Brahmamudi : రాజ్ కోసం వెళ్ళిన కావ్య.. ఇదేనా బ్రహ్మముడి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -794 లో.....సీతారామయ్యకి కాఫీ తీసుకొని వస్తుంది కావ్య. నువ్వు నిన్న రాజ్ తో ఎందుకు అలా మాట్లాడావ్.. ఇంట్లో అందరికంటే నువ్వే అలోచించి మాట్లాడతావనుకున్న కానీ ఇలా చేస్తావ్ అనుకోలేదని సీతారామయ్య అంటాడు. నేను ఎందుకు అలా మాట్లాడానో ఇప్పుడు నేను చెప్పలేనని కావ్య అనుకుంటుంది. ఆ తర్వాత కావ్య దగ్గరికి యామిని వచ్చి మా బావని ఏం చేసావ్.. నిన్నటి నుండి కన్పించడం లేదని కోప్పడుతుంది. దాంతో ఇంట్లో అందరు టెన్షన్ పడతారు. యామిని తనకి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే.. అపర్ణ కోప్పడుతుంది. ఇక్కడ నుండి వెళ్ళమని అనగానే యామిని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆవేశంలో యామినిపై కోప్పడ్డారు కానీ రాజ్ తిరిగి వస్తే ముందు వచ్చేది యామిని దగ్గరికే యామిని ఇదంతా మనసులో పెట్టుకొని రాజ్ కి నెగెటివ్ చెప్తే ఏంటని యామినికి సపోర్ట్ గా రుద్రాణి మాట్లాడుతుంది. ఈ ఇంట్లో ఉంటూ ఆ యామినికి సపోర్ట్ చేస్తావా అని రుద్రాణిని ఇందిరాదేవి కోప్పడుతుంది. రాజ్ కన్పించడం లేదని కావ్య బాధగా లోపలికి వెళ్లి తన ఫోటో చుస్తూ ఎమోషనల్ అవుతుంది. అప్పుడే ఇందిరాదేవి, అపర్ణ వచ్చి.. నేను ముందే చెప్పాను. వాడు చాలా బాధపడ్డాడని.. ఇప్పుడు చూడు ఏం జరిగిందోనని అపర్ణ అంటుంది. కాసేపటికి అపర్ణపై పడి కావ్య ఏడుస్తుంది. అప్పుడే కావ్యకి రేవతి ఫోన్ చేసి.. రాజ్ ఇక్కడే ఉన్నాడని చెప్పగానే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. నా ఫ్రెండ్ దగ్గర అయిన ఉన్నాడట.. నేను తీసుకొని వస్తానని కావ్య ఎమోషనల్ గా వెళ్తుంటే హాల్లో ఉన్న అందరూ చూస్తారు. ఏంటి కావ్య అలా వెళ్తుందని ప్రకాష్ వాళ్ళు అనుకుంటారు. ఇంకేముంది రాజ్ కి మళ్ళీ ఏదో అయినట్టుంది. అందుకే అలా వెళ్ళిందని రుద్రాణి అంటుంది. అలా ఎందుకు అంటున్నావని రుద్రాణిపై కోప్పడుతుంది ఇందిరాదేవి. తరువాయి భాగంలో రేవతి ఇంట్లో ఉన్న రాజ్ దగ్గరికి వెళ్తుంది కావ్య. రాజ్ కి తలకి కట్టుకట్టి ఉంటే కావ్య ఎమోషనల్ గా మాట్లాడుతుంటుంది. ఇంత ప్రేమ పెట్టుకొని నిన్న అలా మాట్లాడారని రాజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దిగొచ్చిన శివన్నారాయణ.. కార్తీక్ చెప్తానన్న ఆ కండిషన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -430 లో.....దీప మెడలో తాళిని జ్యోత్స్న తెంపడంతో జ్యోత్స్న చెంప చెల్లుమనిపిస్తుంది సుమిత్ర. మాట్లాడడానికి మంచి మనసు ఉండాలనుకుంటుంది నా భార్య.. కానీ మీరు స్థాయి ఉండాలని అనుకుంటారని చెప్పి దీపని తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు కార్తీక్. ఎందుకు ఇలా చేసావ్ జ్యోత్స్న అని సుమిత్రతో పాటు ఇంట్లో అందరు జ్యోత్స్న పై విరుచుకుపడతారు. నా మాట వినరా.. నేను చేసుకోవాల్సిన బావని అది చెసుకున్నానే గర్వంతో మాట్లాడుతుంది. నాకు పెళ్లి చేసుకోమని సలహా ఇస్తుందని జ్యోత్స్న చెప్తుంది. తప్పేంటి అని శివన్నారాయణ అంటాడు. నువ్వు చేసిన తప్పు చిన్నది కాదు అందుకు వాళ్ళకి క్షమాపణ అడగాలని చెప్పి సుమిత్ర అంటుంది. మనం వెళదాం పదండి అని దశరథ్ తో సుమిత్ర అనగానే నేను వస్తానని శివన్నారాయణ అంటాడు. ముగ్గురు కలిసి కాంచన దగ్గరికి వెళ్తారు. మరొకవైపు అసలు విషయం తెలిసి కాంచన బాధపడుతుంది. జ్యోత్స్న ని తిడుతుంది. అదే సమయంలో జరిగిందంతా శ్రీధర్ కి చెప్తుంది పారిజాతం. దాంతో శ్రీధర్ హ్యాపీగా ఫీల్ అవుతూ.. ఇక ఆ దీప నా కొడుకు జీవితంలో ఉండదని అనుకుంటాడు. శివన్నారాయణ వాళ్ళు కాంచన ఇంటికి  వెళ్తారు. నా కోడలు మెడలో తాళి తెంపుతుంటే అందరు చోద్యం చూస్తున్నారా అని వాళ్లపై కాంచన కోప్పడుతుంది. మా వల్ల తప్పు జరిగింది క్షమించమని అడగడానికి వచ్చామని సుమిత్ర అంటుంది. క్షమించంటే సరిపోతుందా అని కార్తీక్ అంటాడు. మరేం కావాలని శివన్నారాయణ అంటాడు. నాకొక కండిషన్ ఉంది దానికి మీరు ఒప్పుకోవాలని కార్తీక్ అంటాడు. ఒప్పుకుంటాం చెప్పమని శివన్నారాయణ అనగానే ఇప్పుడు చెప్పను రేపు మీ ఇంట్లో చెప్తానని కార్తీక్ అనగానే సరే అని వాళ్ళు వెళ్లిపోతారు. ఏం కండిషన్ రా అని  కార్తీక్ ని అడుగుతుంది‌ కాంచన. నీకు అక్కడే చెప్తానని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : దొంగతనానికి వచ్చిన ఆనందరావుని చూసేసిన నర్మద.. ఆ ఇంటికి వెళ్ళాడుగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -231 లో..... శ్రీవల్లి వాళ్ళ నాన్న దొంగతనానికి వస్తున్నాడని తెలిసి శ్రీవల్లి గడియ పెట్టకుండా ఉంటుంది. లోపలికి వచ్చి ఎప్పటిలాగే పడుకుంటుంది. అప్పుడే తిరుపతి వాటర్ కోసం నిద్ర లేచి గడియ పెట్టలేదేంటనుకొని గడియ పెడుతాడు. అప్పుడే ఆనందరావు వచ్చి డోర్ తియ్యబోతుంటే డోర్ రాదు. దాంతో శ్రీవల్లికి ఫోన్ చేసి గడియ పెట్టారని అంటాడు. శ్రీవల్లి వచ్చి నేను గడియ పెట్టలేదు కదా ఎవరు పెట్టారని గడియ తీస్తుంది. ఆ తర్వాత ఆనందరావు లోపలికి వెళ్తాడు. అదే సమయంలో  ప్రేమ దగ్గరికి ధీరజ్ వస్తాడు. ఇద్దరు గొడవ పడుతుంటే ప్రేమ తన చేతిలో వస్తువు విసిరేస్తుంది. అది కాస్త ఆనందరావు గుండుకి తాకుతూంది. ఏదో కాలినట్లు వాసన వస్తుందనుకుంటాడు కానీ తీరా చూస్తే తన వెనకాల దోమలు బిళ్ల  అంటుకుంటుంది. శ్రీవల్లి చెప్పిన ప్లేస్ కి వెళ్లి కీస్ తీసుకుంటాడు ఆనందరావు. మరోవైపు నర్మదతో సాగర్ మాట్లాడాలని ట్రై చేస్తుంటాడు. నర్మద కోపంగా వాటర్ కోసం బయటకు వస్తుంటే.. ఆనందరావు కర్టెన్ వెనకలా దాక్కుంటాడు. అతని కాళ్ళు కనిపించడంతో దొంగ దొంగ అంటూ నర్మద గట్టిగా అరవడంతో అందరు బయటకు వస్తారు. శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. ఆనందరావు అందరు వచ్చేలోపే పారిపోతాడు. అతను పారిపోయి ఎదురుగా ఉన్న భద్రవతి ఇంట్లోకి వెళ్తాడు. హమ్మయ్య తప్పించుకున్నానని తనలో తాను మాట్లాడుకుంటుంటే.. ఎవరది అని భద్రవతి అంటుంది. దాంతో ఆనందరావు టెన్షన్ పడుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

అందరూ కలిసి నాకు వెన్నుపోటు పొడిచారు... తెర వెనుక నాగబాబు కష్టం!

జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో నటుడు నాగబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. జబర్దస్త్ మొదలై పుష్కరం పూర్తైన సందర్భంగా 12 ఏళ్ళ సంబరాలు చేసుకుంటోంది. ఇక ఈ సెలెబ్రేషన్స్ కి కొత్త పాత కమెడియన్స్ అంతా కూడా మళ్ళీ ఒక చోట చేరారు. అలాగే జడ్జ్ నాగబాబు రీఎంట్రీ ఇచ్చారు. ఇక ఎప్పటిలానే స్కిట్స్ కి పడీపడీ నవ్వుతూ ఉన్నారు. ఐతే ఇందులో ఆది ఒక స్కిట్ వేసాడు. అందులో ఎవరు ఎవరిని పొడిచి పైకొచ్చారో చెప్పాడు. జబర్దస్త్ లో అందరూ కట్టప్పలే బాహుబలులు ఎవరూ లేరు. ఒకరు పైకి రావడానికి ఇంకొకరు టీం లీడర్స్ ని పొడిచి పైకి వచ్చినవాళ్లే అంటూ చెప్పాడు. దాంతో నాగబాబు ఈ పాయింట్ కి బాగా కనెక్ట్ అయ్యారు. చలాకి చంటిని అందరూ పొడిచారు అని చెప్పాడు ఆది. ఆది నీకు అసలు విషయం తెలియడం లేదు. ఇక్కడ ఉన్న అందరూ నన్ను పొడిచారు..ఆ విషయం నీకు ఇంకా తెలియడం లేదు. ఈ స్టేజి మీద నన్ను ప్రతీవాళ్ళూ పొడిచారు. చంటి వీపు జల్లెడ ఐతే నాకు అసలు వెనక ఏమీ లేదు. వేరే స్కిన్ కప్పుకుని  తిరుగుతున్నా అంటూ చాలా ఫీలయ్యారు. ఈ సెలెబ్రేషన్స్ లో చమ్మక్ చంద్ర, అదిరే అభి, రైజింగ్ రాజు, బలగం వేణు, హైపర్ ఆది, గెటప్ శీను, ధనరాజ్, షకలక శంకర్ ఇలా అందరూ ఈ ప్రోగ్రాంకి హాజరయ్యారు. ఎవరి గురువులకు వాళ్లకు కాళ్ళు కడిగి వాళ్ళ గురించి నాలుగు మంచి మాటలు చెప్పుకున్నారు.  ఇక చాన్నాళ్ల తర్వాత నాగబాబు నవ్వును మళ్ళీ జబర్దస్త్ స్టేజి మీద వింటున్నాం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

నాంచాక్ తిప్పి అందరినీ పిచ్చెక్కించిన ఆలీ...

కూకు విత్ జాతిరత్నాలు షో నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో వెరైటీ గా ప్రొఫెషన్ థీమ్ పేరుతో ఎపిసోడ్ ని తీసుకురాబోతున్నారు. ఇక అవినాష్ ఐతే నర్స్ డ్రెస్ వేసుకొచ్చి తన పేరు సిరంజి అంటూ చెప్పి కొంచెం ఫన్ క్రియేట్ చేసాడు. తర్వాత విష్ణు ప్రియా వచ్చి "నా పేరు శివమణి. నాకు కొంచెం మెంటల్ ఉంది" అని చెప్పింది. "కొంచెం కాదు చాలా ఉంది" అంటూ చెప్పాడు అవినాష్. ఇక సైంటిస్ట్ ప్రొఫషన్ లో రీసెర్చ్ చేస్తూ కనిపించాడు బిత్తిరి సత్తి. "కుక్క కాటుకు చెంప దెబ్బ అంటారు కదా ఆ చెప్పు ఎన్నో నంబర్ సైజు అనే దాని మీద రీసెర్చ్ చేసి 8 వ నంబర్ సైజు చెప్పుతో కొట్టారు అది నేను కనిపెట్టాను" అంటూ క్రియేటివ్ గా చెప్పాడు. దానికి రాధ పగలబడి నవ్వింది. ఇక సుహాసిని ఐతే కరాటే మాష్టర్ వేసుకునే వైట్ డ్రెస్ లో వచ్చింది. నాంచాక్ తీసుకుని ఆలీ దగ్గరకు వెళ్లి "నన్ను గుర్తుపట్టలేదా మల్లి" అని అడిగింది. "అది నాకు చేతికి ఇవ్వకు నాకేదో లోపల వచ్చేస్తూ ఉంటుంది" అని చెప్పి పైన కోట్ తీసి వేరే లెవెల్ లో నాంచాక్ తిప్పేసరికి అందరూ షాకయ్యారు. ఓ మై గాడ్ అంటూ సంజయ్ తుమ్మ గట్టిగా అరిచాడు. ఐతే లాస్ట్ వీక్ నుంచి జడ్జ్ ఆశిష్ విద్యార్థి కనిపించడం లేదు. ఆయన  ప్లేస్ లో ఆలి వస్తున్నారు. ఇక నెటిజన్స్ ఐతే ఆశిష్ విద్యార్థి గారు కావాలి. ఆయన ప్లేస్ ని ఆలీతో రీప్లేస్ చేసినట్టు ఉన్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

నాకు రష్మిక మందనా లాంటి వైఫ్ కావాలి

శ్రావణ మాసం సందర్భంగా ఇప్పుడు షోస్ అన్నిట్లో ఆ శ్రావణ మాసం ఎఫెక్ట్ బాగా కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ వీక్ ఫామిలీ స్టార్స్ కూడా అదే థీమ్ తో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇందులో రోహిణి చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఇక కమెడియన్ జ్ఞానేశ్వర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. "జ్ఞాని ఏంట్రా" అని సుధీర్ అడిగేసరికి "అన్న నేను కూడా పూజ చేయడానికి వచ్చాను. పూజ చేస్తే నాకు కూడా రష్మిక మందనా లాంటి వైఫ్ కావాలి" అన్నాడు. "రేయ్ ఆవిడ యానిమల్ ని థియేటర్ వరకు యాక్సెప్ట్ చేస్తారు. పర్సనల్ గా నేను ట్రై చేశా యాక్సెప్ట్ చేయరు." అన్నాడు సుధీర్ . ఇంతలో శ్రీకర్ కృష్ణ ముందుకు వచ్చి "ఈ పూజ సంగతి పక్కన పెట్టు రీసెంట్ గా ఎవరో పూజ పరిచయం అయ్యారటగా" అన్నాడు కామెడీగా. "ఏంటయ్యా బాబు నువ్వు" అన్నాడు సుధీర్. తర్వాత సుధీర్ అమ్మాయిల ముందు తెగ సిగ్గుపడ్డాడు. "అందంగా లేను అని అందరూ నన్ను అందరూ ఎగతాళి చేస్తున్నారు" అన్నాడు కావ్య ముందుకు వెళ్లి. "దేవుడు ఎవరినీ అందం లేకుండా స్రుష్టించడు అండి. కానీ మిమ్మల్ని ఎవరు సృష్టించారో తెలీట్లేదు" అంది. అంతే సుధీర్ షాకయ్యాడు ఆ కామెంట్ కి. ఇక రోహిణి ఐతే వైరల్ వయ్యారి పాటలో ఆ వయ్యారిని నేనే అంటూ నా వెనకాల పడుతున్నారు అంటూ చెప్పేసరికి అందరూ నవ్వేశారు. ఇంకా ఆ పాటకు రోహిణి డాన్స్ చేసి సుధీర్ ని ఒక ఆట ఆడేసుకుంది.  

Jayam serial : తను మళ్ళీ వస్తుందా అని అడిగిన శకుంతల.. నిజం తెలిసి గంగ షాక్!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -21 లో... నా కూతురిని నా ఇంటికి పంపించండి అని రుద్ర ఇంటికి పైడిరాజు వచ్చి గొడవ పడుతుంటాడు. రుద్ర వచ్చి.. నీ కూతురు ఇక్కడ ఎందుకు ఉంటుందని కోప్పడతాడు. ఆ తర్వాత గొడవలో పెద్దసారు కింద పడబోతుంటే రుద్ర పట్టుకుంటాడు. రుద్ర కోపంతో పైడిరాజుని కొట్టబోతుంటే గంగ అడ్డుపడుతుంది. గంగని చూసిన రుద్ర షాక్ అవుతాడు. నా కూతురు ఈ ఇంట్లో లేదన్నారు కదా మరి ఇప్పుడు ఎలా వచ్చింది. నా కూతురుపై ఈ రుద్ర మోజు పడ్డాడు అందుకే ఇక్కడ ఉంచుకున్నాడని తప్పుగా మాట్లాడుతుంటే.. మా నాన్న తరుపున నేను సారీ అడుగుతున్నాను.. ఇంకెప్పుడు మీకు కన్పించనని చెప్పి గంగ పైడిరాజుని తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత అందరు నన్ను చీట్ చేశారని రుద్ర అంటుంటే.. గంగ వస్తే మీ పెద్దమ్మ బాగవుతుందని అలా చేసాను. ఇప్పుడు భాను ఎక్కడ అంటే ఇప్పుడేం చెయ్యాలని పెద్దసారు బాధపడతాడు. అందరు లోపలికి వస్తారు. ఏమైందని శకుంతల అడుగుతుంది. భాను వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాలేకపోతే వాళ్ళ నాన్న వచ్చి తీసుకొని వెళ్ళాడని పెద్దసారు చెప్తాడు. నాకు బాగా దగ్గర అయింది. మళ్ళీ వస్తుందా అనీ శకుంతల అడుగుతుంది. వస్తుందని పెద్దసారు అంటాడు. అదంతా రుద్ర వింటాడు. మరొకవైపు ఒక చిన్నపాపకి దెబ్బ తాకుతుంది. రుద్ర హాస్పిటల్ కి తీసుకొని వెళ్లి తన బ్లడ్ ఇస్తాడు.  మరొకవైపు హాస్పిటల్ లో వీరు తమ్ముడు కోమాలో ఉంటాడు. వీరు వచ్చి నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఛాంపియన్ షిప్ లో నిన్ను ఓడించి ఇంతలా కొట్టాడు ఆ రుద్ర. మన నాన్న ఆ విజయేoద్ర వల్లే చనిపోయాడు.. వాళ్లపై పగ తెంచుకోవడానికి ఆ ఇంటికి అల్లుడు అయ్యానని తన తమ్ముడుని చూసుకుని అతనితో తన పగ చెప్తాడు. అక్కడే రుద్ర కన్పిస్తాడు. కావాలనే ఎదురుగా వెళ్లి ఏంటి ఇక్కడ అని అడుగుతాడు. ఒక చిన్న పాపని హాస్పిటల్ కి తీసుకొని వచ్చానని రుద్ర అంటాడు. తరువాయి భాగంలో పైడిరాజు కావాలనే తన భార్య టాబ్లెట్స్ పారేస్తాడు. దాంతో తను పడిపోతుంది. హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు. తన ఇంజక్షన్ ఖర్చు వీరు మనిషి గంగని పెళ్లి చేసుకుంటానని చెప్పిన వ్యక్తి ఇస్తానని అంటాడు. మీరు ఎందుకు ఇస్తున్నారని గంగ అడుగగా ఇతనే నిన్ను పెళ్లి చేసుకునేది అని పైడిరాజు అనగానే గంగ షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu : దొంగతనం ప్లాన్ లో శ్రీవల్లి డ్రామా.. పదిలక్షల కోసమే అలా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -230 లో.... వాళ్ళ నాన్న తన ఇంటికి దొంగతనానికి వస్తాడని శ్రీవల్లి టెన్షన్ పడుతుంది.. అప్పుడే వాళ్ళ నాన్న ఫోన్ చేస్తాడు. శ్రీవల్లి కంగారుగా బయటకు వచ్చి మాట్లాడుతుంది. నువ్వు డోర్ ఓపెన్ చేసి పెట్టు అని వాళ్ళ నాన్న చెప్పగానే.. సరే గానీ జాగ్రత్తగా రా.. హాల్లో తిరుపతి బాబాయ్ పడుకున్నాడని చెప్తుంది. ఆ తర్వాత శ్రీవల్లి ఫోన్ మాట్లాడి లోపలికి వచ్చేసరికి చందు లేచి ఉంటాడు. ఈ టైం లో ఫోన్ ఎవరని అడుగుతాడు. మా అమ్మ అని కవర్ చేస్తుంది. ఆ తర్వాత ధీరజ్ రాత్రి ఇంటికి వస్తాడు. డోర్ వేసి ఉండడంతో ప్రేమకి ఫోన్ చేస్తాడు. డోర్ తియ్ అని అంటాడు. నేను తీయనని ప్రేమ అంటుంది. అప్పుడే శ్రీవల్లి వాళ్ళ నాన్న వస్తాడని డోర్ తీస్తుంది. తీరా చుస్తే ధీరజ్ ఉంటాడు. అతన్ని చూసి శ్రీవల్లి షాక్ అవుతుంది. నువ్వేంటి వదిన ఈ టైమ్ కి అని ధీరజ్ అడుగుతాడు. నీ కోసమే డోర్ తీద్దామని అని కవర్ చేస్తుంది శ్రీవల్లి. మొన్న తియ్యలేదు కదా ప్రేమ ఎంత రిక్వెస్ట్ చేసిన వినలేదట.. మళ్ళీ ఇప్పుడేంటని ధీరజ్ అనగానే అంటే మీరు ఇబ్బంది పడుతున్నారని అని శ్రీవల్లి అంటుంది. దాంతో ధీరజ్ లోపలికి వెళ్తాడు. ఆ తర్వాత శ్రీవల్లి ఎవరు లేకుండా చూసి మళ్ళీ బయటకి వస్తుంది. వాళ్ళ నాన్న వచ్చాడేమో అని చూసి డోర్ గడియ పెట్టదు ఆ తర్వాత ఈ తాళాలు ఎలా కన్పించేలా పెట్టాలని కిచెన్ లోకి వెళ్లి.. బీరువా తాళాలు అక్కడ పెడుతుంది. వాళ్ళ నాన్న పది లక్షలు దొంగతనం చెయ్యడానికి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : దీప తాళిని తెంచేసిన జ్యోత్స్న.. సుమిత్ర ఫైర్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -429 లో..... శివన్నారాయణ పంతులిని పిలిపించి జ్యోత్స్న జాతకం చూపిస్తాడు. ఈ జాతకం ప్రకారం అయితే ఈ అమ్మాయికి ఇప్పటికే పెళ్లి అయ్యి ఉండాలని పంతులు అనగానే అలా అంటున్నారు పెళ్లి అవడం లేదనే కదా మిమ్మల్ని పిలిపించిందని శివన్నారాయణ అంటాడు. ఆ తర్వాత ఈ జాతకం.. ఈ అమ్మాయిదే అయితే నేను చెప్పింది నిజమని పంతులు అంటాడు. అయితే ఒకసారి చెయ్ చూపించు అనీ చెయ్ చూసి జ్యోత్స్న జాతకం చెప్తాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడు నిజం చెప్తాడా ఏంటని పంతులిని డైవర్ట్ చేయాలని దీప పంతులు జ్యూస్ తీసుకోండని ఇస్తుంది. ఒకసారి నీ చెయ్ చూపించమని దీపతో పంతులు అంటాడు. దీప చూపించగానే మహారాణి యోగం అని పంతులు అంటాడు. దానికి మహారాణి యోగం ఏంటి అనాథ.. పెంచిన వాడు చచ్చిపోయాడని పారిజాతం అంటుంది. కన్నవాళ్ళు ఉన్నారు కదా.. వాళ్ళకి దగ్గర లోనే ఉంది అని పంతులు అనగానే దీప హ్యాపీగా ఫీల్ అవుతుంది. జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత పంతులు వెళ్లిపోతూ.. సుమిత్ర, దశరథ్ లని జాగ్రత్త అంటాడు. మనల్ని ఎందుకు జాగ్రత్త అన్నాడని ఇద్దరు అనుకుంటారు. ఆ తర్వాత అందరు వెళ్ళిపోయాక అసలు నువ్వే ఈ ఇంటికి పట్టిన దరిద్రంవి అని  దీపని తిడుతుంది జ్యోత్స్న. మీరు పెళ్లి చేసుకోండి అమ్మా అప్పుడు అందరు హ్యాపీగా ఉంటారని దీప అంటుంది. నీ స్థాయేంటో తెలుసా.. మా బావది మా స్థాయి.. నీ మెడలో తాళి కట్టాడు కాబట్టి నువ్వు ఈ స్థాయి అని ఫీల్ అయి నాకు చెప్తున్నావా.. అని దీప తాళిని పట్టుకొని వదలదు జ్యోత్స్న. అందరు వచ్చి వదులు జ్యోత్స్న అంటున్నా జ్యోత్స్న వదలదు.. దాంతో తాళి తెగిపోతుంది. అది చూసి అందరు షాక్ అవుతారు. దీప బాధపడుతుంది జ్యోత్స్న చేతిలో నుండి తాళి కింద పడిపోతుంటే కార్తీక్ పట్టుకుంటాడు.‌ కార్తీక్ కోప్పడబోతుంటే జ్యోత్స్న చెంపచెల్లుమనిపిస్తుంది సుమిత్ర. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : ఇంటికి వారసుడిని ఇవ్వడం నా భాద్యత.. శుభవార్త చెప్పిన కావ్య!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -793 లో.... కావ్యకి రాజ్ ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేస్తుంది. రాజ్ వెళ్తుంటే ఇందిరాదేవి, అపర్ణ ఆపి మేం కావ్యకి నచ్చజెప్పుతాం.. నువ్వు టెన్షన్ పడకని అంటారు. వద్దు తనకి ఇష్టం లేదు.. ఇన్ని రోజులు నా హెల్ప్ తీసుకుంటే అది ప్రేమ అనుకుని భ్రమ పడ్డాను అంతే అని రాజ్ ఎమోషనల్ అవుతాడు. బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇందిరాదేవి, అపర్ణ ఇద్దరు కావ్య దగ్గరకు వచ్చి.. నువ్వు ఏం చేస్తున్నావ్.. అర్ధం అవుతుందా.. ఇన్ని రోజులు ఈ సమయం కోసం వెయిట్ చేసావ్.. తీరా ఇలా చేసావ్ ఎందుకు ఇలా చేసావ్ కారణం ఏంటని కావ్యని అడుగుతుంది ఇందిరాదేవి. ఏం లేదు నా కారణాలు నాకుంటాయని కావ్య అనగానే నువ్వు చెప్పవు ఇప్పుడే రాజ్ దగ్గరికి వెళ్లి గతం గురించి చెప్తానని అపర్ణ వెళ్లిపోతుంటే.. నేను తల్లిని కాబోతున్నానని కావ్య అంటుంది. ఇందిరాదేవి, అపర్ణ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఈ విషయం ఆయనతో ఎలా చెప్పాలి.. నా కడుపులో బిడ్డకి తండ్రి మీరే అని ఎలా చెప్పాలని కావ్య బాధపడుతుంది. నేను ఈ ఇంటికి వారసుడిని ఇవ్వడం నా బాధ్యత.. అందుకే నేను ఆయనకు ఎదురు పడనని కావ్య చెప్తుంది. ఆ తర్వాత రాజ్ నడుచుకుంటూ వెళ్తుంటే వెనకాల నుండి ఏదో వచ్చి డాష్ ఇస్తుంది. మరొకవైపు రాజ్ కోసం యామిని చూస్తుంటుంది. ఆ తర్వాత కావ్య అందరికి కాఫీ తీసుకొని వస్తుంది.  రాజ్ ని కావ్య రిజెక్ట్ చేసిందని కోపంతో ప్రకాష్, సుభాష్, ధాన్యలక్ష్మి కాఫీ తీసుకోకుండా తనతో కోపంగా మాట్లాడుతారు. పాపం దాని పరిస్థితి చుస్తే బాధగా ఉంది అత్తయ్య.. నిజం చెప్పలేక ఎవరు ఎమన్నా పడుతుందని ఇందిరాదేవి, అపర్ణ అనుకుంటారు. అప్పుడే రుద్రాణి వచ్చి.. నీకు రాజ్ అంటే ఇష్టం కదా ఎందుకు వద్దన్నావని అడుగుతుంది. కావ్య కోపంగా అక్కడ నుండి వెళ్తుంది. తరువాయి భాగంలో మా బావ ఎక్కడ నిన్నటి నుండి ఇంటికి రాలేదని కావ్య దగ్గరికి వస్తుంది యామిని. రాజ్ ఎక్కడికి వెళ్ళాడని ఇంట్లో అందరు టెన్షన్ పడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

జబర్దస్త్ లో కట్టప్పలు ఎవరు..బాహుబలులు ఎవరు ? రివీల్ చేసిన ఆది

  జబర్దస్త్ మెగా సెలెబ్రేషన్స్ లో ఆది అసలు విషయం చెప్పాడు. పాత, కొత్త టీమ్ లీడర్స్ ని పెట్టాడు. వెనక కత్తులతో పొడుస్తున్న వాళ్ళు కట్టప్పలు కానీ ముందున్న వాళ్ళు బాహుబలులు మాత్రం కాదు. కంటెస్టెంట్స్ అంతా టీమ్ లీడర్స్ ని పొడిచిన వాళ్ళే. ఒక్క రచ్చ రవి అన్నే హడావిడిలో తనకు తానే పొడుచుకున్నాడు. ఇక చలాకీ చంటి ఘట్టం మామూలుది కాదు అన్నాడు ఆది. దానికి ప్రత్యక్ష సాక్షిని నేనే అంటూ నాగబాబు చెప్పాడు. జబర్దస్త్ లో ఉన్న కత్తులన్నీ కూడా చంటి వీపుకు దిగాయి. ఆల్రెడీ జల్లెడ అయ్యింది. "గోడ మీద పెయింట్ లు వేసుకునే వాడిని తీసుకొచ్చి ఆర్టిస్ట్ ని చేశా" అంటూ షకలక శంకర్ ని చూపించాడు. "అసలు వాడే మహా ప్రమాదకారి" అన్నారు నాగబాబు. "ఈయన కామెడీ మొత్తం నాగబాబు గారికి తెలిసి కూడా ఆయన దగ్గరకు వెళ్లి మీరొక 4 పెట్టండి మనకు 10 వస్తాయి అన్నాడట" అంటూ ఆది వాళ్ళ మధ్య ఉన్న సీక్రెట్స్ ని లీక్ చేసేసాడు. వెంటనే నాగబాబు "ఆది ఆల్మోస్ట్ అందరూ కలిసి నన్ను పొడిచారు. ఆ విషయం మీకు తెలుసో లేదో. ఈ స్టేజి మీద నన్ను ప్రతీ వాళ్ళు పొడిచారు. చంటి వీపు జల్లెడ అయ్యింది. అసలు నాకు వెనక ఎం లేదు..వేరే చర్మం కప్పుకుని తిరుగుతున్నా..." అన్నారు. ఇంకో ఘట్టం సుధీర్ - రష్మీ. "నేను చచ్చిపోతే ఏడుస్తావో లేదో కానీ నువ్వు ఏడిస్తే నే చచ్చిపోతా" అన్నాడు .."చచ్చిపోవడం దేవుడెరుగు..కనీసం వచ్చిపోవడం కూడా లేదు" అంటూ సుధీర్ మీద పంచులు వేసాడు. "రష్మీ బయటకు వెళ్తే సుధీర్ అన్న ఎక్కడ అంటారు..సుధీర్ ప్రెస్ మీట్ కి వెళ్తే రష్మీ వదిన ఎక్కడా అని అడుగుతారు చివరికి ఏమయ్యింది. వదిన ఒంటరయ్యింది. ఆయనేమో అక్కడ ఆడపిల్లలతో పాడుకుంటున్నాడు చిన్నపిల్లలతో ఆడుకుంటున్నాడు" అంటూ సెటైర్స్ వేసాడు. సుధీర్ - రష్మీ లవ్ ట్రాక్ ని చూసి పుట్టుకొచ్చిన రైల్వే ట్రాక్ ఇమ్మానుయేల్ - వర్ష జోడి. "కరోనా వైరస్ వచ్చిన తర్వాత నేను వర్షని ఈటీవీకి పరిచయం చేసాను. ఈమె ఇమ్మానుయేల్ తో లవ్ ట్రాక్ పెట్టుకుని ఇంకో వైరస్ ని ఈటీవీకి పరిచయం చేశారు." అందరి గురించి చెప్పుకొచ్చాడు ఆది.  

రష్మీ,అనసూయ మధ్య విభేదాలు..జబర్దస్త్ సెలెబ్రేషన్స్ లో రష్మీ కన్నీళ్లు

జబర్దస్త్ 12 ఇయర్స్ మెగా సెలెబ్రేషన్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సెలెబ్రేషన్స్ కి అలనాటి జబర్దస్త్ కమెడియన్స్ అంతా ఒక చోట చేరారు. అలాగే వెళ్లిపోయిన జడ్జెస్ కూడా తిరిగి వచ్చారు. కానీ రోజా, సుధీర్ మాత్రం ఈ సెలెబ్రేషన్స్ లో కనిపించలేదు. ఇక ఇందులో ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే అనసూయ - రష్మీ ప్యాచప్. గతంలో అనసూయ, రష్మీ ఈ షోకి యాంకర్స్ గా చేసిన విషయం తెలిసిందే. ఐతే అనసూయ కొన్ని కారణాల వలన అలాగే మూవీ ఆఫర్స్ కారణంగా జబర్దస్త్ హోస్ట్ గా బై చెప్పేసి వెళ్ళిపోయింది. తర్వాత ఆమె ప్లేస్ లో రష్మీ వచ్చింది. అప్పటి నుంచి రష్మీ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక ఇప్పుడు ప్రోగ్రాంలో రష్మీ, అనసూయ ఎమోషనల్ అయ్యారు. "జీవితం బోలెడన్ని అవకాశాలు ఇవ్వదు అంటారు కానీ తప్పకుండ ఇస్తుంది. నేను కొంతమందితో ప్యాచప్ చేసుకోవాలి" అంటూ లేచి వెళ్లి రష్మీని హగ్ చేసుకుంది. దాంతో ఆమె ఏడ్చేసింది. "నిజానికి ఎవరికీ తెలియనివి కొన్ని అందరికీ తెలిసిపోయేలా ఉన్నాయి మన ప్యాచప్ వలన..ఓ అదే మీ ఇద్దరూ మాట్లాడుకోరా" అంటారు. దాంతో రష్మీ వెంటనే "అదేదో వాట్సప్ లో కానీ ఫోన్ చేసి ఉంటే ఐపోయేది కదా" అని చెప్పింది. వెంటనే అనసూయ "అలా ఫోన్ లో మాట్లాడితే చాలా ఈగోలు అడ్డొస్తాయి.. ఇలా ఐతే" అంటూ నవ్వేసింది. ఐతే వీళ్ళు ఎప్పుడు మాట్లాడుకున్నట్టు చూడలేదు. వీళ్ళ మాటలను బట్టి వీళ్ళు కొన్నేళ్ల నుంచి మాట్లాడుకోవడం లేదు అనే విషయం తెలుస్తోంది. ఐతే ఎందుకు వీళ్ళు మాట్లాడుకోవడం లేదు అనే విషయం రాబోయే ఎపిసోడ్ లో తెలిసే అవకాశం ఉంది.  

అదిరే అభి కాళ్ళు కడిగిన హైపర్ ఆది..

  జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. 12 ఇయర్స్ మెగా సెలెబ్రేషన్స్ జరిగాయి. ఇక ఇందులో ఎవరి గురువులకు వాళ్ళు కాళ్ళు కడిగి వాళ్ళ అభిప్రాయాన్ని వెల్లడించారు. ముందుగా ఐతే అదిరే అభి కాళ్ళు కడిగాడు హైపర్ ఆది. "నువ్వేం సాధించావ్ లైఫ్ లో అని ఎవరైనా అడిగితే ఆది నా శిష్యుడు అని చెప్పడానికి నాకు గర్వంగా ఉంటుంది..." అన్నాడు. "నేను గర్వంగా చెప్పుకునేది ఏంటి అంటే ఒకసారి మా అమ్మానాన్నను హాస్పిటల్ కి తీసుకెళ్తే అక్కడ డాక్టర్స్ చూసి మీరు చాలా అదృష్టవంతులు మీకు ఇలాంటి కొడుకు ఉన్నందుకు" అన్నారు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తర్వాత చమ్మక్ చంద్రకి ఆయన శిష్యులంతా లేడీ గెటప్స్ తో వచ్చి కాళ్ళు కడిగారు. "ధన్రాజ్, వేణు ఆర్టిస్టులు అయ్యారు..మా టీమ్ లో చేరిన తాగుబోతు రమేష్ కూడా ఆర్టిస్ట్ అయ్యాడు. కానీ నేను కావట్లేదు. ఆ టైములో నేను బాధలో ఉన్నప్పుడు నాకు జబర్దస్త్ ఆఫర్ వచ్చింది. అప్పుడి ఒక్కటే అనుకున్నా నా లైఫ్ అండ్ డెత్ ప్రోగ్రాం ఇది అని" చెప్పాడు. తర్వాత రాఘవ గారికి కూడా వాళ్ళ శిష్యులు వచ్చి కాళ్ళు కడిగారు.  ఇక హారిక అనే సింగర్ జబర్దస్త్ మీద టీమ్ లీడర్స్ పేర్లు వచ్చేలా వాళ్ళు చేసిన బెస్ట్ స్కిట్స్ ని తీసుకుని మంచి పాట తయారు చేసి పాడి వినిపించింది. ఇక ఈ షోకి రోజా రాకపోయినా కూడా ఆమె మీద కూడా కొన్ని లిరిక్స్ రాసి జబర్దస్త్ ఈ పదేళ్ల జర్నీ మీద ఆమె పాడిన ఈ  మంచి సాంగ్ కి అందరూ ఫిదా ఇపోయారు. ఇక చమ్మక్ చంద్ర ఐతే "మా ఫామిలీ మీద మా జబర్దస్త్ మీద ఫస్ట్ టైం సాంగ్ విన్నాం చాలా చక్కగా ఉంది" అన్నాడు. "మీరు పాడుతుంటే ఆ మిస్సింగ్ ఫీలింగ్ అందరిలో తెప్పించారు..అంత బ్యూటిఫుల్ గా పాడారు" అంటూ ఇంద్రజ కామెంట్ చేసింది.  

మరో మహాలక్ష్మి మా ఇంట్లో అడుగు పెట్టింది

  బిగ్ బాస్ రివ్యూయర్ గా ఆదిరెడ్డి అందరికీ పరిచయమే. తర్వాత కామన్ మ్యాన్ క్యాటిగరీలో బిగ్ బాస్ సీజన్ 6 లో ఎంట్రీ ఇచ్చాడు. ఫైనల్ వరకు వెళ్లి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక బిగ్ బాస్ నుంచి వచ్చాక ఒక సలోన్ స్టార్ట్ చేసాడు. మళ్ళీ బిగ్ బాస్ లేటెస్ట్ అప్ డేట్స్ ఇస్తూ ఉన్నాడు. అలాగే కొన్ని బుల్లితెర షోస్ కి భార్య కవితతో సహా వెళ్ళాడు. ఆదిరెడ్డి - కవిత జంటకు ఒక పాపా ఉంది. ఇప్పుడు మరో పాపకు జన్మనిచ్చింది కవిత.   ఆల్రెడీ ముందు వీరికి  ఒక పాప ఉంది. ఆమె పేరు హద్విత. ఇక ఇప్పుడు కూడా మరో మహాలక్ష్మి పుట్టింది అంటూ డాక్టర్ తన చేతిలో బిడ్డను పెట్టిన వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. రీసెంట్ గా భార్య కవితకు ఘనంగా సీమంతం కూడా చేసాడు ఆదిరెడ్డి. ఇక నెటిజన్స్ ఐతే శ్రావణ మాసంలో పుట్టిన శ్రావణ మహాలక్ష్మి అంటూ కంగ్రాట్స్ చెప్తున్నారు. "మా అమ్మ మరణించిన రెండో రోజునే పాప పుట్టింది. దేవుడు ఇలా మా అమ్మను మరో సారి మా ఇంటికి పంపేలా ప్లాన్ చేసాడు" అంటూ స్టేటస్ లో పోస్ట్ చేసాడు. ఇక ఆదిరెడ్డి త్వరలో అడ్వకేట్ గా మారబోతున్నాడు.  ఇక ఇష్మార్ట్ జోడి 3 రన్నరప్ గా నిలిచాడు ఆదిరెడ్డి.   

Jayam serial: గంగని చూసి రుద్ర షాక్.. గొడవచేసి ఆమెను తీసుకెళ్ళిన పైడిరాజు!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -20 లో..... రుద్ర తన సూపర్ మార్కెట్ లో పని చేసే అమ్మాయికి తను ప్రేమించిన అబ్బాయితో పెళ్లి జరిపించి తీసుకొని వస్తాడు. నిన్న నువ్వు చనిపోతానన్నావ్ కదా చనిపోమని రుద్ర అనగానే అంటే నిన్న అలా అనిపించింది సర్ అని ఆ అమ్మాయి అంటుంది. అంత నీ ఇష్టమేనా నీకంటు కుటుంబం ఉంటుంది.. వాళ్ళ గురించి ఆలోచించవా.. బంధాలు దూరం అయి ఎంత బాధపడుతున్నామో మా కుటుంబా‌నికి తెలుసని రుద్ర ఎమోషనల్ గా మాట్లాడతాడు. ఆ తర్వాత గంగ వర్క్ చేసుకుంటుంటే.. అప్పుడే గంగ వాళ్ళ నాన్న పైడిరాజు వస్తాడు. గంగ మన ఇంటికి వెళ్లిపోదాం పద అని చేయి పట్టుకొని బలవంతంగా లాక్కొని వెళ్తుంటే రుద్ర వచ్చి ఆపుతాడు. ఇక్కడ గొడవ చెయ్యకు.. ఇది వర్కింగ్ అవర్ అని రుద్ర తనని బెదిరించి పంపిస్తాడు. ఇంకోసారి ఇలా వచ్చి గొడవ చేస్తే నీకు సూపర్ మార్కెట్ లో అడుగుపెట్టనివ్వమని గంగకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు రుద్ర. నీ జాబ్ కి ఎలాంటి టెన్షన్ లేదు.. నువ్వు వర్క్ చేసుకోమని పెద్దసారు అంటాడు. మరొకవైపు గంగ ఇంటికి రాలేదని.. అతని భార్యని అడుగుతాడు. సూపర్ మార్కెట్ లో పని అయ్యాక పెద్దసారు వాళ్ళింట్లో పని చెయ్యడానికి తీసుకొని వెళ్తున్నారు.. అక్కడే ఉంటుందని ఆవిడ చెప్పగానే అది అక్కడ ఉంటే నేను అనుకున్నది ఎలా జరుగుతుందనుకుంటాడు పైడిరాజు. నేను ఇప్పుడే వెళ్లి వాళ్ళ సంగతి తేలుస్తానని వెళ్తాడు. పైడిరాజు వెళ్తుంటే వీరు మనిషి వచ్చి ఇప్పుడు కాదు.. రేపు ప్రొద్దున వెళ్లి అడగమని అతను అనగానే సరే అని పైడిరాజు అంటాడు. మరుసటి రోజు ఉదయం పైడిరాజు రుద్ర ఇంటికి వెళ్తాడు. నా కూతురిని కిడ్నప్ చేసారంటు గొడవ పెడతాడు. ఎక్కడ రుద్ర బయటకు వస్తాడోనని అందరు టెన్షన్ పడుతాడు. గంగ లోపల దాక్కుంటుంది. పైడిరాజ్ గొడవ చేస్తుంటే నీ కూతురు ఇక్కడ ఎందుకు ఉంటుందని అతనిపైకి రుద్ర వెళ్తాడు. తరువాయి భాగం లో పైడిరాజుని రుద్ర కొడుతుంటే గంగ వస్తుంది. గంగని చూసిన రుద్ర షాక్ అవుతాడు. ఆ తర్వాత గంగని తీసుకొని పైడిరాజు వెళ్ళిపోతాడు. ఇప్పుడు మీ పెద్దమ్మ.. భాను అని అడిగితే ఏం చెయ్యాలని పెద్దసారు టెన్షన్ పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu : ఇంటికి దొంగతనానికి వచ్చిన ఆనందరావు.. శ్రీవల్లీనే అసలు సూత్రధారి!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -229 లో..... ప్రేమని ధీరజ్ సైకిల్ పై కూర్చొపెట్టుకొని సైకిల్ ని తోసుకుంటూ తీసుకొని వెళ్తాడు. అదంతా సాగర్ చూసి నవ్వుకుంటాడు. మరొకవైపు నర్మద దగ్గరికి సాగర్ వస్తాడు. నర్మద మాట్లాడకపోవడంతో మాట్లాడించే ప్రయత్నం చేస్తుంటాడు. అయినా సరే నర్మద మాట్లాడదు. పక్కన ఒకావిడ చూసి నర్మదని ఏడిపిస్తున్నాడెమో అని అనుకొని.. ఎవర్రా నువ్వు అమ్మాయి వెంట పడుతున్నావని అడుగుతాడు. తను నా భార్య.. చెప్పు నర్మదా అని సాగర్ అంటుంటే నర్మద కాసేపు సైలెంట్ గా ఉంటుంది. ఆ తర్వాత నా భర్త అని చెప్తుంది. ఏదో చిన్న గొడవ అయింది అని సాగర్ అంటాడు. కోపంగా నర్మద అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అప్పుడే ధీరజ్ అదంతా చూసి సాగర్ దగ్గరికి వచ్చి నవ్వుతాడు. ఇద్దరు ఒకరి బాధలు ఒకరు చెప్పుకుంటారు. మరొకవైపు భాగ్యం దగ్గరికి వెళ్తుంది శ్రీవల్లి. మా అయన డబ్బు ఇవ్వమని అంటున్నాడు. ఇప్పుడేం చెయ్యాలని శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. ఇంటి పెత్తనం నీ చేతికి వచ్చినా మనకి కష్టాలు వదలడం లేదని భాగ్యం అనగానే ఆనందరావుకి ఒక ఐడియా వస్తుంది. ఇంటి పెత్తనం నీదే కాబట్టి ఈ రోజు నేను మీ ఇంటికి దొంగతనానికి వస్తాను. తాళాలు ఇవ్వు డబ్బు తీసుకొని వస్తాను.. ఇదొక్కటే దీనికి పరిష్కారమని ఆనందరావు అంటాడు. ఆ తర్వాత రామరాజు ఇంటికి భోజనానికి వస్తాడు. భోజనం చేస్తూ ఉంటాడు. వేదవతి ఎంత మాట్లాడిన రామరాజు మాట్లాడడు. వేదవతి పక్కకు వచ్చి బాధపడుతుంది‌. వాళ్ళు అలా బాధపడడానికి ఒకరకంగా కారణం మనమే.. ఎలాగైనా ఆ వల్లి అక్క ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలని ప్రేమ, నర్మద అనుకుంటారు. తరువాయి భాగంలో ఆనందరావు రామరాజు ఇంటికి దొంగతనానికి వస్తాడు. శ్రీవల్లి డోర్ తీస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : ఆస్తులు అడిగితే నా కూతురే అడగాలి... శ్రీధర్ పై శివన్నారాయణ ఫైర్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -428 లో.... నోటిసులు నేనే పంపించాను.. దానికి వాళ్లకు ఏం సంబంధం లేదు.. ఇలాంటి మంచిపనులు నేనే చేస్తాను.. ఈ క్రెడిట్ నాకే అని శ్రీధర్ గొప్పలు చెప్పుకుంటాడు.. ఇక ఆస్తులు వాటాలు చెయ్యండి అని ఆస్తుల గురించి శ్రీధర్ చెప్తుంటాడు. ఇక శివన్నారాయణకి కోపం వచ్చి నువ్వు ముందులేరా మర్యాదగా.. ఇక్కడ నుండి వెళ్ళిపో ఆస్తులలో వాటా కావాలంటే నా కూతురు అడగాలి నువ్వేంట్రా అని శివన్నారాయణ కోప్పడతాడు. ఇంకొకసారి ఇలా నోటిసులు అంటూ ఇబ్బంది పెట్టకండి.. మాకు ఆస్తులు అవసరం లేదు.. బంధాలు కావాలని నోటీసులని చింపి శ్రీధర్ చేతిలో పెడుతాడు కార్తీక్. ఇక మీరు మారరని చెప్పి శ్రీధర్ వెళ్ళిపోతాడు. మీరు చాలా మాటలు అన్నారు అయ్యగారు.. మీ కూతురికి మీకంటే ఎక్కువ పౌరుషమని శివన్నారాయణతో దీప అంటుంది. ఆ తర్వాత కార్తీక్, దీప ఇద్దరు ఇంటికి వచ్చి శ్రీధర్ చేసిన పని గురించి చెప్తారు. నా వాళ్ళని బాధపెడుతున్నాడని కాంచన ఎమోషనల్ అవుతుంది. మరొకవైపు శ్రీధర్ కోపంగా ఉంటాడు. ఎందుకండి అన్నీ ఇలాంటి పనులు చేస్తారు.. దీపని కోడలుగా ఒప్పుకోండి అని కావేరి అంటుంది. అసలు ఎప్పటికి జరగదని శ్రీధర్ అంటాడు. ఆ దీపతో నా కొడుకుకి విడాకులు ఇప్పిస్తాను.. ఇందులో ఎలాంటి మార్పు ఉండదని శ్రీధర్ అనుకుంటాడు. ఆస్తులు అడిగితే నా కూతురు అడగాలన్నాడు. ఒకవేళ కాంచన అడిగితే ఆస్తులు ఇస్తాడని జ్యోత్స్నతో పారిజాతం అంటుంది. ఇవ్వన్నీ అత్త ఆస్తులు అయితే బావని పెళ్లి చేసుకుంటే నాకే కదా అని జ్యోత్స్న అంటుంది. అంటే నీకు ఇంకా కార్తీక్ పై ఆశ పోలేదా అని పారిజాతం అంటుంది. లేదు ఎప్పటికిపోదని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత జ్యోత్స్న జాతకాన్ని పంతులు గారికి చూపిస్తారు. అది చూసి ఈ జాతకం ప్రకారం అయితే ఆల్రెడి ఈ అమ్మాయికి పెళ్లి అయి ఉండాలని పంతులు అనగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. అది తన జాతకం అయితేనే కదా అని కార్తీక్ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : రేవతితో పాటు బాబు హ్యాపీ.. నిరాశగా రాజ్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -792 లో...కావ్యకి రాజ్ ప్రపోజ్ చేస్తాడు. కావ్య నాకు ఇష్టం లేదని చెప్తుంది. ఏదో క్లోజ్ గా మాట్లాడినంత మాత్రాన అలా మీరు ఉహించుకొని ఇలా చెయ్యడం కరెక్ట్ కాదని కావ్య అంటుంటే.. ఇంట్లో అందరు షాక్ అవుతారు. అలా  రాజ్ ని దూరం పెట్టేలా కావ్య మాట్లాడుతుంటే అపర్ణకి కోపం వచ్చి తనపైకి చెయ్ ఎత్తుతుంది. దాంతో రాజ్ ఆపుతాడు. మీరు తననే నెత్తిన పెట్టుకొని ఊరేగండి అని కావ్య అక్కడ నుండి వెళ్లిపోతుంది. కాసేపటికి రాజ్ బాధగా వెళ్ళిపోతాడు. మరొకవైపు రుద్రాణి యామినికి రుద్రాణి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్తుంది. నాకు చాలా హ్యాపీగా ఉందని యామిని అంటుంది. తన పేరెంట్స్ తో కూడా రాకుండా ప్రపోజ్ చేస్తే కావ్య వద్దని చెప్పిందట అని యామిని చెప్తుంది. ఆ తర్వాత రాహుల్ ఇంటికి వచ్చి ఆ అప్పు మిస్ అయిందని రుద్రాణికి చెప్తాడు. అది నిన్ను చూసిందేమో.. అందుకే కానిస్టేబుల్స్ నిన్ను అలా డైవర్ట్ చేశారని రుద్రాణి అంటుంది. కానీ ఇంట్లో ఇదంతా జరిగిందని మొత్తం చెప్పగానే రాహుల్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరొకవైపు బాబుని తీసుకొని రేవతి ఇంటికి వెళ్తుంది అప్పు. వాళ్లకు బాబూ అప్పగించి అప్పు వెళ్ళిపోతుంది. నేను తప్పిపోవడం బాగుంది అమ్మ.. తప్పిపోతేనే కదా మా ఫ్రెండ్ వాళ్ళింటికి తీసుకొని వెళ్ళింది.. నన్ను బాగా చూసుకుందని బాబూ చెప్తుంటే రేవతి మురిసిపోతుంది. ఆ తర్వాత రాజ్ డల్ గా వెళ్ళిపోతుంటే అపర్ణ, ఇందిరాదేవి వచ్చి మాట్లాడుతారు. అది అలా మాట్లాడింది కానీ నువ్వు అంటే ఇష్టమని రాజ్ తో ఇందిరాదేవి అంటుంది. తను వద్దంటే నాకు లైఫ్ లేదనిపిస్తుందని రాజ్ బాధపడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Jayam serial: రుద్రకి దొరికిన గంగ చెవికమ్మ.. అతను ఏం చేయనున్నాడు!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -19 లో......సూపర్ మార్కెట్ లో రుద్ర మీటింగ్ పెడతాడు. సేల్స్ ఎలా పెంచాలని రుద్ర వాళ్లకు గైడ్ చేస్తాడు. మరి ఈ మీటింగ్ కి గంగని ఎందుకు రమ్మన్నావవని రుద్రని పెద్దసారు అడుగుతాడు. గంగ బయటకు వెళ్లి వన్ ప్లస్ వన్ ఆఫర్ అంటూ బయటున్న కస్టమర్స్ ని లోపలికి పంపిస్తుంది. ఆ తర్వాత సరుకులు తీసుకొని గంగ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. నిన్ను చూసి సరుకులు ఇవ్వడానికి వచ్చానని అమ్మతో గంగ చెప్తుంది. అప్పుడే పైడిరాజు బండిపై వస్తాడు. అంతేకాకుండా వాళ్లకు బట్టలు కూడా తీసుకొని వస్తాడు. నువ్వేదో కొంపముంచే పనే చేసి ఉంటావని గంగ వాళ్ళ అమ్మ తిడుతుంది. నాన్న నా కోసం బట్టలు తీసుకొని వచ్చాడు అని గంగ అవి తీసుకుంటుంది. ఆ తర్వాత నువ్వు నాకొక మాట ఇవ్వాలని పైడిరాజు గంగతో అనగానే సరే అని గంగ అంటుంది. మరోవైపు ఆ రుద్ర రూమ్ ముందుగా గంగ వెళ్తుంటే తన చెవికమ్మ ఒకటి రుద్ర గదిలో పడిపోతుంది. రుద్ర స్నానం చేస్తుంటే గంగ తన గదిలోకి వచ్చి చెవికమ్మ కోసం చూస్తుంది. రుద్ర అంటే కోపం కాబట్టి ఒక పిల్లోని తీసుకొని రుద్ర అనుకొని కొడుతుంది. అప్పుడే వెనకాల నుండి ఎవరో వచ్చి గంగ భుజంపై చెయ్ వేస్తాడు. తీరా చుస్తే వీరు.. నువ్వు ఈ గదిలో ఎందుకున్నావంటూ పంపిస్తాడు. ఆ తర్వాత రుద్రకి గంగ చెవికమ్మ గుచ్చుకుంటుంది. ఎవరు నా గదిలోకి వచ్చారని అందరిని అడుగుతాడు. ఎవరు రాలేదని రుద్ర వాళ్ళ అమ్మ చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.