హాస్పిటల్ బెడ్ మీద సుప్రీత.. అది నిజమే!

  బుల్లితెర మీద హల్చల్ చేస్తున్న సుప్రీతా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈమె ఎవరో కాదు నటి సురేఖావాణి కూతురు. రీసెంట్ గా సుప్రీతా చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే షోలో యాదమ్మ రాజుకి జోడిగా వచ్చి వంటలు చేసింది. త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. మరో మూడు మూవీస్ లో కనిపించబోతోంది. ఇక ఇన్స్టాగ్రామ్ లో ఐతే చెప్పక్కర్లేదు. హాట్ పిక్స్ తో కుర్రాళ్ళ మనసులు దోచుకుంటూ ఉంటుంది. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో అప్ డేట్స్ పెడుతూనే ఉంటుంది. ఎవరు ఎలా ట్రోల్ చేసినా సుప్రీతా పెద్దగా పట్టించుకోదు. తల్లి సురేఖతో కలిసి ట్రిప్స్ వెళ్తూ ఆ పిక్స్ ని పోస్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి రీసెంట్ గా మామిడికాయ పచ్చడి కూడా పెట్టి ఆ వీడియోని కూడా పోస్ట్ చేసింది.    అలాంటి సుప్రీతా ఇప్పుడు సడెన్ గా హాస్పిటల్ లో బెడ్ మీద కనిపించింది. చేతికి సెలైన్ ఎక్కించుకుంటూ ఉంది. హాస్పిటల్ పిక్స్ చూసిన నెటిజన్స్ ఏమయ్యింది అంటున్నారు ..టేక్ కేర్, జాగ్రత్తగా ఉండు, స్పీడీ రికవరీ అంటూ చెప్తున్నారు. ఇక సన కూడా కామెంట్ పెట్టింది. గెట్ వెల్ సూన్, లాట్స్ ఆఫ్ లవ్.. అని చెప్పింది.      తన పిక్స్ తో పాటు ఒక కామెంట్ కూడా పోస్ట్ చేసింది. "ద్రుష్టి నిజమే. ఈ వారం నేను నా జీవితంలో ఎలా బలంగా ఉండాలో ఆలోచిస్తూ ఉన్నాను. నేను శివయ్యను నమ్ముతాను.. కానీ ఆయనకు నా మీద బాగా కోపం వచ్చినట్టుగా ఉంది. ఐనా నా జీవితంలో శివయ్య, మా అమ్మ, ప్రసన్న, రమణ. నా జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తి.. వీళ్ళు లేకుండా నేను లేను. ఈ భూమి మీద ఉన్న నాకు ఈ జీవితం ఎన్నో పరీక్షలు పెడుతూనే ఉంది. ఈ ద్రుష్టి కారణంగా నా మానసిక, శారీరక ఆరోగ్యం బాగా ఎఫెక్ట్ అయ్యింది. శారీరక ఆరోగ్యం బాగుండాలి అంటే ముందుగా మానసిక ఆరోగ్యం చాలా బాగుండాలి." అంటూ రాసుకొచ్చింది.    అమరదీప్ తో సుప్రీతా ఒక లవ్ ఎంటర్టైనర్ మూవీలో నటిస్తోంది. రీసెంట్ గానే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ మీద సారీ చెప్తూ ఒక వీడియో కూడా చేసింది.  

నేను ఆమెను వేస్ట్ ఫెలో అంటాను.. ఆమె నన్ను హనీ అంటుంది!

  బుల్లితెర మీద ఇమ్మానుయేల్ కి ఒక స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. జబర్దస్త్ లో మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. బుల్లితెర మీద రష్మీ-సుడిగాలి సుధీర్ జోడి ఎలా ఐతే ఆన్ స్క్రీన్ పెయిర్ గా మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారో ఇమ్మానుయేల్ - వర్ష కూడా అలాంటి ఒక ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నారు. మొదట్లో వచ్చిన షోస్ లో వీళ్ళిద్దరినీ చూస్తే గనక వర్ష ఐతే ఇమ్మును నిజంగా లవ్ చేస్తోందా అన్న ఫీల్ కలిగేది. అలాగే కోడలొస్తోంది అని మీ ఇంట్లో చెప్పు ఇమ్ము అని వర్ష అంటే అల్లుడొస్తున్నాడని మీ ఇంట్లో చెప్పు వర్ష అనుకునేవాళ్లు. ఐతే వీళ్ళు నిజంగా పెళ్లి చేసేసుకుంటారేమో అని కూడా అనుకున్నారు ఆడియన్స్. కట్ చేస్తే జబర్దస్త్ లో ఇమ్ము కంటెస్టెంట్ నుంచి టీమ్ లీడర్ అయ్యాడు. ఆ తర్వాత అక్కడి నుంచి స్టార్ మాకి వచ్చి సెటిల్ అయ్యాడు. ఇక్కడ షోస్ లో కనిపిస్తున్నాడు. ఇప్పుడు కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఈ వారం లవ్ థీమ్ లో తన లవ్ స్టోరీ చెప్పాడు.    "నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది..త్వరలో మేము పెళ్లి చేసుకోబోతున్నాం. ఇప్పుడు డాక్టర్ చదువుతోంది. మిడిల్ క్లాస్ ఫామిలీ. చాలా కష్టపడి చదివి స్కాలర్ షిప్స్ తెచ్చుకుని డాక్టర్ వరకు వచ్చింది. ఆమె కష్టపడిన గుణం నచ్చి నేను వెళ్లి నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పాను. ఆమె కూడా ఒప్పుకుంది. ఆమె ఒప్పుకున్న రెండు రోజులకే మా ఇంట్లో ఆమెను పరిచయం చేసాను. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. నీకు పిల్ల దొరకడమే ఎక్కువ అని అన్నారు. ఆమె నా షోస్ అన్ని చూస్తుంది. ఆమె చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తుంది. నేను ఆమె పేరు చెప్పను కానీ ముద్దుగా వేస్ట్ ఫెలో అని పిలుస్తాను..ఆమె నన్ను హనీ అని నాన్న అని పిలుస్తుంది. వేస్ట్ అమ్మ ఐ లవ్ యు..నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తావ్...ఏ తప్పు చేసినా నన్ను భరిస్తావ్. నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చావ్. థ్యాంక్యూ సో మచ్  " అని చెప్పాడు ఇమ్మానుయేల్.  

పెళ్ళాం చెబితే వినాలి..

  చాలా కుటుంబాల్లో భార్యభర్తలు ఒకరికి ఒకరు ఎప్పుడూ సలహాలు ఇచ్చుకోరు. అందులోనూ భార్యల మాటల్ని కానీ సలహాలను కానీ భర్తలు పట్టించుకోరు. కానీ ఎప్పుడైతే ఒకరి సలహాలు మరొకరు విని ఆచితూచి అడుగు వేస్తారో వాళ్ళు లైఫ్ లో పెద్దగా నష్టపోరు...ఇప్పుడు ఆది రెడ్డి కూడా అదే చెప్పాడు. బెట్టింగ్ యాప్స్ విషయంలో ఇప్పుడు ఆది రెడ్డికి, నా అన్వేషణకి మధ్య  కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ టైములో ఆది ఈ వీడియోని పోస్ట్ చేసాడు.    "నా పెళ్ళై ఐదేళ్లు అయ్యింది. ఈ టైంలో ఆది ఇది చేయొద్దు...నీకు నెగటివ్ అవ్వొచ్చు..లాస్ రావొచ్చు...అని చెప్పేది. కానీ నేను ఆమె మాట వినలేదు. దాంతో లాస్ వచ్చింది. దాంతో నేను కొన్ని నెలల క్రితం నేను ఒకటి డిసైడ్ అయ్యాను. భార్య మాట వినాలి ఎందుకంటే మనం టెన్షన్స్ లో డెసిషన్స్ తీసేసుకుంటాం కానీ భార్య మాత్రం భర్త చెడును కోరుకోదు. అందుకే ఆలోచించి భర్త బాగుండాలని కోరుకుంటూ సలహాలు ఇస్తే మనం మాత్రం అన్నీ మనకే తెలుసులే అని లైట్ తీసుకుంటాం. ఆ తరువాత దెబ్బ పడినప్పుడు, లాస్ వచ్చినప్పుడు, నెగటివ్ ఐనప్పుడు అర్ధమవుతుంది. కాబట్టి భార్యల మాటలు వింటే కచ్చితంగా మంచే జరుగుద్ది..అలాగే నా వైఫ్ చెప్పింది ఒక్కటే ఎవరో ఏదో అన్నారని రియాక్ట్ అవ్వొద్దు...ఏదైనా ఉంటే లీగల్ గా వెళ్ళు అని చెప్పింది ఇప్పుడు అదే చేస్తున్నా. నేను ఎప్పుడూ చట్టవిరుద్ధమైన యాప్స్ ని, బెట్టింగ్ యాప్స్ ని  ప్రమోట్ చేయలేదు ..ఇక ముందు కూడా చేయను." అని  చెప్పాడు ఆది రెడ్డి.    అలాగే టెలిగ్రామ్ యాప్ లో తన పేరుతో బెట్టింగ్ యాప్స్ నడుస్తున్నాయని దానికి తనకి ఎలాంటి సంబంధం లేదు అంటూ లోకల్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కూడా ఇచ్చినట్లు తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసాడు ఆది రెడ్డి.  

నేను రెడీ..పెళ్ళెప్పుడు ప్రియాంక..!

  కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ ఈ శనివారం ఎపిసోడ్ లో శివ్-పరి లవ్ థీమ్ కి కంటెస్టెంట్స్ అంతా ఫిదా ఇపోయారు. శ్రీముఖి వాళ్ళ మధ్య ఏ క్వాలిటీస్ ఎవరు మార్చుకోవాలి లాంటి ప్రశ్నలు అడిగింది.    "శివ్ హడావిడి ఎక్కువ చేస్తాడు అది తగ్గించుకుంటే అంతా బాగుంటుంది" అని చెప్పింది ప్రియాంక జైన్. శివ్ చెప్తూ "అవును హడావిడి చేయడం తగ్గించి స్మూత్ గా ఉండడానికి ట్రై చేస్తాను. ప్రియాంకలో మార్చుకోవాల్సినవి ఏమీ లేవు. ఆవిడలో అన్ని విషయాలు నచ్చే ఆమెను ప్రేమిస్తున్నాను. మంచి సర్ప్రైజ్ ఇచ్చి ప్రపోజ్ చేద్దామనుకున్నా కానీ అవ్వలేదు. ఫ్యూచర్ లో అలా చేస్తాను. మొదట్లో బాగా మాట్లాడేవాడివి. టీవీ చూస్తూన్న కట్టేసి మాట్లాడేవాడివి.. అందరి అబ్బాయిల్లానే నువ్వు కూడా అంది. దానికి రియల్లీ సారీ. ఐతే ఈసారి పరి నువ్వే నాకు సారీ చెప్పాలి. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు చాలాసార్లు అడిగావు పెళ్ళెప్పుడు, బయటకు వచ్చాక చేసుకుందామా అని. ఇప్పుడు ఆడియన్స్ ముందు అడుగుతున్నా..మన పెళ్లి ఎప్పుడు..నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను." అన్నాడు శివ్. దానికి ప్రియాంక ఒక మాట చెప్పింది. "నీ ఫ్యామిలీ, నా ఫ్యామిలీ కలిసి ఒకే ఇంట్లో ఉన్నప్పుడు చేసుకుందాం ఒకేనా" అని చెప్పింది. అలా ఇద్దరూ లవ్ థీమ్ కాబట్టి ఐ లవ్ యు అని ఇద్దరూ చెప్పుకున్నారు.    శివ్ చెప్పిన మాటలకు ఖిలాడీ గర్ల్స్ అంతా ఫిదా ఇపోయారు. తేజస్విని మడివాడ ఐతే "అసలు నువ్వంటే ఇష్టం ఉండేది కాదు. ఈ రౌండ్ తర్వాత నాకు నీ మీద గౌరవం పెరిగింది" అంది. ఇక డెబ్జానీ ఐతే ఇలాంటి అబ్బాయి దొరికితే తనకు  ఒకే  అని చెప్పింది. ఇక శ్రీముఖి ఐతే ఇలాగే ప్రేమగా ఉండాలని కోరుకుంటున్నాం అంటూ విష్ చేసింది.  

Illu illalu pillalu :రూమ్ లో నర్మద కాళ్ళు నొక్కుతూ సాగర్.. ప్రేమ ట్యూషన్ కష్టాలు!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -161 లో... చందుకి శ్రీవల్లి లంచ్ తీసుకొని వెళ్తుంది. శ్రీవల్లి బాక్స్ తీసుకొని రావడంతో చందు హ్యాపీగా ఫీల్ అవుతాడు. నువు తిన్నావా అని చందు అనగానే మీరు తినకుండా నేనెలా తింటానని శ్రీవల్లి అనగానే ఇలాంటి భార్య దొరకడం చాలా అదృష్టమని చందు మురిసిపోతాడు.   ధీరజ్ ఫుడ్ డెలివరీ బాయ్ గా చేరి అందరికి ఫుడ్ డెలివరీ చేస్తుంటాడు. కొంతమంది డెలివరి లేట్ అయిందని కోప్పడుతుంటాడు. తనకి కోపం వచ్చినా కూడా ఏం అనలేకపోతాడు. తను అప్పుడు జీవితం అంటే ఏంటో రియలైజ్ అవుతాడు. మరొకవైపు తిరుపతి దగ్గరికి ప్రేమ వచ్చి తనతో కూల్ గా మాట్లాడుతుంది. అప్పుడే ధీరజ్ వస్తాడు. బాబాయ్ నీ ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళతో మాట్లాడి ట్యూషన్ కి వచ్చేలా చెయ్యమని తిరుపతిని ప్రేమ అడుగుతుంది. చూసావా అందుకే ప్రేమ నీతో ఇప్పటివరకు ఇలా మాట్లాడిందని ధీరజ్ అంటాడు.   మరొకవైపు నర్మద, సాగర్ ఇద్దరు రూమ్ కి చేరుకుంటారు. కాళ్ళు నొప్పిగా ఉన్నాయని నర్మద అనగానే సాగర్ కాళ్ళు నొక్కుతాడు. ఆ తర్వాత ఈ నర్మద వస్తువులు ఎక్కడ పెట్టిందో ఏమోనని ప్రేమతో అంటుంది వేదవతి. ఫోన్ చేసి అడగండి అని ప్రేమ అనగానే వేదవతి ఫోన్ చేసి నర్మదతో మాట్లాడుతుంది. తరువాయి భాగంలో ధీరజ్, నేను ట్యూషన్ స్టార్ట్ చేస్తున్నాం.. నాకు అల్ ది బెస్ట్ చెప్పమని ప్రేమ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam 2 : అవార్డు సొంతం చేసుకున్న కార్తీక్.. శివన్నారాయణ కోపం అందుకే!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -360 లో... పోలీసులతో జ్యోత్స్న, గౌతమ్ ఇద్దరిపై డౌట్ ఉందని  ఇంకొకరిని కనిపెట్టాలని కార్తీక్ చెప్తాడు. ఆ తర్వాత కార్తీక్ ఇంట్లోకి వచ్చాక వాళ్ళని జ్యోత్స్న దగ్గరికి వెళ్లకని చెప్పండి. త్వరగా రెండు కుటుంబాలు కలవాలని అనుకుంటే ఇంకా దూరం అవుతున్నారని దీప అంటుంది. ఇప్పుడు ఏమైనా కలిసి ఉన్నాయా విడిపోవడానికి అని కార్తీక్ అంటాడు.   ఆ తర్వాత పోలీసులు శివన్నారాయణ ఇంటికి వెళ్లి కార్తీక్ ఇంట్లో కత్తి దొరికింది. జ్యోత్స్న, గౌతమ్ పై డౌట్ ఉందని చెప్పాడు అనగానే జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. ఇలా చీటికీ మాటికీ వచ్చి మా ఇంటి ఆడపిల్ల పరువు తియ్యకండని సుమిత్ర అంటుంది. బుల్లెట్ మిస్ అయిన కేసులో కూడా జ్యోత్స్న విచారణకి రావల్సి ఉంటుందని ఇన్‌స్పెక్టర్ అంటాడు‌. కత్తిపై వేలిముద్రలు ఎవరివో తెలిస్తే అప్పుడు తెలుస్తుందని ఇన్‌స్పెక్టర్ చెప్పి వెళ్తాడు. అందరు కార్తీక్ పై కోపంగా ఉంటారు. ఎవరు నేరస్తులో తెలుస్తుంది కదా.. అప్పుడు తెలుస్తుందని దశరథ్ అంటాడు.   ఆ తర్వాత అనసూయని శౌర్య ఆటపట్టిస్తుంది. అప్పుడే కార్తీక్ వచ్చి వాళ్ళతో మాట్లాడతాడు. కార్తీక్ దగ్గరికి స్వీట్ బాక్స్ తో ఎంట్రీ ఇస్తాడు సత్యరాజ్. బెస్ట్ రెస్టారెంట్ అవార్డు మన రెస్టారెంట్ కి వచ్చిందని చెప్పి స్వీట్ ఇచ్చి వెళ్తాడు. కార్తీక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇప్పుడు మా తాత ముందు నిలబడి నేను గెలిచానని చెప్తానని కార్తీక్ గర్వంగా చెప్తాడు. ఆ తర్వాత  ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

డాన్స్ ఐకాన్ సీజన్ 2 విన్నర్.. క్యాష్ ప్రైజ్ ఎంతంటే..?

  డాన్స్ ఐకాన్ సీజన్ 2 గ్రాండ్ ఫినాలే చాలా ధూమ్ ధామ్ గా జరిగింది. ఈ ఎపిసోడ్ కి సాయి ధరమ్ తేజ్ గెస్ట్ గా వచ్చాడు. అలాగే "వచ్చినవాడు గౌతమ్" మూవీ టీమ్ నుంచి అశ్విన్ కూడా ఈ షోకి వచ్చాడు. ఈ మూవీ టీజర్ కూడా ఈ షోలో రిలీజ్ చేశారు. ఇక ఈ ఫైనల్ ఎపిసోడ్ లో విన్నర్ ని తప్పించి మిగతా ఓడిపోయిన వాళ్ళను జడ్జెస్ రమ్యకృష్ణ, శేఖర్ మాష్టర్, ఫారియా వచ్చి ఒక్కొక్కరినీ బయటకు తీసుకెళ్ళిపోగా ఫైనల్ గా యష్ మాష్టర్ - బినితా మాత్రమే మిగిలారు. వీళ్ళు టైటిల్ ని సొంతం చేసుకున్నారు. సాయి ధరమ్ తేజ్ వీళ్లకు ట్రోఫీని అందించారు.    బినితా 8,58,771 ఓట్స్ తో ఫస్ట్ ప్లేస్ ని సొంతం చేసుకుంది. ఇక సెకండ్ ప్లేస్ లో ప్రాకృతి-బర్కత్ టీమ్ 6,81,278 ఓట్స్ తో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. ఐతే బర్కత్ ఈ ఎపిసోడ్ రాలేకపోయింది. అలాగే అన్ని ఎపిసోడ్స్ లో బినితాకి డాన్స్ కొరియోగ్రాఫ్ చేసిన కృష్ణని యష్ మాష్టర్ స్టేజి మీదకు పిలిచాడు. ఆ ట్రోఫీ పట్టుకుని కృష్ణ ఎంతో ఆనందం వ్యక్తం చేసాడు. సీజన్ 1 లో ఫోర్త్ ప్లేస్ లో ఉన్నాను. ఎలాగైనా ఫస్ట్ ప్లేస్ కి రావాలి అనుకున్నాను అలాగే బినిత దొరికింది చాల హార్డ్ వర్క్ చేసింది ఎంతో సపోర్ట్ చేసింది అని చెప్పాడు కృష్ణ. అలాగే బినితాకి 5 లక్షల క్యాష్ ప్రైజ్ కూడా అందించారు.    అలాగే "వచ్చినవాడు గౌతమ్" మూవీ ప్రొడ్యూసర్ కి బినిత అంటే చాలా ఇష్టం అని అందుకే మూవీ టీమ్ తరపున మరో 5 లక్షల క్యాష్ ప్రైజ్ కూడా అందించారు. అలాగే సాయి ధరమ్ తేజ్ చిన్నపిల్లలైన బర్కత్ , బినితా కోసం రెండు టెడ్డి బేర్స్ ని తెచ్చి ప్రెజెంట్ చేశారు. ఇలా ఈ సీజన్ ఇక్కడితో ఎండ్ ఐపోయింది.  

Brahmamudi : అప్పుకి సపోర్ట్ గా కళ్యాణ్.. ఆ ఫొటో చూసేసిన రాజ్!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -724 లో... అప్పు డ్యూటీకి వెళ్తుంటే ధాన్యలక్ష్మి ఆగమంటుంది. నువ్వు డ్యూటీకి వెళ్ళడానికి వీలు లేదు.. జాబ్ మానెయ్.. హౌస్ వైఫ్ గా ఇంట్లోనే ఉండి నా కొడుకుని చూసుకోమని ధాన్యలక్ష్మి అంటుంది. ఎందుకు అలా అంటున్నావని ప్రకాష్ కోప్పడతాడు. పిల్లలు సంసారం గురించి ఆలోచించడం లేదని ధాన్యలక్ష్మి అంటుంది.   కళ్యాణ్ కష్టపడి తన భార్యని పోలీస్ చేసాడు. నువ్వు అలా అంటావేంటి అని ఇందిరాదేవి అడుగుతుంది. అదే సమయంలో 'అమ్మ తనకి జాబ్ చెయ్యడం ఇష్టం' అంటూ కళ్యాణ్ అప్పుకి సపోర్ట్ గా మాట్లాడుతాడు. ఆ మాటలన్నీ విన్న ధాన్యలక్ష్మి కోపంగా అక్కడ నుండి వెళ్తుంది. ఆ తర్వాత అప్పుని డ్యూటీకి వెళ్ళమంటాడు కళ్యాణ్. నువ్వు అలా భార్యని అర్థం చేసుకోవడం చాలా హ్యాపీగా ఉందని కళ్యాణ్ తో అపర్ణ అంటుంది.    ఆ తర్వాత రుద్రాణి ఆఫీస్ ఎంప్లాయి కి కాల్ చేసి కావ్య కి ఫోన్ చేసి ఆఫీస్ లో వర్క్ ఉందని చెప్పమంటుంది. దాంతో ఆ ఎంప్లాయి కావ్యకి ఫోన్ చేసి మీరు ఆఫీస్ కి రావాలని చెప్తాడు. ఇక కావ్య ఆఫీస్ కి రెడీ అయి వెళ్తుంటే సుభాష్, ప్రకాష్ వద్దని అంటారు. ఆఫీస్ గురించి మేమ్ చూసుకుంటామని చెప్పి కావ్యని ఆపుతారు.   ఆ తర్వాత ప్లాన్ ఫెయిల్ అయిందని రుద్రాణి యామినికి ఫోన్ చేసి చెప్తుంది. ఇద్దరు కలిసి వేరొక ప్లాన్ చేస్తారు. అదంతా స్వప్న చాటు నుండి వింటుంది. ఆ తర్వాత కావ్య దగ్గరికి రాజ్ వస్తాడు. ఎందుకు వచ్చారన్నట్లుగానే రాజ్ తో కావ్య మాట్లాడుతుంది.    తరువాయి భాగంలో కావ్య పెళ్లి బట్టల్లో ఉన్న ఫోటోని రాజ్ చూసేలా రుద్రాణి సెట్ చేస్తుంది. రాజ్ ఆ ఫోటో చూసి షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

పెళ్ళయ్యాకా నా మొగుడు ఇచ్చినా అంతా హ్యాపీగా ఉండదేమో

కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ శనివారం షో ఫుల్ జోష్ గా కలర్ ఫుల్ గా సాగింది. ఈ వారం ఈ ఎపిసోడ్ ని లవ్ థీమ్ గా జరుపుకున్నారు. ఇందులో బాయ్స్ అండ్ గర్ల్స్ జంటలుగా వచ్చారు. అలాగే అబ్బాయిలు వాళ్లకు వచ్చిన ఫస్ట్ రెడ్ రోజా పూలను పుస్తకంలో దాచుకున్నారు అంటూ అనసూయ చెప్పింది. శ్రీముఖి కూడా అలాగే చేసింది అనేసరికి ఆమె ఒక ఇంటరెస్టింగ్ విషయాన్ని చెప్పింది. "భోళా శంకర్ మూవీ టైములో వాలెంటైన్స్ డే రోజున చిరంజీవి గారితో షూట్ చేస్తున్నాం. అందరూ షూట్ మూడ్ లో ఉంటే నేను మాత్రం చిరంజీవి గారి దగ్గరకు వెళ్లి హ్యాపీ వాలెంటైన్స్ డే అని చెప్పాను. నేను అలా చెప్పిన వెంటనే ఆయన ఒక క్రేజి లుక్ కూడా ఇచ్చారు. షూటింగ్ ఐపోయాక ప్యాకప్ ఐపోయే టైంకి చిరంజీవి గారు నన్ను పిలిచి చాలా రెడ్ రోజెస్ ఇచ్చారు. అన్ని రెడ్ రోజెస్ ఇచ్చేసరికి ఐపాయ్ నా పని..అప్పుడు కీర్తి సురేష్ గారు కూడా అక్కడే ఉన్నారు. అదేంటండి నాకు ఇవ్వరా రెడ్ రోజెస్ అని అడిగారు చిరంజీవి గారిని. అప్పుడాయన శ్రీముఖి హ్యాపీ వాలెంటైన్స్ డే అని చెప్పింది. నువ్వు వచ్చి చెప్పావా శ్రీముఖి చెప్పింది అందుకే ఇచ్చాను అని చెప్పారు. అది బెస్ట్ మోమెంట్. నేను ఒక రోజ్ ని నా బుక్ లో పెట్టుకున్నా. నాకు తెలిసి నాకు పెళ్ళయాక నా మొగుడు రెడ్ రోజెస్ ఇచ్చినా కానీ అంత హ్యాపీనెస్ ఉండదేమో..." అని శ్రీముఖి చెప్తుండగా మధ్యలో విష్ణు ప్రియా వచ్చి "అరే వాడు అసలు రాడు. నువ్వు ఈ విషయం చెప్తే వచ్చేవాడు కూడా రాడు" అని కౌంటర్ ఇచ్చింది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో పృద్వి విష్ణుప్రియాను ఎత్తుకుని వచ్చాడు.  

గతం గుర్తుందా తేజు...మగాళ్ళన్నాక ఆడవాళ్ళనే కదరా చూసేది

ఆదివారం విత్ స్టార్ మా పరివారం లీగ్ తో ఈ షో ప్రోమో చాలా ఫన్నీగా ఉంది. ఈ ఎపిసోడ్ కి నిఖిల్, అలీ రెజా, రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత, తేజస్విని గౌడ, శోభా శెట్టి, ఐశ్వర్య పిస్సే, దీపికా రంగరాజు  ఇంకా కొంతమంది బుల్లితెర స్టార్స్ వచ్చారు. ఇక నిఖిల్ ఈ షోకి నల్ల కళ్ళజోడు పెట్టుకుని వచ్చాడు. అది చూసి హరి చాలా ఫీలయ్యాడు. "ఈయన్ని కళ్ళజోడు తియ్యమని చెప్పండి. కేవలం అమ్మాయిలనే చూస్తున్నాడు" అన్నాడు. "మగాళ్ళన్నాక ఆడవాళ్ళనే కదరా చూసేది " అని శ్రీముఖి ఆన్సర్ ఇవ్వడంతో అందరూ నవ్వేశారు. తర్వాత నిఖిల్ వెళ్లి తేజుతో డాన్స్ చేయడాన్ని తట్టుకోలేకపోయాడు హరి. "పాయింట్ పోయింది కాక సిగ్గులేకుండా డాన్స్ వేస్తున్నాడు నిఖిల్" అనేశాడు. "ఆయన జీవితంలోంచి ఒకావిడా వెళ్ళిపోయాక మీరే ఎక్కువగా ఆయన మీద కన్నేసినట్టు ఉన్నారు" అంటూ హరి మీద కౌంటర్ డైలాగ్ వేసింది శ్రీముఖి. "అరే ఎం కావాలో చెప్పు నీకు" అని నిఖిల్ అడిగేసరికి "నువ్వే కావాలి" అన్నాడు అవినాష్. "ఒక్క పాయింట్ రాలేదు కానీ చూడు కాలు మీద కాలేసుకుని కూర్చున్నారు" అన్నాడు హరి. "నిఖిల్ అండ్ అలీ మీరు కాలేసుకోవడం ఆయనకు నచ్చట్లేదు ఆయన మీద కాలేయాలని ఆయన కోరుకుంటున్నారు" అని శ్రీముఖి చెప్పేసరికి ఒక్కసారిగా హరి షాకయ్యాడు. తర్వాత వీళ్ళతో గేమ్స్ ఆడించింది శ్రీముఖి. ఇందులో తేజుకు బాల్ వచ్చి గట్టిగా తగిలేసరికి గతం మర్చిపోయిందేమో అంటూ శ్రీముఖి పలకరించింది. "నీకు పెళ్లి ఎవరితో అయ్యింది" అని అడిగేసరికి అమరదీప్ తో అని చెప్పింది తేజు. ఇలా ఈ ఆదివారం ఈ ఎపిసోడ్ అందరినీ అలరించబోతోంది.    

Illu illalu pillalu : ట్రైనింగ్ కి వెళ్లిన నర్మద, సాగర్.. కుళ్ళుకుంటున్న శ్రీవల్లి!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -160 లో.....వేదవతి, ప్రేమ, నర్మద ముగ్గురు కలిసి ఇంట్లో ఉండి చేసే జాబ్ గురించి ఆలోచిస్తారు. అప్పుడే శ్రీవల్లి వచ్చి మీరు ముగ్గురు ఒకటి నేను ఒక్కదాన్ని ఒకటి అని శ్రీవల్లి బాధపడుతుంది. లేదమ్మా.. ప్రేమ ఇంట్లో ఉండి చేసే జాబ్ గురించి ఆలోచిస్తున్నామని అనగానే.. నేను చెప్పాలా అని శ్రీవల్లి వేదవతి ముందు కూర్చొని వేదవతి చేతులు తన మీద వేసుకుంటుంది. దాంతో మిగతా ఇద్దరు కోడళ్ళు కుళ్ళకుంటారు. ఇంట్లో ఉండి చేసే జాబ్స్ చాలా ఉన్నాయ్ అత్తయ్య అని శ్రీవల్లి చెప్తుంది. ఇంటి ముందు హోటల్ పెట్టొచ్చు.. వడియాలు పెట్టొచ్చు.. ఇంకా ట్యూషన్ చెప్పొచ్చు అనగానే నర్మద, ప్రేమలకి ఆలోచన వస్తుంది. చాల థాంక్స్ అక్క ట్యూషన్ చెప్పాలని ఐడియా ఇచ్చినందుకు అని ప్రేమ అంటుంది. కానీ ఇద్దరు కలిసి చెప్తే బాగా స్టూడెంట్స్ వస్తారని ప్రేమ అంటుంది. అయినా శ్రీవల్లి చదువుకుంది కదా శ్రీవల్లి అక్క హెల్ప్ చేస్తుందని ప్రేమ, నర్మద అనగానే అడ్డంగా బుక్కయిపోయానని శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. చెప్తావా అక్క అని ఇద్దరు చెరొకవైపు అంటుంటే ఇంకేం చెయ్యలేక సరే అంటుంది. ఆ తర్వాత బావ ఎటైనా బయటకు వెళదామని చందుతో శ్రీవల్లి అంటుంది. అది రామరాజు విని అమ్మాయిని తీసుకొని వెళ్ళమని రామరాజు అంటాడు. సినిమాకి తీసుకొని వెళ్ళమని రామరాజు అంటాడు. టికెట్ ధర ఎంత అని రామరాజు అనగానే ఇద్దరికి పన్నెండు వందలు అని శ్రీవల్లి అంటుంది. అన్ని డబ్బులా అని రామరాజు అనగానే మావయ్య గారికి డబ్బు ఖర్చు చెయ్యకూడదు అన్న వీక్ నెస్ ఉందన్న మాట అని అనుకొని మావయ్య డబ్బులు ఎందుకు వేస్ట్ చెయ్యడం.. మేమ్ ఎక్కడికి వెళ్ళమని శ్రీవల్లి అంటుంది. డబ్బు విలువ నీకు బాగా తెలుసమ్మ అని రామరాజు గొప్పగా శ్రీవల్లి గురించి మాట్లాడతాడు. ఆ తర్వాత నర్మద, సాగర్ హైదరాబాద్ ట్రైనింగ్ కి వెళ్తుంటే రామరాజు వేయి రూపాయలు ఇస్తాడు. ఆ తర్వాత ధీరజ్ కొంత వేదవతి కొంత డబ్బు వాళ్ళకి ఇచ్చి పంపిస్తారు. తరువాయి భాగంలో ప్రేమ, వేదవతి ఇద్దరు నర్మదతో ఫోన్ మాట్లాడుతుంటే శ్రీవల్లి కుళ్ళుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : హంతకుడు వాడిన కత్తిని చూసిన శౌర్య.. మరో వ్యక్తిపై కార్తీక్ కి అనుమానం!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -359 లో......జ్యోత్స్న వచ్చి దాస్ కి వార్నింగ్ ఇస్తుంది. దాంతో కార్తీక్ దగ్గరికి వచ్చి జ్యోత్స్న వార్నింగ్ ఇచ్చిన విషయం మొత్తం చెప్తాడు దాస్. అసలు నువ్వు సంతకం పెట్టావ్ కానీ అందులో జ్యోత్స్న ఏం రాసిందో.. నువ్వు దీప విడిపోవాలని రాసి ఉంటుందని దాస్ అనగానే.. కార్తీక్ షాక్ అవుతాడు. నా కూతురు గురించి నీకు తెలియదు.. మా అమ్మ పారిజాతం దగ్గర పెరిగిందని దాస్ అంటాడు. తనకి ఆస్తులు కావాలి.. అలాగే నువ్వు కూడా కావాలి.. అందుకు ఏదైనా చేస్తుందని దాస్ అంటాడు. వెనకాల దూరాన దాస్ ని దీప చూస్తుంది. బాబాయ్ ఒక్కడే వచ్చి ఉంటాడా.. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారని దీప అనుకుంటుంది. మావయ్య మీరు ఏం కంగారు పడకండి. ఇప్పటివరకు ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. ఇప్పుడు నాకు సిచువేషన్ మొత్తం అర్ధమైంది. నువ్వు వెళ్ళమని దాస్ కి చెప్తాడు కార్తీక్. ఆ తర్వాత కార్తీక్ లోపలికి వెళ్తుంటే.. అక్కడ దీపని చూసి కార్తీక్ షాక్ అవుతాడు. ఏంటి దీప విని ఉంటుందా అని కంగారుపడతాడు. బాబాయ్ ఎందుకు వచ్చాడు.. ఏం మాట్లాడాడని దీప అనగానే ఏం లేదని కార్తీక్ కవర్ చేస్తాడు. ఆ తర్వాత దీపకి కార్తీక్ జుట్టు వేస్తాడు. ఎందుకు మీకు శ్రమా అని దీప అంటుంది. కానీ కార్తీక్ ప్రేమగా తనకి జుట్టు వెయ్యడం చూసి నేను చాలా అదృష్టవంతురాలిని అని దీప అనుకుంటుంది. అప్పుడే శౌర్య బయట నుండి గట్టిగా అరవడంతో కార్తీక్ వెళ్తాడు. అక్కడ దీపని పొడవడానికి ఉపయోగించిన కత్తి ఉంటుంది. అది చూసిన కార్తీక్ పోలీస్ కి ఫోన్ చేసి రమ్మంటాడు. పోలీసులు వచ్చి కత్తిని తీసుకుంటారు. ఎవరిపై డౌట్ ఉందని ఇన్ స్పెక్టర్ అడుగుతాడు. గౌతమ్ ఇంకొకరు ఎవరో తెలియదు మీరే కనిపెట్టాలని కార్తీక్ చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళని సుమిత్ర అమ్మ ఇంటికి వెళ్లకని చెప్పండి అని కార్తీక్ తో దీప అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : రాజ్, కావ్యలని దూరం చేయడానికి యామిని, రుద్రాణి కొత్త ప్లాన్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -723 లో.....కావ్య ని ఇంప్రెస్ చెయ్యడానికి రాజ్ రెడీ అవుతాడు. అప్పుడే రాజ్ కి అపర్ణ ఫోన్ చేస్తుంది. చెప్పండి అమ్మ అని రాజ్ అనగానే అపర్ణ మురిసిపోతుంది. నేను చెప్పింది ఎంతవరకు వచ్చింది.. కావ్యని ఎలా ఇంప్రెస్ చెయ్యాలో ఆలోచించావా అని అపర్ణ అడుగుతుంది. లేదని రాజ్ అంటాడు. ఇంకా ఆలోచించలేదా.. ఏదైనా గిఫ్ట్ గా సారి ఇచ్చి ఇంప్రెస్ చెయ్ అనగానే రాజ్ సిగ్గుపడుతూ సరే అంటాడు. మరొకవైపు ప్రకాష్ దగ్గరికి ధాన్యలక్ష్మి వచ్చి.. అసలు మీరు కొడుకు గురించి పట్టించుకుంటున్నారా.. ఆ అప్పు అయితే వాడి గురించి పట్టించుకోవడం లేదు.. నాకు మాత్రం మనవడినో, మనవరాలినో ఎత్తుకోవాలని ఉండదా అని ధాన్యలక్ష్మి అంటుంటే వాళ్ళకి ప్లానింగ్ ఉంటుందిలే అని ప్రకాష్ అంటాడు. ఆ తర్వాత రాజ్ దగ్గరికి యామిని వచ్చి.. బావ రేపు రెలెటివ్స్ కి కార్డ్స్ ఇవ్వాలని అంటుంది. లేదు నాకు వేరే ఇంపార్టెంట్ పర్సన్ ని కలవాలని రాజ్ చెప్తాడు. నాకు తెలుసు ఎవరో అని యామిని అనుకుంటుంది. ఆ తర్వాత అప్పుకి కళ్యాణ్ భోజనం తీసుకొని వచ్చి తినిపిస్తాడు. ఆ తర్వాత రుద్రాణికి యామిని ఫోన్ చేస్తుంది. ఇద్దరు రాజ్ కావ్య గురించి మాట్లాడుకుంటారు. రాజ్ వస్తాడు కానీ కావ్యని కలవదు. ఎందుకంటే కావ్యకి ఆఫీస్ నుండి ఫోన్ వస్తుంది వెళ్ళిపోతుంది. రాజ్ వెయిట్ చేసి వెళ్ళిపోతాడని రుద్రాణి ప్లాన్ చేసి యామినికి చెప్తుంది. ఆ తర్వాత రాహుల్, స్వప్న నగలు తీస్తుంటే.. స్వప్న నిద్రలో నడుచుకుంటూ వెళ్లి రాహుల్ ని కొడుతుంది. మరుసటి రోజు అప్పు స్టేషన్ కి వెళ్తుంటే ఆగమని ధాన్యలక్ష్మి అంటుంది. తరువాయి భాగంలో కావ్య, రాజ్ ఇద్దరిని దూరం చెయ్యడానికి యామిని, రుద్రాణి ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

నాకు పుట్టే బిడ్డకు మేఘన అని పేరు పెట్టుకుంటాను

  మహబూబ్ నగర్ లో పడమటి సంధ్యారాగం టీమ్ అక్కడికి వచ్చిన అశేష ప్రజానీకం మధ్య సెలెబ్రేషన్స్ చేసుకుంది. ఇక వీళ్ళ మధ్యనే జానకి అత్తా పుట్టినరోజు వేడుకను కూడా నిర్వహించారు. ప్రజలంతా వచ్చి ఈ వేడుకను చూసారు. అలాగే ఈ టీమ్ ని విష్ చేశారు. అలాగే ఇందులో రాము రాథోడ్ స్టేజి మీదకు వచ్చి "రాను ముంబైకి రాను" అనే సాంగ్ పాడి అందరినీ ఎంటర్టైన్ చేసాడు. అలాగే ఈ ఈవెంట్ లో ఒక అభిమాని వచ్చి మేఘనతో ముచ్చటించారు. అమ్మానాన్న ప్రేమ తరువాత ఫాన్స్ ప్రేమ చాలా ప్యూర్ గా అనిపిస్తుంది. స్టేజి మీదకు వచ్చి చామంతి పూల దండను మేఘన మేడలో వేశారు. "నాకు పుట్టే బిడ్డకు మేఘన అని పేరు పెట్టుకుంటాను" అని చెప్పింది. తర్వాత మేఘన మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది. "మా నాన్నను దేవుడు తొందరగా తీసుకెళ్లిపోయాడు. కానీ ఆ ప్రేమను నాకు వీళ్ళ రూపంలో ఇచ్చినందుకు" అని చెప్తూ స్టేజి మీదనే ఏడ్చేసింది. ఇక సీరియల్ లో ఆద్య రామలక్ష్మికి ఒక సర్ప్రైజ్ ని ఈ స్టేజి మీద ఇచ్చింది. ఆద్య మాట్లాడుతూ "రామ డ్రామా జూనియర్స్ లో చాల ఫీలయ్యింది. తన నాన్నతో ఒక్క సెల్ఫీ కూడా లేదు అని. కానీ ఈరోజు నేను ఆమె విష్ ని ఫుల్ ఫీల్ చేద్దామనుకుంటున్నా" అంటూ రామలక్ష్మి వాళ్ళ నాన్నతో కలిసి ఉన్న ఒక ఫోటోని లామినేషన్ చేయించి ఆ స్టేజి మీద ఆద్య రామలక్ష్మికి ఇచ్చింది. తర్వాత రామలక్ష్మి తన పేరెంట్స్ తనకు ఫెవరేట్ అని చెప్పింది. వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే అంది. అలా మహబూబ్ నగర్ లో పడమటి సంధ్య రాగం సీరియల్ తో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

సింగల్ రెడీ టు మింగిల్...నాకు వరుడు కావాలి...

కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ నెక్స్ట్ వీక్ ప్రోమో సరికొత్తగా రిలీజ్ అయ్యింది. ఇందులో డెబ్జాని తన లవ్ స్టోరీ చెప్పింది. రాబోయే వారం షోలో లవ్ థీమ్ ఇచ్చింది శ్రీముఖి. "చిన్నప్పుడు ఏమన్నా లవ్ స్టోరీస్ ఉన్నాయా నీకు" అని అడిగింది శ్రీముఖి. "ఒకటే ఉంది. అది చిన్నప్పుడు కాదు పెద్దయ్యాకే ఉంది. అది కాస్తా బ్రేకప్ అయ్యింది." అని చెప్పింది. "ఎందుకు బ్రేకప్ అయ్యింది" అని అడిగింది శ్రీముఖి. "ఆ అబ్బాయి చాలా హైపర్ యాక్టివ్ గా ఉన్నాడు. ప్రతీ శని, ఆదివారాల్లో ట్రిప్స్ కి వెళ్ళిపోతాడు. నేనేమో ఎన్నెన్నో జన్మల బంధం, సత్యభామా" అంటూ సీరియల్స్ చేసుకుంటూ కూర్చున్నాను అంది డెబ్జాని. "ఐతే అతను ఇండస్ట్రీకి సంబంధించినవాడా కాదా" అని శ్రీముఖి అడిగేసరికి డెబ్జాని నీళ్లు నమిలింది. వెంటనే తేజుతో పాటు మిగతా వాళ్లంతా చెప్పేయ్ ఎం కాదు అంటూ ఆట పట్టించారు. తర్వాత శ్రీముఖి డెబ్జాని చేతికి "నాకు వరుడు కావాలి" అని తయారు చేసిన ఒక పోస్టర్ ఇచ్చింది.  సోషల్ మీడియాలో "సింగల్ రెడీ టు మింగిల్" అని స్టోరీ పెట్టించింది శ్రీముఖి. ఆ పోస్ట్ కి అమరదీప్ కూడా కామెంట్ చేశాడంటూ శ్రీముఖి చెప్పేసరికి అమరదీప్ కూడా షాకయ్యాడు. "మీలాంటి వాళ్ళు పిలవాలి కానీ స్మశానానికి కూడా వస్తాం" అంటూ చేసిన కామెంట్ ని శ్రీముఖి చదివి వినిపించింది. దాని పైన ఇంకో కామెంట్ ఉంది అది కూడా చదవండి అంటూ ఇమ్మానుయేల్ అనేసరికి అబ్బాయిలంతా అరిచారు. ఇలా ఈ వారం ప్రతీ ఒక్కరి లవ్ స్టోరీని శ్రీముఖి ఈ ఎపిసోడ్ రివీల్ చేయబోతోంది.

Illu illalu pillalu : ధీరజ్ గురించి గొప్పగా అనుకున్న ప్రేమ.. శ్రీవల్లి ప్లాన్ సక్సెస్!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -159 లో.. ప్రేమ ఈ రెండు వేల్లలో ఒక వేలు పట్టుకోమని ధీరజ్ అనగానే ప్రేమ ఒక వేలు పట్టుకుంటుంది. ప్రేమ పట్టుకోగానే ఇదొక ఎనిమిదో వింత.. నేను అనుకున్నది నువ్వు సెలక్ట్ చేసావని ధీరజ్ అంటాడు. ఏం అనుకున్నావని ప్రేమ అడుగుతుంది. ఫుడ్ డెలివరి బాయ్ గా అనుకున్నా.. అదే నువ్వు సెలక్ట్ చేసావ్ అని ధీరజ్ అంటాడు. ఫుడ్ డెలివరి బాయ్ అంటే మన కాలేజీ వాళ్ళు చూస్తారేమోనని ప్రేమ అంటుంది. చూస్తే ఏంటి మనం చేసే పని న్యాయంగా ఉంటే చాలు.. ఈ నెల నుండి పదివేలు ఇస్తానన్న కదా అని ధీరజ్ అంటాడు. ధీరజ్ లోపలికి వెళ్తాడు. చెయ్ నొప్పితో ఇబ్బంది పడుతుంటే ధీరజ్ పడుకున్నాక ప్రేమ అంటిమెంట్ రాస్తుంది. నిన్నోక బాధ్యత లేని మనిషి అనుకున్నాను కానీ నువ్వు బాధ్యతగల వాడివి అని ప్రేమ ధీరజ్ గురించి పాజిటివ్ గా అనుకుంటుంది. మరుసటిరోజు వేదవతి దగ్గరికి శ్రీవల్లి వచ్చి.. మీరు ముగ్గురు ఒకటి నేనొక్కదాన్ని ఒకటి.. మీరు ఏదో మాట్లాడుకుంటున్నారు.. నేను వచ్చేసరికి ఆపేస్తున్నారని శ్రీవల్లి అంటుంది. అదేం లేదు నర్మద ట్రైనింగ్ గురించి అని వేదవతి అంటుంది. ఇక వేదవతిని తన వైపుకి తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది శ్రీవల్లి. వట్టి అమాయకురాలు అని శ్రీవల్లి గురించి వేదవతి అంటుంది. మరొకవైపు నర్మద, ప్రేమ మాట్లాడుకుంటుంటే వేదవతి వచ్చి ఏం మాట్లాడుకుంటున్నారని అంటుంది. ప్రేమ ఇంట్లోనే ఉండి చేసే జాబ్ గురించి ఆలోచిస్తున్నామని నర్మద అంటుంది. అలాగేనా ఆలోచించేది అని ఇలా ఆలోచించాలని వేదవతి చూపిస్తుంది. ఏదైనా ఐడియా వచ్చిందా అని వేదవతితో నర్మద అంటుంది. అప్పుడే శ్రీవల్లి వచ్చి.. మీరు ముగ్గురు ఒకటే దాని గురించి ఆలోచిస్తున్నారా అని అడుగుతుంది. ప్రేమ జాబ్ గురించి అని వేదవతి అనగానే.. అవునా అంటూ శ్రీవల్లి వేదవతి ముందు కూర్చొని వేదవతి చేతులు తన మీద వేసుకుంటుంది. అది చూసి మిగతా కోడళ్ళు అయిన ప్రేమ, నర్మద కుళ్ళుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : దాస్ కి వార్నింగ్ ఇచ్చిన జ్యోత్స్న..ఆలోచనలో పడ్డ కార్తీక్!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -358 లో... దీప దగ్గరికి కార్తీక్ వచ్చి మాట్లాడతాడు. లాకెట్ ని కార్తీక్ చూసి ఇది చిన్నప్పుడు మీ అమ్మ ఇచ్చింది కదా మీ అమ్మ పేరేంటి అసలు నీ పుట్టుక గురించి చెప్పమని దీపని కార్తీక్ అడుగుతాడు. అదేంటి అలా అడుగుతున్నారు మా అమ్మని నేను చూడలేదని దీప అంటుంది. ఒకవేళ మీ అమ్మనాన్న బ్రతికే ఉన్నారేమో.. అందుకే ఆ రోజు పిండేం ముట్టలేదేమోనని కార్తీక్ అంటాడు. ఆ విషయం మీకెలా తెలుసని దీప అనగానే సుమిత్ర అత్త చెప్పింది. నువ్వు చెప్పావట కదా అని కార్తీక్ అంటాడు. నా గురించి బానే తెలుసుకున్నారని దీప అంటుంది. అదంతా అనసూయ వింటుంది. కార్తీక్ బాబుకి దీప గురించి ఏదైనా నిజం తెలిసి ఉంటుంది.‌ అందుకే ఇలా అంటున్నారు ఇంకా కార్తీక్ బాబు అడిగితే దీప బాధపడుతుందని వాళ్ళు మాట్లాడుకుంటుంటే అనసూయ వెళ్లి కాఫీ ఇస్తుంది. మరొకవైపు పారిజాతం తీసిన వీడియోని జ్యోత్స్నకి చూపిస్తుంది. వెంటనే ఇప్పుడు మనం దాస్ దగ్గరికి వెళ్లాలని జ్యోత్స్న అంటుంది. ఇద్దరు దాస్ దగ్గరికి వస్తారు. అక్కడ స్వప్న, పారిజాతం గొడవపడతారు. ఆ తర్వాత పారిజాతం, జ్యోత్స్నలని తన గదిలోకి తీసుకొని వెళ్తాడు దాస్. గ్రానీ నువ్వు కాఫీ తీసుకొని రా అని జ్యోత్స్న పారిజాతాన్ని పంపిస్తుంది. దాస్ గతం గుర్తులేనట్లే నటిస్తాడు. నీకు గతం గుర్తు ఉందని తెలుసు నాన్న.. నా గురించి నువ్వు ఎవరికైనా చెప్పే ప్రయత్నం చేస్తే ఊరుకోనంటూ వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న. కానీ దాస్ పట్టించుకోనట్లు ఉంటాడు. ఆ తర్వాత కార్తీక్ దగ్గరికి దాస్ వెళ్లి జ్యోత్స్న వార్నింగ్ ఇచ్చిన విషయం చెప్తాడు. అసలు జ్యోత్స్న అగ్రిమెంట్ లో ఏం రాసి ఉంటుంది. దీపతో విడిపోవాలని రాసిందా అని దాస్ అనగానే కార్తీక్ ఆలోచనలో పడతాడు. అప్పుడే వాళ్ళని దీప చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : కావ్య పెళ్ళి ఫోటోని రాజ్ చూస్తాడా.. రుద్రాణి మాస్టర్ ప్లాన్!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -722 లో..... రాజ్ ని ఇంటికి పిలిచారని కావ్య ఇంట్లో వాళ్లపై కోపంగా ఉంటుంది. తనకి గతం గుర్తుచేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు. మొన్నే కదా అలా అయిందని కావ్య కోప్పడుతుంది. రాజ్ కి మేమ్ ఏం చెప్పడం లేదు కదా.. కేవలం రాజ్ నీ వెనకాల తిరిగేలా చేస్తున్నాం.. ఆ యామిని అంటే వాడికి ఇష్టం లేదట.. నువ్వు అంటే ఇష్టం అంట.. నిన్ను పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటాడని అపర్ణ అంటుంది. చెప్పినట్లు ఎవరు పట్టించుకోవడం లేదని కావ్య బాధపడుతు వెళ్ళిపోతుంది. మరొకవైపు రాజ్ ఇంటికి వస్తాడు. ఎక్కడికి వెళ్ళావ్ బావ అని యామిని అడుగుతుంది. మన ఫ్రెండ్స్ కి కార్డ్స్ ఇవ్వడానికి వెళ్ళానని రాజ్ చెప్పగానే యామిని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ విషయం వెళ్లి తన పేరెంట్స్ కి చెప్తుంది. బావలో మార్పు వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ విషయం నా శత్రువుకి చెప్పాలని కావ్యకి యామిని ఫోన్ చేసి.. మా బావ తన ఫ్రెండ్స్ కి కార్డ్స్ ఇవ్వడానికి వెళ్ళాడు.. అంటే నేనంటే అంటే ఇష్టమే కదా అని యామిని అంటుంది‌. రాజ్ నా దగ్గరికి వచ్చాడు. మా వాళ్ళని బుట్టలో పడేయ్యడానికి వచ్చాడని కావ్య అనగానే యామిని షాక్ అవుతుంది. రాజ్ నన్ను ఇంత మోసం చేశాడా అని యామిని కోపంగా ఉంటుంది. మరొకవైపు సీతారామయ్య, ఇందిరాదేవి, అపర్ణ, కావ్యని పిలిచి రాజ్ గురించి మాట్లాడతారు. ఆ తర్వాత కళ్యాణ్ భోజనం చెయ్యకుండా అప్పు కోసం వెయిట్ చేస్తాడు. దాంతో ధాన్యలక్ష్మి కోప్పడుతుంది. అప్పుడే అప్పు వచ్చి నాకు ఆకలిగా లేదు అనడంతో ధాన్యలక్ష్మి అప్పుని తిడుతుంది. మరొకవైపు కావ్య దేవుడికి మొక్కుకుంటూ బాధపడుతుంది. మరుసటిరోజు కావ్యని రాజ్ ఇంప్రెస్ చేయడానికి రెడీ అవుతాడు. తరువాయి భాగంలో కావ్య ఆఫీస్ కి వెళ్తానంటే వద్దని సుభాష్ అంటాడు. ఆ తర్వాత రాజ్ ఇక్కడికి వస్తున్నాడు కదా.. కావ్య పెళ్లి బట్టల్లో ఉన్న ఫోటో చూసేలా చేస్తాను. దాంతో కావ్యకి పెళ్లి అయిందని రాజ్ అనుకుంటాడని యామినితో రుద్రాణి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

వెనుక నుంచి వచ్చి ఆ అబ్బాయి హగ్ చేసుకున్నాడు...గుండె పగిలిపోయింది

  బుల్లితెర మీద అమరదీప్ -తేజస్విని ఒక మంచి జోడిగా అందరికీ తెలుసు. రీసెంట్ గా అమరదీప్ కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ కి లవ్ థీమ్ ఇచ్చింది శ్రీముఖి. అందులో అమరదీప్ తన హార్ట్ బ్రేక్ లవ్ స్టోరీ చెప్పాడు. "దగ్గరుండి అప్లికేషన్ ఫిల్లప్ చేయించి బస్ ఎక్కించి పంపించిన అమ్మాయి వేరే అబ్బాయిని లవ్ చేస్తే ఎలా ఉంటుంది. అది మన కళ్ళతో చూస్తే మనకు ఎలా ఉంటుంది. ఎప్పుడూ వచ్చే అమ్మాయి ఆ బస్సులోంచి దిగుతుంది కదా అని ఎదురు చూసే టైములో వెనక నుంచి ఒక అబ్బాయి వచ్చి హగ్ చేసుకున్నాడు. నా కళ్ళ ముందు నేను అది చూసాను." అని తన బ్రేకప్ లవ్ స్టోరీ చెప్పాడు. "జానకి కలగనలేదు" అనే సీరియల్ తో బుల్లితెర ఆడియన్స్ కి దగ్గరయ్యాడు అమరదీప్.  రామ పేరుతో మంచి పేరు సంపాదించుకున్నాడు అమర్ దీప్ చౌదరి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7  లో అమరదీప్ బాగా గేమ్స్ ఆడాడు అలాగే ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసాడు. అలాగే అరియానా, సొహైల్, అషు రెడ్డి, అవినాష్ వీళ్లంతా అమర్ దీప్‌కి మంచి ఫ్రెండ్స్ కూడా. రీసెంట్ గా అమరదీప్ - తేజస్విని గౌడ ఇద్దరూ కూడా ఇష్మార్ట్ జోడికి కూడా వెళ్లారు. అలాంటి అమరదీప్ ఐరావతం, రాజు గారి కిడ్నాప్ అనే మూవీస్ లో నటించాడు. ఇక ఇప్పుడు "సుమతి శతకం" అనే మూవీలో నటిస్తున్నాడు. అమర్ దీప్ చౌదరి సరసన సాయిలీ చౌదరి హీరోయిన్ గా చేస్తోంది.