ఏవి అలనాటి ముద్దులు అంటున్న అర్జున్ కళ్యాణ్..శ్రీసత్య ఫీలవుద్ది అంటున్న నెటిజన్స్

అర్జున్ కళ్యాణ్ బుల్లితెర మీద బాగా ఫేమస్ అయ్యాడు.  బిగ్ బాస్ తర్వాత నువ్వుంటే నా జతగా అనే సీరియల్ లో నటిస్తున్నాడు. అలాగే మూవీస్, వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నాడు. "బాబు, ప్లే బ్యాక్, పెళ్లి కూతురు పార్టీ" వంటి మూవీస్ లో నటించగా, మిస్సమ్మ, నారి నారి నడుమ మురారి, 7 డేస్ ఆఫ్ లవ్ వంటి వెబ్ సిరీస్ లో కూడా చేసాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 6 లో, బిబి జోడిలో కంటెస్టెంట్ గా ఉన్నాడు. ఇక ఇప్పుడు "ఏవి అలనాటి ముద్దులు" అనే మూవీలో నటించాడు. ఇప్పుడు ఈ మూవీ ఈటీవీ విన్ విన్ లో స్ట్రీమ్ అవుతోంది. ఈ విషయాన్నీ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. ఆ మూవీ మేకింగ్ సీన్స్ ని కూడా పేజీలో పోస్ట్ చేసాడు. "ఈ మూవీ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ నాకు. లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్ర రావు గారు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నటించడం మంచి విషయం అలాగే ఆయన నన్ను మెచ్చుకోవడం ఆనందంగా ఉంది. అలాగే బ్యూటిఫుల్ హీరోయిన్ నటాషా సింగ్ తో కలిసి నటించడం ఇంకా బాగుంది. రాంకీ కి థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేను ఎందుకంటే ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు" అంటూ పోస్ట్ చేసాడు. ఇక నెటిజన్స్ ఐతే "మూవీ చాల బాగుంది, అమేజింగ్, రాఘవేంద్ర రావు గారితో పని చేయాలనీ ప్రతీ నటుడూ కోరుకుంటారు...యాక్టింగ్ చాలా బాగా చేశారు. కీప్ రాకింగ్. నీలో మ్యాటర్ ఉంది అన్నో...శ్రీసత్య ఫీల్ అవుద్ది బ్రో" అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. బిగ్ బాస్ లో శ్రీసత్య, అర్జున్ కళ్యాణ్ లవ్ ట్రాక్ తో వీళ్ళ మధ్య ఏదో ఉందని ఆడియన్స్ అంతా అనుకున్నారు కానీ ఏమీ లేదు అని అర్జున్ చెప్పాడు.  బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఇద్దరూ కలిసి షోస్ లో కనిపించడం మానేశారు.

హమ్మయ్యా దేవుడా థ్యాంక్యూ..వీసా వచ్చింది.. శివ్ తో కలిసి ఇక యూఎస్ వెళ్లొచ్చు

బుల్లితెర మీద ప్రియాంక జైన్, శివ్ గురించి తెలియని వాళ్లుండరు. వీళ్ళు కలిసి సీరియల్స్ లో, షోస్ లో నటిస్తూనే ఉంటారు. ఇక రీసెంట్ గా ప్రియాంక ఒక వీడియోని తన యూట్యూబ్ లో పోస్ట్ చేసింది. యూఎస్ వీసా కోసం ఎంతో ట్రై చేస్తోందని ఫైనల్ గ వీసా వచ్చిందంటూ ఆనందంతో గంతులేసింది. ఐతే వీసా గురించి మూడు ప్రశ్నలు అడిగారు శివ్ తో కలిసి యూఎస్ ట్రిప్ కి వెళ్ళినప్పుడు చెప్తాను అంటూ చెప్పింది. దేవుడికి కూడా థాంక్యూ చెప్పింది ప్రియాంక. ఇక ముంబైలోని బ్యాండ్ స్టాండ్ మీదగా వెళ్తూ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఇళ్ళు ఇవే అంటూ కార్ లో వెళ్తూ చూపించింది. ఫ్యూచర్ లో ఇలాంటి ఒక ఇల్లు ఇక్కడ ముంబైలో ఉండాలని అది షారుఖ్ ఖాన్ ఇంటి కంటే పెద్దగా ఉండాలని చెప్తూ "శివ్ ప్లీజ్ నాకు అంత పెద్ద ఇల్లు ఒకటి కావాలి" అంటూ అడిగింది. ముంబై వచ్చాక అందులోనూ మన్నత్ ప్లేస్  కి వచ్చాక సూపర్ గా అనిపిస్తుంది అని చెప్పింది. ఇక పిన్నితో కలిసి డేట్ కి వెళ్ళింది అలాగే బీచ్ కూడా వెళ్ళింది ప్రియాంక. వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి వీసా అప్రూవ్ అయ్యింది అని చెప్పింది. తర్వాత ఫుడ్ తినేసి షాపింగ్ చేసింది. అలాగే వాళ్ళ ఇంటికి వెళ్లి అక్కడ వాళ్ళ రెలెటివ్స్ ని పిల్లలని చూపించింది. వాళ్ళ అమ్మను చూపించింది. ఆమె పావురాళ్లకు మేత వేస్తూ కనిపించింది. అలాగే వాళ్ళ అత్తగారింటికి కూడా వెళ్ళింది. ఇక అక్కడ అందరికీ బై చెప్పేసి హైదరాబాద్ వచ్చేసింది ప్రియాంక జైన్.  

అన్ ప్రొఫెషనల్ ఎడిటింగ్ తో జనాల్ని మాయ చేసింది పాడుతా తీయగా సీజన్

  సింగర్ ప్రవస్తి ఎపిసోడ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. రీసెంట్ గా ఆమె రెండు వీడియోస్ రిలీజ్ చేసింది. పాడుతా టీయగా షోలో తన ఎపిసోడ్ లో అసలు సునీత, చంద్రబోస్, కీరవాణి లేరు అంటూ చెప్పుకొస్తూనే ఉంది. ఆ ఎపిసోడ్ కచ్చితంగా చూడండి మీకే నిజం తెలుస్తుంది అంటూ ఆడియన్స్ కూడా చెప్పింది. ఐతే రీసెంట్ గా ప్రసారమైన ప్రవస్తి ఎపిసోడ్ చూస్తే అందులో జడ్జెస్ ముగ్గురూ కూర్చుని చప్పట్లు కొడుతూ కనిపించారు. దీంతో ఆడియన్స్ కి డౌట్ రావడంతో ప్రవస్తి మరో వీడియోని రిలీజ్ చేసింది. ఇదంతా అన్ ఎథికల్ గా ఎడిటింగ్ చేసి లేనిది ఉన్నట్టు చూపించారు అంటూ చెప్పుకొచ్చింది. ఈ ఎపిసోడ్ చూసాక తానే షాక్ కి గురైనట్టు చెప్పింది. "రియాలిటీ షో హిస్టరీలో ఇంత అన్ ఎథికల్ గా , అన్ ప్రొఫెషనల్ గా కంప్రెస్ చేసి ఈ వీడియో ఇలా వదులుతారు అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అందులో అది ఈటీవీ. అందులో ఇలాంటివి జరుగుతాయని నేను అస్సలు అనుకోలేదు. కంప్రెస్ చేసి ఎడిట్ చేసి ఎక్కడిదో తీసుకొచ్చి క్లిప్స్ అతికిస్తారని నేను ఎక్స్పెక్ట్ చేశా. చాలా ఎడిట్ చేసినట్టు అనిపించింది అంటూ చాలా కామెంట్స్ వచ్చాయి నాకు. చంద్రబోస్ గారు కొంచెం సేపు కూడా లేరు. కీరవాణి గారు నాకేం సంబంధం లేదు అని లేచి వెళ్లిపోయారు. కీరవాణి గారివి ఎక్కడివో క్లాపింగ్ షాట్స్ వచ్చాయి. అవి ఎక్కడివో నాకు తెలీదు. ఎలిమినేషన్ ప్రాసెస్ లో నలుగురిలో నేను రేణు కుమార్ అన్న ఇద్దరమే మిగిలాం. ఏ జడ్జ్ ఎంత స్కోర్ ఇచ్చారు, ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నారు అన్న క్లారిటీ కూడా ఏమీ ఇవ్వలేదు. మీరు కూడా ఆలోచించండి ఇంకేదైనా రియాలిటీ షోలో ఇలాగే చూసారు. ఎలిమినేషన్ ప్రాసెస్ మొత్తం నేను నవ్వుకుంటూనే ఉన్నాను. ఈ సీజన్ ఇంత ఘోరంగా జరుగుతున్నప్పుడు నేను ఇంకా వదిలేసాను. ఆడియన్స్ కి అర్థమవుతుందని నేను అనుకున్నాను. నేను ఎలాంటి తప్పు చేయలేదు అన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది. జనాల్ని ఇంత ఈజీగా ఫూల్స్ చేస్తారనుకోలేదు. ఎవరి మీద ఎలాంటి పర్సొనల్ గ్రజ్ లేదు. ఒక వేళా ఈ సీజన్ లో ఎవరైనా విన్ అయ్యుంటే పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని నేను అనుకోవడం లేదు. ఇక ఆ విన్నర్ కూడా ఆ నచ్చిన వాళ్ళే అవుతారు." అంటూ చెప్పుకొచ్చింది ప్రవస్తి.

llu illalu pillalu : ధీరజ్ కోసం ప్రేమ త్యాగం.. నర్మద షరతు అదే!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -194 లో.....నర్మద, సాగర్ ఇద్దరిని నర్మద వాళ్ళ నాన్న అవమానించి పంపిస్తాడు. నేను ఒక జాబ్ చేసున్నాను.. నువ్వు కూడా ఏదైనా జాబ్ చేస్తే గౌరవంగా ఉంటుంది కానీ ఇలా మీ నాన్న దగ్గర రైస్ మిల్ లో పని చేస్తున్నావని నర్మద అనగానే నిన్ను పెళ్లి చేసుకోక ముందే ఈ విషయం నీకు తెలుసు కదా అని సాగర్ అంటాడు. తెలుసు ఎక్కడ నువ్వు నాకు దూరం అవుతావో అని పెళ్లి చేసుకున్నానని నర్మద అంటుంది. మరొకవైపు ప్రేమ, ధీరజ్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తారు. ప్రేమ ఎగ్జామ్ బాగా రాస్తుంటే ధీరజ్ కి అందులో ఒక్క ప్రశ్నకి కూడా సమాధానం తెలియదు. దాంతో దిక్కులు చూస్తుంటే ప్రేమ తను రాసింది చూపిస్తూ ఉంటుంది. అప్పుడే ఇన్విజిలేటర్ చూసి ఇద్దరి పేపర్లు తీసుకుంటాడు. ముందే ప్రేమ పేపర్ పై ఐ లవ్ యూ అని రాస్తుంది. తను మా హస్బెండ్ సర్ మాకు గొడవ అయింది. అందుకే ఇలా పేపర్ పై రాసి తనకి చూపిస్తున్నానని ప్రేమ కవర్ చేస్తుంది. ఆ తర్వాత వేదవతి తన పుట్టింటి వంక చూస్తుంటుంది. ఎక్కడికి వెళ్లారు. అసలు ఎవరు కన్పించడం లేదని వేదవతి అనుకుంటుంది. అప్పుడే రామరాజు వస్తాడు. ఏంటి మీ పుట్టింటి వంక చుస్తున్నావని అడుగుతాడు. మా వాళ్ళు కన్పించడం లేదని వేదవతి అంటుంది. మీ తమ్ముడున్నాడు కదా వాడిని అడుగమని రామరాజు అంటాడు. ఆ తర్వాత ధీరజ్ గురించి రామరాజు మాట్లాడతాడు. వాడు ఆ ప్రేమని పెళ్లి చేసుకోవడం వల్లే ఇదంతా అని వేదవతితో రామరాజు అంటాడు. ఆ తర్వాత ప్రేమ ఇక ఎగ్జామ్స్ అయిపోయాయి కదా నెక్స్ట్ ఏంటని తన ఫ్రెండ్స్ ప్రేమని అడుగుతారు. గవర్నమెంట్ కాలేజీ అని ప్రేమ అనగానే.. అదేంటి అబ్రాడ్ వెళ్ళాలని నీ డ్రీమ్ కదా అని తన ఫ్రెండ్స్ అనగానే ఫైనాన్సియల్ గా కొంచెం ప్రాబ్లమ్ ఉందని ప్రేమ అక్కడ నుండి వెళ్లిపోతుంది. అదంతా ధీరజ్ వింటాడు. తరువాయి భాగంలో ఊళ్ళో దొంగలు పడుతున్నారట అని తిరుపతి వచ్చి రామరాజుకి చెప్తాడు. అయితే ఇంట్లో ఉన్న డబ్బు నగలు లాకర్ లో పెట్టండి అని రామరాజు అనగానే.. శ్రీవల్లి నగలు తీసుకొని రా అని వేదవతి అడుగుతుంది. దాంతో శ్రీవల్లి కంగారుపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : జ్యోత్స్న ప్లాన్ ని తిప్పికొట్టిన కార్తీక్.. పారిజాతం షాక్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -393 లో..... కార్తీక్, దీప రాగానే జ్యోత్స్న ప్లాన్ ని మొదలుపెడుతుంది. నా డైమండ్ చెవి కమ్మ కన్పించడం లేదని పారిజాతం అంటుంది. అది దీప దొంగతనం చేసిందని పారిజాతం అంటుంది. దాంతో దీప షాక్ అవుతుంది. సాక్ష్యం లేకుండా అలా నిందించొద్దని కార్తీక్ అంటాడు. పారిజాతం కిచెన్ లోకి వెళ్లి అక్కడ పర్సు తీసుకొని వస్తుంది. అందులో చెవి కమ్మ ఉంటుంది. ఇప్పుడు ఏం అంటారని పారిజాతం అంటుంది. దాంతో అందరు దీప దొంగతనం చేసిందని నమ్ముతారు. ఈ ఒక కమ్మ మాత్రమే పోయిందా అన్నీపోయాయా అని కార్తీక్ అనగానే అన్నీ ఉన్నాయ్ కావాలంటే చూపిస్తానని పారిజాతం లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్లి చేసేసరికి తన నగలు ఉండవు.. ఒక్క కమ్మనే అనుకున్న మొత్తం దొంగతనం చేసావా అని పారిజాతం అంటుంది. అదంతా కాదు పారు ఇప్పుడు మళ్ళీ కిచెన్ లోకి వెళ్ళు నగలు ఉంటాయని కార్తీక్ అనగానే పారిజాతం వెళ్తుంది. ఎక్కడ రా నగలు.. అని అన్నీ వెతుకుతుంది. అప్పుడే పారిజాతం తన చెవి కమ్మ తెచ్చి దీప పర్సులో పెట్టె వీడియోని కార్తీక్ చూపిస్తాడు. అది చూసి పారిజాతం షాక్ అవుతుంది. ఇప్పుడు కనుక వెళ్లి నా భార్య దొంగతనం చెయ్యలేదని చెప్పలేదనుకో ఈ వీడియో తాతకి చూపిస్తానని కార్తీక్ అంటాడు. పారిజాతం వెళ్లి దీప ఏ తప్పు చెయ్యలేదు.. నేను మర్చిపోయి అలా చేసానని అనగానే పారిజాతం పై శివన్నారాయణ కోప్పడతాడు. అనవసరంగా దీపని అన్నారు నేను కూడా ఒక మాట అన్నాను సారీ అని సుమిత్ర అనగానే.. అమ్మా మీరు ఎందుకు అలా అంటున్నారని దీప అంటుంది. అంటే ఏంటే నువ్వు ఏమైనా నా కూతురివా అని దీప బాధపడేలా సుమిత్ర మాట్లాడుతుంది. ఆ తర్వాత నా నగలు ఎక్కడరా అని కార్తీక్ ని పారిజాతం అడుగుతుంది.‌ అవి నా దగ్గర ఉన్నాయ్ నచ్చినప్పుడు ఇస్తానని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : ప్రాణాపాయ స్థితిలో స్వప్న.. కావ్య ప్లాన్ అదే!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -757 లో..... యామిని తన ప్లాన్ ఏంటో క్లియర్ గా కావ్యకి ఫోన్ చేసి చెప్తుంది. దాంతో కావ్య షాక్ అవుతుంది. వెంటనే కిందకి వెళ్లి అక్క ఎక్కడ అని అడుగుతుంది. పాప ని తీసుకొని హాస్పిటల్ కి వెళ్ళింది టీకా కోసమని రుద్రాణి అనగానే కనీసం మీకు తోడు వెళ్లాలన్నా బుద్ది కూడా లేదా అని వాళ్లని తిడుతుంది కావ్య. అప్పుడే హల్లో ఉన్న వాళ్ళందరూ ఏమైందని కావ్యని అడుగుతారు. అక్క గురించి చెప్తే అందరు కంగారు పడుతారని ఏం లేదని కావ్య అంటుంది. కావ్య వెళ్తుంటే అప్పుడే రాజ్ వస్తాడు. మీతో మాట్లాడాలి కళావతి గారు అని రాజ్ అనగానే.. నేను బయటకు వెళ్ళాలి ప్లీజ్ ఏమనుకోకండి ఇంట్లో వాళ్ళతో మాట్లాడండి వస్తానంటూ కావ్య బయటకు వెళ్తుంది. మరొక వైపు స్వప్న హాస్పిటల్ కి వెళ్తుంటే డ్రైవర్ కార్ డైవర్ట్ చేస్తాడు. ఆ తర్వాత స్వప్నకి కావ్య ఫోన్ చేస్తుంటే ఫోన్ అఫ్ వస్తుంది. హాస్పిటల్ కి వెళ్లి స్వప్న గురించి అడుగుతుంది. ఎవరు రాలేదని వాళ్ళు చెప్పగానే కావ్య ఇంకా టెన్షన్ పడుతుంది. స్వప్న తన ఫోన్ ఎక్కడ అని చూసుకుంటుంది. ఇదేనా మేడం అని డ్రైవర్ అంటాడు. దాంతో స్వప్నకి తను ప్రాబ్లమ్ లో ఉన్నట్లు అర్ధమవుతుంది. మరొకవైపు కావ్యకి ఒక ఐడియా వస్తుంది. అన్ని కార్ లలో జీపీఎస్ ట్రాకర్ ఉంది కదా అని మేనేజర్ కి ఫోన్ చేసి లొకేషన్ ట్రేస్ చేయమని చెప్తుంది. ఆ తర్వాత కావ్యకి యామిని ఫోన్ చేసి మా వాళ్ళు మీ అక్క ని ఏం చేస్తారోనని అంటుంటే.. వాళ్లకి అంత సీన్ లేదు మళ్ళీ కాల్ చేస్తానని కావ్య మాట్లాడుతుంది. దాంతో యామిని అయోమయంలో పడుతుంది. నేను ఎంత ఆశగా వస్తే కళావతి గారు ఇలా చేసారని రాజ్ డిస్సపాయింట్ అవుతాడు. వస్తుందని ఇందిరాదేవి, అపర్ణ అంటారు. నన్ను ఇక్కడికి యామిని పంపించిందని రాజ్ అనగానే తను పంపించడం ఏంటని అపర్ణ, ఇందిరాదేవి ఇద్దరికి డౌట్ వస్తుంది. తరువాయి భాగంలో స్వప్న కిడ్నాప్ గురించి ఇంట్లో తెలుస్తుంది. మరొకవైపు యామిని దగ్గరికి‌ అప్పు వెళ్లి చెంపచెల్లుమనిపిస్తుంది. అదంతా రాజ్ చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

రాధ ఎవరనుకున్నావ్ కోహినూర్ వజ్రం.. 

"కుక్కు విత్ జాతి రత్నాలు" షో త్వరలో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అయ్యింది. ఈ షోకి హోస్ట్ గా ప్రదీప్ మాచిరాజు జడ్జెస్ గా అలనాటి అందాల నటి రాధ, మూవీస్ లో విలన్ రోల్స్ లో కనిపించే ఆశిష్ విద్యార్థి, వాహ్ చెఫ్ సంజయ్ తుమ్మ ఉండబోతున్నారు. ఇక షోలో వంటలు చేసి అలరించడానికి ఈటీవీ నటుడు ప్రభాకర్, ప్రియా, యష్మి, బాబా భాస్కర్, సుజిత, సుహాసిని, విజె సున్ని, అవినాష్, విష్ణుప్రియ, రీతూ చౌదరి, బాలు అలియాస్ విషుకాంత్ వంటి వాళ్లంతా రాబోతున్నారు. ఐతే రోజూ ఒక ప్రోమోని రిలీజ్ చేస్తూ వస్తోంది స్టార్ మా. రీసెంట్ గా ఒక ప్రోమోని రిలీజ్ చేశారు. రాధ సిగ్గు పడుతూ కూర్చుంటే ఆశిష్ విద్యార్థి డైలాగ్ వేశారు. "ప్రదీప్ ఎవరయ్యా చెప్పింది బ్రిటీషర్ లు కోహినూర్ వజ్రాన్ని తీసుకుపోయారని ..చూడు మన పక్కనే కూర్చుంది" అన్నారు. వెంటనే ప్రదీప్ "పోకిరి సినిమాలో మహేష్ బాబును చూసి పోలీసా" అనే ఎక్స్ప్రెషన్ ఇస్తారు కదా మీరు...అలా ఈ మధ్యన మీరు ఫుడ్డుని చూసి ఫుడ్డా  అని ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు" అంటూ ఆశిష్ విద్యార్థిని ఉద్దేశించి అన్నాడు. వెంటనే రాధ.. "నేను చూసాను ఆయనకు ఏదైనా ఫుడ్ నచ్చితే వేళ్ళు మొత్తం నాకేస్తారు" అంటూ చేసి మరి చూపించింది రాధ. తర్వాత "పెళ్ళికి ముందు కుకింగ్ ఎంటర్టైనింగ్ గా ఉందా పెళ్లి తర్వాత కుకింగ్ ఎంటర్టైనింగ్ గా ఉందా" అని సంజయ్ తుమ్మని అడిగాడు. "తిన్నాక తల్లి ఎం చేస్తుంది. చాల బాగా చేసావ్ రా అంటుంది. కానీ భార్య" అని చెప్పబోయేంతలో "రేపు కూడా మీరే చేయండి అంటుంది" అని ఫన్నీ డైలాగ్ వేసాడు. ఇలా ఈ షో ప్రోమో కూడా ఎంటర్టైనింగ్ గా ఉంది.

మా ఇంట్లో వాళ్ళు చనిపోయారని రాశారు దానికి బాధపడ్డా..జర్నలిస్టుల గొంతు నొక్కేస్తారా

  ఫ్యామిలీ స్టార్ షో నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఐతే ఈ షో కొంచెం డిఫరెంట్ గా ఉండబోతోంది. ఎందుకంటే ఈ షోకి వీడియొ జాకీస్ వెర్సెస్ ఆడియో జాకీస్ విజెస్ వెర్సెస్ ఆర్జెస్ గా డిజైన్ చేశారు. ఇందులోకి దీప్తి నల్లమోతు, జాఫర్, శివజ్యోతి, వింధ్య విశాఖ, ఆర్జే సూర్య, చైతు,  వంటి వాళ్లంతా వచ్చారు. ఐతే జాఫర్ ఎక్కడ ఉన్నా కూడా ఎదుటి వాళ్ళను ఇంటర్వ్యూ చేయడం చూస్తూనే ఉంటాం. ఇక్కడ కూడా సుధీర్ ని ఇంటర్వ్యూ చేసాడు. "ఎన్నో రూమర్స్ వస్తూ ఉంటాయి కదా.. బాగా బాధపెట్టిన రూమర్ ఏంటి" అని అడిగాడు. "ఇంట్లో వాళ్ళు చనిపోయారని ఏదో న్యూస్ రాశారు. మా డాడీకి ఫోన్స్ చేసి అడుగుతూ ఉన్నారు. అంటే వాళ్ళు బతికుండగానే లేరు అని రాయడం" చాలా బాధపెటింది అని చెప్పి ఎమోషనల్ అయ్యాడు సుధీర్. సుధీర్ చీకటి కోణం పేరుతో ఈ ప్రశ్నలు అడిగాడు జాఫర్.  "సుధీర్ అంటే పెద్ద మానిప్యులేటెడ్...సినిమా ప్రాజెక్ట్స్ చేస్తూ మళ్ళీ బుల్లితెర మీద షోస్ చేయడం యూ టర్న్ లేదా " అంటూ ఒక ప్రశ్న వేశారు. "ప్రొఫెషనల్ లైఫ్ లో యూజ్ అయ్యి పర్సనల్ లైఫ్ లో ఎఫెక్ట్ చేసిన ఆ అమ్మాయిది" అంటూ ఆపేసాడు. ఇంతకు జాఫర్ అడిగిన ఇన్ కంప్లీట్ ప్రశ్నలు ఏంటి వాటికి ఆన్సర్స్ సుధీర్ ఎం చెప్పాడో తెలియాలి అంటే నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ప్రోమో స్టార్టింగ్ జాఫర్ చూసిన సుధీర్ "మీరెందుకు కొచ్చారు సర్" అని అడిగాడు. "ఏంటి జాఫర్ సర్ ని మీరెందుకు వచ్చారు అంటాడా..అంటే జర్నలిస్టుల గొంతుని ఇక్కడితో నొక్కేస్తున్నారా  " అంటూ  శివజ్యోతి రెచ్చిపోయింది. ఇక సుధీర్ ఐతే "ఇక ఇప్పటి నుంచి ఒక్కటే దొరికిన దాన్ని తురుముదాం దొరకని దాన్ని తరుముదాం" అన్నాడు. దానికి జాఫర్ "సుధీర్ ఇన్ని డబుల్ మీనింగులా..డీకోడ్ చేయలేకపోతున్నా" అంటూ కౌంటర్ వేసాడు.    

Illu illalu pillalu :  నిజాలు చెప్పిన నర్మద వాళ్ళ నాన్న.. షాకైన ఇన్విజిలేటర్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -193 లో.... సాగర్, నర్మద కలిసి నర్మద వాళ్ళింటికి వెళ్తారు. నర్మద వాళ్ళ నాన్నకి వాచ్ గిఫ్ట్ గా ఇచ్చి‌ బర్త్ డే విషెస్ చెప్పాలనుకుంటుంది. అయితే నర్మద ఇంట్లోకి వెళ్ళగానే వాళ్ళ నాన్న కోపంతో రగిలిపోతుంటాడు. లేచిపోయి‌ ఇప్పుడు వచ్చి విషెస్ చెప్పి గిఫ్ట్ ఇస్తే అన్నీ మర్చిపోతాననుకుంటున్నావా అంటూ నర్మదని కోప్పడతాడు వాళ్ళ నాన్న. నీ అప్పుడు ఏం చేస్తున్నాడని ఎవరైనా అడిగితే రైస్ మిల్ లో మూటలు మోస్తాడని చెప్పాలా.. మీ ఆఫీస్ లో నీ భర్త ఏం  చేస్తాడంటే ఏం సమాధనం చెప్తావని వాళ్ళ నాన్న నర్మదని నిలదీస్తాడు. తను మౌనంగా ఉండిపోతుంది. ఇక కాసేపటికి నర్మద, సాగర్ ఇద్దరూ ఒకచోటకి చేరుకుంటారు. తన నాన్న అన్న మాటలకి నర్మద కన్నీటి పర్యంతం అవుతుంది. సాగర్ ఓదారుస్తుంటాడు.  మరోవైపు ఎగ్జామ్ హాల్ దగ్గర ధీరజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆమె ఫ్రెండ్స్ వచ్చి.. టైమ్ అవుతుంది రావే అని అన్నా కూడా.. మీరు వెళ్లండే ధీరజ్ వచ్చిన తరువాత వస్తానని అతని కోసమే ఎదురుచూచ్తుంది. రేయ్.. టైమ్ అవుతుంది రారా బాబూ అని ప్రేమ అనుకుంటుంది. ఇంతలో ధీరజ్ సైకిల్‌పై హడావిడిగా వస్తాడు. ఏంటే.. ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యిందా ఏంటీ.. బయట దిష్టిబొమ్మలా ఎదురుచూస్తున్నావని ధీరజ్ అంటాడు. రేయ్ సచ్చినోడా.. ఎగ్జామ్ రోజున కూడా ఆలస్యంగానే వస్తావా.. తొందరగా రావాలని తెలిసి చావదా అని ప్రేమ అంటుంది. ఎహే.. ఫుడ్ డెలివరీ ఇచ్చేసి వస్తున్నానని  ధీరజ్ అంటాడు. ఎగ్జామ్స్ రోజున కూడా ఫుడ్ ఆర్డర్స్ ఏంట్రా అని ప్రేమ అంటే.. డ్యూటీకి డుమ్మా కొడితే రేటింగ్ తగ్గుతుంది.. దాంతో కంపెనీ వాడు ఆర్డర్స్ తక్కువ ఇస్తాడు.. మా బాధలు మాకు ఉన్నాయ్.. నీకేంటిలే అని ధీరజ్ అంటాడు.  అవునా అని ప్రేమ అనగానే సర్లే చేసిన ల్యాగ్ చాలు కానీ.. పదా అని ధీరజ్ అంటాడు. దాంతో కంగారుగా ఇద్దరూ కలిసి ఎగ్జామ్ సెంటర్‌ దగ్గరకు వెళ్తారు. ధీరజ్ కనీసం ఎగ్జామ్‌ రాయడానికి పెన్ కూడా తెచ్చుకోకపోవడంతో.. నీ గురించి తెలిసేరా.. పెన్ తీసుకొచ్చానని చెప్పి తీసుకోమని ఇస్తుంది. నా గురించి బాగానే స్టడీ చేశావే అని ధీరజ్ అంటే.. కలిసి ఉంటున్నాం కదా.. ఆ మాత్రం తెలుసుకోకపోతే ఎలా అని  ప్రేమ అంటుంది. టెన్షన్ పడకుండా ఎగ్జామ్ బాగా రాయి.. 90 పర్సెంట్ రావాలని ప్రేమ అంటుంది. నా గురించి నువ్వు చాలా ఎక్కువ ఊహించుకుంటున్నావ్.. నాకంత సీన్‌లేదని ధీరజ్ అంటాడు. రేయ్ కనీసం పాస్ అవ్వరా.. లేదంటే పరువు పోతుందని  ప్రేమ అంటుంది. అది ఎగ్జామ్ రాసిన తరువాత తెలుస్తుందని ధీరజ్ అంటాడు. ఎగ్జామ్ హాల్‌లో ధీరజ్ ఏమీ రాయలేకపోతుంటాడు. రేయ్ ఏదోటి రాయరా.. గుర్తు తెచ్చుకోరా అని ప్రేమ అంటుంది. ఏమీ గుర్తుకి రావడం లేదని ధీరజ్ అనడంతో.. ఇదిగో రాసుకోమని ప్రేమ తన పేపర్‌ని ఇస్తుంది. ఇంతలో ఇన్విజిలేటర్ చూస్తాడు. ఇద్దరి పేపర్లను ఇన్విజిలేటర్ తీసుకుని చూసి  షాక్ అవుతాడు. అయితే ప్రేమ పేపర్‌ని చూసి ఇన్విజిలేటర్‌తో పాటు ధీరజ్ కూడా షాక్ అవుతున్నాడు.  ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : కార్తీక్ పై శివన్నారాయణకి డౌట్.. జ్యోత్స్నకి ఆ వీడియో పంపిన దీప!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -392 లో.....కార్తీక్ ఏదైనా అడుగు ఇస్తాను అన్నాను కానీ వాడేం అడగకుండా ఉన్నాడు అగ్రిమెంట్ క్యాన్సిల్ చెయ్యమని అడగొచ్చు లేదంటే చెక్ పై అమౌంట్ ఎంతైనా రాసుకోవచ్చు.. అలా చేయకుండా నేను సెకండ్ హాండ్ స్కూటీ ఇస్తే తీసుకొని వెళ్ళాడు.. వాడు అగ్రిమెంట్ కోసం ఇక్కడికి రాలేదు ఇంకెందుకో వచ్చాడని దశరత్ తో శివన్నారాయణ అంటాడు. వాడు ఒకరి నుండి ఆశించే వాడు కాదు నాన్న అని దశరథ్ అంటాడు. బావ ఏం ఉద్దేశ్యంతో ఇక్కడికి వచ్చాడో అర్థం అవ్వడం లేదని జ్యోత్స్న అనుకుంటుంది. మరొకవైపు కార్తీక్, దీప మాట్లాడుకుంటారు. అలా మాటల్లో కార్తీక్ పై దీప అలుగుతుంది. కార్తీక్ బుజ్జగిస్తాడు. మరదలు అలకమన్పిస్తాడు. ఆ తర్వాత కార్తీక్ గురించి శ్రీధర్ తప్పుగా మాట్లాడుతుంటే కాశీ ఊరుకోడు. ఆ తర్వాత కార్తీక్, దీప ప్రేమగా ఉన్నా వీడియోని జ్యోత్స్న ఫోన్ కి పంపిస్తారు. అది చూసి జ్యోత్స్న షాక్ అవుతుంది.  ఆ తర్వాత జ్యోత్స్నకి దీప కాల్ చేస్తుంది. బావ ఈ వీడియో ఎందుకు పంపించావ్ అని జ్యోత్స్న అడుగుతుంది. బావ కాదు మరదలు పంపించిందని దీప అంటుంది. నువ్వా ఎందుకు పంపావని జ్యోత్స్న కోప్పడుతుంది. ఊరికే సరదాగా అని దీప అంటుంది. ఆ తర్వాత పారిజాతానికి దీప వీడియో పంపించిన విషయం చెప్తుంది. అసలు దీపని ఇక్కడికి రాకుండా చేయ్యలని పారిజాతానికి జ్యోత్స్న చెప్తుంది. కార్తీక్, దీప ఇంటికి రాగానే.. ఇంట్లో నా బంగారం కన్పించడం లేదని పారిజాతం యాక్టింగ్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : అటు రాజ్ ప్రపోజ్, ఇటు అక్కపై ఎటాక్..కావ్య ఏం చేయనుంది!

  స్టార్ మ్ టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -756 లో..... రాజ్ పెళ్లి కి వద్దన్నాడని యామిని కోపంగా లోపలికి వెళ్లి డోర్ వేసుకుంటుంది. దాంతో వైదేహి, రఘనందన్ డోర్ తియ్యమని యామినిని రిక్వెస్ట్ చేస్తారు. అప్పుడే రాజ్ వస్తాడు. నా కూతురికి ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వేనని రాజ్ పై కోప్పడుతుంది వైదేహీ. అప్పుడే యామిని డోర్ తీస్తుంది. అసలు తప్పు నాది బావ.. నీ మనసులో నేను లేను.. ఇంకెవరో ఉన్నారు..నువ్వు ఎవరిని ఇష్టపడుతున్నావో వాళ్లనే చేసుకోమని యామిని అనగానే రాజ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. యామిని పేరెంట్స్ మాత్రం షాక్ అవుతారు. ఆ తర్వాత రాజ్ వెళ్ళిపోతాడు. నువ్వేనా ఇలా మాట్లాడేది అని యామినితో వైదేహీ అంటుంది. యామిని సూసైడ్ చేసుకోబోతుంటే తనకి ఒకటి గుర్తొస్తుంది. నువ్వు లేకపోతే వాళ్ళు హ్యాపీగా ఉంటారు.. కావ్య తనంతట తనే రాజ్ అంటే ఇష్టం లేదని చెప్పేలా చెయ్యాలని ఒకసారి  రుద్రాణి చెప్పిన విషయం యామిని గుర్తు చేసుకుంటుంది. మరొకవైపు స్వప్న తన పాపని హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాలనుకుంటుంది. రాహుల్ ని రమ్మని పిలుస్తుంది. వద్దు నువ్వే వెళ్ళమని రాహుల్ అంటాడు. అలా స్వప్న ఒకతే పాపని తీసుకొని వెళ్లేలా రుద్రాణి ప్లాన్ చేస్తుంది. ఆ తర్వాత కావ్యకి యామిని ఫోన్ చేసి.. రాజ్ నీకు ప్రపోజ్ చేస్తే నువ్వు ఇష్టం లేదని చెప్పాలని అంటుంది. తరువాయి భాగంలో స్వప్నపై యామిని మనుషులు ఎటాక్ చేస్తారు.ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ఆది నువ్వు ఇంతవరకు చేసిందంతా బొక్క...రెజీనా బిజీనా

ఢీ - 20 ఇది సర్ మా బ్రాండ్ న్యూ సీజన్ లాంఛ్ కి సిద్దమయ్యింది. ఇక ఆది ఎంట్రీ ఊరమాస్ డైలాగ్స్ తో అదిరిపోయింది.  "ఆది గాడు బయటకు వస్తే చాలు సర్. సందుల్లో, పార్కుల్లో, రెస్టారెంటుల్లో ఎక్కడ పడితే అక్కడ అనుమానంతో చూస్తున్న కొన్ని వేల కళ్ళ మధ్య నుంచి నడుచుకుంటూ వస్తున్నా సర్ నేను. అరె ఇదే ఢీ షోలో కంటెస్టెంట్స్ బాగా చేస్తే దగ్గరకు పిలిచి బుగ్గలు కొరికిన పూర్ణని చూసి మనం ఎం నేర్చుకున్నాం..హగ్గులిచ్చే ప్రియమణిని చూసి మనం ఎం నేర్చుకున్నాం ..మారాలి సర్ ఈ పద్దతి మారాలి..మార్పంటే అమ్మ ఏదో ఆకాశం నుంచి ఊడిపడక్కర్లేదు..ఇక్కడే ఎక్కడో ఉంటుంది చూడండి సర్..రెజీనా బిజీనా" అని అనేసరికి రెజీనా షాకైపోయింది. ఇక ఈ షోలోకి సౌమ్య ఎంట్రీ ఇచ్చింది. "షోకి చాల అందం పెరగాలని నన్ను పెట్టేసారు. షో కొంచెం హాట్ లో ఉండాలని నందుని పెట్టారు. షో కొంచెం వెయిట్ ఉండాలని ఈ పొట్టోడిని పెట్టేసారు" అంటూ ఆది మీద పంచ్ డైలాగ్ లు వేసింది".."నేనుండగా నువ్వెందుకురా ఇక్కడ" అంటూ ఆది సౌమ్యని అడిగాడు. "ఇంతవరకు చేసిందంతా బొక్క" అనేసింది. ఆ డైలాగ్ కి తట్టుకోలేక "ఆపవే గుంట నక్క" అనేశాడు ఆది. ఆదితో గత సీజన్స్ లో జెస్సి చేసాడు, అశ్విని చేసింది ఇక ఇప్పుడు సౌమ్య వచ్చింది. ఆది, సౌమ్య కలిసి జబర్దస్త్ వంటి షోస్ లో కొన్ని స్కిట్స్ కూడా చేశారు. గతంలో సౌమ్య మీద నూకరాజు తెలుగు తెలీదంటూ కూడా కామెంట్స్ చేసాడు కానీ ఆమె తెలుగు కొంచెం బెటర్ గా నేర్చుకుని షోస్ లోకి వస్తోంది.  

రష్మీ తెలుగు నేర్పించొచ్చుగా...పోనీ రొమాన్స్ చేయడం నేర్పనా ?

  శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో బోనాల జాతర స్పెషల్ థీమ్ తో రాబోతోంది. ఈ షోకి బలగం వేణు ఎంట్రీ ఇచ్చాడు. అలాగే మార్గన్ మూవీ టీమ్ వచ్చింది. విజయ్ ఆంటోనీ ఫుల్ జోష్ తో ఈ ఎపిసోడ్ లో పార్టిసిపేట్ చేశారు. అలాగే రష్మీని ఆట పట్టించారు. ఇక రష్మీ ఐతే వెల్కమ్ విజయ్ సర్ అంటూ ఇన్వైట్ చేసింది. "తెలుగులో మాట్లాడ్డం ఎలాగో ట్రైనింగ్ ఇవ్వొచ్చుగా" అంటూ విజయ్ ఆంటోని రష్మీని అడిగేసరికి ఇంద్రజ పడీపడీ నవ్వేసింది. "మా రష్మీ మీకు తెలుగు నేర్పిస్తే తెలుగులో మాట్లాడాలని ఆశ పడుతున్నారా"అని కౌంటర్ వేసింది. "రొమాన్స్ గురించి ఏదన్నా పోనీ నేర్పించొచ్చుగా..లేదంటే నేర్పనా " అని అడిగేసరికి రష్మీ వెంటనే విజయ్ ఆంటోనితో కలిసి ఒక రొమాంటిక్ సాంగ్ కి డాన్స్ చేసింది. లవ్ ప్రొపోజ్ చేసేటప్పుడు ఎలా ఐతే మోకాళ్ళ మీద కూర్చుంటారో రష్మీ ముందు విజయ్ ఆంటోని కూడా అలాగే మోకాళ్ళ మీద కుర్చునేసరికి రష్మీ ఫిదా ఐపోయింది. ఆల్రెడీ సర్కార్ సీజన్ కి విజయ్ ఆంటోనీ వచ్చి రష్మీతో సుధీర్ జోడి గురించి సుధీర్ ని అడిగారు. ఇక ఇప్పుడు ఈ షోలో రష్మీతో కలిసి డాన్స్ చేశారు. ఇక బోనాల స్పెషల్ అందరూ బోనాల మీద సాంగ్స్ పాడి జాతర చేసారు. కొంతమందికి పూనకాలు కూడా వచ్చేసాయి. ఇంద్రజ కూడా వాళ్లందరితో కలిసి బోనాల డాన్స్ లో పార్టిసిపేట్ చేసింది.  

Illu illalu Pillalu: భార్య ఒడిలో వాలిపోయిన భర్త.. ఎగ్జామ్ హాల్లో దొరికిపోయాడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-192లో..  ఎగ్జామ్స్ ఉండటంతో ప్రేమ చదువుకుంటూ ఉంటుంది. ఇంతలో ధీరజ్ వచ్చి పడకేస్తుంటాడు. రేయ్ సచ్చినోడా.. ఎగ్జామ్ ఉంది కదా చదవకుండా పడుకుంటావ్ ఏంట్రా.. ఫస్ట్ బుక్ తీసి చదువమని ప్రేమ అంటుంది. అబ్బా ఉదయం నుంచి సైకిల్‌పై ఆర్డర్స్ ఇచ్చి అలసిపోయాను.. నిద్ర తన్నుకొస్తుంది. నావల్ల కాదు.. నేను పడుకుంటానని ధీరజ్ పడుకుంటాడు. చదవమంటే పడుకుంటావ్ ఏంట్రా దొంగ సచ్చినోడా అంటూ దుప్పటి లాగేసి కొడుతుంది. పుస్తకం తెచ్చి ధీరజ్ చేతిలో పెట్టి.. పక్కనే కూర్చోబెట్టుకుని బలవంతంగా చదివిస్తుంది. ఏయ్.. ఏంటే.. మా బాబు కంటే ఎక్కువైపోయావని ధీరజ్ అనగానే.. నోరు మూసుకుని చదవరా అని ప్రేమ భయపెట్టేస్తుంది. ఈ సబ్జెక్ట్ ఏంటే అంత కష్టంగా ఉంది.. అస్సలు అర్థం కావడం లేదు.. ఎక్కడం లేదని అంటాడు ధీరజ్. చూస్తే అలాగే ఉంటుందిరా.. అర్థం చేసుకుని చదివితే ఈజీగా అర్థం అయిపోయింది.. నీనైనా ఆ సబ్జెక్ట్ అయినా అని ప్రేమ అంటుంది. అబ్బో అని ధీరజ్ అంటాడు. అవును ధీరజ్.. భయంతోనో.. అపార్థంతోనో కాకుండా ప్రేమగా చదువు.. అప్పుడు సబ్జెక్ట్ మీద ఎంత అభిప్రాయం, ఇష్టం ఏర్పడతాయో నీకే అర్థం అవుతుందని అంటుంది ప్రేమ. నిన్ను ఖచ్చితంగా మెంటల్ హాస్పిటల్‌లో చేర్పించాలని ధీరజ్ అంటాడు. నోరు మూసుకుని తెల్రార్లూ చదవరా.. రేపు ఖచ్చితంగా ఎగ్జామ్స్‌లో మంచి మార్కులు వస్తాయని ప్రేమ అంటుంది. ఇక ధీరజ్ చదువుతూ ఉంటాడు కానీ నిద్రలోకి జారిపోతుంటాడు. దాంతో జుట్టు పట్టుకుని లాగిపారేసి బలవంతంగా చదివిస్తుంది ప్రేమ. ఇక చదివీ.. చదివీ.. అలా ప్రేమ భుజంపై వాలిపోతాడు. వీడు చెప్పింది నిజమే.. ఫుడ్ డెలివరీ చేసి చాలా అలసిపోయాడు. నిద్ర ఆపుకోలేకపోతున్నాడంటూ ధీరజ్‌ని చూస్తూ అలా ఊహల్లో తేలిపోతుంది ప్రేమ.‌ కాసేపటికి అలా భుజంపై నుంచి ఒడిలోకి జారిపోతాడు ధీరజ్. ఇక తనని ఒడిలో పడుకోబెట్టుకుని జోకొడుతుంది. మరి ఇలా ఒడిలో పడుకుంటే.. ఎగ్జామ్ ఎలా రాస్తాడూ అనే కదా.. ఎగ్జామ్ హాల్‌లో దానికి ఓ చిట్కా చెప్పింది ప్రేమ.  మరోవైపు సాగర్ కి అర్థరాత్రి మెలుకవ వస్తుంది.  పక్కన నర్మద లేకపోయేసరికి బయటకొచ్చి చూస్తాడు. అక్కడ నర్మద ఒంటరిగా కూర్చొని బాధపడుతుంది. తన దగ్గరికి సాగర్ వచ్చి ఏమైందని అడుగగా.. రేపు మా నాన్న బర్త్ డే.. నా జాబ్ వచ్చాక వచ్చిన ఫస్ట్ బర్త్ డే.. గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దామని అనుకున్నా కానీ విషెస్ కూడా చెప్పలేకపోతున్నానని నర్మద అంటుంది. అదేం ప్రాబ్లమ్ కాదు..‌మనం రేపు మీ ఇంటికి వెళ్దాం.. మీ నాన్నకి విషెస్ చెప్దామని సాగర్ అంటాడు. దాంతో నర్మద హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ ఇప్పటికే నాన్న నా మీద చాలా కోపంగా ఉన్నారు కదా అని నర్మద అనగానే..‌ నేనున్నాను కదా బంగారం నేను‌ చూసుకుంటానంటాడు సాగర్. తరువాయి భాగంలో ధీరజ్ ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్‌కి అడ్డంగా దొరికిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : కార్తీక్ కి శివన్నారాయణ బంపర్ ఆఫర్.. జ్యోత్స్న ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -391 లో..... పారిజాతానికి శ్రీధర్ ఫోన్ చేసి గొడవ గురించి అడుగుతాడు. ఇక నా కొడుకు గెలిచాడు కదా.. ఆ శివ మామని ఒక ఆట ఆడుకుంటాడని శ్రీధర్ అంటుంటే.. పారిజాతం చిరాకుగా ఫోన్ కట్ చేస్తుంది. కార్తీక్ వర్కర్స్ సమస్యని పరిష్కారించినందుకు ఏం కావాలో అడగమని శివన్నారాయణ అడుగతాడు.  దాంతో కార్తీక్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయమని చెప్తాడు. చూశావా వాడు అవకాశవాది అని శివన్నారాయణ అంటుండగా.. అని అంటాననుకున్నావా అగ్రిమెంట్ గురించి కాదని ట్విస్ట్ ఇస్తాడు కార్తీక్. ఆ తర్వాత శివన్నారాయణ కార్తీక్ కి బ్లాంక్ చెక్ ఇస్తాడు. దాంతో ఎక్కడ ఎన్ని కోట్లు రాస్తాడో అని పారిజాతం టెన్షన్ పడుతుంది. కానీ కార్తీక్ మళ్ళీ ఆ బ్లాంక్ చెక్ జ్యోత్స్న కి ఇస్తాడు. అందులో జ్యోత్స్న ఒక్క రూపాయి రాసి.. ఇది నువ్వు ఇచ్చే అమౌంట్ లో కట్ చేసుకోమని పొగరుగా సమాధానం చెప్తుంది. అలా ఎందుకని దశరథ్ అంటాడు. తప్పేముంది వాడికి బ్లాంక్ చెక్ ఇచ్చాను తిరిగి ఇచ్చాడు.. తప్పు వాడిది అని శివన్నారాయణ అంటాడు. కానీ మనకి సాయం చేసాడు కాబట్టి వాళ్ళు రోజు సైకిల్ పై ఇబ్బంది పడుతూ రావడం ఎందుకు.‌. స్కూటీ ఉంది కదా తీసుకోండి అని శివన్నారాయణ అనగానే దీప, కార్తీక్ హ్యాపీగా ఫీల్ అవుతారు. అక్కడ జరిగింది మొత్తం ఇంటికి వెళ్లి కాంచనకి చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : ఆగిపోయిన రాజ్ , యామినిల పెళ్ళి.. కావ్యకి కొత్త సవాల్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -755 లో..... యామిని తప్పు చేసిందని అప్పు నిరూపించే ప్రయత్నం చేస్తుంది కానీ సాక్ష్యాలు లేకుండా రాహుల్, రుద్రాణి చేస్తారు. దాంతో రాజ్ కన్ఫ్యూజన్ లో ఉంటాడు. మీరు యామిని తప్పు చెయ్యలేదని నమ్ముతున్నారా అయితే పెళ్లికి ఇంకా టైమ్ ఉంది కదా పెళ్లి చేసుకోండి అని రాజ్ తో కావ్య అంటుంది. దాంతో యామిని నటిస్తూ ఎవరు నాకు సపోర్ట్ గా లేకపోయిన నువ్వు ఉన్నావ్ కళావతి థాంక్స్ అని కావ్య ని యామిని హగ్ చేసుకొని ఇక రాజ్ నా వాడు అని అంటుంది. నాకు ఇంకా నమ్మకం ఉంది పెళ్లి జరగదని కావ్య అంటుంది. ఆ తర్వాత యామిని మెడలో రాజ్ తాళి కట్టబోతు కావ్యతో ఉన్నా జ్ఞాపకాలు గుర్తుచేసుకొని తాళి కిందపడేస్తాడు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు.. ఇష్టం లేని పెళ్లి చేసుకొని యామినికి అన్యాయం చెయ్యలేనని రాజ్ అంటాడు. మరొకవైపు దుగ్గిరాల కుటుంబం మొత్తం డాన్స్ చేస్తుంది. అప్పుడే కావ్య వచ్చి సాంగ్స్ అఫ్ చేసి ఎందుకిలా చేస్తున్నారంటూ చిరాకు పడుతుంది. మరొకవైపు యామిని లోపలికి వెళ్లి డోర్ వేసుకుంటుంది తన పేరెంట్స్ ఇంకా రాజ్ ఎంత రిక్వెస్ట్ చేసిన డోర్ తియ్యదు. నీ వల్లే నా కూతురికి ఈ పరిస్థితి వచ్చిందని రాజ్ తో వైదేహీ అంటుంది. తరువాయి భాగంలో కావ్యకి రాజ్ ప్రపోజ్ చేస్తున్నాడని తెలిసి కావ్యకి యామిని ఫోన్ చేస్తుంది. నువ్వు రాజ్ ప్రపోజ్ ఆక్సెప్ట్ చేస్తే నీ అక్క తన పాప ఇంటికి రారు అని యామిని బ్లాక్ మెయిల్ చేస్తుంది. అప్పుడే కావ్య దగ్గరికి రాజ్ వస్తాడు. నేను వెళ్ళాలని కావ్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

నా కామెడీ గురించి అడగడానికి మీరంతా ఎవరు ?

కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ ఈ వారం శనివారం ఎపిసోడ్ లో ఇమ్మానుయేల్ బాగా ఏడ్చేశాడు. ఐతే శ్రీముఖి సాకేత్ కి ఇమ్ముకి ఒక టాస్క్ ఇచ్చింది. సాకేత్ శ్రీముఖిలా చేసాడు. ఇమ్ము ఖిలాడీ గర్ల్స్ ని ఇమిటేట్ చేసాడు. ఐతే ఇమ్ము రోహిణి అదే పనిగా తింటున్నట్టుగా నటించాడు. ఇంతలో సాకేత్ "రోహిణి మెమరీ టాస్క్ లో మీ సైడ్ నుంచి ఎవరొస్తున్నారు" అని గట్టిగ అడిగేసరికి "ఎవరికీ మెమరీ లేదు ఎవరూ రారు..ఐనా మెమరీ మీలో ఎవరికీ లేదేంటి " అనేశాడు ఇమ్ము. దాంతో రోహిణి లైన్ లోకి వచ్చి "చేస్తే నా గురించి చెయ్యి..ఓవర్ యాక్షన్ చెయ్యి ఇలాంటివి చేయకు అంటూ" కౌంటర్ ఇచ్చింది. "ఆల్వేస్ లూజింగ్ బట్ సడెన్లి విన్నింగ్ కెప్టెన్ రోహిణి" అని సాకేత్ అడిగేసరికి ఇమ్ము వెంటనే ఎవరూ రావట్లేదు అనేశాడు. "మాకు మెమరీ లేదు. బాయ్స్ కి మెమరీ బాగుంది కాబట్టి వాళ్ళకే ఈ గేమ్ ఇచ్చేయండి" అన్నాడు. "మీరు చాలా ఎక్కువ చేస్తున్నారు..రోహిణి బాధపడుతోంది" అంటూ శ్రీసత్య, ప్రియాంక జైన్ గట్టిగానే చెప్పారు. "ఇమిటేషన్ అంటే నిజాలు చెప్పాలి కానీ అబద్దాలను చెప్పడం కాదు" అని ప్రేరణ చెప్పింది. "ఇది ఇరిటేషన్ లా ఉంది ఇమిటేషన్ లా లేదు.. వేరే వాళ్ళ బాధను నువ్వు ఎలా కామెడీ చేస్తావ్ " అంటూ తేజస్విని మడివాడ  అడిగింది. "సారీ మీ అందరికీ సారీ" అని చెప్పాడు ఇమ్ము. అనసూయ ఇమ్ము అని అనేసరికి "మేడం కామెడీని కామెడీలా తీసుకోవాలి" అన్నాడు. దాంతో తేజు వచ్చి "ఈరోజు నువ్వు ఎక్కడా కామెడీ చెయ్యట్లేదు ఈరోజు .. ఎక్స్ట్రాలు చేయకు చాలు " అంది. "మీరు చెప్తే నేను చేసేదేంటి నాకు వచ్చినట్టు నేను చేస్తాను. మీలో ఎవరి గురించైనా చేసానా" అన్నాడు. "కొంచెం ఎక్కువగా చేస్తేనే కదా కామెడీ అవుతుంది. ఉన్నది ఉన్నట్టుగా చేస్తే కామెడీ అవ్వదు కదా. కామెడీని కామెడీలా తీసుకోవడం రాకపోతే ఎలా. నా కామెడీ గురించి అడగడానికి మీరంతా ఎవరు. గర్ల్స్ అంతా ఒకేసారి అరిచారు నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడారు. నాకసలు నచ్చలేదు. ఎవరు ఏమన్నా పడతాను. నవ్వించాలని నాకేం అవసరం. కామెడీ చేస్తేనే సర్వైవ్ అవుతాను. మీకు కామెడీ నచ్చకపోతే చెప్పండి. బాయ్స్ మీద కామెడీ చేయమంటే హ్యాపీగా చేయొచ్చు. కామెడీ సెన్స్ ఉన్నోళ్ళతో కామెడీ చేయాలి..ఎవరినన్నా తప్పుగా అని ఉంటే సారీ  " అన్నాడు ఇమ్ము.

సుధీర్ కి విజయ్ ఆంటోనీ కూడా పెద్ద ఫ్యాన్

సర్కార్ సీజన్ 5  లేటెస్ట్ ప్రోమో ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ఈ షోకి "మార్గన్"మూవీ టీమ్ వచ్చింది. విజయ్ ఆంటోని, అజయ్ ధిషన్ వచ్చారు. రాగానే "మీకు నేను చాలా పెద్ద ఫ్యాన్..మీరు ఎంచుకుంటే సబ్జెక్ట్స్ చాలా బాగుంటాయి " అంటూ సుధీర్ చెప్పాడు. దాంతో విజయ్ ఆంటోని వెంటనే "నేను కూడా నీకు చాలా పెద్ద ఫ్యాన్ ని.. నీ షోస్ అన్ని నేను చూసాను. రష్మీతో నీ కెమిస్ట్రీ చాలా ఆసంగా ఉంటుంది" అనేసరికి సుధీర్ సిగ్గుపడిపోయాడు. "సర్ అసలు నేను ఇన్ని షోస్, సినిమాలు ఎందుకు చేస్తున్నానో మీకు తెలుసా సర్" అనగానే బిచ్చగాడు మూవీలోంచి "ఒక్క పూట అన్నం కోసం" అంటూ సాంగ్ పడేసారు విజయ్. ఇక మూవీలో లేడీ క్యారెక్టర్స్ ఐన బ్రిగిడ సాగ, దీప్ షికా వచ్చారు. సుధీర్ ఐతే "మీరు సర్కార్ గురించి టెన్షన్ పడక్కర్లేదు..బ్రెయిన్ ఉన్నోళ్లు విన్ అవుతారు అసలు బ్రెయిన్ లేనోళ్ళు ఉన్నారనుకోండి" అనేసరికి "యాంకర్ అవుతారు" అంటూ కౌంటర్ వేసింది. "నువ్వేం ప్రేమ కోసం వెతకక్కర్లేదు.." అంటూ దీప్ షికా సుధీర్ ని చూసి కన్ను కొట్టింది. దాంతో సుధీర్ ఎం చేశారు మేడం మీరిప్పుడు అన్నాడు వెంటనే అజయ్ ఎంట్రీ ఇచ్చి " రష్మీ మేడంకి ఈ విషయం తెలుసా" అని అడిగాడు. ఇక ఈ షోలో "గీతాంజలి" మూవీలోని ఒక సీన్ ని స్పూఫ్ గా చేశారు సుధీర్, దీప్ షికా. విజయ్ ఆంటోనీ వాళ్ళను డైరెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇలా ఈ టీమ్ మొత్తం సర్కార్ నెక్స్ట్ ఎపిసోడ్ లో నవ్వించబోతున్నారు.

త్వరలో జూనియర్ ఎన్టీఆర్ తో ఎక్స్ప్రెస్ హరి మూవీ ?

  కాకమ్మ కథలు షో ఆహా ప్లాటుఫారం మీద మంచి రేటింగ్ తో దూసుకుపోతోంది. ప్రతీ వారం బుల్లితెరకు సంబందించిన వాళ్ళను ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది తేజస్విని మడివాడు. అలాగే వాళ్ళ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ని చెప్తూ ఉంటుంది. ఇక రీసెంట్ ఎపిసోడ్ కి అష్షు రెడ్డి, ఎక్స్ప్రెస్ హరి వచ్చారు. ఐతే హరి పాస్ట్ గురించి చెప్పి తేజుని ఏడిపించేసాడు. ఐతే హరి ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో తేజు చెప్పేసింది. ఇక ఫ్యూచర్ లో జూనియర్ ఎన్టీఆర్ పిక్ ని తేజు చూపించేసరికి హరి ఆశ్చర్యపోయాడు. "హరి నువ్వు ఎప్పటినుంచి తారక్ అన్నతో ఫోటో దిగడం కోసం వెయిట్ చేసి చేసి మిస్ అయ్యావని విన్నాను. నేను తారక్ అన్నతో ఫోటో ప్రామిస్ చేయగలను. ఫోటో ఇప్పించగలను. ఐతే నాకెందుకో తారక్ అన్నతో స్క్రీన్ షేర్ చేసుకుంటావని ఆయనకు నువ్వు రాస్తావని మా కాకమ్మ చెప్తోంది.గట్టిగా అనుకో అది జరుగుతుంది " అంది తేజు. " గట్టిగా అనుకుంటా. గొంతు పోయేంత గట్టిగా అనుకుంటా జరుగుతుంది అంటే" అంటూ హరి ఆనందాన్ని షేర్ చేసుకున్నాడు. ఇక తేజు ఐతే "ఎన్టీఆర్ గారు మీరు ఈ షో చూస్తుంటే మీ ఫ్యాన్ ఇక్కడ మీతో ఫోటో దిగడానికి తహతహలాడుతున్నాడు. మీ అన్నపూర్ణ స్టూడియోస్ బయట వెయిట్ చేసిన రైటర్. అతను చాలా టాలెంటెడ్. కావాలంటే రెండు పీకండి.. కానీ పిలిచి ఫోటో దిగండి" అంటూ చెప్పింది. ఇక హరి కష్టాలు విన్న తేజు " ఇక నువ్వు కష్టాలు పడాల్సిన సమయం ఐపోయింది. నువ్వు ఫుడ్ కోసం బాధపడక్కర్లేదు. ఎందుకంటే అష్షు నీకు లైఫ్ లాంగ్ ఫుడ్ పెడుతుంది" అంది. "హరినే నాకు ఫుడ్ పెట్టాలి" అంది అష్షు. "ఇప్పుడు నువ్వు అందరికంటే ఎక్కువగా డబ్బులు సంపాదిస్తున్నావ్ కాబట్టి నువ్వే ఫుడ్ పెట్టాలి. నీకు మంచి అమ్మాయి దొరికి మంచి పండు లాంటి పిల్లలు పుట్టాలని, నీ లైఫ్ నువ్వు ఎలా ఉండాలని కోరుకుంటున్నావో అలా ఉండాలని కోరుకుంటున్నా  " అంటూ విష్ చేసింది తేజు.