మేము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం

  బుల్లితెర మీద శివ్ కుమార్ - ప్రియాంక జైన్ ఇద్దరూ ఇంతమంచి స్నేహితులో అందరికీ తెలుసు. అలాంటి శివ్ పుట్టినరోజును పరి స్పెషల్ గా ప్లాన్ చేసింది. అలాగే ఇంకో సర్ప్రైజ్ కూడా ఇచ్చింది. శివ్ ని అండమాన్ తీసుకెళ్లింది పరి. శివ్ ఐతే చాలా ఎక్సయిట్ అయ్యాడు. అలాగే అతనికోసం ఒక రింగ్ కూడా కొన్నది పరి. 2025 జూన్ లో టేకాఫ్ అయ్యాం అదే 2050 ఇయర్ లో ల్యాండ్ ఐతే ఎలా ఉంటుంది అంటూ వింతైన ప్రశ్న అడిగింది పరి. చాలా బాగుంటుంది అంటూ ఆన్సర్ ఇచ్చాడు శివ్. సముద్రం మీద ఫ్లయిట్ లో వెళ్తూ డ్రై ఫ్రూప్ట్స్ తో తయారు చేసిన కేక్ ని ఎయిర్ హోస్టెస్ తీసుకొచ్చి ఇచ్చేసరికి శివ్ కట్ చేసి టేస్ట్ చేసాడు. అలాగే క్రోజ్ లో హావలోక్ అనే ఐలాండ్ కి తీసుకెళ్లి అక్కడ 150 ఏళ్ళ వయసున్న పెద్ద వృక్షాన్ని చూపించింది. ఇక అక్కడ ఒక పెద్ద సెటప్ వేయించింది. శివ్ ని బయట పెట్టి కళ్ళకు గంతలు కట్టి ఆ సెటప్ దగ్గరకు తీసుకొచ్చి మోకాళ్ళ మీద కూర్చుని రింగ్ ఇచ్చి "విల్ యు మ్యారి మీ" అని అడిగింది. ఇక శివ్ ఐతే తెగ సిగ్గుపడిపోయాడు. ఫైనల్లీ డ్రీం కం ట్రూ ప్రపోజల్  చేసావ్ అంటూ హగ్ చేసుకుని ఐ లవ్ యు అని చెప్పాడు. "సరే నువ్వు లైఫ్ లాంగ్ ఇలా ఉండడానికి రెడీగా ఉన్నావా" అని అడిగింది పరి. "లైఫ్ లాంగ్ ఏంటే ఏడేడు జన్మలు ఇలా ఉండడానికి రెడీగా ఉన్నా" అని చెప్పాడు శివ్. "29 వ బర్త్ డే చేసింది ప్రియాంక ఎప్పుడూ ఇంత మంచి సర్ప్రైజ్ ఇవ్వలేదు..ప్రియాంక మదర్ ఆఫ్ సర్ప్రైజెస్ ..మేము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం" అని చెప్పుకొచ్చాడు శివ్.  

Illu illalu pillalu : ప్రేమ డ్యాన్స్ నేర్పిస్తుందని తెలుసుకున్న రామరాజు.. నర్మదపై ఫైర్!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -184 లో.....ప్రేమని ధీరజ్ పట్టుకుంటాడు. అది చూసిన తిరుపతి.. ఎంట్రా రోడ్డుపై మీ రొమాన్స్ అని అంటాడు. అలా అనడంతో ప్రేమ సిగ్గుపడుతుంది. రొమాన్స్ లేదు.. ఏం లేదు మామ అని ధీరజ్ అక్కడా నుండి ప్రేమని చూస్తూ వెళ్ళిపోతాడు. మరొకవైపు శ్రీవల్లి డోర్ వేసుకొని హనీ మూన్ కాన్సిల్ అయిందని కోపంగా వస్తువులు కింద పడేస్తుంది. ఏమైందని వేదవతి డోర్ కొడుతుంది. ఏం లేదంటూ శ్రీవల్లి కోపంగా బయటకు వెళ్ళిపోతుంది. ఏమైంది ఈ పిల్లకి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుందా అని వేదవతి అనుకుంటుంది. శ్రీవల్లి తన పుట్టింటికి వెళ్లేసరికి.. శ్రీవల్లి వాళ్ళ అమ్మ, నాన్న డాన్స్ చేస్తుంటారు. తనకి కోపం వస్తుంది. తను అత్తారింట్లో జరిగింది అంతా కూడా భాగ్యంకి చెప్తూ ఏడుస్తుంది. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావంటూ శ్రీవల్లికి దైర్యం చెప్తుంది భాగ్యం. ఆ తర్వాత నర్మద, ప్రేమ, శ్రీవల్లి చేసిన ప్లాన్ తిప్పి కొట్టినందుకు హ్యాపీగా ఫీల్ అవుతారు. నర్మద ప్రేమ ఇద్దరు ఒక దగ్గరికి వెళ్లి ప్రేమ క్లాసికల్ డాన్స్ నేర్పించడానికి స్టూడెంట్స్ ని మాట్లాడతారు. ప్రేమ స్టూడెంట్స్ కి డాన్స్ క్లాస్ నేర్పిస్తుంది. తరువాయి భాగంలో ప్రేమ డాన్స్ నేర్పిస్తున్న విషయం ఇంట్లో రామరాజుకి తెలిసి గొడవ జరుగుతుంది. అసలు నువ్వు రాకముందు ఇల్లు ప్రశాంతంగా ఉండేది.. దీనికి అంతటికి కారణం నువ్వేనని నర్మదపై కోప్పడతాడు రామరాజు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : మల్లెపూలతో బావ అని రాసిన దీప.. మురిసిపోయిన కార్తీక్!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -383 లో.....పారిజాతం కేక్ కింద పడేసిన వీడియో జ్యోత్స్నకి చూపించి కార్తీక్ బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఆ తర్వాత జ్యోత్స్న ని కిందకి రప్పించి.. కేక్ ఆర్డర్ చేస్తాడు. కేక్ పై దీప, జ్యోత్స్న అని రాసి ఉంటుంది. అది చూసి అందరు షాక్ అవుతారు. ఆ పేర్లు జ్యోత్స్న పెట్టమందని కార్తీక్ అనగానే అవునని జ్యోత్స్న చెప్తుంది. ఇప్పుడు ఇద్దరం కలిసి కేక్ కట్ చేస్తామని చెప్పమని జ్యోత్స్నకి కార్తీక్ సైగ చెయ్యగా.. మేమ్ ఇద్దరం కేక్ కట్ చేస్తామని జ్యోత్స్న  అంటుంది.  వద్దని శివన్నారాయణ, సుమిత్ర అంటారు. ప్లీజ్ నా కోసం ఒప్పుకోండి అని జ్యోత్స్న రిక్వెస్ట్ చేస్తుంది. కాసేపటికి ఇద్దరు కలిసి కేక్ కట్ చేస్తారు. సుమిత్ర, దశరథ్ కి జ్యోత్స్న కేక్ తినిపిస్తుంది. దీపకి దశరథ్ కేక్ తినిపిస్తాడు. జ్యోత్స్నకి కార్తీక్ సైగ చెయ్యగానే.. అమ్మ నువ్వు కూడా దీపకి తినిపించమని చెప్తుంది. సుమిత్రకి ఇష్టం లేకున్నా దీప కి కేక్ తినిపిస్తుంది. ఆ తర్వాత దీప ఆశీర్వాదం తీసుకోబోతుంటే సుమిత్ర వెళ్ళిపోతుంది. దీప, కార్తీక్ కలిసి దశరథ్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తర్వాత సుమిత్ర పడిపోతుంటే దీప పట్టుకోబోతుంది. వద్దని సుమిత్ర కోపంగా అంటుంది. ఆ తర్వాత సుమిత్రకి కాలు బెణుకుతుంది. దాంతో దశరథ్ తనని గదిలోకి తీసుకొని వెళ్తాడు. సుమిత్ర అటు వైపుగా పడుకొని ఉంటుంది. దీప వచ్చి కాలుకి మందు రాస్తుంది. జ్యోత్స్న అనుకొని సుమిత్ర మాట్లాడుతుంది. తీరా చూసేసరికి దీప ఉంటుంది. దాంతో తనని కోప్పడి పంపిస్తుంది. ఆ తర్వాత దీప దగ్గరికి కార్తీక్ వస్తాడు. మరదలు అంటూ పిలుస్తాడు. బావ అనొచ్చు కదా అని కార్తీక్ అనగానే.. దీప మల్లెపూలతో బావ అని రాస్తుంది. అది చూసి కార్తీక్ మురిసిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : రాజ్ మనసులో మాటని కావ్యతో చెప్తాడా.. కూతురి కోసం రంగంలోకి కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -747 లో.....పెళ్లి రాట్ కి యామిని, రాజ్ పూజ చేస్తారు. ఆ తర్వాత పెళ్లి రాట్ విరిగిపోతుంది. దాంతో యామిని షాక్ అవుతుంది. ఇలా జరగకూడదు. ఈ పెళ్లి ఆపండి అని ఇందిరాదేవి, అపర్ణ అంటారు. అలా ఎందుకు అండి అని పంతులు గారు అంటాడు. దాంతో అపర్ణ, ఇందిరాదేవి డిస్సపాయింట్ అవుతారు. ఆ తర్వాత ఇలా జరుగుతుంది ఏంటని అపర్ణ, ఇందిరాదేవి మాట్లాడుకుంటుంటే అప్పుడే కనకం ఎంట్రీ ఇస్తుంది. నా కూతురు కి అన్యాయం జరుగుతుందని అంటుంది‌‌ ఇంతకి ఆ యామిని ఎవరు అంటూ నిలదీస్తుంది. కనకం నువ్వు ఎక్కువ మాట్లాడకు.. ఈ పెళ్లి ఎలాగైనా మనం ఆపాలని ముగ్గురు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత కావ్య దగ్గరికి కనకం వెళ్తుంది. ఏంటే ఇదంతా అని అడుగుతుంది. కావ్య ఎప్పటిలాగే తనకేం పట్టనట్లు ఉంటుంది. ఆ తర్వాత కావ్యతో రాజ్ మాట్లాడాలని ప్రయత్నం చేస్తుంటే యామిని అసలు రాజ్ కి ఛాన్స్ ఇవ్వదు. మరొకవైపు పూజకి పంతులు ఏర్పాట్లు చేస్తుంటాడు.  కనకం, ఇందిరదేవి, అపర్ణ ముగ్గురు కలిసి పెళ్లి చెడగొట్టాలని ప్లాన్ చేస్తుంటారు. మనకి ఆ పంతులు వీక్ పాయింట్ తెలిస్తే ఆటోమెటిక్ గా మనం అనుకున్నది జరుగుతుందని కనకం అంటుంది. తరువాయి భాగంలో కావ్యతో తన మనసులో మాట చెప్పాలని రాజ్ ట్రై చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

 "కమింగ్ సూన్"...అమ్మాయా, అబ్బాయా త్వరలో చెప్తాం

  బుల్లితెర మీద అంజలి- పవన్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఈ ఇద్దరూ భార్య భర్తలు సీరియల్స్ ద్వారా ఆడియన్స్ కి దగ్గరయ్యారు. మొగలి రేకులు సీరియల్ తో అంజలి బాగా ఫేమస్ అయ్యింది. ఇప్పుడు అంజలి పవన్ అలాగే వీళ్ళ ముద్దుల కూతురు చందమామ అలియాస్ ధన్వికతో కలిసి యూట్యూబ్ వీడియోస్ చేస్తోంది. అలాగే ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఐతే ఇప్పుడు అంజలి రెండో సారి తల్లయ్యింది. రీసెంట్ గా ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఐతే పుట్టింది ఆడపిల్లా, మగపిల్లాడా అన్నది మాత్రం రివీల్ చేయలేదు. ఐతే వీళ్ళు "కమింగ్ సూన్" అంటూ పోస్ట్ చేశారు. ఐతే త్వరలో ఈ విషయాన్నీ చెప్పబోతున్నారన్న విషయం తెలుస్తోంది. 2017 లో సీరియల్ నటుడు సంతోష్ పవన్ ని అంజలి పెళ్లి చేసుకుంది. కూతురు చందమామతో కూడా ఫోటోషూట్స్ అవి చేయిస్తూ ఆమెకు కూడా ఒక స్పెషల్ పేజీని ఇన్స్టాగ్రామ్ లో ఓపెన్ చేసి అందులో పోస్ట్ చేస్తున్నారు. అలాగే అన్ని రకాల బుల్లితెర షోస్ కి కూడా ఈ చిన్నారిని తీసుకొస్తున్నారు. బుల్లితెర షోస్ లో అంజలి పవన్ వాళ్ళ అమ్మాయి చందమామ అలాగే విశ్వ వాళ్ళ అబ్బాయి ర్యాన్ మంచి ఫ్రెండ్స్ లా మారిపోయారు. వీళ్ళిద్దరే ఈ మధ్య షోస్ లో ఎక్కువగా కనిపిస్తున్నారు.

ఒక లవ్ కోసం...ఈవిడ ఒకడి తోటి ఎఫైర్...

కాకమ్మ కథలు నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ న్యూ ఎపిసోడ్ కి మానస్, సత్య వచ్చారు.  "అసలు మీరిద్దరూ ఎలా కలుసుకున్నారో నాకు తెలుసుకోవాలని ఉంది " అంటూ తేజస్విని అడిగింది. "ఒక గొడవ వలన కలిసాం..నువ్వెందుకు వాళ్ళను సపోర్ట్ చేసావ్ అంటూ నన్ను అడిగింది  " అని చెప్పాడు మానస్. "వాళ్లంటే ఎవరు" అని అడిగింది తేజు. "పేర్లెందుకులే" అంది సత్య. "ఐతే ఎవరో ఒక కాకి" అంది తేజు. ఇక తర్వాత మానస్ కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. "10 త్ లో 93 , ఇంటర్ లో 98 పర్సెంట్ మార్క్స్ వచ్చాయి. నాకు హీరో అనే మూవీ ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా అవకాశం వచ్చింది. ఇక ఆ సినిమా 13 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కి సెలెక్ట్ అయ్యింది. ఆ సినిమాకు నంది అవార్డు వచ్చింది. నాకు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు వచ్చింది." అని చెప్పాడు మానస్. "నా స్టోరీ ఎలా ఫ్లిప్ అయ్యిందంటే ఒక లవ్ కోసం ..ఫైనల్ వాళ్ళ నోటి నుంచి వినిపించిన మాటలు అవే..దాని కారణంగా ఫామిలీలో కొన్ని పరిస్థితులు మారిపోయాయి " అంటూ చెప్పింది సత్య. "ఇంట్లో ఉన్నవాళ్లను తిన్నావా అని కూడా అడగని ఈవిడ ఒకడి తోటి ఎఫైర్ " అంటూ తేజు కూడా ఏదో చెప్పుకొచ్చింది. ఐతే ఇంతకు శ్రీసత్య, తేజు ఎం చెప్పారు అన్నది ఎపిసోడ్ చూసి తెలుసుకోవాలి. ఇక శ్రీసత్య బిగ్ బాస్ 6 ద్వారా ఆడియన్స్ కి బాగా దగ్గరయింది. కొన్ని షోస్, సీరియల్స్ లో నటించింది. రామ్ పోతినేని అంటే పిచ్చ ఇష్టం. అలాగే కొన్ని మూవీస్ లో సైడ్ రోల్స్ లో నటించింది కూడా. ఇక సత్య మెహబూబ్ తో కలిసి రీల్స్ అవి చేస్తూ ఉంటుంది. అలాగే అంజలి పవన్ వాళ్ళ అమ్మాయి చందమామతో కలిసి కొన్ని కవర్ సాంగ్స్ కూడా చేస్తూ ఉంటుంది సత్య.  

నాకు మల్లెపూలు ఇచ్చిన ఫస్ట్ మగాడు మానస్..

  కిరాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ షో ప్రీ-ఫినాలేలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ కి స్పెషల్ థీమ్ ని తీసుకొచ్చారు. అదేంటంటే "మీరు ఒకరికి ఒకరు గుర్తుగా గిఫ్ట్ ఇచ్చుకోవాలి అంటే ఎం ఇచ్చుకుంటారు" అని హోస్ట్ శ్రీముఖి అడిగింది. ఇందులో తేజస్విని మడివాడ తన చేతికి వచ్చిన గిఫ్ట్ ప్యాక్ ని ఓపెన్ చేసింది. "మల్లెపూలు" అని గట్టిగా అరిచింది. మల్లెపూలు చూసి శ్రీముఖి ఇంకా గట్టిగా అరిచింది. ఆ గిఫ్ట్ ఇచ్చింది ఎవరో కాదు బ్రహ్మముడి సీరియల్ హీరో  మానస్. "నాకు మల్లెపూలు ఇచ్చిన ఫస్ట్ మగాడు మానస్" అని చెప్పేసింది తేజస్విని. ఇక శ్రీముఖి ఆ మల్లెపూలు తీసుకుని తేజస్విని కొప్పులో అలంకరించింది. అలాగే తేజు కూడా బొట్టు పెట్టుకుంది. "నిన్ను పద్ధతైన అమ్మాయిగా చూడాలనుకున్నాడు కాబట్టి మల్లెపూలు తెచ్చాడు" అంటూ శ్రీముఖి పెద్ద కామెంట్ ఐతే చేసింది. కానీ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ లో మాత్రం "అది అవ్వదమ్మ" అంటూ వినిపించేసరికి అందరూ నవ్వుకున్నారు. ఇక తర్వాత డెబ్జానీ ఒక గిఫ్ట్ ప్యాకెట్ ని తీసుకొచ్చి అమరదీప్ కి ఇచ్చింది. "ఏదైనా హార్ట్ షేప్ లో ఉన్న సింబల్ ఏమన్నా ఇచ్చి ఉంటుంది" అన్నాడు. కానీ ప్యాకెట్ ఓపెన్ చేసిన శ్రీముఖి అందులో కర్చీఫ్ ఉండడం చూసి అవాక్కయింది. "కర్చీఫ్ ఎందుకు ఇచ్చావ్" అంటూ డెబ్జానీని అడిగింది. "అందరినీ చూసి సొల్లు కార్చుకుంటావ్ కదా..తుడుచుకోవడానికి ఇది" అంటూ ఆ కర్చీఫ్ ని అమరదీప్ చేతిలో పెట్టింది. తర్వాత బాయ్స్ కి గర్ల్స్ కి ఒక టాస్క్ ఇచ్చింది. వాటర్ బెలూన్ నీళ్ళల్లో మునుగుతుందా, తేలుతుందా అని అడిగేసరికి మునుగుతుంది అని మానస్ రాసాడు తేలుతుంది అంటూ ప్రియాంక జైన్ రాసింది. కానీ ఆ వాటర్ బెలూన్ కాసేపు మునుగుతూ, తేలుతూ కనిపించింది.

రచ్చ రవి:  నేను తాగను... తాగబోను

  సింగర్ మంగ్లీ పుట్టినరోజు సెలెబ్రేషన్స్ లో భాగంగా డ్రగ్స్, గాంజా వంటివి సేవిస్తున్నారంటూ న్యూస్ వచ్చింది. చాలామంది సెలబ్రిటీస్ నేమ్స్ కూడా వార్తల్లో వినిపించాయి. ఐతే అనుమతి లేకుండా పార్టీ నిర్వహించినందుకు సింగర్ మంగ్లీతో పాటు ఆమె సోదరుడు శివరామకృష్ణ, అనుచరుడు దామోదర్ రెడ్డి పై కూడా పోలీసులు కేసు పెట్టారు. ఇక ఇందులో సెలబ్రిటీస్ పేర్లలో రచ్చ రవి పేరు కూడా వచ్చింది. దాంతో అతను రియాక్ట్ అయ్యాడు. "హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రచ్చ రవి..నా మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ ఫోన్ చేసి నువ్వు వైరల్ అవుతున్నావ్ అంటే నా పేరు పెరుగుతోంది..నాకో నాలుగు అవకాశాలు ఇంటి దగ్గరకు వస్తాయనుకున్నా...తీరా న్యూస్ చూస్తే తెలిసింది. ఉన్న అవకాశాలు పోగొట్టేలా ఉన్నాయి. ఫ్రెండ్స్ వారం రోజుల నుంచి డే అండ్ నైట్ షూట్స్ ఉండడం వలన నేను ఇంటికి దూరంగా ఉంటున్నాను. ఇక్కడ సిగ్నల్స్ కూడా లేవు. కాబట్టి అప్ డేట్స్ లేట్ గా తెలుస్తున్నాయి. ఇటీవల బర్త్ డే పార్టీ మాదక ద్రవ్యాల మద్యలో రచ్చ రవి అని స్ప్రెడ్ అవుతూ ఉంది. నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఇండస్ట్రీ మొత్తానికి నేను ఒక్కడినే రచ్చ రవిని...నా లాగ ఇంకోడు లేడు, రాడు.. అక్కడ ఉన్న రచ్చ రవి నేను కాదు. నాకు తెలీదు. అర్ధం చేసుకుంటారని అనుకుంటున్నా" అంటూ ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియోని రిలీజ్ చేసాడు. "నేను తాగను... తాగబోను...నాకు తెలవదు దయచేసి అర్ధం చేసుకోండి." అనే కాప్షన్ తో పాటు రెండు ప్రముఖ టీవీ ఛానెల్ పేర్లను కూడా హ్యాష్ టాగ్స్ రూపంలో పెట్టాడు.

Brahmamudi: యామినికి షాకిచ్చిన కావ్య.. తన చేయి పట్టుకున్న రాజ్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -746 లో....రాహుల్, మా అత్త రుద్రాణి అక్కడికి వస్తే మీ ప్లాన్ చెడగొడుతారు.. వాళ్ళు రాకుండా నేను చూస్తాను.. మీరు వెళ్ళండి అని ఇందిరాదేవి వాళ్ళతో స్వప్న చెప్తుంది. ఆ తర్వాత కావ్య మంచిగా రెడీ అయి రావడం చూసి అందరు ఆశ్చర్యపోతారు. నేను ఎలా ఉన్నానని కావ్య అడిగితే.. అక్కడ నీ భర్తకి వేరొకరితో పెళ్లి జరుగుతుందని ఇందిరాదేవి కోప్పడుతుంది. అయిన కావ్య అవేం పట్టించుకోదు. మరొకవైపు కావ్య కోసం రాజ్ వెళ్తుంటే.. ఎక్కడికి బావ ఇప్పుడు నలుగు పెట్టుకోవాలని యామిని అంటుంది. కళావతి దగ్గరికి అని రాజ్ అనగానే అప్పుడే కావ్య ఫ్యామిలీతో ఎంట్రీ ఇస్తుంది. తనని చూసి రాజ్ షాక్ అవుతాడు. బావ వాళ్ళని నేనే పిలిచానని యామిని అంటుంది. పిలవగానే వచ్చినందుకు థాంక్స్ అని యామిని అనగానే.. అంతగా పిలిస్తే రాకుండా ఎలా ఉంటామని అని కావ్య అంటుంది. మరొకవైపు రాహుల్, రుద్రాణి బయటకు రాకుండా స్వప్న లాక్ వేస్తుంది. ఆ తర్వాత నలుగు పెట్టేటప్పుడు.. అది ఆగిపోయేలా అప్పు, కళ్యాణ్ ప్లాన్ చేస్తారు. అలా ప్రతీ దాంట్లో యామిని ఫెయిల్ అయ్యేలా ఇందిరాదేవి, అపర్ణ, అప్పు, కళ్యాణ్ సెట్ చేస్తారు. తరువాయి భాగంలో తనని పెళ్లి చేసుకోకపోతే చనిపోతానని యామిని బెదిరించిందని.. అందుకే పెళ్ళికి ఒప్పుకున్నానని రాజ్ అంటాడు. అలా కాదు మీకు ఎవరైనా నచ్చితే అప్పుడు చేసుకోవాలని కావ్య అనగానే.. కావ్య చెయ్ పట్టుకుంటాడు రాజ్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : జ్యోత్స్నని బెదిరించిన కార్తీక్.. బర్త్ డే కేక్ పై ఇద్దరి పేర్లు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -382 లో.. దీపని కార్తీక్ నిద్ర నుండి లేపి కేక్ తో సర్ ప్రైజ్ చేస్తాడు. దీప కేక్ కట్ చేసి కార్తీక్ కి తినిపిస్తుంది. మరుసటి రోజు జ్యోత్స్న రెడీ అవుతుంది. పదా కింద మీ అమ్మ వాళ్ళు వెయిట్ చేస్తున్నారని పారిజాతం వస్తుంది. అలా కొద్దీ సేపు వెయిట్ చేయనివ్వు.. అప్పుడే వాళ్ళకి నా విలువ తెలుస్తుందని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత దీప జ్యోత్స్న బర్త్ డే కోసం డెకరేషన్ చేస్తుంది. వెళ్లి సుమిత్ర అత్తయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకోమని కార్తీక్ అనగానే దీప వెళ్లి ఆశీర్వాదం తీసుకుందామని వెళ్తుంటే సుమిత్ర వెనక్కి వెళ్తుంది. దాంతో దీప బాధపడుతుంది. అప్పుడే జ్యోత్స్న, పారిజాతం ఎంట్రీ ఇస్తారు. అమ్మ నాన్న నిన్న మిమ్మల్ని బాధపెట్టాను.. దీప నీకు కూడా సారీ అని జ్యోత్స్న అనగానే అబ్బా ఏం నటిస్తున్నావని కార్తీక్ అనుకుంటాడు. ఇప్పుడు దీప నేను కేక్ కట్ చేస్తామని జ్యోత్స్న బలవంతంగా దీపని తీసుకొని వెళ్తుంటే పారిజాతం పక్క నుండి కేక్ కింద పడేస్తుంది. అది చూసి దీప పడేసిందని అందరు దీపపై కోప్పడతారు. ఇష్టం లేకపోతే సైలెంట్ గా ఉండాలి కానీ ఇలా చెయ్యడం ఏంటి దీప అని పారిజాతం కోప్పడుతుంది. నాకు ఈ బర్త్డే సెలెబ్రేషన్స్ చేసుకోవడం ఇష్టం లేదని జ్యోత్స్న పైకి వెళ్తుంది.ఇప్పుడు ఏం అంటావ్ రా అని కార్తీక్ తో సుమిత్ర అంటుంది. నేను వెళ్లి జ్యోత్స్న ని తీసుకొని వస్తానని జ్యోత్స్న దగ్గరికి వెళ్తాడు కార్తీక్. పారిజాతం కేక్ కింద పడేసిన వీడియోని జ్యోత్స్నకి చూపిస్తాడు. ఇప్పుడు నువ్వు కిందకి రాకుంటే ఈ వీడియో చూపిస్తానని కార్తీక్ అనగానే జ్యోత్స్న వద్దని భయపడి కిందకి వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు కేక్ లేదు కదా అని పారిజాతం అనగానే.. కార్తీక్ చిటికె వెయ్యగానే డెలివరీ బాయ్ కేక్ తీసుకొని వస్తాడు. కేక్ పై జ్యోత్స్న, దీప అని రాసి ఉంటుంది. అది చూసి జ్యోత్స్న షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu: ముగ్గురు కొడుకులని హానీమూన్ కి వెళ్ళమన్న రామరాజు.. కోడళ్ళు ఏం చేశారంటే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు '(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -183 లో......చందు శ్రీవల్లీలని హానిమూన్ కి వెళ్ళమని చెప్పి రామరాజు వెళ్లిపోతుంటే.. రామరాజుని ఆపుతుంది వేదవతి. అదేంటీ ముగ్గురు కొడుకు కోడళ్ళని సమానంగా చూడాలి.. అది మన బాధ్యత అంతే కానీ ఇలా చెయ్యడం ఏంటని వేదవతి కోప్పడుతుంది. మరొకవైపు మమ్మల్ని హనీమూన్ వెళ్లామన్నారని శ్రీవల్లి డాన్స్ చేస్తుంటుంది. అప్పుడే రామరాజు ఇంట్లోకి వచ్చి అందరిని పిలుస్తాడు. రేయ్ నడిపోడా నువ్వు మిల్ కి నాలుగు రోజులు రాకపోయిన పర్వాలేదు.. చిన్నోడా నువు డ్యూటీకి రెండు రోజులు వెళ్ళకున్నా పర్వాలేదా అని రామరాజు అడుగుతాడు. పర్వాలేదు అని వాళ్ళు చెప్పగానే అయితే మూడు జంటలు హనీమూన్ కి వెళ్ళండి అని రామరాజు చెప్పగానే అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఆ శ్రీవల్లితో వెళ్తే మనం కంఫర్ట్ గా ఉండమని ప్రేమ, నర్మద అనుకుంటారు. మావయ్య నాకు వీలు అవ్వదని ప్రేమ నర్మద చెప్తారు. వెళ్ళండి అని వేదవతి అంటుంది. వెళ్ళమని వాళ్లంటారు. దాంతో రామరాజు కోపంగా.. వెళ్తే మూడు జంటలు వెళ్ళండి, లేదంటే లేదని రామరాజు అంటాడు. మీరు కావాలని చేశారు కదా అని శ్రీవల్లి అనగానే అవునని ప్రేమ, నర్మద అంటారు. ఆ తర్వాత ధీరజ్ వెళ్తుంటే.. నాకు అల్ ది బెస్ట్ చెప్పు అని ప్రేమ అంటుంది. ఎందుకని ధీరజ్ అంటుంటాడు. అయిన దానికి రీజన్ చెప్పదు. ప్రేమ పరిగెడుతుంటే ధీరజ్ తన వెనకాలే పరిగెడుతాడు. తనని పట్టుకుంటాడు. అప్పుడే తిరుపతి చుసాడని ప్రేమ సిగ్గుపడుతుంది. తరువాయి భాగంలో ప్రేమ పిల్లలకి డాన్స్ నేర్పిస్తుంది. అక్కడికి ధీరజ్ ఫుడ్ తీసుకొని వస్తాడు. నర్మద చూసి ప్రేమకి చెప్తుంది. ప్రేమ లోపల దాక్కుంటుంది. అదే సమయంలో ప్రేమని అద్దంలో నుండి చూస్తాడు ధీరజ్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

నాకు ఊపిరి ఉన్నన్నాళ్ళు వాడు బాగుండాలి..విశ్వ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న ఇంద్రజ

శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వారం ఎపిసోడ్ కొత్తగా ఫాదర్స్ డే స్పెషల్ గా "డియర్ డాడీ" పేరుతో   రాబోతోంది. ఈ షోకి గెస్ట్ గా 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి వచ్చాడు. ఇక పిల్లలంతా వచ్చి సమ్మర్ హాలిడేస్ ఐపోతున్నాయిగా ఫాథర్స్ ని కూల్ చేయాలంటే ఫాదర్స్ డే చేద్దాం అంటూ ఆడిపాడారు పిల్లలంతా. ఇందులో అంజలి పవన్ వాళ్ళ పాప చందమామ అలాగే విశ్వ వాళ్ళ అబ్బాయి ర్యాన్ ఇద్దరూ డ్రాయింగ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేశారు. అందులో చందమామ పెయింట్స్ సరిగా వేయకపోయేసరికి ర్యాన్ ఐతే "చందమామ నువ్వు విన్ ఐతే నేను కూడా విన్ ఐనట్టే..మేమిద్దరం విన్నర్స్" అంటూ రష్మీకి చాలా క్లియర్ గా చెప్పాడు. ఇక తర్వాత రాఘవ వాళ్ళ అబ్బాయి డంబెల్స్ పట్టుకుని వచ్చాడు. "ఇక్కడున్న ఫాదర్స్ అందరికీ రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో ఫస్ట్" అన్నాడు. "మీరేమన్నా నేషనల్ ఫాదర్సా లేదంటే చర్చ్ ఫాదర్సా రెస్పెక్ట్ ఇవ్వడానికి" అన్నాడు అంతే రాఘవ షాకయ్యాడు. ఇక తర్వాత "నాన్నెందుకో వెనకబడ్డాడు" అంటూ ఒక స్కిట్ ని ప్లే చేశారు. అందులో విశ్వ ఒక ముసలాయన గెటప్ లో వచ్చి తండ్రి పడే కష్టాలను కళ్ళకు కట్టినట్టు చూపించాడు. దాంతో ఇంద్రజ కన్నీళ్లు పెట్టుకుంది. ఫైనల్ లో "నాకు ఊపిరి ఉన్నన్నాళ్ళు ఎక్కడ ఉన్నా బాగుండాలి... వాడు నాతోనే ఉండాలి" అంటూ తన కుమారుడు ర్యాన్ గురించి చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తండ్రి అలా కన్నీళ్లు పెట్టుకొనేసరికి ర్యాన్ కూడా వచ్చి విశ్వ కన్నీళ్లు తుడిచాడు.

నన్ను తట్టుకునేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ?.. యాంకర్ రష్మీ

జబర్దస్త్ ఇక కొత్త ఎంటర్టైన్మెంట్ తో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ న్యూ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. కృష్ణ భగవాన్, ఖుష్బూ ఇద్దరూ కూడా కొత్తగా కనిపించబోతున్నారు. న్యూ చాప్టర్ బిగిన్స్ అంటూ ఈ షో కొత్తగా రాబోతోందన్న విషయం తెలుస్తోంది. "ఇక నుంచి జబర్దస్త్ కొత్తగా ఉండబోతోంది..ఎనర్జీ డబుల్, ఎంటర్టైన్మెంట్ డబుల్. ఎవ్రిథింగ్ డబుల్ " అంటూ ఖుష్బూ మంచి ఎలివేషన్ ఇచ్చింది. "ఇప్పటి వరకు జబర్దస్త్ ఆడియన్స్ లో ఉంది. ఇప్పుడు జబర్దస్త్ లో ఆడియన్స్ ఉన్నారు" అంటూ కృష్ణ భగవాన్ చెప్పారు.  "అన్ని డబులా" అని రష్మీ అనుమానంతో అడిగేసరికి "అన్ని డబుల్ ఐతే యాంకర్ కూడా డబుల్ అవ్వాలిగా" అంది జడ్జ్ ఖుష్బూ. " నన్ను తట్టుకునేవాళ్ళు ఎవరైనా ఉన్నారా" అని రష్మీ అడిగింది. ఐతే ప్రోమో లాస్ట్ లో కొత్త జెంట్ యాంకర్ ని సైడ్ లుక్ లో చూపించారు. ఐతే ఆ కొత్త యాంకర్ సుధీర్ ఆ, మానస్ ఆ అన్నది చూపించలేదు. ఐతే నెటిజన్స్ మాత్రం కొంతమంది సుధీర్ అంటుంటే కొందరు మానస్ అంటూ మెసేజెస్ చేస్తున్నారు. ఐతే ఈ సీరియల్స్ టైమింగ్స్ ని మాత్రం మార్చలేదు. ఇక రష్మీకి జోడీ ఉండే కో-యాంకర్ ఎవరు అన్నది ఈ శుక్రవారం షోలో తెలిసిపోతుంది. మానస్ కళ్ళజోడు తీసి పెట్టే మ్యానరిజంతో సుధీర్ అన్న ఈజ్ బ్యాక్ అంటున్నారు ఫాన్స్. ఇక జడ్జ్ గా శివాజీ వెళ్లిపోవడంతో ఈ కామెడీ షోకి జడ్జ్ గా కృష్ణ భగవాన్ గారే కరెక్ట్ అంటూ కూడా మెసేజ్ పెడుతున్నారు నెటిజన్స్.

Karthika Deepam2 : దీపకి సర్ ప్రైజ్ ప్లాన్ చేసిన కార్తీక్.. జ్యోత్స్న ఎత్తుగడ అదేనా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -381 లో.... శౌర్యకి సుమిత్ర తన చిన్నపటి వస్తువులు ఇచ్చినందుకు రాద్దాంతం చేస్తుంది. దాంతో జ్యోత్స్నపై సుమిత్ర, దశరథ్ కోప్పడతారు. ఈ వస్తువులు నాకు అవసరం లేదని జ్యోత్స్న విసిరేస్తుంటే.. నాకు అవసరమంటు ఆ వస్తువులు అన్నింటిని కార్తీక్ తీసుకొని వెళ్తాడు. వాళ్లలో ఏదో మార్పు కన్పిస్తుంది.. కార్తీక్ మాటలు తేడా ఉన్నాయ్.. దీప అయితే మనిషే మారిపోయిందని జ్యోత్స్నతో పారిజాతం అంటుంది. అసలు సుమిత్ర, దశరథ్ లతో నువ్వు ప్రేమగా నడుచుకోవాలి.. అప్పుడే నువ్వు చెప్పింది వాళ్ళు వింటారని జ్యోత్స్నతో పారిజాతం చెప్తుంది. ఆ తర్వాత ఎందుకురా అక్కడికి రమ్మన్నావని కాంచన అడుగుతుంది. నీ కోసం.. ఇంకా దీప కోసం.. ఆ ఇల్లు నీకు పుట్టిల్లు.. అదెప్పుడు దూరం కాకూడదు.. అందుకే దగ్గర చేసే ప్రయత్నం అని కార్తీక్ అంటాడు. మరీ దీప కోసం అన్నావని కాంచన అనగానే.. తనకి కూడా పుట్టిళ్లే కదా అని కార్తీక్ అనగానే అందరు షాక్ అవుతారు. అంటే దీప ఇక్కడికి వచ్చాక అక్కడ ఉంది కదా అని కార్తీక్ కవర్ చేస్తాడు. ఎప్పటిలాగే అందరం కలిసి ఉండాలని కార్తీక్ అంటాడు.  ఆ తర్వాత దీప నిద్రపోతుంటే కార్తీక్ వచ్చి.. అనసూయ గారు వెళ్లిపోతున్నారంటూ బయటకు తీసుకొని వస్తాడు. తీరాచూస్తే బెలూన్ డెకరేషన్ కేక్ ఉంటుంది. కార్తీక్ సర్ ప్రైజ్ గా ప్లాన్ చేస్తాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకని దీప అంటుంది. కానీ నాకు సంతోషమని కార్తీక్ అంటాడు. దీప కేక్ కట్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi: యామినికి షాక్.. కావ్య ప్లాన్ ఏంటంటే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -745 లో... ఎందుకు వాళ్ళని పెళ్లికి పిలిచావని వైదేహి యామినిని తిడుతుంది. కానీ అవేం యామిని పట్టించుకోకుండా మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తుంది. ఆ తర్వాత ఎందుకు యామినితో నా కుటుంబాన్ని తీసుకొని వస్తానని చెప్పావ్.. ఏదైనా ప్లాన్ చేసావా అని ఇందిరాదేవి అడుగుతుంది. ఏం లేదు నాకు ఆ దేవుడిపై నమ్మకం ఉందని కావ్య అంటుంది. ఆ తర్వాత ఆ పెళ్లిని మనం ఆపాలంటే యామిని మనిషి ఎవరో ఒకరు మనకి తెలిసి ఉండాలని ఇందిరాదేవి అంటుంది. మరొకవైపు పెళ్లి జరిపించడానికి పంతులు కావాలని యామిని వైదేహి పంతులు దగ్గరికి వచ్చి మాట్లాడతారు. ఆ తర్వాత కావ్యకి రాజ్ ఫోన్ చేస్తాడు. ఈ టైమ్ కి ఫోన్ చేసారేంటి.. ఇలా చెయ్యడం కరెక్ట్ కాదు.. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారని కావ్య ఫోన్ కట్ చేస్తుంది. ఇలా కాదు వెళ్లి నేనే డైరెక్ట్ కావ్యతో మాట్లాడుతానని కావ్య దగ్గరికి రాజ్ వెళ్తుంటే.. యామిని బావ నీకు ఒక సర్ ప్రైజ్ అని తన వెంట తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత మరుసటి రోజు అందరు పెళ్లికి రెడీ అవుతారు. ఈ రాహుల్, రుద్రాణి వస్తే.. మనం ఏం చేసిన అడ్డుపడతారని ఇందిరాదేవి అంటుంది. అందుకే వీళ్ళు రాకుండా నేను చూస్తానని స్వప్న అంటుంది. తరువాయి భాగంలో కావ్యని కలవాలని రాజ్ వెళ్తుంటే.. ఎక్కడికి అని యామిని అడుగుతుంది. అప్పుడే కావ్య ఫ్యామిలీతో ఎంట్రీ ఇస్తుంది. నేనే పిలిచానని రాజ్ తో యామిని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : కోడలి బుట్టలో పడ్డ రామరాజు.. శ్రీవల్లి, చందులకి బంపర్ ఆఫర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ 182 లో.. బావ మనకి కొత్తగా పెళ్లి అయింది. నాలుగు రోజులు ఎక్కడికైనా సరదాగా వెళదామా అని చందుతో శ్రీవల్లి అనగానే.. నాన్నని అడుగుతాను ఒప్పుకుంటే వెళదామని చందు అంటాడు. మరుసటి రోజు ఉదయం వేదవతి నిద్రలేచేసరికి ఎక్కడి పని అక్కడే ఉంటుంది. అప్పుడే నర్మద, ప్రేమ వస్తారు. శ్రీవల్లి కన్పించడం లేదు.. ఎక్కడ అని వేదవతి అనగానే నర్మద మాకేం తెలుసని వెటకారంగా మాట్లాడుతుంది. శ్రీవల్లి దగ్గరికి వేదవతి వెళ్ళగానే జ్వరం వచ్చినట్లు యాక్టింగ్ చేస్తుంది. శ్రీవల్లి యాక్టింగ్ చేస్తున్న విషయం నర్మద ప్రేమకి అర్థమై తనని అటపట్టిస్తారు. నన్నే ఆటపట్టిస్తారా మీ సంగతి చెప్తానని శ్రీవల్లి అనుకుంటుంది. ఆ తర్వాత రామరాజు ముందు కావాలనే శ్రీవల్లి ఫోన్ మాట్లాడినట్లు యాక్టింగ్ చేస్తూ.. అమ్మా మావయ్య గారిని నేను అడగలేను అంటూ ఫోన్ కట్ చేస్తుంది. ఏమైందని రామరాజు అడుగుతాడు. అంటే మా పక్కింటి వాళ్ళకి పెళ్లి అయి హనీమూన్ వెళ్లారట.. మీరు ఇంకా వెళ్లలేదా నేను పంపిస్తాను వెళ్ళండి అంటుంది. మావయ్య గారికి తెలియదా.. నువ్వు పంపించడం ఏంటని కోప్పడి ఫోన్ కట్ చేసానని శ్రీవల్లి అంటుంది. ఆ తర్వాత చందుని రామరాజు పిలిచి.. మీరు నాలుగు రోజులు ఎటైనా వెళ్ళిరండి అని రామరాజు చెప్తాడు. శ్రీవల్లి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదంతా అందరు చూస్తుంటారు. రామరాజు వెళ్తుంటే వేదవతి ఆపి ఇంట్లో పెళ్ళైన జంటలు ఉన్నాయ్.. వాళ్లని కూడా వెళ్ళమని చెప్పకుండా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని రామరాజుతో వేదవతి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu: ఆ పది లక్షల మ్యాటర్ పక్కన పెట్టి శోభనం కానియ్.. శ్రీవల్లికి ప్లాన్ చెప్పిన భాగ్యం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu)'.  ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-181లో.. శ్రీవల్లి తల్లి భాగ్యం పడుకుంటుంది. అప్పుడే తన భర్త భాగ్యం దగ్గరికి వస్తాడు. బయట దోమలు కుడుతున్నాయి లోపలికి రావే అని తన మీద చేయి వేసి ప్రేమగా పిలుస్తాడు. కానీ భాగ్యం మాత్రం కసురుకొని తిట్టేసి పంపించేస్తుంది. కాసేపటికి భాగ్యానికి శ్రీవల్లి ఫోన్ చేస్తుంది. ఏమైందే.. నిద్ర పట్టడం లేదా అని శ్రీవల్లిని భాగ్యం అడుగుతుంది. నువ్వు చేసిన పనికి నిద్ర ఎక్కడ పడుతుంది.. మీ అల్లుడు వెళ్లి వాళ్ల తమ్ముళ్ల పక్కన పడుకున్నాడు. వాళ్లతో ఆ పది లక్షల మ్యాటర్ చెప్పేయబోతుంటే బ్రేక్ వేశాను కానీ.. ఇప్పుడు అక్కడే ఉన్నాడు. చెప్పేస్తాడేమోనని భయంగా ఉందే అమ్మా.. ఇక్కడ కొంపలు అంటుకునేట్టుగా ఉన్నాయని శ్రీవల్లి అంటుంది. ఏంటీ తమ్ముళ్ల దగ్గర పడుకుంటున్నాడా.. పెళ్లై ఇన్నేళ్లు అవుతున్నా నా మొగుడు నా కొంగు పట్టుకునే తిరుగుతాడు.. మరి నీ మొగుడు బయటపడుకోవడం ఏంటే.. ఇంతకీ మీరిద్దరూ బాగానే ఉన్నారు కదా.. రేపటి నుంచి బయటకు వెళ్లనీయకని భాగ్యం అంటుంది. ఇక నర్మద, సాగర్‌లు హైదరాబాద్‌లో ఒక్కటైన విషయాన్ని భాగ్యానికి శ్రీవల్లి చెప్పేస్తుంది. ఆ నర్మద చాలా ఫాస్ట్.. ముందు దాని కడుపున కాయ కాచిందనుకో దాని పెత్తనం ఎక్కువైపోతుంది.. మీ చెల్లి హనీమూన్ గురించి చెప్పింది కదా.. అల్లుడు గార్ని ప్లానింగ్‌లో పెట్టు.. ఆ పది లక్షల మ్యాటర్ తరువాత చూద్దాం.. ముందు అల్లుడుతో మ్యాటర్ చూడు అని భాగ్యం అంటుంది. సరేనని శ్రీవల్లి చెప్తుంది. ఇక తెల్లారినా చందు ఇంట్లోకి రాకపోయేసరికి శ్రీవల్లి గదిలో వేచి చూస్తుంది. లోపలికి రానియ్ చెప్తానంటూ చందు రాగానే జ్వరం వచ్చినట్టు డ్రామా ఆడుతుంది శ్రీవల్లి. నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయావ్.. మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను.. ఆ దిగులుతో ఆ బాధతో దెబ్బకి జ్వరం వచ్చేసిందంటూ పెద్దోడి భుజంపై వాలిపోయి తెగ నటించేస్తుంది. ఇక తరువాయి భాగంలో.. శ్రీవల్లి తన డ్రామాను కంటిన్యూ చేస్తుంది. మెల్లగా ముగ్గులోకి లాగి.. తమ్ముళ్లకి దూరం చేసే ప్రయత్నం చేస్తుంది శ్రీవల్లి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : కార్తీక్, దీపల ప్లాన్ ని ఊహించి‌న జ్యోత్స్న.. తల్లిని కోప్పడిన కూతురు!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -380 లో.... శౌర్యని తన గదిలోకి తీసుకొని వెళ్తుంది సుమిత్ర. ఇదిగో ఇవన్ని జ్యోత్స్న చిన్నప్పటి డ్రెస్ లు బొమ్మలు అని చూపిస్తుంది. అవి చూసి శౌర్యా మురిసిపోతుంది. జ్యోత్స్న ఫ్రాక్ శౌర్య వేసుకుంటుంది. నాకు బొమ్మలు కావాలంటూ సుమిత్రని అడిగి తీసుకుంటుంది శౌర్య. తీసుకోమని వాళ్ళు చెప్తారు. ఇవన్నీ అమ్మకి చూపిస్తానని శౌర్య వెళ్ళిపోతుంది. పారిజాతం చెత్త ఏరుకొనే గెటప్ తో తమ ఇంటికి వచ్చినట్లు అనసూయ గుర్తుపడుతుంది. మరొకవైపు దీప గురించి జ్యోత్స్న, పారిజాతం మాట్లాడుకుంటారు. వీళ్ళు అందరు పెద్ద ప్లాన్ లోనే ఉన్నారని జ్యోత్స్నతో అంటుంది పారిజాతం. జ్యోత్స్న ఏదో మాట్లాడడానికి వస్తుంటే శౌర్య బొమ్మతో ఆడుతూ వస్తుంది. జ్యోత్స్నకి తగులుతుంది. ఏంటి ఆ బొమ్మలు.. అవి నావి ఈ డ్రెస్ కూడా నాదే ఎవరిచ్చారని జ్యోత్స్న కోప్పడుతుంది. ఆ తర్వాత శివన్నారాయణ దగ్గరికి కాంచన వస్తుంది కానీ శివన్నారాయణ కాంచన బాధపడేలా మాట్లాడతాడు. నా బొమ్మలు డ్రెస్ ఎందుకు శౌర్యకి ఇచ్చావని  సుమిత్రతో జ్యోత్స్న గొడవ పడుతుంది. తప్పేముంది ఇప్పుడు అవేవి నీకు అవసరం లేదు కదా అని సుమిత్ర దశరథ్ లు అంటారు. అయితే నా జ్ఞాపకాలు మీ దగ్గర వద్దని జ్యోత్స్న బొమ్మలు విసిరేస్తుంటే.. అవి అత్త మావయ్యల జ్ఞాపకాలు అంటూ కార్తీక్ వాటిని తీసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : ఆమెను పెళ్ళికి ఎందుకు పిలిచావ్.. యామినిపై వైదేహీ సీరియస్!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -744 లో..... రాజ్ పెళ్లికి రెడీ అయిన విషయం కావ్యకి చెప్పడానికి అపర్ణ, ఇందిరాదేవి వస్తారు. వాళ్ళు వచ్చేసరికి కావ్య ఐస్ క్రీమ్ తింటూ ఉంటుంది. ఏం పట్టనట్లు అలా ఎలా ఉంటున్నావేంటని ఇందిరాదేవి అంటుంది. కిచెన్ లో ఇంకొక ఐస్ క్రీమ్ ఉందంటూ కావ్య వెళ్తుంటే వాళ్ళకి ఇంకా కోపం వస్తుంది. ఆ తర్వాత రాజ్ దగ్గరికి వైదేహి, యామిని వచ్చి డ్రెస్ చూపించి సెలక్ట్ చేసుకోమని చెప్తారు. కాసేపటికి కావ్యకి యామిని ఫోన్ చేసి‌.. ఎల్లుండి నాకు రాజ్ కి పెళ్లి అని చెప్తుంది. నాకు బయపడి చాటుగా పెళ్లి చేసుకుంటున్నావా అని కావ్య అనగానే నీకు భయపడడమేంటి అందరి ముందు గ్రాంఢ్ గా పెళ్లి చేసుకుంటానని యామిని అంటుంది. ఆ తర్వాత స్వప్న నగలన్ని ప్యాక్ చేస్తుంటే రాహుల్ వస్తాడు. ఇప్పుడు నగలు ఎందుకు ఇలా చేస్తున్నావని రాహుల్ అడుగగా బ్యాంకు లో పెట్టడానికి అని స్వప్న అంటుంది. ఇప్పుడు బ్యాంకులో పెడితే ఇవి గిల్టీ నగలు అని తెలిసి పోతుందని రాహుల్ అనుకుంటాడు. ఇప్పుడు ఫంక్షన్లు ఉన్నాయ్ కదా ఎందుకు ఇప్పుడు బ్యాంకు లో అని రాహుల్ అనగానే అవును కదా అని స్వప్న అంటుంది. మరుసటిరోజు యామిని, వైదేహి వెడ్డింగ్ కార్డ్ పట్టుకొని కావ్య ఇంటికి వస్తారు. అందరూ పెళ్లికి రండీ అని యామిని అనగానే అందరం వస్తామని కావ్య చెప్తుంది. ఆ తర్వాత ఇప్పుడు ఎందుకు కావ్యని ఎందుకు పిలిచావని యామినిపై వైదేహీ కోప్పడుతుంది. తరువాయి భాగంలో కావ్య దగ్గరికి రాజ్ వెళ్ళబోతుంటే కావ్య వాల్లే పెళ్లి కి వస్తారు. వాళ్ళని చూసి రాజ్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.