రోజాతో లేడీ ఓరియెంటెడ్ మూవీ..

  డ్రామా జూనియర్స్ ప్రోమోనే ఒక ఫుల్ ఎపిసోడ్ లా ఉంది. ఇక ఏ సీజన్ లేనంతగా ఈ సీజన్ ఫుల్ జోష్ ని అందిస్తోంది ఆడియన్స్ కి. అందులో ఈర్య అనే చిన్నారి అనిల్ రావిపూడిని మామా మామ అనడం అనిల్ కూడా ఆమెతో ముచ్చట్లు పెట్టడం ఈ సీజన్ లో బాగా హైలైట్ అయ్యాయి. ఇక ఈ న్యూ ప్రోమోలో అనిల్ రావిపూడి హోస్ట్ సుధీర్ ని బాగా రోస్ట్ చేసాడు. "ఏంటి సర్ ఈ సెటప్ అంతా" అంటూ అనిల్ రావిపూడిని అడిగాడు సుధీర్. "రోజా గారిని హీరోయిన్ గా పెట్టి ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ చేద్దామనుకుంటున్నా" అన్నాడు. "మీరు ఆమెను బిజీ చేస్తారు. నన్ను మాత్రం బిజీ చేయరు" అంటూ సుధీర్ అనిల్ మీద కౌంటర్ వేసాడు. ఆయన ఊరుకోకుండా "నిన్ను బిజీ చేస్తే నేను ఖాళీ అవుతాను కదా" అనేశాడు. ఇంతలో రోజా "ఈరోజు ముహూర్తం షాట్ అన్నారు కదా సినీ పెద్దలెవరైనా వస్తున్నారా" అంటూ అడిగింది రోజా. "ఆల్రెడీ పెద్దవాళ్లతోనే సినిమా తీస్తుంటే మళ్ళీ సినీ పెద్దలు ఎందుకండీ" అంటూ సుధీర్ కౌంటర్ ఇచ్చాడు. ఇక ప్రోమో ఫైనల్ లో రిక్షాలో ఈర్య చిరంజీవి కటౌట్ తో అదిరిపోయే గెటప్ తో ఎంట్రీ ఇచ్చింది. దాంతో సుధీర్ "ఈర్య ఏంటి హడావిడి..ఎవరు వీళ్లంతా" అని అడిగాడు. వెంటనే చిరంజీవి కటౌట్ చూసి షాకయ్యాడు. "ఏంటి చిరంజీవిగారితో నటిస్తున్నావా" అన్నాడు. "లేదు చిరు మామే నాతో నటిస్తున్నారు" అని చెప్పింది ఈర్య. "అసలు నీకెవరు ఛాన్స్ ఇచ్చారు" అన్నాడు సుధీర్ ఆశ్చర్యంగా ."అనిల్ మామ" అని చెప్పింది. అంతే సుధీర్ వెంటనే "పనోడి క్యారెక్టర్ అన్నా నాకు ఇవ్వాలనిపించలేదా మీకు..ఛాన్స్ నాకు ఇవ్వకుండా తనకు ఇచ్చారు.. ఎలా ఛాన్స్ ఇచ్చారో నాకు ఇప్పుడు తెలియాలి " అన్నాడు.  

అరేయ్ ఏంట్రా ఇది..వీళ్ళ వయసెంత ఇంతకీ ?

  డ్రామా జూనియర్స్ ప్రోమో ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ఈ ఎపిసోడ్ కి అనసూయ ఎంట్రీ మాములుగా లేదు. చిన్న చిన్న రెండు జడలు వేసుకుని రోజాతో పోటాపోటీగా చేసింది. ఇందులో అత్తా కోడళ్ళుగా అనసూయ, రోజా చేశారు. వీళ్ళిద్దరూ స్టేజి మీదకు వచ్చి "మేము వయసుకు వచ్చాము" అనే సాంగ్ కి డాన్స్ చేశారు. దాంతో అనిల్ రావిపూడి పెద్ద డైలాగ్ వేసాడు. "మేం వయసుకు వచ్చాము 50 కి వచ్చారా, 60 కి వచ్చారా " అనేసరికి ఇద్దరి మొహాలు మాడిపోయాయి. ఇంతకు మీరిద్దరూ ఎవరండీ నాకు అర్ధం కాలేదు అన్నాడు. "అత్తాకోడళ్ళం" అన్నారు ఇద్దరూ. "మీ ఇద్దరిలో అత్తాకోడళ్లు ఎవరు" అన్నాడు సుధీర్. "నేను కోడలిని, రోజా గారు నాకు అత్తా" అంటూ చెప్పింది అనసూయ ."నేను అత్తను కాదు కోడలినని ఏ తలకమాసిన ఎదవని అడిగినా చెప్తాడు..సుధీర్ నువ్వు చెప్పు " అని అడిగింది రోజా. "ప్రతీ దానికి నన్ను అడుగుతారు అక్కడ ఫామిలీ డైరెక్టర్ అనిల్ గారిని అడగండి" అన్నాడు సుధీర్. "రేపు మా ఇంట్లో నాకు బారసాల మీరు తప్పకుండా రావాలి" అంటూ అనసూయ రోజాకి కార్డు ఇచ్చింది. "రేపు నాకు కుదరదు అనసూయ. నాకు పుట్టెంటుకులు తీస్తున్నారు" అని చెప్పింది రోజా. "ఎవరికి వయసు ఎక్కువుందో అందరూ చెప్తారు ముందు అది చూడండి" అంటూ అనసూయ ఒక పిక్ ని చూపించింది. అందులో సూరేకాంతంతో రోజా పిక్ చూసి షాకయ్యింది రోజా. "ఏంటి సూరేకాంతమ్మ గారికి అత్త క్యారెక్టర్ ఆ ఈమె" అని కౌంటర్ వేసాడు సుధీర్. "నీ ఫొటోస్ కూడా ఉన్నాయి చూస్కో" అంటూ రోజా ఒక పిక్ ని చూపించింది. అందులో మహాత్మా గాంధీ వెనకాల అనసూయ నడుస్తూ కనిపించింది. "అనసూయ గారు నాకు తెలీదండి మీరు ఫ్రీడమ్ ఫైటర్ అని" అంటూ సుధీర్ పెద్ద కౌంటర్ వేసాడు. ఇక అనిల్ రావిపూడి "అరే కిడ్స్ అంతా లేచి వాళ్లకు స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వాలి" అంటూ  రోజా, అనసూయ పరువు తీసేసాడు.  

దీపికా రంగరాజు కి ఆస్తులు ఏమీ లేవు అంట 

బ్రహ్మముడి సీరియల్ ద్వారా దీపికా ఫుల్ ఫేమస్ అయ్యింది. రాజ్ కి చక్కని జోడిగా తెలుగు ఆడియన్స్ కూడా ఆమెకు బాగా కనెక్ట్ అయ్యారు. ఐతే ఆమె రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పింది. హోస్ట్ ని ఐతే బాగా రోస్ట్ చేసింది. "ఏంటి దీపికా నీకు బూరేలంటే ఇష్టమే..బుగ్గలు బూరెల్లా ఉంటేనూ" అంది హోస్ట్. దానికి వెంటనే దీపికా "మీకు స్కెలిటన్ అంటే ఇష్టమా. సైన్స్ ల్యాబ్ లో బయట ఉండే అలా ఉన్నారు మీరు" అనేసింది. దాంతో హోస్ట్ తలపట్టుకుంది. "ప్రెజెంట్ దీపికా మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి" అని హోస్ట్ అడిగేసరికి  "ఈ ప్రపంచానికే తెలుసు నేను బ్రహ్మముడి సీరియల్ చేస్తున్నాను అని. కార్తీక దీపం ఫస్ట్ ఆఫర్ వచ్చింది నాకు. ఐతే అప్పుడు సీరియల్ పేరు ఏమీ చెప్పలేదు. ఇలా బ్లాక్ మేకప్ వేసుకోవాలి అని చెప్పారు. అప్పుడు దేవుడు అంటే నాకు చాలా చాలా నమ్మకం. హైదరాబాద్ వచ్చాక నాకొక పెద్దమ్మ తల్లి బాగా ఇష్టం. ఆమె దగ్గరకు వెళ్లి బ్రహ్మముడి సీరియల్ బాగా హిట్ అవ్వాలి. నేను అందరికీ నచ్చాలి. కానీ దాని కంటే ఎక్కువగానే జరిగింది. బ్రహ్మముడి సీరియల్ దొరకడం ఒక అదృష్టం అంటే అందులో రాజ్ దొరకడం ఇంకా అదృష్టం. మానస్ దొరకడం శ్రీజకు అదృష్టం." అంటూ చెప్పుకొచ్చింది దీపికా. ఇక దీపికా ముందు న్యూస్ రీడర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. తర్వాత కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ లో నటించింది. అలాగే తమిళ్ మూవీ "ఆరడి"లో నటించింది. అలాగే తమిళ్ సీరియల్స్ చితిరం పేసుతడి" అనే సీరియల్ లో యాక్ట్ చేసింది. ఇక ఇప్పుడు తెలుగులో బ్రహ్మముడి సీరియల్ లో నటిస్తోంది.    

బిగ్ బాస్ సీజన్ 9 సెప్టెంబర్ 7 నుంచి స్టార్ట్..

  బిగ్ బాస్ సీజన్  9 లేటెస్ట్ అప్డేట్స్ ని మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి ఇస్తూ ఉన్నాడు. ఇక రీసెంట్ గా "ఏదైనా అడగొచ్చు" అంటూ నెటిజన్స్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇచ్చాడు. " బిగ్ బాస్ సీజన్ 9 సెప్టెంబర్ 7 నుంచి స్టార్ట్ అవుతుంది. నాకు మళ్ళీ బిగ్ బాస్ ఛాన్స్ రావొచ్చు, పోవచ్చు అనుకుంటా. నా ఫామిలీ నా లక్కీ. ఈసారి బిగ్ బాస్ రివ్యూస్ గట్టిగా చేద్దామనుకుంటున్నా..ఈసారి ఒక రూమ్ లో ఉంటా పని చేసుకుంటూ పోతా .ఒక్కరితో కూడా టచ్ లో ఉండకూడదు అండ్ ఎవడిని పట్టించుకోకూడదు అనుకుంటున్నా అందుకే నేను నా కాంటాక్ట్స్ కూడా మార్చేసా." అని చెప్పాడు. ఇక మరో నెటిజన్ "పికిల్స్ రమ్య గురించి వాళ్ళ రియల్ లైఫ్ లో చాలా తక్కువ చేసి మాట్లాడింది..ఇంకా బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉంటుందో ఏంటో" అనేసరికి "మాట్లాడింది వాళ్ళ అక్క కదా" అన్నాడు ఆదిరెడ్డి. "బిగ్ బాస్ టైంలో 99 %  బాడ్ కామెంట్స్ పిఆర్ కామెంట్స్ కాబట్టి నేను వాటిని పెద్దగా పట్టించుకోను." అన్నాడు. ఇక తన లైఫ్ గురించి అడిగిన ప్రశ్నకు "లైఫ్ లో ఒక్కసారైనా నా హైట్ కి తగ్గట్టు బాడీని పెంచాలి..వ్యవసాయం చేయాలి..నా పిల్లల్ని మంచి పొజిషన్ లో చూడాలి" అన్నాడు. ఇక మూవీస్, సీరియల్స్ లో యాక్టింగ్ గురించి వచ్చిన ప్రశ్నకు "నన్ను మూవీస్ అండ్ సీరియల్స్ లో అడిగారు. రీసెంట్ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఒకరు ఒక మూవీలోకి అడిగారు. అలాగే జెమినిలో ఒక సీరియల్ కి అడిగారు. ఈటీవీలో కూడా యాక్టింగ్ రిలేటెడ్ అడిగారు. కానీ నేను నో చెప్పాను. నాకు తెలియని దానిలో దూరాలని అనుకోవట్లేదు. ఐనా నాకు కూడా అంత సీన్ లేదనే నమ్ముతా. ఫ్యూచర్ లో ఏమో" అన్నాడు. "ఎవరినీ నమ్మొద్దు..నమ్మిన వాళ్ళను మోసం చేయద్దు..నేను చాల మందిని నమ్మి ఘోరంగా మోసపోయా అందుకే ఆ విషయంలోనే రిగ్రెట్ ఫీలవుతా..నా లా పరీక్షలు ఇంకో ఆరు రోజుల్లో ఉన్నాయి" అంటూ నెటిజన్స్ ప్రశ్నలకు ఆన్సర్స్ ఇచ్చాడు.

బేబీ బంప్ తో దేవర నటి...

  టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి చైత్ర రాయ్. ఆమె ఇప్పుడు మరోసారి తల్లి కాబోతున్నట్లు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో లేటెస్ట్ న్యూస్ ని అప్ డేట్ చేసింది. బేబీ బంప్ తో ఉన్న పిక్స్ ని పోస్ట్ చేసింది. అలాగే "అనదర్ హార్ట్ బీట్" అంటూ చెప్పింది. చైత్రకి ఆల్రెడీ ఒక పాప ఉంది. ఆమె పేరు నిష్క శెట్టి. "బేబీ 2 ఈజ్ లోడింగ్. త్వరలో నిష్క శెట్టి అక్క కాబోతోంది. ఇప్పటి వరకు ఈ విషయాన్నీ మాలోనే దాచుకున్నాం. ఇక ఇప్పుడు మీ అందరితో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాం. మా కోసం కూడా మీరు ప్రార్ధించండి..ప్రేమ చూపించండి" అంటూ పోస్ట్ చేసింది. అలాగే వీళ్ళ ముగ్గురు ఉన్న ఒక అందమైన వీడియోని కూడా పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్స్, సెలబ్రిటీస్ అంతా కూడా విషెస్ చెప్తున్నారు. చైత్ర రాయ్ దేవర మూవీలో నటించింది. అలాగే 2013 అష్టాచెమ్మా సీరియల్ తో తెలుగు బుల్లితెరకు పరిచయం అయ్యింది. ఈ సీరియల్ లో స్వప్న అనే రోల్ ద్వారా తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరయింది.  ఆ తర్వాత అలా మొదలైంది, అత్తో అత్తమ్మ కూతురో, దటీజ్ మహాలక్ష్మి, ఒకరికి ఒకరు, మనసున మనసై, అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు, రాధకు నీవేరా ప్రాణం. వంటి సీరియల్స్ లో నటించింది. తెలుగుతో పాటు అటు కన్నడలో కూడా ఈమె బాగా ఫేమస్. రెండు ఇండస్ట్రీలోని  సీరియల్స్ లో సినిమాల్లో నటిస్తుంది. ఈమె ఇంజినీర్ ప్రసన్న శెట్టిని వివాహం చేసుకుంది. చాల టీవీ షోస్ లో కనిపించేది. కానీ పెళ్లయ్యాక సీరియల్స్ కి కొంచెం గ్యాప్ ఇచ్చింది. ఇక దేవరతో మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసింది.

బిగ్ బాస్ లోకి అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్ కన్ఫర్మ్...

బిగ్ బాస్ సీజన్ 9 త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇప్పుడు ఈ షోకి కంటెస్టెంట్స్ వేటలో పడ్డారు బిగ్ బాస్ టీమ్ఐ తే కొంతమంది కంటెస్టెంట్స్ ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారంటూ కూడా తెలుస్తోంది. ఐతే రీసెంట్ ఆదిరెడ్డి తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఒక పోస్ట్ పెట్టాడు. అందులో పికిల్స్ రమ్య బిగ్ బాస్ సీజన్ 9 కి కంఫర్మ్ ఐనట్టు చెప్పాడు. అలాగే  బిగ్ బాస్ లేటెస్ట్ అప్ డేట్స్ ప్రకారం ఈసారి సీజన్ లో కామన్ మ్యాన్ కేటగిరీలో 9 మంది ఉండొచ్చు అని 70 % , ఉండకపోవచ్చు అని 30 % తెలుస్తోంది అంటూ పోస్ట్ చేసాడు. 9 వెర్సెస్ 9 అనే థీమ్ చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయి అనే టాక్ అంటూ చెప్పాడు. ఇక అలేఖ్య చిట్టి పికిల్స్ సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యిందో అందరికీ తెలిసిన విషయమే. వీళ్లకు చాల ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చిట్టి పికిల్స్ అంటే చాలు ఈ ముగ్గురు సిస్టర్స్ గుర్తొస్తారు. వీళ్ళ మీద వీడియోస్, ట్రోల్స్, మీమ్స్, గలీజ్ కామెంట్స్, రీల్స్, వెటకారపు డైలాగ్స్ ఒక్కటేమిటి అన్ని రకాలుగా వీళ్ళు సోషల్ మీడియాలో నోట్లో బాగా నానారు. దాంతో వీళ్ళు బిగ్ బాస్ కి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయంటూ కొన్ని వీడియోస్ కూడా వచ్చాయి. తిడితే తిట్టారు కానీ దగ్గరుండి బిగ్ బాస్ కి పంపిస్తున్నారుగా అంటూ కొన్ని ఛానెల్స్ కూడా పోస్టులు పెట్టాయి. ఏదేమైనా ఫైనల్ గా వీళ్ళు బిగ్ బాస్ లోకి వెళ్లే అవకాశం కూడా వచ్చేసింది. అలాగే జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానుయేల్ కూడా బిగ్ బాస్ కి కన్ఫర్మ్ ఐనట్టు తెలుస్తోంది. అలాగే టాలీవుడ్ సింగర్ శ్రీతేజ కూడా వెళ్ళబోతున్నట్టు న్యూస్ వస్తోంది. ఇక రీతూ చౌదరి వెళ్లే ఛాన్స్ కనిపిస్తోందంటూ సోషల్ మీడియా పోస్టింగ్స్ ద్వారా తెలుస్తోంది.  

Ilu illalu pillalu : భాగ్యం భాగోతం నర్మద బయటపెట్డగలదా.. ప్రేమ టెన్షన్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -207 లో.... భాగ్యంకి శ్రీవల్లి ఫోన్ చేసి నర్మద రెంట్ కి తీసుకున్న ఇంటి దగ్గరికి వెళ్లిన విషయం చెప్తుంది. నువ్వు ఏం కంగారు పడకు.. మీ మామయ్యకి ఒకవేళ విషయం చెప్పిన సాక్ష్యం కావాలని అంటాడు. ఆ సాక్ష్యాలు అది తీసుకొని రాలేదు.. ఇంత పెద్ద ఊళ్ళో మన ఇల్లు కనిపెట్టడం అసాధ్యమని శ్రీవల్లికి భాగ్యం దైర్యం చెప్తుంది. ఆ తర్వాత భాగ్యం భర్త టెన్షన్ పడుతూ.. ఎందుకు ఆ నర్మదతో పెట్టుకున్నావ్.. ఏదో వార్నింగ్ ఇచ్చి వచ్చావ్.. ఇక ఆ పిల్లకి ఎలా ఉంటుంది.. మన భాగోతం మొత్తం బయట పెడుతుందకి భాగ్యంతో ఆమె భర్త అంటాడు. మరొకవైపు ప్రేమ, నర్మద ఇద్దరు భాగ్యం ఇంటి కోసం వెతుకుతుంటారు. అప్పుడే ప్రేమకి డాన్స్ క్లాస్ కి టైమ్ అయిందని ఫోన్ వస్తుంది. నాకూ అర్జెంట్ వర్క్ ఉందని ప్రేమ అక్కడ నుండి వెళ్తుంది. నా దగ్గర ప్రేమ ఏదైనా దాస్తుందా ఏంటని నర్మద అనుకుంటుంది. ఆ తర్వాత ప్రేమ ఆటో కోసం చూస్తుంటే ధీరజ్ వస్తాడు. ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతాడు. స్పెషల్ క్లాస్ ఉందని ప్రేమ అనగానే.. ధీరజ్ నమ్మడు.. అయితే సైకిల్ ఎక్కు అనీ ధీరజ్ అనగానే నేను ఎక్కనని ప్రేమ అంటుంది. దాంతో ప్రేమ వెనకాలే ధీరజ్ ఫాలో అవుతాడు. కానీ ధీరజ్ కి కనపడకుండా ప్రేమ వెళ్ళిపోతుంది. మరొకవైపు ధీరజ్ గురించి రామరాజు ఆలోచిస్తాడు. తరువాయి భాగంలో ప్రేమ డాన్స్ క్లాస్ చెప్తుంటే.. అప్పుడే ప్రేమ వాళ్ళ నాన్న సేనాపతి చూస్తాడు. ప్రేమ దగ్గరికి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : జ్యోత్స్న, గౌతమ్ ల ఎంగేజ్ మెంట్ కోసం కార్తీక్ ఏర్పాట్లు.. అది కనిపెట్టేశాడుగా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -406 లో.....కార్తీక్ ఎంగేజ్ మెంట్ రింగ్స్ తీసుకొని వచ్చి సుమిత్రకి ఇస్తాడు. ఇలా ఈ రింగ్స్ నీ చేత్తో తీసుకోవడం చాలా హ్యాపీగా ఉందిరా అని సుమిత్ర అంటుంది. మీరేం కంగారు పడకండి పెళ్లి కూడా నా చేతుల మీదుగా జరుగుతుందని కార్తీక్ అంటాడు. మరొకవైపు ఈ గౌతమ్ గాడితో ఎంగేజ్ మెంట్ చెడగొట్టాలి అనుకుంటే వీడు ఏకంగా ఫస్ట్ నైట్ ప్లాన్ చేసుకుంటున్నాడని జ్యోత్స్న అనుకుంటుంది. ఎలాగైనా వాడితో ఫోన్ లో మాట్లాడి ఎంగేజ్ మెంట్ కాన్సిల్ చెయ్యాలని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత జ్యోత్స్న దగ్గరికి రింగ్స్ పట్టుకొని వస్తుంది సుమిత్ర. మీ ఎంగేజ్ మెంట్ రింగ్స్ అనగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. ఆ తర్వాత గౌతమ్ తో ఫోన్ మాట్లాడినట్లు యాక్టింగ్ చేస్తుంటాడు కార్తీక్. ఏంటని శివన్నారాయణ అడుగుతాడు. జ్యోత్స్న రింగ్స్ పట్టుకొని ఉన్నప్పుడు వీడియో తీసి పంపామన్నాని అనగానే జ్యోత్స్నని పిలిచి రింగ్స్ తీసుకొని చూపిస్తూ వీడియో అంట పంపమని అంటాడు. రింగ్స్ లేవని జ్యోత్స్న అనగానే అందరు షాక్ అవుతారు. జ్యోత్స్న రింగ్స్ ని టెడ్డిబేర్ లో దాచింది గుర్తు చేసుకుంటుంది. నేను గ్రానీకి ఇచ్చాను అనగానే పారిజాతం షాక్ అవుతుందిమ నాకు ఎక్కడ ఇచ్చావే అని పారిజాతం అనగానే నీకే ఇచ్చానని జ్యోత్స్న యాక్టింగ్ చేస్తుంది. దాంతో రింగ్స్ ఎక్కడ పెట్టవని శివన్నారాయణ పారిజాతం పై కోప్పడుతాడు. అప్పుడే దీప వచ్చి ఇదిగో రింగ్స్.. పారిజాతం గారు నాకు ఇచ్చారని దీప అనగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. జ్యోత్స్న దాచిన రింగ్స్ ని కార్తీక్ తీసింది గుర్తు చేసుకుంటాడు. రింగ్స్ ని సుమిత్రకి ఇస్తుంది దీప. సుమిత్ర అవి తీసుకొని లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : రాజ్ ప్రెజెంటేషన్ కి సిద్దార్థ్ ఫిధా.. కావ్యకి సపోర్ట్ గా అతను!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -770 లో..... రాజ్ ఆఫీస్ కి వెళ్తాడు. యామిని ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగా రాజ్ ని అందరి ముందు నీకు హెల్త్ బాలేదని విన్నాను నీకు ఎండీగా ఉండే కెపాసిటీ లేదని అంటాడు. ఇప్పటివరకు మన కంపెనీ డీలింగ్స్ చెప్పు.. ఎన్ని కోట్ల టర్నవోవర్ చేసిందని అడుగుతాడు. రాజ్ ఏం చెప్తాడోనని కావ్య టెన్షన్ పడుతుంది. కానీ రాజ్ ఆఫీస్ గురించి క్లారిటీ గా చెప్తుంటే అందరు షాక్ అవుతారు. రాజ్ కి గతం గుర్తు వచ్చిందేమోనని కావ్య అనుకుంటుంది. రాజ్ మాట్లాడే మాటలకి సిద్దార్థ్ మైండ్ బ్లాంక్ అవుతుంది. సారీ రాజ్ మిమ్మల్ని తప్పుగా అర్ధం చేసుకున్నాను.. మీరే ఈ కంపెనీకి ఎండీ అని సిద్ధార్థ్ చెప్తాడు. దాంతో కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందరు వెళ్ళిపోయాక ఇప్పుడు నిజం చెప్పండి ఇవ్వన్నీ మీకెలా తెలుసు.. మీకు గతం గుర్తుకు వస్తుందా అని కావ్య అనగానే.. ఏం మాట్లాడుతున్నారు అండి మీరే అన్ని నేర్పించారు కదా అని రాజ్ అంటాడు. నేను చెప్పలేని విషయలు కూడా గుర్తున్నాయ్ అంటే గతం మెల్లగా గుర్తుకు వస్తుందని కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు రాజ్ మీటింగ్ లో మాట్లాడింది. సుభాష్ కి తెలిసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంట్లో అందరికి చెప్తాడు. దాంతో రాహుల్, రుద్రాణి డిస్సపాయింట్ అవుతారు. మరొక వైపు కావ్యకి రాజ్ ప్రపోజ్ చేయబోతుంటే అప్పుడే కావ్యకి యామిని ఫోన్ చేసి అప్పు సస్పెండ్ అయిన విషయం చెప్పగానే కావ్య రాజ్ ని హగ్ చేసుకొని ఎమోషనల్ గా వెళ్ళిపోతుంది. తరువాయి భాగంలో అప్పు లంచం తీసుకుంటు దొరికిపోయిందని రుద్రాణి ఇంట్లో అందరికి చెప్తుంది. నా చెల్లి ఏం తప్పు చెయ్యలేదని నిరూపిస్తానని ధాన్యలక్ష్మికి చెప్తుంది కావ్య. ఆ తర్వాత రాజ్ కి అప్పు విషయం చెప్పగానే మనం ఇద్దరం కలిసి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామని రాజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ఫీలింగ్స్ వస్తున్నాయి.. అబ్బాయి కావాలి నాకు అర్జెంటుగా

  ఈమధ్య కాలంలో అమ్మాయిలు అబ్బాయిల్లో ఎక్కువ క్వాలిటీస్ ని కోరుకుంటున్నారు. బుల్లితెర మీద నటించేవాళ్ళు తాము పెళ్లి చేసుకోబోయే వాళ్ళల్లో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో వాళ్ళు రకరకాల షోస్ లో చెప్తూ వస్తున్నారు. రీసెంట్ గా ఢీ షోలో సుస్మిత, అన్షు వచ్చి వాళ్ళను పెళ్లి చేసుకోబోయే అబ్బాయిల్లో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో చెప్పారు. సుస్మిత ఐతే "ఉదయాన్నే 4 కి లేచి శుభ్రంగా చన్నీళ్ళ స్నానం చేసి పూజలో కూర్చోవాలి" అంది. "ఏంటి కలిసి కూర్చోవాలా" అంటూ రెజీనా కౌంటర్ వేసింది. దానికి సుస్మిత తెగ సిగ్గుపడిపోయింది. "ఏదేమైనా సాయంత్రం 4 కి అతను ఇంటికి వచ్చేసి నన్ను బయటకు తీసుకెళ్ళాలి." అంది. "అసలు ఇంట్లో ఉండరా మీరు" అంటూ ఆది ఫైర్ అయ్యాడు. "కాదు నందు అబ్బాయిల క్వాలిటీస్ కావాలని నన్ను కంగారుపెట్టేశావ్. నాకేమో ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి. మరి అబ్బాయి కావాలి నాకు అర్జెంటుగా పెళ్లి చూపులకు" అనేసరికి అందరూ పడీ పడీ నవ్వేశారు. ఇక అన్షు ఐతే తనకు నందులాంటి అబ్బాయి భర్తగా వస్తే చాలు అని చెప్పింది. "నా వర్క్ నేను చేసుకోవాలి అతని వర్క్ అతను చేసుకోవాలి." అని చెప్పింది. అలా ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటే ఇద్దరూ బాచిలర్స్ అవుతారు కానీ మొగుడూపెళ్లాలు ఎందుకు అవుతారు అంటూ అది కౌంటర్ వేసాడు. "సింపుల్ గా నందులాగా ఉంటే చాలు. హ్యాండ్సమ్, అండర్ స్టాండింగ్  ఉండాలి" అని చెప్పింది. ఇక నందు ఐతే "అలాంటి మొగుడు నీకు దొరకాలని త్వరలో పెళ్లి కావాలని  కోరుకుంటున్నా" అన్నాడు.  

జూనియర్ పవన్ కళ్యాణ్...మనల్ని ఎవడ్రా ఆపేది

  ఢీ సీజన్ 20 ఇది సర్ మా బ్రాండ్ షో ఈ వీక్ ఎపిసోడ్ ఫుల్ జోష్ గా సాగింది. ఇందులో రీ-రిలీజ్ స్పెషల్ థీమ్ లో ఒక్కో కొరియోగ్రాఫర్ ఒక్కో మూవీలోని సాంగ్ ని రీ-రిలీజ్ చేస్తూ పెర్ఫార్మ్ చేశారు. ఇక భూమిక ఐతే గబ్బర్ సింగ్ సాంగ్ ని రీ-రిలీజ్ చేసింది. దాంతో జడ్జెస్ ఫిదా ఇపోయారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెటప్ లో ఒక జూనియర్ ఆర్టిస్ట్ అలా అచ్చంగా పవన్ కళ్యాణ్ లా నడుచుకుంటూ వచ్చి ఎంటర్టైన్ చేశారు. పవన్ కళ్యాణ్ మ్యానరిజమ్, ఆయన సిగ్నేచర్ స్టెప్స్ ని వేసి అలరించారు. అప్పుడు హోస్ట్ నందు ఆదిని ఒక విషయం అడిగాడు. "జూనియర్ పవర్ స్టార్ ని చూస్తేనే షేక్ వస్తోంది. ఆది పవర్ స్టార్ ని పర్సనల్ గా కలిసి ఎలా తట్టుకుంటారయ్యా మీరు ఆ చరిష్మాని" అని అడిగాడు. "మాములుగా ఎప్పుడు ఎవరిని కలిసినా కానీ ఒక్కసారి ఎగ్జాయిట్మెంట్ ఉంటుంది. రెండో సారి నార్మల్ అనిపిస్తుంది. కానీ ఒక్క పవన్ కళ్యాణ్ గారినే ఎప్పుడు ఎన్ని సార్లు కలిసినా అదే ఎగ్జైట్మెంట్ ఉంటుంది. " అని చెప్పాడు. ఇక ఎన్నికల సమయంలో జబర్దస్త్ కమెడియన్ గా ఉన్న ఆది పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా పిఠాపురంలో ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఇక జూనియర్ గెటప్ లో వచ్చిన పవన్ కళ్యాణ్ కూడా తనకు ఢీ షోకి రావడం కొత్త ఎనర్జీని నాలో జెనెరేట్ అవుతూనే ఉంటుంది.. ఈ టైములో బాస్ చెప్పిన డైలాగ్ ఒకటి అంటూ "మిత్రమా అసలే చీకటి..రోడ్లంతా గతుకులు. చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. మనల్ని ఎవడ్రా ఆపేది" అంటూ మంచి ఫోర్స్ తో డైలాగ్ చెప్పారు. ఢీ షో సీజన్ 20 లో విన్నర్ కొరియోగ్రాఫర్స్ అంతా వచ్చి పెర్ఫార్మ్ చేస్తున్నారు. అలాగే జడ్జెస్ గా విజయ్ బిన్నీ మాష్టర్, రెజీనా వ్యవహరిస్తున్నారు.

షర్మిల కామెంట్స్ ని గుర్తు చేసుకున్న కౌషల్.. 

  ఇటీవల రిలీజయిన కన్నప్ప మూవీలో కౌషల్ ఒక మంచి రోల్ లో నటించాడు. కౌషల్ బిగ్ బాస్ కంటెస్టెంట్ కూడా. ఆయన కోసం కౌషల్ ఆర్మీ అనేది ఒక ఫార్మ్ కూడా అయ్యింది. ఇదంతా ఏడేళ్ల క్రితం. ఐతే బిగ్ బాస్ తర్వాత కౌషల్ ఫేమ్ తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు కన్నప్పతో మళ్ళీ తెరమీద కనిపించాడు. దాంతో ఒక ఇంటర్వ్యూలో బిగ్ బాస్ గురించి కొన్ని ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసాడు. "బిగ్ బాస్ తర్వాత చాలా ఆఫర్స్ వస్తాయని అనుకున్నా. దాని క్రేజ్ కారణంగా మంచి ఆఫర్స్ దొరుకుతాయని ఊహించా. కానీ రాలేదు. తర్వాత అర్ధమైన విషయం ఏంటంటే ఫిలిం ఇండస్ట్రీ, బిగ్ బాస్ రెండు వేరువేరు అని అర్ధమయ్యింది. అందులో సగం మంది బిగ్ బాస్ షోనే చూడరు. మోహన్ బాబు గారు కూడా బిగ్ బాస్ అనేదే చూడలేదు. షూటింగ్ లొకేషన్స్ లో బిగ్ బాస్ గురించి మమ్మల్ని అడిగి తెలుసుకునే వాళ్ళు. బిగ్ బాస్ అంటే ఏమిటి, ఎం చేస్తారు, ఎలా ఆడతారు అని అడిగేవాళ్ళు. ఆయన లాంటి వాళ్లకు చాలా మందికి కూడా బిగ్ బాస్ గురించి ఏమీ తెలీదు. ఐతే నా సీజన్ లో కౌశల్ ఆర్మీ పేరుతో చాలా హడావిడి జరిగింది కాబట్టి కొంతమందికి బిగ్ బాస్ గురించి తెలిసి ఉండవచ్చు. కానీ బిగ్ బాస్ నుంచి వచ్చానని ఇండస్ట్రీ పిలిచి అవకాశాలు ఇవ్వాలని కూడా ఏమీ లేదు. ఐతే ఎన్నాళ్ళ నుంచో నేను ఇండస్ట్రీలో ఉన్నాను. అన్ని రకాల రోల్స్ చేసాను. దాంతో లీడ్ క్యారక్టర్ ఇవ్వాలి అంటే వాళ్లకు కూడా కష్టమే అయ్యుండొచ్చు. నేను హీరోగా చేస్తానని చెప్పలేదు. లీడ్ రోల్ కూడా అడగలేదు. కానీ ఇచ్చిన రోల్ కి న్యాయం చేస్తాను అని చెప్పా అంతే. బిగ్ బాస్ ఐపోయి ఏడేళ్లు ఐపోతోంది. అప్పట్లో ఇంటర్వ్యూ చేస్తే లక్షల్లో వ్యూస్ వచ్చేవి ఇప్పుడు బిగ్ బాస్ ఫ్లవర్ తగ్గుతూ వస్తుంది దాంతో వేలల్లోనే వ్యూస్ వస్తాయి. ఎవరో అన్నట్టు పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర అన్నట్టు ఇంటర్వ్యూ అంటే మనం ఏంటో చెప్పేదే. అది కొంతమంది ఇన్స్పిరేషన్ ఇస్తుంది. కొంతమందికి ఉపయోగపడుతుంది. అలా ఉండాలి లేదంటే ఇంటర్వ్యూస్ చేయడం వేస్ట్" అని చెప్పారు కౌశల్.

కాశీ విశ్వనాథుడి సేవలో తరించిన రష్మీ గౌతమ్

  బుల్లితెర మీద గత పదేళ్లుగా జబర్దస్త్ కి యాంకర్ గా చేస్తున్న రష్మీ గౌతమ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మొదట్లో సుడిగాలి సుధీర్, రష్మీ కలిసి జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ ని హోస్ట్ చేసేవాళ్లు. కానీ తర్వాత సుధీర్ మూవీస్ లో ఛాన్సెస్ రావడంతో వెళ్ళిపోయాడు. అలా ఈ రెండు షోస్ ని రష్మీ నిర్వహిస్తూ వస్తోంది. ఇక రీసెంట్ గా రష్మీకి కో-యాంకర్ గా మానస్ జతయ్యాడు. రష్మీ ఎప్పుడూ సోషల్ మీడియాలో చాల యాక్టివ్ గా ఉంటుంది. రీసెంట్ గా ఒక హెల్త్ ఇష్యూని కూడా ఫేస్ చేసింది. ట్రీట్మెంట్ చేయించుకుని వచ్చింది. దాంతో ఆమె కొంచెం తగ్గిపోయింది కూడా. అలాగే ఇప్పుడు కొన్ని పిక్స్ ని పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఆమె కాశి వెళ్లి అక్కడ దర్శనం చేసుకున్న పిక్స్ ని పోస్ట్ చేసింది. అలాగే "కాశీ మనుషులు నిర్మించిన నగరం కాదు.. ఇది దేవతలు కొలువై ఉండే నగరం, శివుని త్రిశూలం అంతా చూసుకుంటుంది. కాశీ విశ్వనాథుని ఆధ్యాత్మిక విశ్వాసం " అంటూ హరహర మహాదేవ, హరహర గంగే, కాశీవిశ్వనాథ అంటూ హాష్ ట్యాగ్స్ పెట్టింది. నుదిటి మీద త్రిసూలం బొట్టుతో రష్మీ కొత్తగా అందంగా కనిపించింది ఈ పిక్స్ లో . ఇక నెటిజన్స్ ఐతే హరహరమహదేవా, చాలా బాగున్నారు, ఓం నమఃశివాయ, శివ శంభో, మంచిగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం..." అంటూ విష్ చేస్తున్నారు. ఇక జబర్దస్త్ కి మధ్యలో యాంకర్స్ గా సౌమ్య, సిరి హన్మంత్ వచ్చారు కానీ వాళ్ళు ఎక్కువ కాలం నిలబడలేకపోయారు. రష్మీ ఒక్కతే స్టాండర్డ్ గా ఆ షోకి ఫిక్స్ ఐపోయింది. అలాగే కొన్ని మూవీస్ లో కూడా నటించింది.

అమెరికాలో ఫ్రీడమ్ ఉంటుంది..జడ్జ్ చేసేవాళ్ళు ఉండరు

  హీరోయిన్ లయ అందమైన తెలుగింటి అమ్మయిలా ఉంటుంది. ఆమె ఇండస్ట్రీలో ఎన్నో మూవీస్ లో నటించింది. ప్రేమించు, స్వయంవరం, అదిరిందయ్యా చంద్రం, మనోహరం వంటి మంచి మూవీస్ లో నటించింది. ఐతే తర్వాత పెళ్ళైపోయి అమెరికాలో సెటిల్ ఐపోయింది. రీసెంట్ గా నితిన్ తో కలిసి తమ్ముడు అనే మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇక ఒక ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు చెప్పింది. "ఇండియన్ లైఫ్ స్టైల్ చాలా బెటర్. ఎందుకంటే ఇక్కడ చాల మంది మనకు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు. ఆర్డర్ పెట్టగానే ఫుడ్ కానీ గ్రోసరీస్ కానీ అందుబాటులో ఉంటాయి. మనకు ఫామిలీ లేకపోయినా బతికేయొచ్చు. ఎవరో ఒకళ్ళు ఉంటూనే ఉంటారు. ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఉంటారు. నిమిషాల్లో అన్ని పనులు ఐపొతాయి. చాలా ఆప్షన్స్ ఉంటాయి. కానీ ఇవే పనులు నేను అమెరికాలో చేయాలంటే తలప్రాణం తోకకొస్తుంది. అన్ని మనమే తెచ్చుకోవాలి..అన్నీ దూరాలుంటాయి. పార్కింగ్ ఎక్కడో ఉంటుంది. గ్రోసరీస్ అన్నీ తెచ్చుకుని పార్కింగ్ వరకు నడుచుకుంటూ వచ్చి మళ్ళీ బండిలో పెట్టుకుని ఇంటికి వెళ్లి అన్నీ మళ్ళీ సర్దుకోవాలి. ఏదన్నా ఒక్కటి కొనడం మర్చిపోతే అంతే సంగతి. ఆ వస్తువును ఆర్డర్ పెట్టుకోవడానికి ఉండదు. ఉన్నాయి కానీ ఆన్లైన్ మార్కెట్ నుంచి ఆర్డర్ పెట్టి తెప్పిస్తే మాత్రం ఆ ప్రోడక్ట్ కాస్ట్ కంటే కూడా ఎక్కువగా పే చేయాల్సి ఉంటుంది. అందుకే కంఫర్ట్ వైజ్ గా ఇండియానే బెస్ట్. కాకపొతే అమెరికాలో ఫ్రీడమ్ ఉంటుంది. మనం ఎం చేస్తున్నామో పక్కవాళ్ళు చూడరు..మనల్ని జడ్జ్ చేసే వాళ్ళు ఎవరూ ఉండరు. ఎలాంటి డ్రెస్ వేసుకున్న కామెంట్ చేయరు. ఎలా కావాలంటే అలా అక్కడ ఉండొచ్చు. ఎవరూ ఎవరినీ డిస్టర్బ్ చేయరు. రావచ్చా అంటూ ముందుగా కనుక్కుని వస్తారు. ఎప్పుడు పడితే అప్పుడు బెల్ రింగ్ చేయడం అంటూ ఉండదు. విజయవాడలో చిన్నప్పుడు ఉన్నాను. కానీ మిస్ అవుతున్న ఫీలింగ్ లేదు. ఎందుకంటే నా ఫ్రెండ్స్ అంతా కూడా అమెరికాలోనే సెటిల్ ఇపోయారు. విజయవాడలో ప్రస్తుతానికి ఎవరూ లేరు. నేను అక్కడికి వెళ్లి ఏమీ చేయలేను. " అని చెప్పారు లయ.

శ్రీముఖి ఎంత స్లిమ్ గా ఐపోయినావమ్మా

  బుల్లితెర మీద క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్ ఫిమేల్ హోస్ట్ ఎవరు అంటే చాలు అందరూ శ్రీముఖి అంటారు. ఆమె హోస్ట్ చేసే షోస్ రేటింగ్స్ కూడా అలాగే పీక్స్ లో ఉంటాయి. ఐతే శ్రీముఖి రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో హాష్ టాగ్ మెమోరీస్ అంటూ వాషింగ్టన్ డిసిలో దిగిన కొన్ని పిక్స్ ని పోస్ట్ చేసింది. ఈ పిక్స్ లో శ్రీముఖి చాలా సన్నగా కనిపిస్తోంది. చిన్నపిల్లలా ఫోజులిస్తూ ఆ పిక్స్ లో కనిపిస్తోంది. ఇక నెటిజన్స్ ఐతే రకరకాల కామెంట్స్ తో శ్రీముఖిని పొగిడేస్తున్నారు. "ఎంత క్యూట్ గా ఉన్నావో స్కూల్ పాపలా. డ్రెస్ మస్తు ఉంది రాములమ్మ.. ఓలమ్మ ఓలమ్మ ఓలమ్మో ఎంత స్లిమ్ గా ఐపోయినావమ్మా..మా బాబు స్కూల్ షూస్ మిస్ అయ్యాయి...ఎక్కడ పోయాయో అనుకున్నా మీరు తీసుకెళ్లారా...నువ్వు లంగా ఓణీలోనే బావుంటావ్..కొన్ని ఫోజుల్లో నువ్వు అచ్చం దివ్యభారతిలా ఉన్నావు.." అంటూ రకరకాల క్యూట్ కామెంట్స్ ని పోస్ట్ చేశారు. ఎప్పుడూ బిజీగా ఉండే శ్రీముఖి అప్పుడప్పుడు ఇలా ఛిల్ల్ అవుతూ ఉంటుంది. ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో చేస్తుంది అలాగే రీసెంట్ గా కిర్రాక్ బాయ్స్, ఖిలాడీ గర్ల్స్ షోకి హోస్ట్ చేసింది. ఇక శ్రీముఖి గురించి ఒక న్యూస్ బాగా వైరల్ అవుతోంది. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసారంటూ కొంతమంది సెలబ్రిటీస్ మీద ఈడి కేసు ఫెయిల్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో శ్రీముఖి పేరు కూడా ప్రముఖంగా వినబడుతోంది. బుల్లితెరకు సంబంధించిన నటీనటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూఎన్సర్ల పేర్లు  కూడా  వినిపిస్తున్నాయి.

Inaya Sulthana : ఇనయా పోస్ట్ కి షాకింగ్ కామెంట్ చేసిన నెటిజన్.. జామకాయలు కావాలంట!

  బిగ్ బాస్‌కి ముందు ఇనయా సుల్తానాని పట్టించుకున్న వాళ్లెవ్వరూ లేకపోయిన బిగ్ బాస్ తరువాత తన గురించే మాట్లాడుకునేట్టు చేస్తుందామె. నిన్న మొన్నటి దాకా ఓ అబ్బాయితో గోవా ట్రిప్ కి వెళ్ళి అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేసి వచ్చిన ఇనయా అతనికి బ్రేకప్ చెప్పేసి ఇప్పుడు కొత్త జీవితాన్ని గడుపుతుంది.  తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఐడీలో జామకాయ తింటూ కొన్ని  ఫోటోలని వదిలింది ఇనయా. అయితే ఆ ఫోటోలని చూసిన నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. అయితే వాటిల్లో ఓ నెటిజన్ చేసిన కామెంట్ కి రిప్లై ఇచ్చింది ఈ భామ. " నాకు జామకాయలు కావాలి" అంటూ ఓ కుర్రాడు కామెంట్ చేయగా.. సూపర్ మార్కెట్‌లో ఉంది కొనుక్కో అంటూ ఇనయా రిప్లై ఇచ్చింది. ఇక ఇనయా రిప్లై చూసిన ఆ కుర్రాడు..నేను అడిగిన జామకాయ ఏంటో.. మీకు అర్థం కాలేదా బ్యూటీ.. మినిమమ్ డిగ్రీ చదవలేదా అని రిప్లై ఇచ్చాడు.‌ ఇక ఇనయా దానికి సమాధానమేమి ఇవ్వలేదు. కానీ‌ ఇతరులు ఆ కామెంట్ కి రిప్లై ఇస్తున్నారు.  బోల్డ్ ఫోటోలని అప్పుడప్పుడు కొంతమంది సెలెబ్రిటీలు పెట్టేదే ఇలాంటి డబుల్ మీనింగ్ అండ్ బోల్డ్ కామెంట్లు ఇంకా కాంట్రవర్సీ కామెంట్లు వస్తాయనే కదా.. వాళ్లు మినిమిమ్ డిగ్రీ కాదు.. మాస్టర్ డిగ్రీ చేసేశారు. ఇలాంటి కామెంట్లు వస్తాయని తెలిసే ఈ జామకాయల పోస్ట్ పెట్టిందంటు మరో నెటిజన్ కామెంట్ చేసాడు. ఇక ఇప్పుడు ఇది నెట్టింట వైరల్ గా మారింది.

Illu illalu pillalu : భాగ్యానికి నర్మద సవాల్.. ఇంటికెళ్ళిన ఇద్దరు కోడళ్ళు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -206 లో.... ప్రేమ, నర్మద బాధపడేలా మాట్లాడుతుంది భాగ్యం. ఇంకొకసారి నా కూతురు జోలికి వస్తే బాగుండదని నర్మదకి భాగ్యం వార్నింగ్ ఇస్తుంది. భాగ్యం వెళ్లిపోతుంటే నర్మద పిలిచి.. మీ పాటికి మీరు మాట్లాడి వెళ్ళిపోతే ఎలా మీరు అన్నారు కదా.. నీకు ఈ ఇంట్లో ఎవరు సపోర్ట్ గా లేరని.. నాకు ఎవరు సపోర్ట్ గా లేకున్నా సరే నేను ఈ కుటుంబానికి ఎప్పుడు సపోర్ట్ గా ఉంటాను.. నా కుటుంబం జోలికి ఎవరైనా వస్తే అసలు ఊరుకోను వారి బంఢారం బయట పెట్టేవరకు ఊరుకోను.. ఇప్పటి వరకు డౌట్ ఉండే కానీ ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది అందరి సంగతి తేలుస్తానని భాగ్యంతో నర్మద అనగానే భాగ్యం టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత వేదవతిని వాళ్ళ అమ్మ ఎదురింటి నుండీ పిలుస్తుంది. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లారని వేదవతి అడుగుతుంది. అక్క మనసు బాలేదని తీర్ధయాత్రలకి తీసుకొని వెళ్ళిందని వాళ్ళ అమ్మ చెప్తుంది. ముగ్గురు కోడళ్ళు వచ్చారు కదా అని కోడళ్ళ గురించి వేదవతి వాళ్ళ అమ్మ మాట్లాడుతుంది. ముగ్గురు కోడళ్లకి ఒకరంటే ఒకరికి పడదని వేదవతి అనగానే నర్మద అయితే గడుసు పిల్ల కుటుంబం కోసం ఏదైనా చేస్తుందని వేదవతి వాళ్ల అమ్మ అంటుంది. మరొకవైపు భాగ్యం తన కూతురు పెళ్లి కోసం ఇంటిని రెంట్ తీసుకున్న దగ్గరికి ప్రేమ, నర్మద వెళ్తారు. ఆ ఇల్లు భాగ్యం వాళ్ళది కాదని ప్రేమ, నర్మదలకి అర్ధమవుతుంది. వేదవతి కి ఫోన్ చేసి శ్రీవల్లి అక్క పేరెంట్స్ ఎక్కడున్నారో కనుక్కోండి మేమ్ వాళ్ల ఇంటి ముందు ఉన్నామని నర్మద అనగానే శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. మా వాళ్ళు ఇంట్లో లేరని చెప్పి తప్పించుకుంటుంది. ఆ తర్వాత అసలు శ్రీవల్లి వాళ్ల ఇల్లు ఎక్కడో తెలుసుకొని ఇంటి పక్కన వాళ్ళని అడిగితే తెలుస్తుంది కదా అని ప్రేమ, నర్మద అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : దీపకి నిజం చెప్పేసిన కార్తీక్‌.. మరి దాస్ ఎక్కడ?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -405 లో......అసలు జ్యోత్స్న ఎందుకు అలా ఉంది బావ అని కార్తీక్ ని అడుగుతుంది దీప. గౌతమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు జ్యోత్స్న ఒంటరిగా ఉందని చెయ్యి పట్టుకున్నాడని కార్తీక్ చెప్తాడు. మరి నువ్వు లోపలకి వెళ్లలేదా అని దీప అనగానే లేదు తర్వాత వెళ్ళానని కార్తీక్ అంటాడు. థాంక్స్ దీప.. జ్యోత్స్న గురించి అలోచించి నన్ను వెళ్ళమన్నావని కార్తీక్ అనగానే.. నేను ఒక తల్లి కూతురిని.. ఒక కూతురుకి తల్లిని కదా ఆలోచించకుండా ఎలా ఉంటానని దీప అంటుంది. మనం కొద్ది కొద్దీగా జ్యోత్స్న గురించి నాన్నకి తెలిసేలా చెయ్యాలని దీప అనగానే.. మావయ్యకి జ్యోత్స్న గురించి తెలుసు.. దాస్ మావయ్యని కొట్టింది తనే అని మావయ్యకి తెలుసు కానీ దాస్ మావయ్య నిజం చెప్పేవరకు అని ఆలోచిస్తున్నాడని కార్తీక్ అంటాడు. దాస్ బాబాయ్ నిజం చెప్తాడు కదా అని దీప అనగానే చెప్పడు అని కార్తీక్ అంటాడు. అంటే బాబాయ్ ఎక్కడున్నాడో నీకు తెలుసా అని దీప అనగానే తెలుసు కానీ సమయం వచ్చినప్పుడు వస్తాడని కార్తీక్ అంటాడు. మరొకవైపు స్వప్న, కాశీ భోజనం చేస్తుంటే శ్రీధర్ వస్తాడు. కాశీ పది లక్షల అప్పు తీర్చిన విషయం చెప్తాడు. ఆ తర్వాత జ్యోత్స్న, పారిజాతం మాట్లాడుకుంటుంటే దీప కాఫీ తీసుకొని వస్తుంది. ఎందుకు మేమ్ తీసుకొని రమ్మనకముందే వచ్చావని పారిజాతం కోప్పడుతుంది. ఆ తర్వాత కార్తీక్ వచ్చి గౌతమ్ వాళ్ళ అమ్మ పూజ జరిపించిన ఎంగేజ్ మెంట్ రింగ్స్ కోసం పంపించిందని శివన్నారాయణకి చెప్తాడు. ఇవి జ్యోత్స్నలకి ఇవ్వండి అని సుమిత్రకి ఇస్తాడు కార్తీక్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : ఏసీబీకి చిక్కిన కావ్య చెల్లి.. రాజ్ ప్రపోజ్ చేయకుండానే తను వెళ్ళిపోయిందిగా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -769 లో...... రాజ్ పై నుండి కిందకి వస్తుంటే అందరు షాక్ అవుతారు. రాజ్ కిందకి వచ్చి పనిమనిషి వంట బాగా చెయ్యలేదని మాట్లాడుతుంటే.. ఒక్క క్షణం అందరికి రాజ్ కి గతం గుర్తు వచ్చిందేమో అనుకుంటారు. ఏంటి అలా మాట్లాడుతుంటే భయపడ్డారా అని రాజ్ కామెడీ చేస్తాడు. ఆ తర్వాత రాజ్, కావ్య ఆఫీస్ కి బయల్దేరతారు. రాజ్, కావ్య ఆఫీస్ లోపలకి వెళ్తుంటే.. కావ్యకి యామిని ఫోన్ చేస్తుంది. మీరు లోపలికి వెళ్ళండి.. నేను వస్తానని రాజ్ ని పంపిస్తుంది కావ్య. ఎప్పటిలాగే ఈసారి నువ్వు ఓడిపోతున్నావ్.. మీటింగ్ అవ్వగానే నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని యామిని అంటుంది. దాంతో మళ్ళీ ఏదో ప్లాన్ చేసిందని కావ్యకి అర్ధమవుతుంది. స్వప్నకి ఫోన్ చేసి అక్కడ అంత ఒకే కదా అని అడుగుతుంది. ఒకే అని స్వప్న అనగానే సరేనని అప్పుకి ఫోన్ చేస్తుంది కావ్య. అక్కడ సిచువేషన్ ఒకేనా కావ్య అడుగగా.. ఒకే అక్క అని అప్పు అంటుంది.  ఆ తర్వాత యామిని మనుషులు అప్పు తమని లంచం అడిగిందని రెడ్ హ్యాండెడ్ గా పట్టిస్తామని ఏసీబీ వాళ్ళకి చెప్పి అప్పు దగ్గరికి వెళ్తారు. ఇద్దరు రౌడీలు అప్పు దగ్గరికి వెళ్లి మేడమ్ వాడికి మీ చేతుల మీదుగా డబ్బు ఇవ్వండి అని అతను అనగానే అప్పు సరే అంటుంది. అప్పుడే ఏసీబీ వాళ్ళు వచ్చి అప్పు లంచం తీసుకుంటుందని సస్పెండ్ చేస్తారు. కోర్ట్ లో కలుద్దామని వాళ్ళు అంటారు. ఆ తర్వాత రాజ్ ఆఫీస్ కి వెళ్లి మీటింగ్ లో మాట్లాడతాడు. తరువాయి భాగంలో కావ్యకి రాజ్ ప్రపోజ్ చేస్తుంటే కావ్యకి యామిని ఫోన్ చేసి మీ చెల్లి సస్పెండ్ అయిందని చెప్తుంది. దాంతో కావ్య అక్కడ నుండి వెళ్లిపోతుంది. నువ్వు ప్రపోజ్ చేస్తుంటే వెళ్ళిపోయిందంటే కావ్యకి నువ్వంటే ఇష్టం లేదని రాజ్ తో యామిని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.