నేటి నుంచే రాఘ‌వేంద్రుడి సీరియ‌ల్‌.. ఎలా ఉండ‌బోతోంది?

  `కార్తీక దీపం` థీమ్‌ని ఫాలో అవుతూ ద‌ర్శకేంద్రుడు కె. రాఘ‌వేంద్రరావు స‌మ‌ర్ప‌ణ‌లో రాబోతున్న స‌రికొత్త ధారావాహిక `కృష్ణ తుల‌సి`. జీ తెలుగులో ఈ నెల 22 నుంచి ఈ సీరియ‌ల్ ప్ర‌సారం కాబోతోంది. ఇందుకు సంబంధించిన ప్రోమో ఆక‌ట్టుకుంటోంది. న‌లుపు వ‌ర్ణంలో వున్న అమ్మాయి శ్యామా.. చీక‌టంటే ప‌డ‌ని అఖిల్ మ‌ధ్య సాగే క‌థ‌గా ఈ సీరియ‌ల్‌ని రూపొందించారు. న‌లుపు రంగులో వుండే శ్యామా అడుగ‌డుగునా అవ‌మానాలు... ఈస‌డింపులు.. ఎదుర్కొంటూ వుంటుంది. అలాంటి అమ్మాయికి అత్యంత ధ‌న‌వంతుల అబ్బాయి అఖిల్‌కి జోడీ ఎలా కుదిరింది.. రెండ‌వ కోడ‌లిగా‌ మిస్ హైద‌రాబాద్‌ని ఇంటికి తెచ్చుకున్న అత్త‌గారు న‌లుపంటేనే భ‌య‌ప‌డే అఖిల్‌కి భార్య‌గా శ్యామాని అంగీక‌రిస్తుందా?.. ఈ వెలుగు నీడ‌ల ప్ర‌యాణంలో శ్యామా క‌థ ఏ తీరం చేర‌బోతోంది అన్న‌దే `కృష్ణ తుల‌సి` క‌థాగ‌మ‌నం. ఇప్ప‌టికే ఈ సీరియ‌ల్ కోసం ప్ర‌చారం మొద‌లుపెట్టిన రాఘ‌వేంద్రుడు ముఖ్యంగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకునే ప‌నిలో భాగంగా గ్రామాల్లోని మ‌హిళా ప్రేక్ష‌కుల‌కు ఇంటింటికి బొట్టు బిళ్ల‌‌ల్ని పంచుతూ ప్ర‌చారం చేయిస్తున్నారు. నేటి (ఫిబ్ర‌వ‌రి 22) నుంచి జీ తెలుగులో సాయంత్రం 6:30 గంట‌ల‌కు ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ రాఘ‌వేంద్రుడి న‌మ్మ‌కాన్ని నిజం చేస్తుందా?  లేదా అన్న‌ది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. 

ముమైత్ ముద్దులు త‌ట్టుకోలేక‌పోయిన అవినాష్‌!

  "ఇప్ప‌టికింకా నా వ‌య‌సు నిండా ప‌ద‌హారే.. చిటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్లే.." అంటూ టాలీవుడ్‌లో సంచ‌ల‌నం సృష్టించింది ముమైత్‌ఖాన్. గ‌త కొంత కాలంగా సినిమాల‌కు దూరంగా వుంటూ వ‌స్తున్న ముమైత్ తాజాగా ఓంకార్ నిర్వ‌హిస్తున్న డ్యాన్స్ షో `డ్యాన్స్ ప్ల‌స్‌`లో న్యాయ నిర్ణేత‌గా ప్ర‌త్య‌క్ష‌మైంది. గ‌త కొన్ని వారాలుగా ఈ షో విజ‌య‌వంతంగా ప్ర‌సార‌మౌతోంది. శ‌నివారం, ఆదివారం రాత్రి 9 గంట‌ల‌కు ప్ర‌సారం అవుతున్న ఈ షోలో టాలెంటెడ్ డ్యాన్స‌ర్స్ త‌మ పెర్ఫార్మెన్స్‌తో అబ్బుర‌ప‌రుస్తున్నారు. ఇదిలా వుంటే ఈ షోకు మ‌రింత ప్ర‌త్యేక‌త‌ని, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ని జోడించ‌డానికి ఓంకార్ క‌మెడియ‌న్ ముక్కు అవినాష్‌ని రంగంలోకి దింపేశాడు. టూ వీక్స్‌కి ఒక‌సారి ఏదో ఒక గెట‌ప్‌తో అవినాష్ `డ్యాన్స్ ప్ల‌స్` స్టేజ్‌పై త‌న‌దైన స్టైల్లో ఎంట‌ర్‌టైన్‌చేస్తూ న‌వ్వులు కురిపిస్తున్నాడు. గ‌త వారం పోస్ట్‌మ‌న్‌గా ఎంట్రీ ఇచ్చిన న‌వ్వుల వ‌ర్షం కురిపించి ముమైత్‌తో ఆడుకుంటే ఈ సారి ముమైత్ .. అవినాష్‌తో ఆడుకోబోతోంది. వ‌య‌సు మ‌ళ్లిన‌ వ్య‌క్తిగా.. పండు ముస‌లి గెట‌ప్‌లో అవినాష్ స్టేజ్‌పై కొచ్చాడు. ముమైత్ నుంచి ఓ ముద్దు కావాలంటూ సైగ చేశాడు. ముమైత్ దొరికిందే అవ‌కాశం అనుకుని అవినాష్‌ని ముద్దుల్లో ముంచెత్తింది.. ఎంత‌లా అంటే ఊపిరాడక అవినాష్ ఫ్లోర్‌పై ప‌డి దొర్లేంత‌!.. వ‌చ్చే వారం ప్ర‌సారం కానున్న ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో నెట్టింట సంద‌డి చేస్తోంది. 

వంట‌ల‌క్క ప్రేమిపై నిరుప‌మ్ ఫేస్‌బుక్ సెటైర్‌!

  స్టార్ మాలో ప్ర‌సారం అవుతున్న పాపుల‌ర్ సీరియ‌ల్ `కార్తీక దీపం`. న‌టుడు, ర‌చ‌యిత ప‌రిటాల ఓంకార్ త‌న‌యుడు ప‌రిటాల నిరుప‌మ్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ సీరియ‌ల్ ఉభ‌య తెలుగు రాష్ట్రాల మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. దీపగా వంట‌ల‌క్క పాత్ర‌లో ప్రేమి విశ్వ‌నాథ్ ఈ సీరియ‌ల్‌తో స్టార్ స్టేట‌స్‌ని సొంతం చేసుకుని సెల‌బ్రిటీగా మారిపోయింది. ఎంత‌గా అంటే ఈమె ప్ర‌ధాన పాత్ర‌లో సినిమా స్టార్ట్ చేసేంత‌. ప్రేమి విశ్వ‌నాథ్ త్వ‌ర‌లో సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. ఇంత‌లా మ‌హిళా మ‌ణుల ఆద‌ర‌ణ చూర‌గొన్న ప్రేమి విశ్వ‌నాథ్‌పై డాక్ట‌ర్ బాబు.. నిరుప‌మ్ ఫేస్ బుక్ వేదిక‌గా సెటైర్ వేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. శ‌నివారం త‌న ఫేస్‌బుక్ పేజీలో దీప అలియాస్ ప్రేమి విశ్వ‌నాథ్ తీసిన త‌న ఫొటోని షేర్ చేసి ప్రేమి విశ్వ‌నాథ్ పై సెటైర్ వేయ‌డం వైర‌ల్‌గా మారింది. వంట‌ల‌క్క చేసిన వంట ఎలా వుంటుందో ఐడియా లేదు కానీ.. తీసిన ఫొటోలు మాత్రం బానే వుంటాయి. (వంద‌లో ఒక‌టి రాక చ‌స్తుందా)` అంటూ సెటైర్ వేసి క‌న్ను కొడుతున్న‌ ఎమోజీని షేర్ చేస్తూ ప్రేమి విశ్వ‌నాథ్‌కు ట్యాగ్ చేశాడు నిరుప‌మ్‌. మ‌రి ఈ సెటైర్‌పై వంట‌ల‌క్క ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

ఇంకొక‌రితో డేట్‌కి వెళ్తే నా బాయ్‌ఫ్రెండ్ ఫీల‌వుతాడు!

  అందాల యాంక‌ర్‌, బుల్లితెర బుట్ట‌బొమ్మ శ్రీ‌ముఖికి బాయ్ ప్రెండ్ వున్నాడంటూ గ‌త కొంత కాలంగా వార్త‌లు షికారు చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే అలాంటి వార్త‌లు పుట్టుకొచ్చిన ప్ర‌తీసారి వాటిని లైట్‌గా తీసుకుంటూ  కొట్టి పారేస్టూ వ‌స్తోందామె. ఇటీవ‌ల కూడా శ్రీ‌ముఖి ప్రేమ‌లో వుంద‌ని, గ‌త కొంత కాలంగా డేటింగ్ చేస్తోందంటూ వార్త‌లు షికారు చేశాయి. అయితే తాజాగా మాత్రం త‌ను ప్రేమ‌లో వున్నాన‌ని, త‌న‌కూ ఓ ల‌వ‌రున్నాడ‌ని చెప్పేసి శ్రీ‌ముఖి షాకిచ్చింది. సుమ క‌న‌కాల యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న 'స్టార్ట్ మ్యూజిక్'‌ షోలో ప్ర‌త్యేకంగా పాల్గొన్న శ్రీ‌ముఖి త‌న ల‌వ్ గురించి ఓపెన్ అయిపోయింది. షోలో భాగంగా ఇక్క‌‌డ క‌నిపిస్తున్న వారిలో ఏ హీరో అంటే ఇష్ట‌మంటూ త‌న‌ని ఇరికించే ప్ర‌య‌త్నం చేసింది సుమ‌. అయితే శ్రీ‌ముఖి తెలివిగా త‌న‌కు మెగాస్టార్ చిరంజీవి అంటే ఇష్ట‌మ‌ని ట‌క్కున చెప్పేసింది. ఒక వేళ రొమాంటిక్ డేట్‌కి వెళ్లాల్సి వ‌స్తే ఎవ‌రితో డేట్‌కి వెళ‌తావ‌ని సుమ అడిగితే తాను ఎవ‌రితోనూ డేట్‌కి వెళ్ల‌న‌ని, అల్రెడీ క‌మిటెడ్ అని, నేను డేట్‌కి వెళితే నా బాయ్ ఫ్రెండ్ ఫీల‌వుతాడు, నా కంటూ కొన్ని నియ‌మాలున్నాయ‌‌ని షాకిచ్చింది. దీంతో సుమ‌తో పాటు అక్క‌డున్న విష్ణుప్రియ‌, రోల్ రైడా, హ‌రి, పండు, ఆర్జే చైతూ షాక్‌తో నోరెళ్ల‌బెట్టారు. ఇంత‌కీ ఆ బాయ్‌ఫ్రెండ్ ఎవ‌ర‌నేది మాత్రం శ్రీ‌ముఖి వెల్ల‌డించ‌లేదు. అత‌ను ఎవ‌ర‌బ్బా..!

రియ‌ల్ లైఫ్‌లో 'కార్తీక దీపం' మోనిత ఎవ‌రో తెలుసా?

  స్టార్‌ మాలో ప్రసారం అవుతున్న పాపుల‌ర్ సీరియ‌ల్ 'కార్తీక దీపం'. నిరుప‌మ్, ప్రేమి విశ్వ‌నాథ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. వంట‌ల‌క్క‌గా దీప పాత్ర‌లో న‌టించిన  ప్రేమి విశ్వ‌నాథ్ బుల్లితెర‌పై స్టార్ సెల‌బ్రిటీగా మారిపోయింది. ఇదే సీరియ‌ల్‌లో దీపని అష్ట‌క‌ష్టాలు పెడుతూ డాక్ట‌ర్ బాబును త‌న సొంతం చేసుకోవ‌డానికి శ‌క్తివంచ‌న లేకుండా ప్ర‌య‌త్నించే మోనిత పాత్ర కూడా పాపులారిటీ ద‌క్కించుకుంది. అయితే ఈ మోనిత ఎవ‌ర‌న్న‌ది ఇప్పుడు టెలివిజ‌న్ ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఈ సీరియ‌ల్‌లో మోనిత‌గా న‌టిస్తున్న న‌టి పేరు శోభా శెట్టి. బెంగ‌ళూరులోని ఒక తుళు ఫ్యామిలీలో పుట్టిన శోభా శెట్టి తెలుగు సీరియ‌ల్ 'కార్తీక దీపం'తోటే వెలుగులోకి వ‌చ్చింది. మంచి పాపులారిటీని ద‌క్కించుకుంది. క‌న్న‌డ‌, తుళు, తెలుగు ఇండ‌స్ట్రీల్లో ప‌ని చేసింది. 2013లో న‌టిగా క‌న్న‌డ క‌ల‌ర్స్ టీవీలో ప్ర‌సార‌మైన 'అగ్ని సాక్షి' సీరియ‌ల్‌తో కెరీర్‌ని ప్రారంభించింది శోభ‌. 2017లో పునీత్ రాజ్‌కుమార్, ర‌ష్మిక మంద‌న్న జంట‌గా న‌టించిన 'అంజ‌నీ పుత్ర‌' సినిమాతో వెండితెర‌కు సైతం ప‌రిచ‌య‌మైంది. టిక్ టాక్ వీడియోల‌తోనూ పాపులారిటీని ద‌క్కించుకున్న మోనిత అలియాస్ శోభా శెట్టి ప్ర‌స్తుతం 'కార్తీక దీపం', 'లాహిరి లాహిరి లాహిరిలో' వంటి సీరియ‌ల్స్‌లో న‌టిస్తోంది.   

శ్రీ‌ముఖికి సుమ సీరియ‌స్ వార్నింగ్‌‌!

  పాపుల‌ర్ యాంక‌ర్ సుమ క్రేజీ హాట్ యాంక‌ర్ శ్రీ‌‌ముఖికి క‌బ‌ర్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. "క‌న‌కాల కంచుకోట‌లోకి వ‌చ్చిన వాళ్ల‌కి క‌బ‌ర్దార్.. నేను మూడు లెక్కెట్టే లోపు ఎవ‌రికి వాళ్లు వాళ్ల స్థానంలో వుండాలి... మొత్తం సెట్ట‌వ్వాలి" అంటూ వార్నింగ్ ఇచ్చేసింది. దీంతో శ్రీ‌ముఖి బిత్త‌ర చూపులు చూస్తూ సుమ‌తో క‌లిసి కౌంట్ డౌన్ లెక్కిస్తూ 3 అనే స‌రికి గ‌ట్టిగా సుమ‌ని కౌగ‌లించుకుని న‌వ్వేసింది. వివ‌రాల్లోకి వెళితే... సుమ క‌న‌కాల స్టార్ మాలో 'స్టార్ట్ మ్యూజిక్'` పేరుతో ఓ స‌ర‌దా షోని ప్రారంభించారు. దీనికి సుమ యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ సండే ప్ర‌సారం కానున్న ఎపిసోడ్ కోసం ఈ షోకి శ్రీ‌ముఖి, విష్ణుప్రియ‌, రోల్ రైడా, ఆర్జే చైతూ, హ‌రి, పండు హాజ‌ర‌య్యారు. ఇందులో భాగంగా  "సో.. నా షోకు నేనొచ్చేశాను కాబ‌ట్టి ఇంకెందుకు లేటు.. షో మొద‌లెడ‌దామా" అంటూ శ్రీ‌ముఖి అన‌డంతో స్టేజ్‌పై ఒక్క‌సారి ఉరుములు మెరుపు‌లు మొద‌ల‌య్యాయి. క‌ట్ చేస్తే.. మోయ‌లేని గ‌ద‌ని ఈడ్చుకుంటూ, ముఖం చిట్లించుకుంటూ కేజీఎఫ్ ఆర్ ఆర్‌తో సుమ  సీరియ‌స్‌గా రావ‌డం.. శ్రీ‌ముఖికి వార్నింగ్ ఇవ్వ‌డం టీవీ వీక్ష‌కుల‌కు ఆస‌క్తి రేకెత్తిస్తోంది. దీనికి సంబంధించిన ప్రోమో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది. ఈ ఎపిసోడ్ వ‌చ్చే సండే 12 గంట‌ల‌కు ప్ర‌‌సారం కానుంది. 

ఫ్రెండ్ ఇంట్లో ఉరేసుకున్న 25 ఏళ్ల టీవీ యాక్ట‌ర్!

  శుక్ర‌వారం ఇందిరా కుమార్ అనే టెలివిజ‌న్ యాక్ట‌ర్ మృతి చెందాడు. అత‌ని వ‌య‌సు కేవ‌లం 25 సంవ‌త్స‌రాలు. త‌మిళ సీరియ‌ల్స్‌లో న‌టిస్తున్న అత‌ను చెన్నైలోని త‌న ఫ్రెండ్ నివాసంలో ఉరివేసుకొని ఉండ‌గా క‌నుగొన్నారు. అందిన స‌మాచారం మేర‌కు, త‌న ఫ్రెండ్‌ను క‌లుసుకోవ‌డానికి అత‌ని ఇంటికి వ‌చ్చిన ఇందిరా కుమార్‌, మ‌రుస‌టి రోజు పొద్దున్నే ఉరేసుకుని క‌నిపించాడు. ఆందోళ‌న‌కు గురైన అత‌ని ఫ్రెండ్, వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించాడు. ఇన్వెస్టిగేష‌న్ ప్రారంభించిన పోలీసులు మృత‌దేహాన్ని పోస్ట్‌మార్ట‌మ్‌కు త‌ర‌లించారు. రిపోర్టుల ప్ర‌కారం, ఇందిరా కుమార్ మృతికి కార‌ణాలు వెల్ల‌డి కాలేదు. సూసైట్ నోట్ లాంటిదేమీ పోలీసుల‌కు ల‌భించ‌లేదు. ఆశించిన అవ‌కాశాలు రాక‌పోతుండ‌టంతో అత‌ను మాన‌సికంగా ఇబ్బందులు ప‌డుతున్న‌ట్లు త‌మిళ టీవీ రంగంలో చెప్పుకుంటున్నారు. అత‌ను శ్రీ‌లంకకు చెందిన త‌మిళుడు. కొన్ని పాపుల‌ర్ త‌మిళ సీరియ‌ల్స్‌లో న‌టించాడు. అత‌నికి భార్య‌, ప‌సివాడైన కుమారుడు ఉన్నారు. చెన్నైలోని శ‌ర‌ణార్ధి శిబిరంలో ఉంటున్నాడు. ధ‌నుష్ సినిమా 'తూటా'లో న‌టించాడు.

దీప ప్లాన్ తెలిసి బిత్త‌ర‌పోయిన డాక్ట‌ర్ బాబు!

`కార్తీక దీపం` రోజుకో మ‌లుపు తిరుగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఈ శ‌నివారం 968వ ఎపిసోడ్ ప్ర‌సారం కాబోతోంది. ఈ ఎపిసోడ్‌లో ఊహించ‌ని ట్విస్ట్‌లు.. ట‌ర్న్‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. హిమ‌ని డాక్ట‌ర్ బాబు త‌న వ‌ద్ద‌కు చేర్చాల‌ని ప్లాన్ వేసిన మోనిత ఈ విష‌యంపై లాయ‌ర్ సుజాత‌ని రంగంలోకి దింపుతుంది. ఇందు కోసం ఆమెకి 2 ల‌క్ష‌లు ఫీజు కింద ఇచ్చేస్తుంది. అయితే ఇంత జ‌రుగుతున్నా దీప (వంట‌ల‌క్క) మాత్రం ఆత్మ‌విశ్వాసంతో ముంద‌డుగు వేస్తుంటుంది. కార‌ణం ఏంట‌ని సౌంద‌ర్య‌తో పాటు మామ ఆనంద‌రావు ఆరాతీస్తే కోర్టు త‌న‌కే అనుకూలంగా తీర్పు చెబుతుంద‌ని లేదంటే పిల్ల‌కు మీకు ఉన్న సంబంధం ఏంటో నిరూపించుకోండ‌ని జ‌డ్జి డాక్ట‌ర్ బాబుని అడుగుతార‌ని, అదీ లేదంటే భార్య‌నీ, పిల్ల‌ల‌నీ ఇంటికి తీసుకెళ్లి బుద్దిగా కాపురం చేసుకోమ‌ని హెచ్చ‌రిస్తార‌ని దీప వివ‌రంగా ఎక్స్‌‌ప్లేయిన్ చేస్తుంది. శుక్ర‌వారం దీప వివ‌రిస్తున్న తీరుని చాటు నుంచి చూసిన డాక్ట‌ర్ బాబుకి ఫీజులెగిరిపోతాయి. షాక్‌కు గురైన డాక్ట‌ర్ బాబు అక్క‌డి నుంచి మోనిత ఇంటికి వెళ‌తాడు. క‌ట్ చేస్తే మోనిత లాయ‌ర్ సుజాత‌కు ఫోన్ చేసి దీప గురించి, కోర్టు కేసు గురించి మాట్లాడుతుంటుంది. అక్క‌డికి చేరుకున్న డాక్ట‌ర్ బాబు వెంట‌నే మోనిత ఫోన్ లాక్కుని `హాలో నేను కార్తీక్‌ని.. మీరా చెప్పండి.. అంటుంది లాయ‌ర్ సుజాత‌. టెన్ష‌న్ ప‌డ‌కండి. ఆ దీప కేసు గెలిచే ఛాన్సేలేదు` అంటుంది.. అల్రెడీ గెలిచింది. మీరు వాదించ‌డానికి ఏమీ లేదు. మీ క‌న్నా నాలుగు ఆకుటు ఎక్కువే చ‌దివింది నా పెళ్లాం. ఏం అయ్యింది అని సుజాత అడుగుతుంది. కోర్టుకు వెళ్ల‌కుండానే ఈ కేసు గెలిచేసింది. కోర్టుకు వెళ్ల‌కుండానే కేసు క్లోజ్ అయ్యింది. కేసు వెన‌క్కి తీసుకుంటున్నాను... సీన్ క‌ట్ చేస్తే తుల‌సి బ్యాగ్ స‌ర్దుకుంటూ ఫోన్ మాట్లాడుతుంటుంది.. ఇంత‌లో అక్క‌డికి మోనిత ఎంట‌రై నేను సాయం చేస్తానుగా అంటుంది. అవ‌స‌రం లేదు. తోడేలు తోడేస్తానంటే లేడి పిల్ల‌లా నీ వెంట‌రావ‌డానికి నేనేమీ దీప లాంటి పిల్ల‌ని కాదు..తుల‌సిని అంటూ మోనితని ఇరిటేట్ చేస్తుండ‌గానే సీన్‌లోకి దీప ఎంట‌ర‌వుతుంది.. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. మోనిత‌.. దీప‌ల మ‌ధ్య ఎలాంటి చర్చ జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే శ‌నివారం ఎపిసోడ్ చూడాల్సిందే.

స్టేజ్‌పైనే తన్మ‌య‌త్వంలో మునిగిన‌ వ‌రుణ్‌, వితిక‌!

  'హ్యాపీ డేస్'` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో వ‌రుణ్ సందేశ్‌‌. తొలి చిత్రంతో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న వ‌రుణ్ ఆ త‌రువాత త‌న‌తో క‌లిసి న‌టించిన హీరోయిన్ వితికా షేరుని ప్రేమించి పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల ఈ జోడీ బిగ్‌బాస్ సీజ‌న్ 3లోనూ మెరిసి సంద‌డి చేశారు. తాజాగా వీరిద్ద‌రూ క‌లిసి టీవీలో షో స్టేజ్‌పై మైమ‌రిచి ఊహ‌ల్లో తేలిపోయారు. జీ తెలుగు ఛాన‌ల్ లో సుమ‌, ర‌వి వ్యాఖ్యాత‌లుగా 'బిగ్ సెల‌బ్రిటీ ఛాలెంజ్‌'ని మ‌ళ్లీ రీ స్టార్ట్ చేశారు. ఈ షోకి గెస్ట్‌లుగా విచ్చేసిన హీరో వ‌రుణ్‌  సందేష్ ‌, వితిక షేరు స్టేజ్ పై సుమ‌, యాంక‌ర్ ర‌వి, చుట్టూ ఆడియ‌న్స్ వుండ‌గా "నేను నేనుగా లేనే.. నిన్న‌మొన్న‌లా.." అంటూ సాగే రొమాంటిక్ సాంగ్‌కి స్టెప్పులేసి మైమ‌రిచిపోయారు. అక్క‌డ ఎవ‌రున్నార‌న్న విష‌యాన్ని కూడా మ‌రిచిపోయి త‌న్మ‌య‌త్వంలో మునిగిపోయారు. సుమ త‌న త‌ర‌హా పంచ్‌ల‌తో న‌వ్వులు పూయించిన ఈ ఎసిసోడ్ ఈ ఆదివారం రాత్రి 9 గంట‌ల‌కు ప్ర‌సారం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట సంద‌డి చేస్తోంది. బ్లాక్ అండ్ బ్లాక్ కాంబినేష‌న్ డ్రెస్‌లో వితికా షేరు, వ‌రుణ్ సందేశ్‌ చేసిన హంగామా చూడాలంటే ఆదివారం రాత్రి ఈ ఎపిసోడ్ చూడాల్సిందే. 

బుల్లితెర‌పై హీరో త‌ల్లిగా రాశి!

  వెండితెర‌పై క‌థానాయిక‌లుగా ఆక‌ట్టుకున్న వారితో పాటు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌లుగా పేరు తెచ్చుకున్న వారు చాలా వ‌ర‌కు బుల్లితెర‌ని ఆశ్ర‌యిస్తున్నారు. వెండితెర‌పై అవ‌కాశాలు త‌గ్గ‌డంతో బుల్లితెర‌ని న‌మ్ముకుంటున్నారు. తాజాగా ఈ జాబితాలో ఒక‌నాటి హీరోయిన్ రాశి, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ రాజా ర‌వీంద్ర చేరుతున్నారు. వీరిద్ద‌రూ క‌లిసి స్టార్ మా కోసం 'జాన‌కి క‌ల‌గ‌న లేదు' అనే పేరుతో రూపొందిన డైలీ సీరియ‌ల్‌లో బుల్లితెర ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఇందులో 'సిరిసిరి మువ్వ‌లు' ఫేమ్ వంశీ ఆలూర్‌, 'మౌన‌రాగం' ఫేమ్ అమ్ములు పాత్ర ధారి ప్రియాంక జైన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ప్ర‌ధాన పాత్ర‌ధారి వంశీ ఆలూరుకి రాశీ త‌ల్లిగా న‌టిస్తుండ‌గా, రాజా ర‌వీంద్ర మ‌రో కీల‌క పాత్ర‌ధారి ప్రియాంక జైన్‌కు తండ్రిగా క‌నిపించ‌బోతున్నారు. రెండు క‌ల‌ల మ‌ధ్య రెండు జీవితాలు ఒకే గూటికి చేర‌బోతున్నాయా అంటూ రిలీజ్ చేసిన ఈ సీరియ‌ల్ ప్రోమో ఆక‌ట్టుకుంటోంది. "జాన‌కి ఎంత చ‌దివినా అంత‌కంటే ఎక్కువ చ‌దివిన వాడినే తీసుకొస్తాన‌"ని తండ్రి పాత్ర‌లో రాజా ర‌వీంద్ర చెబుతున్న డైలాగ్‌ల‌తో పాటు "మంచిది తెలివైంది అయితే ఫ‌ర‌వాలేదు. కానీ మావాడిక‌న్నా ఎక్కువ చ‌దివేసి పొగ‌రుగా వుంటే మాత్రం క‌ష్టం.. నా కోడ‌లు ఏడో ఎనిమిదో చ‌దివితే చాలు".. అని రాశి చెబుతున్న తీరు భిన్న మ‌న‌స్థ‌త్వాలు.. భిన్న నేప‌థ్యాలు క‌లిగిన ఇద్ద‌రు యువ‌తీ యువ‌కుల క‌థ‌గా 'జాన‌కి క‌ల‌గ‌న లేదు' సీరియ‌ల్ వుండ‌బోతోంద‌ని తెలుస్తోంది.

మోనితని టెన్ష‌న్ పెడుతున్న తుల‌సి!

డైలీ సీరియల్ `కార్తీక్ దీపం` క్లైమాక్స్‌కి వ‌చ్చేసిందా? అనే లోపు ర‌స‌వ‌త్త‌ర మ‌లుపులు, ట్విస్టుల‌తో షాకిస్తోంది. విహారి కార‌ణంగా డాక్ట‌ర్ బాబు, దీప‌ల మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు పెర‌గ‌డం.. దీప‌ని త‌న ఇంటి నుంచి డాక్ట‌ర్ బాబు వెలివేయ‌డం.. ఇద్ద‌రు పిల్ల‌లో పెద్ద పాప శౌర్య‌తో వంట‌ల‌క్క‌గా జీవితాన్ని దీప సాగించ‌డం.. మ‌రో పాప హిమ‌ని సౌంద‌ర్య త‌న త‌న‌యుడు డాక్ట‌ర్ బాబు చెంత‌కు చేర్చ‌డం తెలిసిందే. అయితే ఈ మొత్తం క‌థ గాడి త‌ప్ప‌డానికి.. దీప - డాక్ట‌ర్ బాబు విడిపోవ‌డానికి కార‌ణంగా విహారి. అయితే అత‌న్ని అడ్డుపెట్టుకుని గేమ్ ఆడిన మోనిత త‌న ప్లాన్‌తో దీప - డాక్ట‌ర్ బాబుని శాశ్వ‌తంగా విడ‌గొట్టాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తూ వ‌స్తోంది. ఇదిలా వుంటే విహారి భార్య తుల‌సికి విహారి సంసార జీవితానికి ప‌నికిరాడ‌న్న నిజం తెలుస్తుంది. ఆ నిజం చెప్పేసి దీప - డాక్ట‌ర్ బాబుల మ‌ధ్య అపార్థాల్ని తొల‌గించాల‌ని ప్ర‌య‌త్నిస్తుంది. ఇందులో భాగంగా దీప‌ని క‌లిసి విష‌యం చెప్పాల‌ని ఇంటికి వెళుతుంది. కానీ ఇంట్లో దీపి లేక‌పోవ‌డం, అక్క‌డే దీప తండ్రి వుండ‌టంతో అస‌లు విష‌యం చెప్ప‌క దీప‌ని త‌ను క‌ల‌వ మ‌న్నాన‌ని చెప్పి వెళ్లిపోతుంది. ఇంత‌లో తుల‌సి గురించి మోనిత టెన్ష‌న్ ప‌డుతూ వుంటుంది. విహారి వ‌ల్ల తుల‌సికి ప‌ల్లలు పుట్టే అవ‌కాశం లేద‌ని కార్తీక్‌కి తెలిస్తే ఇంకేమైనా వుందా?.. కార్తీక్ అనుమానంతో ఎంక్వైరీ మొద‌లుపెడితే .. డొంకంతా క‌దులుతుంది. దీని వెన‌కుంది నేనేన‌ని తెలుస్తుంది. అప్పుడు కార్తీక్ నేను ఎన్ని అబ‌ద్ధాలు చెప్పినా న‌మ్మ‌డు. ఇప్పుడు ఏం చెయ్యాలి. దీప తుల‌సిని క‌లిసినా డేంజ‌రే.. విష‌యం తెలిస్తే దీప ఊరుకోదు.. సౌంద‌ర్య‌కు చెప్పేస్తుంది. ఆ త‌రువాత కార్తీక్‌కి తెలుస్తుంది. అంతా ఒక్క‌టైపోతారు నో.. అలా జ‌ర‌గ‌డానికి వీళ్లేదు` అని శుక్ర‌వారం ఎపిసోడ్‌లో మోనిత కంగారు ప‌డుతూ వుంటుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది?  కార్తీక్‌కి అస‌లు విష‌యం తెలిసిందా.. రేప‌టి ఎపిసోడ్‌కి సాగ‌దీశారా అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

చిన్న‌త‌నంలో హేమ రౌడీనా?

క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ హేమ ఇటీవ‌ల వ‌రుస‌గా వార్త‌ల్లో నిలుస్తున్నారు. గ‌తంలో `మా` ఎల‌క్ష‌న్‌ల‌లో మెంబ‌ర్‌గా గెలిచి ప్ర‌మాణ స్వీకారం రోజు త‌న‌ని మాట్లాడ‌నివ్వ‌ని `మా` అధ్య‌క్షుడు న‌రేష్‌నే మీడియా సాక్షిగా క‌డిగిపారేసి వార్త‌ల్లో నిలిచారు. ప్ర‌మాణ స్వీకారానికి ముందే మ‌మ్మ‌ల్ని మాట్లాడ‌నివ్వ‌కుండా మైక్ లాగేసుకుంటున్నారంటూ బాహాటంగానే న‌రేష్‌ని నిల‌దీసినంత ప‌ని చేశారు. ఇదిలా వుంటే ఆమెని న‌టుడు ఆలీ "చిన్న‌త‌నంలో రౌడీ అంట‌గా!" అంటూ సంబోధించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.   ఈ టీవీలో ఆలీ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న`ఆలీతో స‌రదాగా` కార్య‌క్ర‌మంలో హేమ‌, న‌టి శ్రీ‌ల‌క్ష్మిఅతిథులుగా వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా హేమ‌, శ్రీ‌ల‌క్ష్మీ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని ఆలీతో పంచుకున్నారు. ఈ క్ర‌మంలో "చిన్న‌త‌నంలో హేమ పెద్ద రౌడీ అంట‌ క‌దా?" అని ప్రశ్నించారు. దీనికి హేమ ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు. "అలా ఏమీ కాదు కానీ ఇంట్లో అంద‌రికంటే నేను చిన్న‌దాన్ని.. అక్క‌ల‌తో క‌లిసి జాత‌ర‌ల‌కు, అంర్వేది తీర్థాల‌కు వెళుతుండేదాన్ని. అక్క‌డికి ఎంతో మంది జ‌నం వ‌చ్చేవారు. ఎవ‌రైనా మాతో వెకిలి వేషాలు వేస్తే అక్క‌డే కొట్టేసేదాన్ని. అలా ఒక‌బ్బాయిని కొడితే త‌ల బొప్పిక‌ట్టింది. అప్ప‌ట్లో నా చేతికి ఇనుప‌గాజులు వుండేవి. నేను ప్ర‌తీసారి గాజులు ప‌గ‌ల‌గొట్టుకుంటున్నాన‌ని అమ్మే ఇన‌ప‌గాజులు వేసేది" అని హేమ చిన్ననాటి సంగ‌తుల్ని పంచుకున్నారు. hema shares her personal life, hema in Alitho Saradaga,Alitho Saradaga,Sri Lakshmi,Hema 

ఈల వేసి రచ్చ చేస్తున్న ర‌ష్మీ గౌత‌మ్

బుల్లితెర యాంక‌ర్స్ సందు దొరికితే చాలు అదిరిపోయే పెర్ఫార్మెన్స్‌తో టాపు లేపేస్తున్నారు. త‌మ టాలెంట్‌ని పూర్తి స్థాయిలో ప్ర‌ద‌ర్శించే స్టేజీ ల‌భిస్తే చాలు ఓ రేంజ్‌లో అద‌రిగొట్టేస్తున్నారు. స‌రిగ్గా బుల్లితెర అందాల బొమ్మ ర‌ష్మీ గౌత‌మ్ అదే ప‌ని చేసింది. త‌న డ్యాన్స్ టాలెంట్‌ని బ‌య‌ట‌పెట్టే అవ‌కాశం రాగానే పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసేసుకుంది. ఈల వేసి గోల చేసింది. అదిరిపోయే స్టెప్పుల‌తో ఓ రేంజ్‌లో అల్లాడించింది. `నా అందాల చూసీ కుర్రాళ్లు టెమ్ట్ అయితే నా త‌ప్పు ఏమున్న‌దబ్బా అంటూ క‌న్ను గీటి అదిరిపోయే మాస్ స్టెప్పుల‌తో ర‌చ్చ చేసింది. గులాబీ క‌ల‌ర్ డ్రెస్‌లో అందాలు ఆర‌బోస్తూ ర‌ష్మీ గౌత‌మ్ చేసిన ర‌చ్చ నెట్టింట, యూట్యూబ్‌లో సంద‌డి చేస్తోంది. `స్టార్ మా`లో 6 రియ‌ల్ క‌పుల్స్‌, 6 రీల్ క‌పుల్స్‌లో `100% ల‌వ్‌` పేరుతో ఓ ఎంట‌ర్‌టైనింగ్ షోని ప్రారంభించ‌బోతున్నారు.   ఈ నెల 21న ప్రారంభిం కానున్న ఈ షోకు యాంక‌ర్ ర‌వి, వ‌ర్షిణి సౌంద‌ర‌రాజ‌న్ వ్యాఖ్య‌త‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ షోలో `నా త‌ప్పు ఏమున్న‌ద‌బ్బా..` అనే పెప్పీ మాస్ ఐట‌మ్ నంబ‌ర్‌కు ర‌ష్మీ గౌత‌మ్ వీర లెవెల్లో ప‌క్కా మాస్ పెర్ఫార్మెన్స్‌తో అద‌ర‌గొట్టేసింది. దీనికి సంబంధించిన ప్రోమో స్టార్ మా అఫీష‌య‌ల్ ట్విట్ట‌ర్ పేజీలో సంద‌డి చేస్తోంది. ర‌ష్మీ గౌత‌మ్ అభిమానుల‌కు ఈ సాంగ్ ఓ పండ‌గే.. అంత‌లా ర‌ష్మీ ఈ పాట‌లో అందాలు ఆర‌బోసి ఊర మాస్ స్టెప్పుల‌తో విజిల్స్ వేస్తూ ర‌చ్చ చేసింది.

ముగ్గురు భార్య‌ల మ‌ధ్య ఇరుక్కుపోయిన అవినాష్!

  బిగ్‌బాస్ సీజ‌న్ 4తో ముక్కు అవినాష్ ద‌శ తిరిగిపోయింది. అంత‌కు ముందు జ‌బ‌ర్ద‌స్త్ టీమ్ అత‌న్ని బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట‌రైతే షో నుంచి వెలివేస్తామ‌ని బెదిరించ‌డంతో అవినాష్ చాలా సందర్భాల్లో క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. అత‌ని ప‌రిస్థితిని గ‌మ‌నించిన స్టార్ మా ఏడాది పాటు త‌మ ఛాన‌ల్‌లో కామెడీ షో చేయాల్సిందిగా అత‌నికి ఆఫ‌ర్ ఇచ్చి అగ్రిమెంట్ చేయించుకుంది. ఆ అగ్రిమెంట్ ప్ర‌కారమే 'కామెడీ స్టార్స్‌' షోని ఓంకార్ చేత స్టార్ట్ చేయించింది. ఈ షోలో ముక్కు అవినాష్ టీమ్‌, చ‌మ్మ‌క్ చంద్ర‌తో పాటు మ‌రో టీమ్ కూడా పాల్గొంటూ హాస్యాన్ని పండిస్తోంది. ఇదిలా వుంటే ఈ షోలో భాగంగా గ‌త వారం ముక్కు అవినాష్ భార్య‌గా, గ‌య్యాళి వ‌దిన‌గా అరియానా గ్లోరీ  క‌లిసి ర‌చ్చ చేసింది. వ‌చ్చే ఆదివారం అవినాష్ ముగ్గురు ముద్ద గుమ్మ‌లు అషురెడ్డి, జోర్దార్‌ సుజాత‌, సిరి హ‌న్మంత్‌ల‌తో క‌లిసి ర‌చ్చ చేయ‌బోతున్నాడు. ఆదివారం మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల‌కు ప్ర‌సారం కానున్న ఈ షోలో అవినాష్ ముగ్గురు పెళ్లాల‌తో తిప్ప‌లు అనే స్కిట్‌ని చేశాడు. ఇందులో అవినాష్ ముగ్గురు భార్య‌లుగా అషురెడ్డి, జోర్దార్ సుజాత‌, సిరి హ‌న్మంత్ లు న‌టిస్తున్నారు. మొద‌ట విడివిడిగా ఒక్కొక్క‌రితో ఆడుతూ పాడుతూ హాయిగా క‌నిపించిన అవినాష్‌, ఆ త‌ర్వాత ఒక పెళ్లికి ఒక భార్య‌తో క‌లిసి వెళ్తే, అక్క‌డ మిగ‌తా ఇద్ద‌రు భార్య‌లూ రావ‌డంతో ఎలా బిక్క‌చ‌చ్చిపోయాడు, వారి నుంచి త‌ప్పించుకోడానికి ఎలాంటి వేషాలు వేశాడ‌నేది చూచాయ‌గా చూపించిన‌ ప్రోమో ప్ర‌స్తుతం న‌వ్వులు పూయిస్తోంది. ఇక ఫుల్ ఎపిసోడ్ చూస్తే.. ఇంకెన్ని న‌వ్వులు పండుతాయో!

పాట‌ల‌క్క కోసం ద‌ర్శ‌కేంద్రుడి కొత్త స్కీమ్‌!

  స్టార్ మాలో 'కార్తీక దీపం' సీరియ‌ల్ ఎంత పాపుల‌ర్ అయిందో అంద‌రికి తెలిసిందే. గ‌త కొన్ని వారాలుగా ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్‌కి మ‌హిళా ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఇందులో వంటల‌క్క‌గా దీప పాత్ర‌లో న‌టించిన ప్రేమి విశ్వ‌నాథ్‌ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ సీరియ‌ల్ కార‌ణంగా ఈమె స్టార్ సెల‌బ్రిటీగా మారిపోయింది. ఈ సీరి‌య‌ల్ థీమ్‌ని వాడుకుంటూ వంట‌ల‌క్క త‌ర‌హాలో పాట‌ల‌క్క పాత్ర‌ని డిజైన్ చేశారు ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు. ఆయ‌న నిర్మిస్తున్న తాజా సీరియ‌ల్ 'కృష్ణ తుల‌సి'. జీటీవీలో ఈ సీరి‌య‌ల్ ఈ నెల 22 నుంచి ప్ర‌సారం కాబోతోంది. ఈ సీరియ‌ల్ ప‌బ్లిసిటీ కోసం పాపుల‌ర్ టీవీ న‌టీమ‌ణుల్ని రంగంలోకి దింపిన రాఘ‌వేంద్రరావు కొత్త స్కీమ్‌ని ఈ సీరియ‌ల్ కోసం మొద‌లుపెట్టారు. కృష్ణ తుల‌సి మొక్క‌ల పంప‌ణీ ప్రారంభించిన రాఘ‌వేంద్రుడు కొత్త‌గా బొట్టుబిళ్ల‌ల‌ స్కీమ్‌ని ప్రారంభించారు. ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో బొట్టుబిళ్ల‌ల్ని ఈ సీరియ‌ల్ ప్ర‌మోష‌న్ కోసం పంపిణీ చేస్తున్నారు. మ‌రి రాఘ‌వేంద్రుడి బొట్టుబిళ్ల‌ల‌ స్కీమ్ ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తుందో చూడాలి. 22న మొద‌ల‌య్యే ఈ ధారావాహిక సోమ‌వారం నుంచి శ‌నివారం వ‌ర‌కు సాయంత్రం 6:30 గంట‌ల‌కు జీ తెలుగులో ప్ర‌సారం కాబోతోంది. 

దారి త‌ప్పుతున్న ఆర్య‌వ‌ర్ధ‌న్‌!

  'బొమ్మ‌రిల్లు' సినిమాలో సిద్ధార్ధ్‌కి బ్ర‌ద‌ర్‌గా న‌టించి ఆక‌ట్టుకున్న శ్రీ‌రామ్ బుల్లితెర‌పై ప్ర‌స్తుతం బిజీగా మారిపోయారు. ప్ర‌స్తుతం శ్రీ‌రామ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తూ ‌నిర్మిస్తున్న సీరియ‌ల్ 'ప్రేమ ఎంత మ‌ధురం'. ఏజ్ బార్‌ అయిన యువ‌కుడు ఆర్య‌వ‌ర్ధ‌న్‌కీ... త‌న కంటే చాలా చిన్న‌దైన అనురాధ‌కీ మ‌ధ్య సాగే ప్రేమ‌క‌థ‌గా ఈ సీరియ‌ల్‌ని డిజైన్ చేశారు. గ‌త కొన్ని వారాలుగా ఈ సీరియ‌ల్ విజ‌య‌వంతంగా జీ తెలుగులో ప్ర‌సారం అవుతోంది. ఆర్య‌వ‌ర్థ‌న్‌ని ప్రేమిస్తున్న అనురాధ త‌న తండ్రి సుబ్బు కార‌ణంగా అత‌నికి దూరంగా వుండ‌టానికి అంగీక‌రిస్తుంది. ఆర్య వ‌ర్ధ‌న్ ఆఫీసు నుంచి బ‌య‌టికి వ‌చ్చిన అనురాధ కొత్త ఉద్యోగం వెతుక్కుంటుంది. ఈ క్ర‌మంలో అనురాధ‌ని ఆర్య‌వ‌ర్ధ‌న్ నుంచి దూరం చేసిన మీరా కావాల‌నే ఆఫీసుకి రాకుండా ఆర్య‌వ‌ర్ధ‌న్‌నే త‌న ఇంటికి వ‌చ్చేలా చేస్తుంది. మీరా కోసం వ‌చ్చిన ఆర్య‌వ‌ర్ధ‌న్ ఆమె ఇంట్లో ఏం చూశాడు? అనురాధ‌ను ప్రేమించే ఆర్య వ‌ర్థ‌న్ అనూహ్యంగా మారిపోయి మీరాకు అండ‌గా వుంటాన‌ని ఎందుకు మాటిచ్చాడు? తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ఆర్య వ‌ర్ధ‌న్ దారి తప్పుతున్నాడా? అన్న‌ది నేడు ఆస‌క్తిక‌రంగా మార‌బోతోంది. బుల్లెతెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న 'ప్రేమ ఎంత మ‌ధురం' సీరియ‌ల్ జీ తెలుగులో ఫ‌స్ట్ ప్లేస్‌లో నిలుస్తోంది. 

రియ‌ల్ క‌పుల్స్‌తో పెట్టుకుంటే ప‌గిలిపోద్ది!

  స్టార్ మా ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛాన‌ల్ క్రేజీ షోల‌తో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటోంది. బిగ్‌బాస్ సీజ‌న్ 4తో మ‌రింత పాపులారితో పాటు టీఆర్పీని సొంతం చేసుకుని లీడింగ్ ఛాన‌ల్ గా మారిన స్టార్ మా తాజాగా '100% ల‌వ్‌' షోతో మ‌రింత ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ని అందించ‌బోతోంది. రియ‌ల్ క‌పుల్స్ వ‌ర్సెస్ రీల్ ‌క‌పుల్స్‌తో ఈ షోని ప్రారంబించారు. యాంక‌ర్ ర‌వి, వ‌ర్షిణి సౌంద‌ర‌రాజ‌న్ ఈ షోకు వ్యాఖ్యాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ నెల 21 నుంచి ఈ షో సాయంత్రం 6 గంట‌ల‌కు ప్ర‌సారం కాబోతోంది. ఆరు రియ‌ల్ జంట‌లు.. ఆరు రీల్ జంట‌లు ఈ షోలో పాల్గొంటున్నారు. కార్తీక దీపంతో పాపుల‌ర్ అయిన నిరుపమ్‌ త‌న భార్య మంజుల‌‌తో క‌లిసి ఈ షోలో పాల్గొన్నాడు. ఈ సంద‌ర్భంగా ప‌లు ఆట‌ల్ని భార్య‌తో క‌లిసి ఆడిన నిరుప‌మ్ "రియ‌ల్ క‌పుల్‌తో పెట్టుకుంటే ప‌గిలిపోద్ది" అంటూ రీల్ జంట‌ల‌ని ఉద్దేశించి అన్న మాట‌లు వైర‌ల్‌గా మారాయి. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుద‌లైంది. ఇందులో ఆరు రీల్ జంట‌లుగా సీరియ‌ల్ జోడీలు పాల్గొన‌గా.. ఆరు రియ‌ల్ లైఫ్‌లో భార్యాభ‌ర్త‌లైన జంట‌లు పాల్గొన్నాయి. వీరంతా క‌లిసి పోటాపోటీగా ఆడిన ఆట‌లు.. చేసిన అల్ల‌రి వీక్ష‌కుల్ని ఎంట‌ర్‌టైన్ చేసేదిగా వుంది. 

గోవాలో అవినాష్-అరియానా బైక్ రైడింగ్‌!

  జ‌బ‌ర్ద‌స్త్ మాజీ కంటెస్టెంట్‌, బిగ్‌బాస్ సీజ‌న్ 4 కంటెస్టెంట్ ముక్కు అవినాష్ ఇటీవ‌ల గోవా ట్రిప్‌కి వెళ్లిన విష‌యం తెలిసిందే. అరియానా గ్లోరీతో క‌లిసి అవినాష్ అక్క‌డ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఈ జంట‌తో పాటు శ్రీ‌ముఖి, విష్ణు ప్రియ‌, శ్రీ‌ముఖి త‌మ్ముడు సుప్రీత్‌, ఆర్జే చైతూ కూడా వెళ్లారు. అక్క‌డి బీచ్ స‌మీపంలో వున్న‌ గోవా కోలా రిసార్ట్‌లో సంద‌డి చేశారు. పోర్ట్ ఏరియాకు బైకుల‌పై వెళ్లిన ఈ జంట‌లు ఎక్క‌డి నుంచి బీచ్ వ్యూని చూసి ఎంజాయ్ చేశారు. అరియానాతో క‌లిసి అవినాష్ బైక్ రైడింగ్ వెళ్లాడు. మ‌ధ్య‌లో ఆపి అరియానా బైక్ రైడ్ చేసిన దృశ్యాల‌కు సంబంధించిన వీడియో నెట్టింట సంద‌డి చేస్తోంది. అవినాష్ వెన‌కాల కూర్చుని అరియానా రైడ్ చేస్తున్న దృశ్యాల‌ని షూట్ చేశాడు. ఆ త‌రువాత ఫోర్ట్ ఏరియాలో వున్న మ‌ర్రి చెట్టు ఊడ‌ల్ని ప‌ట్టుకుని కోతిలా ఊగుతూ ముక్కు అవినాష్ కోతి కొమ్మ‌చ్చి ఆడిన దృశ్యాలు ఆక‌ట్టుకుంటున్నాయి. గోవా ట్రిప్‌కి సంబంధించిన వీడియోని అవినాష్ త‌న యూట్యూబ్ ఛాన‌ల్‌లో పోస్ట్ చేశాడు. అది నెట్టింట సంద‌డి చేస్తోంది. 

బిగ్ బాస్ డ‌బ్బుతో సొహేల్ క‌ల నిజ‌మాయెగా!

  బుల్లితెర‌పై మొద‌ట చిన్న పాత్ర‌ల్లో న‌టించి, 'కృష్ణ‌వేణి' లాంటి సీరియ‌ల్‌లో హీరోగా రాణించిన‌ ఇస్మార్ట్ స‌య్య‌ద్ సొహేల్ బిగ్‌బాస్ త‌రువాత క‌థ వేరేగానే వుంది. సీజ‌న్ 4లో టాప్ 5లో నిలిచిని సోహైల్ త‌న‌దైన మేన‌రిజ‌మ్స్‌తో... ఆక‌ట్టుకునే డైలాగ్‌ల‌తో ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నాడు. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి దృష్టిలోప‌డిన సొహేల్‌ చిరు నుంచి బంప‌ర్ ఆఫ‌ర్‌తో పాటు ఆయ‌న భార్య స్వ‌యంగా చేసిన బిర్యానీని కూడా ద‌క్కించుకుని వార్త‌ల్లో నిలిచిన విష‌యం తెలిసిందే. త‌ను చేసే సినిమాలో చిన్న గెస్ట్ పాత్ర అయినా తాను చేస్తాన‌ని మెగాస్టార్ చిరంజీవి.. ఇస్మార్ట్ సొహేల్‌‌కు బిగ్‌బాస్ ఫైన‌ల్ స్టేజ్ సాక్షిగా మాటివ్వ‌డంతో అత‌ని ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. అంత‌కు ముందు సింగ‌రేణి ముద్దు బిడ్డ అంటూ షోలో హ‌ల్‌చ‌ల్ చేసిన సొహేల్‌ టాప్ 3కి వ‌చ్చేసరికి తెలివిగా ప్ర‌వ‌ర్తించి 25 ల‌క్ష‌ల క్యాష్‌తో ఇంటిదారి ప‌ట్ట‌డం ప‌లువురిని ఆక‌ట్టుకుంది. బిగ్‌బాస్ హౌస్‌‌లోనే కాదు, హౌస్‌ నుంచి బ‌య‌టికి వ‌చ్చాక కూడా సొహేల్‌ క‌థ వేరేగానే వుంది. హీరోగా ఓ సినిమాని ప్ర‌క‌టించిన సోహైల్ తాజాగా ఎంజీ హెక్ట‌ర్ కారుని సొంతం చేసుకున్నాడు. తండ్రి, త‌మ్ముడితో క‌లిసి షోరూమ్‌కి వెళ్లిన సొహేల్‌ ఎంజీ హెక్ట‌ర్ కారుని కొనుగోలు చేశాడు. దీని విలువ దాదాపు రూ. 30 లక్ష‌లు అని తెలిసింది. ఆ ఫొటోల‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశాడు సొహేల్‌.  "ఫైన‌ల్లీ.. కొత్త కారు కొనాల‌నే ఒక క‌ల నిజ‌మైంది. దీన్ని సాధ్యం చేసిన బిగ్ బాస్‌కు, ఎప్పుడూ నాకు ఇన్‌స్పిరేష‌న్‌గా నిలిచిన మా నాన్న‌కు థాంక్స్‌. హ‌లో ఎంజీ." అని వాటికి క్యాప్ష‌న్ రాసుకొచ్చాడు. ఈ ఫొటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారాయి.