తల్లి కూతుళ్ళని కలపడానికి వాళ్ళిద్దరి ప్రయత్నం.. తన ప్రేమ బయటపెడుతుందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -784 లో... తల్లి కూతుళ్లని ఒకటి చేయాలని రాజ్, కావ్య కలిసి రేవతి జగదీశ్ లని పుట్టినరోజుకి రప్పిస్తారు. కానీ రేవతిని అపర్ణ చూడగానే తన కోపాన్ని మొత్తం బయటపెట్టింది. మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి వచ్చావంటూ తిడుతుంది. అత్తయ్య ఇంటికి వచ్చిన వాళ్ళని అలా తిట్టడం కరెక్ట్ కాదు.. ఆమె మీ కూతురని నాకు ఇప్పుడే తెలిసిందని కావ్య అంటుంది. నీకు ఇప్పుడే తెలిసింది కానీ రేవతికి అయితే తెలుసు కదా అని రుద్రాణి ఇంకా గొడవ పెద్దది అయ్యేలా చూస్తుంది.    ఇదే మంచి సందర్బం అనుకొని క్షమించండి అత్తయ్య అని అపర్ణని కావ్య రిక్వెస్ట్ చేస్తుంది. నువ్వు ఈ ఇంటికి కోడలు అన్న ఒకే ఒక కారణంతో నిన్ను వదిలేస్తున్నాను కానీ ఆ మనిషిని ఈ జన్మలో క్షమించనని అపర్ణ తెగేసి చెప్తుంది. దాంతో రేవతి జగదీష్ అక్కడ నుండి బాధపడుతూ వెళ్లిపోతారు.    ఆ తర్వాత రేవతి, అపర్ణ కలిసి ఉన్న ఫోటోని చూస్తూ అపర్ణ బాధపడుతుంటే సుభాష్ వస్తాడు. ఇప్పటికైనా నీకు రేవతిపై కోపం తగ్గలేదా అని అడుగుతాడు. అది కోపం కాదు.. బాధ.. ఎంత ప్రేమగా చూసుకున్నాం ఎంత మోసం చేసిందని అపర్ణ బాధపడుతుంది. మరొకవైపు ఇన్ని రోజులు అపర్ణకి రేవతిని దగ్గర చెయ్యాలని చాలా ట్రై చేశాను. ఇప్పుడు మీరు ఇలా చేసి అపర్ణ కోపం మొత్తం బయటకి వచ్చేలా చేశారు ఇంకా దూరం పెరిగిందని రాజ్,  కావ్యలపై ఇందిరాదేవి కోప్పడుతుంది.    తరువాయి భాగంలో రాజ్, కావ్య కలిసి రేవతి అపర్ణ ఇద్దరు ఎదురుపడేలా చెయ్యాలనుకుంటారు. రేవతిని గుడికి తీసుకొని రావాలనుకుంటాడు రాజ్. అపర్ణని కావ్య గుడికి తీసుకొని వెళ్ళాలనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

భానుప్రియలా ఉన్నారు..డాన్స్ క్లాసెస్ స్టార్ట్ చేయొచ్చుగా

బిగ్ బాస్ సీజన్ 1 అంటే ముందుగా గుర్తొచ్చేది హరితేజ. ఎందుకంటే అందులో టాస్కులు ఆడింది అలాగే హరికథ కూడా చెప్పి ఆడియన్స్ ని ఆకట్టుకుంది. హరితేజ మల్టి టాలెంటెడ్ లేడీ. చాల మూవీస్ లో నటించింది. అలాగే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. బుల్లి తెర షోస్ కి యాంకర్ గా చేసింది. చిన్నారి, రక్త సంబంధం, మనసు మమతా, కన్యాదానం, అభిషేకం వంటి సీరియల్స్ లో నటించింది. సూపర్ సింగర్, పటాస్, బ్లాక్ బస్టర్ వంటి షోస్ లో కనిపించి ఎంటర్టైన్ చేసింది. విలేజ్ లో వినాయకుడు, ఆడవారి మాటలకు అర్దాలు వేరులే, అనగనగా ఒక ధీరుడు, అత్తారింటికి దారేది, విన్నర్, దువ్వాడ జగన్నాధం, నేనే రాజు, నేనే మంత్రి, అ-ఆ, అరవింద సమేత వంటి ఎన్నో మూవీస్ లో నటించింది. ఇక రీసెంట్ గా ఆమె భానుప్రియ మూవీలోని  "చిరునవ్వే పుట్టిల్లు నీకైనా నాకైనా" పాటకు ఆమె అద్భుతంగా డాన్స్ చేసి ఆ రీల్ ని పోస్ట్ చేసింది. ఇక నెటిజన్స్ ఐతే రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. "జూనియర్ భానుప్రియ,  భానుప్రియలా ఉన్నారు.. డాన్స్ క్లాసెస్ స్టార్ట్ చేయొచ్చుగా హరితేజ అక్క. గ్రేస్ ఫుల్ డాన్స్, మీకు వందనాలు అండి..మీ డాన్స్ ని చూస్తూనే ఉండాలనిపిస్తోంది. స్వర్ణ కమలంలో భాను ప్రియా గారు గుర్తొచ్చారు. చాల బాగా చేశారు. ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి" అంటూ కామెంట్స్ చేశారు. ఈమె కూచిపూడి కూడా నేర్చుకుంది కాబట్టే ఏ డాన్స్ ఐనా అలవోకగా చేసేస్తుంది. అలాగే మంచి సింగర్ కూడా. అప్పుడప్పుడు డాన్స్ తో పాటు పాటలు కూడా పాడుతూ ఉంటుంది. రీసెంట్ గా ఆమె తమ్ముడు మూవీలో కూడా నటించింది. వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం, రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ లో కూడా నటించింది.

జానులిరి అంటే ఈ స్టేట్ లోనే నార్మల్ పేరు కాదు.. వీళ్లిద్దరి కోసమే ఈ షోకి వచ్చాను

ఢీ 20 ట్రెండింగ్ స్పెషల్ 2 . 0 పేరుతో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమో ఫుల్ జోష్ తో నిండిపోయి ఉంది. ఈ షోకి ఒక స్పెషల్ గెస్ట్ కూడా వచ్చారు. "ఢీ 3 ఛాంపియన్ మనందరి ఫేవరేట్ , మోస్ట్ స్టైలిష్ కొరియోగ్రాఫర్ ఆఫ్ టాలీవుడ్ రఘు మాష్టర్" అంటూ నందు అనౌన్స్ చేసేసరికి రఘు మాష్టర్ స్టేజి మీదకు వచ్చారు. "19 సీజన్స్ కంటే చాలా గొప్ప సీజన్ ఢీ 20 " అన్నారు. అలాగే మంచి జోష్ తో "హులాల హులాల" అనే సాంగ్ కి డాన్స్ కూడా చేశారు. ఇక నందిని వచ్చి కోర్ట్ మూవీలోని "కథలెన్నో చెప్పారు" సాంగ్ కి ఎల్లో కలర్ కాస్ట్యూమ్ తో చేసింది. ఇక రఘు మాష్టర్ కి ఈ పెర్ఫార్మెన్స్ నచ్చేసింది. "ఈ సాంగ్ మూవీలో ఎంత బాగుందో ఇక్కడ కూడా అంతే బాగుంది" అన్నారు. తర్వాత జాను లిరి వచ్చింది. "దారిపొంతొత్తుండు" సాంగ్ కి డాన్స్ చేసింది. దాంతో రఘు మాష్టర్ ఫుల్ ఫిదా ఇపోయారు. లేచి పేపర్ చింపేసి "జాను అంటేనే ఈ స్టేట్ లో నార్మల్ పేరు కాదది" అని చెప్పారు. తర్వాత కండక్టర్ ఝాన్సీ వచ్చింది. ముసలామె గెటప్ లో "జామ చెట్టుకు కాస్తాయ్ జామకాయలు" అనే సాంగ్ కి ముసలామెలా డాన్స్ చేసింది. ఇంతలో ఒక ముసలాయన గెటప్ లో వచ్చి ఒక వాటర్ బోటిల్ ఇచ్చాడు. "ఏంట్రా ఇది" అని ఝాన్సీ అడిగేసరికి "రఘు మాష్టర్ టానిక్" అన్నాడు. అంతే ఆ టానిక్ తాగేసాక ముసలి ఝాన్సీ కాస్తా "నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతిరెడ్డి" అంటూ కుర్రదానిలా చిందులేసేసింది. దాంతో రఘు మాష్టర్ ఫిదా ఐపోయాడు. "ఈ ఎపిసోడ్ కి గెస్ట్ గా రావడానికి కారణం వీళ్ళిద్దరే" అన్నారు. ఐతే ఈ ప్రోమోలో అసలు కంటెంట్ ఏంటి...స్టేజి మీదకు వచ్చిందెవరో ఆది హోస్ట్ నందుకు ఎక్ష్ప్లైన్ చేస్తూ ఇదిదా ప్రోమో అంటూ ఎండింగ్ చెప్పాడు..

ఆవిడ ఇస్తే గిఫ్టులు తీసుకుంటావ్ ..మన స్నేహం ఎన్నేళ్లో తెలుసా?

ఇద్దరు హోస్టులు ఒక షోలో కలిస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు సర్కార్ షోలో కూడా అలాగే ఉంది. ఈ షోకి ఆల్రెడీ హోస్ట్ సుధీర్ ఉన్నాడు. ఇక నెక్స్ట్ ప్రోమో చూస్తే ఈ ఎపిసోడ్ కి ప్రదీప్ కూడా వచ్చాడు. ప్రదీప్ ఆల్రెడీ సీనియర్ హోస్ట్ ఢీ డాన్స్ షోని ఎన్నో సీజన్స్ నిర్వహించాడు. అటు మూవీస్ లో కూడా నటిస్తున్నాడు. రీసెంట్ గా కూకు విత్ జాతిరత్నాలు షోకి హోస్ట్ గా చేస్తున్నాడు. ఇప్పుడు గెస్ట్ గా సర్కార్ సీజన్ 5 కి వచ్చాడు. ఇక రాగానే సుధీర్ ని ఫుల్ గా ఏడిపించాడు. ప్రదీప్ స్టేజి మీదకు రాగానే అబ్బా ఎంత ఆనందం వచ్చింది అంటూ వెళ్లి సుధీర్ ని హగ్ చేసుకున్నాడు. "హాయ్ హలో వెల్కమ్ టు సర్కార్ సీజన్ 5 " అంటూ షో లింక్ ని ప్రదీప్ చెప్పాడు. దాంతో సుధీర్ కంగారు పడిపోయాడు. ఎందుకంటే ప్రదీప్ గతంలో సర్కార్ ని హోస్ట్ చేసాడు. ఇక సుధీర్ "హలో యాంకర్ ఇక్కడ" అన్నాడు. "ఫోటోలు ఇప్పుడు కాదమ్మా ..నీ డ్రెస్ చూసి పెద్ద జోకర్ అనుకున్న" అంటూ సుధీర్ మీద కౌంటర్ వేసాడు ప్రదీప్. "ఇంతకు మనది ఎన్ని ఇయర్స్ ఫ్రెండ్ షిప్పో గుర్తుందా..పోనీ వేరే షిప్పులు ఎన్నాళ్ళో గుర్తున్నాయా  " అంటూ ప్రదీప్ అడిగాడు. "అది" అంటూ సుధీర్ సిగ్గు పడేసరికి "ఎం చచ్చిపోవాలనిపిస్తోందా" అంటూ అడిగాడు.."కాదు చంపేయాలనిపిస్తోంది" అన్నాడు ప్రదీప్. "12 ఏళ్ళు మన ఫ్రెండ్ షిప్..సరే నేను నీకు 12 గిఫ్ట్ లు ప్లాన్ చేసాను" అని ప్రదీప్ అనేసరికి "ఎక్కడో కొడతాంది శీనా" అంటూ సుధీర్ అన్నాడు. "ఆవిడ ఇస్తే గిఫ్టులు తీసుకుంటావ్ నేను ఇస్తే 12 గిఫ్ట్ లు తీసుకోవు" అన్నాడు. "ఇంతకు ఎవారావిడా" అని సుధీర్ అన్నాడు. "ఏంటి ఆవిడెవరో తెలీదా.అన్న బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు " అంటూ ప్రదీప్ కౌంటర్ వేసాడు. ప్రోమో ఫైనల్ లో ప్రదీప్ అన్నతో చిన్న పోజ్ ఇవ్వాలని ఉంది అన్నాడు సుధీర్. ఇంతలో లైట్స్ ఆర్పేసారికి "లైట్ లు ఆపెంత పోజ్ కాదు.." అనేసరికి లైట్స్ వెలిగాయి. వెంటనే సుధీర్ మోకాలి మీద ప్రదీప్ కూర్చుని థంబ్ పెట్టాడు" అలా వీళ్ళిద్దరూ కలిసి ఫొటోస్ దిగారు.

Jayam serial: గంగని క్షమించేసిన రుద్ర.. పైడిరాజుని చూసేసాడుగా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -14 లో......గంగ లేట్ గా నిద్ర పోతుంటే ఫస్ట్ డేనే డ్యూటీ కి లేట్ గా వెళ్తే ఎలా త్వరగా రెడీ అవ్వు అని గంగ వాళ్ల అమ్మ నిద్ర లేపుతుంది. త్వరగా లేచి ఇంట్లో పనులు చేసి సూపర్ మార్కెట్ కి బయలు దేర్తుంది. బస్సు లేట్ అవ్వడం.. ఇంకా ఆటో దొరకపోవడంతో గంగ సూపర్ మార్కెట్ లోకి లేట్ గా వెళ్తుంది. రుద్ర ఆల్రెడీ సూపర్ మార్కెట్ లో ఉంటాడు. ఎవరు లేట్ గా వచ్చిన లోపలికి రానివ్వొద్దని చెప్తాడు. దాంతో గంగ లేట్ గా రావడంతో తనని లోపలికి అనుమతించారు. అప్పుడే రుద్ర వాళ్ళ పెద్దనాన్న వచ్చి గంగని లోపలికి తీసుకొని వెళ్తాడు. నువ్వు ఇక్కడే ఉండు.. నేను రుద్ర తో మాట్లాడుతానని వెళ్లి ఈ ఒక్కసారి గంగని వదిలేయ్ అని చెప్తాడు. రేపటి నుండి టైమ్ కి వస్తుందని అతను రుద్రని కన్విన్స్ చేస్తాడు. ఇక రేపటి నుండి త్వరగా రమ్మని గంగతో చెప్పి రుద్ర వాళ్ళ పెద్దనాన్న చెప్పి వెళ్ళిపోతాడు. మరొక వైపు గంగ వాళ్ల నాన్న పైడిరాజు పేకాట ఆడి అప్పు చేస్తాడు. నా కూతురు జాబ్ చేస్తుంది. మీ అప్పు తీరుస్తానని వాళ్ళతో చెప్తాడు.ఆ తర్వాత గంగ సూపర్ మార్కెట్ లో అన్ని పనులు ఫాస్ట్ గా చేస్తుంది. ఫస్ట్ డే అయిన చాలా ఫాస్ట్ గా చేస్తున్నావని అక్కడున్న వాళ్ళు అందరు అంటుంటారు. నేను అంతే అని గంగ అనగానే అంటే పని రాక్షసివి అన్నమాట అని ఒకావిడ అంటుంది. రాక్షసి అనగానే రుద్ర ఫోటోని భూతంలాగా గీసిన బొమ్మ గుర్తుచేసుకొని ఇప్పుడు గానీ అతను అది చుస్తే ఇంకేమైనా ఉందా అని కంగారుగా రుద్ర క్యాబిన్ వైపు పరుగెడుతుంది గంగ. రుద్ర క్యాబిన్ లో ఉంటాడు. బొమ్మ గీసిన పేపర్ టేబుల్ పై ఉంటుంది. ఇప్పుడు ఎలా తీసుకొని రావాలని గంగ టెన్షన్ పడుతుంది. తరువాయి భాగంలో సూపర్ మార్కెట్ దగ్గరున్న గంగ దగ్గరికి పైడిరాజు అప్పు ఇచ్చేవాళ్ళని తీసుకొని వచ్చి.. వాళ్లకు డబ్బు ఇవ్వమంటూ గొడవ చేస్తుంటే రుద్ర చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కన్నకూతురిని అవమానించి పంపించేసిన తల్లి.. బాధపడ్డ రేవతి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -783 లో.....అందరు స్వప్న వాళ్ల పాపకి గిఫ్ట్స్ ఇస్తుంటారు. రాజ్ కావ్య దగ్గరున్న గిఫ్ట్ తీసుకొని స్వప్న పాపకి ఇస్తాడు. ఆ తర్వాత ఏంటే కావ్య.. నా కూతురికి కనీసం గిఫ్ట్ కూడా తీసుకొని రాలేదని స్వప్న అంటుంది. అది నేను తీసుకొని వచ్చిందేనని కావ్య అంటుంటే పరువు తియ్యకండి కళావతి గారు అని రాజ్ అంటాడు. ఎవరు తీసుకొని వస్తే ఏంటి మేం ఇద్దరం ఒకటే కదా అని కావ్య అంటుంది. అందరు తీసుకొని వచ్చారు నీ కూతురికి నువ్వేం తీసుకొని రాలేదా అని రాహుల్ ని ఇందిరాదేవి అడుగుతుంది. తీసుకొని వచ్చానని డ్రెస్ తీసుకొని వస్తాడు. అది చూసి ఇలాంటి డ్రెస్ నా కూతురికి ఎలా తీసుకోవాలనిపించిందని రాహుల్ పై స్వప్న కోప్పడుతుంది నా దగ్గర డబ్బు లేదు ఉన్నంతలో తీసుకున్నాను.. మాకు మీరు ఏదయినా ప్రాపర్టీ రాసివ్వండి అని రుద్రాణి అనగానే సరే అని ఇందిరాదేవి అంటుంది. వాళ్లకు వద్దు రాస్తే నా కూతురికి రాసివ్వండి అని స్వప్న అంటుంది. అలాగే అని ఇందిరాదేవి అనగానే రాహుల్, రుద్రాణి కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతారు. మరొకవైపు రేవతి, జగదీష్ ఇద్దరు దుగ్గిరాల ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతారు. నాకు భయంగా ఉందని రేవతి అంటుంటే మీ వాళ్ళకి నీపై కోపం పోయి ఉంటుంది. నువ్వేం భయపడకు అని జగదీశ్ దైర్యం చెప్తాడు. ఆ తర్వాత కేక్ కట్ చేయండి ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నారని అపర్ణ వాళ్ళు అంటుంటే ఇంకా రావల్సిన వాళ్ళున్నారు అని కావ్య అంటుంది. అప్పుడే రేవతి, జగదీశ్ వస్తారు. వాళ్ళని చూసి అందరూ షాక్ అవుతారు. అగు అక్కడే అని అపర్ణ అంటుంది. మళ్ళీ ఎందుకు వచ్చావని అపర్ణ కోప్పడుతుంది. మీరే కదా అత్తయ్య నిన్న పిలిచారని కావ్య అంటుంది. తను అని తెలిస్తే పిలిచేదాన్ని కాదని అపర్ణ అంటుంది. తరువాయి భాగంలో రేవతిని అవమానించి పంపిస్తుంది అపర్ణ. ఆ తర్వాత రేవతి ఫోటో చూసి అపర్ణ బాధపడుతుంటే మన బిడ్డ మీద ఇంకా కోపంగా ఉన్నావా అని సుభాష్ అడుగుతాడు. అదంతా కావ్య వింటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దాస్ కి థాంక్స్ చెప్పిన శివన్నారాయణ.. కార్తీక్ సవాల్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -419 లో.. కార్తీక్, దీప మాట్లాడుకుంటుంటే శౌర్య వచ్చి.. నాకు అమ్మ ఉంది.. నీకు ఉంది.. అమ్మ వాళ్ల అమ్మ ఎక్కడ అని కార్తీక్ ని అడుగుతుంది. అమ్మ వాళ్ల అమ్మ కలిసి ఉండాలని మొక్కుకోమని శౌర్యతో చెప్తాడు కార్తీక్. మా అమ్మ అక్కడ ఎలా ఉందో ఏంటో రేపు ప్రొద్దున అక్కడికి వెళ్ళాలని కార్తీక్ తో దీప అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిన సరే ఎంగేజ్ మెంట్ ఆగిపోయిందని పారిజాతం అనగానే నీ కొడుకుని నువ్వే రప్పించావా అని జ్యోత్స్న అడుగుతుంది. లేదని పారిజాతం అనగానే అయితే బావ నా చేత నిజం చెప్పించాలనుకున్నాడు. అది ఫెయిల్ అయితే ఇలా ప్లాన్ చేసాడన్నమాట అని జ్యోత్స్న అంటుంది. ఆ గౌతమ్ గాడు చూసావా వాడు చెడ్డవాడు అయ్యాడని నిన్ను చెడ్డదాన్ని చెయ్యాలనుకున్నాడు దీపని చంపాలని ట్రై చేసావని చెప్పబోతుంటే కార్తీక్ ఆపాడని పారిజాతం అంటుంది. బావకి నేను దీపని చంపించాలనుకున్నానని తెలుసని జ్యోత్స్న అంటుంది. రేపు దీప రానియ్ దాని సంగతి చెప్తానని పారిజాతం అంటుంది. మరుసటి రోజు శివన్నారాయణ ఇంటికి దాస్ వస్తాడు. చాలా థాంక్స్ దాస్ టైమ్ కి వచ్చి జ్యోత్స్న జీవితం కాపాడావని శివన్నారాయణ అంటాడు. అప్పుడే దీప వస్తుంది ఈ దీప వల్లే ఇదంతా అని పారిజాతం కోప్పడుతుంది. ఫస్ట్ గౌతమ్ మంచివాడు కాదని చెప్పింది.. తర్వాత మంచివాడు అంటేనే కదా ఎంగేజ్ మెంట్ కి ఏర్పాట్లు చేసుకుందని పారిజాతం అంటుంది. మీరు ముందు చెప్తే నమ్మారా ఎప్పుడు మీరు దీప మాటలు నమ్మరని కార్తీక్ అంటాడు. అసలు గౌతమ్ గురించి ఎలా తెలుసుకున్నావని దాస్ ని శివన్నారాయణ అడుగుతాడు. కార్తీక్ చెప్పాడని దాస్ అనగానే.. నీకు ఎందుకు గౌతమ్ పై డౌట్ వచ్చిందని శివన్నారాయణ అడుగుతాడు. మావయ్య కనుక్కోమని చెప్పాడని కార్తీక్ అంటాడు. ఇక్కడ అందరు మంచివాళ్ళే అని దాస్ అనగానే నేను ఎప్పటికి ఆ దీపని నమ్మలేనని సుమిత్ర అంటుంది. నా భార్య పై ఇంకొక నింద ఉంది దశరథ్ మావయ్యని షూట్ చేసింది నా భార్య కాదని నిరూపిస్తాను లేదంటే దీప భర్తనే కాదని కార్తీక్ ఛాలెంజ్ చేస్తాడు. దాంతో జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అదంతా ఆనందరావు కల.. రాజమాత ఆర్డర్ తప్పితే అంతే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -220 లో..... ప్రేమ, నర్మద నడుచుకుంటూ వెళ్తు ప్రొద్దున శ్రీవల్లి మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటారు. శ్రీవల్లికి పెత్తనం రావడం వెనకాల ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. ఎన్నోసార్లు గొడవ అయింది కానీ ఇలా ఇంటికి వెళ్తానని ఓవర్ యాక్టింగ్ చెయ్యలేదు. ఇందులో వాళ్ల అమ్మ హస్తం ఉందేమోనని డౌట్ అనీ నర్మద అనగానే అవును అక్క నాకు అనిపిస్తుందని ప్రేమ అంటుంది. మనం వాళ్ల గురించి తెలుసుకొని వాళ్ల బంఢారం బయటపెట్టాలని ఎక్కడ అయితే.. ఆపేసామో అక్కడ నుండి మొదలు పెడుదామని ప్రేమ, నర్మద అనుకుంటారు. ఆ తర్వాత భాగ్యం తన ఫ్యామిలీ గురించి ప్రేమ, నర్మద తెలుసుకొని రామరాజుకి చెప్పి తనని భాగ్యం ఉన్న ఇంటికి తీసుకొని వస్తారు. రామరాజు ని చూసి భాగ్యం షాక్ అవుతుంది. నన్ను ఇంత మోసం చేస్తారా అని ఆనందరావు ని లాక్కొని వెళ్లి శ్రీవల్లి దగ్గర పడేసినట్లు శ్రీవల్లిని ఇంట్లో నుండి గెంటేసినట్లు ఆనందరావు కల కంటాడు. ఒక్కసారిగా ఉల్లిక్కిపడి లేచి మన అమ్మాయిని ఇంట్లో నుండి గెంటేసినట్లు కల వచ్చిందని చెప్పగానే అలా జరగనివ్వను మన జోలికి ఆ నర్మద రాకుండా చేస్తానని భాగ్యం అంటుంది. మరోవైపు నర్మద వెళ్తుంటే సాగర్ పక్కనుండి వెళ్లిన మాట్లాడడు. పాపం నీ కష్టం ఎవరికి రాకూడదంటూ వెటకారంగా భాగ్యం వచ్చి నర్మదతో మాట్లాడుతుంది. తరువాయి భాగంలో ధీరజ్, ప్రేమ వచ్చేసరికి శ్రీవల్లి డోర్ వేస్తుంది. ప్రొద్దున రాజమత ఆర్డర్ వేసింది కదా టైమ్ కి రావాలని అని ధీరజ్ తో ప్రేమ అంటుంది. ఆకలిగా ఉందే అని ప్రేమతో ధీరజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

చల్లటి బీరు తాగినంత హాయిగా ఉంది నీ వాయిస్...

పాడుతా తీయగా సీజన్ 25 కి సంబందించిన నెక్స్ట్ వీక్ ప్రోమోలో కీరవాణి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అలాగే సునీత, చంద్రబోస్ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. సీనియర్ సింగర్ చిత్రమా పుట్టినరోజు సందర్భంగా సింగర్స్ కొంతమంది ఆమె పాటల్ని పాడారు. ఇందులో శ్రీనివాస్ దరిమిశెట్టి "హలో బ్రదర్" మూవీ నుంచి "అల్లరి కోయిల" సాంగ్ పాడాడు. చంద్రబోస్ ఈ సాంగ్ మీద కామెంట్ చేశారు. "కొంతకాలం పాటు జనాలందరినీ ఉర్రూతలూగించిన పాట ఇది" అన్నారు. ఇక సునీత ఐతే "అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పాట ఏలుతూనే ఉంది" అన్నారు. ఇక ఇప్పుడు కీరవాణి అందుకున్నారు.. "చల్లటి బీరు తాగితే ఎంత హాయిగా ఉంటుందో అంతా హాయిగా ఉంది నీ వాయిస్" అన్నారు. శ్రీనివాస్ తెలుగు ఇండియన్ ఐడల్ లో 1st రన్నరప్ గా వచ్చాడు అలాగే చిరంజీవి చేతుల మీదుగా రెండు లక్షల కాష్ ప్రైజ్ తీసుకున్నాడు. సరేగమప 2018 లో 2nd రన్నరప్ గా నిలిచాడు. ఇక ప్రోమో చివరన కీరవాణి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. "పాత్రికేయులు నన్ను.. నన్నంటే నన్ను కాదు అందరినీ పరభాషా గాయకులూ పాడుతున్నారు. ఎందుకు పరభాషా గాయకులు అంటున్నారు. పాడితే  తప్పేంటి ? అది కాదు అడగాల్సిన ప్రశ్న" అంటూ కామెంట్ చేసారు. ఇక సింగర్ సునీత ఐతే "చిత్రమ్మ  అలా వచ్చి నిల్చుంటే చాలు సాష్టాంగ నమస్కారం చేయాలనిపిస్తుంది. " అన్నారు. గత ఎపిసోడ్స్ లో ఈ షో జడ్జెస్ ఐన కీరవాణి, సునీత, చంద్రబోస్ మీద సింగర్ ప్రవస్తి చేసిన కామెంట్స్ గురించి తెలిసిందే.  

టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న కూకు విత్ జాతిరత్నాలు...కార్తీకదీపం

  బుల్లితెర మీద ప్రసారమయ్యే షోస్ చాలా ఉన్నాయి. ఐతే రీసెంట్ గా జాయిన్ ఐన కొత్త షో కూకు విత్ జాతిరత్నాలు.. కుకింగ్ షో అన్నమాట. చాలా రోజుల తర్వాత ప్రదీప్ హోస్ట్ గా ఈ కుకింగ్ షో చేస్తున్నాడు. ఇక జడ్జెస్ గా సీనియర్ నటి రాధ, ఆశిష్ విద్యార్థి, చెఫ్ సంజయ్ తుమ్మ ఉన్నారు. ఇక బుల్లితెర నటులు జాతిరత్నాలుగా, సీనియర్ నటులేమో చెఫ్స్ గా ఈ షోలో ఉన్నారు. ఐతే ఈ షోస్ కి కూడా రేటింగ్స్ ఉంటాయి. ఏ షో ఎంత రేటింగ్ తో టాప్ లో ఉందో స్టార్ మా రీసెంట్ గా అనౌన్స్ చేసింది. నాన్ ఫిక్షన్ షోస్ లో టాప్ 2 ప్లేసెస్ ని ఆక్రమించుకున్న షోస్ "కూకు విత్ జాతిరత్నాలు" ఉంది. ఈ షోకి రేటింగ్ 7 . 2 గా ఉంటే "ఆదివారం విత్ స్టార్ మా పరివారం"  షో సెకండ్ ప్లేస్ లో ఉంది. ఈ షోకి రేటింగ్ 5 . 6 గా ఉంది. ఇక సీరియల్స్ విషయానికి వస్తే కార్తీక దీపం 14 .42 , గుండె నిండా గుడి గంటలు 13 . 11 , ఇంటింటి రామాయణం 12 . 92 , ఇల్లు ఇల్లాలు పిల్లలు, 12 . 36 , నువ్వుంటే నా జతగా 10 .62 , బ్రహ్మముడి సీరియల్ కి రేటింగ్ బాగా తగ్గిపోయింది 6 .96 గా ఉంది. ఇలా సీరియల్స్ రేటింగ్ ని సొంతం చేసుకున్నాయి. కూకు విత్ జాతిరత్నాలు షోలో ప్రదీప్ కామెడీ అలాగే మద్యమద్యలో యాదమ్మ రాజు పెళ్లి కాన్సెప్ట్ ఈ వారం బాగా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది. ఇక సీరియల్స్ పరంగా చూస్తే కార్తీక దీపం - 2  హవా కొనసాగిస్తోంది. ఇక గుండె నిండా గుడి గంటలు సీరియల్ హీరో బాలు ఇటు సీరియల్ లోనూ అటు మిగతా షోస్ లో కనిపించడం శ్రీముఖి వలన బాలుకి మంచి హైప్ వస్తోంది. దాంతో అటు ఆ షో ఇటు ఈ సీరియల్ కూడా మంచి రేటింగ్ ని సొంతం చేసుకుంటున్నాయి.

Jayam serial : గంగని కాపాడిన రుద్ర.. తనని కిడ్నాప్ చేసింది ఎవరంటే!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ నెల పద్నాలుగున కొత్తగా మొదలైంది. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -13 లో..... రుద్ర బామ్మర్ది వీరు గంగని కిడ్నాప్ చేస్తాడు. తన భారీ నుండి గంగని రుద్ర కాపాడి ఎత్తుకొని ఇంటికి తీసుకొని వస్తుంటే.. గుమ్మానికి ఉన్న పూలదండ వాళ్లపై పడుతుంది‌. రుద్ర చిరాకు పడుతుంటే.. వీరు వచ్చి అది తీసేస్తాడు. గంగని అలా ఎత్తుకొని తీసుకొని వస్తుంటే రుద్ర ఫ్యామిలీ టెన్షన్ పడతారు. గంగకి ఏమైందని అడుగుతారు. ఎవరో గంగని కిడ్నాప్ చేస్తే బావ కాపాడాడని ఏం తెలియనట్లు వీరు యాక్ట్ చేస్తాడు. గంగ స్పృహలో లేకపోవడంతో డాక్టర్ ని పిలుస్తారు. గంగని ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారు బావ అని రుద్రతో వీరు అంటాడు. నా శత్రువులు అయిన అయి ఉండాలి లేక నా నాశనం కోరుకునేవారు అయి ఉండాలి.. అందుకే నా దగ్గర పనిచేసే తనని కిడ్నాప్ చేశారని రుద్ర అంటుంటే అది ఎవరైనా సరే నేను కనుక్కుంటానని వీరు అంటడు. వీరు పక్కకి వెళ్లి ప్లాన్ ఫెయిల్ చేశారని  రౌడీలతో మాట్లాడతాడు. ఆ రుద్ర వస్తాడనుకోలేదు ఒక్కొక్కరిని బాగా కొట్టాడని ఆ రౌడీ చెప్తాడు. వీరు డిస్సపాయింట్ గా ఉంటే తన చెల్లి వచ్చి ఏదో ప్లాన్ ఫెయిల్ అయినట్లు ఉంది బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ అంటుంది. మరోవైపు డాక్టర్ వచ్చి గంగని చెక్ చేసి ఏం పర్వాలేదు ఆని చెప్తాడు. గంగ స్పృహ లోకి వచ్చి‌‌.. నేనేంటి ఇక్కడున్నా అని అడుగుతుంది. నిన్ను ఎవరో కిడ్నాప్ చేశారు రుద్ర కాపాడాడని చెప్తారు. నాకు గుర్తు వచ్చింది ఎవరో ఒకతను కొంతమంది అమ్మాయిలని తీసుకొని వెళ్తున్నాడు. ఆ కార్ నెంబర్ అంటూ గంగ గుర్తుచేసుకోబోతుంటే వీరు కంగారుపడుతూ.. గంగ మీ ఇంట్లో వాళ్ళు వెయిట్ చేస్తుంటారు పదా డ్రాప్ చేస్తానని అంటాడు. నువ్వు వద్దు రుద్ర డ్రాప్ చేస్తాడని రుద్ర వాళ్ల నాన్న అంటాడు. గంగని ఇంటి దగ్గర తీసుకొని వెళ్తాడు రుద్ర. అప్పటికే గంగ కన్పించడం లేదని వాళ్ల అమ్మ ఏడుస్తుంటుంది. గంగ ని చూడగానే దగ్గరికి వచ్చి ఏమైందని అడుగుతుంది. గంగ వాళ్ల నాన్న రుద్ర దగ్గరికి వెళ్లి నా కూతురిని నువ్వు తీసుకొని వెళ్ళావంటూ తాగి వాగుతుంటే రుద్రకి కోపం వస్తుంది. రుద్ర కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తరువాయి భాగంలో గంగ సూపర్ మార్కెట్ లో పని చేస్తూ ఉంటుంది. తను లేట్ గా లేవడంతో సూపర్ మార్కెట్ కి ఆలస్యంగా వెళ్తుంది. ఆ రోజే రుద్ర సూపర్ మార్కెట్ కి చెకింగ్ కి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu : ఇంట్లో శ్రీవల్లిదే పెత్తనం.. ప్రేమ, నర్మదలకి టార్చర్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -219 లో.....ప్రేమ నిద్రపోతుంటే శ్రీవల్లి వచ్చి మొహంపై వాటర్ కొడుతుంది. ఈ టైమ్ వరకు పడుకోవడమేంటి.. రేపటి నుండి ప్రొద్దున లేచి ముగ్గు పెట్టాలని శ్రీవల్లి అనగానే నేను చెయ్యనని ప్రేమ అంటుంది. అయితే ఈ విషయం మావయ్య గారికి చెప్తానని అనడంతో ప్రేమ కోపంగా వెళ్ళిపోతుంది.  ఆ తర్వాత నర్మద స్నానానికి వెళ్తు గీజర్ స్విచ్ వేసుకొని వెళ్తుంది. లోపలికి వెళ్ళగానే శ్రీవల్లి వచ్చి స్విచాఫ్ చేస్తుంది. నర్మద వచ్చి ఎవరు ఆఫ్ చేశారనుకుంటుంది నేనే అఫ్ చేసాను.. కరెంటు బిల్ ఆదా చేస్తున్నానని శ్రీవల్లి అంటుంది. ఇక నర్మద  వెళ్లి ఛన్నీళ్లతో స్నానం చేస్తుంది. ఆ తర్వాత ప్రేమ ముగ్గు వేస్తుంది. నర్మద స్నానం చేసి వస్తుంది. అందరు నేను చెప్పినట్లు వింటున్నారని శ్రీవల్లి మురిసిపోతుంది. ఆ తర్వాత శ్రీవల్లి పూజ చేసి హారతి ఇస్తుంది. మీ స్థానంలో నేను పెత్తనం చెయ్యడం బాధగా ఉంది కానీ మావయ్య గారికి ఎదురు చెప్పలేనని వేదవతితో శ్రీవల్లి అంటుంది. ఇక ఈ ఇంట్లో కొన్ని నిర్ణయలు తీసుకున్నానని అందరి ముందు శ్రీవల్లి చెప్తుంది. అందరు టైమ్ కి వెళ్లి టైమ్ కి రావాలి.. ఎవరైనా లేట్ గా వస్తే డోర్ తీయను అందరు నాకు చెప్పి వెళ్ళాలని చెప్తుంది. ప్రొద్దున అందరు శ్రీవల్లికి చెప్పి వెళ్తుంటారు. ప్రేమ నువ్వు ఎక్కడికి వెళ్లిన త్వరగా రావాలని శ్రీవల్లి చెప్తుంది. అందరూ చెప్పి వెళ్లడంతో శ్రీవల్లి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : దాస్ వల్ల ఆగిపోయిన ఎంగేజ్ మెంట్.. గౌతమ్ కి బుద్దిచెప్పిన కార్తీక్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -418 లో..... జ్యోత్స్నకి గౌతమ్ రింగ్ తోడుగబోతుంటే.. ఎక్కడ ఎంగేజ్ మెంట్ జరుగుతుందేమనని టెన్షన్ పడుతుంది దీప. నువ్వు టెన్షన్ పడకు ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి ఉంది కదా అని కార్తీక్ అంటాడు. అప్పుడే శివన్నారాయణ వచ్చి ఎంగేజ్ మెంట్ ఆపండి అని అంటాడు. దాంతో అందరు షాక్ అవుతారు. నా మనవరాలు జీవితం నాశనం చేయాలని అనుకుంటావా అని గౌతమ్ కాలర్ పట్టుకుంటాడు శివన్నారాయణ. సాక్ష్యాలు లేకుండా ఇలా నింద వెయ్యడం కరెక్ట్ కాదని గౌతమ్ అంటుంటే.. దాస్ ని పిలవగా దాస్ వచ్చి గౌతమ్ రాసలీల వీడియో చూపిస్తాడు. అదంతా ఫేక్ అని గౌతమ్ సమర్ధిస్తుంటే.. తన వల్ల ప్రెగ్నెంట్ అయినా రమ్యని పిలుస్తారు. ఇంతకు ముందు వచ్చినప్పుడు నువ్వే కదా గౌతమ్ కి నా కడుపులో బిడ్డకి సంబంధం లేదని చెప్పావని సుమిత్ర అంటుంది. అప్పుడు అబద్దం చెప్పానని రమ్య అంటుంది. ఇప్పుడు నిజం చెప్పావని గ్యారంటి ఏంటని గౌతమ్ అనగానే ఆ కడుపులో బిడ్డ కి డిఎన్ఏ టెస్ట్ చేయించాలని దాస్ అనగానే గౌతమ్ భయపడుతాడు. ఈ పెళ్లి వద్దు ఏం వద్దని వెళ్తుంటే నిజం బయట పడింది కాబట్టి సైలెంట్ గా వెళ్ళిపోతున్నావా అని అతడిని దశరథ్ కొడతాడు. నేనే చేసానా తప్పు.. నీ కూతురు కూడా చేసిందని.. దీపని చంపించాలని చూసిందని గౌతమ్ చెప్పబోతుంటే అతని చెంప చెల్లుమనిపిస్తాడు కార్తీక్. చేసింది తప్పు ఇంకా ఈ ఇంటి ఆడపిల్లపై వేలెత్తి చూపిస్తావా అని కార్తీక్ అంటాడు. కాసేపటికి అందరు అక్కడ నుండి వెళ్ళిపోతారు. సుమిత్ర కళ్ళు తిరిగిపడిపోతుంది. డాక్టర్ వస్తారు. ఎంగేజ్ మెంట్ ఆగిపోవడంతో స్ట్రెస్ తీసుకున్నారని డాక్టర్ చెప్తుంది. కార్తీక్,  దీపలని అక్కడ నుండి వెళ్ళమంటాడు శివన్నారాయణ. కార్తీక్ ఇంటికి వెళ్లి జరిగిందంతా కాంచనకి చెప్తాడు. ఆ తర్వాత దీప జరిగింది గుర్తు చేసుకొని బాధపడుతుంటే.. కార్తీక్ వెళ్లి మాట్లాడతాడు. ఆ తర్వాత శౌర్య వచ్చి నాకు అమ్మ ఉంది.. నీకు అమ్మ ఉంది.. అమ్మ వాళ్ల అమ్మ ఎక్కడ అని అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : రుద్రాణి పెట్టిన చిచ్చు.. అపర్ణ తన కూతురిని అంగీకరిస్తుందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -782 లో... కావ్య, రాజ్ కలిసి యామిని ఇంటికి వస్తారు. ఇంటి పైనుండి యామిని, వైదేహి చూస్తుంటారు. కావ్య కావాలనే రాజ్ దగ్గరగా వచ్చి థాంక్స్ అని చెప్పి హగ్ చేసుకుంటుంది. మీరు రేవతి గారి విషయంలో హెల్ప్ చేస్తున్నందుకు థాంక్స్ అని కావ్య అనగానే రాజ్ ఇలా మీరు హగ్ ఇచ్చి థాంక్స్ చెప్తారని తెలిస్తే రోజొక హెల్ప్ చేసేవాడిని కదా అని రాజ్ అంటాడు. అదంతా యామిని చూసి కుళ్ళుకుంటుంది. రాజ్ లోపలికి రాగానే.. మీరు ఆ కళావతి బాగా క్లోజ్ అయినట్లున్నారని వైదేహి అనగానే అదేం లేదండి.. రేపు కళావతి హ్యాపీగా ఉంటుంది.. అప్పుడు ప్రపోజ్ చెయ్యాలి అనుకుంటున్నానని రాజ్ అంటాడు. ఆ తర్వాత ఇప్పుడు కుడా సైలెంట్ గా ఉండాలా అని యామిని అంటుంటే ఉండాలి బేబి నువ్వు అప్పు విషయంలో తొందరపడ్డావ్. నువ్వు తప్పు చేసావనడానికి సాక్ష్యం వాళ్ల దగ్గర ఉందని వైదేహి అంటుంది. ఆ తర్వాత అపర్ణ దగ్గరికి రుద్రాణి వచ్చి.. ఇంకా రేవతిపై కోపం ఉందో లేదో టెస్ట్ చేస్తుంది. రేవతి పేరు తియ్యగానే అపర్ణ కొట్టినంత పని చేసింది.. ఇదే కదా మాక్కావాల్సింది ఆ రేవతి ఈ ఇంటికి దగ్గర కాకూడదని రాహుల్, రుద్రాణి అనుకుంటారు. మరుసటి రోజు రాహుల్ తన పాపకి లో కాస్ట్ లో డ్రెస్ తీసుకొని వస్తాడు. ఎందుకు ఇలా తీసుకొని వచ్చావని రుద్రాణి అనగానే అప్పుడే కదా అందరికి తెలిసింది.. మా ఆస్తులు మాకు రాయండి అంటే పాప పేరు మీద అయినా ఆస్తులు రాస్తారు కదా అని రాహుల్ అంటాడు. అవునని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత రాజ్ కోసం కావ్య వెయిట్ చేస్తుంది. రాజ్ రాగానే పక్కకి తీసుకొని వెళ్లి రేవతి గారి అప్డేట్ ఏంటని కావ్య అడుగుతుంది. ఎప్పుడు దాని గురించేనా వస్తుంది లేండి అని కావ్యపై రాజ్ చిర్రు బుర్రులాడతాడు. ఆ తర్వాత స్వప్న పాప పుట్టినరోజుకి కళ్యాణ్ ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చి అప్పుకి చూపిస్తాడు. బాగుందని అప్పు అంటుంది. మనకి ఒక పాప ఉంటే బాగుండు అని కళ్యాణ్ అనగానే నాకు బాబు కావాలని అప్పు అంటుంది. అందరు స్వప్న దగ్గరికి వాళ్ళు తీసుకొని వచ్చిన గిఫ్ట్స్ ఇస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

మనసిచ్చి చూడు సీరియల్ హీరో పెళ్లి ఫిక్స్...

  "మా బోనాల జాతర" పేరుతో ఆదివారం స్పెషల్ ఎపిసోడ్ రాబోతోంది. ఐతే ఈ ఎపిసోడ్ లో స్పెషల్ అట్రాక్షన్ మహేష్ - సాండ్రా. వీళ్ళ వీడింగ్ బెల్స్ ఈ స్టేజి మీద మోగాయి. మహేష్ "మనసిచ్చి చూడు" సీరియల్ లో ఆది రోల్ ద్వారా తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యాడు. ఇక ఈ ఎపిసోడ్ కి మహేష్ - సాండ్రా వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు. "మీకు అబ్బాయి నచ్చితే మహేష్ నా అల్లుడివి నువ్వే" అని చెప్పండి అంటూ సాండ్రా వాళ్ళ నాన్నకు చెప్పమని చెప్పింది శ్రీముఖి. "ఎప్పుడో చెప్పాను" అన్నారాయన..వెంటనే మహేష్ తనకు కాబోయే అమ్మాయి చేతులు పట్టుకుని  ధర్మేచా..అంటే ధర్మంగా నిన్ను బాధ్యతగా చూసుకుంటాను అని ప్రమాణం చేస్తున్నా అంటూ వెలికి ఉంగరం తొడిగాడు. మోక్షేచ్చ అంటే మోక్ష మార్గంలో నడిపించడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాను అని చెప్పాడు. అప్పుడు సాండ్రా మహేష్ వెలికి ఉంగరం పెట్టింది. తర్వాత మహేష్ ఆమెను హగ్ చేసుకున్నాడు. "ఇప్పటివరకు నేను నీకు ప్రొపోజ్ చేయలేదు. ఐ లవ్ యు" అంటూ ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని చెప్పాడు. అలా ప్రొపోజ్ చేసిన తర్వాత మహేష్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. దాంతో సాండ్రా అతని కన్నీళ్లు తుడిచింది. "మా ఇంటికి నాకు కాబోయే అమ్మాయిని తీసుకొచ్చా" అని చెప్పాడు. దాంతో శ్రీముఖి సూపర్ అంది. సెట్ లో ఉన్న వాళ్ళ ఫామిలీ మెంబర్స్ అంతా చప్పట్లు కొట్టారు. వీళ్ళిద్దరూ కలిసి "సమ ప్రయాణం" పేరుతో ఒక యూట్యూబ్ చానెల్ ని రన్ చేస్తున్నారు. సాండ్రా జైచంద్రన్ ముద్దమందారం, కలవారి కోడళ్ళు వంటి సీరియల్స్ లో నటించింది. ఆటో విజయశాంతి సీరియల్ లో నటిస్తోంది.

Illu illalu pillalu : భాగ్యం ఫ్యామిలీ గుట్టురట్టు చేసిన ప్రేమ, నర్మద.. శ్రీవల్లి షాక్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -218 లో.... నర్మద ముందు సాగర్ వెళ్తు నర్మదని పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. దాంతో బావగారు నీతో మాట్లాడడం లేదు కదా ఎందుకు అక్కా అబద్దం చెప్పావ్.. నా వల్లే ఇదంతా అని ప్రేమ ఫీల్ అవుతుంది. నీతో కూడా ధీరజ్ మాట్లాడడం లేదు కదా నాకు అర్ధం అయింది.. వాళ్ళే మాట్లాడతారని ప్రేమతో నర్మద అంటుంది. ఆ తర్వాత వేదవతి డల్ గా ఉంటుంది. తిరుపతి వెళ్లి మాట్లాడతాడు. తిరుపతి మాటలకి వేదవతి తన చెంపచెల్లుమనిపిస్తుంది. అప్పుడే నర్మద, ప్రేమ వస్తారు. నేను చెప్పినట్లు చెయ్యండి అని వాళ్ళు తిరుపతికి చెప్పి వేదవతి దగ్గరికి పంపిస్తారు. నీ పెత్తనం లాగేసుకున్నారు అక్కా.. ఇక ఒక్క క్షణం కూడా ఇక్కడ వద్దు వెళదాం పద అని తిరుపతి అంటాడు. మమ్మల్ని విడదీయ్యాలి అనుకుంటావా అని వేదవతి మరొక చెంపపగులగొడుతుంది. అది మీ కోడళ్ళు చెప్పారని తిరుపతి అనగానే వేదవతి వాళ్ల వంక కోపంగా చూసి వెళ్ళిపోతుంది. మరొకవైపు ప్రేమ దగ్గరికి ధీరజ్ భోజనం తీసుకొని వస్తాడు. భోజనం చేయలేదట అని అడుగుతాడు. వస్తువుతో నీకెందుకని ప్రేమ బాధపడుతుంది. మరొకవైపు ఇంటికి పెత్తనం వచ్చింది.. ఇక నేను చెప్పినట్లే వింటారని శ్రీవల్లి అనుకుంటుంది. పడుకున్న ప్రేమ దగ్గరికి వెళ్లి మొహంపై నీళ్లు చళ్లుతుంది శ్రీవల్లి. ఇది నీ పుట్టిల్లు కాదు రేపటి నుండి అయిదింటికి లేవాలని శ్రీవల్లి చెప్పగానే.. నేను లేవనని ప్రేమ అంటుంది. సరే ఇదే విషయం మావయ్య దగ్గరికి వెళ్లి చెప్తానని శ్రీవల్లి అంటుంది. తరువాయి భాగంలో ప్రేమ, నర్మద కలిసి భాగ్యం ఫ్యామిలీ గుట్టురట్టు చేస్తారు. ఇడ్లీ అమ్మడానికి వెళ్తున్న భాగ్యం వాళ్ళ దగ్గరికి రామరాజుని ప్రేమ, నర్మద లు తీసుకొని వెళ్తారు. రామరాజు ఆనందరావుని కొడతాడు. ఆ తర్వాత ఆనందరావుని తీసుకొని వెళ్లి శ్రీవల్లి ముందు పడేస్తాడు రామరాజు. అది చూసి శ్రీవల్లి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : హ్యాండ్ ఇచ్చిన దీప.. టెన్షన్ లో జ్యోత్స్న!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -417 లో... ఈ ఎంగేజ్ మెంట్ జరుగుతుందా లేదా నా మీద ఒట్టేసి చెప్పమని దీప చెయ్ సుమిత్ర తన తలపై పెట్టుకుంటుంది. నేను మీపై ఒట్టు వెయ్యలేనని దీప అంటుంది. అంటే నువ్వు ఈ ఎంగేజ్ మెంట్ జరగనివ్వవా అని సుమిత్ర అడుగుతుంది. దీప ముందు సుమిత్ర ఒక గీత గీస్తుంది. ఈ గీత దాటి ఎంగేజ్ మెంట్ అయిపోయే వరకు రాకని దీపతో సుమిత్ర చెప్పి వెళ్ళిపోతుంది. అదంతా కార్తీక్ చూస్తుంటాడు. ఆ గీత దాటి రా దీప మనం చెయ్యాల్సింది బాగా ఉందని కార్తీక్ అనగానే నేను నా తల్లి మాట కాదని రాలేనని దీప చెప్తుంది. సరే నువ్వు ఇక్కడే ఉండి జరిగేది చూస్తూ ఉండని కార్తీక్ చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత గౌతమ్ తన కుటుంబంతో ఎంట్రీ ఇస్తాడు. జ్యోత్స్నని పారిజాతం తీసుకొని వస్తుంది. గౌతమ్, జ్యోత్స్న పక్కన కూర్చుంటాడు. దీప ఎక్కడ కన్పించడం లేదని పారిజాతంతో జ్యోత్స్న అంటుంది. వెళ్ళు ఇక్కడికి తీసుకొని రా అని జ్యోత్స్న అనగానే దీప దగ్గరికి వెళ్తుంది పారిజాతం. గౌతమ్ గురించి అందరికి చెప్పు దీప అని పారిజాతం అనగానే.. మీకు గౌతమ్ గురించి తెలుసు కదా మీరే చెప్పుకోండి.. సుమిత్ర అమ్మగారు ఈ గీత గీశారు.. నేను దాటి రాలేనని చెప్పగానే పారిజాతం టెన్షన్ గా జ్యోత్స్న దగ్గరికి వెళ్లి ఆ దీప హ్యాండ్ ఇచ్చిందే అని చెప్తుంది. జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. ఇప్పుడు మరదలకి వేరే మార్గం లేదు గౌతమ్ మంచివాడు కాదని తనే చెప్పాలని దీపతో అంటాడు కార్తీక్.  జ్యోత్స్న టెన్షన్ పడుతుంటే ఏమైందని గౌతమ్ అడుగుతాడు. దేని గురించి టెన్షన్ పడుతున్నావని కార్తీక్ తో పాటు అందరు అడుగుతారు. నా నోటితో నేను గౌతమ్ మంచివాడు కాదని చెప్పలేను అనుకొని నాకేం టెన్షన్ లేదు.. ఈ ఎంగేజ్ మెంట్ నాకు ఇష్టమే అని అనగానే సుమిత్ర వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ దీప, కార్తీక్ షాక్ అవుతారు. ఆ తర్వాత శివన్నారాయణకి ఏదో ఫోన్ రావడంతో బయటకు వెళ్తాడు. తన వెంటే దశరథ్ కూడా వెళ్తాడు. ఇద్దరు ఉంగరాలు మార్చుకోండి అని పంతులు చెప్తాడు. జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : స్వప్న పాప పుట్టినరోజుకి వచ్చిన రేవతి.. రుద్రాణి ప్లాన్ ఏంటంటే!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -781 లో..... కావ్య ఏదో ఆలోచిస్తుంటే అప్పుడే రాజ్ వచ్చి అప్పు ప్రాబ్లమ్ సాల్వ్ అయింది కదా ఎందుకిలా ఉన్నారని అడుగుతాడు. రేపు మీ అక్క స్వప్న వాళ్ల పాప పుట్టినరోజు కదా ఆ ఏర్పాట్లలో బిజీగా ఉండాలి కానీ ఇలా చేస్తున్నారని రాజ్ అంటాడు. నేను ఆలోచిస్తుంది అత్తయ్య గురించి అని కావ్య అనగానే ఇప్పుడు అమ్మకి ఏమైందని రాజ్ అడుగుతాడు. అత్తయ్యకి ఒక కూతురు ఉందని జరిగింది మొత్తం రాజ్ కి చెప్తుంది కావ్య. రేవతి గారు ఆవిడ కూతురా అని రాజ్ ఆశ్చర్యపోతాడు. ఎలాగైనా వాళ్ళని కలపాలని కావ్య అనగానే సరే నా దగ్గర ఒక ఐడియా ఉందని కావ్యకి ఏదో చెప్తాడు రాజ్. మరొకవైపు జగదీష్ ని రాహుల్, రుద్రాణి వాళ్ళు ఫాలో అవుతారు. రేవతి దగ్గరికి జగదీష్ వస్తాడు. మా అమ్మ ఈ రోజు మన కొడుకుని దగ్గరికి తీసుకుందని రేవతి చెప్పగానే జగదీష్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరొకవైపు అపర్ణ ఇంటికి రాగానే రాజ్, కావ్య తనని చూసి గొడవపడుతున్నట్ల యాక్టింగ్ చేస్తారు. ఏమైందని అపర్ణ అడుగుతుంది. మొన్న మమ్మల్ని ఒకావిడ కాపాడింది అన్నాను కదా ఆవిడని బర్త్ డే కి పిలుస్తానంటే తను వద్దని అంటున్నాడని కావ్య అనగానే పిల్వండి అని అపర్ణ అంటుంది. నేను పిలుస్తాను ఏం పేరు అని అపర్ణ అడుగుతుంది. రేవతి అని కావ్య చెప్పగానే అపర్ణ షాక్ అవుతుంది. రేవతికి అపర్ణ ఫోన్ చేస్తుంది. నేను కావ్య వాళ్ల అత్తయ్యని.. రేపు పుట్టినరోజుకి రండీ అని అపర్ణ చెప్పగానే రేవతి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత జగదీశ్, రేవతిలకి దూరంగా ఉండి రుద్రాణి, రాహుల్ అంతా వింటారు. వీళ్ళు మళ్ళీ ఒక్కటైతే ఆస్తులు మనకి దక్కవని రాహుల్, రుద్రాణి అనుకుంటారు. ముందు అపర్ణ వదినకి రేవతిపై కోపం ఉందో లేదో టెస్ట్ చెయ్యాలని రుద్రాణి అంటుంది. తరువాయి భాగంలో స్వప్న పాప పుట్టినరోజుకి రేవతి వస్తుంది. తనని చూసి ఇంట్లో వాళ్ళందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

మాన్సూన్ టైములో బెడ్ రూమ్ లోకి వెళ్ళి..బెడ్ షీట్ తీసి..మణికొండలో ఇదే టాక్

  ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ ని మాన్సూన్ స్పెషల్ గా డిజైన్ చేశారు. అసలే వర్షాలు పడుతున్నాయి. కూల్ వెదర్ లో క్యూట్ థాట్స్ కాన్సెప్ట్ లో ఈ ఎపిసోడ్ రాబోతోంది. ఈ ఎపిసోడ్ కి ఆకర్ష్ బైరాముడి - ఐశ్వర్యరాజ్  ప్రేరణ - శ్రీపాద్, ప్రియాంక జైన్ - శివ్, కీర్తి భట్ - విజయ్  వచ్చారు. ఇక శ్రీముఖి ఐతే ప్రతీ వారం కొత్త కొత్త డ్రెస్సులు వేసుకొచ్చేది. కానీ ఈ ఎపిసోడ్ కి మాత్రం చక్కగా శారీ కట్టుకుని క్యూట్ లుక్ తో లూజ్ హెయిర్ తో వచ్చింది. "సడెన్ గా వర్షం పడడం స్టార్ట్ అయ్యింది. మీ ఇంట్లో మీరిద్దరు ఉన్నారు అనుకోండి. అప్పుడు రొమాన్స్ గురించి నీ ఐడియా ఏమిటి" అని అడిగింది. అప్పుడు ఆకర్ష్ వచ్చి "మొన్ననే వచ్చింది వర్షం. ఏమీ లేదు..బాల్కనీ క్లీనింగ్." అని చెప్పేసరికి అందరూ నవ్వారు. తర్వాత ఇదే ప్రశ్నకు శ్రీపాద్ ఐతే "బెడ్ రూమ్ లోపలికి  వెళ్ళిపోయి..చక్కగా బెడ్ షీట్ తీసి ఉతకడానికి వేసి కొత్త బెడ్ షీట్ వేసుకుంటా" అని చెప్పాడు. ఈ ఆన్సర్ ని చాలా స్లోగా చెప్తున్నప్పుడు ప్రేరణ- శ్రీపాద్ మధ్యలో ఇంకెందన్న రొమాన్స్ విషయం చెప్తాడేమో అంటూ అవినాష్, శ్రీముఖి తెగ కేకలు వేస్తూ హడావిడి చేశారు. కానీ బెడ్ షీట్స్ మార్చాలి అని చప్పటి ఆన్సర్ చెప్పేసరికి శ్రీముఖి పాపం "సరిపోయారు" అంటూ సప్పగా చెప్పింది. తర్వాత శివ్ వైపు వెళ్లి "ఏంటి నువ్వు మాన్సూన్ రాగానే చాలా రొమాంటిక్ మారతావని మణికొండలో టాక్ . ఏమంటావ్" అని అడిగింది. దానికి శివ్ - ప్రియాంక తెగ సిగ్గుపడిపోయారు. మరి వీటికి ఈ జోడీలంతా ఎలాంటి ఆన్సర్స్ ఇస్తారో రొమాన్స్ విషయంలో వీళ్ళ ఐడియా ఏంటో సండే ఎపిసోడ్ లో తెలుస్తుంది.