కాశీ విశ్వనాథుడి సేవలో తరించిన రష్మీ గౌతమ్

  బుల్లితెర మీద గత పదేళ్లుగా జబర్దస్త్ కి యాంకర్ గా చేస్తున్న రష్మీ గౌతమ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మొదట్లో సుడిగాలి సుధీర్, రష్మీ కలిసి జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ ని హోస్ట్ చేసేవాళ్లు. కానీ తర్వాత సుధీర్ మూవీస్ లో ఛాన్సెస్ రావడంతో వెళ్ళిపోయాడు. అలా ఈ రెండు షోస్ ని రష్మీ నిర్వహిస్తూ వస్తోంది. ఇక రీసెంట్ గా రష్మీకి కో-యాంకర్ గా మానస్ జతయ్యాడు. రష్మీ ఎప్పుడూ సోషల్ మీడియాలో చాల యాక్టివ్ గా ఉంటుంది. రీసెంట్ గా ఒక హెల్త్ ఇష్యూని కూడా ఫేస్ చేసింది. ట్రీట్మెంట్ చేయించుకుని వచ్చింది. దాంతో ఆమె కొంచెం తగ్గిపోయింది కూడా. అలాగే ఇప్పుడు కొన్ని పిక్స్ ని పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఆమె కాశి వెళ్లి అక్కడ దర్శనం చేసుకున్న పిక్స్ ని పోస్ట్ చేసింది. అలాగే "కాశీ మనుషులు నిర్మించిన నగరం కాదు.. ఇది దేవతలు కొలువై ఉండే నగరం, శివుని త్రిశూలం అంతా చూసుకుంటుంది. కాశీ విశ్వనాథుని ఆధ్యాత్మిక విశ్వాసం " అంటూ హరహర మహాదేవ, హరహర గంగే, కాశీవిశ్వనాథ అంటూ హాష్ ట్యాగ్స్ పెట్టింది. నుదిటి మీద త్రిసూలం బొట్టుతో రష్మీ కొత్తగా అందంగా కనిపించింది ఈ పిక్స్ లో . ఇక నెటిజన్స్ ఐతే హరహరమహదేవా, చాలా బాగున్నారు, ఓం నమఃశివాయ, శివ శంభో, మంచిగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం..." అంటూ విష్ చేస్తున్నారు. ఇక జబర్దస్త్ కి మధ్యలో యాంకర్స్ గా సౌమ్య, సిరి హన్మంత్ వచ్చారు కానీ వాళ్ళు ఎక్కువ కాలం నిలబడలేకపోయారు. రష్మీ ఒక్కతే స్టాండర్డ్ గా ఆ షోకి ఫిక్స్ ఐపోయింది. అలాగే కొన్ని మూవీస్ లో కూడా నటించింది.

అమెరికాలో ఫ్రీడమ్ ఉంటుంది..జడ్జ్ చేసేవాళ్ళు ఉండరు

  హీరోయిన్ లయ అందమైన తెలుగింటి అమ్మయిలా ఉంటుంది. ఆమె ఇండస్ట్రీలో ఎన్నో మూవీస్ లో నటించింది. ప్రేమించు, స్వయంవరం, అదిరిందయ్యా చంద్రం, మనోహరం వంటి మంచి మూవీస్ లో నటించింది. ఐతే తర్వాత పెళ్ళైపోయి అమెరికాలో సెటిల్ ఐపోయింది. రీసెంట్ గా నితిన్ తో కలిసి తమ్ముడు అనే మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇక ఒక ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు చెప్పింది. "ఇండియన్ లైఫ్ స్టైల్ చాలా బెటర్. ఎందుకంటే ఇక్కడ చాల మంది మనకు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు. ఆర్డర్ పెట్టగానే ఫుడ్ కానీ గ్రోసరీస్ కానీ అందుబాటులో ఉంటాయి. మనకు ఫామిలీ లేకపోయినా బతికేయొచ్చు. ఎవరో ఒకళ్ళు ఉంటూనే ఉంటారు. ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఉంటారు. నిమిషాల్లో అన్ని పనులు ఐపొతాయి. చాలా ఆప్షన్స్ ఉంటాయి. కానీ ఇవే పనులు నేను అమెరికాలో చేయాలంటే తలప్రాణం తోకకొస్తుంది. అన్ని మనమే తెచ్చుకోవాలి..అన్నీ దూరాలుంటాయి. పార్కింగ్ ఎక్కడో ఉంటుంది. గ్రోసరీస్ అన్నీ తెచ్చుకుని పార్కింగ్ వరకు నడుచుకుంటూ వచ్చి మళ్ళీ బండిలో పెట్టుకుని ఇంటికి వెళ్లి అన్నీ మళ్ళీ సర్దుకోవాలి. ఏదన్నా ఒక్కటి కొనడం మర్చిపోతే అంతే సంగతి. ఆ వస్తువును ఆర్డర్ పెట్టుకోవడానికి ఉండదు. ఉన్నాయి కానీ ఆన్లైన్ మార్కెట్ నుంచి ఆర్డర్ పెట్టి తెప్పిస్తే మాత్రం ఆ ప్రోడక్ట్ కాస్ట్ కంటే కూడా ఎక్కువగా పే చేయాల్సి ఉంటుంది. అందుకే కంఫర్ట్ వైజ్ గా ఇండియానే బెస్ట్. కాకపొతే అమెరికాలో ఫ్రీడమ్ ఉంటుంది. మనం ఎం చేస్తున్నామో పక్కవాళ్ళు చూడరు..మనల్ని జడ్జ్ చేసే వాళ్ళు ఎవరూ ఉండరు. ఎలాంటి డ్రెస్ వేసుకున్న కామెంట్ చేయరు. ఎలా కావాలంటే అలా అక్కడ ఉండొచ్చు. ఎవరూ ఎవరినీ డిస్టర్బ్ చేయరు. రావచ్చా అంటూ ముందుగా కనుక్కుని వస్తారు. ఎప్పుడు పడితే అప్పుడు బెల్ రింగ్ చేయడం అంటూ ఉండదు. విజయవాడలో చిన్నప్పుడు ఉన్నాను. కానీ మిస్ అవుతున్న ఫీలింగ్ లేదు. ఎందుకంటే నా ఫ్రెండ్స్ అంతా కూడా అమెరికాలోనే సెటిల్ ఇపోయారు. విజయవాడలో ప్రస్తుతానికి ఎవరూ లేరు. నేను అక్కడికి వెళ్లి ఏమీ చేయలేను. " అని చెప్పారు లయ.

శ్రీముఖి ఎంత స్లిమ్ గా ఐపోయినావమ్మా

  బుల్లితెర మీద క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్ ఫిమేల్ హోస్ట్ ఎవరు అంటే చాలు అందరూ శ్రీముఖి అంటారు. ఆమె హోస్ట్ చేసే షోస్ రేటింగ్స్ కూడా అలాగే పీక్స్ లో ఉంటాయి. ఐతే శ్రీముఖి రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో హాష్ టాగ్ మెమోరీస్ అంటూ వాషింగ్టన్ డిసిలో దిగిన కొన్ని పిక్స్ ని పోస్ట్ చేసింది. ఈ పిక్స్ లో శ్రీముఖి చాలా సన్నగా కనిపిస్తోంది. చిన్నపిల్లలా ఫోజులిస్తూ ఆ పిక్స్ లో కనిపిస్తోంది. ఇక నెటిజన్స్ ఐతే రకరకాల కామెంట్స్ తో శ్రీముఖిని పొగిడేస్తున్నారు. "ఎంత క్యూట్ గా ఉన్నావో స్కూల్ పాపలా. డ్రెస్ మస్తు ఉంది రాములమ్మ.. ఓలమ్మ ఓలమ్మ ఓలమ్మో ఎంత స్లిమ్ గా ఐపోయినావమ్మా..మా బాబు స్కూల్ షూస్ మిస్ అయ్యాయి...ఎక్కడ పోయాయో అనుకున్నా మీరు తీసుకెళ్లారా...నువ్వు లంగా ఓణీలోనే బావుంటావ్..కొన్ని ఫోజుల్లో నువ్వు అచ్చం దివ్యభారతిలా ఉన్నావు.." అంటూ రకరకాల క్యూట్ కామెంట్స్ ని పోస్ట్ చేశారు. ఎప్పుడూ బిజీగా ఉండే శ్రీముఖి అప్పుడప్పుడు ఇలా ఛిల్ల్ అవుతూ ఉంటుంది. ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో చేస్తుంది అలాగే రీసెంట్ గా కిర్రాక్ బాయ్స్, ఖిలాడీ గర్ల్స్ షోకి హోస్ట్ చేసింది. ఇక శ్రీముఖి గురించి ఒక న్యూస్ బాగా వైరల్ అవుతోంది. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసారంటూ కొంతమంది సెలబ్రిటీస్ మీద ఈడి కేసు ఫెయిల్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో శ్రీముఖి పేరు కూడా ప్రముఖంగా వినబడుతోంది. బుల్లితెరకు సంబంధించిన నటీనటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూఎన్సర్ల పేర్లు  కూడా  వినిపిస్తున్నాయి.

Inaya Sulthana : ఇనయా పోస్ట్ కి షాకింగ్ కామెంట్ చేసిన నెటిజన్.. జామకాయలు కావాలంట!

  బిగ్ బాస్‌కి ముందు ఇనయా సుల్తానాని పట్టించుకున్న వాళ్లెవ్వరూ లేకపోయిన బిగ్ బాస్ తరువాత తన గురించే మాట్లాడుకునేట్టు చేస్తుందామె. నిన్న మొన్నటి దాకా ఓ అబ్బాయితో గోవా ట్రిప్ కి వెళ్ళి అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేసి వచ్చిన ఇనయా అతనికి బ్రేకప్ చెప్పేసి ఇప్పుడు కొత్త జీవితాన్ని గడుపుతుంది.  తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఐడీలో జామకాయ తింటూ కొన్ని  ఫోటోలని వదిలింది ఇనయా. అయితే ఆ ఫోటోలని చూసిన నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. అయితే వాటిల్లో ఓ నెటిజన్ చేసిన కామెంట్ కి రిప్లై ఇచ్చింది ఈ భామ. " నాకు జామకాయలు కావాలి" అంటూ ఓ కుర్రాడు కామెంట్ చేయగా.. సూపర్ మార్కెట్‌లో ఉంది కొనుక్కో అంటూ ఇనయా రిప్లై ఇచ్చింది. ఇక ఇనయా రిప్లై చూసిన ఆ కుర్రాడు..నేను అడిగిన జామకాయ ఏంటో.. మీకు అర్థం కాలేదా బ్యూటీ.. మినిమమ్ డిగ్రీ చదవలేదా అని రిప్లై ఇచ్చాడు.‌ ఇక ఇనయా దానికి సమాధానమేమి ఇవ్వలేదు. కానీ‌ ఇతరులు ఆ కామెంట్ కి రిప్లై ఇస్తున్నారు.  బోల్డ్ ఫోటోలని అప్పుడప్పుడు కొంతమంది సెలెబ్రిటీలు పెట్టేదే ఇలాంటి డబుల్ మీనింగ్ అండ్ బోల్డ్ కామెంట్లు ఇంకా కాంట్రవర్సీ కామెంట్లు వస్తాయనే కదా.. వాళ్లు మినిమిమ్ డిగ్రీ కాదు.. మాస్టర్ డిగ్రీ చేసేశారు. ఇలాంటి కామెంట్లు వస్తాయని తెలిసే ఈ జామకాయల పోస్ట్ పెట్టిందంటు మరో నెటిజన్ కామెంట్ చేసాడు. ఇక ఇప్పుడు ఇది నెట్టింట వైరల్ గా మారింది.

Illu illalu pillalu : భాగ్యానికి నర్మద సవాల్.. ఇంటికెళ్ళిన ఇద్దరు కోడళ్ళు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -206 లో.... ప్రేమ, నర్మద బాధపడేలా మాట్లాడుతుంది భాగ్యం. ఇంకొకసారి నా కూతురు జోలికి వస్తే బాగుండదని నర్మదకి భాగ్యం వార్నింగ్ ఇస్తుంది. భాగ్యం వెళ్లిపోతుంటే నర్మద పిలిచి.. మీ పాటికి మీరు మాట్లాడి వెళ్ళిపోతే ఎలా మీరు అన్నారు కదా.. నీకు ఈ ఇంట్లో ఎవరు సపోర్ట్ గా లేరని.. నాకు ఎవరు సపోర్ట్ గా లేకున్నా సరే నేను ఈ కుటుంబానికి ఎప్పుడు సపోర్ట్ గా ఉంటాను.. నా కుటుంబం జోలికి ఎవరైనా వస్తే అసలు ఊరుకోను వారి బంఢారం బయట పెట్టేవరకు ఊరుకోను.. ఇప్పటి వరకు డౌట్ ఉండే కానీ ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది అందరి సంగతి తేలుస్తానని భాగ్యంతో నర్మద అనగానే భాగ్యం టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత వేదవతిని వాళ్ళ అమ్మ ఎదురింటి నుండీ పిలుస్తుంది. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లారని వేదవతి అడుగుతుంది. అక్క మనసు బాలేదని తీర్ధయాత్రలకి తీసుకొని వెళ్ళిందని వాళ్ళ అమ్మ చెప్తుంది. ముగ్గురు కోడళ్ళు వచ్చారు కదా అని కోడళ్ళ గురించి వేదవతి వాళ్ళ అమ్మ మాట్లాడుతుంది. ముగ్గురు కోడళ్లకి ఒకరంటే ఒకరికి పడదని వేదవతి అనగానే నర్మద అయితే గడుసు పిల్ల కుటుంబం కోసం ఏదైనా చేస్తుందని వేదవతి వాళ్ల అమ్మ అంటుంది. మరొకవైపు భాగ్యం తన కూతురు పెళ్లి కోసం ఇంటిని రెంట్ తీసుకున్న దగ్గరికి ప్రేమ, నర్మద వెళ్తారు. ఆ ఇల్లు భాగ్యం వాళ్ళది కాదని ప్రేమ, నర్మదలకి అర్ధమవుతుంది. వేదవతి కి ఫోన్ చేసి శ్రీవల్లి అక్క పేరెంట్స్ ఎక్కడున్నారో కనుక్కోండి మేమ్ వాళ్ల ఇంటి ముందు ఉన్నామని నర్మద అనగానే శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. మా వాళ్ళు ఇంట్లో లేరని చెప్పి తప్పించుకుంటుంది. ఆ తర్వాత అసలు శ్రీవల్లి వాళ్ల ఇల్లు ఎక్కడో తెలుసుకొని ఇంటి పక్కన వాళ్ళని అడిగితే తెలుస్తుంది కదా అని ప్రేమ, నర్మద అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : దీపకి నిజం చెప్పేసిన కార్తీక్‌.. మరి దాస్ ఎక్కడ?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -405 లో......అసలు జ్యోత్స్న ఎందుకు అలా ఉంది బావ అని కార్తీక్ ని అడుగుతుంది దీప. గౌతమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు జ్యోత్స్న ఒంటరిగా ఉందని చెయ్యి పట్టుకున్నాడని కార్తీక్ చెప్తాడు. మరి నువ్వు లోపలకి వెళ్లలేదా అని దీప అనగానే లేదు తర్వాత వెళ్ళానని కార్తీక్ అంటాడు. థాంక్స్ దీప.. జ్యోత్స్న గురించి అలోచించి నన్ను వెళ్ళమన్నావని కార్తీక్ అనగానే.. నేను ఒక తల్లి కూతురిని.. ఒక కూతురుకి తల్లిని కదా ఆలోచించకుండా ఎలా ఉంటానని దీప అంటుంది. మనం కొద్ది కొద్దీగా జ్యోత్స్న గురించి నాన్నకి తెలిసేలా చెయ్యాలని దీప అనగానే.. మావయ్యకి జ్యోత్స్న గురించి తెలుసు.. దాస్ మావయ్యని కొట్టింది తనే అని మావయ్యకి తెలుసు కానీ దాస్ మావయ్య నిజం చెప్పేవరకు అని ఆలోచిస్తున్నాడని కార్తీక్ అంటాడు. దాస్ బాబాయ్ నిజం చెప్తాడు కదా అని దీప అనగానే చెప్పడు అని కార్తీక్ అంటాడు. అంటే బాబాయ్ ఎక్కడున్నాడో నీకు తెలుసా అని దీప అనగానే తెలుసు కానీ సమయం వచ్చినప్పుడు వస్తాడని కార్తీక్ అంటాడు. మరొకవైపు స్వప్న, కాశీ భోజనం చేస్తుంటే శ్రీధర్ వస్తాడు. కాశీ పది లక్షల అప్పు తీర్చిన విషయం చెప్తాడు. ఆ తర్వాత జ్యోత్స్న, పారిజాతం మాట్లాడుకుంటుంటే దీప కాఫీ తీసుకొని వస్తుంది. ఎందుకు మేమ్ తీసుకొని రమ్మనకముందే వచ్చావని పారిజాతం కోప్పడుతుంది. ఆ తర్వాత కార్తీక్ వచ్చి గౌతమ్ వాళ్ళ అమ్మ పూజ జరిపించిన ఎంగేజ్ మెంట్ రింగ్స్ కోసం పంపించిందని శివన్నారాయణకి చెప్తాడు. ఇవి జ్యోత్స్నలకి ఇవ్వండి అని సుమిత్రకి ఇస్తాడు కార్తీక్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : ఏసీబీకి చిక్కిన కావ్య చెల్లి.. రాజ్ ప్రపోజ్ చేయకుండానే తను వెళ్ళిపోయిందిగా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -769 లో...... రాజ్ పై నుండి కిందకి వస్తుంటే అందరు షాక్ అవుతారు. రాజ్ కిందకి వచ్చి పనిమనిషి వంట బాగా చెయ్యలేదని మాట్లాడుతుంటే.. ఒక్క క్షణం అందరికి రాజ్ కి గతం గుర్తు వచ్చిందేమో అనుకుంటారు. ఏంటి అలా మాట్లాడుతుంటే భయపడ్డారా అని రాజ్ కామెడీ చేస్తాడు. ఆ తర్వాత రాజ్, కావ్య ఆఫీస్ కి బయల్దేరతారు. రాజ్, కావ్య ఆఫీస్ లోపలకి వెళ్తుంటే.. కావ్యకి యామిని ఫోన్ చేస్తుంది. మీరు లోపలికి వెళ్ళండి.. నేను వస్తానని రాజ్ ని పంపిస్తుంది కావ్య. ఎప్పటిలాగే ఈసారి నువ్వు ఓడిపోతున్నావ్.. మీటింగ్ అవ్వగానే నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని యామిని అంటుంది. దాంతో మళ్ళీ ఏదో ప్లాన్ చేసిందని కావ్యకి అర్ధమవుతుంది. స్వప్నకి ఫోన్ చేసి అక్కడ అంత ఒకే కదా అని అడుగుతుంది. ఒకే అని స్వప్న అనగానే సరేనని అప్పుకి ఫోన్ చేస్తుంది కావ్య. అక్కడ సిచువేషన్ ఒకేనా కావ్య అడుగగా.. ఒకే అక్క అని అప్పు అంటుంది.  ఆ తర్వాత యామిని మనుషులు అప్పు తమని లంచం అడిగిందని రెడ్ హ్యాండెడ్ గా పట్టిస్తామని ఏసీబీ వాళ్ళకి చెప్పి అప్పు దగ్గరికి వెళ్తారు. ఇద్దరు రౌడీలు అప్పు దగ్గరికి వెళ్లి మేడమ్ వాడికి మీ చేతుల మీదుగా డబ్బు ఇవ్వండి అని అతను అనగానే అప్పు సరే అంటుంది. అప్పుడే ఏసీబీ వాళ్ళు వచ్చి అప్పు లంచం తీసుకుంటుందని సస్పెండ్ చేస్తారు. కోర్ట్ లో కలుద్దామని వాళ్ళు అంటారు. ఆ తర్వాత రాజ్ ఆఫీస్ కి వెళ్లి మీటింగ్ లో మాట్లాడతాడు. తరువాయి భాగంలో కావ్యకి రాజ్ ప్రపోజ్ చేస్తుంటే కావ్యకి యామిని ఫోన్ చేసి మీ చెల్లి సస్పెండ్ అయిందని చెప్తుంది. దాంతో కావ్య అక్కడ నుండి వెళ్లిపోతుంది. నువ్వు ప్రపోజ్ చేస్తుంటే వెళ్ళిపోయిందంటే కావ్యకి నువ్వంటే ఇష్టం లేదని రాజ్ తో యామిని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

మిమ్మల్ని చూస్తుంటే చాలా మంది కాళిదాసులే అవుతారు మేడం

బుల్లితెర నటి ప్రియా గురించి చెప్పక్కర్లేదు. ఆమె సీరియల్స్ లో అటు మూవీస్ లో నటిస్తూ ఉంటుంది. చిరంజీవి నటించిన మాష్టర్ మూవీతో 1998 లో మూవీ ఇండస్ట్రీకి వచ్చింది. అలాంటి ప్రియా రీసెంట్ గా కూకు విత్ జాతిరత్నాలు షోకి కంటెస్టెంట్ గా వచ్చింది. ఐతే అవినాష్ ప్రియాతో చేసిన రీల్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఈ రీల్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసుకుంది ప్రియా. ఐతే ఆమె ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎలా ఉందొ ఇప్పటికీ అలాగే ఉంది. అందంలో మార్పు లేదు. సన్నగా, స్లిమ్ గా ఉంది. దాంతో నెటిజన్స్ అంతా కూడా అలా ఎలా అందాన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఈవిడకి అసలు వయసు పెరగదు.. మిమ్మల్ని చూసిన వాళ్ళు కాళిదాసులే అవుతారు మేడం..అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ రీల్ లో అవినాష్ మాత్రం ప్రియా పక్కన చాలా పెద్దవాడిలా కనిపిస్తున్నదంటూ కూడా అవినాష్ మీద సెటైర్స్ వేస్తున్నారు. ఎలా వెయిట్ లాస్ అయ్యారు మేడం..టిప్స్ చెప్పండి... హీరోయిన్ మెటీరియల్ మీరు అంటూ ప్రియని పొగిడేస్తున్నారు. కూకు విత్ జాతి రత్నాలు షోకి ప్రియా శారీలో, డ్రెస్ లో వస్తుంటే కాలేజీకి వెళ్లే అమ్మాయిలా అనిపిస్తోంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్ ఎపిసోడ్ లో వంకాయ బిర్యానీ చేసిన ప్రియాకు మంచి మార్క్స్ కూడా వచ్చాయి. అలాగే ఈమె బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్ గా వెళ్ళింది. లేడీ డిటెక్టివ్, చిన్న కోడలు, మెరుపు కలలు, శశిరేఖా పరిణయం,  కృష్ణ ముకుందా మురారి లాంటి ఎన్నో సీరియల్స్ లో నటించింది.    

మనల్ని ఎవడ్రా ఆపేది.. జబర్దస్త్ లోకి నాగబాబు రీ ఎంట్రీ!

  ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోకి తెలుగునాట ఎందరో ఫ్యాన్స్ ఉన్నారు. ఈ షో ద్వారా పలువురు నటులు వెండితెరకు పరిచయమై రాణిస్తున్నారు. జబర్దస్త్ లో కొందరు కంటెస్టెంట్స్ ప్రేక్షకుల హృదయాల్లో ఎలాగైతే పేరు సంపాదించారో.. జడ్జిగా మెగా బ్రదర్ నాగబాబు కూడా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆ షోకి ఎందరు జడ్జిలు మారినా.. ఆడియన్స్ లో నాగబాబుకి ఎప్పుడూ ఓ స్పెషల్ ప్లేస్ ఉంటుంది. అలాంటి నాగబాబు.. ఏవో కారణాల వల్ల కొన్నేళ్ల క్రితం జబర్దస్త్ నుంచి తప్పుతున్నారు. అయితే ఇప్పుడు ఆయన సడెన్ గా జబర్దస్త్ లో ప్రత్యక్షమయ్యారు.   జబర్దస్త్ షో ప్రారంభమై 12 ఏళ్ళు అవుతుంది. దీంతో మెగా సెలెబ్రేషన్స్ పేరుతో ఓ భారీ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. ఈ సెలబ్రేషన్ కి సంబంధించిన టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఒకప్పుడు జబర్దస్త్ లో కంటెస్టెంట్లుగా చేసిన పలువురు కమెడియన్లు ఈ టీజర్ లో కనిపించారు. ముఖ్యంగా జడ్జిగా నాగబాబు రీఎంట్రీ ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. "అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే.." అంటూ పవన్ కళ్యాణ్ 'ఓజీ' డైలాగ్ తో నాగబాబు ఎంట్రీ చూపించారు. జడ్జి సీట్లో కూర్చున్న నాగబాబు.. "రావాల్సినోడు వచ్చినప్పుడు ఆనందపడాలి కానీ, ఆశ్చర్యపోతారు ఏంటి" అంటూ అందరిలో ఉత్సాహం నింపారు. అంతేకాదు, రియల్ లైఫ్ లో పవన్ కళ్యాణ్ ఫేమస్ డైలాగ్ "మనల్ని ఎవడ్రా ఆపేది" అంటూ మరింత జోష్ తీసుకొచ్చారు నాగబాబు.  

 హీరో అర్జున్ తో రాహుల్ సిప్లిగంజ్...రేపు సాంగ్ రిలీజ్

రాహుల్ సిప్లిగంజ్ మంచి ఊపున్న సాంగ్స్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. నాట్ నాటు అంటూ ఆస్కార్ స్టేజి మీద డాన్స్ ని దుమ్ము దులిపాడు.  బిగ్ బాస్ సీజన్ 3  విన్నర్ గా నిలిచాడు రాహుల్. తర్వాత కొన్ని సింగింగ్ షోస్ కి జడ్జ్ గా వచ్చాడు. అలాంటి రాహుల్ రీసెంట్ గా గా హీరో అర్జున్ తో కలిసి ఉన్న పిక్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. " నేను మెలోడీ సాంగ్స్ తో ప్రేమలో పడింది ఒకే ఒక్కడు మూవీ సాంగ్స్ ద్వారానే.. అర్జున్ సర్‌ను కలవడం నిజంగా ఫ్యాన్ బాయ్ మొమెంట్ నాకు. అర్జున్ సర్ డైరెక్ట్ చేసిన సీత పయనం మూవీ నుంచి రేపు నా సాంగ్ రీలీజ్ కాబోతోంది. మ్యూజిక్ అనూప్ రూబెన్స్, పాడింది నేను, మధుప్రియ..సీత పయనం టీమ్ కి బెస్ట్ విషెస్  " అంటూ రాసుకొచ్చాడు. నెటిజన్స్ ఐతే కామెంట్స్ చేస్తున్నారు. "ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు కింగ్స్, అన్న నెక్స్ట్ లెవెల్, అన్న యు ఆర్ ది రాక్ స్టార్" అంటూ పొగిడేస్తున్నారు. ఇక ఈ మూవీ ఈ నెల 22 న రిలీజ్ కాబోతోంది. అర్జున్ కూతురు ఐశ్వర్య హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. ఇక నిరంజన్ హీరోగా నటిస్తున్నాడు. ఇతను కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర సోదరుడి కుమారుడు. ఇక ఈ మూవీ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అర్జున్. ట్రెండీ ట్యూన్స్ తో ఆడియన్స్ ని ఎప్పుడూ అలరిస్తూ ఉంటాడు. ప్రైవేట్ ఆల్బమ్స్ తో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక బిగ్ బాస్ లో పునర్నవితో కెమిస్ట్రీ మాత్రం అప్పట్లో బాగా వైరల్ అయ్యింది.  

Illu illalu pillalu : నర్మద, ప్రేమలపై భాగ్యం ఫైర్.. ఫాలో చేసిన ఆ ఇద్దరు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -205 లో....భాగ్యం తన కూతురిని వేరు చేసి నర్మద, ప్రేమ కలిసి ఆడుకుంటున్నారని వాళ్ళని అవమానించడమే పనిగా పెట్టుకుంటుంది. నర్మద, ప్రేమ వాళ్ళ పుట్టింటి వాళ్ళ టాపిక్ తీసి భాగ్యం బాధపెడుతుంది. ఇద్దరు కూడా పక్కకు వెళ్లి బాధపడుతారు. ప్రేమ తన పుట్టింటి వాళ్ళ ఫోటో చూసి బాధపడుతుంటే అయితే మీ పుట్టింటికి వెళ్ళమని సరదాగా నెట్టేస్తాడు ధీరజ్. నేను వెళ్ళనని ప్రేమ అంటుంది. మరొకవైపు శ్రీవల్లి హ్యాపీగా ఫీల్ అవుతూ.. వాళ్ళకి బుద్ది చెప్పావ్ అమ్మ లేదంటే వాళ్ళు ఒకటి అయి నాతో ఆడుకుంటారా అని శ్రీవల్లి అంటుంది. మరి నా కూతురు జోలికి వస్తారా అని భాగ్యం అంటుంది. అప్పుడే చందు వచ్చి.. అత్తయ్య నేను మీకు ఇచ్చిన పది లక్షలు ఇవ్వండి అని వాళ్లపై కోప్పడతాడు. అప్పుడే భాగ్యం భర్త ఆనందరావు వచ్చి డమ్మి చెక్ ఇస్తాడు. అది ఇవ్వగానే చందు హ్యాపీగా ఫీల్ అవుతాడు. అదేంటీ బయట వాళ్ళకి డమ్మీ చెక్ ఇచ్చినట్లు అల్లుడికి ఇస్తావేంటని భాగ్యం పక్కకి తీసుకొని వెళ్లి తన భర్తపై కోప్పడుతుంది. ఆ తర్వాత నర్మద దగ్గరికి భాగ్యం వచ్చి నా కూతురు జోలికి వచ్చావనుకో నీ సంగతి చెప్తానని వార్నింగ్ ఇస్తుంది. తరువాయి భాగంలో పెళ్లి కోసం భాగ్యం ఇంటిని రెంట్ కి తీసుకున్న దగ్గరికి ప్రేమ, నర్మద వెళ్తారు అక్కడ ఫోన్ నెంబర్ చూసి చెయ్యగా.. ఇది భాగ్యలక్ష్మి గారి ఇల్లు కదా అని అడుగుతారు. కాదు రెంట్ కి తీసుకున్నారు డబ్బు ఇవ్వలేదని వాళ్ళు చెప్తారు. ఆ తర్వాత వేదవతి, శ్రీవల్లి దగ్గరికి వచ్చి మీ అమ్మ నాన్న ఎక్కడ ఉన్నారని అడుగుతుంది. ఇంట్లోనే అని శ్రీవల్లి అనగానే ఇంట్లోనే ఉన్నారట అని నర్మదకి ఫోన్ లో చెప్తుంది వేదవతి. అయితే వాళ్ళని బయటకి రమ్మని చెప్పమని నర్మద అనగానే శ్రీవల్లి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : అతడిని ఫాలో చేస్తున్న కాశీ.. కార్తీక్ పై జ్యోత్స్నకి డౌట్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -404 లో......గౌతమ్ కి కోపం వచ్చింది. నువ్వు వెళ్లి సారీ చెప్పమని జ్యోత్స్నతో దశరథ్ అంటాడు. సరే డాడ్ కలిసినప్పుడు చెప్తానని జ్యోత్స్న అనగానే.. వద్దు ఇప్పుడే ఇంటికి వెళ్లి చెప్పమని దశరత్ అంటాడు. సరేనని జ్యోత్స్న అంటుంది. జ్యోత్స్నతో పాటు కార్తీక్ కూడా వెళ్తాడు.  ఆ తర్వాత గౌతమ్ తన గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నప్పుడు కాశీ వీడియో తీస్తాడు. అందుకే జ్యోత్స్న అక్క ఫాలో అవ్వమని చెప్పందేమో ఈ విషయం వెంటనే వాళ్లకు చెప్పాలని కాశీ అనుకుంటాడు. ఒక దగ్గర జ్యోత్స్న కార్ ఆపమని చెప్పి బావ నీతో మాట్లాడాలి అంటుంది. నా గురించి నీకేమైనా నిజం తెలుసా అని అడుగుతుంది. ఎందుకు అలా అడిగావని కార్తీక్ అంటాడు. గౌతమ్ ని నేను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని జ్యోత్స్న అనగానే.. చేసుకునేది నువ్వు నన్ను ఎందుకు అడగడం ఎందుకని కార్తీక్ అంటాడు. గౌతమ్ గురించి తెలుసా అని జ్యోత్స్న అనగానే నీకు ఎంత తెలుసో నాకు అంతే తెలుసని కార్తీక్ అంటాడు. అసలు బావ బయటపడడం లేదని జ్యోత్స్న అనుకుంటుది. ఆ తర్వాత గౌతమ్ ఇంటికి వెళ్తుంది జ్యోత్స్న. కార్తీక్ బయటే ఉండి వాళ్ళ మాటలు వింటుంటాడు. జ్యోత్స్న గౌతమ్ కి సారీ చెప్తుంది. జ్యోత్స్న చేతులు పట్టుకుంటాడు గౌతమ్. అప్పుడే కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. బావ కరెక్ట్ టైమ్ కి వచ్చాడని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత అందరు భోజనం చేస్తుంటారు. కార్తీక్ ఏదో ఒకటి మాట్లాడుతుంటే శివన్నారాయణ కోప్పడతాడు. జ్యోత్స్న ఏంటి అలా ఉందని దీప అడుగుతుంది. ఇంటికి వెళ్ళాక చెప్తానని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : అనామిక స్కెచ్ లో అప్పు పడనుందా.. రాజ్ ఆఫీస్ కి రెడీ!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -768 లో.... రాజ్ కి ఆఫీస్ గురించి మొత్తం చెప్తుంది కావ్య. అన్ని ఫైల్స్ ముందు వేసి ఎక్స్ ప్లెయిన్ చేస్తుంది. అలాగే నిద్రపోతుంది కానీ రాజ్ మాత్రం అన్ని ఫైల్స్ చూస్తాడు. తను కూడా కావ్య ఒళ్ళో పడుకుంటాడు. అప్పుడే అపర్ణ ఇందిరాదేవి వస్తుంది. వాళ్ళని చూసి హ్యాపీగా ఫిల్ అవుతారు. మరొకవైపు అప్పు స్టేషన్ కి రెడీ అవుతుంటే అప్పుడే అనామిక రౌడీలు ఫోన్ చేసి.. మేడమ్ డబ్బు నేను ఇవ్వాల్సిన అతనికి ఇస్తాను. అది మీ చేతుల మీదుగా ఇవ్వాలని కాల్ చేస్తాడు దానికి అప్పు సరేనని స్టేషన్ కి రమ్మని చెప్తుంది. అప్పుడే కళ్యాణ్ వచ్చి అప్పు నువ్వు కొన్ని రోజులు సెలవు పెట్టు హనీమూన్ కి వెళదామని అంటాడు. ఇప్పుడు కుదరదని చెప్పి అప్పు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రాహుల్ చేసిన పనికి ఇందిరాదేవి ఇంట్లో పనులన్నీ రాహుల్ నే చెయ్యమని చెప్పడంతో రాహుల్ ఇంట్లో అన్ని పనులు అని చేస్తాడు. రాహుల్ తో అన్ని పనులు చేయిస్తుంది స్వప్న. మమ్మీ ప్లీజ్ ఈ ఒక్కసారి క్షమించు.. నాకు ఈ శిక్ష నుండి బయటపడేయ్ అని రుద్రాణితో అంటాడు రాహుల్. రేపటి తో కావ్య పవర్స్ అన్ని పోతాయ్ వెయిట్ చెయ్ అని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత యామిని సిద్దార్థ్ కి ఫోన్ చేసి రాజ్ కి గతం గుర్తు లేదు.. రేపు నువ్వు అడిగే వాటికి రాజ్ సమాధానం చెప్పలేడు.. అప్పుడు అందరి ముందు కావ్య పరువు పోతుందని యామిని అంటుంది. అందుకు సిద్ధార్థ్ సరే అంటాడు. మరొకవైపు కావ్య రెడీ అయి రాజ్ కోసం చూస్తుంది. రాజ్ కి అన్ని నేర్పించావా కావ్య అని ఇందిరాదేవి అడుగుతుంది. అన్ని నేర్పించానని కావ్య అంటుంది. రాజ్ ఆఫీస్ కి రెడీ అయి కిందకి వస్తుంటే అందరు రాజ్ ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

 తెలుగు బిగ్ బాస్ అసలు చూడను...హిందీలో ఒక్క సీజన్ చూసా అంతే

బిగ్ బాస్ సీజన్ 8  రన్నరప్ గౌతమ్ కృష్ణ హీరోగా నటించిన సోలోబోయ్ డెబ్యూ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇదొక యూత్ ఫుల్ ఫామిలీ డ్రామా. మిడిల్ క్లాస్ ఫామిలీస్ కి కనెక్ట్ అయ్యే మూవీ ఇది. అలాంటి గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ గురించి తన గురించి కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను ఇంటర్వ్యూస్ లో చెప్తున్నాడు. "నన్ను నేను బిగ్ బాస్ కంటెస్టెంట్ గా అనుకోను. నేను కామన్ మ్యాన్ ని. బిగ్ బాస్ నాకు ఒక ప్రాజెక్ట్ లాగా. ఒక అవకాశం వచ్చింది. వెళ్లాను. కానీ నేను ఇంతవరకు తెలుగు బిగ్ బాస్ ఒక్క ఎపిసోడ్ కూడా చూసింది లేదు. నేను కాలేజ్ చదువుకుంటున్నప్పుడు హిందీ బిగ్ బాస్ ఒక్క సీజన్ చూసా అంతే. నా ఫ్రెండ్స్ బిగ్ బాస్ చూస్తూ ఉన్న కూడా బిగ్ బాస్ తీయించేసి సినిమాలు పెట్టించేవాడిని. సినిమాలు ఎక్కువగా చూసేవాడిని. బిగ్ బాస్ నాకు గుడ్ ఎక్స్పీరియన్స్. నాకు బాగా యూజ్ అయ్యింది. నేను మొదటి నుంచి రైటర్ ని. రైటింగ్ అంటే నాకు ఇష్టం. ఢిల్లీలో ఎంబిబిఎస్ చదివేటప్పుడు చివర్లో నాకు యాక్టింగ్ సైడ్ ఇంట్రస్ట్ వచ్చింది. కానీ ఎప్పుడు నా ఫోకస్ రైటింగ్ అండ్ డైరెక్షన్ మాత్రమే. క్రికెట్ , న్యూస్, సీరియల్స్ ఏ ఫార్మాట్ ఇష్టం ఉండేది కాదు ఒక్క మూవీస్ అంటేనే ఇష్టం నాకు. అలాగే ఫిలిం వర్క్ షాప్స్ కి వెళ్ళేవాడిని. ఒక షార్ట్ ఫిలిం తీశాను అప్పుడు హీరోగా ఎవరిని అడిగా చేయము అని చెప్పారు. అలా నేనే అందులో హీరోగా చేశా. అప్పుడు నా సర్కిల్ నాకు సజెషన్స్ ఇచ్చారు. అలా ఒక ఆరు నెలలు యాక్టింగ్ కోర్సు చేసాను. ఈ సోలో బాయ్ మూవీకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ నేనే రాసాను." అని చెప్పాడు గౌతమ్ కృష్ణ.  

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4  యూ.ఎస్. ఏ  ఫైనలిస్ట్స్ వీళ్ళే

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 ఆడిషన్స్ మొదలయ్యాయి. ఆహా ప్లాటుఫారం మీద ఈ షో ఇప్పటికే 3 సీజన్స్ ని కంప్లీట్ చేసుకుంది. ఐతే లాస్ట్ సీజన్ లో ఐతే దాదాపు 15 వేల మంది సింగర్స్ ని ఆడిషన్స్ చేశారు. ఫైనల్ గా 12 మందిని సెలెక్ట్ చేయారు. ఇక కొత్త సీజన్ కి ఆడిషన్స్ జరుగుతున్నాయి. అమెరికాలో జరిగిన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 ఆడిషన్స్ జరిగాయి అలాగే ఫైనలిస్టులు కూడా రెడీ అయ్యారు. ఆ విషయాన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఆహా. మనోజ్ఞ బెల్లంకొండ, రిషిత్ గద్దె, శ్రియ నందగిరి, స్నిగ్ధ ఏలేశ్వరపు, శ్రీజ కొఠారు, శ్రీష్టి చిల్లా..వీళ్ళ ఆరుగురు ఫైనల్ ఆడిషన్స్ లో సెలెక్ట్ అయ్యారు. ఇక ఆహా వీళ్ళ పోస్టర్ రిలీజ్ చేసి...ఇండియా ఇక నీ టర్న్..ఆడిషన్స్ జరుగుతున్నాయి. రెజిస్ట్రేషన్స్ చేసుకోండి అంటూ కోరింది. ఆల్రెడీ జూన్ 18 నుంచి ఆడిషన్స్ స్టార్ట్ చేసిన ఇండియన్ ఐడల్. ఐతే ఈ ఫైనలిస్టులను చూసిన  నెటిజన్స్ , ఫైనల్ కంటెస్టెంట్స్ కి సంబంధించిన వాళ్లంతా కూడా వాళ్ళను విష్ చేస్తూ మెసేజెస్ పెడుతున్నారు. ఇక లాస్ట్ సీజన్ చూస్తే నసీరుద్దీన్ టైటిల్ విన్ అయ్యాడు. దాంతో థమన్ ఓజి మూవీలో ఒక సాంగ్ ని నసీరుద్దీన్ తో పాడించాడు. అలాగే ఫస్ట్ రన్నరప్ గా అనిరుద్ సుస్వరం, సెకండ్ రన్నరప్ గా శ్రీకీర్తి నిలిచారు. వీళ్ళు అప్పుడప్పుడు బుల్లితెర మీద వచ్చే షోస్ లో పాడుతూ ఆడియెన్స్ ని అలరిస్తున్నారు. అలాగే కొన్ని మూవీస్ లో కూడా వీళ్ళు సాంగ్స్ పాడుతున్నారు. ఇక ఇప్పుడు ఈ న్యూ సీజన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. జడ్జెస్, హోస్ట్ ఎవరు అనేది త్వరలోనే తెలుస్తుంది.  

విజయ్ కార్తీక్‌తో నా పెళ్లి.. కానీ వాడు నన్ను మోసం చేశాడు

  బుల్లితెర మీద కీర్తి భట్ బాగా ఫేమస్. సీరియల్ నటిగా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఆమె మంచి పేరు తెచ్చుకుంది. ఐతే ఒక చిట్ చాట్ షోలో కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. "నేను మానేయాలి అనుకుంటే వ్లాగ్స్ చేయడం మానేస్తా. వ్లాగ్స్  తిప్పలు నా వల్ల కాదు. షోస్, సీరియల్స్ మాకు జీవితాన్ని ఇస్తుంది కాబట్టి అవి చేస్తాను. ఇక నా పెట్ నేమ్ చిన్నప్పుడు పుట్టి ఇప్పుడు పాపు. నా ఫ్రెండ్స్ ని విజయ్ కార్తీక్ తన ఫామిలీలాగే చూస్తాడు. ఇక బాడ్ థింగ్ ఏంటంటే ఎక్కువగా బాత్ రూమ్ లో ఉంటాడు లేదంటే టీవీలో మునిగిపోతాడు. ఇక నా సెలబ్రిటీ క్రష్ వచ్చి యష్. విజయ్ కార్తీక్ తో నా పెళ్లి ఈ ఇయర్ ఎండింగ్ కి ఉంటుంది. ఈ ఇయర్ నా పుట్టినరోజును ఒక వృద్ధాశ్రమంలో సెలెబ్రేట్ చేసుకున్న. అది చాల బెస్ట్ బర్త్ డే. బోర్ మూమెంట్ అనేది నాకు రాదు. ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. ఇంట్లో పని చేస్తా లేదంటే వంట లేదంటే రీల్స్ చూస్తా. బయటికి వెళ్తా. కొత్త రీల్స్ చేయడానికి టాపిక్ వెతుక్కుంటా.. హిడెన్ టాలెంట్ నేను పాటలు కూడా పాడగలను. టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ ఇష్టం, బాలీవుడ్ లో షారుక్ ఖాన్, కోలీవుడ్ లో విష్ణు వర్ధన్ గారు ఇష్టం. ఆయన ఓల్డ్ హీరో. విజయ్ కార్తీక్ కి చెప్పకుండా ఒక పని చేశా..ఒక ఫ్రెండ్ డబ్బులు అవసరం అంటే ఇచ్చా. కానీ ఇంతవరకు తిరిగి ఇవ్వలేదు. క్రికెట్ అంటే ఇష్టం. కాఫీ అంటే ఇష్టం, ఫుడ్ బాగా తింటాను, యాక్షన్ ఫిలిమ్స్ బాగా చూస్తాను. వర్షా కాలం, చలి కాలం అంటే బాగా ఇష్టం. సన్సెట్ అంటే ఇష్టం. నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరు. ఇక్కడంతా కమర్షియల్ ఫ్రెండ్ షిప్స్ మాత్రమే ఉంటాయి. నాకు కార్తీక్ మాత్రమే అన్నీ." అంటూ చెప్పింది కీర్తి భట్.

Illu illalu pillalu : రామరాజు ఇంటికి భాగ్యం... నర్మదకి వార్నింగ్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -204 లో.....సాగర్ నర్మద బయట కూర్చొని ఉంటారు. సాగర్ గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవుతుంటే శ్రీవల్లి చూసి రామరాజు కి పట్టించాలని అనుకుంటుంది. దాంతో అర్ధరాత్రి దొంగ దొంగ అంటూ అరుస్తుంది. అందరు బయటకి వస్తారు. దొంగ ఎక్కడ అని అడుగుతారు. అప్పుడే చదువుకుంటున్న సాగర్ ని రామరాజు చూస్తాడు. రామరాజుని చూసి సాగర్ షాక్ అవుతాడు. ఇక్కడ ఏం చేస్తున్నారని అడుగుతాడు. చేతిలో ఆ బుక్ ఏంటి మావయ్య గారు అని శ్రీవల్లి అనగానే అవును అదేంటని రామరాజు అడుగుతాడు. నేను చదువుకుంటున్నానని నర్మద కవర్ చేస్తుంది. అయిన బుక్ నీ చేతిలో లేదు కదా అని శ్రీవల్లి అనగానే సాగర్ నాకూ ఎక్స్ ప్లెయిన్ చేస్తున్నాడని నర్మద కవర్ చేస్తుంది. మరుసటిరోజు నర్మద, ప్రేమలకి ఓ విషయం అర్థమవుతుంది. శ్రీవల్లి రాత్రి కావాలనే రామరాజు పిలిచిన విషయం అర్ధమవుతుంది. దాంతో బల్లి అక్క బల్లి అక్క అంటూ శ్రీవల్లి ని అట పట్టిస్తారు. ఆ తర్వాత వేదవతి హారతి ఇస్తుంటే దీపం ఆరిపోతుంది. అప్పుడే నర్మద ప్రేమ వచ్చి అలా దీపం ఆరిపోతే ఏం కాదని చెప్పి మాట్లాడతారు. దాంతో వేదవతి హ్యాపీగా ఫీల్ అవుతుంది. మనం ఎప్పుడు కోడళ్ళలా కాకుండా ఫ్రెండ్స్ లా ఉండాలని వేదవతి తన ఇద్దరి కోడళ్ళతో అంటుంది. అదంతా శ్రీవల్లి చూసి కుళ్ళుకుంటుంది. ఆ తర్వాత శ్రీవల్లి పేరెంట్స్ రామరాజు దగ్గరికి వస్తారు తొలిఏకాదశి కదా మీకు బట్టలు పెట్టాలని వచ్చానని రామరాజుతో భాగ్యం అంటుంది. నర్మద, ప్రేమలని అవమానించడానికి భాగ్యం ట్రై చేస్తూ ఉంటుంది. తరువాయి భాగంలో నా కూతురు జోలికి వస్తే బాగుండదని నర్మదకి వార్నింగ్ ఇస్తుంది భాగ్యం. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : కాశీకి డీల్ ఇచ్చిన జ్యోత్స్న.. ఇంట్లో రచ్చ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -403 లో....దీప దగ్గరికి కార్తీక్ వస్తాడు. గౌతమ్ మంచివాడు కాదు కదా.. జ్యోత్స్న పెళ్లి అతనితో జరిగితే పరిస్థితి ఏంటని దీప అనగానే జ్యోత్స్నకి గౌతమ్ గురించి తెలుసు కాబట్టి జ్యోత్స్న సిచువేషన్ అంతవరకు తెచ్చుకోదు కానీ నువ్వు మాత్రం జ్యోత్స్న దగ్గరికి వెళ్లి గౌతమ్ మంచివాడు కాదని చెప్పే ప్రయత్నం చేసావనుకో జ్యోత్స్న అది రికార్డు చేసి ఇంట్లో వాళ్లకి వినిపిస్తుంది. దాంతో నువ్వు మళ్ళీ పెళ్లి చెడగొడుతున్నావని ఈ సారి మా అత్త ఇంట్లో నుండి నిన్ను గెంటేస్తుంది. ఒకవేళ పెళ్లి ఆపడానికి జ్యోత్స్న ఏమైనా చేస్తుంది అత్తకి మామయ్య కి తాతకి ఏదైనా ప్రమాదం తీసుకొని రావచ్చు లేక గౌతమ్ ఫ్యామిలీకి ఏదైనా చెయ్యొచ్చు కానీ నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండాలని దీపకి‌ కార్తీక్ చెప్తాడు. మరొకవైపు పారిజాతం, జ్యోత్స్న కలిసి కాశీని కలుస్తారు. నీకు పది లక్షలు హెల్ప్ చేస్తాను. నాకు ఒక హెల్ప్ చేయాలి.. గౌతమ్ మంచివాడో కాదో కనుకోమ్మని జ్యోత్స్న ఆఫర్ ఇస్తుంది. దానికి ముందు కాశీ ఒప్పుకోడు పారిజాతం చెప్పగానే సరే అంటాడు. ఈసారి పెళ్లి దీప కాదు కాశీ చెడగొడతాడని జ్యోత్స్న, పారిజాతం అనుకుంటారు. మరికొవైపు గౌతమ్ ని కలుస్తాడు కార్తీక్. ఆ తర్వాత కార్తీక్ ఇంటికి వెళ్ళగానే గౌతమ్ వెళ్తాడు. అసలు జ్యోత్స్నకి నాతో పెళ్లి ఇష్టమేనా.. ఫోన్ లిఫ్ట్ చెయ్యడం లేదని శివన్నారాయణతో గౌతమ్ అంటాడు గౌతమ్ కి సపోర్ట్ గా కార్తీక్ మాట్లాడతాడు. అప్పుడే జ్యోత్స్న, పారిజాతం ఇంట్లోకి వస్తారు. జ్యోత్స్న రాగానే గౌతమ్ సైలెంట్ గా వెళ్లిపోతాడు. నీ వల్ల గౌతమ్ కి కోపం వచ్చింది. అతను ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చెయ్యడం లేదట.. నువ్వు తన దగ్గరికి వెళ్లి సారీ చెప్పమని జ్యోత్స్న పై కోప్పడుతాడు దశరథ్. బావ నన్ను ఇలా ఇరికించావా అని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi: రాజ్ చెప్పినవి విని షాకైన సిద్దార్థ్.. కావ్య హ్యాపీ!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -767 లో..... రాజ్ ఆఫీస్ కి వెళ్లి ఎంప్లాయిస్ అందరిని పిలిచి.. మీరు వర్క్ సరిగా చెయ్యడం లేదని కోప్పడతాడు. ఇప్పుడే మీ అందరిని ఉద్యోగం నుండి తీసేస్తున్నానని రాజ్ అనగానే అందరు టెన్షన్ పడతారు. అప్పుడే కావ్య ఎంట్రీ ఇచ్చి.. సూపర్ బాస్.. ఫ్రాంక్ చాలా బాగుందని అంటుంది. ఇదంతా సర్ ఫ్రాంక్ చేశారు.. మీరు అందరు వెళ్ళండి అని కావ్య అనగానే అందరు వెళ్ళిపోతారు. ఏం చేస్తున్నారు బాస్ లాగా నటించమంటే ఎందుకిలా చేస్తున్నారని రాజ్ పై కావ్య కోప్పడుతుంది. ఆ తర్వాత ఇద్దరు సరదాగా కార్ లో వెళ్తూ మాట్లాడుకుంటారు. మరొకవైపు రాహుల్ ని తీసుకొని వచ్చి రుద్రాణి కాళ్ళపై పడేస్తుంది స్వప్న. ఏం చేసాడని అలా చేస్తున్నావని రుద్రాణి అనగానే.. రాహుల్ చేసిన పని గురించి స్వప్న చెప్తుంది. నువ్వు చెప్పింది ఇప్పుడు మేమ్ నమ్మాలా అని రుద్రాణి అనగానే రాహుల్ గర్ల్ ఫ్రెండ్ ని తీసుకొని వస్తుంది అప్పు. రాహుల్ నన్ను పెళ్లి చేసుకుంటానని నగలు ఇచ్చాడని తను చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత రాహుల్ ని అందరు తిడతారుమ ఇకనుండి ఈ ఇంట్లో వాడికి ఎవరు డబ్బు ఇవ్వనవసరం లేదు.. ఇంట్లో పనులు చెయ్యాలని ఇందిరాదేవి అంటుంది. ఎందుకురా ఇలా తప్పు మీద తప్పు చేస్తునే ఉంటావని రాహుల్ పై కోప్పడుతుంది రుద్రాణి. ఆ తర్వాత యామినికి రాజ్ ఫోన్ చేసి.. ఈ రోజు నేను ఇంటికి రావడం లేదు. ఇక్కడ కళావతి దగ్గర ఉంటున్నానని చెప్పగానే.. యామినికి కోపం వస్తుంది. ఆ తర్వాత ఇందిరాదేవి, అపర్ణ వచ్చి రాజ్ తో మాట్లాడతారు. ఈ రోజు ఎలాగైనా కళావతి గారికి ప్రపోజ్ చెయ్యాలని రాజ్ అనుకుంటాడు. తరువాయి భాగంలో రాజ్ ని ఎండీగా తొలగించాలని అనుకుంటున్నాను.. ఇప్పటివరకు జరిగిన డీలింగ్స్ గురించి చెప్పు అని రాజ్ ని మీటింగ్ లో అడుగుతాడు సిద్దార్థ్. రాజ్ అన్ని చెప్తుంటే సిద్దార్థ్ షాక్ అవుతాడు. అప్పుడే కావ్య వచ్చి ఇవన్నీ ఎలా తెలుసు.. గతం గుర్తుకు వచ్చిందా అని కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత  ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.