Illu illalu pillalu : శ్రీవల్లి ఆ గండం నుండి తప్పించుకుంటుందా.. చందు ఏం చేయనున్నాడు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -225 లో.....సాగర్ ధీరజ్ అంతా తమ భార్యల వల్లే అని కోపంగా ఉంటారు. అప్పుడే చందు వచ్చి ప్రేమ అసలు ఎందుకు అలా చేసిందో ఆలోచించావా నీపై ప్రేమతో నువ్వు ఒక్కడివే కష్టపడుతున్నావని చూడలేక అది అర్థం చేసుకోకుండా తనపై కోపం పెంచుకుంటావ్ ఏంటని ధీరజ్ పై కోప్పడతాడు చందు. వాళ్ళు తన ఫ్యామిలీని వదిలి మీతో వచ్చారు.. మీరు ఎలా చూసుకోవాలి.. మీరు అర్ధం చేసుకోకపోతే వాళ్ళకి ఎలా అనిపిస్తదని తన తమ్ముళ్ళకి క్లాస్ తీసుకుంటాడు చందు. మరొకవైపు ఇంట్లో ఎవరు తమతో మాట్లాడడం లేదని ప్రేమ, నర్మద ఇద్దరు బాధపడతారు. ఇంతవరకు అమ్మని మిస్ అయిన ఫీలింగ్ రాలేదు కానీ మొదటిసారి అమ్మ గుర్తు వస్తుందని ఇద్దరు అనుకుంటారు. అదంతా వేదవతి విని బాధపడుతుంది. వాళ్ళ ఇద్దరి మధ్యలో వచ్చి కూర్చుంటుంది. ఏంటి మీ అమ్మ గుర్తువస్తుందా.. మరి ఇక్కడ ఉన్నదాన్ని ఏంటి దెయ్యన్నా.. ఇంకొకసారి ఇలా అంటే ఊరుకోనని వేదవతి అంటుంటే.. ప్రేమ, నర్మద ఇద్దరు వేదవతి భుజాలపై తలవాల్చి ఎమోషనల్ అవుతారు. మరుసటిరోజు ఉదయం శ్రీవల్లి నిద్ర లేచి.. నా తాళాలు ఎక్కడ అంటూ వెతుకుతుంది. హమ్మయ్య.. ఉన్నాయ్ ఎప్పటికి ఇంట్లో పెత్తనం నాదే ఉండాలి మావయ్య గారు నేను ఏది చెప్పినా వినాలని శ్రీవల్లి బయటకు వస్తుంటే.. ప్రేమ, నర్మద వేదవతి నవ్వుతు మాట్లాడుకుంటుంటారు. వీళ్ళు ఎప్పుడు కలిసి పోయారని కళ్ళు తిరిగి పడిపోతుంది శ్రీవల్లి. వాటర్ చల్లి లేచాక మీరు కలిసిపోయారా అని శ్రీవల్లి అడుగుతుంది. వేదవతికి నర్మద సైగ చెయ్యగానే వాళ్ళతో నేనేందుకు మాట్లాడుతానని వేదవతి అంటుంది. ఆ తర్వాత సేట్ చందు దగ్గరికి వచ్చి నాకు పని చెయ్యని చెక్ ఇచ్చారు. ఈ విషయం మీ నాన్నకి చెప్తానని అంటుంటే వద్దని అతడిని రిక్వెస్ట్ చేసి పంపిస్తాడు. అదంతా నర్మద చూసి బావగారు ఏదైనా ప్రాబ్లమ్ ఆ అని అడుగుతుంది. అప్పుడే రామరాజు వస్తాడు. ఏంటి రా ఏదో టెన్షన్ పడుతున్నావని అడుగుతాడు. ఏం లేదని చందు అంటాడు. రామరాజు వెళ్ళాక ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే చెప్పండి బావ గారు అని నర్మద అడుగుతుంది. చిన్న విషయమే నేను చూసుకుంటా ఎవరితో ఈ విషయం చెప్పకని చందు అంటాడు. ఆ తర్వాత శ్రీవల్లి దగ్గరికి చందు వెళ్లి.. పనికి రాని చెక్ ఇచ్చి మోసం చేశారు.. పదా మీ ఇంటికి వెళదామని శ్రీవల్లిని చందు బయటకు తీసుకొని వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2: దీప కన్నతండ్రి కుబేర్ కాదని చెప్పేసిన అనసూయ.. షాక్ లో పారిజాతం!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -424 లో.....దీప బాధపడుతుంటే ఇంకా ఆ మాటల గురించే ఆలోచిస్తున్నావు.. ఎలాగు రేపు మీ నాన్న దగ్గరికి వెళ్తావ్ కదా అని కార్తీక్ అనగానే ఏంటి ఏమంటున్నావ్ రేపు వెళ్లడమేంటని కాంచన అంటుంది. కార్తీక్ ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తాడు. ఆ తర్వాత కావేరి దగ్గరికి శ్రీధర్ వచ్చి రేపు ఒక ప్లేస్ కి వెళ్ళాలి.. రేపు ప్రోగ్రాం ఏం పెట్టుకోకని అంటాడు. మరుసటి రోజు కుబేర్ ఆర్ధికంకి అన్ని ఏర్పాట్లు చేస్తారు. దీప పిండం పెట్టబోతుంటే అనసూయ తీసుకొని నా తమ్ముడికి నేను పెడతాను.. మీరు వెళ్లి అన్నదానం దగ్గర భోజనం ఏర్పాట్లు చూడండి అని అనసూయ అంటుంది. ఆ తర్వాత అన్నదానం దగ్గరికి దశరథ్ కుటుంబంతో వస్తాడు. అప్పుడే శ్రీధర్ కూడా ఎంట్రీ ఇస్తాడు. ఇక ఎప్పటిలాగే శ్రీధర్ ఏదో ఒకటి గొడవ పెట్టుకోవడానికి మాట్లాడతాడు. ఇక్కడ మాకు మర్యాదలు చెయ్యట్లేదు అన్నట్లుగా దీప, కార్తీక్ లతో పారిజాతం అంటుంది. ఆ తర్వాత దశరథ్ చైర్ పై కూర్చోబోతుంటే కింద పడిపోబోతాడు.. మెల్లిగా నాన్న అని దీప అనగానే.. దొరికింది ఛాన్స్ అని ఇప్పుడు ఏమన్నావ్ ఇలా ఎన్నిసార్లు నాన్న అంటావని జ్యోత్స్న కోప్పడుతుంది. ఈ రోజు వాళ్ళ నాన్న ఆర్ధికం కదా.. నాన్న అని ఆ ధ్యాసలో ఉండి అంది అని కార్తీక్ కవర్ చేస్తాడు. అయిన పారిజాతం వినిపించుకోకుండా గొడవపెడుతుంది. నీ వల్ల చనిపోయిన మీ నాన్నకి కూడా ప్రశాంతంగా ఉండదని పారిజాతం అంటుంటే.. పదే పదే చనిపోయాడు అనకండి అని దీప అంటుంది. చనిపోయిన వాడిని పట్టుకొని అలా కాకుండా ఎలా అంటారని పారిజాతం అంటుంది. మా నాన్న చనిపోలేదని దీప అంటుంది. దాంతో అందరూ షాక్ అవుతారు.ఫోటో ఎదురుగా పెట్టుకొని చనిపోలేదంటారు ఏంటని శ్రీధర్ అడుగుతాడు. అది నా తమ్ముడు కుబేర్ ఫోటో అని అనగానే అంటే దీప నాన్నే కదా అని పారిజాతం అంటుంది. కాదని అనసూయ అంటుంది. దాంతో అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : దుగ్గిరాల కుటుంబమంతా షాక్..‌ స్వరాజ్ ఏం చేసాడంటే!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -788 లో.....రేవతి బాబుని అపర్ణ బాగా చూసుకుంటుంది‌. అన్నం తినిపిస్తుంది.. అదంతా కావ్య వీడియో కాల్ చేసి రేవతికి చూపిస్తుంది. రేవతి హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది. బాగా టైడ్ అయ్యావ్ పడుకుందువురా అని బాబుతో అపర్ణ అంటుంది. నువ్వు నన్ను ఎత్తుకొని తీసుకొని వెళ్ళు అని బాబూ అనగానే బాబుని ఎత్తుకొని లోపలికి తీసుకొని వెళ్తుంది అపర్ణ. ఆ తర్వాత ఇందిరాదేవి బాబు ఎక్కడ చూస్తాడోనని ముసుగు వేసుకొని వెళ్తుంటే ఏమైందని రుద్రాణి అడుగుతుంది. అప్పుడే ఇందిరాదేవికి బాబు డాష్ ఇస్తాడు. తాతమ్మ అనగానే అందరు షాక్ అవుతారు. ఎక్కడ నిజం తెలిసిపోతుందోనని రాజ్, కావ్య టెన్షన్ పడుతుంటారు. మా అమ్మ నీకు ముందే తెలుసా ఎందుకు అలా పిలిచావని రుద్రాణి అడుగుతుంది. నువ్వు నాకూ నచ్చలేదని రుద్రాణితో అంటాడు బాబు. నేను అంటే నీకు ఇష్టం కదా నాకు చెప్పు మా అత్తయ్య ముందే తెలుసా అని అపర్ణ అడుగుతుంది. మా అమ్మ ఇలా బొండంలాగా ముసలివాళ్ళు ఎవరు కనిపించినా కూడా తాతమ్మ అని పిలవమందని బాబు అనగానే రాజ్, కావ్య రిలాక్స్ అవుతారు. ఆ తర్వాత రాజ్, కావ్య బాబు బయట ఉంటారు. నేను ఎక్కడ తెలుసు అంటానోనీ భయపడ్డారా.. నాకు మీరు గుళ్లో ఏమని చెప్పారు.. ఎవరు తెలిసినా తెలియనట్లు ఉండమన్నారు కదా అని బాబు అంటాడు. మరొకవైపు రాజ్ కి ఫోన్ చేస్తుంది యామిని. నేను రేపు కావ్యకి ప్రపోజ్ చేయబోతున్నానని రాజ్ చెప్తాడు. ఆ తర్వాత కావ్య దగ్గర పడుకుంటానని బాబు అనుకుంటాడు. లేదు.. నువ్వు నీ ఫ్రెండ్ అపర్ణ దగ్గర పడుకోమని కావ్య చెప్తుంది. సరేనని బాబూ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

కూరగాయల మార్కెట్, కూకట్‌పల్లి ఫ్లైఓవర్ అదే తెలుసు నాకు అప్పటికి

  ప్రశాంత్ బిగ్ బాస్ తర్వాత ఇంత గ్యాప్ తీసుకున్నావంటే ఏదో జరుగుతోంది ? అని అంది వర్ష. "అంతకు మించి" అని సిగ్గుపడుతూ సమాధానం ఇచ్చాడు పల్లవి ప్రశాంత్. "మనతో పాటు పొలంలో పని చేసిన అంకుల్స్, ఆంటీలు కానీ ఒరేయ్ కోతి నా కొడకా ఇది ఇంకా ఆపవా" అని అడిగితే "ఆపము అది. అది అట్లే నడుస్తూ ఉంటుంది. "ఉన్నది చిన్న ఫోన్..అందులో వీడియోస్ చేస్తే బిగ్ బాస్ వరకు వెళ్తాను అని ఎలా అనిపించింది" అని అడిగింది వర్ష ." ఒక సారి బాపు దగ్గర ఒక పెద్దాయన వచ్చారు. నీ కొడుకు ఎం చేస్తున్నాడు అంటే పొలం కాడ పని చేస్తున్నాడు అని చెప్పాడు. ఆయన కొంచెం తీసిపారేసినట్టు మాట్లాడాడు..దాంతో నాకు బాధ అనిపించింది. బాపు దగ్గర 500 లు తీసుకున్న.. హైదరాబాద్ కొత్త. ఎక్కడుండాలో తెలీదు. ఒక్కటే తెలుసు. కూరగాయల మార్కెట్,కూకట్‌పల్లి ఫ్లైఓవర్  కింద కూరగాయలు అమ్ముకోవాలి పోవాలే" అన్నాడు. "ఎవరినో అడగలనిపిస్తుంది నాకు "నీ హార్ట్ టప్ టప్ మని కొట్టుకుంటోంది. ఒక పోరి ఎలా ఉంది ? " అనేసరికి "తెల్లగా ఉంటది" అంటూ ప్రశాంత్ సిగ్గుతో కామెడీ చేసాడు. "బిగ్ బాస్ తర్వాత మీరు ఇద్దరూ టచ్ లో లేరా" అని అడిగింది. "షో ఐపోయాక మాట్లాడాను కానీ..ఆ తర్వాత ఇంకా మాట్లాడలేదు . మంచిగా ఉండాలని కోరుకుంటా అక్క" అంటూ ఆన్సర్ ఇచ్చాడు. బిగ్ బాస్ సీజన్ 7 టైములో  హౌస్ లో పల్లవి ప్రశాంత్ , రతికా మధ్య ఒక లవ్ స్టోరీ నడిచిన విషయం తెలిసిందే. పల్లవి ప్రశాంత్ కూడా రాతికతో బాగా క్లోజ్ అయ్యాడు. ఆమె ప్రపంచం అన్నట్టు ప్రవర్తించేవాడు. దాంతో నెటిజన్స్ కూడా పల్లవి ప్రశాంత్ ని ట్రోల్ చేసిన విషయం తెలిసిందే.

జీవితంలో ఏది జరగకూడదనుకున్నానో అవన్నీ జరిగాయి

చాన్నాళ్ల తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్ రతికా రోజ్ గురించి ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసాడు.  ఒక ఇంటర్వ్యూకి సెలెబ్రిటీగా పల్లవి ప్రశాంత్ వచ్చాడు. ఇక హోస్ట్ వర్షా కూడా ఇంటరెస్టింగ్ ప్రశ్నలే వేసింది. "ఇంత మంచి మనిషివి చాలా కష్టపడి ఇంత స్టేజికి వస్తే నిన్ను చాలా మంది తిట్టారు" అని చెప్పింది. ఇక పల్లవి ప్రశాంత్ ఏడుస్తూ " అన్నా ఒక మనిషి గురించి తెలుసుకుని వాళ్ళు చేస్తున్నారా చేయట్లేదా చూడాలి.." అన్నాడు. "అమరదీప్ తో నీ బాండింగ్ ఎలా ఉంది ఇప్పుడు" అని అడిగింది. "అన్నా ఆ పంచాయతీలన్నీ విడిచిపెట్టు. నేను మీరు చేశారు అనుకున్నా..మీరు నేను చేసాను అనుకున్నారు. చెప్పాను కాదన్నా..లవ్ యు అన్నా" అన్నాడు. "విజయం సాధించాక ఎవరైనా ఇంటికి వెళ్తారు కానీ నువ్వు జైలుకు వెళ్ళావు ప్రశాంత్" అంది. "నుదిటిన రాసుంది..ఇంత బతుకు బతికి బాపు అక్కడ కోర్ట్ మెట్ల కాడ ఉన్నాడు. ఆయన ఇప్పటికీ బాధపడుతున్నాడు " అన్నాడు. "జైల్లోకి వెళ్లిన ఇన్సిడెంట్ లైఫ్ లాంగ్ గుర్తు ఉంటుంది. జైల్లోకి వెళ్లి నాలుగు రోజులు ఉన్నప్పుడు అన్నా బిగ్ బాస్ లో ఎవరు గెలిచారు అన్నారు..ఏది చూడకూడదు అనుకున్నానో అవన్నీ చూసాను. జైలుకు వెళ్లాను, చావు బతుకుల వరకు వెళ్లాను. ఒక రోజు ఒకళ్ళు సాయం కావాలని అని అడిగితే అర్ధరాత్రి అక్కడికి వెళ్లి వస్తున్నాం. కార్ లారీని అన్నా ఢీ కొట్టాలి లేదంటే పక్కనే ఉన్న జంతువునన్నా ఢీ కొట్టాలి. నేను కార్ సైడ్ కి తీసుకున్న. మూడు పల్టీలు కొట్టింది. తమ్ముడికి మెడ దగ్గర దెబ్బ తగిలింది. దాంతో అన్నా అని అరిచాడు. అన్నా అని అరిచేసరికి భరించడం నా వల్ల కాలేదు..ఆరోజు వాడికేమన్నా ఐనా నాకేమన్నా ఐనా అంతే" అంటూ బాధగా తన జీవితంలో జరిగిన సంఘటనను చెప్పుకొచ్చాడు పల్లవి ప్రశాంత్ .

చిత్రగారు పేపర్ ని తిరగేసి కూడా చదవగలరు.. పాత్రికేయులు అడగాల్సిన ప్రశ్న అది కాదు

  పాడుతా తీయగా షో ఆడియన్స్ ని అలరిస్తూనే ఉంది. ఈ వారం షోలో జయరాం అనే కుర్రాడు "ఏదో ఒక రాగం" అనే సాంగ్ పాడాడు. ఐతే పాట పూర్తయ్యాక "చిత్ర గారిలా చక్కగా పాడావు" అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు కీరవాణి. అలాగే చిత్ర గారి సూపర్ టాలెంట్ గురించి చెప్పుకొచ్చారు. "చిత్ర గారు పుట్టకతో ఆవిడ మలయాళీ. మెల్లమెల్లగా తెలుగు పాటలు పాడుతూ తెలుగు నేర్చుకున్నారు. చాలామంది తెలుగు వాళ్లకు కూడా రాని తెలుగు ఆమెకు వచ్చు. ఆ పదాల అర్థాలతో పాటు అన్ని ఆమెకు తెలుసు. పైగా ఆవిడ తెలుగు పేపర్ ఏదన్నా ఉంటే దాన్ని తిరగేసి మరీ చదువుతారు. ఆవిడ పేపర్ ని తిరగేసి పదాలను గుర్తు పట్టి చదివేస్తూ ఉంటారు. ఆమెను చూసి నేను చాలా సార్లు ఆశ్చర్యపోయాను. కాగితం  తిరగేసి ఉన్నా కూడా చదవగలుగుతున్నారు అని అనేవాడిని. ఒక భాష మీద సాధికారత సంపాదించాలంటే దానికి శ్రద్ద, ఆసక్తి ఉంటే చాలు. గత 30 ఏళ్ళుగా పాత్రికేయులు నన్ను తినేస్తూ ఉంటారు... నన్నే కాదు అందరినీ ఎందుకు పరభాషా గాయకులతో పాడిస్తున్నారు అని..కానీ అది కాదు అడగాల్సిన ప్రశ్న..చక్కగా పాడుతున్నారా లేదా అని.. పరభాషా గాయకులూ పాడడం ప్రాబ్లమ్ కాదు. వాళ్ళు కరెక్ట్ గా పాడడమే మనకు కావాల్సింది. అలా చూసుకుంటే బాలుగారు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ వంటి అనేక భాషల్లో పాటలు పాడారు. పరభాషా గాయకులు పాడకూడదు అని వాళ్ళందరూ కూడా అనుకుని ఉంటే చక్కటి గాయకులను వాళ్లంతా  మిస్ అయ్యుండేవాళ్లు కదా" అంటూ చెప్పారు కీరవాణి.  

ఢీ షోలో ఇరగదీసిన పండు..ఫిదా ఐన జడ్జెస్.. 

ఢీ షో ఈ వారం ఎపిసోడ్ లో డాన్సర్స్ అంతా పోటా పోటీగా ఇదే ఫైనల్స్ అన్న లెక్కలో చేశారు. ఇక పండు డాన్స్ ఐతే ఇరగదీసేసాడు. నెక్స్ట్ లెవెల్ లో చేసి మంచి మార్కులు కొట్టేసాడు. షర్ట్ నిక్కర్ వేసుకుని నిక్కర్ జేబుల్లో పూలు పెట్టుకుని నుదుటిన నల్ల బొట్టు, బుగ్గన చుక్క పెట్టుకుని నెత్తిన పిలక వేసుకుని దానికి పూలు పెట్టుకుని మెడలో చైన్ వేసుకుని అసలు గెటప్ చూస్తేనే నవ్వొచ్చేలా ఉంది. ఇక సొంతంగా సాంగ్ రాసుకుని పాడుతూ చేసిన డాన్స్ ఐతే మాములుగా లేదు. అందులో మళ్ళీ జాను లిరి గురించి కొన్ని లిరిక్స్ యాడ్ చేసాడు. జానులిరి డాన్స్ చేస్తే ట్రోల్ అవుతుంది అని ఆ ట్రోల్స్ మీద ఏడుస్తూ కూర్చుంటుంది అని రాసాడు. తర్వాత భూమిక డాన్స్ చేస్తే ప్యాంటు సర్దుకుంటుంది, మాష్టర్ మాష్టర్ అంటూ వెనక తిరుగుతూ ఫైనల్స్ కి వెళ్తుంది అంటూ ఆమె గురించి లిరిక్స్ ని రాసాడు. మా అభి మాష్టర్ డాన్స్ చేస్తే గ్రేస్ ఉంటాది, ఐ లవ్ యు అంటూ జడ్జెస్ కి సిగ్నల్ ఇస్తాడు, చివరికి మార్కులన్నీ దోచుకుంటాడు అంటూ అభి మాష్టర్ గురించి చెప్పాడు. ఇక చివరికి తన గురించి కూడా చెప్పుకుంటూ లిరిక్స్ రాసాడు. సెట్ లో అందమైన అమ్మాయిలకు తానంటే ఇష్టం అని తానొస్తే షో మొత్తం దున్నేస్తాడు కానీ ఫైనల్ కి వచ్చాక ఫెయిల్ అవుతాడు అంటూ ఫన్నీగా చెప్పుకున్నాడు. పండు డాన్స్ చాలా యూనిక్ గా ఉంటుంది కానీ ఇంతవరకు టైటిల్ మాత్రం కొట్టలేదు. ఈ ఢీ సీజన్ 20 స్టార్ట్ ఐన దగ్గర నుంచి ఈ సాలా కప్పు నమదే అంటూ చెప్తూ ఫ్యాన్ క్రియేట్ చేస్తున్నాడు. ఇలా సాగిన పండు డాన్స్ కి జడ్జెస్ కూడా ఫిదా ఇపోయారు. ఇక రఘు మాష్టర్ ఐతే పండు సాంగ్ చాలా ఇన్నోవేటివ్ గా ఉంది. నీ ఓన్ గా సాంగ్ రాసుకుని పాడావ్ బాగుంది..ఈ సాలా కప్పు నీదే అంటూ చెప్పారు. ఇక విజయ్ బిన్నీ మాష్టర్ ఐతే పండు  నువ్వు హడావిడి హడావిడి చేస్తావ్ చేస్తావ్ . చాలా మంది ఇలా చేస్తారు కానీ డాన్స్ చేయరు కానీ నువ్వు అన్ని చేస్తావ్ డాన్స్ కూడా చేస్తావ్ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు.

మేము పెడితే కూత కాదు కోతే..

డ్రామా జూనియర్స్ లేటెస్ట్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో చిన్నారులంతా కలిసి ధర్నా చేస్తూ ఉంటారు. "మొగుడ్స్ వెర్సెస్ పెళ్లామ్స్" అనే కాన్సెప్ట్ లో పిల్లలు అంతా కూడా ఒక మగాడు హ్యాపీగా ఉండాలంటే ఎం చేయాలి అనుకుంటూ ఉంటారు. దానికి ఆన్సర్ ని అనిల్ రావిపూడి ఇచ్చారు. "మూడు తప్పులు చేయకూడదు..లవర్ మ్యారేజ్ , అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోకూడదు.. ఫైనల్ గా అసలు పెళ్లి చేసుకోకూడదు" అన్నారు. ఆడపిల్లలంతా ఆదివారం ఆడవాళ్ళకు సెలవు కావాలి అని అడుగుతూ మగపిల్లలేమో వారంలో ఒక్కరోజైనా మాకు మనఃశాంతి కావాలి అంటూ ధర్నాలు చేస్తూ ఉంటారు. "ఇది తేలే విషయం కాదు కానీ రెండు టీమ్స్ మధ్య కబడ్డీ పెడదాం" అని చెప్పారు అనిల్ రావిపూడి. ఆడోళ్ళు గెలిస్తే ఆదివారం ఆడవాళ్లకు సెలవు మగవాళ్ళు గెలిస్తే వాళ్ళు అడిగినట్టు వారంలో ఒక రోజు మనఃశాంతి అన్నారు. "మనఃశాంతి కోసం మరణానికి సిద్ధం" అంటూ మగపిల్లలు కూత పెడుతూ ఉంటె "దమ్ముంటే పట్టుకోరా నా మొగుడా " అంటూ ఆడపిల్లలు కూత పెట్టారు. ఇక ఫైనల్ గా అనిల్ రావిపూడి, రోజా కబడ్డీ రింగ్ లోకి ఎంటర్ అయ్యారు. మగవాళ్ళు చీటింగ్ చేస్తున్నారు అన్నారు రోజా. దానికి సుధీర్ "కూతకు మీరు వెళ్తారా వాళ్ళను రమ్మంటారా" అని అడిగాడు. రోజా మాత్రం ఫుల్ జోష్ తో ఆన్సర్ ఇచ్చింది. "మేము పెడితే అది కూత కాదు కోతే" అన్నారు. "ఆవిడ ఊపు చూస్తే అది కోత లాగే ఉంది" అన్నారు అనిల్ రావిపూడి అన్నారు. తర్వాత రోజా "మనఃశాంతి కావాలా మరణం కావాలా" అంటూ కూత పెట్టారు.

బాబుమోహన్ - కోట శ్రీనివాసరావు జంట సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది

  ఆదివారం విత్ స్టార్ మా పరివారం రాబోయే ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఫ్రెండ్ షిప్ డే  ని పురస్కరించుకుని ఈ షోకి వచ్చిన వాళ్లంతా వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి వచ్చారు. ఇక ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ షిప్ ఆనాటి నుంచి ఈనాటి వరకు చెప్పుకునేది ఏదైనా ఉంది అంటే అది బాబుమోహన్ - కోట శ్రీనివాసరావు ఫ్రెండ్ షిప్ గురించే. ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలి అంటూ ఒక ఉదాహరణగా కూడా చూపిస్తూ ఉంటారు. ఐతే ఇప్పుడు ఆ స్నేహితుల్లో కోట గారు బాబు మోహన్ గారిని వదిలేసి వెళ్లిపోయారు. దాంతో ఆయన స్నేహితుడు లేని ఒంటరి మనిషిగా ఉన్నారు. అలాంటి ఆయన ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోకి వచ్చారు. ఇక శ్రీముఖి ఐతే "నా బెస్ట్ ఫ్రెండ్ బాబు మోహన్ గారు వచ్చారు" అంటూ ఇన్వైట్ చేసింది. అలా అందరూ లేచి ఆయన చుట్టూచేరి "ముస్తఫా ముస్తఫా" సాంగ్ కి డాన్స్ చేశారు. కోట శ్రీనివాసు రావు గారితో బాబు మోహన్ ఉన్న ఫోటోని ఆయనకు గిఫ్ట్ చేశారు. "కోటన్నా మళ్ళీ నటుడిగా పుట్టి తీరతాడు" అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. "బాపు రమణల స్నేహం గురించి మన తెలుగు వాళ్లంతా చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పటి నుంచి బాబుమోహన్ - కోట శ్రీనివాసరావు గారి స్నేహం కూడా శాశ్వతంగా సువర్ణాక్షరాలతో అలా ఈ సినిమా చరిత్రలో లిఖించబడుతుంది అని ఈ వేదిక సాక్షిగా తెలియజేస్తున్నా" అంటూ లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ నాలుగు మంచి మాటలు చెప్పారు. ఇండస్ట్రీలో కొన్ని పెయిర్స్ ఎప్పుడూ ఎవర్ గ్రీన్ . సుత్తి - వీరభద్రరావు, బాపు-రమణ, కోట-బాబూమోహన్ ఇలా కొన్ని జంటలు ఉన్నాయి..వాళ్ళు ఎప్పటికీ చరిత్రలో అలా నిలిచిపోతారు.

Jayam serial : పొంగలి రుచిచూపించిన కొత్తపనిమనిషి.. శంకుతలని గంగ మార్చేస్తోందా!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -15 లో.....పెద్దసారు, గంగ మాట్లాడుకుంటారు. కొడుకు చనిపోయాడు అందుకే నా భార్య బాధతో గదిలో నుండి బయటకు రావడం లేదు.. అసలు ఏం తింటుందో.. ఏ టైమ్ కి పడుకుంటుందో తెలియదు.. నువ్వు తనలో మార్పు తీసుకొని వస్తావని నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చానని గంగతో పెద్దసారు అంటాడు. కిచెన్ లోకి గంగ వెళ్లి నేను వంట చేస్తాను.. మీరు పక్కకి తప్పుకోండి అని గంగ అంటుంది. ఇంతకీ ఏం వంట చెస్తున్నావని ఇంట్లో వాళ్ళు అడుగుతారు. పొంగలి చేస్తున్నా అని గంగ అనగానే అది శకుంతలకి బాగా ఇష్టమని పెద్దసారు అంటాడు. గంగ పొంగలి చేసి శకుంతల దగ్గరికి వెళ్లి డోర్ కొడుతుంది. ఎవరు అని కోపంగా శకుంతల ఆడుగగా నేను భానుని అని అనగానే శకుంతల డోర్ తీస్తుంది. మీకు ఇష్టమైన వంట చేసుకొని వచ్చానని గలగల మాట్లాడుతుంటే శకుంతల కొడుకు భాను మాట్లాడినట్లుగా శకుంతల ఉహించుకుంటుంది. తనకి ఇష్టమైన పొంగలి చేసానని తినిపిస్తుంది. అందరు గంగని తిడుతుందనుకుంటారు కానీ శకుంతల పొంగలి తింటు మాట్లాడుతుంటే గంగ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందరు శకుంతల గది దగ్గర ఉండడంతో ఏమైంది పెద్దమ్మకి అని రుద్ర కంగారుపడతాడు. ఏం లేదు కొత్తగా పనిమనిషి జాయిన్ అయింది. తనతో శకుంతల బాగుంటుందని అనగానే నేను ఒకసారి చూస్తానని రుద్ర అంటాడు. వద్దు మళ్ళీ నిన్ను చూస్తే ఏమన్నా అంటుందని పెద్దసారు  అనగానే సరే నేను వెళ్తున్నానని రుద్ర వెళ్తాడు. ఆ తర్వాత రుద్ర వెళ్తుంటే కార్ వెనకాల గంగ కూర్చొని ఉంటుంది. ఆ విషయం రుద్రకి తెలియదు. రుద్ర సూపర్ మార్కెట్ దగ్గర కార్ ఆగగానే తన కంటే ముందు వెళ్లి పూజ చేస్తుంది గంగ. అప్పుడే గంగని చూస్తుంటాడు రుద్ర. తరువాయి భాగంలో శకుంతల వచ్చి వంట చేస్తుంది. అందరు తినేసి కాసేపటికి పడుకుంటారు. రుద్ర ఒక్కసారిగా లేచి పెద్దమ్మ చేతిగోరు ముద్దలు తినలేను.. తను వండింది అయిన తింటానని రుద్ర భోజనం చేస్తుంటే గంగ చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu : అత్తాకోడల్లు కలిసిపోయారు.. శ్రీవల్లి ఏం చేయనుంది!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు:(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -224 లో.. నీకు ఈ పనులన్నీ ఎందుకు చెప్తుందో పెద్ద వదినని అడుగుతానని ధీరజ్ వెళ్తుంటాడు. నా గురించి అడగడానికి నువ్వెవరని ధీరజ్ తో ప్రేమ అంటుంది. వస్తువులు పని చేస్తే ఏంటీ.. ఏం చేస్తే ఏంటని ప్రేమ అంటుంది. ఒకసారి వస్తువు అన్నదాన్ని పట్టుకొని ఎందుకిలా సాధిస్తున్నావని ధీరజ్ ఫ్రస్ట్రేషన్ అవుతాడు. మరొకవైపు నర్మద వెళ్తుంటే సాగర్ బండిపై వచ్చి ఎక్కమని చెప్తాడు. ఈ రోజు గుర్తు వచ్చానా అని నర్మద అంటుంటే.. నేనేం కావాలని రాలేదు నాన్న పంపించాడని సాగర్ అంటాడు. అంటే నువ్వు ప్రేమతో రాలేదు కదా.. నేను నీకు అవసరం లేనప్పుడు నువ్వు కూడా అవసరం లేదు.. నేను మా ఇంటికి వెళ్ళిపోతానని నర్మద ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత రాత్రి అందరు భోజనం చేస్తుంటారు. రామరాజు నర్మద, ప్రేమలని భోజనానికి పిలుస్తాడు. మావయ్యగారు వాళ్ళతో మాట్లాడుతున్నాడేంటని శ్రీవల్లి యాక్టింగ్ చేస్తూ.. మావయ్య గారు చొక్కాని చింపారు ఆ విషయం గుర్తువచ్చి భోజనం చెయ్యాలి అనిపిస్తలేదని శ్రీవల్లి అంటుంటే రామరాజు తినే దగ్గర నుండి లేచి బయటకు వచ్చి బాధపడతాడు. మీరు ఇలా ప్రేమ పెళ్లిళ్లు చేసుకోబట్టే వాళ్ళు ఇలా బాధపడుతున్నారని  ధీరజ్, సాగర్ లతో శ్రీవల్లి అంటుంది. ఆ తర్వాత సాగర్, ధీరజ్ పక్కకి వెళ్లి అంతా ప్రేమ వల్లే అని ధీరజ్ అంటుంటే నర్మద తప్పు కూడా ఉందని సాగర్ అంటాడు. ఎంతసేపు మీరు నాన్న తరపున ఆలోచిస్తారా.. నీపై ప్రేమతోనే ప్రేమ ఇలా చేసిందని ధీరజ్ తో చందు అంటాడు. తరువాయి భాగంలో వేదవతి, ప్రేమ, నర్మద నవ్వుతు మాట్లాడుకుంటుంటే.. వీళ్ళు ఎప్పుడు కలిసిపోయారని శ్రీవల్లి అనుకుంటుంది. మీరు కలిసిపోయారా అని శ్రీవల్లి అంటుంది. నేను వీళ్ళతో మాట్లాడడం ఏంటని వేదవతి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : పారిజాతాన్ని ఇరికించేసిన కార్తీక్, దీప.. బెత్తంతో కొట్టిన శివన్నారాయణ!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -423 లో.....పారిజాతం మాటలకి దీప హర్ట్ అవుతుంది. రోజు రోజుకి ఆ పారిజాతం గారి మాటలు ఎక్కువవుతున్నాయని కార్తీక్ తో అంటుంది దీప. పారు సంగతి చెప్దాం గానీ నేను బయటకు వెళ్ళొస్తానని కార్తీక్ అక్కడ నుండి బయల్దేరతాడు. కార్తీక్ బయటకు వెళ్తుంటే పారిజాతం హాల్లో డల్ గా కూర్చొని ఉంటుంది. ఏమైంది పారు అని కార్తీక్ అడుగుతాడు. ఏం లేదు రా మీ తాతని యాభై వేయిలు అడిగాను ఇవ్వను అన్నాడని పారిజాతం చెప్తుంది. ఇది నీ ఇల్లు పారు నీకు ఇవ్వకపోవడం ఏంటని దీపని పిలుస్తాడు కార్తీక్. ఇంట్లో పెత్తనం ఎవరిది అని అడుగుతాడు. నాదే అనీ దీప చెప్తుంది. డబ్బు అవసరం అయితే నన్ను అడుగుతావా అని కార్తీక్ అనగానే లేదని దీప సమాధానం చెప్తుంది. చూసావా ఇంట్లో ఆడవాళ్ళదే పెత్తనం అని పారిజాతాన్ని రెచ్చగొడుతాడు కార్తీక్. అవును రా.. నా ఇంట్లో నేను అడిగి తీసుకొవడం ఏంటని బెడ్ రూమ్ లోకి వెళ్లి లాకర్ నుండి డబ్బు తీసుకొని వస్తుంటే.. హాల్లో ఫోన్ చూస్తూ శివన్నారాయణ ఉంటాడు. అతన్ని చూసి పారిజాతం భయపడుతుంది శివన్నారాయణ తను చూస్తున్న వీడియోని పారిజాతానికి చూపిస్తాడు. అందులో పారిజాతం డబ్బు తీసుకునేది ఉంటుంది. ఎవరు ఈ వీడియో తీసారని అడుగుతుంది. నేనే అని కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత అందరు ఇళ్లలో ఆడవాళ్ల పెత్తనం ఉంటుంది కావాలంటే దీపని అడగండి అని పారిజాతం అంటుంది. ఇంట్లో ఎవరి పెత్తనం దీప అని కార్తీక్ అడుగుతాడు. మీదే అనీ దీప అంటుంది. నన్ను అడగకుండా డబ్బులు తీసుకుంటావా అని కార్తీక్ అనగానే నిన్ను అడగకుండా ఒక్కరూపాయి కూడా తీయనని దీప అనగానే పారిజాతం షాక్ అవుతుంది. ఇలా మాట మార్చావ్ ఏంటే అని పారిజాతం టెన్షన్ పడుతుంది. పారిజాతం చేసిన తప్పుకి శిక్ష వెయ్యాలని కార్తీక్ అంటాడు. నా దగ్గర బెత్తమ్ ఉందని ఇస్తాడు. దాంతో శివన్నారాయణ బెత్తం తీసుకొని పారిజాతం చెయ్ పై కొడతాడు. ఆ తర్వాత నువ్వు నిన్న ఇదే చేత్తో నా భార్యని కొట్టడానికి లేపావని పారిజాతంతో కార్తీక్ అంటాడు. ఇలా రివెంజ్ తీసుకున్నావ్ కదరా అని పారిజాతం దెబ్బని చూస్తూ అనుకుంటుంది. మరొకవైపు కుబేర్ ఆర్ధికంకి కార్తీక్, దీప అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. ఏంటి ఆలోచిస్తున్నావు.. మీ నాన్న అన్న మాటలకా ఎలాగు వెళ్తాము కదా అని కార్తీక్ అనగానే.. ఏంట్రా దీప అమ్మనాన్న అంటున్నావ్.. లేరు కదా అని కాంచన అనగానే కార్తీక్ కవర్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : బాబుకి దగ్గరైన అపర్ణ.. తనకి రేవతి కొడుకు అని తెలిసిపోతుందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -787 లో..... రేవతి కొడుకుని అపర్ణ ఇంటికి తీసుకొని వస్తుంది. ఎవరు ఈ బాబు అని అందరు అడుగుతారు. మొన్న ఒక బాబు పరిచయం అయ్యాడని చెప్పాను కదా అదే బాబు..... గుడిలో తప్పిపోయాడు అందుకే తీసుకొని వచ్చానని అపర్ణ చెప్తుంది. ఈ బాబుని ఎక్కడో చూసానని స్వప్న, అప్పు అంటారు. చెప్పకండి అని కావ్య సైగ చెయ్యడంతో ఇద్దరు ఆగిపోతారు. ఆ తర్వాత బాబుని ఇందిరాదేవి చూసి సీతారామయ్య దగ్గరికి వెళ్లి రేవతి కొడుకు వచ్చాడు వెళ్లి చుడండి అని చెప్తుంది. సీతారామయ్య వచ్చి చూస్తాడు. నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు ఆ బాబుకి తెలుసు కదా ఎదరుపడకు అని ఇందిరాదేవితో చెప్తాడు సీతారామయ్య. కాసేపటికి సీతారామయ్య కిందికి వెళ్లి ఎవరు ఈ బాబు అని ఏం తెలియనట్లు అడుగుతాడు. దాంతో అపర్ణ జరిగింది చెప్తుంది. అప్పు నువ్వు రేపటి వరకు బాబు పేరెంట్స్ ఎవరో కనుక్కోమని రాజ్ అంటాడు. బాబుకి ఆకలిగా ఉన్నట్టుంది నేను పెడతానని అపర్ణ లోపలికి తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత నాకు నా చిట్టి అంత చెప్పింది. అపర్ణకి కోపం వస్తే మాత్రం ఎవరు తట్టుకోరని రాజ్, కావ్యలతో సీతారామయ్య అంటాడు. కాసేపటికి స్వరాజ్ కి భోజనం పెడుతుంది అపర్ణ. అత్తయ్యగారు బాబుపై ప్రేమ అనురాగం చూపించడం లేదని రాజ్ తో కావ్య అంటుంది. రాజ్ వెళ్లి మీకు బాబుపై ప్రేమ లేదని అంటాడు. ఎక్కడ నిజం బయటపడుతుందోనని కావ్య టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత స్వరాజ్ కి భోజనం పెడుతుంటే సుభాష్ పై బాబు కూర్చొని ఉంటాడు. అదంతా వీడియో కాల్ లో  రేవతికి చూపిస్తుంది కావ్య. రేవతి హ్యాపీగా ఫీల్ అవుతుంది. తరువాయి భాగంలో కావ్య అందంగా ముస్తాబవుతుంది. ఏంటి స్పెషల్ అనీ ఇందిరాదేవి అడుగగా మీ మనవడు ఈ రోజు నాకు ప్రపోజ్ చేస్తున్నాడని సిగ్గుపడుతుంది. ఆ తర్వాత బాబు పేరెంట్స్ తెలిసారని అప్పు అనగానే ఒకసారి బాబు వాళ్ళ అమ్మతో మాట్లాడుతానని అపర్ణ అంటుంది. దాంతో అపర్ణకి ఫోన్ ఇస్తుంది అప్పు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

బిగ్ బాస్ టీమ్ పంపే మెయిల్స్ ని షేర్ చేయొద్దు....మీరు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది

బిగ్ బాస్ సీజన్ 9 త్వరలో స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో కామన్ మ్యాన్ కేటగిరి నుంచి కొంతమంది తీసుకుంటున్నారు. వాళ్లకు టెస్టులు కూడా పెడుతున్నారు. ఇదంతా కూడా మెయిల్స్ ద్వారా జరుగుతోంది. ఐతే ఆది రెడ్డి ఈ విషయాన్నీ చెప్తూ కొన్ని ఇంపార్టెంట్ విషయాలను తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ ద్వారా చెప్పాడు. "రౌండ్ 3 గ్రూప్ డిస్కషన్ ఆగష్టు 3 న జరగబోతోంది.  మీరు నెక్స్ట్ రౌండ్స్ కి  సెలెక్ట్ అయ్యారంటూ మీకు ఈమెయిల్స్ వస్తే గనక దయచేసి గుర్తుపెట్టుకోండి వాటిని ఎవరికీ షేర్ చేయకండి. ఎందుకంటే నాకు కొంతమంది అలాంటి మెయిల్స్ స్క్రీన్ షాట్స్ పెట్టారు. ఒక వేళా అలా మీ మెయిల్ లోని ఇన్ఫర్మేషన్ లీక్ ఐతే గనక అప్పుడు బిబి టీమ్ మిమ్మల్ని రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. అది కూడా కాన్ఫిడెన్షియల్ మెసేజ్ ని లీక్ చేసిన బేసిస్ మీద మీరు సెలెక్ట్ ఐనా కానీ రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి" అని చెప్పాడు. ఇక బిగ్ బాస్ టీమ్ లేటెస్ట్ అప్ డేట్స్ కొన్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. డెబ్జనిని, జానూ లిరి, ఇమ్మానుయేల్, అలేఖ్య చిట్టి పికిల్స్ ని, ఫోక్ డాన్సర్ నాగ దుర్గాని బిగ్ బాస్ టీమ్ అప్ప్రోచ్ ఐనట్టు తెలుస్తోంది. అలాగే ముగ్గురు నుంచి ఐదుగురు వరకు ఎక్స్ హౌస్ మేట్స్ కూడా ఈ బిగ్ బాస్ సీజన్ లోకి వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఒక న్యూస్ హల్చల్ చేస్తోంది.

చంద్రబాబు ఇష్టమా, పవన్ కళ్యాణ్ ఇష్టమా ?

సుమ అడ్డా లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయింది. నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ కి "సుందరకాండ" మూవీ టీమ్ రాబోతోంది. ఈ మూవీ టీమ్ లో నారా రోహిత్, శ్రీదేవి విజయ్ కుమార్, వాసుకి, సునయన, విర్తి వాఘాని వీళ్లంతా వచ్చారు. ఐతే ఈ వీక్ సుమ అడ్డా కాస్తా పొలిటికల్ అడ్డాగా మారింది. ఇందులో కీలకమైన రాపిడ్ ఫైర్ రౌండ్ లో వాసుకుని, నారా రోహిత్ ని కొన్ని ప్రశ్నలు వేసింది సుమ.  " మీరు రాఖీ పండగ రోజు రాఖీ ఎవరికీ కడతారు. మీ రియల్ బ్రదర్ కా లేదా తొలి ప్రేమలో మీ బ్రదర్ పవన్ కళ్యాణ్ గారికి" అని అడిగేసరికి వాసుకి షాకైపోయింది. తర్వాత నారా రోహిత్ వచ్చారు. "మీకు బాగా ఇష్టమైన రాజకీయ నాయకులు ఎవరు..చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు" అని అడిగింది సుమ. పవన్ కళ్యాణ్ నటించిన ఎవర్ గ్రీన్ మూవీ తొలి ప్రేమలో పవన్ కళ్యాణ్ కి చెల్లిగా వాసుకి నటించింది. ఈ మూవీలో వీళ్లిద్దరి రోల్స్ మాత్రమే బాగా హైలైట్ అయ్యాయి. వాసుకి అంటే పవన్ కళ్యాణ్ సిస్టర్ గానే గుర్తిస్తారు ఆడియన్స్ కూడా. ఇక ఈ ప్రోమోలో నారా రోహిత్ కి పెళ్లి చూపులు చూస్తుంది అక్క సునయన. "అక్క ఇప్పుడు పెళ్లి చూపులు అవసరం..మగాళ్లకు సేఫ్టీ లేకుండా పోయింది. " అని పాపం బాధపడ్డాడు. దానికి సునయన "మాహా ఐతే పోయేదేముంది డ్యూడ్ ఒక ప్రాణమే కదా." అంటూ కౌంటర్ ఇచ్చింది. ఇక నారా రోహిత్ పెళ్లి చూపుల కోసం సుమ, శ్రీదేవి, విర్తి వచ్చి సాంగ్స్ పాడడం డాన్స్ లు చేయడం హైలైట్ గా ఉన్నాయి. ఇక వాసుకి, నారా రోహిత్ ఎం ఆన్సర్స్ ఇచ్చారో తెలియాలి అంటే నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ చూడాలి.  

ఫ్రెండ్స్ అయ్యాకే సిట్టింగ్ మొదలుపెట్టాం..

  ఆదివారం విత్ స్టార్ మా పరివారం ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ఈ ప్రోమో వచ్చింది. ఈ షోకి సింగర్స్ రఘు కుంచె, కల్పనా వచ్చారు. ఇక శ్రీముఖి ఐతే "మీరిద్దరూ ఎన్ని సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ ఎందుకు ఫ్రెండ్స్" అని అడిగింది. "ఈ ఎపిసోడ్ కి రావడానికి" అని చెప్పింది కల్పనా. తర్వాత జబర్దస్త్ కమెడియన్ అభి పాటల రచయితా అనంత శ్రీరామ్ కలిసి ఈ షోకి ఫ్రెండ్స్ గా వచ్చారు. "ఒక హాస్య కళాకారుడికి ఒక పెన్ను కళాకారుడికి ఎలా కుదిరింది ఫ్రెండ్ షిప్" అని అడిగింది శ్రీముఖి. "2016 లో యూఎస్ ప్రోగ్రాం చేసాము." అని చెప్పాడు అభి.  "ఎన్ని ట్రిప్పులు వేశారు లైఫ్ లో చెప్పండి" అని మళ్ళీ అడిగింది. "మేమిద్దరం కలిసి ట్రిప్పులు వేస్తే ఏమొస్తుంది చెప్పండి." అన్నారు అనంత శ్రీరామ్ కామెడీగా. తర్వాత అమరదీప్ ఆరియానాతో కలిసి వచ్చాడు. "మీరిద్దరూ నిజంగానే సిట్టింగ్ లో ఫ్రెండ్స్ అయ్యారా" అని అడిగింది శ్రీముఖి. "ఫ్రెండ్స్ అయ్యాకే సిట్టింగ్ మొదలుపెట్టాం" అని చెప్పాడు అమరదీప్. తర్వాత టేస్టీ తేజ సోబాశెట్టితో కలిసి డాన్స్ చేసుకుంటూ మరీ వచ్చాడు. "వీళ్ళు రక్షా బంధన్ అనుకుని వచ్చినట్టున్నారు" అని కౌంటర్ వేసేసరికి తేజా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత శ్రీముఖి "గర్ల్స్ హ్యాపీ ఫ్రెండ్ షిప్ చెప్పుకుంటే ఎలా చెప్పుకుంటారో చెప్పండి" అనేసరికి విష్ణు ప్రియా పృద్వితో వచ్చింది. ఇక పృద్వి విష్ణుని ఎత్తుకుని డాన్స్ చేసాడు. దాంతో హరి "ఈ డాన్స్ జరుగుతున్నంత సేపు అమరదీప్ అనవసరంగా ఆరియానాతో వచ్చాను డెబ్జానీతో రావాల్సింది అనుకుంటూ ఉన్నాడు" అంటూ చెప్పాడు. "అమరదీప్ ఇక్కడ చూడు చాలామంది ఉన్నారు. కల్పనా అక్కతో డాన్స్ చేస్తావా" అంటూ శ్రీముఖి ఇంకా ఉడికించింది.  

జ్యోతక్కకు సీమంతం...చీరా సారె పెట్టిన జోగిని శ్యామల

మా బోనాలు జాతర స్పెషల్ ఎపిసోడ్ కి జోగిని శ్యామల వచ్చి తీన్మార్ డాన్స్ వేసి ఆడియన్స్ ని అలరించారు. ఇక ఆమె గోల్కొండ జగదాంబ అమ్మవారికి లష్కర్ సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారికి బల్కంపేట ఎల్లమ్మ తల్లికి సమర్పించిన సారె అంటే చీరా, పూలు, పళ్ళు, బెల్లం, పసుపుకుంకుమను ఈ షోకి తీసుకొచ్చారు. ఈ షోలో త్రి టీమ్స్ ఆడాయి. గోల్కొండ పహిల్వాన్స్, హైదరాబాద్ దగడ్స్, సికింద్రాబాద్ షేర్స్. ఐతే జోగిని శ్యామలను లష్కర్ కి ఆడపడుచుగా పిలుచుకుంటారు అంటే సికింద్రాబాద్ అన్నమాట. ఇక ఈ సారెని  సికింద్రాబాద్ షేర్స్ గెలుచుకున్నారంటూ అనౌన్స్ చేసింది. ఆ తర్వాత ఓడిపోయిన వాళ్లకు కూడా కూడా అమ్మవారి సారెను అందించారు అది కూడా లక్కీ డిప్ ద్వారా. అమ్మవారి దగ్గర పెట్టిన తీపి బెల్లం డాక్టర్ బాబు గెలుచుకున్నాడు. పసుపు కుంకుమను గెలుచుకుంది శ్రీసత్య. ఇక పళ్ళు, కొబ్బరిని గెలుచుకున్నాడు ఇమ్మానుయేల్. తర్వాత బిత్తిరి సత్తి వచ్చి సారె పళ్ళాన్ని పట్టుకుని " గేమ్ గమ్మత్తు కోసమే ఆడతాం. గెలుపోటములు ఏమీ ఉండదు. అందరూ సంతోషంగా ఉండాలి. లేకలేక రాకరాక మా అక్క నేను చాలా రోజుల తర్వాత కలిసాం. కలిసినందుకు మా ఇంటి ఆడపిల్లకు బట్టలు పెట్టాలి కదా. మరి అమ్మవారి చీర ఆమెకు పెడితే ఇంకా సంతోషం కదా..ఇంతకన్నా ఎక్కువ ఇస్తాం మా అక్కకు..మంచిగా మురుసుకో..మేమంతా మంచిగా ఉండాలని దీవెనలు ఇవ్వు" అన్నాడు. అలా జోగిని శ్యామల జ్యోతక్కకి సారె ఇచ్చింది. ఇక జ్యోతక్క కన్నీళ్లు పెట్టుకుంది. "మీ అందరికీ తెల్సు కొత్తగా చెప్పేది ఏమీ లేదు. రెండేళ్ళ నుంచి పిల్లల కోసం చూస్తున్నాం. నేను దీన్ని చిన్న సీమంతంగా భావించి ఈ ఏడాది కచ్చితంగా సీమంతం చేసుకుంటాను అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను." అంది. "అతి త్వరలో అమ్మవారు మీ ఇంటికి వచ్చేస్తారు" అంటూ శ్రీముఖి విష్ చేసింద

Jayam serial : ఇంప్రెస్ చేసిన గంగ.. ఇంట్లోకి వచ్చిన తనని రుద్ర అంగీకరిస్తాడా!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -14లో..... గంగ సూపర్ మార్కెట్ లో పని చేయకుండా అందరిని డిస్టబ్ చేస్తుందనుకొని తనకి రుద్ర పనిష్మెంట్ ఇస్తాడు. నువ్వు ఒక్కమాట మాట్లాడిన కూడా మాటకి వంద చొప్పున శాలరీ లో నుండి కట్ అవుతుందని గంగతో రుద్ర చెప్తాడు. దాంతో గంగ సైలెంట్ గా ఉంటుంది. పెద్దసారు వచ్చినా కూడా మాట్లాడదు. ఆ తర్వాత సూపర్ మార్కెట్ కి ఒకవిడ వస్తుంది. ఒక వర్కర్ కస్టమర్ ఒక ఆవిడకి సమాధానం చెప్పకపోవడంతో అందరిపై తను కోప్పడుతుంది. అప్పుడే గంగ వచ్చి తనతో బాగా మాట్లాడుతుంది. గొడవ కాకుండా తనే దగ్గర ఉండి సరుకులు ఇస్తుంది. దాంతో పెద్దసారు.. చూసావా గంగ తన మాటలతో కస్టమర్స్ ని ఎలా డీల్ చేసిందని రుద్రకి చెప్తుంటే రుద్ర సైలెంట్ గా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పెద్దసారు గంగ ని తీసుకొని ఇంటికి వెళ్తాడు. ఇంట్లో అందరికి గంగ ఈ రోజు నుండి ఇక్కడే ఉంటుందని చెప్తాడు. మరి రుద్రకి ఇష్టం ఉండదు కదా అని ఇంట్లో వాళ్ళు అంటారు. రుద్రకి తెలియకుండా గంగ ఇక్కడ ఉంటుంది. తెలియకుండా మీరే చూడాలని పెద్దసారు అంటాడు. అప్పుడే రుద్ర ఇంట్లోకి వస్తుంటే అందరు గంగ కన్పించకుండా అడ్డుగా ఉంటారు. ఆ తర్వాత రుద్ర పైకి వెళ్ళాక ఇంట్లో అందరిని పెద్దసారు పరిచయం చేస్తాడు. ఆ తర్వాత నా కోడలు అని పెద్దసారు పరిచయం చేస్తాడు. మరి కొడుకు అని గంగ అనగానే పెద్దసారు కోడలు లోపలికి వెళ్లి ఫోటో పట్టుకొని ఏడుస్తుంది. వెనకాలే పెద్దసారు, గంగ వెళ్తారు. నా కొడుకు చనిపోయాడు. అప్పటి నుండి నా భార్య శకుంతల గదిలో బాధపడుతూ కూర్చొని ఉంటుంది. నువ్వు తనని మారుస్తావని అనుకుంటున్నానని పెద్దసారు అంటాడు. తరువాయి భాగంలో గంగ భోజనం తీసుకొని వెళ్లి శకుంతల డోర్ కొడుతుంది. ఎవరు అని శకుంతల అనగానే భానుప్రసాద్ అని గంగ అనగానే శకుంతల వచ్చి డోర్ తీస్తుంది. భోజనం పట్టుకొని ఉన్న గంగని చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu : నర్మద కన్నీళ్ళకి  కరిగిన రామరాజు.. ప్రేమకి ధీరజ్ తోడుంటాడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -223 లో....నర్మద ఆఫీస్ కి వెళ్తు మావయ్య గారు వెళ్ళొస్తానని చెప్తుంది కానీ రామరాజు సైలెంట్ గా ఉంటాడు. నర్మద బాధపడుతు వెళ్ళిపోతుంది. మరొకవైపు ప్రేమకి ఇల్లు క్లీన్ చెయ్యమని శ్రీవల్లి చెప్పడంతో తను క్లీన్ చేస్తుంటుంది. అదంతా వేదవతి చూస్తుంది. ఈ ఇంట్లో ఏంటో చుట్టూ ఇంత మంది ఉన్నా ఎవరు మాట్లాడరని ప్రేమ బాధపడుతుంది. ప్రేమ పనులు చెయ్యడం సేనాపతి చూస్తాడు. ఏంటి అమ్మ నీకు ఇష్టం.. ఇంట్లో ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నాం.. నువ్వు మన ఇంటికి రా అనీ సేనాపతి అంటాడు. కానీ ప్రేమ ఏం సమాధానం చెప్పకుండా లోపలికి వెళ్తుంటే ధీరజ్ వింటాడు. దాంతో ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది.. ఆ తర్వాత నర్మద ఆటోలో వెళ్తు.. అది నా కుటుంబం అందరు నా వాళ్ళు.. ఆ భాగ్యం వాళ్ళు నా కుటుంబాన్ని మోసం చేస్తున్నారు.. అలా జరగకుండా చూడాలని నర్మద అనుకుంటుంది. ఆ తర్వాత రామరాజుతో మాట్లాడడానికి మిల్లుకి వెళ్తుంది నర్మద‌. మావయ్య గారు నేను చెప్పేది వినండి.. అసలు ప్రేమ డాన్స్ క్లాస్ కి వెళ్తున్న విషయం నాకు తెలియదు. నాకు ఆమె నాన్న దూరంగా ఉన్నారు. మిమ్మల్ని అమ్మనాన్న అనుకుంటున్నా.. మీరు నాతో మాట్లాడకుంటే నాకు ఎలా అనిపిస్తదని నర్మద ఏడుస్తుంటే ఎడ్వకు మాట్లాడుతామని రామరాజు అంటాడు. నర్మద వెళ్తుంటే సాగర్ ఎదరుపడి సైలెంట్ గా ఉంటాడు. సాగర్ ని రామరాజు పిలిచి.. నీ భార్యని తీసుకొని వెళ్లి ఆఫీస్ దగ్గర దింపమని చెప్తాడు. మరొకవైపు ప్రేమ దగ్గరికి ధీరజ్ వచ్చి.. ఎందుకు ఈ పనులన్నీ చేస్తున్నావని అడుగుతాడు. మీ వదిన చెప్పింది కదా అని ప్రేమ అంటుంది. ఇప్పుడే వెళ్లి తనతో ఎందుకు పనులు చేయిస్తున్నావని అడుగుతానని ధీరజ్ అంటాడు. నేను నీకు ఏమవుతానని అడుగుతావని ధీరజ్ తో ప్రేమ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.