Brahmamudi : కావ్యని లేపెయ్యడానికి యామిని స్కెచ్.. రాహుల్ ని పట్టుకున్న స్వప్న!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -739 లో......కావ్య గదిలో రాజ్ ని చూసి వెయిటర్ షాక్ అవుతాడు. మీరేంటి ఇక్కడ అని రాజ్ ని అడుగగా రాజ్ తడబడుతుంటాడు. అంటే ఇందాక నా ఫ్రెండ్ రూమ్ లో నన్ను చూసి మళ్ళీ ఇక్కడ చూసి షాక్ అయ్యాడని రాజ్ కవర్ చేస్తాడు. మీ సంగతి ఆ మేడమ్ కి చెప్తాను అని వెయిటర్ యామిని దగ్గరికి వెళ్తాడు. మీతో ఉన్న సార్ మిమ్మల్ని మోసం చేస్తున్నాడని చెప్తాడు. అప్పుడే రాజ్ వచ్చి అదేం లేదు యామిని.. ఇందాక నా ఫ్రెండ్ రూమ్ కి వెళ్తానన్న కదా తన రూమ్ లోకి వెళ్ళబోయి ఒక అమ్మాయి రూమ్ లోకి వెళ్ళాను. అప్పుడే అతను చూసాడని రాజ్ అంటాడు. లేదు మేడం మిమ్మల్ని మోసం చేస్తున్నాడని యామినితో వెయిటర్ అనగానే.. నా బావ నన్ను మోసం చెయ్యడని యామిని అంటుంది. యామినిని తీసుకొని రాజ్ గదిలోకి వెళ్తాడు. రాజ్ కి దగ్గరగా యామిని వస్తుంది. అప్పుడే కావ్య ఫోన్ చేసి నేను వెళ్లిపోతున్నానని చెప్తుంది. వద్దు నేను వస్తున్నానంటు రాజ్ యామినికి చెప్పి అక్కడ నుండి కావ్య దగ్గరికి వెళ్తాడు. కావ్య, రాజ్ వెళ్తుంటే యామిని చూస్తుంది. నన్ను ఇంత చీట్ చేస్తావా బావ అని యామిని అనుకుంటుంది. వెంటనే యామిని రౌడీకి ఫోన్ చేసి కావ్యని లేపేయ్యమని చెప్తుంది. మరొకవైపు అప్పు కిచెన్ లో వంట చేస్తుంటే.. కళ్యాణ్ వచ్చి తన నడుం పట్టుకుంటాడు. గదిలోకి రా అని అంటుంటే.. అప్పుడే స్వప్న వస్తుంది. దాంతో అప్పు, కళ్యాణ్ ఇద్దరు సిగ్గుపడతారు. రాహుల్ వస్తాడు. వాళ్ళతో స్వప్న మాట్లాడుతుంటే తనకి తెలియకుండా స్వప్న చీరకి ఉన్న లాకర్ తాళాన్ని తీసుకొని వెళ్తాడు రాహుల్. కాసేపటికి గిల్టీ నగలని రాహుల్ లోపల పెడుతుంటే అప్పుడే స్వప్న వస్తుంది. నగలు దొంగతనం చేస్తున్నావని గొడవ చేస్తుంది. అందరికి చెప్తుంది. తరువాయి భాగం లో రాజ్, కావ్యలని ఒకటి చెయ్యాలనుకుంటున్నాం.. ఈ టైమ్ లో రాహుల్, స్వప్న గొడవ ఎందుకని ఇందిరాదేవి, అపర్ణ అనుకుంటారు. స్వప్న ని గొడవ చెయ్యకని అంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu:  గుండెల్ని పిండేసిన అన్నదమ్ముల అనుబంధం.. ఒక్కటైన ఆ ముగ్గురు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-176లో..  ధీరజ్, ప్రేమ ఇద్దరు ప్రేమగా మాట్లాడుకుంటారు. తనేమో హోమ్ ట్యూషన్స్ చెప్తామంటే ధీరజ్ వద్దంటాడు. మరోవైపు ధీరజ్ అన్న మాటల్ని పెద్డోడు తల్చుకుంటాడు. వదిన అందర్నీ బాధపెట్టొచ్చు కానీ వదినకు మాత్రం ఎవరి వల్లా బాధపడకూడదు.. ఇదెక్కడి న్యాయం అన్నయ్యా అని అడిగిన మాట గట్టిగానే గుచ్చుకుంటుంది. ఇక సాగర్‌కి కూడా చందు అన్న మాటలు గుర్తొస్తాయి. ఇక ముగ్గురు అన్నదమ్ములు ఆలోచిస్తుంటారు. ఇక వేదవతి జరిగిందంతా రామరాజుకి చెప్పడంతో తనే ముగ్గరితో మాట్లాడటానికి పిలుస్తాడు.  అమ్మ చెప్పినట్టు అందరం కలిసి  అన్నవరం వెళ్దామని రామరాజు చెప్పినా.. ఎవరు సరిగ్గా స్పందించారు. అన్నవరం అంటే ఆ స్వామివారితో పాటు.. వెంటనే గుర్తొచ్చేది మీ ముగ్గురేరా అని రామరాజు అంటాడు. వెంటనే మేం ముగ్గురం గుర్తుకురావడం ఏంటి నాన్నా అని పెద్దోడు అడుగుతాడు. మీరు బాగా చిన్నగా ఉన్నప్పుడు అన్నవరం వెళ్తే.. మీ అన్నదమ్ముల మధ్య ఎంత బలమైన బంధం ఉందో చెప్పడానికి అక్కడో సంఘటన జరిగింది. మీరెవరూ తప్పిపోకూడదని.. మీ ముగ్గుర్నీ ఒకరి చేయి ఒకర్ని పట్టుకోమని చెప్పానురా.. అక్కడ పట్టుకున్న చేతులు ఇంటికి వచ్చేవరకూ వదిలిపెట్టలేదు. నాకు ఆ క్షణమే అనిపించిందిరా.. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా.. ఎంత కష్టం వచ్చినా కూడా.. నా ముగ్గురు కొడుకులు ఒకరి చేయి ఒకరు పట్టుకుని ఉంటారే తప్ప.. ఆ చేతుల్ని విడిచిపెట్టను. వాళ్ల మధ్య దూరం పెరగదని.. నా నమ్మకాన్ని మీరిప్పటి వరకూ నిజం చేస్తూ నన్ను గెలిపిస్తూనే ఉన్నారు. అనాధనైన నేను మీ అమ్మని పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించిన తరువాత.. నన్ను అర్థం చేసుకునే భార్య ఉందని ఆనందం ఉన్నాసరే.. భుజాన్ని భరోసాగా ఇచ్చే ధైర్యం లేదే అని దిగులు ఉండేది. కానీ.. నా ముగ్గురు కొడుకుల రూపంలో ఆ ధైర్యం నాకు వచ్చేసింద్రా. నా ముగ్గురు కొడుకులు నా భుజం తట్టి భరోసా ఇవ్వడమే కాదు.. వాళ్లే నా భుజాలయ్యారు. ఎవరైనా ఎప్పుడైనా.. రామరాజూ నువ్వేం సంపాదించావయ్యా అని ఎవరైనా అడిగితే.. వజ్రాల్లాంటి ముగ్గురు కొడుకుల్ని సంపాదించాను అని గర్వంగా చెప్తానురా. అందరూ కొడుకులంటే వారసత్వం అని చెప్తారు. నేను మాత్రం నా కొడుకులే నా ధైర్యం.. నా బలం అని చెప్తానురా అంటూ రామరాజు ఎమోషనల్‌గా మాట్లాడతాడు. ఇక అలా రామరాజు ఎమోషనల్ అవ్వగానే తన ముగ్గురు కొడుకులు కూడా భావోద్వేగానికి గురవుతారు. ఇక ఒకరి జాబ్ గురించి మరొకరు అడుగుతూ మాటలు కలుపుతారు.  ఆ తర్వాత ముగ్గురు ఎమోషనల్ అయి హగ్ చేసుకుంటారు. ఇది హార్ట్ టచింగ్ అనిపిస్తుంది. వాళ్లని వేదవతి చూసి కన్నీళ్ళు పెట్టుకుంటుంది. మీరు ముగ్గురు ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండాలని వేదవతి అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ప్రపంచం మర్చిపోయినా నేను మర్చిపోను.. థాంక్యూ శివయ్య

  బుల్లితెర మీద అష్షు రెడ్డి ఒక హాట్ బాంబ్. ఆర్జీవి బ్యూటీ..జూనియర్ సమంత..పవన్ కళ్యాణ్ ఫ్యాన్..ఇలా ఆమె గురించి చాలా చెప్పుకోవచ్చు. ఐతే ఇదంతా జీవితంలో ఒక భాగం. అష్షు లైఫ్ లో మరో భాగాన్ని చూస్తే ఆమె ఒక ఫైటర్..జీవితాన్ని గెలిచిన అమ్మాయి. ఎందుకంటే ఆమెకు బ్రెయిన్ సర్జరీ జరిగింది. దాని నుంచి కోలుకుని మళ్ళీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడం అంటే చాలా కష్టమైన పని. ఒక్కసారి చావు అంచుల వరకు వెళ్లి వచ్చాక ఆ జీవితం ఎప్పటికీ అలా గుర్తు వస్తూనే ఉంటుంది. ఇప్పుడు అలాంటి తన బ్రెయిన్ సర్జరీ విషయం కూడా అంతే. రీసెంట్ గా ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది. "ప్రపంచం మర్చిపోవచ్చు..కానీ నేను ఎప్పటికీ మర్చిపోను. ఈ జూన్ 4 వస్తే నాకు బ్రెయిన్ సర్జరీ జరిగి ఏడాది పూర్తయ్యింది. థ్యాంక్యూ అనే ఒకే ఒక్క పదమే నా మైండ్ లో వస్తుంది" అంటూ థాంక్యూ శివయ్య, రిబోర్న్,  బ్రెయిన్  సర్జరీ అంటూ హ్యాష్ టాగ్స్ పెట్టింది. అలాగే ఒక ఫైటర్ అని రాసి ఉన్న ఒక చాకోలెట్ కేక్ పిక్ ని పోస్ట్ చేసింది అష్షు రెడ్డి. ఆ పోస్ట్ కి హీరో అరవింద్ కృష్ణ మెసేజ్ చేసాడు. "చాలా గర్వంగా ఉంది.  నీ కం బ్యాక్ అనేది చాల ఇన్స్పైరింగ్ గా మనసుల్ని కదిలించేదిగా ఉంది. నీకంతా మంచే జరగాలి" అని విష్ చేసాడు. ఇక అష్షు మూవీస్ విషయానికి వస్తే ఛల్ మోహన రంగా, ఏ మాష్టర్ పీస్ వంటి మూవీస్ లో నటించింది. బిగ్ బాస్ సీజన్ 3 , బిగ్ బాస్ నాన్ స్టాప్ షోస్ లో పార్టిసిపేట్ చేసింది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది అష్షు .

సోషల్ మీడియాకు బ్రేక్ ఇవ్వబోతున్న శోభా శెట్టి...కారణం అదేనా?

  శోభా శెట్టి సడెన్ గా సోషల్ మీడియాకి బై చెప్పేసి వెళ్ళిపోయింది. దానికి సంబంధించిన ఒక పోస్ట్ ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో వైరల్ గా మారింది. ఐతే ఎందుకు బ్రేక్ తీసుకోవాలి అనుకుంటుందో మాత్రం రీజన్స్ చెప్పలేదు. ఇక నెటిజన్స్ ఐతే ఆమె బ్రేక్ తీసుకోవడానికి రీజన్స్ ఏంటి అని అడుగుతున్నారు. "ఎం జరిగిందో తెలీదు కానీ చాలా స్ట్రాంగ్ గా అయ్యి తిరిగి రండి...ఏమయ్యింది అక్క. ఇదేమన్నా ప్రాంక్ మెసేజా...హ్యాపీ జర్నీ" అంటూ మెసేజెస్ చేస్తున్నారు. ఐతే ఇంతకు పర్సనల్ రీజన్స్ కారణంగా వెళ్ళిపోతోందా లేదంటే ఇంకా ఇంకేమైనా కన్నడ నుంచి బెటర్ ఆఫర్ లు వచ్చాయా లేదంటే బిగ్ స్క్రీన్ మీద ట్రై చేయడానికి బ్రేక్ తీసుకుంటోందా లేదా పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకుని పెళ్లి చేసుకుని తిరిగి వస్తుందా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. ఇండస్ట్రీలో ఉంటుంది కానీ లేటెస్ట్ అప్డేట్స్ మాత్రమే సోషల్ మీడియాలో పోస్ట్ చేయదు అంతేనా ? అంటూ కూడా నెటిజన్స్ ఆరా తీస్తున్నారు.  శోభా శెట్టికి కార్తీక దీపం సీరియల్ మంచి బ్రేక్ ఇచ్చింది. కానీ తర్వాత అలాంటి సీరియల్స్ ఇంకా ఏమీ రాలేదు. ఈమధ్య కొన్ని షోస్ లో కనిపిస్తోంది..అలాగే బిగ్ బాస్ కి వెళ్ళొచ్చింది. కానీ ఆ తర్వాత పెద్దగా ఆఫర్స్ వచ్చినట్టు ఏమీ కనిపించడం లేదు. కనడ బిగ్ బాస్ కి వెళ్లి మధ్యలోనే వెళ్ళొచ్చేసింది. కార్తీక దీపం సీరియల్ సెకండ్ హీరోతో ఎంగేజ్మెంట్ చేసుకుంది కానీ ఇంకా పెళ్లిని పెండింగ్ లో పెట్టింది. అలాగే బిగ్ బాస్ నుంచి వచ్చాక కాబోయే వాడితో కలిసి కొత్త ఇల్లు కొనుక్కుంది. మరి ఏమయ్యిందో ఇంత సడెన్ గా సోషల్ మీడియాకి బై చెప్పడం ఏంటో తెలీడం అంటూ ఫాన్స్ బాగా హర్ట్ అవుతున్నారు.    

సీరియస్ సింహం పోయి హ్యాండ్సమ్ సింహం వచ్చాడు...

  గుప్పెడంత మనసు సీరియల్ ఐపోయినా కానీ రిషి సర్ మీద ఉన్న ప్రేమ ఆడియన్స్ కి తగ్గడం లేదు. ఇంకా ఇంకా గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. రిషి సర్ అలియాస్ ముఖేష్ గౌడ సోషల్ మీడియాలో దుమ్ము లేపుతున్నాడు. తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఫుల్ జోష్ ఉన్న పిక్స్ ని వీడియోస్ ని పోస్ట్ చేస్తూ ఉన్నాడు. రీసెంట్ ఒక ఒక వీడియో పెట్టాడు. అది ఫుల్ వైరల్ అవుతోంది. ఇందులో నెటిజన్స్ కామెంట్స్ చూస్తే దిమ్మ తిరిగిపోతోంది. "నాట్ జస్ట్ ఏ వైబ్...ఇట్స్ ఏ వార్నింగ్" అంటూ ఒక కొటేషన్ ని పోస్ట్ చేసాడు. "ఏంటి ఇంత సడెన్ సర్ప్రైజ్ ఇన్నాళ్లు..హాయ్ హీరో. నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం వెయిటింగ్ బాస్. మీరు స్టార్ మా షోస్ కి ఎందుకు రావడం లేదు..మీరు రక్షా ఇద్దరూ ఒక్క షోకైనా రండి మీ ఫాన్స్ కోసం... మీ గుప్పెడంత మనసు సీరియల్ మా హృదయంలో నిలిచిపోయింది. బిగ్ స్క్రీన్ మెటీరియల్ మీరు...క్లాస్ ఐనా మాస్ ఐనా మీకు మీరే సాటి. మోహన్ లాల్ లాంటి స్వాగ్, స్టైల్ మీలో కూడా ఉన్నాయి. సీరియస్ సింహం పోయి హ్యాండ్సమ్ సింహం వచ్చాడు... మా మనసుల్ని దోచే అందం మీది." అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక గీత సంకరం, ప్రియమైన నాన్నకు వంటి మూవీస్ లో నటించాడు. ఐతే రిషి ఫాన్స్ ఐతే గుప్పెడంత మనసు సీరియల్ 2 గురించి అడుగుతూనే ఉన్నారు.  

పృద్వి - విష్ణు మధ్యకు శ్రీముఖి...మేమిద్దరి పార్టీకి వెళ్తే ఓకేనా

  కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షో మొత్తం పార్టీ థీమ్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రాబోతోంది. పార్టీ థీమ్ అనేసరికి ఎలా ఉంటుంది...ఫుల్ రంగు రంగుల కాస్ట్యూమ్స్ తో మంచి జోష్ తో వచ్చారు అంతా. శ్రీముఖి కూడా కిర్రాక్ కాస్ట్యూమ్ తో వచ్చింది. "పార్టీ ఉంటుంది పుష్ప" అంటూ చెప్పుకొచ్చింది శ్రీముఖి. తేజస్విని మడివాడ ఐతే అచ్చం పార్టీ వేర్ వేసుకుని గాగుల్స్ పెట్టుకుని వచ్చేసరికి "పార్టీ మొత్తం నీలోనే కనిపిస్తోంది" అంటూ సెటైర్ వేసింది శ్రీముఖి. "పార్టీ అమ్మాయిలు చేసుకుంటే బాగుంటుందా అబ్బాయిలు చేసుకుంటే బాగుంటుందా" అని అడిగింది. "అమ్మాయిలు లేకుండా అబ్బాయిలకు పార్టీలో ఎంట్రీనే లేదు" అని చెప్పింది తేజు. "పార్టీలో కొంత మంది అబ్బాయిలు వుంటారు గ్లాస్ పట్టుకుని యు అని వచ్చేస్తారు..అక్కడ కూర్చున్న అమ్మాయిల్లో ఎవరిని చూస్తే యు" అని చెప్పాలని ఉంది అంటూ అమరదీప్ ని అడిగింది శ్రీముఖి. "అందరికీ చెప్పాలనిపిస్తుంది వాడికి" అంటూ వెనక నుంచి నిఖిల్ ఆన్సర్ ఇచ్చాడు. తర్వాత పృద్వి దగ్గరకు వచ్చి " అక్కడ ఉన్న విష్ణుని తీసేస్తే మిగతా అమ్మాయిల్లో  నువ్వు ఏ అమ్మాయితో పార్టీ చేసుకుంటావ్" అని అడిగింది. దానికి పృద్వి వెంటనే శ్రీముఖి భుజం మీద చెయ్యేసి నీతోనే అని ఇన్డైరెక్ట్ గా చెప్పాడు. దానికి శ్రీముఖి "మేమిద్దరమే పార్టీకి వెళ్తే నీకు ఒకే నా" అంటూ విష్ణుని అడిగేసరికి ఆమె చాలా డల్ గా పెట్టింది ముఖం. ఈ మధ్య విష్ణు- పృద్వి ఆన్ స్క్రీన్ పెయిర్ గా బాగా హిట్ అయ్యారు. వీళ్ళ రిలేషన్ పెళ్లి వరకు వెళ్లే అవకాశం ఉందంటూ కూడా మిగతా వాళ్ళు షోలో మాట్లాడుకుంటూనే ఉన్నారు. మరి విష్ణు, పృద్వి రిలేషన్ ఎంత దూరం కంటిన్యూ అవుతుందో చూడాలి.  

సుధీర్ గారు ఎన్నాళ్ళు సింగల్ గా వుంటారు...

  ఫ్యామిలీ స్టార్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో సీరియల్ హీరోస్ వెర్సెస్ సీరియల్ హీరోయిన్స్ మధ్య పోటీ నిర్వహించాడు సుధీర్. ఈ షోకి బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ దీపికా ఐతే సుధీర్ ని ఒక రేంజ్ లో ఆడేసుకుంది. ఇప్పటి వరకు ఏ షోలో కూడా సుధీర్ తో అలా కామెడీ చేసిన వాళ్ళు లేరు. "మీ అందాన్ని నేను ఎంత బాగా వర్ణిస్తానో చూడండి. కాజు అంటే డ్రై ఫ్రూట్ సుధీర్ అంటే" అని చెప్పేసరికి సుధీర్ గట్టిగా అరుస్తూ ఆపేయ్ అన్నాడు. సుధీర్ తోనే కాదు రవికిరణ్ తో కూడా కామెడీ చేసింది దీపికా. "నాన్న నేనే టెక్సాస్ లో చదువుకుంటున్న మీ లిటిల్ ప్రిన్సెస్ ని" అనేసరికి రవి కిరణ్ షాకయ్యాడు. ఇక పవిత్ర వచ్చి మంచి సీరియల్ చేసానయ్యా అంటూ "చెడ్డీ చెరో సగం" అని చెప్పేసరికి అవాక్కయ్యాడు సుధీర్. తర్వాత "అబ్బని తియ్యని దెబ్బ" సాంగ్ కి దీపికా సుధీర్ తో కలిసి డాన్స్ చేసింది. అది కూడా మీద మీద పడుతూ సుధీర్ ని గిల్లుతూ గిచ్చుతూ చేసేసరికి సుధీర్ భయపడిపోయారు. "సుధీర్ గారు వేస్ట్ అండి. మీరు ఇంకా ఎన్ని సంవత్సారు సింగల్ గా ఉంటారు. ఈ ప్రపంచానికి మీరొక ఫాథర్ థెరెసాలా (father theresa ) ఉన్నారు తెలుసా మీకు." అని చెప్పేసరికి అందరూ నవ్వేశారు. చాలా రోజుల తర్వాత వాసంతి కృష్ణన్ ఈ షోలో కనిపించింది. అలాగే బిందెల మీద నిలబెట్టి సాంగ్ కి డాన్స్ వేసే టాస్క్ ఇచ్చారు. ఇక దీపికా ఐతే తన లైఫ్ లో జరిగిన ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పి కొంచెం బాధపెట్టింది. తన లైఫ్ కి తానే హీరో అని చెప్పుకొచ్చింది. తాను ఈ కెరీర్ లో సెటిల్ కావడం ఎవరికీ నచ్చలేదు. కానీ తన కెరీర్ ని తానే డెవలప్ చేసుకుంటోంది కాబట్టి తన కెరీర్ కి తానే హీరో అని చెప్పుకొచ్చింది.  

వాడు మగాడని తెలియాలిగా ముందు...

కాకమ్మ కథలు నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కి గెస్టులుగా నయని పావని, శ్వేతా నాయుడు వచ్చారు. "మమ్మల్ని గారు అనడానికి మేము ఇంకా 30s లోకి రాలేదు." అని చెప్పారు. ఇక హోస్ట్ ఐతే కొన్ని వర్డ్స్ ఇచ్చి స్టోరీ చెప్పమంది. ఐతే వాళ్ళు "6 ఇంచెస్, అబ్బాయి, నైస్ పెర్ఫ్యూమ్ స్మెల్ తో వచ్చాడు తర్వాత లేచి చూస్తే ఒక కల.." అంటూ చెప్పుకొచ్చారు. జీవితంలో ఒక డార్కెస్ట్ టైం ఏంటి అని అడిగేసరికి..."చాలామంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు...కానీ ఎవరూ ఆ టైములో నాకు సపోర్ట్ చేయలేదు. బాధగా అనిపిస్తే బాధపడు..ఆ పరిస్థితి నన్ను చాలా మార్చేసింది. నేను ఎవరినైనా హగ్ చేసుకోవడం మానేసాను. రెండేళ్ల క్రితం అమ్మకు యాక్సిడెంట్ అయ్యి రెండు కళ్ళు బాగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఆమె ఒక పెంగ్విన్ లా నడుస్తూ ఉంటుంది. డోర్ తెరవాలంటే చిన్నారి వెళ్లి డోర్ తెరవ్వా అంటుంది. నాకు చాల చాలా బాధగా ఉంటుంది." అని చెప్పింది శ్వేతా నాయుడు. "శ్వేతా సిద్దార్థ్ అయ్యి ఉంటె ఎం చేసేది" అని హోస్ట్ అడిగింది. "ఫిమేల్ గొంతులో పాడేదాన్ని" అని చెప్పింది. "పావని పవన్ అయ్యుంటే ఎం చేసేవాడు" అని అడిగింది హోస్ట్. 20 మంది అమ్మాయిల్ని ఒకేసారి పడేసేవాడిని" అని చెప్పింది. "లివ్ ఇన్ ఆర్ మ్యారేజ్" అని హోస్ట్ అడిగింది "లివ్ ఇన్ బిఫోర్ మ్యారేజ్" అని చెప్పింది శ్వేతా నాయుడు. "ఫస్ట్ లివ్ ఇన్ ఎక్స్పెరిమెంట్ తర్వాత పెళ్లి" అని చెప్పింది హోస్ట్. "ముందు వాడు మగాడు అని తెలియాలిగా అందుకే లివ్ ఇన్" అని ఆన్సర్ ఇచ్చింది శ్వేతా. నయని పావని, శ్వేతా నాయుడు ఇద్దరూ కొంత కాలం క్రితం వరకు బుల్లితెర మీద కనిపించే వాళ్ళు కానీ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఎక్కడ కనిపించడం లేదు. అలాంటి వాళ్లిద్దరూ ఎన్నో విషయాలను ఈ షోలో షేర్ చేసుకున్నారు.  

Karthika Deepam2 : నా కొడుకుని పంపించండి అంటూ నిలదీసిన శ్రీధర్.. వాళ్ళిద్దరిపై జ్యోత్స్నకి డౌట్!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'( karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -374 లో.. జ్యోత్స్న ఇంట్లో దీప ఇల్లు క్లీన్ చేస్తుంది. ఏమైనా కావాలా అని జ్యోత్స్నని దీప అడుగుతుంది.  ఏం వద్దు అంటూ జ్యోత్స్న దీప వంక అలాగే చూస్తుంది. అప్పుడే కార్తీక్ కూరగాయలు పట్టుకొని వచ్చి.. దీప ఈ రోజు ఈ వంటలు చేయు అని చెప్తుంటే.. అప్పుడే పారిజాతం వస్తుంది. నువ్వు ఇచ్చిన పనిష్మెంట్ వాళ్లకు ఎంటర్‌టైన్మెంట్ లాగా ఉందే అని జ్యోత్స్నతో పారిజాతం అంటుంది. అలా అయితే నువ్వు కూడా పని మనిషిలాగా మారమని కార్తీక్ వెటకారంగా మాట్లాడతాడు. దీప టీ పాయ్ క్లీన్ చేస్తుంది. కార్తీక్ బాబు ఈ దుమ్ము పోవట్లేదని దీప అనగానే.. ఎందుకు పోదు, ఇలా గట్టిగా తుడిస్తే ఏ దుమ్ము అయిన పోతుందని జ్యోత్స్న, పారిజాతానికి కౌంటర్ ఇచ్చేలా కార్తీక్ మాట్లాడతాడు. అప్పుడే శ్రీధర్ వస్తాడు. శ్రీధర్ వచ్చేసరికి కార్తీక్ టీ పాయ్ క్లీన్ చేస్తుంటాడు. నా కొడుకుని చివరికి పనిమనిషిని చేసారు కదా అంటూ కోపంగా అందరిని పిలుస్తాడు. సంతకం పేరుతో ఇలా చేస్తారా అని శివన్నారాయణతో శ్రీధర్ గొడవ పెట్టుకుంటాడు. నువ్వు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళమని శివన్నారాయణ అంటాడు . నా కొడుకుని నాతో పాటు పంపించే వరకు ఇక్కడే ఉంటానని నట్టింట్లో కూర్చుంటాడు శ్రీధర్. ఇప్పుడు మీరు ఇక్కడ నుండి వెళ్లకపోతే చెల్లి, పిన్నికి కాల్ చేస్తానని కార్తీక్ బెదిరిస్తాడు. దాంతో శ్రీధర్ వెళ్లిపోతానంటాడు. ఇప్పుడు వెళ్లిపోతున్నానని మీరు అనుకోకండి మళ్ళీ వస్తానంటూ శ్రీధర్ చెప్పి వెళ్లిపోతాడు. దీప వంట చెయ్ అని తనని కిచెన్ లోకి తీసుకొని వెళ్తాడు కార్తీక్. బావేంటి ఇంత హ్యాపీగా ఉన్నాడు .. అసలు వీళ్ళు ఏదో ప్లాన్ తోనే ఇక్కడికి వచ్చారని జ్యోత్స్న అనుకుంటుంది. మరొకవైపు శ్రీధర్ ఇంటికి వెళ్లేసరికి స్వప్న, కాశీ భోజనం చేస్తుంటారు. శివన్నారాయణ ఇంటికి వెళ్లిన విషయం గురించి శ్రీధర్ ని కావేరి అడుగుతుంది. మీకెలా తెలుసు అని శ్రీధర్ అనగానే అన్నయ్య ఫోన్ చేసి చెప్పాడని స్వప్న అంటుంది. నా కొడుకు ఆ ఇంట్లో అలా పని చెయ్యడానికి కారణం దీప అని శ్రీధర్ తిడతాడు. వాళ్ళు ఇంట్లో పని చెయ్యడం ఏంటని కాశీ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu : అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టిన శ్రీవల్లి.. వేదవతికి మాటిస్తారా!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'( Illu illalu pillalu).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -175 లో.....చందు ఒంటరిగా కూర్చొని శ్రీవల్లి మాటలు గుర్తుచేసుకుంటాడు. అప్పుడే సాగర్ వచ్చి.. ఏం ఆలోచిస్తున్నావు అన్నయ్య అంటాడు. నీకు ఇది వరకే చెప్పాను.. నీ భార్య నా భార్య విషయంలో కలుగజేసుకోకని చెప్పమని.. అయిన తన మాటలతో నా భార్యని బాధపెడుతుంది. ఇప్పుడు తన చెల్లి వస్తే కూడా అలాగే బాధపెట్టారట అని సాగర్ తో చందు అంటాడు. అప్పుడే దీరజ్ వస్తాడు. మొన్న ట్యూషన్ విషయంలో కూడా వదిన జోక్యం చేసుకుంది. ఏమైనా అంటే ఇంటికి పెద్ద కోడలు అంటుంది. అందరి గురించి పట్టించుకుంటున్నపుడు తన గురించి కూడా ఇంట్లో వాళ్ళు జోక్యం చేసుకుంటారు కదా అని ధీరజ్ అనగానే.. నేను అన్నది నాకే చెప్తున్నావా.. ఇన్ని రోజులు ఆ మాటలు మనసులో పెట్టుకున్నావా.. బాగా అర్ధమవుతుందిరా.. ప్రేమ, నర్మద ఒకటి అందుకే మీరిద్దరూ ఒకటి అయ్యారా అని చందు అంటాడు. అప్పుడే వేదవతి వచ్చి ఒరేయ్ ఇలా తయారయ్యారేంటి.. ఎంత బాగా కలిసి ఉండేవాళ్ళు ఇప్పుడు ఇలా అయ్యారు.. మీరు గొడవ పెట్టుకోనని మాటివ్వండి అని వేదవతి అంటుంది. అందరు సైలెంట్ గా వెళ్ళిపోతారు.ఆ తర్వాత వేదవతి దగ్గరికి రామరాజు వచ్చి‌. ఇంట్లో సిచువేషన్ ఎలా ఉందని అడుగుతాడు. అసలు బాలేదు.. ఇప్పుడు వాళ్ళ మధ్య దూరం పెరుగుతున్నట్లనిపిస్తుందని వేదవతి అంటుంది. ఇంత మంది ఉన్న దగ్గర అవి జరుగుతూనే ఉంటాయని రామరాజు అంటాడు. మరొకవైపు ధీరజ్ ను ఉహించుకుంటూ ప్రేమ ఊహల్లో తెలిపోతుంది. ప్రొద్దున నిద్రలేచి.. అసలు నా మనసు ఎందుకిలా ఉంది.. నిజంగానే ధీరజ్ ని లవ్ చేస్తున్నానా అని పేపర్ పై ఇద్దరి పేర్లు రాసి ఫ్లేమ్స్ వేస్తుంది. అందులో లవ్ అని రావడంతో ప్రేమ సిగ్గుపడుతుంది. ధీరజ్ నిద్ర లేచి ఇంత ప్రొద్దున నిద్రలేచి ఏం చేస్తున్నావ్.. ఆ పేపర్ లో ఏముందని అడుగుతాడు ఏం లేదు. ఇవి నా బుక్స్ అని ప్రేమ అంటుంది. ఏదో తేడాగా బెహేవ్ చేస్తున్నావని ధీరజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : రొమాంటిక్ గా రాజ్ దగ్గరికి వెళ్ళిన యామిని.. పాపం పట్టించుకోలేదుగా!

    స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -738 లో... యామినిని రాజ్ తీసుకొని రెసాట్ కి బయల్దేర్తాడు.ఈ రోజు కావ్యకి ఎలాగైనా నా మనసులో మాట చెప్పాలని రాజ్ అనుకుంటాడు. మరొకవైపు రాహుల్ గిల్టీ నగలు తీసుకొని స్వప్నకి తెలియకుండా రూమ్ లో పెట్టాలనుకుంటాడు. అప్పుడే స్వప్న వస్తుంది. తను నగలు చూడకుండ కవర్ చేస్తాడు. ఎలాగైనా స్వప్న దగ్గర కీస్ తీసుకొని ఈ నగలు అందులో పెట్టాలనుకుంటాడు. రాహుల్ దగ్గరికి రుద్రాణి వచ్చి.. నువ్వు ఏదైనా తప్పు చేస్తే మాత్రం ఊరుకోను.. కంపెనీకి ఓనర్ చెయ్యాలనుకుంటున్నా, ఈ టైమ్ లో ఏ తప్పు చెయ్యకని రాహుల్ కి వార్నింగ్ ఇస్తుంది. రాజ్ , యామిని గదిలోకి వెళ్తారు. అక్కడ వెయిటర్ రాజ్ కి చిరాకు తెప్పిస్తాడు. రాజ్ బెడ్ పై కూర్చొని ఉంటాడు. రాజ్ దగ్గరగా యామిని వెళ్లి తనపై చెయ్ వేస్తుంది. ఏంటి బావ నాపై రొమాంటిక్ ఫీల్ వస్తుందా అంటుంది. అదేం లేదని రాజ్ అంటాడు. పర్లేదు బావ మనం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం.. పైగా మా అమ్మనాన్న మనల్ని పంపించారని యామిని అంటుంది. అయితే నమ్మకంగా పంపించారు అలాగే ఉండాలని రాజ్ అంటాడు. అప్పుడే కావ్య రావడం కిటికీ లో నుండి చూసి మా ఫ్రెండ్ వచ్చిందంటూ యామిని దగ్గర నుండి రాజ్ వెళ్ళిపోతాడు. కావ్య రూమ్ కీస్ తీసుకొని వెళ్తుంటే రాజ్ ఎదురుపడి మీరు ఇక్కడికి వచ్చారా అంటూ తెలియనట్లు అడుగుతాడు. ఆ తర్వాత ఎక్కడ యామిని చూస్తుందోనని రాజ్ త్వరగా కావ్యని తీసుకొని గదిలోకి వెళ్తాడు  మరొకవైపు అప్పు క్యారేజ్ ప్రిపేర్ చేస్తుంది. అప్పుడే ధాన్యలక్ష్మి వచ్చి ఒక ముడు రోజులు అయినా ఇంట్లో ఉండకుండా మళ్ళీ డ్యూటీ కి వెళ్తున్నావా అని కోప్పడుతుంది. లేదు తను లీవ్ పెట్టిందని కళ్యాణ్ అంటాడు. మరి ఎందుకు క్యారేజ్ పెడుతుందని ధాన్యలక్ష్మి అడుగుతుంది. నాకు వంట రాదు కదా ప్రాక్టీస్ చేస్తున్నానని అప్పు చెప్తుంది.ఆ తర్వాత కావ్య గదిలో రాజ్ ఉండడం వెయిటర్ చూసి ఇక్కడ ఉన్నారేంటని రాజ్ అడుగుతాడు. తరువాయి భాగం లో రెసాట్ లో కావ్యని చూసి యామిని షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

 వీళ్ళు చెత్తవాళ్ళు అంటూ చీప్ గా తీసిపారేస్తారు..

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి హాస్య నటుడు ఆలీ వచ్చారు. అలాగే ఈ షో మెయిన్ థీమ్ గా జిహెచ్ఎంసి పారిశుధ్య కార్మికుల కష్టాలను చూపిస్తూ ఈ ఎపిసోడ్ ని డిజైన్ చేశారు. వర్ష వచ్చి చెత్త తీసుకెళ్ళలేదేమిటి అంటూ ఒక పారిశుద్ధ్య కార్మికురాలిని అడిగేసరికి "మా చేతిలో చెత్త బుట్ట పెట్టకుండా మేమేటి సేత్తాం " అంటూ డైలాగ్ వేసింది. ఇక నాటీ నరేష్ వచ్చి "ఆఫ్ట్రాల్ చెత్త ఎత్తుకునేవాడా" అని తిట్టేసరికి రాంప్రసాద్ పెద్ద డైలాగ్ చెప్పాడు. "ఆఫ్ట్రాల్ కాదు సర్. హైదరాబాద్ లో మొత్తం 30 జోన్లు ఉన్నాయి. మీకు జలుబు, జ్వరం వస్తే కనీసం గేట్ కూడా దాటరు. కానీ మేము  ఏ రోగం వచ్చినా కష్టపడతాం సర్." అని చెప్పాడు. తర్వాత కొంతమంది పారిశుద్ధ్య కార్మికుల్ని తీసుకొచ్చి వాళ్ళ కష్టాలను విన్నారు. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ టీమ్ మొత్తం కూడా వాళ్లకు సన్మానం చేశారు. తర్వాత ఆలీ, ఇంద్రజ మంచిగా డాన్స్ చేసుకుంటూ స్టేజి మీదకు వచ్చారు. "ఏప్రిల్ 28 కి నేను హీరో అయ్యి, ఇంద్రజ హీరోయిన్ అయ్యి 31 ఇయర్స్..మీకు ఇంకో విషయం చెప్పాలి. రష్మీ కూడా అప్పుడే వచ్చి 31 ఇయర్స్ " అని చెప్పాడు. ఇక పారిశుధ్య కార్మికులు తమ బాధల్ని చెప్పుకున్నారు. "మమ్మల్ని చెత్తవాళ్ళని చెప్పి దూరం పెట్టాలనుకుంటారు. వీళ్ళు చెత్తవాళ్ళు అంటూ చీప్ గా తీసిపారేస్తారు." అని చెప్పుకున్నారు. దానికి ఆలీ రియాక్ట్ అయ్యాడు. "ఎవరైతే ఆ మాటలు అన్నారో వాళ్ళు చెత్త. మీరు ఫీలవ్వక్కర్లేదు. మీరు ముత్యం" అన్నాడు. ఇక చలాకి చంటి పారిశుధ్య కార్మికుడి గెటప్ లో వచ్చి కాసేపు ఎంటర్టైన్ చేసాడు.  

Illu illalu pillalu : పదిలక్షల గురించి శ్రీవల్లి టెన్షన్.. నర్మద కనిపెట్టేనే!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -174 లో.....నర్మద, ప్రేమ అక్కలు ఇద్దరు కలిసి నన్ను పది లక్షలు గురించి అడుగుతున్నారని  శ్రీవల్లితో బుజ్జి చెప్తుంది. దాంతో శ్రీవల్లి కోపంగా వాళ్ళ దగ్గరికి వెళ్లి ఏంటి మా చెల్లి ని బెదిరిస్తున్నారట ఎందుకని అడుగుతుంది. పది లక్షల గురించి టెన్షన్ పడుతున్నావ్ కదా ఏంటని అడిగానని నర్మద అనగానే నా గురించి నీకెందుకని శ్రీవల్లి అంటుంది. కదా అయితే ప్రతీదాంట్లో మా విషయాల్లో నువ్వు ఎందుకు దూరుతావని శ్రీవల్లిని నర్మద అడుగుతుంది. దాంతో శ్రీవల్లి ఏం చెయ్యలేక ఏడుపు మొదలుపెడుతుంది. అప్పుడే వేదవతి వచ్చి అడుగుతుంది. శ్రీవల్లి అక్క ఏదో పది లక్షల గురించి టెన్షన్ పడుతుందని వేదవతికి నర్మద చెప్తుంది. పదిలక్షలు ఏంటని వేదవతి అనగానే.. ఏం లేదు అత్తయ్య, వాళ్ళు కావాలనే చేస్తున్నారని శ్రీవల్లి అంటుంది. శ్రీవల్లిని వేదవతి లోపలికి వెళ్ళమంటుంది. అమాయకరాలిని చేసి ఏడిపిస్తున్నారని నర్మదతో వేదవతి అంటుంది. మీ ముద్దుల కోడలిని ఏం అనలేదని నర్మద, ప్రేమ అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఆ తర్వాత చందు డబ్బు గురించి అడుగుతుంటే.. నన్ను వాళ్ళు తిట్టారంటూ శ్రీవల్లి టాపిక్ డైవర్ట్ చేస్తుంది. మరొకవైపు ప్రేమ దగ్గరికి నర్మద వస్తుంది. నువ్వు ధీరజ్ ని ప్రేమిస్తున్నావని చెప్తుంది. అదేం లేదని ప్రేమ అంటుంటే.. నువ్వు ధీరజ్ వచ్చాక తన కళ్ళలోకి చూడు అప్పుడు తెలుస్తుందని నర్మద అంటుంది. ధీరజ్ ఇంటికి వస్తాడు. అతనికి భోజనం వడ్డించగా.. థాంక్స్ ప్రేమ అని ధీరజ్ అంటాడు. అలా అనగానే తన కళ్ళలోకి చూస్తూ ప్రేమ మురిసిపోతుంది. పక్కన నుండి నర్మద చూస్తుంటుంది. తరువాయి భాగంలో వేదవతి తన ముగ్గురు కోడళ్ళని పిలిచి కలిసి మెలిసి ఉండమని చెప్తుంది ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : తనని బావ అని పిలమన్న కార్తీక్.. దీప పిలుస్తుందా!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -373 లో.....జ్యోత్స్నకి దీప హెడ్ మసాజ్ చేస్తుంది. దీప చేస్తుందనే విషయం జ్యోత్స్నకి తెలియదు.. గ్రానీ బాగా చేస్తున్నావ్ ఇన్ని రోజులు ఇలా చెయ్యలేదు ఎందుకని అని అంటుంది. అప్పుడే పారిజాతం లోపలికి వస్తుంటే గ్రానీ అక్కడ ఉంటే మరి ఇక్కడ చేసేది ఎవరని జ్యోత్స్న చూసేసరికి.. దీప ఉంటుంది. దీపని చూసి జ్యోత్స్న షాక్ అవుతుంది. నువ్వు ఏంటని జ్యోత్స్న అడుగగా.. అంటే నేను పని మనిషి కదా అన్ని పనులు చెయ్యాలని దీప అంటుంది. నువ్వు వెళ్లి ఏదైనా పని చేసుకోపో అని దీపతో పారిజాతం అంటుంది. అన్ని పనులు చేశానని దీప అంటుంది. ఇంకా ఏదైనా పనులు ఉంటే చెప్పమని దీప అంటుంది. అవసరం ఉంటే పిలుస్తానని పారిజాతం అంటుంది. దీప వెళ్ళిపోయాక.. అదేంటీ ఇలా చేంజ్ అయిందని ఇద్దరు అనుకుంటారు. దీపకి దాస్ నిజం చెప్పి ఉంటాడా అని జ్యోత్స్న అనుకుంటుంది. మరొకవైపు శ్రీధర్, కావేరి కలసి కాంచన దగ్గరికి  వెళ్తారు. అసలు వాడు ఎందుకు సంతకం పెట్టాడు.. ఆ ఇంట్లో ఎందుకు పని చేస్తున్నాడు అంటూ శ్రీధర్ గొడవ చేస్తాడు. అప్పుడే కార్తీక్, దీప వస్తారు. ఎప్పటిలాగే శ్రీధర్ పై ఇంట్లో అందరు విరుచుకుపడుతారు. కార్తీక్ కూడా నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోమని కఠినంగా మాట్లాడతాడు. దాంతో శ్రీధర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు.   ఆ తర్వాత అనసూయ, కాంచన ఇద్దరు దీపతో మాట్లాడతారు. ఎందుకు ఆ ఇంటికి వెళ్లారని దీపని కాంచన అడుగుతుంది. మనం అందరం కార్తీక్ బాబుపై నమ్మకం ఉంచుదామని దీప చెప్తుంది. ఆ తర్వాత రా మరదలు అని దీపని కార్తీక్ పిలుస్తాడు. దీప పరిచయం అయినప్పటి నుండి తన గురించి కార్తీక్ ఏం అనుకున్నాడో అన్నీ తనకి చెప్తాడు. ఇక నుండి నువ్వు నన్ను బావ అను.. నేను నిన్ను మరదలు అని పిలుస్తానని కార్తీక్ అంటాడు. ఎవరికైనా డౌట్ వస్తుందని దీప అనగానే.. భార్యాభర్తలం కదా ఏం అనుకోరని కార్తీక్ అంటాడు. అప్పుడే శౌర్యా వచ్చి బావమరదలు ఏంటని అడుగుతుంది. ఏం లేదని కార్తీక్ డైవర్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : రిసార్ట్ కి వెళ్తున్న రాజ్, యామిని.. శోభనాన్ని కావ్య ఆపుతుందా!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -737 లో... కళ్యాణ్ ని అప్పు పట్టించుకోకుండా ఫోన్ చూస్తుంటే.. కళ్యాణ్ ఫీల్ అవుతాడు. దాంతో కళ్యాణ్ ఎమోషనల్ గా మాట్లాడుతుంటే అప్పు అలుగుతుంది. తనకి బుజ్జగించి కూల్ చేస్తాడు. మరొకవైపు స్వప్న ఏడువారాల నగలని రాహుల్ తీసుకొని వచ్చి తన గర్ల్ ఫ్రెండ్ కి ఇస్తాడు. అవి చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక ఆ కంపెనీకి వారసుడిని నేనే అంటూ గొప్పలు చెప్తుంటాడు. అయితే నాకు ఒక విల్లా కావాలి.. అప్పుడే మన మధ్య ఏదైనా అని తను ఫిట్టింగ్ పెడుతుంది. ఇదేంటీ ఇది నగలు ఇస్తే నా సొంతం అవుతుందనుకుంటే ఇలా అంటుంది. దీన్ని ఎలాగైనా నా సొంతం చేసుకోవాలని రాహుల్ అనుకుంటాడు. ఆ తర్వాత రాజ్ రెసాట్ కి వెళ్తున్నాడని అపర్ణ, ఇందిరాదేవి కావ్యకి చెప్తారు. దాంతో కావ్య కూడా టెన్షన్ పడుతుంది. ఆ యామిని ఏం ప్లాన్ చేసిందో ఏమో అని అనుకుంటారు. కావ్యని కూడా రెసాట్ కి వెళ్ళమని ఇందిరాదేవి, అపర్ణ చెప్తారు. దాంతో కావ్య కూడా సరే అంటుంది. మరుసటి రోజు అప్పు చీర కట్టులో కళ్యాణ్ కి కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి కళ్యాణ్ ఫ్లాట్ అవుతాడు. దగ్గరికి తీసుకుంటాడు. ఆ తర్వాత యామిని రెసాట్ కి వెళ్ళడానికి బ్యాగ్ సర్దుతుంది. అప్పుడే వైదేహి వచ్చి మాట్లాడుతుంది. మరోవైపు రాజ్ కి ఇందిరాదేవి ఫోన్ చేసి.. నువ్వు ఎలాగు కావ్య దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేసేలా లేవు.. అందుకే కావ్యనే నీ దగ్గరికి పంపిస్తున్నానని ఇందిరాదేవి అంటుంది. దాంతో రాజ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత యామిని, రాజ్ కలిసి రెసాట్ కి స్టార్ట్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

మహేష్ బాబుతో డేటింగ్ చేయాలని ఉంది..

  ఐశ్వర్య పిస్సే బుల్లితెర ముద్దబంతి. ఈ మధ్య కాలంలో ఎన్నో షోస్ లో కనిపిస్తోంది. ఐతే ఒక చిట్ చాట్ ఎపిసోడ్ ఆమె ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చింది. అదేంటో తెలుసా.." "నేను కన్నడలో ఆర్కా మీడియా వాళ్లకు సీరియల్ చేస్తున్నాను. ఇక్కడ మాత్రం ఆర్కా మీడియాకి మంచి పేరుంది అలాగే పెద్ద ప్రొడక్షన్ హౌస్ కూడా దాంతో వాళ్ళే నన్ను తెలుగులో ఇంట్రడ్యూస్ చేశారు. నేను మొదట ఈటీవీలోనే నా పేరు మీనాక్షి సీరియల్ చేసాను. అలా వచ్చింది అవకాశం. టాలీవుడ్ ఎప్పటికైనా నా క్రష్ మహేష్ బాబు...డేటింగ్ చేసే అవకాశం వస్తే మహేష్ బాబుతోనే డేటింగ్ చేస్తాను. కాలేజ్ లో నేను చేసిన క్రేజి థింగ్ నేను ఫస్ట్ పీరియడ్ కి అసలు వెళ్లేదాన్ని కాదు..నా కోసం వెయిట్ చేస్తూ నా ఫ్రెండ్స్ కూడా కాలేజీ బంక్ కొట్టేవాళ్ళు. అలా బంక్ కొట్టి సినిమాకు వెళ్లాం. సీరియల్స్ చేస్తూ ఇక్కడి వరకు వచ్చాను కాబట్టి సీరియల్స్ అంటే చాల ఇష్టం. అప్పుడప్పుడు టీవీ షోస్ కి కూడా వెళ్తూ ఉంటాను. నా లైఫ్ లో రిటర్న్ రావాలి అని అనుకోవడం లేదు.. అన్నీ కరెక్ట్ గానే జరుగుతున్నాయి. ఫ్యూచర్ లో మంచి పాపులర్ అవ్వాలి. అందరూ నన్ను పొగడాలి...నా యాక్టింగ్ ని అందరూ ఇష్టపడాలి. మైథలాజికల్ క్యారెక్టర్ చేయడం నా డ్రీం రోల్. నన్ను తక్కువ చేసి మాట్లాడేవాళ్ళను నిలబెట్టి మాట్లాడదామనుకుంటాను కానీ ఎప్పుడూ నిలదీయను. మూవీస్ చేయాలి అంటే లక్ ఉండాలి. అక్కడ లక్ దొరుకుతుందో లేదో తెలీదు కానీ సీరియల్స్ చేయడమే నాకు కంఫర్ట్ గా ఉంటుంది.  నేను ఇక్కడ ఉండిపోతాను. తెలుగు, కన్నడ నుంచి బిగ్ ప్రాజెక్ట్స్ వస్తే తెలుగులో ఎక్కువ ప్రాజెక్ట్స్ చేస్తున్నా కాబట్టి తెలుగునే ఎంచుకుంటాను. నేను మేకప్ చేసుకునేటప్పుడు కానీ ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా అదే పనిగా చూస్తే మాత్రం వాళ్ళు ఎవరు అని కూడా చూడకుండా తిట్టేస్తాను. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో మాకు ఏమీ తెలిసేది కాదు. మేము ఎం చేయకపోయినా పెద్ద ఆర్టిస్టులను తిట్టలేక మమ్మల్ని తిట్టేవాళ్ళు ..ఆ విషయం చాల ఇబ్బందిగా అనిపించేది." అంటూ చెప్పుకొచ్చింది.

ఈ వయసులో కిస్సులు, హగ్గులు ఏంటి రష్మీ...

  జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో రామ్ ప్రసాద్ కిస్సులు, హగ్గులు అంటూ సరదాగా నవ్వించాడు. రాంప్రసాద్, దొరబాబు, శాంతిస్వరూప్ కలిసి ఒక స్కిట్ వేశారు. రాంప్రసాద్ కుర్చీలో ఊగుతూ దొరబాబుతో వార్తలు చదివించుకుంటూ ఉంటాడు. అందులో హెడ్ లైన్ గా "కిస్సులకు, హగ్గులకు ఒకే అన్న రష్మీ" అని చదువుతాడు. ఎవరైనా ఆ మాట వింటే సీరియస్ అవుతారు. కానీ రష్మీ మాత్రం సింపుల్ గా నవ్వుతూ "ఇది ఎప్పుడో అన్నాను నేను" అనేసరికి రాంప్రసాద్, దొరబాబు షాకై చూస్తూ ఉంటారు. "నీకు అభ్యంతరం లేకపోతే చూడడానికి మాకు ఉండాలి కదా అభ్యంతరం..ఈ వయసులో కిస్సులు, హగ్గులు బాగోవు కదా" అన్నాడు రాంప్రసాద్..ఆ మాటకు రష్మీ షాకయ్యింది. ఆ తర్వాత బులెట్ భాస్కర్ స్కిట్ లో భాస్కర్ కూడా రష్మీ మీద సెటైర్స్ వేసాడు. స్కిట్ లో భాగంగా వర్ష భాస్కర్ ని పెళ్లి చేసుకోవాలి అంటే భాస్కర్ వెనక పెద్ద ఫామిలీ ఉండాలి అని చెప్తుంది. వెంటనే భాస్కర్ రష్మీకి ఫోన్ చేసాడు. "హలో రష్మీ గారు. చాలా రోజుల నుంచి క్యారెక్టర్ అడుగుతున్నారు. నాకు అమ్మ క్యారక్టర్ లో చేయాలి చేస్తారా" అని అడిగాడు. వెంటనే రష్మీ "చెప్పు తీసుకుని కొడతా" అంది. ఇలా రాబోయే వారం జబర్దస్త్ లో స్కిట్స్ రష్మీ బేస్డ్ గా రష్మీని సెంట్రాఫ్ అట్రాక్షన్ గా చూపిస్తూ చేశారు. రీసెంట్ గా రష్మీ కొన్ని హెల్త్ ఇష్యూస్ ని ఎదుర్కొంది. అలాగే పుట్టినరోజుకు వేరే ప్లేస్ కి వీల్ చైర్ లోనే వెళ్లి సెలెబ్రేట్ చేసుకుని మరీ తిరిగొచ్చింది. ఇక ఆమెతో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వెళ్లి మంచిగా ఎంజాయ్ చేశారు. ఆ పిక్స్ ని, వీడియోస్ ని రష్మీ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేసింది.  

బిగ్ బాస్ టైటిల్ విన్నర్ విషయంలో జరిగేది ఇదే ..

బ్రహ్మముడి మానస్ బుల్లితెర మీద దూసుకుపోతున్న నటుడు. బ్రహ్మముడి సీరియల్ ద్వారా మంచి గ్రాఫ్ పెంచుకుని తెలుగు ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. అలాగే కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ షోలో చేస్తున్నాడు. డాన్స్ ఐకాన్ లో కూడా చేసాడు మానస్. అలాంటి మానస్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ విషయంలో ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చాడు. "బిగ్ బాస్ లో ముందుగానే విన్నర్ ఫిక్స్ అయ్యి ఉంటాడు అంటారు అది నిజమేనా" అని హోస్ట్ అడిగింది. "మా సీజన్ లో సన్నీ విన్నర్ అయ్యాడు..తర్వాత కౌశల్, రాహుల్ సిప్లిగంజ్ విన్నర్స్ అయ్యారు. ఎవరూ విన్నర్స్ విషయంలో ముందుగా ఊహించలేకపోయాం. బిగ్ బాస్ విన్నర్ ఫిక్స్ అనే మాట ఫేక్. ఆడియన్స్ మైండ్ ని డీవియేట్ చేయడానికి వాళ్లకు విన్నర్ ఎవరు అని మాట్లాడుకోవడానికి స్కోప్ ఇవ్వడం అన్నమాట. ఇక్కడ ఫిక్స్డ్ అనేది ఉండదు. అలాగే ఇక్కడ స్క్రిప్ట్ అనేదే ఉండదు. గతంలో కూడా చాలా మంది బిగ్ బాస్ స్క్రిప్టెడ్ కాదు అని చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ ఇటీవలి కాలంలో చాలా నెగటివిటీని మూట గట్టుకుంది. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా మొదలైన బిగ్ బాస్ మొదటి రెండు సీజన్ లకు ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యారు. కానీ ఆ తర్వాత వచ్చిన సీజన్స్ మాత్రం ఆడియన్స్ ని పెద్దగా అలరించలేకపోయాయి.  ఐతే బిగ్ బాస్ ని ఇంకా సరికొత్తగా మార్చి ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నారు.

నా జీవితం మొత్తం విష్ణు మాత్రమే ఉంటుంది

కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ ఈ వారం ఫ్రెండ్ షిప్ థీమ్ తో ఫుల్ జోష్ తో ఎంటర్టైన్ చేసింది. ఈ షోలో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి రకరకాల గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. ఇక విష్ణుప్రియా బెస్ట్ ఫ్రెండ్ రీతూ చౌదరి వచ్చింది. ఐతే "మీ ఫ్రెండ్ షిప్ లో బెస్ట్ మూమెంట్ ఏది అంటే ఎం చెప్తారు" అని శ్రీముఖి అడిగింది. "నాకు రీతూతో ఉండే ప్రతీ క్షణం చాలా బెస్ట్. మేమిద్దరం కంటి సైగతోనే నవ్వుకుంటాం. నాకు రీతూతో చాల ఎఫెక్షన్ ఉంది. నా కోసం రీతూ కూడా ఏమైనా చేస్తుంది." అని చెప్పింది విష్ణు ప్రియా. "మర్చిపోలేని సిట్యువేషన్ అని ఏదైనా ఉందా" అంటూ శ్రీముఖి రీతుని అడిగింది. "2023 జనవరి ఒకటో రెండో తెలీదు మేమిద్దరం ఒక ట్రిప్ కి వెళ్లాం..ఫ్లయిట్ టేకాఫ్ అవుతున్నప్పుడు మనం ట్రిప్ నుంచి వచ్చేసరికి మా అమ్మ బతికి ఉంటే చాలు అని ఒక మాట అంది. నాకేం అర్ధం కాలేదు. నేను పెద్దగా పట్టించుకోలేదు. మేము ట్రిప్ కి వెళ్లాం. బాగా ఎంజాయ్ చేసి తిరిగి వచ్చేసాం. తర్వాత జనవరి 22 న మా డాడీ చనిపోయారు. ఆ టైములో ఎం చేయాలో తెలీక విష్ణుకి కాల్ చేసాను. అప్పుడు విష్ణు ఒక ఈవెంట్ లో ఉంది. తన అసిస్టెంట్ ఫోన్ తీసాడు. కానీ విష్ణు మాత్రం మాట్లాడలేదు. నాకు కోపం వచ్చింది. రెండో రోజు నాన్న కార్యక్రమాలు ఐపోయాయి. నాకు మా అమ్మ, నాన్న, అన్న, విష్ణు ఉంటే చాలు అనిపించేది. అప్పుడు విష్ణు దగ్గర నుంచి  కాల్ వస్తే మా ఫ్రెండ్ నాకు ఫోన్ ఇచ్చి మాట్లాడమని చెప్పింది. మాట్లాడు వాళ్ళ అమ్మగారు చనిపోయారంట అని చెప్పింది. నాకు ఒక్క నిమిషం ఎం అర్ధం కాలేదు. బాధల్లో కూడా ఇలా కలిశామా అనిపించింది. నా లైఫ్ మా నాన్నను ఎవరైనా రీప్లేస్ చేయగలరు అంటే అది ఒక్క విష్ణు మాత్రమే. గోవా, తిరుపతి, అరుణాచలం, బ్యాంకాక్, పారిస్ అన్ని చోట్ల మొదటిసారిగా నన్ను తీసుకెళ్లింది విష్ణు మాత్రమే. నా జీవితం మొత్తం విష్ణు మాత్రమే ఉంటుంది." అని చెప్పింది రీతూ.