ములక్కాడ తిను నీ కళ్ళు బయటికొస్తాయి..

  స్టార్ మాలో రీసెంట్ గా "కూకు విత్ జాతిరత్నాలు" పేరుతో ఒక కుకింగ్ షో స్టార్ట్ అయ్యింది. ఇక ఇప్పుడు నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ప్రతీ శని, ఆదివారాల్లో ఈ షో ప్రసారమవుతుంది. లేటెస్ట్ ప్రోమోలో దీక్ష పంత్ చేసిన కామెంట్స్ ఫుల్ వైరల్ అవుతున్నాయి. "మీకు అసలు సిసలైన ఫుల్ మీల్స్ ని రెడీ చేసాం" అన్నాడు ప్రదీప్. రాగానే జడ్జ్ ఆశిష్ విద్యార్థి రాధా మీద మంచి కామెంట్ చేసాడు. "ప్రదీప్ వండర్స్ ఎన్ని" అనేసరికి సెవెన్ అన్నాడు కాదు ఎయిట్ అది రాధమ్మ స్మైల్ ప్రదీప్ అనేసరికి రాధ పగలబడి నవ్వేసింది. ఇక కిచెన్ రూకీస్ పేరుతో అవినాష్, దీక్ష పంత్, విష్ణు ప్రియా, బిత్తిరి సత్తి, ఆర్జే హేమంత్ వచ్చారు. "జడ్జెస్ మీరు దీక్ష గారు గుర్తు ఉన్నారు కదా షో లాంచ్ లో మంచి టిప్స్ ఇచ్చారు" అన్నాడు. "గోంగూర తింటే గోల్స్ రీచ్ అవుతారు" అని చెప్పింది దీక్ష. "ఈవిడ ఆ టిప్ చెప్పాక గోంగూరకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది సర్" అన్నాడు ప్రదీప్. "నాకు తెలుసు ప్రదీప్" అంది. "నేనే జోక్ వేసాను దానికి ఎక్స్టెన్షన్ జోక్ వేసింది" అంటూ దీక్ష మీద కామెడీ కౌంటర్ వేసాడు ప్రదీప్.  "అవును ప్రదీప్ ఏంటి మీ కళ్ళు కొంచెం లోపలి వెళ్లాయి" అంది దీక్ష. "ఏమన్నా టిప్స్ ఉన్నాయా" అని అడిగాడు. "ములక్కాడ తిను కళ్ళు బయటకు వస్తాయి" అని చెప్పింది. తర్వాత కుకింగ్ లెజెండ్స్ పేరుతో ప్రియా, విజె సన్నీ, యష్మి, ప్రభాకర్ వచ్చారు. "మీరు వంటల్లో అదుర్స్, మా జాతిరత్నాలు వంటల్లో బెదుర్స్" అని జడ్జ్ సంజయ్ తుమ్మ చెప్పేసరికి "సర్ మేము వంటల్లో ముదుర్స్" అంటూ ప్రియా రివర్స్ డైలాగ్ వేసింది.  

బిగ్ బాస్ షో పై రాజా రవీంద్ర కామెంట్స్

కాకమ్మ కథలు షో ఫినాలే ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి నవీన్ చంద్ర, రాజా రవీంద్ర వచ్చారు. ఇక వీళ్ళ మధ్య నడిచిన కాన్వర్జేషన్ మరీ డబుల్ మీనింగ్ గా సాగింది. "నవీన్ చంద్ర మీరు అనవసరంగా రాజా రవీంద్రతో రావాల్సి వచ్చినందుకు సో సారీ..సీజన్ 3 లో మళ్ళీ పిలుస్తాను" అని చెప్పింది. ఇక రాజా రవీంద్రతో ఎం అన్నదంటే "రాజా రవీంద్రను చిన్నప్పటి నుంచి చూస్తున్నా కానీ నాకు ఆయన షేడ్స్ అర్ధం కావడం లేదు. ఒక మనిషిని చూస్తే ఆయన ఈ రోల్ అయ్యుంటుంది అని మనం అనుకుంటాం. మీరు ఏ రోల్ చేసినా అలాగే ఉండదు" అంది తేజు. "జనాలు నన్ను ఒక ఇమేజ్ లో చూస్తారుగా క్యారెక్టర్ లో అది ఉండదు. "మనిద్దరం కలిసి ఒక సినిమా చేసాం ఐతే క్యారవాన్ లోంచి నువ్వు బయటకు రాలేదు." అని రాజా రవీంద్ర అనేసరికి "మీరు క్యారవాన్ రాలేదా ఐతే" అని కౌంటర్ వేసింది తేజు. "సోషల్ మీడియా లేక ముందు మీరే సోషల్ మీడియా మీకు గుర్తుందా " అని అడిగింది తేజు. దానికి రాజా రవీంద్ర పడీ పడీ నవ్వేసాడు. "మీరు తెలియకుండా జనాలు మీ గురించి ముందే అనుకునే ఒక నిజమైన విషయం ఏంటి" అని అడిగింది. "అదే ఈడికి నోటి దూల అని" అన్నాడు. "అవును ఇది నిజమే" అంది తేజు. తర్వాత రాపిడ్ ఫైర్ అడిగేసరికి "నిజానికి మీరు లైఫ్ లో రాపిడ్ ఫైర్ ఆడుతున్నారు. కానీ అది ఎవరికీ తెలియడం లేదు" అంది తేజు. "ఒకవేళ మీరు బిగ్ బాస్ కి వెళ్లి ఉంటే మీరు సర్వైవ్ అయ్యేవాళ్ళా " అని అడిగింది. "వాళ్ళు సర్వైవ్ అయ్యేవాళ్ళు" అని చెప్పాడు రాజా రవీంద్ర. రాజా రవీంద్ర ఎన్నో మూవీస్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసాడు, చేస్తున్నాడు. అలాగే మూవీస్ కి డబ్బింగ్ కూడా చెప్తూ ఉంటాడు.  

అరేయ్ చూడండిరా...కీర్తి సురేష్ గారు నన్ను పొగిడారు..

  సుహాస్ బిగ్ స్క్రీన్ మీద ఆచి తూచి మంచి మూవీస్ చేస్తూ ఉంటాడు. ఆయన చేసే మూవీస్ తో ఇండస్ట్రీకి ఒక ప్రామిసింగ్ హీరోగా మారిపోయాడు. కలర్ ఫోటో, ప్రసన్న వదనం, రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఇలాంటి ఆడియన్స్ కి నచ్చే ఎన్నో మూవీస్ చేసాడు. ఐతే సుహాస్ మీద ఇంత వరకు నెగటివ్ ట్రోలింగ్ అనేది ఆడియన్స్ నుంచి ఎప్పుడూ ఎదురుకాలేదు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రమే తిడుతూ ఉంటారట. ఇక రీసెంట్ కీర్తి సురేష్, సుహాస్ సుమ చాట్ షోకి వచ్చారు. "పవన్ కళ్యాణ్ , ప్రభాస్ అవకాశం వస్తే వీళ్లల్లో ఎవరితో డైరెక్షన్ చేస్తారు" అని సుమ అడిగింది.  "వామ్మో నేను అంత రిస్క్ చేయలేను, టెన్షన్ పడలేను..డైరెక్షన్ మానేసి ఇంటికి వెళ్ళిపోతాను. నేను నిజంగా డైరెక్షన్ చేస్తే నాని అన్నతో చేస్తాను. డైరెక్షన్ అవ్వాలని ఉంది. కానీ హీరోగా చేయడం బాగుందని ఇలా ఉండిపోయాను." అని చెప్పాడు సుహాస్. "సుహాస్ మీకు హేటర్స్ ఉంటే వాళ్లకు ఎం చెప్తారు" అని అడిగింది సుమ. "మీకు హేటర్స్ ఉన్నారా..సుహాస్ కి హేటర్సా..." అని షాకయ్యింది కీర్తి సురేష్. "లేదక్కా హేటర్స్ ఉంటే నా ఫ్రెండ్స్ లోనే ఉంటారు. నన్ను బయట ఎవరూ ఏమీ అనరు కానీ నా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. ఛీ అదేం యాక్టింగ్ అంటూ తిడతారు. నా ఫ్రెండ్సే నా హేటర్స్ " అన్నాడు సుహాస్.."చూడండిరా కీర్తి సురేష్ గారు కూడా పొగుడుతున్నారు. మీకేమొచ్చిందిరా నాయనా" అని నవ్వుతూ చురక అంటించాడు.    

Illu illalu pillalu : ధీరజ్ గురించి ఇంట్లో చర్చ.. అతని కోసం ఎదురుచూస్తూ ప్రేమ!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -199 లో.....రామరాజు వాళ్లంతా రాత్రి భోజనం చేస్తుంటారు. ధీరజ్ ఇంకా ఇంటికి రాకపోవడంతో ఎక్కడికి వెళ్ళాడని వేదవతిని రామరాజు అడుగుతాడు. నాకేం తెలియదని వేదవతి అంటుంది. నర్మద, సాగర్ కి ధీరజ్ గురించి తెలిసి ఉంటుందని శ్రీవల్లి అనగానే  నర్మద, సాగర్ ఇద్దరు టెన్షన్ పడతారు. మాకేం తెలియదని సాగర్, నర్మద చెప్తారు. మరొకవైపు ధీరజ్ గురించి గుమ్మం దగ్గరే ఎదురుచూస్తుంటుంది ప్రేమ. అదే సమయంలో వేదవతి, నర్మద మాట్లాడుకుంటుంటే.. రామరాజుకి చూపిస్తుంది శ్రీవల్లి. దాంతో అక్కడికి వచ్చిన రామరాజు.. ఏంటి ఏం మాట్లాడుకుంటున్నారు.. ధీరజ్ ఎక్కడికి వెళ్ళాడో తెలుసా అని అడుగుతాడు. వాళ్ళు తెలియదని అంటారు. ఏమో నా వెనకాల జరుగుతుంది కానీ చెప్పట్లేదని రామరాజు అంటాడు. ఆ తర్వాత ప్రేమ దగ్గరికి వేదవతి వస్తుంది. నువ్వు మళ్ళీ మాకు తెలియకుండా ఏదైనా జాబ్ చెయ్యాలనుకుంటున్నావా ఇప్పటికే మీ మావయ్య గారు నా వల్ల ఇన్నాళ్లుగా మాటలు పడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ నీ వల్ల మాటలు పడేలా చెయ్యకని వేదవతి అంటుంది. అలాంటి ప్రయత్నం ఏం చెయ్యనని నాకు మాటివ్వు అనగానే వేదవతికి‌ ప్రేమ మాటిస్తుంది. మరొకవైపు ధీరజ్ డే అంతా ఫుడ్ డెలివరీ చేసి రాత్రి డ్రైవింగ్ చేస్తుంటాడు. ధీరజ్ వచ్చేసరికి ప్రేమ గుమ్మం ముందు ఉంటుంది. నాకు నిద్రొస్తుందంటూ ధీరజ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కాస్త అన్నం తినమని ప్రేమ రిక్వెస్ట్ చేస్తుంది. కానీ నాకు నిద్రొస్తుందంటూ ధీరజ్ వెళ్లి పడుకుంటాడు. అప్పుడే ధీరజ్ కాలికి ఉన్న దెబ్బని ప్రేమ చూసి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. మరొకవైపు నర్మద చెప్పినట్టు సాగర్ గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2: బిడ్డ కోసం శివన్నారాయణ ఆత్రుత.. నిలదీసిన కాశీ!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -398 లో.... కాంచన కింద పడిపోయినందని తెలిసి తన దగ్గరికి వస్తాడు శ్రీధర్. నేను తప్పు చేశాను నన్ను క్షమించమని రిక్వెస్ట్ చేస్తాడు. అందరం కలిసి ఉందామని అడుగుతాడు శ్రీధర్. నిన్ను కావేరికి దానం చేశాను.. మళ్ళీ ఎలా తిరిగి తీసుకోవాలి.. అది జరగని పని అని కాంచన అనగానే శ్రీధర్ బాధపడతాడు. అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అలా మాట్లాడినందుకు కాంచన కూడా శ్రీధర్ వెళ్లిపోయాక బాధపడుతుంది. ఆ తర్వాత కార్తీక్, దీప ఇద్దరు శివన్నారాయణ ఇంటికి వస్తారు. ఎందుకు లేట్ అయింది. అయిన ఒకరు ఇంట్లో ఉండొచ్చు కదా ఇంట్లో బాలేని మనిషి ఉన్నారు కదా అని శివన్నారాయణ అనగానే.. మా అమ్మ ఇప్పుడు బానే ఉంది కావాలంటే ఫోటో చూడండి అని కాంచన ఫోటోని కార్తీక్ చూపిస్తుంటే శివన్నారాయణ ఆత్రుతగా చూస్తాడు. కార్తీక్ ఫోటోని అలా చూపించి ఇలా తీసుకుంటాడు. ఏంటి నేను చూడలేదని శివన్నారాయణ అనగానే అవసరం ఉన్నవాళ్లు.. చూడాలనుకున్న వాళ్ళు ఇంటికి వెళ్లి చూస్తారని కార్తీక్ అంటాడు. మరొకవైపు కావేరి దగ్గరికి శ్రీధర్ వస్తాడు. కాంచన కిందపడిన విషయం గురించి శ్రీధర్ చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఇదంతా ఆ జ్యోత్స్న వల్లే అని శ్రీధర్ అంటాడు. దీప అక్క ఏం చేసిందని కాశీ అంటాడు. వాళ్ళిద్దరి గొడవ‌ వల్లే నా భార్య ఇబ్బంది పడుతుందని శ్రీధర్ అంటాడు. ఆ తర్వాత శివన్నారాయణ ఇంటికి కాశీ వెళ్లి జ్యోత్స్న చేసిన తప్పు గురించి నిలదీస్తాడు. నువ్వేంటి రా బయటకు వెళ్ళు అని శివన్నారాయణ అంటాడు. మమ్మీ చూసావా.. నేను దీపకి సారీ చెప్పాను కానీ తనకు తృప్తి కాలేదు.. అందుకే కాశీనీ రప్పించిందని జ్యోత్స్న అంటుంది. నన్నెవరు రప్పించలేదని కాశీ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : అనామిక ప్లాన్ లో అప్పు బలి కానుందా.. రేవతి ఎవరు?

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -762 లో... కావ్యకి యామిని ఫోన్ చేసి.. అసలు ఆఫీస్ లో గొడవ జరిగేలా చేసిందే నేను, సిద్ధార్థ్ తో నేనే ఇదంతా చేసానని యామిని చెప్పగానే.. కావ్య షాక్ అవుతుంది. ఇక నుండి రోజు ఇలాంటి షాక్ లు తప్పవని యామిని అంటుంది. మరొకవైపు స్టేషన్ బయట ఇద్దరు యువకులు గొడవ పడుతుంటే.. అప్పు వాళ్ళని లోపలిక పిలిపిస్తుంది. ఏమైందని వాళ్ళని అడుగగా నాకు లక్ష రూపాయలు అప్పు ఇవ్వాలని ఒకతను అనగానే ఇస్తాను అంటున్నా కూడా కొడుతున్నాడని ఇంకొకతను అంటాడు. ఇస్తాను అంటున్నాడు కదా వదిలేయ్ అని అప్పు అనగానే మేడమ్ మీకు డబ్బు ఇస్తాను మీరే అతనికి ఇవ్వండి అని అతను అనగానే సరే మీరు వెళ్ళండి అని అప్పు అంటుంది. ఆ ఇద్దరు యువకులు బయటకి వచ్చి మన ప్లాన్ సక్సెస్ అని యామినికి ఫోన్ చేసి జరిగింది చెప్తారు. సరే డబ్బు పంపిస్తున్నాను అసలు అప్పు ఈ ఉచ్చులో నుండి బయటకి రాకూడదని యామిని వాళ్ళకి చెప్తుంది. ఆ తర్వాత ఇందిరాదేవితో రాజ్ మాట్లాడుతుంటే.. అప్పుడే కావ్య ఫోన్ చేస్తుంది. మీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి రండి అనగానే రాజ్ సిగ్గుపడుతూ కావ్య దగ్గరికి వెళ్లిపోతాడు. కావ్యని రాజ్ కలుస్తాడు. మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఇప్పుడు మా కంపెనీ ప్రాబ్లమ్ లో ఉంది.. మీరు మా బాస్ గా నటించాలని కావ్య అనగానే మొదట రాజ్ ఒప్పుకోడు కానీ ఆ తర్వాత సరే అంటాడు. దాంతో రాజ్ ని కావ్య హగ్ చేసుకొని థాంక్స్ చెప్తుంది. పదండి మా బాస్ లాగా మిమ్మల్ని ట్రైన్ చెయ్యాలని రాజ్ ని తీసుకొని వెళ్తుంది కావ్య. తరువాయి భాగంలో  రేవతి వాళ్ళ బాబు షూస్ కొనివ్వమని ఏడుస్తాడు. డబ్బు లేక రేవతి కొనివ్వదు. అదంతా రాజ్, కావ్య చూసి బాబు కి షూస్ తీసుకొని వస్తారు. రాజ్ ని చూడగానే రేవతి హగ్ చేసుకొని బాగున్నావారా అని అడుగుతుంది. దాంతో రాజ్, కావ్య షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

మహానటి మూవీకి నో చెప్పాను...ఎందుకంటే

  మహానటి సావిత్రి బియోగ్రఫీతో వచ్చిన మూవీ "మహానటి". అందులో కీర్తి సురేష్ అచ్చం సావిత్రిలానే నటించింది. నటించింది అనడం కంటే జీవించింది అంటే బాగుంటుంది. ఐతే ఈ మూవీ కోసం కీర్తి సురేష్ ని అప్ప్రోచ్ ఐతే నో చెప్పిందట. ఐతే ఎందుకు నో చెప్పిందో కూడా రీసెంట్ గా రిలీజ్ ఐన "చాట్ షో విత్ సుమ" ఎపిసోడ్ లో చెప్పింది. మహానటి మూవీ మొదట్లో చేయకూడదు అనుకున్నారా "అవును.. నేను ఈ మూవీకి మొదట్లో నో చెప్పాను. ఎందుకంటే అంత పెద్ద క్యారెక్టర్ ని మెప్పించగలనా అనిపించింది. ఆడియన్స్ ని నా వైపు తిప్పుకోగలనా..నేను ఏదైనా చేశా అంత మహానటి సావిత్రి గారి పేరును చెడగొడతానేమో అని భయం. కానీ నాగి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మీరు చేస్తారు కచ్చితంగా అటూ నన్ను మోటివేట్ చేశారు. వేరెవరో నా మీద అంత కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు నేనెందుకు సెల్ఫ్ కాన్ఫిడెంట్ గా ఉండకూడదు అనిపించింది. కానీ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు తెలీదు ఈ సినిమాను ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారా లేదా అని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది అని అసలు ఊహించలేదు. ప్రీమియర్ షో చూడడానికి వెళ్ళినప్పుడు మాయాబజార్ సీన్ క్లాప్స్ కొట్టారు జనాలు. అప్పుడు అర్ధమయ్యింది. ఇక్కడే క్లాప్ కొట్టారంటే థియేటర్ లో బాగుంటుంది అనుకున్నాం. ఐతే ఈ మూవీ ప్రీమియర్ చూసాక మిక్స్డ్ కామెంట్స్ చేశారు. మా నాన్న చాలా బాగా చేసావ్ అన్నారు. కానీ డాక్యూమెంటరీలా ఐపోతుందేమో అనుకుంటున్నా అన్నారు. రెండు రోజు తెల్లవారుజామున స్వప్న ఫోన్ చేసి మూవీస్ బ్లాక్ బస్టర్ అని చెప్పింది. రెండో రోజు కూడా థియేటర్ కి వెళ్లాం. నేను వెళ్లి ఎవరికీ తెలీకుండా ఒక మూలాన కార్నర్ సీట్ లో కూర్చున్నా. మహానటి అని టైటిల్ పాడినప్పుడు థియేటర్ మొత్తం అరుపులతో దద్దరిల్లి పోయింది. అప్పుడు గూస్ బంప్స్ వచ్చేసాయి. అప్పుడు తెలిసింది మూవీ హిట్ అని. అప్పుడు అర్ధమయ్యింది సావిత్రి గారిని జనాలు ఎంతగా ఆరాదించారో అని. అలా నేను ఒక మంచి సినిమా చేసాను అని తెలుసుకున్నా. " అని చెప్పింది కీర్తి సురేష్.  

నెక్స్ట్ తెలుగు ఇండియన్ ఐడల్ మీరే కావాలనుకుంటారా..ఐతే అప్లై చేసుకోండి

  తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 త్వరలో మొదలు కాబోతోంది. దాని కోసం ఇప్పుడు ఇంటరెస్ట్, ఫ్యాషన్ ఉన్న సింగర్స్ కోసం అన్వేషణ మొదలు పెట్టింది. 14 నుంచి 30 ఏళ్ళ లోపు సింగర్స్ ని ఆడిషన్స్ కోసం పిలుస్తోంది ఆహా. తమ పేర్లను రిజిస్టర్ చేసుకోమంటూ ఒక ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు. ఇక ఆహా ప్లాట్ఫారం మీద తెలుగు ఇండియన్ ఐడల్ 3 సీజన్స్ ని పూర్తి చేసుకుంది. సీజన్ 1  2022 లో జరిగింది. ఫస్ట్ సీజన్ విన్నర్ గా వాగ్దేవి నిలిచింది. ఈ సీజన్ కి హోస్ట్ గా శ్రీరామచంద్ర వ్యవహరించగా జడ్జెస్ గా నిత్యా మీనన్, కార్తీక్, థమన్ ఉన్నారు. ఇక సీజన్ 2 విన్నర్ గా సౌజన్య భాగవతుల నిలిచింది. ఈ సీజన్ హోస్ట్ గా హేమచంద్ర వ్యవహరించగా జడ్జెస్ గా గీతా మాధురి, కార్తీక్, థమన్ ఉన్నారు. అలాగే సీజన్ 3 విన్నర్ గా నసీరుద్దీన్ టైటిల్ గెలుచుకున్నాడు. ఈ సీజన్ కి హోస్ట్ గా శ్రీరామచంద్ర వ్యవహరించగా జడ్జెస్ గా గీతా మాధురి, కార్తీక్, థమన్ ఉన్నారు. ఇప్పుడు సీజన్ 4 కి సమయం వచ్చేసింది. "హలో హలో  ఎవరున్నారు? స్టార్ డంలోకి రావడానికి ఒక్క అడుగే దూరం. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 వస్తోంది..మీరు సిద్ధంగా ఉన్నారా ?" అంటూ కాప్షన్ పెట్టింది ఆహా. మరి ఈ సీజన్ ఎలా ఉండబోతోంది. సెలెక్షన్స్ ఎలా జరగబోతున్నాయి..హోస్ట్ ఎవరు, జడ్జెస్ ఎవరూ ఏ సెలెబ్రిటీ వచ్చి ఈ సీజన్ ని గ్రాండ్ లాంచ్ చేస్తారో చూడాలి.  

సూపర్ మాన్ గా ఊహించుకుంటూ ఉంటాను.. ఆర్మీలో కానీ పోలీస్ ఫోర్స్ లో కానీ ఉండేవాడిని

  మంచు విష్ణు హీరోగా రీసెంట్ గా కన్నప్ప మూవీ రిలీజ్ అయ్యింది. ఈ మూవీ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. మంచు విష్ణు, మోహన్ బాబు నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఐతే విష్ణు ఒక ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసాడు. అందులో ఇలాంటి ఇంటరెస్టింగ్ ఆన్సర్స్ చెప్పాడు. "మీకు సౌత్ ఇండియన్ డిషెస్ లో ఏది ఇష్టం" అనడంతో "దోస" అన్నాడు.  "ప్రజలు మీ గురించి అనుకునే ఏ విషయం కరెక్ట్ కాదు అని మీరు అనుకుంటారు" అన్నారు.  "ప్రజలు నన్ను గుడ్ పర్సన్  అనుకుంటారు" అనేసరికి  "అంటే మీరు గుడ్ పర్సన్ కాదా" అని రివర్స్ లో మళ్ళీ అడిగారు.  "నేను గుడ్ పర్సన్ నీ కానీ డర్టీ మైండ్ నాది " అంటూ ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు. "సండే వస్తే మంచు వారి ఇంట్లో బ్రన్చ్ ఎలా ఉంటుంది" అని అడగడంతో  "లైక్ రెస్టారెంట్ లా ఉంటుంది" అని చెప్పాడు. " ఇంట్లో ఆర్గుమెంట్స్ జరిగినప్పుడు ఎవరు గెలుస్తారు..నిజం చెప్పండి" అని అడిగారు. " నేను ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటాను" అన్నాడు. "ఏ హీరోతో నటించాలని ఉంటుంది ఎప్పుడూ మీకు" అన్నారు. " మిస్టర్ మోహన్ లాల్ " అన్నాడు.  "ఎలా ఉండాలంటే మీకు భయం.. ప్రొడ్యూసర్ ఉండడానికా లేదంటే ఒక పేరెంట్ గా ఉండడానికా" అన్న ప్రశ్నకు  "పేరెంట్ గా ఉండాలంటే భయం వేస్తూ ఉంటుంది " అన్నాడు. " మీ మొబైల్ లో అన్ రీడ్ వాట్సప్ మెసేజెస్ ఎన్ని ఉన్నాయి" అని అడిగారు. "జీరో " అని చెప్పాడు. "యాక్టింగ్ లోకి రాకపోయి ఉంటే మీరు ఈరోజున ఎం చేస్తూ ఉండేవాళ్ళు" అన్న ప్రశ్నకు "ఆర్మీలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ లో కానీ పని చేస్తూ ఉండేవాడిని" అని చెప్పాడు.  "మీలో ఎవరికీ తెలియని సీక్రెట్ టాలెంట్ ఏదైనా ఉందా" అని అడిగారు. "నేను ఒంటరిగా కూర్చుని పుస్తకం చదువుతూ ఉంటాను లేదంటే నన్ను నేను అంతకు మించి సూపర్ మాన్ గా ఊహించుకుంటూ ఈ ప్రపంచాన్ని కాపాడుతూ ఉంటాను" అని చెప్పాడు మంచు విష్ణు.    

Brahmamudi: సిద్దార్థ్, కావ్యల మధ్య వార్.. అది యామిని స్కెచ్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి (Brahmamudi)'. ఈ  సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-761 లో..  కావ్య, ఇందిరాదేవి మాట్లాడుకుంటారు. నిజంగానే నీకు అంత కోరిక ఉందంటే రాజ్ రాగానే వాడు ఐ లవ్యూ చెప్పగానే నువ్వు కూడా ఐ లవ్యూ టూ అని చెప్పెయ్.. అప్పుడు నమ్ముతామని కావ్యతో ఇందిరాదేవి అంటుంది.  అలాగే చెబుతాను నాకేమైనా భయమా అమ్మమ్మగారు అని కావ్య అంటుంది. నీకేం భయం లేదు చెల్లి.. నువ్వు ఎక్కడ చివరి నిమిషంలో జారుకుంటావో అన్నదే మా అందరి భయం అని స్వప్న అంటుంది. ఇంతలో రాజ్ కారు వచ్చి ఆగుతుంది. అదిగో నా మనవడు వచ్చాడు.. రెడీగా ఉండు కావ్యా అని ఇందిరాదేవి అంటుంది. అంతా చూస్తున్న రుద్రాణీ మనసులో.. ఇది అయ్యే పని కాదులే.. యామినీ ఏదో స్కెచ్ వేసే ఉంటుందని అనుకుంటుంది. ఇక రాజ్ వచ్చి కావ్యకు హాయ్ చెప్పడం.. నిన్న వెళ్లిపోవడం గురించి కావ్య.. రాజ్‌కి సారీ చెప్పడం పూర్తి అయిన తర్వాత.. కళావతి గారు మనం బయటికి వెళ్దామా అని రాజ్ అంటాడు. రేయ్ బయటికి వెళ్లే పనులేం వద్దు.. ఇక్కడే ఇక్కడే ఆ మూడు ముక్కలు(ఐ లవ్ యూ) చెప్పెయ్.. మీరు బయటికి వెళ్తుంటే విషయం చెప్పడానికి వీలు కావట్లేదు కదా అని ఇందిరాదేవి అంటుంది. దాంతో సరే అని రాజ్ స్టార్ట్ చేస్తాడు. ఇంతలో అపర్ణా దేవికి .. కంపెనీ మేనేజర్ కమల్ కాల్ చేస్తాడు. మధ్యలో ఈ ఫోన్ ఏంట్రా అని కట్ చేస్తుంది. జీవితంలో సంతోషం అనే పదానికి అర్థం అంటూ రాజ్ కవితాత్మకంగా చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఇంతలో ఆ మేనేజర్ సుభాష్‌కి కాల్ చేస్తాడు. సుభాష్ లిఫ్ట్ చేసి.. మళ్లీ చేస్తాను కమల్ అంటాడు. అయితే అవతల నుంచి మేనేజర్.. సర్, సర్.. ఈ రోజు బోర్డ్ ఆఫ్ మీటింగ్ ఏర్పాటు చేశాడు సర్ ఆ సిద్ధార్థ్ గారు. కావ్య మేడమ్ ఫోన్ కలవడం లేదని మేనేజర్ కంగారుగా అంటాడు. వాట్ అంటూ సుభాష్ నిల్చొని.. అమ్మా కావ్యా... మీటింగ్ ఏదైనా ఉందా అని అంటాడు. లేవు మావయ్యా ఏ మీటింగ్ లేవు కదా అని కావ్య అంటుంది. మరి కమల్ ఏంటి ఇలా అంటున్నాడు. ఒకసారి నువ్వే మాట్లాడమ్మా అని సుభాష్ అంటాడు. దాంతో ఫోన్ అందుకుంటుంది కావ్య. మేడమ్ ఆ సిద్ధార్థ్ గారు ఉన్నట్టుండి బోర్డ్ మీటింగ్ అంటున్నారు.. చూడబోతే ఏదో ప్లాన్ చేసినట్లే ఉన్నాడు. మీరు త్వరగా రండి మేడమ్ అని మేనేజర్ అంటాడు. వెంటనే వస్తానని కావ్య ఫోన్ పెట్టేయగానే.. రాజ్ వైపు అయోమయంగా చూస్తుంది. అయ్యో కావ్య గారు మీరు వెళ్లండి.. ఎంత అవసరం లేకపోతే ఫోన్స్ వస్తాయంటూ రాజ్ సపోర్ట్‌గా మాట్లాడతాడు. దాంతో కావ్య ఆఫీస్‌కి వెళ్లిపోతుంది. ఇక కావ్య మీటింగ్‌కి వెళ్తుంది. కూర్చుంటుంది. సిద్ధార్ధ్ అక్కడ వన్ మ్యాన్ షో చేస్తాడు. నేను ఈ కంపెనీకి 5 వందల కోట్ల ప్రాజెక్ట్ ఒకటి తీసుకొచ్చాను. ఇతర దేశాల్లో కొన్ని విగ్రహాలను డిజైన్ చేసే పని. అయితే క్లయింట్స్‌ నన్ను చూసి వచ్చారు కాబట్టి కంపెనీ ఎండీగా నన్నే కోరుకుంటున్నారు. ఇప్పుడు సమస్య ఏంటంటే నాకు కావ్య గారి నాయకత్వంపై నమ్మకం లేదు. అందుకే రెండు రోజులు టైమ్ ఇస్తున్నాను.. ఆవిడ నాకంటే గ్రేట్ అని నిరూపించుకుంటే ఓకే. లేదంటే ఆవిడ పదవి నుంచి తప్పుకోవాలని సిద్దార్థ్ అంటాడు. మిగిలిన బోర్డ్ మెంబర్స్ అంతా మొదట కావ్యకు సపోర్ట్‌గా మాట్లాడతారు. ఎండీ పదవి మీకెందుకు ఇస్తారు సిద్ధార్థ్ గారు.. కావ్య గారి ఫ్యామిలీ కదా దీన్ని స్థాపించిందని అంటారు. మనకు లాభాలు ముఖ్యం కానీ ఇదంతా కాదు కదా.. పైగా మనం కూడా పార్టనర్స్ కదా అని సిద్దార్థ్ అంటాడు. దాంతో ఆ బోర్డ్ మెంబర్స్ అంతా మాట మారుస్తారు. సరే రెండు రోజుల్లో కావ్య గారు గ్రేట్ అని నిరూపించుకుంటే ఓకే లేదంటే పదవి మీకు అప్పగిస్తారని చెప్పేస్తారు. దాంతో కావ్య ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తుంది అంతే ప్రతిసారీ. ఏం మాట్లాడదు. అప్పుడే కావ్యకి యామినీ కాల్ చేస్తుంది. బోర్ట్ మీటింగ్ అయిపోయిందా అంటూనే సిద్ధార్థ్ ఎంట్రీకి తనే కారణం అనే విషయం చెప్తుంది. సిద్దార్థ్ కారణంగా కంపెనీలో నీ స్థానం పోతుంది. తర్వాత అత్తింట్లో నీ గౌరవం, స్థానం రెండూ పోతాయి. ఎలా ఉంది నా దెబ్బ అంటూ యామినీ మాట్లాడుతుంది.  ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu: శ్రీవల్లి చేసిన పనికి నర్మద, సాగర్ బుక్ అవుతారా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu)'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్- 198 లో.. భాగ్యం, శ్రీవల్లి మాట్లాడుకుంటారు. అమ్మడూ ఊరకే కంగారు పడకు.. బ్యాంక్‌లో బంగారం తాకట్టు పెట్టేటప్పుడు మాత్రమే ఒరిజినలా కాదా అని చెక్ చేస్తారు.. అంతే తప్ప దాచుకోవడానికి, లాకర్‌లో పెట్టేటప్పుడు కాదని శ్రీవల్లితో భాగ్యం అంటుంది భాగ్యం. బతికించావే అమ్మా.. ఎక్కడ మన బండారం భయపడి చచ్చానే అమ్మా అని శ్రీవల్లి అంటుంది. బ్యాంక్ వాళ్లు చెక్ చేయరు కదా అని అజాగ్రత్తగా ఉండకు.. వాటిని ఎవరైనా పరిశీలనగా చూస్తే అవి రోల్డ్ గోల్డ్ అని కనిపెట్టే ప్రమాదం ఉంది.. కాబట్టి వాటిని ఎవరూ చూడకుండా మూటగట్టి ఇచ్చేయ్ అని భాగ్యం అంటుంది‌. ఇంతలో వేదవతి పిలివడంతో.. సరేనమ్మా అంటూ నగల్ని మూటకట్టేస్తుంది శ్రీవల్లి. అప్పటికే నర్మద, ప్రేమ ఇద్దరు తమ నగల్ని వేదవతికి ఇస్తారు‌. శ్రీవల్లి మూట తీసుకురాగానే వేదవతి దాన్ని విప్పమని చెప్తుంది. దాంతో శ్రీవల్లి కంగారుపడుతుంది. ఇక వేదవతితో పాటు నర్మద, ప్రేమ అనుమానంతో చూస్తారు. ఆ నగలు రోల్డ్ గోల్డ్ లా ఉన్నాయని నర్మద అనుమానపడుతుంది. దాంతో శ్రీవల్లి తెగ నటించేస్తుంది. ఇంతలో తిరుపతి వచ్చేస్తాడు. బావ బంగారం తీసుకురమ్మని చెప్తున్నాడని తిరుపతి అనగానే.. అందరి నగల్ని తీసుకెళ్తుంది వేదవతి. ఇక రాత్రివేళ నర్మద తన చీరకొంగులో సీక్రెట్ గా ఏదో తీసుకెళ్తుంది‌‌. అది శ్రీవల్లి చూసి ఏంటని అడుగగా.. తనకి ఏదో చెప్పేసి వెళ్ళిపోతుంది నర్మద. ఇంతకీ ఆమె చీర చెంగులో ఉన్నది ఏంటంటే.. సాగర్ గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపేర్ కావడానికి బుక్స్. ఎవరికీ కనిపించకుండా బుక్స్‌ని తీసుకొచ్చి సాగర్‌‌కి ఇస్తుంది. నువ్వు గవర్నమెంట్ జాబ్ సాధిస్తానని అన్నావ్ కదా.. ఎగ్జామ్స్‌లో పాస్ కావాలంటే బుక్స్ చదవాలి కదా... ఇవే కాదు.. ఇంకా చాలా ఉన్నాయని సాగర్ తో నర్మద చెప్తుంది. అమ్మ బాబోయ్ ఇన్ని బుక్స్ చదవాలా. ఇది నా వల్ల అవుతుందా.. నాకు ఉద్యోగం వస్తుందంటావా అని సాగర్ అంటాడు. మీకు నేనున్నా కదా శ్రీవారూ.. మీతో చదవిస్తా కదా అని నర్మద అంటుంది.  ఇక మొదలుపెడదామా శ్రీవారూ అని నర్మద అనగానే నువ్వు ఊ అంటే నేనూ ఊహూ అంటానా.. ఆల్రెడీ బెడ్ కూడా సర్దేశా.. పద మొదలుపెడదామని సాగర్ అంటాడు. నేను చెప్పింది చదవడం గురించి శ్రీవారూ అని నర్మద అంటే.. అంతకంటే ముందు నిన్ను ప్రేమగా చదివి అప్పగించాలి కదా అని నర్మదతో రొమాన్స్ స్టార్ట్ చేస్తాడు సాగర్. ఆగండి శ్రీవారూ.. గవర్నమెంట్ జాబ్‌లు ఊరికే రావు.. దృష్టి బుక్స్‌పై పెట్టు.. నా మీద కాదు అంటూ సాగర్‌ని దగ్గరుండి చదివిస్తుంది నర్మద. అతనికి అర్థం అయ్యేట్టుగా సబ్జె‌క్ట్‌ని చదివి వినిపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2: శ్రీధర్ లో మార్పు.. కాంచన కాళ్ళపై పడి మరీ ఏడ్చాడుగా! 

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2(Karthika Deepam2)'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-397 లో..  మనసుకి తగిలిన గాయాలకు మాటలు సరిపోతాయేమో కానీ ఒంటికి తగిలిన గాయాలకు మాత్రలు కావాలి. నేను నీకు అవసరం లేకపోవచ్చు. ఇప్పుడు ఇది నీకు అవసరం వేసుకోమంటూ కాంచనకి శ్రీధర్ ఇస్తాడు. దాంతో కాంచన టాబ్లెట్ తీసుకుని వేసుకుంటుంది. మనసుకి గాయాలను ఎప్పటికీ మందులుండవుగా అని కాంచన అంటుంది. నీ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోవచ్చు కానీ నీ మీద నేను చూపించే ప్రేమ అయితే నిజం కాంచనా అని ఎమోషనల్ గా శ్రీధర్ చెప్తాడు. ఇంతలో అనసూయ వచ్చి మీరెందుకు వచ్చారని శ్రీధర్ ని అడుగుతుంది. నా భార్య కోసం వచ్చానని శ్రీధర్ అంటాడు. అయితే మీరు రాంగ్ అడ్రస్‌కి వచ్చారు మాస్టారు అంటూ కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. కార్తీక్ వెనుకే దీప కూడా ఉంటుంది. మీరు చేసిన తప్పే మీ భార్య చేసి ఉంటే మీరేం చేసేవారని అనసూయ అనగానే.. అవును నేను చేసింది తప్పే.. కానీ నాకు నా భార్య అంటే ప్రేమ ఉంది అని శ్రీధర్ అంటాడు. భార్య మీద ప్రేమ ఉన్నవాడు మరో ఆడదానివైపు కన్నెత్తి చూడడు. కన్నెత్తి చూడటం కాదు ఏకంగా కాపురం చేసి కూతుర్నే కన్నావ్.. నిన్ను వద్దు అనుకునే కదా మా అమ్మ పొమ్మంది.. మళ్లీ ఈ రాకలెందుకు.. ఈ దొంగ ప్రేమలెందుకని కార్తీక్ కోపంగా అంటాడు. ఆ మాటతో శ్రీధర్ కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. అవునురా నాది దొంగ ప్రేమే అంటూ శ్రీధర్ ఎమోషనల్ గా.. కాంచనా నువ్వు చెప్పు కాంచనా.. నాది దొంగ ప్రేమే కదా.. కార్తీక్ పుట్టిన తర్వాత నీకు యాక్సిడెంట్ అయ్యింది. జీవితంలో ఇక నువ్వు లేచి నడవలేవు అన్నారు.. ఏ రోజు అయినా నిన్ను తక్కువ చూశానా.. నీకు నా ప్రేమను పంచలేదా.. నిన్ను ఏరోజైనా అవమానంగా మాట్లాడానా అని అంటాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకండీ ఆవిడ్ని బాధపెట్టడానికి కాకపోతే అని దీప అంటుంది.  లేదు దీపా.. నేనేంటో నా కొడుక్కి తెలియకపోయినా నా భార్యకు తెలుసు కదా అని శ్రీధర్ ఏడుస్తూ అంటాడు. తెలుసండి.. మీరు నన్ను ఎంత ప్రేమగా చూసుకునేవారో నాకు తెలుసు.. మీరు నాకోసం వంట చేసేవారు. నాకు జడ వేసేవారు.. నా కాళ్లకు ఆయిల్ రాసేవారు. నాకు భోజనం తినిపించే వారు. భర్త భార్యను చూసుకున్నట్లు కాకుండా ఒక తండ్రి కూతుర్ని చూసుకున్నట్లు చూసుకున్నారు. కానీ బాధేంటంటే మీరు నాలాగే మరో ఆడదాన్ని కూడా చూసుకున్నారు.. ఆ నిజం నాకు తెలిసిన రోజున నా నరాలను ఎవరో కత్తితో నరుకుతున్నట్లు అనిపించింది. నాకే కాదండీ ప్రతి ఆడది ఇలానే బాధపడుతుంది. నిజం తెలియగానే బోరుబోరున ఏడ్చానండీ.. నా ఏడుపునే నాకొక దారిని చూపించింది. నా జీవితంలో నాతో పాటు నా కొడుకు ఉంటే చాలు అనిపించింది. నేను అవిటిదాన్నే కానీ ఎప్పుడూ నా అవిటి నాకు గుర్తే రాలేదు. మిమ్మల్ని నా జీవితంలోంచి పంపించిన తర్వాత నే...నేను మొదటి సారీ అవిటి దాన్ని అయ్యానంటూ కాంచన ఏడుస్తుంది. కాంచన అలా అనగానే శ్రీధర్ కుమిలిపోతూ అక్కడే నేల మీద కాంచన కాళ్ల దగ్గర కూలబడిపోతాడు. నేను తప్పు చేశాను కాంచనా.. అది నా బలహీనత.. నన్ను నేను అదుపు చేసుకోలేకపోయాను.. కానీ నీ మీద ప్రేమను నేను ఏ నాడు నటించలేదు. నువ్వు నన్ను పొమ్మన్నావ్.. పోయానంటూ శ్రీధర్ మాట్లాడతాడు. కాంచనా.. మన కొడుక్కి పెళ్లి అయిపోయింది. వాడికో కూతురు ఉంది. వాడి జీవితం వాడు చూసుకుంటాడు. ఈ వయసులో మనకు కావాల్సింది కాస్త ప్రశాంతత.. రా కాంచనా నువ్వు, నేను, కావేరీ మన ముగ్గురం కలిసే ఉందాం, లేదంటే చెప్పు.. కావేరీని తీసుకుని నేనే ఇక్కడికి వచ్చేస్తానంటాడు. హలో మాస్టారూ అంటూ కార్తీక్ తిట్టబోతుంటే దీప అడ్డుపడుతుంది. బావా .. మీ నాన్నగారు నీతో మాట్లాడటం లేదు. తన భార్యతో మాట్లాడుతున్నారు.. నాకోసం నువ్వు మౌనంగా ఉండు బావా అని దీప అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

బిగ్ బాస్ నుంచి ఈ ఇయర్ ఆఫర్ వచ్చింది.. కానీ కిల్లర్ మూవీ మీదనే దృష్టంతా

గుప్పెడంత మనసు సీరియల్ హీరో రిషి వాళ్ళ అమ్మ రోల్ లో నటించిన జగతి మేడం అంటే అందరికీ తెలుసు. ఆమె అసలు పేరు జ్యోతి పూర్వాజ్. ఐతే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 త్వరలో ఆడియన్స్ ముందు రాబోతోంది. ఐతే హౌస్ లోకి కంటెస్టెంట్స్ కోసం సంప్రదింపులు జరుపుతున్నారు. అలాగే చాల మంది పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు జ్యోతి పూర్వాజ్ కూడా బిగ్ బాస్ లోకి వెళ్లబోతోందా..అనే టాక్ నడుస్తోంది. ఆమె బిగ్ బాస్ కి వస్తే టిఆర్పిలు బద్దలైపోతాయి అనే చర్చ కూడా నడుస్తోంది. జ్యోతి ఇటు తెలుగులో అటు కన్నడలో సీరియల్స్, మూవీస్ లో నటిస్తోంది. ఇక గుప్పెడంత మనసు సీరియల్ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఐతే మూవీస్ లో ఛాన్సెస్ రావడంతో ఆమె రోల్ ని మధ్యలోనే ముగించేయాల్సి వచ్చింది. ఇక తర్వాత మూవీస్ షూటింగ్స్ లో కనిపిస్తూ ఆ వీడియోస్ ని పిక్స్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఐతే ఈ అందాల నటి రీసెంట్ ఒక పోస్ట్ ని తన స్టేటస్ లో పోస్ట్ చేసుకుంది. లాస్ట్ ఇయర్ కూడా బిగ్ బాస్ తెలుగు, కన్నడ ఇండస్ట్రీస్ నుంచి టీమ్ సంప్రదించారు కానీ ఆ టైంలో ఆ అవకాశాన్ని వదులుకున్నానని చెప్పింది. ఇక ఈ ఇయర్ కూడా బిగ్ బాస్ నుంచి ఆఫర్ వచ్చినా కానీ ఇప్పుడు కూడా బిగ్ బాస్ వెళ్లడం లేదు అని చెప్పింది. దానికి కారణంగా ప్రస్తుతానికి తానూ  పూర్తిగా "కిల్లర్" మూవీ మీద ద్రుష్టి పెట్టానని అందుకే  రియాలిటీ షోస్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యట్లేదు అంటూ ఆ పోస్ట్ లో పేర్కొంది. సో జ్యోతి ఐతే బిగ్ బాస్ కి వచ్చే ఛాన్స్ లేనట్టే.  

"జయమ్ము నిశ్చయమ్మురా" అంటున్న శుభలగ్నం హీరో..జీ తెలుగులో త్వరలో న్యూ షో

ఒకప్పుడు లేడీ ఫాలోయింగ్ ఉన్న హీరో జగపతి బాబు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. జగపతి బాబు అంటే గుర్తొచ్చే ఒకే ఒక్క సినిమా "శుభలగ్నం". ఆయన కెరీర్ ని మార్చేసిన మూవీ. అలాంటి జగపతి బాబు ఇప్పుడు బుల్లితెర మీద కనిపించబోతున్నారు. "జయమ్ము నిశ్చయమ్మురా" అనే ఒక కొత్త టాక్  షో ద్వారా హోస్ట్ గా రాబోతున్నారు.."జ్ఞాపకం దాని విలువ ఒక జీవితం..అన్నీ నేరుగా చెప్పుకోలేక అమ్మకు రాసిన ఉత్తరం. నాన్న కంట పడకుండా గడిపిన బాల్యం. ఆట కోసమే బతికిన రోజులు..అమ్మా నాన్న కోసమే చదువుకున్న క్షణాలు..అలవాటుగా మారిన అల్లరి పనులు..అన్నీ ఉన్నా కూడా చేసిన చిన్ని చిన్ని దొంగతనాలు. అలలా కదిలిపోయిన యవ్వనం..కళ్ళ ముందే మారిపోయిన కాలం..వీటన్నిటికీ ఒక్కటే లక్ష్యం..విజయం..జయమ్ము నిశ్చయమ్మురా" అంటూ ఒక ప్రోమో రిలీజ్ అయ్యింది. "గుర్తుల్ని జ్ఞాపకాలుగా మార్చుకుని మనసుల్ని గెలుచుకున్న మన మనుషుల కథలు..వింటారా.. విత్ మీ మీ జగపతి..అంటూ ఒక టాక్ షోతో త్వరలో జీ తెలుగులో రాబోతున్నారు. ఇక గోడ మీద సెలబ్రిటీస్ పిక్స్ కూడా కనిపించాయి. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, రాఘవేంద్ర రావు, దిల్ రాజు, కీర్తి సురేష్, సుకుమార్, మహేష్ బాబు వంటి ఎంతో మంది సెలబ్రిటీస్ చిత్రాలు ఉన్నాయి. ఇక డ్రామా జూనియర్స్ సీజన్ 8  స్టార్ట్ ఐనప్పుడు జగపతి బాబు, రోజు, ఆమని వచ్చి కాసేపు సందడి చేసారు.    

బిగ్ బాస్ 9 లోకి రాజ్ తరుణ్, ఇమ్మానుయేల్

  బిగ్ బాస్ సీజన్ 9 త్వరలో స్టార్ట్ కాబోతోంది. ఈ షో ప్రోమోలు కూడా వస్తున్నాయి. ఐతే హౌస్ లోకి వెళ్లే వాళ్ళ లిస్ట్  మాత్రం ఇంకా బయటకు రాలేదు. ఐతే సోషల్ మీడియాలో లో వేళ్ళు వెళ్లొచ్చు, వాళ్ళు వెళ్లొచ్చు అంటూ కొన్ని గాసిప్స్ నడుస్తున్నాయి. ఐతే రీసెంట్ గా జబర్దస్త్ కమెడియన్  ఇమ్మానుయేల్ అలాగే హీరో రాజ్ తరుణ్ వెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఇమ్మానుయేల్ బిగ్ బాస్ కి వెళ్తే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఇమ్ము జర్నీ జబర్దస్త్ లో కమెడియన్ నుంచి టీమ్ లీడర్ అయ్యాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి వస్తున్నాడు అలాగే కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోలో కెప్టెన్ కూడా అయ్యాడు. అతని ఇన్స్పైరింగ్ జర్నీ కాబట్టి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తోంది. ఇక రాజ్ తరుణ్ విషయానికి వస్తే హీరోగా కొన్ని సినిమాలు చేసి ప్రామిసింగ్ యాక్టర్ అనిపించుకున్నాడు. తర్వాత తన ఫామిలీ ఇష్యుస్ కారణంగా నిత్యం వార్తల్లో నిలిచాడు. ఇక లావణ్య, ఆరియానా, శేఖర్ బాషా, రాజ్ తరుణ్ మధ్య ఎన్ని గొడవలు జరిగాయో చూస్తూనే ఉన్నాం. ఐతే రాజ్ తరం ఈమధ్య సోషల్ మీడియాలో కానీ బిగ్ స్క్రీన్ మీద ఎక్కడా కనిపించడం లేదు. ఒకవేళ బిగ్ బాస్ కి వెళ్తే అక్కడ అసలు ఎలా ఎంటర్టైన్ చేస్తాడో,  ఇక వీళ్ళతో పాటు బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరెవరు వెళ్ళబోతున్నారో చూడాలి.  

విజయ్ ఆంటోని మూవీ "భద్రకాళీ"లో రెండు సాంగ్స్ రాయడానికి భోలే షావలికి ఛాన్స్

విజయ్ ఆంటోని మూవీ "మార్గన్" టీమ్ తో ఏమంటా శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి వచ్చారో చాలా మందికి ఆఫర్స్ ఇచ్చారు ఆయన. జడ్జ్ ఇంద్రజ భోలే షావలి గురించి చాల మంచిగా చెప్పారు.   వండర్ ఫుల్ లిరిక్ రైటర్ అని మంచి టాలెంట్ ఉన్న పర్సన్ అంటూ ఇంట్రడ్యూస్ చేశారు విజయ్ ఆంటోనీకి. "ఆయన ఒక ఇండిపెండెంట్ మ్యూజిక్ కంపోజర్ గా స్టార్ట్ చేసి ఫెంటాస్టిక్ ఆల్ రౌండర్ గా ఎంటర్టైన్మెంట్ అందిస్తారు" అని చెప్పారు. దాంతో విజయ్ ఆంటోని ఫుల్ ఖుషీ ఇపోయారు ఐతే "మీరు లిరిక్ రైటర్ ఐతే గనక నా రాబోయే సినిమా భద్రకాళి మూవీలో మీరు టు సాంగ్స్ రాయబోతున్నారు..ఇది నా ప్రామిస్" అని చెప్పారు. "భద్రకాళి మూవీ సెప్టెంబర్ లో రిలీజ్ కాబోతోంది. నేను మీతో టచ్ లో ఉంటాను. మీరు నా మూవీ 2 పాటలు రాయాల్సిందే " అని చెప్పారు. అలాగే నాటీ నరేష్ ఐతే బిచ్చగాడు మూవీ సీన్ ని స్పూఫ్ గా చేసేసరికి విజయ్ ఫుల్ ఫిదా ఇపోయారు. "నరేష్ నీ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. డైలాగ్స్ ని ఎంత ప్రోపర్ గా చెప్పావో చూసాను. డైలాగ్స్ ని పంక్ట్యువేషన్ (punctuation ) కి తగ్గట్టే చెప్పారు. సక్సెస్ఫుల్ యాక్టర్ కూడా మీరు. మిమ్మల్ని నేను తమిళ్ లో ఇంట్రడ్యూస్ చేయాలని అనుకుంటున్నా. నరేష్ నేను నీతో టచ్ లో ఉంటాను. ఇక్కడ ఎంత మంది టాలెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళను చెన్నైకి తీసుకెళ్లాలని అనుకుంటున్నా.. అందరినీ నా మూవీస్ లో ఇంట్రడ్యూస్ చేద్దామనుకుంటున్న" అని చెప్పారు విజయ్ ఆంటోని.    

రష్మీ విజయ్ తో మిస్ చేసుకున్న మూవీస్ ఇవే...బిచ్చగాడు 3 లో రష్మీకి అవకాశం

  యాంకర్ రష్మీ మాములు యాంకర్ కాదు. ఆమె మంచి మూవీ ఆఫర్స్ ని వదిలేసుకుందన్న విషయం ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో తెలిసింది. ఈ వారం షోకి మార్గన్ మూవీ వచ్చింది. అలాగే బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోని కూడా వచ్చారు. ఇక రష్మీ , విజయ్ ఇద్దరూ క్లోజ్ గా మాట్లాడుకోవడం చూసి రామ్ ప్రసాద్ అడిగేశాడు. "రష్మీ నా ఫస్ట్ మూవీలో నటించాల్సి ఉంది. డాక్టర్ సలీం మూవీలో చేయాలి వుంది. బేతాళుడు మూవీ టైంలో కూడా రష్మీ కోసం వెయిట్ చేశా.. తాను నటిస్తుందేమో అనుకున్నా..కానీ ఇదంతా పక్కన పెడితే త్వరలో నా మూవీలో చేయబోతోంది." అని చెప్పారు. దాంతో రాంప్రసాద్ " హిట్ సినిమాలో ఛాన్స్ పోగొట్టుకున్నావా  రష్మీ నువ్వు ...సర్ మాదో చిన్న రిక్వెస్ట్ మీరు చేసిన బిచ్చగాడు 1 , 2 రెండూ చూసాం రష్మీని పెట్టి బిచ్చగత్తె 3 తియ్యండి..రష్మీ నా బిక్కగాడు 3 మూవీలో నటించబోతోంది. రష్మీని త్వరలో బిచ్చగత్తెలా చూడబోతున్నాం..దానికి ఆనందంగా ఉంది నాకు" అంటూ రాంప్రసాద్ కామెడీ చేసాడు. ఐతే మార్గన్ మూవీ హీరో అజయ్ వెంటనే " ఈ మూవీలో రొమాన్స్ సర్ కి కాదు నాకు" అన్నాడు. "డైరెక్టర్ నాకు పెయిర్ ఇచ్చారు కానీ రొమాంటిక్ సీన్స్ లేవు" అన్నారు విజయ్. "నెక్స్ట్ పార్ట్ లో ఫుల్ రొమాన్స్ పెడదాం" అని డైరెక్టర్ చెప్పాడు. దాంతో రష్మీ "సర్ మార్గన్ పార్ట్ 2 లో విత్ అగ్రెసివ్ లవ్ " అంది. "అందరూ నన్ను సీరియస్ పర్సన్ అనుకుంటారు రష్మీ కానీ నేను చాల రొమాంటిక్ పర్సన్ ని" అన్నారు విజయ్. "సరే ఇప్పుడు రొమాన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సినిమాలో ఎలాగో జరగలేదు కాబట్టి ఇక్కడ ఒక రెండు నిముషాలు రొమాంటిక్ సీన్ చేద్దాం అంటూ ఇద్దరూ కలిసి డాన్స్ వేశారు.  

బిగ్ బాస్ సీజన్ 9 కి కామన్ మ్యాన్ గా అప్లై చేసుకునే వాళ్లకు ఆదిరెడ్డి టిప్స్

బిగ్ బాస్ సీజన్ 9 కి కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇవ్వాలనుకుంటే ఎలా అంటూ గత బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి చెప్పుకొచ్చాడు. బిగ్ బాస్ కి వెళ్లాలనుకునే కామన్ మ్యాన్ కోసం కొన్ని టిప్స్ చెప్పాడు. త్వరగా అప్లై చేసి పంపించేయండి. బిగ్ బాస్ కి కావాల్సింది డిఫెరెంట్ క్యారెక్టర్స్ ఉండే కంటెస్టెంట్స్ . మీరు ఏ కేటగిరీలో పంపిద్దామనుకున్నారో ఆ కేటగిరీలో ఇంకా ఎవరైనా ముందుగా పంపించేస్తే మీ వీడియోస్ ని పరిశీలించే అవకాశం ఉండదు. సింపుల్ గా నువ్వు ఏంటి అనేది వాళ్లకు తెలిసేలా 3 మినిట్స్ వీడియో చేసి పంపించాలి. నువ్వెంటి నీ ఫామిలీ ఏంటి, బిగ్ బాస్ హౌస్ కి ఎందుకు వద్దామనుకుంటున్నావ్..వస్తే జనాలను ఎలా ఎంటర్టైన్ చేస్తావ్ అనే చెప్తూ నీ నేచర్ ఏంటి అనేది బిగ్ బాస్ కి అర్ధమవ్వాలి. నువ్వు హైపర్ గా క్యారెక్టర్ ఐతే అలాగే ఆ వీడియోలో ప్రాజెక్ట్ చేయాలి..నువ్వు అగ్రెసివ్ పర్సన్ ఐతే అలాగే ఆ వీడియోలో కనిపించాలి. పూర్ బ్యాక్ గ్రౌండ్ ఐతే అది కూడా చూపించుకోవచ్చు. ఏ జాబ్ ఐనా కానీ జెన్యూన్ గా నువ్వెంటో ఆ వీడియోలో చూపించుకోవాలి. బిగ్ బాస్ ఇలాంటి వాళ్లనే సెలెక్ట్ చేస్తారని లేని క్వాలిటీని తెచ్చిపెట్టుకుని వీడియోస్ చేయొద్దు. ఇక వీడియోని అప్లోడ్ చేశాక బిగ్ బాస్ టీమ్ అంటూ డబ్బులు డిమాండ్ చేస్తూ కాల్స్ వస్తాయి. కానీ అవన్నీ ఫేక్. బిగ్ బాస్ టీమ్ ఎలాంటి డబ్బులు అడగరు. కాబట్టి ఆ ఫేక్ కాల్స్ కి, ఫేక్ వెబ్ సైట్స్ కి దూరంగా ఉండండి అంటూ చెప్పాడు." అంటూ చెప్పుకొచ్చాడు ఆది రెడ్డి. ఇక బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ కాబోతోంది. ఐతే బిగ్ బాస్ లోకి సెలబ్రిటీస్ తో పాటు కామన్ మ్యాన్ కూడా వెళ్తూ ఉంటారు. కామన్ మ్యాన్ క్యాటిగరీలో ఇప్పటి వరకు ఆదిరెడ్డి, గలాటా గీతూ, పల్లవి ప్రశాంత్ లాంటి వాళ్ళు వెళ్లారు. ఇక ఇప్పుడు కొత్త సీజన్ లో కూడా కామన్ మ్యాన్ క్యాటిగారీ కోసం వెబ్సైటులో నమోదు చేసుకోమంటూ ఒక లింక్ కూడా ఇచ్చారు. ఇందులో మొత్తం ఫైవ్ లెవెల్స్  లో ఈ  సెలక్షన్ జరగబోతోంది. ముగ్గురు కామన్ మ్యాన్ ని తీసుకునే అవకాశం కూడా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు ఆదిరెడ్డి.  

Illu illalu pillalu : అత్తగారింట్లో అడ్డంగా దొరికిపోయిన శ్రీవల్లి.. భాగ్యం ఏం చేయనుంది?

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -197 లో... ఊళ్లో దొంగలు పడ్డారని తిరుపతి వచ్చి రామరాజుతో చెప్పేసరికి ఇంట్లో ఉన్న నగలు, డబ్బు బ్యాంకులో పెట్టమని రామరాజు చెప్తాడు. దాంతో శ్రీవల్లిని నగలు తీసుకురమ్మని చెప్తుంది వేదవతి. వేదవతి పిలుపు వినిపించేసరికి ఆ నగలకోసమే అయ్యి ఉంటుందని శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. అమ్మా వల్లీ అని వేదవతి ప్రేమగా పిలిచేసరికి.. చూశావా ప్రేమా.. అత్తయ్య గారికి ఆ అగ్గిపుల్ల కోడలంటే ఎంత ప్రేమో అని నర్మద అంటుంది. ఏయ్.. అగ్గిపుల్ల ఏంటే.. అగ్గిపుల్లా.. చిన్న పెద్ద తేడా తెలియకుండా అని వేదవతి అంటుంది. హా.. ఆ పేరు ఆవిడగారికి సరిగ్గా సరిపోతుందని ప్రేమ అంటుంది. ఏంటే.. దీనితో ఉండి నువ్వు కూడా దానిలాగే తయారయ్యావని వేదవతి అంటుంది.    ఇంతలో అగ్గిపుల్ల కోడలు.. చేతులు నలుపుకుంటూ వస్తుంది. ఏంటి అత్తయ్య గారూ పిలిచారా అని శ్రీవల్లి అడుగుతుంది. ఏం లేదమ్మా.. ఊరిలో దొంగలు పడ్డారంట.. మనందరి నగలు లాకర్‌లో పెట్టమని మీ మామయ్య గారు చెప్పారు. మీరు వెళ్లి మీ నగల్ని తీసుకుని రండి అని వేదవతి అంటుంది. ఇద్దరు కోడళ్లు వెళ్తారు కానీ.. శ్రీవల్లి మాత్రం అతితెలివి ప్రదర్శించి నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అత్తయ్య గారూ.. లాకర్‌లో పెట్టడం ఎందుకు వేస్టూ అని అంటుంది. దొంగలు నీకంటే జాగ్రత్తగా ఉంటారు.. వెళ్లి చెప్పింది చెయ్ అని వేదవతి అంటుంది. అంటే అదీ అత్తయ్య గారండీ.. అన్ని నగల్ని లాకర్‌లో పెడితే ఫంక్షన్లకు ఏం వేసుకోవాలని శ్రీవల్లి అడుగుతుంది. అందరి నగలు పెడుతున్నాం కదా.. ఫంక్షన్ నీ ఒక్కదానికే రాదు కదా.. బ్యాంక్‌కి వెళ్లాలి తొందరగా వెళ్లి నగల్ని తీసుకునిరా అని వేదవతి అంటుంది. దాంతో చచ్చినట్టు నగలు తీసుకునిరావడానికి వెళ్తుంది శ్రీవల్లి.    ఈ నగల్ని బ్యాంక్‌లో పెడితే రోల్డ్ గోల్డ్‌వి అని తెలిసిపోతుంది.. ఏం చేయాల్రా దేవుడా అని తలపట్టుకుంటుంది. వెంటనే భాగ్యానికి ఫోన్ చేస్తుంది శ్రీవల్లి.. కొంపలు అంటుకుంటున్నాయే అమ్మా.. మా ఏరియాలో దొంగలు పడ్డారట. అందుకని అందరి నగల్ని లాకర్‌లో పెడుతున్నారు. అప్పుడు ఇవి రోల్డ్ గోల్డ్ నగలని తెలిసిపోతుంది. దీంతో పాటు పెళ్లి కోసం మనం ఆడిన నాటకాలన్నీ బయటపడిపోతాయి. నా కాపురం నిలువుగా కూలిపోతుంది. ఆయనంటే నాకు చచ్చేంత ప్రేమే.. ఆయన దూరం అయితే నేను బతకలేనే అని శ్రీవల్లి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.