Karthika Deepam 2 : దీపపై జ్యోత్స్నకి డౌట్.. డబ్బు ఇవ్వనన్న శ్రీధర్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -396 లో... జ్యోత్స్న చేసిన పని గురించి శివన్నారాయణతో చెప్తాడు కార్తీక్. అదంతా విని జ్యోత్స్నని తిడతాడు శివన్నారాయణ. ఆ తర్వాత జ్యోత్స్న చేత దీపకి సారీ చెప్పిస్తాడు.    దీప గాజు ముక్కలు క్లీన్ చేస్తుంటే తర్వాత చెయ్యొచ్చు కదా అని కార్తీక్ అనగానే ఇలాంటివి ప్రమాదకరం అయిన వాటిని ఎంత త్వరగా క్లీన్ చేస్తే అంత మంచిదని దీప అంటుంది. ఆ మాటలకి దీప మనల్ని అన్నట్లు ఉందని జ్యోత్స్న, పారిజాతం అనుకుంటారు. దీప ఏంటి ఏదో నిజం తెలిసినట్లు మాట్లాడుతుందని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత కార్తీక్, దీప వెళ్ళిపోతారు. జ్యోత్స్న ఏంటి దీప వల్ల ఇన్ని మాటలు పడాల్సి వస్తుందని సుమిత్ర అనుకుంటుంది. ఆ తర్వాత కాశీ తన ఫ్రెండ్ కి ఒకతని దగ్గర అప్పు ఇప్పిస్తాడు. అతను కాశీని వచ్చి డబ్బు ఇవ్వమని గొడవ చేస్తాడు. ఆ విషయం స్వప్న కి తెలిసి కాశీతో గొడవ పడుతుంది.   మరొకవైపు దశరథ్ దగ్గరికి శివన్నారాయణ వచ్చి.. మీ చెల్లికి ఎలా ఉందో కనుక్కోమని.. ఇండైరెక్ట్ గా వీడియో కాల్ చేయమని అడుగుతాడు. దాంతో దశరత్ వీడియో కాల్ లో కాంచన ని చూస్తాడు. అప్పుడు నాన్న అని కాంచన పిలవగానే శివన్నారాయణ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కాంచన మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు కాశీకి డబ్బు కావాలని కావేరిని అడుగుతుంది స్వప్న. కావేరి లాకర్ కీస్ కావాలని శ్రీధర్ ని అడుగుతుంది. ఎందుకు చెప్పు అని శ్రీధర్ అనగానే.. జరిగింది మొత్తం కావేరి చెప్తుంది. దాంతో కాశీని తిడతాడు శ్రీధర్. నాకు నీ డబ్బేం అవసరం లేదని స్వప్న కోపంగా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : అప్పుకి సపోర్ట్ గా పెద్దావిడ.. యామిని ప్లాన్ అదే!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -760 లో.... యామిని దగ్గరికి అప్పు వచ్చి తన చెంపచెల్లుమనిపిస్తుంది. మా అక్కని కిడ్నాప్ చెయ్యాలని ట్రై చేసింది నువ్వే అని నాకు తెలుసు యామిని.. మొన్న కూడా ఏదో సాక్ష్యం డిలీట్ చేశానని తప్పించుకున్నావ్.. కానీ నేను వదిలేస్తే నువ్వు తప్పించుకున్నావ్.. మా అక్క వదిలెయ్యమని చెప్పిందని అప్పు అనగానే యామిని షాక్ అవుతుంది. యామినికి అప్పు వార్నింగ్ ఇస్తుంటే అప్పుడే రాజ్ వస్తాడు‌ ఏంటి అప్పు ఇక్కడ ఉన్నావని రాజ్ అడుగుతాడు. ఒక కేసు పని మీద ఇక్కడికి వచ్చానని అప్పు అంటుంది.   నువ్వు కావ్యకి ప్రపోజ్ చేస్తానని వెళ్ళావ్ కదా బావ ఏమైందని రాజ్ ని యామిని అడుగగా.. ఏం లేదని రాజ్ అంటాడు. ఆ తర్వాత కావ్యకి యామిని ఫోన్ చేసి నిన్ను బావని కలవకుండా చేస్తానని మా‌ట్లాడుతుంది‌. తన మాటలకి కావ్య వెటకారంగా మాట్లాడుతుంది. అప్పు వచ్చి వార్నింగ్ ఇచ్చిన విషయం కావ్యకి చెప్తుంది యామిని. అప్పు రాగానే ఎందుకు వెళ్ళావని కావ్య కోప్పడుతుంది. ఇందిరాదేవి, అపర్ణ వచ్చి అప్పు చేసిన దాంట్లో తప్పేముందని అంటారు.   మరొకవైపు రాజ్ కంపెనీలోని ఒక బోర్డు మెంబర్ తో కలిసి యామిని మాట్లాడుతుంది. కావ్య గురించి నెగెటివ్ గా చెప్పండి. అప్పుడు కంపెనీ లో మీరు అనుకున్నది జరుగుతుందని యామిని అనగానే.. అతను యామిని చెప్పినట్లు చెయ్యడానికి సరే అంటాడు. ఆ తర్వాత కావ్యకి రాజ్ ఫోన్ చేసి మాట్లాడతాడు. తరువాయి భాగంలో కావ్యకి రాజ్ ప్రపోజ్ చేస్తుంటే ఆఫీస్ నుండి ఫోన్ వచ్చి అర్జెంట్ గా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

సినిమాలో ఆఫర్ ని వదిలేసుకున్నా..అషు ​​రెడ్డి

  అషు ​​తాను ఒక మంచి సినిమాలో ఆఫర్ ని వదిలేసుకున్నాను అంటూ కాకమ్మ కథలు ఎపిసోడ్ లో చెప్పుకొచ్చింది. కాకమ్మ కథలు షోలో లాస్ట్ వీక్ గెస్టులుగా అష్షు-హరి వచ్చారు. ఐతే వీళ్ళ  ఎపిసోడ్ 2 రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో అష్షు ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పింది. "డోర్ దాకా వచ్చిన రోల్ ని మిస్ చేసిన సందర్భం ఉందా" అని హోస్ట్ తేజస్విని అడిగింది. అప్పుడు అషు ​​రెడ్డి "3 రోజెస్ అనే మూవీ రీసెంట్ గా కొత్త సీజన్ స్టార్ట్ అయ్యింది. నేను అందులో ఒక అమ్మాయిగా చేయాలంటూ ఆఫర్ వచ్చింది. ఆ మూవీ ప్రొడ్యూసర్ నన్ను రమ్మని అడిగారు. ఐతే నేను న్యూమరాలజీని స్ట్రిక్ట్ గా ఫాలో అవుతూ ఉంటాను. డేట్స్ విషయంలో బాగా నమ్ముతాను. ఆ డేట్స్ లో షూటింగ్స్ కి ఎవరైనా రమ్మన్నా ఆడిషన్ ఇమ్మాన్నా నేను కచ్చితంగా వెళ్ళలేను అని చెప్పలేను కాబట్టి డేట్స్ మార్చమని వాళ్ళను అడుగుతూ ఉంటాను. ఒక మంచి రోజు చూసుకుని వస్తానండి అని చెప్తాను. నీ కోసం మంచి రోజు చూసి ఆడిషన్స్ పెట్టాలా అంటారు. ఎందుకంటే వాళ్లకు ఉండే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వాళ్లకు ఉంటాయి. ఐతే ఈ మూవీ మరో నాలుగు రోజుల్లో షూటింగ్ స్టార్ట్ అవ్వబోతోంది. ఐతే ఆ ప్రొడ్యూసర్ నాకు స్ట్రిక్ట్ గా ఒక మెసేజ్ పెట్టారు. ఈ మూవీలో కచ్చితంగా మీరు ఉండాలి అని మేము అనుకుంటున్నాము అన్నారు. ఈ మూవీకి చాలా రీచ్ కూడా ఉంది. నేను రాను అని చెప్పేసరికి నా ప్లేస్ లో వేరే అమ్మాయిని తీసుకున్నారు. ఆమె ఎవరో కాదు నా ఫ్రెండ్ . నాకు చాలా హ్యాపీగా ఉంది. చెప్పాలంటే ఈ మూవీ అవకాశం డోర్ వరకే కాదు కిచెన్ లోపలి వచ్చింది. కానీ నేనే ఈరోజు వద్దు రేపు రా అని చెప్పి పంపించేసా.." అంటూ చెప్పింది అషు ​​రెడ్డి. ఆమె బిగ్ బాస్ సీజన్ 3  తో పాటు బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ లో కూడా పార్టిసిపేట్ చేసింది. సోషల్ మీడియాలో అష్షు రేంజ్ వేరే లెవెల్ లో ఉంటుంది. టీవీ షోస్, వెబ్ సిరీస్, మూవీస్ చేస్తూ ఉంటుంది.  

బెస్ట్ యాక్టర్ గా మానస్ కి "ఇంటర్నేషనల్ ఐకానిక్ అవార్డ్స్ టాలీవుడ్  2025 "  

  బుల్లితెర మీద బ్రహ్మముడి సీరియల్ కి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. ఈ సీరియల్ లో హీరో హీరోయిన్స్ గా మానస్ నాగులపల్లి, దీపికా రంగరాజు ఫుల్ ఎంటర్టైన్ చేశారు. వీళ్ళు సీరియల్ లో కావ్య - రాజ్ గా బాగా పేరు తెచ్చుకున్నారు. ఇంతకు ముందు కార్తీక దీపం సీరియల్ రాత్రి వచ్చేది. ఆ సీరియల్ ఐపోగానే ఆ టైం స్లాట్ లో ఈ బ్రహ్మముడి సీరియల్ స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ ఐన దగ్గర నుంచి కూడా మంచి రేటింగ్ ని తెచ్చుకుంది. అలాగే మానస్ ఇంకా దీపికా సీరియల్ తో పాటు రకరకాల షోస్ లో కూడా చేస్తూ ఉన్నారు. మానస్ శ్రీదేవి డ్రామా కంపెనీకి, ఆదివారం విత్ స్టార్ మా పరివారానికి వస్తున్నాడు. అలాగే ఇప్పుడు జబర్దస్త్ కి కో- యాంకర్ గా చేస్తున్నాడు. దీపికా కూడా ఈ షోస్ లో కనిపిస్తూ ఉంటుంది. డాన్స్ ఐకాన్ సీజన్ 2 లో దీపికా - మానస్ ఇద్దరూ మెంటార్స్ గా వచ్చారు. ఇక దీపికా ఐతే చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే షోకి సమీరా భరద్వాజ్ తో కలిసి వచ్చింది. ఐతే డాన్స్ ఐకాన్ తర్వాత దీపికా షోస్ లో కనిపించడం తగ్గింది. రీల్స్ మాత్రం చేస్తూ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పెడుతోంది. ఇక ఇప్పుడు "బెస్ట్ యాక్టర్ ఆఫ్ ఇండియన్ టెలివిజన్ తెలుగు 2025 ఫర్ బ్రహ్మముడి" సీరియల్ కి మానస్ నటనకు గాను "ఇంటర్నేషనల్ ఐకానిక్ అవార్డ్స్ టాలీవుడ్  2025 " అవార్డుని అందుకున్నాడు. సీరియల్స్ లో బెస్ట్ ఐకానిక్ తెలుగు షోగా బ్రహ్మముడి సీరియల్ నిలిచిందంటూ ఈ సంస్థ పేర్కొంది. ఇక హీరోయిన్ దీపికా మానస్ ని విష్ చేస్తూ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ పెట్టింది. సీరియల్ లో పద్దతిగల కోడలిగా కనిపించే దీపికా రీల్స్ లో, షోస్ లో చేసే హడావిడి, అల్లరి మాములుగా ఉండదు. ఆమె ఉంటే చాలు షో రేటింగ్స్ పీక్స్ అన్న టైంలో మరి కొంచెం అమ్మడి హవా ఐతే తగ్గింది.  

Illu illalu pillalu : ప్రేమలో రామరాజు కొడుకులు, కోడళ్ళు.. ధీరజ్, ప్రేమ తప్ప!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -196 లో.... ప్రేమ దగ్గరికి ధీరజ్ వచ్చి ప్రేమ ఎంతటి వారినైనా మార్చేస్తుందంటే ఏమో అనుకున్నాను కానీ ఇప్పుడు తెలుస్తుందని ధీరజ్ అంటాడు. కోపందీసి నాపై ఏమైనా ప్రేమ మొదలైందా అని ప్రేమ అడుగుతుంది. అంత లేదు నేను నడిపోడు గురించి చెప్తున్నాను.. వాడు వదినని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు కదా.. అన్నయ్య గవర్నమెంట్ జాబ్ చెయ్యడం.. తనకి ఇష్టమట అందుకే అన్నయ్య గవర్నమెంట్ జాబ్ చేస్తానని నాతో చెప్పాడని ప్రేమతో చెప్తాడు ధీరజ్. మరొకవైపు ప్రేమ కోసం ధీరజ్ నైట్ డ్రైవింగ్ కి వెళ్తున్న విషయం నర్మదకి చెప్తాడు సాగర్. ఈ విషయం ఎవరికీ చెప్పకని నర్మద దగ్గర సాగర్ మాట తీసుకుంటాడు. మరొకవైపు అన్నయ్య గవర్నమెంట్ జాబ్ చేస్తానన్నా విషయం ఎవరికి చెప్పొద్దని ప్రేమ దగ్గర ధీరజ్ మాట తీసుకుంటాడు. మరుసటిరోజు కిచెన్ లో ఉన్న నర్మద దగ్గరికి ప్రేమ వస్తుంది. మాటల్లో ధీరజ్ కి నువ్వంటే ఎంత ఇష్టం.. నీకోసం ఇలా కష్టపడుతున్నాడన్న విషయం ప్రేమకి చెప్తుంది నర్మద. అలాగే బావ ఎంత మంచోడు నీ కోసం గవర్నమెంట్ జాబ్ చెయ్యాలనుకుంటున్నాడని నర్మదతో ప్రేమ చెప్తుంది. ఆ మాట విన్న నర్మద హ్యాపీగా ఫీల్ అవుతుంది. తరువాయి భాగంలో సాగర్ వెనకాల నుండి వచ్చి హగ్ చేసుకుంటుంది నర్మద. తనని చూసిన శ్రీవల్లి.. చందు దగ్గరికి వచ్చి హగ్ చేసుకుంటుంది. అలా రామరాజుని వేదవతి హగ్ చేసుకుంటుంది. అందరిని చూసి ధీరజ్ దగ్గరికి వెళ్తుంది ప్రేమ. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2: నోరుజారిన కార్తీక్.. దీపే నీ అసలైన కూతురు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -395 లో.... కాంచన దగ్గరికి దశరథ్ వెళ్లి డాక్టర్ ని పిలిపించి ట్రీట్ మెంట్ ఇప్పిస్తాడు. నేను అసలు చెల్లి దగ్గర ఉండకుండా వెళ్ళిపోయానని అనసూయ బాధపడుతుంటే.. నేనే నిన్ను వెళ్ళమన్నాను కదా అని కాంచన అంటుంది. మరొకవైపు జ్యోత్స్నని కార్తీక్ తీసుకొని ఇంటికి వెళ్తాడు. కాంచన పడిన విషయం చెప్పి, జ్యోత్స్న మీకు చెప్పకుండా చేసిందని కార్తీక్ తో దీప చెప్తుంది. దాంతో కార్తీక్ వెంటనే దశరథ్ కి వీడియో కాల్ చేస్తాడు. మావయ్య అమ్మకి ఎలా ఉందని అడుగుతాడు‌. బాగుంది రా అని కాంచనని చూపిస్తాడు. నాకు బానే మీరు రాకండి అని కాంచన అంటుంది. ఆ తర్వాత దశరథ్ బయటకు వెళ్లి కార్తీక్ తో మాట్లాడతాడు. నా కూతురు చేసిన తప్పుకి క్షమించురా దశరథ్ అనగానే.. మీరు ఎందుకు అలా చెప్తున్నారని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత నా కూతురిని దీపలా నువ్వే మార్చాలిరా అని దశరథ్ అనగానే అది జరగదు ఎందుకంటే దీపనే నీ కూతురు అని కార్తీక్ అంటాడు. ఏం అంటున్నావని దశరథ్ అనగానే కార్తీక్ డైవర్ట్ చేస్తాడు. నా కూతురికి నువ్వే బుద్ది చెప్పాలని దశరథ్ రిక్వెస్ట్ చేస్తాడు. ఆ తర్వాత రాత్రి అందరు భోజనం చేస్తుంటే.. దశరథ్ కి కార్తీక్ థాంక్స్ చెప్తాడు. ఎందుకని అని శివన్నారాయణ అడుగుతాడు. మా అమ్మని కాపాడాడని జరిగింది చెప్తాడు కార్తీక్. జ్యోత్స్న చేసిన తప్పుకి శివన్నారాయణ తనపై కోప్పడతాడు. జ్యోత్స్న చేత దీపకి సారీ చెప్పిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : రేవతికి దుగ్గిరాల కుటుంబానికి మధ్యగల సంబంధమేంటి.. బ్రహ్మముడిలో ట్విస్ట్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -759 లో.....కావ్య ఇంకా రావడం లేదని రాజ్ డిస్సపాయింట్ అవుతుంటే.. వస్తుందిలే అని అపర్ణ, ఇందిరాదేవి ఇద్దరు రాజ్ తో మాట్లాడి తనకి హోప్ ఇస్తారు. సరే నేను వెళ్తున్నాను.. రేపు వచ్చి ప్రపోజ్ చేస్తానంటూ రాజ్ వెళ్ళిపోతాడు. వచ్చిన అవకాశం చేజర్చుకుందని కావ్యపై అపర్ణ కోపంగా ఉంటుంది. ఆ తర్వాత కావ్య, స్వప్నలని రేవతి కాపాడి లోపలికి తీసుకొని వస్తుంది. రేవతి భర్త వచ్చి డోర్ కొడతాడు. రౌడీలు వచ్చారనుకొని కావ్య, స్వప్న టెన్షన్ పడుతారు తీరా చూసేసరికి తన భర్త.. అసలు విషయం రేవతి తన భర్తకి చెప్తుంది. ఆ తర్వాత అప్పు లొకేషన్ కి వచ్చి ఫోన్ చేస్తుంది. కావ్య, స్వప్న ఇద్దరు అప్పు దగ్గరికి వెళ్తారు. అక్కాచెల్లెళ్లు రేవతికి థాంక్స్ చెప్తారు. మీ ఋణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదని అప్పు అనగానే.. మనది తీర్చుకుంటే తీరిపోయే ఋణం కాదని రేవతి అంటుంది. ఏం అంటున్నారని అప్పు అంటుంది. దాంతో రేవతి డైవర్ట్ చేస్తుంది. ఆ తర్వాత రేవతి లోపలకి వచ్చి ఏదో ఫోటో చూస్తూ ఏడుస్తుంది. అప్పుడే తన భర్త వచ్చి నన్ను పెళ్లి చేసుకోవడం వల్లే.. నీ వాళ్ళకి దూరంగా ఉన్నావ్.. లేదంటే ఆ కోటలో మహారాణిలాగా ఉండేదానివి ఇన్ని రోజులుగా వాళ్ళ మనసు మారుతుందని వెయిట్ చేస్తున్నావ్ కానీ అది అవట్లేదని అతను అంటాడు. ఆ తర్వాత కావ్య, స్వప్నలని అప్పు ఇంటి దగ్గర దింపి యామిని దగ్గరికి వెళ్తుంది. కావ్య రాగానే ఇంట్లో వాళ్లంతా ఎక్కడికి వెళ్లావని అడుగతారు. స్వప్న జరిగిందంతా చెప్తుంది. యామిని ఇదంతా చేసిందని కావ్య చెప్తుంది. మరొకవైపు అప్పు వెళ్లి యామిని చెంప చెల్లుమనిపిస్తుంది. తరువాయి భాగంలో యామిని రాజ్ కంపెనీలో బోర్డ్ మెంబర్ తో కలిసి మాట్లాడతుంది. ఆ తర్వాత రాజ్ తో కావ్య ఫోన్ మాట్లాడతుంది. మీరేం మాట్లాడాలనుకుంటున్నారో నాకు ఫోన్ లో చెప్పండి అని కావ్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. Brahmamudi episode 759,Brahmamudi June 27th Episode,Brahma Mudi Episode 760,Brahma Mudi

మీ పిల్లలకు ఎం చదువులు చెప్తారా అని భయంగా ఉంది

  సర్కార్ సీజన్ 5 ఈ వారం ఎపిసోడ్ ఫుల్ ఫన్నీగా సాగింది. ఇందులో రకరకాల ప్రశ్నలు అడిగాడు. ఈ షోకి ఆరియానా, వర్షిణి, దేత్తడి హారికా, శ్రీసత్య వచ్చారు. వచ్చే ముందు సుధీర్ ని ఆటపట్టించారు. ఇక ఒక ప్రశ్న అడిగారు సుధీర్ ఇందులో. "లక్ష రూపాయల్లో ఎన్ని 500 నోట్లు ఉంటాయి " అని అడిగాడు. ఈ ప్రశ్నకు క్లూస్ కోసం అందరూ డబ్బులు బిడ్డింగ్ పెంచుతూ వెళ్తున్నారు. ఆరియానా ఆశాలు బిడ్ చేయకపోయేసరికి సుధీర్ అడిగాడు ఎందుకు బిడ్ చేయట్లేదని. దానికి ఆరియానా ఏంటి నువ్వు ? అని అడిగాడు. "మీరు లెక్కలు అడిగారు నేను లెక్కల్లో చాలా పూర్. నా పరువు పోతుందని భయం" అంది. "ఎప్పుడన్నా మనకు ఉన్నదాని గురించి పోయిద్దా అని ఆలోచించాలి" అని కౌంటర్ వేసాడు. "ఎందుకంటే ఇంత కఠినంగా ఉంటారు మీరు" అని మళ్ళీ సుధీర్ అడిగేసరికి "ఇంత కఠినంగా ఉండే మీరు మమ్మల్ని కఠినంగా" అంటూ ఆ కఠినం అనే పదాన్ని పలకలేకపోయింది. దాంతో సుధీర్ "నీకు ఇంగ్లీష్ కాదు తెలుగు కూడా రాదు" అనేశాడు. "ఎలా లెక్కపెట్టాలి" అంటూ హారిక ఫైనల్ గా 200 అంటూ ఆన్సర్ చెప్పింది. దాంతో సుధీర్ షాకై చూస్తూ "మీ తెలివితేటలకు ఒక దణ్ణం..నా ప్రాబ్లమ్ మిమ్మల్ని ఎవరు చేసుకుంటారన్నది కాదు. మీ పిల్లలకు చదువులు ఎం చెప్తారా అన్నదే భయంగా ఉంది" అన్నాడు సుధీర్. దానికి వర్షిణి "మేమే చదవలేదు..మా పిల్లలకేం చదువు చెప్తాము ఇంకా" అంది. "అదే నా భయం పొరపాటున ఇంట్లో ఏదన్నా డౌట్ ఉంటే అని. అమ్మా లక్షలో ఎన్ని 500 లు ఉంటాయి అని పిల్లలు అడిగితే ఆ 100 అన్నారనుకో మొత్తం పోయినట్టే కదా " అంటూ కౌంటర్ వేసాడు.  

కండక్టర్ ఝాన్సీ జీవితంలో కష్టాలు..

ఢీ సీజన్ 20 స్టార్ట్ అయ్యింది. ఇది సర్ మా బ్రాండ్ అనే టాగ్ తో ఈ షో స్టార్ట్ అయ్యింది.  ఇక కంటెస్టెంట్స్ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఐతే మెంటార్స్ గా ఆది, సౌమ్య వచ్చారు. ఇక పెర్ఫార్మెన్స్ ని బట్టి జడ్జెస్ విజయ్ బిన్నీ మాష్టర్ అలాగే రెజీనా వచ్చి టాగ్స్ ఇస్తున్నారు. ఇందులో పల్సర్ బైక్ ఝాన్సీ కూడా వచ్చింది. ఆమె డాన్స్ పెర్ఫామెన్స్ అయ్యాక సర్ప్రైజ్ వాళ్ళ అమ్మను స్టేజి మీదకు తీసుకొచ్చారు. "ఏ తల్లి కడుపునా ఇలాంటి కూతురు పుట్టదు. కానీ నా కడుపున పుట్టింది. ఏ కూతురు తల్లిని పెంచదు..కానీ నా కూతురు నన్ను పెంచుతోంది. తమ్ముడిని, నన్ను చూస్తది, పిల్లల్ని చూసుకుంటుంది. భర్తను చూస్తది. తెల్లవారుజామున డ్యూటీకి వెళ్తుంది..వెళ్లొచ్చి మళ్ళీ ప్రోగ్రామ్స్ చేస్తుంది. ఎవరికీ ఎం కావాలన్నా ఝాన్సీనే చూస్తుంది. ఝాన్సీ 7th క్లాస్ చదివేటప్పుడు వాళ్ళ నాన్న ఇంట్లోంచి వెళ్లిపోయారు. అప్పటి నుంచి నాకు కొడుకైనా, కూతురైనా ఝాన్సీ మాత్రమే. నాకు ఒక కొడుకు ఉన్నాడు. రమేష్. అతన్ని 7th నుంచి మొదలుకుని ఇప్పుడు ఎల్ఎల్బి వరకు జాన్సీ చదివించింది. ఇలాంటి కూతురు ప్రతీ ఒక్క తల్లి కడుపున పుట్టాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కష్టంలో, సుఖంలో అండగా ఉంటది. నవ్విస్తాది, ఏడిపిస్తది, చిన్నపిల్లలా నుంచి వందేళ్ల వరకు ఉన్న వాళ్ళను లాలిస్తాది. నీకుందుకు నేనున్నాను అంటది. మా కుటుంబంలో ఎంతమంది ఉన్నా సరే ఎవరూ నన్ను చూడలేదు. నా కూతురు నన్ను చూసింది." అని చెప్పింది. వెంటనే నందు "ఝాన్సీ నీది వెరీవెరీ ఇన్స్పైరింగ్ జర్నీ" అంటూ పొగిడేసాడు. ఇక ఝాన్సీ వాళ్ళ అమ్మ కూతురు కోసం ఒక గిఫ్ట్ కూడా తెచ్చారు. ఆ గిఫ్ట్ ఓపెన్ చేసి చూసినా ఝాన్సీకి అందులో కండక్టర్ డ్రెస్ ఉంది. అది వేసుకుని డైరెక్ట్ గా నోటితో విజిల్ వేసింది స్టేజి మీద. వెంటనే ఆది "కండక్టర్ గారు చిల్లర టికెట్ వెనక రాయకుండా చేతికివ్వరా" అని కామెడీ డైలాగ్ వేసాడు. ఇక విజయ్ బిన్నీ మాష్టర్ వచ్చి ఝాన్సీకి "కరెంట్ తీగ" అనే టాగ్ ఇచ్చారు. ఇక ఝాన్సీ ఆది టీమ్ లోకి వచ్చేసింది.

హౌ డేర్ యు..మీరెవరు అసలు నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలో చెప్పడానికి ?

  శుభశ్రీ రాయగురు బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ వెళ్లి అందరినీ అలరించిన నటి. అటు మూవీస్ లో కూడా నటించింది. ఆమె రీసెంట్ గా ఏజె మైసూర్ అలియాస్ అజయ్ మైసూర్ అనే అతనితో ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఇతను కూడా ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్. మైసూర్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద "కమ్మ రాజ్యంలో కడప రెడ్లు" అనే మూవీ తీసాడు. ఇతనితో శుభశ్రీ మింగిల్ అయ్యింది. ఐతే వీళ్ళ పెయిర్ మీద చాల నెగటివ్ ట్రోలింగ్స్ వచ్చాయి. దాని గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్తూ చాలా ఫీలయ్యింది. "ఆయన గురించి చెప్తూ డార్క్ కలర్ లో ఉన్నాడు. అసలు ఎలా నచ్చాడు." అంటూ కామెంట్స్ చేశారు. "ఐనా ఆ విషయాలు చెప్పడానికి మీకెంత ధైర్యం..హౌ డేర్ యు..మీరెవరు అసలు ఎలాంటి పార్ట్నర్ ని చూజ్ చేసుకోవాలో చెప్పడానికి.. "అంటూ గట్టిగా క్లాస్ పీకింది."కట్నం ఎంతిస్తున్నారు...మనీ, మనీ, మనీ అంటున్నారు...మనీ డిగ్గర్, ఆరు నెలలు కలిసుంటే చూద్దాం..ఎందుకు ఎవరూ పాజిటివ్ గా ఉండరు..నేను ఏదన్నా రాంగ్ చేసానా  " అసలు ఏంటి కామెంట్స్ అంటూ తెగ ఫీలయ్యింది. తర్వాత హోస్ట్ అజయ్ మైసూర్ కి ఫోన్ చేయమని శుభశ్రీతో చెప్పింది. దాంతో ఆమె నిజంగా ఫోన్ చేసింది. "మిమ్మల్ని అంతలా ట్రోల్ చేస్తుంటే మీరు మాత్రం అంత హ్యాపీగా ఎలా ఉన్నారు" అంటూ హోస్ట్ వర్ష అడిగింది. "నా ఫస్ట్ మూవీ 2019 లో వచ్చిన "కమ్మ రాజ్యంలో కడప రెడ్లు"..నేను అప్పటి నుంచే నేను ట్రోలింగ్ కి అలవాటు పడ్డాను..హటర్స్, లవర్స్ అందరి రెస్పాన్స్ కి థ్యాంక్యూ. వి రాక్ " అని చెప్పాడు. రీసెంట్ గా వీళ్ళిద్దరూ కలిసి చేసిన "మెజెస్టీ ఇన్ లవ్" అనే కవర్ సాంగ్ వచ్చింది.

ప్రభుదేవా ఎందుకు పనికి రాడు బ్రో అన్న నెటిజన్ కి నందు కౌంటర్

బుల్లితెర మీద హోస్ట్ నందు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మల్టి-టాలెంట్ కి నిలువెత్తు అద్దం. ఢీ షోకి హోస్ట్ గా, అలాగే డాన్సర్ గా, మూవీస్ లో యాక్టర్ గా, క్రికెట్ కామెంటేటర్ గా ఇలా అన్ని రోల్స్ లో నందు తనదైన పెర్ఫామెన్స్ తో అందరినీ ఆకట్టుకుంటూ ఉన్నాడు. ఇక ఢీ న్యూ సీజన్ కోసం ఆల్రెడీ ప్రిపరేషన్ మొదలయ్యింది. దాంతో నందు కూడా డాన్స్ నేర్చుకుంటూ ఇరగదీసేస్తున్నాడు. రీసెంట్ గా ఒక డాన్స్ పెర్ఫార్మెన్స్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. డాన్స్ నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి..అని నందు అడిగేసరికి...చాలా మంది చాలా కామెంట్స్ పెట్టేసారు. ఇక నెటిజన్స్ ఐతే వేరే లెవెల్ లో కామెంట్స్ చేస్తున్నారు. ప్రతీ ఒక్క నెటిజన్ కి నందు ఆన్సర్ చేయడం మనం చూడొచ్చు.. కొన్ని కామెంట్స్ ఎలా ఉన్నాయంటే "ప్రభుదేవా ఎందుకు పనికి రాడు బ్రో అనే కామెంట్ కి షెడ్డుకు పంపేసేలా ఉన్నావు బ్రో అంటూ నందు రిప్లై ఇచ్చాడు. ఒకే ఇంట్లో సింగర్ అండ్ డాన్సర్ ఉన్నారు. మీరు ఢీ కంటెస్టెంట్ గా ఎందుకు చేయకూడదు ? అన్న ప్రశ్నకు ఎందుకంటే యాంకర్ గా చేస్తున్న కాబట్టి అన్నాడు. ఫస్ట్ టైం ఒక యాక్టర్ కామెంట్స్ కి రెస్పాండ్ కావడం..నందు ఆన్ ఫైర్, ఇండస్ట్రీ సూపర్ స్టార్, నిన్న ప్రాక్టీస్ ఈరోజు లైవ్..ఆసమ్, ఎందుకు ఇంత అందంగా పుట్టారు " అంటూ కామెంట్స్ చేశారు. ఇక సోమేష్ మాష్టర్ ఐతే సూపర్ అన్న అంటూ కామెంట్ పెట్టాడు.

దయచేసి లైవ్ యానిమల్స్ ని గిఫ్ట్ చేయడం.కొనడం చేయొద్దు..అడాప్ట్ చేసుకోండి..

  బుల్లితెర యాంకర్ గా రష్మీ గౌతమ్ కి ఉన్న పాపులారిటీ గురించి చెప్పక్కర్లేదు. ఆమె యాంకర్ గా, యాక్టర్ గా చేసింది. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ వంటి షోస్ ని హోస్ట్ చేస్తోంది. వీటికన్నా కూడా ఆమెకు పెట్స్ మదర్ అని మరో పేరు కూడా ఉంది. ఆమెకు పెట్స్ అంటే ఇష్టం. వాటి కోసం ఏమైనా చేస్తుంది. ఆల్రెడీ గతంలో ఆమెకు ఒక పెట్ డాగ్ ఉండేది. దాని పేరు చుట్కి గౌతమ్. ఐతే అది చనిపోయింది. దాని ఆస్తికాల్ని కూడా గోదాట్లో కలిపింది. ఇక ఇప్పుడు మరో పెట్ డాగ్ ఆమె ఇంటికి వచ్చింది. అది కూడా చాలా క్యూట్ గా బ్రౌన్ కలర్ లో ఉంది. ఆ పెట్ డాగ్ తో తన పిక్స్ ని ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది రష్మీ. "నాకు ఇంకో అనుబంధం కానీ ఇంకో స్టోరీ కానీ వద్దు అనుకుంటున్నాను. అదృష్టం కొందరికే అనుకూలంగా ఉంటుంది ఇంకా వాడు అదృష్టవంతుడు..దయచేసి లైవ్ యానిమల్స్ ని గిఫ్ట్ చేయడం కానీ కొనడం కానీ చేయకండి. ఆర్థికంగా అలాగే భావోద్వేగాల పరంగా పెట్స్ తో 15 ఏళ్ళ అనుబంధం ఉంటుంది. అలాంటి కమిట్మెంట్ ఉన్నప్పుడు పెట్స్ అడాప్ట్ చేసుకోండి కానీ కొనద్దు" అంటూ ఒక పోస్ట్ పెట్టింది. ఇక యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహా ఐతే "ఈ పప్పీ క్యూట్ గా ఉంది" అని కామెంట్ చేసాడు. ఇంకో నెటిజన్ ఐతే "పెంపుడు జంతువులకు తల్లిగా ఉన్నందుకు ధన్యవాడు. ఒక పెట్ చనిపోయాక మరో పెట్ ని ఇంటికి తెచ్చుకోవడం కొంచెం కష్టమే కానీ ఇలాంటి పెట్స్ కి మీ ఇల్లు మంచి ప్లేస్ అనుకుంటున్నాను. మీరు ఎల్లప్పుడూ నాకు స్ఫూర్తినిస్తారు, మీ గురించి తలుచుకుంటే  గర్వంగా ఉంది..మీ అభిమానిగా ఉండటం గర్వంగా ఉంది." అంటూ ఒక పోస్ట్ పెట్టారు. ఇంకా కొంతమంది ఐతే "సూపర్ మేడం యు అండ్ యువర్ పెట్ ..మంచి మెసేజ్ ఇచ్చారు. మంచి కాప్షన్ " అంటూ కామెంట్స్ చేశారు.

బిఆర్ఎస్ ఎంఎల్సి కవితతో యష్, సోనియా...తొలి బోనం ఎత్తిన సోనియా ఆకుల

  ఆషాఢ మాసం సందర్భంగా బోనాల పండగ జాతర సంబరాలు షురూ అయ్యాయి. ఎటు చూసినా ఫెస్టివల్ వైబ్స్ కనిపిస్తున్నాయి. బోనాలు అంటే బోనం ఎత్తడం ముఖ్యం. ఇక రీసెంట్ గా తెలంగాణాలోని గోల్కొండ కోట మీద వెలసిన జగదాంబిక ఎల్లమ్మ తల్లి ఆలయంలో  తొలి బోనంతో సందడి మొదలయ్యింది. ముందుగా మహంకాళి, ఎల్లమ్మ తల్లికి తొలి బోనం సమర్పించారు బిఆర్ఎస్ ఎంఎల్సి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. ఈమెతో పాటు ఈ బోనాల జాతరలో యష్ వీరగోని, సోనియా ఆకుల కలిసి మొదటి బోనం ఎత్తారు. ఈ విషయాన్నీ సోనియా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. "ఫస్ట్ బోనం ఎత్తడం నిజంగా ఆ దైవ సంకల్పం. బోనాల పండగ మీ జీవితాల్లో సంతోషాల్ని తేవాలనుకుంటున్నాను" అంటూ పోస్ట్ చేసింది. అలాగే వీళ్ళిద్దరూ బోనం ఎత్తి అలా నడుచుకుంటూ వెళ్లడాన్ని కూడా చూపించింది సోనియా. కవితతో కలిసి ఉన్న పిక్స్ ని సోనియా పోస్ట్ చేసింది. ఇక సోనియా మూవీస్ లో కూడా నటించింది. జార్జ్ రెడ్డి మూవీలో హీరో సిస్టర్ గా నటించింది. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఆశ ఎన్కౌంటర్, కరోనా వైరస్ వంటి మూవీస్ లో కూడా నటించింది. ఆమె ఒక స్వచ్చంద సంస్థ పెట్టి ఆడపిల్లలకు అండగా నిలిచింది. బిగ్ బాస్ 8 సీజన్ తో మంచి పేరు తెచ్చుకుంది సోనియా. ఇక యష్, సోనియా పెళ్ళికి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంతా కూడా వచ్చారు.  

Bigg Boss 9 Telugu Promo : ఈ సారి చదరంగం కాదు రణరంగమే!

  బిగ్ బాస్ తెలుగు అప్టేడ్ వచ్చేసింది.. అదే ప్రోమో వచ్చేసింది. ఇప్పటికే బిగ్ బాస్ ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకుంది. ఏడవ సీజన్లో పల్లవి ప్రశాంత్, ఎనిమిది సీజన్లో నిఖిల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక తొమ్మిదో సీజన్లో కంటెస్టెంట్స్ ఎవరుంటారు.. జడ్జ్ ఎవరు అనే క్యూరియాసిటి నిన్నటి వరకు అందరిలో ఉంది. కానీ నిన్న రిలీజ్ అయిన ప్రోమోతో ఆ డౌట్లన్నీ క్లియర్ అయ్యాయి. నాగార్జున హోస్ట్ గా తాజాగా ఓ ప్రోమో విడుదల చేశారు మేకర్స్. అందులో నాగార్జున ఓ పెద్ద సుత్తి పట్టుకొని వచ్చాడు. ఆటలో అలుపు వచ్చినంత సులువుగా గెలుపు రాదు.. ఆ గెలుపు రావాలంటే యుద్ధం చేస్తే సరిపోదు.. కొన్నిసార్లు ప్రభంజనం సృష్టించాలి అని నాగార్జున చెప్పాడు. ఇక ప్రోమో చివర్లో  ఈ సారి చదరంగం కాదు రణరంగమే అంటు  ఫైనల్ టచ్ ఇచ్చేశాడు.  ఈ ప్రోమోని బట్టి చూస్తే గత సీజన్లోతో పోలిస్తే గేమ్స్ అండ్ పోటీ ఎక్కువగానే ఉండేట్టుగా ఉంది. ఇక ఆట డోస్ పెంచేట్టుగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికైతే  ఈ సీజన్ కి హోస్ట్ నాగార్జున అని క్లారిటీ వచ్చేసింది. ఇక ఎప్పుడు మొదలవుతుంది.. కంటెస్టెంట్స్ ఎవరు అనేది తెలియాల్సి ఉంది. అయితే ప్రోమోని బట్టి చూస్తే మరో మూడు వారాల్లో బిగ్ బాస్-9(Bigg Boss 9 Telugu) ప్రారంభం అయ్యేలా ఉంది. ఇక ఈ ప్రోమో యూట్యూబ్ లో ఇప్పటికే అత్యధిక వ్యూస్ ని తెచ్చుకుంది.   

బాబోయ్ ఏంటి వీళ్ళు..బుల్లితెర నటులా చిల్లర ఏరుకునే వాళ్ళా

  ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఆదివారం షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇది కూడా బోనాల్ స్పెషల్ గా రాబోతోంది. దాంతో షోకి వచ్చిన వాళ్లంతా హోమ్లీ కాస్ట్యూమ్స్ తో వచ్చారు. శోభా శెట్టి, ప్రేరణ, అంబటి అర్జున్, కావ్య శ్రీ, శివ్, ప్రియాంక జైన్ ఇలా చాలా మంది టీవీ ఆర్టిస్టులు వచ్చారు. శ్రీముఖి ఒక ముంత తీసుకొచ్చి దీన్ని కింద పడేస్తే ఆ ఊరోళ్లు, ఈ ఊరోళ్లు ఎవరు చిల్లర ఏరుకుంటారో చూస్తా అంటూ ఒక టాస్క్ అనౌన్స్ చేసింది. వెంటనే శ్రీముఖి కౌంట్ డౌన్ స్టార్ట్ చేసి ముంతను కిందపడేసి రేంజ్ లో ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. కానీ పడేయకుండా అందరినీ వెంట తిప్పుకుంది. అంబటి అర్జున్ టీమ్ వెంటనే చిల్లర ఏరుకోవడానికి వచ్చేసరికి ఇమ్మానుయేల్ వచ్చి వాళ్ళ టీమ్ చిల్లగాళ్ళని చెప్పానా అంటూ కౌంటర్ వేసాడు. ఫైనల్ గా లేడీస్ ని తన వెంట తిప్పుకున్న శ్రీముఖి ఆ ముంతను కింద పడేసింది. దాంతో శోభా శెట్టి, ప్రేరణ ఐతే చిల్లర ఏరుకున్న తీరు చూసి ఎవ్వరైనా షాకవ్వాల్సిందే. "ప్రేరణకు చిల్లర ఏరుకోవడంలో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు ఉంది.. నాకు ఈ ఆట చూసాక అర్ధమయ్యింది..నార్మల్ పర్సన్స్ ఎవరూ కూడా ఇలా చిల్లర ఏరరు " అన్నాడు ఇమ్మానుయేల్. "ప్రేరణ, శోభా మాత్రం జీవితం ఈ చిల్లర ఏరడమే వాళ్ళ గోల్" అన్నట్టుగా ఏరుకున్నారు అంటూ శ్రీముఖి చెప్పింది. "అసలు ఈ చిల్లరే వాళ్ళ పేమెంట్ లా బిహేవ్ చేశారు" అని మళ్ళీ కౌంటర్ పేల్చాడు ఇమ్ము. దాంతో శోభా ముఖం మూసుకుని తెగ నవ్వుకుంది.  

డ్రామా జూనియర్స్ ఎపిసోడ్స్ కింద కామెంట్స్ పెట్టిస్తున్న సుధీర్..

డ్రామా జూనియర్స్ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో బోనాల స్పెషల్ తో రాబోతోంది. ఇందులో ప్రోమో స్టార్టింగ్ లో పంచ్ లు పేలిపోయాయి. అందరూ కొత్త కొత్త కాస్ట్యూమ్స్ తో అలరించారు. ఇక సుధీర్ రోజాకి ప్రసాదం తినిపించాడు. బోనాలతో ఈ వీకెండ్ ఎంటర్టైన్మెంట్ కి నో ఎండ్ అన్నాడు సుధీర్. "బోనాల గురించి ఎవరికైనా తెలుసా" అని సుధీర్ అడిగాడు. దానికి లాస్య వెరైటీ ఆన్సర్ ఇచ్చింది. "పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ చేయాలి. మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి. మళ్ళీ డిన్నర్ గురించి ఎం చేసుకోవాలి అన్నది ప్రేపరషన్" అంటూ అమాయకంగా చెప్పింది. బోనాల గురించి చెప్పమంటే భోజనాల గురించి చెప్తావేంటమ్మా అంటూ సుధీర్ లాస్య మీద కౌంటర్ వేసాడు. బోనాలు అంటేనే డ్రామా జూనియర్స్ గుర్తు రావాలి అన్నాడు. తర్వాత రోజా చేరుకోల సుధీర్ కి ఇచ్చి "దీంతో కొట్టుకుంటే మోత మోగి పోవాల్సిందే" అంది. టెలికాస్ట్ అయ్యిందిగా ఎపిసోడ్ దాని కింద ఎన్ని కామెంట్స్ ఉంటే అన్ని దెబ్బలు కొట్టుకుంటే చాలు" అంది. "ఏంటి 364 కామెంట్సా" అని షాకయ్యాడు సుధీర్. "ఇలా అని తెలిస్తే అన్ని కామెంట్స్ పెట్టించేవాడివి కాదు కదా" అంటూ పక్కనుండి మరో కౌంటర్ వేశారు అనిల్ రావిపూడి. ఇక ఈ డ్రామా జూనియర్స్ లో చిచ్చర పిడుగు ఇర్య సుబ్రహ్మణ్యం ఐతే కర్ర తీసుకుని అనిల్ రావిపూడిని, రోజాని, సుధీర్ ని కొట్టేసింది. సుధీర్ ని ఏ,బి,సి,డిలు ఎన్ని అని అడిగింది. 26 అని చెప్పాడు. కాదు 4 అని చెప్పి బాది పారేసింది. సుధీర్ ఐతే కుయ్యో మొర్రో అంటూనే ఉన్నాడు.  

Illu illalu Pillalu: ఊళ్లో దొంగలు పడ్డారు.. శ్రీవల్లి దొరికిపోయిందిగా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-195 లో.. ధీరజ్, ప్రేమ ఎగ్జామ్ రాసాక.. ప్రేమ తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంది. నా ఆర్థిక పరిస్థితి బాలేదని ప్రేమ అనగా.. అదేంటే మాకు ఎంతో సహాయం చేశావ్.. లక్షల్లో ఫీజు కట్టావ్.. ఇప్పుడేంటి ఇలా మారిపోయావని ప్రేమ స్నేహితురాలు అనగానే.. అందరి రాత ఒకేలా ఉండదని చెప్పి వెళ్ళిపోతుంది ప్రేమ. ఇక అదంతా ధీరజ్ విని బాధపడతాడు. ఇక మరోవైపు రామరాజు దగ్గరికి తిరుపతి వచ్చి.‌ ఊళ్ళో జరిగిన దొంగతనాల గురించి చెప్తాడు. దొంగలు పది ఇళ్ళకి పైగా దోచుకున్నారని తిరుపతి చెప్పగానే డబ్బులన్నీ బ్యాంకులో వేసి రమ్మంటాడు.  నగలు కూడా వేయాలని వేదవతి అంటుంది‌. ఆ మాటతో శ్రీవల్లి గుండెల్లో రాయి పడిపోతుంది. అవునండీ.. నా నగలు, పిల్లలు నగలు, కోడళ్ల నగలు బోలెడన్ని ఉన్నాయి.. దొంగలు పడి వాటిని పట్టుకుని వెళ్తే ఏంటి పరిస్థితి అని వేదవతి అంటుంది. అవును కదా.. ఆ విషయమే మర్చిపోయాను. పైగా వల్లీ వాళ్ల అమ్మ గారు చాలా నగలు పెట్టారు. పొరపాటున ఆ నగలు మన ఇంట్లో ఉన్నప్పుడు పోతే మనకే చెడ్డపేరు.. రేపే నీ నగలు, కోడళ్ల నగలు, వల్లీ నగలు తీసుకుని వెళ్లి బ్యాంక్‌లో పెట్టేయ్ అని అంటాడు రామరాజు. మామయ్య గారు చెప్పింది వినిపించింది కదా.. నగలన్నీ తీసి రెడీగాపెట్టమని వేదవతి అంటుంది. వామ్మో ఆ నగలు గిల్టు నగలు అని తెలిస్తే.. నా బండారం మొత్తం బయటపడిపోతుందంటూ శ్రీవల్లి ఏడుపు మొదలుపెడుతుంది. ఇక గదిలోకి వెళ్ళిన శ్రీవల్లి.. భాగ్యానికి ఫోన్ చేస్తుంది. తన ఫోన్ పనిచేయకపోవడంతో.. ఏం చేయాల్రా దేవుడా.. మా యమ్మ అబద్దాల మీద అబద్దాలు చెప్పి.. మోసాల మీద మోసాలు చేసి నా పెళ్లి చేసి పారేసింది. అవన్నీ నా మెడకి పాములా చుట్టేశాయి. ఈ నగల్ని లాకర్‌లో పెడితే అడ్డంగా దొరికిపోతానే అంటూ శ్రీవల్లి తలపట్టుకుంటుంది. ఇంతలో పెద్దోడు చందు వచ్చి.. అక్కడున్న నగల్ని చూస్తాడు. ఏంటి ఇవి బయటపెట్టావని ఆశ్చర్యంగా అడుగుతాడు. ఏం లేదు బావా.. ఊరికనే ఒకసారి చూసుకుందాం అని పెట్టానులే అని అంటుంది. హో సరదాగానా? సర్లే కానీ.. ఊరిలో దొంగలు పడ్డారని.. మన ఇంట్లో నగలు జాగ్రత్త అని పెద్దోడు అంటాడు. ఆ దొంగ వెధవలు.. ఈ ఇంట్లో పడి.. వీటిని ఎత్తుకుపోతే ప్రశాంతంగా ఉండేదాన్ని అని శ్రీవల్లి అనుకుంటుంది.  సర్లే కానీ.. మీ అమ్మని పది లక్షలు అడగమని చెప్పాను కదా.. ఏమైంది.. ఇప్పుడు ఇస్తుందని అడుగుతాడు పెద్దోడు. ఫోన్ చేశాను బావా కలవగానే అడుగుతానని శ్రీవల్లి అంటుంది. మీ అమ్మ ఎప్పుడు ఇస్తుందో ఏమో కానీ.. ఆ సేటు ఎప్పుడు మా ఆఫీస్‌కి వచ్చి డబ్బులు అడుగుతాడోనని భయంగా ఉంది. రేపటి వరకూ చూస్తాను.. మీ అమ్మ వాళ్లు డబ్బులు ఇచ్చారా సరేసరి లేదంటే నేనే ఉదయాన్నే డబ్బుల కోసం మీ ఇంటికి వెళ్తానని తెగేసి చెప్తాడు. దాంతో తలపట్టుకున్న శ్రీవల్లి.. ఓ వైపు నగల టెన్షన్.. ఇంకో వైపు పది లక్షల టెన్షన్.. ముందు చూస్తే నుయ్యి.. వెనక చూస్తే గొయ్యి.. టెన్షన్ తోనే పోయేట్టు ఉన్నాను దేవుడు.. ఈ ప్రమాదం నుంచి ఎలా గట్టెక్కుతానోనని ఏడుస్తుంది శ్రీవల్లి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : చెల్లెలి కోసం దశరథ్ పరుగు.. దీపని ఆపేసిన జ్యోత్స్న!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -394 లో..... కార్తీక్ దీప ఇద్దరు పారిజాతం చేసిన పని గురించి ఇంటికి వచ్చి కాంచనకి చెప్తారు. మంచిగా బుద్ది చెప్పావని కాంచన, అనసూయ హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ మేనకోడలు ఇలాంటివి ఎన్ని చేస్తుందని అనసూయ అనగానే.. అలా అనకు అక్క.. నాకు మేనకోడలు అంటే దీపనే అని జ్యోత్స్న కాదని కాంచన అంటుంది. ఆ తర్వాత కార్తీక్ కార్ క్లీన్ చేస్తుంటే అప్పుడే జ్యోత్స్న వచ్చి మాట్లాడుతుంది. తనకి కౌంటర్ ఇచ్చేలా కార్తీక్ మాట్లాడుతాడు.‌నీ మాటల్లో ఏదో తేడా ఉంది బావ. బయటకు వెళ్ళాలి బావ కార్ తియ్ అని జ్యోత్స్న అనగానే పెట్రోల్ లేదని కార్తీక్ అంటాడు. అయితే కొట్టించుకొని తీసుకొని రా అని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత కాంచనకి చెప్పి అనసూయ బయటకు వెళ్తుంది. కాంచన వీల్ చైర్ నుండే బూజు దులుపుతు ఉంటుంది. అప్పుడే అదుపు తప్పి కింద పడిపోయి.. తలకి రక్తం వస్తుంది. దీపకి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్తుంది కాంచన. దాంతో దీప బయల్దేరబోతుంటే జ్యోత్స్న ఆపుతుంది. ఇలా అత్తయ్యకి దెబ్బ తగిలిందని అనగానే.. నువ్వు చెప్పేది అబద్ధం.. మరి ఒకసారి అత్తయ్యకి చెయ్ అని జ్యోత్స్న అంటుంది. కాంచనకి దీప కాల్ చేసేసరికి తన ఫోన్ స్విచాఫ్ వస్తుంది. నువ్వు చెప్పేది అబద్దం అని దీపని బయటకు రాకుండా చేసి బయటున్నా కార్తీక్ ని తీసుకొని బయటకు వెళ్తుంది జ్యోత్స్న. దీప మాటలు దశరథ్ విని చెల్లికి ఏమైంది.. దీప చెప్పేది నిజమేనా అని కంగారుగా కాంచన దగ్గరికి దశరథ్ బయల్దేరతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : బ్రహ్మముడి సీరియల్ లో కీలక మలుపు.. ఆ రేవతి ఎవరు?

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -758 లో..... స్వప్నని కాపాడడానికి కావ్య వెళ్తుంది. అప్పుడే రాజ్ ఫోన్ చేసి ఇంకా ఎప్పుడు ఇంటికి వస్తారని అడుగుతాడు. నాకు కొంచెం టైమ్ పడుతుందని కావ్య అనగానే.. ఏంటి కంగారుగా మాట్లాడుతున్నారు.. ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే చెప్పండి అని రాజ్ అడుగుతాడు. అదేం లేదని కావ్య అంటుంది. రాజ్ దగ్గరికి అపర్ణ, ఇందిరాదేవి వస్తారు. తను ఎదో ప్రాబ్లమ్ లో ఉందని రాజ్ అనగానే.. తనకి ఎప్పుడు ప్రాబ్లమ్ వైఫ్ వైఫై లాగా తిరుగుతుందని ఇందిరాదేవి అంటుంది. మరొకవైపు స్వప్న వెళ్ళిన కార్ దగ్గర కి కావ్య వెళ్లి చూసేసరికి స్వప్న ఉండదు. కావ్యకి ఇంకా టెన్షన్ అవుతుంది. ఆ తర్వాత స్వప్న వెంట రౌడీలు వస్తుంటే తను ఒక దగ్గర దాక్కొని ఉంటుంది. ఒక రౌడీ స్వప్నని చూసి తనని చంపడానికి వస్తుంటే అప్పుడే కావ్య వచ్చి కాపాడుతుంది. స్వప్నని తీసుకొని కావ్య పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అంతలో ఒకావిడ స్వప్న, కావ్యలని లోపలికి లాక్కొని డోర్ వేస్తుంది. ఆ కాపాడిన ఆమె పేరు రేవతి.. మీ వాళ్ళు ఎలా ఉన్నారని కావ్య వాళ్లని రేవతి అడుగుతుంది. మా వాళ్ళు మీకెలా తెలుసని కావ్య అడుగగా.. నాకు తెలుసు అంటూ చెప్తుంది.  మీ అత్త అపర్ణ గారు చాలా మంచివారు.. ముక్కు మీద కోపం ఉంటుంది కానీ మంచిదని కావ్యతో రేవతి అంటుంది. రేవతి ఎమోషనల్ గా మాట్లాడుతుంటే.. తనకి దుగ్గిరాల కుటుంబంతో ఏదో సంబంధం ఉందని క్లియర్ గా అర్థమవుతుంది. మరొకవైపు అప్పుకి కావ్య ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.