నువ్వు మాస్ ఐతే నేను మానస్ ఊరమాస్ ఇక్కడ...

  జబర్దస్త్ షో న్యూ ప్రోమో ఇప్పుడు అందరినీ అలరిస్తోంది. న్యూ చాప్టర్ బిగిన్స్ అని ఏదైతే చెప్పారో అది ఈ ఎపిసోడ్ లో కనిపించబోతోంది అన్న విషయం తెలుస్తోంది. ఇంత మార్పులు ఈ షోలో వస్తున్నా కూడా సుధీర్ ఎపిసోడ్ కి మాత్రం ఫుల్ స్టాప్ పడడం లేదు. ఇక జడ్జ్ ఖుషూ వచ్చి అన్నీ డబుల్ గా ఉండబోతున్నాయా అంది. అవును యాంకర్ కూడా డబుల్ కాబోతున్నారు అని చెప్పింది. ఇక రష్మీ  పక్కన బ్రహ్మముడి హీరో మానస్ సెకండ్ యాంకర్ గా వచ్చేసాడు. ఐతే రావడమే ఒకప్పుడు సుడిగాలి సుధీర్ ఎలా ఐతే కళ్ళజోడు తీసి పెట్టి తనదైన మ్యానరిజమ్ ని చేసేవాడో మానస్ కూడా అలాగే చేసాడు. ఇక రష్మీ ఐతే ఉడుక్కుంది. "తెల్ల తోలు కదా స్టైలిష్ గా ఉంటది హలో మాస్ ఇక్కడ మాస్ పిల్ల" అంది.."నువ్వు మాస్ ఐతే నేను మానస్ ఊరమాస్ ఇక్కడ" అని కౌంటర్ డైలాగ్ వేసాడు. ఇప్పటి వరకు టీం లీడర్స్ మధ్యలో పోటీ జరిగింది కానీ ఇప్పుడు యాంకర్స్ మధ్యలో పోటీ ఉండబోతోంది అని చెప్పింది ఖుష్భూ. జబర్దస్త్ అమ్మాయి వెర్సెస్ ఖతర్నాక్ అబ్బాయి పేరుతో వీళ్ళ మధ్య పోటీ జరగబోతోంది. ఇక స్కిట్స్ మీద ఆడియన్స్ స్పందనలు కూడా ఈ షోలో ఉండబోతున్నాయి ఇక. "చూసావా రష్మీ ఇప్పటి నుంచి మానస్ గాడి హవా స్టార్టవబోతోంది అంటూ కళ్ళజోడు తీసి పెట్టుకోబోతుండగా "వద్దు మానస్ ఈ స్పెక్ట్స్ ఇవన్నీ వద్దు. ఇవే పెట్టి పెట్టి" అంటూ రష్మీ ఒకప్పటి సుధీర్ ని గుర్తు చేసుకుంది. ఎప్పటిలాగే రాకింగ్ రాకేష్ పిల్లల్తో స్కిట్ చేయడానికి వచ్చాడు అతనితో ప్రవీణ్ ని కూడా తెచ్చుకున్నాడు. "ఈ స్టేజి మీద కొన్ని రోజులు నేను లేను కదా రష్మీ నా గురించి చాల ఫీలయ్యి ఉంటుంది కదా" అని అన్నాడు రాకేష్. "బిర్యానీలో ఆకు లాంటి ఆయన పోయినప్పుడే బాధపడలేదు. కూరలో కరివేపాకు లాంటోడివి నువ్వు పొతే బాధపడుతుందా" అంటూ ప్రవీణ్ కౌంటర్ వేసాడు. నూకరాజు స్కిట్ లో ఐతే బుల్లితెర సెలబ్రిటీస్ కూడా రాబోతున్నారు.

Illu illalu pillalu : కోడళ్ళకి సపోర్ట్ గా వేదవతి.. శ్రీవల్లికి ఆ ఇద్దరు చెక్ పెడతారా!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -187 లో..... రామరాజుకి తెలియకుండా ప్రేమ డ్యాన్స్ క్లాస్ చెప్తుందని తనకి నర్మద సపోర్ట్ చేస్తుందని ఇద్దరిపై అతను కోప్పడతాడు. దాంతో నర్మద బాధపడుతుంది. ఇక తనకి చెప్పకుండా చేశారని అత్త వేదవతి నర్మద, ప్రేమలతో మాట్లాడదు‌. కాసేపటికి నర్మద, ప్రేమ ఇద్దరు కలిసి వేదవతి దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి జరిగింది చెప్తారు. దాంతో తను అర్థం చేసుకుంటుంది. నేను వచ్చిన తరువాత ఈ ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయిందా అని నర్మద ఏడుస్తుంటే.. ఆయనకి కోపం వస్తే అలాగే మాట్లాడతారు.. వాటిని పట్టించుకుని బాధపడతావా అని వేదవతి అంటుంది. అందరి ముందు అలా మాట్లాడితే బాధ ఉండదా అత్తా అని నర్మద అంటే.. అందుకే కదా.. నేను వెళ్లి దులిపేశానని వేదవతి అంటుంది. ఏంటీ మీరు మామయ్య గారిని నిలదీశారా అని నర్మద అడుగుతుంది.. హా.. ఇంటి కోడల్ని పట్టుకుని అంత మాట అంటే అడగకుండా ఎలా ఉంటానూ.. మామూలుగా కాదు.. చాలా గట్టిగానే అడిగాను.. కడిగిపారేశాను. ఆయన కోపంలో అన్నారు తప్ప.. నీపై కోపం ఏం లేదని వేదవతి అంటుంది. అయినా మేం ఏం మాట్లాడుకున్నామో మీకెందుకు చెప్పాలి.. మీరు నాతో చెప్తున్నారా.. అంటే అన్నానని అంటారు కానీ అది గుర్తొచ్చిన ప్రతిసారీ నేను ఎంత ఫీల్ అవుతున్నానోనని వేదవతి అంటుంది. దాంతో ఇంకెప్పుడు అలా చేయమని చెప్తారు.  నేను డాన్స్ క్లాస్‌కి వెళ్తున్నాననే విషయం మీకు కూడా తెలియదు కదా.. మరి మామయ్యకి ఎలా తెలిసిందని ప్రేమ అడుగుతుంది. అవును కదా.. మరి ఎలా తెలిసి ఉంటుంది సుమీ అని వేదవతి అనగానే నీ ముద్దుల కోడలు వల్లీ చేసిందని నర్మద అంటుంది. ఇక ప్రేమ, నర్మద ఇద్దరు కలిసి శ్రీవల్లి దగ్గరికి వెళ్తారు. తను హ్యాపీగా ఆనందమానందమే అనే పాట పాడుతుంటుంది. దాంతో ఇద్దరు అదే పాటను అందుకుంటారు. వాళ్ళని చూసిన శ్రీవల్లి.. ఎందుకొచ్చారని అడుగుతుంది. ఏం లేదక్కా.. మా మట్టి బుర్రలకు ఓ విషయం తట్టడం లేదు.. నీది పాదరసం బుర్ర కదా.. నేను డాన్స్ క్లాస్‌కి వెళ్లిన విషయం నాకు నర్మదకి తప్ప మూడో వ్యక్తికి తెలియదు.. మరి మామయ్య గారెకి ఎవరు చెప్పారక్కా అని శ్రీవల్లిని ప్రేమ, నర్మద అడుగుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : జ్యోత్స్నని‌ ఆడుకున్న కార్తీక్, దీప.. డౌట్ మొదలైందిగా!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -386 లో....దీప, కార్తీక్ కిచెన్ లో ఉంటారు. అప్పుడే పారిజాతం కిచెన్ లోకి వచ్చి.. రెండు ఫిల్టర్ కాఫీ తీసుకొని రా అని చెప్తుంది. సరే అంటూ పారిజాతంతో వెటకారంగా మాట్లాడతాడు కార్తీక్. అప్పుడే జ్యోత్స్న వచ్చి.. ఏంటి కిచెన్ లో మీ సోది అని పని చేయకుండా అని అంటుంది. అంటే ఫిల్టర్ కాఫీ బాగోకపోతే మళ్ళీ కిచెన్ లోకి విసిరేస్తారు కదా అని పారిజాతం అనగానే ఖచ్చితంగా అదే జరుగుతుందని జ్యోత్స్న అంటుంది. చెప్పుతో కొడుతానని కార్తీక్ అనగానే పారిజాతం జ్యోత్స్న బిత్తెరపోయి చూస్తారు. ఇప్పుడు ఏమన్నవ్ జ్యోత్స్నని చెప్పుతో కొడుతావా అని పారిజాతం అనగానే.. కాదు పాలు పోసినోడిని అన్నాను.. పాలు చిక్కగా ఉంటేనే కదా టీ బాగుండేది అని కార్తీక్ కవర్ చేస్తాడు. బావ నీకు కూడ కాఫీ పెట్టాలా అని దీప అనగానే.. పారిజాతం, జ్యోత్స్న షాక్ అవుతారు. ఏమని పిలిచావని జ్యోత్స్న అడుగుతుంది. బావ అని పిలిచింది.. అయిన పనివాళ్ళ పిలుపులతో మీకేంటి సంబంధమని కార్తీక్ అంటాడు. అలా దీప పిలవకూడదని జ్యోత్స్న గొడవ చేస్తుంది. ఆ తర్వాత దీపని కార్తీక్ బంగారమని పిలుస్తాడు‌. దానికి కూడా జ్యోత్స్న, పారిజాతం గొడవ చేస్తారు. ఆ తర్వాత ఏదో జరుగిందని జ్యోత్స్న అంటుంటే ఏదో నిన్ను ఆటపట్టించడానికి అలా పిలుచుకుంటున్నారని పారిజాతం అంటుంది. అయిన జ్యోత్స్న పట్టించుకోకుండా దాస్ నిజం చెప్పేసి ఉంటాడా అని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత అందరు భోజనం చేస్తుంటే సుమిత్రకి జ్యోత్స్న బయట నుండి భోజనం తెప్పిస్తుంది. ఆ భోజనాన్ని దీప కిందపడేసినట్లు జ్యోత్స్న క్రియేట్ చేస్తుంది. దాంతో మళ్ళీ దీపని సుమిత్ర తిట్టేలా చేస్తుంది. దాంతో దీప పక్కకు వచ్చి బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : ట్విస్ట్ ఇచ్చిన కనకం.. బాధగా కావ్య, సంతోషంగా అనామిక!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -750 లో..... రాజ్, యామినిల నిశ్చితార్ధం పెళ్లి అన్ని ఏర్పాట్లు చేస్తారు. రాజ్ అయిష్టంగానే ఉంటాడు. ఇద్దరు రింగ్ లు మార్చుకోవడానికి సిద్ధం అవుతారు. ఉంగరాలు తీసుకొని వైదేహి వస్తుంటే.. కనకం కావాలనే వైదేహీని పడేలా చేస్తుంది. ఉంగరాలున్న బాక్స్ కిందకి పడిపోతాయ్. వెంటనే కనకం అందులో నుండి ఉంగరాలు వైదేహీకి తెలియకుండా తీస్తుంది. చూసుకోవాలి కదా వైదేహి గారు అని కనకం అంటుంది. మీలా డబ్బున్న వాళ్ళింటికి కోడలిని చేయాలని.. నాకేం కోరికలు లేవని వైదేహి అంటుంది. దాంతో అవునండి పెళ్లి అయిన వాళ్ళని వేరు చేసి కూతురిని ఇచ్చి పెళ్లి చేసే ఆలోచన నాకు లేనందుకు సిగ్గుపడుతున్నానని కనకం కౌంటర్ వేస్తుంది. ఆ తర్వాత యామిని, రాజ్ ఉంగరాలు మార్చుకోవాలని చూసేసరికి రింగ్స్ ఉండవు. దాంతో అపచారం అంటూ ఇందిరాదేవి వాళ్ళు అంటుంటారు. దాంతో ఏం పర్లేదు బావ.. నీ చేతికి ఒక రింగ్.. నా చేతికి ఒక రింగ్ ఉందిది.. ఇవే మార్చుకుందామని యామిని అంటుంది. ఇక ఆ ఉంగరాలు మార్చుకునే టైమ్ కి కళ్యాణ్ బయటకు వెళ్లి ఏదో శబ్దం చేస్తుంటాడు. ఆ సౌండ్ కి అందరు బయట వైపు చూస్తారు. కనకం మాత్రం తెలివిగా యామినికి రాజ్ తోడిగినట్లు ఉంగరం తొడుగుతుంది. అది పంతులు చూసి షాక్ అవుతాడు. యామిని రాజ్ తొడిగాడని హ్యాపీగా ఫీల్ అవుతుంది. కావ్య కూడా రాజ్ ఉంగరం తొడిగాడని బాధపడుతుంది. రా బావా అంటు యామిని గర్వంగా తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ఇమ్ము డెబ్జానీ సీక్రెట్ లవ్ స్టోరీ

  శ్రీముఖి కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ సెట్ లో ఖాళీగా ఉండడంతో ఇమ్మానుయేల్ తో ముచ్చట్లే పెట్టింది. "మీ ఛానల్ లో కుకింగ్ వీడియోస్ ఎందుకు చేయడం లేదు అని అందరూ అడుగుతున్నారు" అంటూ శ్రీముఖి ఇమ్ముని అడిగింది. "అంతకు ముందు నా ఛానల్ లో చేశా. ఐతే ఆ ఛానెల్ ఎగిరిపోయింది..కొన్ని కారణాల వలన స్ట్రైక్స్ పడి లక్షా 95 వేల సబ్స్క్రైబర్స్ వరకు ఉన్నారు..ఆ ఛానెల్ ఎగిరిపోయింది " అని చెప్పాడు. "నేనసలు అమ్మాయిలు, అబ్బాయిలు ఎగిరిపోతారని అనుకున్నాను కానీ ఛానెల్స్ ఎగిరిపోతాయని తెలీదు" అంది శ్రీముఖి. దాంతో ఇమ్ము "ఛానెల్ బ్లాక్ అయ్యింది. తర్వాత నేనొక వెబ్ సిరీస్ తీసి ఆ తర్వాత మళ్ళీ ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేశా. దానికి లక్షా 50 వేల మంది సబ్స్క్రైబర్స్ వరకు ఉన్నారు..కానీ కుదరట్లేదు అక్కా చేయడానికి..అమ్మాయిలంటే అందానికి సంబంధించి ఏదో ఒకటి చేస్తారు" అని చెప్పాడు. "నువ్వు కూడా గ్లామర్ గానే ఉంటావ్ కదా గ్లామర్ రిలేటెడ్ టిప్స్ చేయొచ్చుగా" అని అడిగింది. "నాకు వ్లాగ్స్ చేయడం ఇష్టం ఉండదు. నేను ఒక వెబ్ సిరీస్ రాసుకున్నా" అని చెప్పాడు. " నీ కథలో హీరోయిన్ ఎవరు" అని అడిగింది. " నా కథలో ఒక అందమైన అమ్మాయి హీరోయిన్ గా వుంటే బాగుంటుంది" అన్నాడు. "దెబ్బాజానీనా..మా ఇమ్మానుయేల్ కి దెబ్బజానీకి ఎవరికీ తెలియకుండానే ఒక సీక్రెట్ లవ్ స్టోరీ నడుస్తోంది..దెబ్బాజానీ అని ఎందుకు అంటున్నానంటే యాదమ్మరాజుకు డెబ్జానీ అనడం రాక దెబ్బజానీ" అన్నాడు అని చెప్పింది   శ్రీముఖి. "డెబ్జానీ నాకు మంచి ఫ్రెండ్ అయ్యింది నాకు" అన్నాడు ఇమ్ము. దాంతో  " ఒక ఎపిసోడ్ లో ఇమ్మానుయేల్ చెప్పిన తన లైఫ్ స్టోరీ డెబ్జానీ ఫ్లాట్ ఐపోయి కన్నీళ్లు పెట్టేసుకుంది." అని చెప్పింది శ్రీముఖి. "డెబ్జానీ చాలా ఎమోషనల్ అయ్యింది. చాలా మంచి అమ్మాయి" అన్నాడు ఇమ్ము. "మరి నీ వేస్ట్ ఫెల్లోని పక్కన పెట్టేసి డెబ్జానీకి లైఫ్ ఇవ్వాలని నీకు అనిపించడం లేదా" అని అడిగింది శ్రీముఖి. " అమ్మో నేను టోటల్ గా పక్కకెళ్ళిపోతాను" అన్నాడు ఇమ్ము.  

బిగ్ బాస్ లోకి సాకేత్ ?

  కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ షూటింగ్ సెట్స్ ఆఫ్ స్క్రీన్ లో శ్రీముఖి చేసే సందడి అంతా ఇంతా కాదు. రీసెంట్ గా అలాంటి ఆఫ్ స్క్రీన్ కంటెంట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో శ్రీముఖి రెడీ అయ్యి ఈ షోలో ఉన్న గర్ల్స్ ని బాయ్స్ ని ఈ షో మీద అభిప్రాయం అడుగుతూ ఉంది. ఐతే విష్ణు ప్రియా ఈ షో బిగ్ బాస్ కంటే చాలా బెటర్ అని బిగ్ బాస్ కంటే పెద్ద నరకం ఇంకోటి లేదంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. శ్రీముఖి దగ్గరకు సాకేత్ కొమాండూరి వచ్చాడు. అతన్ని కూడా ఈ షో మీద ఒపీనియన్ అడిగింది. "ఈ షో నైస్. చాలా ఫన్ ఉంది..మినీ బిగ్ బాస్ లా అనిపించింది" అంటూ చెప్పాడు. వెంటనే విష్ణుప్రియ కంటిన్యూ చేస్తూ "బిగ్ బాస్ ఎంత నరకమో తెలుసో..ఇప్పుడు బ్రేక్స్ కి వెళ్తున్నారు కానీ బిగ్ బాస్ లో అలా ఉండదు" అనేసరికి శ్రీముఖి దాన్ని నెగటివ్ చేసి "బిగ్ బాస్ నరకం అంటున్న విష్ణు ప్రియా" అనే థంబ్ నైల్ చెప్పేసరికి విష్ణుప్రియాకి కోపం వచ్చింది. "నరకం ప్రతీ నిమిషం నరకం శ్రీముఖి నా ఫ్రెండ్ అనుకున్నా కానీ కాదు ఈమె పెయిడ్ హాలిడేలా ఉంటది అని చెప్పింది కానీ లోపల రెండు బాత్ రూమ్స్ ఇచ్చారు అందులోనే 14 మంది ఉండాలి.. అందులోనే పాయఖానాకి వెళ్ళాలి " అంటూ బిగ్ బాస్ మీద గట్టిగా వ్యతిరేకత వెళ్లగక్కింది. "అవును రా నువ్వు బిగ్ బాస్ కి వెళ్లాల్సి వస్తే వెళ్తావా" అంటూ శ్రీముఖి సాకేత్ ని అడిగేసరికి "చూద్దాం..అది టైం డిసైడ్ చేయాలి..నువ్వు నేను కాదు " అన్నాడు. "నువ్వు బిగ్ బాస్ లో ఉండలేవు..కట్టలు తెంచుకుని దూకేస్తావ్ అక్కడి నుంచి" అంటూ విష్ణు ప్రియా పక్క నుంచి ప్రామ్ప్టింగ్ ఇచ్చింది. "వెళ్తే నువ్వు బిగ్ బాస్ హౌస్ లోని స్మోకింగ్ ఏరియాలోనే ఉంటావేమో" అంటూ సాకేత్ ని అడిగింది శ్రీముఖి. "ఆ ఏరియాలోకి అసలు వెళ్ళను నాకు స్మోక్ పడదు" అన్నాడు సాకేత్.  

అమ్మాయిల మీద ఫీలింగ్స్ ఉండి వుంటే శ్రీముఖిని పెళ్లి చూసుకునేదాన్ని

  బుల్లితెర మీద ఏ షో ఐనా కానీ కెమెరా, లైట్స్, రోల్ అంటే స్టేజి మీద చేసేది ఆడియన్స్ కోసం అన్నట్టు వుంటే ఆఫ్ స్క్రీన్ లో మస్త్ కామెడీ మస్త్ కంటెంట్ దొరుకుతుంది. కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ సెట్స్ లో ఆఫ్ స్క్రీన్ లో శ్రీముఖి-తేజస్విని మడివాడ మధ్య అలాంటి ఒక ఇంటరెస్టింగ్ టాపిక్ ఇప్పుడు వైరల్ అవుతోంది. శ్రీముఖి-తేజు రెడీ అయ్యి వచ్చి కూర్చుని సరదాగా చిట్ చాట్ చేసుకున్నారు. "ఈ వ్లాగ్స్ గిగ్స్ కాకుండా నువ్వు ఇంత అందంగా ఎలా తయారవుతున్నావో చెప్పు" అని శ్రీముఖిని తేజు అడిగింది. వెంటనే శ్రీముఖి "నన్ను చేసుకుంటావా పెళ్లి" అని అడిగేసింది. "నేను నిన్ను చేసుకోగలిగితే ఎప్పుడో చూసుకునేదాన్ని. అమ్మాయిల మీద ఫీలింగ్స్ ఉండి వుంటే గనక శ్రీముఖి నా ఫస్ట్ ఆప్షన్. కానీ అవకాశం లేదు కదరా. మనందరికీ ఇండిపెండెన్స్ అలవాటైపోయింది. ముఖ్యంగా నీకు" అని తేజు చెప్పింది. "చిన్నప్పుడు ఇండిపెండెన్స్ డేకి కూడా మనం ఇంత సెలెబ్రేట్ చేసుకోలేదు కానీ ఇప్పుడు ప్రతీ రోజు సెలెబ్రేట్ చేసుకుంటున్నాం కదా" అంది శ్రీముఖి. "నేనేమనుకుంటానంటే నీకు డబ్బులు, కార్ అవసరం లేదు. అన్నీ ఉన్నాయి నీకు. మరి నీకు అబ్బాయి ఎందుకు కావాలసలు జనరల్ గా" అని తేజు మళ్ళీ అడిగింది. "ఇప్పుడు పెళ్లి గురించి వద్దులే కానీ కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ చేసావ్ కదా ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పు" అంటూ శ్రీముఖి మాట మార్చేసింది. "నాకు గేమ్స్ అంటే ఇష్టం. గేమ్స్ ఆడేటప్పుడు నా లైఫ్ గురించి మర్చిపోతూ ఉంటాను. ఈ షోని నేను బాగా ఎంజాయ్ చేసాను. డాన్స్ షోలో కానీ బిగ్ బాస్ లో కానీ నేను ఇంతలా ఎప్పుడూ ఎంజాయ్ చేయలేదు." అని చెప్పింది తేజు.

మీరు మా అక్కను పెళ్లి చేసుకున్నారనుకోండి..నేను ఫ్రీ..

ఢీ జోడి ప్రోమో ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ఈ షో గ్రాండ్ ఫినాలేకి వచ్చేసింది. ఈ టైటిల్ ఇవ్వడానికి యంగ్ అండ్ డైనమిక్ హీరో అడివి శేష్ వచ్చాడు. కార్ లో దిగి గన్ ని హ్యాండిల్ చేస్తూ ఇచ్చిన పోజ్ చాలా యూనిక్ గా ఉంది. తర్వాత స్టేజి మీద టైటిల్ ని తీసుకొచ్చాడు. ఇక అడివి శేష్ ని చూసేసరికి అశ్విని చేసిన కామెంట్స్ ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. "మా సిస్టర్ కి మీరంటే చాలా ఇష్టం అండి" అని అశ్విని చెప్పేసరికి "నాక్కూడా మీ మొత్తం ఫామిలీ అంటే ఇష్టమండి" అని చెప్పాడు అడివి శేష్. "అయ్యయ్యో ఒక వేళా మీరు మా అక్కను పెళ్లి చేసుకున్నారనుకోండి మీకు 1 + 1 ఆఫర్ వస్తది. అంటే అక్కను పెళ్లి చేసుకుంటే నేను కూడా వస్తాను. ఎలా వస్తానో కూడా చెప్తాను" అంది అశ్విని. "ఎలాగో చెప్పండి ప్లీజ్ " అన్నాడు అడివి శేష్. "సినిమాల్లో కంటే పెద్ద ట్విస్టుల్లా ఉన్నాయి నీవి" అన్నాడు ఆది పక్కనుంచి. "నేను ఆది కామెడీకి బిగ్ ఫ్యాన్ కానీ డాన్స్ ఐతే అంత కాదు" అన్నాడు. జడ్జ్ విజయ్ బిన్నీ మాష్టర్ గురించి చెప్తూ "విజయ్ మాష్టర్ కానీ నాకు బ్రదర్ ఫస్ట్.. ఒక చిన్న చరిత్ర కూడా ఉంది కదా బ్రో. మరి అప్పట్లో " అంటూ ఒక సస్పెన్సు ని క్రియేట్ చేసాడు అడివి శేష్. ఇక సోనియా సింగ్, సిద్ధుని ఆది పరిచయం చేసాడు. "మీర్జాపురం యువరాణి ఆవిడ వాడు మీర్జాపురంలో మున్నాభాయ్..నేను అంతఃపురం ఆది.. ఇది అవతార్ అశ్విని " అన్నాడు. హోస్ట్ నందు విన్నర్ ఎవరో చెప్తూ కౌంట్ డౌన్ స్టార్ట్ చేసేసరికి "నీకంటే నాకే ఎక్కువ టెన్షన్ గా ఉంది బ్రో" అంటూ చెప్పాడు అడివి శేష్. "ఇది కాస్త టఫ్ గానే ఉంది మావా" అంటూ ఆదికి చెప్పేసరికి "ఆ టెన్షన్ తట్టుకోలేకే హన్సిక పక్కకొచ్చి నిలబడ్డా" అంటూ ఆది కామెడీ చేసాడు. మరి ఇంతకు ఎవరు విన్ అవుతారో ఈ వీక్ ఎపిసోడ్ లో తెలిసిపోతుంది.  

శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజి మీద ప్రియాంక జైన్ ని పెళ్లి చేసేసుకున్న శివ్

బుల్లితెర మీద స్క్రీన్ మీద కనిపించే ఆన్ స్క్రీన్ ప్రేమలు ఆ స్టేజి దిగాక కనిపించవు అని చాల మంది అంటూ ఉంటారు. అది నిజమైనా కాకపోయినా బుల్లితెర మీద ఆన్ స్క్రీన్ జోడీస్ కొన్ని బాగా హిట్ పెయిర్ గా మంచి పేరు తెచ్చుకున్నాయి. అందులో సుధీర్ - రష్మీ జంట ఒకటైతే వీళ్ళు జస్ట్ స్క్రీన్ వరకే అంటారు. అలాగే రాకేష్ - సుజాతా ..వీళ్లది ఆన్ స్క్రీన్ జోడి కానీ రియల్ లైఫ్ లో మ్యారేజ్ చేసుకున్నారు. తర్వాత ఇమ్మానుయేల్ - వర్ష జోడి...వీళ్ళు మొదట్లో అలరించారు...పెళ్లి విషయాలు మాట్లాడుకున్నారు కానీ ఇప్పుడు వేరే వేరే షోస్ లో చేస్తున్నారు. అలాగే ప్రియాంక జైన్ - శివ్ వీళ్ళ గురించి చెప్పక్కర్లేదు. వీళ్ళు పెళ్లి చేసుకుంటాం అని చెప్తూనే ఉన్నారు. కానీ చేసుకోవడం లేదు. చేసుకుంటారా లేదా ఇదంతా రేటింగ్ కోసమా అనే డౌట్ కూడా చాలా మందిలో ఉంది. ఇదే విషయాన్ని ఆది కూడా వాళ్ళను అడిగాడు. నెక్స్ట్ వీక్ శ్రీదేవి డ్రామా కంపెనీ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో ఆది అదే ప్రశ్న అడిగాడు. "జెన్యూన్ గా ఒక డౌట్ ఉంది. ఈ రేటింగ్స్ కోసం రిలేషన్ షిప్ పెట్టుకోవడం మీరు కూడా ఇలా ఈ టీవీ షో కోసం ఇలా చేస్తున్నారా ? " అని అడిగాడు. దాంతో ప్రియాంక జైన్ కి కోపం వచ్చేసి శివ్ ని చూసింది. "ఇది రియల్లీ టూ మచ్. "మీరు నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారా" అని మళ్ళీ అడిగాడు ఆది. దాంతో శివ్ కి కోపం నషాళానికి అంటింది. "మీ డౌట్ నేను క్లియర్ చేస్తాను. పరి మనం ఈ స్టేజి మీదనే పెళ్లి చేసేసుకుందాం" అన్నాడు సీరియస్ గా శివ్. అన్నట్టుగానే స్టేజి మీదనుంచి వెళ్లి తాళి తీసుకొచ్చి పరి మెళ్ళో కట్టేసాడు. దాంతో ఇంద్రజ షాకయ్యింది. మిగతావాళ్ళు కూడా అలానే చూస్తూ ఉండిపోయారు. మరి ఇది నిజంగా పెళ్లా రేటింగ్ కోసం ఇదేమన్నా ప్రాంకా చూడాలి.

Illu illalu pillalu : కోడళ్ళపై నిప్పులు కక్కిన రామరాజు.. నర్మద ఏడ్చేసిందిగా!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -186 లో..   నర్మద, ప్రేమ ఇద్దరు డ్యాన్స్ క్లాస్ ముగించుకొని ఇంటికొస్తారు. ఇక అప్పటికే విషయం తెలుసుకున్న రామరాజు ఫుల్ కోపం మీద ఉంటాడు. మామయ్యా అంటూ ప్రేమ ఏదో చెప్పబోతుంటే..వద్దూ .. ఏం చెప్పొద్దని రామరాజు ఆపేస్తాడు. మీరిద్దరూ ఒకరికొకరు చేసుకునే సపోర్ట్ అద్భుతం, అమోఘం. మీరు బాగా చదువుకున్నారు కాబట్టి.. తెలివితేటలు ఉండటం సహజం అనుకున్నా.. కానీ మీ ఇద్దరిలో ఎదుటి వాళ్లని పిచ్చోళ్లను చేసే తెలివితేటలు ఉన్నాయని నాకు తెలియలేదంటూ ఫుల్ ఫైర్ అవుతాడు. ఏమైందండీ అని రామరాజుని వేదవతి అడుగుతుంది. ఒకసారి చేస్తే పొరపాటు.. కానీ రెండోసారి కూడా అదే తప్పు చేస్తే లెక్కలేనితనం.. వీళ్ల దృష్టిలో నేనంటే అదే అని రామరాజు అంటాడు. ఏం జరిగిందని అడుగుతుంటే.. ఏదేదో మాట్లాడతారేంటని వేదవతి అంటుంది. ఏం చెప్పను.. ఏమని చెప్పను.. ఈ ఇంట్లో ఎవరికి నచ్చినట్టు వాళ్లు చేస్తున్నారు. ఈ ఇంటికో పెద్ద ఉన్నాడూ.. ఆయనకి చెప్పాల్సిన అవసరం లేదనే అహంకారంతో ఉన్నారని చెప్పనా అని రామరాజు అంటాడు.  మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారని వేదవతి అడుగగా.. ఇదిగో వీళ్ళిద్దరి గురించేనని రామరాజు అంటాడు. వీళ్ళేం చేశారని వేదవతి అనగా.. అంటే ఈ విషయం నీక్కూడా తెలియదన్న మాట. ఇద్దరూ కలిసి నన్నే కాదు.. నిన్ను కూడా పిచ్చిదాన్ని చేశారన్నమాట. ఈ అమ్మాయి ఏం చేసి వస్తుందో తెలుసా.. బయట ఎక్కడో ఎవరింట్లోనో డాన్స్ క్లాస్ చెప్పి వస్తుందని రామరాజు అంటాడు. ఆ మాటతో ఇంట్లో వాళ్లంతా షాక్ అయిపోతారు. ఆ ఉద్యోగం చూసింది ఎవరో తెలుసా.. ఇదిగో ఈవిడ గారే అంటూ నర్మదని చూపిస్తాడు రామరాజు. నీ డ్యాన్స్ వల్ల మీ వాళ్లు నన్ను నలుగురిలో అవమానిస్తున్నారు.. మీ వాళ్లు నన్ను అవమానించి.. నలుగురిలో నా పరువు తీయాలనుకుంటున్నావా అని ప్రేమతో రామరాజు అనగానే.. నేను మీ ఇంటి కోడల్ని.. మీ పరువు నిలబెట్టాలనే అనుకుంటాను తప్ప.. మీ పరువు తీయాలని ఎందుకు చూస్తాను. అలాంటి పని చేయనని ప్రేమ అంటుంది. హా.. మరి ఇప్పుడు నువ్వు చేసిందేంటి.. నాకు తెలియకుండా వెళ్లి డాన్స్ క్లాస్ చెప్పి వస్తున్నావంటే.. నన్ను అవమానించాలనే కదా అని రామరాజు అంటాడు.  ఇక ప్రేమ, నర్మదలని రామరాజు ఇష్టం వచ్చినట్టు తిడతాడు. భార్య భాద్యత భర్తది, భర్తే సంపాదించాలని క్లాస్ పీకుతాడు రామరాజు. వేదవతి సపోర్ట్ చేసినా రామరాజు వినిపించుకోకుండా ప్రేమని డ్యాన్స్ క్లాస్ చెప్పొదంటాడు. నర్మద వల్లే ఇదంతా తన వల్లే ఇంట్లో ఇన్ని గొడవలని రామరాజు అనగానే తను ఫీల్ అవుతుంది. ఇక ఇదంతా చూసి శ్రీవల్లి తెగ సంబరపడిపోతుంది‌. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : తనని ఇంట్లోకి రావొద్దన్న సుమిత్ర.. దీప కండిషన్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'( karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -385 లో....దీపని కార్తీక్ పిలుస్తాడు. వస్తున్నా బావ అని దీప అనగానే.. అందరు ఆశ్చర్యంగా చూస్తారు. ఏంటే పిలుపు మారిందని అనసూయ అనగానే అలా పిలిస్తే ఏంటని కార్తీక్ అంటాడు. మీరు మా అమ్మని అక్క అని పిలుస్తున్నారు కదా.. నేను దీపని బావ అని పిల్వమన్నానని కార్తీక్ అంటాడు. మరి దీప అలా పిలిస్తే మీరు కూడా పిలవాలి కదా అని అనసూయ అనగానే.. మరదలు అనే కదా పిలుస్తున్నానని కార్తీక్ అంటాడు. నిజంగా దీప నా మేనకోడలు అయితే ఎంత బాగుండు.. ఇక నుండి నన్ను అత్త అని పిలువు.. నిన్ను కూడా మేనకోడలు అని పిలుస్తానని కాంచన అంటుంది. దాంతో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. కార్తీక్, దీప అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఏ తల్లి కన్నబిడ్డో మీరు దగ్గర అయ్యారని కాంచనతో అనసూయ అనగానే.. ఏ తల్లి కన్న బిడ్డో ఏంటి? నీకు తెలియదా దీప తల్లి ఎవరోనని కాంచన అంటుంది. అంటే తెలుసు.. మీకు తెలియదు కదా.. అని అనసూయ కవర్ చేస్తుంది. ఆ తర్వాత కార్తీక్, దీప కలిసి శివన్నారాయణ ఇంటికి వెళ్తారు. వాళ్ళని వద్దని సుమిత్ర చెప్తుంది. దీప ఇక నుండి నాకు కన్పించడానికి వీల్లేదని సుమిత్ర అంటుంది. నాకు ఇష్టం లేదని శివన్నారాయణ అంటాడు. లేదు తను పని చేయాలిసిందేనని జ్యోత్స్న అంటుంది. నేను రాను కానీ ఒక కండిషన్ అని దీప అనగానే.. ఏంటని పారిజాతం అడుగుతుంది. నేను రావద్దు అంటే నా భర్త కూడా వద్దని దీప అనగానే అలా ఏం వద్దు ఇద్దరు రండి అని జ్యోత్స్న చెప్తుంది. మీ ఇష్టం అన్నట్లుగా సుమిత్ర కోపంగా ఉంటుంది. శివన్నారాయణని తాత అని పిలుస్తాడు కార్తీక్. నన్ను అలా పిల్వకని శివన్నారాయణ అనగానే.. సరే మీరు ఓనర్ లు మేమ్ వర్కర్లం.. ఇక సర్ మేడం అని పిలుస్తామని కార్తీక్ అంటాడు. అదంతా చూసిన జ్యోత్స్న.. ఏంటి ఇలా జరుగుతుందని టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : ఎంగేజ్ మెంట్ రింగ్ దాచేసిన కనకం.. యామిని ఏం చేయనుంది!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -749 లో ఇందిరాదేవి, కనకం, అపర్ణ ముగ్గురు కలిసి పెళ్లి ఆపాలనుకుంటారు. ఈ ప్రయత్నంలో భాగంగా పంతులిని బ్లాక్ మెయిల్ చేస్తారు. యామిని పూజ చేసి హారతి ఇస్తుంది. హారతి గాలికి పోవాలని కనకం ఫ్యాన్ అటుగా తిప్పుతుంది. దాంతో ఆ  దీపం ఆగిపోతుంది. అది చూసి అందరు షాక్ అవుతారు. ఇన్ని జరుగుతున్నాయి. పెళ్లి ఆపండి అని ఇందిరాదేవి అంటుంది. అవసరం లేదని పంతులు యామినికి ఫేవర్ గా మాట్లాడతాడు. పంతులు ఫోన్ మాట్లాడుతుంటే.. యామిని వింటుంది. ఎవరు నిన్ను పెళ్లి ఆపమని అంటుందని అడుగుతుంది. దాంతో పంతులు జరిగింది యామినికి చెప్తాడు. నువ్వు ఈ పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరపాలి.. లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదని యామిని పంతులిని బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఆ మాటలు పంతులు గుర్తు చేసుకొని యామినికి సపోర్ట్ చేస్తాడు. యామినికి పంతులు సపోర్ట్ చెయ్యడంతో ఇందిరాదేవి వాళ్ళు షాక్ అవుతారు. ఇక నిశ్చితార్థం, పెళ్లి ఒకేసారి అని పంతులు చెప్తాడు. ఆ తర్వాత కావ్య దగ్గరికి యామిని వచ్చి.. అసలు ఎన్ని ప్లాన్ చేస్తన్నావ్.. ఈ పెళ్లి ఆపడానికి అని యామిని అంటుంది. నేనేం చెయ్యడం లేదు.. నేను పెళ్లి ఆపను కానీ పెళ్లి జరగదు.. మా ఆయనకి చివరి నిమిషంలో నేను గుర్తొచ్చినా ఈ పెళ్లి జరగదని కావ్య కాన్ఫిడెన్స్ గా చెప్తుంది. ఆ తర్వాత అపర్ణ, కనకం, ఇందిరాదేవి డిస్సపాయింట్ అవుతారు. నేను వెళ్లి అల్లుడు గారితోనే మాట్లాడుతానని రాజ్ దగ్గరికి కనకం వెళ్తుంది. అల్లుడు గారు నేను కళావతి అమ్మని.. నా కూతురు మిమ్మల్ని ప్రేమించింది.. మీరు ఎలా ఇలా వేరొక పెళ్లి చేసుకుంటున్నారని అడుగుతుంది. నాకు వేరే ఆప్షన్ లేదని రాజ్ అనగానే ఇన్ని శకునాలు అయినవి ఇక పెళ్లి ఆపండి అని కనకం అంటుంది. తరువాయి భాగంలో రాజ్, యామిని ఎంగేజ్ మెంట్ ల రింగ్ ని కనకం తీస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

అసలు యాక్టింగ్ వచ్చా నీకు..రోహిణి ఫాదర్ ఫైర్

  ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఈ ఆదివారం షో ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఐతే ఇందులో రోహిణి వాళ్ళ నాన్న సింహాద్రి ఈ షోకి వచ్చారు. శ్రీముఖి ఐతే రోహిణి వాళ్ళ నాన్నతో డాన్స్ లు చేయించింది, తొడ కొట్టించింది. "మొదటి సారి ఫ్లయిట్ ఎక్కి మరీ షూటింగ్ కి వచ్చారు. ఎలా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్" అని అడిగింది శ్రీముఖి. "ఆర్టిస్టులకు కూడా కార్ పెడతాం ఫ్లయిట్ పెడతాం అనే మర్యాదలు జరగవు కానీ ఈయన ఎక్కడో ఉన్నారు. రండి రండి ప్లీజ్ మీకు ఫ్లయిట్ పెడతాం అని రప్పించారు..మీరు నమ్మరు కానీ ఉదయాన్నే షూటింగ్ కి వెళ్తున్నాను అంటే మా నాన్న లేచి జ్యూస్ లు ఏమన్నా తినడానికి బాక్స్ లు రెడీ చేసి మా అమ్మా నాన్న రెడీ చేస్తారు. అమ్మ చేయడం కామన్ కానీ నాన్న లేచి ఫ్రూప్ట్స్ అవీ కట్ చేసి బాక్స్ లు రెడీ చేయడం వంటివి చేస్తారు..నన్ను చిన్నప్పటి నుంచి చాల బాగా చూసుకుంటున్నందుకు థ్యాంక్యూ సో మచ్ అంటూ హ్యాపీ ఫాదర్స్ డే " అంటూ రోహిణి చెప్పింది. తర్వాత వీళ్ళు ఒక డంబ్ షో నిర్వహించింది. కొన్ని చిత్రాలను చూపిస్తూ ఉంటె ఎదురుగా ఉన్న వాళ్ళు వాటిని చెప్పాలి. ఐతే ఇందులో వేరే టీమ్ తో రోహిణి వాళ్ళ టీమ్ ఓడిపోయింది. దాంతో రోహిణి "నా యాక్టింగ్ ఎలా అనిపించింది" అంటూ వాళ్ళ నాన్నను అడిగింది. "నా యాక్టింగ్ ముందు నువ్వు చేసేది తక్కువే. ఉదయాన్నే లేచి జ్యూస్ లు చేసి ఫ్రూప్ట్స్ కట్ చేసి షూటింగ్ కి పంపిస్తే ఇదా నువ్వు చేసే యాక్టింగ్. మంచిగా గేమ్ గెలవాలని నేను నెల్లూరు నుంచి ఫ్లయిట్ లో వచ్చాను. ఇదేనా ఆట ?...నీ మీద కన్నా నేను బాగా ఆడాను అనుకుంటున్నాను...పబ్లిక్ అంతా చూస్తోంది కదా ఎవరు బాగా ఆడారో." అని చెప్పాడు. "నా యాక్టింగ్ కన్న తండ్రికే అర్ధం కాలేదు మిగతా ప్రజలకు ఎం అర్ధమవుతుంది" అంది కోపంతో రోహిణి. "అదే కదా నేను చెప్తున్నా" అన్నాడు రోహిణి వాళ్ళ నాన్న.

జ్యోతక్క వార్నింగ్...నేను హైదరాబాద్ లోనే ఉంటా

  సుమ అడ్డా నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి శివజ్యోతి - గంగులు, కీర్తి - జై ధనుష్ వచ్చారు. కీర్తి - జై ధనుష్ కి ఎప్పుడూ గొడవలవుతూ ఉంటాయట..ఏ విషయంలో ఎక్కువగా గొడవలు అవుతాయని సుమ అడిగేసరికి. "టవల్ ఆరబెట్టరు" అని చెప్పింది కీర్తి. "ఈ టవల్ అనే యూనివర్సల్ ప్రాబ్లమ్ కి ఇంకో సొల్యూషన్ ఉంది" అని సుమ అనేసరికి " ఇంకో ట్వేల్ కొనుక్కోవాలి అని జై ధనుష్ చెప్పాడు. దాంతో సుమ "టవల్ లేకుండా చేయడం" అంది. " మీ ప్రాబ్లమ్ కూడా అదేనా" అని జ్యోతక్కను అడిగింది. "ఏది చెప్పినా ఆ చేస్తా చేస్తా అంటాడు. ఆ మాట చెప్పేలోపు నేనే వెళ్లి చేసుకుంటా" అని చెప్పింది జ్యోతక్క.ఇక భార్యలను ఒక వైపు భర్తలను ఒక వైపునకు పంపింది సుమ. "మేము అసలు ఆంటీస్ లా లేము. వాళ్ళు మాత్రం అంకుల్స్ " అని శివజ్యోతి చెప్పింది. తర్వాత సుమ ఒక ప్రశ్న అడిగింది. " అబ్బాయిలు ఎక్కువగా ఎక్కడ టైం పాస్ చేస్తారు" అంది. "రెండు గంటలు బాత్ రూమ్ లో మా ఆయన టైం పాస్ చేస్తాడు" అని జ్యోతక్క చెప్పింది. ఇక కీర్తి ఐతే ఒక గంట అంటూ వేలెత్తి మరీ చూపించింది. "నీ మీద ఎలిగేషన్స్ వస్తే ఎలా ఎదుర్కుంటావ్" అని సుమ మళ్ళీ జ్యోతక్కను అడిగింది. "కొంచెం సీరియస్ గానే చెప్బ్దామనుకుంటున్నాను నేను. వాడు బతకడానికి లేని పోనీ ఎలిగేషన్స్ చేస్తున్నాడు. నేను హైదరాబాద్ లోనే ఉంటా" అంటూ గట్టిగానే ఎవరికో కానీ వార్నింగ్ ఇచ్చింది. ఈ మధ్య కాలంలో బెట్టింగ్ యాప్స్ ప్రొమోషన్స్ మీద కొన్ని వివాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. మరి ఆ ఇష్యూ మీద వార్నింగ్ ఇచ్చిందా, ఎవరికీ, ఏంటి అనేది తెలియాలి అంటే నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ చూడాల్సిందే.  

అందరినీ ఆకర్షిస్తున్న ఏఐ వెర్షన్ జబర్దస్త్ ప్రోమో

జబర్దస్త్ షో నెక్స్ట్ వీక్ నుంచి సరికొత్త ఎంటర్టైన్మెంట్ తో రాబోతోంది అన్న విషయం తెలిసిందే . ఈ ఎపిసోడ్ ఏఐ వెర్షన్ ప్రోమో అందరినీ అలరిస్తోంది. ఈ మధ్య ఎంత పెద్దవాళ్ళనైనా ఏఐలో చిన్న చిన్న పిల్లల్లా మర్చి వీడియోస్ ని రిలీజ్ చేయడం చూస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రోమో కూడా అలాగే వచ్చింది. జడ్జ్ గా కృష్ణ భగవాన్ మళ్ళీ షోలోకి ఎంట్రీ ఇచ్చారు. ఖుష్బూ శివగామిగా, కృష్ణ భగవాన్ బిజ్జల దేవుడుగా కనిపించారు. "జబర్దస్త్ రాజ్యంలోని ప్రజలందరికీ నమస్కారం..ఏవండీ మన రాజ్యం ఎలా ఉంది" అని బిజ్జల దేవుడిని అడిగింది శివగామి. "రాజ్యంలో ప్రజలందరూ బాగున్నారు. డబ్బు, ఆహారానికి కొదువ లేదు. ఆనందమే కొంచెం ఎక్కువ కావాలనుకుంటున్నాడు" అని చెప్పాడు. రాఘవ కట్టప్పగా వచ్చాడు. "జబర్దస్త్ రాజ్యానికి మకిలి పట్టింది. కామెడీతో కడిగెయ్ కట్టప్ప..ఇదే నా మాట నా మాటే శాసనం..ఇక్కడ కామెడీ చేసిన వాళ్ళే శాశ్వతం " అని ఆజ్ఞ ఇచ్చింది. దాంతో రాఘవ ట్రిపుల్ ఆర్ లను పిలిచాడు. "రామ్ గా సద్దాం, భీం గా యాదమ్మ రాజు" వచ్చారు. "ఇక నుంచి మీ కామెడీలో టైమింగ్ బాగుండాలి..కామెడీ పెరగాలి" అని చెప్పింది ఖుష్భూ..."అడవి మనిషిని తల్లి..అర్ధం కాలేదు" అంటూ యాదమ్మ రాజు పెద్ద కామెడీ డైలాగ్ వేసాడు. దేవరాగా ఆటో రాంప్రసాద్ వచ్చాడు. "ఇప్పుడేటి కామెడీ బాగుండాలి అంతే కదా..ఈ దేవర చెప్పాడంటే చేస్తాడని అర్ధం" అన్నాడు. నూకరాజు పుష్ప గెటప్ లో , షెకావత్ గెటప్ లో బులెట్ భాస్కర్, భట్టు గెటప్ లో రాకింగ్ రాకేష్, చారీ గెటప్ లో ప్రవీణ్ వచ్చారు. "ఒరేయ్ ప్రవీణ ఇంతమందిని చూసేసరికి నా గుండేమిట్రా ఇంతలా వణుకుతోంది" అన్నాడు రాకేష్. "ఏముంది గురువుగారు కొత్తగా కామెడీ చేయమంటున్నారుగా గుండె కాదు ఇక నుంచి అన్నీ వణుకుతాయి" అన్నాడు ప్రవీణ్.

"కూకూ విత్ జాతిరత్నాలు" స్టార్ మాలో త్వరలో కొత్త కుకింగ్ రియాలిటీ షో

బుల్లితెర మీద చాలా షోస్ ఉన్నాయి కానీ కుకింగ్ షోస్ మాత్రం చాలా తక్కువే ఉన్నాయి. రీసెంట్ గా చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే పేరుతో ఒక కుకింగ్ షో వచ్చింది. అది పూర్తయిపోయింది. ఇక ఇప్పుడు ఇంకో కొత్త కుకింగ్ షో రాబోతోంది. అదే "కూకూ విత్ జాతిరత్నాలు" పేరుతో ఒక కొత్త కుకింగ్ షో రాబోతోంది. దీనికి హోస్ట్ గా ప్రదీప్ మాచిరాజు ఎంట్రీ ఇచ్చేసాడు. ఒక మూవీ కోసం కొన్ని నెలలు బుల్లితెరకు బ్రేక్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ షోతో ఆడియన్స్ ముందుకు హోస్ట్ గా రి-ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆ ప్రోమోస్ రెండు రిలీజ్ అయ్యాయి. "మై డియర్ ఫుడీస్ అండ్ బడ్డీస్ ఇక్కడ చిన్న చిన్న స్పూన్ లు కూడా సూపర్ వెపన్స్ గా మారతాయి. ఇప్పటివరకు రుచి చూడని క్యూజిన్స్ చేస్తారు మా నలభీముల కజిన్స్...ఇమ్మానుయేల్, రీతూ చౌదరి, గోమతి, ఎక్స్ప్రెస్ హరి, సుహాసిని, బిత్తిరి సత్తి వంటి వాళ్లంతా ఈ షోలో వంటలు చేయబోతున్నారు. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, ఇటాలియన్, అమెరికన్, మెక్సికన్, ఇటాలియన్, జాపనీస్, చైనీస్, థాయ్" అని లీడ్ చెప్తూ ఉండగా రీతూ చౌదరి చేసిన డిష్ ప్లేట్ లోంచి ఎగిరొచ్చి ప్రదీప్ కోట్ మీద పడి మొత్తం ఖరాబైపోతుంది. మొదలయ్యింది జాతిరత్నాల అల్లరి అంటూ ఈ షో ప్రోమో ఆడియన్స్ ని అలరిస్తోంది. ఇక మరో ప్రోమోలో చూస్తే సెలబ్రిటీ జడ్జ్ గా అలనాటి అందాల నటి రాధ వచ్చింది. ఒక డిష్ స్మెల్ చూసి "అదే స్మెల్" అంది..ఇక వాహ్ చెఫ్ సంజయ్ తుమ్మ కూడా వచ్చి "అదే టేస్ట్" అన్నాడు. తర్వాత రాధ, సంజయ్ కలిసి "సేమ్ ఫైవ్ స్టార్ హోటల్ లాగే ఉంది" అన్నారు. ఇంతలో బిత్తిరి సత్తి వచ్చి "ఇది అక్కడి నుంచే తెప్పించా" అన్నాడు. రాధా, సంజయ్ ఆశ్చర్యపోయి "నువ్వు చేసింది ఏమిటి" అన్నారు సీరియస్...బిత్తిరి సత్తి ఒక మూల మాడిపోయి డస్ట్ బిన్ లో పడేసిన ఒక డిష్ ని చూపించాడు ఏడుపు ముఖంతో. ఇలా త్వరలో సరికొత్త కుకింగ్ రియాలిటీ షో స్టార్ మాలో రాబోతోంది.

"కెప్టెన్సీ చేయడం ఎలా" సక్సెస్ బుక్ బై కెప్టెన్ ఇమ్మానుయేల్..

కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ ఈ వీక్ షో ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఇందులో ఒక సెగ్మెంట్ ని పెట్టింది. ఇప్పుడు జరుగుతోంది ప్రీ ఫినాలే కాబట్టి ఫినాలే కూడా దగ్గరకు వచ్చేసింది కాబట్టి బాయ్స్ అండ్ గర్ల్స్ ఒకరికి ఒకరు గిఫ్ట్స్ ఇచ్చుకోమని చెప్పింది శ్రీముఖి. ఇందులో మానస్ తేజస్వినికి మల్లెపూలు, కాటుక, కుంకుమ ఇచ్చాడు. తేజు ఐతే ఒక బోటిల్ లో బటర్ మిల్క్ తెచ్చి ఎప్పుడూ కోపంగా ఉంటావు కాబట్టి ఈ బటర్ మిల్క్ తాగి కొంచెం కూల్ అవ్వు అంటూ చెప్పింది. తర్వాత ప్రియాంక జైన్ ఐతే నిఖిల్ కి కళ్ళజోడు ఇచ్చింది, నిఖిల్ ఆమెకు బాక్సింగ్ గ్లోవ్స్ ఇచ్చాడు. ఆ తర్వాత రోహిణి ప్లాస్టర్ ని గిఫ్ట్ గా ఇమ్మానుయేల్ కి ఇచ్చి అతని మూతికి ప్లాస్టర్ వేసేసింది. ఇక ఇమ్ము ఐతే ఒక బుక్ తెచ్చి రోహిణికి ఇచ్చాడు. "కెప్టెన్సీ చేయడం ఎలా" సక్సెస్ బుక్ బై కెప్టెన్ ఇమ్మానుయేల్ అంటూ తానే మూడు రోజులు కష్టపడి రాసనంటూ ఒక బుక్ ని ఇచ్చాడు. ఇక రోహిణి ఐతే ఇమ్ముని చితక్కొట్టింది. "అసలు ఇది బుక్ అన్నావ్ కానీ ఇందులో ఏమీ లేదు కదా" అని శ్రీముఖి అనేసరికి "రోహిణి కెప్టెన్ అయ్యింది కానీ కెప్టెన్సీ చేయడం రావట్లేదు. కెప్టెన్సీ అనేది మనలో ఉండాలి పుస్తకాల్లో ఉంటే రాదు." అంటూ డైలాగ్ వేసాడు. అమరదీప్ ఐతే కొంతమంది అబ్బాయిలు ఫోటోలు తెచ్చి డెబ్జానీకి చూపించాడు. ఆమె మాత్రం అమర్ కి కర్చీఫ్ ఇచ్చి అమ్మాయిలను చూస్తూ సొల్లు కార్చుకోకు అంటూ చెప్పింది. ఇక గాయత్రి ఐతే అంబటి అర్జున్ కి ఒక వాకింగ్ స్టిక్ ఇచ్చింది. అర్జున్ ఆమెకు ఒక దీపం గిఫ్ట్ గా ఇచ్చాడు. సాకేత్ ప్రేరణకు ఒక హ్యాండ్ వాచ్ ఇచ్చాడు. ప్రేరణా అతనికి ఒక బాల్ ఇచ్చింది. అలాగే శ్రీసత్య నిఖిల్ విజయేంద్ర సింహకి ఒక ఐడి కార్డు ఇచ్చింది. ఈ కార్డు లేకపోతె అతను ఈ షోలో ఉన్నాడో లేడో తెలీడం లేదు అని చెప్పింది. ఇక నిఖిల్ ఐతే ఆమెకు ఒక బొచ్చే ఇచ్చాడు. జైల్లో ఖైదీలకు ఇచ్చే బొచ్చె ఇచ్చి శ్రీసత్య షోలో  జైలుకి వెళ్ళినప్పుడు తినడానికి యూజ్ అవుతుంది అని చెప్పాడు.

పెళ్లి కార్డ్ తెచ్చి పృద్వి చేతిలో విష్ణు ప్రియా

బిగ్ బాస్ హౌస్ నుంచి కూడా పృద్వి - విష్ణు ప్రియా జోడి బాగా హిట్ పెయిర్ అన్న పేరు సంపాదించుకుంది. వీళ్ళు పెళ్లి కూడా చేసుకుంటారు అన్న టాక్ కూడా నడిచింది. విష్ణు ప్రియా తనకు పృద్వి అంటే ఎంత ఇష్టమో ప్రతీ షోలోనూ చెప్తూ ఉంటుంది. ఐతే రీసెంట్ గా కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ లో మాత్రం ఒక ఇంటరెస్టింగ్ విషయం బయపడింది. ఇద్దరూ ఒకరికి ఒకరు గిఫ్ట్స్ ఇచ్చి పుచ్చుకున్నారు. "ఐ వాంట్ టు బి విత్ హర్...ఏ ఫ్రెండ్.." అంటూ పృథ్వి విష్ణు ప్రియాకి తన మినీ వెర్షన్ బొమ్మను ఇచ్చాడు. "నేను నీతో లేకపోయినా నా మినీ వెర్షన్ నీతో ఉండాలని కోరుకుంటా..నువ్వు నా ఫ్రెండ్ షిప్ ని గెలుచుకున్నావ్. అందుకే ఇది నా అవార్డు  " అని చెప్పాడు. "మినీ వెర్షన్ ఇలా రాదు..వేరేలా వస్తది" అంటూ చెప్పేసింది విష్ణు ప్రియా. దాంతో అందరూ నవ్వేశారు. "నువ్వు ఇంత అందమైన గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్యూ..నువ్వు నా గుండెల్లో ఉన్నావ్. తర్వాత శ్రీముఖి "విష్ణు నువ్వేమన్నా ఇవ్వాలనుకుంటే ఇవ్వు" అని చెప్పింది. అప్పుడు ఒక పెళ్లి కార్డ్ తెచ్చి పృద్వి చేతిలో పెట్టింది విష్ణు ప్రియా. అందులో పృద్వి పెళ్లి ఎప్పుడు, వెన్యూ ఎక్కడ, టైం ఏంటి అని క్వశ్చన్ మార్క్స్ తో ఉంది. ఎందుకు ఇది ఇచ్చావ్ అని శ్రీముఖి అడిగింది. "నాకు తెలుసు నీ మనసులో నేను లేను అని. నాకు తెలిసిన గుణవంతులైన అబ్బాయిల్లో నువ్వు ఒకడివి. నీకు ధర్మ పత్నిలాగా అద్భుతమైన అమ్మాయి రావాలి అది నేనైనా అవ్వొచ్చు ఏమో.. కాకపోవచ్చేమో..ఐనా పెళ్లి కార్డు పంపడం మర్చిపోకు" అన్న అర్ధంలో ఈ కార్డు ఇచ్చింది విష్ణు ప్రియా.

కార్తీక్ ని బావ అని పిలిచిన దీప.. షాక్ లో కాంచన, అనసూయ!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -384 లో.... దీపని మరదలు అని పిలుస్తాడు కార్తీక్. మీరు అలా పిలుస్తుంటే నాకు ఒకలా పిలవాలని ఉందని దీప అంటుంది. ఎలా అని కార్తీక్ అడుగగా.. నాకు సిగ్గుగా ఉంది పిలవలేనని మల్లెపూలతో బావ అని రాసి ఉంది చూపిస్తుంది.  అది చూసిన కార్తీక్ మురిసిపోతాడు. రాసిందానివి పిల్వవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. దీప కాస్త సిగ్గుపడుతూ బావ అంటుంది. దాంతో కార్తీక్ గాల్లో తేలుతాడు. ఇద్దరు సరదాగా కబుర్లు చెప్పుకుంటారు. మరోవైపు జ్యోత్స్న, పారిజాతం మాట్లాడుకుంటారు. కార్తీక్ చెప్పినట్లు వింటున్నావేంటని జ్యోత్స్నని పారిజాతం అడుగుతుంది. నువ్వు కేక్ పడేసింది బావ వీడియో తీసి చూపించి, బ్లాక్ మెయిల్ చేసాడు.. అందుకే దీపతో కలిసి కేక్ కట్ చేసానని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత సుమిత్రని దశరథ్ తీసుకొని వస్తాడు. ఎక్కడికి వెళ్లారని జ్యోత్స్న అడుగుతుంది. కాలు బెణికింది కదా హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళానని దశరథ్ అంటాడు. నీపై నాకు చాలా కోపంగా ఉంది. ఆ దీపతో కలిసి నువ్వు కేక్ కట్ చెయ్యడం ఏంటని జ్యోత్స్నపై సుమిత్ర కోప్పడుతుంది. సుమిత్ర, దశరథ్ వెళ్ళిపోతారు. చూసావా మమ్మీకి దీప అంటే చిరాకు పెరిగింది..అదే కదా మనకి కావాలని పారిజాతంతో జ్యోత్స్న అంటుంది. మరొకవైపు కార్తీక్ రెడీ అయి వచ్చి.. దీపని పిలుస్తాడు. వస్తున్నా బావ అని దీప అనగానే అనసూయ, కాంచన, శౌర్య ఆశ్చర్యంగా చూస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.