Illu illalu pillalu : భాగ్యంకి చెమటలు పట్టించిన నర్మద.. ఆ ఇద్దరు జస్ట్ మిస్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -228 లో...... భాగ్యం, ఆనందరావు ఇద్దరు చిన్న బండిపై వెళ్తుంటే ప్రేమ, నర్మద వాళ్ళని ఫాలో అవుతుంటారు. ప్రేమ, నర్మద తమని ఫాలో అవడం చూసిన భాగ్యం తన భర్తకి చెప్తుంది. ఆ నర్మద సామాన్యురాలు కాదు.. నువ్వు తనతో పెట్టుకోవద్దని చెప్పాను కదా అని భాగ్యం భర్త అంటాడు. వాళ్ళు ఫాలో అవుతున్నారని బండి అక్కడ పడేసి సందులల్లో దాక్కుంటారు భాగ్యం ఆమె భర్త. ప్రేమ, నర్మద వాళ్ళు ఎక్కడి వెళ్ళారని వెతుకుతారు. ఈసారీ తప్పించుకున్నారు కానీ అసలు వదిలిపెట్టొద్దని ప్రేమ, నర్మద అనుకుంటారు. ఆ నర్మదని తక్కువ అంచనా వేసాను.. అసలు వదిలిపెట్టొద్దని భాగ్యం అనుకుంటుంది. మరొకవైపు చందు ఒకదగ్గర డల్ గా కూర్చొని సేట్ వచ్చి బెదిరించింది గుర్తుచేసుకుంటాడు. అప్పుడే సాగర్, ధీరజ్ వచ్చి.. ఏమైంది రా ఇక్కడ కుర్చున్నావని అడుగుతారు. ఏం లేదు రా అని సైలెంట్ గా అక్కడ నుండి వెళ్ళిపోతాడు చందు. వీడేదో దాస్తున్నాడు అనిపిస్తుందని వాళ్లిద్దరూ అనుకుంటారు. వదిన, నువ్వు ఇప్పుడు ఒకే కదా అని సాగర్ ని అడుగుతాడు ధీరజ్. ఒకే నర్మదకి నేను అంటే చాలా ఇష్టం బ్రతిమిలాడడం బుజ్జగించడం ఉండదంటూ డబ్బా కొట్టుకుంటాడు. మరి ప్రేమ, నువ్వు ఒకే నా అని సాగర్ అడుగుతాడు. అది చాక్లెట్ కి ఏడ్చే రకం.. చిన్నపిల్ల నేనంటేనే గజగజలాడుతుందని ధీరజ్ అంటాడు. అది పెట్టే టార్చర్ కోసం నిన్ను పట్టుకొని ఏడవాలని ఉందని ధీరజ్ మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత ప్రేమ నడుచుకుంటూ వెళ్తుంటే ధీరజ్ ఆగి.. నువ్వు ఆలా వెళ్లడం కష్టంగా ఉంది సైకిల్ ఎక్కు అంటాడు. నేను సైకిల్ ఎక్కాలంటే నువ్వు తొక్కకూడదు.. నేను కూర్చుంటా నువ్వు తోసుకొని వెళ్ళాలని ప్రేమ అనగానే సరే అని ధీరజ్ అంటాడు. ప్రేమ కూర్చొని ఉంటే.. ధీరజ్ తోసుకుంటూ వెళ్లడం సాగర్ చూసి నవ్వుకుంటూ.. వీడిని చూసి ప్రేమ బయపడుతుందట అని నవ్వుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2: ఆస్తిలో వాటా కోసం నోటీసులు పంపించిన శ్రీధర్.. శివన్నారాయణ ఏం చేయనున్నాడు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -427 లో..... దీప దగ్గరికి జ్యోత్స్న వచ్చి తన తల్లిదండ్రులు ఎవరో తనకి తెలుసో లేదో కనుక్కునే ప్రయత్నం చేస్తుంది. కానీ దీప మాత్రం చాలా తెలివిగా తనని కన్నవాళ్ళ గురించి తెలిసిన కూడా దీప బయటపడదు. దేవుడు ఎవరిని ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చుతాడు. ఏమో త్వరలోనే నా వాళ్ళకి దగ్గర చేయ్యొచేమోనని దీప అంటుంది. దాంతో ఇది తెలిసి మాట్లాడుతుందా లేక తెలియక మాట్లాడుతుందా అని జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. మరొకవైపు శివన్నారాయణకి ఏదో కొరియర్ వస్తుంది. అది ఓపెన్ చేసి చదివి షాక్ అవుతాడు. ఏమైంది పెద్దసారు అని కార్తీక్ అడుగుతాడు. మీ అమ్మ చేత నాకు ఆస్థిలో వాటా కావాలని నోటిస్ పంపిస్తావా అని కార్తీక్ పై కోప్పడతాడు శివన్నారాయణ. నేను పంపలేదని కార్తీక్ అంటాడు. మీ అమ్మ నీ సపోర్ట్ లేకుండా ఇలా చెయ్యదని శివన్నారాయణ అంటాడు. మొన్న ఎంగేజ్మెంట్ కి రానప్పుడే నాకు అర్ధం అయింది. వీళ్లకు ఆస్తులపై వ్యామోహం పెరిగిందని శివన్నారాయణ మాట్లాడతాడు. ఆ తర్వాత ఇది ఎవరో చేసారో నాకు తెలుసని దీప తో కార్తీక్ అంటాడు. వెంటనే శ్రీధర్ కి ఫోన్ చేస్తాడు. నోటిస్ వచ్చిందరా అని కార్తీక్ ని శ్రీధర్ అడుగుతాడు. హ వచ్చింది వాళ్ళు ఆస్తుల వాటా గురించి మాట్లాడతారట అని కార్తీక్ యాక్టింగ్ చేస్తూ మాట్లాడతాడు. నువ్వు చిన్నపిల్లాడివి నీకేం తెలియదు.. నేను వస్తున్నానని శ్రీధర్ అంటాడు. ఆ తర్వాత కార్తీక్ ఈ నోటిసులు నేను పంపలేదని ఋజువు చేస్తానని శివన్నారాయణతో చెప్తాడు. అప్పుడే శ్రీధర్ ఎంట్రీ ఇస్తాడు. కార్తీక్ తన మాటలతో నేనే వాళ్లకు తెలియకుండా ఈ నోటిసులు పంపించానమి శ్రీధర్ చెప్పేలా చేస్తాడు. ఈ క్రెడిట్ మొత్తం నాకే.. న్యాయంగా నా భార్యకి వాటా రావాలి ఇవ్వండి అంటూ ఆస్తుల గురించి చెప్తుంటాడు. నీకేం వద్దా అని శివన్నారాయణ వెటకారంగా మాట్లాడతాడు. ఇక ఇంట్లో అందరు.. శివన్నారాయణ చేతిలో నీకుంది రా అన్నట్లు చూస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : రాజ్ ప్రపోజల్ కి నో చెప్పిన కావ్య.. అప్పు తప్పించుకుందిగా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -791 లో..... కావ్య ప్రెగ్నెంట్ అని షాక్ అవుతుంది. అప్పుడే అప్పు వస్తుంది. తనని పట్టుకొని కావ్య ఎమోషనల్ అవుతుంది. కావ్య ప్రెగ్నెంట్ అనే విషయం అప్పుకి తెలుస్తుంది. తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయినా మీరెప్పుడు కలిశారని అప్పు అనగానే తనకు ఆక్సిడెంట్ కాకముందే అని కావ్య అంటుంది. మరి హ్యాపీగా ఇంట్లో అందరికి చెప్పి స్వీట్ చేపించుకోవాలని అప్పు అనగానే ఇప్పుడు నేనున్న సిచువేషన్ ఏంటని కావ్య అంటుంది. నాకు ఇప్పుడు అయన ప్రపోజ్ చెయ్యడానికి వస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం ఎలా చెప్పాలని కావ్య టెన్షన్ పడుతుంది. నువ్వు ఈ విషయం ఎవరితో చెప్పకు.. ముందు వెళ్లి బాబుని రేవతి గారికి అప్పజెప్పిరా అని కావ్య అనగానే అప్పు వెళ్ళిపోతుంది. మరొకవైపు కావ్యకి ప్రపోజ్ చేయబోతున్నానని రాజ్ హ్యాపీగా వస్తుంటాడు. ఆ తర్వాత బాబుని తీసుకొని అప్పు వెళ్లిపోతుంటే అప్పు వెనకాల రాహుల్ ని ఫాలో అవడం తను గమనిస్తుంది. వెంటనే కానిస్టేబుల్ కి ఫోన్ చేసి ప్లాన్ చెప్తుంది. కానిస్టేబుల్ రాహుల్ కార్ ముందు ఆగి మీ కార్ స్మగిలింగ్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. చెక్ చెయ్యాలి అంటారు. నా కార్ లో ఉండడం ఏంటని రాహుల్ అంటాడు. ఆ తర్వాత కానిస్టేబుల్స్ చెక్ చేసి మాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు. అప్పు ఎప్పుడో అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంట్లో అందరు రాజ్ వచ్చి ఎప్పుడు కావ్యకి ప్రపోజ్ చేస్తాడా అని వెయిట్ చేస్తుంటారు. రాజ్ వచ్చి కావ్యని పిలుస్తాడు. కావ్య బాధగా పై నుండి కిందకి వస్తుంది. ఇక నా వల్ల కాదు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను.. మీతో కలిసి ఉండాలని అనుకుంటున్నానని రాజ్ తన మనసులో మాట చెప్పగానే కావ్య నాకు మీరంటే ఇష్టం లేదని చెప్తుంది. దాంతో అందరు షాక్ అవుతారు. తరువాయి భాగంలో కావ్య వద్దని చెప్పినందుకు రాజ్ బాధగా వెళ్ళిపోతాడు. రాజ్ నడుచుకుంటు వెళ్తుంటే ఆతని వెనకాల నుండి ఏదో వెహికల్ వచ్చి డాష్ ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 కన్ఫమ్ కంటెస్టెంట్స్ ఎవరంటే!

  బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఈ నెల చివర్లో మొదలవ్వబోతుంది. అయితే ఇప్పటికి ఎవరు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. హౌస్ లోకి ఎవరు ఎంట్రీ ఇస్తున్నారని చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. ప్రతీ సీజన్ లో  కామన్ మ్యాన్ ఎవరస్తారనే క్యూరియాసిటీ అందరిలో ఉంటుంది. అయితే ఈ కేటగిరీ నుండి ఎవరనేది ఇంకా సస్పెన్సుగానే ఉంది. బిగ్ బాస్ గ్రాంఢ్ లాంచ్ రోజు ఎంతమంది ఎంట్రీ ఇస్తారో, వైల్డ్ కార్డుగా ఎంతమంది అనేది ప్రతీ సీజన్ కి ఆసక్తికరంగా ఉంటుంది. ఇలా ఒక్కటేమిటి బిగ్ బాస్ గురించి ప్రతి ఒక్కటి ట్విస్ట్ లాగే ఉంది. అమరదీప్ భార్య తేజస్విని గౌడ కన్ఫమ్ కంటెస్టెంట్ అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రీతు చౌదరి, మై విల్లేజ్ షో అనిల్ జీలా, సీరియల్ యాక్టర్ నవ్య స్వామి, అలేఖ్య చిట్టి పిక్కిల్ చిట్టి, తెల‌ంగాణ ఫోక్ డ్యాన్సర్ నాగ దుర్గ, సీరియల్ యాక్టర్ సాయి కిరణ్, శివ కుమార్, దెబ్జానీలతో పాటు కమెడియన్ ఇమ్మాన్యుయెల్ కూడా ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వీరితో పాటుగా  సింగర్ కేటగిరీ నుండి శ్రీతేజ ఎంట్రీ ఇస్తున్నాడంట. సీరియల్ యాక్టర్ దీపిక రంగరాజు, కేరింత మూవీ హీరో సుమంత్ అశ్విన్ కూడా సీజన్ 9(Bigg Boss 9 Telugu) కి వస్తున్నట్లు సమాచారం. వీరితో పాటు కొంతమంది సీరియల్ యాక్టర్స్ ఇంకా సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ ని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎవరు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారనేది తెలియాలంటే సీజన్ 9 గ్రాంఢ్ లాంఛ్ వరకు ఆగాల్సిందే.   

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ సీజన్ 9 గ్రాంఢ్ లాంచ్ ఎప్పుడంటే.. ఈసారి రణరంగమే!

  తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణం త్వరలోనే రాబోతుంది. బిగ్ బాస్ తెలుగు తెలివిజన్ రంగంలో సంచలనం సృష్టిస్తున్న రియాలిటి షో బిగ్ బాస్. విజయవంతంగా ఎనిమిది సీజన్లు పూర్తిచేసుకొని తొమ్మిదో సీజన్ కి సర్వం సన్నద్దమవుతుంది. ఈసారి హోస్ట్ గా మళ్ళీ నాగార్జున నే వస్తున్నాడు అనడంలో ఎలాంటి మార్పు లేదు. ఎందుకంటే తాజాగా స్టార్ మాలో బిగ్ బాస్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేసారు. ఈసారి బిగ్ బాస్ లోకి సెలబ్రిటీలే కాకుండా కామన్ మ్యాన్ కి కూడా ఎంట్రీ ఉంది. ఎవరు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారనేది అందరిలో ఉన్న డౌట్. తాజాగా వచ్చిన ప్రోమోలో అగ్నిపరీక్షలో ఆడి గెలిచిన వారికే బిగ్ బాస్ సీజన్-9 హౌస్ లోకి ఎంట్రీ ఉంటుందట.. ఆ అగ్నిపరీక్ష అనేది డైరెక్ట్ టెలివిజన్ కాకుండా జియో హాట్ స్టార్ లో టెలికాస్ట్ కాబోతుంది. అన్ని సీజన్లలో కంటే బిగ్ బాస్ సీజన్ 8 భిన్నంగా ఉందనుకుంటే అంతకు మించి భిన్నంగా ఈ సీజన్ ఉండబోతుందనేది ప్రోమో చూస్తేనే తెలుస్తుంది. ఈసారి చదరంగం కాదు రణరంగమే అని నాగార్జున ప్రోమోలో చెప్పడంతో ప్రేక్షకులలో మరింత ఆసక్తి నెలకొంది. ప్రతి సీజన్ ఆగష్టు లేదా.. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో మొదలవుతుంది బిగ్ బాస్. అయితే ఈ సీజన్(Bigg Boss 9 Telugu) మాత్రం ఆగష్టు 23 న గ్రాంఢ్ గా లాంచ్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.   

నాగార్జున గారిని చూస్తే ముద్దుపెట్టుకోవాలనిపిస్తుంది

  కితకితలు మూవీ ద్వారా బాగా ఫేమస్ ఐన నటి గీతాసింగ్. ఈమె జీవితంలో ఎన్నో కష్టాలను బాడీ షేమింగ్ కామెంట్స్ ని ఎదుర్కొన్నారు. ఐతే ఈమె బిగ్ బాస్ మీద సెన్సేషనల్ కామెంట్స్ చేసారు ఒక ఇంటర్వ్యూలో. "నా ఫాన్స్ అంతా అడుగుతున్నారు ఎందుకు బిగ్ బాస్ కి వెళ్లడం లేదు అని. నాకు బిగ్ బాస్ లోకి వెళ్లడం అంటే ఇష్టం. అందరూ ఆడినట్టే ఆడతాను. స్క్రిప్ట్ ఇస్తారు కదా టాస్కులు ఆడమంటూ అలాగే ఆడతాను. ఆల్రెడీ కితకితలు మూవీలో స్విమ్మింగ్ పూల్ లోకి దూకేసారికి  అల్లరి నరేష్ గారు ఎగిరిపోయారు ఇక బిగ్ బాస్ లో ఉండేదే చిన్న స్విమ్మింగ్ పూల్ అందులో నేను దూకితే మిగతా వాళ్ళు ఎక్కడ స్నానాలు చేస్తారు వాళ్లకు ఎలా సరిపోతుంది. మిగతా వాళ్ళు పారిపోడానికి కూడా లేదు. గేట్స్ మూసేస్తారు కదా. నాగార్జున గారు  వింటున్నారా సెపరేట్ స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయిస్తే ఓకే. నాగార్జున గారి హోస్టింగ్ సూపర్ గా ఉంటుంది. ఆయన్ని చూడగానే ఆయన బుగ్గ మీద ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. నాగార్జున గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన్ని చూసా కానీ దగ్గరకు వెళ్లి ఎప్పుడూ మాట్లాడలేదు. బిగ్ బాస్ ఆఫర్ వస్తే ముందు వెళ్లి నాగార్జున గారికి ముద్దు పెట్టేసి ఆ  తర్వాత మాట్లాడతా. రీసెంట్ గా కొన్ని ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు షోస్ కి ఎవరూ రావడం లేదు అని అడిగితె బిగ్ బాస్ చూస్తున్నారు అని చెప్పారు. పల్లెటూళ్లలో కూడా ప్రతీ ఒక్కరూ బిగ్ బాస్ చూస్తున్నారు. ప్రతీ నార్మల్ పీపుల్ కి ఈ షో రీచ్ అవుతుంది. పెద్ద స్క్రీన్ మాత్రమే కాదు చిన్న స్క్రీన్ మీద కూడా చేస్తే బాగుంటుంది అనిపించింది. నాకు వంట రాదు..ఎవరో ఒకరు చేసి ఇస్తారు ఐనా జ్యూస్ లు ఏర్పాటు చేస్తే చాలు. బాత్ రూమ్స్ క్లీనింగ్ అవన్నీ క్లీన్ చేస్తామా ఏంటి..ఏదైనా ప్రాబ్లమ్ వస్తే నేనే కొట్టేస్తా...దాంతో వాళ్ళు నా జోలికి రారు. వాళ్ళే ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతారు. తర్వాత రాజ్యం మొత్తం మనమే ఏలేది." అంటూ చెప్పుకొచ్చింది గీతా సింగ్.  

Jayam serial : గంగకి థాంక్స్ చెప్పిన రుద్ర.. గదిలోకి వెళ్ళిన ఆమె దొరికిపోతుందా!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం' (Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -18 లో... పైడిరాజు దగ్గరికి వీరు వాళ్ళ మనిషి ఒకడు వస్తాడు. నేను కోటి రూపాయలు ఎదురుకట్నం ఇస్తాను.. నీ కూతురిని నాకు ఇచ్చి పెళ్లి చెయ్.. ఆ తర్వాత ముంబై తీసుకొని వెళ్తానని చెప్పగానే దానికి పైడిరాజు సరే అంటాడు. పైడిరాజు ఒప్పుకున్న విషయాన్ని అతను వీరుకి ఫోన్ చేసి చెప్తాడు. గంగని నువ్వు పెళ్లి చేసుకొని నాకు ఇచ్చేయ్ అని వీరు అంటాడు. దానికి అతను సరే అంటాడు.   గంగ కిచెన్ లో ఉండగా మక్కం ఇంటికి వస్తాడు. గంగ అక్కడ ఉండడం చూసి నువ్వు ఇక్కడ ఉన్నావ్ ఏంటని అడుగుతాడు. నన్ను పెద్దసారు పనిలో పెట్టాడు. నువ్వు నా గురించి సర్ తో చెప్తే నీ సంగతి చెప్తానని మక్కంని బ్లాక్ మెయిల్ చేస్తుంది గంగ‌. అప్పుడే రుద్ర వస్తాడు‌. తనకి కనిపించకుండా గంగ మొహంపై చున్నీ కప్పుకుంటుంది. ఇద్దరికీ కాఫీ తీసుకొని రమ్మని గంగకి చెప్తాడు రుద్ర.  మా పెద్దమ్మ నీ వల్ల హ్యాపీగా ఉంటుందని విన్నాను.. ఎప్పుడు అలాగే ఉండేలా చూడు అని గంగతో రుద్ర అంటాడు. రుద్ర సూపర్ మార్కెట్ కి వెళ్తాడు. అతని కంటే ముందే వెళ్ళాలని మక్కం స్కూటీపై గంగ వెళ్తుంది. ఇక గంగ స్పీడ్ గా వెళ్తూ మక్కంని వాటర్ లో పడేస్తుంది. ఆ తర్వాత రుద్ర కంటే ముందే గంగ సూపర్ మార్కెట్ కి వెళ్తుంది. అక్కడ ఒకమ్మాయి ప్రేమించిన అబ్బాయి మోసం చేసాడని సూసైడ్ చేసుకోబోతుంటే రుద్ర ఆపి ఒక్కరోజు టైమ్ ఇవ్వు.. నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తానని చెప్తాడు. ఆ తర్వాత సూపర్ మార్కెట్ లో మీటింగ్ జరుగుతుంది. అక్కడికి గంగని కూడా పిలుస్తారు. అసలు గంగని ఇక్కడికి ఎందుకు పిలిచావని పెద్దసారు అడుగుతాడు.    తరువాయి భాగంలో గంగ చెవికమ్మ రుద్ర రూమ్ లో పడిపోతుంది. ఇక రుద్ర స్నానం చేస్తున్న సమయంలో గంగ తన చెవికమ్మ కోసం అతని గదిలోకి వెళ్ళి వెతుకుతుంది. ఇక రుద్రపై ఉన్న కోపాన్ని పిల్లోని పట్టుకొని.. ఇది మీరే అంటూ పిల్లోని కొడుతుంది గంగ. ఇక అప్పుడే వెనకాల నుండి ఎవరో వచ్చి తన భుజంపై చేయి వేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam 2: శివన్నారాయణకి దీపపై సానుభూతి.. కొడుకు చేసిన పనికి బాధలో శ్రీధర్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -426 లో... దీప పుట్టుక గురించి శ్రీధర్ తప్పుగా మాట్లాడుతుంటే తండ్రి అని కూడా చూడకుండా తన పరువు మొత్తం తీసేస్తాడు కార్తీక్‌. అక్కడ నుండి వెళ్లిపొమ్మని చెప్తాడు. శ్రీధర్ డల్ గా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. దీప బాధపడుతుంటే తన గురించి తెలుసు కదా ఎందుకు బాధపడుతావని కార్తీక్ అంటాడు. కాంచన కూడా సారీ చెప్తుంది. ఆ తర్వాత శౌర్య వచ్చి తన మాటల్తో దీప నవ్వేలా చేస్తుంది.   శ్రీధర్ ఇంటికి వచ్చి డ్రింక్ చేస్తూ కోపంతో గ్లాస్ పగులగొడతాడు. ఏమైందని కావేరి అడగగా.. ఆ కార్తీక్ గాడు నన్ను అవమానించాడని చెప్తాడు. దీప ఒక అనాథ.. దానివల్లే వాడు రాజులా ఉండేవాడు అలా అయ్యాడని శ్రీధర్ అంటాడు. అందుకే మిమ్మల్ని అవమానించి పంపించుంటారని కావేరి అంటుంటే శ్రీధర్ కి ఇంకా కోపం వస్తుంది.    ఆ తర్వాత నిన్న జరిగింది మొత్తం దశరథ్ చెప్పాడు. కుబేర్ నిన్ను పెంచిన తండ్రి అంట కదా.. అతను చాలా గ్రేట్ అని శివన్నారాయణ అంటాడు. పక్కనే పారిజాతం ఉంటుంది. నువ్వు బస్టాండ్ లో ఏ టైమ్ కి దొరికావ్.. నీ స్పందన ఏంటని పారిజాతం తిక్కతిక్కగా మాట్లాడుతుంటే నిన్ను మెంటల్ హాస్పిటల్ లో వదిలి పెట్టి రావాలని శివన్నారాయణ అంటాడు. నన్ను కాదు మిమ్మల్ని వదిలి పెట్టి రావాలని పారిజాతం మెల్లిగా అంటుంది. ఆ మాటలని కార్తీక్ రికార్డు చేసి శివన్నారాయణకి వినిపిస్తాడు.   ఇలా ఇరికిస్తున్నావ్ ఏంట్రా అని పారిజాతం అంటుంది. దీనికి పనిష్మెంట్ ఉండాలి కదా అని కార్తీక్ బెత్తమ్ ఇస్తాడు. దాంతో పారిజాతం చేతిపై మళ్ళీ కొడతాడు శివన్నారాయణ. నాకు టైం వస్తుంది.. మీ సంగతి చెప్తానని పారిజాతం అంటుంది. మరోవైపు దీప దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది జ్యోత్స్న. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu : భాగ్యాన్ని రప్పించిన నర్మద, ప్రేమ.. వాళ్ళ అడ్రెస్ కనుక్కుంటారా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -227 లో... నర్మద చేతిలో ఉన్న ఉప్మా ప్లేట్ ని తీసుకొని తింటుంది శ్రీవల్లి. అయ్యో వల్లి అక్క అందులో బొద్దింక పడిందని ప్రేమ, నర్మద చెప్పగానే.. అమ్మో అని శ్రీవల్లి వాంతింగ్ చేసుకుంటుంది. అది చూసి ప్రేమ, నర్మద ఇద్దరు కలిసి ఇంట్లో ఉన్న అందరిని పిలుస్తారు. వేదవతి రాగానే.. అత్తయ్య మీ పెద్దకోడలు నెల తప్పిందని ప్రేమ, నర్మద చెప్తారు. దాంతో వేదవతి హ్యాపీగా ఫీల్ అవుతుంది.   రామరాజు వచ్చి నన్ను తాతయ్యని చేస్తున్నందుకు హ్యాపీగా ఉందని అంటాడు. అత్తయ్య హడావిడిలో వల్లి అక్క పేరెంట్స్ కి చెప్పడం మర్చిపోయారని నర్మద అంటుంది. అది కాదు అత్తయ్య అని శ్రీవల్లి చెప్పబోతుంటే.. అసలు తనని ప్రేమ, నర్మద మాట్లాడనివ్వరు. కాసేపటికి భాగ్యం కి ఫోన్ చేస్తుంది వేదవతి‌. నీ కూతురు నెల తప్పిందని చెప్పగానే భాగ్యం హ్యాపీగా ఫీల్ అవుతుంది. వెంటనే బయల్దేరి శ్రీవల్లి దగ్గరికి వచ్చేస్తారు. నేను నెల తప్పలేదు.. బొద్దింక పడ్డ ఉప్మా తిని వాంతింగ్ చేసుకున్నానని శ్రీవల్లి చెప్పగానే అందరు డిజప్పాయింట్ అవుతారు.   నర్మద, ప్రేమ వాళ్ళే అది ఇచ్చారని వల్లి చెప్తుంటే.. మేం అదే ఉప్మా తిన్నాం.. మాకేం కాలేదని ప్రేమ అంటుంది. ఇంకా ఎక్కువసేపు ఉంటే చందు ఎక్కడ డబ్బు అడుగుతాడోనని భాగ్యం తన భర్తని తీసుకొని వెళ్లిపోతుంటే భాగ్యంకి నర్మద, ప్రేమ ఎదురుపడి వార్నింగ్ ఇస్తారు. భాగ్యం తన భర్త వెళ్తుంటే ప్రేమ, నర్మద వెనకాలే వెళ్తారు. తరువాయి భాగంలో వాళ్ళు ఫాలో అవుతున్న విషయం భాగ్యం చూసి వాళ్లకు కనిపించకుండా దాక్కుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : బ్రహ్మముడి సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. కావ్య ప్రెగ్నెంట్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -790 లో.... రేవతి బాబుని అపర్ణ బాగా చూసుకుంటుంది. అది చూడలేక "పాపం మా వదిన.. ఇంట్లో కోడలు ఉంది అయినా పాపం ఎవరో పిల్లాడిని పట్టుకొని ముద్దాడుతుంది.. అదేదో కావ్య బాబునో పాపనో ఇస్తే.. నువ్వు ఇలా ఎవరినో ముద్దాడాల్సిన అవసరం ఉండేది కాదు" రుద్రాణి అంటుంటే.. ఎందుకు అలా బాధపడే మాటలు మాట్లాడుతావంటూ రుద్రాణిపై ప్రకాష్, ఇందిరాదేవి కోప్పడతారు.   ఆ తర్వాత అందరు హాల్లో ఉండగా అప్పు ఫోన్ లో మాట్లాడినట్లు యాక్టింగ్ చేస్తూ.. ఓహ్ బాబు వాళ్ళ పేరెంట్స్ దొరికారా అయితే ఇప్పుడే బాబుని తీసుకొని స్టేషన్ కి వస్తున్నానని అంటుంది. బాబు వాళ్ళ పేరెంట్స్ దొరికారట.. నేను తనని తీసుకొని వెళ్తానని అప్పు ఇంట్లో చెప్తుంది. బాబు పేరెంట్స్ పేరేంటని రుద్రాణి ఎంక్వయిరీ చేస్తుంది. ఏవో పేర్లు చెప్తారు. వాళ్ళ పేరెంట్స్ ని ఇక్కడికి రప్పించండని రుద్రాణి అనగానే అలా వీలు అవ్వదని అప్పు సర్ది చెపుతుంది. సరే వాళ్ళ పేరెంట్స్ తో నేను ఫోన్ లో మాట్లాడుతా.. ఎందుకు ఇలా బాబుని పట్టించుకోకుండా వదిలేసారో కనుక్కుంటానని అపర్ణ అనగానే రేవతికి ఫోన్ చేస్తుంది అప్పు. మా అత్తయ్యగారు బాబు గురించి మీతో మాట్లాడుతారట అని చెప్పి ఫోన్ ని అపర్ణకి ఇస్తుంది అప్పు. బాబుని జాగ్రత్తగా చూసుకోవాలి కదా అలా వదిలేసారని అపర్ణ అనగానే నేను కళ్ళు తిరిగి పడిపోయానని రేవతి టెన్షన్ పడుతూ మాట్లాడుతుంది. అయ్యో సారీ అండి బాబుని బాగా చూసుకున్నాను.. ఇక మీరు కూడా జాగ్రత్తగా చూసుకోండి అని రేవతికి చెప్తుంది అపర్ణ. ఆ తర్వాత నాకెందుకో డౌట్ గా ఉంది రాహుల్.. ఎందుకైనా మంచిది వాళ్ళని ఫాలో అవ్వమని రాహుల్ కి చెప్తుంది రుద్రాణి.    ఆ తర్వాత రాజ్ ప్రపోజ్ చేయబోతున్నాడని దేవుడికి సంతోషంతో మొక్కుకుంటుంది కావ్య. అప్పుడే కావ్య వాంతి చేసుకుంటుంది. డౌట్ వచ్చి ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకుంటుంది. ప్రెగ్నెంట్ అని కన్ఫమ్ కావడంతో కావ్య షాక్ అవుతుంది. అప్పుడే అప్పు వస్తుంది.. తనని పట్టుకొని ఏడుస్తుంది.    తరువాయి భాగంలో రాజ్ ప్రపోజ్ చేస్తే.. మీరు అంటే నాకూ ఇష్టం లేదని కావ్య చెప్తుంది. దాంతో ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

జబర్దస్త్ ఎంతో ఇచ్చింది మాకు...సోషల్ మీడియా పెరిగాక ప్రతీ ఒక్కరి నోట్లో నానుతున్నాం

    జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ దాదాపు కొన్నేళ్ల నుంచి స్కిట్స్ చేస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాడు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదుర్కున్న కష్టాలను వివరించాడు. "ఈ సోషల్ మీడియా ద్వారా ప్రతీ ఒక్కరి సెల్ లో నానడం వలన ప్రతీ ఒక్కరికీ అలుసైపోయాం. ఎవరి వల్లనైనా ఏదైనా బాడ్ ఇన్సిడెంట్ జీవితంలో జరిగితే దాన్ని మర్చిపోయి మూవ్ ఆన్ ఐపోవాలి. అప్పుడే వాడు రిగ్రెట్ అవుతాడు, మనం గ్రేట్ అవుతాం. నా టీమ్ లో ఉన్న వ్యక్తే నన్ను పాయింటౌట్ చేసి ఇష్టమొచ్చినట్టు మాట్లాడాడు. ఇప్పుడు అదే వ్యక్తిని నేను గ్రూప్ లో పెట్టుకుని వర్క్ చేస్తున్నా. మేము ఒక ఈవెంట్ కి వెళ్లాం. అక్కడ నేను స్టేజి మీద యాంకరింగ్ చేస్తున్నా మిమిక్రీ చేస్తున్నా, గేమ్స్ ఆడిస్తున్నా అన్నీ చేస్తున్నా. అందరూ తిన్న తర్వాతే నేను తినాలి. ఆర్టిస్ట్ గా వెళ్ళినప్పుడు మా ఫామిలీకి చెప్పుకున్నామండీ ప్లేట్స్ మీరు తీసుకుని తినేస్తారేంటండి అంటారు. అలా చాలా సార్లు బాధపడిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడే తిడతారు, ఇక్కడే పొగుడుతారు, ఇక్కడే సన్మానాలు జరుగుతాయి, ఇక్కడే పూలదండలు వేస్తారు, ఇక్కడే పట్టు పాన్పులు మీద కూర్చోబెట్టి మీలాంటి గొప్పోళ్ళు లేరు అంటారు. చివరికి వాళ్ళు చనిపోతే చూడడానికి కూడా వెళ్లని వ్యక్తులు ఉన్న సమాజం మన సినిమా ఇండస్ట్రీ. 12 ఏళ్ళు జబర్దస్త్ అనే ఒక ప్రయాణం మాములు కాదు. జబర్దస్త్ మాకు ఇల్లు కొనిచ్చింది. అదే జబర్దస్త్ మాకు కార్ కొనిచ్చింది. అదే జబర్దస్త్ మమ్మల్ని దేశాలు తిప్పుతోంది. అదే జబర్దస్త్ మాకు మంచి పేరు ఇచ్చింది. " అంటూ చెప్పాడు జబర్దస్త్ రాకింగ్ రాకేష్.  

Jayam serial : శకుంతులకి దగ్గరైన గంగ.. తనని రుద్ర చూస్తాడా!

  జీ తెలుగు లో  ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -17 లో.....శకుంతల బిర్యాని చేసి ఇంట్లో అందరికి పెడుతుంది. ఆ తర్వాత రుద్ర నిద్రలో ఒక్కసారి ఉల్లిక్కి పడి లేచి పెద్దమ్మ గోరు ముద్దలు అయినా తినే భాగ్యం లేదు.. కనీసం తన వంట అయిన తిందామని అందరు పడుకున్నాక రుద్ర కిందకి వచ్చి.. మిగిలిపోయిన బిర్యానిని తింటుంటాడు. గతంలో వాళ్ళ పెద్దమ్మ శకుంతల తనతో ఎంత ప్రేమగా ఉందో గుర్తు చేసుకొని బాధపడుతాడు. ఆ తర్వాత కిచెన్ లో ఏదో సౌండ్ వస్తుందని గంగ కిందకి వస్తుంది. రుద్ర బిర్యాని తినడం చూసి ఈయనకి ఏంటి దెయ్యం పట్టిందా ఏంటని అనుకుంటుంది. మరుసటి రోజు గంగ ఉదయం లేచి పూజ చేస్తుంది. శకుంతలకి హారతి ఇవ్వడానికి గంగ వెళ్తుంటే పెద్దసారు ఆపుతాడు. తను అన్నివేళల ఒకేలా ఉండదు గంగ అని అంటుంటే అప్పుడే శకుంతల వచ్చి గంగ ఎవరు తన పేరు భాను కదా అంటుంది. అవును తన పేరు గంగ భవాని కానీ అందరు భాను అంటారని పెద్దసారు అనగానే అందరు తనని బాను అనాలని శకుంతల అంటుంది. పూజ చేసి మంచి పని చేసావని గంగతో శకుంతల అంటుంది. ఇంట్లో అందరిని లేపి మరి గంగ హారతి ఇస్తుంది. మరొకవైపు గంగ తండ్రి పైడిరాజు దగ్గరికి వీరు మనిషి వచ్చి డబ్బు ఎరగా చూపిస్తాడు. బట్టలు బండి కొనిస్తాడు. నాకూ నీ కూతురు కావాలి.. ఎదురు కట్నం కోటి రూపాయలు ఇస్తానంటాడు. దానికి పైడిరాజు సంతోషంగా ఒప్పుకుంటాడు. తరువాయి భాగంలో మక్కం సూపర్ మార్కెట్ మేనేజర్ రుద్ర దగ్గరికి వస్తాడు. అక్కడ గంగను చూస్తాడు. నేను ఇక్కడ ఉన్నట్టు సర్ కి చెప్పకండి అని గంగ రిక్వెస్ట్ చేస్తుంది. గంగ చున్నీ మొహంపై కప్పుకోని వచ్చి రుద్ర ఇంకా మక్కంకి కాఫీ ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu : శ్రీవల్లికి మాస్ వార్నింగ్ ఇచ్చిన నర్మద.. తను ఏం చేయనుంది!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -226 లో......నన్ను మీ వాళ్ళు ఇంత మోసం చేస్తారా మీ ఇంటికి వెళదాం పదా అని శ్రీవల్లిని లాక్కొని బయటకు వెళ్తాడు చందు. ఎదరుగా నర్మద ఉంటుంది. ఏమైంది బావగారు ఎందుకు టెన్షన్ పడుతున్నాడు. నువ్వెందుకు బావ గారిని రిక్వెస్ట్ చేస్తున్నావని నర్మద అడుగుతుంది. ఇది మా భార్యాభర్తలకి సంబంధించిన విషయం నువ్వు ఎందుకు మధ్యలో దూరుతున్నావని శ్రీవల్లి అంటుంది. కుటుంబంలో ఎవరు బాధపడ్డ అందరి రెస్పాన్సిబిలిటీ అని నర్మద అంటుంది. దాంతో చందుని శ్రీవల్లి పక్కకు తీసుకొని వెళ్లి.. ఈ ఒక్కసారి ఆగండి. ఇప్పుడు మా ఇంటికి వెళ్తే నర్మదకి డౌట్ వస్తుందని శ్రీవల్లి రిక్వెస్ట్ చెయ్యడంతో చందు లోపలికి వెళ్తాడు. ఆ తర్వాత నువ్వు మా విషయం గురించి ఎందుకు పట్టించుకుంటున్నావని నర్మదపై కోప్పడుతుంది శ్రీవల్లి. ఇది వార్నింగ్ అనుకో ఎమన్నా అనుకో ఇంకొకసారి మా మధ్య ఇన్వాల్వ్ అవ్వకని శ్రీవల్లి అంటుంది. ఇక నేను అసలు వదిలి పెట్టను.. అసలు ఏం జరుగుతుంది మొత్తం తెలుసుకుంటాను.. మీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటో కనుక్కుంటా‌. ఇక క్షణం క్షణం భయపడుతూ ఉంటావని శ్రీవల్లికి మాస్ వార్నింగ్ ఇస్తుంది నర్మద‌. మరొకవైపు ధీరజ్ ఒకసారి నువ్వు ఒక వస్తవు అన్నందుకు ప్రతీసారి నేనొక వస్తువుని నాది నీకు బాధ్యత మాత్రమే అంటూ ప్రేమ టార్చర్ పెడుతుంది. ఆ తర్వాత ఎలాగైనా ఇప్పడు మనం చేసే పనికి శ్రీవల్లి వాళ్ళ పేరెంట్స్ వస్తారు. తిరిగి వెళ్తుంటే మనం ఫాలో అవుదామని నర్మద, ప్రేమ అనుకుంటారు. నర్మద, ప్రేమ కాజు ఉప్మా ప్లేట్ చేతిలో పట్టుకుంటారు. ఏంటి మీ పుట్టింట్లో చేసుకున్నట్లు ఇష్టం వచ్చింది తింటున్నారని వాళ్ళ చేతిలోది లాక్కొని శ్రీవల్లి తింటుంది. అయ్యో పాపం వల్లి అక్క అందులో బొద్దింకా పడిందని ప్రేమ, నర్మద అనగానే శ్రీవల్లి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : దీపే అసలైన వారసురాలు.. నాన్న అని పిలవమన్న దశరథ్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -425 లో... దీప తండ్రి కుబేర్ కాదన్న విషయం అనసూయ చెప్పగానే అందరు షాక్ అవుతారు. నా తమ్ముడికి దీప ఒక బస్టాండ్ లో దొరికిందని అనసూయ చెప్పగానే బస్టాండ్ లో వదిలేసిన పాప బతికే ఉందని దాస్ పారిజాతంతో అన్న మాటలు గుర్తుచేసుకుంటుంది. అనసూయకి దీప గురించి ఎంత వరకు తెలుసో కనుకోవాలని జ్యోత్స్న అనుకొని మరి దీప తల్లిదండ్రులు ఎవరని అడుగుతుంది. నాకు తెలియదని అనసూయ చెప్తుంది. అయితే దీప అనాధ అన్నమాట అనీ శ్రీధర్ అంటుంటే.. ఇంకొక సారి అలా అనకండి ఒక భర్తగా అన్ని నేనే అనీ కార్తీక్ అంటాడు. దీప నువ్వు నన్ను నాన్న అని పిలిచావ్ కదా.. ఇక నుండి అలాగే పిలువు అని దశరథ్ అంటాడు. అలా పిల్వడానికి రక్తబంధం ఉండాలని సుమిత్ర కోపంగా అంటుంది. పదండీ వెళదామని సుమిత్ర అంటుంది. ఆ తర్వాత పారిజాతం ఇంటికి వచ్చి అనసూయ మాటలకి బుర్రబద్ధలు కొట్టుకుంటుంది. అది ఏ బస్టాండ్ లో దొరికిందోనని ఆలోచిస్తుంటే.. గ్రానీకి దీపే అసలైన వారసురాలు అని తెలియొద్దని డైవర్ట్ చేస్తుంది. ఇంత మందిలో ఎవరో ఒక అనాధ.. ఆ కుబేర్ కి దొరికి ఉంటుంది. నువ్వు టెన్షన్ తీసుకోకని జ్యోత్స్న అంటుంది. మరొకవైపు అందరు జరిగిందానికి బాధపడుతారు. దీప ఎవరు అయితే ఏంటి.. ఇప్పుడు నా కోడలు అని కాంచన అంటుంది. అప్పుడే శ్రీధర్ ఎంట్రీ ఇచ్చి నీకు పర్వాలేదు కానీ దీప అనాధ అన్న విషయం దాచి కార్తీక్ ని పెళ్లి చేసుకుందని కోప్పడతాడు. దీపని ఎవరు పడేసి ఉంటారో ఒకవేళ తన తల్లి తప్పు చేసి వదిలించుకుందేమోనని శ్రీధర్, దీప పుట్టుక గురించి తప్పుగా మాట్లాడుతుంటే.. కార్తీక్ పట్టరాని కోపంతో శ్రీధర్ మీదకి కొట్టడానికి వెళ్తాడు. నువ్వు చేసిందేంటి.. అమ్మ స్వప్నని కూతురు అనుకుంటుంది. లేకపోతే అక్రమసంతానం అంటారు కదా.. దీప ఎవరు లేక అనాధేమో.. స్వప్న నేను, నువ్వు ఉండి ఆనాధ కదా అని కార్తీక్ ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : ఇంటి వారసుడు అని చెప్పేసిన ఇందిరాదేవి.. కావ్యకి రాజ్ ప్రపోజ్ చేస్తాడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -789 లో.... బాబుని అపర్ణ దగ్గరికి వెళ్లి పడుకోమని పంపిస్తుంది కావ్య. బాబు అపర్ణ దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు నేను పడుకోవాలంటే కథ చెప్పాలని బాబు అనగానే అపర్ణ కథ చెప్పి బాబుని పడుకోబెడుతుంది. మరుసటిరోజు బాబు నిద్ర లేచి మొక్కలకి నీళ్లు పడుతుంటాడు. పైనుండి రుద్రాణి చూసి అసలు ఆ బాబూ ఎవరు గుళ్లో తప్పిపోతే అక్కడ ఎవరికైనా అప్పగించాలి లేదా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి.. ఇలా ఇంటికి తీసుకొని రావడం ఏంటి.. దీని వెనకాల ఏదైనా ఉందా బాబుని అడగాలని బాబు దగ్గరికి వస్తుంది రుద్రాణి. బాబు నీ పేరెంట్స్ ఎవరు.. వారి పేరు ఏంటని రుద్రాణి అడుగుతుంది. నీకెందుకు చెప్పాలని బాబూ అంటాడు. నీకు చాక్లెట్ ఇస్తానని రుద్రాణి అనగానే సరే అడుగు అని చాక్లెట్ తీసుకుంటాడు బాబు. మీ అమ్మ పేరు ఏంటి అని అడుగగా.. అమ్మ అని అంటాడు. నాన్న పేరేంటంటే నాన్న అని ఆ బాబు అంటాడు. ఏం అడిగినా అలానే చెప్తూ రుద్రాణికి చిరాకు తెప్పిస్తాడు. రుద్రాణి తనపై కోప్పడుతుంది. దాంతో బాబు రుద్రాణి పై వాటర్ పడతాడు. రుద్రాణి కొట్టబోతుంటే అప్పుడే అపర్ణ వచ్చి.. చిన్నపిల్లాడిని కొడుతావా అని తనపై కోప్పడుతుంది.ఆ తర్వాత కావ్య అందంగా రెడీ అవుతుంది. ఏంటి ఇలా రెడీ అయ్యావని ఇందిరాదేవి అడుగుతుంది. ఈ రోజు ఆయన నాకు ప్రపోజ్ చేయబోతున్నారని కావ్య చెప్పగానే అపర్ణ, ఇందిరాదేవి కలిసి కావ్యని ఆటపట్టిస్తారు. మరొకవైపు ఆ బాబు రేవతి కొడుకు అన్న విషయం కళ్యాణ్ కి అప్పు చెప్పగానే.. ఇంట్లో తెలిస్తే ఎలా అని అతను టెన్షన్ పడతాడు. ఆ తర్వాత అందరు భోజనం చేస్తుంటే నిన్న ఈ చైర్ లో కూర్చున్నా.. నాది ఆ చైర్ అని కళ్యాణ్ ని లేపి మరి బాబు కూర్చుంటాడు. ఆ తర్వాత బాబుని మెచ్చుకుంటుంటే ఎవరనుకున్నావ్ ఈ ఇంటి బిడ్డ అని ఇందిరాదేవి అనగానే అందరు షాక్ అవుతారు. అంటే అత్తయ్య ఫ్రెండ్ ఇక్కడున్నాడు కాబట్టి మన ఫ్యామిలీ కదా అని కావ్య కవర్ చేస్తుంది. తరువాయి భాగంలో కావ్యకి రాజ్ ప్రపోజ్ చేయబోతున్నాడని హ్యాపీగా ఫీల్ అవుతు దేవుడుకి మొక్కుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

చిత్రగారికి టేప్ రికార్డర్, కోయిల, రాక్షసి, ఏనుగు అనే నిక్ నేమ్స్ వెనక స్టోరీ తెలుసా ?

పాడుతా తీయగా ఈ వారం షోలో సింగర్స్ చిత్రా గారి పాటలు పాడి ఆడియన్స్ ని అలరించారు. ఈ సందర్భంగా చిత్రా గారితో ఉన్న అనుబంధం ఆనాటి జ్ఞాపకాల గురించి విషయాలను గురించి కీరవాణి మధ్యమధ్యలో ఉటంకిస్తూ ఉన్నారు. అలాగే ఆమెకు పెట్టిన నిక్ నేమ్స్ గురించి కూడా చెప్పారు. " నేను ఎలుగుబంటిని ఐతే చిత్రా గారు ఎవరు అనేది నేను చెప్తాను.  నేను అందరికీ నిక్ నేమ్స్ ఉంటాయి...చిత్ర గారికి నేను చాలా నిక్ నేమ్స్ పెట్టాను. నాకు మనుషులు దగ్గరయ్యే కొద్దీ నిక్ నేమ్స్ పెరుగుతూ ఉంటాయి. నా కెరీర్ లో 90 పర్సెంట్ సాంగ్స్ చిత్ర గారే పాడారు. ఆవిడతో నా జర్నీ 35 ఏళ్ళు. చిత్ర గారి నిక్ నేమ్స్ చెప్తాను. మా గురువు గారు రాజమణి గారు ఒక నిక్ నేమ్ పెట్టారు. టేప్ రికార్డర్ వచ్చింది. ఎందుకు ఆ పేరు పెట్టారు అంటే ఆమె చెప్పింది చెప్పినట్టు బైహార్ట్ చేస్తారు. ఆమెకు ధారణ శక్తి కూడా ఎక్కువ. కరెక్షన్స్ కి అవకాశం లేకుండా పడేస్తారు. అందుకే ఆమెను టేప్ రికార్డర్ అనేవాళ్ళు. నేను ఆమెను కోయిల అని పిలుస్తాను. అలాగే ఆమెకు రాక్షసి అనే నిక్ నేమ్ పెట్టాను. అంటే మనుషులకు సాధ్యం కానీ పనులను చేసే వాళ్ళను రాక్షసులు లేదా దేవతలు అంటారు. రజో గుణం ఎక్కువగా ఉన్న వాళ్ళను రాక్షసులు అంటారు. అలాగే ఆమెను ఏనుగు అని కూడా పిలుస్తూ ఉంటాను. తెలుగులో ఒక సామెత ఉంది నిలబడిన గుర్రం కంటే పడిపోయిన ఏనుగు ఎక్కువ హైట్ ఉంటుంది. అంటే ఆవిడ పాడడానికి వచ్చినప్పుడు కొన్ని కొన్ని అపస్వరాలు ఉన్నాయి మళ్ళీ ఇంకోసారి పాడతాను అనేవారు కానీ నాకు చాలా బాగా నచ్చేది. ఎక్కువ కరెక్షన్స్ చేసినా అది యాంత్రికంగా ఉంటుంది అని ఆమె సాంగ్ ని ఫస్ట్ టేక్ లోనే ఓకే చేసేవాడిని. ఎందుకు ఫస్ట్ టేక్ లోనే ఓకే చేస్తున్నారు అంటూ నన్ను అడిగేవారు. అప్పుడు నేను ఆమెకు ఈ సామెతను చెప్పాను. మీరు ఎలా పాడినా మామూలు సింగర్స్ కంటే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అనేవాడిని. ఆ తర్వాత కొన్నాళ్ళకు ఆమె ఆకారంలో ఏనుగును అనడం స్టార్ట్ చేశారు. నేను పట్టించుకోవడం మానేసాను." అంటూ చెప్పుకొచ్చారు కీరవాణి.

"తగ్గేదేలే" స్టూడెంట్స్ స్పెషల్ షో ఆగష్టు 4 నుంచి

  ఈటీవీలో త్వరలో ఒక కొత్త షో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. అది కూడా స్టూడెంట్స్ స్పెషల్ గా డిజైన్ చేసిన షో ఇది. ఈ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది.  ఈ షోకి హోస్ట్స్ గా  రవి, వర్ష ఉండబోతున్నారనే విషయం తెలుస్తోంది. "తగ్గేదేలే" అంటూ ఈ షోకి పేరు పెట్టారు. ఇక ఆగష్టు 4 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 5 .30 కి ఇది ప్రసారం కాబోతోంది. "వీళ్ళ పంచుల్లో ఒక క్లారిటీ ఉంటుంది" అంటూ రవి చెప్పడంతో "ఏంటి రవి గ్యాప్ వచ్చింది గాలి తిరుగుడా" అంటూ ఒక స్టూడెంట్ ఘాటుగా ఒక డైలాగ్ వేసింది. "వీళ్ళ డైలాగుల్లో ఒక దమ్ము ఉంటుంది" అనేసరికి "సామి పీలింగ్స్ వచ్చేస్తున్నాయి" అంటూ ఇంకో స్టూడెంట్ అనేసింది. "స్టూడెంట్ టాలెంట్ ని ఫుల్ వాల్యూమ్ లో వినిపిస్తాం" అంటూ కొన్ని టాస్కులు ఇచ్చి ఆడించాడు. "వీళ్ళ సాంగ్స్ లో ఒక స్వాగ్ ఉంటుంది. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఫుల్ గా ఉంటుంది..అసలు సిసలైన సెలబ్రిటీ షో" అన్నాడు. తర్వాత వర్షా వచ్చి "దగ్గర నుంచి భయమేసిందమ్మా" అనేసరికి "మిమ్మల్ని చూస్తే భయమేసింది అక్క" అంటూ ఒక స్టూడెంట్ గట్టిగా కౌంటర్ ఇచ్చింది వర్షకి. "మా స్టూడెంట్స్ మా సెలబ్రిటీస్  తగ్గేదేలే" అంటూ చెప్పాడు రవి. ఇంతకు ముందు కూడా ఎన్నో షోస్ ఇలా స్టూడెంట్స్ ఆధర్యంలో అలాగే మహిళలకు కూడా నిర్వహించారు. కానీ ఇప్పుడు ఈ షోని స్టూడెంట్స్ కోసమే  సరికొత్తగా తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది.  

 కిచెన్ లో ఉంటుంది స్టవ్...చాలా బాగుంటుంది నా ప్రదీప్ బావ నవ్వు

  కూకు విత్ జాతిరత్నాలు ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కొన్ని ఎపిసోడ్స్ నుంచి గమనిస్తే హోస్ట్ ప్రదీప్ తో ఫ్లర్ట్ చేస్తూ ఉంటుంది గోమతి. గోమతి చేసే చిలిపి పనులకు ప్రదీప్ కూడా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటాడు. రాధ కూడా వీళ్లిద్దరి మీద సెటైర్స్ వేస్తూ ఉంటుంది. ఇక ఈ వారం ప్రోమోలో కూడా వీళ్ళు చాల స్పెషల్ గా కనిపించారు. గోమతి పద్దతిగా లంగా ఓణీ వేసుకుని వచ్చింది. చిన్నపిల్లలు తినే పసుపురంగు గొట్టాలను ఐదు వేళ్ళకు పెట్టుకుని "లక్ష్మి బావ లక్ష్మి బావా" అని పాడుకుంటూ వచ్చింది. ఇక ప్రదీప్ ఐతే సిగ్గు మొగ్గలవుతూ "ఇదేంటి గోరింటాకు పెట్టుకుంటే ఎర్రగా పండాలి కానీ ఇలా అయ్యిందేంటి అన్నాడు." "అయ్యో ఇది గోరింటాకు కాదు మీకు ఇష్టం అని ఇలా పెట్టుకున్నాను" అని ఆ గొట్టాలని చూపించేసరికి ఆ గొట్టాలని ప్రదీప్ కరకర నమిలేశాడు. "కిచెన్ లో ఉంటుంది స్టవ్...చాలా చాలా బాగుంటుంది నా బావ నవ్వు" అంటూ గోమతి రెండు స్మైలింగ్ ఫింగర్స్ చూపించేసరికి ప్రదీప్ కూడా నవ్వేసాడు. రాధ గట్టిగా నవ్వేసింది. ఇక హరి ఐతే ఏంటి పెళ్లి బట్టలు కుట్టించేయమంటారా అంటూ ఫన్నీ కౌంటర్ వేసాడు. ఇక ఈ ప్రోమోలో స్పెషల్ గెస్ట్ గా వచ్చిన ఆలీ యాదమ్మ రాజు మీద ఫన్నీ సెటైర్స్ వేసాడు. గోమతి గతంలో "హిట్లర్ గారి పెళ్ళాం " అనే తెలుగు సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఇక ప్రదీప్ ఐతే ఒకప్పుడు ప్రతీ షోకి హోస్ట్ చేస్తూ ఉండేవాడు. కానీ మధ్యలో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ కోసం బుల్లితెర మీద గ్యాప్ తీసుకుని మళ్ళీ ఈ షో ద్వారా హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు.

Jayam serial: శంకుతల చేసిన బిర్యానీ.. రుద్రని తను చూస్తుందా!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-16 లో.......పైడిరాజు పేకాట ఆడుతు డబ్బు మొత్తం పోగొట్టుకుంటాడు. అప్పుడే చిలకజ్యోతిశ్యం చెప్పే అతను వస్తాడు. పైడిరాజు కుబేరుడు అవబోతున్నాడని చెప్తాడు. అప్పుడే ఒకతను వచ్చి డబ్బు ఇచ్చి.. పైడిరాజుని పేకాట ఆడమంటాడు. అతనికి వీరు కాల్ చేసి.. ఆ పైడిరాజు నేను చెప్పేది వినేలా చెయ్ అని చెప్తాడు. వీడు ఒక వేస్ట్ గాడు వట్టిగనే మన దారిలోకి వస్తాడని అతను వీరుతో అంటాడు. మరొకవైపు ఇంట్లో అందరు ఖాళీగా కూర్చొని ఉంటారు. ఎవరు వంట చెయ్యడం లేదని పెద్దసారు వాళ్ళ మరదలు అడుగుతుంది. శకుంతల పెద్దమ్మ చేత వంట చేయిస్తానని గంగ చెప్పిందని ఇషిక అంటుంది. ఆ తర్వాత గంగ శకుంతల రూమ్ కి వెళ్లి.. అమ్మ మీ జుట్టు ఎలా ఉందో చూడండి అని జుట్టు వేస్తుంది. అలాగే బొట్టు పెట్టుకోమని చెప్తుంది. పెద్దసారు మీ గురించి చాలా టెన్షన్ పడుతున్నారు. సర్ ఎన్ని రోజులు అయిందో కడుపు నిండా తిని.. మీరు తన కోసం అయినా వంట చెయ్యొచ్చు కదా అని గంగ అనగానే పదా అని శకుంతల గది లో నుండి బయటకు వస్తుంది. అప్పుడే పెద్దసారు లోపలికి వస్తుంటాడు. శకుంతలని చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే పెద్దసారు దగ్గరికి గంగ వచ్చి అమ్మగారు మీకు ఇష్టమైన బిర్యానీ చేస్తున్నారని చెప్తుంది. నా భార్యలో మార్పు మొదలు అయిందని పెద్దసారు హ్యాపీగా ఫీల్ అవుతాడు. శకుంతల కిచెన్ లో వంట చేస్తుంటే రుద్ర ఇంట్లోకి వస్తాడు. శకుంతల వాయిస్ విని అటుగా వెళ్తుంటే వద్దు మళ్ళీ డిస్టబ్ అవుతుందని రుద్ర వాళ్ళ అమ్మ అనగానే రుద్ర సైలెంట్ గా లోపలకి వెళ్తాడు. ఆ తర్వాత శకుంతల బిర్యాని చేసి అందరిని పిలుస్తుంది. రుద్రని అత్తయ్య చూస్తే గొడవ అయ్యేది మిస్ అయిందని వీరు డిస్సపాయింట్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.