Illu illalu pillalu : శ్రీవల్లికి తిట్లు.. నర్మద మాటలకి సిగ్గుపడ్డ ప్రేమ!
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -180 లో.....రామరాజు ఇంటికి వచ్చి సాగర్ నర్మద శోభనానికి ముహూర్తం పెట్టించాలని అంటాడు. అది విని శ్రీవల్లి నవ్వుతుంది. ఎందుకు అలా నవ్వుతున్నావని రామరాజు అడుగుతాడు. అంటే మావయ్య హైదరాబాద్ లోనే సాగర్ , నర్మదల శోభనం జరిగిందని శ్రీవల్లి చెప్పగానే.. అందరు షాక్ అవుతారు. అక్క నాకు చెప్పలేదని ప్రేమ అంటుంది. అంటే సందర్భం రాలేదని నర్మద అంటుంది.
రామరాజు సైలెంట్ గా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఏ విషయం ఎవరితో ఎక్కడ చెప్పాలో తెలియదా అని శ్రీవల్లితో వేదవతి అంటుంది. శ్రీవల్లి పక్కకి వెళ్లి డాన్స్ చేస్తుంది. ప్రేమ, నర్మద శ్రీవల్లి దగ్గరికి వెళ్లి ఇండైరెక్ట్ గా శ్రీవల్లి ని తిడుతుంటారు. ఆ తర్వాత వేదవతి దగ్గరికి ప్రేమ, నర్మద వస్తారు. అసలు ఆ పిల్ల ఏంటే. ఏం మాట్లాడాలో తెలియదు..అలా చెప్తారా ఎవరైనా అని వేదవతి అనగానే ఏరి కోరి తెచ్చుకున్నారు కదా ముద్దులా కోడల్ని అంటూ ప్రేమ, నర్మద అనేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు.
ఆ తర్వాత ప్రేమ క్లాసికల్ డాన్స్ చేస్తుంటుంది. అప్పుడే ధీరజ్ వచ్చి బాగా చేస్తున్నావ్.. ఒకవేళ నీకు జాబ్ రాకపోతే పిల్లలకి డాన్స్ కూడా నేర్పించవచ్చని అంటాడు. మంచి ఐడియా ఇచ్చావని ప్రేమ అనుకుంటుంది. మరోవైపు చందుకి సేట్ ఫోన్ చేసి డబ్బు అడుగుతాడు. చందు టెన్షన్ పడతాడు. సాగర్, ధీరజ్, తిరుపతి వచ్చి ఏమైందని అడుగుతారు. చందు ఏం జరిగిందో చెప్తుంటాడు. అప్పుడే శ్రీవల్లి వస్తుంది. తరువాయి భాగంలో ప్రేమ, నర్మద ఒక రూమ్ లో పడుకుంటారు. ఏది ఏమైనా మీరు భార్యభర్తలు.. కలిసి కాపురం చెయ్యాలిసిందేనని ప్రేమతో నర్మద అనగానే ప్రేమ సిగ్గుపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.