికి రీజన్ దొరికితే" అంటూ ఎమోషనల్ అయ్యాడు. శ్రీముఖి వెంటనే "మనల్ని బాగా ఇబ్బంది పెట్టే ప్రాబ్లమ్ ని ఒక పేపర్ మీద రాసి దాని తగలబెట్టేస్తే భారం తీరిపోయినట్టు అనిపిస్తుంది" అంటూ చెప్పింది. నిఖిల్ కూడా వెంటనే తన ప్రాబ్లమ్ ని పేపర్ మీద రాసి దాని స్టేజి మీదనే తగలబెట్టేసాడు..నిఖిల్, కావ్య విడిపోయిన విషయం తెలిసిందే. వీళ్ళు కలిసి ఏ షోలోనూ కనిపించడం లేదు. ఎవరికీ వాళ్ళు విడిగా ఉంటున్నారు. అలాంటి నిఖిల్ ని శ్రీముఖి ఈ ప్రశ్న అడిగింది. మరి నిఖిల్ పూర్తి ఆన్సర్ ఎం ఇచ్చాడో తెలియాలి అంటే ఈ షో చూడాల్సిందే.  

నన్ను మోసం చేశారు...నేను మా నాన్నగారిని చాలా మిస్ అయ్యాను

    ఫ్యామిలీ స్టార్స్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి ఆమని, సింగర్ ఎస్పి చరణ్, కోర్ట్ మూవీ ఫేమ్ రోషన్ వచ్చారు. హోస్ట్ సుధీర్ ఆమనిని చూసి "మేడం మీరెందుకు ఇక్కడికి వచ్చారు" అని అడిగేసరికి "అరే నేను కొనడానికి వచ్చా" అని చెప్పింది. " మీరు సినిమాల్లో భర్తను అమ్మేస్తానంటారు ఇక్కడేమో నన్ను కొంటానంటున్నారు..ఏంటి మేడం ఇది" అని అడిగేసరికి "అంతే మరి..కొంటుంటాం..తీసుకుంటూ ఉంటాం" అని కౌంటర్ వేశారు. తర్వాత తన లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్పి ఆమని కన్నీళ్లు పెట్టుకున్నారు. "తెలుగు ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వకముందు తమిళ్ మూవీ కోసం వెళ్లాను. ఆ మూవీ ఇంకా త్రి డేస్ ఉంది. ఆ మూడు రోజులు చేస్తూ ఉండగా లాస్ట్ డే మా నాన్న గారు చనిపోయారు. నాన్నగారికి ఏదో సీరియస్ అని మీ బ్రదర్ ఫోన్ చేసి చెప్పారంటూ ఆ సినిమా టీమ్ వాళ్ళు చెప్పారు. నేను కూడా ఆ మాటల్ని నమ్మాను. ఎందుకంటే సినిమా క్లైమాక్స్ కదా లాస్ట్ డే కదా ఐపోతుంది కదా ఆ తరువాత వెళ్ళొచ్చులే అనుకున్నా. ఐతే నేను సినిమా పూర్తి చేసి ఇంటికి వెళ్లేసరికి నాన్నగారు చనిపోవడం అన్ని కార్యక్రమాలు జరిగిపోవడం ఐపోయాయి. వాళ్ళ సెల్ఫ్  కోసం నన్ను అలా మోసం చేశారు. లైఫ్ లో మళ్ళీ మా నాన్న గారిని నేను చూడలేను. నేను మా నాన్నగారిని చాలా మిస్ అయ్యాను." అంటూ చిన్నపిల్లలా ఏడ్చేసింది ఆమని. తర్వాత ఎస్పీ చరణ్ తన లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ని చెప్పారు. "ఒక సారి నా కాలికి ఫ్రాక్చర్ అయ్యింది. చాలా విపరీతమైన పెయిన్, అమ్మ పక్కన పడుకున్నారు. ఆమె నా ఏడుపును, నొప్పిని కంట్రోల్ చేయలేకపోయారు. దాంతో ఆమె మా నాన్నకు ఫోన్ చేసి రమ్మని చెప్పారు. నాన్నగారు వచ్చి నన్ను సాముదాయించి పడుకోబెట్టారు. నేను ఆయనకు చాలా అవకాశాలు ఇచ్చాను నా మీద కోప్పడడానికి కానీ ఆయనలా చాలా సహనంగా ఉన్న వ్యక్తిని ఇంతవరకు నా జీవితంలో ఎవరినీ చూడలేదు" అని చెప్పారు.  

నైటీతోనే షోకి...నేను పుట్టినప్పుడు నాన్నకు జాబ్ లేదు..

  ఆహా ప్లాట్ఫారం మీద కాకమ్మ కథలో ఎపిసోడ్స్ మంచి ఫన్నీగా ఉంటున్నాయి. తేజు హోస్టింగ్ కూడా ఫుల్ కామెడీని పంచుతోంది. ప్రతీ వారం ఇద్దరు చొప్పున షోకి తీసుకొచ్చి వాళ్ళతో మస్తీ చేస్తోంది. ఇక రాబోయే వారం యష్మి, ప్రేరణను తీసుకొచ్చింది. ఐతే "ఈ షోకి ప్రేరణ డైరెక్ట్ గా నైటీతో వచ్చేసింది. ఇంట్లో కూర్చుని మాట్లాడినట్లు ఉంటుంది అన్నావ్ గా నైటీ కంటే కంఫర్ట్ నాకు వేరేది లేదు కాబట్టి వేసుకొచ్చేసా" అంది దాంతో తేజు కూడా అవాక్కయ్యింది.."పో వెంటనే డ్రెస్ మార్చుకుని రా" అని పంపించేసింది తేజు. ఇక ఈ షోలో వీళ్ళను హార్ట్ బ్రేకింగ్ ఇన్సిడెంట్స్ ని చెప్పమని అడిగింది తేజు. "నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మా నాన్న నన్ను కొట్టేవాళ్ళు..ఇది నేను లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేను. అరేయ్ ఇదేంట్రా ఈ స్క్రాప్ పీస్ అని తిట్టేవాళ్ళు." అంటూ యష్మి చెప్తూ బాధపడింది. తర్వాత ప్రేరణ తన లైఫ్ లోని  ఇన్సిడెంట్స్ చెప్పింది "నిజంగా ఇప్పటికీ ఎన్నో నిద్ర లేని రాత్రులు గడుపుతున్నా...పేరెంట్స్ ఎంతో కష్టపడతారు. తమకు లేని కంఫర్ట్ లైఫ్ ని పిల్లలకు అందించడం కోసం. ఒక పాయింట్ లో నేను పుట్టాక మా నాన్నకు జాబ్ కూడా లేదు. ఇప్పటికీ ఇంకా ఎన్నో కస్టాలు అనుభవిస్తున్నా" అని చెప్పింది. "ఒక వేళ నువ్వు విలన్ ఐతే నీకు హీరోగా ఎవరు చేయాలనుకుంటున్నావ్ అలాగే ఎలాంటి పంచ్ డైలాగ్ ఉండాలనుకుంటావ్" అని తేజు అడిగింది. "నిఖిల్ హీరోగా ఉండాలి అలాగే నేను నీ మక్కే అని తిట్టాలి" అంటూ యష్మి చెప్పింది. వీళ్లంతా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కలిసిన ఫ్రెండ్స్. అక్కడ ప్రేరణ, యష్మి, నిఖిల్, పృద్వి బాగా డీప్ ఫ్రెండ్స్ ఇపోయారు. ఎందుకంటే వీళ్లంతా కన్నడ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వీళ్లంతా కలిసి ఉండేవాళ్లు.    

అదిరే అభి అసలు పేరేమిటి... ప్రభాస్‌ని అరె మావా అనడం ఏమిటి?

జబర్దస్త్ లో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్స్ లో అదిరే అభి కూడా ఒకరు. టీమ్ లీడర్ గ ఉంటూ మంచి కాన్సెప్ట్స్ తో స్కిట్స్ చేసి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేవాడు. జబర్దస్త్ స్టార్టింగ్ లో అదిరే అభి స్కిట్స్ ఫుల్ కామెడీని పంచేవి. ఐతే తర్వాత కొత్త వాళ్ళు రావడంతో పాత టీమ్ లీడర్స్ చాలా మంది కూడా జబర్దస్త్ నుంచి వెళ్లిపోయారు. అలాగే అదిరే అభి కూడా వెళ్ళిపోయాడు. ఐతే అదిరే అభి పేరు ఎవరు పెట్టారు అసలు తన ఒరిజినల్ పేరేమిటో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. "అభినయ్ కృష్ణ" అనేది నా ఒరిజినల్ పేరు. ఐతే ఈ పేరు కంటే ముందు స్కూల్ లో ఉన్న పేరు "హరికృష్ణ". అభినయ్ కృష్ణ అనే పేరును సి.నారాయణ రెడ్డి గారు పెట్టారు. ఇక ఆ పేరును అలా కంటిన్యూ చేస్తూ జబర్దస్త్ కి వచ్చినప్పుడు ఒక టాగ్ లైన్ ఉండాలి అన్నారు.. అప్పుడు "అదిరే అభి" అని పెట్టుకున్నా అంటూ చెప్పుకొచ్చాడు. చుట్టాల పెళ్లిళ్లలో ముందుగా తానే వెళ్లి డాన్స్ చేసేవాడిని అని చెప్పారు. డిగ్రీ చదివేటప్పుడు సరే ఒకసారి ఇండస్ట్రీలో ట్రై చేద్దామని వచ్చినప్పుడు రైటర్ జనార్దన్ మహర్షి గారు చదువు కంప్లీట్ చేసుకుని రమ్మన్నారు. దాంతో వెనక్కి వచ్చి చదువు పూర్తి చేసాను అని అన్నాడు.   అలా ఒకసారి ఈశ్వర్ మూవీకి ఆడిషన్స్ జరుగుతున్నప్పుడు తాను చేసిన డాన్స్ , మిమిక్రీ పెర్ఫార్మన్స్ చూసాక ఈశ్వర్ మూవీకి సెలెక్ట్ చేసినట్లు చెప్పాడు. ఫస్ట్ డే షూటింగ్ లో ప్రభాస్ తో  "అరె మావా ఈరోజు మొత్తం జాతరకు వచ్చినట్టు వచ్చార్రా" అని చెప్పడం నిజంగా కొంచెం భయం అనిపించింది ఎందుకంటే కృష్ణం రాజు గారి వారసుడు అలాంటి అతన్ని అరె మావా అనడం ఏమిటి అనుకున్నా కానీ నటించడం ప్యాషన్ కాబట్టి చేసేసాను అని చెప్పాడు.

Illu illalu pillalu : ట్రైనింగ్ గురించి వేదవతి చెప్తుందా.. చాటుగా విన్న శ్రీవల్లి!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -157 లో.....నర్మద వేదవతి దగ్గరికి వస్తుంది. ధీరజ్ ప్రేమ గురించి మాట్లాడిందంతా నర్మదకి వేదవతి చెప్తుంది. అప్పుడే వాళ్ళ దగ్గరికి ప్రేమ వస్తుంది. మీ అయన మీ గురించి ఏదో మాట్లాడట కదా అని నర్మద అనగానే.. ప్రేమ సిగ్గుపడుతుంది. ముందు ధీరజ్ అంటే నీకు పడేది కాదు కదా.. ఇప్పుడు బానే ఉంటున్నారని నర్మద, వేదవతి ఇద్దరు కలిసి ప్రేమని అడుగుతారు. అవును ముందు ధీరజ్ ని చూస్తే కోపం వచ్చేది కానీ ధీరజ్ వెరీ సెన్సిటివ్ అని ప్రేమ చెప్తుంది. ఆ తర్వాత శ్రీవల్లి అన్న మాటలు గుర్తుచేసుకొని సాగర్ బాధపడుతాడు. అప్పుడే తిరుపతి వచ్చి ఏంటని అడుగుతాడు. ఎంత కష్టం చేసిన గుర్తింపులేదని సాగర్ అంటాడు. అప్పుడే రామరాజు వస్తాడు. ఎంట్రా చిన్నోడు అలా మాట్లాడుతున్నాడని అడుగుతాడు. సాగర్ ఏదో సర్ది చెప్పి వెళ్ళిపోతాడు. బావ చిన్నోడిని చూస్తే అచ్చం నిన్ను చుసినట్లే అనిపిస్తుంది. ఆ దైర్యం అంతా నీ పోలికే అని తిరుపతి అనగానే.. అవునురా వాడిని చూస్తే నన్ను నేను చూసుకుంటున్నట్లు ఉంటుందని రామరాజు అంటాడు. అయితే ఎందుకు కోప్పడుతావని తిరుపతి అనగానే పిల్లల్ని అలా పెంచితేనే వాళ్ళు భయంతో ఉంటారని రామరాజు అంటాడు. ఆ తర్వాత నర్మద ట్రైనింగ్ గురించి సాగర్ మావయ్యతో చెప్పేలా లేడని వేదవతి దగ్గరికి వచ్చి మావయ్య తో ట్రైనింగ్ గురించి చెప్పమని రిక్వెస్ట్ చేస్తుంది. ప్రేమ కూడా వచ్చి నర్మదతో జాయిన్ అవుతుంది. ఇద్దరు రిక్వెస్ట్ చేస్తారు. అప్పుడే శ్రీవల్లి వస్తుంది. తను రాగానే అందరూ సైలెంట్ గా ఉంటారు. వెళ్ళగానే మాట్లాడుకుంటారు. రాగానే సైలెంట్ అయిపోతారు.. మీరు ఏదో మాట్లాడుకుంటున్నారు.. నేను రాగానే ఆగిపోయారు.. మీరు ముగ్గురు ఒకటి నేనే పరాయిదాన్ని అని శ్రీవల్లి అనగానే మేమ్ ఏం మాట్లాడుకోవట్లేదని వాళ్ళు అంటారు. ఆ తర్వాత శ్రీవల్లి చాటు నుండి వాళ్ళ మాటలు వింటుంది. ట్రైనింగ్ గురించా మీరు మాట్లాడుకునేది చెప్తానని శ్రీవల్లి అనుకుంటుంది. తరువాయి భాగం లో వేదవతి నర్మద ట్రైనింగ్ గురించి రామరాజుతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : జ్యోత్స్నపై దశరథ్ కి డౌట్.. ఆ గెటప్ లో పారిజాతం!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -356 లో... శివన్నారాయణ ఇంటికి కార్తీక్ వచ్చి మాట్లాడి వెళ్ళాక పారిజాతం జ్యోత్స్నని పైకి తీసుకొని వెళ్తుంది. ఆ దీప పై ఎటాక్ చేసింది నువ్వేనా దశరత్ ని షూట్ చేసింది నువ్వేనా అని పారిజాతం అడుగుతుంది. ఎందుకు నాపై డౌట్ పడుతున్నావని జ్యోత్స్న అడుగుతుంది. మరి కార్తీక్ అలా మాట్లాడి వెళ్తుంటే ఎందుకు టెన్షన్ పడుతున్నావని పారిజాతం అడుగుతుంది. దాంతో కార్తీక్ సంతకం పెట్టిన పేపర్ తీసుకొని వచ్చి చూపిస్తుంది జ్యోత్స్న. ఈ అగ్రిమెంట్ గురించి ఏదైనా చెప్తాడని భయపడ్డానని జ్యోత్స్న అంటుంది. ఇలా బావని బ్లాక్ మెయిల్ చేశాను. దాంతో బావ సంతకం పెట్టాడు. ఇక మనకి నచ్చింది ఈ పేపర్ పై రాసుకోవచ్చని జ్యోత్స్న అంటుంది. సరే గాని నేను చెప్పినట్లు చెయ్ అంటూ ఏదో ప్లాన్ పారిజాతానికి జ్యోత్స్న చెప్తుంది. మరొకవైపు దీపని కార్తీక్ ఇంటికి తీసుకొని వస్తాడు. అనసూయ దిష్టి తీస్తుంది. లోపలికి వచ్చాక శౌర్యని హగ్ చేసుకొని దీప ఎమోషనల్ అవుతుంది. మీరు ఆ ఇంటికి ఎందుకు వెళ్లారని కాంచన కోప్పడుతుంది. వాళ్ళు హెల్ప్ చేయకున్న నా భార్యని కాపాడుకున్నానని చెప్పడానికి వెళ్లానని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత దీప లోపలికి వెళ్తుంది. అమ్మ నువ్వు అనుకున్నదే జరిగిందని.. దీపనే నీ మేనకోడలు.. తననే కోడలు చేసుకున్నావని కార్తీక్ మనసులో అనుకుంటాడు. మరొకవైపు దశరథ్ కి జ్యూస్ ఇస్తుంది జ్యోత్స్న. దీపపై ఎటాక్ వెనుక ఖచ్చితంగా జ్యోత్స్న ఉండి ఉంటుందని దశరథ్ అనుకుంటాడు. డాడ్ కి నాపై డౌట్ వచ్చిందని జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. అయినా నువ్వు దీపని ఎందుకు పలకరించావ్ డాడ్ అని జ్యోత్స్న అడుగుతుంది. దీప ఒకరి ప్రాణం తీసేంత కఠినమైన మనిషి కాదు.. అయినా దీప చేతిలో ఉన్న గన్ నుండి బుల్లెట్ రాలేదని తెలిసింది కదా నన్ను షూట్ చేసినవాళ్లు దీపని ఎటాక్ చేసినవాళ్లు ఒకరే అయి ఉంటారు త్వరలోనే తెలుస్తుందని దశరథ్ అనగానే జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత చెత్త ఏరుకునే గెటప్ లో పారిజాతం రెడీ అయి దీప ఇంటికి వెళ్లి అక్కడ జరుగుతున్న సిచువేషన్ తెలుసుకోవాలని అనుకుంటుంది. పారిజాతం ఆ గెటప్ లో దీప ఇంటికి వెళ్తుంది. ఎవరు అని అనసూయ బయటకు వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : మీకు పడింది బ్రహ్మముడి.. దాన్ని చిక్కుముడి చేసాను!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -720 లో... రాజ్ ని తీసుకొని కావ్య ఇంటికి వస్తుంది యామిని. అందరూ రాజ్ ను చూసి షాక్ అవుతారు. మేం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం.. మొదటి కార్డు మా బావ తన ఫ్రెండ్ కళావతికి ఇవ్వాలి అనుకుంటున్నాడని యామిని అంటుంది. మమ్మల్ని ఆశీర్వాదించండి అని యామి,ని రాజ్ ఇద్దరు సీతారామయ్య, ఇందిరాదేవి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తర్వాత అప్పుడే సడెన్ గా అపర్ణ వస్తుంది. ఈ అంటీతో మొన్న కేక్ కట్ చేయించావ్ కదా అని ఆవిడా ఇక్కడ ఉందేంటని యామిని కావాలనే కావ్యని అడుగుతుంది. ఆవిడా ఆ కావ్య అత్త కోడళ్ళు అని రుద్రాణి అంటుంది. అది విని రాజ్ షాక్ అవుతాడు. అంటే ఆ రోజు నాకు అబద్దం చెప్పారా అని రాజ్ కావ్యని చీటర్ లాగా చూస్తాడు. కావ్య ఏదో చెప్పాలని ప్రయత్నం చేసిన రాజ్ వినిపించుకోడు. రాజ్ కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. చూసావా బావని ఎలా నా వైపుకి తిప్పుకున్నానో.. మీకు పడింది బ్రహ్మముడి దాన్ని ఎవరు విప్పలేరన్నావ్ కదా దాన్ని ఇప్పుడు చిక్కుముడి వేసానని యామిని చెప్పి వెళ్ళిపోతుంది. చూసారా అయన నన్ను ఒక మోసగత్తెలాగా చూస్తున్నాడు.. ఎప్పటికి నా మొహం కూడా చూడడని కావ్య బాధపడుతుంది. ఆ తర్వాత అపర్ణ, ఇందిరాదేవి, స్వప్న, అప్పు, కళ్యాణ్ కలిసి రాజ్ ని మళ్ళీ కావ్య వెంటపడేలా చెయ్యాలని ప్లాన్ చేస్తారు. రాజ్ కి కళ్యాణ్ ఫోన్ చేసి నిన్ను కలవాలి అన్నయ్య, మా వదిన గురించి మీకు చెప్పాలని కళ్యాణ్ అనగానే రాజ్ సరే అంటాడు. ఆ తర్వాత కావ్యకి యామిని ఫోన్ చేసి ఇక రాజ్ నిన్ను ఎప్పటికి కలవడు అంటుంది. తరువాయి భాగంలో రాజ్ ఇంటికి వచ్చి భోజనం చేస్తుంటాడు. మీరు మళ్ళీ ఎందుకు వచ్చారని రాజ్ ని కావ్య అడుగుతుంది. వస్తాను రోజు వస్తానని కావ్యకి చెప్పి వెళ్ళిపోతాడు రాజ్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

శ్రీముఖి వయసు 32...ఇంత డబ్బు వస్తే ప్రొడక్షన్ హౌస్ పెడతాను... 

  ఈ వారం ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో యాంకర్ శ్రీముఖి పుట్టినరోజు సెలెబ్రేషన్స్ ని ఎంతో ఘనంగా చేశారు. చిన్నప్పుడు శ్రీముఖికి అన్న ప్రాసన కార్యక్రమం జరగలేదని చెప్పడంతో అవినాష్, హరి కలిసి ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీముఖి కళ్ళకు గంతలు కట్టారు. తరువాత నేల మీద ఆదుకునే గిలక్కాయ, గోల్డ్ కాయిన్స్-డబ్బులు, మైక్, వాచ్,  పుస్తకం పెట్టారు. ఆమెకు కళ్ళకు గంతలు కట్టేశారు. తర్వాత హరి కార్తీక దీపం డాక్టర్ బాబుని అడిగాడు "అన్నా శ్రీముఖి ఎం పట్టుకుంటుంది అనుకుంటున్నారు" అన్నాడు. "ఏదైనా తనకు కావాల్సిందే పట్టుకుంటుంది.. మనీ అండ్ గోల్డ్" అన్నాడు. "అది పెద్దాయన" అని అంది శ్రీముఖి. ఆ తర్వాత వెతుకుతూ వెతుకుతూ డబ్బు, బంగారాన్ని పట్టుకుంది శ్రీముఖి. ఇక హరి ఐతే మైక్ తీసుకుని "ఐతే యాంకరింగ్ వదిలేస్తారంటారా" అన్నాడు . అవినాష్ ఐతే "మీరు అనుకున్నదే సాధిస్తారు అమ్మగారు" అన్నాడు. "ఏయ్ నేను యాంకరింగ్ వదిలేయను. ఇదిగో ఇన్ని డబ్బులు వస్తే ప్రొడక్షన్ హౌస్ పెట్టి మీ ఇద్దరితో షో చేస్తాను" అంటూ అవినాష్ కి, హరికి చెప్పింది. ఐతే తనకు 32 ఏళ్ళు వచ్చేసాయి అంటే తనకు నమ్మబుద్ది కావడం లేదంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ షోలో శ్రీముఖి పుట్టిన దగ్గర నుంచి ఉన్న ఫొటోస్ ని పెట్టి అవి ఏ ఏజ్ లో ఉన్న ఫొటోస్ అంటూ టాస్క్ ఇచ్చారు హరి- అవినాష్. షోకి వచ్చిన కంటెస్టెంట్స్ అంతా కూడా వాళ్ళు తెలిసిన ఏజ్ గ్రూప్స్ రాసేసరికి శ్రీముఖి అవి కరెక్టా కాదా అని చెప్పారు.

కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన అనసూయ.. ఇంటి పేరు శ్రీరామ సంజీవని...

బుల్లి తెర మీద అనసూయ గురించి తెలియని వారు లేరు. అలాంటి అనసూయ ఇప్పుడు కొట్టం ఇంట్లోకి వెళ్ళింది. ఈ గృహప్రవేశ వేడుకను ఫొటోస్, వీడియోస్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. " ఆ సీతారామాంజనేయ కృపతో...మా తల్లితండ్రుల ఆశీర్వాదంతో..మీ అందరి ప్రేమతో...మా జీవితంలో మరో అధ్యాయం..మా కొత్త ఇంటి పేరు తెలుసా..శ్రీరామ సంజీవని" అని చెప్పింది. అలాగే జై హనుమాన్, జై శ్రీరామ్ అంటూ హాష్ ట్యాగ్స్ పెట్టింది. అనసూయ, సుశాంక్ భరద్వాజ్ వాళ్ళ పిల్లలు కలిసి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన అనసూయ ఫామిలీకి అందరూ విషెస్ చెప్తున్నారు. "మాకు కూడా వాటా ఉంటుందా" అంటూ సమీరా భరద్వాజ్ కామెంట్ చేసింది. "కంగ్రాట్యులేషన్స్ అను, నిక్కు, షోరూ, ఆయాన్ష్" అంటూ శ్రీముఖి మెసేజ్ పెట్టింది. పాగల్ పవిత్ర, యాంకర్ గాయత్రి భార్గవ్, జబర్దస్త్ కమెడియన్ గడ్డం నవీన్, ఆర్జె చైతు, భానుశ్రీ, నటి, లేడీ కమెడియన్ రోహిణి, సింగర్ పర్ణిక, ఐశ్వర్య మీనన్, సింగర్ అనుదీప్ వంటి వాళ్లంతా కూడా వాళ్లకు శుభాకాంక్షలు చెప్పారు. అనసూయ ఇప్పుడు కిర్రాక్ బాయ్స్, ఖిలాడీ గర్ల్స్ షోకి శేఖర్ మాష్టర్ తో జడ్జ్ గా చేస్తోంది. అలాగే షాప్ ఓపెనింగ్స్ కి కూడా వెళ్తూ ఆ పిక్స్ ని కూడా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. రంగస్థలం మూవీతో అనసూయకు ఎంతో మంచి పేరు పేరు వచ్చింది. తర్వాత పుష్ప మూవీలో  రోల్ కి అలాగే విమానం మూవీలో చేసిన రోల్ కి అనసూయకు మంచి మార్కులు పడ్డాయి. అనసూయ ఎంత బిజీగా ఉన్నా తన ఫామిలీతో తన పెట్స్ తో మంచి టైం స్పెండ్ చేస్తుంది. షోస్ అన్నీ చూసుకుని ఇంటికి వెళ్లి కుటుంబంతో టూర్లకు వెళ్తూ ఉంటుంది. అనుసయా కొత్త ఇల్లు మాత్రం మంచి కాస్ట్లీ అండ్ గ్రాండ్ లుక్ తో అందరినీ ఆకర్షించేదిగా ఉంది.

నాతో మీకు సెకండ్ టైం కదా...

  సుమ అడ్డా షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి "ఓ భామ అయ్యో రామ" మూవీ టీమ్ వాళ్ళు వచ్చారు. ఇందులో సుహాస్, ఆలీ, సౌమ్య శారద వచ్చారు. ఈ సినిమా టీమ్ వాళ్ళు వచ్చారు సరే మరి నువ్వు వచ్చావేంటి అంటూ సుమ సౌమ్యని అడిగింది. ఈ సినిమాలో భామ క్యారెక్టర్ కి నన్ను అడిగారు అని చెప్పింది సౌమ్య. "ఓ బామ్మ క్యారెక్టర్ కి నిన్ను అడిగారా" అంటూ సుమ కౌంటర్ వేసింది. "ఆమె భామ కాదు నేను భామ" అంటూ ఆలీ చెప్పాడు. "ఇది నాకు మీతో సెకండ్ టైం కదా" అంటూ సౌమ్య అనేసరికి ఆలీ షాకై "ఏంటది" అని అడిగాడు.. "షూటింగ్ షూటింగ్" అని సౌమ్య చెప్పింది. అది చెప్పు ఆడియన్స్ కి అన్నాడు ఆలీ. "ఈ అమ్మాయి అప్పుడప్పుడు తెలుగులో కొన్ని పదాలు వాడుతూ ఉంటుంది. నువ్వు అవన్నీ పట్టించుకోకు అంటూ సుహాస్ కి చెప్పాడు ఆలీ. వెంటనే సౌమ్య "నాకు తెలుగు రాదు అని ఇక్కడ అందరూ అవమానిస్తున్నారు..అందుకే ఇప్పుడు నేనే వాళ్ళను అనుభవిస్తున్నా" అని మాట్లాడేసరికి సుమ షాకైపోయింది. "ఈ సినిమాలో ఆలీ గారు నాకు మావయ్యగా నటిస్తున్నారు" అని సుహాస్ చెప్పాడు. వెంటనే సౌమ్య "ఏంటండీ ఇంత చిన్న ఏజ్ లో మావయ్య క్యారెక్టర్ ఇస్తున్నారు. ఆయనే హీరోలా ఉన్నారుగా" అనేసింది. ఆలీ తనని అన్నదా ఇంకా ఎవరినన్నా అన్నదా అని వెనకా ముందు చూసుకుంటూ ఉన్నాడు. "నేను అన్నది మిమ్మల్నే" అంది సౌమ్య. వెంటనే సుమ ఆలిగారు మీరు సౌమ్యతో ఒక పోడియంలో ఉండి గేమ్ ఆడండి...ఈరోజు మీకు ఉంది లెండి అంది..వెంటనే ఆలీ "ఇంటికి వెళ్లిన తర్వాత కూడా ఉంటది నాకు" అనేశాడు. దానికి సౌమ్య "అది రోజూ ఉంటది వదిలేయండి" అంది. జనరల్ గా అమ్మాయిలు క్రీం రాస్తారు కానీ ఈ అమ్మాయి ఏకంగా సున్నం రాసేస్తోంది అంటూ ఆలీ సౌమ్య మీద సెటైర్ వేసాడు.

Brahmamudi : కావ్యని ఛీటర్ ని చేసిన యామిని.. కోపంగా వెళ్ళిన రాజ్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -719 లో..... కావ్యకి రాజ్ ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చెయ్యదు. అప్పుడే అపర్ణ, అప్పు, కళ్యాణ్ వస్తారు. రాజ్ ఫోన్ చేస్తుంటే ఎందుకు లిఫ్ట్ చెయ్యడం లేదని అడుగుతారు. ఇక ఆయన్ని డిస్టబ్ చెయ్యాలనుకోవడం లేదని కావ్య బాధపడుతుంది. వాళ్ళు కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు. అప్పుడే రాజ్ ఎంట్రీ ఇస్తాడు. రాజ్ ని చూసి కావ్య టెన్షన్ పడుతుంది. ఎందుకు ఫోన్ లిఫ్ట్ చెయ్యడం లేదని రాజ్ అడుగుతాడు. నేను మీతో ఎందుకు మాట్లాడాలని కావ్య కఠినంగా మాట్లాడుతుంది. దాంతో రాజ్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అదంతా రాహుల్, రుద్రాణి చూసి మనకి కావల్సింది కూడా అదేగా అని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత రాహుల్, రుద్రాణి కలిసి యామినిని కలుస్తారు. నువ్వు కావ్యని తక్కువ అంచనా వెయ్యకు రాజ్ ఎప్పుడు నీ సొంతమని వాళ్ళకి నమ్మకం కలిగించాలని రుద్రాణి చెప్తుంది. సరే రేపు మా వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి మీ ఇంటికి రాజ్ ని తీసుకొని వస్తానని యామిని చెప్తుంది. సరే కానీ కావ్య ఆ ఇంటికి కోడలు అన్న విషయం చెప్పకు.. ఎందుకంటే కావ్యకి పెళ్లి అయిందని.. భర్త ఉన్నాడన్న ఆలోచన వచ్చి కనుక్కోనే ప్రయత్నం చేస్తాడు. దాంతో తన గతాన్ని తనే కనుక్కుంటాడని రుద్రాణి అనగానే.. సరేనని యామిని అంటుంది. రాజ్ రెడీ అవుతుంటే యామిని తన దగ్గరికి కి వెళ్లి మాట్లాడుతుంది. మనం ఇప్పుడు నీ ఫ్రెండ్ కళావతి దగ్గరికి వెళ్తున్నాం. తన నిజస్వరూపం నీకు తెలుస్తుందని రాజ్ ని తీసుకొని కావ్య దగ్గరికి వెళ్తుంది యామిని. రాజ్ ని తీసుకొని యామిని రావడంతో అందరు షాక్ అవుతారు. మా పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చామని యామిని అంటుంది. తరువాయి భాగంలో సడెన్ గా అపర్ణ వస్తుంది. ఆవిడ గుర్తుందా నువ్వు తనతో కేక్ కట్ చేయించావ్.. ఆమె మీ ఫ్రెండ్ కళావతి వాళ్ళ అత్తయ్య అని యామిని చెప్పగానే రాజ్ షాక్ అవుతాడు. నాకు ఆ రోజు ఎందుకు చెప్పలేదని కావ్య వంక రాజ్ కోపంగా చూస్తాడు. కావ్య ఏదో చెప్పబోతుంటే.. ఇంకేం వద్దని రాజ్ అంటాడు. దాంతో కావ్య బాధపడుతుంది. రాజ్ దృష్టిలో కావ్యని ఒక చీటర్ గా క్రియేట్ చెయ్యాలనుకున్న యామిని సక్సెస్ అయింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : దీపని పొడిచింది గౌతమ్..కనిపెట్టిన కార్తీక్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -355 లో..... ఇన్‌స్పెక్టర్ దీప దగ్గరికి వచ్చి.. తనపై హత్య ప్రయత్నం ఎవరో చేసారో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. మీకు ఎవరిపై అయినా డౌట్ ఉందా అని ఇన్‌స్పెక్టర్ అడుగగా.. లేదని దీప అంటుంది. జ్యోత్స్న వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు మాకేం సంబంధం లేదనట్లు మాట్లాడుతన్నారని ఇన్‌స్పెక్టర్ అంటాడు. మిమ్మల్ని పొడిచింది ఆడా, మగ అని ఇన్‌స్పెక్టర్ అడుగగా మగ అని దీప చెప్తుంది. ఏదైనా ఇన్ఫర్మేషన్‌ కోసం మళ్ళీ వస్తామని చెప్పి ఇన్‌స్పెక్టర్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత జ్యోత్స్న వాళ్ళింటికి ఇన్‌స్పెక్టర్ ఎందుకు వెళ్ళాడని కార్తీక్ ని దీప అడుగుతుంది. నేనే జరిగిన గొడవ చెప్పి జ్యోత్స్నపై డౌట్ ఉంది అన్నాను అందుకే వెళ్లారని కార్తీక్ అంటాడు.. నిన్ను చంపాల్సిన అవసరం ఇద్దరికి ఉంది. ఒకరు గౌతమ్.. ఇంకొకరు జ్యోత్స్న.. నువ్వు ఇప్పుడు మగ అని చెప్పావ్ కాబట్టి ఖచ్చితంగా గౌతమ్ గాడే ఈ పని చేసి ఉంటాడు.. వాడిని నా స్టైల్ లో ఎంక్వయిరీ చేస్తానని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత దీపకి ఇప్పుడు ఎలా ఉందోనని సుమిత్రని దశరథ్ అడుగుతాడు. ఇప్పుడు వాళ్ళ గురించి మనకెందుకని సుమిత్ర, పారిజాతం అంటారు అప్పుడే దీపని తీసుకొని సుమిత్ర ఇంటికి వస్తాడు కార్తీక్. వాళ్లని చూసి పారిజాతం వాళ్ళు షాక్ అవుతారు. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చావని దీప అంటున్నా సరే కార్తీక్ లోపలికి తీసుకొని వస్తాడు. దీపని ఎందుకు తీసుకొని వచ్చావ్ రా అని కార్తీక్ ని అడుగుతుంది సుమిత్ర. మాట్లాడాలి అందరు రావాలి అంటూ తాత అంటూ శివన్నారాయణని పిలుస్తాడు కార్తీక్. అతను వచ్చి ఎందుకు వచ్చావ్ అంటాడు. మీకు అందరికి ఒక విషయం చెప్పాలని వచ్చానని కార్తీక్ అనగానే ఏంటి బావకి నిజం తెలిసిపోయిందా అని జ్యోత్స్న కంగారుపడుతుంది. నా భార్యని కాపాడడానికి ఒక అడుగు ముందుకి వేసావ్ అత్త అని కార్తీక్ థాంక్స్ చెప్తాడు. ఎవరు ఏం చేసినా నా మనవరాలు సాయం చేసిందని శివన్నారాయణ అంటాడు. ఇంకా తెలియాల్సినవి.. రెండు విషయాలు.. ఒకటి బుల్లెట్ ఎవరిది.. రెండు నా భార్య ని పొడిచింది ఎవరో.. అది తెలిసిన రోజు మళ్ళీ వస్తానంటు దీపని తీసుకొని కార్తీక్ బయల్దేర్తాడు. మరొకవైపు జ్యోత్స్నని తీసుకొని పారిజాతం పైకి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu : ట్రైనింగ్ కోసం కోడలు నర్మద.. మామ రామరాజు ఒప్పుకుంటాడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -156 లో......ధీరజ్ తన నెల సంపాదన ఆరు వేలు తీసుకొని వచ్చి రామరాజుకి ఇవ్వాలని ప్రయత్నం చేస్తాడు. ఈ అరువేలు మీ ఇద్దరికి సరిపోతాయా అని రామరాజు కోపంగా మాట్లాడుతాడు. ఒక అరు వేలు ఇవ్వడం ఏంటి ఏదో హాస్టల్ లో ఇచ్చినట్లు ఇంకా మావయ్య గారి ముందే తల ఎగిరేసి మాట్లాడుతున్నావ్ మరిది గారు.. మా ఆయన నెల కాగానే యాభై వేలు మావయ్యకి ఇస్తున్నాడు.. ఎప్పుడైనా అలా పొగరుగా మాట్లాడాడా అని ధీరజ్ ని బ్యాడ్ చెయ్యాలని చూస్తుంది శ్రీవల్లి. నడిపి మరిది రైస్ మిల్ చూసుకుంటున్నాడు.. పైసా ఆదాయం లేదు.. చిన్న మరిది చదువుతున్నాడు ఖర్చు తప్ప ఆదాయం లేదు.. మా ఆయన డబ్బు ఇస్తున్నాడని శ్రీవల్లి అనగానే మా ఆయనకి జీతమిస్తే మీ ఆయన కంటే ఇరవై వేయిలు ఎక్కువే అని నర్మద అంటుంది. ధీరజ్ చదువు అవగనే అందరికంటే ఎక్కువ డబ్బు తీసుకొని వచ్చి ఇస్తాడని ప్రేమ అంటుంది. దాంతో రామరాజు అందరిపై కోప్పడతాడు. ఇక వెళ్లిపోతున్న రామరాజు చేతిలో ధీరజ్ డబ్బు పెట్టి వచ్చే నెల ఎక్కువ ఇస్తానని చెప్తాడు. రామరాజు వెళ్ళిపోయాక.. ఏంటి బావ నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా అని చందుతో శ్రీవల్లి అంటుంది. అదేం లేదని చందు అంటాడు. ఆ తర్వాత ధీరజ్ దగ్గరికి వేదవతి వెళ్లి మాట్లాడుతుంది. మీ నాన్నతో అలా ఎందుకు మాట్లాడావని అడుగుతుంది. ఇంట్లో అందరు సంపాదిస్తున్నారు వాళ్ళ భార్యలకి గౌరవం ఉంటుంది. నా భార్య కి గౌరవం ఉండాలనే ఇలా చేస్తున్నాను.. ప్రేమ నా భార్య.. నా బాధ్యత అని ధీరజ్ మాట్లాడుతుంటే పక్కనే ఉన్న ప్రేమ విని మురిసిపోతుంది. ఆ తర్వాత వేదవతి దగ్గరికి నర్మద వచ్చి మాట్లాడుతుంది. అప్పుడే ప్రేమ వస్తుంది. మీ అయన గురించి ఏదో చెప్పారట అని నర్మద అనగానే.. ప్రేమ సిగ్గుపడుతుంది. తరువాయి భాగంలో నర్మద ట్రైనింగ్ సంగతి మావయ్యకి చెప్పండి అని నర్మద, ప్రేమ కలిసి వేదవతిని రిక్వెస్ట్ చేస్తారు. శ్రీవల్లి రావడంతో టాపిక్ మారుస్తారు. ఆ తర్వాత రామరాజుతో నర్మద ట్రైనింగ్ గురించి వేదవతి మాట్లాడుతుంది. మావయ్య గారు అసలు ఒప్పుకోరని శ్రీవల్లి అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam 2: దీప వారసురాలని ఎవరితో చెప్పకు.. దాసుతో కార్తీక్ ఒప్పందం!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం-2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్‌-354లో.. దీపే అసలైన వారసురాలని చెప్పేస్తానని, నేను బతికి ఉంటే ప్రమాదమని జ్యోత్స్న నన్ను చంపాలనుకుందని కార్తీక్‍తో దాసు అంటాడు. తనను తలపై కొట్టిందని చెప్తాడు. దీంతో కార్తీక్ షాక్ అవుతాడు. నేను తన కన్నతండ్రినని తెలిసి చంపాలనుకుందంటే అసలైన వారసురాలిని వదిలిపెడుతుందా అని కార్తీక్ తో దాసు చెప్తాడు. దీంతో కార్తీక్ కంగారుపడతాడు. దీపే అసలైన వారసురాలు అని జ్యోత్స్న నిశ్చితార్థం రోజు చెప్పాలనుకున్నా ఎవరు చెప్పనివ్వలేదని దాసు అంటాడు. ఆ తర్వాత ఏమైందో గుర్తులేదని చెప్తాడు.    నువ్వు చెప్పేది నమ్మలేకపోతున్నా.. దీప పెద్ద మామయ్య కూతురు ఏంటి.. జ్యోత్స్న నీ కూతురు ఏంటని కార్తీక్ ఆశ్చర్యంగా అంటాడు. ఇవన్నీ పారిజాతం అమ్మమ్మకు తెలుసు కదా అని అడుగుతాడు. లేదు.. దీపే అసలైన వారసురాలు అనే విషయం నాకు, జ్యోత్స్నకు మాత్రమే తెలుసంటాడు దాసు. దీపే అసలైన వారసురాలని తెలిస్తే మా అమ్మకు, జ్యోత్స్నకు నష్టమే, కాబట్టి వాళ్లు దీపను చంపే ప్రయత్నం చేయవచ్చు అల్లుడు అని కార్తీక్‍తో దాసు అంటాడు. లేకపోతే మా అమ్మకు తెలియకుండా జ్యోత్స్న ఒక్కటే ఈ పని చేసి ఉండొచ్చని అంచనా వేస్తాడు. ఎందుకంటే జ్యోత్స్నను మా అమ్మ అలా తయారు చేసిందని, మనుషుల ప్రాణాలు తనకు లెక్కలేదని అంటాడు. కన్నతండ్రినైన నన్నే చంపాలనుకుంది.. నా అనుమానం ఏంటంటే దశరథ్ అన్నయ్యకు బుల్లెట్ తగిలేందుకు కూడా నా కూతురే (జ్యోత్స్న) కారణం అయి ఉండాలని దాసు చెప్తాడు. దీపను చంపాలనుకున్నది నా కూతురే అయి ఉండాలని అనుమానిస్తాడు. ఇంత జరిగిన తర్వాత కూడా మామూలుగా ఉంటే ఎవరికి ఏ రూపంలో ప్రమాదం వస్తుందో తెలియదని అంటాడు.  ఎవరికి ఏమి కాకుండా ఉండాలంటే నిజం చెప్పేయాలని, తన తల్లికి, జ్యోత్స్నకు గట్టిగా బుద్ది చెప్పాలని దాసు అంటాడు. దీపే నీ అసలైన కూతురు అని దశరథ్‍కు చెప్పేస్తాను.. వెళదాం పదా అని దాసు అంటాడు.    చెప్పగానే వాళ్లు నమ్ముతారని అనుకుంటున్నావా.. ఈ మధ్యే నా మీద వారికి నమ్మకం పోయింది. నీపై ముందు నుంచి లేదు. నువ్వు చెప్పగానే జ్యోత్స్న ఒప్పుకుంటుందా. పారిజాతం అమ్మమ్మ నిజాలు చెబుతుందా అని కార్తీక్ అంటాడు. ఒప్పిస్తానని దాసు అరుస్తాడు. ఇంటి వారసురాలి విషయాన్ని ఇన్ని సంవత్సరాల తర్వాత చెప్తే నమ్ముతారా.. ఆధారాలు అడుగుతారని కార్తీక్ అంటాడు. నమ్మిస్తానని దాసు అంటాడు. ఎలా నిరూపిస్తావని కార్తీక్ అడుగుతాడు. నిజం చెప్పకపోతే కూతురని కూడా చూడనని దాసు ఆవేశంగా అంటాడు. అసలు నిన్ను గుమ్మంలోకే రానివ్వరని కార్తీక్ వారిస్తాడు. జరిగింది విన్న నాకే ఈ విషయం ఆశ్చర్యంగా ఉంది.. ఇన్నాళ్లు ఈ విషయాన్ని పారిజాతం అమ్మమ్మ మ్యానేజ్ చేసిందంటే ఎప్పుడు చెప్పినా ఎవరు నమ్ముతారని కార్తీక్ అంటాడు. మాములు గానే దీప అంటే వాళ్లకు పడదు.. అలాంటిది దీపే అసలైన వారసురాలు అంటే నీకు మతిస్థిమితం లేదని అందరు నమ్ముతున్నారు.. ఇప్పుడు నాకు కూడా మతిస్థిమితం లేదని అనుకుంటారని కార్తీక్ అంటాడు.   నిజాలు చెప్పకపోతే హత్యాయత్నాలు ఇంతటితో ఆగవని దాసు అంటాడు. ఆస్తి కోసం దశరథ్ అన్నయ్యను, సుమిత్ర వదినను, శివన్నారాయణను కూడా చంపేస్తారని జ్యోత్స్న, పారిజాతం గురించి దాసు అంటాడు. దీప విషయం వేరే వాళ్లకు తెలిసి భయపడితేనే అలా జరగుతుందని, ఈ నిజం ఇంకా బయట ఎవరికి తెలుసని కార్తీక్ అడుగుతాడు. ఇక ఎవరికి తెలియదని అంటాడు దాసు. ఈ విషయాలన్నీ ఎవరితో చెప్పకు.. మనం ఇకనుండి వాళ్ళని గమనిద్దామని దాసుతో జాగ్రత్తలు చెప్పి అక్కడి నుండి కార్తీక్ హాస్పిటల్ కి వెళ్తాడు. తరువాయి భాగంలో దీప కళ్ళు తెరిచి చూస్తుంది. ఎలా ఉన్నావని కార్తీక్ అడుగగా.. బానే ఉన్నా అన్నట్టుగా తలాడిస్తుంది దీప. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.