Karthika Deepam2 : కార్తీక్, దీపల పెళ్ళికి ఒకే చెప్పిన శివన్నారాయణ.. కాంచన హ్యాపీ!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -433 లో...... బావ అలా కోరిక కోరడం వెనుక నీ హస్తం కూడా ఉంది కదా.. అసలు నీ ఉద్దేశం ఏంటి దీప అని జ్యోత్స్న  అడుగుతుంది. ఉద్దేశం ఏముందని కార్తీక్ అంటాడు. మరి వేరే ఎక్కడ అయినా బయట అలా ఎవరి చేత్తో తగిలి తాళి తెగిపోతే అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మనాన్నలు దీప అమ్మనాన్నలుగా ఉండి పెళ్లి చేయమంటావా అని జ్యోత్స్న అడుగుతుంది. ఏం అడిగావే అది శివన్నారాయణ మనవరాలు అంటే అని పారిజాతం ఓవర్ యాక్షన్ చేస్తుంది. మరి ఇంతకు ముందు మీ ఇంట్లో పని చేసిన వాళ్ళ తాళి తెంపలేదు కానీ దీప తాళి ఎందుకు తెంపావని కార్తీక్ అనగానే అది బావ అంటే అంటూ కార్తీక్ గురించి గొప్పగా దీప పోగుతుంటుంది. ఏం కౌంటర్ వేసావే అని పారిజాతం అంటుంది. దీపని అలా చెయ్యడానికి పాత పగలు చాలా ఉన్నాయని పారిజాతం అనగానే మేం ఇలా చెయ్యడానికి మాకు చాలానే ఉన్నాయని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత శివన్నారాయణకి దీప కాఫీ తీసుకొని వస్తుంది. కాంచన ఎలా ఉందని శివన్నారాయణ అడుగుతాడు. కాంచన గురించి చెప్తూ శివన్నారాయణ ఎమోషనల్ అవుతాడు. పెద్దసారు మేం వెళ్తాము ఇక.. మీ నిర్ణయం ఏంటో చెప్పండి అని కార్తీక్ అడుగుతాడు. సుమిత్ర వాళ్ళని పిలుస్తుంది  పారిజాతం. అందరు వస్తారు మీ పెళ్లి జరుగుతుందని శివన్నారాయణ అనగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. సుమిత్ర కోపంగా లోపలికి వెళ్తుంది. కార్తీక్, దీప ఇంటికి వచ్చి కాంచనకి పెళ్లి గురించి చెప్తారు. ఈ రోజు మీ నాన్న దీపతో నీ గురించి గొప్పగా చెప్పారు అమ్మ అని కార్తీక్ అనగానే ఏం అన్నారని సంతోషంగా అడుగుతుంది కాంచన. అప్పుడే కార్తీక్ ఏదో ఫోన్ వచ్చి బయటకు వెళ్తాడు. ఈ టైమ్ లో బావ కి ఎవరు కాల్ చేసారని దీపకి డౌట్ వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi :  కావ్యకి క్యాన్సర్.. తప్పుగా అర్థం చేసుకున్న రాజ్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -797 లో..... కావ్య హాస్పిటల్ కి వెళ్లి బేబీ ఎలా ఉందో చెక్ చేసుకొని వస్తానని అపర్ణకి చెప్పి వెళ్తుంది. కావ్య హాస్పిటల్ కి వెళ్తుంటే రాజ్ కి కన్పిస్తుంది. వాళ్ళ ఆఫీస్ అటు కదా ఇటు వెళ్తుంది ఏంటని కావ్యకి ఫోన్ చేస్తాడు రాజ్. నేను ఆఫీస్ కి వెళ్తున్నానని చెప్పి కావ్య ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి అబద్ధం చెప్తున్నారు.. ఒకవేళ నన్ను రిజెక్ట్ చెయ్యడానికి కారణం ఇదే అయి ఉంటుంది.. వెళ్లి కనుక్కోవాలని కావ్యని ఫాలో అవుతాడు రాజ్. ఆ తర్వాత కావ్య హాస్పిటల్ కి వెళ్తుంది. గైనకాలజిస్ట్ రూమ్ రెనొవేషన్ లో ఉండగా ఆ డాక్టర్ అంకాలాజిస్ట్ రూమ్ లో కూర్చొని ఉంటుంది. డాక్టర్ దగ్గరికి కావ్య వెళ్తుంది. కావ్యని చూసి టెస్ట్ చేసి బేబీ బాగుంది కంగ్రాట్స్ అని చెప్తుంది. రాజ్ వచ్చి చాటుగా వింటూ ఉంటాడు. ఇన్ని రోజులు ఎందుకు టెస్ట్ చేపించుకోలేదు.. ఇప్పటికే లేట్ అయిందని  డాక్టర్ అంటుంది. డాక్టర్ దేని గురించి మాట్లాడుతున్నారు అని రూమ్ బయట నేమ్ ప్లేట్ చూస్తాడు. ఏంటి అంకాలజిస్ట్ అని ఉంది.. అంటే కళావతి గారికి క్యాన్సరా.. అందుకే నన్ను రిజెక్ట్ చేసిందా అని రాజ్ ఎమోషనల్ అవుతాడు. అప్పుడే కావ్య వస్తుంది. ఏంటి ఈయన ఇక్కడున్నారు కొంపదీసి విన్నారా అని అనుకుంటుంది. మీకు క్యాన్సర్ అని ఎందుకు చెప్పలేదు.. మీకు నేనున్నాను అంటూ భారీ డైలాగ్ లు కొడుతు ఎమోషనల్ గా మాట్లాడతాడు రాజ్. మీరు ఆ గదిలో నుండి వస్తున్నారు అంటేనే నాకు అర్ధం అయిందని రాజ్ అనగానే కావ్య బోర్డ్ చూసి ఓహ్ ఆయనకు అలా అర్ధమైందా అని కావ్య అనుకుంటుంది. ఆ తర్వాత కావ్య ఇంటికి వెళ్లి అపర్ణకి లోపల బేబీ బాగుంది అంట అని చెప్తుంది. అప్పుడే రాజ్ వచ్చి నా దగ్గర కళావతికి క్యాన్సర్ అన్న విషయం ఎందుకు దాచారని అపర్ణ, ఇందిరాదేవీలని రాజ్ అడుగుతాడు. అయ్యో అదేం లేదు కావాలంటే డాక్టర్ నా ఫ్రెండ్ కాల్ చేస్తానని చేస్తుంది. ప్రియా నా బాడీ లో ఏదైనా ప్రాబ్లమ్ ఉందా అని అడుగుతుంది. లేదని డాక్టర్ చెప్తుంది. విన్నారా అని కావ్య లోపలికి వెళ్తుంది. తరువాయి భాగంలో తను ప్రెగ్నెంట్ అని కళ్యాణ్ కి అప్పు చెప్తుంది. ఇంట్లో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పు మామిడికాయ తీసుకొని వచ్చి ఇలా ఉన్నవాళ్లకి తినాలనిపిస్తుంది అంట తిను అని కావ్యకి ఇస్తుంది. అది చూసిన రుద్రాణి.. నువ్వు తినాలి కానీ కావ్యకి ఇస్తున్నావ్ ఏంటి? మీ అక్క ఏమైనా ప్రెగ్నెంటా అని రుద్రాణి అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Bigboss 9 Telugu : బిగ్ బాస్ అగ్నిపరీక్ష జడ్జిగా అభిజిత్.. ఫ్యాన్స్ కి పండగే!

  బిగ్ బాస్ అంటే క్రేజ్ ని తీసుకొచ్చింది ఎవరంటే అభిజిత్ అని చెప్తారు.  సీజన్-4 లో తన ఆటతీరుతో ప్రేక్షకులకు దగ్గరై చివరికి విన్నర్ అయ్యాడు. అభిజిత్ బిగ్ బాస్ ని విడిచి దాదాపు అయిదేల్లవుతుంది. అభిజిత్ ఇప్పటివరకు ఎక్కడా కూడా బిగ్ బాస్ గురించి ప్రస్తావించలేదు. అయితే ఇన్నేళ్లు అయిన అభిజిత్ కి ఉండే క్రేజే వేరు. బిగ్ బాస్ సీజన్-4 అయ్యాక పెద్దగా ఎక్కడ కన్పించలేదు. తన పాటికి తను టూర్స్ అంటూ ఎంజాయ్ చేస్తున్నాడు అభిజిత్. అగ్నిపరీక్షకి జడ్జిగా అభిజిత్ ని భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ తీసుకొని వచ్చారట బిగ్ బాస్ టీమ్. అయితే అభిజిత్ తో పాటు బిందుమాధవి, నవదీప్ కూడా అగ్నిపరీక్షకి జడ్జులుగా ఉండగా.. శ్రీముఖి యాంకర్ గా వ్యవహరించనుంది. అగ్నిపరీక్షలో కంటెస్టెంట్స్ కి అభిజిత్ కి మధ్య చిన్న వార్ జరిగిందని తెలుస్తోంది. దాంతో ఎప్పుడు కూల్ గా ఉండే అభిజిత్ ఒక కంటెస్టెంట్ తో గొడవపడటం ఏంటని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.  ఈ గొడవని అగ్నిపరీక్ష ప్రోమోలో ఇస్తే మంచి హైప్ క్రియేట్ చేయోచ్చని బిగ్ బాస్ టీమ్ అనుకుంటుంది. అభిజిత్ ని మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లో చూడబోతున్నందుకు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అగ్నిపరీక్షలో కంటెస్టెంట్ సెలక్షన్ అనేది డిఫరెంట్ గా జరుగుతుంది. కొన్ని గ్రూప్ లాగా చేసి ఒక టాస్క్ ఇచ్చి.. ఎవరైతే ఎక్కువ యాక్టివ్ గా ఉంటారో వాళ్ళని ముందు లెవెల్ కి క్వాలిఫై చేస్తారట. అయితే ఈ సెలెక్షన్ లో ఎన్ని టాస్క్ లు ఉన్నాయో, ఎంతమంది కంటెస్టెంట్స్ ఇందులో పార్టిసిపేట్ చేశారో తెలియాలంటే బిగ్ బాస్ సీజన్‌-9 మొదలయ్యే వరకు ఆగాల్సిందే.  

Bigboss 9 Telugu : బిగ్‌బాస్ నే మార్చేసిన నాగార్జున...ఈసారి చదరంగం కాదు..రణరంగమే!

బిగ్ బాస్ రియాలిటి షో మొదలు కావడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజాగా బిగ్ బాస్ టీమ్ ప్రోమో ఒకటి రిలీజ్ చేశారు. అన్ని సీజన్ ల కంటే ఈ సీజన్ భిన్నంగా ఉండబోతుందనేది ఈ ప్రోమోని చూస్తే తెలుస్తుంది. హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వాలంటే ఒక మినీ యుద్ధమే గెలవాలన్నట్లుగా ప్రోమో ఉంది. షోకి సెలబ్రిటీలతో పాటు కామన్ మ్యాన్ కి కూడా ఆహ్వానం ఉంది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సెలెక్షన్ లో భాగంగా లక్షలో అప్లికేషన్ వచ్చాయంట. అందులో బిగ్ బాస్ కొంతమందిని సెలక్ట్ చేసారని వారికి ఓ సవాలు ఇచ్చారంట. సెలక్ట్ చేసిన వాళ్ళకి 'అగ్నిపరీక్ష' ఉంటుందంట.. అది గెలిస్తేనే హౌస్ లోకి ఎంట్రీ ఉంటుంది. ఈ అగ్నిపరీక్షకి నలభై అయిదు మంది(45) వెళ్లారట. ఈ అగ్నిపరీక్షకి బిందు మాధవి, నవదీప్,అభిజిత్ జడ్జులుగా ఉన్నారు . ఈ ముగ్గురు కూడా అగ్నిపరీక్ష ద్వారా హౌస్ లోకి వెళ్లే వాళ్ళని ఎంపిక చేస్తారని తెలుస్తోంది. ఈ అగ్ని పరీక్షలో భాగంగా పదిహేను మంది అర్హత సాధించారని తెలుస్తోంది. ముగ్గురు జడ్జులు ఒక్కొక్కరు అయిదుగురు కంటెస్టెంట్స్ ని కలిగి మూడు టీమ్ లుగా డివైడ్ అవుతారు. మూడు గ్రూప్ లకి జడ్జెస్ హెడ్.. వాళ్ళ గ్రూప్ లలో పర్ఫామెన్స్ ని బట్టి సెలెక్ట్ చేస్తారు. అలా పర్ఫామెన్స్ ని బట్టీ ఒక్కో టీమ్ నుండి కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపిస్తున్నారట‌ ఇంకా పన్నెండు మందికి ఆడియన్స్ పోల్ పెడుతారంట. ఓటింగ్ లో టాప్ 2 లో ఉన్న వాళ్ళకి డైరెక్ట్ హౌస్ లోకి ఎంట్రీ ఉంటుందని.. అలా హౌస్ లోకి ఇప్పటి వరకు అయిదుగురు కంటెస్టెంట్స్ కన్ఫమ్ అయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఈ అగ్నిపరీక్ష షూటింగ్ జరుగుతుందని.. ఈ నెల 22 న జియో హాట్ స్టార్ లో బిగ్ బాస్ అట్టహాసంగా మొదలవబోతుందని తెలుస్తోంది. మరి మీలో ఎంతమంది ఈ బిగ్ బాస్ సీజన్ 9 చూడటం కోసం ఎదురుచూస్తున్నారో కామెంట్ చేయండి.

సోషల్ మీడియా కరోనా వైరస్ లాంటిది... పైకేమో చీర కట్టు ఎక్స్‌క్లూజివ్‌లో ఓపెన్‌గా పెట్టు!

ఈమధ్య కాలంలో సోషల్ మీడియా ఎంతలా తయారయ్యిందో అందరం చూస్తూనే ఉన్నాం. దాని మీద ఒక నియంత్రణ అనేది లేదు. దాని వలన చాలా నష్టాలైతే జరుగుతూనే ఉన్నాయి. ఐతే అమరదీప్ ఒక ఇంటర్వ్యూలో సోషల్ మీడియా గురించి కొన్ని విషయాలు చెప్పాడు. "ఒక్క రోజు సీఎం ఐతే గనక సోషల్ మీడియా మొత్తాన్ని పీకి పారేస్తా. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ తీసేస్తా. ఇన్స్టాగ్రామ్ మీదనే సంపాదించేవాళ్ళు ఉన్నారు. కొంతమంది అమ్మాయిల వీడియోస్ చూస్తుంటే  వ్యూస్ కోసం ఫేమస్ కావటానికి అంత బరితెగించడం అవసరమా అనిపిస్తుంది. అలాంటి వీడియోస్ ని ఎవరైనా స్కూల్ కి వెళ్లే పిల్ల చూస్తే అలాంటి డ్రెస్ వేసుకోవాలనే ఆలోచన రాదా. ఈ సోషల్ మీడియా కారణంగా చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు. ఇది కరోనా వైరస్ లాంటిదే. ఏదైతే మనకు అనవసరమో ఆ కంటెంట్ మొత్తం తీసేస్తా. అమ్మాయైనా, అబ్బాయినా ఎక్స్పోజింగ్ లు చేసుకుంటూ ఏవన్నా అవి ఇవి చేసుకుంటూ ఉంటె గనక ఎక్స్ పోజింగ్ చేయొచ్చు కానీ ఒక పరిమితి ఉంటుంది. అడల్ట్ రేటింగ్ కంటే కిందకి ఉంటె చిన్న పిల్లలెవరైనా చేయడం చూస్తే నిర్మొహమాటంగా తీసుకొచ్చి పిర్రలు పేలేలా కొట్టిస్తా. మనకు కొంచెం జ్ఞానం ఉంది కదా. ఎంత వరకు చేయాలి ఎంతవరకు చేయకూడదు అని చాలా మంది ఆ వీడియోస్ కి ఎడిక్ట్ ఐపోయి చెడిపోతున్నారు. రీసెంట్ టైమ్స్ లో ఎక్స్‌క్లూజివ్‌ కంటెంట్‌.. దేనికి అది దేన్నీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఒక్కసారి చూడండి వెళ్లి బూతు పురాణం మొత్తం అందులోనే ఉంటుంది. పైకేమో చీర కట్టు ఎక్స్‌క్లూజివ్  లో ఓపెన్ గా పెట్టు. ఎంతవరకు చేయాలో అంత చేస్తే చాలు. లేదంటే మనం పాడైపోయేది కాక పక్కవాళ్ళకు కూడా పాడు చేయడమే. అవి జరగకుండా జాగ్రత్త పడితే చాలు." అన్నాడు అమరదీప్.

బిగ్ బాస్ అగ్ని పరీక్ష లేటెస్ట్ అప్ డేట్స్.. ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

బిగ్ బాస్ అగ్ని పరీక్ష షూటింగ్ కి సిద్దమైనట్లు అప్ డేట్స్ ద్వారా తెలుస్తోంది. జడ్జెస్ గా నవాడీపీ, అభిజిత్, బిందు మాధవి ఉన్నారన్న విషయం తెలుస్తోంది. 40 మంది కామన్ మ్యాన్ నుంచి ఈ జడ్జెస్ బెస్ట్ అనుకున్న వాళ్ళను నెక్స్ట్ రౌండ్ కి పంపించబోతున్నారు. అలాగే ఇందులో 25 మంది ఎలిమినేట్ కాబోతున్నారన్న విషయం తెలుస్తోంది. ఇక సెలెక్ట్ ఐన 15 మందిని ముగ్గురు జడ్జెస్ ఒక్కొక్కరు 5 గురిని తీసుకుని వాళ్లకు టాస్కులు ఇచ్చి ఆడించబోతున్నారు. అలాగే నెక్స్ట్ లెవెల్ ఆడియన్స్ పోల్ ఉండబోతోందన్న విషయం తెలుస్తోంది. టాప్ 5 ఓట్స్ తో ఎవరు లీడ్ లో ఉంటారో వాళ్ళే బిగ్ బాస్ సీజన్ 9 వెళ్లారంటూ అప్ డేట్స్ ద్వారా తెలుస్తోంది. అగస్ట్ 22 నుంచి ఈ అగ్నిపరీక్ష స్టార్ట్ కాబుతోంది. ఇక కామన్ మ్యాన్ క్యాటగిరి కంటెస్టెంట్స్ కి జడ్జెస్ కొన్ని టాగ్స్ తో బడ్జెస్ కూడా ఇవ్వబోతున్నారు. బ్యాడ్జ్ ఆన్ హోల్డ్, బ్యాడ్జెస్ ఆల్మోస్ట్ ఒకే, బ్యాడ్జిస్ సెలెక్టెడ్ ఫర్ లెవెల్ 2 ఇలా ఇవ్వబోతున్నారు. అలాగే 0 బ్యాడ్జ్ అంటే స్పాట్ ఎలిమినేషన్ కూడా ఉండబోతోందన్నమాట. ఇక ఈ టాస్కుల్లో ఆల్రెడీ కొంతమంది ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ పేర్లు కూడా తెలుస్తున్నాయి. యాంకర్ మల్లేశ్వరి, మొహమ్మద్ సమీర్, ట్రాన్స్జెండర్ అంకిత, దమ్ము శ్రీరాజ్ వంటి వాళ్ళు ఎలిమినేట్ అయ్యారన్న విషయం తెలుస్తోంది.

 పెళ్లికి ఒప్పుకున్న గంగ.. పెద్దసారుని అడ్డుకున్న రౌడీలు!

జీ తెలుగులో  ప్రసారమవుతున్న సీరియల్'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-24 లో..... తన తల్లి హాస్పిటల్ ఖర్చు ఎలా తీసుకొని రావాలని గంగ టెన్షన్ పడుతుంటే.. వీరు మనిషి వచ్చి ఇంజక్షన్ కి డబ్బు కడతాడు. అది చూసి ఇతనే నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పిందని గంగకి చెప్తాడు పైడిరాజు. నేను మిమ్మల్ని మొదటిసారి చూసి ఇష్టపడ్డాను.. మీకు ఇష్టం అయితేనే ఈ పెళ్లి జరుగుతుంది.. మీ అమ్మ కిడ్నీ మార్చడానికి కూడా డబ్బు ఇస్తానని వీరు మనిషి చెప్పగానే మా అమ్మ కంటే ఏది ముఖ్యం కాదని, నాకు ఈ పెళ్లి ఇష్టమే అని గంగ అంటుంది. నా మీద ఒట్టేసి చెప్పమని పైడిరాజు అడుగగా.. గంగ ఒట్టేసి చెప్తుంది. మరొకవైపు వీరుకి తన మనిషి ఫోన్ చేసి.. గంగ పెళ్లికి ఒప్పుకుందని చెప్తాడు. వీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకు అంత హ్యాపీ అని తన భార్య అడుగుతుంది. బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా పర్మిషన్ వచ్చిందని అంటాడు. ఏం బిజినెస్ అని తను అడుగుతుంది. అప్పుడే ఇషిక వచ్చి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అని కవర్ చేస్తుంది. ఇద్దరం కలిసి ప్లాన్ చేసామని ఇషిక అంటుంది. అవును తన సపోర్ట్ వల్లే సక్సెస్ అయ్యానని వీరు అంటాడు. మరొకవైపు గంగ పెళ్లి కూతురులాగా రెడీ అవుతుంది. తన ఫ్రెండ్స్ కి మా అమ్మ కోసమే ఈ పెళ్లి చేసుకుంటున్నానని చెప్తుంది. అది వాళ్ళ అమ్మ విని గంగ దగ్గరికి వెళ్లి ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత ఇందుమతి గంగ గురించి మాట్లాడుతుంటే శకుంతల వచ్చి.. భాను అను అంటుంది. వాళ్ళ అమ్మకి ఎలా ఉందో ఏంటో ఒకసారి వెళ్ళొస్తే బాగుండు అని శకుంతల అనగానే.. నేను వెళ్ళొస్తానని వీరు అంటాడు. అవసరం లేదు నేను వెళ్ళొస్తానని పెద్దసారు వంశీని తీసుకొని వెళ్తుంటాడు. అప్పుడే రుద్ర ఎదురు పడతాడు. అక్కడ ఏదైనా ప్రాబ్లమ్ అయితే వచ్చెయ్యండి అని రుద్ర చెప్తాడు. మరొకవైపు ఇప్పుడు ఈయన వెళ్తే అక్కడ గంగ గురించి తెలుస్తుందని వీరు, ఇషిక అనుకుంటారు. వీరు మనిషికి ఇషిక ఫోన్ చేసి అక్కడికి మా మావయ్య వస్తున్నాడు.. రాకుండా ఆపు అని చెప్తుంది. దాంతో పెద్దసారు ఇంట్లోకి వెళ్లకుండా రౌడీలు అడ్డకుంటారు అలాగే పైడిరాజు గొడవపడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ఆనందరావుని దొంగ అని కొట్టిన భద్రవతి.. భాగ్యం ఎంట్రీతో తప్పించుకున్నాడుగా!

స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -233 లో..... దొంగ వచ్చాడని రామరాజు ఇంట్లో అందరు పడుకోకుండా కూర్చొని ఉంటారు. మావయ్య, అత్తయ్య గారికి మాటలు కలపడం ఇదే కరెక్ట్ టైమ్ అని ప్రేమ, నర్మద అనుకుంటారు. అత్తయ్య గారు మీ లవ్ స్టోరీ చెప్పండి అని నర్మద, ప్రేమ అనగానే వేదవతి చిర్రుబుర్రులాడుతుంది. వాళ్ళ లవ్ స్టోరీకి నేనే మెయిన్ పిల్లర్ అంటూ తిరుపతి ఎంట్రీ ఇస్తాడు. తిరుపతి తన అక్క, బావ లవ్ స్టోరీ చెప్తుంటే ఇద్దరు ఎమోషనల్ అవుతారు. ఆ తర్వాత మావయ్య గారు అత్తయ్య మీ కోసం తన కుటుంబాన్ని మొత్తం వదిలేసిందని వేదవతికి కోపం పోగొట్టేల నర్మద మాట్లాడుతుంది. మరుసటి రోజు ఉదయం భద్రవతి కుటుంబం మొత్తం ఆనందరావుని తీసుకొని రామరాజు ఇంటికి గొడవకి వస్తారు. నా వియ్యంకుడిని అలా కట్టేసి తీసుకొని వస్తున్నారని రామరాజు వాళ్ళపై కోప్పడతాడు వాడు మా ఇంటికి దొంగతనానికి వచ్చాడని భద్రవతి చెప్పగానే అందరు షాక్ అవుతారు. అదేంటి వాళ్ళు సమాజంలో మంచి పేరు ఉన్నవాళ్ళని రామరాజు అంటాడు. ఎవరి సంగతి అయిన పోలీస్ కంప్లైంట్ ఇస్తేనే తెలుస్తుందని భద్రవతి అంటుంది. దాంతో శ్రీవల్లి, ఆనందరావు టెన్షన్ పడుతారు. అప్పుడే భాగ్యం ఎంట్రీ ఇస్తుంది. మా ఆయన వచ్చారా అని అడుగతుంది. అయన ఏంటి అలా ఉన్నాడు.. ఈ రోజు శ్రీవల్లి పుట్టినరోజు అర్ధరాత్రి తన కూతురికి విషెస్ చెప్పాడానికి వచ్చాడని భాగ్యం అంటుంది. అవును కన్ఫ్యూషన్ లో వాళ్ళ ఇంటికి వెళ్ళాను.. దాంతో నన్ను దొంగ అంటున్నారని ఆనందరావు అంటాడు. విన్నారు కదా ఇంకొకసారి తప్పుగా అర్థం చేసుకోకండి అని భద్రవతి కుటుంబాన్ని పంపిస్తాడు రామరాజు.  కాసేపటికి కుటుంబం అంతా లోపలికి వెళ్తారు. భాగ్యం హమ్మయ్య అని రిలాక్స్ అవుతుంటే నర్మద చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

కార్తీక్ కండిషన్ ని కాదన్న సుమిత్ర.. ఆమె నిర్ణయానికి వాళ్ళిద్దరు షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -432 లో..... దీపకి అమ్మనాన్నల స్థానంలో మీరు ఉండి మాకు మళ్ళీ పెళ్లి చేయాలని సుమిత్ర, దశరథ్ లతో కార్తీక్ అనగానే అందరు షాక్ అవుతారు. ఒక మనిషిగా కూడా తన పక్కన నిల్చోవడానికి ఇష్టపడను అలాంటిది తల్లి స్థానంలో అంటున్నావ్ అది జరగదని సుమిత్ర అక్కడ నుండి వెళ్లిపోతుంది. ఇప్పుడే చెప్పావ్ కదా.. కాస్త టైమ్ ఇవ్వు అని కార్తీక్ తో శివన్నారాయణ అంటాడు. ఆ పారిజాతం, జ్యోత్స్న పైకి వెళ్లి ఎందుకు ఇలాంటి కోరిక కోరాడని ఇద్దరు అనుకుంటారు. మరొకవైపు ఎందుకు బావ అలాంటి కోరిక కోరావని కార్తీక్ ని దీప అడుగుతుంది. ఒక ప్రయత్నం చేసానని కార్తీక్ అంటాడు. మరొకవైపు ఎందుకిలా చేసావని సుమిత్రతో దశరథ్ అంటాడు. మావయ్య గారు దీనికి ఒప్పుకుంటారనుకుంటున్నారా అని సుమిత్ర అంటుంది. అక్కడ ఆయనకి ఎక్కడ గౌరవం ఇచ్చామని దశరథ్ అంటాడు. అప్పుడే శివన్నారాయణ వస్తాడు. వాడిని మనమే అడగమన్నాం.. మనం ఆలోచించాలని శివన్నారాయణ అంటాడు. ఏం ఆలోచించినా కూడ నా నిర్ణయంలో ఏ మార్పు ఉండదని సుమిత్ర చెప్తుంది. దాంతో శివన్నారాయణ, దశరథ్ షాక్ అవుతారు. మరొకవైపు కార్తీక్ కి దీప టీ తీసుకొని వెళ్తుంటే పారిజాతం ఆపి అది తీసుకొని తాగుతుంది. ఏదైనా నాకు లాక్కొవడం అలవాటు అని పారిజాతం అంటుంది. టీ తాగి ఛీ ఇలా ఉందేంటని అంటుంది. మిర్యాల ఛాయ్ అని దీప అంటుంది. అప్పుడే కార్తీక్, జ్యోత్స్న వస్తారు. నీకు ముందే బావ కండిషన్ గురించి తెలుసు కదా అని దీపతో జ్యోత్స్న అంటుంది. ఇప్పుడు తెలిస్తే ఏంటి, తెలియకపోతే ఏంటని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

యామినికి వార్నింగ్.. కావ్య ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న రాజ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -796 లో... కావ్య దగ్గరికి రాజ్ రాగానే యామిని ఎంట్రీ ఇస్తుంది. మా బావని వద్దని అనడానికి కారణం చెప్పమని కావ్యని యామిని అడుగుతుంది. కళావతి ఎందుకు రిజెక్ట్ చేసిందో నాకు తెలియదు గాని తప్పకుండా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది కానీ మీరందరు నాపై చూపిస్తున్న ప్రేమకి ఇక్కడే ఉండిపోవాలని ఉందని రాజ్ అంటాడు. యామిని తనకి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. మీ బావని ఇక్కడ ఏం ఉంచుకోములే.. నువ్వు వెళ్ళమని యామినితో ఇందిరాదేవి అంటుంది. యామిని కోపంగా వెళ్ళిపోతుంది. తన వెనకాలే కావ్య వెళ్లి.. ఏంటి ఎక్సట్రాలు చేస్తున్నావ్ త్వరలోనే నీ నిజస్వరూపం ఆయనకు తెలిసేలా చేస్తానని యామినికి కావ్య వార్నింగ్ ఇస్తుంది. మరొకవైపు రేవతి తన తమ్ముడు తన దగ్గరున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత అపర్ణ, ఇందిరాదేవి కలిసి రాజ్ ని తిడతారు తాను రిజెక్ట్ చేసిందని నువ్విలా చెయ్యడం కరెక్ట్ కాదని అంటారు. ఆ తర్వాత రాజ్ ఇంటికి వెళ్తాడు. యామిని హాల్లో కూర్చొని ఉంటుంది. నిన్ను వద్దని అంది అంటే.. తనకి నువ్వు అంటే ఇష్టం లేదని యామిని అంటుంది. లేదు తనకి ఇష్టం ఆ విషయం నాకు తెలుసు కానీ ఎందుకు వద్దని అంటుందో కారణం తెలుసుకుంటానని రాజ్ అంటాడు. మరుసటిరోజు అపర్ణకి చెప్పి కావ్య హాస్పిటల్ కి వెళ్తుంది. తరువాయి భాగం లో కావ్య హాస్పిటల్ కి వెళ్తుంటే రాజ్ చూసి ఫాలో అవుతాడు. కావ్య డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. లోపల బేబీ ఒకే కంగ్రాట్స్ అని డాక్టర్ అనగానే కావ్య థాంక్స్ అంటుంది. అదంతా రాజ్ విని షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

నన్ను కొట్టొచ్చు అంటూ పర్మిషన్ ఇచ్చిన నాగబాబు

జబర్దస్త్ 12 ఇయర్స్ సెలెబ్రేషన్స్ లో భాగంగా ఈ వారం ఆది పంచులు స్కిట్ మాములుగా లేదు. అందులోనూ ప్రత్యేకంగా జడ్జ్ ఇంద్రజ మీదనే పెద్ద డైలాగ్ వేసాడు ఆది. ఇక నాగబాబు మీద డైలాగులా వరద కురిపించాడు. "రాగానే ఇద్దరి మధ్యలో కూర్చున్నారు. మీ కళ్ళకు ఎలా ఉందొ కానీ నా కళ్ళతో చూడండి మామ. ఇంద్రజ పక్కన కూర్చున్న ఇంద్రసేనారెడ్డిలా ఉన్నారు..ఖుష్భూ గారి పక్కన కూర్చున్న ఖైదీలా ఉన్నారు. మొత్తంగా మగమహారాజులా ఉన్నారు. ఆయన పట్టుకోకపోవడంవల్లనే చాలామందిమి పట్టు తప్పాం. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరం దారిలోకి వస్తున్నాం. బేసిక్ గా నాగబాబు గారి పక్కన ఎవరు కూర్చున్నా భుజాల మీద కొట్టి నవ్వడం అలవాటు..ఒకవేళ మీకు కూడా ఆ అలవాటుఉంటే " అన్నాడు ఆది. దానికి నాగబాబు "కొట్టొచ్చు ఎం పర్లేదు" అన్నారు. "కొంచెం చిన్నగా కొట్టండి..ఇప్పుడు ఓన్లీ కొట్టడానికి కాదు పది మందికి పెట్టడానికి కూడా ఆ చేతులు కావాలి. ఆ చివర ఖుష్బూ గారు ఆల్రెడీ పొలిటికల్. మీరు పొలిటికల్ . ఈ ఎపిసోడ్ అయ్యేలోపు ఇంద్రజ గారు మీరు కూడా మాట్లాడుకుని పాలిటిక్స్ లోకి వెళ్లిపోండి. " అన్నాడు ఆది ఇంద్రజాతో. ఆవిడ బాబోయ్ నాకొద్దు అన్నట్టుగా పెట్టారు ఫేస్. "ఆమ్మో పాలిటిక్స్ లోకి వద్దులే. మీరు మాములుగా మాట్లాడితేనే స్పీచులు ఇచ్చినట్టు ఉంటుంది. పాలిటిక్స్ అంటే మొత్తం స్పీచులే ఉంటాయి మాటలు ఉండవు. ఇంద్రజగారు జడ్జ్మెంట్ ఇచ్చేలోపు మీరు జనసేన మీటింగ్ కి కూడా వెళ్లిరావచ్చు. " అంటూ చెప్పుకొచ్చాడు ఆది.

Jayam serial: హాస్పిటల్ లో గంగ వాళ్ళ అమ్మ.. రుద్ర సాయం చేస్తాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -23 లో......పెద్దసారు సూపర్ మార్కెట్ కి వస్తాడు. ఎవరిని చూసిన గంగ వచ్చిందనే భ్రమ పడుతుంటాడు. అప్పుడే గంగ వస్తుంది కానీ తన ఉహ అనుకుంటాడు. గంగ గిల్లి చూడగా నిజంగానే వచ్చిందని పెద్దసారు అనుకుంటాడు. నువ్వు ఇక రావేమో అనుకున్నాను కానీ వచ్చినందుకు సంతోషమని గంగతో పెద్దసారు అంటాడు.  మళ్ళీ మీ నాన్న వచ్చి గొడవ ఏం చెయ్యడు కదా అని పెద్దసారు అనగానే చెయ్యడు అని గంగ అంటుంది. కానీ నన్ను ఇక్కడ చూస్తే రుద్ర సర్ ఏమంటాడో అని గంగ అంటుంది. రుద్ర ఎదురుగా నిల్చొని వాళ్ళ మాటలన్నీ వింటాడు. రుద్రని చూసి గంగ షాక్ అవుతుంది. నిన్ను మా ఇంట్లో మా వాళ్ళు పెట్టారు.. మా తప్పు కుడా ఉంది కాబట్టి తల వంచానని రుద్ర అంటాడు. మాపై మాట పడకుండా నువ్వు వెళ్లిపోయావ్ నీపై మాట పడకుండా మేం చూడాలి కదా అందుకే నువ్వు మా ఇంటికి గానీ సూపర్ మార్కెట్ కి గానీ రకని చెప్పి రుద్ర వెళ్ళిపోతాడు. రుద్ర సర్ మాట్లాడిన దాంట్లో న్యాయం ఉందాని గంగ వెళ్ళిపోతుంది. మరొకవైపు పైడిరాజు తన భార్యని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాడు. ఆ విషయం పైడిరాజు గంగకి ఫోన్ చేసి చెప్పగానే.. గంగ హాస్పిటల్ కి వస్తుంది. మరొకవైపు రుద్ర చిన్నపిల్లని హాస్పిటల్  లో చేర్పించాడు కదా చూడడానికి హాస్పిటల్ వెళ్తాడు. ఆ పాపతో మాట్లాడి తనని స్కూల్ లో జాయిన్ చేసి తన బాగోగులు చూసుకుంటానని చెప్తాడు మరొకవైపు అదే హాస్పిటల్ లో గంగ వాళ్ళుంటారు. డాక్టర్ బయటకు వచ్చి గంగ, పైడిరాజుతో మాట్లాడుతుంది. కిడ్నీ మార్చాలి ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఇంజక్షన్ వెయ్యాలి లక్ష రూపాయలు కావాలని అనగానే గంగ బయటకు వెళ్లి టెన్షన్ పడుతుంది. అప్పుడే వీరు మనిషి గంగని పెళ్లి చేసుకుంటానన్న పర్సన్ వచ్చి ఇంజక్షన్ కి బిల్ కడతాడు. మీరు ఎందుకు కట్టారని గంగ అడుగుతుంది. అతనే నిన్ను పెళ్లి చేసుకుంటానన్నది అని గంగకి చెప్తాడు పైడిరాజు. నా కూతురు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు.. ఏ అర్హతతో నీ దగ్గర డబ్బు తీసుకోవాలని పైడిరాజు యాక్టింగ్ చేస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi: రాజ్ ని చూసి హ్యాపీగా ఫీల్ అయిన దుగ్గిరాల కుటుంబం.. అతను రీజన్ తెలుసుకుంటాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -795 లో.... రాజ్ ఉన్నాడని రేవతి ఫోన్ చెయ్యగానే కావ్య వెళ్తుంది. ఏంటి అలా వెళ్తుంది.. మళ్ళీ రాజ్ కి ఏమైనా అయిందా ఏంటని రుద్రాణి అంటుంది. అదేం నోరు ఎప్పుడు ఏదో వాగుతునే ఉంటావని ఇందిరాదేవి రుద్రాణిపై కోప్పడుతుంది. రాజ్ ఉన్నాడని తెలిసింది అందుకే కావ్య వెళ్ళిందనగానే.. ఒక రుద్రాణి, రాహుల్ తప్ప అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత యామినికి రుద్రాణి ఫోన్ చేసి రాజ్ దగ్గరికి కావ్య వెళ్ళింది.. ఇప్పుడు రాజ్ ని తీసుకొని వచ్చి అతనికి నిజం చెప్పేలా ఉన్నారని చెప్తుంది. అలా ఎలా జరగనిస్తానని యామిని అంటుంది. మరొకవైపు రేవతి దగ్గరికి కావ్య వెళ్తుంది. నువ్వు రాజ్ ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసావట కదా బాధపడుతున్నాడు.. రాజ్ కి చిన్న ఆక్సిడెంట్ అయిందని రేవతి చెప్తుంది. కావ్య లోపలికి వెళ్లేసరికి రాజ్ కి తలకి కట్టుకట్టి ఉంటుంది. కావ్య ఎమోషనల్ గా మాట్లాడుతుంటే మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని నిన్న ఎందుకు అలా మాట్లాడరని రాజ్ అంటాడు. ఇంట్లో అందరు మీ గురించి బాధపడుతున్నారు అందుకే తీసుకొని వెళ్లాడానికి  వచ్చానని కావ్య అంటుంది. రానని రాజ్ అంటాడు. అయినా వినకుండా బలవంతంగా రాజ్ ని లాక్కొని తీసుకొని వెళ్తుంది కావ్య. ఆ తర్వాత రాజ్ రాగానే ఇంట్లో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు నాపై చూపిస్తున్న ప్రేమకి చాలా థాంక్స్ నేను మీ కుటుంబంలో ఒకడిగా అవ్వాలని ఉంది కానీ అది కళావతి గారితోనే సాధ్యం అవుతుందని రాజ్ అంటాడు. అప్పుడే యామిని వచ్చి.. బావ నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడు.. రిజెక్ట్ చెయ్యడానికి కారణం ఏంటని కావ్యని యామిని అడుగుతుంది. తరువాయి భాగంలో కావ్యకి నువ్వు అంటే ఇష్టం లేదు బావ అని యామిని అనగానే ఉంది కానీ దాస్తున్నారు ఎందుకో రీజన్ తెలుసుకుంటానని రాజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2: తల్లిదండ్రుల స్థానంలో ఉండి దీప పెళ్ళి జరింపించాలన్న కార్తీక్.. సుమిత్ర షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -431 లో...... దీపని క్షమించమని అడగడానికి వెళ్ళిన వాళ్ళు ఇంకా రావడం లేదని జ్యోత్స్న , పారిజాతం టెన్షన్ పడతారు. అప్పుడే శివన్నారాయణ వాళ్ళు ఎంట్రీ ఇస్తారు. అక్కడ ఏం జరిగింది.. కాంచన వాళ్ళు క్షమించారా అని పారిజాతం ఆత్రంగా అడుగుతుంటే.. లేదు ఏదో కండిషన్ పెట్టాడని శివన్నారాయణ అంటాడు. ఏంటని పారిజాతం, జ్యోత్స్న అడుగుతారు. ఇంకా చెప్పలేదు రేపు వచ్చి చెప్తానన్నాడని శివన్నారాయణ అంటాడు. ఆ తర్వాత శౌర్యని దీప‌ పడుకోబెడుతుంది. ఆ తర్వాత కార్తీక్ వస్తాడు. కండిషన్ ఏంటి బావ అని దీప అడుగుతుంది. రేపే చెప్తానని కార్తీక్ అంటాడు.‌మరుసటి రోజు ఉదయం పారిజాతం ఏదో లెక్కలు వేస్తూ ఉంటుంది. శివన్నారాయణ వచ్చి ఏం చేస్తున్నావని అడుగుతాడు. అప్పుడే కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. కార్తీక్, దీప వచ్చి వారి రెగ్యులర్ వర్క్ చేసుకుంటుంటే శివన్నారాయణ పిలిచి ఏదో కండిషన్ అన్నావ్ ఏంటని అడుగుతాడు. ఏదైనా సరే మేమ్ చేస్తాం తప్పుని సరిదిద్దుకుంటామని సుమిత్ర అంటుంది. దీప అమ్మనాన్నల చేతులు మీదుగా మళ్ళీ పెళ్లి చేయించండని కార్తీక్ అనగానే.. దీప అమ్మనాన్న లేరు కదా.. ఒక అనాథ కదా అని పారిజాతం అంటుంది. ఇంకోసారి నా భార్యని అలా అనకు అని పారిజాతంపై కార్తీక్ కోప్పడతాడు. అది మా వల్ల ఎలా సాధ్యం అవుతుందని సుమిత్ర అనగానే మరి వదిలేయండి అని కార్తీక్ అంటాడు. నా కూతురు చేసిన తప్పుని సరిదిద్దాలి లేదంటే ఆ నింద జీవితాంతం మోయ్యాలి ఇంకా ఏదైనా ఉంటే చెప్పు చేస్తామని సుమిత్ర అనగానే.. సరే దీపకి అమ్మనాన్న స్థానంలో మీరు ఉండి.. వేదమంత్రాల సాక్షిగా మాకు పెళ్లి చెయ్యండి అని కార్తీక్ అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu: భద్రవతి ఇంట్లో దొంగ.. రామరాజుతో గొడవకి వెళ్లిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -232 లో.....ఆనందరావుని నర్మద చూడగానే దొంగ అని ఆరవడంతో అందరు బయటకు వస్తారు. దాంతో ఆనందరావు పారిపోతాడు. నర్మదకి బీరువా తాళం కనిపిస్తుంది. అందరు అంతా వెతుకుతుంటారు. కానీ అతను ఎదరుగా ఉన్న భద్రవతి ఇంట్లోకి వెళ్తాడు. భద్రవతి ఎవరు అక్కడ దొంగ అని అరవడంతో ఇంట్లో అందరు బయటకు వస్తారు. ఆనందరావుని చూసి వీడు రామరాజు వియ్యంకుడు అని భద్రవతి అంటుంది. మరొక వైపు దొంగ కోసం రామారాజు ఇంట్లో అందరు వెతుకుతారు. నర్మద తాళాలు చూపిస్తూ ఈ తాళాలు దొంగ చేతిలో నుండి పడిపోయాయని నర్మద అంటుంది. నీ దగ్గర ఉండాల్సిన తాళాలు అతని దగ్గర ఎందుకున్నాయని నర్మద అడగానే ఏమో నా గదిలోకి వచ్చి దొంగతనం చేసాడేమోనని శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. దొంగ ఎక్కడికి పోలేదు దొరికితే అన్ని నిజాలు బయటకి వస్తాయని నర్మద అంటుంది. ఆ తర్వాత నువ్వు ఆ రామరాజు వియ్యంకుడివి మా ఇంట్లోకి ఎందుకు వచ్చావని భద్రవతి అడుగుతుంది. ఆ ఇంట్లోకి వెళ్ళబోయి ఇటు వచ్చానని అతను అనగానే ఎవరు నమ్మరు.. రేపు ప్రొద్దున ఆ రామరాజు పరువు తీస్తానని భద్రవతి అంటుంది. మరొకవైపు రామరాజు ఇంట్లో దొంగ అంటూ అందరు హాల్లో కూర్చొని ఉంటారు. ఇదే కరెక్ట్ టైం మావయ్య గారని అత్తయ్య మధ్య మాటలు కలపడమని  ప్రేమ, నర్మద అనుకుంటారు. తరువాయి భాగంలో ఆనందరావుని తీసుకొని రామరాజు ఇంటికి గొడవకి వస్తుంది భద్రవతి. నా ఇంటికి దొంతనానికి వచ్చాడని భద్రవతి అనగానే అంటే రాత్రి  ఈ ఇంటికి దొంతనానికి వచ్చింది అతనే అని నర్మద అనుకుంటుంది. పేరు ప్రతిష్ట ఉన్న మా వియ్యంకుడిని దొంగ అంటావా అని రామరాజు వాళ్లపై కోప్పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

వన్ ఛాన్స్ ప్లీజ్...డైరెక్టర్స్ కోసం పోస్ట్ పెట్టిన ప్రేరణ

స్టార్ మాలో  కృష్ణ ముకుంద మురారి సీరియల్ తో తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైన నటి ప్రేరణ. కన్నడ పోరి ఐనా కానీ తెలుగు ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది. ఈమె బిగ్ బాస్ సీజన్ 8 కి కూడా వెళ్ళొచ్చింది. అలాగే ఇష్మార్ట్ జోడిలో కూడా సందడి చేసింది. అలాంటి ప్రేరణ రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఒక పోస్ట్ పెట్టింది. "విజనరీ డైరెక్టర్స్ కి కి ఒక విషయం. మీకు  స్క్రీన్ ప్రెజన్స్ లో అందంగా కనిపిస్తూ ఎమోషన్స్ ని బాగా పండిస్తూ ఆ రోల్ బలాన్ని చాటి చెప్పే సత్తా ఉన్న నటి కోసం మీరు చూస్తున్నట్టయితే నా పేరును పరిశీలించండి. నన్ను  కేవలం బిగ్ బాస్ ఫైనలిస్ట్ గా కాకుండా అంతకంటే ఎక్కువ విలువలు ఉన్న మహిళగా, సవాళ్లు ఎదుర్కునే స్త్రీగా, అంతః సౌందర్యంతో ఉండే అమ్మాయిని. ఒక్క అవకాశం ఇస్తే ఆమె తానేంటో నిరూపించుకుంటుంది" అంటూ వన్ ఛాన్స్ అంటూ ఒక పోస్ట్ పెట్టింది. ప్రేరణ కన్నడలో "చూరికట్టే" అనే మూవీలో నటించింది. తర్వాత ఆయన, పెంటగాన్, ఫిజిక్స్ టీచర్ వంటి మూవీస్ లో కూడా నటించింది. కన్నడ మినీ బిగ్ బాస్ సీజన్ లో కూడా కంటెస్టెంట్ గా వెళ్ళింది. ఇక ఈమె శ్రీపాద్ ని వివాహం చేసుకుంది. కొన్ని వరకు ప్రేరణ మాత్రమే బుల్లితెర షోస్ లో కనిపించేది కానీ తర్వాత తనతో పాటు తన భర్తను కూడా షోస్ లో ఇంట్రడ్యూస్ చేసింది. అలా ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో వీళ్ళు జంటగా వస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ప్రేరణ మనసు మూవీస్ మీదకు మళ్లింది. మరి డైరెక్టర్స్ ఎవరైనా ఆమెకు అవకాశం ఇస్తారో లేదో చూడాలి.

కారు యాక్టిడెంట్‌కి గురైన ఢీ కంటెస్టెంట్ భూమిక!

ఢీ షోలో భూమిక అంటే తెలియని వాళ్ళు లేరు. అలాంటి భూమిక ఢీ సీజన్ 20 లో తన డాన్స్ తో ఎంటర్టైన్ చేస్తోంది. ఇక లాస్ట్ సీజన్ లో ఐతే శేఖర్ మాష్టర్ ఈమె డాన్స్ కి గ్రేస్ కి ఫిదా ఇపోయారు. ఇక ఇప్పుడు కూడా కంటెస్టెంట్ గా చేస్తోంది భూమిక. రీసెంట్ గా ఆమె ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది. " ఈ ఐదు నెలల్లో నేను వెనకడుగు వేయడానికి కారణం ఇదే...ఇన్ని నెలలు ఏం చేస్తున్నావు, అకస్మాత్తుగా ఎందుకు కనిపించకుండా పోయావ్ ..? నువ్వు ఎక్కడా ఎందుకు యాక్టివ్ గా లేవు ? ఎందుకు లావయ్యావు ? అని నన్ను అడిగిన వారికి ఇదే నా జవాబు. నేను కొత్తగా మళ్ళీ నన్ను నేను బలపరుచుకోవడానికి ఇన్ని నెలలు పట్టింది. ఎవరికైనా ఇలాంటి పరిస్థితి వస్తే బాధపడకండి....కొత్త శక్తితో తిరిగి రండి. ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు చాలామంది మనల్ని వెనక్కి లాగడానికి చూస్తారు. కానీ లెజెండ్ బాబ్ ఏమన్నారో తెలుసా "నువ్వెంత బలంగా ఉన్నవో నువ్వు బలపడేవరకు నీకు తెలీదు అన్నారు. నేను మార్చ్ 19 న నాకు యాక్సిడెంట్ అయ్యింది. ఆ టైములో నాకు తగిలిన దెబ్బల వలన అంతా ఐపోయింది అనుకున్నా. నొప్పి నాతో నాట్యం చేసింది. ఆ దెబ్బల కారణంగా నేను వెయిట్ గైన్ అయ్యాను. కానీ నేను సంతోషంగా ఉన్నా ఎందుకంటే దేవుడు నన్ను బతికించాడు అని. అప్పుడే ఢీలోకి కం బ్యాక్ ఇవ్వాలనుకున్నా. ఢీకి థ్యాంక్స్ " అంటూ తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని పిక్స్ కి పోస్ట్ చేసింది భూమిక. 

సూసైడ్ చేసుకోవాలంటే ధైర్యం కావాలి!

బుల్లితెర మీద అమరదీప్-తేజు జోడి గురించి తెలియని వాళ్ళు లేరు. శ్రీముఖి ఐతే తమ్ముడు అంటూ బాగా సపోర్ట్ చేస్తుంది. ఇక ఒక ఇంటర్వ్యూలో ఐతే వర్ష రాఖీ కట్టి తమ్ముడు అని పిలిచింది. ఇక ఆమె కాళ్లకు దణ్ణం పెట్టుకుని బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. అలాగే ఈ ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు చెప్పుకొచ్చాడు. "సింధూరం టైం నుంచి నేను ఆ సినిమా ఎప్పుడైతే చూశానో నా మైండ్ లో రన్ ఐన హీరో ఒకే ఒక్క రవితేజ. నీ పేరు ఎప్పుడు చూస్తాను అని ఎదురు చూస్తున్నానురా నా లిస్ట్ లో అంటే అవకాశం వస్తే అది నీకు ఉపయోగపడేలా ఉండాలి అన్నారు. నేను ఊహించుకున్న నా దేవుడు నా గురించి మాట్లాడినప్పుడు ఇది కదా నా సక్సెస్" అన్నాడు అమరదీప్. "తేజు నా లైఫ్ లోకి రావడం దేవుడు ఇచ్చిన వరం, అదృష్టం , అబ్బా దీంతో తలనొప్పిరా బాబు అనే ఈ మూడు ఉంటేనే అది ప్రేమ, అది పెళ్లి, అది పెళ్ళాం.   నేను ఎప్పుడూ ఏ విషయాన్నీ క్యారీ ఫార్వర్డ్ చేయను. నా మెంటల్ స్టేటస్ నాట్ గుడ్. నేను ఒక ఓవర్ థింకర్ ని . అది నాకు తెలీదు. నా థింకింగ్ కి అసలు కంట్రోల్ ఉండరు. కర్మ కచ్చితంగా హిట్ అవుతుంది. నేను ఒకప్పుడు వాళ్ళను బాధపెట్టాను కాబట్టి ఇప్పుడు నేను కర్మను తిరిగి అనుభవిస్తున్నాను. నా షర్ట్ విప్పి చూస్తే వీపు మొత్తం వెన్నుపోట్లే ఉంటాయి జీవితమంతా. చెప్పులు ఎప్పుడూ బయటే ఉండాలి. బెడ్ రూమ్ వరకు రాకూడదు..అన్నా చెల్లి అనే బంధానికి ఒక స్వచ్ఛత ఉంది అది పాడు చేయకూడదు. మా అమ్మ లేకపోతే అమర్ అనే బొమ్మే లేదు మీముందు..  కొంత మంది లవ్ చేసి సూసైడ్ చేసుకుంటున్నారు.. అలాంటి వాళ్ళకోసం నువ్వు ఏం చెబుతావ్ అని వర్ష అడగడంతో... సూసైడ్ చేసుకోవాలంటే ధైర్యం కావాలి.." అంటూ చెప్పుకొచ్చాడు అమరదీప్.

Jayam serial : వీరు ప్లాన్ అదే.. పెళ్ళికి ఒప్పుకున్న గంగ!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -22 లో..... గంగ తన తండ్రితో ఇంటికి వస్తుంది. అక్కడ జరిగింది మొత్తం వాళ్ళ అమ్మకి చెప్తుంది గంగ. ఇంకా నువ్వు ఎక్కడ పని చేయాల్సిన అవసరం లేదు.‌. బుద్దిగా పెళ్లి చేసి పంపిస్తానని పైడిరాజు అంటాడు. నాకు ఇప్పుడు అర్థం అయింది. నువ్వు ఎప్పుడు అసలు గంగ గురించి పట్టించుకోలేదు.. ఇప్పుడు ఏంటో తెగ పటించుకుంటున్నావ్ అంటేనే నాకు డౌట్ వచ్చిందని గంగ వాళ్ళ అమ్మ అంటుంది. మరొకవైపు పెళ్లికి గంగ ఒప్పుకోవడం లేదని వీరు మనిషి వీరు దగ్గరికి వచ్చి చెప్తాడు. ఇక అక్కడే ఉన్న ఇషిక వాళ్ళకి ఒక ఐడియా ఇస్తుంది. చాలా బాగా చెప్పావ్ సిస్టర్ అని ఇషికని గొప్పగా పొగుడతాడు వీరు. ఆ తర్వాత గంగకి వాళ్ళ అమ్మ అన్నం తినిపిస్తుంది. పెద్దసారు ఇంట్లో వాళ్ళ ఒక్కొక్కరి గురించి వాళ్ళమ్మకి గంగ చెప్తుంది. అమ్మ నువ్వు వెళ్లి టాబ్లెట్ వేసుకోమని గంగ అంటుంది. ఆవిడ టాబ్లెట్ వేసుకోవడానికి వెళ్తుంది కానీ టాబ్లెట్స్ ఉండవు. టాబ్లెట్స్ అన్ని పైడిరాజు పారేస్తాడు. అదంతా వీరు వాళ్ళ ప్లాన్. ఆ తర్వాత మరుసటి రోజు గంగ సూపర్ మార్కెట్ కి వెళ్తుంది. వాళ్ళ అమ్మ టాబ్లెట్స్ లేక కళ్ళు తిరిగి కిందపడిపోతుంది.... ఇదే కదా నాకు కావల్సిందని పైడిరాజు అనుకుంటాడు. పైడిరాజు తన భార్యని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాడు. మరొకవైపు పెద్దసారు ఇక గంగ రాదేమోనని డల్ గా వస్తుంటే.. పెద్దసారు అని గంగ పిల్వగానే అతను హ్యాపీగా ఫీల్ అవుతాడు. తరువాయి భాగంలో గంగ తన తల్లి  హాస్పిటల్ ఖర్చు మొత్తం వీరు మనిషి ఇస్తానని చెప్తాడు. ఇతనే నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడని గంగతో పైడిరాజు అనగానే ఇక ఏం చెయ్యలేక నాకు ఈ పెళ్లి ఇష్టమే అని గంగ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.