Illu illalu pillalu : ధీరజ్ పై కోప్పడిన రామరాజు.. జీతం డబ్బుల కోసం రచ్చ!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-155 లో... చందు ఆఫీస్ నుండి ఇంటికి రాగానే అబ్బా వచ్చారా.. ఉదయం నుండి బోర్ కొడుతుందని శ్రీవల్లి అనగానే.. ఎందుకు ఇంట్లో అందరు ఉన్నారుగా అని చందు అంటాడు. ఉంటే మీరు లేరు కదా అని శ్రీవల్లి అంటుంది. చందు తన జీతం డబ్బు శ్రీవల్లికి ఇచ్చి.. ఇది రేపు నాన్నకి ఇవ్వాలని అంటాడు. అంత డబ్బు శ్రీవల్లి చూసి షాక్ అవుతుంది. ఇంత డబ్బు మా ఆయన ఇంట్లో వాళ్ళకి ఇస్తే ఎలా అందరు మా అయన సంపాదనతో బ్రతుకుతున్నారన్నమాట అని శ్రీవల్లి అనుకుంటుంది.   మరోవైపు నర్మద అన్న మాటలకి సాగర్ బాధపడతాడు. సాగర్ దగ్గరికి ధీరజ్ వచ్చి ఏంట్రా ఇలా ఉన్నావని అడుగుతాడు. జరిగింది చెప్పి సాగర్ బాధపడతాడు. నాన్న మిల్ లో వర్క్ ఉందని అలా చేసాడు అంతే కానీ నీ భార్యతో బయటకు వెళ్లొద్దని కాదని ధీరజ్ చెప్తాడు.    మరుసటిరోజు రామరాజుకి వేదవతి టీ ఇస్తుంది. ముగ్గురు కోడళ్ళు చాలా బాగా కలిసిపోయారంటూ మురిసిపోతు రామరాజుకి చెప్తుంది. ధీరజ్ తన నెల శాలరీ రామరాజుకి ఇవ్వాలనుకుంటాడు. మరొకవైపు చందు తన శాలరీ రామరాజుకి ఇవ్వడానికి వస్తాడు. నాకు హైదరాబాద్ లో ట్రైనింగ్ ఉందని మీ నాన్న గారికి చెప్పమని సాగర్ తో నర్మద అంటుంది. సాగర్ రామరాజుకి చెప్పడానికి వస్తాడు. అప్పుడే చందు శాలరీ ఇస్తాడు.    ఆ తర్వాత ధీరజ్ డబ్బు ఇస్తుంటే నువ్వు ఎందుకు ఇస్తున్నావని వేదవతి అంటుంది. అంటే నాకూ నా భార్య కి ఇంట్లో ఉండడానికి చోటు ఇంకా భోజనం పెడుతున్నారు కదా అని ధీరజ్ అంటాడు‌. దాంతో రామరాజుకి కోపం వస్తుంది.   ఇద్దరు మనుషుల తిండికి ఒక ఆరు వేలు సరిపోతాయా అని వేదవతిని రామరాజు అడుగుతాడు. వేదవతి చెప్పకపోవడంతో శ్రీవల్లిని రామరాజు అడుగుతాడు. ఎనిమిది నుండి పది వేలు అవుతాయని చెప్తుంది. మరి నువ్వు ఏ లెక్కన ఇస్తున్నావ్.. ఉద్యోగం చేస్తున్నానని పొగరు కదా అని ధీరజ్ పై కోప్పడతాడు రామరాజు.    తరువాయి భాగంలో ఇంట్లో అందరికంటే నా భర్త ఎక్కువ సంపాదిస్తున్నాడని శ్రీవల్లి అంటుంది. మా ఆయనకు జీతం ఇస్తే మీ ఆయన కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడని నర్మద అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : నా వల్లే ఆయనకి అలా జరిగింది.. బాధపడుతూ వెళ్ళిన కావ్య!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-718 లో... రాజ్ తో కావ్య గురించి నెగెటివ్ గా చెప్తుంది యామిని. నువ్వు ఇలా హాస్పిటల్ లో ఉంటే కనీసం నువ్వు ఫ్రెండ్ అనుకుంటున్న ఆ కళావతి అసలు రాలేదని యామిని అనగానే.. కళావతి గారు అలా చెయ్యరని రాజ్ అంటాడు. ఆ మాటలన్నీ బయట నుండి కావ్య, అప్పు, కళ్యాణ్ వింటారు. తప్పంతా నాదే, ఆయనకి ఎదరుపడి గతం గుర్తువచ్చేలా చేసానని బాధపడుతూ కావ్య అక్కడ నుండి వెళ్లిపోతుంది.   మరొకవైపు ఏంటి కావ్య వాళ్ళు ఇంకా రాలేదని ఇందిరాదేవి వాళ్ళు అనుకుంటారు. అప్పుడే కావ్య, అప్పు, కళ్యాణ్ ఎంట్రీ ఇస్తారు. ఇప్పటి వరకు ఎక్కడకి వెళ్లి వస్తున్నావని కావ్యని అడుగుతుంది రుద్రాణి. దుగ్గిరాల కుటుంబం పరువు తీస్తున్నావ్ రిసార్ట్ లో ఎవరితోనో తిరిగి వస్తున్నావ్.. అచ్చం రాజ్ లా ఉన్న రామ్ అనే అబ్బాయితో తిరుగుతుందని రుద్రాణి అనగానే.. నా కోడలు గురించి తప్పు గా మాట్లాడితే అసలు ఊరుకోనని రుద్రాణిపై కోప్పడుతుంది అపర్ణ. రాజ్ లా ఉన్న అబ్బాయి రామ్ కాదు ఇద్దరు ఒకటే అదే రాజ్ ఈ విషయం మాకు తెలుసు.. మేమే దగ్గర ఉండి పంపించామని అపర్ణ చెప్పగానే రాహుల్, రుద్రాణి షాక్ అవుతారు. అంటే మీకందరికి తెలిసినా కూడ ఈ విషయం మాకెందుకు చెప్పలేదని రుద్రాణి అంటుంది. ఇలాగే మాట్లాడతావని చెప్పలేదని ఇందిరాదేవి, అపర్ణ అంటుంది.    అక్కడ రాజ్ హాస్పిటల్ లో ఉన్నాడని రుద్రాణి చెప్తుంది. ఏమైందని కావ్యని అడుగుతుంది అపర్ణ. అన్నయ్య గతం గుర్తుచేసుకునే క్రమంలో స్పృహ తప్పి పడిపోయాడు. ఇప్పుడు బానే ఉన్నాడని కళ్యాణ్ చెప్తాడు. అసలు నేను ఇలా చేయకుండా ఉండాల్సిందని కావ్య బాధపడుతూ లోపలికి వెళ్తుంది.    ఆ తర్వాత కావ్యకి రాజ్ ఫోన్ చేస్తాడు కానీ కావ్య లిఫ్ట్ చేయదు. అప్పుడే యామిని వచ్చి రాజ్ తో కావ్య గురించి నెగెటివ్ గా మాట్లాడుతుంది. ఆ తర్వాత బావ దారిలోనే వెళ్లి బావని నా వైపు తిప్పుకుంటానని యామిని తన పేరెంట్స్ కి చెప్తుంది. ఆ తర్వాత కావ్యకి రాజ్ ఫోన్ చేస్తాడు లిఫ్ట్ చెయ్యదు. అపర్ణ, అప్పు, కళ్యాణ్ కలిసి కావ్య దగ్గరికి వచ్చి.. రాజ్ ఫోన్ చేస్తున్నాడు లిఫ్ట్ చెయ్ అంటారు.    తరువాయి భాగంలో కావ్య దగ్గరికి రాజ్ వస్తాడు. నేను ఎందుకు మీతో మాట్లాడాలని కావ్య అనగానే రాజ్ బాధపడుతూ వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ఊరుకుంటున్నాను కదా అని ప్రతీసారి నా మీద డైలాగులు వేయకు చిరాగ్గా ఉంది...

  కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ షో ఈ శనివారం ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. అందులో ఫెస్టివల్ థీమ్ కావడంతో అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరూ కలిసి మంచి మంచి కలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో స్టేజి మీద మెరిశారు. అలాగే గేమ్స్ ని కూడా ఇరగదీసి ఆడారు. ఐతే ఈ షోలో రౌడీ రోహిణి ఇమ్మానుయేల్ మీద ఫుల్ ఫైర్ అయ్యింది. శ్రీముఖి రోహిణిని ఒక ప్రశ్న వేసింది "నువ్వు దీపావళి ఎలా సెలెబ్రేట్ చేసుకుంటావు" అని అడిగింది. "అందరూ చేసేవే చేస్తా. ఒక బాక్స్ లో బాంబులు తెచ్చుకుంటా..ఒక్కోటి వెలిగించి దొబ్బుతా" అంది రోహిణి. దానికి ఇమ్మానుయేల్ కౌంటర్ ఇచ్చాడు. "ఒక బాక్స్ లో బాంబులు తెచ్చుకుంటుంది..ఇంకో బాక్స్ లో ఫుడ్ తెచ్చుకుంటుంది. అది తింటా ఇవి కాలుస్తా ఉంటది..నేను వాళ్ళ ఇంటికి ప్రతీ దీపావళికి వెళ్తాను, కానీ నాకేమీ పెట్టదు. " అంటూ రోహిణి పరువు తీసేసాడు. "కాదు కాదు రోహిణి పేల్చిన బాంబు వల్ల ఇలా అయ్యాడు" అని ఇమ్ము పరువు తీసేసాడు అమరదీప్. "ఈ ఎపిసోడ్ లో నా మీద డైలాగులు వేయడం ఇది మూడో సారో, నాలుగో సారో...అన్నీ ఓకే..కానీ ప్రతీ సారీ వేయకు నాకు చాలా చిరాగ్గా ఉంది. నేను కూడా కొన్ని కొన్ని సార్లు యాక్సెప్ట్ చేస్తా కానీ ఎక్కువగా కంటిన్యుయస్ గా అలాగే జోకులేయకు" అని ఇమ్ము మీద ఫైర్ అయ్యింది రోహిణి. వెంటనే డెబ్జానీ కూడా "నన్ను కూడా లడ్డూలా ఉన్నావు" అన్నాడు ఇమ్ము అంటూ కంప్లైంట్ చేసింది. "ఇప్పుడేదో ఫన్ చేసి తర్వాతేదో నవ్వేయడంలా కాకుండా నేను నిజంగా చెప్తున్నా అన్ని సార్లు రిపీట్ చేయకుండా ఎప్పుడో ఒకసారి అంటే ఆ జోక్ తీసుకుంటా" అంది రోహిణి. దానికి ఇమ్మానుయేల్ "ఎప్పుడూ అనడం లేదు. అరగంటకుసారే అంటున్నా" అన్నాడు. అలా ఇద్దరి మధ్యా ఒక చిన్న ఫైట్ జరిగింది.

అందానికి ఆధార్ కార్డు ఆమె...ఆమెలో ఉన్నది బ్యూటీ వైరస్ ...

అందానికి ఆధార్ కార్డు ఆమె...ఆమెలో ఉన్నది బ్యూటీ వైరస్ ...డాన్స్ ఐకాన్ సీజన్ 2 మెగా గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఫుల్ కలర్ ఫుల్ గా ఉంది. ఇక ఈ షోకి శివగామి రమ్యకృష్ణ వచ్చింది. రమ్యకృష్ణ గురించి చెప్పాలంటే బోలెడంత ఉంటుంది. ఆమె స్టైల్ , ఆమె స్వాగ్ అదిరిపోతోంది. ఇక ఈ షోకి స్పెషల్ గెస్ట్ గా వచ్చింది. రావడమే ఓంకార్ అటు కంటెస్టెంట్స్ ని ఇటు జడ్జెస్ ని, మరో వైపు మెంటార్స్ ని పరిచయం చేశారు. రమ్యకృష్ణ  వాళ్లందరికీ హాయ్ చెప్పింది. ఇక దీపికా మీద ఆమె చూపు పడిందో లేదో దీపికా డైలాగుల వర్షం కురిపించింది. "నేను ఎయిర్ ని రిప్రెజెంట్ చేస్తున్న మెంటార్ ని. అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడితే అది లార్డ్ కృష్ణ..అదే అమ్మాయిలు , అబ్బాయిలు కలిసి ఇష్టపడుతున్నారంటే అది రమ్య కృష్ణ." అంటూ ఆమె గురించి చెప్పేసరికి రమ్య కృష్ణ కూడా షాకయ్యింది. స్టేజి మీద ఉన్న వాళ్లంతా కూడా నవ్వేశారు. అంతటితో ఆగలేదు దీపికా. "మీ బాడీలో వైరస్ ఉంది మేడం" అని మళ్ళీ షాకింగ్ డైలాగ్ వేసేసరికి రమ్య కృష్ణ భయపడుతూనే ఏ వైరస్ అని అడిగింది. "బ్యూటీ వైరస్" అనేసింది దీపికా. ఆ ఆన్సర్ కి రమ్య కృష్ణ నవ్వుకోలేక పోయింది. "ఎన్ని సంవత్సరాలైనా ఆ స్టైల్ ఆ అందం అమ్మో..అందం ఆధార్ కార్డు తీసుకుని మీ ఇంట్లోనే ఉండిపోయింది..అందుకే మాకు అందం దొరకలేదు  " అని ఆపకుండా చెప్తున్నా డైలాగ్స్ కి రమ్య కృష్ణ కూడా బాబోయ్ నువ్వు ఎయిర్ కాదు తల్లి నువ్వే ఫైర్ అనేసింది. ఆమె డైలాగ్స్ కి రమ్యకృష్ణ కూడా "థాంక్యూ నేను  నీ మాటలకు చాలా ఇంప్రెస్ ఐపోయాను" అనేసరికి "నేను మీ అందానికి బాగా ఇంప్రెస్ ఐపోయాను మేడం" అంది దీపికా. ":నేను కూడా నీ అందానికి ఇంప్రెస్ ఐపోయాను" అని రమ్యకృష్ణ కూడా ఆమెకు కాంప్లిమెంట్ ఇచ్చేసింది.

రోజమ్మ మా అమ్మ కంటే ఎక్కువ...నా ప్రాణం నిలిపారు

  సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ షో ఫైనల్స్ కి వచ్చేసింది. ఈ ఆదివారం గ్రాండ్ ఫినాలే జరగబోతోంది. ఈ షోకి మంచు లక్ష్మి, నటి రోజా వచ్చారు. ఈ షోకి డిటెక్టీవ్ గెటప్ లో పంచ్ ప్రసాద్ వచ్చాడు. రవి అతన్ని చూసి "అసలు నువ్వొచ్చిన పనేంటి" అని అడిగాడు. "నేను డిటెక్టీవ్ ని" అన్నాడు. "ఐతే ఆమె షూస్ , అతని సాక్స్ పోయాయట..అవి కనుక్కో ఫస్ట్" అన్నాడు ప్రసాద్.."సరే ఏదో ఒకటి చెయ్యి ఫస్ట్" అన్నాడు రవి.. "కుడి చెయ్యా ఎడమ చెయ్యా" అని ప్రసాద్ అనేసరికి "ఛి నేనెళ్ళి కూర్చుంటా" అని అష్షు వెళ్ళిపోయింది. ప్రసాద్ తన భార్య ఫోటో చూపించేసరికి రోజా " ఫస్టా, సెకండా, థర్డ్ ఆ" అని అడిగింది. తర్వాత రవి "ఇంతకు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఎవరితో మాట్లాడ్డానికి" అని అడిగాడు. వెంటనే ప్రసాద్ ఒక రోజా పిక్చర్ తీసి చూపించేసరికి రోజా నవ్వేసింది. "ఈరోజు ఇంత హ్యాపీ లైఫ్ ని భార్యా పిల్లలతో  లీడ్ చేస్తున్నాను అంటే మేడం మీరు పెట్టిన బిక్షే మేడం. నిజం చెప్తున్నా మేడం నాకు మా అమ్మ ప్రాణం పోస్తే నా భార్య పునర్జన్మ ఇస్తే రోజమ్మ మా అమ్మ కంటే ఎక్కువ" అంటూ కాళ్ళ మీద పడ్డాడు ప్రసాద్. ఇక ఈ గ్రాండ్ ఫినాలేలో అమ్మాయిగారు - పడమటి సంధ్యారాగం వెర్సెస్  చామంతి- జానకి రామయ్య గారి మనవరాలు సీరియల్ టీమ్స్ మధ్యన ఈ పోటీ జరిగింది. ఇక రోజా ఫస్ట్ ఎపిసోడ్ లో చేసిన ఉప్మా ఛాలెంజ్ లో ఉప్మాన్ని అస్సలు మర్చిపోలేదంటూ చెప్పాడు రవి. "నేను చేసిన ఉప్మా తిన్న వాళ్ళు గెలిచారు చూసారుగా" అంది రోజా. దానికి ప్రభాకర్ కౌంటర్ వేసాడు. "అది ఉప్మా కాదురా...అది బోండాలా ఉన్న ఉప్మా" అన్నాడు. ఇక మంచు లక్ష్మి అమ్మాయిగారు - పడమటి సంధ్య రాగం టీమ్స్ ని లీడ్ చేసింది. రోజా చామంతి- జానకి రామయ్య గారి మనవరాలు టీమ్స్ ని లేదా చేశారు.

నా హైట్ చూసి పారిపోయాడు...నా బాయ్ ఫ్రెండ్ కి డ్రైవింగ్ రాదు

  ఫారియా అబ్దుల్లా జాతి రత్నాలు మూవీతో తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యింది. ఆమె హైట్ చూస్తే వామ్మో అనిపిస్తుంది ఎవరికైనా. అలాంటి ఫారియా రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పింది. "రోడ్డు మీద ఏదో జరిగిందని విన్నాను...ఎవరికో వార్నింగ్ ఇచ్చారట. ఎవరో మిమ్మల్ని ఫాలో చేస్తూ వస్తుంటే మీరే కార్ తీసుకొచ్చి బయటకి వచ్చి వార్నింగ్ ఇచ్చారట నిజమా ?" అని సుమ అడిగేసరికి "ఫారియా కూడా నిజమే. నేను ఎప్పుడూ రెడీగా ఉంటారు ఫైట్ చేయడానికి. నేను చాల పీస్ ఫుల్ పర్సన్ ని. అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు కొత్తగా అనిపిస్తుంది. మంచి ఫైట్ చేయాలన్న కోరికగా ఉంది. అప్పట్లో మేము యాప్రాల్ లో ఉన్నాం. సైనిక్ పురి, యాప్రాల్ కొంచెం ఎడారి ప్రాంతాల్లా ఉండేవి. నేను కార్ లో వెళ్తుంటే వెనక బైక్ మీద ఒక పర్సన్ ఫాలో అవుతున్నాడు. నేను కార్ స్లో చేస్తుంటే అతను బైక్ స్లో చేస్తున్నాడు. నాకు మస్త్ కోపం వచ్చింది. కార్ పక్కకు ఆపి రా ఇటు రా అని అతన్ని పిలిచాను. అతను పారిపోయాడు..సాధారణంగా జనాలు నా హైట్ చూసి పారిపోతారు...దగ్గరకు రారు " అని చెప్పింది. దానికి సుమ నవ్వుతూ "నిజమే . కార్ లో కూర్చున్నంత సేపు ఎవరో పొట్టి పిల్ల అనుకుని ఉంటాడు. కార్ లోంచి బయటకు దిగేసరికి వామ్మో ఇంత పొడుగుందేమిట్రా బాబు అని పారిపోయి ఉంటాడు" అంది సుమ. "నా దృష్టిలో నా హజ్బెండ్ ఎలా ఉండాలి అంటే రోజూ ఫన్ ఉండాలి. నా పిల్లలు అతని కంపెనీని ఎంజాయ్ చేయాలి. బెస్ట్ ఫ్రెండ్ లా ఉండాలి. హోమ్ స్కూలింగ్ టైంలో ఇద్దరం కలిసి పిల్లలకు పాఠాలు చెప్పుకోవాలి. పిల్లల కోసమే కదా పెళ్లి చేసేది. ఇవన్నీ చేయనప్పుడు పెళ్లి లేకుండానే ఛిల్ల్ అవ్వొచ్చు కదా" అంది ఫారియా. బాయ్ ఫ్రెండ్ పేరులో ఫస్ట్ లెటర్ చెప్పమని సుమా అడిగినా ఫారియా చెప్పలేదు. ఐతే తనకు అతనంటే ఇస్తామని.. ఇంచుమించు తన హైట్ ఉంటాడని...మన మండి బిర్యాని అంటే ఇష్టం..లాంగ్ డ్రైవింగ్ ఇష్టం కానీ అతనికి డ్రైవింగ్ రాదు..తనకంటే ఎక్కువగా తెలుగు సినిమాలు ఇష్టమని కానీ తెలుగు డబ్డ్ హిందీ మూవీస్ చూస్తారని చెప్పింది ఫారియా.  

Illu illalu pillalu : మీ నాన్న చెప్తేనే నన్న ముట్టుకుంటావా.. సాగర్ ని తిట్టేసిన నర్మద!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -154 లో.....శ్రీవల్లి ప్రతీ విషయంలో తలదూరుస్తుంది. మావయ్య గారు తన కొడుకుని ఏమైనా అనుకుంటారు. ఆవిడకేంటి నవ్వుతుందని ప్రేమతో చెప్తుంది నర్మద. ఇంటికి పెద్దకోడలు కదా అందుకే నెత్తిన పెట్టుకుంటున్నారని నర్మద అంటుంది. ఏంటి తోటికోడళ్ళు ఇద్దరు గుసగుసలాడుకుంటున్నారని వేదవతి అంటుంది. మీ కంటికి మేమ్ ఎలా కనిపిస్తాం లేండి.. మీకు పెద్ద కోడలు ఉంటే చాలు.. చేతిలో ఉన్న బజ్జీలు తీసుకొని వెళ్లినా కూడా మీ పెద్దకోడలు బంగారమని నర్మద అంటుంది. తను నా ఆరోగ్యం కోసమే కదా అలా తీసుకుందని వేదవతి అంటుంది. గంట సేపు లైన్ లో ఉండి తీసుకొని వచ్చింది పోయింది కానీ అలా తీసుకుంటే మీ కోసం అంటున్నారా అని నర్మద అనగానే.. నీ తెలివితేటలకి ఒక దండం.. నీ గవర్నమెంట్ తెలివి నాకు తెలుసని వేదవతి అంటుంది. ఎదుటి వారి విషయంలో వేలు పెట్టకని చెప్పండి మీ పెద్దకోడలికి అని నర్మద కాస్త కోపంగానే వేదవతికి చెప్తుంది. ఇప్పుడే ఇలా ఉన్నారంటే ఇక ముందు ముందు ఎలా ఉంటారోనని వేదవతి అనుకుంటుంది. మరోవైపు నర్మద, సాగర్ మాట్లాడుకుంటారు. సారీ నర్మద బిల్ నేను కట్టలేకపోయానని సాగర్ అంటాడు. నువ్వు బిల్ కట్టలేనందుకు బాధగా లేదు.. నాతో టైమ్ స్పెండ్ చెయ్యందుకు బాధగా ఉందని నర్మద అంటుంది. నాన్నని పర్మిషన్ అడిగాను.. ఇవ్వలేదని సాగర్ అనగానే.. ఏంటి భార్యని బయటకు తీసుకొని వెళ్ళడానికి మీ నాన్నని పర్మిషన్ అడిగావా.. సిగ్గనిపించడం లేదా.. నన్ను ముట్టుకోవాలన్నా కూడా మీ నాన్న పర్మిషన్ అడిగేలా ఉన్నావని నర్మద అనగానే.. సాగర్ కోప్పడతాడు. అయిన నర్మద అంటూనే ఉంటుంది. సాగర్ ఏమనలేకపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : కార్తీక్ కి నిజం చెప్పేసిన దాస్.. దీపే అసలైన వారసురాలు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం2(Karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -353 లో.... జ్యోత్స్నని  దీపకి బ్లడ్ ఇవ్వమని కార్తీక్ రిక్వెస్ట్ చేస్తాడు. దొరికింది ఛాన్స్ అన్నట్లు గా నువ్వు ఈ పేపర్స్ పై సంతకం పెడితే నువ్వు చెప్పింది చేస్తానని జ్యోత్స్న బ్లాక్ మెయిల్ చేస్తుంది. అప్పుడే డాక్టర్ ఫోన్ చేసి కార్తీక్ ఏమైంది డోనార్స్ వచ్చారా అని అడుగుతుంది. హా వస్తున్నారని కార్తీక్ చెప్తాడు. ఇక వేరే దారిలేక జ్యోత్స్న ఇచ్చిన పేపర్స్ పై కార్తీక్ సంతకం చేస్తాడు. జ్యోత్స్న చిటికె వెయ్యగానే డోనార్స్ వస్తారు. ఆ తర్వాత వాళ్ళని కార్తీక్ లోపలికి తీసుకొని వెళ్తాడు. జ్యోత్స్న, కార్తీక్ ఇద్దరు మాట్లాడుకుంది అంతా దాస్ చూస్తాడు. ఈ పేపర్స్ నీ జీవితాన్ని ఎలా మార్చుతాయో చూద్దాం బావ అని జ్యోత్స్న అనుకుంటుంది. కాసేపటికి దీప సేఫ్ అని డాక్టర్ వచ్చి చెప్తాడు. ఇక మీరు ఇంటికి వెళ్ళండి శౌర్య చూస్తుంటుందని అనసూయ, కాంచనలని కార్తీక్ ఇంటికి పంపిస్తాడు. కార్తీక్ టాబ్లెట్స్ తీసుకొని రావడానికి వెళ్తాడు‌ అక్కడ కార్తీక్ తో దాస్ మాట్లాడతాడు. నీతో ఒక విషయం చెప్పాలని అంటాడు. సుమిత్ర, దశరథ్ ల కూతురు దీపనే.. జ్యోత్స్న కాదని దాస్ చెప్పగానే కార్తీక్ షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావ్ మావయ్య అని కార్తీక్ అడుగుతాడు. నేను చెప్పేది నిజం అని దాస్ అంటాడు. అయితే జ్యోత్స్న ఎవరని కార్తీక్ అడుగుతాడు. జ్యోత్స్న నా కూతురు అని దాస్ చెప్పగానే కార్తీక్ అయోమయంలో పడుతాడు. దాస్ చిన్నప్పుడు వాళ్ళ అమ్మ పారిజాతం పిల్లల్ని మార్చిన విషయం చెప్తాడు. దీపే అసలైన వారసురాలు అని దాస్ చెప్తాడు. దాంతో కార్తీక్ చిన్నప్ప్పుడు కార్తీక్ ని దీప కాపాడిన విషయం గుర్తుచేసుకుంటాడు. నాకు ఈ విషయం తెలిసినా కూడ ఎవరికి చెప్పలేని సిచువేషన్ ఎవరికైనా చెప్తే చనిపోతానని జ్యోత్స్న బెదిరించిందని దాస్ జరిగింది మొత్తం చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : ఒక్కటైన యామిని, రుద్రాణి.. స్పృహకోల్పోయిన రాజ్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -717 లో..... రాజ్ కి గతం గుర్తుచేసే పనిలో భాగంగా అప్పు, కళ్యాణ్ ఇద్దరు రాజ్, కావ్య వాళ్ళ పెళ్లి ఎలా జరిగిందని తమ స్టోరీలాగా చెప్తుంటే రాజ్ ఆసక్తిగా వింటాడు.  నాకు తెలిసిన స్టోరీలాగా అనిపిస్తుందని రాజ్ అనుకుంటాడు. ఎక్కడ రాజ్ కి గతం గుర్తుకి వస్తుందోనని యామిని టెన్షన్ పడుతుంది. మరొకవైపు రాజ్ కి గతం గుర్తుకి రాకూడదని రాహుల్, రుద్రాణి పవర్ కట్ చెయ్యడానికి పవర్ మెయిన్ దగ్గరికి వెళ్తారు. పవరాఫ్ చేయబోతుంటే.. అప్పుడే యామిని కూడా పవరాఫ్ చేయబోతుంది.  మీకు కావలిసిందే నాకు కావాలి రాజ్ కి గతం గుర్తు రాకూడదని రుద్రాణి, యామిని అనుకుంటారు శత్రువుకి శత్రువు మిత్రువు అని యామిని, రుద్రాణి ఒకటి అయ్యి పవరాఫ్ చేస్తారు. రాజ్ కి గతం గుర్తు రాబోతున్న టైమ్ లో పవర్ పోవడంతో అంత డిస్టబెన్స్ అవుతుంది. నేనే పవర్ ఆఫ్ చేసాను అనికావ్యకి చెప్తుంది యామిని. బావ వెళదాం పదా అని యామిని రాజ్ ని తీసుకొని వెళ్తుంటే..కళ్యాణ్ దగ్గరికి రాజ్ వెళ్లి మీ స్టోరి వినాలని ఉందని అంటాడు. అందరు మీ దగ్గర ఉన్న ఫోన్ లో టార్చు ఆన్ చెయ్యండి అని చెప్పగానే అందరు టార్చ్ ఆన్ చేస్తారు. కళ్యాణ్, అప్పు కలిసి రాజ్, కావ్య స్టోరీని కంటిన్యూ చేస్తారు. ఆ తర్వాత రాజ్ అంత వింటునే తల పట్టుకుంటాడు. కళ్ళు తిరుగుతున్నట్లు బెహేవ్ చేస్తూ కావ్యని చూస్తూ నువ్వు అంటూ ఏదో చెప్పబోతు స్పృహకోల్పాతాడు. రాజ్ దగ్గరికి కి యామిని వస్తుంటే వద్దని కావ్య ఆపుతుంది. రాజ్ ని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు. గతం గుర్తు చేసుకోవడానికి ట్రై చేశారని డాక్టర్ తో కావ్య చెప్పగానే.. అలా చెప్పగానే అలా చేస్తే తన ప్రాణానికి ప్రమాదం అని డాక్టర్ చెప్తాడు. ఇప్పుడు బానే ఉన్నాడు ఇంకొకసారి ఆలా చెయ్యకండి అని డాక్టర్ చెప్తాడు. అప్పుడే యామిని వస్తుంది. మీరు ఎవరు రాజ్ కి గుర్తు లేదు.. నేను తన మరదలిని అని మాత్రమే గుర్తు ఉందని కావ్య వాళ్ళకి కోపం వచ్చేలా యామిని మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

వామ్మో ఫారియాకి ఇష్టమైన ఊత బూతు పదం ఇదా...కష్టం బ్రో

చిట్టి అలియాస్ ఫారియా అబ్దుల్లా అంటే గుర్తొచ్చే మూవీ "జాతి రత్నాలు". ఈ మూవీ ఫుల్ కామెడీగా ఉంటుంది. ఆ ఫారియా ఇప్పుడు బుల్లితెర మీద కొన్ని షోస్ లో కనిపిస్తోంది. డాన్స్ ఐకాన్ సీజన్ 2 లో జడ్జ్ గా వచ్చింది. రీసెంట్ గా సుమతో చాట్ షోకి వచ్చింది. ఐతే ఇందులో సుమ ఒక ప్రశ్న అడిగింది. "డేటింగ్, లవ్, మ్యారేజ్ చేసుకోవడానికి ముగ్గురు సెలబ్రిటీస్ ని ఎవరో చెప్పు" అని అడిగింది. "యంగ్ పవన్ కళ్యాణ్ గారితో డేటింగ్ యంగ్ నాగార్జున గారితో లవ్, ప్రభాస్ తో మ్యారేజ్ " అని చెప్పింది ఫారియా. "మీరు ఎక్కువగా వాడే ఊత పదాలు ఏంటి" అని అడిగింది సుమ. "నీ యమ్మ..." అనేసరికి ఊతపదాలే అడిగా కానీ అన్నీ బూతు పదాలే చెప్తోంది అని ఫీలయ్యింది సుమ. జాతిరత్నాలు సినిమా కోసం ఇంటికి వెళ్లి మరీ నేర్చుకున్నా అలాగే నవీన్ కూడా నాతోనూ...చాలా ఫన్ ఉండేది నవీన్ తో, అనుదీప్ తో అని చెప్పింది ఫారియా. అలాగే ఫారియా ఇంగ్లీష్ లో సుమ గురించి ఒక రాప్ సాంగ్ పాడి సుమానే ఎంటర్టైన్ చేసింది. ఫారియా సుమాని అడిగింది "మీ హజ్బెండ్ ని ప్రేమగా పిలిచే మూడు పదాలు చెప్పండి " అని అడిగింది. "ఏవండీ, రాజా, రాజ్" అని ఆన్సర్ ఇచ్చింది సుమ. ఇలా ఫారియా వెరైటీ ఆన్సర్స్ ఇచ్చి మంచి ఫన్ క్రియేట్ చేసింది. ఫారియా చాలా సెలెక్టెడ్ మూవీస్ చేస్తూ ఉంటుంది. "ది జెంగాబురు కర్స్, బచ్చలమల్లి, రావణాసుర, బంగార్రాజు, మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్" లాంటి ఎన్నో మూవీస్ లో నటించింది.  

ఇండస్ట్రీలో కొందరు నన్ను బెదిరించారు

  జబర్దస్త్ తన్మయ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఫుల్ కామెడీ చేస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ ఆమె ఒక ఇంటర్వ్యూ చేసింది. అందులో తన జీవిత కష్టాలన్నీ చెప్పుకొచ్చింది. అసలు తానూ ఎలా ట్రాన్ఫర్మ్ కావాల్సి వచ్చింది...అప్పుడు ఎదుర్కున్న కష్టాలు, మాటల దాడుల గురించి చెప్తూ బాధపడింది. ఐతే ఇంకో ముఖ్య విషయాన్ని కూడా షేర్ చేసుకుంది. లాస్ట్ ఇయర్ ఆగస్టు లో తన్మయ్ ఫాదర్ కన్నుమూశాడు. "ఐతే ఆయన చనిపోయే ముందు రోజు రాత్రి శ్రీదేవి డ్రామా కంపెనీ షూటింగ్ ఐపోయాక  నాన్నతో వీడియో కాల్ లో మాట్లాడాను. ఆ తర్వాత రోజు ఉదయం 11 గంటలకు నాన్న చనిపోయాడు అన్న న్యూస్ వచ్చింది. ఆ టైములో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలీలేదు.ఎం చేయాలో తెలీలేదు. షాక్ లో ఉండి ఇమ్మానుయేల్ కి ఫోన్ చేసాను.అమ్మ షూటింగ్ లో ఉన్నాను లేదంటే వచ్చేవాడిని అని చెప్పాడు. తర్వాత నూకరాజుకు ఫోన్ చేశా. ఎక్కడి పనులు అక్కడ వదిలిపెట్టి, షూటింగ్ ని కూడా వదిలేసి కార్ వేసుకుని వచ్చేసాడు. నేను ఏడుస్తూనే ఉన్నాను. హైదరాబాద్ లో నా చెయ్యి పట్టుకున్నవాడు మా నాన్న దగ్గరకు వెళ్లేంత వరకు నా చెయ్యి వదల్లేదు. నాకు ధైర్యం చెప్తూనే ఉన్నాడు. నాకు తెలిసి నాకు హెల్ప్ చేసిన వ్యక్తి నూకరాజు ఒక్కడే. డబ్బులుపరంగా కూడా ఎవరూ హెల్ప్ చేయలేదు. ఎవరి లైఫ్ వాళ్లకు ఉంటుంది. నేను రెండేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉండడానికి కారణం కొంతమంది పెద్ద హోదాలో ఉన్నవాళ్లు నన్ను కొట్టి, తిట్టి, నన్ను బెదిరించారు...ఇవన్నీ తెలిస్తే మా అమ్మా వాళ్ళు బాధపడతారని నేను ఎప్పుడూ చెప్పలేదు." అంటూ తన్మయ్ తన జీవితంలో పడిన కష్టాలని చెప్పుకొచ్చింది.  

చుట్ట తాగడం వలన కాన్సర్ వస్తుందా రాదా 

  డ్రామా జూనియర్స్ ప్రతీ వారం ఫుల్ ఫన్నీగా ఉంటోంది. ఇక శనివారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో సుధీర్ కూడా ఒక స్కూల్ పిల్లాడి గెటప్ లో వచ్చి ఫుల్ ఎంటర్టైన్ చేసాడు. రోజా టీచర్ గా వచ్చింది. గొప్ప సైంటిస్టుల పేర్లు చెప్పండి అని రోజా అడిగేసరికి  "మా తాత మేడం" అన్నాడు సుధీర్. "ఎం కనిపెట్టాడు" అని రోజా అడిగేసరికి "చుట్ట తాగడం వలన కాన్సర్ వస్తుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు కదా మేడం అది నిజమో కాదో అని మా తాతే కనిపెట్టాడు మేడం" అన్నాడు. అంతే రోజా షాకైపోయింది. "గాంధీ గారి మీద వ్యాసం రాయమన్నాను కదా" అని రోజా అడిగేసరికి సుధీర్ 100 నోటు చూపించాడు. "ఇదేంట్రా డబ్బులు మీద రాసావ్" అని అడిగింది. "మీరే కదా మేడం గాంధీ తాత మీద రాయమన్నారు" అందుకే అనేసరికి రోజాకి ఏమనాలో అర్ధం కాలేదు. ఒక స్కిట్ లో ఒక కుర్రాడు సుధీర్ ని చూసి నవ్వాడు.."ఎందుకు అంత నవ్వుతున్నారు... నేనెవరో మీకు తెలుసా" అన్నాడు సుధీర్. మీరు తెలియక పోవడం ఏంటి "గూగుల్ లోకి వెళ్లి నీచుడు, నికృష్టుడు, దుర్మార్గుడు అని కొడుతుంటే మీ ఫొటోలే వస్తున్నాయి..ఐనా అందరికీ సాధ్యమా అండి చి పోరా అనుకునే స్థాయికి రావడం  " అని ఆన్సర్ చెప్పేసరికి అందరూ నవ్వేశారు. వీళ్ళు పిల్లలైనా అన్న రేంజ్ లో స్కిట్స్ చేస్తుంటే ప్రతీ ఒక్కరూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతున్నారు.  

Illu illalu pillalu : పనులు మానుకొని పెళ్ళాంతో షికారు.. కొడుకుని తిట్టిన రామరాజు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-153లో.. ఇంట్లో వాళ్లందరికీ రాత్రికి చపాతీలు చేస్తానని శ్రీవల్లి అంటుంది. అయ్య బాబోయ్ చపాతీలే.. ఇంట్లో పది మంది ఉన్నారు.. అందరికీ చపాతీలు చేయాలంటే యాభైకి పైనే చేయాలి.. ఏం వద్దులే అన్నం పెట్టేయ్ అని వేదవతి అంటుంది. అన్నం తింటే లావైపోతామ్ అత్తయ్య గారూ.. టిపినీలే మంచిది కాబట్టి చపాతీలు చేసేసి చికెన్ కర్రీ వండేత్తానండీ అని శ్రీవల్లి అంటుంది‌. పదా నేను సాయం చేస్తానని వేదవతి అనగా‌..  అయ్య బాబోయ్.. మీరు వంటగదిలోకి రావడం ఏంటండీ బాబూ.. అసలు మీరు ఎవరనుకుంటున్నారూ.. మీరు అత్తయ్య రూపంలో ఉన్న దేవత. నేను కోడలిగా వచ్చిన తరువాత కూడా మీరు ఇంటి పనులు చేయడం ఏంటండీ.. మీరు రెస్ట్ తీసుకోండి.. వంట అంతు నేను చూస్తానని శ్రీవల్లి అంటుంది‌. ఇక అప్పుడే నర్మద వస్తుంది. ఏంటమ్మ లేట్ అయిందని వేదవతి అనగా.. ఈవినింగ్ మా ఆఫీస్‌కి సాగర్ వచ్చాడు.. ఇద్దరం కలిసి బయటకు వెళ్లామని నర్మద అంటుంది. అయ్ బాబోయ్ అదేంటీ.. బయట కలుసుకోవడానికి.. బయట తిరగడానికి మీరిద్దరూ ఏమైనా లవర్సా ఏంటి? అని శ్రీవల్లి అంటుంది. హో లవర్స్ అయితేనే బయట కలుస్తారా.. భార్యాభర్తలు కలుసుకోకూడదా అని నర్మద తిరిగి అడుగుతుంది. అంటే.. నా ఉద్దేశం అది కాదు.. ఇంట్లో ఎలాగూ కలిసే ఉంటారు కదా.. బయటకలవడం ఏంటా అని అడుగుతున్నా అని శ్రీవల్లి గుచ్చి గుచ్చి అడుగుతుంది. అందుకే.. మేం ఇద్దరం రెస్టారెంట్‌కి వెళ్లాం బదులిస్తుంది నర్మద. ఓహో.. బాగా ఎంజాయ్ చేశారన్నమాట అని వేదవతి, ప్రేమ నవ్వుతుంటారు‌. అత్తయ్యా మీకు సర్ ప్రైజ్ అంటూ అత్తకోసం తెచ్చిన మిరపకాయ బజ్జీల పొట్లం ఇస్తుంది నర్మద. ఆ వాసన చూసి వేదవతి.. ఆయ్... మిరపకాయ బజ్జీలూ అంటూ తెగ సంబరపడిపోతుంది. నాకు మిరపకాయ బజ్జీలు ఇష్టం అని గుర్తుపెట్టుకుని తెచ్చావ్.. ఈ అత్తయ్య మనసు తెలిసిన కోడలివే నువ్వూ అంటూ ప్రేమను దగ్గరకు తీసుకుని ముద్దాడుతుంది వేదవతి. ఇక ఆ బజ్జీలు తినద్దొంటు శ్రీవల్లి లాక్కుంటుంది‌. బయట ఫుడ్ బాగుండటం లేదు.. అత్తయ్య ఆరోగ్యం ముఖ్యం అంటూ నర్మదతో గొడవపెట్టుకొని మరీ ఆ మిర్చీలని తీసుకెళ్ళి పాడేస్తుంది.  మరోవైపు రామరాజు కోపంగా ఉంటాడు. అప్పుడే తిరుపతి వస్తాడు. కాసేపటికి అక్కడికి సాగర్ వస్తాడు. జగన్నాథం రైస్ మిల్లు దగ్గరికి కలెక్షన్ కు వెళ్ళాను నాన్న అని సాగర్ అబద్ధం చెప్తాడు. మరి డబ్బులు ఏవిరా అని రామారాజు అనగా.‌. ఆయన లేరు.. రేపిస్తా అన్నారని సాగర్ అంటాడు. ఉండు అతడికి కాల్ చేస్తా అని రామరాజు అనేసరికి ... నాన్న ఆగు అని సాగర్ అంటాడు. ఏంట్రా కంగారుపడుతున్నావ్ అని తిరుపతి అనగానే.. కంగారు పడక ఏం చేస్తాడూ.. సర్ గారూ నోరు తిరిస్తే అన్నీ అబద్దాలే కదా అని అంటాడు. ఏమైంది బావా? రేయ్ సాగర్.. ఎక్కడికి వెళ్లావ్ రా నువ్వు అని తిరుపతి అడుగుతాడు‌. చెప్పరా చెప్పు.. నిన్ను నేను రెస్టారెంట్‌లో చూడకపోయి ఉంటే.. ఇంకో అబద్ధం ఆడేవాడివి కదా అని రామరాజు అంటాడు. సరదాగా షికార్లు చేయడానికి నన్ను పర్మిషన్ అడిగాడు.. ఇవ్వకపోయేసరికి అబద్దం ఆడేసి.. పారిపోయాడు వీడు అని రెచ్చిపోతాడు రామరాజు. సారీ నాన్నా.. అని సాగర్ అనేసరికి.. నిన్ను నమ్మడం నాది తప్పు అని రామరాజు అంటాడు. పోనీలే బావా.. వాడికి కొత్తగా పెళ్లైంది కదా.. సరదాగా వెళ్లి ఉంటాడులే అని తిరుపతి అంటాడు. కొత్తగా పెళ్లైతే.. పనులు మానుకుని భార్యలతో షికారు చేయాలా? నేను పెళ్లైన తరువాత అలాగే చేశానా? నేను వీడిలాగే చేసి ఉంటే నా కుటుంబం ఇప్పుడు ఇలా ఉండేదా అని రామరాజు తిట్టేసి వెళ్ళిపోతాడు. ఇక సాగర్ బాధపడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi :  గతాన్ని మొత్తం చెప్పేసిన అప్పు, కళ్యాణ్.‌. పెళ్ళి సీన్ ని స్పష్టంగా గుర్తుచేసుకున్న రాజ్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-716లో.. కావ్య, రాజ్, అప్పు, కళ్యాణ్ లతో పాటు కొంతమంది అక్కడికి వస్తారు. వారిలో ఒక అమ్మాయి సత్య.. తను రాజ్ తో క్లోజ్ గా ఉంటుంది.  రాజ్ కోసం సత్య ప్లేట్ తీసుకురావడం చూసిన కావ్య తన ప్లేట్ పగులగొట్టి అక్కడి నుండి వచ్చేస్తుంది. అది చూసిన సత్య.. తను మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టుంది.. అందుకే అలా కోపంగా ఉందని రాజ్ తో అంటుంది. దాంతో రాజ్.. కావ్య దగ్గరకి వెళ్లి ఏమైందని అడుగుతాడు. ఏం లేదు ప్లేట్ జారిపోయిందని కావ్య అంటుంది‌. ఇక అక్కడ కావ్య విసుక్కోవడం రాజ్ చూసి తనలో తాను నవ్వుకుంటాడు.  ఇక కావ్యతో కోపంగా వెళ్తుంది. వెంటనే రాజ్ తన దగ్గరికి వెళ్తాడు. నేను సత్య తెచ్చిన ప్లేట్ తీసుకున్నందుకు కోపం వచ్చిందా అని రాజ్ అంటాడు. సత్య కాకపోతే రుక్మిణీ ఇచ్చిన ప్లేట్ తీసుకోండి.. నాకేంటని కావ్య అంటుంది. ఇక యామినీ చాటుగా వింటూ ఉంటుంది. ఏం తెలియనట్లు మాట్లాడుతున్నారేంటీ.. నా మనసులో ఏముందో మీకు తెలియదా అంటూ కావ్య మాట్లాడే సరికి.. ఏముందో చెప్పండి అంటూ రాజ్ ఆశగా అడుగుతాడు. ఇక రాజే స్వయంగా.. మీరంటే నాకు ఇష్టమని చెప్పే పరిస్థితి రావడం అంతా అప్పూ, కవి దూరం నుంచి చూస్తుంటారు. మీరంటే నాకు మీరంటే నాకు అని రాజ్ నసుగుతుంటే.. బావా అని యామినీ కావాలనే ఎంట్రీ ఇస్తుంది. ఇక్కడున్నావా? నీకోసం రిసార్ట్ అంతా వెతుకుతున్నా.. రా బావా తిందామని యామిని అంటుంది. నేను తినేశా నువ్వు వెళ్లు తిను అని రాజ్ అంటాడు. అయ్యో బావా నీ కంపెనీ లేకుండా నేను తినలేను రా బావా అంటూ బలవంతంగా రాజ్ ని లాక్కునిపోతుంది యామిని. ఇక మరోవైపు కావ్య అలానే చూస్తుంటే అప్పూ, కవి దగ్గరకు వచ్చి.. ఈ యామినీ కావాలనే తీసుకునిపోయింది. తనను తక్కువ అంచనా వేస్తున్నామని అంటారు. యామినీ నాటకాలన్నీ ఆయనకు గతం గుర్తొచ్చే వరకూ కదా.. ఎలా అయిన రాత్రికి మనం అనుకున్నది జరగాలని కావ్య అంటుంది. ఇక పార్టీ మొదలవుతుంది. అప్పు, కావ్య ఇద్దరు తమ లవ్ స్టోరీ ఇదీ అంటు రాజ్, కావ్యల స్టోరీ చెప్తుంటారు. అది విని రాజ్ కనెక్ట్ అవుతాడు. ఇక పెళ్ళిలో కావ్య తాళి కట్టించుకున్న సీన్ దగ్గరి నుండి ఒక్కొక్కటి రాజ్ కి గుర్తొస్తుంటుంది‌. మరోవైపు రుద్రాణి, రాహుల్ వెయిటర్  వేషాల్లో ఉంటారు. ఇది రాజ్ స్టోరీ కదా అని రుద్రాణితో రాహుల్ అంటాడు. అదే సమయంలో యామినికి టెన్షన్ మొదలవుతుంది. పోదాం బావా అంటు రాజ్ తో అనగా‌.. వద్దు ఈ స్టోరీ బాగుందని రాజ్ అంటాడు‌. ఇక తరువాయి భాగంలో పార్టీలో కరెంట్ పోతుంది. రాజ్ లైట్ ఆన్ చేసి స్టేజ్ మీదకి వెళ్లి వింటూ ఉంటాడు. మొత్తం వింటూ గతం గుర్తుతెచ్చుకునే ప్రయత్నం చేస్తాడు రాజ్. ఆ ప్రయత్నంలోనే రాజ్‌కి కళ్లు తిరుగుతుంటాయి. మరి రాజ్ పడిపోతాడా.. యామిని అందరిని కాదని రాజ్‌ని అక్కడి నుంచి తీసుకునిపోతుందా లేదా తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2: చావుబతుకుల్లో దీప.. కార్తీక్ తో జ్యోత్స్న ఒప్పందం అదే!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం2(Karthika Deepam2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-352లో..  కార్తీక్ వెళ్లిపోగానే.. ఆ దీప ఆసుపత్రిలోంచి బయటికి వచ్చినా.. జైల్లో శిక్ష అనుభవించాల్సిందే అని అనేసి శివనారాయణ లోపలికి వెళ్లిపోతాడు. మీరేం కరగకండి.. ఆ దీప కోసం కార్తీక్ నాటకాలు ఆడుతున్నాడు అంతే అనేసి పారిజాతం వెళ్లిపోతుంది. ఇక దశరథ్.. సుమిత్రా ఇలా రా కూర్చో.. కాస్త దీప గురించి కాకపోయినా కార్తీక్ గురించి ఆలోచించాల్సింది. అయినా పొంది సాయాన్ని మరిచిపోకూడదు సుమిత్ర.. నా కోసం ఈ సాయం చేసిరా అంటాడు. సరే అంటుంది సుమిత్ర. అంతా జ్యోత్స్న వింటుంది. మమ్మీ నువ్వు ఇవ్వద్దు రక్తం.. నేను ఇచ్చి వస్తాను.. నా తల్లిని కాపాడిన ఆ దీప రుణం నేను తీర్చుకుని వస్తానని సుమిత్రను ఆపేసి తను వెళ్లిపోతుంది. చూశారా.. నా కూతురు.. ఎంత గొప్పదో.. ఆ దీప వల్ల ఎంత నష్టం జరిగినా సాయం చెయ్యడానికి వెళ్లింది.. అదండీ నా జ్యోత్స్న అని సుమిత్ర మురిసిపోతుంది. మరోవైపు కార్తీక్ బాధగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే దారిలో ఓ చిన్న గుడి కనపడటంతో.. దేవుడికి మొక్కుకుంటాడు. ఇంతలో అతనికి డాక్టర్ నుండి కాల్ వస్తుంది. బ్లడ్ కోసం వెతుకుతున్నా డాక్టర్ అని కార్తీక్ అనగానే డోనర్ దొరికారు హాస్పిటల్ కి రమ్మని డాక్టర్ చెప్తుంది. ఇక కార్తీక్ వెళ్తూ కాశీకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తాడు. అదే విషయం స్వప్నకు కాశీ చెప్తాడు. ఏంటి కాశీ.. దీప వదినకు ఈ కష్టం.. కనీసం సుమిత్ర అత్త పొందిన సాయాన్ని కూడా మరిచిపోయి మాట్లాడటం ఏంటీ? డోనర్ దొరికాడు కాబట్టి సరిపోయింది. లేదంటే దీప వదినకు ఏం జరిగి ఉండేదని అరుస్తూ ఉంటుంది. బెయిల్ మీద బయటికి వచ్చిన దీప వదినను చంపాలని ఎవరనుకుంటారంటూ స్వప్న బాధపడుతుంటే వెనుక గదిలో ఉన్న దాస్ వింటాడు. ఆ జ్యోత్స్న ఏదో చేస్తుందని అనుకుంటాడు దాస్. పదా వెళదామని స్వప్న అనగానే కార్తీక్ వద్దన్నాడని కాశీ చెప్తాడు. ఆసుపత్రి పక్కనే అంటున్నారంటే ఆ పెద్ద ఆసుపత్రిలోనే చేర్పించి ఉంటారు.. నేను వెంటనే వెళ్లాలి. దీపను చూడాలి అని దాసు అనుకుంటాడు. వెంటనే కాశీ, స్వప్నలకు తెలియకుండానే వాళ్ల వెనుక నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు దీప దగ్గర నర్సు ఉంటుంది.  ఆవిడకు ఊపిరి అందడం లేదని గమనించిన నర్స్ వెంటనే పరుగుతియ్యడంతో కాంచన, అనసూయ ఇద్దరు గుండెల పట్టుకుని ఏడుస్తుంటారు. ఇంతలో కార్తీక్ వచ్చి.. ఏమైందమ్మా అనేసరికి.. నర్స్ మాటల గురించి చెప్తారు. ఇక సుమిత్ర అన్న మాటల గురించి కార్తీక్.. వాళ్లతో చెప్తాడు. దాంతో వదిన అలా మాట్లాడిందా అంటు కాంచన బాధపడుతుంది. ఇంతలో డాక్టర్ వచ్చి కార్తీక్‌తో మాట్లాడుతుంది. కార్తీక్.. ఆ డోనర్ కాల్ చేసి బ్లడ్ నేను ఇస్తాను అన్నాడు. తిరిగి చేస్తుంటే లిఫ్ట్ చేయడంలేదు. కొన్నిసార్లు స్విచ్ ఆఫ్ వస్తుంది. కాస్త చూడమని నంబర్ చూపిస్తుంది. దాంతో కార్తీక్ వెంటనే ఆ నంబర్ తన ఫోన్‌లో ఎక్కించుకుని.. కాల్ ట్రై చేస్తూనే ఉంటాడు. అయితే లిఫ్ట్ చేసిన డోనర్.. సర్ నేను ఆసుపత్రి బయటే ఉన్నాను.. మీరు ఒకసారి రండి అని ఫోన్ పెట్టేస్తాడు. కార్తీక్ బయటకు వస్తాడు. ఇక అప్పుడే కార్ లో నుండి జ్యోత్స్న దిగుతుంది. డోనర్ నా మనిషే బావా.. నీకు నీ భార్య ప్రాణాలతో కావాలంటే నేను అడిగిన చోట ఓ సంతకం పెట్టు అంటూ ఎమ్టీ కాగితాలను తీసుకుని పెన్ పట్టుకుని అడుగుతుంది. కార్తీక్ మొదటగా రిక్వెస్ట్ చేస్తాడు.. ఆ తర్వాత కోపంగా హెచ్చరిస్తాడు. ఆవేదనగా తిడతాడు. ఏం చేసినా జ్యోత్స్న డిమాండ్ మాత్రం మారదు. పదిహేను నిమిషాలే టైమ్ బావా.. లేదంటే నీ భార్య చస్తుంది చూసుకోమని జ్యోత్స్న అంటుంది. ‌ఇక అప్పుడే దాసు ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

అమ్మమ్మను చివరి చూపు కూడా చూసుకోలేకపోయా...

  ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ఈ వారం అమ్మమ్మగారింట్లో అంటూ టెలికాస్ట్ అయ్యింది. అసలే పిల్లలందరికీ సమ్మర్ హాలిడేస్ కాబట్టి అమ్మమ్మగారింటికో నానమ్మ వాళ్ళ ఇంటికో వెళ్ళిపోయి సమ్మర్ హాలిడేస్ ని అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ వారం బుల్లితెర నటీనటుల్ని ఈ షోకి వచ్చారు. ఇక సీనియర్ నటి అన్నపూర్ణ కూడా వచ్చింది. గేమ్స్, టాస్కులు ఆడిన తర్వాత అందరూ రౌండ్ గా కూర్చుంటే అన్నపూర్ణమ్మ పెద్ద బేసిన్ లో ఆవకాయ అన్నం కలిపి అందరికీ ముద్దలు కలిపి పెట్టింది. ఈ నోస్టాల్జియా మెమోరీస్ అమ్మమ్మతో ఎక్కువగా ఉంటాయి. దాంతో షోలో వాళ్ళ వాళ్ళ చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళింట్లో ఎలా గడిచాయో చెప్పారు. ఐతే అన్నపూర్ణ శ్రీముఖి వాళ్ళ అమ్మమ్మతో దిగిన ఫోటో చూపించి దాని వెనక స్టోరీ అడిగింది. "ఆవిడే మా అమ్మమ్మ..ఆవిడొక స్ట్రాంగ్ లేడీ. ఆమె పేరు కవిత. ఈరోజు నేను ఈ స్టేజి మీద ఉన్నాను అంటే, ఇంత ఎనెర్జీగా ఉన్నానంటే, ఇంత యాక్టివ్ గా ఉన్నాను అంటే దానికి కారణం మా అమ్మమ్మ. ఇండస్ట్రీకి రావడానికి కారణం ఆమె. ఇండస్ట్రీకి రావడం హ్యాపీగా ఫీలవ్వాల, స్యాడ్ గా ఫీలవ్వాల అనే ఒక సందర్భం వచ్చింది. నేను ఒక షాప్ ఓపెనింగ్ కి వేరే ఊరు వెళ్లాం. ఎర్లీ మార్నింగ్ షాప్ ఓపెనింగ్ ఉంది. దానికి ముందు రోజు నైట్ మా అమ్మమ్మ చనిపోయిందంటూ న్యూస్ వచ్చింది. ఐతే ఆ షాప్ వాళ్ళను పర్మిషన్ అడిగాను. వాళ్ళు కుదరదు అన్నారు. ఇంత వరకు వచ్చింది. షాప్ ఓపెనింగ్ చేసి వెళ్లిపోండి అన్నారు. సరే అప్పుడు ఇంట్లో వాళ్లకు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశా...నేను వచ్చేవరకు అమ్మమ్మను తీసుకెళ్లొద్దు చివరి చూపు చూసుకోవాలి అని చెప్పాను. కానీ కుదర్లేదు. కానీ లాస్ట్ లో స్నానం అదంతా చేయిస్తారు కదా ఆ తంతు మొత్తాన్ని వీడియో కాల్ లో చూపించారు. నేను ఆ షాప్ ఓపెనింగ్ చేసి కాకినాడ నుంచి అమ్మమ్మ ఊరు వెళ్లేసరికి అర్ధరాత్రి అయ్యింది. నేను వెళ్లేసరికి అక్కడ అమ్మమ్మ లేదు. నా లైఫ్ లో ఉన్న ఒకే ఒక రిగ్రెట్ ఆమెను ఒకే ఒక్కసారి చూసి ఉంటే బాగుండేమో అనిపించింది.. నేను ఈ రోజు ఇంత స్ట్రాంగ్ గా ఉండడానికి రీజన్ ఆమెనే. ఆమె లేని లోటు ఎవరూ తీర్చలేరు. నేను స్టేజి మీద ఎప్పుడూ తినలేదు. అన్నపూర్ణమ్మ చేతులు మా అమ్మమ్మలా ఉంటాయి..అందుకే ఆమె చేతులతో ఈ గోరుముద్ద తింటున్నా" అంటూ ఏడ్చేసింది శ్రీముఖి.

తొక్కలో శివ్ .. రాకు నా దగ్గరకు నువ్వు...

  కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ నెక్స్ట్ వీక్ ప్రోమోలో శివ్ - పరి మధ్య గొడవ అయ్యింది. ఇక నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ కి ఫెస్టివల్ థీమ్ ఇచ్చింది శ్రీముఖి. ఇందులో అమరదీప్, విష్ణు ప్రియా, ప్రియాంక జైన్ వంటి వాళ్లంతా వచ్చారు. ఇక అమరదీప్ ఐతే "మనం అంతా ఐక్యంగా ఉండి ఆడితేనే గెలుస్తాం" అని చెప్పాడు. దానికి ఇమ్మానుయేల్ కౌంటర్ ఇచ్చాడు. "ఫస్ట్ ఎపిసోడ్ లో మనమంతా కలిసి ఇంతకంటే చాలా ఎక్కువగానే అనుకున్నాం" అంటూ కౌంటర్ వేసాడు. ఇంతలో విష్ణుప్రియకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది శ్రీముఖి. "నువ్వు ఒక్క అమ్మాయితో జాగ్రత్తగా ఉండాలి. అదిగో ఐశ్వర్య..అసలే పృద్వి మీద ఆమె మనసు పారేసుకుంది. మొన్నే హగ్గులు వరకు వెళ్ళింది కథ " అంటూ ఆమెను చూపించింది. ఇక విష్ణు ప్రియా ఐతే "ఇట్స్ ఓకే. నాకు పృద్వి మీద నమ్మకం ఉంది..ఇట్స్ ఓకే అక్కడ ఎం చేయరు " అని చెప్పింది ఎంతో నమ్మకంతో. "ఇంతలో శివ్ లేచి ప్రియాంక జైన్ వైపు రాబోతుంటే ఆమె ఫుల్ ఫైర్ అయ్యింది. "అక్కడే ఆగు. నువ్వేమన్నావ్..తొక్కలో పరి అన్నావ్...తొక్కలో శివ్ .. రాకు నా దగ్గరకు నువ్వు" అంటూ అరిచింది. ప్రియాంక కోపాన్ని చూసి అందరూ షాక్ అయ్యారు. ఇంతలో శివ్ కూడా "ఓయ్ పోవే..చూసుకుందాం పోవే" అన్నాడు శివ్..వెంటనే ప్రియాంక కూడా "ఓయ్ పోరా" అంది...నిజానికి ఇంతకుముందు ఎపిసోడ్స్ లో శివ్ ప్రియాంకను తొక్కలో పరి.. టైటిల్ విన్ అయ్యేవరకు పరిని వదిలిస్తున్నా అని చెప్పాడు. అతని మాటలు విన్న ప్రియాంకకు  బాగా కోపం వచ్చింది. ఎందుకు అలాంటి మాటలు మాట్లాడావ్ అంటూ బాధపడింది. ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో ఆమె తన రివెంజ్ తీర్చుకుంది.

నన్ను వాడుకుని ఓవర్ నైట్ జంప్ ఐపోయాడు

  కాకమ్మ కథలు సీజన్ 2 బాగా ఫన్నీగా సాగుతోంది. ఫస్ట్ ఎపిసోడ్ కి దీపికా - చెఫ్ సంజయ్ తుమ్మల వచ్చారు. ఎపిసోడ్ 2 కి శేఖర్ మాష్టర్ - ముమైత్ ఖాన్ వచ్చారు. ఇప్పుడు ఎపిసోడ్ 3 సాకేత్ కొమాండూరి - పర్ణికని తీసుకొచ్చింది. వీళ్ళు సింగర్స్. వీళ్ళతో రిలీజ్ ఐన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందులో సాకేత్ ని కొన్ని ప్రశ్నలు అడిగింది హోస్ట్ తేజస్విని మడివాడ. సింగర్ సాకేత్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ఇప్పుడు కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ షోలో కూడా చేస్తున్నాడు. చాలా ఫన్నీగ ఉంటాడు. అలాగే కామెడీ యాంగిల్ కూడా ఎక్కువగా. ఐతే ఇందులో తేజు కొన్ని ప్రశ్నలు వేసింది సాకేత్ ని. "నీ లైఫ్ లో లోపాయింట్ గురించి చెప్పు" అని అడిగేసరికి. "చాలా నమ్మిన ఒక వ్యక్తి సొంత తమ్ముడిలా చూసుకున్న ఒక వ్యక్తి ఓవర్ నైట్ జంప్ ఐపోయాడు. ఇంకా చెప్పాలంటే అతను  నన్ను వాడుకున్నాడు." అదే ప్రశ్నకు పర్ణిక కూడా రియాక్ట్ అయ్యింది.."తన ప్రెగ్నెన్సీ టైంలో తన వాయిస్ ని కూడా కోల్పోవాల్సి వచ్చింది అని అప్పుడు చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని చెప్పింది...చాలా ట్రెయిట్మెంట్స్ కూడా తీసుకున్నాను అని అంది". ఆ తర్వాత కొన్ని కొంటె ప్రశ్నలు అడిగింది.."పాటలు తక్కువ మాటలు ఎక్కువ" అని ఎవరిని చూస్తే అనిపిస్తుంది" అని పర్ణికను అడిగింది.."సాకేత్" అని ఆన్సర్ ఇచ్చింది. "స్వరం తక్కువ సోకులెక్కువ" ఎవరు అని సాకేత్ ని అడిగింది. "రేవంత్" అని చెప్పాడు. "ఏ హీరోయిన్ తో వీడియో సాంగ్ లో చేయాలనిపిస్తుంది" అని అడిగింది. దానికి సాకేత్ "తమన్నా" అని చెప్పాడు. "మోస్ట్ ఓవర్ రేటెడ్ సింగర్ ఎవరని నువ్వు అనుకుంటున్నావు" అని అడిగింది. "సిద్ శ్రీరామ్" అని చెప్పాడు సాకేత్.

Illu illalu pillalu : ఆ డ్రెస్ లో తనని చూసి ఇంప్రెస్ అయిన ధీరజ్.. కోపంగా ఉన్న రామరాజు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -152 లో.... నర్మద సాగర్ కోసం వెయిట్ చేసి ఇంటికి వెళ్లిపోతుంటే.. అప్పుడే సాగర్ వస్తాడు. ఇంత లేట్ ఏంటని నర్మద అడుగగా.. పెండింగ్ ఆర్డర్లు ఉన్నాయ్ అందుకే అని సాగర్ చెప్తాడు. అయ్యో మరి ఇంకొకసారి ప్లాన్ చేసుకునే వాళ్ళం కదా అని నర్మద అంటుంది. పర్లేదు వెళదామని సాగర్ రెస్టారెంట్ కి తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత ధీరజ్ వాటర్ క్యాన్ లు వెయ్యడం నెల అవుతుంది కాబట్టి అతనికి జీతం వస్తుంది. దాంతో ప్రేమకి ఒక డ్రెస్ తీసుకోవాలనుకుంటాడు. షాప్ కి వెళ్లి అడుగుతాడు. డ్రెస్ సైజ్ ఎంత అని షాప్ అతను అడుగుతాడు. ప్రేమకి ఫోన్ చేసి నీ సైజ్ ఏంత అని అడగడంతో ప్రేమ తప్పుగా అర్థం చేసుకొని తిడుతుంది. ఇక ఏం చెయ్యలేక ప్రేమ ఎలా ఉంటుందనేది షాప్ ఓనర్ కి చెప్పి ధీరజ్ ఒక డ్రెస్ తీసుకుంటాడు. మరొకవైపు నర్మద, సాగర్ ఇద్దరు రెస్టారెంట్ కి వెళ్లి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అనుకోకుండా అదే రెస్టారెంట్ కి రామరాజు రైస్ డెలివరీ కోసం వస్తాడు. అప్పుడే నర్మద, సాగర్ ని చూస్తాడు. సాగర్ కి రామరాజు ఫోన్ చేస్తాడు కానీ సాగర్ లిఫ్ట్ చెయ్యడు. దాంతో అక్కడ నుండి రామరాజు వెళ్ళిపోతాడు. బిల్ వస్తుంది నా దగ్గర డబ్బులు లేవని సాగర్ అనగానే కోపంగా నర్మద బిల్ పే చేస్తుంది. తరువాయి భాగంలో ప్రేమకి తీసుకొని వచ్చిన డ్రెస్ ప్రేమ వేసుకుంటుంది. ఆ డ్రెస్ లో తనని చూసి ఫ్లాట్ అవుతాడు ధీరజ్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.