Brahmamudi : శ్రీనుని కిడ్నాప్ చేపించింది యామిని.. టెన్షన్ లో రాజ్, కావ్య!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -774 లో.... రేవతి దగ్గరికి ఇందిరాదేవి వెళ్లి డబ్బు ఇస్తుంది. నాకు కావల్సింది ఇది కాదు నానమ్మ.. ఆ కుటుంబంతో బంధం కావాలని రేవతి అంటుంది. ఆ రోజు త్వరలోనే వస్తుంది కానీ అప్పటివరకు ఈ డబ్బు తీసుకోమని ఇందిరాదేవి అంటుంది. నన్ను ఉన్నంతలో హ్యాపీగా చూసుకుంటున్నాడు.. వద్దు నానమ్మ అని రేవతి అంటుంది. మా అమ్మ ఎప్పుడు నా కొడుకుని ఎత్తుకొని ముద్దాడుతుందోనని రేవతి బాధపడుతుంది. మరొకవైపు అపర్ణ కార్ డోర్ తీస్తుంటే ఒక అబ్బాయి కింద పడిపోతాడు. దాంతో అతని చేతిలోని ఐస్ క్రీమ్ కిందపడిపోతుంది. ఆ అబ్బాయి ఎవరో కాదు రేవతి కొడుకు. అయ్యో బాబు అని అపర్ణ ఆ బాబుని దగ్గరికి తీసుకొని.. నీకు ఐస్ క్రీమ్ కి డబ్బు ఇస్తానని అంటుంది. వద్దు నాకు ఐస్ క్రీమ్ మీరే కోనివ్వండి అని ఆ బాబు అనగానే అపర్ణ సరేనంటుంది. నీ పేరు ఏంటని అపర్ణ అడుగగా. స్వరాజ్ అని ఆ బాబు చెప్తాడు. నా కొడుకు పేరే అని అపర్ణ మురిసిపోయి ఐస్ క్రీమ్ కొనిస్తుంది. ఇక నుండి మనిద్దరం ఫ్రెండ్స్ అని అపర్ణ అంటుంది. సరే అని ఆ  బాబు అంటాడు. మరొకవైపు ఇందిరాదేవి ఇంటికి వెళ్ళబోతుంటే అప్పుడే కావ్య, రాజ్ వస్తారు. రేవతి ఇంటి డోర్ కొడతారు. దాంతో ఇందిరాదేవి లోపల దాక్కుంటుంది. ఏంటి ఇలా వచ్చారని రేవతి అడుగగా.. శ్రీను అనే అతని అడ్రెస్ కావాలని కావ్య చూపించగా ఇంటిపక్కనే అని రేవతి తీసుకొని వెళ్తుంది. శ్రీను వాళ్ల అమ్మని బయటకి పిలుస్తుంది రేవతి. కావ్య జరిగింది చెప్తుంది. నా కొడుకు అలా చేసాడంటే నేను నమ్మలేకపోతున్నానని  శ్రీనుకి వాళ్ల అమ్మ ఫోన్ చేస్తుంది. శ్రీను దగ్గర ఫోన్ ఇంకొక రౌడీ తీసుకొని మీ కొడుకుని కిడ్నాప్ చేశామని రౌడీ చెప్తాడు. అలా అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఇందిరాదేవి వెళ్తుంటే అక్కడే ఉన్న రాజ్ చూసి నానమ్మ అంటాడు. తరువాయి భాగంలో శ్రీనుని కిడ్నాప్ చేయిస్తుంది యామిని. ఆ కిడ్నాప్ చేసింది కూడా అప్పునే అని క్రియేట్ చేయాలని ప్లాన్ చేస్తుంది యామిని. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

శ్రీముఖి కి స్వయంవరం...గెలిచింది ఎవరు!

ఆదివారం విత్ స్టార్ మా పరివారం నెక్స్ట్ వీక్ ప్రోమో మొత్తం హిస్టారికల్ థీమ్ తో క్రియేట్ చేసినట్టు కనిపిస్తోంది. శ్రీముఖి స్వయంవరం ఈ ఎపిసోడ్ లో నిర్వహించబోతున్నారు. దాంతో అవినాష్, హరి కలిసి శ్రీముఖిని బాగా ఎలివేట్ చేశారు. "పరివారం దేశపు యువరాణి..148 ఎపిసోడ్లుగా ప్రయాణం చేస్తున్న అలుపెరగని యోధురాలు..ఎంతోమంది మనసులు గెలుచుకున్న అందగత్తె.. మా శ్రీముఖి యువరాణి వచ్చేస్తున్నారహో" అని చెప్పారు. దాంతో శ్రీముఖి యువరాణి కాస్ట్యూమ్ మెరిసిపోతూ స్టేజి మీదకు వచ్చింది. ఆ పక్కనే రోహిణి కూడా అదే గెటప్ లో వచ్చింది. దాంతో అవినాష్ "యువరాణి అమ్మగారికి నా ప్రణామాలు" అన్నాడు. "ఆవిడ నా అమ్మగారు కాదు" అంది శ్రీముఖి. "ఇంత అందమైన బొమ్మను చూసి అమ్మా అందువా" అంటూ రోహిణి డైలాగ్ వేసింది. "మరీ చూడడానికి మాసిపోయినట్టు ఉంది" అంటూ కౌంటర్ వేసాడు అవినాష్. "మిమ్మల్ని చూసుకోవడానికి ఎంతో మంది యువరాజులు పక్క రాజ్యం నుంచి వస్తున్నారు" అంటూ శ్రీముఖి స్వయంవరం నిర్వహించారు అవినాష్, హరి. ఇక ఈ షోకి వచ్చిన లేడీ టీమ్ లో అమ్మాయిలు అబ్బాయిలను చూసి ఫ్లాట్ ఇపోయారు. దాంతో "అమ్మా ఇష్టసఖులు అబ్బాయిల్ని చూసి మరీ లేకీగా ప్రవర్తించకూడదమ్మా" అంటూ కౌంటర్ ఇచ్చాడు. "మేము లేకీగా ప్రవర్తించట్లేదు. మాకు ఏమీ లేక ప్రవర్తిస్తున్నాం" అంది రోహిణి. ఇక ఆ షోకి వచ్చిన అబ్బాయిలంతా పెద్ద కత్తులతో వచ్చారు. " ఏంటి ఆర్జే చైతు మాత్రం చిన్న కత్తితో వచ్చాడు" అంటూ శ్రీముఖి తెగ ఫీలైపోయింది. వెంటనే రోహిణి "ఆ కత్తిని చూసి నేను కన్నుమూసెదను" అనేసింది. దాంతో అందరూ నవ్వారు. ఇక బాలు ఈ షోకి వచ్చాడు. రాగానే శ్రీముఖి అతని కాళ్లకు వంగి నమస్కారం చేసింది. అతను ఒక పువ్వు ఇచ్చాడు. దాంతో శ్రీముఖి ఫిదా ఐపోయింది. "వాళ్ళ కత్తుల కన్నా మీ పువ్వే నచ్చింది" అని చెప్పింది. దాంతో శ్రీకర్ "ఇక మేము మా కత్తులు పట్టుకుని బయల్దేరుతాము" అనేశాడు.  

శ్రీదేవి డ్రామా కంపెనీలో అంజలి సీమంతం..కన్నీళ్లు పెట్టుకున్న ఇంద్రజ, రష్మీ

  శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో ఫుల్ ఎంటర్టైనింగ్ ఉంది. ఈ ప్రోమోలో అంజలిపవన్ కి సీమంతం చేసే కాన్సెప్ట్ తో ఈ ఎపిసోడ్ రాబోతోంది. ఈ సీమంతం చేసింది ఎవరో కాదు హోస్ట్ తమ్ముడు రవి..."నేను చందమామ కలిసి మా అక్కకు సీమంతం చేస్తాం" అంటూ చెప్పుకొచ్చాడు. భార్య సీమంతం సందర్భంగా పవన్ ఐతే ఫుల్ జోష్ తో యమా స్పీడ్ తో డాన్స్ చేసాడు. కానీ ఆ స్పీడ్ డాన్స్ తనకు నచ్చలేదు అని చెప్పి వాళ్ళ నాన్న పరువు తీసేసింది చందమామ. ఇక శ్రీ సత్య, చందమామ కలిసి "చల్ల గాలి" సాంగ్ కి ఐ-ఫీస్ట్ పెర్ఫార్మెన్స్ చేశారు. తర్వాత సెట్ లో ఉన్నవాళ్ళంతా కలిసి వచ్చి అంజలికి సీమంతం చేసారు. ఇక పవన్ తన భార్యకు గాజులు తొడిగాడు. ఈ గాజులు నీ చేతి నరాలకు తగిలి ప్రసవం సుఖంగా అవ్వాలని ఈ గాజులు వేస్తున్నా అని చెప్పాడు. తర్వాత రవి ఒక స్కిట్ వేసాడు. ప్రతీ ఇంట్లో మామఅల్లుడు ఎలా ఉంటారో తెలిపే రిలేషన్ ని ఈ స్కిట్ లో చూపించారు. పేగు మెళ్ళో వేసుకుని పుట్టిన మేనల్లుడిని చూస్తే అరిష్టం అనే కాన్సెప్ట్ మీద ఈ స్కిట్ నడిచింది అలాగే రవికి పెళ్లయ్యాక మేనమామతో రిలేషన్ చాలా తగ్గిపోతుంది అనేది కూడా చూపించారు. ఇక ఇంద్రజ, రష్మీ కన్నీళ్లు పెట్టుకున్నారు ఈ స్కిట్ చూసి. "ఒక అన్నయ్య కానీ ఒక తమ్ముడు కానీ లేరు అని నేను చాలా చాలా ఫీలైన సందర్భాలు ఉన్నాయి "హార్ట్ టచ్చింగ్ పెర్ఫార్మెన్స్ నిజంగా చాల బాగుంది అక్షరంలో ఒక్క మా కాదు రెండు మా లు ఉంటాయి. "మామా" అంటూ చెప్పి కన్నీళ్లు పెట్టుకుని రష్మీ. తర్వాత స్టేజి మీద అంజలి సోదరుడు వచ్చాడు. "ఒక నాలుగేళ్లు అనుకుంట వాడు నేను అసలు మాట్లాడుకోలేదు" అని చెప్పి ఏడ్చేసింది. ఈ ప్రోమోలో చాన్నాళ్లకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఘంటాడి కృష్ణ వచ్చి "చెలియా నిను చూడకుండా" "దేవుడు వారమందిస్తే" అనే అనే సాంగ్స్ పాడారు. దాంతో రవి "మీరు పాట పాడుతుంటే నాకు క్యాసెట్ ఏ సైడ్ బి సైడ్ గుర్తొచ్చింది" అంటూ చెప్పాడు.

Illu illalu pillalu : అందరు మోసం చేసారని కుప్పకూలిన రామరాజు.. ప్రేమపై ధీరజ్ కోపం!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -210 లో......ప్రేమ డాన్స్ క్లాస్ చెప్పడం చూసిన సేనాపతి ఇంటికి వచ్చి రామరాజు కుటుంబంపైకి గొడవకి వెళ్తాడు. అక్కడ ప్రేమ కూడా డాన్స్ కి వెళ్తున్నానని చెప్పడంతో అందరు షాక్ అవుతారు. నేను వద్దని చెప్పాను కదా ఎందుకు వెళ్ళావని రామరాజు అడుగుతాడు. ఇంకా మా ప్రేమ నగలు కూడా మీ దగ్గరే ఉన్నాయని సేనాపతి అంటాడు. లేవని రామరాజు అంటాడు. ఉన్నాయ్ అవి లాకర్ లో పెట్టానని వేదవతి అనగానే రామరాజు షాక్ అవుతాడు. నిజాలు బయటపడ్డాక ఇప్పుడు ఎందుకు నాటకాలని భద్రవతి అంటుంది. ఆయనని ఏం అనకండి ఆయనకి ఏం తెలియదు మీరేమైన అంటే నన్ను  అనండి అని వేదవతి అంటుంది. రామరాజు పై చెయ్ చేసుకుంటాడు సేనాపతి. ఆ గొడవలో రామరాజు చొక్కా చిరిగిపోతుంది. ధీరజ్ వాళ్ళు విశ్వపై గొడవకి వెళ్తారు. ఆ తర్వాత రామరాజు తన కుటుంబంతో లోపలికి వస్తాడు. అంతా కలిసి మోసం చేశారని రామరాజు బాధపడతాడు. నేనేం చెప్పిన మీకోసం కానీ మీకు అర్థం కాదని రామరాజు బాధపడతాడు. వేదవతి మాట్లాడబోతుంటే నువ్వింకేం మాట్లాడకు.. నేను నిన్ను నమ్మినంతగా ఎవరిని నమ్మలేదు కానీ నువ్వు కూడ నా దగ్గర నగల విషయం దాచావని రామరాజు అంటాడు. నేను మర్చిపోయానని వేదవతి అంటుంది. ఆ తర్వాత దీనంతటికి కారణం నువ్వే అసలు వద్దని చెప్పిన ఎందుకు డాన్స్ క్లాస్ కి వెళ్ళవని ప్రేమని అడుగుతుంది వేదవతి. ధీరజ్ కోసమని ప్రేమ అనగానే అందరు షాక్ అవుతారు. తరువాయి భాగంలో ధీరజ్ కి ప్రేమ సారీ చెప్తుంటే ధీరజ్ మాత్రం ప్రేమపై కోపంగా ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : జ్యోత్స్న పెళ్ళికి కాంచనని ఆహ్వనించిన సుమిత్ర, దశరథ్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -409 లో......కార్తీక్ తన తాత మాటలకి కోపంగా.. ఈయన ఇలాగే ఉంటే ఇంట్లో వాళ్ళకి డౌట్ వస్తుందని దీప బైక్ ఆపమని చెప్తుంది. కార్తీక్ మూడ్ ని డైవర్ట్ చేయాలనీ ట్రై చేస్తుంది. మా బావ చాలా అందంగా ఉంటాడు. వెళ్ళాక దిష్టి తియ్యాలని దీప అంటుంది. దీప ఎలాగోలా కార్తీక్ ని కూల్ చేసి ఇంటికి తీసుకొని వెళ్తుంది. మరొక వైపు జ్యోత్స్న దగ్గరికి గౌతమ్ వస్తాడు. జ్యోత్స్న చెయ్ పట్టుకుంటాడు. కింద తాతయ్య ఉన్నాడని జ్యోత్స్న అనగానే తనే పంపించాడు ప్రైవేట్ గా మాట్లాడాలని చెప్పాను. వెళ్ళు మాట్లాడమన్నాడని గౌతమ్ అనగానే జ్యోత్స్న టెన్షన్ పడుతూ పారిజాతానికి అర్జెంట్ గా రమ్మని మెసేజ్ చేస్తుంది. అది చూసి పారిజాతం వస్తుంటే ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతాడు. ఇంకా గ్రానీ రాదేంటని పారిజాతానికి జ్యోత్స్న ఫోన్ చేస్తుంది. గౌతమ్ వచ్చాడు వాళ్లకు ప్రైవసీ ఇవ్వమని శివన్నారాయణ అంటాడు. అంటే కాఫీ ఇచ్చి వస్తానని పారిజాతం గౌతమ్, జ్యోత్స్నల దగ్గరికి వెళ్తుంది. పారిజాతం రాగానే గౌతమ్ జ్యోత్స్న చెయ్ వదిలేస్తాడు.. బాబు కాఫీ తీసుకొని వచ్చానని పారిజాతం తన మాటలతో గౌతమ్ ని భయపెట్టి పంపిస్తుంది. ఎందుకు ఇంత లేట్ గా వచ్చావని పారిజాతాన్ని కోప్పడుతుంది జ్యోత్స్న. మరొకవైపు సుమిత్ర, దశరథ్ కాంచనని ఎంగేజ్ మెంట్ కి పిల్వడానికి వస్తారు. సుమిత్ర కాంచన ఇద్దరు ఎమోషనల్ అవుతారు. అప్పడే దీప, కార్తీక్ ఎంట్రీ ఇస్తారు. దీప కాఫీ తీసుకొని రా అని కాంచన అంటుంది. అనసూయతో దీప కాఫీ పంపిస్తుంది. ఎందుకు దీప రాలేదని కాంచన అడుగగా.. సుమిత్ర గారు దీప చేత్తో కాఫీ ఇస్తే తాగరని అనసూయ అంటుంది. ఆ తర్వాత కాంచన దీపని పిలిచి మా వదినకి కాఫీ ఇవ్వమని చెప్తుంది. దీప కాఫీ ఇస్తుంటే అక్కడ పెట్టమని సుమిత్ర అంటుంది. ఆ తర్వాత దశరథ్ సుమిత్ర ఇద్దరు కాంచనకి బట్టలు పెట్టి ఆహ్వానిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : రేవతి దుగ్గిరాల కుటుంబంలోని ఆడబిడ్డ.. స్వరాజ్ కి ఐస్ క్రీమ్ కొనిచ్చిన అపర్ణ!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -773 లో..... రౌడీలు అప్పుని కేసులో ఇరికించడానికి ఎలా ట్రై చేసారో స్క్రిప్ట్ చేద్దామని రాజ్ అంటాడు. అందులో భాగంగా రాహుల్, రుద్రాణిలకి చెరొక క్యారెక్టర్ ఇస్తారు. ఏ క్యారెక్టర్ ఇచ్చిన కూడా రాహుల్, రుద్రాణిలని కుటుంబం మొత్తం ఎదో ఒక రీజన్ తో కొడుతుంటారు. ఆ తర్వాత రాజ్, కావ్యలకి రౌడీల అడ్రెస్ తెలుస్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోవాలని రాజ్, కావ్య వెళ్తారు. రాజ్, కావ్య రౌడీలని పట్టుకోవడానికి వెళ్తున్న విషయం యామినికి ఫోన్ చేసి చెప్తుంది రుద్రాణి‌‌. నువ్వు ఏదో పెద్ద ప్లాన్ చేసావనుకున్న చీప్ గా ఇలా చేశావేంటని యామినిపై రుద్రాణి కోప్పడుతుంది. మరొకవైపు ఇందిరాదేవి ఎవరి కంట పడకుండా బయటకి వెళ్లాలనుకుంటుంది. స్వప్న ఎదరుపడి ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతుంది. అప్పుడే అపర్ణ వస్తుంది. ఎవరి కంట్లో పడకూడదనుకున్నానో వాళ్ల కంట్లోనే పడ్డాన అని ఇందిరాదేవి కంగారు పడుతుంది. ఏదో ఒకటి చెప్పి ఇందిరాదేవి అక్కడ నుండి వెళ్తుంది. మరొక వైపు రాజ్, కావ్య వెళ్తుంటే అప్పుని కేసు లో ఇరికించిన రౌడీ వాళ్ల కార్ కి డాష్ ఇస్తాడు. దాంతో రాజ్ కి అతనికి గొడవ జరుగుతుంది. మనకి టైం అవుతుందంటూ రాజ్ ని కావ్య అక్కడ నుండి తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత ఇందిరాదేవి రేవతి దగ్గరికి వస్తుంది. నానమ్మ అంటు ఇందిరాదేవిని హగ్ చేసుకుంటుంది రేవతి‌. మీ అమ్మ మనసు మారడం లేదు.. నువ్వు మోసం చేసావన్న దాంట్లో నుండి బయకి రావడం లేదని ఇందిరాదేవి అంటుంది. తరువాయి భాగం లో అపర్ణ కార్ డోర్ తీస్తుంటే రేవతి కొడుకుకి తాకుతుంది. నా ఐస్ క్రీమ్ కింద పడింది.. కొనివ్వమని ఆ బాబూ అంటాడు. నీ పేరు ఏంటని అపర్ణ అనగానే స్వరాజ్ అని బాబు చెప్తాడు. అపర్ణ దగ్గరికి తీసుకొని ఐస్ క్రీమ్ కొనిస్తుంది. మరొకవైపు రేవతి, ఇందిరాదేవి మాట్లాడుకుంటుండగా అప్పుడే కావ్య, రాజ్ వచ్చి డోర్ కొడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

మాస్టర్ ని పట్టుకుని విజ్జు అనేసిందేంటి జానులిరి

  ఢీ 20 ఇది సర్ మా బ్రాండ్ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. నెక్స్ట్ వీక్ విలేజ్ స్పెషల్ థీమ్ గా రాబోతోంది. ఈ ప్రోమోలో జానులిరి విజయ్ బిన్నీ మాష్టర్ ని పట్టుకుని పెద్ద మాటే అనేసింది. "ఈరోజు ఎట్లైతే అట్లా విజ్జుని నా వాడిని చేసుకోవాలి" అంటూ జాను ఇంకో డాన్సర్ కూడా విజయ్ బిన్నీ మాస్టర్  వైపు కొంటెగా చూస్తూ పెళ్లి కలలు కనేసారు. "వన్నెలాడి వన్నెలాడి" అంటూ ఆ సాంగ్ వచ్చింది. ఇక హోస్ట్ నందు ఐతే "మేము పిలవచ్చా విజ్జు అని లేదంటే వన్నెలాడి, టిక్కులాడే పిలవాలా" అని అడిగాడు. "నన్ను విజ్జు అని నా భార్యే ఇప్పటి వరకు పిలవలేదు" అని విజయ్ బిన్నీ మాస్టర్ ఇచ్చేసరికి నందు, జాను ఇద్దరూ తెగ నవ్వేసుకున్నారు. తర్వాత విజయ్ మాస్టర్ స్టేజి మీదకు పిలిచాడు నందు. "రిఇంట్రడ్యూసింగ్ విజయ్ బిన్నీ యాజ్ లవర్ బాయ్ విజ్జు" అనేసరికి ఆయన కూడా షాకయ్యాడు. "సాంగ్ లిరిక్స్ కానీ దానికి వేసిన డాన్స్ కానీ చాలాచాలా బాగుంది. వాళ్ళు అలా అలా నవ్వుతుంటే" అంటూ జానుతో డాన్స్ చేశారు విజయ్  మాస్టర్ . తర్వాత ఆది వెళ్లి "ఇక నేను టీమ్ లీడర్ గా చేయడం లేదు జడ్జ్ గా చేస్తున్నాను" అన్నాడు. "ముందు డాన్స్ చేయదని తర్వాత జడ్జ్ అవ్వొచ్చు" అని కౌంటర్ వేసింది రెజీనా. "నువ్వు అంత హార్ష్ గా మాట్లాడకురా రా రెజీనా" అని ఆది అనేసరికి నవ్వేసింది. తర్వాత అనాలా సుస్మిత వచ్చి విజయ్ బిన్నీ మాస్టర్ కోసమే అన్నట్టు ఫిదాలో సాంగ్ కి డాన్స్ చేసింది. తర్వాత వెళ్లి ఆయన ఎదురుగా నిలబడింది. ఈ ప్రోమో విలేజ్ స్పెషల్ ప్రోమోనా లేదంటే విజయ్ బిన్నీ మాస్టర్ స్పెషల్ ప్రోమోనా అన్నట్టుగా ఉంది.  

బిగ్‌బాస్‌ సీజన్‌ 9 కంటెస్టెంట్స్‌ వీళ్లే.. ఈసారి అంతా కలర్‌ ‘ఫుల్లే’!

బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా, మరెంతో ఉత్సాహంతో చూసే షో బిగ్‌బాస్‌. ఇప్పటికి 8 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్‌.. సీజన్‌ 8 కొంత వెరైటీగా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ షోకి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే కంటెస్టెంట్స్‌ను సెలెక్ట్‌ చేసే ప్రక్రియ పూర్తి కావచ్చిందని తెలుస్తోంది. తాజా సమాచారం మేరకు వంద మంది నుంచి 25 మందిని ఎంపిక చేశారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.  సీజన్‌ 9కి హోస్ట్‌గా ఎవరు ఉంటారు అనే విషయంలో సోషల్‌ మీడియాలో రకరకాల పేర్లు వినిపించాయి. అయితే ఫైనల్‌గా నాగార్జునే సీజన్‌ 9ని నిర్వహిస్తారని కన్‌ఫర్మ్‌ అయిపోయింది. కొత్త హోస్ట్‌ రాబోతున్నారనే ప్రచారంలో విజయ్‌ దేవరకొండ, బాలకృష్ణతో సహా చాలామంది పేర్లు వినిపించాయి. అయితే అవన్నీ సోషల్‌ మీడియాలో పుట్టుకొచ్చిన వార్తలేనని తర్వాత తేలిపోయింది. చివరికి నాగార్జుననే ఫైనల్‌ చేశారు. సీజన్‌ 9కి సంబంధించి ఇప్పటికే రెండు టీజర్లు రిలీజ్‌ చేశారు. అయితే ఈసారి కంటెస్టెంట్స్‌ ఎవరు అనే విషయంలో అందరిలోనూ ఆసక్తి ఉంది. ప్రతి సీజన్‌కి ముందు కొందరి పేర్లు వినిపిస్తాయి. అందులో కొంత శాతం నిజం ఉంటుంది. అన్ని సీజన్లలోనూ ఇదే జరిగింది. తాజాగా సీజన్‌ 9కి సంబంధించి కొందరి పేర్లు ప్రచారంలోకి వచ్చేశాయి. బుల్లితెర నుంచి సాయికిరణ్‌, జబర్దస్త్‌ కమెడియన్‌ ఇమాన్యూల్‌, అలేఖ్య చిట్టి పికిల్స్‌ సిస్టర్స్‌లో రమ్య మోక్ష, రీతూ చౌదరి, తేజస్విని ఎంపికయ్యారని తెలుస్తోంది. చూడబోతే ఈసారి బిగ్‌బాస్‌ కలర్‌ఫుల్‌గా ఉండబోతుందనేది అర్థమవుతోంది. వీరు కాకుండా దెబ్జానీ, సుమంత్‌ అశ్విన్‌, శివకుమార్‌, ముఖేష్‌ గౌడ, నవ్యసామిలతోపాటు మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్‌ 7న ప్రారంభం కాబోతున్న బిగ్‌బాస్‌ సీజన్‌ 9 కోసం అంతా ఎదురుచూస్తున్నారు. 

అసలు నేరస్థులని పట్డుకోవడానికి స్కిట్ చేస్తున్న దుగ్గిరాల కుటుంబం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -772 లో..... కావ్య ఇంకా ఫోన్ చెయ్యలేదని రాజ్ ఆలోచిస్తుంటాడు. కాసేపటికి కావ్యకి ఫోన్ చేస్తాడు రాజ్‌. అప్పుని స్టేషన్ నుండి బయటకి తీసుకొని వచ్చావా అని రాజ్ అడుగగా... తీసుకొని వచ్చానని కావ్య అంటుంది. మరి ఆ విషయం నాకు చెప్పలేదు.. నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా అని రాజ్  అంటాడు. నేను టెన్షన్ లో ఉన్నాను.. అందుకే చెయ్యలేదని కావ్య అంటుంది. ఇప్పుడైతే తీసుకొని వచ్చాను గానీ ఇంకా కేసు నుండి బయట పడలేదు కదా అని కావ్య అనగానే మీరేం టెన్షన్ పడకండి.. మనిద్దరం కలిసి అప్పుని కేసు నుండి బయటకు తీసుకొని వద్దామని రాజ్ అనగానే.. మీకెందుకు ఇబ్బంది అని కావ్య అంటుంది. ఆ తర్వాత కావ్య ఫోన్ కట్ చేసాక అపర్ణ, ఇందిరాదేవి కావ్య దగ్గరికి వచ్చి ఎందుకు రాజ్ హెల్ప్ చేస్తానంటే వద్దని అంటున్నావని కోప్పడతారు. మరొకవైపు అప్పు దగ్గరికి కళ్యాణ్ వస్తాడు. అప్పు ఏడుస్తుంటే కళ్యాణ్ ఓదారుస్తాడు. మరుసటిరోజు ఇంట్లో అందరు అప్పుని ఈ కేసు నుండి ఎలా బయటపడేయాలని ఆలోచిస్తుంటే అప్పుడే రాజ్ వస్తాడు. అప్పుని బయటకి తీసుకొని రావాలంటే ఏదో ఒక సాక్ష్యం ఉండాలని రుద్రాణి అంటుంది. కరెక్ట్ చెప్పారు అసలు స్టేషన్ లో ఏం జరిగిందో తెలియాలి . అందుకే మనం అందరం స్టేషన్ లో జరిగింది స్కిట్ రూపం లో చేద్దామని రాజ్ అంటాడు. రాహుల్ , రుద్రాణి స్టేషన్ కి వచ్చిన రౌడీ క్యారెక్టర్ అని రాజ్ అంటాడు. అప్పు అమాయకురాలు అనవసరంగా కేసులో ఇరికించావని అందరు రాహుల్, రుద్రాణీలని కొడతారు. దాంతో మాకు ఈ క్యారెక్టర్ వద్దని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

కూతురి గురించి చెప్తూ ఎమోషనల్ అయి‌న సుమిత్ర.. ఏడ్చేసిన దీప!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -408 లో... సుమిత్రకి కాఫీ తీసుకొని వస్తుంది దీప. ఏంటి ఏ టైమ్ కి ఏం తింటానో ఏం తాగుతానో అన్ని తీసుకొని వస్తున్నావ్.. నేను ఇంతలా ఛీకొడుతున్నా.. నీకు ఏం అనిపించడం లేదా అని దీపని సుమిత్ర అంటుంది. నాకొక హెల్ప్ చెయ్యాలి. ఈ చీర నా ఆడపడుచు కోసం కొన్నాను. నువ్వే తనకి ఇవ్వాలని సుమిత్ర అనగానే.. నేను ఇవ్వలేను.. మీరే ఇస్తే బాగుంటుందని దీప అంటుంది. నువ్వు ఎక్కడ మళ్ళీ ఈ ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేస్తావోనని భయమవుతుంది.. నా కూతురు అంటే నాకు చాలా ఇష్టం.. జ్యోత్స్న తన కడుపులో పడ్డప్పుడు డాక్టర్ నేను బ్రతకనని చెప్పాడు కానీ ఉంటే మేమ్ ఇద్దరం ఉండాలని చెప్పాను. అలా జ్యోత్స్న నాకు పుట్టినప్పటి నుండి చాలా ఇష్టంగా పెంచుకున్నానని సుమిత్ర ఎమోషనల్ అవుతుంటే.. నీ కన్నకూతురు నేనే అని చెప్పలేక దీప బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. దీప బాధపడుతుంటే అప్పుడే కార్తీక్ వస్తాడు. ఏమైందని దీపని కార్తీక్ అడుగుతాడు. మా అత్త ఏమైన అందా అని కార్తీక్ అడుగుతాడు. అమ్మ ఏం అనలేదు.. నా వల్ల తను బాధపడుతుందని దీప అంటుంది. అప్పుడే శివన్నారాయణ వచ్చి.. ఎంగేజ్ మెంట్ కి మీ అమ్మని పిలువు అంటాడు. ఎలా పిలవాలి.. డ్రైవర్ అమ్మగా పిలవాలా.. లేక ఈ ఇంటికి ఆడపడుచుగా పిలవాలా అని కార్తీక్ అంటాడు. అది మీ ఇష్టమని శివన్నారాయణ అనగానే నేను పిలవను అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు కార్తీక్. నీతో ఎలా పిలిపించాలో నాకు తెలుసని శివన్నారాయణ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ప్రేమ చేసిన పనికి రామరాజు కుటుంబంపై సేనాపతి దాడి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -209 లో......ధీరజ్ ఇచ్చిన షర్ట్ రామరాజు వేసుకొని బైక్ పై తన ముందు నుండి వెళ్తుంటే ధీరజ్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. రామరాజు వెనక్కి వచ్చి ధీరజ్ దగ్గర ఆగుతాడు. వెళ్తుంటే కన్పించావ్.. బండి ఎక్కు అని రామరాజు అంటాడు. అదే సంతోషం అన్నట్టుగా ధీరజ్ బండి ఎక్కుతాడు. హ్యాపీగా ఫీల్ అవుతూ రామరాజుని హగ్ చేసుకుంటాడు. మరొకవైపు ప్రేమ ఇంటికి వస్తుంది. ఎక్కడ వాళ్ల నాన్న సేనాపతి వచ్చి గొడవ చేస్తాడోనని టెన్షన్ పడుతుంది. అన్నట్లుగానే ధీరజ్, రామరాజు ఇంటికి రాగానే సేనాపతి, భద్రవతి, విశ్వ రామరాజు ఇంటిపైకి గొడవకి వస్తారు. ఆడవాళ్ల కష్టం మీద పడి బ్రతకడానికి సిగ్గు లేదా రామరాజుపై సేనాపతి విరుచుకుపడుతాడు. నా కూతురు పిల్లలకి డాన్స్ క్లాస్ చెప్తుందని సేనాపతి అనగానే అందరు షాక్ అవుతారు. అతను చెప్పేది నిజమేనా అని రామరాజు అనగానే నిజమేనని ప్రేమ అంటుంది. ఎందుకు ఇలా చేసావ్ అమ్మ.. నీకు వద్దని చెప్పాను కదా.. నా మాట అంటే లెక్కలేదా అని ప్రేమతో రామరాజు అంటాడు. దొరికింది ఛాన్స్ అన్నట్లుగా భద్రవతి కుటుంబం మొత్తం.. రామరాజు కుటుంబంపై విరుచుకుపడతారు. ఇరు కుటుంబాల మధ్య గొడవ ముదురుతుంది. ధీరజ్, విశ్వ ఇద్దరు ఒకరి కాలర్ ఒకరు పట్టుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

సుధీర్, గెటప్ శీను లేకుండా ఒక్కడినే స్టేజి ఎక్కినప్పుడు గుండె ఆగిపోయిన్నట్టుగా ఉంది

సర్కార్ సీజన్ 5 ఈ వీక్ ఎపిసోడ్ ఫుల్ జోష్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది. ఎందుకు అంటే ఈ వీక్ ఎపిసోడ్ కి వచ్చింది జబర్దస్త్ టీమ్. అంటే సుధీర్ ఫ్రెండ్స్ రామ్ ప్రసాద్, గెటప్ శీను, బులెట్ భాస్కర్, సన్నీ. వీళ్లందరి అల్లరి మాములుగా లేదు. కింద పడి దొర్లి దొర్లి జోక్స్ వేసుకున్నారు. ఇక సుధీర్ ఐతే ఒక టైంలో వాళ్ళ వాళ్ళ లైఫ్ లో స్పైసీ ఇన్సిడెంట్స్ చెప్పమని అడిగేసరికి..రాంప్రసాద్ చెప్తూ ఏడ్చినంత పని చేసాడు. "సీరియస్ నేను ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏడ్చింది లేదు. ఒక్కసారి నేను మీ ఇద్దరూ లేకుండా ఒక షో కోసం స్టేజి ఎక్కా..కుడి భుజం, ఎడం భుజం లేకుండా అంటారు కదా అలా కూడా కాదు. నాకు మెదడు, గుండె పని చేయనంతలా ఐపోయింది. అదే ఫస్ట్ టైం నేను మీ ఇద్దరూ లేకుండా ఆ పరిస్థితిని ఫేస్ చేశా గట్టిగా. మేకప్ వేసుకునే అద్దం ముందుకెళ్లి ఏంటి కొత్తగా ఉంది నిజంగా ఏదో పవర్ నన్ను వెనక్కి లాగుతున్నట్టు అనిపించింది. తొమ్మిదిన్నరేళ్ళు కలిసి పని చేసాం. కానీ ఒక్కసారి నేను ఒక్కడినే స్టేజి మీదకు వెళ్లేసరికి తెలియని ఒక భయం వచ్చేసింది. అఫ్కోర్స్ నేను ఇండస్ట్రీకి వచ్చింది నా గురించి నేను బతకడానికి కూడా కాబట్టి ఆ విషయాన్నీ కూడా గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్ అందరూ ఉంటారు ఎక్కడికి పోతారు బయటకు వెళ్లి కలుస్తాను...అప్పుడే మీరు లేనప్పుడే నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. అదే నా లైఫ్ లో బాధపడిన విషయం" అన్నాడు రాంప్రసాద్. అవును ..మేము కూడా నిన్ను చాలా మిస్సయ్యాం..అలాగే ఆ స్టేజిని కూడా మిస్సయ్యాం అని చెప్పాడు సుధీర్.

లక్ష రూపాయలు ఇవ్వబోతున్న శుభశ్రీ ? ఎందుకు ? ఎప్పుడు ? ఎలా ?

ఈరోజున చారిటీ చేయడం అంటే ఎంతో కష్టమైన పని. కానీ కష్టాల్లో ఉన్నవారిని తెలుసుకుని నిజంగా తోచినంత సాయం చేయడం ఈరోజుల్లో ఒక మంచి విషయంగా చెప్పుకోవాలి. ఇంతకు ఈ చారిటీ ఎవరు చేస్తున్నారు అనుకుంటున్నారా.. శుభశ్రీ రాయగురు ఆమె బెటర్ హాఫ్ అజయ్. బిగ్ బాస్ సీజన్ 7  కంటెస్టెంట్ ఈమె. త్వరలో పుట్టినరోజు ఉన్న సందర్భంగా ఆమె కష్టాల్లో ఉన్నవాళ్లకు సాయం చేద్దామని అనుకుంటున్నట్టు ప్రకటించింది. "నా పుట్టిన రోజును పురస్కరించుకుని ఒక పది మందికి ఒక్కొక్కరికి 10 వేలు చొప్పున ఇద్దామనుకుంటున్నాను. కామెంట్ సెక్షన్ లో కానీ డి.ఎంలో కానీ మీ రిక్వయిర్మెంట్ ఏముందో చెప్పండి. కానీ అది జెన్యూన్ గా ఉండాలి. మా ఎంగేజ్మెంట్ తర్వాత చాలామంది ఫ్లడ్స్ కారణంగా చాలా నష్టపోయాం సాయం చేయండి అంటూ మెసేజెస్ చేశారు. అందుకే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుతానికి ఈ మాత్రం చేయగలుగుతున్నాం. కానీ ఫ్యూచర్ లో ఇంకా చేయగలుగుతామేమో చూడాలి. ఇక ఇదేమీ ప్రమోషనల్ వీడియో కాదు. స్పాన్సర్ వీడియో కూడా కాదు. పర్సనల్ వీడియో. చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతూ ఉన్నారు. అందుకే ఈసారి వాళ్లకు హెల్ప్ చేద్దామనుకుంటున్నాం. మా సైడ్ నుంచి మేము చేస్తాం అలాగే మీ సైడ్ నుంచి మీరు జెన్యూన్ గా ఉండండి. డిపి లేని అకౌంట్స్ అలాంటి వాటితో మెసేజ్ చేయండి అని చెప్పింది. ఇక 15 వ తేదీన మేము లైవ్ కి వస్తాము. సెలెక్ట్ చేసుకున్న ఆ పది మంది పేర్లను అనౌన్స్ చేస్తాం. అంత పెద్ద సాయం కాదు చాల చిన్న సాయమే." అని చెప్పారు శుభశ్రీ, అజయ్. ఇక ఈమె తెలుగు, తమిళ్ మూవీస్ లో ఈమె నటించింది. 2020 లో విఎల్సిసి ఫెమినా మిస్ ఇండియా ఒడిశాగా నిలిచింది. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత మూవీస్ లో నటించింది శుభశ్రీ.  

అయ్యబాబోయ్ సమీరా..సుధీర్ ని రసికుడు, పశుపతి అనేసిందేంటి...

  సుధీర్ ఏ షోలో ఉంటే ఆ షో వాళ్ళు తెగ ఆడేసుకుంటున్నాడు. రీసెంట్ గ సుధీర్ ని సమీరా భరద్వాజ్ సర్కార్ సీజన్ 5 లేటెస్ట్ ప్రోమోలో ఫుల్ ఫ్రై చేసి పారేసింది. గుణలో కమలహాసన్ చెప్పే కవితను సాంగ్ గా రాసే రేఖ సీన్ గుర్తుంటే చాలు. ఈ ప్రోమోలో కూడా అలాగే జరిగింది. సమీరా స్టేజి మీదకు రాగానే "నా మనసులో ఉన్న ఫీలింగ్స్ చెప్తే మీరేమన్నా రాసిస్తే" అంటూ సుధీర్ సమీరాని అడిగాడు. "నీ మనసులో ఫీలింగ్స్ ఒక పేపర్ లో సరిపోతాయా" అని అడిగింది. "రాయి" అన్నాడు సుధీర్ "ఏంటి" అంది సమీరా. "లెటర్" అన్నాడు సుధీర్ "ఎవరికీ" అంది సమీరా "అమ్మాయిలకు అన్నాడు సుధీర్ 'ఓహో మీరు పార్కులో ప్యాంప్లెట్స్ పంచినట్టు పంచుదామని డిసైడ్ అయ్యారా ఈ ప్రేమ లేఖను" అని కౌంటర్ వేసింది సమీరా. "నా ప్రియా..ప్రేమతో" అని సుధీర్ చెప్తుండగా సమీర్ అచ్చం గుణ మూవీ హీరోయిన్ రేఖలా నవ్వింది. "ఇంకా అక్కడ నువ్వెంత ఏమీ లేదు" అని సమీరా పరువు తీసేసాడు సుధీర్. "కమ్మని నీ ప్రేమ లేఖలే రాసాడు రసికుడే..ప్యాంటు షర్టు వేసిన పశుపతొచ్చేలే.." అంటూ రాసింది. అంటే సుధీర్ ఫేస్ మాడిపోయింది. తర్వాత రోల్ రైడా వచ్చాడు షోకి. "ప్రాబ్లమ్ ఏంటన్న అసలు చెప్పు నాకు" అన్నాడు రైడా. "ఇప్పుడు గడ్డి ఉంది..నిప్పురవ్వలు గడ్డి మీద పడితే ఏమొస్తాది" అంటూ ఒక తింగరి ప్రశ్న అడిగాడు. దాంతో రైడా బుర్ర గోక్కున్నాడు. సమీరా సింగర్ గా కంటే రీల్స్ తో ఫుల్ ఫేమస్ అయ్యింది. నారాయణ అనే కాన్సెప్ట్ తో చేసిన రీల్ ఐతే సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.  

సుధీర్ కి ప్రపోజ్ చేసింది...రష్మీనా?

సర్కార్ సీజన్ 5 లేటెస్ట్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి ముందుగా శివ్ కుమార్, ప్రియాంక జైన్ వచ్చారు. రాగానే ప్రేమలో మునిగి తేలిపోయారు. వీళ్ళు ఎక్కడికి వచ్చి ప్రేమ, ప్రేమ మాటలు, ప్రేమ గులాబీలు ఇవి తప్ప ఇంకో మాట ఉండదు. "ఓ ప్రియా ప్రియా" అనే సాంగ్ కి వీళ్ళు డాన్స్ చేస్తూ వచ్చారు. ఇక షో అన్న విషయం మర్చిపోయి ప్రేమలో డాన్సుల్లో మునిగి తేలుతున్న వీళ్లకు బ్రేక్ వేస్తూ సుధీర్ వచ్చి ఒక గులాబీ పువ్వు ఇచ్చాడు. ఇక ఆ గులాబీని శివ్ ప్రియాంకకు ఇచ్చి చేతి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఇక వాళ్ళు ప్రేమలో మునిగితేలుతున్న టైంలో సుధీర్ అబ్బా అనుకున్నాడు. "కెమిస్ట్రీ అనేది నాకు అర్ధం కావట్లేదు" అని సుధీర్ శివ్ ని అడిగాడు. "కెమిస్ట్రీ మేము మీకు నేర్పించడం ఏంటి సర్.. మిమ్మల్ని చూసే మేము ఇక్కడ కెమిస్ట్రీ నేర్చుకున్నాం" అని రివర్స్ లో కౌంటర్ వేసాడు శివ్. "అదంతా అప్పుడు సర్..ఇప్పుడు నేను కంప్లీట్ గా మారిపోయాను సర్" అని చేతులు కట్టుకుని మరీ సుధీర్ చెప్పాడు. "మీరు ఇన్నేళ్ల నుంచి లవ్ లో ఉన్నారు" అంటూ ప్రియాంక జైన్ సుధీర్ ని చాలా స్లోగా అడిగింది. సుధీర్ ఆలోచిస్తుండగా అతని ఆన్సర్ ని శివ్ చెప్పేసాడు. "నేను చెప్పాల్సిన అవసరం ఉందా అందరికీ తెలిసిందే కదా" అనేసరికి సుధీర్ కూడా ఒక రేంజ్ లో శివ్ వైపు చూసాడు. "మీరు ఆవిడ కోసం ఏమన్నా చెప్పాలి అంటే ఎం చెప్తారు" అని సుధీర్ శివ్ ని అడిగాడు. వెంటనే శివ్ మోకాళ్ళ మీద కూర్చుని ఒక మోకాలి మీద ప్రియాంకను కూర్చోబెట్టుకున్నాడు. "నేను కూడా ప్రతీ రోజు అడిగే ప్రశ్న అదే ప్రియాంకను ఎప్పుడు పెళ్లి అనేది" అన్నాడు. "2026 " అని చెప్పింది ప్రియాంక. ఇంతలో శివ్ "ఒక్క నిమిషం లే" అంటూ కాళ్ళు పట్టేసిన ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. "ఏవండీ ప్రియాంకను మోకాళ్ళ మీద రెండు నిముషాలు మోయలేకపోయారు పెళ్ళెప్పుడు అని అంటున్నారు" అన్నాడు కౌంటర్ గా సుధీర్. "మీ ఇద్దరిలో ఎవరు  ప్రపోజ్ చేశారండి" అంటూ శివ్ సుధీర్ ని అడిగాడు. "తనే ప్రపోజ్ చేసింది" అంటూ తెగ సిగ్గుపడిపోయాడు. మరి ఇంతకు ప్రపోజ్ చేసింది రష్మీనా ఇంకెవరన్ననా చూడాలి.  

Illu illalu pillalu : తన కష్టంతో నాన్నకి షర్ట్ కొనుక్కెళ్ళిన కొడుకు.. ప్రేమ వల్ల ఏం జరిగిందంటే!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'( illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -208 లో... ధీరజ్ గురించి రామరాజు బాధపడతాడు. వాడు నేను చెప్పినట్టు వినకుండా ఫుడ్ డెలివరీ చేస్తూ కష్టపడుతున్నాడు. పాపం వాడు ఏమైనా తిన్నాడో లేదో అని తిరుపతితో  రామరాజు అంటాడు అప్పుడే ధీరజ్ వస్తుంటాడు. వాడు వస్తున్నాడు బావ.. నువ్వే అడుగు అనీ తిరుపతి అంటాడు. రామరాజు దగ్గరికి ధీరజ్ వచ్చి.. నాన్న నేను ఫుడ్ డెలివరి ఫాస్ట్ గా చేసినందుకు ఇంటెన్సివ్ ఇచ్చారు. అందుకే మీకు షర్ట్ తీసుకొని వచ్చాను తీసుకోండని ధీరజ్ అంటాడు. రామరాజు ఆ షర్ట్ ని తీసుకొని కింద పడేస్తాడు. నేను జీవితంలో ఇంకా కష్టపడి పైకి రావాలని కోరుకుంటే ఈ షర్ట్ తీసుకుంటారు. లేదంటే లేదని షర్ట్ టేబుల్ పై పెట్టి ధీరజ్ వెళ్తాడు. ఎందుకు బావ వాడిని అలా బాధపెడుతావని రామరాజుతో అంటాడు తిరుపతి. ఆ తర్వాత కాసేపటికి రామరాజు షర్ట్ వేసుకొని వస్తాడు. అది చూసి తిరుపతి హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరొకవైపు ప్రేమ డాన్స్ క్లాస్ చెప్తుంటే సేనాపతి చూసి ప్రేమ దగ్గరికి వెళ్తాడు. ఎలా పెంచాను నిన్ను.. ఎలా కష్టపడుతున్నావ్.. వాళ్ల సంగతి చెప్తానని ప్రేమ దగ్గర నుండి కోపంగా వెళ్తాడు సేనాపతి. మరొకవైపు రామరాజు షర్ట్ వేసుకొని ధీరజ్ ముందు నుండి వెళ్తాడు. అది ధీరజ్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. తరువాయి భాగం లో రామరాజు, ధీరజ్ బైక్ పై ఇంటికి వస్తారు. అప్పుడే సేనాపతి, విశ్వ వస్తారు. నా కూతురు కష్టం తో బతుకుతున్నారని రామరాజు పై గొడవకి వెళ్తారు. నా కూతురు డ్యాన్స్ క్లాస్ చెప్తుందని సేనాపతి అనగానే ప్రేమని అడుగుతాడు రామరాజు. నిజమేనని ప్రేమ అనగానే సేనాపతి, విశ్వ రామరాజు మీదకి వెళ్తారు. దాంతో షర్ట్ చినిగిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : పారిజాతం ముందు నోరుజారిన జ్యోత్స్న.. దీపే అసలైన వారసురాలు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -407 లో.....జ్యోత్స్న తన గదిలోకి వస్తుంది. టెడ్డి బేర్ లో ఉన్న రింగ్స్ ఏమయ్యాయని చూస్తుంటే అందులో లేకపోయేసరికి ఏంటి రింగ్స్ బావ తీసుకున్నాడంటే.. దీని అర్ధం ఏంటి నేను పెళ్లి వద్దని అనుకుంటున్న విషయం బావకి తెలిసిపోయిందని జ్యోత్స్న అనుకుంటుంది. అప్పుడే పారిజాతం కోపంగా వచ్చి జ్యోత్స్న చెంపచెల్లుమనిపిస్తుంది. ఏంటి గ్రానీ అనీ జ్యోత్స్న అడుగుతుంది. ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని అడుగుతుంది. నేను నీ గురించి ఇదంతా చేస్తుంటే నువ్వేంటే ఇలా చేస్తున్నవని పారిజాతం అడుగుతుంది. నేను పెళ్లి వద్దని అనుకుంటున్న విషయం బావకి తెలిసిపోయిందని జ్యోత్స్న అనగానే.. తెలిసిపోతేనే కదా రింగ్స్ తీసిందని పారిజాతం అంటుంది. బావకి అసలైన వారసురాలు తెల్సిపోయి ఉంటుంది.. బావ అమ్మకి మేనల్లుడు.. దీప అమ్మ కూతురు అని జ్యోత్స్న అనగానే పారిజాతం షాక్ అవుతుంది. దాంతో వెంటనే జ్యోత్స్న కవర్ చేస్తుంది. మరొకవైపు దీప, కార్తీక్ మాట్లాడుకుంటుంటే వెనకాల నుండి పారిజాతం, జ్యోత్స్న వస్తారు. వాళ్ళు వచ్చిన విషయం కార్తీక్ చూసి వాళ్ళు మాట్లాడుకునే టాపిక్ డైవర్ట్ చేస్తాడు. రోజ్ ఫ్లవర్ తెంపి దీప తల్లో పెడతాడు. అది చుసిన పారిజాతం.. ఎందుకు అలా నా పర్మిషన్ లేకుండా తెంపావని గొడవపడుతుంది. ఆ తర్వాత శివన్నారాయణ వచ్చి.. దానికి ఎందుకు గొడవ చేస్తున్నావని పారిజాతంపై కోప్పడతాడు. మరొకవైపు కార్తీక్ తో దశరథ్ మాట్లాడతాడు. జ్యోత్స్న ఎంత చెడ్డది అయిన నా కూతురు రా.. అసలు గౌతమ్ ఎలాంటి వాడని దశరథ్ అడుగుతాడు. మీకు అయితే అన్యాయం జరగదని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత సుమిత్రకి దీప కాఫీ తీసుకొని వస్తుంది. మళ్ళీ ఎప్పటిలాగే దీప బాధపడేలా సుమిత్ర మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : బెయిల్ పై అప్పుని తీసుకొచ్చిన కావ్య.. రేవతి ఎవరంటే!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -771 లో..... అప్పు సస్పెండ్ అవ్వడంతో తన యూనిఫామ్ ని స్టేషన్ లో హ్యాండ్ ఓవర్ చేస్తుంది. ఇక సెల్ లోకి వెళ్ళండి అని ఏసీబి వాళ్ళు అప్పు తో అంటారు. అప్పుడే అప్పుకి బెయిల్ తీసుకొని వస్తుంది కావ్య. ఇంత త్వరగా ఎలా బెయిల్ వచ్చిందని ఆఫీసర్ అడుగగా అప్పుకి ఇంతకి ముందు ఎలాంటి నేర చరిత్ర లేదు అందుకే త్వరగా వచ్చిందని కావ్య తీసుకొని వచ్చిన లాయర్ అంటాడు. ఆ తర్వాత అప్పు గురించి ఆఫీసర్ తప్పుగా మాట్లాడుతుంటే.. మా అప్పు దుగ్గిరాల ఇంటి కోడలు అనీ కావ్య అనగానే అలాంటి కుటుంబం లో ఉంటూ ఇలా చెయ్యడమేంటని ఆఫీసర్ అనగానే మా చెల్లి ఏం తప్పు చెయ్యలేదు. నేను నిరూపిస్తానని కావ్య అంటుంది. సరే ఎల్లుండి కోర్ట్ కి అయితే రండి అని ఆఫీసర్ అంటాడు. రాజ్ డిస్సపాయింట్ గా ఇంటికి వెళ్తాడు ఏమైందని యామిని అడుగుతుంది. అప్పు సస్పెండ్ అయిందని కావ్య వెళ్ళిందనగానే కావ్యని ప్రపోజ్ నుండి తప్పించుకోవాలని లా చేసిందేమోనని యామిని అంటుంటే అలా కావ్య చెయ్యదని యామినితో కోపంగా మాట్లాడుతాడు రాజ్. మరొకవైపు అప్పు లంచం తీసుకొని దొరికిపోయిందని ఇంట్లో వాళ్లకి చెప్తుంది రుద్రాణి‌. అప్పుడే కావ్య, అప్పు ఇంటికి వస్తారు. ఎందుకు ఇలా చేసావని ధాన్యలక్ష్మి అప్పుపై కోప్పడుతుంది. నా చెల్లి ఏం తప్పు చెయ్యలేదని నిరూపిస్తాను లేదంటే నా చెల్లి మీకు నచ్చినట్టుగా  ఉంటుందని కావ్య అంటుంది. తరువాయి భాగంలో రేవతి దగ్గరికి ఇందిరాదేవి వెళ్తుంది. రేవతి నానమ్మ అంటూ ఇందిరాదేవిని హగ్ చేసుకుంది. అప్పుడే కావ్య, రాజ్ రేవతి వాళ్ళ డోర్ కొడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

జబర్దస్త్ ని మానస్ ని నేను చూసుకుంటా

  జబర్దస్త్ షోకి ఈ మధ్య హోస్ట్ రష్మీతో పాటు మరో యాంకర్ గా మానస్ జాయిన్ అయ్యాడు. ఐతే బ్రహ్మముడి సీరియల్ లో మానస్ దీపికతో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక మానస్ ఏ షోకి వెళ్లినా ఆ షోకి దీపికా కూడా కచ్చితంగా వెళ్తుంది. ఆదివారం విత్ స్టార్ మా పరివారం, డాన్స్ ఐకాన్ సీజన్ 2 , చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే ఈ షోస్ లో తన కామెడీతో టిఆర్పీ రేటింగ్స్ ని ఎక్కడికో తీసుకుపోయింది. ఐతే ఈ మధ్య దీపికా హడావిడి షోస్ లో కొంచెం తగ్గింది. ఇక రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో జబర్దస్త్ రష్మీ సీటుకే ఎసరు పెట్టింది. తానూ జబర్దస్త్ యాంకర్ గా రావాలనుకుంటున్నట్టు చెప్పింది. ఎందుకంటే మానస్ ఉన్నాడుగా అంటోంది. "మానస్ ఇప్పుడు జబర్దస్త్ లో రష్మీకి కో-యాంకర్ గా చేస్తున్నాడుగా అది నాకు సంతోషంగా అనిపిస్తోంది. ఐతే నన్ను మానస్ పక్కన పెట్టలేదు అని అనిపిస్తోంది" అనేసింది దీపికా. దాంతో రష్మీ గత ఎపిసోడ్ లోని ఒక డైలాగ్ ఉంది. అదేంటంటే "ఓయ్ నాకు కరెక్టో కాదో నన్ను కూడా అడగండి" అనే డైలాగ్ క్లిప్ ని ఇక్కడ యాడ్ చేశారు. "క్లైమేట్ బాగుంది కదా. ఒక నెల రోజులు స్విజర్ ల్యాండ్ వెళ్లి రండి. జబర్దస్త్ ని మానస్ ని నేను చూసుకుంటా." అని దీపికా చెప్పేసరికి రష్మీ జబర్దస్త్ లో షాకైన ఫేస్ క్లిప్ ని ఇక్కడ యాడ్ చేసి చూపించారు. "ఆన్ స్క్రీన్ లో ఏ హీరోతో ఐనా రొమాంటిక్ సీన్ చేయడానికి నేను రెడీ. వాళ్ళే సిగ్గుపడతారేమో కానీ నాకు ఏ మొహమాటం లేకుండా చేసేస్తా. విజయ్ దేవరకొండ గారితో రష్మీక గారి సీన్ కంటే నేనే కిస్సింగ్ బాగా చేస్తా తెలుసా" అని నవ్వుతూ చెప్పేసింది. దీపికా ఎం మాట్లాడినా అది వైరల్ ఐపోతుంది. ఎందుకంటే తెలుగు కొంతవరకు సరిగా తెలీదు దాంతో ఆమె మాట్లాడే మాటలు చిరాకు అనిపించినా నవ్వు తెప్పిస్తాయి దాంతో ఆమెను షోస్ లో తీసుకుంటున్నారు మేకర్స్.