కెమెరాతో జాగ్రత్త.. మీరేంటో అదే చూపించండి అంటున్న ప్రేరణ

ప్రేరణకంబమ్  బిగ్ బాస్ సీజన్ 8 ఫైనలిస్ట్. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వాలంటే కామనర్స్ కి ముందుగా అగ్ని పరీక్ష పేరుతో కొన్ని టాస్కులు పెట్టి అందులో కొంతమందిని సెలెక్ట్ చేసి బిగ్ బాస్ హౌస్ కి పంపిస్తున్నారు. ఇక ఇప్పుడు అగ్ని పరీక్ష షూటింగ్ ఐతే జరుపుకుంటోంది. ఈ టైములో మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో కొన్ని టిప్స్ చెప్పిస్తున్నారు. రీసెంట్ అమరదీప్ చెప్పగా ఇప్పుడు ప్రేరణ కూడా టిప్స్ ఇచ్చింది. "మీరు ఒక కామనర్ గా వెళ్తున్నారో మీరు ఎందుకు స్పెషలో తెలియాలి కదా. బిగ్ బాస్ హౌస్ లో ఉండగలరా సర్వైవ్ అవ్వగల అన్నది తెలియాలి అంటే ముందుగా అగ్ని పరీక్షలో సర్వైవ్ అవ్వాలి. అగ్ని పరీక్షలో చాల టాస్కులు ఉంటాయి. కాబట్టి అక్కడ ఎలాంటి డ్రామాలు, యాక్టింగ్ లు చేయకండి. ఇంటర్వ్యూస్ ఉంటే మీలాగే ఇవ్వండి ఎందుకంటే  ప్రతీ చోట కెమెరా ఉంటుంది. మీరు నటిస్తున్నారన్న విషయం కెమెరాకి తెలిసిపోతుంది. బిగ్ బాస్ నేను చూసాను ఆ హౌస్ లో వీళ్ళు ఇలా ఉంటారు అలా ఉంటారు అనే కాన్సెప్ట్ ని మీ మైండ్ నుంచి తీసేయండి. మీరు మీలాగే ఉండండి. మీరు ఒక కంపెనీకి ఇంటర్వ్యూ ఇస్తున్నట్టుగా అనుకుని మీరేంటో అదే చూపించండి. అదే జనాలకు కూడా నచ్చుతుంది. ఇక టాస్కుల విషయానికి వస్తే అన్ని విషయాలు మర్చిపోయి అందులో పాస్ అవ్వడం ఎలాగో నేర్చుకోండి. ఆల్ ది బెస్ట్" అంటూ చెప్పింది ప్రేరణ.    

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ అగ్నిపరీక్షకి రంగం సిద్ధం.. ప్రోమోలో అభిజిత్ హైలైట్!

  బిగ్‌బాస్ 9 తెలుగు మొదలయ్యే ముందే ఆడియన్స్‌ని ట్రాక్‌లో పెట్టేందుకు పెద్ద ప్లాన్‌యే వేశారు. ఈ సీజన్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి కామన్ మ్యాన్ ఎంట్రీ అంటూ బిగ్‌బాస్ టీమ్ ప్రకటన చేసింది. ఇక వీరిని సెలక్ట్ చేసేందుకు అగ్నిపరీక్ష అంటూ అనౌన్స్ చేసింది. ఇక ఈ సెలక్షన్ ప్రాసెస్ మొత్తాన్ని జియో హాట్‌స్టార్‌ స్ట్రీమింగ్ చేయబోతుంది. వీరిని సెలక్ట్ చేసేందుకు బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్స్ అభిజిత్, నవదీప్, బింధు మాధవి రంగంలోకి దిగారు. ఇందుకు సంబంధించిన ప్రోమో తాజాగా వచ్చింది. ఇక ఈ అగ్నిపరీక్షకి శ్రీముఖి హోస్టింగ్ చేయబోతుంది. మీరందరూ డ్రీమ్ చేసిన స్పాట్ లైట్.. ఇదే బిగ్‌బాస్ సీజన్ 9 హౌస్‌లోకి మీ ఎంట్రీ టికెట్.. కానీ ఇక్కడ స్పాట్ లైట్ అక్కడ ఎంట్రీ టికెట్ అంత ఈజీ కాదు.. అంటూ శ్రీముఖి ప్రోమోలో బాగానే హైప్ ఎక్కించింది. వెంటనే అభిజిత్ ఎంట్రీ ఇచ్చాడు. నా మైండ్ గేమ్ గురించి మీకు తెలుసు.. కానీ ఈసారి అగ్నిపరీక్షలో మీ మైండ్ బ్లో అయిపోతుంది.. రెడీగా ఉండండి.. అంటూ చదరంగం ముందు కనిపించాడు. వెంటనే మాస్క్ అంటేనే ఫేక్.. నా ముందు ఉంది రెండే ఆప్షన్స్.. బ్లాకా లేక వైటా.. ఈ అగ్నిపరీక్షలో తేల్చేద్దాం.. అంటూ బింధు మాధవి చెప్పుకొచ్చింది. ఇక ప్రోమో చివరిలో ఏంటి సీరియస్ అవుతున్నారు.. ఎంటర్‌టైన్‌మెంట్ ఉండదనుకుంటున్నారా.. నేనున్నాను కదా ఈ అగ్నిపరీక్షలో మీ స్ట్రెస్ ఎలా బరస్ట్ చేయాలో వాళ్లని ఎలా స్ట్రెస్ చేయాలో నేను చూసుకుంటానంటూ నవదీప్ అన్నాడు. బిగ్‌బాస్ అగ్నిపరీక్ష బిగ్ బిఫోర్‌ ది బిగ్గెస్ట్ అంటూ శ్రీముఖి అనౌన్స్ చేసింది. ఇక ఈ అగ్నిపరీక్షని ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 5 వరకు ప్రతీరోజూ స్ట్రీమింగ్ చేయబోతున్నారు. కేవలం జియో హాట్‌స్టార్‌లోనే ఇది స్ట్రీమింగ్ అవుతుంది. అంటే మొత్తం మూడు వారాల పాటు ఈ సెలక్షన్ ప్రాసెస్‌ని చూపించబోతున్నారన్న మాట.  అభిజిత్ ని చాలా సంవత్సరాల తర్వాత బిగ్ బాస్ స్టేజ్ పై చూసిన ఆడియన్స్ బాగానే కనెక్ట్ అయినట్టు‌ తెలుస్తోంది. మరి ఈ ప్రోమో‌ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.  

అఖిల్ సార్థక్ vs ఆదిరెడ్డి.. బిగ్ బాస్ లీక్స్ ముందుగా ఇవ్వను అంటూ పోస్ట్

రీసెంట్ గా బిగ్ బాస్ లీక్స్ ఇస్తున్న ఆదిరెడ్డి మీద అఖిల్ సార్థక్ పెట్టిన పోస్ట్ వైరల్ కావడంతో ఆదిరెడ్డి లీక్స్ ఇవ్వను అంటూ ఇన్స్టాగ్రామ్ స్టేటస్ పెట్టిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతోంది. ఇక బిగ్ బాస్ అగ్ని పరీక్ష గురించి ఆదిరెడ్డి ఎం చెప్పాడంటే " అగ్నిపరీక్షలో రచ్చ రచ్చ. నేను ఆ విషయాలను లీక్ చేయాలనుకోవడం లేదు. ఎపిసోడ్ చూస్తేనే మజా వస్తుంది. బిగ్ బాస్ చూసినట్టే ఉంటుంది. గొడవలే గొడవలు ఉంటాయి. నేను నిర్ణయించుకున్నాను ఇక నుంచి బిగ్ బాస్ గురించి ఎలాంటి లీక్స్ ముందుగానే ఇవ్వబోను. ఇంపార్టెంట్ అనుకున్నవి చూస్తేనే బాగుంటుంది...చెప్పాలి అని ఏమీ లేదు. మీరు కచ్చితంగా చూడాల్సిందే. నంబర్స్ దగ్గర నిలబడి డిస్కషన్ చేసుకునేది ఎవరు ఎం  పొజిషన్ అనేది అయ్యింది. ఇక ఆలోచించుకోండి రచ్చ ఫైర్ ఎలా ఉంటుందో." అంటూ చెప్పుకొచ్చాడు. ఇక రీసెంట్ గా అఖిల్ సార్థక్ ఒక పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. "బిగ్ బాస్ కి సంబంధించి ఇన్ని లీక్స్ ముందుగానే ఇచ్చి ఆడియన్స్  ని అవమానిస్తున్నావ్.  ఆ సస్పెన్సుని  వాళ్ళు ఎంజాయ్ చేయాలనుకుంటారు" అంటూ చెప్పుకొచ్చాడు. దాంతో ఆదిరెడ్డి ఈ లీక్స్ విషయంలో వెనక్కి తగ్గినట్టే కనిపిస్తోంది.

పెళ్లి చేసుకోబోతున్న ఆది - సుధీర్... శోభనం ముందా తర్వాతా!

ఈటీవీ 30 ఏళ్ళ సంబరాలు త్వరలో జరుపుకోవడానికి సిద్దమయ్యింది. ఇక ఈ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో బుల్లితెర స్టార్స్ తో పాటు సింగర్స్, డాన్సర్స్, షో జడ్జెస్, జబర్దస్త్ ఆర్టిస్ట్స్, కమెడియన్స్, సినిమా స్టార్స్ , డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అన్ని రంగాల వాళ్ళు వచ్చారు. ఇక ఇందులో ఆది, సుడిగాలి సుధీర్ వేసిన జోక్ హైలైట్ గా నిలిచింది. వీళ్ళిద్దరూ పెళ్లి గెటప్పుల్లో నుదిటి బాసికం కూడా కట్టుకుని వచ్చారు. ఇక సుధీర్ తన ఓల్డ్ మ్యానరిజాన్ని అదేనండి కళ్లజోడును స్టైల్ గా పెట్టుకుని చూపించాడు. తర్వాత "మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం" అంటూ అనౌన్స్ చేసాడు. "కూల్ డ్రింక్ లో విషం కలిపి చంపేశారు మొగుడిని" అంటూ ఆది చాలా ఆతృతగా చెప్పాడు. ఇక సుధీర్ అంతే ఆత్రుతతో "శోభనం ముందా తర్వాతా" అంటూ అడిగాడు. దాంతో ఆది షాకయ్యాడు. ఇక ఫారియా వచ్చి అటు చిరంజీవితో స్టెప్పులేసింది. అలాగే సింగల్ గా దబిడి దబిడి సాంగ్ కి డాన్స్ ఇరగదీసింది. ఇక ఈ షోకి సుధీర్ రావడంతో నెటిజన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. రకరకాల కామెంట్స్ పెట్టారు. "వచ్చాడు.. వచ్చాడు.. వీరుడొచ్చాడు..సుధీర్ అన్న కూడా ఇందులో భాగం అవ్వడం చాలా చాలా హ్యాపీగా ఉంది. కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ సుధీర్ అన్న - పంచెస్ మాష్టర్ ఆది ఇద్దరి ఫన్ సూపర్. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి - బుల్లితెర మెగాస్టార్ సుధీర్ ఒక ప్రోగ్రాంలో ఉండడం బాగుంది. రష్మీ కూడా ఉంటే ఇంకా అదిరిపోయేది." అంటున్నారు.

Jayam serial : పెళ్ళికొడుకు నిజస్వరూపం తెలుసుకున్న లక్ష్మీ.. గంగ పెళ్ళి జరుగుతుందా!

  జీతెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -27 లో...... గంగ పెళ్లికి ఏర్పాట్లు జరుగుతాయి. పెళ్లికొడుకుని పిలవడానికి లక్ష్మీ తన గదివైపు వెళ్తుంది. అక్కడ కొంతమంది రౌడీలు అబ్బాయి గురించి మాట్లాడుకుంటారు. ఇది పెళ్లి కాదు ఒక నాటకం ఇదంతా మా సర్ బిజినెస్.. పెళ్లి చేసుకొని అమ్మాయిని దుబాయ్ కి అమ్మేస్తాడనుకుంటారు. అప్పుడే అబ్బాయి వచ్చి ఎవరైనా వింటారు. సైలెంట్ గా ఉండండి అని రౌడీలతో అతను అంటాడు. అప్పటికే లక్ష్మీ మొత్తం వినేస్తుంది. నాకు ముందు నుండి డౌట్ గానే ఉందని లక్ష్మీ అనుకుంటుంది. లక్ష్మీ వినేసిందని వాళ్ళకి అర్ధమవుతుంది. వెంటనే లక్ష్మీ కాళ్ళు కట్టేసి ఒక రూమ్ లో బంధిస్తారు. ఆ తర్వాత వీరుకి పెళ్ళికొడుకు ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్తాడు. మరొకవైపు గంగ నాకు చాలా దగ్గర అయింది.. తనకి నా తరుపున ఏదైనా ఇవ్వాలని శకుంతల అనుకుంటుంది. తాళిబొట్టు చేతిలో పట్టుకొని గతంలో రుద్రకి కాబోయే భార్యకి ఇవ్వాలని అనుకుంటుంది. గతంలో వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉందని గుర్తుచేసుకుంటుంది. నిన్ను కన్నకొడుకులాగా చూసుకున్నాను కానీ నువ్వు నా కొడుకు చావుకి కారణం అయ్యావ్.. నిన్ను ప్రేమించిన అమ్మాయిని మోసం చేసావ్.. ఈ తాళి నీకు ఇచ్చే అర్హతని కోల్పోయావ్.. ఇది గంగకి ఇస్తానని శకుంతల అనుకుంటుంది. తాళి, చీర రెడీ చేస్తుంది. మరొకవైపు వీరు, ఇషిక గంగ ఇంటికి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu : శ్రీవల్లి బంఢారం బయటపడుతుందా.. కామాక్షి నిజం చెప్తుందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -236 లో..... ప్రేమ, నర్మద చేసిన పనికి భాగ్యం ఆనందరావుని భయపెట్టి శ్రీవల్లి చేత బీరువా తాళాలు రామరాజుకి ఇచ్చేలా చేస్తారు. నా కూతురు చిన్నపిల్ల తనకి ఇప్పుడే ఇంటి పెత్తనం ఎందుకని భాగ్యం అంటుంది. అత్తయ్య గారు తాళాలు తీసుకోండి అని శ్రీవల్లి అంటుంది. ఎందుకు అక్క మీరే ఉంచుకోండి మీరు అయితేనే ఇంటిని సమర్థవంతగా నడిపిస్తారని నర్మద అంటుంది. అదంతా ఏం కాదని తాళాలు రామరాజుకి ఇస్తుంది శ్రీవల్లి. ఆ తర్వాత ఆ తాళాలని వేదవతికి ఇస్తాడు రామరాజు. అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత  శ్రీవల్లి దగ్గరికి చందు వచ్చి.. నాకు డబ్బు కావాలి. మీ వాళ్ళని అడుగమని చందు అంటుంటే.. ఈ రోజు నా పుట్టినరోజు అది పట్టించుకోకుండా బాధపెడుతున్నారని శ్రీవల్లి యాక్టింగ్ చేస్తుంది. మరొకవైపు గోల్డ్ షాప్ కి శ్రీవల్లి ఇచ్చిన గోల్డ్ తీసుకొని వెళ్తుంది కామాక్షి. ఆ గోల్డ్ చూసి షాప్ అతను రోల్డ్ గోల్డ్ అని చెప్తాడు. ఆ తర్వాత భాగ్యం దగ్గకి శ్రీవల్లి వచ్చి అయన డబ్బు అడుగుతున్నాడు. నాకు టెన్షన్ గా ఉందని చెప్తుంది. అప్పుడే కామాక్షి కోపంగా ఇంట్లోకి వచ్చి శ్రీవల్లిని పిలుస్తుంది. కామాక్షిని శ్రీవల్లి గదిలోకి తీసుకొని వెళ్తుంది. రోల్డ్ గోల్డ్ ఇచ్చి నన్ను మోసం చేస్తావా.. ఇప్పుడే ఈ విషయం నాన్న కి చెప్తానని బయటకు వస్తుంటే భాగ్యం ఆపుతుంది. అదంతా ప్రేమ, నర్మద చూస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : జ్యోత్స్న రిక్వెస్ట్ చేయడంతో పెళ్లికి ఒప్పుకున్న సుమిత్ర!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -435 లో....కాంచన డల్ గా ఉంటుంది. ఏమైందని కార్తీక్ అడుగుతాడు. పెళ్లికి ఒప్పుకున్నారు కరెక్టే కానీ పెళ్లి గురించి వెళ్లి ఎలా మాట్లాడాలని కాంచన అంటుంది. అప్పుడే దశరథ్ వస్తాడు. ఆ తర్వాత శివన్నారాయణ, పారిజాతం, సుమిత్ర ఇలా ఒక్కొక్కరుగా ఎంట్రీ ఇస్తారు. పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చామని శివన్నారాయణ అనగానే.. ఇప్పుడే కాంచన దాని గురించి మాట్లాడుతుంది. ఇంతలో మీరే వచ్చారని అనసూయ అంటుంది. మీరు ఇబ్బంది పడుతారని మేమే వచ్చామని దశరథ్ అంటాడు. కాంచనతో సుమిత్ర ప్రేమగా మాట్లాడుతుంది. దీప నువ్వు వెళ్లి కాఫీ తీసుకొని రా అని సుమిత్ర అనగానే మా అమ్మ నాతో మాట్లాడింది కోపం పోయిందని దీప హ్యాపీగా ఫీల్ అవుతుంది. మనం ఇలా పక్కకు వెళ్లి మాట్లాడుకుందామని కాంచనని తీసుకొని పక్కకి వస్తుంది సుమిత్ర. వదిన నువ్వు దీపని క్షమించి ఈ పెళ్లికి ఒప్పుకున్నావని కాంచన అంటుంది. అదంతా నటన నేను దీపని క్షమించడం అసలు జరగదని సుమిత్ర అంటుంటే.. కాంచన షాక్ అవుతుంది. ఈ పెళ్లి జరగదు.. నువ్వు వెళ్లి వాళ్ళ చేతుల మీదగా పెళ్లి అవసరం లేదు.. ఏదో చిన్నగా చేసుకోండి అని చెప్పమని కాంచనతో  సుమిత్ర అంటుంది. నా కోడలిని క్షమించు ఈ పెళ్లికి ఒప్పుకోమని కాంచన రిక్వెస్ట్ చేస్తుంది. నువ్వు చెప్పకపోతే నేనే చెప్తానని సుమిత్ర వెళ్తుంటే జ్యోత్స్న వచ్చి ఈ పెళ్లి జరుగుతుందని చెప్తుంది. మమ్మీ తాతయ్య మన కోసం మాటిచ్చాడు.. నాకు లైఫ్ లాంగ్ రిగ్రేట్ ఉంటుంది కదా ప్లీజ్ ఒప్పుకోమని జ్యోత్స్న అనగానే సుమిత్ర సరే అంటుంది. అందరు గదిలో నుండి హాల్లోకి వస్తారు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో అమ్మని అడగాలని దీపతో కార్తీక్ అంటాడు. ఆ తర్వాత  ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : కావ్య ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న రుద్రాణి.. యామిని ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Braamamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-799 లో... కావ్యకి అప్పు మామిడికాయ ఇస్తుంటే.. మీ అక్క ఏమైనా ప్రెగ్నెంటా అని రుద్రాణి అడుగుతుంది. ఇది పుల్లటి మామిడికాయ కాదు తియ్యగా ఉంది. ఎవరైనా తినొచ్చని అప్పు, కావ్య కలిసి రుద్రాణిని పిచ్చిదాన్ని చేస్తారు. అప్పుడే ఇందిరాదేవి వెళ్తుంటే రుద్రాణి పిలుస్తుంది. ఈ మామిడికాయ తిని పుల్లగా ఉందో తియ్యగా ఉందో చెప్పమని అడుగుతుంది. ఇందిరాదేవి కూడా అప్పు వాళ్ళకి సపోర్ట్ గా ఇది తియ్యగా ఉందని చెప్తుంది. దాంతో రుద్రాణి ఏం చెయ్యలేక అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మీరు కాస్త దానితో జాగ్రత్తగా ఉండండి అని అప్పు, కావ్యలకి ఇందిరాదేవి చెప్తుంది. ఆ తర్వాత కనకంకి స్వప్న ఫోన్ చేసి అప్పు ప్రెగ్నెంట్ అన్న విషయం చెప్తుంది. అలాగే రాజుని కావ్య రిజెక్ట్ చేసిన విషయం కూడా చెప్తుంది. మరుసటి రోజు ధాన్యలక్ష్మి అప్పుని కోడలుగా ఒప్పుకొని తన ఏడు వారాల నగలు ఇస్తుంది. అప్పుడే కనకం వస్తుంది. అప్పుని హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతుంది. రాజ్ వస్తాడు ఎందుకు అల్లుడు గారిని వద్దని అన్నావని కావ్యని కనకం కోప్పడుతుంది. నా లైఫ్ నా ఇష్టమని కావ్య చెప్పి వెళ్తుంది. ఆ తర్వాత ఇందిరాదేవి, అపర్ణ ఇద్దరు కనకాన్ని బయటకు తీసుకొని వెళ్లి కావ్య ప్రెగ్నెంట్ అన్న విషయం చెప్తారు. దాంతో కనకం కావ్య దగ్గరికి కనకం వెళ్లి బాధపడుతుంది. ఆ తర్వాత కావ్య, కనకం ఇద్దరు మాట్లాడుకుంటుంటే.. రుద్రాణి డోర్ దగ్గర ఉంటుంది. అది స్వప్న చూసి చూసి ఇండైరెక్ట్ గా రుద్రాణి ని తిడుతుంది. తరువాయి భాగంలో కావ్య టాబ్లెట్స్ వేసుకోవడం రాహుల్, రుద్రాణి చూసి ఆ టాబ్లెట్ ఎందుకు వేసుకుంటారో తెలుసుకుంటారు. ఈ టాబ్లెట్స్ ప్రెగ్నెంట్ గా ఉన్నవాళ్ళు వేసుకుంటారని రుద్రాణికి తెలుస్తుంది. అయితే కావ్య ప్రెగ్నెంట్ అనుకొని యామినికి ఫోన్ చేసి చెప్తుంది రుద్రాణి. కావ్య ప్రెగ్నెంటా.. అయితే ఈ విషయం బావతో చెప్పి కావ్యని నెగెటివ్ చేస్తానని యామిని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Bigboss telugu 9: డబుల్ ఫేస్ వద్దు.. పల్లవి ప్రశాంత్‌పై అమర్ దీప్ కామెంట్స్ వైరల్!

బిగ్ బాస్ సీజన్-9 మరికొన్ని రోజుల్లో మొదలవ్వబోతుంది. భారీ అంచనాలు క్రియేట్ చెయ్యడానికి ప్రోమోల మీద ప్రోమోలు వదులుతున్నాడు బిగ్ బాస్. ఇది ఇలా ఉంటే ఎక్స్ కంటెస్టెంట్ అయిన అమర్ దీప్ బిగ్ బాస్ ని ప్రమోట్ చేస్తూ ఓ వీడియో వదిలాడు. అది ప్రమోషనే కానీ తన ఫ్రస్ట్రేషన్ మొత్తం బయటపెట్టినట్లుగా అది ఉంది. ఇండైరెక్ట్ గా పల్లవి ప్రశాంత్ కి కౌంటర్ వేసినట్టనిపిస్తుంది.. అసలు అతనేమన్నాడో ఓసారి చూసేద్దాం.. నేను మీ అమర్ దీప్ చౌదరి. బిగ్ బాస్ సీజన్-7 రన్నరప్‌ ని. బిగ్ బాస్ అనేది ఒక డ్రీమ్. అందరికి కలలు ఉంటాయి. బిగ్ బాస్‌లోకి రావాలని చాలామంది అనుకోవచ్చు.. చూశాంలే ఆడావ్ కదా అని అనుకుంటారు.. కానీ అక్కడ నేను ఆడింది మాత్రమే మీకు కనిపించింది. బిగ్ బాస్ మీతో ఆడింది.. నాతో ఆడింది ఎవ్వరికి కనిపించదు. అదే మన వీక్ నెస్, స్ట్రెంత్, ప్రేమ, ఆప్యాయత, ఫ్రెండ్ షిప్.. వీటన్నింటిని కలిపి కొడితేనే బిగ్ బాస్. అన్నింటికి చాలా సిద్దంగా ఉండాలి. ముఖ్యంగా తెగించి నిలబడాలి.  బిగ్ బాస్ సీజన్-9 కామన్‌మ్యాన్‌‌కి అగ్నిపరీక్ష. అది ఎలా ఉండబోతుందో తెలుసా.. అక్కడ భయమే లేని జడ్జులు ఉండబోతున్నారు. వాళ్లు మిమ్మల్ని డ్రిల్ చేస్తారు.. కిల్ చేస్తారు.. సూటిగా అడుగుతారు.. మీరు సుత్తి లేకుండా సమాధానాలు చెప్పాలి. హానెస్ట్‌గా ఉండాలి.. డబుల్ గేమ్ ఆడటానికి వీళ్లేదమ్మా.. డబుల్ ఫేస్ చూపించడానికి లేదు. ఒకటే ఫేస్.. టాస్క్‌లు ఈసారి మామూలుగా ఉండవు. ఇవన్నీ దాటుకుంటేనే లోపలికి ఎంట్రీ ఉంటుంది. చాలా టఫ్‌గా ఉండబోతుంది.. చాలా కొత్తగా కూడా ఉండబోతుంది. నేను మీకు ఇచ్చే ఒకే ఒక్క సలహా ఏంటంటే.. బీ బోల్డ్, బీ షార్ప్.. బీ స్ట్రైట్. న్యాయంగా ఉండండి. హానెస్ట్‌గా ఉండండి.. డబుల్ ఫేస్ చూపించొద్దు. ఏది చెప్పినా సరే నిజం చెప్పండి.. నిలబడండి.. బిగ్ బాస్ అగ్నిపరీక్ష.. ది బిగ్.. బిఫోర్ ది బిగ్గెస్ట్. త్వరలోనే హాట్ స్టార్‌లో ప్రసారం కాబోతుందంటూ అమర్ దీప్ చెప్పుకొచ్చాడు. బిగ్ బాస్ సీజన్-9(Bigg Boss season 9) పై హైప్ ని క్రియేట్ చేయడానికి ఇలా ఎక్స్ కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ బానే వాడుకుంటున్నాడు.

Bigboss telugu 9 : బిగ్ బాస్ అగ్నిపరీక్షకి సెలెక్ట్ అయిన పదిహేను మంది కంటెస్టెంట్స్ ఎవరంటే!

బిగ్ బాస్ తెలుగు ఇప్పటికే ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకుంది. మరికొన్ని రోజుల్లో ఈ సీజన్(బిగ్ బాస్ సీజన్-9) ప్రారంభం కానుంది. దాంతో ఈ సీజన్ పై  రోజురోజుకి క్యూరియాసిటి పెరుగుతుంది. బిగ్ బాస్ అగ్నిపరీక్ష కోసం పదిహేను మంది కామన్ మ్యాన్ కేటగిరీలో ఎంపిక అయినట్లు తెలుస్తోంది. అందులో దాదాపు జనాలకి పెద్దగా తెలియని వాళ్ళే ఉన్నారు. ఈ పదిహేను మందిలో సగం మంది అగ్ని పరీక్షలో విన్ అయితే డైరెక్ట్ హౌస్ లోకి ఎంట్రీ టికెట్ వస్తుంది. మరోవైపు సెలబ్రిటీలు ఎంత మంది హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారనేది ప్రస్తుతం అందరిలో ఉన్న ప్రశ్న.. ఈ సీజన్ అంతా డిఫరెంట్ గా ఉన్నప్పుడు ఇక వైల్డ్ కార్డు ఎంట్రీ ఉండొచ్చు.. ఉండకపోవచ్చు.. ఉంటే అది ఎలా ప్లాన్ చేసారో.. లేకపోతే ఏం చేస్తారో అని ఇలా బిగ్ బాస్ మొదలు నుండి ముగిసే వరకు ఎవరి ఊహాగానాలు వాళ్ళవి.. అయితే బిగ్ బాస్ అగ్నిపరీక్షకి పదిహేను మంది ఎంపికయ్యారు.  అనూష రత్నం, దివ్య నిఖిత, శ్రేయ, శ్వేతా శెట్టి, డిమాన్ పవన్, ప్రసన్న కుమార్, దమ్ము శ్రీజ, మిస్ తెలంగాణ కల్కి, లాయర్ ప్రశాంత్, దాహిళా షరీఫ్, మాస్క్ మ్యాన్ హృదయ్, పవన్ కళ్యాణ్, మార్దయ మదన్, ప్రియ శెట్టి, ఇన్ ఫ్లూయెన్సర్ షకీర్ అగ్నిపరీక్షకి సెలక్ట్ అయినట్టు తెలుస్తోంది. ఈ అగ్నిపరీక్షలో విన్ అయ్యి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేది ఎవరో తెలియాలంటే కొద్దీరోజులు ఆగాల్సిందే. ఈ పదిహేను మంది కూడా యూట్యూబ్ , ఇన్ స్టాగ్రామ్ లో ఎంతో కొంత ఫాలోవర్స్ ని కలిగి ఉన్నారు. ఈ కామన్ మ్యాన్స్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఎవరు సెలబ్రిటీగా మారుతారో చూడాలి.

Jayam serial : తన ఇష్టప్రకారమే పెళ్ళి జరుగుతుందన్న గంగ.. నిజం తెలుసుకున్న లక్ష్మీ!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -26 లో.....పెద్దసారు ఇంటికి వస్తాడు. అప్పుడే రుద్ర వస్తాడు.. పెద్దసారు డల్ గా ఉండడంతో ఏమైందని రుద్ర అడుగుతాడు.  ఏం కాలేదని పెద్దసారు చెప్తాడు కానీ వంశీ అక్కడ జరిగింది మొత్తం చెప్తాడు. అది విన్న రుద్ర పట్టరాని కోపంతో పదండి పెద్దనాన్న అని పెద్దసారు చెయ్ పట్టుకొని తీసుకొని వెళ్తాడు. అక్కడ పెద్ద గొడవ అయ్యేలా ఉంది ఎలాగైనా ఆపాలని వీరు, ఇషిక అనుకుంటారు. మరొకవైపు మన అల్లుడు గారు చూసావా ఎంత మంచోడో.. మనం కూడా పెళ్లి తర్వాత దుబాయ్ వెళ్ళడానికి పాస్ పోర్ట్ తీసుకొని వచ్చాడని  పైడిరాజు పాస్ పోర్ట్ చూపిస్తాడు. అక్కడ మంచి డాక్టర్స్ ఉంటారు.. మీ అమ్మ బాగుంటుంది అనగానే గంగ హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాకు ఎందుకో డౌట్ గా ఉంది.. నా కూతురు జీవితం బాగుంటుందంటే ఈ పెళ్లి జరిపించు.. లేదంటే ఆపెయ్ దేవుడా అని గంగ వాళ్ళ అమ్మ లక్ష్మీ మొక్కుకుంటుంది. మరొకవైపు రుద్ర వచ్చి ఎవడ్రా మా పెద్దనాన్నని కొట్టిందని రౌడీలను కొడతాడు.ఆ తర్వాత గంగని కలవడానికి లోపలికి వెళ్తారు.‌ వద్దని పైడిరాజు పెళ్లికొడుకు అడ్డుపడతారు. అప్పుడే గంగ వస్తుంది. నీతో మాట్లాడతా అంటే వాళ్ళు ఆపుతున్నారు.. నీకు ఈ పెళ్లి ఇష్టమేనా అని పెద్దసారు అడుగుతాడు. ఇష్టమేనని గంగ అంటుంది. లేదు దానికి ఇష్టం లేదు.. నా ఆరోగ్యం బాగుపడుతుందని చేసుకుంటుందని గంగ వాళ్ళ అమ్మ లక్ష్మీ అంటుంది. లేదు నా ఇష్టప్రకారం చేసుకుంటున్నాను.. మా అమ్మ ఆరోగ్యం బాగవుతుందని గంగ అంటుంది. మీ అమ్మ ఆరోగ్యం బాగవ్వాలంటే నేను హెల్ప్ చేస్తాను.. అనవసరంగా నీ జీవితం నాశనం చేసుకోకని పెద్దసారు అంటాడు. మీరు చేస్తారు కానీ అందరు అలా అనుకోరు కదా అని గంగ అంటుంది. పదండి పెద్దనాన్న మీరు వాళ్ళని మన అనుకున్నారు.. వాళ్ళు అనుకోవడం లేదని రుద్ర అంటాడు.. దయచేసి ఈ పెళ్లికి అడ్డుపడకండి అని గంగ వాళ్ళని రిక్వెస్ట్ చెయ్యగానే వాళ్లు వెళ్ళిపోతారు. తరువాయి భాగంలో ఇది పెళ్లి కాదు.. ఇదంతా నాటకం.. ఇదే కదా మా సర్ బిజినెస్.. ఆ తర్వాత దుబాయ్ కి అమ్ముకోవడం అని రౌడీలు మాట్లాడుకుంటుంటే లక్ష్మీ వింటుంది. విని అబ్బాయి దగ్గరికి వెళ్లి అడుగుతుంది. ఆ అబ్బాయి వీరుకి ఫోన్ చేసి గంగ వాళ్ళ అమ్మకి నిజం తెలిసిందని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : అప్పు, కావ్య ప్రెగ్నెంట్.. ఎమోషనల్ అయిన కనకం!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -798 లో..... రాజ్ తో ఇందిరాదేవి, అపర్ణ మాట్లాడతారు. కావ్యని నువ్వు అపార్థం చేసుకోవడం ఆపేయమని అంటారు. మరొకవైపు కళ్యాణ్ కవితలు రాసుకుంటుంటే అప్పు వచ్చి నాకు పుల్లగా ఏదైనా తినాలనిపిస్తుందని చెప్తుంది. ఇప్పుడు మామిడికాయలు దొరకవని కళ్యాణ్ అంటాడు. ఇక అంతలోనే కళ్యాణ్ కి అప్పు ప్రెగ్నెంట్ అన్న విషయం అర్థమై అప్పుని ఎత్తుకొని చుట్టుతిప్పుతాడు. ఆ తర్వాత కళ్యాణ్ హాల్లోకి వెళ్లి అందరిని పిలుస్తాడు. ఆ విషయం ఎలా చెప్పాలో సిగ్గుపడతాడు. ఇందిరాదేవికి కళ్యాణ్ చెవిలో చెప్పగా తను అందరికి చెప్తుంది. ఇంట్లో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్లిద్దరికి విషెస్ చెప్తుంటారు. ఏంటి పెద్ద వదినకి హ్యాపీగా లేనట్టుంది.. తన కొడుకుకి ముందు పెళ్లి అయింది కానీ వాళ్ళు కాకుండా వీళ్ళు వారసుడిని ఇస్తున్నారని బాధగా ఉన్నట్లుందని రుద్రాణి అనగానే అదేం లేదు నేను హ్యాపీగా ఉన్నానని అపర్ణ అంటుంది. కాసేపటి తర్వాత బిడ్డ పుట్టేవరకు జాబ్ మానెయ్ అని ధాన్యలక్ష్మి అనగానే సరే అత్తయ్య లాంగ్ లీవ్ తీసుకుంటానని అప్పు చెప్తుంది. ఇంట్లో ఉండడం కాదు నేను చెప్పినట్టు వినాలని ధాన్యలక్ష్మి అనగానే సరేనని అప్పు అంటుంది. మరొకవైపు తను ప్రెగ్నెంట్ అనే విషయం అందరికి చెప్పే సిచువేషన్ లో లేనని కావ్య బాధపడుతుంటే ఇందిరాదేవి, అపర్ణ వచ్చి ధైర్యం చెప్తారు.ఆ తర్వాత  కళ్యాణ్ అమ్మాయి పుట్టాలని.. అప్పు అబ్బాయి పుట్టాలని మాట్లాడుకుంటారు. ఆ తర్వాత అప్పు మామిడికాయ తింటూ కావ్య దగ్గరికి వచ్చి తినమని ఇస్తుంది. అది చూసిన రుద్రాణి.. ఏంటి నువ్వు తినాలి కానీ మీ అక్కకి ఇస్తున్నావ్.. మీ అక్క కూడా ప్రెగ్నెంటా ఏంటని అడుగుతుంది. వెంటనే అప్పు ఏదో చెప్పేసి కవర్ చేస్తుంది. తరువాయి భాగంలో అల్లుడి గారితో ఎందుకు పెళ్లి వద్దన్నావని కావ్యని కనకం అడుగుతుంది. అది నా ఇష్టమని కావ్య అంటుంది. ఇందిరాదేవి, అపర్ణ  ఇద్దరు అసలు విషయం కనకంకి చెప్తారు. ఆ విషయం తెలిసి కనకం కావ్య దగ్గరికి వచ్చి ఎమోషనల్ గా మాట్లాడుతుంటే రుద్రాణి వచ్చి వింటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu : ఇంటి పెత్తనం వద్దన్న శ్రీవల్లి.. ఇద్దరు కోడళ్ళ ప్లాన్ సక్సెస్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -235 లో.......వేదవతిని తప్పుగా అపార్థం చేసుకున్నందుకు తనకి రామరాజు సారీ చెప్తాడు.  వెళ్లి మొదటి ధాన్యం దేవుడి దగ్గర పెట్టమని రామరాజు చెప్పగా.. వేదవతి వెళ్లి రామరాజు చెప్పినట్లు చేస్తుంది. హమ్మయ్య వాళ్ళు కలిసిపోయారు.. నా వల్ల వాళ్ళ మధ్య మనస్పర్థలు వచ్చాయని చాలా ఫీల్ అయ్యాను.. ఇప్పుడు రిలీఫ్ గా ఉందని ప్రేమ అంటుంది. మనం ఇంకొకపని కూడా చెయ్యాలి.. ఇంటి పెత్తనం, బీరువా తాళాలు మళ్ళీ అత్తయ్య చేతికి వచ్చేలా చెయ్యాలని ప్రేమ, నర్మద ఇద్దరు అనుకుంటారు. అసలు రాత్రి దొంగ మన ఇంటికి వచ్చిన విషయం మర్చిపోయారు.. వల్లి వాళ్ళ నాన్నే మన ఇంటికి వచ్చిన దొంగ ఒక్కరే అనిపిస్తుందని నర్మద అంటుంది. అవును అక్కా.. ఎవరైనా బర్త్ డే విషెస్ చెప్పడానికి దొంగ గెటప్ లో వస్తారా అని ప్రేమ అంటుంది. ఇద్దరు కలిసి ఒక ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత ఆనందరావుకి వినపడేలా రాత్రి దొంగని చూసాను కదా.. వల్లి వాళ్ళ నాన్నలాగే అనిపిస్తుందని అంటారు. అప్పుడే ఆనందరావు వాళ్ళ దగ్గరికి వస్తాడు. పాపం దొంగ ఎవరో గాని వల్లి అక్క ఇరుక్కుపోయింది. వల్లి అక్క దగ్గర ఉండాల్సిన తాళాలు దొంగ దగ్గర ఎందుకున్నాయని పోలీసులు అడుగుతారు. అత్తయ్య దగ్గర ఉంటే ఇదంతా గొడవ ఉండేది కాదు.. పాపం వల్లి అక్క.. ఇంటి ముందు సీసీటీవీ  ఉంది.. దొంగ ఎవరో తెలుస్తుందని ఆనందరావుని ఇద్దరు భయపెడతారు. ఆ తర్వాత భాగ్యం, శ్రీవల్లి దగ్గరికి ఆనందరావు వెళ్లి సీసీటీవీ ఉందట.. వల్లి దగ్గరున్న తాళాలు దొంగ దగ్గర ఎలా వచ్చాయని అడుగుతారు కదా ఎందుకైనా మంచిది.. తాళాలు మీ అత్తయ్య గారికి ఇచ్చేయమని అతను అంటాడు. ఇవ్వనని శ్రీవల్లి అనగా భాగ్యం తనని ఒప్పిస్తుంది. ఆ తర్వాత శ్రీవల్లి తాళాలు తీసుకొని వెళ్లి.. ఇక నా దగ్గర వద్దని రామరాజుతో చెప్తుంది. మా కూతురు ఇంకా చిన్నపిల్ల.. తనకి ఇంత బాధ్యతలు ఎందుకని భాగ్యం అంటుంది. తరువాయి భాగంలో కామాక్షి కోపంగా ఇంటికి వస్తుంది. నాకు నువ్వు గిల్టీ నగలు ఇచ్చావని శ్రీవల్లితో గొడవపడుతుంటే భాగ్యం సర్దిచెప్తుంది. అదంతా నర్మద, ప్రేమ చూస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : వాళ్ళిద్దరి పెళ్ళికి సుమిత్ర ఒప్పుకుంటుందా.. జ్యోత్స్న ఎత్తుగడ ఏంటి!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -434 లో..... కార్తీక్ ఫ్రెండ్ కాల్ చేసాడని వెళ్తాడు. నిజానికి చేసింది జ్యోత్స్న.. జ్యోత్స్నని కలవడానికి కార్తీక్ వస్తాడు. ఎందుకు నన్ను రమ్మన్నావని కార్తీక్ అడుగుతాడు. ఈ పెళ్లి మా అమ్మనాన్న చేతులు మీదుగా జరగాలని కండిషన్ ఎందుకు పెట్టావ్.. ఇదంతా కావాలనే చేస్తున్నావ్ కదా.. నేను ఆలా జరగనివ్వనని జ్యోత్స్న అంటుంది. జరుగుతుంది నువ్వు కేవలం నీ గురించి మాత్రమే ఆలోచిస్తావ్ కానీ నేను నా కుటుంబం గురించి ఆలోచిస్తాను ఖచ్చితంగా మా పెళ్లి జరుగుతుందని కార్తీక్ అంటాడు. జరగదని జ్యోత్స్న ఛాలెంజ్ చేస్తుంది. చాలా కాన్ఫిడెంట్ గా ఈ పెళ్లి జరుగుతుందని చెప్పి కార్తీక్ వెళ్ళిపోతాడు. మరొకవైపు భోజనం చేస్తూ మాట్లాడుకుందామని శివన్నారాయణతో దశరథ్ అంటాడు. సుమిత్ర ఎక్కడ అని శివన్నారాయణ అడుగుతాడు. రాదట అని పారిజాతం చెప్తుంది. నువ్వెందుకు చెప్తున్నావని శివన్నారాయణ అంటాడు. అప్పుడే సుమిత్ర వచ్చి.. నేను మీరు తీసుకున్న ఏ నిర్ణయానికి ఎదురు మాట్లాడలేదు కానీ ఈసారి నా వల్ల కావట్లేదు మావయ్య అని సుమిత్ర అంటుంది. నా కూతురిని చంపాలని అనుకుంది.. అలాంటి తన పెళ్లి నా చేతులు మీదుగా అంటే నేను ఒప్పుకోనని సుమిత్ర అంటుంది. నీకు కూడా ఇష్టం లేదని చెప్పు జ్యోత్స్న అని పారిజాతం అంటుంది. తాత నిర్ణయమే నా నిర్ణయమని చెప్పి జ్యోత్స్న అందరికి షాక్ ఇస్తుంది. తాత మన గురించి అలోచించి ఇదంతా చేస్తున్నాడు మమ్మీ ఒప్పుకోమని జ్యోత్స్న రిక్వెస్ట్ చేస్తుంది. నా మనవరాలు ఏదో ప్లాన్ చేసినట్లు ఉంది.. మనం కూడా ఒప్పుకోవాలని పారిజాతం అనుకొని.. నేను ఆయన నిర్ణయానికి సపోర్ట్ చేస్తానని పారిజాతం అంటుంది. మరొకవైపు కార్తీక్ ఇంటికి వస్తాడు. జరిగిందంతా దీపకి చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Aadi Reddy: అఖిల్ సార్థక్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఆదిరెడ్డి!

  బిగ్ బాస్ సీజన్-9 మొదలవ్వకముందే గొడవలు మొదలయ్యాయి. తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి కామన్ మ్యాన్ కోటగిరి కోసం సెలెక్షన్ ప్రక్రియ మొదలైంది. దానికి సంబంధించిన లీక్స్ బయటకొస్తున్నాయి. అయితే సెలెక్షన్ కోసం జడ్జులుగా బిందు మాధవి, అభిజిత్, నవదీప్ ని సెలెక్ట్ చేసింది బిబి టీమ్. దీనిగురించి అదిరెడ్డి తన యూట్యూబ్ ఛానెల్ లో ఓ వీడియో పెట్టాడు.  ఆదిరెడ్డి పెట్టిన వీడియోలో.. అభిజిత్, బిందు మాధవిలతో పాటు అఖిల్ సార్థక్ ఉంటే బాగుండేది అని చెప్పేసి ఓ నవ్వు నవ్వాడు. అది చూసిన అఖిల్ సార్థక్ కి  చివుక్కుమంది. దాంతో అతను తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో ఆదిరెడ్డి క్రింజ్ రివ్యూవర్ అని పెట్టాడు. అది చూసిన అది రెడ్డి మళ్ళీ రియాక్ట్ అయ్యాడు. తన యూట్యూబ్ ఛానెల్ లో ఇరవై ఆరు నిమిషాలతో కూడిన ఓ వీడియోని పెట్టాడు. అందులో నన్ను ఎంత ట్రోల్ చేసిన ఎంత నెగెటివ్ కామెంట్ చేసిన నేను రియాక్ట్ అవ్వను అంటూనే అఖిల్ సార్థక్ ని ఉతికారేసాడు అది రెడ్డి. నా వల్లే సంపాదించుకుంటున్నాడు అని నోరు జారాడు. అతను హర్ట్ కావడానికి మధ్యలో నేను నవ్వడం. అది అనుకోకుండా వచ్చేసింది. అయినా నేను అఖిల్‌ని కంటెస్టెంట్‌గా వెళ్తే బావుంటుందని నేను తక్కువ చేయలేదు. జడ్జీగా వెళ్తేబావుంటుందని అన్నాను. ఆ ఫీలింగ్‌తోనే నేను పోల్ పెట్టాను. సంబంధం లేకుండా అఖిల్‌ని తప్పుపట్టి.. నా స్థాయిని నేను తగ్గించుకుంటానా? అఖిల్ స్థాయి దాటి ఇంకా ఓవర్‌గా మాట్లాడి ఉంటే రియాక్ట్ అయ్యేవాడ్ని కాదు. నీ కర్మ అనుకునేవాడ్ని. నేను ఈ సీజన్‌కి అదే ఫిక్స్ అయ్యాను. నా ఉద్దేశం అది కాదని చెప్పడానికే ఈ వీడియో చేశా. నన్ను క్రింజ్ రివ్యూవర్ అని అన్నాడు. నేను కూడా అనొచ్చు క్రింజ్ రివ్యూవర్ బెటరా.. క్రింజ్ కంటెస్టెంట్ బెటరా అని ఒక మాట అనే ముందు ఆలోచించాలి. అతనికి నేను క్రింజ్ రివ్యూవర్ అని అనిపించిందేమో.. దానికి నేను కౌంటర్ ఇవ్వదలచుకోలేదని అది రెడ్డి అన్నాడు. ఓ పక్క క్రింజ్ రివ్యూవర్ అన్నందుకు.. క్రింజ్ కంటెస్టెంట్ అని అనేసి.. దానికి కౌంటర్ ఇవ్వాలనుకోవడం లేదన్నాడు ఆదిరెడ్డి. దీన్నే అంటారు ఒక చక్కని కవర్ డ్రైవ్ అని.. ఈ వీడియో అఖిల్ సార్థక్ చూస్తే మరో వైరల్ పోస్ట్ వస్తుందనేది నిజం. 

బిగ్ బాస్ దొంగ రివ్యూవర్ కి అఖిల్ సార్థక్ వార్నింగ్!

బిగ్ బాస్ చరిత్రలో రెండు సార్లు రన్నరప్ గా నిలిచిన అఖిల్ గురించి అందరికీ తెలుసు. ఐతే రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అవబోతోంది. ఈ టైములో బిగ్ బాస్ కి సంబందించిన ఒక పోస్ట్ ని అఖిల్ పెట్టాడు. ఇప్పుడు అది వైరల్ అవుతోంది. "బిగ్ బాస్ లో రెండు సార్లు వెళ్లి నేను రన్నరప్ గా నిలిచాను. రెండు సార్లు వెళ్లడం అనేది జస్ట్ ఏ నంబర్ మాత్రమే కాదు అది నాలోని సత్తాని, టాలెంట్ ని ఎక్స్పోజ్ చేస్తుంది. నాతో పోటీ పడిన హౌస్ మేట్స్ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 అగ్నిపరీక్ష కోసం జడ్జెస్ గా వచ్చారు. వాళ్ళ వలన బిగ్ బాస్ కి ఎక్స్ట్రా వేల్యూ అనేది యాడ్ అయ్యింది. ఒక్కసారి నా టాలెంట్ గురించి ఆలోచించండి...రెండు సార్లు వాళ్ళను ఓడించేలా టాస్కులు ఆడాను. నా గురించి నేను కాదు నా ట్రాక్ రికార్డు చెప్తుంది. నేను షోకి అదనపు ఆకర్షణను తీసుకురాగలననే నమ్మకం నాకుంది. ఐనా కానీ వాళ్ళు బిగ్ బాస్ కి ఏది అవసరమో దాన్ని సరైన పద్దతిలో అందిస్తారని నమ్మకం ఉంది.     నా గురించి మాట్లాడిన ఆ దొంగ రివ్యూవర్ కోసమే నేను ఈ కామెంట్ ని రాస్తున్నాను. మీ మొత్తం బిజినెస్ నా మీద డిపెండ్ అయినట్లే కనిపిస్తోంది. నాపై కాన్సంట్రేషన్ చేయడం మానేసి ఆడియన్స్ కి ఏది అవసరమో ఆ క్వాలిటీ కంటెంట్ ని ఎందుకు అందించలేకపోతున్నావ్ ? ఇలాంటి వన్ సైడెడ్ కంటెంటా మీరు ఆడియన్స్ కి అందిస్తోంది. బిగ్ బాస్ షో స్టార్ట్ కావడానికి ముందే అన్ని విషయాలను లీక్ చేసేయడం వలన ఇక ఆడియన్స్ కి ఎం విలువ ఇస్తున్నట్లు ? షోని షోలా ఉండనివ్వండి. ఆడియన్స్ సస్పెన్స్ ని ఎంజాయ్ చేయాలని అనుకుంటారు కానీ అది మొత్తం ఎందుకు నాశనం చేస్తున్నావ్ ? " అంటూ ఒక ఘాటైన మెసేజ్ ని అఖిల్ సార్థక్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో పెట్టారు.

జబర్ధస్త్ సెట్‌లో ఊహించని ఘటన.... ఖుష్భూ మాస్ వార్నింగ్

జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. నూకరాజు స్కిట్ లో రియాజ్, కొమరక్కా ఇంకో కమెడియన్ చేసాడు. ఐతే ఒక కమెడియన్ వచ్చి "ఎవడ్రా నా పెళ్ళానికి 500 లు ఇచ్చింది" అంటూ రియాజ్ ని దబాయిస్తూ ఉన్నాడు. ఇంతలో కొమరక్క వచ్చి "ఎవడ్రా నువ్వు  నా మగోని మీద చెయ్యేశావంటూ" లాగి దవడ మీద ఒక్కటిచ్చింది. అంతే ఆ కమెడియన్ గిలగిలలాడిపోయాడు. దాంతో అందరూ షాకయ్యారు. అది కామెడీగ కాదు నిజంగా కొట్టినట్టుగా భావించారు. ఇక ఆ కమెడియన్ కూడా తిరిగి కొమరక్కను  కొట్టాడు. వీళ్ళ గొడవ చూసిన జడ్జ్ ఖుష్భూ మాత్రం వెంటనే సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. "అన్ని టీమ్స్ కి చెప్తున్నాను ఇంకోసారి ఎవరైనా ఇలా కొడితే ఇక్కడ మార్క్స్ అన్నీ మైనస్ చేస్తాను. కామెడీ అంటే ఇంకొకళ్ళు కొట్టడం కాదు. ఎవరూ ఎవరినీ కొట్టొద్దు. స్కిట్ మాత్రమే చెంపపెట్టులా ఉండాలి. ప్రతీ ఒక్కరూ లిమిట్ లో ఉండాలి." అంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ఇక నెటిజన్స్ కూడా ఈ విషయం మీద రియాక్ట్ అవుతున్నారు. "జబర్దస్త్ లో కామెడీ తక్కువైంది.. కొట్టుకోవడం ఎక్కువైంది .. ఖుష్బూ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు .. సూపర్... ఆ ఫైమకి చెప్పాలి అందరిని కొడుతుంది" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్య స్కిట్స్ లో జోరుగా కొట్టుకోవడమే ఎక్కువగా కనిపిస్తోంది.. ఇక కృష్ణ భగవాన్ మాత్రం చూస్తూ ఉన్నారు కానీ ఏమీ మాట్లాడలేదు.

Jayam serial : కోటిరూపాయల కోసం కూతురికి పెళ్ళి చేస్తున్న పైడిరాజు.. రుద్ర ఏం చేస్తాడు!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -25 లో....గంగని కలవడానికి పెద్దసారు, వంశీ వస్తారు. వాళ్ళని అవమానించి పంపించండని ఇషిక తన మనిషికి చెప్తుంది. దాంతో రౌడీలు అందరు పెద్దసారుని చుట్టుముడతారు. ఎవరు మీరు అని పెద్దసారు అడుగుతాడు. అప్పుడే పైడిరాజు ఎంట్రీ ఇచ్చి మీరెందుకు వచ్చారు. ఈ రోజు మా గంగ పెళ్లి అనగానే పెద్దసారు షాక్ అవుతాడు. అప్పుడే పెళ్లికొడుకు వచ్చి గంగని చేసుకోబోయేది నేనే అని అబ్బాయి వస్తాడు. నేను ఒకసారి గంగతో మాట్లాడుతానని పెద్దసారు అంటాడు. అయినా వినిపించుకోకుండా అటు ఇటు నెట్టేస్తారు. వంశీని కొడుతుంటే ఆపండి.. మేమ్ వెళ్ళిపోతామని పెద్దసారు రిక్వెస్ట్ చేస్తాడు. మంచిగా రిక్వెస్ట్ చెయ్యండి అని రౌడీలు అంటారు. దాంతో చేతులు జోడించి పెద్దసారు రిక్వెస్ట్ చేస్తాడు. ఆ తర్వాత పెద్దసారు వంశీ ని తీసుకొని అక్కడ నుండి బయల్దేరతాడు. వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోగానే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. వీళ్ళు కాదు‌.. నీ భార్య ఎప్పుడు మారేది తెలియదు.. ముందు తన సంగతి చూడమని పెళ్లికొడుకు పైడిరాజు తో అంటాడు. పైడిరాజు తన భార్యకి నిద్రమాత్రలు ఇస్తుంటే.. నువ్వు ఇంత ప్రేమ నటిస్తున్నావ్ దీని వళ్ల నా కూతురికి ఏమైనా అయితే నీ సంగతి చెప్తానని పైడిరాజుకి తన భార్య వార్నింగ్ ఇస్తుంది. నాకు కోటి రూపాయలు వచ్చాక నిన్ను ఎవడు పట్టించుకుంటాడే అని పైడిరాజు అనుకుంటాడు. మరొకవైపు పెద్దసారు వంశీ ఇంటికి వస్తారు. ప్లాన్ సక్సెస్ అని ఇషిక, వీరు అనుకుంటారు. పెద్దసారు ఇంట్లోకి వెళ్ళాక గంగ గురించి అడుగుతారు. గంగకి ఈ రోజు పెళ్లి అని చెప్తాడు. అప్పుడే రుద్ర వస్తాడు. అక్కడ ఏం జరిగిందని అడుగుతాడు. ఏం లేదని పెద్దసారు అంటాడు. అయిన రుద్ర నమ్మడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu : భాగ్యం, ఆనందరావుకి చుక్కలు చూపించారు.. వేదవతికి క్షమాపణ చెప్పిన రామరాజు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -234 లో... ఆనందరావు, భాగ్యం ఇంట్లోకి వచ్చాక.. అసలు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళారు బాబాయ్ అని నర్మద అడుగుతుంది. ఈ ఇల్లు అనుకొని ఆ ఇంట్లోకి వెళ్ళానని ఆనందరావు చెప్తాడు. ఈ రోజు శ్రీవల్లి అక్క పుట్టినరోజు అంటున్నారు.. కనీసం గిఫ్ట్, కేక్ లేకుండా ఎలా సర్ ప్రైజ్ ఇద్దామనుకున్నారని నర్మద, ప్రేమ డౌట్ మీద డౌట్ అడుగుతారు. మీరెందుకు అలా అడుగుతున్నారు.. ఒకసారి చెప్పాడు కదా అని శ్రీవల్లి కోప్పడుతుంది. ఆ తర్వాత అందరు శ్రీవల్లి కి బర్త్ డే విషెస్ చెప్తారు. శ్రీవల్లిని నర్మద హగ్ చేసుకొని విషెస్ చెప్పి ఈ రోజు నీ బర్త్ డే కాదని తెలుసు.. రాత్రి దొంగతనానికి వచ్చింది మీ నాన్నే అని తెలుసని  శ్రీవల్లి చెవిలో చెప్తుంది నర్మద. దాంతో శ్రీవల్లి టెన్షన్ పడుతుంది.  ఆ తర్వాత మీ వాళ్ళు పాపం మావయ్య గారిని దొంగ అనుకొని కొట్టారు.. కొంచెం కూడ బుద్ధి లేదా అని ప్రేమపై దీరజ్ కోప్పడతాడు. ఇద్దరు కాసేపు ఒకరి జుట్టు ఒకరు పట్టుకొని మరి కొట్టుకుంటారు.ఆ తర్వాత భాగ్యం, ఆనందరావు ఎవరు చూడకముందు ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని వెళ్తుంటే నర్మద చూస్తుంది. అది వాళ్ళు చూసి ఇప్పుడు గనక వెళ్తే వాళ్ళు మనల్ని ఫాలో అయి మన భాగోతం మొత్తం బయట పెడతారని కవర్ చేస్తూ వెనక్కి వెళ్తారు. ఇలా కాదు ఇంటి వెనకాల నుండి వెళదామని ఆనందరావు గోడ దూకుతాడు. అది ప్రేమ చూస్తుంది. వాళ్ళు చూసి మళ్ళీ లోపలి వైపు వస్తారు. అటు వెళ్తే ఆవిడ.. ఇటు వెళ్తే ఈవిడ.. మనం ఏం చెయ్యాలి.. అలా అని ఇంట్లో ఉంటే మనల్ని మాటల్తో టార్చర్ పెడుతున్నారని భాగ్యం, ఆనందరావు అనుకుంటారు.ఆ తర్వాత మొదటి ధాన్యం ఇంటికి వస్తుంది. వేదవతిని రామరాజు పిలిచి కొంచెం తీసుకొని వెళ్లి దేవుడికి పెట్టమని రామరాజు అనగానే మీరే తీసుకొని వెళ్ళండి అని వేదవతి అంటుంది. నువ్వు నా లక్ష్మిదేవివి నిన్ను అపార్థం చేసుకున్న నన్ను క్షమించమని వేదవతితో రామరాజు అనగానే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదంతా ప్రేమ, నర్మద చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.