Karthika Deepam2 : దీప, కార్తీక్ లకి శివన్నారాయణ సాయం.. జ్యోత్స్న ప్లాన్ ఏంటంటే!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -422 లో.. జ్యోత్స్న పెళ్లి గురించి శివన్నారాయణ బాధపడుతుంటే దీప వచ్చి మీరేం బాధపడకండి ఇది కాకపోతే ఇంతకన్నా మంచి సంబంధం వస్తుంది. మీ మనవరాలికి పెళ్లి అయి మీరు ముని మనవళ్ళతో ఆడుకుంటారని దీప అంటుంది. దీప అనే ప్రతీ మాట నిజమవుతుందని దశరథ్ అంటాడు. అందరు కాసేపు ఇక్కడ నుండి వెళ్లిపోండి అని శివన్నారాయణ అంటాడు.. మరొకవైపు కుబేర్ ఫోటో చూస్తూ  అనసూయ బాధపడుతుంది. ఫోటో కింద పడిపోతుంటే అప్పుడే దీప వస్తుంది. రేపు మీ నాన్న ఆర్ధికమని అనసూయ అంటుంది. చేద్దామని  దీప అనగానే నువు చెయ్యకూడదు. మీ నాన్న ఎక్కాడో ఒక దగ్గర ఉన్నాడు.. నువ్వు ఈ పెంచిన నాన్నకి ఇలా చేస్తే కన్ననాన్నకి అరిష్టం.... అందుకే  నేను చేస్తానని అనసూయ అంటుంది. దీప బాధపడుతుంటే కార్తీక్ వచ్చి ఏమైందని అడుగుతాడు. ఇలా నేను చెయ్యకూడదంట అని దీప అనగానే ఏం కాదు నువ్వే చెయ్ అని కార్తీక్ చెప్తాడు. మరుసటిరోజు దీప, కార్తీక్ శివన్నారాయణ ఇంటికి వెళ్లి.. ఈ రోజు త్వరగా వెళ్ళిపోతాం.. రేపు రామని చెప్తారు. ఎందుకని జ్యోత్స్న అడుగుతుంది. రేపు అనసూయ గారి తమ్ముడి ఆర్థికమని కార్తీక్ అనగానే దీప వాళ్ళ నాన్న అనొచ్చు కదా అని పారిజాతం అంటుంది. వాళ్లకు రేపు డబ్బు అవసరం ఉంటుంది ఇచ్చి పంపించండి అని శివన్నారాయణ అంటాడు. మీరు రేపు అందరు రావాలని దీప అంటుంది. నాకు వర్క్ ఉందని శివన్నారాయణ అంటాడు. నేను సుమిత్ర వస్తామని దశరథ్ అంటాడు. నేను కూడా వస్తానని జ్యోత్స్న అంటుంది. నేను వస్తానని పారిజాతం అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : రేవతి కొడుకుని తీసుకొచ్చిన అపర్ణ.. షాక్ లో ఇందిరాదేవి!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -786 లో.....రేవతి కొడుకు  స్వరాజ్ ని చూస్తుంది అపర్ణ. నువ్వు ఇక్కడ ఉన్నావ్ ఏంటని బాబని అడుగుతుంది అపర్ణ. మా అమ్మ తప్పిపోయిందని బాబు అనగానే నువ్వు కరెక్ట్ గానే వెళ్తున్నావ్ అన్నమాట అని అపర్ణ అంటుంది. ఇప్పుడు మీ అమ్మ ఎక్కడ ఉందో ఎలా తెలుస్తుంది. మీ ఇల్లు ఎక్కడో తెలుసా అనీ అపర్ణ అడుగుతుంది. మా అమ్మ తీసుకొని వచ్చింది.. మీరు మా ఇంటికీ తీసుకొని వెళ్ళండి అని బాబు అంటాడు. నాకెలా తెలుసురా పోలీస్ స్టేషన్ కి వెళ్లి కనుకుందామని అపర్ణ అంటుంది. అదంతా దూరం నుండి కావ్య, రాజు, రేవతి చూస్తుంటారు. పోలీస్ స్టేషన్ అంటుందని రాజ్, కావ్య ఎంట్రీ ఇస్తారు. ఎవరు ఆ బాబు అని తెలియనట్లు అడుగుతారు. నా ఫ్రెండ్ అని అపర్ణ అంటుంది. వాళ్ళ అమ్మ కన్పించకపోతే పోలీస్ స్టేషన్ కి ఎందుకు.. మన ఇంట్లో అప్పుకి చెప్తే సరిపోతుంది కదా అని రాజ్ అంటాడు. వాళ్ళ అమ్మ కన్పించడం లేదని మీకెలా తెలుసని అపర్ణ అంటుంది.‌ అంటే మీరు మాట్లాడుకుంటుంటే విన్నామని రాజ్, కావ్య కవర్ చేస్తారు. రాజ్ కావ్య ప్లాన్ ప్రకారం బాబుని అపర్ణ తన వెంట తీసుకొని వెళ్తుంది. అదంతా రేవతి చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు రేవతి ఇక్కడే ఉంది.. తన పరిస్థితి ఏం బాగోలేదు.. డబ్బు ఇవ్వడానికి వెళ్తే నాకు వద్దు అమ్మ మనసులో చోటు కావాలని చెప్పిందంటూ సీతారామయ్యతో ఇందిరాదేవి చెప్తుంది. ఆ తర్వాత బాబుని తీసుకొని లోపలికి వస్తుంది అపర్ణ. బాబుని చూసి ఇంట్లో అందరు ఎవరు ఈ బాబు అని అడుగుతారు. తరువాయి భాగంలో స్వరాజ్ కి భోజనం తినిపిస్తుంది అపర్ణ. స్వరాజ్ ఆడుకుంటూ ఇందిరాదేవికి డాష్  ఇస్తాడు. తాతమ్మ అని స్వరాజ్ ఇందిరాదేవిని పిలవగా అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

జగతి మేడం ఎంత పని చేశారు.. ఇలా చూస్తుంటే గుండె పగిలిపోయింది

  జగతి మేడం.. ఈ పేరు వింటే గుప్పెడంత మనసు సీరియల్ గుర్తొచ్చేస్తుంది. రిషి తల్లిగా ఆడియన్స్ బాగా గుర్తుపెట్టుకున్నారు. అలాటి జగతి మేడం అలియాస్ జ్యోతి పూర్వాజ్ ఇప్పుడు కిల్లర్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇక జ్యోతి లుక్స్ చూస్తే వేరే లెవెల్ లో ఉన్నాయి. ఆమె హాట్ లుక్స్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. "శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాష్టర్ పీస్" వంటి మూవీస్ ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ పూర్వాజ్ డైరెక్షన్ లో ఈ కిల్లర్ మూవీ రాబోతోంది. పైగా ఆ డైరెక్టర్ జ్యోతి హజ్బెండ్ కూడా. వీళ్ళ కంబినేషన్ లో ఈ మూవీ రాబోతోంది. రీసెంట్ గా ఒక గ్లిమ్ప్స్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. "మౌనం మాట్లాడినప్పుడు ఈ రొమాంటిక్ సీన్ వస్తుంది. ప్రస్తుతం విఎఫ్ఎక్స్ పని జరుగుతోంది. చాల పవర్ ఫుల్ ఐన ఒక మూవీ రాబోతోంది. మేము రా, రియల్ , రివొల్యూషనరీ మూవీని తీసుకురాబోతున్నాం" అంటూ చెప్పింది. ఇక ఈ గ్లిమ్ప్స్ ని చూసిన నెటిజన్స్ ఐతే హాట్ కామెంట్స్ ని పోస్ట్ చేశారు. కొంతమందైతే "జగతి మేడం ఎంత పని చేశారు..ఒక సాంగ్ అన్నా రిలీజ్ చేయాల్సింది..మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్..గుప్పెడంత మనసులో అలా చూసి ఇప్పుడు ఇలా చూస్తుంటే గుండె పగిలిపోయింది...ఆమె తక్కువ టైంలోనే ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ వైపు ప్రయాణిస్తోంది...బిగ్ స్క్రీన్ మీద త్వరగా చూడాలని ఆశగా ఉంది " అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఇక కిల్లర్ సిరీస్ లో ఫస్ట్ పార్టీ "కిల్లర్ పార్ట్ 1  - డ్రీమ్ గర్ల్" రిలీజ్ కాబోతోంది. ఇందులో ఒక అద్దంలో రోబో కనిపిస్తుంది. మరో వైపు జ్యోతి ఒక చేత్తో కూరగాయల బుట్ట, మరో చేత్తో గొడ్డలి పట్టుకుని నిలబడి ఉంటుంది.

ఆప్షన్స్ ఎక్కువ కావడంతోనే..డివోర్స్ లు బాగా పెరిగాయి

  ఫ్యామిలీ స్టార్ షో ఈ వారం ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ముఖ్యంగా ఇందులో పెళ్ళైన వాళ్ళను, పెళ్లి కానీ వాళ్ళను తీసుకొచ్చారు. దాంతో ఇద్దరి మధ్య పెళ్లి ఎందుకు అవసరం, పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది, చేసుకోకపోతే ఏమవుతుంది అనే పాయింట్ మీద డిబేట్ జరిగింది. ఇక సుధీర్ కూడా పెళ్లి గురించి తన అభిప్రాయాన్ని చెప్పాడు. "మనం పెళ్లి చేసుకున్నాక ఎక్కడున్నావు ఎం తిన్నావు అని అడుగుతుంటే మనం రెస్ట్రిక్టెడ్ గా ఫీలవుతున్నాం కాబట్టే మనకు అది నచ్చట్లేదు. అదే మనం మన పార్టనర్ ని ప్రేమించడం స్టార్ట్ చేస్తే లైఫ్ చాల హ్యాపీగా ఉంటుంది. ఇక పెళ్లి విషయానికి వస్తే ఇంతకు ముందు ఉన్న జనరేషన్ లా ఈ జనరేషన్ లేదు. డివోర్స్ లు తీసుకోవడం ఎందుకు ఎక్కువగా పెరిగాయి అంటే ప్రతీ ఒక్కరికీ రకరకాల ఆప్షన్స్ అనేవి ఈజీగా అందుబాటులోకి వచ్చేసాయి. మొబైల్, సోషల్ మీడియా పెరిగాక అషన్స్ ఎక్కువైపోయాయి. దాంతో పార్టనర్ దగ్గర ఏదైతే దొరకదు దాన్ని ఆ ఆప్షన్ ద్వారా తీర్చుకునే అవకాశం ఎక్కువగా ఉంది. పెళ్లి చేసుకోవడంలో, చేసుకోకపోవడంలో మంచి చెడులు రెండూ ఉంటాయి. కానీ జీవితాన్ని మనం ఎలా చూస్తున్నాం అన్నదే ఇక్కడ ముఖ్యం..పెళ్లి ఐనా కాకపోయినా, చేసుకున్న, చేసుకోకపోయినా ఎప్పుడు ఎలా హ్యాపీగా ఉండాలంటే అలా ఉండొచ్చు " అంటూ సుధీర్ చెప్పుకొచ్చాడు. డాన్సర్ అభినయశ్రీ ఐతే పెళ్లి వద్దు అన్ని అలాగే రీతూ కూడా పెళ్లి కష్టం అన్న లెక్కలో చెప్పారు. కానీ కెవ్వు కార్తీక్, కృష్ణ కౌశిక్ మాత్రం పెళ్లి వేల్యూ గురించి చెప్పారు.  

ది గ్రేట్ యాక్టర్ నా కోటన్న..ఈ షోకి రావాల్సింది కానీ...

ఏ రిలేషన్ ఎలా ఫ్రెండ్ షిప్ అనే రిలేషన్ మాత్రం ఎప్పుడూ ఎవర్ గ్రీన్. అలాంటి ఫ్రెండ్ షిప్ డే వస్తున్న సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీ "స్నేహమంటే ఇదేరా" పేరుతో ఒక ఎపిసోడ్ ని ప్లాన్ చేసింది. ఆ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో బుల్లితెర సెలబ్రిటీస్ తో వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా ఇన్వైట్ చేశారు. అలాగే గెస్ట్ గా బాబు మోహన్ వచ్చారు. "మీకు ఒక బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు. ఆయన్ని, మిమ్మల్ని కలిపి ఈరోజు పిలుద్దామని అనుకున్నాం. పిలవాల్సింది కానీ" అంటూ రష్మీ ఆగిపోయింది. ఇక బాబు మోహన్ ముఖంలో ఒక వేదన కనిపించింది. అది ఎవరి గురించో కాదు అందరికి తెలిసిన సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు గురించే. "ది గ్రేట్ యాక్టర్ కోటన్న . నా కోటన్న" అంటూ చెప్పు కొచ్చారు. ఇక వెనకాల బాబుమోహన్ - కోట కలిసి చేసిన మూవీ సీన్స్ ని ప్లే చేశారు. అలాగే కోట చనిపోయినప్పుడు చిరంజీజీవి వెళ్లిన పిక్స్ ని కూడా చూపించారు. ఆటో రాంప్రసాద్ వచ్చి "హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే సర్" అంటూ బాబు మోహన్ ని విష్ చేసాడు. ఆయన కూడా రిటర్న్ లో హ్యాపీ ఫ్రెండ్ షిప్ చెప్పారు. "మీ ఫేమస్ డైలాగ్ చెప్పండి" అని రాంప్రసాద్ అడిగేసరికి "అరేయ్ కేశవా. నాది చూసావా" అని అడిగేసరికి నాటి నరేష్ సిగ్గు పడిపోయాడు. ఇక శ్రీకర్ కృష్ణ వాళ్ళ ఫ్రెండ్ ని తీసుకొచ్చి తనకు ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఒక్క ఫోన్ చేస్తే వెంటనే కళ్ళ ముందు ఉంటాడని చెప్పుకొచ్చాడు. తర్వాత మానస్ తన ఫ్రెండ్ ని పరిచయం చేసాడు. "మా స్కూల్ లో యాక్టివిటీస్ ఐతే ఏమీ ఉండవు" అని చెప్పాడు వాళ్ళ ఫ్రెండ్. "అవుట్ సైడ్ యాక్టివిటీస్ ఉండేవి" అని మానస్ చెప్పేసరికి "ఎలాంటి యాక్టివిటీస్" అని అడిగింది రష్మీ. "అంటే అరేయ్ మావ ఎక్ పెగ టైపు" అన్నట్టుగా ఫేస్ పెట్టాడు.

రోజాని బాడీ షేమింగ్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు అడ్డుకోలేదు

జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ పొలిటిషన్స్ మీద హాట్ కామెంట్స్ చేసాడు. ఒక ఇంటర్వ్యూలో యాంకర్ కి రాకేష్ మధ్య ఈ హాట్ డిస్కషన్ జరిగింది. "జబర్దస్త్ లో ఎవరికి ఏ ఆపద వచ్చినా తీర్చే వ్యక్తి ముందుండే వ్యక్తి రోజా గారు" అని చెప్పాడు రాకేష్. ఒకప్పుడు జబర్దస్త్ లో నాగబాబు, రోజా జడ్జెస్ గా ఉండేవాళ్ళు. తర్వాత ఈ షోలో జడ్జెస్ మారిపోయారు. పాలిటిక్స్ లో ఉన్న కారణంగా రోజా కొంతకాలం షోస్ కి దూరంగా ఉంది. అలాగే నాగబాబు కూడా. ఐతే ఇటీవల రాకేష్ రోజా మీద, పవన్ కళ్యాణ్ మీద చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. "అలాంటి రోజా గారినే జబర్దస్త్ లో పెర్ఫార్మ్ చేస్తూ ఇక్కడి నుంచి బయటకు వెళ్లిపోయిన తర్వాత రోజా గారిని అన్నప్పుడు మీకు కోపం రాలేదా" అంటూ యాంకర్ అడిగింది.   "ఆవిడ దగ్గర మనం ఉన్నావ్, తిన్నావు, ఆవిడ నీడలో ఉన్నాం..వద్దురా తప్పురా అలా మాట్లాడ్డం.." అన్నా. "డబ్బులు కోసం" అంటారా అనేసరికి "దేని కోసం చేస్తున్నారో పాపం హెల్త్ బాలేకనో ఏమో" అంటూ కామెంట్ చేసాడు రాకేష్. "ఆడపిల్లలకు అన్యాయం జరిగితే ఊరుకోను, ఒప్పుకోను అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా" అని యాంకర్ అడిగేసరికి "అన్నారా ఆయన" అంటూ రాకేష్ కౌంటర్ వేసాడు. "ఏ ఆడబిడ్డకు అన్యాయం జరిగినా నేను అక్కడ ఉంటాను అది ఇది అని అంటారు కదా మరి రోజా గారిని అలా బాడీ షేమింగ్ గా మాట్లాడుతున్నప్పుడు ఎందుకు స్టాప్ చెయ్యట్లేదు" అంటూ యాంకర్ అడిగారు. దానికి రాకేష్ "మహిళలుగా ఆ విషయం మీరే అడగాలి" అన్నాడు రాకేష్. "నేను పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్ ని" అంటూ యాంకర్ అడిగేసరికి "నేను కాదు నేను కాదు" అంటూ కౌంటర్ ఇచ్చాడు రాకేష్. ఈ ప్రోమో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.  

Jayam serial : పెద్దసారు ఇంటికి వెళ్లిన గంగ.. తనని రుద్రా అంగీకరిస్తాడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్నా సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -13 లో......గంగ బియ్యం బస్తాలు మోస్తుంటే రుద్ర వాళ్ళ పెద్దనాన్న చూస్తాడు. మీరు ఇక్కడ ఏంటి పెద్దసారు అని గంగ అడుగుతుంది. అయిన నువ్వు బస్తాలు మోయడం ఏంటని అతను అడుగుతాడు. మా నాన్న అప్పు తీర్చడానికి అని జరిగిందంతా గంగ చెప్తుంది. అలాంటప్పుడు నన్ను అడగాలి కదా అని పెద్దసారు అంటాడు. నేను పని చేసే రుద్ర సర్ దగ్గరికి వెళ్లి అడ్వాన్స్ అడిగాను ఇవ్వలేదని గంగ చెప్తుంది. ఆ డబ్బు నేను ఇస్తాను కానీ నువ్వు మాత్రం ఇక ఇవి మోయకు అని అంటాడు. మరొకవైపు పైడి రాజుకి అప్పు ఇచ్చిన వాళ్ళు ఇంట్లో సామాను అంతా తీసుకొని వెళ్తుంటారు. ఈ సామాను అమ్మితే మీ అప్పు కంటే ఎక్కువ డబ్బు వస్తుంది. మీరు తీసుకోగ మిగిలిన డబ్బు నాకు ఇవ్వండి అని పైడిరాజు అంటాడు . ఆ తర్వాత గంగ పెద్దసారుతో కలిసి ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చేసరికి సామాను అంత కింద పడేసి ఉంటుంది. అది చూసి ఏమైందని వాళ్ళ అమ్మని అడుగుతుంది. గంగ వాళ్ళ అమ్మ జరిగింది మొత్తం చెప్తుంది. గంగ చేతులు బొబ్బలు వస్తాయి. ఏమైందని వాళ్ళ అమ్మ అడుగగా బియ్యం బస్తాలు మోసిందని పెద్దసారు చెప్తాడు. ఇక నువు మా కోసం కష్టపడకు నీ దారి నువ్వు చూసుకోమని వాళ్ళ అమ్మ అంటుంది. గంగని మా ఇంటికి తీసుకొని వెళ్తానని పెద్దసారు అనగానే వాళ్ళ అమ్మ సరే అంటుంది. రుద్ర సారు ఒప్పుకోరని గంగ అనగానే నేను ఒక్కరోజులో అన్ని సర్దుబాటు చేస్తానని పెద్దసారు చెప్తాడు. మరుసటి రోజు నేను సూపర్ మార్కెట్ లో పని చేస్తూనే పెద్దసారు వాళ్ళ ఇంట్లో ఉంటానని గంగ తనతో వర్క్ చేసే వాళ్ళకి చెప్తుంది. అప్పుడే రుద్ర వచ్చి..  ఏంటి ఈ మీటింగ్, మాట్లాడితే జీతం కట్ చేస్తానని గంగకి వార్నింగ్ ఇస్తాడు. అప్పుడే పెద్దసారు సూపర్ మార్కెట్ కి వస్తాడు. తరువాయి భాగం లో పెద్దసారు గంగని తీసుకొని ఇంటికి వెళ్తాడు. గంగ సూపర్ మార్కెట్ లో ఉండడం ఇష్టం లేదు.. అలాంటిది ఇంట్లో ఉంటే రుద్ర ఎలా ఒప్పుకుంటాడని ఇంట్లో వాళ్ళు అంటారు. అప్పుడే రుద్ర ఇంట్లోకి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu : శ్రీవల్లికి జలక్ ఇచ్చిన ప్రేమ.. తన పెత్తనం కరెక్టేనన్న రామరాజు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -222 లో......ధీరజ్ లేట్ గా వస్తాడని చెప్పినా కూడా వినకుండా శ్రీవల్లి డోర్ వేస్తుంది. ప్రేమ కూడా గుమ్మం దగ్గరే ఉంటుంది. ధీరజ్ రాగానే శ్రీవల్లి అక్క గడియ పెట్టిందని చెప్తుంది. ఇప్పుడేల ఆకలిగా ఉందని ధీరజ్ అంటాడు. దాంతో కాయిన్ తో కిటికీ ఓపెన్ చేసి ఇద్దరు లోపలికి వెళ్తారు. మరుసటి రోజు ఉదయం శ్రీవల్లి డోర్ తీస్తుంది. పాపం వాళ్ళు రాత్రంతా బయటే ఉన్నారని హ్యాపీగా ఫీల్ అవుతుంది. వీళ్ళు ఎక్కడ అని చూస్తుంది. వాళ్ళు లోపలే ఉంటారు. మీరు లోపలికి ఎలా వచ్చారని ప్రేమని శ్రీవల్లి అడుగుతుంది. ఏమో మర్చిపోయా అని ప్రేమ సమాధానం చెప్తుంది. వీళ్ళు ఎలా వచ్చారని శ్రీవల్లి ఆలోచిస్తూ కిటికీ పట్టుకుంటుంది. అది ఉడిపోయి శ్రీవల్లి కిందపడుతుంది. వాళ్ళు వచ్చింది ఇలానా అని శ్రీవల్లి అందరిని పిలిచి జరిగింది చెప్తుంది. నేను లేట్ అయిందని డోర్ వేస్తే వాళ్ళు కిటికీ తీసుకొని మరీ లోపలికి వచ్చారని రామరాజుతో అంటుంది. నేనేం చేసిన వాళ్లకు అర్ధం అవడం లేదు.. నేను నీలా లేకనే ఇలా తయారయింది. నువ్వు బాగా చేస్తున్నావ్.. నీ ఇష్టం అని శ్రీవల్లితో రామరాజు అనగానే ఇక శ్రీవల్లి రెక్కలు వచ్చినట్లు రెచ్చిపోతుంది. ప్రేమ వాళ్ళు అలా వచ్చినందుకు శ్రీవల్లి వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తుంది. తరువాయి భాగం లో అందరు భోజనం చేస్తుంటే మిగతా వాళ్ళు ఎక్కడ అని రామరాజు అడుగుతాడు. ప్రేమ, నర్మదలని భోజనానికి పిలుస్తాడు రామరాజు. మావయ్య గారు వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఏంటని శ్రీవల్లి అనుకుంటుంది. వాళ్ళు కూడా భోజనం చేస్తుంటే మిమ్మల్ని అంత మంది చొక్కా చింపారు. అది గుర్తుకి వస్తే అన్నం తినాలనిపించడం లేదని శ్రీవల్లి కావాలనే గుర్తుచేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : శివన్నారాయణ బాధకి కారణం అదే.. దాస్ ని రిక్వెస్ట్ చేసిన జ్యోత్స్న!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -421 లో... శివన్నారాయణ ఇంట్లో దాస్ భోజనం చేసి.. నాకు ఈ అవకాశం కల్పించినందుకు థాంక్స్ అని దాస్ అంటాడు. నీకు ఎప్పుడు రావాలనిపించనా నువ్వు మొహమాటాం లేకుండా రా అని శివన్నారాయణ చెప్పగానే పారిజాతంతో పాటు దాస్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక నేను వెళ్తానని అక్కడ నుండి దాస్ వెళ్తాడు. దాస్ కి గతం గుర్తు వచ్చింది కదా.. నా కూతురు ఎందుకు కొట్టిందో అడగాలని, దాస్ ని పిలిచి ఆగమని నిన్ను ఎవరు కొట్టారని దశరథ్ అడుగుతాడు దాస్ అప్పుడే నిజం చెప్పకని కార్తీక్ చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకొని నాకేం గుర్తు లేదు అన్నయ్య అంటాడు. అదంతా జ్యోత్స్న చూస్తుంటుంది. అప్పుడే దాస్ దగ్గరికి పారిజాతం వచ్చి అడగడం మర్చిపోయా.. నిన్ను ఎవరు కొట్టారని అడుగుతుంది. మర్చిపోయాను అమ్మ అని దాస్ చెప్పి వెళ్ళిపోతాడు. వెంటనే జ్యోత్స్న దాస్ వెనకాలే వెళ్లి అతనితో మాట్లాడుతుంది. నాన్న నా గురించి నువ్వు చెప్పాలనుకున్నా, చెప్పకుండా ఆగిపోమని రిక్వెస్ట్ చేస్తుంది. నువ్వు ఒకవేళ చెప్తే నేను ఉండనని బ్లాక్ మెయిల్ చేస్తుంది. చెప్పను కానీ అది నువ్వు తప్పు చెయ్యనంత వరకే అని జ్యోత్స్నతో అంటాడు దాస్. ఆ తర్వాత శివన్నారాయణ తన భార్య తాళి బొట్టు పట్టుకొని బాధపడతాడు. అప్పుడే దీప వచ్చి అతను మంచివాడు కాదని తెలిసినప్పుడు జరగనందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా అని దీప అంటుంది. అప్పుడే జ్యోత్స్న కూడా వస్తుంది. ఇది నా భార్య తాళి.. జ్యోత్స్నకి కాబోయే వాడితో తన మెడలో ఇది కట్టించాలనుకున్న కానీ ఇలా జరిగిందని శివన్నారాయణ బాధపడుతాడు. మీరు అనుకున్నది జరుగుతుంది. మీరేం ఆలోచించకండి అని శివన్నారాయణతో చెప్తుంది దీప. అప్పుడే దశరథ్ వచ్చి దీప చెప్పింది నిజం అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : రుద్రాణి చెంపచెల్లుమనిపించిన ఇందిరాదేవి.. వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయ్యేనా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -785 లో.....రాజ్, కావ్య, ఇందిరాదేవి, రేవతి వాళ్ళు మాట్లాడుకుంటారు. అన్ని విషయాలు మీ అమ్మతో చెప్పే నువ్వు.. నీ ప్రేమ విషయం దాచి డైరెక్ట్ పెళ్లి చేసుకొని వచ్చావని రేవతితో అంటుంది ఇందిరాదేవి. ఆ రోజు రుద్రాణి అత్తయ్య సలహా వల్ల అలా చెయ్యాలిసి వచ్చిందని రేవతి అంటుంది. మేమ్ ఒకసారి మాట్లాడుకుంటుండగా రుద్రాణి అత్త చూసి మీరు ఇద్దరు పెళ్లి చేసుకొని రండి అప్పుడు మీ వాళ్ళు తప్పక ఆక్సెప్ట్ చేస్తారని చెప్పిందని రేవతి చెప్తుంది. అందుకే ఇలా చేసానని రేవతి చెప్పగానే ఆ రుద్రాణి వల్లే ,నీకు ఈ పరిస్థితి వచ్చిందని కావ్య ఇందిరాదేవి ఇద్దరు తనపై కోపంగా ఉంటారు. మరొకవైపు రుద్రాణి పాటలు పెట్టుకొని డాన్స్ చేస్తుంది. మమ్మీ ఏం చేస్తున్నావ్ ఇలా హ్యాపీగా ఫీల్ అవుతే ఇందులో మన హస్తం ఉందనుకుంటారని రాహుల్ అంటాడు. ఆ రోజు నేనే రేవతిని పెళ్లి చేసుకోమని చెప్పి ఈ ఇంటికి దూరం చేసాను.. ఇక రాజ్ ని యామినికి దగ్గర చేసి ఈ ఇంటికి దూరం చేస్తే ఆస్తులు మనవి అవుతాయని రుద్రాణి అంటుంది. అప్పుడే ఇందిరాదేవి వచ్చి రుద్రాణి చెంపచెల్లుమనిపిస్తుంది. ఎందుకు కొట్టావని రుద్రాణి అడుగుతుంది. పదిహేను సంవత్సరాల క్రితం చేసిన తప్పుకి అని ఇందిరాదేవి అంటుంది. ఆ తర్వాత రేవతి ఇంటికి పిలిస్తే కలుస్తారని రాజ్ ప్లాన్ చెప్పినందుకు రాజ్ పై కావ్య కోపంగా ఉంటుంది. మళ్ళీ రాజ్, కావ్య ఒక ప్లాన్ చేస్తారు. వాళ్ళని గుళ్లో ఎదురుపడేలా చెయ్యాలని చెప్తాడు. దానికి కావ్య సరే అంటుంది. కావ్య, ఇందిరాదేవి ప్లాన్ చేసి అపర్ణ గుడికి వెళ్లేలా చేస్తారు. రాజ్ రేవతి ఇంక బాబు వెళ్లేలా చేస్తాడు. తరువాయి భాగంలో రేవతి బాబు స్వరాజ్ ని అపర్ణ గుడి నుండి ఇంటికి తీసుకొని వస్తుంది. ఈ బాబు గుళ్లో తప్పిపోయి కన్పించాడని అపర్ణ అనగానే.. ఈ బాబుని ఎక్కడో చూసానని స్వప్న, అప్పు అంటుంటే ఎక్కడ చెప్పేస్తారో అని రాజ్, కావ్య టెన్షన్ పడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ఏఐ వీడియో రూపంలో కీర్తి భట్ కి బర్త్ డే విషెస్ చెప్పిన తండ్రి

  సుమ అడ్డా షో ఈ వారం ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ఇందులో మూడు జంటలు వచ్చాయి.. నీలిమ-శేఖర్, కీర్తి భట్ - విజయ్ కార్తీక్, రాకింగ్ రాకేష్ - సుజాత వచ్చారు. ఇందులో వీళ్లకు రకరకాల టాస్కులు ఇచ్చి ఆడించింది సుమ. తర్వాత కీర్తికి ఒక సడెన్ సర్ప్రైజ్ ఇచ్చారు కార్తిక్. కీర్తి పుట్టినరోజు సందర్భంగా ఆమె తండ్రి వీడియో ఒక దానికి ఏఐ వీడియో రూపంలో తీసుకొచ్చి స్టేజి మీద ప్లే చేసాడు. "హ్యాపీ బర్త్ డే కుట్టిమా..వంద కాలాల పాటు నువ్వు హ్యాపీగా ఉండాలి తల్లి. మేము నీతో లేము అని అనుకోకు. నీ ప్రతీ అడుగులో మేము నీతో ఉన్నాము. ఇంకా అలాగే అల్లరి చేస్తున్నావా. అలాగే ప్రేక్షక దేవుళ్ళారా మా ఇంటి అమ్మాయిని మీ ఇంటి అమ్మాయిలా చూసుకుంటున్నందుకు మీకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. జాగ్రత్త కుట్టిమా. హ్యాపీ బర్త్ డే మరో సారి" అంటూ ఆ వీడియోలో వాళ్ళ నాన్న లైవ్ లో మాట్లాడుతున్నట్టే క్రియేట్ చేసి పెట్టారు. ఆ వీడియో వింటూ చూస్తూ కీర్తి భట్ ఏడ్చేసింది. ఇక సుమా ఆ వీడియో చూసి "నీకు చాలా గ్రేట్ పార్టనర్ దొరికారు. రీప్లేస్ చేయలేకపోవచ్చు కానీ ఆ ప్రేమనంతా అందిస్తూ ఉన్నాడు ..మా కీర్తిని జాగ్రత్తగా చూసుకో" అంటూ కార్తీక్ కి చెప్పింది. కీర్తి ఐతే థాంక్యూ అంటూ కార్తీక్ కి చెప్పి హగ్ చేసుకుని ముద్దు పెట్టింది. ఇక కార్తీక్ ఐతే ఒక కేక్ తెప్పించాడు. దాన్ని కట్ చేసిన కీర్తి అక్కడ అందరికీ తినిపించింది.

పవన్ కళ్యాణ్ ఒక్కరే ట్రైబల్ కల్చర్ ని బతికేస్తున్నారు...

  శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఈ వీక్ ట్రైబల్ థీమ్ తో ఎపిసోడ్ రన్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కి కొమ్ము కోయ ట్రైబల్ స్పెషల్ డాన్స్ చేయడానికి భద్రాచలం రమేష్ ట్రూప్ వచ్చి ఎంటర్టైన్ చేసింది. ఇక ఆది ఈ ట్రైబల్ డాన్స్ అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ఎంత ఇష్టమో కూడా చెప్పుకొచ్చాడు ఈ షోలో. "ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చిన ఇంతమంది ఈ కొమ్ము కోయ ట్రైబల్ డాన్స్ కళను బతికించడం  మామూలు విషయం కాదు. రాజకీయ నాయకులు స్టేజి పెట్టినప్పుడు వచ్చిన జనాలు వెనక్కి వెళ్లకుండా రికార్డింగ్ డాన్స్ లు అవీ పెడతారు. కానీ ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఏదన్నా పొలిటికల్ స్టేజిలు అవీ పెట్టినప్పుడు ఫస్ట్ ఇలాంటి వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళతో ఒక కార్యక్రమం చేశాకే ఆయన మీటింగ్ స్టార్ట్ చేస్తారు. రణస్థలంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన కూడా వీళ్ళతో కలిసి డాన్స్ చేసారు. ఆయన డాన్స్ చేయడం మాకు హ్యాపీ అనిపించింది. ఆయన డిప్యూటీ సీఎం ఐన వెంటనే ఫస్ట్ రోడ్ వేయడం స్టార్ట్ చేసింది అక్కడే. ఆ ఊరి వాళ్లకు వేసుకోవడానికి చెప్పులు కూడా లేకపోతె ఆయనే ఆ ఊరు మొత్తానికి చెప్పులు కొని పంపించారు. ఇలాంటి కళను ఎంకరేజ్ చేసే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి పాలిటిక్స్ లో ఉండడం మనందరి అదృష్టం. ఆయన కొడుకు మార్క్ శంకర్ సింగపూర్ లో వాళ్ళ స్కూల్ లో ఫైర్ ఆక్సిడెంట్ ఐనప్పుడు పవన్ కళ్యాణ్ కన్నీళ్లు పెట్టుకోవాల్సిన టైములో ఇలాంటి ట్రైబల్ ఏరియాకి వెళ్లి వాళ్ళ కన్నీళ్లు తుడిచాకే సింగపూర్ వెళ్లారు. అలాంటి గొప్ప మనిషి పవన్ కళ్యాణ్ గారు." అంటూ చెప్పాడు ఆది.  

నాకు లైఫ్ ఇచ్చింది రాకెట్ రాఘవ...ఆర్టిస్ట్ గా గుర్తింపు ఇచ్చింది జబర్దస్త్

  జబర్దస్త్ ఒక కామెడీ షో మాత్రమే కాకుండా ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. రైటర్స్ , ఆర్టిస్టులకు మంచి అవకాశం వచ్చింది. ఆ జబర్దస్త్ కారణంగానే సుధీర్, గెటప్ శీను, బులెట్ భాస్కర్, ఇమ్మానుయేల్, రాకింగ్ రాకేష్ ఇలాంటి వాళ్లంతా కూడా ఈ షో ద్వారా బాగా ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు. ఇక బులెట్ భాస్కర్ మొదట్లో రైటర్ గా స్టార్ట్ అయ్యి తర్వాత ఆర్టిస్ట్ అయ్యాడు. ఇప్పుడు టీమ్ లీడర్ అయ్యాడు. అలా తన ఎక్స్పీరియన్స్ ని తన జబర్దస్త్ జర్నీని తన మాటల్లోనే..."రాకెట్ రాఘవ గారిని నేను జీవితంలో మరిచిపోలేని వ్యక్తి. జబర్దస్త్ 2013  ఆగష్టులో అలా స్టార్ట్ అయ్యింది. నాకు అప్పటికి ఏమీ తెలీదు. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే దానికి కారణం రాఘవ గారు. ఆయన ఆ మాట ఒప్పుకోరు గాని నేను ఒప్పుకోవాలి. మనం లైఫ్ లో ఎవరినైనా మర్చిపోవచ్చు కానీ మనకు సాయం చేసిన వాళ్ళను మర్చిపోకూడదు. నాకు కొంచెం రైటింగ్ నాలెడ్జ్ ఉందని చేపి రాఘవ గారు నన్ను వెతుక్కుంటూ వచ్చి నాకు ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. ఒక రైటర్ గా ఒక ఆర్టిస్ట్ గా ఫస్ట్ ఆయన స్కిట్ లోనే చేసాను. చేసింది 2 , 3 స్కిట్స్ ఐనా కానీ అసలు గుర్తింపు అంటూ లేని నాకు మంచి గుర్తింపును తెచ్చాయి. ఆ తర్వాత చంటి గారి టీమ్ లోకి వెళ్లాను. ఆయన దగ్గర కూడా స్కిట్స్ రాసాను. ఒక రైటర్ గా, ఒక ఆర్టిస్ట్ గా కూడా అక్కడ నాకు మంచి పేరు వచ్చింది. 2016 జనవరిలో నేను టీమ్ లీడర్ ని అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు టీమ్ లీడర్ గా కంటిన్యూ అవుతూనే ఉన్నాను." అంటూ చెప్పుకొచ్చాడు బులెట్ భాస్కర్.  

బిగ్ బాస్ అగ్నిపరీక్షకు హోస్ట్ శ్రీముఖి..ఆగష్టు 17 నుంచి ప్రసారం..

  బిగ్ బాస్ లేటెస్ట్ అప్ డేట్స్ చాలా వస్తున్నాయి. కామన్ మ్యాన్ ఎవరు వెళ్తారు ఎంతమంది వెళ్ళబోతున్నారు. అలాగే కంటెస్టెంట్స్ ఎవరు అనే టాక్ కూడా బాగా నడుస్తోంది. ఐతే కామన్ మ్యాన్ కోసం ఎంట్రీస్ ని పిలిచింది బిగ్ బాస్ టీమ్. ఇక ఇప్పుడు కామన్ మ్యాన్ కేటగిరిలో ఎవరు వెళ్తారు అనే ప్రాసెస్ నడుస్తోంది. ఐతే ఇప్పుడు ఇంకో లేటెస్ట్ అప్ డేట్ బయటకు వచ్చింది. అదే బిగ్ బాస్ అగ్ని పరీక్ష కోసం శ్రీముఖి హోస్ట్ గా రాబోతోందట. ఇక నటుడు శివాజీ, విజె సన్నీ, అభిజీత్ జడ్జెస్ గా రాబోతున్నట్టు తెలుస్తోంది.   ఇక ఈ అగ్నిపరీక్ష అనేది ఆగష్టు 17 నుంచి ప్రారంభం కాబోతోంది అన్న విషయం తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 9 సెప్టెంబర్ 7 నుంచి జియో హాట్ స్టార్ లో కూడా స్ట్రీమ్ కాబోతోంది. ఇక బుల్లితెర సెలబ్రిటీస్, సోషల్ మీడియా సింగర్స్, వంటి వాళ్ళు చాలామంది రాబోతున్నారు. ఇక ఈ సీజన్ లో జబర్దస్త్ ఇమ్మానుయేల్, సీరియల్ నటి తేజస్విని గౌడ, నవ్యస్వామి, హీరో సుమంత్ అశ్విన్, డెబ్జానీ, నటుడు సాయి కిరణ్, రీతూ చౌదరి, చిట్టి పికిల్స్ అలేఖ్య  వంటి వాళ్లంతా పాల్గొనబోతున్నారనే విషయం తెలుస్తోంది. బిగ్ బాస్ ఈ సీజన్ ని దుమ్ము రేపెలా డిజైన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. అలాగే కొత్త కొత్త చేంజెస్ ని కూడా చేయబోతున్నట్టు తెలుస్తోంది.

ఇండస్ట్రీకి కొత్త లిటిల్ సింగర్...

  బిగ్ బాస్ సీజన్ 5 లో విశ్వ చేసిన సందడి, ఆడిన టాస్కులు ఎవరూ మర్చిపోరు. విశ్వా ఒక ఫిట్నెస్ ఫ్రీక్. అలాగే మూవీస్ లో నటిస్తూ ఉంటాడు. బుల్లితెర మీద షోస్ లో రెగ్యులర్ గా కనిపిస్తూ ఉంటాడు. ఇన్స్టాగ్రామ్ లో ఐతే చెప్పక్కర్లేదు. ఫుల్ రీల్స్ , జిమ్ వీడియోస్ తో ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. ఇక రీసెంట్ గా తనతో పాటు తన సుపుత్రుడిని కూడా వెంట షోస్ కి తీసుకొస్తున్నాడు.    విశ్వా కుమారుడి పేరు ర్యాన్. ఈ పిల్లాడి అల్లరి చెప్పక్కర్లేదు. అంజలి - పవన్ వాళ్ళ అమ్మాయి చందమామకు మంచి స్నేహితుడు. టాస్కుల్లో ఆమెను గెలిపిస్తూ హ్యాపీగా ఉంటాడు. ఇక రీసెంట్ గా ర్యాన్ సింగింగ్ కూడా స్టార్ట్ చేసాడు. తనలో మంచి సింగర్ ఉన్నాడని గుర్తించిన విశ్వా ఒక మంచి పాటను పాడించారు స్టూడియోలో.    "అందం అమ్మాయైతే నీలా ఉందా" అనే అందమైన పాటని ఈ చిన్నారి ర్యాన్ పాడుతుంటే అద్భుతంగా ఉంది. ఇక ఫైనల్ లో "నేను సింగింగ్ ని ప్రాక్టీస్ చేస్తున్న. మరి నా సింగింగ్ ప్రాక్టీస్ ఎలా ఉందో కామెంట్స్ చెప్పండి" అని అన్నాడు. అంతే నెటిజన్స్ ఐతే "సూపర్ వాయిస్, సో క్యూట్ సింగర్..చందమామ కోసమా ఈ సాంగ్. నీ వాయిస్ ఇంకా వినాలనిపిస్తోంది. సూపర్ చిన్నా...గాడ్ బ్లేస్ యు" అంటూ విషెస్ చెప్తున్నారు.    ఈ మధ్య కాలంలో పేరెంట్స్ తో పాటు వాళ్ళ పిల్లలు కూడా షోస్ కి వస్తున్నారు. బుల్లితెర నటి శ్రీవాణి వాళ్ళ అమ్మాయి నందిని ఢీ 20 లో కంటెస్టెంట్ గా చేస్తోంది. అలాగే రాఘవ వాళ్ళ అబ్బాయిని మురారిని జబర్దస్త్ స్కిట్స్ కి తీసుకొస్తూ ఉంటాడు. ఇక విశ్వా తన కొడుకు ర్యాన్ ని అలాగే అంజలి- పవన్ వాళ్ళ అమ్మాయి చందమామను, ఇంకా సమీరా భరద్వాజ్ వాళ్ళ అమ్మాయిని కూడా షోస్ కి తీసుకొస్తూ ఉంటారు.  

అరుణాచలంలో ఆట సందీప్ క్రేజ్!

  ఆట సందీప్, అతని వైఫ్ జ్యోతి రాజ్ సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతున్నారు. భర్త-భార్య ఎలా అండర్ స్టాండింగ్ తో ఉండాలి అని జ్యోతి చెప్పిన రీల్ బాగా వైరల్ అయ్యింది. అలాగే సందీప్ నేర్పే డాన్స్ స్టెప్స్ తో చాలామంది డాన్స్ కూడా నేర్చుకుంటున్నారు. రీసెంట్ గా సందీప్ ఒక రీల్ ని ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు.    "హలో ఆల్ ..చాలామంది నాకు అరుణాచలం గురించి వాట్సాప్ చేస్తూ ఉన్నారు. ఆటో మీద నా పిక్స్ పెట్టుకున్నారంట. వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారో నాకు తెలీదు..లవ్ యు సందీప్ మాష్టర్. లవ్ యు సందీప్ అన్నా అంటూ ఆటోల మీద స్టిక్కర్స్ ఉన్నాయంట. వాటిని ఫొటోస్ తీసి నాకు పంపిస్తున్నారు. వాళ్లకు రియల్లీ థ్యాంక్స్ . నేను అరుణాచలం ఒక్కసారే వెళ్లాను. శివుడి మాల వేసుకుని గిరి ప్రదక్షిణ చేసాను. నాకు, జ్యోతికి లైఫ్ లో చాలా చాలా చేంజెస్ ఉన్నాయి. మేము చాల సంతోషంగా ఉన్నాము. తప్పకుండా ఎవరన్నా అరుణాచలం వెళ్ళాలి అనుకుంటే ఒక్కసారన్నా వెళ్లి రండి. మీ జీవితంలో చాల మార్పులు వస్తాయి. ఆటో అన్నలందరికీ చాలా థ్యాంక్స్ ..ఎందుకు నా ఫోటో పెట్టుకున్నారో కానీ నేను చాల హ్యాపీగా ఉన్నాను. ట్యాగ్ చేస్తున్న ప్రతీ ఒక్కరికీ చాలా థ్యాంక్స్. లవ్ యు ఆల్..ఓం నమఃశివాయ. తప్పకుండా అరుణాచలం వెళ్లి విజిట్ చేయండి." అంటూ చెప్పాడు సందీప్.    సందీప్ రీసెంట్ గా ఒక డాన్స్ స్కూల్ స్టార్ట్ చేశారు. అలాగే బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ గా వెళ్లారు. ఇక నీతోనే డాన్స్ రియాలిటీ షోలో విన్ అయ్యారు సందీప్ మాష్టర్.    

Jayam serial : తాగేసి వచ్చి గొడవ చేసిన నాన్న.. కూతురు ఆ అప్పు తీర్చగలదా!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -12 లో... రుద్రని దెయ్యం బొమ్మ లాగా గీసిన పేపర్ రుద్ర క్యాబిన్ లో ఉండడంతో ఎక్కడ అది చూస్తాడేమోనని గంగ టెన్షన్ పడుతూ తన క్యాబిన్ కి వెళ్తుంది. రుద్ర తనని చూడకుండా లోపలికి రమ్మంటాడు. ఆ బొమ్మ ఉన్న పేపర్ ని తీసుకొని వెళ్ళబోతుంటే రుద్ర చూసి నిన్ను ఎవరు లోపలికి రమ్మన్నారని కోప్పడుతాడు. మీరే కదా రమ్మన్నారని గంగ అంటుంది. నువ్వు ఇచ్చిన డబ్బు అక్కడ ఉంది తీసుకొని వెళ్ళు అని రుద్ర అనగానే డబ్బు కింద పేపర్ ఉంది కదా అని డబ్బుతో పాటు పేపర్ తీసుకుంటుంది గంగ. ఈ పేపర్ నాది అని రుద్ర లాక్కుంటాడు. నాది కాని డబ్బు నాకెందుకని గంగ డబ్బు అక్కడ పెట్టి వెళ్తుంది.    ఆ తర్వాత పైడిరాజు అప్పుల వాళ్లని తీసుకొని గంగ పనిచేసే సూపర్ మార్కెట్ దగ్గరకి వస్తాడు. సెక్యూరిటీ లోపలికి పంపించడు. అప్పుడే వీరు, గోపి అక్కడకి వస్తారు. వాళ్ళని చూసి ఎవరు అని సెక్యూరిటీ ని అడుగుతాడు. గంగ వాళ్ళ నాన్న అని సెక్యూరిటీ చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్న దగ్గరికి గంగ వచ్చి.. నాన్న ఇప్పుడు డబ్బు లేదు రేపు ఇస్తానని రిక్వెస్ట్ చేస్తుంది. అదంతా వీరు చూస్తాడు. ఆ తర్వాత గంగ దగ్గరికి వీరు వచ్చి ఇదిగో డబ్బు అని ఇస్తాడు. వద్దని గంగ అంటుంది.    ఆ తర్వాత ఎలాగైనా రేపటి వరకు డబ్బు నాన్నకి ఇవ్వాలని గంగ అనుకుంటుంది. అదే సమయంలో ఒకతను రైస్ మిల్ దగ్గర వర్కర్స్ కోసం చూస్తుంటాడు. అప్పుడే గంగ వెళ్లి నేను ఏ పని అయినా చేస్తానంటుంది. బియ్యం బస్తాల లోడు ఎక్కించాలి.. దించాలనగానే సరే చేస్తానని గంగ పనిచేస్తూ ఉంటుంది. అక్కడే రుద్రతో పాటు వాళ్ళ పెద్దనాన్న కూడా ఉంటారు.    తరువాయి భాగంలో గంగ బస్తాలు మొయ్యడం రుద్ర వాళ్ళ పెద్దనాన్న చూసి.. నువ్వు బస్తాలు ఎందుకు మోస్తున్నావని అడుగుతాడు. ఇక వాళ్ళ నాన్న అప్పు సంగతి చెప్తుంది గంగ. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam 2 : దాస్ కి అతిథి మర్యాదలు చేసిన శివన్నారాయణ.. ఓర్వలేని శ్రీధర్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -420 లో.... నా భార్య దశరథ్ మావయ్యని షూట్ చెయ్యలేదని నిరూపిస్తాను. లేదంటే దీప భర్తనే కాదని కార్తీక్ ఛాలెంజ్ చేస్తాడు. దాంతో జ్యోత్స్న టెన్షన్ పడుతూ ఒక ప్రాబ్లమ్ సాల్వ్ అయిందనుకుంటే ఇంకొక ప్రాబ్లెమ్ వచ్చిందని అనుకుంటుంది.   ఆ తర్వాత మాకు ఇంత హెల్ప్ చేసిన నువ్వు ఈ రోజు మాతో కలిసి భోజనం చెయ్యాలిసిందేనని దాస్ తో శివన్నారాయణ అంటాడు. దానికి దాస్ సరే అంటాడు. దీప నువ్వు వెళ్లి మంచి మంచి వంటలు చెయ్ అని దీపకి చెప్తాడు దశరథ్. మరొక వైపు పారిజాతంకి శ్రీధర్ ఫోన్ చేస్తాడు. ఎంగేజ్ మెంట్ ఆగిపోయిందట ఎలా అని అడుగుతాడు. నా కొడుకు దాస్ వల్ల అని పారిజాతం అనగానే.. అంత లేదు నా కొడుకు కార్తీక్ వల్ల అని శ్రీధర్ అంటాడు. లేదు దాస్ వల్ల కాబట్టే మా ఆయన దాస్ ని భోజనానికి ఉండమ్మన్నాడని పారిజాతం అనగానే ఇది నిజం అల్లుడు అని అంటుండగా అప్పుడే శివన్నారాయణ వస్తాడు. నీకు కొంచెం కూడా సిగ్గు లేదా వాడితో మాట్లాడుతున్నావని పారిజాతాన్ని శివన్నారాయణ తిడతాడు.   ఆ తర్వాత అందరు భోజనానికి వస్తారు. మీరు కూర్చోండి అని దీప, కార్తీక్ లతో దాస్ అంటాడు. మేం తర్వాత తింటామని కార్తీక్ అనగానే.. మీరు తింటేనే నేను తింటానని దాస్ అంటాడు. ఈ రోజు దాస్ మా అతిధి అతను చెప్పింది గౌరవిస్తాను. మీరు కూర్చోండి అని శివన్నారాయణ అనగానే దీప, కార్తీక్ కూర్చుంటాడు. దాంతో సుమిత్ర లేచి వడ్డిస్తుంది. సుమిత్ర చేత్తో దీపకి వడ్డించేలా చేస్తాడు కార్తీక్. ఆ తర్వాత శివన్ననారాయణ దాస్ తో ప్రేమగా మాట్లాడుతుంటే పారిజాతం సెల్ఫీ తీసుకుంటుంది. ఆ ఫోటో శ్రీధర్ కి పంపిస్తుంది. ఆ ఫోటో చూసి శ్రీధర్ కోపంగా మమ్మల్ని దూరం పెట్టి, వాడిని పక్కన కుర్చోబెట్టుకొని భోజనం పెడతారా అని కావేరితో చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

నర్మదని సాగర్ క్షమిస్తాడా.. ప్రేమ ఎమోషనల్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -221 లో... నర్మదని చూసి కూడా చూడనట్లు సాగర్ వెళ్లిపోతుంటే నర్మద బాధపడుతుంది. అప్పుడే భాగ్యం వచ్చి.. ఇలా భర్త చూసి కూడా చూడనట్లు వెళ్తే భరించడం చాలా కష్టం. ఈ అవమానంతో చచ్చిపోతారు కానీ నువ్వు అలా ఏం చెయ్యకని భాగ్యం వెటకారం గా మాట్లాడుతుంటే నర్మద బాధపడుతుంది. ఇంట్లో ఎవరు నీతో మాట్లాడడం లేదట కదా.. 'ఇలా వాళ్ళ బండారం బయటపెడతాను. వీళ్ళ బండారం బయటపెడతానంటే పరిస్థితి ఇలాగే ఉంటుంది' అని నర్మదకి వార్నింగ్ ఇస్తుంది భాగ్యం.    ఆ తర్వాత అందరు ఇంత హ్యాపీగా ఉంటే ఎలా అని.. పది అవుతుంది అందరు వెళ్లి పడుకోండి అని శ్రీవల్లి టీవీ అఫ్ చేస్తుంది. ధీరజ్ కోసం ప్రేమ బయట వెయిట్ చేస్తుంటే.. శ్రీవల్లి వచ్చి లోపలికి రా డోర్ వేస్తానని అంటుంది. ధీరజ్ రావాలి ఆగు అని ప్రేమ అంటున్నా వినకుండా శ్రీవల్లి డోర్ వేస్తుంది. ప్రేమ బయటే ఉంటుంది. మరొకవైపు సాగర్ దగ్గరికి నర్మద వచ్చి ఇలా చూసి కూడా చూడనట్లు వెళ్తే ఎంత బాధగా ఉంటుందని ఎమోషనల్ అవుతుంది. అయిన సాగర్ పట్టించుకోడు.   కాసేపటికి ధీరజ్ వస్తాడు. తను వచ్చేసరికి డోర్ వేసి ఉండడంతో ఎందుకు వేశారని ప్రేమని ధీరజ్ అడుగుతాడు. ప్రొద్దున శ్రీవల్లి రాజమత చెప్పారు కదా టైమ్ కి ఉండాలని అని ప్రేమ అంటుంది. అయ్యో ఇప్పుడెలా ఆకలిగా ఉందని ధీరజ్ అంటుంటే ప్రేమ ఇంటి కిటికీని కాయిన్ తో ఓపెన్ చెయ్యాలని ట్రై చేస్తుంది.    తరువాయి భాగంలో ప్రేమ ఇల్లు దులుపుతుంటే సేనాపతి చూసి ఎందుకు ఇంత కష్టం ఇప్పటికైనా మన ఇంటికి రా అంటాడు. ప్రేమ సైలెంట్ గా బాధపడుతూ లోపలికి వెళ్తుంటే వెనకాలే ఉన్న ధీరజ్, వేదవతి చూస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.