స్కిన్ షోతో షాకిస్తోన్న‌ 'జబర్దస్త్' వర్ష!

  'జబర్దస్త్' షోతో పాపులర్ అయిన వారిలో వర్ష కూడా ఒకరు. నటి కావాలనే ఉద్దేశంతో ఇండస్ట్రీకి వచ్చిన ఆమె ముందుగా సీరియల్స్ లో అవకాశాలు దక్కించుకుంది. ఆ తరువాత 'జబర్దస్త్' షోలో టాప్ కమెడియన్ హైపర్ ఆది స్కిట్ లలో కనిపించి అందరినీ మెప్పించింది. చాలా తక్కువ సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కమెడియన్ ఇమ్మాన్యుయేల్ తో ఆమె చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ లు పెడుతూ హైలైట్ చేస్తుంటారు ప్రోగ్రామ్ నిర్వాహకులు.  ప్రస్తుతం 'జబర్దస్త్' షోతో పాటు 'శ్రీదేవి డ్రామా కంపెనీ' అనే షోతో బిజీగా గడుపుతోంది వర్ష. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తరచూ తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఫాలోవర్ల సంఖ్య పెంచుకుంటోంది. గతంలో తెలుగమ్మాయిలు గ్లామర్ షో చేయడానికి పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో అవకాశాల కోసం హీరోయిన్లతో పోటీగా స్కిన్ షో చేస్తున్నారు.  ఇప్పుడు ఆ లిస్ట్ లో వర్ష కూడా చేరిపోయింది. తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. స్కిన్ కలర్ టాప్ వేసుకొని ఒంటిపై బట్టలు లేనట్లుగా ఫోటోలకు ఫోజులిచ్చింది. తన హాట్ లుక్స్ తో నెటిజన్లను ఆకట్టుకోవాలని చూసింది. ఈ ఫోటోలు చూసిన కొందరు ఆమె గ్లామర్ షోపై పాజిటివ్ కామెంట్స్ చేస్తుంటే మరికొందరు మాత్రం.. 'అమ్మా నాన్న వేసుకోవడానికి బట్టలు ఇవ్వలేదా..?' అంటూ విమర్శిస్తున్నారు. అతి తక్కువ సమయంలోనే ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. 

పొట్టి నిక్క‌రుతో శ్రీ‌ముఖి డాన్స్ షో.. వైర‌ల్ అయిన వీడియో!

  టీవీ రంగంలో ఎంతమంది గ్లామరస్ యాంకర్లు ఉన్నప్పటికీ శ్రీముఖి మాత్రం తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఎలాంటి షో చేసినా తన యాంకరింగ్ తో ఆకట్టుకుంటోంది. నటిగా కెరీర్ మొదలుపెట్టిన ఆమె మెల్లగా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. 'పటాస్' షోతో అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. యాంకర్ గానే కాకుండా తన గ్లామర్ షోతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.  ఎప్పటికప్పుడు సరికొత్త ఫోటో షూట్ లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది. ఇక రీసెంట్ గా శ్రీముఖి గ్లామరస్ సెక్సీ డాన్స్ స్టెప్పులతో నెటిజన్లను ఆకట్టుకుంది. ర్యాప్ సింగర్ రోల్ రైడా పాడిన 'చిన్నా' అనే పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ పాటకు కీర్త‌నా సునీల్‌తో క‌లిసి శ్రీముఖి డాన్స్ చేసింది. ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.  ఇందులో శ్రీముఖి చిన్న నిక్కర్ వేసుకొని డాన్స్ చేయడంతో నెటిజన్లు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. ఈ మధ్యనే శ్రీముఖి తన యూట్యూబ్ ఛానెల్ ను కూడా మొదలుపెట్టి దాని రీచ్ పెంచే పనిలో పడింది. లాక్ డౌన్ సమయంలో అవినాష్ తో కలిసి కొన్ని కామెడీ ఎపిసోడ్స్ కూడా చేసింది. అతడు బిగ్ బాస్ కు వెళ్లే సమయంలో శ్రీముఖి ఆర్థికంగా సహాయం కూడా చేసింది. ఫ్యూచర్ లో తన యూట్యూబ్ ఛానెల్ కంటెంట్ పై ఎక్కువగా ఫోకస్ చేయాలని ప్లాన్ చేసుకుంటోంది.

సుధీర్ ఇంట్లో విషాదం.. చివరిచూపు కూడా దక్కలేదు!

  సుడిగాలి సుధీర్ గురించి తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరు. ఎంతో కష్టపడి టీవీ కమెడియన్ గా, హోస్ట్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. 'జబర్దస్త్' లోకి రావడానికి ముందు సుధీర్ మెజీషియన్ గా పని చేశాడు. ఎన్నో ఈవెంట్స్ లో మ్యాజిక్ చేసిన సుధీర్ ఫైనల్ గా 'జబర్దస్త్' షోలో చేరి బాగా పాపులారిటీ సంపాదించాడు. ప్రస్తుతం 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోతో బిజీగా ఉన్నాడు సుధీర్. మల్లెమాల ప్రొడక్షన్ లో ఈటీవీలో ప్రసారం అవుతున్న ఈ షోలో రామ్ ప్రసాద్, హైపర్ ఆది వంటి కమెడియన్స్ కూడా స్కిట్స్ చేస్తున్నారు.  ప్రస్తుతం టాప్ కామెడీ షోలలో ఒకటిగా 'శ్రీదేవి డ్రామా కంపెనీ' దూసుకుపోతుంది. అయితే తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో సుధీర్ కంటతడి పెట్టుకున్నాడు. కార‌ణం.. ఇటీవల సుధీర్ ఇంట్లో ఓ విషాదం చోటుచేసుకుంది. అతడి అమ్మమ్మ కరోనా సోకి కన్నుమూశారు. అయితే చివరిసారి ఆమెను చూడడానికి కూడా పరిస్థితులు అనుకూలించలేదని ప్రోమోలో సుధీర్ క్లోజ్ ఫ్రెండ్‌ రామ్ ప్రసాద్ ఆ విషయాన్ని చెప్పుకొచ్చాడు.  అమ్మమ్మ చనిపోయిందని తెలిసి సుధీర్ చాలా బాధపడ్డాడని చెబుతూ.. వెళ్లాలని ఉన్నా వెళ్లలేకపోయినట్లు రామ్ ప్రసాద్ వివరణ ఇచ్చాడు. ఈ క్రమంలో సుధీర్ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఆదివారం మధ్యాహ్నం ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ షోకి నటుడు పృథ్వీతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ కూడా వచ్చారు. 

పెళ్లి చేసిన ఫేస్‌బుక్ ప్రేమ‌.. జ‌బ‌ర్ద‌స్త్ ఆనంద్ క్యూట్ ఫ్యామిలీ!

  'జబర్దస్త్' షో ద్వారా చాలా మంది టాలెంటెడ్ కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అందులో ఆనంద్ కూడా ఒకడు. రీసెంట్ గా అతడు తన ఫ్యామిలీను అభిమానులకు పరిచయం చేశాడు. భార్యా, పిల్లలను కెమెరా ముందుకు తీసుకువచ్చి పరిచయం చేయగా.. నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన ఆనంద్ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. 'జబర్దస్త్' షోకి వచ్చిన తరువాత కూడా అతడికి అవకాశాలు అంత సులువుగా రాలేదు.  చివరికి చమ్మక్ చంద్ర అతడిని నమ్మి గ్రూప్ లో చేర్చుకోవడంతో టీమ్ లీడర్ అయ్యేవరకు వచ్చాడు. తన సంపాదనతో ఓ ఇల్లు కూడా కట్టుకున్నాడు. సొంతంగా యూట్యూబ్ ఛానెల్ సెట్ చేసుకొని అందులో తన పర్సనల్ విషయాలకు సంబంధించిన వీడియోలు షేర్ చేయడంతో పాటు విభిన్నమైన కంటెంట్ పోస్ట్ చేస్తుంటాడు. ఇటీవల తన ఫ్యామిలీకి చెందిన వీడియోను పోస్ట్ చేశారు. తన భార్యను మొదటిసారి వీడియో ద్వారా పరిచయం చేశారు.  ఈ వీడియో చూసిన నెటిజన్లు మీ భార్య హీరోయిన్ల కంటే తక్కువేమీ కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలానే తన ఇద్దరు కొడుకులకు పరిచయం చేయగా.. వారు కూడా చాలా క్యూట్ గా ఉన్నారంటూ ప్రశంసిస్తున్నారు. ఆనంద్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఫేస్ బుక్ ద్వారా ఏర్పడిన పరిచయం ఇష్టంగా మారడం తరువాత ఒకరినొకరు పెళ్లి వివాహం చేసుకున్నాడు. పెళ్లి సమయంలో పెద్ద గొడవలు జరిగాయని.. అప్పుడు చమ్మక్ చంద్ర, రోజా గారు సాయం చేశారని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు ఆనంద్. 

నా బయోపిక్ నేనే తీసుకుంటా! నా ల‌వ్ స్టోరీలో మంచి మ‌సాలా ఉంది!!

  ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా బయోపిక్ లు వచ్చాయి. హీరోలు, రాజకీయనాయకులు, స్వాతంత్య్ర యోధులు ఇలా చాలామందిపై బయోపిక్ లు వచ్చాయి, వస్తున్నాయి. అయితే ఇప్పుడు యాంకర్ అనసూయ కూడా డబ్బు బాగా ఉన్నప్పుడు తనపై తానే బయోపిక్ తీసుకుంటానని చెబుతోంది. తన లవ్ స్టోరీలో మంచి మసాలా ఉందని.. దాన్ని దట్టించి బయోపిక్ తీస్తానంటూ చెప్పుకొచ్చింది. తన లవ్ స్టోరీ, పెళ్లి, పిల్లలు వంటి అంశాలపై స్పందించింది అనసూయ.  చిన్నప్పుడు తన తల్లి బాగా పూజలు చేసేదని.. తను కూడా తల్లితో కలిసి టెంపుల్స్ కి తిరిగేదాన్ని అని చెప్పుకొచ్చింది. ప్రేమించిన వాడితో పెళ్లి జరగాలని తెగ పూజలు చేశానని.. ఏడేళ్ల పాటు చాక్లెట్, ఆలు గడ్డ తినలేదని.. సాయిబాబాకు వదిలేశానని తెలిపింది. తన భర్తే తన ప్రపంచమని.. ఎన్‌సీసీ క్యాంప్ లో అతడిని కలిసినట్లు.. అది చాలా పెద్ద కథ అని.. బాగా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు తన లవ్ స్టోరీతో బయోపిక్ తీస్తానని.. తన లైఫ్ లో చాలా మసాలా ఉందని, ఎంటర్టైనింగ్ గా ఉంటుందని చెప్పుకొచ్చింది.  పెళ్లి సమయంలో ఎన్నో ఇబ్బందులు పడినట్లు.. సాక్షిలో జాబ్ చేస్తున్నప్పుడు కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నట్లు చెప్పింది. ఇక పిల్లల గురించి మాట్లాడుతూ.. ఓ పాపని కనాలనుందని చెప్పింది. ఆడబిడ్డను కనడం, పెంచడం పెద్ద ఛాలెంజ్ అని చెప్పిన అనసూయ తనకు 40 ఏళ్లు రాగానే కూతుర్ని కనడానికి ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చింది. కూతుర్ని కనేప్పుడు చాలా వరకు తన వర్క్ ను పాపకి డెడికేట్ చేస్తానని చెప్పింది.   

ప‌వ‌న్ నా బుగ్గ గిల్లి ముద్దుపెట్టారు!

  కొరియోగ్రాఫర్ గా 1400కి పైగా సినిమాలకు పని చేసిన శివశంకర్ మాస్టర్ తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మద్రాస్ లో పుట్టిన ఆయన.. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి నాటి త‌రం అగ్ర హీరోల‌ సినిమాలతో పాటు ప్రభాస్, పవన్ కళ్యాణ్ లాంటి నేటి త‌రం హీరోల సినిమాలకు కూడా పని చేశారు. ఓ వైపు కొరియోగ్రాఫర్ గా సినిమాలు చేస్తూనే.. బుల్లితెరపై పలు షోలకు జడ్జిగా వ్యవహరించారు. అలానే నటుడిగా కూడా కొన్ని సినిమాల్లో కనిపించి ఆకట్టుకున్నారు.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివశంకర్ మాస్టర్ 'అత్తారింటికి దారేది' సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చారు. తనకు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టమని.. ఆయన చాలా మంచి వ్యక్తి అంటూ కొనియాడారు శివశంకర్ మాస్టర్. అందరికీ సాయం చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని.. ఆయన నటించిన 'అత్తారింటికి దారేది' సినిమాకి తాను పనిచేశానని తెలిపారు.  ఈ సినిమాలో 'దేవదేవం' అనే పాటకు తాను కొరియోగ్రఫీ చేశానని శివశంకర్ చెప్పారు. తనను సెట్స్ పై చూడగానే పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చి ఎలా ఉన్నారంటూ హగ్ చేసుకున్నారని గుర్తు చేసుకున్నారు. ఆ పాటకు కొరియోగ్రఫీ చేసే సమయంలో పవన్ త‌న బుగ్గ గిల్లి ముద్దు పెట్టుకున్నారని.. "ఎంత బాగా చేస్తున్నారు మాస్టర్" అంటూ తనను మెచ్చుకున్నారని శివశంకర్ మాస్టర్ అన్నారు. నటుడిగా కంటే పవన్ వ్యక్తిత్వం అంటే తనకు చాలా ఇష్టమని శివశంకర్ మాస్టర్ చెప్పుకొచ్చారు.  

ర‌వి చేసిన‌ రొయ్య‌ల ఇగురు.. నోరూరిస్తోంది!

  బుల్లితెరపై యాంకర్ రవి ఎంత యాక్టివ్ గా ఉంటాడో అందరికీ తెలిసిందే. కో యాంకర్ గా ఎవరు వచ్చినా కూడా రవిలో ఎనర్జీ ఎంతమాత్రం తగ్గదు. లాస్య, శ్రీముఖి, భానుశ్రీ ఇలా ఎంతమంది పక్కన యాంకర్ గా చేసినప్పటికీ తనదైన ముద్ర వేయగలిగాడు. రవి తన ఫ్యామిలీని పరిచయం చేసినప్పటి నుండి ఆయన ఇమేజ్ మారిపోయింది. తన భార్య నిత్య, కూతురు వియాలతో సోషల్ మీడియాలో రవి చేసే అల్లరి మాములుగా ఉండదు. మరీ ముఖ్యంగా కూతురు వియాతో రవి షేర్ చేసే వీడియోలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.  అయితే తన కూతురుకి ఇష్టమైన వంటకాలను వండిపెట్టడానికి రవి చేసే ప్రయత్నాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. గత రెండు రోజులుగా రవి ఇంట్లో చెఫ్ అవతారమెత్తారు. రంజాన్ స్పెషల్ గా బిరియానీ వండేశారు. దీనికి సంబందించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో ఆ బిరియానీను వియా రుచి చూసి బాగుందని చెప్పడం.. దానికి రవి సంతోషపడడం కనిపిస్తుంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలు కామెంట్స్ చేయడంతో వైరల్ అవుతోంది.  ఇక ఆదివారం నాడు రవి మరో స్పెషల్ డిష్ ను వండిపెట్టారు. ఆదివారం ఆడవాళ్లకు సెలవు అనే పద్దతిని రవి పాటిస్తున్నట్లు ఉన్నారు. ఈ మేరకు ఆదివారం రొయ్యల ఇగురుని ఎంతో ఇష్టంగా భార్య, పిల్లలకు వండిపెట్టారు. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ''ఆదివారం ఆడవాళ్లకు సెలవు.. రొయ్యల ఇగురు రవి స్టైల్ లో.. అందరూ ఇంట్లోనే ఉంటూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నా'' అంటూ క్యాప్ష‌న్‌ ఇచ్చారు. 

శేఖర్ మాస్టర్ మంచి మ‌న‌సు.. ప‌స్తులుంటున్న డాన్స‌ర్ల కోసం..!

  కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశంలో కేసులు పెరిగిపోయాయి. గతేడాది మాదిరి ఈ ఏడాది కూడా కార్మికుల పరిస్థితి దారుణంగా మారింది. లాక్ డౌన్ వలన చాలా మంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. నిత్యావసర సరుకులు కూడా కొనలేని పరిస్థితి. దీంతో పలువురు సెలబ్రిటీలు తమకు తోచిన సాయం చేస్తూ ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు. అయితే ఈ సెకండ్ వేవ్ లో కళను నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఎంతోమంది డాన్సర్లు కూడా పని లేక పస్తులు ఉంటున్నారు.  దీంతో అలాంటివారిని ఆదుకోవడానికి ముందుకొచ్చారు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్. గ్రూప్ డాన్సర్ లు, టీవీ షోలు చేసే డాన్సర్లకు ఈ సమయంలో పని దొరకడం చాలా కష్టంగా మారిందని చెప్పిన ఆయన.. తినడానికి కూడా డబ్బులు లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇలా ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే వెంటనే తనకు ఫోన్ చేసి చెప్పమని తెలుపుతూ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు శేఖర్ మాస్టర్.  ఆడియో ఫంక్షన్లు, సంగీత్ వంటి కార్యక్రమాలు ఆగిపోవడంతో గ్రూప్ డాన్సర్లు సహా చాలా మందికి ఆదాయం లేదని.. హైదరాబాద్ లో ఉన్న డాన్సర్లకు ఎవరికైనా నిత్యావసర సరుకులు అవసరమైతే తాను అందిస్తానని శేఖర్ మాస్టర్ అన్నారు. ఈ మేరకు 9989189885, 9618961492, 7416519257 నెంబర్లకి ఫోన్‌ చేసి ఉచితంగా నిత్యావసర సరకులు తీసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం పరిస్థితుల కారణంగా అందరూ ఇంట్లోనే ఉండాలని.. అవసరం ఉంటేనే తప్ప బయటకి రావొద్దని సూచించారు. 

"సుమ ఆంటీకి నేను వీరాభిమానిని".. నాని అల్ల‌రికి హ‌ర్ట‌యిన సుమ‌!

  తెలుగు బుల్లితెరపై యాంకర్ సుమకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన పంచ్‌లతో అందరికీ చుక్కలు చూపిస్తుంటుంది. అలాంటి సుమకే తన కామెంట్స్‌తో మాటలు రాకుండా చేశాడు హీరో నాని. కెమెరా ముందే సుమను ఉక్కిరిబిక్కిరి చేసేశాడు నాని. దెబ్బకి సుమ దండం పెట్టేసి నేను వెళ్లిపోతున్నా అనేసింది. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరిగిందంటే.. సుమ హోస్ట్ గా చేస్తున్న షోలలో 'క్యాష్' ఒకటి.  సినీ, టెలివిజన్ ప్రముఖులను అతిథులుగా తీసుకొని ఈ షోలో రచ్చ చేస్తుంటుంది సుమ. సెలబ్రిటీలతో సుమ చేసే సందడి మాములుగా ఉండదు. అయితే తాజాగా షోలో మాత్రం సీన్ మొత్తం రివర్స్ అయింది. నేచురల్ స్టార్ నాని.. సుమపై పంచ్‌ల మీద పంచ్‌లు వేశాడు. మే 22న ప్రసారం కానున్న సుమ 'క్యాష్' షోకి నాని 'టక్ జగదీష్' టీమ్ గెస్టులుగా వచ్చాయి. హీరో నాని, హీరోయిన్ రీతువర్మలతో పాటు దర్శకుడు శివ నిర్వాణ, న‌టుడు తిరువీర్‌ ఈ షోలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.  ఈ వీడియోలో సుమ పరువుతీసేలా హీరో నాని చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 'సుమ ఆంటీ' అంటూ ఆమెని ఆడేసుకున్నాడు నాని. "అమ్మాయిలకు ఆంటీ అని పిలిస్తే నచ్చదు" అని సుమ అనడంతో వెంటనే అందుకున్న నాని.. ''ఈరోజు సుమ ఆంటీ షోకి రావడం నాకెంతో ఆనందంగా ఉంది. సుమ ఆంటీకి నేను వీరాభిమానిని. సుమ ఆంటీ అంటే నాకెంతో ఇష్టం'' అంటూ రచ్చ చేశాడు. అది విని షాకైన సుమ.. "నేనెళ్లిపోతున్నా" అనేసింది. ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్ లో వైరల్ అవుతోంది!

బిగ్ బాస్ బ్యూటీ బాత్రూం సెల్ఫీ.. వైరల్!

  చాలా మంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేస్తూ తమ ఫాలోయింగ్ పెంచుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో మందనా కరిమి ఒకరు. బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ బిగ్ బాస్ షోతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా బాత్రూం లో బట్టలు లేకుండా దిగిన సెల్ఫీని షేర్ చేసింది.  వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతున్న ఈ బ్యూటీ ప్రముఖ వ్యాపారవేత్త గౌరవ్ గుప్తాతో ప్రేమలో పడింది. కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసిన ఈ జంట 2017లో వివాహబంధంతో ఒక్కటైంది. అయితే పెళ్లైన నెల రోజులకే భర్త, అత్తమామలపై గృహహింస కేసు పెట్టి షాకిచ్చింది. ఆ తరువాత కేసు వాపసు తీసుకుంది. ఇప్పుడు తన భర్తకు దూరంగానే ఉంటోంది. ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తనకు సంబంధించిన అన్ని విషయాలు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.  ఎప్పటికప్పుడు తన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంటుంది. ఈ క్రమంలో మరోసారి రెచ్చిపోయింది. ఇప్పుడు ఏకంగా బాత్రూమ్ లో బట్టలు లేకుండా ఉన్న సమయంలో తీసిన ఓ సెల్ఫీను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటో బ్లర్ గా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సెల్ఫీకి నెటిజన్ల నుండి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ ఫోటో పోస్ట్ చేస్తూ.. 'మీ జీవితాన్ని మార్చగలిగే వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నా..? అయితే వెంటనే అద్దంలో చూడండి' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. 

చచ్చిపోతానేమో అని భయపడ్డా!

  'జబర్దస్త్' షో ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న కమెడియన్ ముక్కు అవినాష్ కి జనాల్లో మంచి క్రేజ్ ఉంది. గతేడాది బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొన్న అవినాష్ తన కామెడీతో అందరినీ ఎంటర్టైన్ చేశాడు. ఒకానొక సమయంలో ట్రోఫీ తనే పట్టుకుపోతాడేమో అనుకున్నారు. కానీ హౌస్ లో కొన్ని గొడవల్లో అవినాష్ ఇన్వాల్వ్ అవ్వడం, ఎలిమినేషన్ వరకు వెళ్లడం వంటి విషయాలు అతడ్ని వెనక్కి లాగేశాయి. కానీ అవినాష్-అరియనా ట్రాక్ మాత్రం జనాలను ఆకట్టుకునేది.  ఇదిలా ఉండగా.. హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత అవినాష్ స్టార్ మా ఛానెల్ లోనే పలు షోలతో బిజీ అయ్యాడు. 'కామెడీ స్టార్స్' షోలో తన స్కిట్ లతో కామెడీ పండిస్తున్నాడు. అయితే రీసెంట్ గా ఈ షోలో పాల్గొన్న అవినాష్ కరోనా భయంతో తను చనిపోతానేమో అని భయపడిన విషయాన్ని వెల్లడించాడు. షోలో భాగంగా ఓ టీమ్ 'కేరాఫ్ కంచరపాలెం' సినిమాలో 'ఆశా పాశం' అనే పాటకు పెర్ఫార్మ్ చేశారు.  ప్రస్తుత పరిస్థితుల్లో జనాలు కరోనా సోకి చనిపోవడం, కనీసం కుటుంబ సభ్యులకు కూడా చివరి చూపు దక్కకపోవడం వంటి విషయాలను తమ పెర్ఫార్మన్స్ ద్వారా అందరికీ కనెక్ట్ అయ్యేలా చూపించారు. ఇది చూసిన అవినాష్ ఎమోషనల్ అయ్యాడు. రీసెంట్ గా తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని.. మొదటి మూడు రోజుల్లో అయితే చనిపోతానేమో అని భయపడిపోయానని చెప్పుకొచ్చాడు. నటి అషురెడ్డి కూడా ఈ పెర్ఫార్మన్స్ చూసి కన్నీళ్లు పెట్టుకుంది. తన తాతయ్య కూడా కరోనాతో చనిపోయారని.. చివరిచూపుకి కూడా నోచుకోలేకపోయామంటూ ఏడ్చేసింది. 

ఆ సినిమా వల్ల చాలా బాధపడ్డా! కొన్ని రోజులు బ‌య‌ట‌కు రాలేదు!!

  బుల్లితెరపై హాట్ యాంకర్ గా దూసుకుపోతున్న అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'జబర్దస్త్' షోతో ఫేమస్ అయిన ఈ భామ ఈరోజు 36వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె కొన్ని విషయాలను షేర్ చేసుకుంది. తన కెరీర్ లో ఓ సినిమా కారణంగా ఎంతో బాధపడ్డానని.. కొన్ని రోజులు బయటకు కూడా రాలేకపోయానని చెబుతోంది. 2013లో ఎన్టీఆర్ నటించిన 'నాగ' సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది అనసూయ.  దాదాపు పదమూడేళ్ల తరువాత ఆమె నాగార్జున సినిమా 'సోగ్గాడే చిన్ని నాయన'లో ఆయ‌న మ‌ర‌ద‌లి పాత్ర‌లో మెరిసింది. ఆ వెంటనే 'క్షణం' సినిమాలో ఓ కీల‌క పాత్ర‌ పోషించింది. ఇక ఆ తరువాత ఐటెం సాంగ్స్ అని, గెస్ట్ రోల్స్ అని బిజీగా గడిపింది. 'రంగస్థలం' సినిమాలో చేసిన రంగ‌మ్మ‌త్త క్యారెక్ట‌ర్‌తో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం ఆమె చేతిలో 'ఖిలాడి', 'రంగమార్తాండ' అనే సినిమాలున్నాయి. ఇన్ని సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ 'కథనం' సినిమా కార‌ణంగా ఎంతో బాధ పడ్డానని చెప్పింది.  'క్షణం' సినిమా తరువాత 'కథనం' సినిమాలో ప్రధాన పాత్ర పోషించానని.. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఆ సినిమా కోసం టీమ్ మొత్తం చాలా కష్టపడిందని.. కానీ సినిమా అనుకున్న ఫలితాన్ని అందుకోలేకపోయిందని చెప్పింది. దాంతో ఎంతో బాధపడ్డానని.. కొన్ని రోజులు ఇంట్లోనే ఉండిపోయానని వెల్లడించింది. తనకు ఎప్పుడైనా ఎక్కువ బాధగా అనిపిస్తే ఆరోజు రాత్రి నిద్రపోయే ముందు వైన్‌ తాగి.. ఆ బాధనంతటిని భర్త ముందు వెళ్లగక్కుకుని ప్రశాంతంగా నిద్రపోతానని చెప్పుకొచ్చింది అన‌సూయ‌.

రియ‌ల్ క‌పుల్‌గా మారిన రీల్ క‌పుల్‌!

  టీవీ నటుడు, 'సావిత్రమ్మ గారి అబ్బాయి' సీరియల్ హీరో బాబు (చందన్ కుమార్).. నటి కవిత గౌడను వివాహం చేసుకున్నారు. కరోనా నిబంధనలను పాటిస్తూ కేవలం ఇరు కుటుంబ సభ్యులు, కొంతమంది సన్నిహితుల మధ్య బెంగ‌ళూరులో శుక్రవారం వారి పెళ్లి వేడుక ఘనంగా నిర్వహించారు. ఇటీవల కుటుంసభ్యుల సమక్షంలో వీరి నిశ్చితార్ధం రహస్యంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బంధంతో ఈ జంట ఒక్కటైంది.  కన్నడలో వీరిద్దరూ కలిసి జంట‌గా 'లక్ష్మీ బారమ్మ' అనే సీరియల్ లో నటించారు. ఆ సమయంలోనే ఒకరినొకరు ఇష్టపడడంతో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. పెళ్లి అనంతరం చందన్ మీడియాతో మాట్లాడారు. కరోనా ఆంక్షలు అన్ని ఎత్తివేసి, సాధారణ పరిస్థితులు రాగానే అందరినీ పిలిచి గ్రాండ్ గా రిసెప్షన్ పార్టీ ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు చెప్పారు.  తమ పెళ్లిని ముందుగా అనుకున్న ముహుర్తానికే జరిపించాలని కుటుంబసభ్యులంతా నిర్ణయించారని.. దీంతో కరోనా ప్రోటోకాల్ నడుమ ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ తమ వివాహ తంతు జరిపించినట్లు చందన్ వెల్లడించాడు. మాస్క్ లతో తమ వివాహ శుభకార్యంలో పాల్గొన్న ఈ జంట ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు నూతన జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. 

సుత్తికొట్టే సుధీర్‌.. రెచ్చ‌గొట్టే ర‌ష్మీ!

  బుల్లితెరపై నెంబర్ వన్ కామెడీ షోగా భారీ టీఆర్పీతో దూసుకుపోతోంది జ‌బ‌ర్ద‌స్త్‌. ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ కు సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది. అలాంటి వారిలో హైపర్ ఆది ఒకడు. తనదైన పంచ్ లతో హడావిడి చేసే ఈ కమెడియన్ తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో తాజాగా సుడిగాలి సుధీర్, రష్మీల రిలేషన్ పై అత‌ను వేసిన పంచ్ ఇప్పుడు వైరల్ అవుతోంది.  ప్రతి గురువారం ప్రసారమయ్యే 'జబర్ద‌స్త్‌' షోలో హైపర్ ఆది టీమ్ లీడర్‌గా పని చేస్తున్న విషయం తెలిసిందే. అలానే అప్పుడప్పుడు 'ఎక్స్‌స్ట్రా జబర్ద‌స్త్‌' షోలో ఇతర టీమ్స్ లో గెస్ట్ రోల్ చేస్తుంటాడు హైపర్ ఆది. ఇప్పుడు రాకింగ్ రాకేష్ టీమ్ లో గెస్ట్ రోల్ చేస్తున్నాడు. వచ్చే వారం ప్రసారం కానున్న ఈ షోలో హైపర్ ఆది కనిపించబోతున్నాడు. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఎప్పటిలానే తన కామెడీతో ఎంటర్టైన్ చేసిన హైపర్ ఆది.. జడ్జ్ మనోతో కలిసి ఓ స్కిట్ చేశాడు.  ఆ సమయంలో ఆయనపై పంచ్ ల వర్షం కురిపించాడు. 'మరగబెట్టే మనో.. ఇరగదీసే ఇంద్రజ' అంటూ మీరు కూడా ఓ టీమ్ పెట్టాల్సిందని జడ్జ్ లకు షాకిచ్చాడు. జడ్జ్ ల టీమ్ పేరు చెప్పగానే.. యాంకర్ రష్మీ 'హలో హలో మరి నాకేం టీమ్ లేదా?' అని ప్రశ్నించింది. దానికి వెంటనే స్పందించిన హైపర్ ఆది 'నీకెందుకు లేదు.. సుత్తికొట్టే సుధీర్.. రెచ్చగొట్టే రష్మీ' అంటూ పంచ్ వేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు యూట్యూబ్ లో వైరల్ అవుతోంది. 

గెస్ట్‌గా వ‌చ్చి.. ప‌ర్మినెంట్ ఆర్టిస్ట్‌గా మారి.. జ‌బ‌ర్ద‌స్త్‌ వ‌ర్ష ముద్ర‌!

  మోడల్ గా కెరీర్ ఆరంభించిన వర్ష.. బుల్లితెర సీరియల్స్ లో నటించే అవకాశం దక్కించుకుంది. 'అభిషేకం', 'తూర్పు పడమర', 'ప్రేమ ఎంత మధురం' వంటి సీరియల్స్ లో కనిపించింది. అందంతో పాటు యాక్టింగ్ లోనూ రాణించడంతో నటిగా మంచి గుర్తింపు అందుకుంది. ఈ క్రమంలోనే సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. సీరియల్ లో నటిగా బిజీగా ఉన్న సమయంలోనే టాప్ కమెడియన్ హైపర్ ఆది చొరవతో 'జబర్దస్త్' షోలోకి ఎంట్రీ ఇచ్చింది.  కేవలం గెస్ట్ గా వచ్చిన ఆమె.. తన కామెడీ టైమింగ్ తో 'జబర్దస్త్' షోలో పర్మినెంట్ ఆర్టిస్ట్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే హైపర్ ఆది స్కిట్ లతో పాటు రాకింగ్ రాకేష్, కెవ్వు కార్తిక్ టీమ్ లలో పని చేస్తోంది. అదే సమయంలో 'శ్రీదేవి డ్రామా కంపెనీ' అనే షోలోనూ చేస్తోంది. 'జబర్దస్త్' లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత వర్ష కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. అలానే ఆ షోలో యంగ్ కమెడియన్ ఇమ్మానుయేల్ తో ప్రేమాయణం సాగిస్తుందనే వార్తలతో మరింత పాపులర్ అయింది.  సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తరచూ తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుని ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఓ గ్లామరస్ ఫోటోను షేర్ చేసింది. ఇందులో ఆమె స్లీవ్ లెస్ టాప్ వేసుకొని గ్లామర్ షో చేస్తూ కనిపించింది. తన నడుము అందాలను ఎక్స్ పోజ్ చేస్తూ యూత్ ను ఆకర్షిస్తోంది. ఈ ఫోటోని చూసిన నెటిజన్లు ఆమె అందాన్ని తెగ పొగిడేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

లాక్‌డౌన్‌.. ఆగిపోయిన సీరియల్ షూటింగ్స్!

  కరోనా వైరస్ అన్ని ఇండస్ట్రీలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. గతేడాది లాక్ డౌన్ విధించినప్పుడు సినిమా, టీవీ సీరియల్స్ షూటింగ్స్ ఆగిపోయాయి. దీని కారణంగా సినీ, టీవీ కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మెల్లగా షూటింగ్స్ మొదలవ్వడంతో ఇక పరిస్థితులు చక్కబడతాయని అందరూ భావించారు. సెకండ్ వేవ్ మొదలైనప్పుడు కూడా షూటింగ్స్ ఆగలేదు. ఇటు సినీ, అటు టీవీ దర్శకనిర్మాతలు పలు జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్స్ జరిపారు. అయితే సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువ అవుతుండడంతో రీసెంట్ గా తెలంగాణలో ప్ర‌భుత్వం లాక్ డౌన్ విధించింది.  అప్పటికే వైరస్ ప్రభావంతో ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలు షూటింగ్స్ ఆపేశారు. ఇప్పుడు టీవీ రంగానికి చెందిన నిర్మాతలు కూడా షూటింగ్స్ ను ఆపేశారు. తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లాక్ డౌన్ సమయంలో సీరియల్ నటీనటులు, నిర్మాతలకు షూటింగ్ ను ఆపేయాలని సూచించింది. ప్యాచ్ వర్క్ చేసుకునే సీరియల్స్ మినహా.. మిగిలిన షూటింగ్ అన్నీ ఆగిపోయాయి. ఈ నిర్ణయానికి ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ కూడా తమ మద్దతుని తెలియజేసింది.  ఈ విషయంపై స్పందించిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు విజయ్ యాదవ్.. ఎప్పుడైతే లాక్ డౌన్ అనౌన్స్ చేశారో అప్పటినుండి షూటింగ్స్ జరగడం లేదని చెప్పారు. రామోజీ ఫిలిం సిటీలో కూడా షూటింగ్స్ ఆపేశారని చెప్పారు. అయితే కొందరు షూటింగ్స్ చేస్తున్నారని వార్తలొస్తున్నాయని.. దానికి కారణం ఛానెల్ నిర్మాతల ఒత్తిడే కారణమై ఉంటుందని అన్నారు. కొంద‌రు సీరియ‌ల్ నిర్మాత‌లు సినిమాటోగ్ర‌ఫీ మినిష్ట‌ర్ త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌గారిని క‌లిసి త‌క్కువ మంది క్రూతో షూటింగ్స్‌ను కొన‌సాగించుకుంటామ‌ని ప‌ర్మిష‌న్ అడగాలనుకుంటున్న విషయాన్ని వెల్లడించారు. 

టాప్‌లో 'కార్తీక దీపం'.. నెక్స్ట్ ఏ సీరియల్?

  తెలుగు టెలివిజన్ రంగంలో డైలీ సీరియల్స్ మధ్య రసవత్తరమైన పోటీ జరుగుతోంది. ప్రముఖ ఛానెల్ స్టార్ మా లో ప్రసారమయ్యే 'కార్తీక దీపం', 'గృహలక్ష్మీ', 'వదినమ్మ', 'దేవత', 'జానకి కలగనలేదు', 'గుప్పెడంత మనసు' వంటి సీరియల్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రేక్షకులకు వినోదం పంచుతున్న ఈ సీరియల్స్ కి సంబంధించిన రేటింగ్స్ ఇప్పుడు బయటకొచ్చాయి. బుల్లితెరపై ఆకట్టుకుంటున్న సీరియల్స్ కి సంబంధించి టాప్ 5 రేటింగులువిషయానికొస్తే .. 'దేవత' సీరియల్ ఐదో స్థానానికి పడిపోయింది.  గతవారం టీఆర్పీలో 'దేవత' సీరియల్ నాలుగో స్థానంలో ఉండేది. గతంలో 'దేవత' సీరియల్ మూడో స్థానానికి కూడా చేరుకున్న సందర్భాలు ఉన్నాయి. 'దేవత' సీరియల్ కు 'గుప్పెడంత మనసు' సీరియల్ నుండి గట్టిపోటీ ఎదురవుతోంది. ఇక 'జానకి కలగనలేదు' సీరియల్ ప్రస్తుతం టీఆర్పీలో నాల్గో స్థానానికి వెళ్లింది. ఇటీవల మొదలైన ఈ సీరియల్ కి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది.  తాజా రేటింగ్స్ లో 'గుప్పెడంత మనసు' మూడో స్థానాన్ని చేజిక్కించుకుంది. 'గృహాలక్ష్మీ' సీరియల్ రెండో స్థానాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తుంది. ఇక ఎప్పటిలానే 'కార్తీకదీపం' భారీ రేటింగ్స్ తో టాప్ గేర్ లో దూసుకుపోతుంది. మలయాళం సీరియల్ 'కరుతముత్తు' ఆధారంగా ఈ సీరియల్ ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో నిరుపమ్ పరిటాల, ప్రేమి విశ్వనాథ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 

సుధీర్ చెంప చెళ్లుమనిపించిన రష్మి.. వీడియో వైరల్!

  బుల్లితెరపై యాంకర్ రష్మీ, సుడిగాలి సుధీర్ జోడీకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెమెరా ముందు వీరు చేసే రొమాన్స్ ఓ రేంజ్ లో పడుతుంది. ఏ షో అయినా.. సుధీర్, రష్మీ జోడీ కనిపించిందంటే ఆ కిక్కే వేరు. అంతటి క్రేజ్ ఉన్న ఈ జోడీ తాజాగా విడుదలైన ఢీ ప్రోగ్రామ్ ప్రోమోలో ఊహించని షాకిచ్చింది. అందరి ముందే సుధీర్ చెంప చెళ్లుమనిపించింది ర‌ష్మి! ముందుగా సుధీర్ కు రెండు ఇవ్వాలని ఉందంటూ వేదిక మీదకు వచ్చిన రష్మీ.. మొదట స్వీట్ హగ్ ఇచ్చి.. ఆ వెంటనే చెంపపై ఒక్కటి ఇచ్చింది. "ఫస్ట్ నీ పెర్ఫార్మన్స్ కు హగ్" అని చెప్పిన ఆమె.. సెకండ్, "నీ కాలు బాగాలేదు అయినా.. జనాలకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మా సుధీర్ ఎప్పటికీ వెనుకాడడు." అంటూ సుధీర్ చెంపపై ప్రేమగా కొట్టింది. ఈ చర్యకు మొదట అందరూ షాక్ అయినప్పటికీ ఆ తరువాత తేరుకొని చప్పట్లు కొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.  చాలా కాలంగా ఈ జంట ప్రేమలో ఉందంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. యూట్యూబ్ లో అయితే ఈ జంటకు సంబంధించిన ఎప్పటికప్పుడు వీడియోలు క్రియేట్ చేస్తూనే ఉంటారు. తమ రిలేషన్ పై స్పందించిన సుధీర్, రష్మీ... తమ మధ్య నడిచేది వెండితెర కెమిస్ట్రీ తప్ప రియల్ లైఫ్ లో ఎలాంటి లవ్ ట్రాక్ లేదని తేల్చి చెప్పింది. అయినప్పటికీ మళ్లీ మళ్లీ అవే వార్తలు హాట్ టాపిక్ అవుతుండడం చూస్తున్నాం. 

హాట్ స‌మ్మ‌ర్‌లో దివి.. ఇన్‌స్టాగ్రామ్‌ను హీటెక్కిస్తోంది!

  బిగ్ బాస్ సీజన్ 4లో మోస్ట్ బ్యూటిఫుల్ కంటెస్టెంట్ గా ప్రేక్షకులను అలరించింది దివి. తన సొట్టబుగ్గలతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. బిగ్ బాస్ షోతో అమ్మడుకి సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది. చిరంజీవి సైతం త‌న సినిమాలో ఆమెకు ఓ రోల్‌ను ఆఫ‌ర్ చేశారు. మహేష్ బాబు 'మహర్షి' సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన దివి హీరోయిన్‌ గా సెటిల్ అవ్వాలని చూస్తోంది. అందం, అభినయం, ఆకర్షించే రూపం ఉన్న దివి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత తన అందాలకు మెరుగులు దిద్దే పనిలో పడింది. హాట్ ఫోటో షూట్ లలో పాల్గొంటూ వాటిని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తోంది. ఈ ఫోటోలు చూసైనా దర్శకనిర్మాతలు తనకు అవకాశాలు ఇస్తారని ఈ ముద్దుగుమ్మ ఆశపడుతోంది. తాజాగా దివి షేర్ చేసిన ఫోటోలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని బ్లాక్ బ్యాక్ గ్రౌండ్ లో తీసుకున్న ఫోటోలు యూనిక్ గా ఉన్నాయి. దీంతో ఫోటోలు పెట్టిన కాసేపటికే భారీ లైకులు వస్తున్నాయి.  ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు.. 'మేకప్ కాస్త ఎక్కువైంది కానీ చాలా అందంగా ఉన్నావంటూ' కామెంట్స్ చేస్తున్నారు. 'సమ్మర్ కారణంగా బయట హాట్ గా ఉంది.. ఇప్పుడు ఈ ఫోటోలతో మీరు ఇన్స్టాగ్రామ్ లో కూడా హీట్ పెంచుతున్నారంటూ' మరో నెటిజన్ కామెంట్ చేశాడు. మొత్తానికి దివి షేర్ చేసిన ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.