అందాల రాక్షసి హిట్ కానీ అవకాశాలు ఫట్.. 

అందాల రాక్షసి మూవీతో హిట్ కొట్టిన నవీన్ చంద్ర యాక్టింగ్ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. ఆ మూవీ తర్వాత గ్యాప్ రావడం ఆ తర్వాత అరవింద సమేత చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక రీసెంట్ గా కాకమ్మ కథలు ఎపిసోడ్ కి వచ్చి తన లైఫ్ లోని స్ట్రగుల్స్ గురించి చెప్పాడు. " పాపింగ్, రాకింగ్, బి-బాయింగ్ , బ్రేక్ డాన్స్ ఇవన్నీ రకరకాల డాన్స్ స్టైల్స్ నేను ఎక్కడా నేర్చుకోలేదు. మా బ్రదర్ నేర్పించాడు. మా ఊళ్ళో డాన్స్ షో పెడితే మా ఊరి వాళ్ళు టికెట్స్ కొని మరీ షో చూసేవాళ్ళు. అప్పుడే నాకు యాక్టర్ అవ్వాలనుకున్నాను ఇక్కడికి వచ్చాను. తేజ గారి వల్లనే వచ్చాను. ఆయన ఒక యాడ్ పోస్ట్ చేసారు. నవదీప్ ది జై మూవీ. ఆ మూవీ ఆడిషన్ కోసం నేను హైదరాబాద్ వచ్చాను. ఐతే ఆడిషన్ లో నాకు కుదరలేదు కానీ ఆ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ రవి వర్మ "సంభవామి యుగే యుగే" అనే మూవీలో ఛాన్స్ ఇచ్చారు. దాని తర్వాత ఒక నాలుగేళ్లు బ్రేక్ వచ్చింది. అందాల రాక్షసి మూవీ చేసాను. ఆ మూవీ సూపర్ హిట్ అయ్యింది కానీ యాక్టర్ గా నేను ఒక్కసారిగా కింద పడిపోయాను. అప్పుడు ఈ ఇండస్ట్రీ నుంచి నేను వెనక్కి వెళ్ళకూడదు అనుకున్న టైములో నేను రాజా రవీద్రగారిని కలిసాను.. అయన వల్ల నా లైఫ్ మారిపోయింది. త్రి మంత్స్ ఎంజాయ్ చెయ్యి  అన్నారు. చేతిలో సినిమా లేదు. ఎం చేయాలో తెలీదు. ఆయనకు ఎలా చెప్పాలో తెలీదు. అలా చాల కలం  తర్వాత ఇద్దరం కొలాబరేట్ అయ్యి అరవింద సమేత మూవీ చేసాం. నిజానికి ఆ సినిమాను నేను చేయను అని చెప్పాను. కానీ రాజా రవీంద్ర గారు నన్ను కన్విన్స్ చేశారు. ఒక్క సినిమా ఆడియన్స్ కి రీచ్ ఐతే చాలు అన్నారు. అలా ఇప్పటి వరకు అసలు గ్యాప్ లేకుండా మూవీస్ చేస్తూనే ఉన్నాను" అని చెప్పాడు నవీన్ చంద్ర. తర్వాత హోస్ట్ తేజు నవీన్ చంద్ర ఫ్యూచర్ చెప్పింది. "యాక్టింగ్ రిలేటెడ్ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నువ్వు అందుకోవాలని" అని విష్ చేసింది.  

రేవతిగారితో నటించిన మూవీ రిలీజ్ కాలేదు.. 

  సిల్వర్ స్క్రీన్ మీద రాజా రవీంద్ర ఎన్నో మూవీస్ లో ఎన్నో రోల్స్ లో నటించాడు. ఆయన జర్నీ చాలా సుదీర్ఘమైనది. ఇప్పటికీ ఎన్నో మూవీస్ లో నటిస్తున్నాడు. రీసెంట్ గా అయన కాకమ్మ కథలో ఎపిసోడ్ కి గెస్ట్ గా వచ్చి ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నాడు. "నేను కూచిపూడి డాన్స్ నేర్చుకోవడానికి చెన్నై వచ్చాను. నేను మెస్ లో భోజనం చేస్తున్నప్పుడు ఒకాయన వచ్చి ఇలా రేవతి గారితో ఒక మూవీ చేస్తున్నారు. హీరో కోసం వెతుకుతున్నారు. మీరు చేస్తారా అని అడిగారు. నేను హీరో ఏంటి అనేసరికి లేడు రండి అని నన్ను తీసుకెళ్లారు. మేము వెళ్లేసరికి డైరెక్టర్ గారు. అప్పట్లో నా అసలు పేరు రమేష్. నేను విజిటింగ్ కార్డు ఇచ్చి వచ్చాను. అప్పట్లో ల్యాండ్ ఫోన్ ఉంది. రెండో రోజు ఫోన్ చేసి పిలిస్తే వెళ్లాను. చూసి ఎవడ్రా నువ్వు అన్నారు. సాంబశివరావు అని ఈనాడు అవి తీశారు కృష్ణ గారితో. నేనే సర్ రమేష్ ని అన్న. ఓరిని రమేష్ అరవింద్ అనుకున్న రమేషా నువ్వు అన్నారు. సరే బానే ఉన్నావ్ గాని రా అని రేవతి గారి దగ్గరకు తీసుకెళ్లారు. హీరోగా వీడు ఓకేనా అని అడిగారు. అప్పటికే ఆవిడ నేషనల్ అవార్డు అందుకున్న పెద్ద ఆర్టిస్ట్. అంటే కొత్తవాళ్లతో చేస్తారా లేదా అని అడగడానికి తీసుకెళ్లారు. తర్వాత ఆవిడ తన క్యారక్టర్ బాగుంది అలాగే నేను కూడా బాగున్నాను అనేసరికి కెమెరా మ్యాన్ మధు అంబటి గారి దగ్గరకు తీసుకెళ్లారు. ఆయన నన్ను చూసి ఇదేంటి ఇతను రేవతి గారి తమ్ముడిలా ఉంటాడుగా అన్నారు. నువ్వు ఉండవయ్యా ఆవిడ ఒప్పుకున్నారు ఎదో ఒకటి చెయ్యవయ్యా అన్నా. అలా సినిమా షూటింగ్ అయ్యింది. తర్వాత ఇక సినిమా అవకాశాలు వస్తాయి..ఎవరితో ఎలా మాట్లాడాలి అని ఆలోచించుకుంటున్నా. మూవీ రిలీజ్ కాలేదు. రెండేళ్లు ఐపోయింది. రాఘవేంద్ర రావు గారికి ప్రివ్యూ వేసి చూపించారట. మా డైరెక్టర్ సినిమా ఎలా ఉంది అని అడిగేసరికి ఆయన ఎం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారట. దేవుడే నన్ను కాపాడాలి అని మా డైరెక్టర్ అనుకుంటే ఎస్ అని చెప్పి రాఘవేంద్రరావు వెళ్లిపోయారు. తర్వాత రామానాయుడు గారి దగ్గరకు వెళ్ళాడు మా డైరెక్టర్. ఈ సినిమా రిలీజ్ చేయడం నా వల్ల కాదు గాని కుర్రాడు బాగున్నాడు నా సినిమాలో వేషం ఇస్తాను సర్పయాగంలో వేషం ఇచ్చారు." అని చెప్పుకొచ్చాడు రాజా రవీంద్ర.  

"ఒరేయ్ దరిద్రుడా కాసేపు మాట్లాడకుండా ఉండరా"

  సర్కార్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కి రామ్ ప్రసాద్, గెటప్ శీను, బులెట్ భాస్కర్, సన్నీ వచ్చారు. ఇక ఈ ఎపిసోడ్ లో రాంప్రసాద్ ఐతే అవసరమైనప్పుడల్లా ప్రాపెర్టీస్ తెచ్చే అమ్మాయి లస్సి మీద ఫుల్ జోకులు వేసాడు. లస్సి స్టేజి మీదకు వచ్చేసరికి "పెరుగు ఎవరు తోడెట్టారో కానీ లస్సి అద్దిరిపోయింది" అని జోక్ వేసాడు. సుధీర్ ఐతే "ఒరేయ్ దరిద్రుడా కాసేపు మాట్లాడకుండా ఉండరా" అన్నాడు. "నాకు ఒక స్ట్రా తెస్తావా లస్సి" అని అడిగాడు మళ్ళీ రాంప్రసాద్. లస్సి చేతిలో ఒక ప్రాపర్టీ ఉంది. "అరేయ్ సుధీర్ లస్సిని పట్టుకురమ్మను. ఇంతదూరం వచ్చింది నిన్ను చూడడానికి కాదు. లస్సి ఇటురా" అని పిలిచాడు రాంప్రసాద్. "నాకు నీ మీద సరిగా నమ్మకం లేదురా" అన్నాడు సుధీర్. "నీకు ఇలా కాదు దుబాయ్ ఫొటోస్ పంపిస్తే గాని" అని రాంప్రసాద్ ఫోన్ తీసి మరీ బెదిరించేసరికి "సర్లే వద్దు కానీ లస్సి రా" అని తీసుకెళ్లి అందరినీ పరిచయం చేసాడు సుధీర్. రాంప్రసాద్ షేక్ హ్యాండ్ ఇచ్చేసరికి షేక్ హ్యాండ్ వద్దు అన్నా అన్నాడు సుధీర్ ఇంతలో లస్సి కూడా రాంప్రసాద్ కి షేక్ హ్యాండ్ ఇవ్వబోయి సుధీర్ చూపును చూసి ఆగిపోయింది. "ఏంట్రా చూపులతో భయపెడుతున్నావ్" అంటూ సుధీర్ మీద కౌంటర్ వేసాడు గెటప్ శీను. "లక్ష పొతే పోయింది కానీ లస్సి అదిరిపోయింది" అన్నాడు ఆటో రాంప్రసాద్. తర్వాత స్టేజి మీద వీళ్లంతా దొర్లి దొర్లి వాళ్ళ ఫ్రెండ్ షిప్ ఫొటోస్ ని చూపించుకుని కాసేపు ఎంజాయ్ చేశారు.  

Illu illalu pillalu : ఆనందరావు ఇడ్లీల బిజినెస్ చెప్పేసిన నర్మద,ప్రేమ.. షాక్ లో శ్రీవల్లి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -202 లో... శ్రీవల్లి వాళ్ళ నాన్న సైకిల్ పై ఇడ్లీలు అమ్ముతుంటే నర్మద, ప్రేమ ఇద్దరు వెళ్లి అతన్ని చూస్తారు. అతను ఈ ఇద్దరిని చూడగానే షాక్ అవుతాడు. వెంటనే త్వరగా డైవర్ట్ చేస్తాడు. ఇలా ఇడ్లీలు అమ్ముకోవాలని అంటాడు. ఆ తర్వాత అక్కడ నుండి వెళ్లి సూట్ వేసుకుంటాడు. ఏంటి బాబాయ్ ఇలా ఇడ్లీ అమ్ముతున్నారని ప్రేమ, నర్మద అడుగుతారు. అదేం లేదమ్మా నేను ఫైనాన్స్ బిజినెస్ చేస్తాను కదా.. అలాగే ఎలా బిజినెస్ చెయ్యాలో కూడా నేర్పిస్తానని కవర్ చేస్తాడు. ఆనందరావు అక్కడ నుండి ఏదో కవర్ చేసి తప్పించుకొని వెళ్ళిపోతాడు. అప్పుడే అతని సూట్ వెనకాల ఒక స్ట్రీక్కర్ కన్పిస్తుంది. అది నర్మద ఫోటో తీస్తుంది. నాకు తెలిసి ఆ సూట్ కూడా రెంట్ ది.. అది కనుక్కోవాలని ఇద్దరు అనుకుంటారు. మరొకవైపు భాగ్యం దగ్గరికి శ్రీవల్లి వెళ్తుంది. నువ్వు నాకు మోసం చేసి పెళ్లి చేసావ్ కానీ ఆయన ఇప్పుడు డబ్బు అడుగుతున్నాడని శ్రీవల్లి అంటుంది. అప్పుడే ఆనందరావు ఇంటికి వచ్చి ప్రేమ, నర్మద నన్ను చూసేసారు కానీ తప్పించుకొని వచ్చానని చెప్పగానే ఇక వాళ్లకు మన గురించి నిజం తెలిసిపోయినట్లేనని శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత నర్మద, ప్రేమ కలిసి ఆనందరావు సూట్ రెంట్ కి తీసుకున్న ప్లేస్ కి వెళ్లి ఆనందరావు ఫోటో చూపించి ఇతను మీ దగ్గర సూట్ తీసుకున్నాడా అని అడుగుతారు. తీసుకున్నాడని అతను చెప్పగానే ఇద్దరు షాక్ అవుతారు. అసలు వాళ్ళేదో చేస్తున్నారు.. కనుక్కోవాలని ఇద్దరు అనుకుంటారు. మరొకవైపు ఇంట్లో అందరు భోజనం చేస్తుంటారు శ్రీవల్లి టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే నర్మద, ప్రేమ వచ్చి ఈ రోజు శ్రీవల్లి అక్క వాళ్ళ నాన్న గారిని కలిసాం.. ఇడ్లీ అమ్ముతుంటే అనగానే అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : జ్యోత్స్న, గౌతమ్ ల ఎంగేజ్ మెంట్.. పెళ్ళిలో వాళ్ళిద్దరు ఉండొద్దంట!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -401 లో..... అసలు జ్యోత్స్న ఏం చేసిన అది తెలియకుండా చేసిందే తప్పా.. కావాలని కాదు.. జ్యోత్స్న తప్పు చేసిందన్నారు కానీ ఇప్పుడు మామయ్య గారిని తీసుకొని మరి వదినని చూడడానికి వెళ్ళిందని దశరథ్ తో సుమిత్ర అంటుంది. మీరు నన్ను ఇలా అనుకోవాలనే కదా.. నేను తాత బ్రతిమిలాడి మరి తీసుకొని వెళ్ళిందని జ్యోత్స్న అనుకుంటుంది. నన్ను నువ్వు ఒక్కదానివి నమ్మితే చాలు మమ్మీ ఎందుకు అంటే డాడ్ ఎప్పుడు నన్ను నమ్మాడని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. జ్యోత్స్న ని నేను ఎప్పుడు నమ్మలేను.. అసలు దాస్ ని ఎందుకు చంపాలనుకుందో తెలిసేవరకు అని దశరథ్ అనుకుంటాడు. ఆ తర్వాత శివన్నారాయణ వచ్చి.. రేపు ఎవరు ఎక్కడికి వెళ్ళకండి.. గౌతమ్ తన పేరెంట్స్ తో ముహూర్తం పెట్టించడానికి వస్తున్నాడని అనగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. మరుసటిరోజు ఉదయం జ్యోత్స్న రెడీ అవుతుంది. గ్రానీ నేను చెప్పినట్టు చెయ్ అని పారిజాతానికి చెప్తుంది జ్యోత్స్న. ఆ తర్వాత గౌతమ్ తన పేరెంట్స్ ని తీసుకొని శివన్నారాయణ ఇంటికి వస్తాడు. దీప, కార్తీక్ ఇద్దరు మర్యాదలు చేస్తూ సందడి చేస్తుంటారు. అప్పుడే పారిజాతం వచ్చి జ్యోత్స్న కిందకి రాలేదు.. పాపం జ్వరం వచ్చిందని అనగానే జ్యోత్స్న దగ్గరికి వెళ్తాడు కార్తీక్. గౌతమ్ వాళ్ళ అమ్మని సుమిత్ర తీసుకొని వెళ్తుంది. నీ దగ్గరికి గౌతమ్ ని కూడా రమ్మని అంటావా అనగానే వద్దని జ్యోత్స్ననే కిందకి వస్తుంది. ఆ తర్వాత జ్యోత్స్న, గౌతమ్ ఎంగేజ్ మెంట్ కి ముహూర్తం పెడతారు. గౌతమ్ వాళ్ళు వెళ్ళిపోతారు కానీ వాళ్ళ అమ్మ ఆగి ఎంగేజ్ మెంట్ లో దీప కార్తీక్ మాత్రం ఉండొద్దని సుమిత్రకి చెప్పి వెళ్తుంది. అప్పుడే శ్రీధర్ పారిజాతానికి ఫోన్ చేసి మాట్లాడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : నగలు దొంగతనం చేసింది రాహుల్.. అప్పు, స్వప్నల ఇన్వెస్టిగేషన్ షురూ!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -765 లో.... రాజ్ కి బాస్ లాగా ట్రైనింగ్ ఇస్తుంది కావ్య. అందరిలో ఆఫీస్ లో ఎలా నడవాలి.. ఎలా తినాలి.. ఇలా ప్రతీది ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. అదంతా రుద్రాణి చూసి యామినికి ఫోన్ చేసి చెప్తుంది. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు రాజ్ ఆఫీస్ కి రాకుండా చేయమని యామినికి చెప్తుంది రుద్రాణి. మరొకవైపు స్వప్న దగ్గరికి అప్పు వస్తుంది. అక్క నీకు ఎలా కనిపిస్తున్నాను.. గిల్టీ నగలు ఇచ్చి నన్ను మెరుగు పెట్టించమని ఇచ్చావని అప్పు అనగానే స్వప్న షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావే అవి తాతయ్య గారు ఇచ్చిన ఏడు వరాల నగలు అని స్వప్న అనగానే.. చూడు ఒకసారి వీటిని ఒరిజినల్ నగలు అంటారా అనగానే స్వప్న వాటిని చూసి షాక్ అవుతుంది. రాహుల్ నగలు లోపల పెట్టేటప్పుడు చూసింది గుర్తు చేసుకొని అసలు రాహుల్ ఆల్రెడీ నగలు తీసుకొని గిల్టీ నగలు పెడుతుండగా చూసా కానీ అప్పుడు నగలు దొంగతనం చేస్తున్నాడని గొడవ అయిందని స్వప్న అంటుంది. నా మొగుడు ఎలాంటి వాడో చూసావా అని స్వప్న బాధపడుతుంది. అసలు రాహుల్ నగలు తియ్యాల్సిన అవసరం ఏంటి? మనం ఇన్వెస్టిగేషన్ చెయ్యాలని అప్పుతో స్వప్న అంటుంది. మరొకవైపు కావ్యతో రాజ్ ఫోన్ చేసి మాట్లాడతాడు. ఆ తర్వాత స్వప్న కావాలనే లాకర్ కీస్ రాహుల్ కి కనపడేలా పెడుతుంది. కావాలనే అప్పుతో ఫోన్ లో మాట్లాడినట్లు చేస్తుంది. అప్పు నాతో మాట్లాడాలి అంట నేను వెళ్తున్నాను.. పాపని చూడమని రాహుల్ తో స్వప్న అనగానే రాహుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. స్వప్న వెళ్ళగానే లాకర్ నుండీ ప్రాపర్టీ పేపర్స్ తీసుకొని రాహుల్ వెళ్తాడు. అదంతా అప్పు, స్వప్న చూస్తారు. అసలు రాహుల్ ఏం చేస్తాడో చూడాలని ఇద్దరు అనుకుంటారు. మరుసటి రోజు రాజ్ ఆఫీస్ కి వెళ్తాడు. రాజ్ రాగానే శృతి టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

హరి నువ్వు రాసుకుంటేనే నీకు పంచులు వస్తాయి

  కూకు విత్ జాతిరత్నాలు షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఐతే అది ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ఇక ఈ షోకి హరి, ఇమ్మానుయేల్, బాబా భాస్కర్, సుహాసిని, రీతూ వచ్చారు. హరి మెడలో ఉన్న విజిల్ చూసిన ప్రదీప్ "ఏంటి నువ్వు మెడలో విజిల్ వేసుకొచ్చావ్" అని అడిగాడు. దానికి ఇమ్ము ఆన్సర్ ఇచ్చాడు. "పొద్దున్నే మనోడు ఇదే పనికి వెళ్తూ ఉంటాడు. విజిల్ వేయగానే తడి చెత్త, పొడి చెత్త తీసుకొస్తారు" అని కౌంటర్ వేసాడు ఇమ్ము. ఇక ఈ షోకి తమ్ముడు మూవీ నుంచి ఎవర్ గ్రీన్ యాక్ట్రెస్ లయ కూడా ఈ షోకి వచ్చింది. అలాగే దిల్ రాజు కూడా వచ్చారు. "దిల్ రాజు గారు మీరు ఏ ఫుడ్ ఇష్టం" అంటూ రాధ అడిగారు. "ఫేవరేట్ ఫుడ్ అంటే నాకు డెజర్ట్స్ అంటే చాలా ఇష్టం" అని చెప్పారు. దానికి ఇమ్ము రియాక్ట్ అయ్యాడు. "రాజు గారికి స్వీట్ ఇష్టం కాబట్టి కాకరకాయతో కూర కాకుండా స్వీట్ చేస్తాం" అని చెప్పాడు. దాంతో దిల్ రాజు షాకై కాకరకాయతో స్వీట్ ఏంట్రా అంటూ కౌంటర్ వేశారు. తర్వాత మళ్ళీ "చిన్నప్పుడు ఆయా నా మీద అరుస్తూ ఉంటే ఆయా ఆయా అని పిలిచేవాడిని కాదు లయా లయా అని పిలిచేవాడిని" అని చెప్పేసరికి లయ, దిల్ రాజు నవ్వేశారు. ఇక హరి ఏదో డైలాగ్ చెప్పబోయాడు కానీ పాపం చెప్పలేకపోయాడు. దాంతో రాధ హరి పరువు తీసేసారు. "నీకు స్పాంటేనియస్ గా రావు పంచులు నువ్వు రాసుకుంటేనే వస్తాయి" అనేసరికి హరి షాక్ అయ్యాడు.

ఓదెల 2 లో తమన్నాలా ఉన్నావ్...మంచిగున్నావ్ లేడి అఘోరాలా

విరూపాక్ష మూవీలో కనిపించేది చిన్న రోల్ లో ఐనా కానీ ప్రతీ ఒక్కరి మనస్సులో మంచి స్థానం సంపాదించుకుంది సోనియా సింగ్. బుల్లితెర మీద సోనియా సింగ్ - పవన్ సిద్దు జోడి చాలా షోస్ లో కనిపిస్తూ అలరిస్తూ ఉంటారు. రీసెంట్ గా సోనియా కాశీ వెళ్ళింది. శివుని భక్తిలో మునిగి తేలుతోంది. దానికి సంబంధించిన పిక్స్ ని ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. "శివుడిని పట్టుకునేది నేను కాదు... నన్ను ఎప్పుడూ వదలనిది శివుడే." అంటూ కాప్షన్ పెట్టుకుంది. నెటిజన్స్ ఐతే సోనియా పిక్స్ కి కామెంట్స్ పెడుతున్నారు. "హర్ హర్ మహాదేవ..కాశీ వెళ్ళావా సిస్టర్. ఉన్న అఘోరాలు చాలు బాబోయ్. బాబు సిద్దు ఎక్కడున్నావ్ కొంచెం సూడు నాయనా.. అలా వదిలేయకు సోనిని. సిద్దు గారు ఎక్కడున్నారు. ఓదెల 2 లో తమన్నాలా ఉన్నావ్...మంచిగున్నావ్ లేడి అఘోరాలా" అంటూ సెటైరికల్ కామెంట్స్ పెడుతున్నారు.సోనియా యూట్యూబర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. తర్వాత షార్ట్ ఫిలిమ్స్ లో చేసింది. పవన్ సిద్దుతో కలిసి "రౌడీ బేబీ, హే పిల్ల" అనే యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా వీడియోస్ చేసేది. దాంతో టీవీ షోస్ లో ఆఫర్స్ వచ్చాయి. ఢీ 19  సీజన్ కి వీళ్లద్దరూ మెంటార్స్ గా వచ్చారు. విరూపాక్ష, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, శశి మధనం వంటి మూవీస్ లో నటించింది. ఒక నెల క్రితమే అరుణాచలేస్వరుడిని దర్శించుకుంది. ఇక ఇప్పుడు కాశీకి కూడా వెళ్ళొచ్చింది. ఇక "యమలీల ఆ తర్వాత" సీరియల్ లో కూడా నటించింది.

Illu illalu pillalu : ఇడ్లీలు అమ్ముతూ కన్పించిన శ్రీవల్లి నాన్న.. మరి ఆ పది లక్షలు?

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -201 లో... ధీరజ్ ని తీసుకొని ప్రేమ గుడికి వస్తుంది. అక్కడ పంతులు మంచిమాటలు చెప్తుంటే.. ప్రేమ వింటూ ఉంటుంది. నేను ఎలాగైనా.. ఎవరు ఏమన్నా కూడా ధీరజ్ కి సాయంగా ఉండాలని ప్రేమ అనుకుంటుంది. ధీరజ్ దగ్గరికి వెళ్లి రెండు వేల్లు చూపించి ఒక వేలిని పట్టుకోమంటుంది. ధీరజ్ పట్టుకుంటుంటాడు.. థాంక్స్ రా అని ప్రేమ అనగానే ఇదివరకు ఇలాగే చేసి ఇంట్లో గొడవకి కారణం అయ్యావ్.. ఇప్పుడు ఏం చేస్తున్నావని ధీరజ్ అనగానే ఏం లేదని ప్రేమ అంటుంది. ఆ తర్వాత మీ అమ్మ వాళ్ళింటికి వెళదాం పదా.. పది లక్షల గురించి అడగాలని  శ్రీవల్లితో చందు అంటాడు. మా వాళ్ళు ఊళ్ళో లేరని శ్రీవల్లి అనగానే చందు కోపంగా వెళ్లిపోతాడు. అదంతా నర్మద విని శ్రీవల్లి దగ్గరికి వచ్చి అడుగుతుంది. ఏంటి మ్యాటర్ పది లక్షలు ఏంటని అడుగుతుంది. మొగుడు పెళ్ళాం మాట్లాడుకుంటే వింటున్నావా.. బుద్ది లేదా అంటూ శ్రీవల్లి కోప్పడుతుంది. మరొకవైపు ప్రేమ డాన్స్ క్లాస్ చెప్పాలని నిర్ణయం తీసుకొని వెళ్తుంది. పిల్లలకి డాన్స్ నేర్పిస్తుంటుంది. అప్పుడే నర్మద ఫోన్ చేసి అర్జెంట్ గా మాట్లాడాలని రమ్మని చెప్తుంది. కాసేపటికి నర్మదని ప్రేమ కలుస్తుంది చందు, శ్రీవల్లి మాట్లాడుకున్నది మొత్తం చెప్తుంది. అసలు వాళ్ళ ఫ్యామిలీ గురించి కనుక్కోవాలని ప్రేమ, నర్మద అనుకుంటారు. అలా వెళ్తుంటే దారిలో శ్రీవల్లి వాళ్ళ నాన్న ఆనందరావు రోడ్డుపై ఇడ్లీ అమ్ముతూ కనిపిస్తాడు. ప్రేమ, నర్మదని ఆనందరావు చూసి షాక్ అవుతాడు. తరువాయి భాగంలో ప్రేమ, నర్మద ఇంటికి వచ్చి.. శ్రీవల్లి అక్క మీ నాన్న ఇడ్లీ అమ్ముతు కన్పించాడని చెప్పగానే అందరు షాక్ అవుతారు. శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.    

Karthika Deepam2 : యజమాని హోదాలో కూతురి దగ్గరికి వచ్చిన శివన్నారాయణ.. అక్కడేమో పారిజాతం!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -400 లో.... శివన్నారాయణ జ్యోత్స్న కలిసి కాంచనని చూడడానికి వస్తారు. అప్పుడే కార్తీక్ దీప కూడా వస్తారు. శివన్నారాయణని నాన్న అని కాంచన పిలవబోతుంటే.. వద్దు ఆ పిలుపు అక్కడితోనే ఆపేయ్ అమ్మా.. ఇప్పుడు అయ్యగారు ఏ హోదాలో వచ్చారో తెలియదు కదా అని కార్తీక్ అనగానే ఏంట్రా ఆ మాటలు అని కాంచన అంటుంది. నా దగ్గర పని చేసే డ్రైవర్ వాళ్ళ అమ్మకి బాలేకపోతే చూడడానికి వచ్చాను.. మీ యజమానిగా వచ్చానని శివన్నారాయణ అనగానే కాంచన బాధపడుతుంది. కార్తీక్, శివన్నారాయణల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. నాపై కోపం పోవాలని తాతని ఇక్కడికి బ్రతిమిలాడి తీసుకొని వచ్చానని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత శివన్నారాయణ మాటలకి కాంచన బాధపడుతుంది. మరొకవైపు శ్రీధర్ ఇంటికి వస్తుంది పారిజాతం. నీ అల్లుడిని మా ఇంటికి పంపించి వాడు తిట్లు తినేలా చేసావని గొడవ పడుతుంది. మీ మనవడు ఏం చేసాడో తెలుసా అసలు ఎవరో ఫ్రెండ్ కి పది లక్షలు అప్పు ఇప్పించి మోసపోయాడు.. ఇప్పుడు వీడే ఆ డబ్బు కట్టాలని  

Brahmamudi : బాస్ గెటప్ లో ఆఫీస్ కి వెళ్ళిన రాజ్.. శృతి షాక్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -764 లో... స్వప్న లాకర్ ఓపెన్ చేయాలని రాహుల్ చూస్తుంటే.. స్వప్న వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయబోతున్నావని స్వప్న అనగానే ఏం లేదని రాహుల్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. రాహుల్ వాలకం చూస్తుంటే మళ్ళీ ఏదో తప్పు చేస్తున్నాడని స్వప్న అనుకుంటుంది. మరొకవైపు అపర్ణ, ఇందిరాదేవి మాట్లాడుకుంటుంటే అప్పుడే రాజ్ ఎంట్రీ ఇస్తాడు. కావ్య ఏం అంటుందని రాజ్ ని అపర్ణ అడుగుతుంది. తనకి ఆఫీస్ లో ఏదో ప్రాబ్లమ్ అంట హెల్ప్ చెయ్యమని అంటుందని రాజ్ చెప్పగానే.. ఓహ్ అంతేనా అని అపర్ణ డిస్సపాయింట్ అవుతుంది. అప్పుడే కావ్య వచ్చి మీరు నేర్చుకోవల్సింది చాలా ఉందని రాజ్ ని కావ్య లోపలకి తీసుకొని వెళ్తుంది. మరొకవైపు అప్పుకి స్వప్న తన ఏడు వారాల నగలు తీసుకొని వచ్చి ఇస్తుంది. వీటిని మెరుగు పెట్టించమని స్వప్న అనగానే సరే అని కావ్య అంటుంది. రాజ్ కి కావ్య సూట్ వేసి రాజ్ లాగా బాస్ లాగా నడవమని ట్రైనింగ్ ఇస్తుంది. ఆ తర్వాత రాజ్ కి కావ్య ఎలా తినాలో కూడా ట్రైనింగ్ ఇస్తుంది. అదంతా రుద్రాణి చూసి అసలు కావ్య ఏం చేస్తుందని అనుకుంటుంది. తరువాయి భాగంలో రాజ్ ఆఫీస్ కి వెళ్లి శృతి తో అందరి ఎంప్లాయిస్ పిలవమని చెప్తాడు. దాంతో శృతి కావ్యకి ఫోన్ చేసి రాజ్ సర్ గతం మర్చిపోయాడని ఎంప్లాయిస్ కి ఎవరికి తెలియదు కదా.. ఇప్పుడు సర్ వాళ్లని పిలవమని అంటున్నాడని శృతి అంటుంది. దాంతో కావ్య కంగారుపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ఒక్క సినిమా అన్నా రాజమౌళి గారితో వర్క్ చేయాలని ఉంది

  కోర్ట్ మూవీతో హిట్ కొట్టిన కుర్రాడు రోషన్. రోషన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇంట్రడ్యూస్ అయ్యి ఒక ప్రామిసింగ్ యాక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు. ఇక రీసెంట్ గా ఒక చిట్ చాట్ షోలో కొన్ని విషయాలను షేర్ చేసుకున్నాడు.  "ఢీ జూనియర్స్ సీజన్ 2  లో చేసే అవకాశం వచ్చింది. డ్యాన్సింగ్ షోతో నా కెరీర్ స్టార్ట్ అయ్యింది. ఫిలిమ్స్ ప్రకారం "ఈ నగరానికి ఏమయ్యింది" అనేది ఫస్ట్ మూవీ. సలార్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. నాని అన్న అంటే నాకు చాల ఇష్టం. కోర్ట్ లాంటి మూవీని నమ్మి కొత్త వాళ్ళను ఇంట్రడ్యూస్ చేయడం నిజంగా గొప్ప విషయం. సరిపోదా శనివారం మూవీ టైములో నేను ఆయన్ని చూసాను. నాకు ఆయనతో మాట్లాడేటప్పుడు ఏదో పెద్ద హీరోతో మాట్లాడుతున్న ఫీల్ రాదు సొంత అన్నతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది. ఫలక్నుమా దాస్ మూవీలో విశ్వక్సేన్ అన్నతో చేసాను. ఆయన చాలా ఫ్రెండ్లీగా జోక్స్ వేస్తూ ఉంటారు. కోర్ట్, టుక్ టుక్ మూవీస్ చేసాం, ఇప్పుడు అల్ ఇండియా ర్యాంకర్స్ మూవీతో ఆడియన్స్ ని అలరిస్తున్నాం. చిరు గారి డాన్స్ అంటే ఇష్టం. నేను నా లైఫ్ లో ఫస్ట్ టైం థియేటర్ కి వెళ్లి చూసిన సినిమా మగధీర. నాకు ఒక్క సినిమా అన్నా రాజమౌళి గారితో వర్క్ చేయాలని ఉంది. హీరో నాని ఒక వైపు మంచి కంటెంట్ ఉన్న మూవీస్ లో తాను నటిస్తూ అంతకంటే బెటర్ కంటెంట్ ఉన్న మూవీస్ తన దగ్గరకు వస్తే మాత్రం వాటిని నిర్మిస్తూ కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తున్నాడు. అలాంటి మూవీ కోర్ట్. ఆ మూవీ కుర్రాడు రోషన్ కి టర్నింగ్ పాయింట్ అయ్యింది.  

సిద్దార్థ్ కి ఎన్ని కష్టాలో...

  కూకు విత్ జాతిరత్నాలు షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి గెస్ట్ గా సిద్దార్థ్ వచ్చాడు. ఇక రాగానే "అదిరే అదిరే" సాంగ్ ని ప్లే చేయడంతో సిద్దార్థ్ కూడా మంచి జోష్ తో డాన్స్ చేసాడు. తర్వాత హోస్ట్ ప్రదీప్ అడిగాడు "మీకు వంటొచ్చు కదా" అని. "నేను రెగ్యులర్ కుక్ ని ఇక ఇప్పుడు పెళ్లయింది కదా ఇంకా రెగ్యులర్ కుక్ ని ఐపోయాను" అని చెప్పాడు సిద్దార్థ్. దాంతో అందరూ నవ్వేశారు. వెంటనే రాధ "సిద్దార్థ్ నేను అదితిది ఒక వీడియో చూసాను. మూన్ మూన్ మూన్ కా కట్ చేసి అంటూ భలే క్యూట్ గా చెప్తోంది కదా" అని అంది. దానికి సిద్ధార్థ్ " ఉల్లిపాయ కట్ చేసేటప్పుడు మీరు మూన్ మూన్ మూన్ షేప్ లా కట్ చేయాలి అని చెప్తుంది. ఏంటా షేప్ అంటే ఉల్లిపాయ కట్ చేసినప్పుడు ఆ షేప్ మూన్ లా ఉండాలట" అని చెప్పాడు. దానికి ప్రదీప్ "ఇంకా నయం ఆ రోజు అమావాస్య ఐతే ఎం కట్ చేయాలో తెలీదు" అని కామెడీ డైలాగ్ వేసేసరికి అందరూ నవ్వేశారు. తర్వాత జాతిరత్నాలుకి ఐరన్ బాక్స్  మీద ఆమ్లెట్ వేసే టాస్క్ ఇచ్చారు. కానీ ఆర్జే హేమంత్ మాత్రం గుడ్డు కొట్టి ఐరన్ బాక్స్ మీద వేయబోయాడు కానీ అది కాస్త కింద పడిపోయింది. దాంతో సిద్దార్థ్ "టైటిల్ లో ఒక నిజం ఉంది నిజాయితీ ఉంది. జాతిరత్నాలు అందరూ జాతిరత్నాలే" అంటూ అందరినీ చూస్తూ సెటైర్ వేసాడు. సిద్ధార్థ్ నటించిన 3 bhk మూవీ ప్రొమోషన్స్ కోసం వచ్చారు.  తెలుగు, తమిళ్ భాషల్లో ఈ మూవీ జులై 4 న రిలీజ్ కాబోతోంది. ఇదొక మిడిల్ క్లాస్ ఎమోషనల్ స్టోరీ. ఇందులో సొంత ఇంటి కలను సాకారం చేసుకున్నారా లేదా అన్నదే స్టోరీ లైన్.

సీరియల్స్ లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న ఆది

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయింది. "ఈ ఇంట వేడుక" పేరుతో ఈ ఎపిసోడ్ రాబోతోంది.  అందులో ఆది కోరికలు మాములుగా లేవు. సీరియల్ హీరోగా చేద్దామనుకుంటున్నా అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ షోకి సీరియల్స్ వాళ్ళను పిలిచారు. అందుకే పార్టీ అని చెప్పి సీరియల్స్ వాళ్ళను పిలిచి వాళ్ళ నుంచి ఎమోషన్స్ లాగేసి సీరియల్ హీరో ఐపోతా అని ప్లాన్ చేసుకున్నాడు. "వేయి శుభములు కలుగు నీకు, వసుంధర, మెరుపు కలలు, సంధ్య రాగం, అందాల రాక్షసి, జీవన తరంగాలు, ఆరో ప్రాణం" వంటి సీరియల్స్ వాళ్లంతా వచ్చారు. ఇక ఈ షోకి సీరియల్ సీనియర్ యాక్టర్ యమునా వచ్చింది. ఐతే రష్మీ ఆమె ఇలా చెప్పింది. "ఆయన కూడా సీరియల్ లో హీరోగా లాంఛ్ అవుదామనుకుంటున్నాడు" అని చెప్పింది. దాంతో యమునా "నేను మిమ్మల్ని చూసి అంకుల్ క్యారెక్టర్ చేస్తారేమో" అనుకుంటున్నా అంటూ సెటైర్ వేసింది. దానికి ఆది వాయిస్ కట్ ఐపోయింది. ఫ్యాన్ ఆఫ్ సీరియల్స్ అనే స్కిట్ చేశారు ఫైమా, నూకరాజు. ఫైమా ఐతే శిల్ప చక్రవర్తిని పట్టుకుని తెగ తిట్టింది. అడ్డొచ్చిన నూకరాజును బాదింది. ఇక తర్వాత సింగర్స్ కె సింగర్స్ లా పోటీ ఇచ్చారు ఫైమా, ఆది, నూకరాజు,  సుష్మ కిరణ్. వీళ్ళు మంచి మంచి సాంగ్స్ పాడి ఎంటర్టైన్ చేశారు. ఆది, నూకరాజు కలిసి పాడితే అదేదో మ్యాజిక్ ఉండండి అంటూ ఇంద్రజ కితాబిచ్చింది. అలాగే వీళ్ళందరికీ రకరకాల టాస్కులు ఇచ్చింది రష్మీ. ఇక లాస్ట్ లో కారాసాము చేసే కొంతమందిని తీసుకొచ్చారు. వాళ్ళు అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ప్రోమో ఫైనల్ లో శిల్ప చక్రవర్తి, సుష్మ కిరణ్ ఇద్దరూ కూడా వాళ్ళ వాళ్ళ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ని షేర్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.

Illu illalu pillalu : భర్తకి భార్య సపోర్ట్.. ఇడ్లీలు అమ్ముతుంటే చూసిన నర్మద, సాగర్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -200 లో... సాగర్ కి గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలో నర్మద చెప్తుంటుంది. సాగర్ చదువుతుంటే నర్మద పక్కనే ఉంటుంది. తను గట్టిగా చదువుతుంటే.. నువ్వు ఇలా చదివితే అందరు బయటకు వస్తారు.. అందరికి తెలిసిపోతుంది.. మెల్లగా చదవమని నర్మద అంటుంది. అయినా గట్టిగా చదువుతుంటే సాగర్ ని బయటకు తీసుకొని వెళ్లి ఇక్కడ చదువుకోమని నర్మద అంటుంది. ఒక పక్క సాగర్ చదువుతుంటే నర్మద అటు వైపు పడుకొని ఉంటుంది. నర్మద నడుము ని చూస్తూ సాగర్ చదువకుండా డిస్టబ్ అవుతాడు. అలా కాదని సాగర్ పక్కన వచ్చి కూర్చుంటుంది నర్మద. దాంతో సాగర్ చదువుతాడు. సాగర్ చదవడం శ్రీవల్లి చూస్తుంది. రైస్ మిల్ లో పని చేసేవాడికి బుక్ తో ఏం పని కొంచెం ఆలోచించాలని శ్రీవల్లి అనుకుంటుంది. మరొకవైపు ధీరజ్ ని తీసుకొని గుడికి వస్తుంది ప్రేమ. ఎందుకు ఇంత ప్రొద్దున ఇక్కడికి తీసుకొని వచ్చావని ధీరజ్ అనగానే గుడికి ప్రొద్దున్నే వస్తారని ప్రేమ అంటుంది. అక్కడ పంతులు అందరికి మంచి మాటలు చెప్తుంటాడు. ప్రేమ ఆ మాటలు విని నేను కూడా ధీరజ్ కి సాయంగా ఉండాలి.. మావయ్య ఏం అన్నా.. అత్తయ్య మాటలు అన్నా కూడా.. ధీరజ్ కి నేను సాయం ఉండాలని ప్రేమ డిసైడ్ అవుతుంది. తరువాయి భాగంలో శ్రీవల్లి వాళ్ళ నాన్న రోడ్ పై ఇడ్లీలు అమ్ముతుంటే ప్రేమ, నర్మద చూసి షాక్ అవుతారు. అతని దగ్గరకి వచ్చి బాబాయ్ ఇడ్లీ ఇవ్వు అనగానే సరేనని అతను వాళ్ళ వంక చూసి షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : కాశీని కొట్టేసిన కార్తీక్.. కాంచన కోసం దిగొచ్చిన శివన్నారాయణ!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -399 లో....జ్యోత్స్న చేసిన తప్పుని నిలదియ్యడానికి శివన్నారాయణ ఇంటికి కాశీ వెళ్తాడు. అక్కడ జ్యోత్స్నపై కాశీ కోప్పడతాడు. నేను చేసిన దానికి దీపకి సారీ చెప్పాను అయినా తృప్తి కాలేదు అనుకుంటా తమ్ముడిని రప్పించి మరి తిట్టిస్తుందని దీపపై అందరికి కోపం వచ్చేలా మాట్లాడుతుంది జ్యోత్స్న. నాకేం తెలియదు నేను కాశీని ఏం రమ్మన్నలేదని దీప అంటుంది. అసలు ఆ జ్యోత్స్న ఇలా తయారు కావడానికి ఆ పెద్దాయన కారణం అని శివన్నారాయణ గురించి కాశీ తప్పుగా మాట్లాడుతుంటే ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోమని కాశీపై కోప్పడుతాడు కార్తీక్. దీప కూడా నువ్వు వెళ్ళు కాశీ అంటూ ఏడుస్తుంది. నీ కన్నీళ్లు కూడా ఈ ఇంట్లో పడడానికి అర్హత లేదు అక్క.. ఈ ఇంట్లో అందరు రాక్షసులు అని కాశీ అనగానే కాశీ చెంప పగులగొడుతాడు కార్తీక్. కాశీ ని కార్తీక్ బయటకు పంపిస్తాడు. నా కూతురు కావాలనే కాశీని రెచ్చ గొట్టిందని దశరత్ అనుకుంటాడు. ఆ తర్వాత మీరు కాశీని కొట్టి తప్పు చేసారని కార్తీక్ తో దీప అంటుంది. కానీ తప్పలేదని కార్తీక్ అంటాడు. ఫోన్ చేసి కాశీతో మాట్లాడండి అని దీప అంటుంది. ఆ తర్వాత కార్తీక్, దీప ఇద్దరు కలిసి స్వప్న, కాశీలని కలిసి మాట్లాడతారు. కోపంలో అలా చేసానని కాశీతో కార్తీక్ అనగానే.. మీకు నన్ను కొట్టే అర్హత ఉందని కాశీ అంటాడు. మరొకవైపు కాంచనని చూడడానికి శివన్నారాయణ, జ్యోత్స్న కాంచన ఇంటికి వెళ్తారు. వాళ్ళతో మాట్లాడుతుంటే అప్పుడే దీప, కార్తీక్ ఎంట్రీ ఇస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : తమ్ముడు రాజ్ ఇచ్చిన సర్ ప్రైజ్.. రేవతి ఎమోషనల్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -763 లో......రేవతి తన కొడుకుతో బయటకు వస్తుంది. అమ్మా నా పుట్టినరోజు కదా నాకు ఈ షూస్ కోనివ్వమని రేవతి కొడుకు అడుగుతాడు. నా దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదని రేవతి తన కొడుకుకి సర్ది చెప్పి ఇంటికి తీసుకొని వెళ్తుంది. అదంతా రాజ్, కావ్య చూసి బాధపడతారు. అలా ఆశలున్నవారికి కొనే స్థోమత ఉండదని రాజ్ అనగానే.. మనకి కొనే స్థోమత ఉంది కదా వెళ్లి కొందామని కావ్య అంటుంది. వాళ్ళ ఇల్లు తెలియదు కదా అని రాజ్ అనగానే నాకు తెలుసని కావ్య అంటుంది. మరొకవైపు రేవతి కొడుకు తన నాన్న కేక్ తీసుకొని వస్తాడని ఎదరుచూస్తుంటే అతను ఖాళీ చేతులతో వస్తాడు.. అప్పుడే రాజ్, కావ్య ఇద్దరు రేవతి ఇంటికి వస్తారు. రాజ్ ని చూసిన రేవతి వెళ్లి హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతుంది. నేను మీకు తెలుసా అని రాజ్ అనగానే.. నా తమ్ముడు కూడా ఇలాగే ఉంటాడని రేవతి కవర్ చేస్తుంది. ఆ తర్వాత బాబుకి షూస్ సర్ ప్రైజ్ ఇచ్చి కేక్ కట్ చేపిస్తారు. రేవతిని రాజ్ అక్క అని తన భర్తని బావ అని పిలుస్తాడు. వాళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ రేవతి ఇంట్లోకి వచ్చి ఫోటో చూస్తూ ఏడుస్తుంది. ఇప్పుడైన నిజం చెప్పొచ్చు కదా అని తన భర్త అనగానే.. వాడు ఇప్పుడు ఇంట్లో వాళ్ళని గుర్తు పట్టలేని సిచువేషన్ లో ఉన్నాడని రేవతి అంటుంది. మరొకవైపు కావ్య, రాజ్ కార్ లో వెళ్తు సరదాగా మాట్లాడకుంటుంటారు. మరొకవైపు రాహుల్ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసి నాకు ప్రాపర్టీ కావాలని అడుగుతుంది. దాంతో రాహుల్ లాకర్ కీస్ కోసం వెతుకుతుంటే అప్పుడే స్వప్న వస్తుంది. తరువాయి భాగంలో రాజ్ కి కావ్య  బాస్ లాగా ట్రైనింగ్ ఇస్తుంటే..అది రుద్రాణి చూసి యామినికి ఫోన్ చేసి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

చికుబుకు రైలే సాంగ్ 100 పెర్ఫార్మెన్స్ లు ఇచ్చిన స్పెషలిస్ట్

ఢీ 20 షోలో కంటెస్టెంట్స్, కొరియోగ్రాఫర్స్ అందరూ వస్తున్నారు. ఈ షోకి విక్రమాదిత్య, శ్రీవాణి కూతురు రాజా నందిని కూడా కంటెస్టెంట్ గా వచ్చింది. ఆమెకు శశి మాష్టర్ కొరియోగ్రాఫ్ చేస్తున్నాడు. ఇక కూతురి పెర్ఫార్మెన్స్ చూసిన శ్రీవాణి, విక్రమ్ ఇద్దరూ కూడా స్టేజి మీదకు వచ్చారు. ఇద్దరూ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. "నా కూతురు ఇంత పెద్ద స్టేజి మీద పెర్ఫార్మ్ చేయడం ఇంతకన్నా అదృష్టం ఉంటుందా అనిపించింది నాకు ఒక ఆర్టిస్ట్ గా. నేను నా 7th క్లాస్ నుంచి ఈ ఈటీవీ స్టేజి మీద సినిరంజని, మనోరంజని అనే షోస్ చేసాను. నా కూతురు పుట్టాక దాన్ని డాన్స్ క్లాస్ కి పంపించాలి అనుకున్నా కుదిరేది కాదు. ఏ డాన్స్ క్లాస్ కి వెళ్ళలేదు రీల్స్ చేస్తూ ఇంట్లోనే డాన్స్ నేర్చుకుంది. ఢీ నుంచి కాల్ వచ్చేసరికి చేయగలదా లేదా అన్న భయంగా అనిపించింది" అంటూ శ్రీవాణి చెప్పింది. తర్వాత విక్రమ్ కూడా మాట్లాడాడు " నేను డాన్సర్ ని ప్రభుదేవా మాష్టర్ అంటే ప్రాణం. ఆయన్ని కలిసి ఆయన ముందు డాన్స్ కూడా చేసాను. 2022 యాక్సిడెంట్ అయ్యింది. అప్పటి నుంచి డాన్స్ చేయలేకపోయా. కానీ నా కూతురు డాన్స్ చేయడం ఆనందంగా ఉంది. ప్రభుదేవా గారు అంటే ఎంత ఇష్టం అంటే ఆయన సాంగ్ చికుబుకు చికుబుకు రైలే సాంగ్ వల్ల.. ఆ సాంగ్ ని నేను 100 పెర్ఫార్మెన్స్ లు చేసాను. ఈ సాంగ్ పెర్ఫార్మెన్స్ లో స్పెషలిస్ట్ గా ఉన్నానంటూ ఒక న్యూస్ ఆర్టికల్ గా కూడా రాశారు. సూపర్ పోలీస్ అనే మూవీ షూటింగ్ టైములో సౌందర్యగారు చేస్తున్నారు. ప్రభుదేవా గారు కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. నేను వెళ్లి ఆయన ముందు కూడా డాన్స్ చేసి చూపించే ఛాన్స్ వచ్చింది." అని చెప్పి అప్పట్లో ప్రభుదేవా మాష్టర్ తో దిగిన ఫోటో అలాగే ఆ న్యూస్ ఆర్టికల్ ని కూడా స్క్రీన్ మీద చూపించారు. ఇక తన కూతురికి వెండి పట్టీలు తొడిగాడు విక్రమాదిత్య.  

బిగ్ బాస్ హోస్ట్ ని మార్చేయాలి..

  బిగ్ బాస్ కొత్త సీజన్ త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇప్పుడు కంటెస్టెంట్స్ కోసం వెతుకులాట మొదలయ్యింది. అలాగే కామన్ మ్యాన్ క్యాటిగారీ కోసం కూడా రెజిస్ట్రేషన్స్ ఓపెన్ చేశారు. ప్రోమోలు వస్తున్నాయి. ఈ టైములో గత బిగ్ బాస్ కంటెస్టెంట్ కౌశల్ బిగ్ బాస్ విషయంలో సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు. బిగ్ బాస్ ఒకే కంటెస్టెంట్ ప్రతీ సీజన్ లో కనిపిస్తూ ఉంటే బోరింగ్ గా ఉంటుంది. కానీ హోస్ట్ మాత్రం ప్రతీ సీజన్ ఉండాల్సి వస్తే మాత్రం ఆడియన్స్ కి కంటెస్టెంట్స్ కి కొత్తదనాన్ని చూపించాలి. ఆల్రెడీ హోస్ట్ నాగార్జున గారిని ఐదారు సీజన్స్ నుంచి చూస్తూనే ఉన్నాం. హోస్ట్ నాగార్జున గారు ఈ సీజన్ కి ఒక కొత్తదనాన్ని తీసుకొస్తారు అని ఆశిద్దాం అంటూ చెప్పుకొచ్చారు. ఒక కొత్తదనంతో యాంకరింగ్ చేసే వాళ్ళు ఉంటే జనాలకు రొటీన్ కాకుండా ఉంటుంది. అప్పుడు బిగ్ బాస్ రేటింగ్స్ కూడా పీక్స్ కి వెళ్తుంది. 2017 లో మొదలైన బిగ్ బాస్ షో సక్సెస్ ఫుల్ గా 8 సీజన్స్ ని కంప్లీట్ చేసుకుంది. 1st సీజన్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్, 2nd సీజన్ కి న్యాచురల్ స్టార్ నాని హోస్ట్ చేశారు. ఆ తర్వాత 3rd సీజన్ నుంచి 8th సీజన్ వరకు నాగార్జున హోస్ట్ ఉన్నారు. గత రెండు సీజన్స్ నుంచి కూడా హోస్ట్ ని మార్చమంటూ ఆడియన్స్ కూడా కామెంట్స్ చేస్తూ ఉంటారు. కానీ కంటెస్టెంట్స్ మారుతున్నారు తప్ప హోస్ట్ మాత్రం చేంజ్ కావడం లేదు. బిగ్ బాస్ లో అందరూ కంటెస్టెంట్స్ గా వెళ్లి ఎన్ని రోజులున్న వాటికి ఎలాగో డబ్బులొస్తాయి కదా అని మేకప్ లు వేసుకుని కూర్చుంటున్నారు కానీ ఆట మీద కాన్సన్ట్రేట్ చెయ్యట్లేదు. టాస్కులు ఆడట్లేదు..గెలవడానికి ట్రై చెయ్యట్లేదు. ఐతే బిగ్ బాస్ కి బాగా ఫేమ్ ఉన్న కంటెస్టెంట్స్ ని తీసుకొస్తే వాళ్ళు ఎం చేస్తారా అని ఆడియన్స్ చూస్తారు అదే కొత్త కొత్త వాళ్ళను తీసుకొస్తే వాళ్ళేం చేస్తే వీళ్ళకెందుకు అని ఎవరూ సరిగా చూడరు అంటూ బిగ్ బాస్ మీద అనాలిసిస్ చేసి చెప్పాడు కౌశల్.