మహేష్ బాబుతో డేటింగ్ చేయాలని ఉంది..

  ఐశ్వర్య పిస్సే బుల్లితెర ముద్దబంతి. ఈ మధ్య కాలంలో ఎన్నో షోస్ లో కనిపిస్తోంది. ఐతే ఒక చిట్ చాట్ ఎపిసోడ్ ఆమె ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చింది. అదేంటో తెలుసా.." "నేను కన్నడలో ఆర్కా మీడియా వాళ్లకు సీరియల్ చేస్తున్నాను. ఇక్కడ మాత్రం ఆర్కా మీడియాకి మంచి పేరుంది అలాగే పెద్ద ప్రొడక్షన్ హౌస్ కూడా దాంతో వాళ్ళే నన్ను తెలుగులో ఇంట్రడ్యూస్ చేశారు. నేను మొదట ఈటీవీలోనే నా పేరు మీనాక్షి సీరియల్ చేసాను. అలా వచ్చింది అవకాశం. టాలీవుడ్ ఎప్పటికైనా నా క్రష్ మహేష్ బాబు...డేటింగ్ చేసే అవకాశం వస్తే మహేష్ బాబుతోనే డేటింగ్ చేస్తాను. కాలేజ్ లో నేను చేసిన క్రేజి థింగ్ నేను ఫస్ట్ పీరియడ్ కి అసలు వెళ్లేదాన్ని కాదు..నా కోసం వెయిట్ చేస్తూ నా ఫ్రెండ్స్ కూడా కాలేజీ బంక్ కొట్టేవాళ్ళు. అలా బంక్ కొట్టి సినిమాకు వెళ్లాం. సీరియల్స్ చేస్తూ ఇక్కడి వరకు వచ్చాను కాబట్టి సీరియల్స్ అంటే చాల ఇష్టం. అప్పుడప్పుడు టీవీ షోస్ కి కూడా వెళ్తూ ఉంటాను. నా లైఫ్ లో రిటర్న్ రావాలి అని అనుకోవడం లేదు.. అన్నీ కరెక్ట్ గానే జరుగుతున్నాయి. ఫ్యూచర్ లో మంచి పాపులర్ అవ్వాలి. అందరూ నన్ను పొగడాలి...నా యాక్టింగ్ ని అందరూ ఇష్టపడాలి. మైథలాజికల్ క్యారెక్టర్ చేయడం నా డ్రీం రోల్. నన్ను తక్కువ చేసి మాట్లాడేవాళ్ళను నిలబెట్టి మాట్లాడదామనుకుంటాను కానీ ఎప్పుడూ నిలదీయను. మూవీస్ చేయాలి అంటే లక్ ఉండాలి. అక్కడ లక్ దొరుకుతుందో లేదో తెలీదు కానీ సీరియల్స్ చేయడమే నాకు కంఫర్ట్ గా ఉంటుంది.  నేను ఇక్కడ ఉండిపోతాను. తెలుగు, కన్నడ నుంచి బిగ్ ప్రాజెక్ట్స్ వస్తే తెలుగులో ఎక్కువ ప్రాజెక్ట్స్ చేస్తున్నా కాబట్టి తెలుగునే ఎంచుకుంటాను. నేను మేకప్ చేసుకునేటప్పుడు కానీ ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా అదే పనిగా చూస్తే మాత్రం వాళ్ళు ఎవరు అని కూడా చూడకుండా తిట్టేస్తాను. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో మాకు ఏమీ తెలిసేది కాదు. మేము ఎం చేయకపోయినా పెద్ద ఆర్టిస్టులను తిట్టలేక మమ్మల్ని తిట్టేవాళ్ళు ..ఆ విషయం చాల ఇబ్బందిగా అనిపించేది." అంటూ చెప్పుకొచ్చింది.

ఈ వయసులో కిస్సులు, హగ్గులు ఏంటి రష్మీ...

  జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో రామ్ ప్రసాద్ కిస్సులు, హగ్గులు అంటూ సరదాగా నవ్వించాడు. రాంప్రసాద్, దొరబాబు, శాంతిస్వరూప్ కలిసి ఒక స్కిట్ వేశారు. రాంప్రసాద్ కుర్చీలో ఊగుతూ దొరబాబుతో వార్తలు చదివించుకుంటూ ఉంటాడు. అందులో హెడ్ లైన్ గా "కిస్సులకు, హగ్గులకు ఒకే అన్న రష్మీ" అని చదువుతాడు. ఎవరైనా ఆ మాట వింటే సీరియస్ అవుతారు. కానీ రష్మీ మాత్రం సింపుల్ గా నవ్వుతూ "ఇది ఎప్పుడో అన్నాను నేను" అనేసరికి రాంప్రసాద్, దొరబాబు షాకై చూస్తూ ఉంటారు. "నీకు అభ్యంతరం లేకపోతే చూడడానికి మాకు ఉండాలి కదా అభ్యంతరం..ఈ వయసులో కిస్సులు, హగ్గులు బాగోవు కదా" అన్నాడు రాంప్రసాద్..ఆ మాటకు రష్మీ షాకయ్యింది. ఆ తర్వాత బులెట్ భాస్కర్ స్కిట్ లో భాస్కర్ కూడా రష్మీ మీద సెటైర్స్ వేసాడు. స్కిట్ లో భాగంగా వర్ష భాస్కర్ ని పెళ్లి చేసుకోవాలి అంటే భాస్కర్ వెనక పెద్ద ఫామిలీ ఉండాలి అని చెప్తుంది. వెంటనే భాస్కర్ రష్మీకి ఫోన్ చేసాడు. "హలో రష్మీ గారు. చాలా రోజుల నుంచి క్యారెక్టర్ అడుగుతున్నారు. నాకు అమ్మ క్యారక్టర్ లో చేయాలి చేస్తారా" అని అడిగాడు. వెంటనే రష్మీ "చెప్పు తీసుకుని కొడతా" అంది. ఇలా రాబోయే వారం జబర్దస్త్ లో స్కిట్స్ రష్మీ బేస్డ్ గా రష్మీని సెంట్రాఫ్ అట్రాక్షన్ గా చూపిస్తూ చేశారు. రీసెంట్ గా రష్మీ కొన్ని హెల్త్ ఇష్యూస్ ని ఎదుర్కొంది. అలాగే పుట్టినరోజుకు వేరే ప్లేస్ కి వీల్ చైర్ లోనే వెళ్లి సెలెబ్రేట్ చేసుకుని మరీ తిరిగొచ్చింది. ఇక ఆమెతో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వెళ్లి మంచిగా ఎంజాయ్ చేశారు. ఆ పిక్స్ ని, వీడియోస్ ని రష్మీ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేసింది.  

బిగ్ బాస్ టైటిల్ విన్నర్ విషయంలో జరిగేది ఇదే ..

బ్రహ్మముడి మానస్ బుల్లితెర మీద దూసుకుపోతున్న నటుడు. బ్రహ్మముడి సీరియల్ ద్వారా మంచి గ్రాఫ్ పెంచుకుని తెలుగు ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. అలాగే కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ షోలో చేస్తున్నాడు. డాన్స్ ఐకాన్ లో కూడా చేసాడు మానస్. అలాంటి మానస్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ విషయంలో ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చాడు. "బిగ్ బాస్ లో ముందుగానే విన్నర్ ఫిక్స్ అయ్యి ఉంటాడు అంటారు అది నిజమేనా" అని హోస్ట్ అడిగింది. "మా సీజన్ లో సన్నీ విన్నర్ అయ్యాడు..తర్వాత కౌశల్, రాహుల్ సిప్లిగంజ్ విన్నర్స్ అయ్యారు. ఎవరూ విన్నర్స్ విషయంలో ముందుగా ఊహించలేకపోయాం. బిగ్ బాస్ విన్నర్ ఫిక్స్ అనే మాట ఫేక్. ఆడియన్స్ మైండ్ ని డీవియేట్ చేయడానికి వాళ్లకు విన్నర్ ఎవరు అని మాట్లాడుకోవడానికి స్కోప్ ఇవ్వడం అన్నమాట. ఇక్కడ ఫిక్స్డ్ అనేది ఉండదు. అలాగే ఇక్కడ స్క్రిప్ట్ అనేదే ఉండదు. గతంలో కూడా చాలా మంది బిగ్ బాస్ స్క్రిప్టెడ్ కాదు అని చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ ఇటీవలి కాలంలో చాలా నెగటివిటీని మూట గట్టుకుంది. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా మొదలైన బిగ్ బాస్ మొదటి రెండు సీజన్ లకు ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యారు. కానీ ఆ తర్వాత వచ్చిన సీజన్స్ మాత్రం ఆడియన్స్ ని పెద్దగా అలరించలేకపోయాయి.  ఐతే బిగ్ బాస్ ని ఇంకా సరికొత్తగా మార్చి ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నారు.

నా జీవితం మొత్తం విష్ణు మాత్రమే ఉంటుంది

కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ ఈ వారం ఫ్రెండ్ షిప్ థీమ్ తో ఫుల్ జోష్ తో ఎంటర్టైన్ చేసింది. ఈ షోలో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి రకరకాల గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. ఇక విష్ణుప్రియా బెస్ట్ ఫ్రెండ్ రీతూ చౌదరి వచ్చింది. ఐతే "మీ ఫ్రెండ్ షిప్ లో బెస్ట్ మూమెంట్ ఏది అంటే ఎం చెప్తారు" అని శ్రీముఖి అడిగింది. "నాకు రీతూతో ఉండే ప్రతీ క్షణం చాలా బెస్ట్. మేమిద్దరం కంటి సైగతోనే నవ్వుకుంటాం. నాకు రీతూతో చాల ఎఫెక్షన్ ఉంది. నా కోసం రీతూ కూడా ఏమైనా చేస్తుంది." అని చెప్పింది విష్ణు ప్రియా. "మర్చిపోలేని సిట్యువేషన్ అని ఏదైనా ఉందా" అంటూ శ్రీముఖి రీతుని అడిగింది. "2023 జనవరి ఒకటో రెండో తెలీదు మేమిద్దరం ఒక ట్రిప్ కి వెళ్లాం..ఫ్లయిట్ టేకాఫ్ అవుతున్నప్పుడు మనం ట్రిప్ నుంచి వచ్చేసరికి మా అమ్మ బతికి ఉంటే చాలు అని ఒక మాట అంది. నాకేం అర్ధం కాలేదు. నేను పెద్దగా పట్టించుకోలేదు. మేము ట్రిప్ కి వెళ్లాం. బాగా ఎంజాయ్ చేసి తిరిగి వచ్చేసాం. తర్వాత జనవరి 22 న మా డాడీ చనిపోయారు. ఆ టైములో ఎం చేయాలో తెలీక విష్ణుకి కాల్ చేసాను. అప్పుడు విష్ణు ఒక ఈవెంట్ లో ఉంది. తన అసిస్టెంట్ ఫోన్ తీసాడు. కానీ విష్ణు మాత్రం మాట్లాడలేదు. నాకు కోపం వచ్చింది. రెండో రోజు నాన్న కార్యక్రమాలు ఐపోయాయి. నాకు మా అమ్మ, నాన్న, అన్న, విష్ణు ఉంటే చాలు అనిపించేది. అప్పుడు విష్ణు దగ్గర నుంచి  కాల్ వస్తే మా ఫ్రెండ్ నాకు ఫోన్ ఇచ్చి మాట్లాడమని చెప్పింది. మాట్లాడు వాళ్ళ అమ్మగారు చనిపోయారంట అని చెప్పింది. నాకు ఒక్క నిమిషం ఎం అర్ధం కాలేదు. బాధల్లో కూడా ఇలా కలిశామా అనిపించింది. నా లైఫ్ మా నాన్నను ఎవరైనా రీప్లేస్ చేయగలరు అంటే అది ఒక్క విష్ణు మాత్రమే. గోవా, తిరుపతి, అరుణాచలం, బ్యాంకాక్, పారిస్ అన్ని చోట్ల మొదటిసారిగా నన్ను తీసుకెళ్లింది విష్ణు మాత్రమే. నా జీవితం మొత్తం విష్ణు మాత్రమే ఉంటుంది." అని చెప్పింది రీతూ.

ఆ ఇద్దరికి శ్రీవల్లిపై డౌట్.. ధీరజ్ కి దగ్గరవుతున్న ప్రేమ!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -173 లో......శ్రీవల్లి చెల్లి బుజ్జి శ్రీవల్లి దగ్గరికి వస్తుంది. తను వచ్చేసరికి శ్రీవల్లి వంటచేస్తుంది. అక్కడ ఇదే వంట.. ఇక్కడ ఇదే వంటనా.. జాలిగా బావతో హనీమూన్ కి వెళ్లొచ్చు కదా అని అంటుంది. దాంతో శ్రీవల్లి సిగ్గుపడుతుంది.అప్పుడే చందు వచ్చి శ్రీవల్లిని పిలుస్తాడు. అక్క బావ వచ్చాడు.. హనీమూన్ గురించి చెప్పమని బుజ్జి పంపిస్తుంది. చందు సేట్ డబ్బు అడిగాడని టెన్షన్ లో ఉంటాడు. శ్రీవల్లి వచ్చి బావ మనం హనీమూన్ కి వెళదామంటూ చందుని మాట్లాడనివ్వదు. ఇక చందు సరే అంటాడు. ఇప్పుడు సేట్ డబ్బు కోసం ఆఫీస్ కి వచ్చి గొడవ చేసాడు. నువ్వు మీ అమ్మకి ఫోన్ చేసి డబ్బు ఏర్పాటు చెయ్యమని చెప్పమని అంటాడు. దాంతో శ్రీవల్లి టెన్షన్ పడుతూ సరే అని ఒక దగ్గరికి వెళ్లి ఏడుస్తుంది. అప్పుడే బుజ్జి వచ్చి.. ఏమైందని అడుగుతుంది. అమ్మ నాకు మోసం చేసి పెళ్లి చేసింది.. బావ చాలా మంచోడు.. అలాంటోడిని మోసం చేస్తున్నా.‌. డబ్బు అడిగాడని చెప్తుంది. దూరం నుండి నర్మద, ప్రేమ ఇద్దరు చూస్తుంటారు. ఏదో పది లక్షలు అంటూ టెన్షన్ పడుతున్నారు.. ఏంటని ప్రేమ నర్మద అనుకుంటరు. ఆ తర్వాత శ్రీవల్లి టెన్షన్ గా భాగ్యంతో ఫోన్ మాట్లాడుతుంది. నీ భర్తకి నువ్వే నచ్చజెప్పుకోమని శ్రీవల్లితో భాగ్యం అంటుంది. ఆ తర్వాత ఏంటి శ్రీవల్లి అక్క ఎందుకు టెన్షన్ పడుతుందని ప్రేమ, నర్మద అనుకొని.. తన చెల్లి బుజ్జితో కూల్ గా మాట్లాడి తనకి మెకప్ వేస్తూ తన నుండి అసలు విషయం రాబట్టలని అనుకుంటారు. పది లక్షలు ఎక్కడివి? ఎందుకు మీ అక్క టెన్షన్ పడుతుందని అడుగతారు. దాంతో బుజ్జి శ్రీవల్లి దగ్గరికి వెళ్లి ఇద్దరు అక్కలకి డౌట్ వచ్చిందని చెప్తుంది. ఏంటి నా చెల్లి ని ఏం అడుగుతున్నారని ప్రేమ, నర్మదలని శ్రీవల్లి అడుగుతుంది. తరువాయి భాగంలో నువ్వు ధీరజ్ ని ప్రేమిస్తున్నావని ప్రేమతో నర్మద చెప్తుంది. ధీరజ్ ఇంటికి రాగానే భోజనం పెడుతుంది. ధీరజ్ థాంక్స్ అని చెప్పగానే ప్రేమ తన వంక ప్రేమగా చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

దాస్ కోసం జ్యోత్స్న వెతుకులాట.. కన్నవారింటికి జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -372 లో...కార్తీక్ తో పాటు దీప కూడా శివన్నారాయణ ఇంట్లో పని చెయ్యడానికి సిద్ధం అవుతుంది. ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టం లేకున్నా ఒప్పుకున్నారు. కార్తీక్, దీప బయటకు వచ్చి మాట్లాడుకుంటారు. నువ్వు పని చెయ్యడం ఏంటని కార్తీక్ అడుగుతాడు. నా వాళ్లకి నేను చేస్తున్నానని దీప అంటుంది. ఇద్దరం కలిసి రెండు కుటుంబాలని కలపాలి. ఇదొక యాగం.. దీన్ని ఇద్దరం చేసి రెండు కుటుంబాలని కలపాలని దీపతో కార్తీక్ అంటాడు. ఇద్దరు కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. అప్పుడే పారిజాతం వచ్చి.. పనివాళ్ళు ఎంత సేపు మాట్లాడుకుంటారు. దీప నువ్వు వెళ్లి యజమానికి జ్యూస్ ఇవ్వు అని అనగానే దీప లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత దీప ఇంట్లో ఉందని సుమిత్ర చిరాకుగా ఉంటుంది. అప్పుడే దీప జ్యూస్ తీసుకొని వస్తుంది. దాంతో దీపని సుమిత్ర తిడుతుంది. అమ్మనాన్నలు లేని దానికి విలువ ఎలా తెలుస్తుందని పారిజాతం అనగానే.. నాకూ అమ్మ నాన్న ఉన్నారు. ఇక్కడే ఉన్నారు అని దీప అనగానే ఏంటి దీపకి నిజం తెలిసిందా ఏంటని జ్యోత్స్న కంగారు పడుతుంది. ఇంకా నయం మా సుమిత్ర, దశరథ్ లు అంటలేవని పారిజాతం అనగానే.. మీరు ఇంకొకసారి అలా పొరపాటున కూడ అనకండి అని పారిజాతంతో సుమిత్ర అంటుంది. సుమిత్ర కోపంగా అక్కడ నుండి వెళ్లిపోతుంది. సుమిత్ర కోసం తీసుకొని వచ్చిన జ్యూస్ పారిజాతం తాగుతుంది. ఇప్పుడు మనం ఒక ప్లేస్ కి వెళ్ళాలని పారిజాతంతో జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత పారిజాతాన్ని తీసుకొని దాస్ ఇంటికి వస్తుంది జ్యోత్స్న. అక్కడ స్వప్నతో పారిజాతం గొడవ పెట్టుకుంటుంది. దాస్ ఎక్కడ అని పారిజాతం అడుగగా.. ఇంట్లో నుండి వెళ్తున్నా.. నాకోసం ఎవరు వెతకొద్దు.. నేనే వస్తానని పేపర్ పై దాస్ రాసింది తీసుకొని వచ్చి జ్యోత్స్నకి ఇస్తాడు కాశీ. నాన్న ఎక్కడికి వెళ్ళడని జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. నాన్న అంటున్నావని కాశీ అంటుంటే పారిజాతం డైవర్ట్ చేస్తుంది. ఆ తర్వాత అక్కడ నుండి జ్యోత్స్న, పారిజాతం వెళ్లిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

యామిని ప్లాన్ విని వైదేహీ షాక్.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -736 లో.... కావ్యకి రాజ్ ప్రపోజ్ చేయబోతుంటే.. అప్పుడే వైదేహి రాజ్ కి ఫోన్ చేసి యామిని కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్తుంది. దాంతో రాజ్ ప్రపోజ్ చెయ్యకుండానీ వెళ్ళిపోతాడు. రాజ్ అలా వెళ్లిపోవడంతో కావ్యతో పాటు ఇంట్లో వాళ్ళందరూ డిస్సపాయింట్ అవుతారు. రాజ్ ఇంటికి వెళ్లి.. అసలు యామిని కి ఏమైందని అడుగుతాడు. డాక్టర్ యామినిని చెక్ చేసి రాజ్ ని బయటకు పిలిచి.. తను దేని గురించో టెన్షన్ పడుతుంది . స్ట్రెస్ తీసుకుంటుందని చెప్తాడు. ఆ తర్వాత డాక్టర్ వెళ్ళాక రాజ్ వైదేహితో మాట్లాడతాడు. అసలు ఏమైందని అడుగుతాడు అంత నీ వల్లే అలా అయింది.. నువ్వు తనని పట్టించుకోవడం లేదు.. చిన్నప్పటి నుండి బావ నా భర్త అని ఎన్నో కలలు కంటుంది.. నువ్వు తనని పట్టించుకోవడం లేదని వైదేహి అంటుంది. నువ్వు నాకొక మాటివ్వు అంటూ రాజ్ తో మాట తీసుకుంటుంది.  నువ్వు రెండు రోజులు యామినిని అలా బయటకు రెసాట్ కి తీసుకొని వెళ్ళమని రాజ్ తో యామిని వాళ్ళ అమ్మ అంటుంది. ఇక చేసేదేమీ లేక రాజ్ సరే అంటాడు. ఆ తర్వాత ప్లాన్ సక్సెస్ అంటూ యామిని తన పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. మరోవైపు ఇందిరాదేవి, అపర్ణ కలిసి కావ్య దగ్గరికి వచ్చి రాజ్ ప్రపోజ్ చెయ్యలేదని బాధపడుతుందనుకుంటారు. కానీ తను ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసాను.. ఇంకా రావట్లేదని చెప్తుంది. ఆ తర్వాత ఇందిరాదేవి రాజ్ కి ఫోన్ చేసి.. రేపు అయినా వచ్చి కావ్యకి ప్రపోజ్ చెయ్ అని చెప్తుంది. లేదు రేపు యామినిని రెసాట్ కి తీసుకొని వెళ్తున్నానని రాజ్ చెప్తాడు.  రేపు రెసాట్ కి తీసుకొని వెళ్తున్నావ్ కానీ ఏం ప్లాన్ చేస్తున్నావని యామినిని వైదేహీ అడుగుతుంది. రేపు బావతో నా శోభనం.. అలా జరిగితే నన్ను బావ వదిలిపెట్టి వెళ్ళడు కదా అని యామిని అంటుంటే.. అలా ఎవరైనా చేస్తారా అని వైదేహి కోప్పడుతుంది. మరొకవైపు అప్పు, కళ్యాణ్ శోభనం గదిలో ఉంటారు. అప్పు దగ్గరికి కళ్యాణ్ వస్తుంటే.. అప్పు మాత్రం ఫోన్ చూస్తుంది. దాంతో కళ్యాణ్ ఫీల్ అవుతాడు. తరువాయి భాగంలో రాజ్ ని యామిని రెసాట్ కి తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

అమరదీప్-తేజస్విని ఫ్యూచర్ ఏఐ రూపంలో ఇలా...

  అమరదీప్ - తేజస్విని గౌడ బుల్లి తెర మీద సీరియల్స్ ద్వారా షోస్, ఈవెంట్స్ ద్వారా ఆడియన్స్ పరిచయమే. అలాంటి తేజు రీసెంట్ గా కాకమ్మ కథలు షోకి గెస్ట్ గా వచ్చింది. అందులో ఆమె ఎన్నో విషయాలను చెప్పింది. "నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసాక అనుకోకుండా నేను ఇండస్ట్రీకి వచ్చాను. తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఏడేళ్లు అయ్యింది. నిజంగా నేను చాలా లక్కీ నా గ్రాఫ్ ఇండస్ట్రీలో అలానే వెళ్తోంది. కోయిలమ్మ సీరియల్ టైములో నేను అమర్ ని కలిసాను. అప్పుడు అమర్ నాతో మాట్లాడాడు..నన్ను చూస్తూ ఉంటాను అని చెప్పి ఫోన్ నంబర్ తీసుకున్నాడు. ఆ తర్వాత కాల్ చేయడం, చాట్ చేయడం చేసేవాడు. మే బి ట్రై చేసాడేమో అప్పుడే...నేను అప్పుడే అనుకున్నాను కానీ పడలేదు నువ్వు అంటుంటాడు. ఆ తర్వాత ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళం. ఈవెంట్స్, షోస్ లో కలిసినప్పుడు ఫ్రెండ్స్ లా ఉండేవాళ్ళం. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక మ్యారేజ్ చేసుకుందాం అంటూ ప్రొపోజ్ చేసేసాడు. అప్పటివరకు నా మైండ్ లో అలాంటి థాట్స్ లేవు. కానీ పెళ్లి అని సడెన్ గా చెప్పేసరికి నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను. చిన్నప్పటి నుంచి నాన్న లేకపోవడంతో చాలా స్ట్రాంగ్ గా ఉండేదాన్ని. దాంతో నేను ఎప్పుడూ అలాగే ఉండేదాన్ని. కానీ మా అమ్మ నన్ను చాలా జాగ్రత్తగా చూసుకునేది. కానీ బయట ఫాదర్స్ ని చూసినప్పుడు ఒక ఫీలింగ్ ఉండేది. అమ్మ ఇండిపెండెంట్ విమెన్ కాబట్టి ఆమె నన్ను కూడా అలానే పెంచారు. ఈ రెండేళ్ల నుంచి నేను కొన్ని అనుకోని సంఘటనలు ఎదుర్కొన్నాను. అలాంటి టైమ్స్ లో డాడీ ఉండుంటే ఆ పరిస్థితి వేరేలా ఉండేది కదా అనుకున్నా.." అంటూ చెప్పింది. ఇక హోస్ట్ తేజు ఐతే అమరదీప్-తేజస్విని ఫ్యూచర్ ఎలా ఉందో ఏఐ యూజ్ చేసి ఒక పిక్ ని చూపించింది. అందులో అమర్ - తేజు వాళ్లకు ఇద్దరు పిల్లలు ఉన్నట్టుగా అది రాబోయే ఫ్యూచర్ ఫామిలీ అని చూపించింది హోస్ట్ తేజస్విని మడివాడ.

Illu illalu pillalu : భాగ్యం చేసిన మోసం భయటపడుతుందా.. టెన్షన్ లో శ్రీవల్లి!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -172 లో.... ధీరజ్ ని విశ్వ అవమానిస్తుంటే ప్రేమ వచ్చి.. విశ్వ ఫ్రెండ్స్ కి బుద్ది చెప్తుంది. దాంతో వాళ్ళు భయపడి అక్కడ నుండి వెళ్ళిపోతారు. చిన్న ఎర్రమిరపకాయలాగా ఉంది అందరిని భయపెట్టిందని ధీరజ్ అనుకుంటాడు. ఆ తర్వాత ప్రేమ, ధీరజ్ ఇద్దరు కాలేజీకి వస్తారు. ఎందుకు వాళ్ళని అలా అన్నావని ధీరజ్ అడుగుతాడు. నిన్ను అలా తక్కువ చేసి మాట్లాడుతుంటే.. నేను ఎలా ఉరుకుంటానని ప్రేమ అంటుంది. నన్ను అంటే నీకేంటి అని ధీరజ్ అడుగుతాడు. నాకేం ప్రేమ అంటుంది. ఆ తర్వాత నర్మద ఆఫీస్ నుండి నడుచుకుంటూ వెళ్తుంటే.. సాగర్ వస్తాడు. కాసేపు సాగర్ తో నర్మద అయిష్టంగా మాట్లాడుతుంది కానీ సాగర్ తన కోపాన్ని తగ్గిస్తాడు. ఇద్దరు కలిసి సరదాగా బయటకు వెళ్తారు. ఆ తర్వాత చందు ఆఫీస్ లో ఉండగా తనకి అప్పు ఇచ్చిన సేట్ చందు దగ్గరికి వచ్చి నాకు డబ్బు ఇవ్వాలని గొడవ పెడతాడు. మరొకవైపు శ్రీవల్లి వంట చేస్తుంటే తన చెల్లి బుజ్జి వస్తుంది. తరువాయి భాగంలో శ్రీవల్లి బుజ్జితో అమ్మ మోసం చేసి పెళ్లి చేసింది. ఆ పది లక్షల రూపాయల విషయం ఎక్కడ తెలుస్తుందో.. నా కాపురం ఎక్కడ చెడిపోతుందోనని భయపడుతున్నానని బుజ్జితో శ్రీవల్లి చెప్తుంటే దూరం నుండి ప్రేమ, నర్మద చూస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగింహో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : కన్నవాళ్ళ దగ్గరగా దీప.. జ్యోత్స్న ప్లాన్ ఏంటంటే !

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -371 లో.... శివన్నారాయణ ఇంటికి వస్తాడు కార్తీక్. తనతో పాటు దీప కూడా వస్తుంది. కార్తీక్ బాబుతో ఎందుకు అలా పని చేయించుకుంటున్నావని దీప అడుగుతుంది. నువ్వు బ్రతకడానికి నేనే సాయం చేసాను.. అందుకేనని జ్యోత్స్న అంటుంది. నా భర్త  నా కోసం ఇదంతా చేస్తున్నప్పుడు.. నేను తన కష్టం పంచుకోవాలి కదా అని దీప అంటుంది. నేను ఇక్కడే ఉండి ఇక నుండి పని చేస్తానని దీప అంటుంది. నీ మొహం చూస్తూ మేం ఎలా ఉంటాం వద్దని సుమిత్ర కోప్పడుతుంది. ఇంత అమాయకరాలివి ఏంటే దీప.. బావకి పని చెప్పేదే నిన్ను బాధపెట్టాడనికి, అలాంటిది నువ్వు కళ్లారా చూసి బాధపడుతా అంటున్నావని జ్యోత్స్న తన మనసులో హ్యాపీగా ఫీల్ అవుతుంది. వద్దని శివన్నారాయణ అంటుంటే.. చెయ్యనివ్వండి తాతయ్య అని జ్యోత్స్న శివాణన్నారాయణని కన్విన్స్ చేస్తుంది. దాంతో వాళ్ళు ఒప్పుకుంటారు. ఆ తర్వాత దీప, కార్తీక్ బయటకు వస్తారు. నువ్వేంటి ఇక్కడ పని చేయడం ఏంటని కార్తీక్ అంటాడు. తప్పేముంది బాబు.. నా కన్నవాళ్ళకి చేస్తున్నానని దీప హ్యాపీగా చెప్తుంది. ఇప్పుడు అందరి దృష్టిలో నేను మోసగత్తెను కానీ నాకు తెలియకుండానే నా ఇంటి నుండి పొందాల్సినవి పొందానని దీప హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : అప్పుని తిట్టేసిన ధాన్యలక్ష్మి.. యామిని కుట్ర అదే!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -735 లో....రాజ్, కావ్యలని గజదొంగ ఛార్లెస్ తాళ్లతో కట్టేస్తాడు. దాంతో రాజ్ తెలివిగా తన మోబైల్ ని తీసుకొని.. మీరు వెతుకుతున్న దొంగ ఇక్కడే ఉన్నాడని అప్పుకి మెసేజ్ చేస్తాడు. అది చూసిన అప్పు షాక్ అవుతుంది. వెంటనే కళ్యాణ్ కి చెప్పి కార్ ఆపుతుంది. ఇద్దరు కలిసి ఇంటికి బయల్దేర్తారు. రాజ్ అప్పటికే తెలివిగా తాళ్లని విప్పుతాడు దొంగని పట్టుకొని తాళ్లతో కట్టేస్తాడు. అప్పుడే అప్పు, కళ్యాణ్ ఇంటికి రాగానే.. పై నుండి మూట కట్టి దొంగని కిందకి విసిరేస్తాడు. నువ్వు ఇంకొకసారి తప్పించుకుంటే నేనే నిన్ను చంపేస్తానని దొంగకి వార్నింగ్ ఇస్తుంది అప్పు. దొంగ ని కానిస్టేబుల్ కి అప్పగిస్తుంది. ఇప్పుడు మనం పైకి ఎలా వెళ్ళాలని అప్పు, కళ్యాణ్ ఆలోచిస్తుంటే.. నేను హెల్ప్ చెయ్యాలా అని ప్రకాష్ తాడు ఇస్తాడు. ఆమ్మో అత్తయ్య చూస్తుందని అప్పు భయపడుతుంది. అప్పుడే వాళ్ళని ధాన్యలక్ష్మి చూస్తుంది. ఇంట్లో పెద్ద పంచాయతీ పెడుతుంది. ఇలా నువ్వు వెళ్ళేది కాకుండా నా కొడుకుని కూడా తిప్పుతున్నావా అని అప్పుని ధాన్యలక్ష్మి తిడుతుంది. అప్పు దొంగని పట్టుకోవడానికి వెళ్ళింది. ఆ దొంగ మనింట్లో దొరికాడు.. లేదంటే దొంగ వళ్ళ ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లమ్ అయ్యేదని కళ్యాణ్ చెప్పగానే.. ఇంట్లో అందరు అర్ధం చేసుకుంటారు. అందరు కలిసి రాజ్ కావ్యల దగ్గర కి వెళ్తారు. మాకు అప్పు, కళ్యాణ్ అంత చెప్పారని ఇందిరాదేవి అంటుంది. కావ్య బయటకు వస్తుంది. రాజ్ తన చెయ్ పట్టుకొని ఆపుతాడు. కావ్యకి రాజ్ ప్రపోజ్ చేయబోతుంటే అప్పుడే రాజ్ కి ఫోన్ వస్తుంది. తరువాయి భాగంలో రాజ్ ని ఈ రోజు నా సొంతం చేసుకుంటాను.. బావకి నాకు శోభనం.. అలా అయితే బావ నన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటాడని యామిని ప్లాన్ చేసి వాళ్ళ అమ్మ వైదేహితో చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

సర్కార్ సీజన్ 5 జూన్ 6 నుంచి ఆడియన్స్ ముందుకు

ఓటిటి ప్లాట్ఫారం మీద వచ్చే క్విజ్ షోస్ లో సర్కార్ షోకి ఒక స్పెషల్ ప్లేస్ ఉంది. ఇప్పటి వరకు ఇది 4 సీజన్స్ ని పూర్తి చేసుకుంది. ఆహా ఓటిటి ప్లాట్ఫారం మీద ఈ షో బాగా సక్సెస్ సాధించింది. ఇప్పుడు సీజన్ 5 తో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ షో గ్లిమ్ప్స్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. మొదటి 3 సీజన్స్ కి ప్రదీప్ హోస్ట్ గా చేసాడు 4 వ సీజన్ కి ఇప్పుడు రాబోతున్న 5 వ సీజన్ కి సుధీర్ హోస్ట్ గా వున్నాడు. ఇక ఈ షో ప్రతీ శుక్రవారం కొత్త ఎపిసోడ్ రాబోతోంది. జూన్ 6 నుంచి షో ఆడియన్స్ ముందుకు వచ్చేయబోతోంది. "ఒకటే ఆట ఆడే నాకీ...ఏదోలా గెలిసే నాకీ ఇంత పెద్ద బతుకెందుకు..ఏదైనా ఈ స్టేజి మీద ఉన్నప్పుడే సేసెయ్యాల...ఆడతామా ఏటి మళ్ళీ...సర్కార్ సీజన్ 5 ..ఇక్కడ ఆడేది గెలవనీకి కాదు...నువ్వెందో అందరికీ తెల్వనీకి.." అంటూ తన కటౌట్ తో షో థీమ్ చెప్పాడు సుధీర్. సుధీర్ ని చూసిన నెటిజన్స్ ఐతే "గేమ్ చెంజర్ ఈజ్ బ్యాక్...ఆట మొదలయ్యింది. " అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ సర్కార్ గేమ్ షో అనేది 2021 లో స్టార్ట్ అయ్యింది. ఈ షోకి ఇంతవరకు అనన్య నాగళ్ళ, సుహాస్, కాజల్, సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్, నందిని రెడ్డి, మాళవికా నాయర్, బ్రహ్మాజీ, అల్లరి నరేశ్, నిహారిక కొణిదెల, సదా, కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి, నవదీప్  వంటి ఎంతో మంది ఈ షోకి గెస్టులుగా వచ్చి మూవీ ప్రొమోషన్స్ చేసుకున్నారు గేమ్ షో ఆడారు. ఇక ఈ సీజన్ 5 కి ఎలాంటి గెస్టులు వస్తారో చూడాలి.  

ఫంక్షన్స్ లో దొంగతనంగా వెళ్లి తినేవాళ్ళం...

కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ షో రాబోయే వారం షో ప్రోమో చూస్తే ఎవ్వరికైనా కన్నీళ్లు రాకమానవు. ఈ న్యూ ఎపిసోడ్ ని ఫ్రెండ్ షిప్ థీమ్ గా రాబోతోంది. దాంతో ఈ షోలో కంటెస్టెంట్స్ అంతా కూడా వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ ని తీసుకొచ్చారు. ఇక శేఖర్ మాష్టర్ కోసం కూడా ఒక ఫ్రెండ్ వచ్చాడు. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన ఎవరో కాదు సత్య మాష్టర్. ఇద్దరి మధ్య అంత ఎమోషనల్ బాండింగ్ ఎలా ఫార్మ్ అయ్యింది అని శ్రీముఖి అడిగేసరికి "ఉదయం 5 గంటలకే లేచేవాళ్ళం. రాత్రి వరకు మాకు డాన్స్ మాత్రమే ప్రపంచం అంతకు మించి మాకు ఇంకేం తెలీదు. మాకు ఆ టైములో తినడానికి కూడా ఏమీ ఉండేది కాదు. ఐదేళ్లు అలా ఉన్నాం. దొంగచాటుగా ఫంక్షన్ హాల్స్ కి వెళ్ళేవాళ్ళం.. అక్కడే ఎక్కువగా తినేవాళ్ళం. అక్కడ తినేటప్పుడు రేయ్ ఎవర్రా మీరు. ఎవరి తరపున అని అడిగితే నేను మాట్లాడేవాడిని కాదు నాకు భయం అందుకే వీడే సమాధానం చెప్పేవాడు. అలా ఎన్నో సార్లు మాకు సత్యసాయి కల్యాణ మండపం, సవేరా ఫంక్షన్ హాల్ ఉండేవి. అవే మమ్మల్ని చాలావరకు కాపాడాయి. చెప్తారు కదా కష్టాల్లో ఉన్న ఫ్రెండ్ ని ఎవరూ ఎప్పటికీ మర్చిపోలేరని..మేము కూడా అలాగే కష్టాల్లోనే పెరిగాం ఎం మాట్లాడాలో అర్ధం కావట్లేదు." అంటూ శేఖర్ మాష్టర్ ఎమోషనల్ అయ్యాడు. రాకేష్ మాష్టర్ దగ్గర ఇప్పుడు ప్రముఖ కొరియోగ్రాఫర్స్ గా ఉన్న శేఖర్ , జానీ, సత్య మాష్టార్లు శిష్యులుగా ఉండేవాళ్ళు.  ఇక శేఖర్ మాష్టర్ విషయానికి వస్తే రీసెంట్ గా ఆయన కొన్ని ట్రోలింగ్స్ ని కూడా ఎదుర్కొన్నారు. ఐతే రీసెంట్ గా "దబిడి దబిడి" సాంగ్ విషయంలో అలాగే "మిస్టర్ బచ్చన్" మూవీలోని సాంగ్ విషయంలో, పుష్ప 2 లో పీలింగ్స్ సాంగ్స్ విషయంలో కోరియోగ్రఫీ చేసి విమర్శలు ఎదుర్కున్నాడు. ఆ స్టెప్స్ వల్గర్ గా ఉన్నాయనే కామెంట్స్ ని ఫేస్ చేసాడు.  

Illu illalu Pillalu: అన్నదమ్ముల మధ్య గొడవ.. ధీరజ్ కి తోడుగా ప్రేమ!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-171లో.. చందు ఆఫీస్ కి రెడీ అవుతుంటే అప్పుడే శ్రీవల్లి వస్తుంది. మా ఆయన బంగారం.. ఎంత అందంగా ఉన్నారో నా దిష్టే తగిలేటట్టు ఉందని శ్రీవల్లి అనగానే చందు మురిసిపోతాడు. ఇక శ్రీవల్లికి చందు ముద్దు ఇవ్వాలనుకుంటాడు కానీ తను ఆపుతుంది. డోర్ ఓపెన్ లో ఉందని శ్రీవల్లి అనగానే చందు వెళ్ళి డోర్ క్లోజ్ చేసి వస్తాడు. ఆ తర్వాత తనకి ముద్దు ఇచ్చి బయటకు వస్తాడు.  కాసేపటికి మిల్లుకి బయల్దేరడానికి సాగర్  బయటకు వస్తాడు. అదే సమయంలో చందు రావడంతో తనతో మాట్లాడతాడు. అన్నయ్య వదినకి చెప్పు.. నర్మదతో జాగ్రత్తగా మాట్లాడమని, అన్నింట్లో కలుగజేసుకోవద్దని చెప్పని చందుతో సాగర్ అంటాడు. వీళ్ళ మాటల్ని వేదవతి వింటుంది. ఇక చందు తన భార్యకి సపోర్ట్ చేసి మాట్లాడతాడు. నువ్వు నీ భార్యతో కలిసి ఎంజాయ్ చేయాలంటే నాన్నకి ఓ మాట చెప్తే సరిపోతుంది కదరా.. మీ ఫోన్ కలవట్లేదని నాన్న అంటే మీ ఇద్దరి ఫోటోలని వదిన నాన్నకి చూపించింది‌‌.. అందులో తప్పేం ఉంది.. నువ్వు తప్పు చేశావ్ ఇంకోసారి వదినతో జాగ్రత్తగా మాట్లాడమని నర్మదకి చెప్పు అని సాగర్ తో చందు అంటాడు. నువ్వు మారిపోయావ్ అన్నయ్య.. పెళ్ళికి ముందు నేనేదైనా తప్పు చేస్తే నువ్వు నాకు సపోర్ట్ చేసేవాడివి.. ఏదైనా నాన్నకి చెప్పలేకపోతే నీతో చెప్పేవాడివి కానీ ఇప్పుడేమో నీలో కొత్త మనిషి కన్పిస్తున్నాడంటూ సాగర్ ఎమోషనల్ అవుతాడు. కానీ చందు అదేం పట్డించుకోకుండా.. నర్మదని వదినతో జాగ్రత్తగా మాట్లాడమని చెప్పేసి వెళ్ళిపోతాడు. మరోవైపు  ధీరజ్ తన ఫ్రెండ్ బైక్ అడిగి తీసుకుంటాడు. ఆ తర్వాత కొరియర్ బాయ్ డ్రెస్ వేసుకొని వెళ్తుండగా విశ్వ చూస్తాడు. ఇక చిక్కాడు అని అనుకున్న ధీరజ్ తన ఫ్రెండ్స్ తో కలిసి ఆడుకోవాలనుకుంటాడు. అందరి ఫోన్ ల నుండి ఆర్డర్ పెట్టమని చెప్తాడు. రాంగ్ లొకేషన్ పెట్టి ధీరజ్ ని అటుఇటు తిప్పుతారు. ఇక ఫైనల్ గా వాళ్ళ దగ్గరికి వచ్చిన ధీరజ్ ఫుల్ కోపంగా వెళ్తాడు. కానీ వాళ్ళ నాన్న అన్నమాటలు గుర్తొచ్చి సహనంగా ఉంటాడు. దాంతో విశ్వ అతని ఫ్రెండ్స్ కలిసి ధీరజ్ ని ఆడుకుంటారు. అప్పుడే అటుగా వెళ్తున్న ప్రేమ చూసి వాళ్ళ దగ్గరికి వచ్చి వార్నింగ్ ఇచ్చి పంపిస్తుంది. నీకు సంబంధం లేదని ప్రేమతో విశ్వ అనగా.. ఇలాంటివి చేసి ఇంకా దిగజారకు అన్నయ్య... ధీరజ్ నా మొగుడు అని ప్రేమ అంటుంది. ఆ మాటలు విని ధీరజ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi:  దొరికిపోయిన గజదొంగ ఛార్లెస్.. కావ్యకి రాజ్ ప్రపోజ్ చేయగలడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి (Brahmamudi)'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-734లో.. అప్పు, కళ్యాణ్ ల శోభనం గదిని డెకరేట్ చేసిన రాజ్, కావ్య ఇద్దరు అదే గదిలో ఉంటారు. అప్పు, కళ్యాణ్ ఇద్దరు కలిసి ఛార్లెస్ అనే దొంగ కోసం బయటకు వెళ్తారు. అదే సమయంలో ధాన్యలక్ష్మికి డౌట్ వచ్చి అప్పు, కళ్యాణ్ ల గది దగ్గరికి వెళ్తుంది. ఇక రాజ్, కావ్య తెలివిగా ఆలోచించి.. వారి మొబైల్ ఫోన్ లో ఆల్రెడీ రికార్డ్ చేసిన అప్పు, కళ్యాణ్ ల వాయిస్ రికార్డింగ్స్ ని ప్లే చేస్తారు. అది విని ధాన్యలక్ష్మి ఇద్దరు గదిలోనే ఉన్నారని కన్ఫమ్ చేసుకుంటుంది.  ఇక ధాన్యలక్ష్మి గది బయట డోర్ దగ్గర ఉండగా ప్రకాశ్ వస్తాడు. ఇలా కొడుకు, కోడలి శోభనం జరుగుతుంటే బయట నువ్వు ఉండటం తప్పు అని కోప్పడి తనని తీసుకెళ్తాడు. ఆ తర్వాత అప్పు చార్లెస్ దొంగ కోసం వెళ్తుంది. వాడు తప్పించుకొని రాజ్, కావ్య ఉన్న గదిలోకి దూరతాడు. మరోవైపు రాజ్, కావ్య ఇద్దరు కలిసి ఛార్లెస్ అనే దొంగ గురించి వెతకడానికి అప్పు వెళ్ళిందని మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఇద్దరు గొడవపడుతుంటారు.  అదే సమయంలో ఛార్లెస్ దుగ్గిరాల ఇంటికి వస్తాడు. సరిగ్గా శోభనం గది దగ్గరికి వస్తాడు. అక్కడ అప్పటికే రాజ్, కావ్య ఇద్దరు గమనించిన ఛార్లెస్ లైట్లు ఆపేసి.. రాజ్, కావ్యని తాడుతో కట్టేస్తాడు. ఆ తర్వాత లైట్లు ఆన్ చేస్తాడు ఛార్లెస్. అతడిని చూసిన రాజ్, కావ్య ఇద్దరు షాక్ అవుతారు. నువ్వేంట్రా ఇక్కడ, అప్పు నా చెల్లి తను నాలాగా సాఫ్ట్ కాదంటూ చార్లెస్ కి కావ్య వార్నింగ్ ఇస్తుంది. చార్లెస్ అవేమీ పట్టించుకోకుండా  శోభనం గదిలోని స్వీట్లు తింటుంటాడు. ఇక రాజ్ తెలివిగా ఆలోచించి తన ఫోన్ ని తీసుకొని అప్పుకి మెసెజ్ చేయలానుకుంటాడు. కమింగ్ అప్ లో  కావ్యకి రాజ్ తన మనసులో మాట చెప్పాలనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ  వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2: తాతగారింటికి దీప.. నాన్నను చూసి ఎమోషనల్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' కార్తీక దీపం2(Karthika Deepam2)'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-370లో.. దీపకు నిజం చెప్పిన కార్తీక్.. ఆ తర్వాత అనసూయగారిని అడుగమని సలహా ఇస్తాడు. తీరా అనసూయతో మాట్లాడాక తట్టుకోలేక దీప గుడికి వెళ్లి గుడి ముందు దీపాలు వెలిగించి.. అక్కడే కూర్చుని ఏడుస్తుంటుంది. కార్తీక్ వెళ్లి దీపను ప్రేమగా పలకరించి.. నిజం తెలిసింది కదా.. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా అడుగులు వెయ్యాలి దీపా.. లేదంటే మన తాత, సుమిత్ర అత్త, దశరథ్ మావయ్య అంతా ప్రమాదంలో పడతారు.. నిజానికి ఆ జ్యోత్స్న వాళ్లను చంపేసినా చంపేస్తుంది. కన్నతండ్రినే చంపాలనుకున్న మనిషి.. వాళ్లంతా తనకు ఓ లెక్క కాదు.. అందుకే నన్ను ఆ ఇంటికి వెళ్లనీ దీపా.. ఆ మనుషుల్లో మీపైన ఉన్న కోపాన్ని తగ్గిస్తాను.. నిన్ను ఆ ఇంటికి చేరుస్తానని రిక్వెస్ట్ చేస్తాడు. దానికి దీప కూడా ఒప్పుకుంటుంది. మరోవైపు కార్తీక్ పని చేయడానికి ఇంటికి రాలేదని జ్యోత్స్న ఎదురు చూస్తుంది. అప్పుడే వచ్చిన పారిజాతం.. నీ బావ రాడే.. ఆ దీప రానివ్వదు.. చూస్తూ ఉండు.. కావాలంటే వెయ్యి బెట్టు అని కామెడీగానే మాట్లాడుతుంది. జ్యోత్స్న విసుగ్గా కార్తీక్ ఇంటికి వెళ్లిపోతుంది. అక్కడ జ్యోత్స్నని కాంచన తిడుతుంది. పోవే నా ఇంటికి రాకు నువ్వు.. నా కొడుకుని అంత బాధపెడుతున్నావా నువ్వు.. మమ్మల్ని ఇలా బతకనివ్వరా నువ్వు మీ తాతా అంటూ తిడుతూనే ఉంటుంది. నేను ఇక్కడికి వచ్చింది.. బావ కోసం.. అది కూడా మరదలిగా రాలేదు.. యజమానిగా వచ్చానని అంటుంది. ఇంతలో కార్తీక్, దీప ఇద్దరు అక్కడికి వస్తారు. వెంటనే కార్తీక్ చేతులు కట్టుకుని అతి వినయం ప్రదర్శిస్తూ.. నమస్తే యజమానిగారు.. పని వాళ్ల కోసం అంత దూరం నుంచి కారేసుకుని రావడం దేనికో అని అడుగుతాడు. నా గొంతులో ప్రాణం ఉండగా కార్తీక్ బాబుని నేను రానివ్వనని ముందురోజు రాత్రి దీప అన్న మాటలు జ్యోత్స్నకి గుర్తొస్తాయి. దీపనే అయోమయంగా చూస్తుంటుంది. నేను ఇటు మాట్లాడుతుంటే తమరు నా భార్యను చూస్తారేంటీ ఓనర్ గారు అని కార్తీక్ అంటాడు. టైమ్ ఎంతైందని జ్యోత్స్న అడుగగా.. ఓర్నీ.. అది అడగటానికి ఇంత దూరం వచ్చారా అంటు కాసేపు ఎటకారంగా మాట్లాడతాడు కార్తీక్. నేనే అడ్డపడటం లేదు.. కార్తీక్ బాబు వస్తారని దీప అంటుంది దాంతో అటు జ్యోత్స్నతో పాటు.. కాంచన, అనసూయ కూడా షాక్ అయ్యి చూస్తుంటారు. కార్తీక్ బాబు శివనారాయణ తాతయ్యగారి ఇంటికి వెళ్తారు.. మీరు మౌనంగా ఉండండి అత్తయ్యా అని దీప అంటుంది. దాంతో వాళ్లు మౌనంగా ఉంటారు. నా భార్య చెప్పింది విన్నారుగా మీరు వెళ్లొచ్చని జ్యోత్స్నతో అంటాడు కార్తీక్. ఇక చేసేదేమీ లేక జ్యోత్స్న ఇంటికి పోతుంది. కార్తీక్ వెనుకే సైకిల్ మీద ఆ ఇంటికి వెళ్తుంటాడు. ఏంటి దీపా ఇది అని కాంచన అడుగగా.. కొన్ని రోజులు ఓపిక పట్టండి అత్తయ్యా అనేసి దీప వెళ్లిపోతుంది. దీప కార్తీక్ ఒకే మాట మీద ఉన్నారంటే వీళ్లిద్దరూ ఏదో మాట్లాడుకున్నారు చెల్లమ్మా అని కాంచనతో అనసూయ అంటుంది. అది ఏమై ఉంటుందని కాంచన ఆలోచిస్తుంటుంది. కాసేపటికి శివన్నారాయణ ఇంటికి దగ్గరికి దీప వస్తుంది. గుమ్మం దగ్గరే దీప నిలబడి.. ఇదే ఇంటికి అనాథగా రప్పించావ్.. ఇక ఈ ఇంటి బిడ్డగా అడుగుపెడుతున్నాను.. నాకు ఆటంకాలు రాకుండా చూడు గడప తల్లి అని దన్నం పెట్టుకుని మరీ కుడి కాలు పెడుతుంది. రావద్దని సుమిత్ర అరుస్తున్నా దీప వస్తుంది. నువ్వు ఎందుకు వచ్చావ్ దీపా అని కార్తీక్ అంటుంటే.. ఇక్కడ అన్యాయం జరుగుతోంది న్యాయం కోరడానికి వచ్చానని దీప అంటుంది. ఏంటి ఆ అన్యాయమని  జ్యోత్స్న అడుగగా.. శివనారాయణ చెప్పనివ్వడు. దీపను బయటికి పొమ్మంటాడు. శివనారాయణ, జ్యోత్స్న, సుమిత్ర, పారిజాతం అంతా ఏకమై దీపను మాట్లాడనివ్వరు. దాంతో దశరథ్ మధ్యలో కలుగజేసుకొని దీప తరపున మాట్లాడతాడు. తను వచ్చింది కార్తీక్ భార్యగా.. తను చెప్పేది మనం వినాల్సిందే అని దశరథ్ అంటాడు. అమ్మా దీపా నువ్వేం చెప్పాలి అనుకుంటున్నావని దీపను దశరథ్ అడుగుతాడు. ఆ మాటతో కార్తీక్ నిజాలు చెప్పిన సీన్ గుర్తొస్తుంది దీపకు. దశరథ్ నీ కన్నతండ్రి అన్న కార్తీక్ మాట గుర్తు రాగానే.. మనసులో నాన్నా అనుకుంటూ దీప చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

బాలకృష్ణ గారితో నటించా..వైఎస్ఆర్ చేతులమీదుగా నంది అవార్డు తీసుకున్నా

మానస్ నాగులపల్లి బుల్లితెర మీద ఇప్పుడు టాప్ హీరోగా ఉన్నాడు. బ్రహ్మముడి సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే ప్రైవేట్ ఆల్బమ్స్ తో కూడా మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. అలాగే కొన్ని వెబ్ సిరీస్ లు కూడా చేస్తున్నాడు. బుల్లితెర మీద అన్ని షోస్ లో కనిపిస్తూ ఉన్నాడు. అలాగే మానస్ రీసెంట్ గా ఒక షో ఇంటర్వ్యూకి వచ్చి ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నాడు. "నేను బాలకృష్ణ గారితో నా ఫస్ట్ డెబ్యూ ఫిలిం నరసింహ నాయుడు మూవీ చేసాను. వైజాగ్ లో గురజాడ కళాక్షేత్రం కానివ్వండి కళాభారతి కానివ్వండి మనం చేయని డాన్స్ పెర్ఫార్మెన్సెస్ అంటూ ఏవీ లేవు. నేను వైజాగ్ బుల్లోడిని. బలకృష్ణ గారికి బ్రాండ్ ఉంది కానీ నాకు బ్రాండ్ తో సంబంధం లేదు. ఏదైనా ఓకే. గ్లాస్ మేట్స్ చాలా మంది ఉన్నారు. అమరదీప్ ఉన్నాడు అంటే గ్లాస్ పట్టుకుని వచ్చేస్తాడు. వాడికి ఇంటరెస్ట్ అన్నమాటా ఎక్కువ సేపు కూర్చోవాలి నాతో టైం స్పెండ్ చేయాలనీ ఉంటుంది. అమరదీప్ నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఇద్దరం కలిసి ఒక ప్రాజెక్ట్ చేసాం. నాకు బాగా గుర్తు..వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు తొలిసారి సీఎం ఐనప్పుడు ఆయన చేతుల మీద అలాగే దాసరి నారాయణ రావు గారి చేతుల మీదుగా నంది అవార్డు తీసుకున్నా. నాకు అమర్ కి, నిఖిల్ కి, అంబటి అర్జున్ కి పోటీ విషయం ఏమో కానీ మనోడికి  ఒక ఆరు నెలలు కంప్లీట్ బ్రేక్ వచ్చింది. అప్పుడు అతను బ్లేమ్ చేయడం స్టార్ట్ చేసాడు. నేను ఎక్స్పెక్ట్ చేశా ఇలా చేస్తాడని..ప్రియాంక సింగ్ అంటే కోపం, అభిమానం, ఇష్టం కానీ బిగ్ బాస్ వరకే. ఇప్పుడు అసలు టచ్ లో కూడా లేదు. నా వైఫ్ నాన్ ఫిలిం బ్యాక్ గ్రౌండ్ ...ఐనా ఆడవాళ్ళకు కోపం కొంతవరకే. దేవుడు అంటే పవర్ నేను శివుడిని పూజిస్తాను. నీ చుట్టూ ఎవరు లేనప్పుడు, నిన్ను ఎవరూ నమ్మనప్పుడు కచ్చితంగా శివయ్యను నమ్మితే చాలా మంచి జరుగుతుంది.." అని చెప్పాడు మానస్.  

శివయ్య మీద ఒట్టు...సెకండ్ షోకి వెళదామా

  కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ రాబోయే ఆదివారం ప్రోమో ఫుల్ జోష్ తో నిండిపోయి కనిపించింది. ఈ షోకి "భైరవం" మూవీ టీమ్ నుంచి బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, డైరెక్టర్ విజయ్ కనకమేడల, నిర్మాత రాధా మోహన్ వచ్చారు. ఈ మూవీ ప్రొమోషన్స్ కోసం రావడం ఏమో కానీ మంచు మనోజ్ వన్ మ్యాన్ ఎపిసోడ్ లా ఉండబోతోందా అని ఈ ప్రోమో చూస్తే అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడూ లేనంత జోష్ తో మనోజ్ ఫుల్ కామెడీని పంచాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్ స్టేజి మీదకు రాగానే శ్రీముఖి ఐతే "హార్టీ వెల్కమ్ టు యు" అంది "లివర్ వెల్కమ్ టు యు" అంటూ మనోజ్ పంచ్ డైలాగ్ వేసేశాడు. అందరూ నవ్వారు. తర్వాత జైల్లో ఉన్న శ్రీసత్యని చూసాడు. "పాపం ఆవిడ పరిస్థితి ఏమిటిప్పుడు" అని అడిగాడు. "ఆవిడ రెండు రోజుల నుంచి జైల్లోనే ఉందండి" అని చెప్పింది శ్రీముఖి. "పాపం ఒక్కతే ఉందిగా నేను కంపెనీ ఇస్తాను డోర్స్ తియ్యండి" అంటూ కౌంటర్ వేసాడు. తర్వాత ప్రొడ్యూసర్ రాధ మోహన్ ఐతే రౌడీ రోహిణితో డ్యూయెట్ డాన్సులు వేసి అందరినీ అలరించాడు. ఇక డైరెక్టర్ విజయ్ వచ్చి "ఇంతవరకు దిల్ రాజు గారికి పోటీ లేదనుకున్నాం కానీ మా ప్రొడ్యూసర్ రాధామోహన్ అంతకు మించి మంచి పోటీ ఇస్తున్నారు" అంటూ కౌంటర్ వేసాడు. తర్వాత "అనసూయ గారు భైరవం గురించి మీ మాటల్లో" అని శ్రీముఖి అడిగింది. అనసూయ చెప్పబోయేంతలోనే కామెడీగా మంచు మనోజ్ "టాక్ యా" అంటూ కామెడీ చేసాడు. "నేను ఇంకా సినిమా చూడలేదు...శ్రీనివాస్ గారు మీరు" అని అనసూయ అనేంతలా "సెకండ్ షోకి వెళదామా " అంటూ మనోజ్ మళ్ళీ ఆవిడని మాట్లాడనివ్వకుండా కామెడీ చేసాడు. "మీరు వర్క్ చేసిన ఇంతమంది డైరెక్టర్స్ లో మై ఫ్రెండ్ అనిపించే డైరెక్టర్ ఎవరు..విజయ్ గారు ఉన్నారు కదా అని విజయ్ గారు ఉన్నారు కదా అని ఆయన పేరు చెప్పొద్దూ" అంది. వెంటనే మనోజ్ మాత్రం విజయ్ వైపు వేలు చూపించాడు. "ఆ శివయ్య మీద ఒట్టేసి చెప్తున్నా" అన్నాడు మనోజ్. ఇలా ఈ వారం మనోజ్ ఈ షోలో ఫుల్ ఎంటర్టైన్ చేయబోతున్నాడు.  

Illu illalu pillalu : ధీరజ్, విశ్వ మధ్య గొడవ.. మొగుడికి సపోర్ట్ గా ప్రేమ!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -170 లో.... ధీరజ్ దగ్గరికి ప్రేమ వస్తుంది. నువ్వు మీ నాన్న అన్న మాటలకి ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసని ప్రేమ అంటుంది. నాన్న అన్న దాంట్లో కూడా నిజం ఉంది. ఎందుకంటే నాన్న కష్టపడి పైకి వచ్చాడు. అలా మేం కూడా వస్తేనే  కదా మాకు గౌరవమని ధీరజ్ అంటాడు. ఖచ్చితంగా నాకంటూ ఒక పేరు సంపాదించుకుంటా అని ధీరజ్ అంటాడు. దాంతో ప్రేమ హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు సాగర్ ని వేరొక జాబ్ చూసుకోమని నర్మద చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళ అమ్మ భాగ్యానికి శ్రీవల్లి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తుంది. నేను చెప్పినట్లు చెయ్ అని భాగ్యం శ్రీవల్లి కి ఏదో చెప్తుంది. ఆ తర్వాత శ్రీవల్లి ఏడుస్తూ గదిలోకి వస్తుంది. ఏమైందని చందు అడుగుతాడు. మావయ్య కి ఫొటోస్ చూపించానని నర్మద నన్ను తిట్టిందని చందుతో చెప్తుంది శ్రీవల్లి. మరుసటి రోజు రామరాజు మిల్ కి వెళ్ళడానికి రెడీ అవుతాడు. అప్పుడే ధీరజ్ కాలేజీ కి రెడీ అవుతాడు. బైక్ దగ్గరికి వచ్చేసరికి రామరాజు అన్న మాటలు గుర్తుచేసుకొని 'కీ' వేదవతికి ఇచ్చేసి నడుచుకుంటూ వెళ్తాడు. చూసారా మీరు అన్న మాటలకి వాడు ఎంత బాధ పడ్డాడోనని రామరాజుతో వేదవతి చెప్తుంది. నేను వాళ్ళకి బాధ్యత తెలియడానికే కదా అలా అన్నది అని రామారాజు అంటాడు. తరువాయి భాగంలో ధీరజ్ ఫుడ్ డెలివరీ కి వెళ్తాడు. అక్కడ ధీరజ్ ని విశ్వ అవమానిస్తుంటే అప్పుడే ప్రేమ వచ్చి విశ్వతో గొడవపడుతుంది. నీకు సంబంధం లేదని విశ్వ అంటుంటే.. ధీరజ్ నా మొగుడు అని ప్రేమ అంటుంది. అది విని ధీరజ్ ఆశ్చర్యంగా చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.