Illu Illalu Pillalu: ఎమోషనల్ అయిన ప్రేమ.. భాగ్యం చెప్పిన ప్లాన్ తో శ్రీవల్లి డ్రామా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu Illalu Pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -215 లో.. భద్రవతి ఇంట్లో నగలు ఇచ్చి వస్తాడు తిరుపతి. తిరుపతి కోసం శ్రీవల్లి ఎదరుచూస్తూ ఉంటుంది. అతను రాగానే నగలు ఇచ్చారా ఏమన్నారని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటే.. ఎందుకు ఆలాగే అడుగుతున్నావని తిరుపతి అంటాడు. అదేం లేదని శ్రీవల్లి డైవర్ట్ చేస్తుంటే వెనకాలే ప్రేమ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావని  ప్రేమని శ్రీవల్లి అడుగుతుంది. అవి నీ నగలా.. ఎందుకు అలా అడుగుతున్నావని ప్రేమ అంటుంది. ఏంటి అలా అంటున్నావ్ ఇంట్లో సమస్య కాబట్టి అడిగానని చెప్పి శ్రీవల్లి అక్కడ నుండి వెళ్తుంది.   ఆ తర్వాత ఏదో తేడాగా ఉంది కొంచెం దృష్టి పెట్టాలని ప్రేమ అనుకుంటుంది. మరొకవైపు సాగర్ దగ్గరకి నర్మద వచ్చి పక్కన కూర్చుంటుంది. సాగర్ వెళ్ళిపోతుంటే నాతో మాట్లామని నర్మద రిక్వెస్ట్ చేస్తుంది. అయిన సాగర్ కోపంగా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత శ్రీవల్లి భాగ్యానికి ఫోన్ చేసి ప్రేమ నగలల్లో నా నగలు పెట్టేసానని చెప్తుంది. ఇక ఇంట్లో నీదే రాజ్యం ఎవరికి బయపడాల్సిన అవసరం లేదని శ్రీవల్లికి చెప్తుంది భాగ్యం.   ఆ తర్వాత ప్రేమ దగ్గరికి ధీరజ్ ఎంబీఏ ఫామ్ తో వస్తాడు. అది ప్రేమ చింపేస్తుంది. అది నీ డ్రీమ్ లైఫ్ అనీ ధీరజ్ అనగానే నిన్ననే నా లైఫ్ నాకూ అర్థం అయింది. నేనొక వస్తువుని.. నాకోసం నువ్వు ఎందుకు ఇదంతా చేయడమని ప్రేమ ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత చందు వర్క్ చేసుకుంటుంటే.. శ్రీవల్లి కోపంగా బట్టలు బ్యాగ్ లో సర్దుకొని బయటకు వస్తుంది. ఏమైందని చందు తన వెంటే వస్తాడు. ఇంట్లో అందరు వస్తారు. ఏమైందని రామరాజు అడుగుతాడు. నేను మా పుట్టింటికి వెళ్తున్నానని శ్రీవల్లి అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam 2 : ఇంట్లో నుండి పారిపోయిన జ్యోత్స్న.. అడ్డంగా బుక్కైన దీప!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -414 లో... జ్యోత్స్న ఇప్పుడు అందరి ముందు నిజం చెప్తుందా అని కార్తీక్ ని దీప అడుగుతుంది. అంత త్వరగా ఎలా చెప్తుంది. అలా చెప్పేలా చెయ్యాలని కార్తీక్ అంటాడు.    మరొకవైపు కాశీకి జ్యోత్స్న ఫోన్ చేస్తుంది. కాశీ ఫోన్ కట్ చేసి కార్తీక్ కి చేస్తాడు. జ్యోత్స్న అక్క కాల్ చేస్తుందని చెప్తాడు. సరే లిఫ్ట్ చేసి మాట్లాడు.. నేను మ్యూట్ లో పెడతానని కార్తీక్ అనగానే జ్యోత్స్న ఫోన్ లిఫ్ట్ చేసి కాశీ మాట్లాడతాడు. ఒరేయ్ నేను చెప్పిందేంటి.. నువ్వు చేసేది ఏంటని అడుగుతుంది. నేను పది లక్షలు సీక్రెట్ గా ఇద్దామని అనుకున్నాను.. మీరే హడావిడి చేసి ఓపెన్ చేశారని కాశీ అంటాడు. అది కాదు గౌతమ్ మంచివాడు కాదని ఏదైనా ప్రూఫ్స్ తీసుకొని వచ్చావేమో అనుకున్నానని జ్యోత్స్న అంటుంది. గౌతమ్ ఎలాంటి వాడు.. నీకు తెలిసినప్పుడు నువ్వే ఎంగేజ్ మెంట్ ఆపుకోవచ్చు కదా అని కాశీ అంటాడు. అదంతా దీప, కార్తీక్ కాన్ఫరెన్స్ కాల్ లో వింటుంటారు.   ఆ తర్వాత పారిజాతం, జ్యోత్స్న మాట్లాడుకుంటుంటే.. దీప వచ్చి సుమిత్ర అమ్మ పిలుస్తున్నారని చెప్తుంది. జ్యోత్స్న, పారిజాతం సుమిత్ర దగ్గరికి వెళ్తారు. రేపు ఎంగేజ్ మెంట్ కి ఏ నగలు పెట్టుకుంటావో సెలక్ట్ చేసుకోమని సుమిత్ర అనగానే.. జ్యోత్స్న ఇబ్బంది పడుతుంది. సెలక్ట్ చేసుకోండి అని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత రాత్రి కార్తీక్ దీప ఇంటికి వెళ్లకుండా.. జ్యోత్స్న ఏదైనా ప్లాన్ చేస్తుందా అని కనిపెట్టడానికి ఉంటారు కానీ శివన్నారాయణ వచ్చి కార్తీక్, దీపలని ఇద్దరిని వెళ్ళమని చెప్తాడు. మరొకవైపు జ్యోత్స్న ఇంట్లో నుండి పారిపోతుంటే పారిజాతం ఆపుతుంది. ఏం చేస్తున్నావే అని అడుగుతుంది. ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసుకోవడానికి ఇంతకంటే వేరే దారి లేదు. వారం తర్వాత వస్తాను.. ఫోన్ అఫ్ చేస్తాను.. అప్పుడు నువ్వు ఈ దీపనే ఏదో ఒకటి చేసిందని చెప్పమని పారిజాతానికి చెప్పి జ్యోత్స్న వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : రాజ్ తలపై కొట్టిన రౌడీ.. కేసు నుండి అప్పు బయటపడుతుందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -778 లో... అప్పుని కేసు నుండి ఎలా బయట పడేయాలని రాజ్ ఆలోచిస్తుంటాడు. రేవతికి ఫోన్ చేసి ఆ శ్రీను వాళ్ల అమ్మకి కచ్చితంగా ఫోన్ చేస్తాడు.. దాన్ని బట్టి లొకేషన్ ట్రేస్ చెయ్యొచ్చు.. శ్రీను ఫోన్ చేస్తాడేమో ఈ నైట్ అంతా వాళ్ల అమ్మ దగ్గర ఉండమని రాజ్ చెప్పగానే రేవతి సరే అంటుంది.    మరుసటి రోజు కోర్ట్ కి అప్పు, కళ్యాణ్, కావ్య వస్తారు. రాజ్ కూడా వస్తాడు. ఏవైనా సాక్ష్యాలు దొరికాయా అని కావ్య అడుగుతుంది. లేదని రాజ్ నిరాశగా చెప్తాడు. అప్పుడే రాజ్ కి రేవతి ఫోన్ చేసి.. తమ్ముడు ఆ శ్రీను వాళ్ల అమ్మకి రాత్రి ఫోన్ చేసాడని చెప్తుంది. దాంతో రాజ్ వెంటనే శ్రీను ఇంటికి బయల్దేరతాడు. ఆ తర్వాత కావ్య దగ్గరికి యామిని వచ్చి.. నా బావని నా దగ్గరికి పంపిస్తే అప్పుని కేసు నుండి బయటపడేస్తానని యామిని అనగానే కావ్య కోప్పడుతుంది.    ఆ తర్వాత రేవతి, రాజ్ ఇద్దరు కలిసి శ్రీను ఇంటికి వస్తారు. వాళ్ల అమ్మ ఫోన్ తీసుకొని.. లాస్ట్ నెంబర్ కి కాల్ చేస్తారు. మీ అమ్మ గారికి దెబ్బ తాకింది. హాస్పిటల్ లో ఉంది.. మీ ఇంటికి డిశ్చార్జ్ చేసి పంపిస్తాము రండి అని రాజ్ మాట్లాడుతాడు. శ్రీను వెంటనే వెళ్ళబోతుంటే ఇంకొక రౌడీ వద్దని ఆపుతాడు. శ్రీను ఇంకా రావట్లేదని రాజ్ ఫోన్ నెంబర్ తో లొకేషన్ ట్రేస్ చెయ్యమని తన ఫ్రెండ్ కి పంపిస్తాడు. తన ఫ్రెండ్ ట్రేస్ చేసి లొకేషన్ పంపిస్తాడు. మరొకవైపు అప్పు బోన్ లో నిలబడుతుంది.‌ లాయర్ వాదిస్తాడు. కావ్యని బోన్ లోకి పిలుస్తారు.    తరువాయి భాగంలో శ్రీను దగ్గరికి రాజ్ వెళ్లి రౌడీలని కొట్టి శ్రీనుని తీసుకొని వస్తుంటే ఒక రౌడీ రాజ్ తలపై కొడతాడు. మరొకవైపు సాక్ష్యాలు తీసుకొని రావడానికి కొంచెం టైమ్ కావాలని అప్పు తరుపున లాయర్ అడగగా.. జడ్జ్ కుదరదని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

పులిహోర కలపడం బాగా వచ్చుగా

సీనియర్ హీరోలు హీరోయిన్లు ఈమధ్య బుల్లితెర షోస్ కి బాగా వస్తున్నారు. రీసెంట్ గా జీ తెలుగులో ఆదివారం ప్రసారం కాబోతున్న బ్లాక్ బస్టర్ బోనాలు షోకి హీరో శ్రీకాంత్, హీరోయిన్ రోజా వచ్చారు. ఆ ప్రోమో చూస్తే శ్రీకాంత్ రోజా మీద పంచ్ లు వేస్తూనే ఉన్నాడు. "నా రాజా నువ్వే" అనే సాంగ్ కి రోజా వేసిన డాన్స్ కానీ కన్నుకొట్టి మరీ లవ్ సింబల్ చూపించడం మాములుగా లేదు. "బ్లాక్ బస్టర్ బోనాలు జరుపుకోవాలంటే రోజా గారి టీమే జరుపుకోవాలి" అని హోస్ట్ రవి అనేసరికి "రోజా ఎంటర్ ఐతే వార్ వన్ సైడ్ అవుతుంది" అని చెప్పింది రోజా. తర్వాత హీరో శ్రీకాంత్ మంచి యంగ్ లుక్ లో "సౌందర్య లహరి" సాంగ్ తో ఎంట్రీ ఇచ్చాడు. "ఏంటి రోజా గారు వస్తే వార్ వన్ సైడా...ఇప్పుడు నేను ఆఫ్టర్ నూన్ సీరియల్స్ కి సపోర్ట్ చేస్తున్న. నిజంగా వార్ వన్ సైడే..అది నా సైడ్ " అంటూ వాళ్ళ టీమ్ వైపు చూపించాడు. "చిన్నపిల్లలం మేమందరం..సరదాగా బోనాలు పండగ చేసుకోవడానికి వచ్చాము" అని రోజా చెప్పేసరికి. "నువ్వు తలకు రంగు వెయ్యి మాకు వెయ్యకు" అంటూ శ్రీకాంత్ రోజాకి కౌంటర్ ఇచ్చాడు. తర్వాత ఒక మ్యూజిక్ పెట్టి ఆ సాంగ్ చెప్పాలంటే రోజా గారిని కానీ శ్రీకాంత్ గారిని కానీ పట్టుకోవాలని చెప్పాడు హోస్ట్ రవి. తర్వాత ఒక సీరియల్ యాక్టర్ వచ్చి రోజాని పట్టుకున్నాడు. ఇక శ్రీకాంత్ "పాట తెలిసి వచ్చారా రోజా గారిని హగ్ చేసుకోవడానికి వచ్చారా" అంటూ మళ్ళీ కౌంటర్ వేసాడు శ్రీకాంత్. "వానొచ్చేస్తుంటే వరదోచేస్తుంది" అనే సాంగ్ కి రోజా, శ్రీఎకాంత్ కలిసి డ్యూయెట్ డాన్స్ చేసారు. ఇక తర్వాత బాలయ్య అఖండ గెటప్ లో ఒక పిల్లాడు వచ్చి "రోజా నేను నీకే సపోర్ట్ చేస్తా అన్నాడు" . వెంటనే రోజా "వచ్చేయండి మన పార్టీకి" అనేసింది. ఇక బోనాలు స్పెషల్ లో త్రిసూలం మీద కోరిక కోరుకుని గాజులు వేశారు. ఇక శ్రీకాంత్ ఐతే "నువ్వు అనుకో అసెంబ్లీకి వెళ్ళకూడదు అని" అన్నాడు. అంతే రోజా మాత్రం గాజులు వేసింది. దాంతో శ్రీకాంత్ షాకయ్యాడు. ఫైనల్ గా రోజాకి, శ్రీకాంత్ కి కళ్ళకు గంతలు కట్టి పులిహోర కలిపే టాస్క్ ఇచ్చాడు రవి. శ్రీకాంత్ ఐతే చేతికి దొరికిన ఇంగ్రీడియెంట్స్ ని వేసి కలిపేసి కంపు చేసాడు. "నాకు పులిహోరా కలపడం రాదు..రోజాకు పులిహోర కలపడం బాగా వచ్చు" అన్నాడు శ్రీకాంత్.  

ఇది సుధీర్ సర్కారా ? సుధీర్ స్వయంవరమా ?

సర్కార్ సీజన్ 5 నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి కత్తిలాంటి అమ్మాయిలంతా వచ్చారు. అందులోనూ బ్రహ్మముడి హీరోయిన్ కావ్య అలియాస్ దీపికా రంగరాజు వచ్చింది. రాగానే హోస్ట్ సుధీర్ ని పడేసింది. స్టెప్పులేసింది. "మీకు ఈ రోజు అమ్మాయిలే కావాలా ? ఇది సుధీర్ సర్కారా ? సుధీర్ స్వయంవరమా ? కత్తిలా ఉంటారు అమ్మాయిలు అంటారు. కానీ మీరు కత్తిలా ఉన్నారు" అంది దీపికా. "గురువుగారు మరి రెడీ అంటే" అని సుధీర్ అనేసరికి "హా రెడీ అంటే మరి" అని దీపికా రివర్స్ లో అంది. "మీరేంటండి బాబు డాన్స్ చేయడానికి అండి." అన్నాడు సుధీర్. "ఇంకొంచెం దగ్గరకు రండి. గాలి వస్తుంది. ఎందుకంటే మీరు సుడిగాలి సుధీర్ కదా" అంటూ సుధీర్ మీద జోకులేసింది. ఫ్యూచర్ లో బీచ్ కి వెళ్ళాలి అంటే ఎవరితో వెళ్తారు ? అని సుధీర్ అడిగాడు. దానికి దీపికా నవ్వుతూ "డ్రైవింగ్ తెలిస్తే నేనే డ్రైవ్ చేసుకుని వెళ్తాను. లేదంటే క్యాబ్ డ్రైవర్ ని బుక్ చేసుకుని వెళ్తాను." అంది. అంతే క్యాబ్ ని బుక్ చేసుకుని అనాలి కానీ క్యాబ్ డ్రైవర్ ని అనకూడదు అంటూ కరెక్ట్ చేసాడు సుధీర్ . "మా అమ్మ నాన్నతో ఎం చెప్పి వచ్చానో తెలుసా" అంది దీపికా. "అమ్మా ఆడి కార్ వద్దు, బిఎండబుల్యు కార్ వద్దు సుధీర్ సర్కార్ కి వెళ్తే చాలు అని చెప్పి వచ్చాను. దీపికా ఈమధ్య చాలా షోస్ లో కనిపిస్తూ ఉంది. డాన్స్ రాకపోయినా ఓంకార్ నిర్వహించిన డాన్స్ ఐకాన్ సీజన్ 2 కి మెంటార్ గా వచ్చింది. ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో రెగ్యులర్ గా కనిపిస్తుంది. అలాగే చెఫ్ మంత్ర కుకింగ్ షోకి సమీరా భరద్వాజ్ జోడిగా వచ్చింది. అలాగే ఇప్పుడు సర్కార్ సీజన్ కి వచ్చింది. ఎంతమంది కామెడీ చేసినా దీపికా కామెడీ బిట్స్ మాత్రం బాగా హైలైట్ అవుతూ ఉంటాయి.  

కామెడీ తప్ప ఏమీ లేదు..టాలెంట్ బయటకు రావట్లేదు

ఢీ షో గురించి కొరియోగ్రాఫర్ రేవంత్ కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఢీ షో పార్టిసిపెంట్స్ చేసే సాంగ్ కి, డాన్స్ కి అసలు సంబంధం ఉండదు.. జిమ్నాస్టిక్స్ చేస్తూ ఉంటారు, సర్కస్ ఫీట్స్ చేస్తూ ఉంటారు అని ట్రోల్ చేస్తూ ఉంటారు అని అడిగిన ప్రశ్నకు కొరియోగ్రాఫర్ రేవంత్ తన మనసులోని విషయాన్ని బయటపెట్టారు. " ఢీ షోని ఒకప్పుడు అందరూ మెచ్చుకునేవాళ్ళు ఇప్పుడు ఎందుకు మెచ్చుకోవట్లేదు అనే విషయాన్ని ఒక సారి పరిశీలించుకోవాలి. డాన్స్ షో అనేది డాన్సర్ బేస్ గా జరగాలి కానీ అదెప్పుడు జరుగుతుందో తెలీదు. ఫిలిం ఇండస్ట్రీలో అదెప్పుడు జరుగుతుందో చూద్దాం.   డాన్స్ షో డాన్సర్ మీద జరగాలి కానీ ఎవరో కమెడియన్స్ వచ్చేసి జడ్జ్ చేయడం బాలేదు. జడ్జెస్ ని కూడా నువ్వు డాన్సర్స్ ని పెట్టు. డాన్స్ గురించి బాగా నాలెడ్జ్ ఉన్నవాళ్లను పెడితే ఓకే అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రియమణి గారిని కానీ, పూర్ణ మేడమ్ ని కానీ ఒకప్పుడు ఉన్న రేఖ ప్రకాష్ మేడం కానీ వాళ్లంతా గుడ్. ఐతే బేసిక్ గా ఐడియాలజీ మారాలి. 2025 లో మనం ఉన్నాం. ఇంకా ఇప్పటికీ రియాలిటీ షోస్ చేస్తున్నాం..అదే కామెడీ చేస్తాం అంటే కుదరదు..దాని వలన షో మొత్తం కూడా నవ్వులపాలైపోతుంది..టాలెంట్ బయటకు రాదు. ఆడియన్స్ మంచి డాన్స్ పెర్ఫార్మెన్సెస్ చూసి ఎంటర్టైన్ అవ్వాలి. మంచి మంచి డాన్సర్స్ టాలెంట్ బయటకు రావాలి. నేను విష్ చేస్తున్నా ఇప్పటికైనా కొంచెం అన్నా మారండి. డాన్స్ షోని డాన్స్ షోగా కండక్ట్ చేస్తే టాలెంట్ బయటకు వస్తుంది. షో మేకర్స్ డాన్స్ షోలో వేరే కామెడీ అదీ మొత్తం చూపించేసి డాన్స్ పెర్ఫార్మెన్స్ లో వావ్ మూమెంట్స్ లేవు అంటే ఎలా...ఎవరైనా యూట్యూబ్ లో కనిపించే డాన్స్ షో ఎపిసోడ్స్ చూస్తారా ఆడియన్స్ చూడరు డాన్స్ స్కిప్ చేసేసి కామెడీ బిట్స్ ని చూస్తున్నారు. ఆడియన్స్ కి కూడా డాన్స్ షోలో కామెడీ చూడడం అలవాటు చేసేసారు. ఓవరాల్ గా ఛానెల్స్ కూడా మారాలి. ఆర్టిస్టులను ఆర్టిస్టుల్లా, డాన్సర్స్ ని డాన్సర్స్ లా యూజ్ చేసుకోవాలి. అప్పుడు వాళ్ళ టాలెంట్ బయటకు వస్తుంది. వాళ్లకు అవకాశాలు వస్తాయి. వాళ్లకు మంచి లైఫ్ క్రియేట్ అవుతుంది. అప్పుడు పెద్ద పెద్ద ప్లాట్ఫార్మ్స్ మీద పెర్ఫార్మ్ చేసే అవకాశం వస్తుంది. బాలీవుడ్ ని చూస్తే మంచి మంచి డాన్స్ రియాలిటీ షోస్ ఉన్నాయి. అక్కడి డాన్సర్స్ అంతా మంచి మంచి పొజిషన్స్ లో ఉన్నారు." అని చెప్పుకొచ్చాడు.   

నెలతప్పిన సోనియా...ఆనందంతో హగ్ చేసుకున్న యష్

  బిగ్ బాస్ సీజన్ 8 బోల్డ్ కంటెస్టెంట్ సోనియా ఆకుల గురించి తెలియని తెలుగు ఆడియన్స్ లేరు. భర్త యష్ వీరగోనితో కలిసి ఇస్మార్ట్ జోడికి కూడా వెళ్ళింది. ఇక రీసెంట్ గా ఒక విషయాన్ని షేర్ చేసుకుంది. ఒక కాన్ఫిడెన్షియల్ ఫైల్ పట్టుకుని భర్త దగ్గరకు వెళ్ళింది. ఇక యష్ ఆ ఫైల్ లో మ్యాటర్ చూసి ఫుల్ ఫిదా ఐపోయి హగ్ చేసుకున్నాడు. ఇక సోనియా ఐతే ప్రెగ్నెన్సీ రివీల్, న్యూ ఎడిషన్స్, పేరెంట్స్ టోబ్, న్యూ బేబీ, మమ్మీ టోబ్ వంటి హాష్ ట్యాగ్స్ పెట్టింది. ఇక బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్  ఆదిరెడ్డి, కిర్రాక్ సీత, వాసంతి కృష్ణన్ వంటి వాళ్లంతా కంగ్రాట్యులేషన్స్ చెప్పారు. అలాగే నెటిజన్స్ కూడా విషెస్ చెప్పారు. "మా జీవితంలో ఒక లిటిల్ మిరాకిల్ జరగబోతోంది..చాలా సంతోషంగా ఉన్నాం" అని కోట్ పెట్టింది సోనియా. ఇక ఆ ప్రాజెక్ట్ రెండు పేపర్స్ లో కొన్ని విషయాలను మెన్షన్ చేసింది. బేబీ ఆన్-బోర్డింగ్ డిసెంబర్ అని , టూర్స్, ట్రావెల్ ప్లాన్స్, షూట్స్ అన్నీ పోస్ట్ పోన్డ్ అని, మీడియా అండ్ కవరేజ్ లో భాగంగా ఇన్స్టా లో రెడీ అని అంటూ చెప్పింది. అలాగే తాతయ్య, నానమ్మ, అన్నయ్య, వదిన, మామ, బావా వాళ్ళ వాళ్ళ బ్రీఫ్ డిస్క్రిప్షన్ కూడా అందులో రాసింది. "మా బేబీ చూడడానికి వెయిట్ చేయలేకపోతున్నాం" అంటూ ఇలాంటి ఒక ఎక్సయిటింగ్ న్యూస్ ని ఫాన్స్ తో షేర్ చేసుకుంది. రామ్ గోపాల్ వర్మ మూవీ కరోనా వైరస్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అలాగే సోనియా బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున మీద హాట్ కామెంట్స్ చేసింది. ఇక తాను బిగ్ బాస్ కి రాను అని చెప్పేసింది. ఇక యష్ ఐతే ఫ్లైహై టూరిజమ్ సంస్థతో పాటు విరాట్ ఫౌండేషన్ అనే సంస్థను కూడా నడుపుతున్నాడు. అమెరికాలో దావత్ పేరుతో రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇక సోనియా వీళ్ళ ప్రేమ, పెళ్లి గురించి బిగ్ బాస్ లో రివీల్ చేసిన విషయం తెలిసిందే.

Illu illalu pillalu : శ్రీవల్లి గిల్టీ నగలు కనిపెట్టిన రేవతి.. ప్రేమ, ధీరజ్ ల మధ్య దూరం!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -214  లో.. వేదవతితో మాట్లాడడానికి ప్రేమ, నర్మద వస్తారు. మీరు నాతో మాట్లాడకండి.. నన్ను మోసం చేసారు. ప్రేమకి ఇంత దైర్యం రావడానికి కారణం నువ్వే.. నీ వల్లే ఇదంతా అని నర్మదపై కోప్పడుతుంది వేదవతి. అదంతా శ్రీవల్లి వింటూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత వాళ్ల దగ్గరికి వస్తుంది శ్రీవల్లి. ఎందుకు అత్తయ్యని ఇబ్బంది పెడుతున్నారని  ప్రేమ, నర్మద వాళ్ళని పంపిస్తుంది శ్రీవల్లి. నేను మీకున్నాను అత్తయ్య అని శ్రీవల్లి యాక్టింగ్ చేస్తుంది. మరొకవైపు ధీరజ్ దగ్గరికి ప్రేమ వచ్చి.. సారీ రా అని చెప్తుంది నువు మీనాన్నపై నీకు ఎంత ప్రేమ ఉందో నీపై కూడా నాకూ అంతే ప్రేమ.. అందుకే ఇలా చేసానని ప్రేమ అంటుంది. దాంతో ధీరజ్ షాక్ అవుతాడు. నువ్వు నాపై ఏం ఆశలు పెట్టుకున్నావో నాకు తెలియదు కానీ ఈ రూమ్ లో వస్తువులు ఎలాగో నువ్వు అలాగే అని ప్రేమతో ధీరజ్ అనగానే తను బాధపడుతుంది. ఐ హేట్ యు అని అద్దం పై రాస్తుంది. మరొకవైపు ప్రేమ నగలు తీసుకొని భద్రవతి ఇంటికి వస్తాడు తిరుపతి . అన్ని నగలు ఉన్నాయో చూడమని రేవతికి చెప్తుంది భద్రవతి. రేవతి నగలు చూస్తుంది. అందులో కొన్ని నగలు శ్రీవల్లి తన నగలు కలుపుతుంది. ఇవి ప్రేమ నగలు కాదని రేవతికి డౌట్ వస్తుంది కానీ ఆ విషయం చెప్తే మళ్ళీ ఎక్కడ గొడవ జరుగుతుందోనని రేవతి సైలెంట్ గా ఉంటుంది. మరొక వైపు నా గిల్టీ నగలు వాళ్ళు గుర్తుపట్టారేమోనని శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. తిరుపతి రాగానే నగలు ఇచ్చావా బాబాయ్ అని శ్రీవల్లి అడుగుతుంది. తరువాయి భాగం లో ప్రేమ ఎంబీఏ అప్లికేషన్ ఫామ్ తీసుకొని వస్తాడు ధీరజ్. అది ప్రేమ చింపేస్తుంది.ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : జ్యోత్స్న ఇచ్చిన చెక్ గురించి కాశీ చెప్పేస్తాడా.. మరదలిని ఇరికించేసిన కార్తీక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -413 లో.....దీప, కార్తీక్ మాట్లాడుకుంటుంటే కాంచన వస్తుంది. మళ్ళీ మీరేం చేస్తున్నారు చెప్పండి.. ఇప్పుడు గానీ మళ్ళీ ఎంగేజ్ మెంట్ ఆగిపోతే మా వాళ్ళు బాధపడుతారు. మీరు వాళ్లతో మాటలు పడుతారు. నేను అదంతా భరించలేనని కాంచన ఎమోషనల్ అవుతుంటే.. నువ్వేం కంగారుపడకు అమ్మ గౌతమ్ మంచివాడు కాదని జ్యోత్స్నకి తెలుసు.. ఈ ఎంగేజ్ మెంట్ చేసుకోదు ఎలాగైన దీప మాటలు పడాలని ప్లాన్ చేస్తుంది. కానీ తన చేతనే నిజం ఒప్పుకునేలా చెయ్యాలని ప్రయత్నం చేస్తున్నామని కార్తీక్ కాంచనకి అర్ధం అయ్యేలా చెప్తాడు. మరొక వైపు శ్రీధర్ ఇంటికి వచ్చి.. అల్లుడు మీ నాన్న వచ్చాడాట కదా అని చెప్తాడు. అవును మావయ్య మేమ్ వెళ్తున్నామని  కాశీ అంటాడు. ఆ తర్వాత కాశీకి కార్తీక్ ఫోన్ చేసి గౌతమ్ మంచివాడు కాదని సాక్ష్యాలు అన్నీ ఉన్నాయ్ కదా.. అవి పట్టుకొని డైరెక్ట్ మీ జ్యోత్స్న అక్క దగ్గరికి వచ్చేయ్ అని కార్తీక్ చెప్పగానే కాశీ సరే అంటాడు. ఆ తర్వాత కాశీ ఇంటికి వచ్చి జ్యోత్స్నకి ఫోన్ చేస్తాడు. నువ్వు బయట ఉండు అని జ్యోత్స్న అంటుంది. కానీ కాశీ లోపలికి ఒక కవర్ పట్టుకొని వస్తాడు. అప్పడే అక్కడున్న శివన్నారాయణ చూసి ఏంటది అని అడుగుతాడు. ఏం లేదని పారిజాతం అంటుంది. తీరా చుస్తే అందులో జ్యోత్స్న కాశీకి ఇచ్చిన చెక్ ఉంటుంది. అదేంటి గౌతమ్ మంచివాడు కదాని సాక్ష్యాలు తెస్తాడనుకుంటే ఇలా తెచ్చాడని జ్యోత్స్న షాక్ అవుతుంది. మరదలు షాక్ అయినట్లుందని కార్తీక్ అనుకుంటాడు. చెక్కు ఏంటని శివన్నారాయణ అడుగగా.. ఎక్కడ నిజం చెప్తాడోనని జ్యోత్స్న కవర్ చేస్తుంది. బావ ఇదంతా నీ ప్లానా అని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : రేవతిని కుటుంబానికి దగ్గర చేస్తానని మాటిచ్చిన కావ్య.. శ్రీను దొరుకుతాడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'( Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -777 లో..... కావ్యకి రేవతి గురించి మొత్తం చెప్తుంది ఇందిరాదేవి. రేవతి పెళ్లి చేసుకొని వచ్చాక సుభాష్, అపర్ణ ఇద్దరు ఇంట్లో నుండి గెంటేసారు.. అపర్ణ కోపంతో నీ ఆస్తులు వీటి కోసమే కదా వాడు నిన్ను పెళ్లి చేసుకున్నాడు తీసుకొని వెళ్ళిపోమని అపర్ణ పేపర్స్ రేవతి మొహంపై విసిరేస్తుంది. నాకు వద్దని రేవతి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇదంతా కావ్యకి వివరంగా చెప్తుంది ఇందిరాదేవి. మీరేం కంగారు పడకండి అమ్మమ్మ గారు రేవతిని ఈ కుటుంబానికి నేను దగ్గర చేస్తానని ఇందిరాదేవితో చెప్తుంది కావ్య. మరొకవైపు అపర్ణ తనలో తనే రేవతి కొడుకు స్వరాజ్ ని గుర్తుచేసుకొని నవ్వుకుంటుంది. అప్పుడే సుభాష్ వచ్చి.. ఏమైందని అడుగుతాడు. దాంతో స్వరాజ్ గురించి చెప్తుంది ఆ బాబు.. ఎంత బాగా మాట్లాడాడో మళ్ళీ ఒకసారి తనని కలవాలని ఉందని అపర్ణ అనగానే అనుకో జరుగుతుందని సుభాష్ అంటాడు. ఆ తర్వాత కావ్యకి యామిని ఫోన్ చేసి ఎప్పటిలాగే కావ్యకి కోపం వచ్చేలా మాట్లాడుతుంది. రేపు అప్పు కేసు నుండి బయటకు వస్తుందని ఆశ పడుతున్నావా అసలు జరగదని యామిని అనగానే తనపై కావ్య కోప్పడుతుంది. అప్పుని కేసు నుండి ఎలా బయటపడెయ్యాలని కావ్య ఆలోచిస్తుంటే.. రాజ్ దగ్గరికి యామిని వచ్చి మాట్లాడుతుంది. మరోవైపు శ్రీను వాళ్ళ అమ్మకి ఎలాగైనా కాల్ చేస్తాడు.. ఆ ఫోన్ కాల్ సిగ్నల్ ట్రేస్ చేస్తే అసలు విషయం తెలుస్తుంది కదా అని రాజ్ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

వీళ్లకు ఇంత చిన్న స్పెల్లింగ్స్ కూడా రావా

కూకు విత్ జాతిరత్నాలు షో ప్రతీవారం ఫుల్ మీల్స్ తో పాటు కామెడీని కూడా సర్వ్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తోంది. పాన్ ఇండియా వంటలు, మార్కులు, రకరకాల రుచులు, కామెడీ కబుర్లతో ఈ ఎపిసోడ్స్ ప్రసారం అవుతున్నాయి. ఇక ఇందులో మార్కులను బట్టి అడ్వాంటేజ్ టాస్కులు వంటివి కూడా ఉంటున్నాయి. రీసెంట్ గా నెక్స్ట్ వీక్ షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో అడ్వాంటేజ్ టాస్క్ చూస్తే...ఎవ్వరికైనా నవ్వురాకుండా ఉండదు. "ఇక్కడి నుంచి నేను ఒక వస్తువును చూపిస్తాను. కుక్కు దాన్ని ఇంగ్లీష్ లో పేరు చెప్తారు జాతిరత్నం ఆ స్పెల్లింగ్ లెటర్స్ ని బోర్డు మీద కరెక్ట్ గా పెట్టాలి" అని ప్రదీప్ టాస్క్ డీటెయిల్స్ చెప్పాడు. ఇంతలో సుజిత వచ్చి "నా జాతి రత్నాలు ఊటీ కాన్వెంట్ లో చదువుకుని వచ్చారు" అన్నది. "అంటే మరి ఇక్కడ చెప్పగలరా లేదంటే ఊటీ వెళ్ళాలా మేము" అంటూ ప్రదీప్ కౌంటర్ వేసాడు. ఇక పొటాటో అని తనూజ చెప్పేసరికి ఇమ్మానుయేల్ పొట్ట అన్నాడు అంతే పొట్ట కాదు పొటాటో అంటూ తనూజా ఫుల్ ఫైర్ అయ్యింది. ఇక హరి పైన్ ఆపిల్ స్పెల్లింగ్ ఇంగ్లీష్ తప్పుగా పెట్టాడు. స్పెల్లింగ్ తప్పు పెట్టాడు పైగా ఇది కరెక్ట్ అని చెప్పుకుని తిరుగుతున్నాగా ..ఈ స్పెల్లింగ్ కూడా రాదు అంటే కిందన వేసుకుంటారేమో అంటూ ఫుల్ కామెడీ చేసాడు. తర్వాత బాటిల్ గార్డ్ అనే స్పెల్లింగ్ ఇంగ్లీష్ లో సుహాసిని పెట్టాలి. కానీ తప్పు పెట్టింది. దాన్ని ప్రదీప్ హైలైట్ చేసి చూపించాడు. "ఏ స్కూల్ లో చదివావమ్మా" అంటూ రాధ అడిగారు. "చెప్తే మా వాళ్లందరినీ దానికే పంపిస్తాం" అంటూ ప్రదీప్ కూడా కౌంటర్ వేసాడు. ఈ ప్రోమో కింద నెటిజన్స్ ఐతే వీళ్లకు స్పెల్లింగ్స్ కూడా రావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  

నేను చూడడానికి కీర్తి సురేష్ లా ఉంటాను..నాకు కూడా బ్రేకప్ అయ్యింది..

  ప్రేరణ అంటే చాలు బిగ్ బాస్ సీజన్ 8 గుర్తొస్తుంది. ప్రతీ బిగ్ బాస్ కి ఒకళ్ళు బాగా హైలైట్ అవుతూ ఉంటారు. ఈ సీజన్ లో ప్రేరణ. అలాంటి ప్రేరణ రీసెంట్ గా ఒక షో ఇంటర్వ్యూకి వచ్చింది. ఆ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. "మాకు కూడా బ్రేకప్ అయ్యింది. మా రిలేషన్ షిప్ సూపర్ గా వెళ్తోంది అని ఏమీ లేదు. నేను యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేసాక ఫస్ట్ ప్రాజెక్ట్ లో నేను ఆ హీరో బుగ్గ మీద కిస్ చేయాల్సి వచ్చింది. దాంతో ఇద్దరి మధ్య మసస్పర్దలు వచ్చాయి. ఇదంతా నేను తట్టుకోలేను. బ్రేకప్ అని చెప్పుకున్నాం. నాకు మూవీస్ కి వెళ్లడం అలవాటే కానీ శ్రీపాద్ కి అలవాటు లేదు. ఇప్పుడు ఆయన కూడా నాతో మూవీస్ కి వస్తున్నారు. కార్నర్ సీట్ లోనే కాదు నేను ఏ సీట్ లో ఐనా కూర్చుని ఏమైనా చేయగలను. నేను చూడడానికి కీర్తి సురేష్ లా ఉంటానని విషయాన్నీ చాలామంది చెప్పారు. కానీ డైరెక్టర్స్ ఎందుకు చూడట్లేదు దాన్ని. నేను ఖిలాడీ గర్ల్ నే కాదు..కిర్రాక్ గర్ల్ ని కూడా. ఆ షోలో ఇమ్మానుయేల్ ఎందుకు ఏడ్చాడు అనే ప్రశ్న అడిగినందుకు థ్యాంక్స్ నేను ఆన్సర్ చెప్పేయాలి. అతను ఎందుకు ఏడ్చాడు అంటే అందరం కలిసి మాకు అనిపించింది చెప్తే ఆయన హర్ట్ అయ్యి ఆయన ఏడ్చాడు. నా మీద ఎందుకు అంత ద్వేషం..అది నా ప్రాబ్లమ్ కాదు. రష్మిక ఫ్రెండ్. వాళ్ళ ఫామిలీ కూడా చెప్పారు నేను స్టార్ ని అవుతాను అని. అప్పుడు కలిసి మల్టి స్టారర్ మూవీస్ చేద్దాం అని చాలా అనుకున్నాం. కానీ అది ఎప్పుడూ కాలేదు. తనకు ఒకప్పుడు గుర్తున్నాను. ఏయ్ ఫస్ట్ కలవరా నువ్వు..." అంటూ మాట్లాడింది ప్రేరణ. ఈమె 2022 లో కృష్ణ ముకుందా మురారి సీరియల్ తో బుల్లితెర మీదకు ఎంట్రీ ఇచ్చి తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరయింది. ఇక కన్నది బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసింది అలాగే ఆనా, పెంటగాన్, ఫిజిక్స్ టీచర్ వంటి మూవీస్ లో నటించింది.  

Illu illalu pillalu : నర్మదపై అత్త సీరియస్..  భార్య చేసిన పనికి కఠినంగా మాట్లాడిన భర్త!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -213 లో...... ప్రేమ బాధపడుతుంటే నర్మద వచ్చి మాట్లాడుతుంది. నువు నాతో కూడా చెప్పకుండా డ్యాన్స్ క్లాస్ కి వెళ్ళావా అని నర్మద అనగానే సారీ అక్క అని ప్రేమ అంటుంది. నాకు చెప్పనవసరం లేదు.. నువ్వు బాధపడకు అని ప్రేమకి సపోర్ట్ గా మాట్లాడుతుంది నర్మద‌.  మరొకవైపు రామరాజు రైస్ మిల్ లో ఉండగా ధీరజ్, సాగర్, చందు ముగ్గురు వెళ్తారు. రామరాజు దగ్గరికి ధీరజ్ వెళ్లి.. ఇందులో నా తప్పేం లేదు నాన్న, నన్ను క్షమించండి అనీ రిక్వెస్ట్ చేస్తాడు. అయిన రామరాజు కోపంగా ఉంటాడు. దాంతో ధీరజ్ తన అన్నలతో తన బాధని చెప్పుకుంటాడు. ఆ తర్వాత వేదవతి కిచెన్ లో ఉండగా ప్రేమ, నర్మద వచ్చి మాట్లాడించాలని ట్రై చేస్తారు. మిమ్మల్ని ఎంత నమ్మానే.. ఫ్రెండ్ లాగా ఉన్నాను.. కానీ మీరు నన్నే మోసం చేశారు కదా అని వేదవతి బాధపడుతుంది. అయిన అవమానపడడానికి కారణం నువ్వే అని ప్రేమతో వేదవతి కఠినంగా మాట్లాడుతుంది. ప్రేమకి సపోర్ట్ గా నర్మద మాట్లాడడంతో.. అసలు ప్రేమ బయటకు వెళ్లి అలా డ్యాన్స్ చెప్పేంత దైర్యం లేదు.. నువ్వు సపోర్ట్ చెయ్యడం వల్లే ఇదంతా అని నర్మద పై కోప్పడుతుంది వేదవతి. తరువాయి భాగంలో నువ్వు మీ నాన్న గురించి ఎలా ఆలోచిస్తావో.. నువ్వు నా భర్తవి కాబట్టి నేను నీ గురించి ఆలోచిస్తానని ప్రేమ అంటుంది‌. నువ్వు ఏదో ఫీల్ అవుతున్నట్లున్నావ్ కానీ ఈ రూమ్ లో వస్తువులు ఎలాగో.. నువ్వు అలాగే అంతే తప్ప నీపై ఏం ఫీలింగ్ లేదని ధీరజ్ అనగానే ప్రేమ బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : దాస్ ని చూసి జ్యోత్స్న షాక్.. తన ఎంగేజ్ మెంట్ ఆపగలదా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -412 లో... జ్యోత్స్న దగ్గరికి పారిజాతం వస్తుంది.  మంచి ఛాన్స్ మిస్ చేసావ్ గ్రానీ.. ఎందుకు ఎంగేజ్ మెంట్ ఆగిపోతుందన్నప్పుడు నువ్వు సమాధానం చెప్పాలి కదా అప్పుడే గౌతమ్ మంచివాడు కాదని చెప్పుండాల్సింది.. నేను గౌతమ్ మంచివాడు కాదని చెప్పే ఛాన్స్ లేదు.. ఇప్పుడు అలా చెప్తే దీప మంచిది అవుతుందని జ్యోత్స్న అంటుంది.  ఎలాగైనా ఈ ఎంగేజ్ మెంట్ ఆపాలని జ్యోత్స్న అంటుంది. మరొకవైపు దీప, కార్తీక్ ఇద్దరు కలిసి జ్యోత్స్న ఏం ప్లాన్ చేస్తుందని డిస్కషన్ చేసుకుంటారు. మరుసటి రోజు ఉదయం పారిజాతం జ్యోత్స్న దగ్గరికి కాఫీ తీసుకొని వస్తుంది. ఎంగేజ్ మెంట్ దగ్గరికి వచ్చిన కొద్ది ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది. నువ్వు ఎందుకే టెన్షన్ పడడం... కాశీ ఎంగేజ్ మెంట్ ఆపేస్తాడు కదా అనీ పారిజాతం అంటుంది. ఆ తర్వాత పారిజాతం లోపలకి వెళ్ళాక జ్యోత్స్న దగ్గరికి దాస్ వచ్చి.. రా జ్యోత్స్న వెళదామని అంటాడు. దాంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. నేను శివన్నారాయణ గారికి ఒక నిజం చెప్పాలని లోపలికి వెళ్తుంటే వద్దు నాన్న అనీ జ్యోత్స్న అంటుంది. అయిన వినకుండా లోపలకి వెళ్తాడు. అందరు ఉంటారు. అప్పుడే శివన్నారాయణ వచ్చి ఎందుకు వచ్చావని అడుగుతాడు శివన్నారాయణని లోపలికి గదిలోకి తీసుకొని వెళ్లి దేవుడి మాల ఇస్తాడు. మీరు ప్రమాదంలో ఉన్నారు ప్లీజ్ కాదనకండి అని దాస్ చెప్పగానే శివన్నారాయణ మెడలో వేసుకుంటాడు. దాస్, శివన్నారాయణ బయటకు వచ్చేవరకు ఎక్కడ నిజం చెప్పేస్తున్నాడోనని పారిజాతం, జ్యోత్స్న టెన్షన్ పడుతారు. కానీ బయటకు వచ్చి శివన్నారాయణ జరిగింది చెప్పగానే జ్యోత్స్న కూల్ అవుతుంది. నిన్ను ఎవరో కొట్టారో గుర్తు వచ్చిందా అని సుమిత్ర అడుగుతుంది. నన్ను ఎవరు కొట్టారని మళ్ళీ గతం గుర్తు లేనట్టు యాక్టింగ్ చేస్తుంటాడు దాస్. మరొకవైపు దీప, కార్తీక్ మాట్లాడుకుంటుంటే కాంచన వస్తుంది. మళ్ళీ ఈ ఎంగేజ్ మెంట్ ఆపడానికి మీరేం చెయ్యట్లేదు కదా అని అనగానే.. లేదు, మా వాళ్ళు తట్టుకోలేరు మీ అందరిలో ఎవరు బాధపడ్డా నేను చూడలేనని కాంచన బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : బ్రహ్మముడిలో సూపర్ ట్విస్ట్.. కూతురిని అపర్ణ గెంటేసిందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -776 లో..... ఇందిరాదేవి కంగారు పడుతుంటే.. అసలు నా దగ్గర ఏం దాస్తున్నారని కావ్య అడుగుతుంది. అసలు ఈ రేవతి ఎవరు ఆవిడకి ఈ ఇంటికి సంబంధం ఏంటని కావ్య అడుగుతుంది. ఇందిరాదేవి చెప్పకపోవడంతో నేను అత్తయ్యని అడుగుతానంటూ కావ్య వెళ్ళబోతుంటే ఇందిరాదేవి ఆపుతుంది. రేవతి ఈ ఇంట్లో మనిషి అని ఇందిరాదేవి అంటుంది అంటుంది. మరి ఏం తప్పు చేసిందని అక్కడ ఉంటుందని కావ్య అంటుంది. అది చేసింది తప్పు కాదు.. పొరపాటు. రేవతి ఎవరో కాదు అపర్ణ కన్నబిడ్డ అని ఇందిరాదేవి చెప్పగానే కావ్య షాక్ అవుతుంది. ఇందిరాదేవి అసలు ఏం జరిగిందో కావ్యకి చెప్తుంది. రేవతి , రాజ్ ఇద్దరు అపర్ణ పిల్లలు.. రేవతిని చాలా గారాబంగా పెంచారు. ఆ ఇంట్లో డ్రైవర్ గా పని చేసే జగదీష్ ని లవ్ చేసి ఇంట్లో వాళ్లకు తెలియకుండా పెళ్లి చేసుకొని వస్తుంది రేవతి. వాళ్లని చూసి ఇంట్లో అందరు షాక్ అవుతారు. మీరు నా నిర్ణయాన్ని అంగీకరిస్తారని ఇలా చేసానని రేవతి చెప్తుంది. జగదీశ్ ని సుభాష్ కొడతాడు. నీకు ఈ ఇంటికి సంబంధం లేదని అపర్ణ ఆ ఇద్దరిని గేంటేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అది అక్కడే ఉంది.. మేం ఇక్కడే ఉన్నామని ఇందిరాదేవి చెప్తుంది. తరువాయి భాగంలో శ్రీను వాళ్ల అమ్మకి ఫోన్ చేసాడని రాజ్ కి తెలియడం తో రాజ్ వెళ్తాడు. మరొకవైపు నాకు రాజ్ ని అప్పగించు శ్రీను.. వచ్చి సాక్ష్యం చెప్పేలా చేస్తానని యామిని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

దేవుడా ఆడవాళ్ళ సిస్టంని అప్ డేట్ చెయ్యి...

  రష్మీ యాంకర్ గానే కాదు ఏ విషయాన్నీ ఐనా చివరకు మహిళల సమస్యలపైనా కూడా చాలా సింపుల్ గా అందరికీ అర్థమయ్యేలా మాట్లాడుతుంది. ఇది మాట్లాడకూడదు అన్నది ఆమెలో కనిపించదు. అలాంటి రష్మీ రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టిన పోస్ట్ బాగా వైరల్ అవుతోంది. ఈరోజు మహిళలు తీవ్రంగా ఎదుర్కుంటున్న సమస్య పీరియడ్స్. దాని మీద అందరూ ఆలోచించదగ్గ ఒక పాయింట్ ని డిఫెరెంట్ వేలో తన అభిప్రాయాన్ని చెప్పింది. "ప్రతీ నెల పీరియడ్స్ మూడు రోజులు ఐదు రోజులు కాకుండా యూరిన్ కి ఎలా వెళ్తామో అలా ఎందుకు రాదు ? ఓ దేవుడా సీరియస్ గా చెప్పాలంటే వాష్ రూమ్ కి ఇలా వెళ్లి అలా వచ్చేసేలా ఎందుకు డిజైన్ చేయలేదు. అప్పుడు ప్యాడ్స్ , మరకలు, టెన్షన్ లాంటివి లేకుండా ఒక్క ఫ్లష్ తో పీరియడ్స్ ఐపోయే అవకాశం లేదా ?  దేవుడా నువ్వు మమ్మల్ని ప్యాడ్స్ చుట్టూ, మరకలతో, కడుపులో నొప్పితో, కప్స్ తో, మూడ్ స్వింగ్స్ తో మా లోపల్లోపల ఒక యుద్ధం జరిగేలా చేస్తున్నావ్. నిజం చెప్పాలంటే..ప్రతీ 28 రోజులకు ఒక అమ్మాయి సర్వైవ్ కావడం చాలా కష్టం..దేవుడా ప్లీజ్ అప్ డేట్ సిస్టం" అంటూ రష్మీ ఒక బాధ లాంటి నిర్వేదంతో ఈ పోస్ట్ ని పెట్టినట్టు తెలుస్తోంది. నిజంగా ఈ రోజున ఆడపిల్లలు మెచ్యూర్ ఐన దగ్గర నుంచి వీటి చుట్టూనే వాళ్ళ మైండ్ తిరుగుతూ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ విషయాన్నీ చాలా సూటిగా, స్పష్టంగా చెప్పింది రష్మీ. రష్మీకి సోషల్ ఇస్స్యూస్ మీద చాలా క్రేజ్ పోస్ట్స్ పెడుతుంది. అవి ఆలోచించే విధంగా ఉంటాయి. ఇక రష్మీ యాంకరింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఆమె తెలుగు మాట్లాడే స్టైల్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది.  

ఒక్క సినిమా పడితేనా...అనుష్కా లాంటి స్టార్ ఐపోతారు..

దివి అంటే ఒకప్పుడు ఎవరికీ తెలీదు కానీ బిగ్ బాస్ సీజన్ 4  కి వెళ్లొచ్చాక దివి అంటే ఎవరో ఆడియన్స్ కి తెలిసింది. ఐతే బిగ్ బాస్ తర్వాత అనుకున్నంతగా ఆఫర్స్ రాలేదు. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అలాగే జిమ్ వీడియోస్ ని పోస్ట్ చేస్తూ ఉంటుంది. కొన్ని మూవీస్ లో కనిపించింది. లంబసింగి మూవీలో నటనకు స్కోప్ ఉన్న రోల్ లో నటించింది. అలాగే మహేష్ బాబు మూవీ మహర్షిలో,  లూసిఫర్ లో గుర్తుండిపోయే రోల్స్ లో కనిపించింది. ఇక హరికథ మూవీలో ఐతే చాల సైలెంట్ గా ఉండే ఒక పాత్రలో ఒదిగిపోయింది. దివి నాట్యం చేసిన "నెమలి" అనే ఒక ఆల్బం ఫుల్ సాంగ్ జులై 18 న రిలీజ్ కాబోతోంది. ఇక ఈ సాంగ్ కి సంబందించిన కొన్ని చరణాలు  సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. దివి ఐతే "మనలోని బలాన్ని, మన స్వేచ్ఛను, మన సొంత నటనను బయటకు చూపించడం నిజంగా ఒక వేడుకలాంటిది. నెమలి అనేది ఒక లిరికల్ సాంగ్ కాదు, అదొక లిరికల్ పోయెమ్ " అంటూ పోస్ట్ చేసింది. ఇక నెటిజన్స్ ఐతే దివి డాన్స్ కి ఫిదా ఐపొతూ కామెంట్స్ చేస్తున్నారు. ఒక నెటిజన్ ఐతే " మీకు ఒక్క పెద్ద సినిమా పడితే మీరు అనుష్క గారంతా పెద్ద స్టార్ అవుతారు నిజంగా" అంటూ చెప్పారు. ఇంకా కొంతమంది నెటిజన్స్ ఐతే "సాంగ్ సూపర్, శారీలో సూపర్, బ్యూటిఫుల్ దివి మేడం, మీకు సినిమా ఛాన్సెస్ ఎందుకు రావట్లేదు అర్ధం కావడం లేదు" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 2021 లో వచ్చిన "సిలక ముక్కుదాన" అనే మ్యూజిక్ ఆల్బమ్ చేసింది.  

బిగ్ బాస్ లోకి వీళ్ళు దాదాపు కంఫర్మ్ ఐనట్టే ?

బిగ్ బాస్ సీజన్ 9 కి అంతా సిద్ధమవుతోంది. కంటెస్టెంట్స్ విషయానికి వస్తే వాళ్ళు వీళ్ళు అంటూ చాలా మంది నేమ్స్ వినిపిస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్ లో కూడా వాళ్ళ వాళ్ళ పేర్లు బాగా వైరల్ అవుతున్నాయి. ఐతే ఇప్పటివరకు సింగర్ శ్రీతేజ, డైరెక్టర్ పరమేశ్వర్, చిట్టి పికిల్స్  రమ్య, యూట్యూబ్ ఇన్ఫ్లూఎన్సర్ బబ్లు వీళ్ళు ఫైనల్ అయ్యారంటూ తెలుస్తోంది. ఇక నవ్య స్వామి, వర్షిణి, రీతూ చౌదరి, ఇమ్మానుయేల్, హీరో రాజ్ తరుణ్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి అంటూ తెలుస్తోంది.  సింగర్ శ్రీతేజ ఎక్కువగా పోడ్ క్యాస్ట్స్ చేస్తూ ఉంటారు. ఈయనొక సింగర్, యాంకర్, ఇంటర్ప్రెన్యూర్ గా ఉన్నారు. ఇక యాక్టర్, డైరెక్టర్ పరమేశ్వర్ హివ్రాలే గురించి చెప్పాలంటే ఆయన అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిలిం అండ్ మీడియా స్టూడెంట్స్ తీసిన 2015 లో వచ్చిన "చిరు గొడవలు" మూవీతో ఎంట్రీ ఇచ్చారు. 2016 లో కుమారి 18 +, 2017 లో లావణ్య విత్ లవ్ బాయ్స్, 2021 లో జాతీయ రహస్యం, 2022 లో దారి వంటి మూవీస్ లో నటించారు. ఇక గుమ్మడి నరసయ్య బయోపిక్ ని ఆయన డైరెక్ట్ చేశారు. గుమ్మడి నరసయ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నుంచి ఐదు సార్లు ఎంఎల్ఏగా ఎన్నికైన గిరిజన నాయకుడు. ఇక చిట్టి పికిల్స్ రమ్య గురించి చెప్పక్కర్లేదు. సోషల్ మీడియాలో నెగటివ్ గా ట్రోల్ ఐన త్రి సిస్టర్స్ లో రమ్య ఒక అమ్మాయి. యూట్యూబర్ బబ్లు అటు మూవీస్ లో ఇటు షార్ట్ ఫిలిమ్స్ అలాగే బుల్లితెర మీద రకరకాల షోస్ లో కనిపిస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. వెళ్లంటే దాదాపు సెలెక్ట్ ఐనట్టు తెలుస్తోంది.  

Illu illalu pillalu : భార్యని మాట్లాడొద్దన్న భర్త.. ప్రేమని కోప్పడ్డ ధీరజ్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -212 లో..... ధీరజ్ ఒంటరిగా కూర్చొని బాధపడుతుంటే.. సాగర్, చందు వచ్చి మాట్లాడతారు. నాన్న ఇలా మాటలు పడడానికి కారణం ప్రేమ అని ప్రేమపై కోపంగా ఉంటాడు ధీరజ్. ఆ తర్వాత రామరాజు బాధపడుతుంటే వేదవతి వెళ్లి నేను కావాలని నగలు విషయం చెప్పకుండా లేను.. అలాగే ప్రేమ డాన్స్ క్లాస్ చెప్తుందని నాకు తెలియదని వేదవతి అంటుంది. వద్దు ఇక ఏం చెప్పకు.. ఏం నమ్మలేను.. ఈ ఇంట్లో నాకు తెలియకుండా ఏం జరగదనుకున్నా కానీ నా ఇంటి గురించి నాకే తెలియదని రామరాజు బాధపడతాడు. నాతో మాట్లాడండి అని వేదవతి రిక్వెస్ట్ చేస్తుంది. కాస్త సమయం పడుతుందని రామరాజు అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ధీరజ్ కి సారీ చెప్తుంది ప్రేమ. ఇంకా ప్రేమపై ధీరజ్ కోప్పడతాడు.ఇంట్లో జరిగిన గొడవకి శ్రీవల్లి హ్యాపీగా ఫీల్ అవుతూ డ్యాన్స్ చేస్తుంది. ఆ తర్వాత సాగర్ దగ్గరికి నర్మద వస్తుంది. నువ్వు నన్ను మోసం చేసావ్. ప్రేమ డ్యాన్స్‌ క్లాస్ కి వెళ్తున్న విషయం నీకు తెలుసు కానీ నాకు చెప్పలేదని నర్మదతో సాగర్ గొడవ పెట్టుకుంటాడు.. ఆ తర్వాత ధీరజ్, సాగర్ బయట పడుకుంటారు. చందు వాళ్లిద్దరి దగ్గరికి వస్తుంటే వద్దని శ్రీవల్లి అపుతుంది. తరువాయి భాగంలో వేదవతిని నర్మద, ప్రేమ కూల్ చెయ్యాలని ట్రై చేస్తారు. మీ వల్ల ఆయన నన్ను అన్ని మాటలు అన్నారు.. అసలు ప్రేమ అలా తయారు అవ్వడానికి కారణం నర్మద అని వేదవతి అనగానే నర్మద షాక్ అవుతుంది. అదంతా శ్రీవల్లి వింటు హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.