'జ‌‌బ‌ర్ద‌స్త్' షో.. రోజా ప్లేస్‌లో ఇంద్ర‌జ‌!

  ఈటీవీలో ప్ర‌సారం అవుతున్న మోస్ట్ పాపుల‌ర్ డ‌బ‌ల్‌ కామెడీ షో 'జ‌బ‌ర్ద‌స్త్'. గ‌త ఎనిమిదేళ్ల క్రితం మొద‌లైన ఈ కామెడీ షో విజ‌య‌వంతంగా ర‌న్న‌వుతోంది. ఈ షోకి మొద‌ట‌ రోజాతో క‌లిసి మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు న్యాయ నిర్ణేత‌గా వ్య‌వ‌హ‌రించారు. ఆ త‌రువాత వ్య‌క్తిగ‌త కారణాల‌ దృష్ట్యా జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రించిన నాగ‌బాబు త‌ప్పుకున్నారు. అప్ప‌టి నుంచి ఆయ‌న స్థానంలో సింగ‌ర్ మ‌నో జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.   గ‌త కొంత కాలంగా రోజా, మ‌నో 'జ‌బ‌ర్ద‌స్త్' టీమ్ మెంబ‌ర్స్‌, టీమ్ లీడ‌ర్స్‌పై పంచ్‌లు వేస్తూనే వున్నారు. అయితే ఈ జోడీకి తాజాగా బ్రేక్ ప‌డింది. గ‌త కొన్నేళ్లుగా జంట‌గా కంటెస్టెంట్‌ల‌ని ఎంక‌రేజ్ చేస్తున్న మ‌నో, రోజాల జోడీ తాజాగా విడిపోయింది. రోజాకు ఆరోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్త‌డం, ఆమెకు ఇటీవ‌ల చెన్నైలో స‌ర్జ‌రీలు జ‌ర‌గ‌డంతో కొన్ని వారాల పాటు రెస్ట్ అవ‌స‌ర‌మ‌ని డాక్ట‌ర్లు సూచించార‌ట‌. ఈ నేప‌థ్యంలో రోజా ఈ షో నుంచి తాత్కాలికంగా త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది. ఆమె స్థానంలో ఒక‌ప్ప‌టి హీరోయిన్ ఇంద్ర‌జ‌ని రంగంలోకి దింపేశారు. ఇందుకు సంబంబంధించిన ప్రోమో నెట్టింట సంద‌డి చేస్తోంది. రోజా త‌ర‌హాలో జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్న మ‌నోతో క‌లిసి ఇంద్ర‌జ షోని హుషారెత్తిస్తోంది. 

భానుశ్రీ సంచ‌ల‌నం.. ప‌దేళ్లుగా అత‌నితో అనుబంధం!

  బిగ్ ‌బాస్ బ్యూటీ భానుశ్రీ తాజాగా సంచ‌ల‌న విష‌యాల్ని బ‌య‌ట‌పెట్టింది. ప్ర‌స్తుతం వెండితెర‌పై హీరోయిన్‌గా అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్న భానుశ్రీ గ‌త కొంత కాలంగా శివ శంక‌ర్‌రెడ్డి అనే వ్య‌క్తితో డేటింగ్ చేస్తోంది. వీరిద్ద‌రూ త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్త‌లు షికారు చేశాయి. అయితే తాజాగా వీరిద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు త‌లెత్తాయ‌ని, బ్రేక‌ప్ చెప్పుకున్నారంటూ తాజాగా ఓ రూమ‌ర్‌ మొద‌లైంది. దీనిపై భానుశ్రీ స్పందించింది. త‌న‌పై వ‌స్తున్న బ్రేక‌ప్ న్యూస్‌ను ఈ సంద‌ర్భంగా ఖండించింది. త‌ను హైద‌రాబాద్ వ‌చ్చిన‌ కొత్త‌లో నిలువ నీడ కూడా లేని రోజుల్లో త‌ను ఓ జ్యూస్ పాయింట్ వ‌ద్ద వుండేదా‌న్న‌నీ, ఆ స‌మ‌యంలోనే త‌న ఫ్రెండ్ ద్వారా శంక‌ర్‌రెడ్డి అనే వ్య‌క్తి ప‌రిచ‌యం అయ్యార‌ని, త‌ను ఈ స్థాయికి చేరుకోవ‌డానికి అత‌నే కార‌ణ‌మ‌ని వెల్ల‌డించింది భానుశ్రీ‌. అంతే కాకుండా త‌ను బిగ్ బాస్ 2‌కి వెళ్లే ముందు చేయి విర‌గ్గొట్టుకుని ప్రాణాపాయ అంచుల దాకా వెళ్లిన స‌మ‌యంలో త‌న‌కు అన్నీ తానై శంక‌ర్‌రెడ్డి నిలిచార‌ని, త‌ను నాకు అమ్మా నాన్న‌కు మించి అనీ, పెళ్లి చేసుకుంటే అత‌డినే చేసుకుంటాన‌నీ భానుశ్రీ వెల్ల‌డించింది. ప‌దేళ్లుగా తాను శంక‌ర్‌రెడ్డితో రిలేష‌న్‌లో వున్నాన‌నీ, త‌న స‌ర్వ‌స్వం అత‌నే అనీ స్ప‌ష్టం చేసింది భానుశ్రీ‌.

అవినాష్, అరియానా.. ఓ మామిడి తోట‌!

  బాగ్‌బాస్ సీజ‌న్ 4లో ఆక‌ట్టుకున్న జోడీ అవినాష్‌, అరియానా. హౌస్‌లో క్లోస్ ఫ్రెండ్స్‌గా మారిన ఈ జంట బ‌య‌టికి వ‌చ్చాక కూడా అదే బంధాన్ని కంటిన్యూ చేస్తూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. అవినాష్ మాటీవి వారు ఏడాది పాటు అవినాష్‌తో `కామెడీ స్టార్స్‌` కోసం కాంట్రాక్ట్ కుదుర్చుకోగా అత‌నితో పాటు ఆ షోలో అరియానా కూడా అడ‌పా ద‌డ‌పా మెరుపులు మెరిపిస్తోంది. అంతే కాకుండా వీరిద్ద‌రూ క‌లిసి వీకెండ్ పార్టీల‌కు, గోవాలో వెకేష‌న్ కోసం వెళుతూ స‌ద‌రు వెకేష‌న్‌కి సంబంధించిన ఫొటోల‌ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో అవి వైర‌ల్‌గా మారుతున్నాయి. తాజాగా వీరిద్ద‌రికి సంబంధించిన ఓ ఫొటో నెట్టింట సంద‌డి చేస్తోంది. ఈ వీకెండ్ ఇద్ద‌రూ క‌లిసి సిటీకి కొంత దూరంగా వున్న ఫామ్ హౌస్‌కు సంబంధించిన మామిడి తోపులో హ‌ల్ చ‌ల్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది. లేటెస్ట్‌గా వీకెండ్ హాలిడేకి రిలాక్స్ కోసం ఈ జంట‌ సిటీ శివారులో వున్న ఓ ఫామ్ హౌస్‌కి వెళ్లార‌ని, అక్క‌డే వున్న ఓ మామిడి తోట‌లో ఎంజాయ్ చేశారనీ అర్థ‌మ‌వుతోంది. మామిడి తోట‌లో అవినాష్‌తో క‌లిసి న‌డుస్తూ అరియానా సెల్ఫీ వీడియో తీసుకుంది. అదే సెల్పీని సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేయ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య బంధం మ‌రింత‌గా బ‌ల‌ప‌డుతోందిగా అంటూ నెటిజ‌న్స్ కామెంట్‌లు విసురుతున్నారు. ఆ వీడియోలో "ఎక్క‌డికొచ్చాం అవినాష్?" అని ప్ర‌శ్నించింది అరియానా. "ఫామ్ హౌస్" అని చెప్పాడు అవినాష్‌. "ఏం చేస్తున్నాం మ‌న‌మిక్క‌డ‌?" అని అడిగింది అరియానా. "ఏదో మామిడి తోట చుట్టూ తిరుగుతున్నాం అలా" అని అవినాష్ చెప్ప‌డంతో, ఆ ఆన్స‌ర్ కాకుండా ఇంకేదో చెప్తాడ‌ని ఊహించిందేమో, "అయ్య‌య్యో" అని న‌వ్వేసింది అరియానా. "ఇంకా చాలా ఉన్నాయ్ ఫ్రెండ్స్‌.. చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్" అని స‌ర‌దాగా చెప్పింది అరియానా. ఆ త‌ర్వాత "ఏం చాలా ఉన్నాయ్?" అని అవినాయ్ అడిగితే, "ఛీ ఛీ ఛీ" అంది అరియానా. ఈ వీడియోలో ఆ ఇద్ద‌రి మ‌ధ్యా సంభాష‌ణా, అరియానా ముద్దు ముద్దు మాట‌లు వింటుంటే, ఇద్ద‌రూ చాలా స‌న్నిహితమైపోయిన‌ట్లు అనిపించ‌క మాన‌దు.

ఈ ముగ్గురిలో మెహ‌బూబ్ ఎవ‌ర్ని కిస్ చేశాడు?‌

  'దిల్ సే' మెహ‌బూబ్‌కు బంప‌ర్ ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్లే వ‌చ్చి చేజారింది. అత‌ని ఆశ‌ల‌పై నీళ్లు చిల‌క‌రించేశాడు ఓంకార్‌. అవును. ముగ్గురు ముద్దుగుమ్మ‌ల‌ను ఎదురుగా నిలబెట్టి వాళ్ల‌లో ఎవ‌ర్ని హ‌గ్ చేసుకుంటావ్‌? ఎవ‌ర్ని ముద్దు పెట్టుకుంటావ్ అని ఆశ‌పెట్టి, ఆ వెంట‌నే ఆ ఛాన్స్ ఇయ్య‌న‌ని చెప్పేశాడు. దీంతో అవాక్క‌వ‌డం మెహ‌బూబ్ వంత‌యింది. ఈ స‌ర‌దా స‌న్నివేశం 'కామెడీ స్టార్స్' లేటెస్ట్ ఎపిసోడ్‌లో చోటు చేసుకుంది. మా టీవీలో ప్ర‌సార‌మ‌వుతోన్న న‌వ్వుల షో 'కామెడీ స్టార్స్‌'కు ఓంకార్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. లేటెస్ట్ ఎపిసోడ్‌లో బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ మెహ‌బూబ్ పాల్గొన్నాడు. త‌న అదిరే డాన్స్ మూవ్‌మెంట్స్‌తో ఓ ప‌ర్ఫార్మెన్స్ కూడా ఇచ్చాడు. ఆ త‌ర్వాత అత‌డిని ఎదురుగా కూర్చొని వున్న ముగ్గురు ముద్దుగుమ్మ‌లు జోర్దార్ సుజాత‌, అషు రెడ్డి, సిరి హ‌న్మంత్‌ల‌ను చూపించి, "హ‌గ్ చేసుకోవాల‌నుకుంటే ముగ్గురిలో ఎవ‌ర్ని హ‌గ్ చేసుకుంటావ్?  ముద్దు పెట్టుకోవాల‌నుకుంటే ముగ్గురిలో ఎవ‌ర్ని ముద్దు పెట్టుకుంటావ్?" అని ప్ర‌శ్నించాడు ఓంకార్‌. దీంతో ముగ్గుర‌మ్మాయిలూ కొంత ఆందోళ‌న‌గా, కొంత ఆస‌క్తిగా, ఇంకొంత షాకింగ్‌గా మెహ‌బూబ్ ఏం చెప్తాడా? అని చూశారు.   మెహ‌బూబ్ సిగ్గుప‌డుతూ, "హ‌గ్గు, ముద్దు అంటే భ‌య‌మేస్తంది" అని నవ్వుతూ చెప్పాడు. దాంతో అమ్మాయిలు ముగ్గురూ గ‌ట్టిగా న‌వ్వేశారు. అంత‌లోనే ఓంకార్ ట్విస్ట్ ఇచ్చాడు. "చెప్ప‌డం వ‌ర‌కే.. చెయ్య‌డం లేదు" అని చెప్పాడు. అది విన‌గానే "హా" అని నోరు తెరిచి షాకైన‌ట్లు పోజిచ్చాడు మెహ‌బూబ్‌. ఓంకార్ ఇచ్చిన ట్విస్ట్, మెహ‌బూబ్ రియాక్ష‌న్ చూసి జ‌డ్జి స్థానంలో ఉన్న శేఖ‌ర్ మాస్ట‌ర్ స‌హా అంద‌రూ గ‌ట్టిగా న‌వ్వేశారు. రేపు ఆదివారం మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల‌కు ప్ర‌సార‌మ‌య్యే ఎపిసోడ్‌కు సంబంధించిన ఈ ప్రోమో నెట్టింట సంద‌డి చేస్తోంది.

దీప కోసం ముర‌ళీకృష్ణ తీసుకున్న నిర్ణ‌యం ఏంటీ?

`కార్తీక దీపం` ర‌స‌వ‌త్త‌ర మ‌లుపులు తిరుగుతూ క్ర‌మ క్ర‌మంగా ఎండింగ్ స్టేజ్‌కి వ‌చ్చేస్తోంది. గ‌త నాలుగేల్లుగా కంటిన్యూ అవుతున్న స‌స్పెన్స్‌కి త్వ‌ర‌లో తెర ప‌డ‌బోతోంది. త‌న భ‌ర్త‌ని, తండ్రిని, అత్త‌ని కాద‌ని పిల్ల‌ల‌తో ఊరు వ‌దిలి వెళ్లిన దీప మ‌రో చోట కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. కొత్త‌గా టిఫిన్ సెంట‌ర్‌ని ప్రారంభిస్తుంది. దీప‌ని వెతుక్కుంటూ వ‌చ్చిన ముర‌ళీకృష్ణ అదే టిఫిన్ పాయింట్ వ‌ద్ద‌కు వ‌చ్చి దీప కోసం ఆరా తీస్తాడు. ఇంత‌లో దీప ఆటోలో వ‌చ్చి ముర‌ళీ కృష్ణ‌కు క‌నిపిస్తుంది. ఎలాంటి ఇంటి కోడ‌లివి ఇలా వుండ‌టం ఏంట‌మ్మా. రామ్మా మ‌నింటికి పోదాం అంటాడు ముర‌ళీక‌ష్ణ‌. నాకు ఇల్లు ఎక్క‌డుంది నాన్నా ఖాలీ చేశానుగా అంటుంది దీప‌. నీకు పుట్టిల్లుంది, మెట్టినిల్లుంది.. నీకు ఏ ఇల్లు కావాలంటే ఆ ఇంట్లో వుండు.. కానీ నువ్వు రావ‌డ‌మే అంద‌రికి ముఖ్యం` అంటాడు ముర‌ళీకృష్ణ‌. ఆ అంద‌రిలో నా భ‌ర్త లేడు క‌దా నాన్నా అంటుంది దీప‌. ఇంత‌లో సౌంద‌ర్య.. ముర‌ళీకృష్ణ‌కు ఫోన్ చేస్తుంది. దీప క‌నిపించిందా? క‌నిపించినా రానంటోందా? అని అడుగుతుంది. ఈ లోగా త‌ను క‌నిపించిన విష‌యం సౌంద‌ర్యకు చెప్పొద్ద‌ని ఒట్టు వేయించుకుంటుంది. దీంతో త‌ను ఇంకా క‌నిపించ‌లేద‌ని చెబుతాడు ముర‌ళీకృష్ణ‌. ఏడుస్తూనే ఫోన్ పెట్టేస్తాడు. నా భ‌ర్తే స్వ‌యంగా వ‌చ్చి పిలిచేంత వ‌ర‌కు నేను రాన‌ని చెబుతుంది దీప‌. దీంతో ముర‌ళీకృష్ణ ఓ నిర్ణ‌యం తీసుకుంటాడు. త‌ను తీసుకున్న నిర్ణ‌యం ఏంటీ? అందుకు దీప ఎలా స్పందించింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

కార్తికేయ‌కు ఎవ‌రూ పిల్ల‌నిచ్చేలా లేర‌ట‌!

`Rx 100` చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని త‌న ఖాతాలో వేసుకున్నారు యువ హీరో కార్తికేయ గుమ్మ‌కొండ‌. గ‌త కొంత కాలంగా ఆ స్థాయి విజ‌యం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ మూవీ ద్వారా వ‌చ్చిన ఇమేజ్‌ని కూడా మార్చుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాడు. తాజాగా కార్తీకేయ న‌టించిన చిత్రం `చావు క‌బురు చ‌ల్ల‌గా`. ఈ మూవీ ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ సంద‌ర్భంగా ఆలీ వ్యాఖ్యాత‌గా ఈటీవీలో ప్ర‌సారం అవుతున్న `అలీతో సరదాగా` కార్య‌క్ర‌మంలో కార్తికేయ, లావ‌ణ్య త్రిపాఠి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆలీ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు కార్తికేయ చెప్పిన స‌మాధానాలు న‌వ్వులు పూయిస్తున్నాయి. మీ నాన్న ఏం చేస్తుంటారు` అని ఆలీ అడిగితే కార్తికేయ అనుకోకుండా `Rx 100`  స్కూల్ అని చెప్పి వెంట‌నే నాలుక్క‌రుచుకోవ‌డం.. అదేంటి అని ఆలీ, లావ‌ణ్య త్రిపాఠి ఘోల్లున న‌వ్వ‌డం న‌వ్వులు పూయిస్తోంది.   ఇంత‌కీ పెళ్లెప్పుడ‌ని ఆలీ అడిగితే ఇప్పుడున్న ఇమేజ్‌ని మార్చుకున్నాక చేసుకుంటాన‌ని, పెళ్లి గురించి అడిగితే వామ్మో వీడా అంటున్నార‌ని కార్తికేయ చెబుతున్నాడు. ఏంటీ ఇండ‌స్ట్రీలో క్ర‌ష్ వున్న హీరో ఎవ‌ర‌ని లావ‌ణ్య‌ని అడిగితే ఎవ‌రూ లేర‌ని చెప్ప‌డం, ఆ వెంట‌నే ఆఅలీ అందుకుని అంద‌రిని అన్న‌య్య అంటావంట క‌దా ఇక క్ర‌ష్ ఏముంటుందిలే అని ఆలీ త‌న‌దైన స్టైల్లో పంచ్ వేయ‌డం హిలేరియ‌స్‌గా వుంది. ఈ ఎపిసోడ్ ఈ నెల 29న ఈటీవీలో ప్ర‌సారం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో ప్ర‌స్తుంత సంద‌డి చేస్తోంది.

అఖిల్ ఇంటికి వెళ్లిన గంగ‌వ్వ‌కు స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్‌!

  బిగ్‌బాస్ సీజ‌న్ 4 కంటెస్టెంట్స్ అఖిల్ సార్థ‌క్‌‌, గంగ‌వ్వ మధ్య మంచి అనుబంధం వున్న విష‌యం తెలిసిందే. హౌస్‌లోకి ఎంట‌రైన ద‌గ్గ‌రి నుంచి ప్ర‌తి విష‌యంలోనూ గంగ‌వ్వ అఖిల్‌ని స‌పోర్ట్ చేస్తూ వ‌చ్చింది. ఒక ద‌శ‌లో గంగ‌వ్వ అనారోగ్యంతో హౌస్‌ని వీడుతున్న సంద‌ర్భంగా అఖిల్ భావోద్వేగంతో క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. అక్క‌డి నుంచి వీరి మ‌ధ్య అనుబంధం మ‌రింత పెరిగింది. ప్ర‌స్తుతం మోనాల్ గ‌జ్జ‌ర్‌తో క‌లిసి 'తెలుగ‌బ్బాయి గుజ‌రాతీ అమ్మాయి' పేరుతో రూపొందుతున్న వెబ్ సిరీస్ లో న‌టిస్తున్నాడు. ఈ సంద‌ర్భంగా కొత్త కారు‌ని తీసుకున్నాడు అఖిల్. ఆ కారుని గంగ‌వ్వ ఇంటికి పంపించి ఆమెను త‌న ఇంటికి ర‌ప్పించుకున్న అఖిల్ ఆమెకు స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. గంగ‌వ్వ‌ని అఖిల్ ఇంటికి తీసుకెళితే అత‌ని పేరెంట్స్ గంగ‌వ్వ‌కు స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. అమెకు కాలి ప‌ట్టీలు కొనివ్వ‌డంతో గంగ‌వ్వ ఎమోష‌న‌ల్ అయింది. స‌ర‌దాగా అఖిల్ తో గ‌డిపిన త‌రువాత త‌న కొడుకు త‌న‌ని చూసుకునేలా లేడని, అఖిల్‌ని ఇంటికి తీసుకెళ‌తాన‌ని గంగ‌వ్వ స‌ర‌దాగా అంది. ఆ త‌రువాత త‌న ఇంటికి బ‌య‌లుదేర‌గానే అఖిల్ భావోద్వేగానికి లోన‌య్యాడు. గంగ‌వ్వ "బంగారం" అంటూ క‌న్నీళ్లు పెట్టుకోవ‌డం గ‌మ‌నార్హం.

టెస్టుల‌కు వెళ్లిన డాక్ట‌ర్ బాబు.. దీప‌కు మాయ‌దారి రోగం!

  'కార్తీక దీపం' ఈ రోజు 994వ ఎపిసోడ్‌లోకి ఎంట‌ర‌వుతోంది. గ‌త నాలుగేళ్ల నుంచి మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న ఈ పాపుల‌ర్ సీరియ‌ల్ తాజాగా రోజుకో మ‌లుపులు తిరుగుతూ ఎండింగ్‌కి చేరువ అవుతోంది. ఈ రోజు ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చూద్దాం. హిమ దొరికిందంటూ ఓ మెడిక‌ల్ షాప్ వ్య‌క్తి ఫోన్ చేయ‌డంతో మోనిత త‌న కోసం బ‌య‌లుదేరుతుంది. క‌ట్ చేస్తే .. దీప వంట గ‌దిలో ద‌గ్గుతూ వుంటుంది. "దేవుడా ఈ మాయ‌దారి రోగం న‌న్ను పీల్చి పిప్పి చేస్తోంది. భ‌గ‌వంతుడా నాకు ఏదైనా అయితే.. నేనే పోతే నా పిల్ల‌లు అనాథ‌లైపోతారు. దేవుడా నా ఆరోగ్యం బాగుండాలి." అంటూ ఏడుస్తుంటుంది. ఇంత‌లో పిల్ల‌లు దీప ఏడ్వ‌డం చూసి "ఏంట‌మ్మా ఏడుస్తున్నావ్ నాన్న గుర్తొచ్చాడా?" అంటారు. అప్పుడే సంతాన ల‌క్ష్మి వ‌చ్చి పిల్ల‌ల‌కు స్వీట్స్ ఇచ్చి వెళుతుంది... ఇదిలా వుంటే కార్తీక్ త‌ను టెస్ట్‌కి వెళుతున్న విష‌యం చెప్ప‌డానికి మోనిత ఇంటికి వెళ‌తాడు. ప్రియ‌మ‌ణి వుండ‌టం చూసి మోనిత ఫోన్ చేస్తే విష‌యం చెప్ప‌మంటాడు. హిమ‌ని మోనిత వెత‌క‌డం మొద‌లుపెడుతుంది. ఇదే స‌మ‌యంలో హిమ‌ని తీసుకుని వార‌ణాసి జాత‌ర‌కు వెళ‌తాడు. మ‌రోవైపు దీపని వెతుక్కుంటూ వెళ్లిన‌ ముర‌ళీకృష్ణ ఓ టిఫిన్ సెంట‌ర్ వ‌ద్ద ఆగి ఇడ్లీ ఆర్డ‌ర్ చేస్తాడు. చెట్ని టేస్ట్ చేయ‌గానే ముర‌ళీకృష్ణ‌కు దీప గుర్తొస్తుంది. వెంట‌నే "ఈ టిఫిన్ సెంట‌ర్ ఎవ‌రిది?" అని అడ‌గ‌డంతో వార‌ణాసి బంధువు అప్పుడే వ‌స్తున్న దీప‌ని చూపిస్తాడు. తండ్రిని చూసిన దీప షాకవుతుంది. ఈ ఇద్ద‌ర్నీ చూసిన మోనిత ఎలా రియాక్ట్ అయింది? .. ఆత‌రువాత ఏం చేసింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. 

సుమ కోసం.. మైక్ కేక్!‌

  రెండు ద‌శాబ్దాలుగా టెలివిజ‌న్‌పై తిరుగులేని యాంక‌ర్‌గా రాణిస్తున్నారు సుమ‌. న‌టుడు రాజీవ్ క‌న‌కాల‌తో ఆమె వైవాహిక బంధం కూడా రెండు ద‌శాబ్దాల‌కు పైగా అన్యోన్యంగా సాగుతోంది. ఇటు వైవాహిక జీవితంలో, అటు వృత్తి జీవితంలో స‌క్సెస్ అయిన ఆమె పుట్టిన‌రోజు మార్చి 22. ఈ సంద‌ర్భంగా అభిమానులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు, స‌న్నిహితులు సోష‌ల్ మీడియాలో బ‌ర్త్‌డే విషెస్‌తో ముంచెత్తారు. కాగా సుమ చిన్న‌నాటి స్నేహితులు కొంత‌మంది శుభాకాంక్ష‌లు తెలియ‌జేయ‌డానికి సోమ‌వారం ఆమె ద‌గ్గ‌ర‌కు వ‌చ్చారు. వారిలో ఒక‌రు మైక్ ఆకారంలో ఉన్న కేక్‌ను తీసుకురావ‌డం విశేషం. వారినీ, ఆ కేక్‌నూ చూసి సుమ చాలా హ్యాపీ ఫీల‌య్యారు. మంగ‌ళ‌వారం ఉద‌యం త‌న సోష‌ల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఆ మైక్ కేక్ ఫొటోతో పాటు, స్నేహితులు ఫొటోల‌నూ షేర్ చేశారు. "మీరంతా పంపిన బ‌ర్త్‌డే విషెస్‌ను ఇప్పుడే చ‌దివాను. మీ ప్రేమ‌కు క‌దిలిపోయాను. థాంక్ యూ సో మ‌చ్‌. ఐ ల‌వ్ యూ టూ. నిన్న నా ఫ్రెండ్స్‌తో గ‌డిపిన స‌మ‌యం చాలా ముఖ్య‌మైంది. వండ‌ర్‌ఫుల్ మైక్ కేక్ తీసుకొచ్చిన డాక్ట‌ర్ కీర్తికి థాంక్స్." అని ఆమె రాసుకొచ్చారు. చాలా త‌క్కువ టైమ్‌లోనే ఈ పోస్ట్ వైర‌ల్ అయ్యింది.

సుధీర్ పెళ్ల‌యితే ర‌ష్మి రియాక్ష‌న్ ఏంటి?.. లైవ్‌గా చూపించారు!

  బుల్లితెర‌పై ఆక‌ట్టుకుంటున్న జంట ర‌ష్మీ గౌత‌మ్‌, సుడిగాలి సుధీర్‌. జబ‌ర్ద‌స్త్‌, ఢీ షోల‌లో వీరి మ‌ధ్య వ‌చ్చే స‌ర‌దా స‌న్నివేశాలు సోష‌ల్ మీడియాలో నిత్యం వైర‌ల్ అవుతుంటాయి. అంత‌గా వీరిద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ పాపుల‌ర్ అయ్యింది. ర‌ష్మీ లేక‌పోతే సుధీర్ స్కిట్‌కి ప‌వ‌ర్ లేదు.. సుధీర్ లేక‌పోతే ర‌ష్మిక యాంక‌రింగ్‌కు ప‌స వుండ‌ద‌ని అంతా అనుకుంటుంటారు. అంతే కాకుండా వీరిద్ద‌రి మ‌ధ్య చాలా కాలంగా ఏదో జ‌రుగుతోంద‌నే గుసగుస‌లు కూడా త‌ర‌చూ వినిపిస్తుంటాయి. వాటిని ఎప్ప‌టిలాగే కొట్టి పారేస్తుంటారు. జ‌బ‌ర్ద‌స్త్ షో నుంచి మొద‌లైన వీరి రొమాన్స్ ఢీ వ‌ర‌కు పాకింది. ఇక ప్ర‌తీ ఎపిసోడ్‌లోనూ వీరి గురించి ప్ర‌త్యేక చ‌ర్చ జ‌రుగుతూనే వుంటుంది. తాజాగా అలాంటి స‌న్నివేశ‌మే ఒక‌టి 'ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌' షోలో చోటు చేసుకుంది. ర‌ష్మికి చెప్ప‌కుండా సుధీర్ పెళ్లికి సిద్ధ‌మ‌య్యాడు. ఈ విష‌యం తెలిసి అత‌ని స్నేహితులు రామ్‌ప్ర‌సాద్‌, గెట‌ప్ శ్రీ‌ను ఈ విష‌యం ర‌ష్మికి చెప్పారు. త‌న‌ని తీసుకొచ్చి సుధీర్ పెళ్లిని చెడ‌గొట్టాల‌ని ప్ర‌య‌త్నించారు. ఈ సంద‌ర్భంగా ర‌ష్మీ పెళ్లి కొడుకు అవ‌తారంలో సుధీర్‌ను చూసి క‌న్నీరు పెట్టుకుంది. ఇదంతా 'ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్' షో కోసం ప్ర‌త్యేకంగా సుధీర్ పెళ్లి గురించి తెలిస్తే ర‌ష్మీగౌత‌మ్ రియాక్ష‌న్ ఏంటీ?.. అనే కాన్సెప్ట్‌తో చేసిన ఓ స్కిట్‌లో చోటు చేసుకుంది. ఇదంతా చూస్తున్న జ‌డ్జెస్ మ‌నో, రోజా... సుధీర్‌, ర‌ష్మిల‌ని చూసి ఘొల్లున న‌వ్వుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది. నిజంగా సుధీర్ పెళ్లికి రెడీ అయితే ర‌ష్మి ఇలానే ఫీల‌వుతుందా అనే స్థాయిలో ర‌ష్మిగౌత‌మ్ ఫీల్ కావ‌డం ఆడియ‌న్స్ మ‌న‌సు దోచేసేలా వుంది. 

"ఆ టైమ్‌లో వీడు నావాడు అనిపించింది".. ఇమ్మానుయేల్‌పై వ‌ర్ష కామెంట్‌!

  ఈటీవీలో ప్ర‌సారం అవుతున్న కామెడీ షో 'ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌'. ఇంత వ‌ర‌కు ఈ షోని కొట్టే షో ఇంత వ‌ర‌కు రాక‌పోవ‌డం విశేషం. ఈ షోలో గ‌త ఏడేళ్లుగా టీవీ వీక్ష‌కుల్ని అల‌రిస్తూ ఎంట‌ర్‌టైన్ చేస్తున్నారు సుడిగాలి సుధీర్‌, ర‌ష్మిగౌత‌మ్‌. వీరి ల‌వ్ ట్రాక్ గురించి ఎన్ని సార్లు చ‌ర్చ‌ల్లో నిలిచినా మా ఇద్ద‌రి మ‌ధ్య వున్న‌ది స్నేహం మాత్ర‌మే అని కొట్టి పారేస్తుంటారు సుధీర్‌, ర‌ష్మి‌. తాజాగా వీరి త‌ర‌హాలోనే వార్త‌ల్లో నిలుస్తున్న మ‌రో జ‌బ‌ర్ద‌స్త్ జోడీ వ‌ర్ష‌, ఇమ్మానుయేల్‌. వీరిద్ద‌రి మ‌ధ్య స్టేజ్‌పై పండే రొమాన్స్ అంతా ఇంతా కాదు. వ‌ర్ష‌ని రోజా అడిగిన ప్ర‌తీసారి "రంగుదేముందు మేడ‌మ్ మ‌న‌సు ముఖ్యం గానీ" అంటూ వ‌ర్ష.. ఇమ్మానుయేల్‌ని స‌పోర్ట్ చేయ‌డం.. ఆ స‌మాధానానికి రోజా షాక్ కావ‌డం జ‌రుగుతూనే వుంది. తాజాగా వ‌ర్ష చెప్పిన ఓ మాట విని ఈ షోకు జ‌డ్జ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న‌రోజా మ‌రోసారి షాక్‌కు గురయ్యారు. "మేడ‌మ్ నేనొక‌టి చెప్పాలి. యూట్యూబ్‌లో ఎవ‌రో చ‌నిపోయార‌ని స్క్రోలింగ్ వ‌చ్చింది." అని వ‌ర్ష చెప్పింది. "వ‌ర్ష బిల్డింగ్ మీద నుంచి దూకి సూసైడ్ చేసుకుంది అని రాశారు." అని ఇమ్మానుయేల్ అందుకున్నాడు. "నైట్ టైమ్ ఫోన్ చేసి, వ‌ర్షా ఎక్క‌డున్నావ్‌? నువ్వు బాగానే ఉన్నావా?.. అని అడిగాడు." అని చెప్పింది వ‌ర్ష‌. "నీ ప్రాణం గిల‌గిల్లాడిపోయిందా?" అన‌డిగారు రోజా.  "కానీ నాకోటి అనిపించింది మేడ‌మ్‌.. నాకోసం వీడు ఇంత ఆలోచించాడా.." అని చెప్పింది వ‌ర్ష‌. "నిజ‌మైన ప్రేమ" అని కాంప్లిమెంట్ ఇచ్చారు రోజా. దాంతో వ‌ర్ష సిగ్గుల మొగ్గ‌యింది. "ఆ టైమ్‌లో వీడు నావాడు అనిపించింది." అని బ‌య‌ట‌పెట్టేసింది. దాంతో "ఆ.." అని ఆశ్చ‌ర్యంగా నోరు తెరిచేశాడు ఇమ్మానుయేల్‌. "అరెరెరే.." అని న‌వ్వారు రోజా. దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట వైర‌ల్‌గా మారింది. 

బంధం సేన బ‌ల‌వంతం.. అనుకి ఆర్య‌వ‌ర్ధ‌న్ తాళి క‌ట్టాడా?

  జీ తెలుగులో ప్ర‌సారం అవుతున్న పాపుల‌ర్ టీవీ సీరియ‌ల్ 'ప్రేమ ఎంత మ‌ధురం'.  గ‌త కొంత కాలంగా ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. ఆర్యవ‌ర్ధ‌న్‌ని అను నుంచి దూరం చేయాల‌ని అత‌ని ద‌గ్గ‌ర ప‌నిచేసే మీరా మాస్ట‌ర్ ప్లాన్ వేస్తుంది. ప్రేమికుల రోజు అనుని పార్క్‌కి ర‌ప్పించి అదే స‌మ‌యానికి అనుతో క‌లిసి సంప‌త్ వుండేలా చేస్తే నీ కొడుకు పెళ్లి అనుతో జ‌రిగేలా బంధం సేన చూసుకుంటుంద‌ని ర‌ఘురామ్‌కు స‌ల‌హా ఇస్తుంది. అదే స‌మ‌యంలో అనుకి ఫోన్ చేసి పార్క్‌కి ర‌మ్మ‌ని రాంగ్ ఇన్‌ఫర్మేష‌న్ ఇస్తుంది. అలా ఆర్య‌వ‌ర్ధ‌న్‌కి తెలియ‌కుండా అనుని ప్రేమికుల పార్క్‌కి ర‌ప్పించిన మీరా అదే చోటికి ర‌ఘురామ్ త‌న కొడుకు సంప‌త్‌ని తీసుకొచ్చేలా చేస్తుంది. ఆ వెంట‌నే ర‌ఘురామ్‌తో బంధం సేన‌కు ఫోన్ చేయిస్తుంది మీరా. అయితే మీరా ప్లాన్ తెలియ‌క‌పోయినా మాన్సీ కాఫీలో నెయిల్ పాలిష్ క‌లిపి మీరా ఇల్లు క‌ద‌ల కుండా చేస్తుంది. అను, ప‌క్క‌నే సంప‌త్ వుండేలా ప్లాన్ చేసిన మీరా, ర‌ఘురామ్.. బంధం సేన ఎంట్రీ ఇవ్వ‌డంతో ఇక ఖ‌చ్చితంగా అనుకి, సంప‌త్‌కి పెళ్లి జ‌ర‌గ‌డం ఖాయ‌మ‌ని సంబ‌ర‌ప‌డిపోతారు. ఇదే స‌మ‌యంలో ఆర్య‌‌వ‌ర్ధ‌న్ పార్క్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌డం, సంప‌త్ బ‌య‌టికి రావ‌డంతో ర‌ఘురామ్ షాక్‌కు గుర‌వుతాడు. అను, ఆర్య‌వ‌ర్థ‌న్‌ల‌ని చూసిన బంధం సేన త‌మ‌ ముందే ఇద్ద‌రూ పెళ్లి చేసుకోవాల‌ని, అనుకి తాళికట్టాల‌ని ఫోర్స్ చేస్తుంది. ఈ నేప‌థ్యంలో అనుకి ఆర్య తాళి క‌ట్టాడా లేదా అన్న‌ది తెలియాలంటే ఈ రోజు రాత్రి 9 గంట‌ల‌కు ప్ర‌సారం అయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే.

'జ‌బ‌ర్ద‌స్త్' క‌మెడియ‌న్స్ పారితోషికాలు మ‌రీ ఇంత త‌క్కువా?!

  ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌తో పాటు ప్ర‌పంచ న‌లు మూల‌ల్లో వున్న తెలుగు వాళ్ల‌ని క‌డుపుబ్బా న‌వ్విస్తూ ఎంట‌ర్‌టైన్ చేస్తున్న షో 'జ‌బ‌ర్ద‌స్త్‌'. ఈ కామెడీని షోని కొట్టే షో ఇంత వ‌ర‌కు రాలేదంటే దీని ప్ర‌త్యేక‌త ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. అంత‌లా పాపులారిటీని సొంతం  చేసుకుని ఇప్ప‌టికీ టాప్ పొజీష‌న్‌లో కొన‌సాగుతోంది. ఈ షోని చూసి హాయిగా న‌వ్వుకుని ట్రెస్ రిలీఫ్‌ ఫీల‌య్యే హాస్య ప్రియులు ఎంద‌రో వున్నారు. ఈ షో వ‌ల్ల పాపుల‌ర్ అయి సినిమాల్లో అవ‌కాశాల్ని సొంత చేసుకున్న వాళ్లే కాకుండా బిగ్ బాస్ హౌస్‌లో ప్ర‌వేశించిన వాళ్లూ వున్నారు. గెట‌ప్ శ్రీ‌ను, ముక్కు అవినాష్‌, సుడిగాలి సుధీర్‌, రామ్ ప్ర‌సాద్‌, హైప‌ర్ ఆది, షేకింగ్ షేషు, శాంతి స్వ‌రూప్‌.. ఇలా చాలా మందే వున్నారు. అయితే 'జ‌బ‌ర్ద‌స్త్‌' షో కు భారీ స్థాయిలో టీఆర్పీ వ‌స్తుండ‌టంతో వీరి పారితోషికాలు  కూడా భారీ స్థాయిలోనే వుంటాయ‌ని బ‌య‌ట టాక్‌. అయితే అందులో నిజం లేద‌ని లేడీ క్యారెక్ట‌ర్స్‌తో న‌వ్వించే శాంతి స్వ‌రూప్ చెబుతున్నాడు. ల‌క్ష‌ల్లో పారితోషికాలు అన్న‌ది టీమ్ లీడ‌ర్‌ల‌కి త‌ప్ప మిగ‌తా వారికి లేవ‌ని, 5 వేలు, మూడు వేలు, 2500ల‌కు కూడా స్కిట్‌లు చేస్తున్న వాళ్లు కూడా వున్నార‌ని, ఒక్కో సంద‌ర్భంలో టీవీలో క‌నిపిస్తే చాల‌ని ఫ్రీగా కూడా స్కిట్‌లు చేసిన వాళ్లు కూడా ఇక్క‌డ వున్నార‌ని షాకింగ్ నిజాలు తాజాగా బ‌య‌ట‌పెట్టాడు.

చంద్ర‌ముఖిలా భ‌య‌పెడుతూ ర‌చ్చ‌చేసిన లాస్య‌!

  స్టార్ మాలో ప్ర‌సారం అవుతున్న కామెడీ షో 'కామెడీ స్టార్స్‌'. ఈ ఆదివారం మ‌రింత ఫ‌న్నీగా సాగ‌బోతోంది. శేఖ‌ర్ మాస్ట‌ర్, శ్రీ‌దేవి జ‌డ్జెస్‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా ఈ షోలో ముక్కు అవినాష్‌, చ‌మ్మ‌క్ చంద్ర‌తో పాటు ప‌లువురు క‌మెడియ‌న్స్ స్కిట్‌లతో అల‌రించ‌బోతున్నారు. దాదాపు ఐదేళ్ల విరామం త‌రువాత లాస్య ఈ షోలోకి ర‌వితో క‌లిసి ఎంట్రీ ఇచ్చేసింది. ర‌వితో క‌లిసి ఎంట‌ర్‌టైన్ చేస్తూ షోలో ఆక‌ట్టుకుంటోంది. గ‌త ఆదివారం 'ఉప్పెన‌' థీమ్‌కు పేర‌డీ చేసి ఆక‌ట్టుకున్న ర‌వి, లాస్య ఈ సారి చంద్ర‌ముఖిని రంగంలోకి దింపేస్తున్నారు. ఇందులో చంద్ర‌ముఖిగా లాస్య ప‌ర్ఫామ్‌ చేయ‌బోతోంది. ఈ వారం మ‌రో విశేషం ఏంటంటే డ్యాన్స్ మాస్ట‌ర్ బాబా భాస్క‌ర్ ఈ షో లోకి గెస్ట్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. స్వ‌త‌హాగా హ్యూమ‌ర్‌ని పండించే బాబా భాస్క‌ర్ ఈ 'కామెడీ స్టార్స్‌' షోలోకి ఎంట్రీ ఇవ్వ‌డంతో అస‌లైన కామెడీ ఫైట్ ప్రారంభం కాబోతోంది. ఇదే క్ర‌మంలో లాస్య చంద్ర‌ముఖిగా రెచ్చిపోయి ర‌చ్చ చేయ‌డం, అవినాష్ అమ్మాయి వేషంలో హాస్యాన్ని పండించ‌డం..ఇదే క్ర‌మంలో లాస్య ప‌క్క‌నుండ‌గానే ర‌విపై బాబా భాస్క‌ర్ క‌త్తి విస‌ర‌డం.. లాంటి వింత వింత విన్యాసాల‌తో వ‌చ్చే సండే కామెడీ స్టార్స్ ర‌చ్చ ర‌చ్చ చేయ‌బోతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట సంద‌డి చేస్తోంది.

బిగ్‌ బాస్ సీజ‌న్ 5కి గ్లామ‌ర‌స్‌ న్యూస్ రీడ‌ర్‌!

  టీవీ న్యూస్ రీడ‌ర్స్‌కి బిగ్‌బాస్ రియాలిటీ షో కేరాఫ్ అడ్ర‌స్‌గా మారుతోంది. సీజ‌న్ 2లో టీవీ9కి చెందిన దీప్తి న‌ల్ల‌మోతు కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి గ‌ట్టి పోటీనిచ్చింది. ఆ త‌రువాత జ‌కీర్ ఎంట్రీ ఇచ్చాడు. మ‌ధ్య‌లోనే వెళ్లిపోయాడు.. కత్తి మ‌హేష్ కూడా ఇదే ఛాన‌ల్ నుంచి బిగ్ ‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఆశించిన స్థాయిలో రాణించ‌లేక‌పోయాడు.  ఇదే ఛాన‌ల్ నుంచి ఎంట్రీ ఇచ్చింది దేవి నాగ‌వ‌ల్లి. సీజ‌న్ 4లో స్ట్రాంగ్‌గానే క‌నిపించినా పెద్ద‌గా ప్ర‌భావాన్ని చూప‌లేక‌పోయింది. ఇప్పుడు ఇదే ఛాన‌ల్ నుంచి మ‌రో న్యూస్ రీడ‌ర్ బిగ్ ‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. ఆమే ప్ర‌త్యూష‌. గ‌త కొన్నేళ్లుగా ఆమె టీవీ9లో న్యూస్ రీడ‌ర్‌గా ప‌నిచేస్తోంది. జూన్‌లో ప్రారంభం కాబోతున్న సీజ‌న్‌ 5 కోసం ఆమెని కంటెస్టెంట్‌గా ఫైన‌ల్ చేసిన‌ట్టు తెలిసింది. న్యూస్ రీడ‌ర్‌గా వుంటూనే ప‌లు ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్‌ల‌కు, సెల‌బ్రిటీల ఇంట‌ర్వ్యూల‌కు యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన ప్ర‌త్యూష‌కు సెల‌బ్రిటీల‌తో మంచి ప‌రిచ‌యాలున్నాయి. సోష‌ల్ మీడియాలోనూ త‌న గ్లామ‌ర‌స్ స్టిల్స్‌ను షేర్ చేస్తూ ఆక‌ట్టుకుంటూ ఉంటుంది. అవే ఆమెని బిగ్ ‌బాస్ సీజ‌న్ 5కి ఎంపిక‌య్యేలా చేసిన‌ట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ప్ర‌తీ సీజ‌న్‌కి టీవీ9 నుంచి ఎవ‌రో ఒక‌రిని ఎంపిక చేస్తుండ‌టం కూడా ప్ర‌త్యూష‌కు క‌లిసివ‌చ్చిన‌ట్టుగా చెబుతున్నారు.

'నాన్న టిఫిన్ సెంట‌ర్‌'లో అమ్మాకూతుళ్ల గొడ‌వ‌!

  స్టార్ మాలో ప్ర‌సారం అవుతున్న 'కార్తీక దీపం' ఈ బుధ‌వారం మ‌రో కొత్త ట‌ర్న్ తీసుకోబోతోంది. టిఫిన్ సెంట‌‌ర్‌కు 'నాన్న టిఫి‌న్ సెంట‌ర్‌' అని పెట్ట‌డంతో అంతా అడిగితే ఏం స‌మాధానం చెబుతావ‌ని దీప‌ని ప్ర‌శ్నిస్తుంది సంతాన ల‌క్ష్మి. ఇంత‌లో త‌న‌కు వీడియో కాల్ రావ‌డంతో అక్క‌డి నుంచి వెళ్లిపోతుంది. శౌర్య‌పై చిరాకు ప‌డుతుంది దీప‌. "నాన్న ఒక్క‌డే అనాథ‌లా వుంటాడ‌ని టిఫిన్ సెంట‌ర్‌కి పేరు పెట్టావ్‌. త‌ను అనా‌థ‌కాదు.. మ‌న‌ల్ని వ‌దిలేసి అనాథ‌‌ల్ని చేశాడు." అంటుంది కోపంగా. దీంతో "అమ్మా బోర్డు చెరిపేద్దామా?" అంటుంది శౌర్య‌. క‌ట్ చేస్తే.. దీపని, దీప పిల్ల‌ల‌ని వెతుక్కుంటూ ఆమె తండ్రి ముర‌ళీకృష్ణ బ‌య‌లుదేర‌తాడు. ఇంత‌లో భాగ్యం త‌న మంగ‌ళ‌సూత్రం తీసేసి ప‌సుపుతాడు క‌ట్టుకుని "యుద్ధానికి వెళ్లే వీరుల కోసం భార్య‌లు ఎదురుచూసిన‌ట్టుగా మీ కోసం ఎదురుచూస్తుంటానండీ" అంటూ కామెడీ చేస్తుంది. ఎంత‌కీ మార‌డం లేద‌ని త‌ల‌కొట్టేసుకుంటూనే దీపని వెత‌క‌డం కోసం ముర‌ళీకృష్ణ బ‌య‌లుదేర‌తాడు. క‌ట్ చేస్తే .. ఆనంద‌రావుతో మోనిత గురించి సౌంద‌ర్య చెబుతూ వుంటుంది. మోనిత చాలా ముదిరిపోయింద‌ని, కార్తీక్ చేతే పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పించే దాకా వ‌చ్చింద‌ని, నేను మునుప‌టి సౌంద‌ర్య‌నైతే ఇప్ప‌టికే దాన్ని కాల్చిపారేసేదాన్న‌ని అంటుంది. ఈ డిస్క‌ష‌న్‌లో సౌంద‌ర్య‌కు అనుమానం మొద‌ల‌వుతుంది. కార్తీక్‌కి పిల్ల‌లు పుట్ట‌ర‌ని తెలిసి కూడా మోనిత త‌న‌ని పెళ్లి చేసుకోవాల‌ని ఎందుకు ప్ర‌య‌త్నిస్తోంది? ఇందులో ఏదైనా మ‌త‌ల‌బు వుందా?.. అన్న మెరుపులాంటి ఆలోచ‌న త‌డుతుంది. ఇంత‌కీ మోనితని ప‌ట్టించే అస్త్రం సౌంద‌ర్య‌కి తెలిసిందా?.. దీప క‌థ ఎలాంటి మ‌లుపులు తిర‌గ‌బోతోంది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. 

సౌంద‌ర్య‌తో వార్ డిక్లేర్ చేసిన మోనిత‌!

  'కార్తీక‌దీపం' మంగ‌ళ‌వారం ఎపిసోడ్ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా సాగ‌బోతోంది. సిటీ వ‌దిలేసి ఇద్ద‌రు పిల్ల‌ల‌తో వార‌ణాసి బంధువుల ఇంటికి చేరుకున్న వంట‌ల‌క్క అక్క‌డ మ‌ళ్లీ అదే జీవితాన్ని ప్రారంభిస్తుంది. టిఫిన్ సెంట‌ర్‌ని ప్రారంభిస్తుంది. వంటల‌క్క చేతి వంట న‌చ్చ‌డంతో కార్ల‌ల్లో క‌స్ట‌మ‌ర్లు వ‌చ్చేస్తుంటారు. క‌ట్ చేస్తే మోనిత ఇంట్లో కార్తీక్ మంత‌నాలు చేస్తుంటాడు. హిమ‌ని త్వ‌ర‌గా వెత‌క‌మ‌ని మోనిత‌కు చెబుతుంటాడు. "దాదాపు అన్ని హాస్పిట‌ల్స్‌కి దీప‌తో పాటు పిల్ల‌ల ఫోటొలు పంపించాను. వాళ్లు చిన్నా చిత‌కా క్లినిక్స్‌కి కూడా పంపిస్తారు. వాళ్ల‌కు ఏ జ‌లుబో జ్వ‌ర‌మో వ‌చ్చి హాస్పిట‌ల్స్‌కి వెళ్లినా ఇట్టే ఈజీగా దొరికిపోతారు. అలాగే నాకు తెలిసిన ఫార్మాస్యూటిక‌ల్‌ రిప్ర‌జెంటేటివ్స్‌కి కూడా ఈ విష‌యం చెప్పాను. ఆ కంప‌నీలు స‌ప్లై చేసే మెడిక‌ల్ షాప్స్‌లో కూడా అంద‌రి ఫొటోలు వుంటాయి." అంటుంది మోనిత‌. "నిజంగా గుడ్ ఐడియా. వాళ్ల‌ని వెతికి ప‌ట్టుకోవ‌డానికి ఇదొక మంచి దారి." అంటాడు కార్తీక్‌.. ఇలా వీరిద్ద‌రి మ‌ధ్య సంభాష‌ణ జ‌రుగుతుండ‌గానే సౌంద‌ర్య ఎంట్రీ ఇస్తుంది. "ఫ్యూచ‌ర్ ప్లాన్స్ చాలా వున్న‌ట్టున్నాయి సుపుత్రా అంటుంది." సౌంద‌ర్య‌.. "నువ్వు కొంచెం బ‌య‌టికి వెళ‌తావా నాన్నా.. మోనిత‌తో కొంచెం మాట్లాడాలి." అంటుంది.. ముందు కార్తీక్‌ని బ‌య‌టికి వెళ్ల‌వ‌ద్ద‌ని అడ్డు త‌గిలిన మోనిత ఆ త‌రువాత "ఏంటీ కాళ్ల‌బేరానికి వ‌చ్చారా?" అంటుంది. "కాళ్ల‌బేరానికి రావ‌డానికి నేను వ‌సుదేవుడిని కాదు.. నువ్వు గాడిద‌వి కాదు." అంటుంది సౌంద‌ర్య‌.. "ఒక ఆడ‌దానికి వుండాల్సిన ల‌క్ష‌ణాలు నీలో అణువంత కూడా లేవు.  కార్తీక్‌ని నీ మాయ‌మాట‌ల‌తో ప‌డేశావు... ఇప్ప‌టికైనా నీ వృధా ప్ర‌యాస మానుకోమ‌ని హెచ్చ‌రించ‌డానికి వ‌చ్చాను." అంటుంది. "నేను దీన్ని ఓ స‌వాల్‌గా స్వీక‌రించ‌డానికి సిద్ధంగా వున్నాను.  మీకూ నాకూ మ‌ధ్య ఇవ్వాళ్టి నుంచి వార్ మొద‌లైంది." అంటుంది మోనిత. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.  

'జాన‌కి క‌ల‌గ‌న‌లేదు'కు డేట్‌, టైమ్ ఫిక్స్‌

  స్టార్ మాలో స‌రికొత్త సీరియ‌ల్ 'జాన‌కి క‌ల‌గ‌న‌లేదు' ప్రారంభం కాబోతోంది. 'మౌన‌రాగం' సీరియల్‌లో హీరోయిన్‌గా న‌టించ‌డం ద్వారా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న ప్రియాంక జైన్‌, అమ‌ర్‌దీప్ చౌద‌రి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇక ఇదే సీరియ‌ల్‌తో న‌టుడు రాజా ర‌వీంద్ర‌, న‌టి రాశి బుల్లితెరంగేట్రం చేస్తున్నారు. మెయిన్ లీడ్ గా న‌టిస్తున్న ప్రియాంక జైన్‌కి తండ్రిగా రాజా ర‌వీంద్ర న‌టిస్తుంటే.. ప్రియాంక జైన్‌కి జోడీగా న‌టిస్తున్న అమ‌ర్‌దీప్ చౌద‌రికి త‌ల్లిగా రాశి న‌టిస్తున్నారు. ఐపీఎస్ ఆఫీస‌ర్ కావాల‌నుకున్న ఓ అమ్మాయికి, చ‌దువు ఏమాత్రం అబ్బ‌క స్వీట్ షాప్‌ని రన్ చేస్తున్న అబ్బాయికి పెళ్లి జ‌రిగితే ఆ బంధం ఎలా వుంటుంది?.. భార్య కోరిక తెలుసుకున్న భర్త ఆమెకు ఎలా అండ‌గా నిల‌బ‌డ్డాడు?.. త‌న కొడుకు కంటే ఎక్కువ చ‌దివే కోడ‌లుని త‌న ఇంటికి తెచ్చుకోన‌ని చెప్పే తల్లికి తెలియ‌కుండా కొడుకు త‌న భార్య‌ని ఎలా ఐపీఎస్ చ‌దివించాడు.. అన్న‌దే ఈ సీరియ‌ల్ అస‌లు క‌థ‌. హిందీ సూప‌ర్ హిట్ సీరియ‌ల్‌ 'దియా ఔర్ బాతీ హ‌మ్‌'కు రీమేక్‌గా ఈ సీరియ‌ల్‌ని నిర్మించారు. అక్క‌డ 1487 ఎపిసోడ్‌లు విజయ‌‌వంతంగా ప్ర‌సారం అయిన ఈ సీరియ‌ల్ తెలుగులోనూ అదే స్థాయిలో ఆక‌ట్టుకుంటుంద‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. స్టార్ మాలో ఈ ధారావాహిక ఈ నెల 22 నుంచి రాత్రి 9 గంట‌ల‌కు సోమ‌వారం నుంచి శుక్ర‌వారం వ‌ర‌కు ప్ర‌సారం కానుంది. 

రౌడీ శౌర్య షేర్ చేసిన వీడియోకు నెటిజ‌న్లు ఫిదా! ‌

  స్టార్ మా‌లో ప్ర‌సారం అవుతున్న నంబ‌ర్ వ‌న్ తెలుగు సీరియ‌ల్ 'కార్తీక‌దీపం'. ఈ సీరియ‌ల్‌లో వంట‌ల‌క్క దీప‌గా న‌టించిన కేర‌ళ కుట్టి ప్రేమి విశ్వ‌నాథ్ ఎంత పాపుల‌ర్ అయిందో అంద‌రికి తెలిసిందే. అదే స్థాయిలో ఈ సీరియ‌ల్‌లో దీప కూతురు శౌర్య‌గా న‌టించిన బేబీ కృతిక‌ కూడా అంతే పాపుల‌ర్ అయింది. త‌న చిట్టి పొట్టి మాట‌ల‌తో ఆక‌ట్టుకుంటున్న కృతిక‌ తాజాగా చేసిన ప‌నికి నెటిజ‌న్‌లు ఫిదా అయిపోయారు. శ‌భాష్ రౌడీ అంటూ కృతిక‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. బుల్లితెర‌పై రాణిస్తున్న ఈ రౌడీ బేబీలో సామ‌జిక స్పృహ ఎక్కువే. ఈ వ‌య‌సులోనే న‌లుగురికి సాయ‌ప‌డాల‌ని గొప్ప మ‌న‌సుని చాటుకుంటోంది. వివిధ సేవా కార్య‌క్ర‌మాల‌తో పాపుల‌ర్ అయి త‌న‌లోని సేవా నిర‌తిని చాటిన కృతిక తాజాగా సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ వీడియో సందేశాన్ని అందించింది. రానున్న ఎండ‌ల్ని దృష్టిలో పెట్టుకుని ప‌క్షుల‌కు ప‌రిప‌డా నీరు, ఆహారం అందేలా మీ టెర్రెస్‌పై ఏర్పాటు చేయండ‌ని సందేశాన్ని అందిస్తూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ చిన్నారి ఆలోచ‌న‌కు మెచ్చిన నెటిజ‌న్స్ అంతా ఫిదా అయిపోయారు. ఇంత చిన్న వ‌య‌సులో ఎంత సామాజిక స్పృహ అంటూ కృతిక‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు.