Illu illalu pillalu:  అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టిన శ్రీవల్లి.. నువ్వు చేసింది ముమ్మాటికి తప్పేరా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu Pillalu)'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-166లో... చందు దగ్గరకు వెళ్లిన శ్రీవల్లి.. ఏడుస్తూ తన యాక్టింగ్ మొదలెడుతుంది. ఏమైంది వల్లీ ఎందుకు ఏడుస్తున్నావని చందు అడిగేసరికి.. విషయం చెప్పకుండా భోరున ఏడుస్తుంటుంది. ఏమైందో చెప్పు వల్లీ అని చందు అడిగేసరికి.. వయసులో పెద్దదాన్ననే గౌరవం లేదు.. వదినతో ఎలా మాట్లాడాలో కూడా తెలియకపోతే ఎలా అని శ్రీవల్లి యాక్టింగ్ చేస్తుంది. ఏమైందో చెప్పు వల్లీ.. నిన్ను ఎవరేమన్నారని అడుగుతాడు చందు. ఎవరో అన్నారులెండి.. అది మీకు చెప్తే.. నేను వచ్చి మీ అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టిన దాన్ని అవుతాను.. అందుకే ఆ అవమానం ఏదో నేనే పడతాను.. నా ఏడుపేదో నేను పడతాను. నన్ను ఇలా వదిలేయండి అని శ్రీవల్లి అంటుంది. మీ తమ్ముడు ధీరజ్ చాలా దారుణంగా మాట్లాడాడండి అని శ్రీవల్లి చెప్తుంటే చందు అసలు నమ్మడు. అసలు నువ్వెవరు.. మా ఇంటికి వచ్చి పది పదిహేను రోజులు కూడా కాలేదు. మా ఇంటి విషయాలు నీకెందుకు అంటూ మాట్లాడాడండి అంటూ శ్రీవల్లీ అతడిపై చాడీలు చెప్తూనే ఉంటుంది. శ్రీవల్లి చెప్పేదంతా చందు వింటు షాక్ అవుతాడు. చిన్నోడు అలా మాట్లాడు.. అయిన ప్రేమ ట్యూషన్ గురించి నువ్వెందుకు చెప్పావని చందు అంటాడు. అయ్యో.. నేను ఈ ఇంటి పెద్దకోడల్ని కదా.. నాకు ఆమాత్రం బాధ్యత ఉండదా.. మీరు ఇప్పుడు మీ తమ్ముడ్ని అడుగుతారా లేదా.. వదినతో మాట్లాడే పద్దతి మార్చుకోమని తనకు చెప్తారా లేదా.. లేదంటే నా విలువే పోతుంది. అసలు నా ఏడుపుకి కూడా మీ దగ్గర విలువ లేదా అంటూ చందుతో సరే అనిపించేదాకా శ్రీవల్లి ఏడుస్తుంది. మరునాడు పొద్దున్నే ధీరజ్ పలకరించినా చందు మాట్లాడడు.. ఏమైందని ధీరజ్ అడిగితే.. నువ్వు మీ వదినతో మాట్లాడిన పద్దతి కరెక్ట్ కాదురా అని చందు కోపంగా అంటాడు. నేను మాట్లాడింది కరెక్టేరా అన్నయ్యా.. ప్రేమ విషయంలో జ్యోక్యం చేసుకోవడం వల్లే కదా సమస్య వచ్చింది. పనికట్టుకుని మిల్‌కి వెళ్లి వదిన అలా చెప్పడం అవసరమా అని ధీరజ్ పైకి లేచి కోపంగా అంటాడు. దాంతో చందుకి మరింత కోపం వస్తుంది. అదంతా తిరుపతి వింటూ చూస్తూ షాక్ అవుతాడు. వెంటనే చందు కూడా పైకిలేచి.. చెప్పే పద్దతి అది కాదు.. అయినా మీ వదిన పరాయిది కాదుగా అంటూ వాదనకు దిగుతాడు. ఇదంతా చూసి, విన్న తిరుపతి వెంటనే వాళ్ల మధ్యలోకి వచ్చి.. ఏంట్రా మీ పెళ్లాల కోసం మీరు గొడవ పడటం కరెక్ట్ కాదురా అని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తాడు. అయితే చందు వెళ్తూ వెళ్తూ కూడా.. రేయ్ ధీరజ్.. మీ వదినతో అలా మాట్లాడటం మాత్రం కరెక్ట్ కాదురా అనేసి వెళ్లిపోతాడు. ధీరజ్ బాధగా తిరుపతి వైపు..తిరుపతి బాధగా ధీరజ్ వైపు చూస్తుండిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi: రుద్రాణికి చెంపదెబ్బలు.. కావ్యకు రాజ్ ప్రపోజ్ చేస్తాడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' బ్రహ్మముడి (Brahmamudi)'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-729లో.. దుగ్గిరాల ఇంటికి యామిని పంపించిన మనిషి వచ్చి అందరిని వివరాలు అడుగుతాడు. చెప్పండి మేడమ్.. ఈ కళావతి గారు మీ కోడలు అన్నారు.. మీ కోడలంటే? ఎలా కోడలు? అంటూ ఆరా తీస్తాడు. వెంటనే రాజ్ కూల్‌గా.. ఏంటి ఆఫీసర్ అలా అడుగుతావ్.. కళావతిగారు ఆవిడ మేనకోడలు.. ఏంటమ్మా నేను చెప్పింది నిజమే కదా అని రాజ్ అంటాడు. వెంటనే ఇందిరా దేవి.. కరెక్ట్‌గా చెప్పావ్ మనవడా మేనకోడలే అంటుంది. మరి మేనకోడలు అయితే వాళ్ల అమ్మా నాన్నలు ఎక్కడున్నారని యామిని మనిషి అడుగుతాడు. చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగింది మా కళావతి. అందుకే ఇక్కడే ఉంది.. వాళ్లు అక్కడ ఉంటారని ఇందిరాదేవి అంటుంది. హో.. అవునా.. మరి ఈవిడ ఓటర్ ఐడియా ఎక్కడుందని యామిని మనిషి అంటాడు. ఇక్కడుంటే అక్కడ ఉంటుందా అని ఇందిరాదేవి మాట్లాడుతుంది. నన్ను కన్ఫూజ్ చేయొద్దు.. అసలు ఈ కళావతి ఈ ఇంటి మనిషా.. ఆ ఇంటి మనిషా అని యామిని మనిషి అంటాడు. మా కళావతి అందరి మనిషి అని ప్రకాశం అంటాడు. ఇక కాసేపటికి.. సరే మీరు వివరాలు రాసుకోవడం అయితే బయల్దేరండి అనడంతో ఆ వ్యక్తి వెళ్లిపోతాడు. అయ్యో మంచి అవకాశం పోయిందే అని రుద్రాణి చూస్తుంటే..అమ్మా రుద్రాణీ.. ఇలా రా నాన్నా నీతో చిన్న పని ఉంది.. రా అని ఇందిరాదేవి అంటుంది. అబ్బే లేదమ్మా నాకు చిన్న పని ఉంది వస్తానంటూ రుద్రాణి వెళ్లబోతుంది. వెంటనే స్వప్న.. అయ్యో అత్తా.. నీకు ఉన్న పనులన్నీ నేను చేసి పెడతాలే.. నువ్వు ముందు అమ్మమ్మగారితో వెళ్లమని అంటుంది. అవును అత్తా.. వెళ్లు.. నాన్నమ్మ అంత ప్రేమగా పిలుస్తుంది కదా? వెళ్లు అని కళ్యాణ్ అంటాడు. ఇక రుద్రాణి ముందుకు ఇందిరాదేవి వెళ్లి.. చేయి పట్టుకుని మరీ లోపలికి తీసుకుని వెళ్తుంది. అది చూసి అందరికీ సీన్ అర్థమై నవ్వుకుంటూ ఉంటారు. ఆ తర్వాత గదిలోకి వెళ్ళి రుద్రాణి చెంప వాయిస్తుంది ఇందిరాదేవి. ఆ చెంపదెబ్బ సౌండ్ బయటకు వినిపిస్తుంది. అందరు వింటారు.. రాజ్ విని ఆ శబ్దం ఏంటని అందరిని అడుగగా.. రుద్రాణిని చెంపవాయించిందని అందరికి అర్థమై మాకేం వినిపించలేదని యాక్ట్ చేస్తారు. అవునా నాకు వినిపించిందే అని రాజ్ అయోమయంగా చూస్తాడు. మరోవైపు రాజ్ హాల్లో కూర్చుని కవ్య పట్టించుకోవడం లేదని బాధపడుతుంటే.. ఇందిరా దేవి, అపర్ణా ఇద్దరు తన దగ్గరికి వస్తారు. కావ్యకు ప్రపోజ్ చెయ్ రామ్.. తను ఒప్పుకుంటుందిలే అని ఇద్దరు బాగా బూస్టప్ ఇస్తారు. సరే నాన్నమ్మా ఈ రాత్రి బాగా ప్రిపేర్ అయ్యి రేపు తనకు ప్రపోజ్ చేస్తాను సరేనా అనేసి రాజ్ ఇంటికి బయలుదేరతాడు. తీరా రాజ్ వెళ్లాక.. రేపు రాజ్ ప్రపోజ్ చేసే విషయం గురించి ఇందిరాదేవి, అపర్ణా మాట్లాడుకుంటూ ఉంటే అది రాహుల్ వింటాడు. వెంటనే అతను రుద్రాణి దగ్గరకు వెళ్లి.. విషయం చెప్పాలి అనుకుంటే ఆమె చెంపలు దాచుకుంటుంది. నా దగ్గర దాచుకుని ఏం ఉపయోగం లేదులే.. అమ్మమ్మ నిన్ను కొట్టిందన్న విషయం అందరికి తెలిసిపోయింది. దాన్ని వదిలేసి నేను చెప్పేది విను.. రేపు కావ్యకు రాజ్ ప్రపోజ్ చేయబోతున్నాడు. అదే జరిగితే తర్వాత పెళ్లి అంటారు. రాజ్ ఇక్కడికే అల్లుడిలా ఎంట్రీ ఇస్తాడు దీన్ని ఎలాగైనా ఆపాలని రాహుల్ అంటాడు. దాంతో వెంటనే యామినీకి కాల్ చేస్తుంది రుద్రాణి. దీన్ని నువ్వే ఆపాలనే విషయం యామినికి చెప్పేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

రథం ముగ్గేస్తే అది కాస్తా మణికొండ వరకు వెళ్లిందట...

  కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ ఈ వారం ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో ముందుగా శ్రీముఖి ముంజెకాయల్ని ఇచ్చింది. కిర్రాక్ బాయ్స్ అంతా కూడా వాటిని తిన్నారు. "మీరందరూ తింటుంటే ఎంత అందంగా ఉంది ఒక్కడు తింటుంటే మాత్రం అచ్చం పండు కోతిలెక్క ఉన్నావ్రా " అంటూ శ్రీముఖి, రోహిణి కలిసి ఇమ్మానుయేల్ ని కామెంట్ చేశారు. ఈ ఎపిసోడ్ ని విలేజ్ థీమ్ తో డిజైన్ చేసారు. చిన్నప్పుడు పల్లెటూరిలో అందరూ చేసిన అల్లరిని సెట్ లో బుల్లితెర నటులంతా కలిసి చేశారన్నమాట. ఐతే అబ్బాయిలకు ఒక టాస్క్ ఇచ్చింది శ్రీముఖి. ఇక్కడ ఎవరికీ ముగ్గులు వేయడం వచ్చో జెన్యూన్ గా వచ్చో చేతులెత్తండి అనేసరికి అమరదీప్ చెయ్యెత్తాడు. "తేజు చెప్పింది నీ ముగ్గుల గురించి..మొన్న రథం ముగ్గు వేసావంట...అది కూడా మణికొండ వరకు వెళ్లిందట.." అనేసరికి అమరదీప్ తో పాటు అందరూ నవ్వేశారు. తర్వాత అమ్మాయిలకు అబ్బాయిలకు ముగ్గుల పోటీ పెట్టింది. బాయ్స్ అండ్ గర్ల్స్ వేసిన రెండు ముగ్గులు చూసిన జడ్జ్ అనసూయ ఐతే కళ్లద్దాలు పెట్టుకున్నాక ఈ ముగ్గులా ఉంది కళ్లద్దాలు తీసేసాక ఆ ముగ్గులా ఉంది అంటూ సెటైర్ వేసింది. తర్వాత ఒక టబ్ లో కొన్ని చేపల్ని తెప్పించింది శ్రీముఖి. "మీకు తెలిసిన కొన్ని చేపల రకాలు చెప్పండి" అంటూ ఖిలాడీ గర్ల్స్ ని అడిగింది. "పిత్తబరిగె, శీలావతి " అని డెబ్జానీ చెప్పింది. తర్వాత ఇంద్రావతి అని రోహిణి చెప్పేసరికి..అదేం చేప అంటూ శ్రీముఖి ఆశ్చర్యపోయింది. తర్వాత ఇమ్మానుయేల్ ఒక టబ్బులో నాట్లు వేసే టాస్క్ చేసాడు. అలాగే ప్రియాంక జైన్ - అమరదీప్ కలిసి ఏడు పెంకులాట టాస్క్ ఆడారు. ఐతే అందులో బాల్ తేవడానికి మెట్ల వంటి సెటప్ చేశారు. ఐతే అందులో అమరదీప్ కాలు ఇరుక్కుపోయింది. దాంతో అనసూయ అందరూ "ఓ మై గాడ్" అంటూ షాక్ అయ్యారు. మరి ఇంతకు ఏమయ్యిందో షోలో చూడాలి.

నా లిప్స్ ఇష్టం అన్నాడు.. అంతవరకే జరిగింది...ఆ తర్వాతేమీ జరగలేదు

బుల్లితెర నటి ప్రియాంక జైన్ గురించి తెలియని వారు లేరు. అలాగే శివ్ ఉన్న స్నేహం గురించి కూడా తెలుసు. ఏ షోకి వెళ్లినా ఈ ఇద్దరూ కలిసి కనిపిస్తారు. అలాగే ప్రియాంక రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పింది. "ఒక పర్సన్ మన లైఫ్ పార్టనర్ అవ్వాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి" అని యాంకర్ అడిగేసరికి శివ్ లా ఉండాలి అని చెప్పింది. అలాగే శివ్ కి ఫోన్ చేయించి ఐ లవ్ యు చెప్పించింది. శివ్ కూడా రివర్స్ లో ఐ లవ్ యు చెప్పాడు. వెంటనే పరి "వీడు ముసలోడు అవ్వకూడదు" అనే డైలాగ్ చెప్పింది. "కాండిల్ లైట్ డిన్నర్ , బ్లాక్ బ్లాక్ డ్రెస్ నాకే కాదు అందరి డ్రీం కూడా అదే ఉంటుంది. శివ్ ఎప్పుడైనా బ్లాక్ డ్రెస్ వేసాడంటే చాలు నేను అలా చూస్తూ ఉండిపోతా....ఆ రోజు శివ్ నా లిప్స్ అంటే ఇష్టం అని చెప్పాడు. అంత వరకే జరిగింది...ఆ తర్వాతేమీ జరగలేదు." కొంటెగా చెప్పి నవ్వేసింది ప్రియాంక. ఇక అందరూ పెళ్లి గురించే అడుగుతున్నారు ఈ ఏడాదిలో పెళ్లి చేసుకుంటాం అని హింట్ ఇచ్చింది ప్రియాంక. రీసెంట్ గా ప్రియాంక ఇష్మార్ట్ జోడి షోకి వలల డ్రెస్ ఒకటి వేసుకురావడంతో ఆమె మీద చాలా ట్రోల్స్ వచ్చాయి. "కొన్ని కామెంట్స్ చూస్తే నాకే అసహ్యమనిపించింది. నేను ఈ కామెంట్స్ ఎందుకు చూస్తున్నానా అనిపించింది. ఇలాంటి డ్రెస్ ని నేను షోలో వేసుకున్నాను...అదే వేసుకుని మాల్ లో తిరగలేను కదా...ఒక అమ్మాయిగా ఎక్కడ ఏ డ్రెస్ వేసుకోవాలో తెలుస్తుంది కదా...మేము మనుషులమే..మాకు కన్నీళ్లు ఉంటాయి...మేము బాడ్ గా ఫీలవుతాము. అలాంటి కామెంట్స్ చూసినప్పుడు మేము దీని కోసం కాదు చేసింది..మాకు ఆస్తులలాంటివి ఏమీ లేవు...కష్టాల గురించి ఆలోచిస్తే గూస్ బంప్స్ వస్తాయి" అనిపిస్తుంది అని చెప్పింది ప్రియాంక.

Illu illalu pillalu: మామకు ఎదురుతిరిగిన కోడలు.. ప్రేమకు అత్త సపోర్ట్ చేయనుందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu Pillalu)'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-165లో.. ట్యూషన్ విషయంలో ప్రేమ, వేదవతిలు ఎన్ని విధాలుగా సర్దిచెప్పడానికి చూసినా రామరాజు వినిపించుకోడు. దాంతో ప్రేమ రివర్స్ అవుతుంది. మీకు చెప్పాలనే అనుకున్నాం.. ఇంతలో పిల్లలు వచ్చేయడంతో చెప్పడం కుదర్లేదు. ఇంత చిన్న విషయానికి ఎందుకంత సీరియస్ అవుతున్నారో నాకు అర్థం కావడం లేదని ప్రేమ అనగానే.. ఇది నీకు చిన్న విషయమే కావచ్చు కానీ.. ఇది నా ఇంటికి, గౌరవానికి మచ్చ తెచ్చే విషయమని రామరాజు అంటాడు. నేను ట్యూషన్ చెప్తే మీ పరువు పోవడం ఏంటో నాకు అర్థం కావడం లేదని ప్రేమ అడుగుతుంది. ఆరోజు కాఫీ షాప్‌లో పనిచేస్తే మీ వాళ్లు వచ్చి ఎంత పెద్ద గొడవ చేశారో చూశాం కదా.. నీకు రూమ్ ఇవ్వలేదని ఎంత పెద్ద పెంట చేశారో చూశాం కదా.. ఇప్పుడు నువ్వు ట్యూషన్ చెప్తుంటే.. మాకు గతిలేక నీతో ట్యూషన్ చెప్పిస్తున్నామని మాపై పడి ఏడుస్తారు. కాబట్టి నువ్వు ట్యూషన్ చెప్పడానికి వీళ్లేదు.. ట్యూషన్ చెప్పాలనే ఆలోచన కూడా నీకు రాకూడదని రామరాజు అంటాడు. లేదు మామయ్యా.. నేను ఖచ్చితంగా ట్యూషన్ చెప్పే తీరుతానని ప్రేమ అంటుంది. ఏమన్నావని రామరాజు అంటే.. అవును మామయ్యా.. మా నాన్న వాళ్లు ఏమనుకుంటారో.. మీరేం అనుకుంటారో... నాకు అనవసరం. కానీ ట్యూషన్ చెప్పడం నాకు అవసరమని ప్రేమ అంటుంది. నేను వీళ్లేదు అంటే.. ట్యూషన్ చెప్తాననే అంటున్నావ్.. అంటే నా మాటకి నా నిర్ణయానికి ఎదురుచెప్తావా అని రామరాజు అరుస్తాడు. ఇది ఎదురుచెప్పడం కాదు మామయ్యా.. అలా చెప్పను కూడా.. కానీ నెలనెలా ఇంట్లో మా ఆయన పదివేలు ఇవ్వాలి.. ఆయన చేసే పార్ట్ టైమ్ ఉద్యోగానికి అంత డబ్బు రాదు. మరేం చేయాలి అందుకే మా ఆయనకి నాకు.. నావంతు సాయంగా నిలబడటం కోసం ఈ ట్యూషన్ చెప్తున్నాను.. దయచేసి అర్థం చేసుకోండి మామయ్యా అని ప్రేమ రిక్వెస్ట్ చేస్తుంది. కుదరదని చెప్తున్నాను కదా.. మొండిగా మాట్లాడతావ్ ఏంటని రామరాజు అంటాడు. నేను మొండిగా మాట్లాడటం లేదు మామయ్యా.. మా పరిస్థితిని అర్థం చేసుకోమని బ్రతిమిలాడుతున్నానని ప్రేమ అంటుంది. చూడూ.. నేను మీ వాళ్లతో మాటలు పడదల్చుకోలేదు. నిన్ను కష్టపెడతున్నాననే అవమానాన్ని మోయదల్చుకోలేదు. నా గౌరవాన్ని ఇంటి పరువుని వీధిలో పడేయదల్చుకోలేదు. అందుకే ట్యూషన్ చెప్పాలనే ఆలోచనను నీ మనసులో నుంచి తీసేయమని రామరాజు అంటాడు. చూడండి మామయ్యా.. మేం నెలనెలా పదివేలు ఇవ్వాలి.. మా పరిస్థితిని అర్థం చేసుకోండి అని ప్రేమ ఎంత రిక్వెస్ట్ చేసినా రామరాజు వినిపించుకోడు. చెప్తే అర్ధం కాదా నీకు.. ఇది నా ఇల్లు.. నేను చెమటోర్చి సంపాదించుకున్న ఇల్లు.. ఇన్నేళ్లుగా నేను తీర్చుదిద్దుకున్న కుటుంబం ఇది. నా కుటుంబంలో ఏ నిర్ణయం అయినా నేనే తీసుకుంటాను. నా ఇంట్లో నువ్వు ట్యూషన్ చెప్పడానికి వీళ్లేదు. నా నిర్ణయాన్ని కాదంటే.. మీరు కష్టపడి ఇల్లు కట్టుకోండి. ఆ ఇంట్లో మీకు నచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకోండి. అంతే తప్ప నా ఇంట్లో మీ సొంత నిర్ణయాలను అంగీకరించనని రామరాజు అంటాడు. ఇక ప్రేమ ఏడుస్తూ తన గదిలోకి వెళ్తుంది.‌ తన వెనకాలే వేదవతి వెళ్ళి.. మామయ్య గారు చెప్పింది కూడా కరెక్టే కదా.. ఆ రోజు మీ వాళ్ళు అలా అన్నారు కదా.. నువ్వు ట్యూషన్ చెప్తే గొడవ చెయ్యరా అని వేదవతి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi: కావ్య ప్రేమ కోసం రాజ్ విశ్వప్రయత్నం.. యామిని కొత్త ప్లాన్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి (Brahmamudi)'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-728లో.. యామిని, రుద్రాణి ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకుంటారు. కావ్య, అపర్ణల మధ్య ఉన్న సంబంధం రాజ్ కళ్లముందే బయటపడటానికి నా మనిషిని ఒకరిని అక్కడికి ఒక ఆఫీసర్ లా పంపిస్తాను. అతడు జనాభా లెక్కల కోసం వచ్చినట్లుగా నటించి.. ఎవరికి ఎవరు ఏం అవుతారో అనే వివరాలు లాగుతాడు.అప్పుడు రాజ్ ముందే అపర్ణ గారు కళావతికి అత్త అన్న నిజం బయటపడుతుంది. కొడుకు పెళ్లామనే నిజం బయటపడుతుంది.. అప్పుడు రాజ్ నిజం తెలుసుకుని అందరిని తిట్టి నా దగ్గరకు వచ్చేస్తాడని యామిని తన ప్లాన్‌ని రుద్రాణికి చెప్తుంది. మరోవైపు కావ్య కోసం రాజ్ లవ్ లెటర్ రాస్తాడు. అది ఫన్నీగా ఉంటుంది. అయితే లెటర్ చివర్లో కళ్యాణ్ అని రాసి ఉండటంతో అది చూసి కావ్య విసుగ్గా రాజ్ కి ఇచ్చేసి తిట్టేసి వెళ్ళిపోతుంది. ఇక ఆ పేరు చూసి రాజ్ కోపంతో‌‌.. ఒరేయ్ కళ్యాణ్ అంటూ తన వెంటపడతాడు. సారీ అన్నయ్య అలవాటులో పొరపాటుగా నా పేరు రాశేసానని కళ్యాణ్ చెప్పినా రాజ్ వినడు. ఇక కళ్యాణ్ ని స్విమ్మింగ్ పూల్ దగ్గర కిందపడేసి ఎంతపనిచేశావ్ రా అని రాజ్ అంటుంటే.. అపర్ణ, ఇందిరాదేవి ఆపేస్తారు. ఇక వారికి సారీ చెప్పేసి కొత్త ప్లాన్ చెప్పమంటాడు రాజ్. కాసేపు ఆలోచించిన రాజ్ నాకో కొత్త ఐడియా వచ్చిందని అనగానే.. హా ఏంటి అది అని కళ్యాణ్ అంటాడు. హా చెప్తే దాని మీద కూడా సంతకం చేస్తావా అంటూ కళ్యాణ్ మీద కోప్పడతాడు రాజ్. అదంతా దూరం నుండి కావ్య చూసి నవ్వుకుంటుంది‌.  ఇక కావ్యకి కాల్ చేస్తుంది యామిని.‌నీది అధర్మం.. నాది ధర్మం.. నేనే గెలుస్తానంటూ యామినిని రెచ్చగొట్టేలా కావ్య మాట్లాడుతుంది. అదే సమయంలో కావ్యకి సారీ చెప్తూ రాజ్ తనవెంట పడతాడు. రుద్రాణి, ఇందిరాదేవి అంతా రాజ్ కి సపోర్ట్ చేస్తూ డ్యాన్స్ చేస్తుంటారు. ఇక చివరికి కావ్య నవ్వేసరికి.. నవ్వింది.. కళావతి నవ్వింది అంటు రాజ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అదే సమయంలో యామిని మనిషి జనాభా లెక్కల మనిషిలా ఇంటికి వస్తాడు. అతనికి రుద్రాణి సపోర్ట్  చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2: జ్యోత్స్నని నిలదీసిన దశరథ్.. కార్తీక్ కావాలనే అలా చేశాడు!

  స్టార్ మ టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2(Karthika Deepam2)'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-364లో.. జ్యోత్స్న చేసిన అగ్రిమెంట్ గొడవ గురించి శివనారాయణ మాటల్లో దశరథ్, సుమిత్ర తెలుసుకుని షాక్ అవుతారు. జ్యోత్స్న దొరికేసింది ఇప్పుడు ఎలా అని పారిజాతం భయపడుతుంది. అయితే అంతా అగ్రిమెంట్ గురించి నిలదీసేసరికి.. జ్యోత్స్న ఓ కథ అల్లేసింది. నేను ఆ రోజు దీప ఆసుపత్రిలో ఉన్న రోజు.. నలుగురి తీసుకుని బ్లెడ్ ఇవ్వడానికి నలుగురిని తీసుకుని వెళ్లా కదా? ఆ సత్యరాజ్ అంకుల్ ఏదో బావంటే అంత ప్రేమ ఉన్నట్లు మాట్లాడతాడు కానీ.. దీప ఆపరేషన్‌కి డబ్బులు కూడా ఇవ్వలేదట.. సో దీప ఆపరేషన్‌కి డబ్బులు కావాలి బ్లడ్ కావాలి.. బావ ఇంటికి వస్తే మనం అన్న మాటలన్నీ అవమానంగా ఫీలయ్యాడట.. వెళ్లగానే నన్ను చూసి తాతను తిట్టాడు. కొన్ని చెప్పలేను కానీ తాతను గట్టిగానే తిట్టాడు. బావ తాతను అన్ని మాటలు అన్న తర్వాత నేను ఊరికే ఎలా ఉంటాను.. ఆ కోపంలో ఇచ్చిన డబ్బులకు అగ్రిమెంట్ రాయమన్నాను.. బావ పౌరుషానికి పోయి నేను ఎంతకైనా సిద్ధమే అన్నాడంటూ జ్యోత్స్న చెప్తూనే ఉంటుంది.  జ్యోత్స్న చెప్పేదంతా విన్న పారిజాతం.. అమ్మనా మనవరాలా నీకు ఎక్కడ కారం రాయాలో.. ఎక్కడ వెన్న రాయాలో బాగా తెలిసిందే అని తన మనసులో అనుకుంటుంది‌. ఇక సుమిత్ర, శివనారాయణ రగిలిపోతూ వింటుంటారు. బావ సిద్ధమే అన్నాడు కాబట్టి.. నేను చెప్పినట్లు వినాలి.. చెప్పినట్లు చెయ్యాలని చెప్పాను.. బావ కోపంలో నేను ఏదైనా చేస్తాను.. అవసరం అయితే రెస్టారెంట్‌లో నీకు నా వాటా రాసి ఇస్తాను.. అంతే కానీ ఏది ఫ్రీగా తీసుకోనని అగ్రిమెంట్‌ మీద సంతకం పెట్టి నా చేతిలో పెట్టాడు. ఈ కార్తీక్ దేనికీ తగ్గడు.. పోయి మీ తాతకు చెప్పుకో అన్నాడని జ్యోత్స్న అంటుంది. ఇక జ్యోత్స్న మాటలకు శివనారాయణ రగిలిపోతూ ఉంటాడు. పారిజాతం నవ్వుకుంటుంది. బావ నాతో అలా అన్నాడనే నేను వెంటనే ఒక కండీషన్ పెట్టాను.. అగ్రిమెంట్ బ్రేక్ చేస్తే క్షమాపణగా 24 గంటల్లో పది కోట్లు నాకు కట్టాలని చెప్పానంటుంది. నువ్వు చెప్పేదానిలో ఎంతవరకు నిజముందో నాకు తెలియదు కానీ అంటూ దశరథ్ ఏదో అనబోతుంటే.. మీరు దీన్ని ఎందుకు అనుమానిస్తున్నారు.. ప్రాణాలు కాపాడినందుకా లేక సాయం చేసినందుకా అంటు సుమిత్ర అడుగుతుంది. మన కూతురు వాళ్లకు సాయం చెయ్యలేదు.. బేరం పెట్టిందని దశరథ్ అంటాడు. పౌరుషానికి పోయి వాడు గొడవ పడితే అయ్యా బాబు అంటూ ఇది బతిమలాడుకోవాలా అని దశరథ్ తో  పారిజాతం అంటుంది‌. మరి క్షమాపణ పేరుతో 10 కోట్లు ఏంటని దశరథ్ అనగా.. అది శివనారాయణ గారి మనవరాలు.. దీని రేంజ్ అలానే ఉంటుందని పారిజాతం అంటుంది. అసలు అగ్రిమెంట్ విషయం మాకెందుకు చెప్పలేదని సుమిత్ర అనగానే.. అవార్డ్ తెచ్చి తాత చేతిలో పెట్టి సర్ ప్రైజ్ చెయ్యాలి అనుకున్నానని జ్యోత్స్న అంటుంది. అసలు అగ్రిమెంట్‌కి అవార్డ్‌కి సంబంధం ఏంటీ? అంటాడు దశరథ్ అనుమానంగా. వెంటనే శివనారాయణ తనకు అర్థమైనట్లుగా.. అంటే ఆ అగ్రిమెంట్ ప్రకారం ఆ రెస్టారెంట్‌లో కార్తీక్ గాడి పార్టనర్ షిప్ మనది అంతే కదా? ఇదంతా ముందే చెప్పి ఉంటే కథ వేరేగా ఉండేది.. అక్కడ ఆ భార్యభర్తలకు ఆ అవార్డ్ నేనే ఇచ్చి వచ్చాను ఛా అంటాడు. అంటే ఏంటి నాన్నా.. జ్యోత్స్న చేసిన పనిని సమర్థిస్తున్నారా అని దశరథ్ అంటాడు. లేదురా కార్తీక్ గాడ్ని అనుమానిస్తున్నా అని శివనారాయణ అనగానే.. జ్యోత్స్న అయోమయంగా చూస్తుంది. అనుమానం ఏం లేదు తాతా.. ఈ అవార్డ్ పోతే పోయింది కానీ బావ మాత్రం చెప్పింది చెయ్యాల్సిందే.. అలా చూస్తూ ఉండు బావను నీ కాళ్ల దగ్గర పడేలా చేస్తా తాతా అని జ్యోత్స్న అంటుంది. దీన్ని ప్రతీకారం అంటారు జ్యోత్స్న  అని దశరథ్ అంటాడు. నేను మాత్రం న్యాయం అంటాను డాడీ.. బావ కారణంగా మన రెస్టారెంట్‌కి బ్యాడ్ నేమ్ వచ్చింది. తను నంబర్ వన్ అయ్యాడు. అన్నీ పక్కన పెడితే తాతను అవమానించాడు. అతడికి అతడి భార్య ఎక్కువైతే నాకు మా తాత ఎక్కువ.. అందుకే ఫలితం అనుభవిస్తాడని జ్యోత్స్న అంటుంది. లేదు మనవరాలా.. కావాలనే వాడు వాడి జుట్టు నీ చేతిలో పెట్టాడు. ఎందుకంటే వాడు మొదటి నుంచి గెలుస్తూనే ఉన్నాడు.. దీపను జైలు నుంచి విడిపించుకోవడం దగ్గర నుంచి ప్రాణాలు కాపాడుకోవడం వరకు.. చివరికి అవార్డ్ తీసుకోవడంలో కూడా తనే గెలిచాడు.. జాగ్రత్తగా ఉండు మనవరాలా.. వాడ్ని ఏదో నీ గుప్పెట్లో పెట్టుకున్నాననుకుంటున్నావ్ కానీ వాడు ఏదో పెద్ద ప్లాన్‌తోనే అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాడు.. నువ్వు అన్నవన్నీ మాటల్లో కాదు చేతల్లో చూపించు అప్పుడు నమ్ముతానని హెచ్చరించి లోపలికి వెళ్లిపోతాడు శివనారాయణ. కార్తీక్‌తో పెట్టుకోకు జ్యోత్స్నా అది నీకే మంచిది కాదని తిట్టి లోపలికి వెళ్లిపోతాడు దశరథ్. అవును జ్యోత్స్నా.. అసలు ఈ పగలు ప్రతీకారాలు ఎందుకు.. అంతా దేవుడే చూసుకుంటాడని సుమిత్ర అనగానే.. ఇదే మాట డాడీకి ఏదైనా అయ్యి ఉంటే మాట్లాడేదానివా మమ్మీ.. నన్ను తప్పుబట్టడం మానేసి.. డాడీకి నచ్చజెప్పు ముందు అనేసి జ్యోత్స్న కోపంగా లోపలికి వెళ్లిపోతుంది. ముందు నీ కూతురి తరపున నిలబడు సుమిత్ర ఇకనైనా అని పారిజాతం అంటుంది. దాంతో సుమిత్ర మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. వెంటనే పారిజాతం అందుకుంటుంది. నువ్వు కూతురి తరపునే ఉంటావ్ సుమిత్రా నాకు తెలుసు.. అయినా నా మనవరాలు సూపర్ స్కెచ్ వేసింది. ఇక్కడ వీళ్లను పడగొట్టింది. అక్కడ వాళ్లకు షాకిచ్చింది. సూపర్.. కానీ శివనారాయణ అన్నట్లుగా కార్తీక్ సంతకం పెట్టడానికి కారణం ఏదైనా ఉండి ఉంటుందా అని తనలో తానే అనుకుంటుంది. ఇక మరోవైపు అవార్డ్ ముందు పెట్టుకుని సంబరపడుతున్న కార్తీక్ వాళ్ల ఇంటికి జ్యోత్స్న ఎంట్రీ ఇచ్చి అగ్రిమెంట్ విషయంలో కార్తీక్‌తో తను సంతకం ఎలా పెట్టించుకుందో అంతా నిజమే చెప్తుంది. దీప, కాంచన, అనసూయ అంతా అల్లాడిపోతారు. జ్యోత్స్నని తిడుతుంటారు. ఇకపై బావ(కార్తీక్) నా బానిస అనే విషయం జ్యోత్స్న చెప్తుది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

అబ్బా భానుమతి...ఎంత అందంగా ఉన్నావో పళ్ళ తోటలాగా

  ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ ఎపిసోడ్ ని కిట్టి పార్టీగా తీసుకురాబోతోంది. ఈ ఎపిసోడ్ కి చక్రవాకం సీరియల్ హీరోయిన్ ప్రీతి అమీన్, ఋతురాగాలు శృతి, నటకుమారి, అమూల్య గౌడ వంటి వాళ్లంతా వచ్చారు. "బేసిక్ గా కిట్టి పార్టీలో రకరకాల గేమ్స్ ఆడుతూ ఉంటారు. మీకు ఏ గేమ్ ఇష్టం" అని అడిగింది హోస్ట్ శ్రీముఖి. "నాకు ఏ గేమ్ ఐనా గెలవడం ఇష్టం. అందుకే నేను ఈ హ్యాండ్ బ్యాగ్ తెచ్చాను" అని చెప్పింది ప్రీతీ...ఇక శృతి బ్యాగ్ చూసి శ్రీముఖి షాక్ అయ్యింది. "అమ్మో శృతి అక్క చూడు ఎంత పెద్ద బ్యాగ్ తెచ్చిందో" అనేసింది. గెలిస్తే వచ్చే డబ్బులు తీసుకెళ్లడానికి వీళ్ళు ఇంత పెద్ద బ్యాగ్ లు తెచ్చారు అన్నాడు హరి. తర్వాత శ్రీముఖి నటకుమారి దగ్గరకు వెళ్లి "ఎప్పుడైనా రియల్ లైఫ్ లో కిట్టి పార్టీకి వెళ్ళావా" అని అడిగింది శ్రీముఖి.."వెళ్ళలేదు ఎందుకంటే నన్ను ఎవరూ పిలవలేదు" అని చెప్పింది శ్రీముఖి. ఇక అమూల్య గౌడ దగ్గరకు వచ్చి "సీరియల్ లో ఎలా ఉంటావు మీనా...చీర కట్టుకుని పూలు అమ్ముకుని పిచ్చిదానిలా ఉంటావ్...ఇక్కడ చూడు ఎలా ఉన్నావో" అంది శ్రీముఖి. దాంతో అమూల్య బ్లాక్ డ్రెస్ బ్లాక్ గాగుల్స్ తో రాంప్ వాక్ చేసింది. తర్వాత భానుమతి దగ్గరకు వెళ్ళింది శ్రీముఖి "ఈవిడ కోసం కిట్టి పార్టీ ఏంటీ సొంతంగా పార్టీ కూడా పెట్టొచ్చు.. అంత అందంగా ఉన్నారు. మీ నాన్నగారికి ఏమన్నా పళ్ళ తోట ఉందా..అందుకేనా బుగ్గలు యాపిల్ పళ్ళలా..కళ్ళు ద్రాక్ష పళ్ళలాగా..పెదాలు చెర్రీ పళ్ళలాగా ఉన్నాయి " అని తెగ మోసేసాడు హరి. దాంతో మిగతా వాళ్లంతా ఓ అంటూ కేకలేశారు.

మళ్ళీ పెళ్లి చేసుకున్న జ్యోతక్క

సోషల్ మీడియా బాగా పెరిగాక చిన్న విషయం కూడా బాగా వైరల్ ఐపోతోంది. బుల్లితెర మీద శివ జ్యోతి అలియాస్ జ్యోతక్క ఎంత ఫేమస్సో అందరికీ తెలుసు. బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ కూడా. బిగ్ బాస్ లో ఎక్కువగా ప్రతీ విషయానికి జ్యోతక్క ఏడ్చేది. ఆ తర్వాత అన్ని షోస్ కి జ్యోతి రావడం మొదలు పెట్టింది. అలాగే తన భర్తతో కలిసి రావడం స్టార్ట్ చేసింది. జ్యోతక్కతో పాటు ఆమె భర్త గంగూలీ కూడా ఫుల్ ఫేమస్ అయ్యాడు. రీసెంట్ గా వీళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. 2015 లో వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. వీళ్ళ పెళ్లి వీడియోని చూసాక నెటిజన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు. కిర్రాక్ సీత, విష్ణు ప్రియా వంటి వాళ్లంతా విషెస్ చెప్తున్నారు. ఇంకొంతమంది ఐతే "ఒక్కసారి పెళ్లి చేసుకున్నందుకు చాలా జంటలు బాధపడుతున్నాయి. కానీ మీరు చాల గ్రేట్..ఎప్పుడూ ఇలాగే హ్యాపీగా ఉండండి. హమ్మయ ఈసారి అందరి  సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.  సూపర్, ఇంకా బాబో, పాపో వస్తే ఇంకా బాగుంటది. అక్క టెన్ ఇయర్స్ కి మళ్ళీ పెళ్లి ప్లానింగ్ బాగుంది. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ" అంటూ మెసేజెస్ పెడుతున్నారు. శివజ్యోతి న్యూస్ రీడర్ గా కెరీర్ ని స్టార్ట్ చేసింది. అప్పట్లో గంగులుని నిజామాబాద్ లోని సాయి బాబా ఆలయంలో పెళ్లి చేసుకుంది. తన యూట్యూబ్ ఛానల్ లో కూడా ఈ విషయం మీద ఒక వీడియో చేసింది. ఐతే ఈమె పై  రీసెంట్ గా బెట్టింగ్ యాప్స్ మీద కొన్ని ట్రోల్ల్స్ కూడా వచ్చాయి.  

నా కన్నీళ్లతో కడుగుతున్నా నీ మెట్లు..దుర్గమ్మా...నీవే దిక్కు సుమా

  తెలుగు ఇండస్ట్రీలో ఉండే ఆర్టిస్టులకు బయట కానీ జీవితంలో కానీ ఎన్నో కష్టాలు ఉంటాయి. బుల్లితెర మీద జానులిరి లైఫ్ లో కూడా అన్నే కష్టాలు ఉన్నాయి. ఆమె ఒక ఫోక్ డాన్సర్. ఢీ డాన్స్ షోలో ఆమె చేసిన డాన్స్ తో ఓవర్ నైట్ స్టార్ ఐపోయింది. ఆ ఇమేజ్ తోనే డాన్స్ ఐకాన్ సీజన్ 2 షోకి మెంటార్ గా కూడా వచ్చింది. అలాంటి జాను లైఫ్ లో మ్యారేజ్ విషయంగా కొన్ని ఇష్యుష్ ఉన్నాయని కొన్ని ఇంటర్వూస్ లో కూడా చెప్పింది. ప్రస్తుతం ఆమెకు తన కొడుకు లిరి తప్ప వేరే దేనికి ఇంపార్టెన్స్ లేదు అంటూ కూడా చెప్పుకొచ్చింది. అలాంటి జాను దుర్గమ్మ సన్నిధికి చేరుకొని ఆమె ఆశీర్వాదాలు కోసం మోకాళ్ళ మెట్ల పూజ చేసింది. కోనేటిలో తలారా పవిత్ర స్నానం చేసి పసుపు కుంకుమ తీసుకుని మోకాళ్ళ మీద ఒక్కో మెట్టు ఎక్కుతూ పసుపు కుంకుమ పెట్టుకుంటూ వెళ్ళింది. "నీళ్లతో కాదమ్మ నా కన్నీళ్లతో కడుగుతున్నా నీ మెట్లు... ఎవ్వరు లేకున్నా నాకు నువ్వున్నావన్న ధైర్యం...ఆ తర్వాత నీ ఇష్టం దుర్గమ్మ" అని చెప్తూ ఆ మెట్ల పూజ మొత్తాన్ని కూడా వీడియో తీసి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఐతే కామెంట్ సెక్షన్ ని లిమిట్ చేసింది జాను. ఐతే రీసెంట్ గా జాను రెండో పెళ్లి చేసుకోబోతోంది అన్న విషయం మీద సోషల్ మీడియాలో బాగా రచ్చ రాజుకున్న విషయం తెలిసిందే. శేఖర్ మాష్టర్ గురించి, జానూ గురించి నెటిజన్స్ దారుణంగా ట్రోల్ చేయడంతో తట్టుకోలేక జాను కూడా ఒక వీడియోని రిలీజ్ చేసింది. తన జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నారంటూ.. తనకు చావే శరణ్యం అంటూ కూడా ఆ వీడియోలో చెప్పింది. జానూ ఎపిసోడ్ సోషల్ మీడియాలో రెండు రోజులు హడావిడి నడిచింది. తర్వాత తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నానని..పెళ్లి చేసుకున్నాక కూడా తన కొడుకుతో కలిసి హాయిగా జీవిస్తానని చెప్పుకొచ్చింది. కొంత మంది నెటిజన్స్ తిడితే ఇంకొంత నెటిజన్స్ మాత్రం ఆమెకు సపోర్ట్ గా నిలబడ్డారు. తర్వాత తాను పెళ్లి చేసుకోబోయే అబ్బాయిని కూడా చూపించింది జాను.  

Brahmamudi : రుద్రాణి మాటని పట్టించుకోని రాజ్.. కావ్య మీకేమవుతారు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి(Brahmamudi)'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-727లో.. ప్లాన్ ఫెయిల్ అయ్యిందని యామినికి రుద్రాణి చెప్పడంతో తను మరో ఐడియా ఇస్తుంది. ఆ కళావతికి.. అత్తయ్యా, మావయ్య, అమ్మమ్మ, తాతయ్యా అంతా ఉన్నారు సరే.. మరి అత్త కొడుకు ఏమయ్యాడనే ప్రశ్నను రాజ్ ముందు పెట్టండి. అప్పుడు రాజ్.. అందరిని నిలదీస్తాడు. ఎవ్వరూ సమాధానం చెప్పలేరు. రాజ్ తన కొడుకు అన్న నిజం చెప్పలేక, కావ్య తన కోడలు ఎలా అయ్యిందో చెప్పలేక అపర్ణాదేవి గారు తెల్లముఖం వేస్తారంటూ యామిని చెప్తుంది. సూపర్ ఉంది ఐడియా ఇప్పుడే రాజ్‌తో మాట్లాడతానని రుద్రాణి అతని దగ్గరికి వెళ్తుంది. రాజ్‌కి అర్థమయ్యేలా చెప్పాలని రాజ్ ఒంటరిగా దొరికేవరకు కాచుకుని కూర్చుని రాజ్ ఒంటరిగా దొరకగానే రుద్రాణి అడిగేస్తుంది. తప్పుకోండి కళావతి కోసం వెళ్తున్నాను అడ్డు తప్పుకోండి అని రాజ్ అంటాడు‌. నేను కళావతి గురించే ముఖ్యమైన విషయం చెప్పాలని రుద్రాణి అంటుంది. చెప్పండి అని రాజ్ అనగా.. ఇప్పుడు ధాన్యలక్ష్మి ఉంది.. తనకు ఒక కొడుకు ఉన్నాడు.. పెళ్లి అయ్యింది కాబట్టి కోడలు ఉంది.. అలాగే నేను ఉన్నాను నాకు ఒక కొడుకు ఉన్నాడు.. పెళ్లి అయ్యింది కాబట్టి స్వప్న ఉందంటు రుద్రాణి చెప్తుంటుంది.  చూడండి.. మీకు కొంపలు కూల్చే పని తప్ప వేరే పని ఉండదని నాకు ఆల్రెడీ అమ్మ చెప్పింది. మీరు తప్పుకోండి.. గంట తర్వాత తీరిగ్గా చెబుదురుగాని అనేసి రాజ్ వెళ్లిపోతాడు. ఛ మంచి ఛాన్స్ పోయిందని రుద్రాణి బాధపడుతుంటే.. స్వప్న అక్కడికి వస్తుంది. మీరు మారరా.. మా చెల్లెలి విషయం బయటపెడితే మీకేమొస్తుంది అంటుంది. హేయ్ ఏం మాట్లాడుతున్నావని రుద్రాణి ఏం తెలియనట్లుగా నటిస్తుంటే.. మీరు మరీ అంతగా నటించొద్దు.. కావ్య పెళ్లి ఫొటో రాజ్‌కి ఎందుకు చూపించాలనుకున్నారు.. ఆ ఫొటో ఎందుకు అక్కడ పెట్టారని అంటుంది. అంటే ఆ ఫొటో మార్చింది నువ్వా అని రుద్రాణి అంటుంది. అంటే మీరు ఆ ప్రయత్నం చేసినట్లు ఒప్పుకున్నట్లే కదా అని స్వప్న అంటుంది. అంటే రాజ్‌కి గతం గుర్తు చెయ్యాలనుకున్నా అంతే అని రుద్రాణి కవర్ చేసుకుంటుంది. మరోసారి నా చెల్లెలు జోలికి వచ్చినట్లు తెలిసిందో నేను ఊరుకోను చెబుతున్నా.. జాగ్రత్తగా నడుచుకోండి అని రుద్రాణికి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది స్వప్న. ఇక తరువాయి భాగంలో రుద్రాణికి యామినీ కాల్ చేసి.. నేను నా మనుషుల్ని ఆ ఇంటికి పంపిస్తాను.. వాళ్లు జనాభా లెక్కల కోసం వచ్చినట్లుగా అందరి వివరాలు రాజ్ ముందే అడుగుతారు.. అప్పుడు అపర్ణా దేవి కొడుకు భార్య కావ్య అనే విషయం రాజ్ కి తెలిసిపోతుంది కదా అని రుద్రాణీతో క్లారిటీగా మాట్లాడుతుంది యామిని. సీన్ కట్ చేస్తే.. యామినీ మనిషి.. జనాభా లెక్కల సేకరణ వ్యక్తిగా నటిస్తూ ఇంటికి వస్తాడు. అంతా హాల్లోనే ఉంటారు. సుభాష్, ప్రకాశం, అపర్ణా దేవి ఇలా అంతా వారి వారి వివరాలు ఇంట్లో వాళ్ల వివరాలు చెప్తుంటారు. ఈవిడ మీకు ఏం అవుతారంటూ కావ్యని చూపించి అపర్ణా దేవిని అడుగుతాడు యామిని మనిషి. దాంతో అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu: ట్యూషన్ గురించి శ్రీవల్లి పెట్టిన చిచ్చు.. ధైర్యంగా మాట్లాడిన ప్రేమ!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు (illu illalu pillalu)'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-164లో.. రామరాజు, చందులకి శ్రీవల్లి భోజనం తీసుకొని వస్తుంది. ఇక అక్కడ తన డ్రామా స్టార్ట్ చేస్తుంది. ఇక రామరాజు తనకి మంచి కోడలు దొరికిందని సంబరపడతాడు. ఇంట్లో మీకు తెలియకుండా ప్రేమ ట్యూషన్ స్టార్ట్ చేసింది.. నలుగురికి తెలిస్తే మన కుటుంబ గౌరవం ఏమవుతందని రామరాజుకి అన్నీ ఎక్కించి చెప్తుంది శ్రీవల్లి. మరి బుజ్జమ్మ నాకు చెప్పలేదని రామరాజు అనగా.. అత్తయ్యకి తెలుసు వాళ్ళంతా ఒక్కటే అని శ్రీవల్లి అంటుంది.  మరోవైపు వేదవతి దగ్గరికి వచ్చిన ప్రేమ.. మామయ్య గారు రాగానే ట్యూషన్ గురించి మీరే చెప్పాలని అంటుంది. సరేనని వేదవతి అంటంది. ఇక శ్రీవల్లి వాళ్ళని చూసి .. ఆల్రెడీ చెప్పేశాను.. ఇక రణరంగమే అని అనుకుంటుంది.‌ ఇక రామారాజు ఇంటికి రాగానే.. మామయ్య గారు మంచినీళ్ళు తీసుకోండి అని ఇస్తుంది శ్రీవల్లి‌. తన బిహేవియర్ చూసి వేదవతికి కోపం వస్తుంది. ఇక రామరాజు చేతిలోని డబ్బుల బ్యాగ్ ని శ్రీవల్లి తీసుకుంటుంది. ఆ బ్యాగ్ ఇవ్వు .. నేను బీరువాలో పెడ్తానని వేదవతి అనగా.. నేను పెడ్తాలేండి అత్తయ్య అని శ్రీవల్లి అంటుంది. ఇక రామరాజు వారి మధ్యలో కల్పించుకొని.. తనని బ్యాగ్ తీసుకెళ్ళనివ్వు అని అంటాడు. ఇంతలో ప్రేమ వస్తుంది. మామయ్య గారు మీకు ఒక విషయం చెప్పాలని అంటుంది. నువ్వు ఆగమ్మా అని ప్రేమని ఆపిన రామరాజు.. నాకు చెప్పకుండా ఇంట్లో అందరు నిర్ణయాలు తీసుకుంటున్నారా అని వేదవతిని రామరాజు అడుగుతాడు. ఏ విషయం గురించి మాట్లాడుతున్నారండి అని వేదవతి అనగా.. మన ఇంట్లో ఈ అమ్మాయి ట్యూషన్ చెప్తుందంటా.. నిజమేనా అని రామరాజు అంటాడు. అవునండీ.. ప్రేమ కాలేజ్‌ నుంచి వచ్చిన తరవాత ఖాళీగానే ఉంటుంది కదా.. అందుకే ట్యూషన్ చెప్తానని అడిగింది. అయినా అది మంచి విషయమే కదా అని సరేనని అన్నానని వేదవతి అనగా.. ఓహో ఇంటికి సంబంధించిన విషయాలన్నీ మీరే మాట్లాడుకుని.. మీరే నిర్ణయాలు తీసుకుంటే ఇక నేనెందుకు.. రేపటి నుంచి నేను రైస్ మిల్లులోనే ఉండిపోతాను.. ఇక అన్ని నిర్ణయాలు నువ్వే తీసుకోమని రామరాజు అంటాడు. నాన్నా అయిపోయింది కదా.. ఇప్పుడెందుకు ఇంత గొడవా అని చందు అంటాడు. ఆ మాటతో శ్రీవల్లి.. ఐబాబోయ్.. దేవుడు లాంటి మామయ్యకి ఎదురు చెప్తారేంటి‌‌.. అడగనివ్వండీ.. ఆయన అడిగిన దాంట్లో తప్పేం ఉందని శ్రీవల్లి అంటుంది. నువ్వు ఆగు.. నీకేం తెలియదని చందు అనేసరికి.. మీరు ఆగండి బావగారూ.. నేను సమాధానం చెప్తానని ప్రేమ అంటుంది. చూడండి మామయ్యా.. మీకు చెప్పకుండా ట్యూషన్ స్టార్ట్ చేయడం తప్పే.. ఇది కావాలని చేసింది కాదు. పిల్లలు వస్తారో రారో అని అనుకున్నా.. మీ పర్మిషన్ తీసుకునే స్టార్ట్ చేద్దామనుకున్నా. కానీ సడెన్‌గా పిల్లలు వచ్చేశారంటు ప్రేమ గట్టిగానే సమాధానం ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2:  తాత తలవంచేలా చేసిన దీప.. గెలిచిన కార్తీక్ బాబు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2(Karthika Deepam2)'.  ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-363లో.. జ్యోత్స్న అవార్డు అందుకుంటున్నట్టు పగటికలలలు కంటుంది. అంతలోనో కార్తీక్‌ని అవార్డ్ అందుకోవడానికి రమ్మని మైక్ లో  అనౌన్స్ చేస్తారు. ఆ అలికిడికి కలలోంచి బయటికి వచ్చిన జ్యోత్స్న.. జరగబోయేది ఇదే కదా అనుకుంటుంది. తీరా స్టేజ్ మీద నుంచి కార్తీక్‌ని పిలిచేసరికి.. జ్యోత్స్ననే పైకి వెళ్లి.. అవార్డ్ అందుకునేది నేను.. కార్తీక్ కాదు... నీ నోటితో నువ్వే చెప్పు బావా.. అందరికీ క్లారిటీ వస్తుందని జ్యోత్స్న అంటుంది. ఇక కార్తీక్ స్టేజ్ పైకి వెళ్లి.. సత్యరాజ్ గారు ఈ ఒక్క విషయాన్ని వదిలెయ్యండి.. నాకు అంగీకారమే జ్యోత్స్నకు అవార్డ్ ఇవ్వడమే అంటాడు కార్తీక్. దాంతో జ్యోత్స్న హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంతలో అవార్డ్ అందుకునేది కార్తీక్ కాదు. జ్యోత్స్నే అంటూ యాంకర్  అనౌన్స్ చేస్తుంటుంది.  అప్పటికే కాంచన ఏడుస్తూ.. దీపతో... దీపా ఇప్పుడు కార్తీక్ అవార్డ్ తీసుకోకపోతే జీవితాంతం ఆ బాధ వెంటాడుతుందని అంటుంది. దాంతో దీప.. అనౌన్స్ చేసే ఆమెతో.. ఒక్క నిమిషం అంటుంది. దాంతో అనౌన్స్ చేయడం ఆపేస్తుంది ఆమె. ఇంతలో దీప పైకి వెళ్లి మైక్ తీసుకుని.. నేను కార్తీక్ బాబు భార్యను.. నేను మాట్లాడాలి అనుకుంటున్నాను.. నేను ఇలా స్టేజ్ మీద మాట్లాడటం మొదటిసారి. ఎలా మాట్లాడాలో తెలియదు కానీ ఏం మాట్లాడాలో తెలుసు అని దీప అంటుంది. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పండి అని జ్యోత్స్న అంటుంది. మీరు సత్యరాజ్ రెస్టారెంట్ పార్టనర్ షిప్ ఎప్పుడు తీసుకున్నారని జ్యోత్స్నని దీప అడుగగా.. ఐదురోజులు అయ్యిందని జ్యోత్స అంటుంది. సత్యరాజ్ గారు.. మరి ఈ అవార్డ్ ఈ ఐదురోజులు మాత్రమే చూసి ఇస్తున్నారా? లేక కార్తీక్ గారి పనితనం చూసి ఇస్తున్నారా అని దీప అనగా.. కార్తీక్ పనితనం చూసే ఇస్తున్నారని సత్యరాజ్ అంటాడు‌. అయితే ఈ అవార్డ్ న్యాయంగా ఎవరికి దక్కాలో శివనారాయణ తాతయ్య గారే చెబుతారని దీప అంటుంది. దాంతో శివనారాయణను స్టేజ్ మీదకు పిలుస్తాడు సత్యరాజ్. నేనే ఎందుకు చెప్పాలని శివన్నారాయణ దీపతో అనగా. మీరు పెద్ద మనిషిగా న్యాయం చెబుతారన్న నమ్మకం నాకుంది కాబట్టి.. సరే చూస్తున్న ప్రేక్షకులు కూడా న్యాయనిర్ణీతలే.. ఈ అవార్డ్ ఎవరు తీసుకోవాలని దీప మైక్ లో అంటుంది. కార్తీక్ కార్తీక్ అని అంతా అరుస్తారు. దాంతో శివనారాయణ మైక్ తీసుకుని.. ఈ అవార్డ్ కార్తీక్‌కి అందడమే న్యాయమని అంటాడు. దాంతో కార్తీక్‌కి బ్రేక్స్ వేయడానికి జ్యోత్స్న ప్రయత్నిస్తుంది. మీ తాతకు సమాధానం చెప్పు.. నేను అవార్డ్ తీసుకోకుండా ఆగిపోతానని జ్యోత్స్నతో కార్తీక్ అంటాడు. దాంతో కార్తీక్‌ని జ్యోత్స్న ఆపలేకపోతుంది. కిందున్న వాళ్ళంతా హ్యాపీగా ఉంటారు. మైక్ అందుకున్న కార్తీక్.. నేను ఈ స్థాయిలో నిలబడ్డానికి నా భార్య దీపే కారణం అంటూ దీపను పొగుడుతూ.. ఈ అవార్డ్‌కి నా భార్య కూడా అర్హురాలే కలిసి తీసుకుంటాం అంటాడు. ఇక దీప అప్పుడే అవార్డ్ శివనారాయణ గారి చేతుల మీద అందుకోవాలని కోరుతుంది. సత్యరాజ్ అందుకు ప్రోత్సహిస్తాడు. దాంతో శివనారాయణ తప్పక అవార్డ్ అందిస్తాడు. అప్పుడే కార్తీక్.. తాతతో తన ఛాలెంజ్ గుర్తు చేసి.. తాతా విధి ఎవరినీ వదిలిపెట్టదు.. సమాధానం చెబుతుందని అంటాడు. మేము వెళ్తాం.. అవార్డ్ ప్రధానం అయ్యింది కదా అని సత్యారాజ్‌కి చెప్పేసి జ్యోత్స్న ముందుకు వస్తాడు శివనారాయణ. చేసింది చాలు పదా.. ఆ అగ్రిమెంట్ సంగతేంటో తేల్చాలి అంటూ జ్యోత్స్నని శివన్నారాయణ ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

నన్ను సమాజానికి మగాడిగ పరిచయం చేసిన...

  శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో ఫుల్ జోష్ గ ఉంది. ఇందులో #90s లో కుర్రాడు రోహన్ రాయ్ బర్త్ డే సెలెబ్రేషన్స్ చేశారు. ఆది వెంటనే కుర్రాడు రోహన్ ని పట్టుకుని ముద్దు పెట్టుకుని బర్త్ డే విషెస్ చెప్పాడు. తర్వాత సౌమ్యకి ముద్దు పెట్టబోతే ఛి, ఏంటిది అని కసిరింది. దానికి ఆది "ఇవన్నీ తెలీకుండానే ఇంత పెద్ద కొడుకు ఉన్నదా మనకు" అంటూ ఒక రొమాంటిక్ డైలాగ్ చెప్పింది. వీళ్ళ కోసం ఒక బ్యానర్ ని కూడా ప్రిపేర్ చేశారు. "నానమ్మ-ఇంద్రజ,  అమ్మమ్మ- రష్మి,  బాబాయి - రాంప్రసాద్ ఆశీస్సులతో...నా  కష్టం నా  శ్రమ నా  శక్తి నా  చెమట చుక్క నా సమయం {2 నిమిషలు} వృధా  కానివ్వకుండా నన్ను సమాజానికి మగాడిగ పరిచయం చేసిన నా కోడుకు రోహన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు - ఆది...పైన చెప్పింది అంతా అబద్ధం...ఇట్లు సౌమ్య" అంటూ రాసిన బ్యానర్ ఫన్నీగా ఉంది. తర్వాత ఐస్ క్రీం బండి పేరుతో ఒక ఫన్నీ స్కిట్ వచ్చింది. ఇందులో నూకరాజు, నాటీ నరేష్ ఇద్దరూ కలిసి ఐస్ క్రీం అమ్మే వారిలా గెటప్ వేసుకొచ్చారు. "ఇంద్రజ గారు ఐస్ క్రీం లాంటి వారు. ఏ ఎదవ వెళ్లి ఎం చెప్పినా ఇట్టే కరిగిపోతార్రా పాపం" అంటూ ఇంద్రజ మీద నూకరాజు కామెంట్ చేసేసరికి " ఆ ఎదవా మీరే కదా" అంటూ సౌమ్య నూకరాజుకి కౌంటర్ వేసింది. ఆ తర్వాత ఇంకో ఇంటరెస్టింగ్ సెగ్మెంట్ వచ్చింది..అదే ఆర్టిస్ట్స్ 10th క్లాస్ మార్క్స్ లిస్టులు. నూకరాజు మార్క్స్ లిస్ట్ ని చూపించింది రష్మీ. 600 కి 490 మార్కులు వచ్చాయి అని ఆది చెప్పేసరికి నూకరాజు తాను ఇప్పుడు లా కోర్స్ చదువుతున్నానని చెప్పాడు. తర్వాత భాస్కర్, ఫైమా మార్క్స్ లిస్ట్ కూడా చూపించారు. ఫైనల్ గా బెట్టింగ్ యాప్స్ మీద ఒక స్కిట్ వచ్చింది.  

హోటల్ రూమ్ బుక్ చేసుకుని నేను అష్షు...

  ఫ్యామిలీ స్టార్  నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షో బుల్లితెర ఉన్న సగం స్టార్స్ అలాగే సింగర్స్ కూడా వచ్చారు. సమీరా భరద్వాజ్, సాకేత్ కొమాండూరి, పవిత్ర, టేస్టీ తేజ, తేజస్విని గౌడ, శోభా శెట్టి, రచ్చ రవి, పంచ్ ప్రసాద్, రంగస్థలం మహేష్ వంటి వాళ్లంతా వచ్చారు. ఐతే ఇక్కడ అష్షు రెడ్డి, చొక్కారావు స్రవంతి ఇద్దరూ కలిసి బాంగ్ కాక్ అని ఒకరు, కాదు గోవా అని ఒకరు పోటీ పడుతూ ఉండేసరికి సుధీర్ ఒక డౌట్ అడిగాడు. "గోవా అంటున్నారు, బాంగ్ కాక్ అంటున్నారు.. ఉండడానికి ఏది బెస్ట్ ప్లేస్" అని సుధీర్ అడిగేసరికి "నీకైతే తీహార్ కరెక్ట్ ఏమో అని నా డౌట్" అంది సమీరా..దాంతో సుధీర్ షాకైపోతాడు. తర్వాత శోభా శెట్టిని చూసి "శోభా గారు మీరు సముద్రంలోకి దిగను అంటేనే మిమ్మల్ని ట్రిప్ కి తీసుకెళ్తా" అంటాడు సుధీర్. "ఎందుకు" అంటుంది శోభా. "మీ పెదాలు తగిలి సముద్రపు నీళ్లు తియ్యగా ఐపోయి చేపలకు షుగర్ వస్తే" అంటూ ఒక సెటైర్ వేసాడు. దాంతో అందరూ నవ్వారు. తర్వాత అష్షు రచ్చ రవిని ఎక్కడ కలిసిందో చెప్పింది. "నేను రచ్చ రవి గారిని కలిసింది గోవాలోనే. సంపూర్ణేష్ బాబు సినిమాలో నేను రచ్చ రవి గారు కలిసి చిన్న క్యారెక్టర్స్ చేసాము. అక్కడ కలిసాము ఇద్దరం." అని చెప్పింది అష్షు. "ఆ ట్రిప్ కి వెళ్ళొచ్చిందగ్గర నుంచి గోవా లోనే ఉన్నారా" అని అడిగింది సమీరా. తర్వాత చొక్కారావు స్రవంతి చెప్పుకొచ్చింది.."నేను అష్షు ఒక రోజు...పెద్ద మూడ్ స్వింగ్స్ దీనికి. దుబాయ్ టికెట్స్ ఉన్నాయి పొద్దున్నే వెళ్లిపోదామా అని ముంబై తీసుకెళ్లింది. అక్కడ ఎం చేసామో తెలుసా ..ఎయిర్ పోర్ట్ దగ్గర ఒక హోటల్ రూమ్ బుక్ చేసుకుని ఇద్దరం.." అని చెప్పేసరికి "ఏంటి మీరిద్దరా" అంటూ రంగస్థలం మహేష్ అడిగేసరికి అందరూ షాకయ్యారు.  

Illu illalu pillalu : ట్యూషన్ లో ప్రేమ.. భాగ్యం ప్లాన్ లో శ్రీవల్లి!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -163 లో.....నర్మద ట్రైనింగ్ కి రెడీ అయి వెళ్తుంటే.. నేను కూడా నీతో వస్తాను.. నీ పక్కనే ఉంటానని సాగర్ అంటాడు. అంత లేదని నర్మద అంటుంది. అప్పుడే రామరాజు ఫోన్ చేసి అక్కడ పైసలు ఇచ్చేవాళ్ళున్నారు అంటూ అందరి అడ్రెస్ చెప్పి డబ్బు వసూల్ చేసుకొని రమ్మంటాడు. అదంతా పక్కన నుండి నర్మద విని కోపంగా.. నువ్వు ఇంతే అని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ప్రేమ ట్యూషన్ చెప్తుంది. అప్పుడే శ్రీవల్లి వెళ్తుంది. అక్క నువ్వు ఆ పాపకి ఇంగ్లీష్ లో పోయెమ్ చెప్పమని ప్రేమ అంటుంది. దాంతో శ్రీవల్లి కంగారుగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఏంటి అక్క అంత చదువుకుంది అయిన అలా కంగారుపడుతుందని ప్రేమ ఆలోచనలో పడుతుంది. ప్రేమ ఇలా ఇరికిస్తుందని టెన్షన్ గా వాళ్ళ అమ్మ భాగ్యంకి ఫోన్ చేసి జరిగింది చెప్తుంది. దాంతో భాగ్యం ఒక ప్లాన్ చెప్తుంది. ఆ తర్వాత చందు,రామరాజులకి శ్రీవల్లి క్యారేజ్ తీసుకొని వెళ్తుంటే.. రెండు ఎందుకు అని వేదవతి అడుగుతుంది. అంటే మావయ్య గారికి అని శ్రీవల్లి చెప్తుంది. ఆయన ఇంటికి వచ్చి భోజనం చేస్తారని వేదవతి చెప్తుంది. అయినా వినిపించుకోకుండా శ్రీవల్లి వెళ్తుంది. ఈ పిల్ల ఏంటి అన్ని మారుస్తుందని వేదవతి కి డౌట్ వస్తుంది. ఆ తర్వాత రైస్ మిల్ లో ఉన్న రామరాజు దగ్గరికి వెళ్లి బాక్స్ ఇస్తుంది. ఇలా కోడలు భోజనం తీసుకొని వచ్చిందని రామరాజు హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే రైస్ మిల్ లో కస్టమర్స్ తో మాట్లాడుతుంటే.. పిల్ల తెలివైంది అని తిరుపతి, రామరాజు అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : అవార్డు ఫంక్షన్ లో జ్యోత్స్న ఎత్తుగడ.. దీపకి షాకిచ్చిన కార్తీక్!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -362 లో..... బెస్ట్ రెస్టారెంట్ అవార్డు వచ్చినందుకు దీప వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. నాన్న రేపు అవార్డు ఫంక్షన్ కి ఈ డ్రెస్ వేసుకుంటానని శౌర్యా అంటుంది. రేపు మీరందరు ఎందుకు నేను ఒక్కడిని వెళ్తానని కార్తీక్ అంటాడు. మేమ్ కూడా వస్తామని అందరు అంటారు. రేపు అవార్డు అందుకునేది నేను కాదని ఎలా చెప్పాలని కార్తీక్ తన మనసు లో బాధపడతాడు. మరుసటి రోజు ఉదయం అవార్డు ఫంక్షన్ కి జ్యోత్స్న వెళ్తుంది. తను కార్తీక్ ప్లేస్ లో కూర్చుంటుంది. అప్పుడే సత్యరాజ్ వచ్చి ఈ సీట్ కార్తీక్ ది అని అంటాడు. ఇది అవార్డు అందుకునే వాళ్ళదని సత్యరాజ్ అనగానే అవార్డు నేనే అందుకుంటున్నానని జ్యోత్స్న అంటుంది. అప్పుడే కార్తీక్ తన కుటుంబంతో వస్తాడు. జ్యోత్స్న అవార్డు అందుకునేది నేనే అంటుందని కార్తీక్ తో సత్యరాజ్ అంటాడు. అప్పుడే శివన్నారాయణ అక్కడికి వస్తాడు. ఇక్కడికి ఎందుకు వచ్చావ్ జ్యోత్స్న.. నా పరువు తియ్యడానికా అని జ్యోత్స్నని శివన్నారాయణ కోప్పడతాడు. బావపై ఉన్న హక్కులన్నీ మనకి మార్చబడ్డాయ్ ఇప్పుడు అవార్డు అందుకునేది నేనే అని అగ్రిమెంట్ చూపిస్తుంది. అక్కడున్న వాళ్ళకి ఏం అర్ధం కాదు. కార్తీక్ కూడ సైలెంట్ గా ఉంటాడు. జ్యోత్స్న ఏం అంటుంది రా అని కాంచన అడుగుతుంది. నా కొడుకు గెలిచాడని ఓర్వలేక నువ్వు ఇలా మనవరాలిని పంపించావ్ కదా అని తన తండ్రి శివన్నారాయణతో కాంచన అంటుంది. ఆ తర్వాత కార్తీక్ స్టేజ్ పైకి వెళ్లి.. ఈ అవార్డు ఫంక్షన్ లో చిన్న మార్పు.. అవార్డు అందుకునేది నేను కాదు జ్యోత్స్న అని అనగానే దీప షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : కావ్యని ఇంప్రెస్ చేయడానికి రాజ్ ప్లాన్.. రుద్రాణి కొత్త ప్లాన్!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -726 లో... కావ్య ఫోటో పెట్టానని రుద్రాణి అనుకుంటుంది కానీ రాజ్ చూసేసరికి అక్కడ స్వప్న ఫోటో ఉంటుంది. ఇలా ఎందుకు మీ కోడలు ఫోటో పెట్టారని రుద్రాణిపై కోప్పడతాడు రాజ్. స్వప్న ఫోటో ఉండడం ఏంటని రుద్రాణి ఆలోచనలో పడుతుంది. అప్పుడే స్వప్న వచ్చి.. నా ఫోటో అలా పెట్టడానికి మీకు సిగ్గు లేదా అని స్వప్న కోప్పడుతుంది. రాజ్ కిందకి రాగానే కావ్యని ఇంప్రెస్ చెయ్యడానికి ఏం చేసావని ఇందిరాదేవి, అపర్ణ అడుగుతారు. చీర బొకె తీసుకొని వచ్చానని రాజ్ తీసుకొని వస్తాడు. అమ్మాయిని ఇంప్రెస్ చెయ్యాలంటే ఇవి తీసుకొని వస్తారా అని ఇందిరాదేవి నిరాశగా మాట్లాడుతుంది. నువ్వు ఇలా చేస్తావని తెలిసే నేనొకటి తీసుకొని వచ్చానని డ్రెస్ తీసుకొని వస్తుంది. బ్లాక్ డ్రెస్.. ఇది కావ్యకి ఇవ్వమని పంపిస్తుంది. రాజ్ డ్రెస్ ఇచ్చినట్లు కావ్య ఇంప్రెస్ అయినట్లు ఉహించుకుంటుంది. ఆ తర్వాత రాజ్ డిస్సపాయింట్ గా వచ్చి కావ్య ఆ డ్రెస్ బాలేదని తిట్టిన విషయం చెప్తాడు. మరొకవైపు రుద్రాణికి యామిని ఫోన్ చేసి ప్లాన్ ఏమైందని అడుగగా.. ఫెయిల్ అయిందని రుద్రాణి చెప్తుంది. దాంతో యామినికి మరింత కోపం వస్తుంది. ఇద్దరు కలిసి మళ్ళీ ఒక ప్లాన్ చేస్తారు. తరువాయి భాగంలో  రుద్రాణి ప్లాన్ లో భాగంగా జనాభా లెక్కలు అంటూ ఒక మనిషిని ఇంటికి పంపిస్తుంది. అతను అందరి వివరాలు కనుక్కుంటాడు. ఈవిడ మీకు ఏమవుతుందని  ఇంట్లోవాళ్ళని కావ్య గురించి అడుగుతాడు. అక్కడ రాజ్ ఉండడంతో కావ్య సమాధానం చెప్పలేకపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

బిగ్ బాస్ సీజన్ 9 కి ఛాన్స్ వస్తే వస్తావా ?

  బిగ్ బాస్ సీజన్ 9 త్వరలో ప్రారంభం కాబోతోందన్న వార్త ఇప్పుడు బిగ్ బాస్ ఫాన్స్ ని ఫుల్ ఖుషీ చేస్తోంది. ఐతే ఓల్డ్ బిగ్ బాస్ సీజన్స్ లో వచ్చిన కంటెస్టెంట్స్ ని మళ్ళీ ఈ కొత్త సీజన్ లో చూడొచ్చా అని కూడా కొంతమంది ఫాన్స్ అడుగుతున్నారు. ఇప్పుడు ఆర్జె కాజల్ ని కూడా అలాగే అడిగారొక ఫ్యాన్. "బిగ్ బాస్ సీజన్ 9 మిమ్మల్ని చూడొచ్చా" అని.. దానికి కాజల్ తన ఆన్సర్ ని ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది. "జీవితంలో కొన్ని విషయాలు చాలా విలువైనవి..వాటిని ఒక్కసారి మాత్రమే ఎక్స్పీరియన్స్ చేయాల్సి ఉంటుంది. మనసుకు హత్తుకునే సంఘటనలు ఏవైతే ఉంటాయో వాటిని అలాగే వదిలేయాలి కానీ వాటిని మళ్ళీ మళ్ళీ జరగాలని కోరుకోకూడదు. అది మీకైనా, నాకైనా, మనల్ని సపోర్ట్ చేసేవాళ్ళకైనా. నేనొక బిగ్ బాస్ ఫ్యాన్ గా ఎం చెప్తాను అంటే రి-ఎంట్రీస్ అంటే నాకు ఇష్టం ఉండదు. దానికి కట్టుబడి ఉన్నాను కాబట్టే నేను మళ్ళీ బిగ్ బాస్ లోకి రి-ఎంట్రీ ఇవ్వాలనుకోవడం లేదు. నా బిగ్ బాస్ సీజన్ 5 జర్నీ మాత్రం నాకు లైఫ్ టైం ఎక్స్పీరియన్స్, మర్చిపోలేనిది, ఎమోషనల్ గా, నన్ను నన్నుగా అక్కడ ఆవిష్కరించుకున్న ఒక వాల్యుబుల్ జర్నీ.  ఆ మెమోరీస్ ని అలాగే అపురూపంగా ఉంచుకోవాలని అనుకుంటున్నా కానీ రి-ఎంట్రీ ఇచ్చి వాటిని చెరుపుకోవాలని అనుకోవడం లేదు. ఎందుకంటే అవి టచ్ చేయలేనివి, మార్పులు చేర్పులు చేయలేనివి కాబట్టి ఆ జర్నీ నా మనసుకు ఎంతో హత్తుకుపోయింది..కాబట్టి నేను నెక్స్ట్ సీజన్ లో కనించను" అంటూ ఒక లాంగ్ పోస్ట్ ని తన స్టేటస్ లో పోస్ట్ చేసుకుంది కాజల్ ఆర్జే. మళ్ళీ ఆర్జేగా రావొచ్చు అని ఇంకో ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు..అస్సలు టైం సెట్ కావడం లేదు అందుకే రావడం లేదు అని చెప్పింది.