Illu illalu pillalu : ధీరజ్ పై జాలి చూపిస్తున్న ప్రేమ.. వాళ్ళిద్దరు కలుస్తారా!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -191 లో... ప్రేమ, నర్మద, వేదవతి కలిసి ధీరజ్, రామరాజులకి మాటలు కలపాలని చూస్తారు. రామరాజు భోజనానికి వస్తాడు. రామరాజు వచ్చి భోజనం చేస్తుంటే అప్పుడే ధీరజ్ ని ప్రేమ భోజనానికి పంపిస్తుంది. రామరాజు పక్కన ధీరజ్ వచ్చి కూర్చొని భోజనం చేస్తుంటే రామరాజు వెళ్ళిపోతాడు‌. దాంతో ధీరజ్ కూడా వెళ్ళిపోతాడు.   ధీరజ్ దగ్గరికి వేదవతి వచ్చి ఎందుకిలా చేసావని అడుగుతుంది. నాన్నకి నాపై కోపం ఉంది. ఈ కోపం అంతా నేను ప్రేమని పెళ్లి చేసుకున్నప్పటి నుండి మొదలైందని ధీరజ్ అంటుంటే ప్రేమ అదంతా విని బాధపడుతుంది. ఆ తర్వాత వేదవతి ఒంటరిగా కూర్చొని బాధపడుతుంటే.. అప్పుడే నర్మద, ప్రేమ వస్తారు. సాగర్, చందు ఆయన చెప్పింది వింటారు కానీ చిన్నోడు తనకి నచ్చింది చేస్తాడని అంటాడు. ఇలా చాలాసార్లు గొడవ జరిగాయి కానీ ఇప్పుడు అలా కాదు అసలు చిన్నోడు మాటలు పడడానికి కారణం నేనే.. ఆ రోజు వాడు ప్రేమని పెళ్లి చేసుకుంది నా వల్లేనని వేదవతి బాధపడుతుంది. ఇక నేను వెళ్లి నా వల్లే ఈ పెళ్లి జరిగిందని చెప్తానని వేదవతి అనగానే వద్దు ఇన్ని రోజులు నా దగ్గర దాచి మోసం చేసారని అనుకుంటాడని నర్మద అంటుంది.    ఆ తర్వాత ధీరజ్ డల్ గా ఉంటాడు. పాపం వాళ్ళ నాన్న కొట్టినందుకు బాధపడుతున్నాడు.. ఆ బాధని పోగొట్టాలని ప్రేమ అనుకొని ధీరజ్ దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. తరువాయి భాగంలో రేపు ఎగ్జామ్స్ ఉన్నాయ్ చదువుకోమని ప్రేమ అనగానే.. నిద్రొస్తుందని ధీరజ్ పడుకుంటాడు. వద్దని ధీరజ్ ని నిద్ర లేపి బుక్ చేతికి ఇస్తుంది ప్రేమ. ధీరజ్ నిద్రపోతు ప్రేమ కాళ్లపై పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam 2 : జీతం పెంచమన్న వర్కర్స్.. సాల్వ్ చేసిన కార్తీక్!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -390 లో... శ్రీధర్ స్నానం చేసి వచ్చేసరికి తన లుంగీ కన్పించదు. లుంగీ ఎక్కడ అని కావేరిని అడుగుతాడు. అయ్యో ఇప్పుడే మన అల్లుడు గారికి ఇచ్చానండి అని కావేరి చెప్పగానే.. నా లుంగీ ఎందుకు ఇచ్చావని శ్రీధర్ గొడవ పెట్టుకుంటాడు. కాశీ దగ్గరికి శ్రీధర్ వెళ్లి అడుగుతాడు. ఛీ చీప్ గా లుంగీ గురించి గొడవ ఏంటని స్వప్న అంటుంది. అవసరం అయితే కాస్ట్ చెప్పు ఇస్తానని స్వప్న అంటుంది. నాకు క్యాష్ వద్దు ఆన్లైన్ పేమెంట్ కావాలని శ్రీధర్ అనగానే ఈయన మారరని స్వప్న కోప్పడుతుంది.   ఆ తర్వాత శివన్నారాయణ ఇంటికి వర్కర్స్ వచ్చి జీతం పెంచాలని గొడవ చేస్తారు. మీరు కనుక జీతం పెంచకుంటే స్ట్రైక్ చేస్తామని చెప్పి వెళ్తారు. అదంతా దీప, కార్తీక్ వింటారు. జ్యోత్స్న పై శివన్నారాయణ కోప్పడతాడు. బావ సమస్యకి పరిష్కారం చెప్పండి అని కార్తీక్ ని దీప అడుగుతుంది. నేను చొరవ తీసుకోలేనని కార్తీక్ అంటాడు. దాంతో నేను చొరవ తీసుకుంటానని వెళ్లి దీనికి పరిష్కారం మా బావ చెప్తాడని శివన్నారాయణకి చెప్తుంది. అవసరం లేదని శివన్నారాయణ అంటాడు. కార్తీక్ టాలెంట్ తెలుసు కదా నాన్న అని కార్తీక్ గురించి దశరథ్ గొప్పగా చెప్తాడు. దాంతో శివన్నారాయణ సరే అంటాడు. ఒకవేళ ఫెయిల్ అయితే కోటి రూపాయలు ఇవ్వాలని అంటారు. ఒకవేళ సక్సెస్ అయితే అని దీప అనగానే.. మీరు ఏది అడిగితే అది చేస్తానని  శివన్నారాయణ అంటాడు.   ఆ తర్వాత వర్కర్స్ తో కార్తీక్ మాట్లాడతాడు. మీకు ఇప్పుడు జీతం పెంచలేము. మీకు వడ్డీ లేని ఋణం ఇస్తాం.. ఇంకా ఎంత ప్రాఫిట్ వస్తే అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తామని కార్తీక్ అనగానే వర్కర్స్ సరే అంటారు. దాంతో శివన్నారాయణ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత శివన్నారాయణ కార్తీక్ ని లోపలికి పిలుస్తాడు. అందరు లోపలికి వెళ్తుంటే పారిజాతానికి శ్రీధర్ ఫోన్ చేసి గొడవ సర్దుమణిగింది కదా అని అంటాడు. నీకేలా తెలుసు అని పారిజాతం అనగానే అందులో నా మనిషి ఉన్నాడులే అని శ్రీధర్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : సాక్ష్యాలు లేకుండా చేసిన యామిని.. పెళ్ళికి సిద్ధమైన రాజ్!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-754 లో... యామిని, రాజ్ పెళ్లిపీటలపై కూర్చొని ఉంటారు. ఏంటి వదిన అందరు సైలెంట్ గా ఉన్నారు. రాజ్ వేరొక పెళ్లి చేసుకుంటున్నాడని అపర్ణ వాళ్ళతో రుద్రాణి అంటుంది. కావ్య నువ్వు ఏంటి సైలెంట్ గా ఉన్నావని కావ్యని రుద్రాణి అడుగుతుంది. నేను ఆపను కానీ ఈ పెళ్లి జరగదని కావ్య అంటుంది.   మరొకవైపు ఆ రౌడీని తీసుకొని పోలీసులు ఇంకా రావడం లేదని అప్పు, కళ్యాణ్ టెన్షన్ పడతారు. ఆ తర్వాత యామిని మెడలో రాజ్ తాళి కట్టే టైమ్ కి రుద్రాణి ఆపండి అంటుంది. ఎందుకు ఆపావని వైదేహీ అంటుంది. అక్కడ పోలీసులు వచ్చారని అంటుంది. కానిస్టేబుల్ వచ్చి యామిని గారిని అరెస్ట్ చేయాలని అంటాడు. ఎందుకని యామిని అడుగతుంది. మీరు కావ్య గారిని చంపాలని ట్రై చేశారు. దానికి సాక్ష్యం ఈ రౌడీ అని కానిస్టేబుల్ అంటాడు. అప్పుడు ఆ రౌడీ.. ఈ యామిని ఎవరని యామినికి సపోర్ట్ గా మాట్లాడతాడు. దాంతో అప్పు వాళ్ళందరు షాక్ అవుతారు.    ఆ తర్వాత అప్పు జరిగిందంతా చెప్తుంది. మా అక్క మీతో క్లోజ్ గా ఉంటుందని పగతో తనని చంపాలని ట్రై చేసింది.. ఈ యామిని రౌడీకి డబ్బు ఇస్తుంటే నేను వీడియో తీసానని అప్పు తన ఫోన్ లో చూసేసరికి వీడియో ఉండదు. రాత్రి అప్పు పడుకున్నాక రాహుల్ వెళ్లి తన ఫోన్ లో ఉన్న వీడియోని డిలీట్ చేస్తాడు.   అప్పు వీడియో లేదని అనగానే చూసావా బావ వీళ్ళు కావాలనే నన్ను ఇలా చేస్తున్నారని యామిని యాక్టింగ్ చేస్తుంది. యామిని ఇదంతా చేసింది అనడానికి సాక్ష్యాలు చూపించలేపోతున్నావ్ అప్పు.. ఇక ఎలా నమ్మవంటావని రాజ్ అంటాడు.    తరువాయి భాగంలో యామిని తప్పు చెయ్యలేదని మీరు నమ్ముతున్నారా అని రాజ్ ని కావ్య అడుగుతుంది. నమ్ముతున్నానని రాజ్ అనగానే అయితే పెళ్లి చేసుకోండి అని కావ్య అంటుంది. యామిని మెడలో తాళి కట్టడానికి సిద్ధమవుతాడు రాజ్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu : శ్రీవల్లిపై మండిపడ్డ ఇద్దరు.. రామరాజుతో ధీరజ్ మాట్లాడతాడా!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -190 లో..... రామరాజు చెప్పినట్టు ధీరజ్ వినట్లేదని అతడిని రామరాజు కొడుతాడు. ఎందుకు బావ వాడిని అందరిముందు కొట్టావ్.. వాడికి నచ్చిన పని చెయ్యాలనుకుంటున్నాడు.. అందులో తప్పేముందని తిరుపతి అంటాడు. తండ్రిగా వాడు కష్టపడకూడదనుకుంటున్నాను అంతే అని రామరాజు అంటాడు. కానీ నువ్వు అలా కొట్టడం వల్ల మిగతా కోడళ్ళు వాడికి విలువ ఇస్తారా.. అంతెందుకు ప్రేమ వాడికి విలువ ఇస్తుందా అని తిరుపతి అడుగుతాడు. మరొకవైపు వేదవతి, ప్రేమ డల్ గా ఉంటారు. అప్పుడే శ్రీవల్లి వచ్చి.. మామయ్య గారు చెప్పినట్టు ధీరజ్ వినట్లేదని తన గురించి వేదవతికి నెగెటివ్ గా చెప్పాలని చూస్తుంది. ఇక ప్రేమ, నర్మద మాత్రం శ్రీవల్లిపై కోప్పడతారు. ఎందుకు ప్రతీ దాట్లో పానకంలో పుడకలాగా దూరతావ్ అనగానే.. నన్ను అంత మాట అంటావా అని శ్రీవల్లి ఏడవటం మొదలెడుతుంది. మరొకవైపు ధీరజ్ బాధపడుతుంటే.. చందు, సాగర్ తన దగ్గరికి వెళ్లి మాట్లాడతారు. ముగ్గురు కలిసి సరదాగా బయటకు వెళ్లి టీ తాగుతారు. ఆ తర్వాత వేదవతి, ప్రేమ, నర్మద ముగ్గురు కలిసి రామరాజు, ధీరజ్ లు మాట్లాడుకునేలా ప్లాన్ చేస్తారు. రామరాజు భోజనానికి వస్తాడు. మరొకవైపు ఇప్పుడే భోజనానికి వద్దు.. తర్వాత వెళ్ళు అని ధీరజ్ ని ఆపుతుంది ప్రేమ. రామరాజు భోజనం చేస్తుంటే ధీరజ్ ని వెళ్ళమంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : పందెంలో గెలిచిన కార్తీక్.. జ్యోత్స్నకి డౌట్!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -389 లో..... కార్తీక్ కావాలనే సుమిత్రని రెచ్చగొట్టి తను భోజనం చేసేలా చేస్తాడు. నేను దీప వంటలు తిన్నాను. ఇప్పుడు ఏమైంది నేను మారిపోయానా ఆ మనిషి మీద ఎప్పటికి కోపం పోదు.. ఆ మనిషి నా దృష్టిలో హంతకురాలు అని సుమిత్ర అనగానే.. దీప బాధపడుతుంది. ఆ తర్వాత వంటలు బాగున్నాయ్.. నా భార్య తినేలా చేసినందుకు థాంక్స్ అని దీప, కార్తీక్ లకి చెప్తాడు దశరథ్. వంటలు వరస్ట్ గా ఉన్నాయని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత దీప, కార్తీక్ ఇద్దరు పారిజాతం, జ్యోత్స్నల దగ్గర కి వెళ్లి మన పందెం ప్రకారం ఇప్పుడు నువ్వు గుంజీలు తియ్యాలి.. లేదంటే పెద్ద వాళ్ళకి చెప్తానని కార్తీక్ అనగానే భయపడి జ్యోత్స్న కార్తీక్ స్టాప్ అనేవరకు తీస్తుంది. ఆ తర్వాత దీప, కార్తీక్ ఇంటికి వెళ్తారు. అత్త భోజనం చేసిందని కార్తీక్ చెప్పగానే.. కాంచన హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందరు సరదాగా కాసేపు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత జ్యోత్స్న కాళ్ళకి మసాజ్ చేస్తుంది పారిజాతం. నిన్ను వాడితో పెట్టుకోకు అంటే వినవని జ్యోత్స్నతో పారిజాతం అంటుంది. నేను అసలు అయిన వారసురాలు కాదని బావకి తెలిసి ఉంటుందా అని జ్యోత్స్న అంటుంది. లేదు దాస్ చెప్పడు.. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడో కానీ నీకు మాత్రం అన్యాయం జరగనివ్వను అవసరమైతే ఈ ఇంట్లో వాళ్ళ ప్రాణాలు తియ్యడానికి అయినా రెడీ అని పారిజాతం అనగానే..వజ్యోత్స్న హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు దీపకి కార్తీక్ విజిల్ వెయ్యడం నేర్పిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : పెళ్ళిని ఆపిన రుద్రాణి.. పోలీసులు యామినిని అరెస్ట్ చేస్తారా!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -753 లో..... రాజ్ తన మనసులో మాట కావ్యకి చెప్పాలని చూస్తాడు. నాకు ఎందుకో బాధగా ఉంది. గుండె భారంగా ఉంది మీకు అలాగే ఉందా అని కావ్యని రాజ్ అడుగుతాడు. నాకు ఎందుకు ఉంటుంది. యామినితో పెళ్లికి ఒప్పుకుంది మీరు.. అన్ని మీరు చేసి నన్ను అడుగుతున్నారు. అయిన రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడడం ఏంటని రాజ్ తో కావ్య అంటుంది. ఆ తర్వాత ఇందిరాదేవి, అపర్ణ వాళ్లంతా ఒక దగ్గరుంటారు. వాళ్ళని రాహుల్ , రుద్రాణి చూసి.. వీళ్ళేదో పెళ్లి క్యాన్సల్ కి ప్లాన్ చేస్తున్నారని దూరం నుండి చూస్తుంటారు. అప్పుడే కళ్యాణ్, అప్పు, స్వప్న వస్తారు. మన ప్లాన్ సక్సెస్ యామిని రౌడీకి డబ్బు ఇవ్వడం వీడియో తీసానని అప్పు చెప్పగానే అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ విషయం రాహుల్, రుద్రాణి విని షాక్ అవుతారు. వెంటనే యామినికి వెళ్లి చెప్తారు.  మీరేం కంగారు పడకండి ఈ పెళ్లి ఆగదు.. వాళ్ళని ఆ భ్రమలోనే ఉండనివ్వండి అని యామిని కాన్ఫిడెన్స్ గా మాట్లాడుతుంది. ఆ తర్వాత రఘనందన్ కావ్య దగ్గరికి వచ్చి ఈ పెళ్లి ఆపకని రిక్వెస్ట్ చేస్తాడు. కూతురు చేసే ప్రతీదానికి ఇలా సపోర్ట్ చెయ్యొద్దని కావ్య అంటుంది. ఆ తర్వాత రాజ్ పెళ్లి కి రెడీ అవుతుంటే.. అప్పుడే కావ్య వెళ్లి త్వరగా రెడీ అవ్వండి అని చెప్తుంది. అప్పుడే ఇందిరాదేవి వాళ్ళు వస్తారు. అసలు ఆ కళావతికి నేను అంటే ఇష్టం ఉందా.. అసలు ఏం అర్ధం అవడం లేదని రాజ్ అంటాడు. ఆ తర్వాత యామిని పెళ్లికి రెడీ అయి కావ్యకి ఎదురుపడుతుంది. కావ్య బాధపడేలా మాట్లాడుతుంది. తరువాయి భాగంలో రాజ్ యామిని మెడలో తాళి కట్టబోయే టైమ్ కి రుద్రాణి ఆపండి అంటుంది. అప్పుడే పోలీసులు వచ్చి యామిని ని అరెస్ట్ చెయ్యాలని అంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ఢీ సీజన్ 20 త్వరలో

బుల్లితెర మీద ఫేమస్ ఢీ డాన్స్ షో సీజన్ 20 త్వరలో మొదలుకాబోతోంది. ఐతే  ప్రముఖ డ్యాన్స్ షో ‘ఢీ’ కొత్త సీజన్ మొదలవ్వనుంది. ఈ కొత్త సీజన్ కి కూడా యాంకర్ గా నందు వచ్చాడు. ఐతే జడ్జెస్ గా విజయ్ బిన్నీ మాష్టర్ రాగా లేడీ జడ్జ్ గా రెజీనా కసాండ్ర రాబోతోంది. తాజాగా ఈ ఢీ న్యూ సీజన్ గ్రాండ్ లాంచో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్స్ ప్రతీ బుధవారం, గురువారం రాత్రి 9 .30 కి ప్రసారం కాబోతోంది. ఇక ఢీ హిస్టరీలో కొన్ని మైల్ స్టోన్స్ ఉండబోతున్నాయన్న విషయం తెలుస్తోంది. పల్సర్ బైక్ ఝాన్సీ, మణికంఠ, జానూ లిరి, అభి మాష్టర్, సుస్మిత ఆనాల, జతిన్, రాజు, పండు మాష్టర్, భూమిక, అన్షు రెడ్డి ఉండబోతున్నారు. అలాగే శ్రీవాణి కూతురు రాజనందిని కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేయబోతోంది. విక్రమాదిత్య వచ్చి కూతురి కాళ్లకు నల్ల తాడు కట్టాడు. జాను లిరి వాళ్ళ అబ్బాయి కూడా స్టేజి మీదకు వచ్చాడు. ఢీ 20 ఇది సార్ మా బ్రాండ్ అనే టైటిల్ తో ఈ న్యూ ఎపిసోడ్ ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇక నెటిజన్స్ ఐతే వస్తున్న డాన్స్ మాష్టర్లు పేర్లు మెన్షన్ చేస్తూ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఐతే ఈ మెగా లంచ్ ఎప్పుడు ఉండబోతోంది ఎవరు లాంచ్ చేయబోతున్నారు అన్న డీటెయిల్స్ ని ప్రస్తుతానికి సీక్రెట్ గా ఉంచారు మేకర్స్.  

Illu illalu pillalu : నిజం చెప్పాలనుకంటున్నా వేదవతి.. కొడుకుని కొట్టిన తండ్రి!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -189 లో... ధీరజ్ ని తీసుకొని ఇంటికి వస్తాడు రామరాజు. అప్పుడే వాళ్ళు అలా కలిసి రావడం వేదవతి చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరు ఇద్దరు ఇలా వస్తుంటే ఎంత బాగుందోనని వేదవతి అంటుంది. వాడిని డెలివరి బాయ్ జాబ్ మానేయని చెప్పు వాడి అవసరాలకి.. ఆ డబ్బు అంతా నేను ఇస్తానని చెప్పమని వేదవతితో రామరాజు అంటాడు. వాడి కాలేజీ తర్వాత మన మిల్ కి రమ్మని చెప్పమని రామారాజు అంటాడు‌‌‌. దాంతో ఒప్పుకోరా అని ధీరజ్ తో వేదవతి అంటుంది. నేను ఒప్పుకోను.. నాకు సొంతంగా కష్టపడడం ఇష్టం.. నేను ఆయన దగ్గర పనిచెయ్యనని ధీరజ్ చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఆ మాటలకి ధీరజ్ ని రామరాజు కొడతాడు. ఇవ్వన్నీ సమస్యలకి, వాడిని నేను దూరం పెట్టడానికి కారణం.. వాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్లే అనగానే ప్రేమ బాధపడుతుంది. ఆ తర్వాత వేదవతి ఎవరు తగ్గట్లేదంటూ కిచెన్ లోని సామాను అంతా కోపంతో పడేస్తుంది.అప్పుడే ప్రేమ, నర్మద వెళ్తారు. అసలు ధీరజ్ ని ఎందుకు అర్ధం చేసుకోవడం లేదని ధీరజ్ కి సపోర్ట్ గా ప్రేమ మాట్లాడుతుంది. దాంతో వేదవతి, నర్మద  హ్యాపీగా ఫీల్ అవుతారు‌. తరువాయి భాగంలో రామరాజు పక్కన ధీరజ్ కూర్చొని భోజనం చేస్తుంటే రామరాజు వెళ్లిపోతాడు. ఆ తర్వాత దీనంతటికి కారణం నేను..  ప్రేమ, ధీరజ్ ల పెళ్లి చేసాను వెంటనే నేనే వాళ్ళ పెళ్లి జరిపించానని ఆయనతో చెప్పాలనుకుంటింది వేదవతి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : దీప చేసిన వంటలన్నీ తిన్న సుమిత్ర.. పందెంలో  గెలిచిందెవరంటే!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -388 లో.... సుమిత్రని అమ్మగారు అని శౌర్య పిలవడంతో సుమిత్రకి కోపం వస్తుంది. దీప దగ్గరికి వచ్చి ఎందుకు చిన్నపిల్లని పాడుచేస్తున్నావ్.. నీ మీద కోపం తన మీద కాదు.. అయినా నేను భోజనం చెయ్యలేదని దానికేల తెలుసని సుమిత్ర అడుగుతుంది. అంటే ఇంట్లో అనుకుంటుంటే విన్నదని దీప అంటుంది. అయితే ఇంట్లో కూడా నన్ను చెడ్డదాన్ని చేస్తున్నావన్న మాట.. నీతో ఏ బంధం లేదు కానీ దానితో ఒక బంధం ఉందని దీపతో సుమిత్ర అనగానే దీప హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదంతా వింటున్న జ్యోత్స్న నీకు తెలియక అన్నా కూడా అదే నిజమని అనుకుంటుంది. దీప దగ్గరికి కార్తీక్ వచ్చి.. నువ్వు కోరుకుంది కూడా ఇదేగా అత్తకి శౌర్య అంటే చాలా ష్టమని కార్తీక్ అంటాడు. మరొకవైపు మమ్మీకి ఆ శౌర్య అంటే ఎందుకు అంత ఇష్టం.. ఎలాగైనా దాన్ని అమ్మకి దూరం చెయ్యాలని జ్యోత్స్న, పారిజాతం అనుకుంటారు. అప్పుడే కార్తీక్ దగ్గరికి శౌర్య వస్తుంది. నువ్వు ఇక ఇంటికి వెళ్ళు అని శౌర్యని ఇంటికి పంపిస్తాడు కార్తీక్. ఆ తర్వాత కార్తీక్, దీపల దగ్గరకి జ్యోత్స్న వస్తుంది. మా మమ్మీ ని ఈ రోజు కూడా తినకుండా చేస్తారా ఏంటని జ్యోత్స్న అనగానే.. అలా అయితే నువ్వే తినేలా చెయ్యొచ్చు కదా.. నీ వల్ల కాదు నేనే తినేలా చేస్తానని జ్యోత్స్నతో కార్తీక్ పందెం కడుతాడు. ఒకవేళ నువ్వు ఓడిపోతే  గుంజీలు తియ్యాలని కార్తీక్ అంటాడు. మరి నువ్వు ఓడిపోతే అని జ్యోత్స్న అనగానే నేను గుంజీలు తీస్తానని దీప అంటుంది. ఆ తర్వాత అందరు భోజనానికి వస్తారు. జ్యోత్స్న మాత్రం సుమిత్రని తీసుకొని రెస్టారెంట్ కి బయల్దేర్తుంది. కార్తీక్ వద్దని ఆపుతాడు. ఇప్పుడు దీప వంటలు తింటే ఎక్కడ మీ మనసు మారుతుందోనని మీకు భయమని కార్తీక్ అనగానే నాకేం భయం లేదని దీప వండిన అన్ని రకాల వంటలు తింటుంది సుమిత్ర. ఇప్పుడు నీకు కోపం పోయిందా అని కార్తీక్ అనగానే.. ఎప్పటికి పోదని సుమిత్ర అంటుంది. దాంతో దీప బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : పెళ్ళి పీటలపై రాజ్, యామిని.. కావ్య వంకే చూస్తున్నాడుగా!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -752 లో.....రాజ్ తో కావ్య మాట్లాడుతుంటే అప్పుడే యామిని వచ్చి.. బావ రా సంగీత్ స్టార్ట్ అయిందని తన వెంట తీసుకొని వెళ్తుంది. మరొకవైపు రాహుల్, రుద్రాణి పెళ్లికి రావడంతో అయ్యో మీరు కూడా వచ్చారా అని స్వప్న ఏం తెలియనట్లు అడుగుతుంది. నాకు తెలుసు నువ్వే మమ్మల్ని లోపల ఉంచి, నువ్వే రూమ్ లాక్ చేసావని అని రుద్రాణి అంటుంది. తెలిసిపోయిందా అని స్వప్న అంటుంది. ఆ తర్వాత రౌడీకి అప్పు ఫోన్ చేసి యామినికి కాల్ చేయమని చెప్తుంది. అందరు సంగీత్ కి రెడీ అవుతారు. ప్రకాష్, ధాన్యలక్ష్మి డ్యూయెట్ సాంగ్ చేస్తారు. అప్పు, కళ్యాణ్ డాన్స్ చేస్తారు. యామిని, రాజ్ డాన్స్ కి సిద్ధం అవుతుండగా.. రౌడీ ఫోన్ చేసి కోటి రూపాయలు పట్టుకొని రమ్మంటాడు. దాంతో యామిని.. మళ్ళీ వస్తానని బయటకు వెళ్తుంది. ఇక రాజ్ తో కావ్యని డాన్స్ చెయ్యమని ఇందిరాదేవి పంపిస్తుంది. రాజ్, కావ్య ఇద్దరు డాన్స్ చేస్తారు. మరొకవైపు యామిని డబ్బు తీసుకొని రౌడీ దగ్గరికి వెళ్తుంది. రౌడీకి డబ్బు ఇవ్వడం, మాట్లాడేది అంతా కూడా అప్పు, కళ్యాణ్, స్వప్న వీడియో తీస్తారు. రౌడీ వెళ్ళిపోయాక అప్పు వాళ్ళని యామిని చూసి షాక్ అవుతుంది. ఇదంతా చూసారా ఏంటని యామిని టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత కావ్యతో మాట్లాడానికి వస్తాడు రాజ్. .తరువాయి భాగంలో రాజ్, యామిని ఇద్దరు పెళ్లిపీటలపై కూర్చొని ఉంటారు. కావ్య వంక రాజ్ చూస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

జబర్దస్త్ వర్ష కన్నీళ్లు..బావ చనిపోయాడంటూ ఎమోషనల్

జీవితాలు పైకి కనిపించనంత అందంగా ఎవరివీ ఉండవు. ఏదో ఒక రూపంలో ప్రతీ మనిషీ బాధపడుతూనే ఉంటాడు ఇక బుల్లితెర మీద ఉండేవాళ్లు జీవితాల్లోనూ ఎన్నో విషాదాలు ఉంటాయి. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో జబర్దస్త్ వర్ష తన జీవితంలో జరిగిన సంఘటన చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది.  "రీసెంట్ నా లైఫ్ లో ఒక ఇష్యూ జరిగింది. ఏ సోషల్ మీడియాలో కూడా చెప్పలేదు. మనకు మనుషులు అనేవాళ్ళు చాలా అవసరం. మా అక్క ఏదో అడిగింది అని మా బావగారు షాప్ కి వెళ్లారు. బావగారు షాప్ కి వెళ్లి రోడ్డు దాటుతుంటే ఒక బైక్ గుద్దేసింది. బైక్ డాష్ ఇచ్చిందంటే మాములుగా దెబ్బలు తగులుతాయి. ఇంతలో మా అక్కకు ఫోన్ వచ్చింది. బావగారిని బైక్ గుద్దేసింది అని. ఇదేంటి ఇప్పుడే కదా మా ఆయన వెళ్లారు ఎం జరిగింది అనేసరికి హాస్పిటల్ కి రమ్మన్నారు. అక్కడికి వెళ్లేసరికి మా బావగారు చనిపోయి ఉన్నారు. మా బావగారు చనిపోయిన దగ్గర నుంచి అక్క డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. ఫోన్ చేసినా తియ్యట్లేదు. మా బావగారి బట్టలన్నీ తీసుకుని ఒక రూమ్ లో వేసుకుని వాటి మీద పడుకుంటుందట.. బావగారి శవాన్ని అలా తీసుకొస్తున్నప్పుడు మా అక్క వాళ్ళ అబ్బాయి నన్ను హగ్ చేసుకుని పిన్ని అసలు మాకు టిఫన్ తెచ్చుకోవడం కూడా తెలీదు పిన్ని. రేపటి నుంచి మేము ఎవరిని అడగాలి" అని అడిగేసరికి చాలా బాధేసింది. డబ్బులు కచ్చితంగా ఇంపార్టెంట్ కాదు. ఇంతకు ముందు నేను చాలా మూర్ఖంగా ఉండేదాన్ని డబ్బులు ఉండాలి అని..డబ్బులు లేకపోతే పాల ప్యాకెట్ కూడా రాదు..కష్టపడాలి పని చేయాలి అని ఇంట్లో వాళ్ళను తిట్టేదాన్ని. కానీ మనుషులు చాలా అవసరం అన్న విషయం తెలుసుకున్నా...బైక్ డ్రైవ్ చేసే వాళ్ళు చూసుకుని చేయండి. అంటూ ఎమోషనల్ అవుతూ చెప్పింది వర్ష.

అల్లు అర్జున్ ని పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేస్తా

  భానుశ్రీ బిగ్ స్క్రీన్ మీద కనిపిస్తూ అలరిస్తూ ఉంటుంది. బాహుబలి మూవీలో తమన్నాతో కలిసి చేసింది. బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టెంట్ గా వెళ్ళింది. అలాంటి భానుశ్రీ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూకి వచ్చింది. భానుశ్రీకి స్వయంవరం పెడితే ఎవరెవరు ఉండాలనుకుంటుంది అంటూ హోస్ట్ అడిగేసరికి ఎవరైనా ఉండొచ్చా అంది..ఎవరైనా అంది హోస్ట్. బిగ్ స్క్రీన్ మీద రణ్వీర్ కపూర్, విజయ్ దేవరకొండ అని చెప్పేసరికి టీవీలో చెప్పు అంది. "టీవీలో అంత అందగాళ్ళు లేరే..నా పక్కన నిలబడేంత స్టేటస్ ఉన్నవాళ్లు ఎవరూ లేరు. " అంది భాను. "టీవీలో మా హైపర్ ఆది ఎంత అందంగా ఉంటాడు" అంది హోస్ట్. "నా కటౌట్ నా హాట్ చూసి మాట్లాడు" అంది భాను. "నిఖిల్ ఉన్నాడు" అని హోస్ట్ అంది. 'ఆయనకు లాస్ట్ టైం బ్రేకప్ అయ్యిందట" అని భాను చెప్పింది. "ఇలాంటి టైంలోనే మనం వెళ్లి హెల్ప్ చేయాలి" అంది హోస్ట్. "వద్దురా నేను బ్రేకప్ దానిలోకి వెళ్లి ప్యాచప్ కాలేను..నాకంటూ ఒక స్పెషల్ పీస్ కావాలి " అని చెప్పింది భాను. "అర్జున్ కి పెళ్లయిపోయింది. పృద్వి వద్దు..ఆల్రెడీ అతని వెనక విష్ణు ప్రియా పడుతోంది. కష్టం నేను అలా ఎవరి వెనకాల పడను. నా వెనకాల పడేవాళ్ళు కావాలి నాకు. అందుకే చెప్పా టీవీలో నాకు సూటయ్యేవాళ్ళు లేరని" అంది భాను. "మరి అల్లు అర్జున్" అని హోస్ట్ అడిగింది. "అల్లు అర్జున్ ఫాన్స్ అసోసియేషన్ ఇక్కడ. అల్లు అర్జున్ కి నేనంటే ఎంతిష్టమో తెలుసా నీకు . పుష్ప మూవీలో శ్రీవల్లి కదా వెళ్లి తీసేసి శ్రీ అందుకే నా పేరులోని శ్రీ తీసి పెట్టమని ఆయనే చెప్పారు" అంది భాను. ఇక హోస్ట్ వర్ష ఐతే "నాకు అల్లు అర్జున్ రోజూ కల్లోకి వస్తాడు.." అని చెప్పేసరికి "మేము రోజు కలుస్తాం..ఇంకో జన్మ ఉంటే అల్లు అర్జున్ ని పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేస్తా " అని ఇంకొంచెం ఎక్కువగా చెప్పింది భాను.

అమరదీప్ కి డెబ్జానీ అంటే ఇష్టం

కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ లాస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమోలో అమరదీప్ చేసిన పనికి అందరూ షాకయ్యారు. అమరదీప్ కి రవితేజ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు. ఐతే ఈ షో గ్రాండ్ ఫినాలేలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఐతే అమరదీప్ కి రవితేజ అంటే ఎంత ఇష్టమో తెలిసిన విషయమే. హెయిర్ స్టైల్ కానీ టోటల్ ఆటిట్యూడ్ కానీ అంతా కూడా రవితేజనే ఫాలో అవుతూ ఉంటాడు. ఐతే అమరదీప్ కి డెబ్జానీ అంటే ఇష్టం ఈ షోలో ఈమెతో పరాచికాలు ఆడుతూ ఉంటాడు. ఆమె కూడా సరదాగా కౌంటర్లు ఇస్తూ ఉంటుంది. ఈ న్యూ ప్రోమోలో అమరదీప్, డెబ్జానీ ఇద్దరూ కాళీ ఇడియట్ పోస్టర్ ని స్పూఫ్ చేస్తే వెనక నుంచి సాకేత్ కొమాండూరి "జింతాతా జితాజితా" సాంగ్ ని వాళ్ళ ఇద్దరి పేర్లతో రాసి పాడుతూ అందరినీ ఎంటర్టైన్ చేసాడు. ఇక అలా చూడలేని శ్రీముఖి వీపు మీద బాధేసింది..డెబ్జానీ ఐతే అమరదీప్ జుట్టు పట్టుకుని పీకేసింది. ఇక జడ్జ్ అనసూయ ఐతే దొంగ సచ్చినోడా అంటూ క్యూట్ గా తిట్టింది. "తేజు షర్ట్ తీయమంది..నాకు వాతలు పెట్టేసింది" అంటూ సాకేత్ పడేసరికి డెబ్జానీ ఫుల్ ఎంటర్టైన్ అయ్యింది. అమరదీప్ ఐతే బాగా నవ్వుకున్నాడు. ఇంతలో కౌబాయ్ గెటప్ లో యాదమ్మరాజు నేను పెద్ద డైరెక్టర్ ని అంటూ   వచ్చాడు. "మీరు ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు తీశారు" అని అడిగింది శ్రీముఖి. "350 సినిమాలు తీశాను" అని చెప్పాడు. "మరి మేము ఒక్కటి కూడా చూడలేదు మీ సినిమా" అని అడిగింది శ్రీముఖి. "నేను రిలీజ్ చేయలేదు" అన్నాడు. "ఎందుకు చేయలేదు" అని శ్రీముఖి అనేసరికి "నేను కష్టపడి సినిమా తీస్తే మీరు కూర్చుని చూస్తారా" అని కౌంటర్ వేసాడు.  

Illu illalu pillalu : శ్రీవల్లిని జాబ్ చేయమన్న చందు.. కొడుకు కష్టాన్ని చూసి తండ్రి ఎమోషనల్!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -188 లో... ప్రేమ డాన్స్ క్లాస్ చెప్తున్న విషయం  రామరాజుకి శ్రీవల్లి చెప్పిందని ప్రేమ, నర్మదలకి అర్ధమవుతుంది. దాంతో ఇండైరెక్ట్ గా ఎవరు మావయ్యకి చెప్పారని శ్రీవల్లిని అడుగుతారు. నువ్వు గానీ చెప్పావా అక్క.. నిన్న మీ అమ్మ వాళ్ళింటికి వెళ్ళావటా అని నర్మద అంటుంది. నేను వేరొక రూట్ నుండి వెళ్ళాను.. బ్యాంకు కాలనీ నుండి వెళ్ళలేదని శ్రీవల్లి అనగానే మేమ్ బ్యాంక్  కాలనీలో డాన్స్ నేర్పిస్తున్న విషయం నీకెలా తెలుసని నర్మద అనగానే శ్రీవల్లికి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు అక్క ఇలా ప్రతీ దాంట్లో కలుగజేసుకుంటున్నావని నర్మద, ప్రేమ కోప్పడతారు. నేను ఇంటికి పెద్ద కోడలిని అని శ్రీవల్లి అంటుంది. పెద్ద కోడలు అయితే ఇలా చేస్తారా బుద్ధి ఉండాలంటు ఇద్దరు శ్రీవల్లిని తిడతారు. ఇంకొకసారి మా విషయాలు పట్టించుకుంటే బాగోదంటూ ఇద్దరు శ్రీవల్లికి వార్నింగ్ ఇస్తారు. ఆ తర్వాత నాకే వార్నింగ్ ఇస్తారా అని చందు దగ్గరికి వెళ్లి జరిగింది చెప్తుంది శ్రీవల్లి. ప్రేమ చాల మంచి అమ్మాయి అని చందు అనగానే శ్రీవల్లికి ఇంకా కోపం వస్తుంది. వాళ్ళిద్దరు ఏదో ఒక జాబ్ చేస్తున్నారు.. నువ్వు కూడా చదువుకున్నావ్ కదా అప్పుడు ఇవ్వన్నీ గొడవలు పట్టించుకోవని చందు అనగానే నేను ఒకటి అనుకుంటే ఒకటవుతుందేంటని శ్రీవల్లి అనుకుంటుంది. ఆ తర్వాత రామరాజు, తిరుపతి బయటకు వెళ్తారు. అక్కడ ధీరజ్ ఫుడ్ డెలివరి చేస్తూ కన్పిస్తాడు. ఆర్డర్ లేట్ అయిందని అతను తిడుతుంటే నా కొడుకేం పరిస్థితి వచ్చిందని రామరాజు ఫీల్ అవుతాడు. ఆ తర్వాత రామరాజుని తీసుకొని ధీరజ్ ఇంటికి వస్తాడు. తరువాయి భాగం లో.. ఏం చెయ్యకు మిల్ కి రా అని ధీరజ్ తో రామరాజు అనగానే.. రానని దీరజ్ చెప్తాడు. దాంతో ధీరజ్ ని రామరాజు కొడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 :  త్వరలో కార్తీక్, దీపల శోభనం.. నోరెళ్ళబెట్టిన అనసూయ!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -387 లో... సుమిత్ర గురించి కాంచన మాట్లాడుతుంది. అమ్మ ఎంత మొండిది. అయినా నేను వదలను.. ఈ రోజు అమ్మతో భోజనం తినిపిస్తానని దీప అనగానే సుమిత్రని పట్టుకొని అమ్మ అంటుందని కాంచన వాళ్ళు షాక్ అవుతారు. అమ్మగారు అనబోయి అలా అందని కార్తీక్ కవర్ చేస్తాడు. అంటే మాత్రం తప్పేంటి అనసూయ గారు అని కార్తీక్ అంటాడు. మిమ్మల్ని కూడా అలా పిలవడం నాకు ఇష్టం లేదు చక్కగా పెద్దమ్మ అంటానని కార్తీక్ అనగానే అనసూయ హ్యాపీగా ఫీల్ అవుతుంది. సుమిత్ర అత్తని అమ్మ అని పిలవడానికి ఇంకా టైమ్ ఉందని కార్తీక్ అనగానే మీరనేది అర్ధం కావడం లేదని అనసూయ అంటుంది. అంటే రెండు కుటుంబాలు కలిసాక సుమిత్ర అత్తని దీప అమ్మ అంటుందని కార్తీక్ కవర్ చేస్తాడు. ఆ తర్వాత కార్తీక్, దీప సైకిల్ పై శివన్నారాయణ ఇంటికి బయల్దేర్తారు. ఇద్దరు సరదాగా కబుర్లు చెప్తూ వెళ్తారు. ఆ తర్వాత కార్తీక్, దీప శివన్నారాయణ దగ్గరికి వెళ్లి నమస్కారం పెడతారు. ఎప్పుడు కార్తీక్ మిమ్మల్ని అందరు అలా పిలుస్తూ.. నన్ను మాత్రం పారు అంటున్నాడని శివన్నారాయణకి పారిజాతం చెప్తూ మురిసిపోతుంది. ఏమైనా అంటే మనం మనం ఒకటి అంటున్నాడని అంటుంది. నీకు ఇంకా అర్థం కాలేదా.. మనం మనం ఒకటి అంటే నువ్వు కూడా ఈ ఇంటికి ఒకప్పుడు పనిమనిషివి కదా.. ఇప్పుడు వాళ్ళు కూడా అదేగా అని శివన్నారాయణ అనగానే పారిజాతం మొహం మాడిపోతుంది. ఆ తర్వాత దీప దగ్గరికి శౌర్య వస్తుంది. సుమిత్ర దగ్గరికి దీప వెళ్లి.. అమ్మగారు మీరు భోజనం చెయ్యలేదని అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : రౌడీకి కోటి రూపాయలు ఇచ్చిన యామిని.. వాళ్ళిద్దరు చూసేసారుగా!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -751 లో.....రాజ్, యామినీల పెళ్లిలో భాగంగా మెహందీ ఫంక్షన్ ఏర్పాటు చేస్తారు. రాజ్ నువ్వు వచ్చి యామినికి మెహందీ పెట్టమని వైదేహి అంటుంది. దాంతో రాజ్ కాస్త ఇబ్బందిగానే యామిని పక్కన వచ్చి కూర్చుంటాడు. రాజ్ యామినికి మెహందీ పెట్టడం ఆపాలని అప్పు, కళ్యాణ్ ప్లాన్ చేసి కావ్యపై ఎటాక్ చేసిన రౌడీతో యామినికి ఫోన్ చేయిస్తారు. ఆ రౌడీ యామినికి ఫోన్ చేసి ఇప్పుడు మీ ఇంటి ముందున్నాను.. మీరు ఇప్పుడు కనుక రాకుంటే మీరే కావ్యపై ఎటాక్ చేయించారని పోలీస్ స్టేషన్ లో చెప్తానని బ్లాక్ మెయిల్ చెయ్యగానే యామిని మెహందీ పెట్టించుకోకుండా రౌడీ దగ్గరికి వస్తుంది. మీరు నాకు ఇప్పుడు కోటి రూపాయలు ఇవ్వాలని రౌడీ డిమాండ్ చేస్తాడు. దానికి యామిని ఒప్పుకుంటుంది. అదంతా అప్పు, కళ్యాణ్ వీడియో తీస్తారు. అప్పుడే యామిని దగ్గరికి వైదేహి, రఘు నందన్ వచ్చి ఏంటి కోటి రూపాయలు అంటున్నారని అడుగుతాడు. ఆ తర్వాత చెప్తానని యామిని అంటుంది. ఆ తర్వాత యామిని తన పేరెంట్స్ కి అసలు విషయం చెప్తుంది. నాకు కోటి రూపాయలు కావాలని యామిని అడుగుతుంది. ఇలా ఇంకొకసారి చేస్తే సపోర్ట్ చెయ్యమని యామినికి వార్నింగ్ ఇస్తాడు రఘునందన్. ఆ తర్వాత రాహుల్, రుద్రాణి కలిసి యామిని దగ్గరికి వస్తారు. ఆ కావ్య వాళ్ళు పెళ్లి క్యాన్సిల్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. నేను ఎలాగైనా మీ పెళ్లి జరిగేలా చూస్తానని యామినితో రుద్రాణి అంటుంది. ఆ తర్వాత సంగీత్ కి కావ్య రెడీ అయి వస్తుంది. స్వప్న వచ్చి ఏంటే నీ భర్తకి పెళ్లి జరుగుతుంది. నీకు బాధగా లేదా అంటూ మాట్లాడుతుంది. అప్పుడే రాజ్ పాట పాడుకుంటు కావ్య దగ్గరికి వస్తాడు. తరువాయి భాగం లో సంగీత్ టైమ్ కి యామినికి రౌడీ ఫోన్ చేస్తాడు. రాజ్ తో కావ్య డాన్స్ చేస్తుంది. రౌడీకి యామిని కోటి రూపాయలు ఇచ్చేది అప్పు, కళ్యాణ్ వీడియో తీస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

గెలిస్తే 1000 వాలా అంటిస్తాం గెలవకపోతే సెట్ అంటించేస్తాం

కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ షో గ్రాండ్ ఫినాలేలోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఈ షో ప్రోమో లేటెస్ట్ గా రిలీజ్ అయ్యింది. "మాష్టర్ ఫినాలేకి ప్రిపరేషన్ ఎలా ఉంది" అని శ్రీముఖి శేఖర్ మాష్టర్ ని అడిగింది. చూసావు కదా అంటూ అమరదీప్ గట్టిగా అరుస్తూ "1000 వాలా తెచ్చి స్టేజి మీద పెట్టి మాష్టర్ చెప్పండి వెలిగించేస్తాం" అన్నాడు మంచి జోష్ తో. "గెలిస్తే ఇవి అంటిస్తాం గెలవకపోతే సెట్ అంటించేస్తాం" అంటూ విన్నింగ్ కెప్టెన్ ఇమ్మానుయేల్ చెప్పుకొచ్చాడు. ఇక లేడీస్ సైడ్ నుంచి ప్రియాంక జైన్ వచ్చి కోసేయమంటారా అంటూ కేక్ ని చూపించి అడిగింది. ఇక విష్ణు ప్రియా ఐతే పటాసులు తెచ్చి కాల్చేయమంటారా అంటూ అడిగింది. దాంతో అందరూ నవ్వేశారు. ఇక రోహిణి ఐతే రెండు దండాలు పట్టుకొచ్చింది. అవి చూసిన శ్రీముఖికి డౌట్ వచ్చి " ఒక దండ అంటే అనసూయ గారి మెడలో వేయడానికి తెచ్చావు ఓకే ఇంకో దండ ఎందుకు" అని అడిగింది. "యాజ్ ఏ విన్నింగ్ కెప్టెన్ గా నేను వేసుకోవడానికి" అని చెప్పింది. దాంతో అందరూ నవ్వేశారు. "యుద్ధంలో అందరూ పోరాడతారు. కానీ పోరాడేవాడి చేతిలో కత్తి మాత్రమే ఉంటుంది. కానీ గెలిచినోడికి మాత్రమే సింహాసనం దక్కుతుంది" అంటూ అనసూయ, శేఖర్ మాస్టర్ కలిసి టైటిల్ ని రివీల్ చేసి చూపించారు. కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 1 ,  2 గ్రాండ్ సక్సెస్ ని సొంతం చేసుకున్నాయి. ఈ ఎపిసోడ్ మొత్తం కూడా బుల్లితెర మీద కనిపించేవాళ్లే ఉన్నారు. తేజస్విని మడివాడ, డెబ్జానీ, శ్రీసత్య, హమీద, రోహిణి, ప్రేరణ, ఇమ్మానుయేల్, అమరదీప్, ప్రియాంక జైన్, శివ్, సాకేత్, నిఖిల్, నిఖిల్ విజయేంద్ర సింహ, బంచిక్ బాబులు, సుష్మిత, పృద్వి శెట్టి, అంబటి అర్జున్, మానస్, విష్ణుప్రియ వంటి వాళ్లంతా ఎంటర్టైన్ చేశారు. ఐతే ఇప్పుడు ఈ ఫినాలేలో గర్ల్స్ గెలుస్తారా బాయ్స్ గెలుస్తారా అన్నది చూడాలి.  

అష్షు కాళ్ళు పట్టుకున్న హరి..అమ్మాయిలు ఇండస్ట్రీకి రావడానికి భయపడుతున్నారు

కాకమ్మ కథలో నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ న్యూ ఎపిసోడ్ కి హరి, అష్షు రెడ్డి వచ్చారు. ఇక ఈ షోలో వీళ్ళు మాటలు మాట్లాడుకుంటున్న అవి బూతుల్లానే ఉన్నాయి. హరి ఐతే ఆర్జీవీలా కాసేపు పుష్ప రాజ్ లా కాసేపు ట్రాన్సఫార్మ్ ఐపోయాడు. అష్షు కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. "బేసిక్ గా నాకు దేవుడంటే కోపం ఇంత అందాన్ని ముందే ఎందుకు పరిచయం చేయలేదన్న కోపం" అంటూ హరి రామ్ గోపాల్ వర్మలా చెప్పిన డైలాగ్ అష్షు, హోస్ట్ తేజస్విని షాకయ్యారు. ప్రోమో ఫైనల్ లో ఐతే పుష్ప శ్రీవల్లి తగ్గేదెలా ఐతే అష్షు - హరి కూడా తగ్గేదెలా అంటూ అష్షు కళ్ళు పట్టుకుని మరీ డైలాగ్ చెప్పాడు. ఇక హోస్ట్ తేజు ఐతే "నువ్వు చిన్నప్పటి నుంచి రాజుని పెంచుకున్నావ్ మరి హరిని ఎందుకు పెంచుతున్నావ్" అని అడిగింది. "పెంచుకోకపోతే ఉంచుకోమంటారని" అని అష్షు డైలాగ్ వేసింది. "అష్షు పక్కనున్న చాలు ప్రేమించక్కర్లేదు" అన్నాడు హరి. "ఏంటి నీకేమన్నా ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తున్నారా ఇవన్నీ చెప్పమని..ఊపాల్సింది ఊపకుండా కాళ్ళు ఊపుతున్నాడు " అంటూ హరి పరువు తీసేసింది అష్షు. అప్పుడు హరి "ఈ టాస్కుల్లో గెలిస్తే హగ్గులు, ముద్దులు ఏమన్నా ఉన్నాయా" అని హోస్ట్ ని అడిగాడు. వెంటనే అష్షు రియాక్ట్ అయ్యి "ఇలాంటి వాళ్ళ వలనే అమ్మాయిలు ఇండస్ట్రీకి రావడానికి భయపడుతున్నారు" అంటూ పెద్ద కౌంటర్ వేసింది. ఇక అష్షు, హరి వాళ్ళ జీవితంలో జరిగిన ఎన్నో ఇన్సిడెంట్స్ ని ఈ షోలో చెప్పారు. ఇంతకు ఎం చెప్పారో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ చూడాల్సిందే.

నువ్వు మాస్ ఐతే నేను మానస్ ఊరమాస్ ఇక్కడ...

  జబర్దస్త్ షో న్యూ ప్రోమో ఇప్పుడు అందరినీ అలరిస్తోంది. న్యూ చాప్టర్ బిగిన్స్ అని ఏదైతే చెప్పారో అది ఈ ఎపిసోడ్ లో కనిపించబోతోంది అన్న విషయం తెలుస్తోంది. ఇంత మార్పులు ఈ షోలో వస్తున్నా కూడా సుధీర్ ఎపిసోడ్ కి మాత్రం ఫుల్ స్టాప్ పడడం లేదు. ఇక జడ్జ్ ఖుషూ వచ్చి అన్నీ డబుల్ గా ఉండబోతున్నాయా అంది. అవును యాంకర్ కూడా డబుల్ కాబోతున్నారు అని చెప్పింది. ఇక రష్మీ  పక్కన బ్రహ్మముడి హీరో మానస్ సెకండ్ యాంకర్ గా వచ్చేసాడు. ఐతే రావడమే ఒకప్పుడు సుడిగాలి సుధీర్ ఎలా ఐతే కళ్ళజోడు తీసి పెట్టి తనదైన మ్యానరిజమ్ ని చేసేవాడో మానస్ కూడా అలాగే చేసాడు. ఇక రష్మీ ఐతే ఉడుక్కుంది. "తెల్ల తోలు కదా స్టైలిష్ గా ఉంటది హలో మాస్ ఇక్కడ మాస్ పిల్ల" అంది.."నువ్వు మాస్ ఐతే నేను మానస్ ఊరమాస్ ఇక్కడ" అని కౌంటర్ డైలాగ్ వేసాడు. ఇప్పటి వరకు టీం లీడర్స్ మధ్యలో పోటీ జరిగింది కానీ ఇప్పుడు యాంకర్స్ మధ్యలో పోటీ ఉండబోతోంది అని చెప్పింది ఖుష్భూ. జబర్దస్త్ అమ్మాయి వెర్సెస్ ఖతర్నాక్ అబ్బాయి పేరుతో వీళ్ళ మధ్య పోటీ జరగబోతోంది. ఇక స్కిట్స్ మీద ఆడియన్స్ స్పందనలు కూడా ఈ షోలో ఉండబోతున్నాయి ఇక. "చూసావా రష్మీ ఇప్పటి నుంచి మానస్ గాడి హవా స్టార్టవబోతోంది అంటూ కళ్ళజోడు తీసి పెట్టుకోబోతుండగా "వద్దు మానస్ ఈ స్పెక్ట్స్ ఇవన్నీ వద్దు. ఇవే పెట్టి పెట్టి" అంటూ రష్మీ ఒకప్పటి సుధీర్ ని గుర్తు చేసుకుంది. ఎప్పటిలాగే రాకింగ్ రాకేష్ పిల్లల్తో స్కిట్ చేయడానికి వచ్చాడు అతనితో ప్రవీణ్ ని కూడా తెచ్చుకున్నాడు. "ఈ స్టేజి మీద కొన్ని రోజులు నేను లేను కదా రష్మీ నా గురించి చాల ఫీలయ్యి ఉంటుంది కదా" అని అన్నాడు రాకేష్. "బిర్యానీలో ఆకు లాంటి ఆయన పోయినప్పుడే బాధపడలేదు. కూరలో కరివేపాకు లాంటోడివి నువ్వు పొతే బాధపడుతుందా" అంటూ ప్రవీణ్ కౌంటర్ వేసాడు. నూకరాజు స్కిట్ లో ఐతే బుల్లితెర సెలబ్రిటీస్ కూడా రాబోతున్నారు.