మీరా వెన్నుపోటు ప్లాన్ వ‌ర్క‌వుట్ అవుతుందా?

  జీ తెలుగులో ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ 'ప్రేమ ఎంత మ‌ధురం'. 'బొమ్మ‌రిల్లు' వెంక‌ట్ శ్రీ‌రామ్, వ‌ర్ష‌ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ప్ర‌తి సోమ‌వారం నుంచి శుక్ర‌వారం వ‌ర‌కు రాత్రి 9 గంట‌ల‌కు ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ వీక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటోంది. ప్ర‌ధానంగా అను పాత్ర‌లో న‌టిస్తున్న వ‌ర్ష ఈ సీరియ‌ల్‌కి యూఎస్‌పీగా మారింది. గ‌త వారం ఎపిసోడ్‌లో మీరాని నందిని టెక్స్ టైల్స్ కంప‌నీకి ఆర్య‌వ‌ర్ధ‌న్ సీఈవోగా అపాయింట్ చేస్తాడు. ఇది ముందు అను ఫాద‌ర్ సుబ్బుకి న‌చ్చ‌దు కానీ ఆర్య‌వ‌ర్ధన్ క‌న్విన్స్ చేయ‌డంతో తాను పొర‌పాటు ప‌డ్డాన‌ని ఆర్య‌కు సారీ చెప్పి అక్క‌డి నుంచి వెళ్లిపోతాడు. అను సీఈఓ కావ‌డం జీర్ణించుకోలేని మీరా ఎలాగైనా అనుని దెబ్బ‌కొట్టాల‌ని, ఆర్య దృష్టిలో బ్యాడ్ చేయాల‌ని ప్లాన్‌లు వేస్తూ వుంటుంది. అందు కోసం పెద్ద ప‌థ‌కం వేస్తుంది. అనుని న‌మ్మించి ఆమె వ‌ద్దే ప‌ని చేస్తానంటూ చెప్పిన మీరా.. అలా న‌మ్మించి అనుని వెన్నుపోటు పొడ‌వాల‌ని ప్లాన్ చేస్తుంది. ఈ ప్లాన్ బెడిసికొడుతుంద‌ని, అనుని దెబ్బ కొట్టాల‌న్న ప్లాన్‌తో ఆర్య‌ని ఇబ్బంది పెట్ట‌బోతున్నావ‌ని, ఈ విష‌యంలో మ‌రోసారి ఆలోచించి అడుగువేస్తే మంచిద‌ని జెండే (రాంజ‌గ‌న్‌) మీరాని హెచ్చ‌రిస్తాడు. అయితే తాను చేసేదే ఆర్య‌వ‌ర్ధ‌న్ కోస‌మ‌ని అన్న మీరా త‌న ప‌థకం ప్ర‌కార‌మే అనుని వెన్ను పోటు పొడిచిందా? ప‌క్క‌నే వుండి అనుని ఇబ్బందుల‌కు గురిచేయ‌బోతోందా? అన్న‌ది తెలియాలంటే సోమ‌వారం ఎపిసోడ్ చూడాల్సిందే. 

లాస్య‌పై యాంక‌ర్ ర‌వి ఎమోష‌న‌ల్ పోస్ట్!

  బుల్లితెర‌పై ఓ రేంజ్‌లో ఆక‌ట్టుకున్న జోడీ.. రవి, లాస్య‌. ఈ ఇద్ద‌రూ మాటీవీలో ప్ర‌సార‌మైన 'సంథింగ్ స్పెష‌ల్' ప్రోగ్రామ్‌తో యాంక‌ర్స్‌గా కెరీర్ స్టార్ట్ చేశారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా వీరిద్ద‌రూ టీవీ వీక్ష‌కుల్లోనూ కాకుండా ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారిపోయారు. ఈ జ‌ర్నీ చాలా కాలం చాలా అందంగా సాగింది. వీరిద్ద‌రూ క‌లిసి ఆ త‌రువాత చేసిన ప్ర‌తీ షో సూప‌ర్ హిట్టే. అయితే ఇంత‌లో వీరిద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డం, లాస్య వేరే వ్య‌క్తిని ప్రేమించి పెళ్లిచేసుకోవ‌డంతో వీరి జోడీకి బ్రేక్ ప‌డిపోయింది. లాస్య యాంక‌రింగ్‌కి టాటా చెప్పేసింది. అయితే ఈ రంగంలో ఎప్పుడూ ఎవ‌రూ ఒకేలా వుండ‌రు, మారుతుంటారు.. అన్న‌ది తెలిసిందే. అదే మార్పు ర‌వి,లాస్యలోనూ వ‌చ్చింది. ఐదేళ్ల త‌‌రువాత మ‌ళ్లీ వీరిద్ద‌రు క‌లిశారు. 'స్టార్ మా' కోసం ఓంకార్ ప్రొడ్యూస్ చేస్తున్న కామెడీ షో 'కామెడీ స్టార్స్‌'. ఈ షోకి లాస్య ఎంట్రీ ఇచ్చింది. దాదాపు ఐదేళ్ల విరామం త‌రువాత మ‌ళ్లీ ర‌వి, లాస్య క‌లిసి 'ఉప్పెన‌' మూవీ కాన్సెప్ట్‌ని పేరడీ చేశారు. ఇందులోని "జ‌ల జ‌ల జ‌ల‌పాతం నువ్వు..." అంటూ సాగే పాట‌కు ఆడిపాడి అల‌రించారు. దీంతో ఈ షోకి జ‌డ్జెస్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న శ్రీ‌దేవి, శేఖ‌ర్ మాస్ట‌ర్ మురిసిపోయారు. ఇలా మిమ్మ‌ల్ని చూసి ఎన్నే‌నేళ్ల‌యింది.. అయినా మీ మ్యాజిక్ మార‌లేదంటూ ప్ర‌శంస‌లు కురిపించారు.  ఇదే విష‌యాన్ని సోష‌ల్ మీడియా ఫేస్ బుక్ ద్వారా వెల్ల‌డిస్తూ లాస్య‌పై రవి ఓ ఎమోష‌న‌ల్ పోస్ట్‌ని షేర్ చేశాడు. "కాలం మారింది.. జీవితాలు మారాయి. కానీ మా ఇద్ద‌రి మాయాజాలం మాత్రం పిస‌రంత‌ కూడా మార‌లేదు. అప్పుడు, ఇప్పుడు మేం మిమ్మ‌ల్ని అల‌రిస్తుంటాము. ఎందుకంటే మేం పెర్ఫార్మ‌ర్స్ కాబ‌ట్టి. మీ అంద‌రి అన్ కండీష‌న‌ల్ ల‌వ్‌కు  థ్యాంక్స్‌." అంటూ లాస్య‌తో 'ఉప్పెన' పాట‌కు రొమాన్స్ చేసిన ఫొటోల్ని పంచుకున్నాడు. ఈ పోస్ట్‌కు వేల సంక్‌య‌లో లైక్స్ వ‌చ్చాయి.

"మోనిత‌ని పెళ్లిచేసుకో".. కార్తీక్‌కు‌ సౌంద‌ర్య స‌ల‌హా!

  'కార్తీకదీపం' సోమ‌వారం ఎపిసోడ్ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా సాగ‌బోతోంది. సిటీని వ‌దిలి వెళ్లిన దీప వార‌ణాసి స‌హాయంతో టిఫిన్ సెంట‌ర్‌ని ప్రారంభిస్తుంది. దానికి 'నాన్న టిఫిన్ సెంట‌ర్'` అని నామ‌క‌రణం చేస్తుంది. తొలి రోజు లెక్క‌లు మాట్లాడుకుంటుంటారు. ఈ లోగా అక్క‌డ‌కి ఒకావిడ వ‌చ్చేసి "నాన్నా నాన్నా అంటున్నారు.. ఏడీ మీ నాన్న?" అన‌డుగుతుంది. "టిఫిన్ సెంట‌ర్ పేరు 'నాన్న టిఫిన్ సెంట‌ర్‌' అని పెట్టారు క‌దా ఎక్క‌డ మీ నాన్న‌? .. టిఫిన్ చేసే వాళ్లు ఇదే అడిగితే ఏమ‌ని చెబుతారు?" అని ప్ర‌శ్నిస్తుంది. దీంతో శౌర్య "బోర్డు చెరిపేద్దామా" అంటుంది. క‌ట్ చేస్తే మోనిత ఇంట్లో కార్తీక్ "హిమ అడ్ర‌స్ తెలిశాక రౌడీని కూడా తెచ్చేసుకుందాం" అంటాడు మోనిత‌తో. "దీప త‌ప్ప నీతో ఎవ‌రున్నా నాకు అభ్యంత‌రం లేదు.. మ‌న‌మిద్ద‌రం మ‌న‌కిద్ద‌రు." అంటుంది మోనిత‌. అయితే ఇంత‌లో కార్తీక్‌ని వెతుక్కుంటూ సౌంద‌ర్య లోప‌లికి ఎంట్రీ ఇస్తుంది. ఉన్నఫ‌ళంగా సౌంద‌ర్య అక్క‌డ‌కు రావ‌డంతో కార్తిక్‌, మోనిత షాక‌వుతారు. అప్ప‌టికే త‌ను మోనిత‌కి ప్రామిస్ చేశాన‌ని, హిమ‌ని వెతికి తీసుకొస్తే త‌న‌ని పెళ్లి చేసుకుంటాన‌ని మాటిచ్చాన‌ని చెబుతాడు కార్తీక్ . "అయితే మోనిత‌ని పెళ్లి చేసుకో." అని చెప్పి షాకిస్తుంది సౌంద‌ర్య‌. మ‌రి త‌ల్లి సౌంద‌ర్య చెప్పిన‌ట్టే డాక్ట‌ర్ బాబు మోనిత‌ని పెళ్లి చేసుకుంటాడా?.. అలా చేస్తానంటే సౌంద‌ర్య నిజంగా అంగీక‌రిస్తుందా? త‌ల్లీ కొడుకుల మ‌ధ్య ఈ సోమ‌వారం ఎలాంటి చ‌ర్చ జ‌రగబోతోంది అన్న‌ది తెలియాలంటే సోమ‌వారం ఎపిసోడ్ చూడాల్సిందే. 

శ్రీ‌దేవి, శేఖ‌ర్ మాస్ట‌ర్ రొమాన్స్‌కు ప‌గ్గాలు లేవుగా!

  పెళ్లి చేసుకున్నాక సినిమాల్లో క‌నిపించ‌కుండా పోయిన శ్రీ‌దేవి తాజాగా స్టార్ మా చాన‌ల్‌లో ఓంకార్ ప్రొడ్యూస్ చేస్తున్న 'కామెడీ స్టార్స్' షోలో వ‌న్ ఆఫ్ ది జ‌డ్జ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. మ‌రో జ‌డ్జిగా డ్యాన్స్ మాస్ట‌ర్‌ శేఖ‌ర్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. గ‌త కొన్ని వారాలుగా ఈ షో విజ‌యవంతంగా టెలికాస్ట్ అవుతోంది. అవినాష్. అరియానా, అషురెడ్డి ఓ టీమ్‌గా, చ‌మ్మ‌క్ చంద్ర అండ్ కో ఓ టీమ్‌గా  వ్య‌వ‌హ‌రిస్తూ త‌మ‌దైన కామెడీతో అల‌రిస్తున్నారు. ఇదిలా వుంటే ఈ ఆదివారం 'కామెడీ స్టార్స్‌'లో రొమాన్స్ డోస్ పెంచేసిన‌ట్టున్నారు. 'ఉప్పెన‌' కాన్సెప్ట్‌తో కామెడీని పండించే క్ర‌మంలో కంటెస్టెంట్స్ 'ఉప్పెన'` పాట‌కు రొమాన్స్ చేస్తూ త‌మ‌ని తాము మ‌ర్చిపోయి చిందులేస్తూ ర‌చ్చ చేస్తున్నారు. యాంక‌ర్ ర‌వి, లాస్య ఓ రేంజ్‌లో రొమాన్స్ చేయ‌గా త‌మ ఛాన్స్ రావ‌డంతో శేఖ‌ర్ మాస్ట‌ర్‌, శ్రీ‌దేవి రెచ్చిపోయారు. 'ఉప్పెన‌'లోని "జ‌ల జ‌ల జ‌ల‌పాతం నువ్వు.." సాంగ్‌కు శేఖ‌ర్ మాస్ట‌ర్‌, హీరోయిన్ శ్రీ‌దేవి రెచ్చిపోయి స్టెప్పులేశారు. శేఖ‌ర్ మాస్ట‌ర్ ఛాన్స్ దొరికింది కదా అని శ్రీ‌దేవిని కౌగిలిలో బంధిస్తూ, ఫుల్ రొమాంటిక్ మూడ్‌లో త‌న‌ని తాను మైమ‌ర‌చిపోయాడు. శ్రీ‌దేవి కూడా సంద‌ర్భోచితంగా ఆ కౌగిలిని ఆస్వాదిస్తున్న‌ట్లు ఫీలింగ్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

ర‌విని "జ్వ‌రం కావాలా?" అని అడిగిన లాస్య‌!

  యాంక‌ర్ ర‌వి, లాస్య ఇద్ద‌రూ క‌లిసి గ‌త కొన్నేళ్ల క్రితం మా మ్యూజిక్‌లో 'స‌మ్‌థింగ్ స్పెష‌ల్‌' ప్రోగ్రామ్ ద్వారా కెరీర్ ప్రారంభించారు. ఆ త‌రువాత కొన్నాళ్ల పాటు వీరి యాంక‌రింగ్ జ‌ర్నీ విజ‌య‌వంతంగా సాగుతూ వ‌చ్చింది. అయితే ఇద్ద‌రి మ‌ధ్య ఏదో జ‌రుగుతోందంటూ వ‌రుస ప్ర‌చారాలు మొద‌లు కావ‌డం.. కొన్ని సంద‌ర్భాల్లో ర‌వి ప్ర‌వ‌ర్త‌న న‌చ్చ‌క‌పోవ‌డంతో ర‌వితో క‌లిసి యాంక‌రింగ్ చేయ‌డానికి నిరాక‌రించి గుడ్ బై చెప్పింది లాస్య. దాదాపు ఐదేళ్ల విరామం త‌రువాత మ‌ళ్లీ వీరిద్ద‌రు స్టార్ మా కోసం 'ఫ్యామిలీ పార్టీ' షోలో క‌లిశారు. ఇద్ద‌రూ క‌లిసి యాంక‌రింగ్ చేయ‌డం మొద‌లుపెట్టారు. ఆ ఇద్ద‌రి మ్యాజిక్ చిన్నితెర‌పై మ‌రోసారి అల‌రిస్తోంది. తాజాగా ఈ ఆదివారం మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల‌కు ప్ర‌సారం కానున్న 'కామెడీ స్టార్స్‌' షోలో పాల్గొంటున్నారు. 'ఉప్పెన‌' థీమ్‌తో సాగే ఈ షోలో "జ‌ల జ‌ల జ‌ల‌పాతం నువ్వు.." అంటూ సాగే పాట‌కు స్టెప్పులేశారు. "జ్వ‌రం కావాలా ఆశీ" అంటూ ర‌విని అడిగిన లాస్య‌, "మా తా‌త‌య్య‌కు వాడిన సూది ఇది. దీంతో జ్వ‌ర‌మేంటి... ద‌గ్గు, జ‌లుబూ అన్నీ వ‌చ్చేస్తాయి." అన‌గానే ర‌వి బిత్త‌ర బిత్త‌ర‌గా చూడ‌టం.. లాస్య ప‌క ప‌కా న‌వ్వ‌డం ఆక‌ట్టుకుంటోంది. ఈ షోకి సంబంధించిన ప్రోమో నెట్టింట సంద‌డి చేస్తూ న‌వ్వులు పూయిస్తోంది. 

దీప తండ్రిపై కార్తీక్ దౌర్జ‌న్యం!

  స్టార్ మాలో ప్ర‌సారం అవుతున్న 'కార్తీక దీపం' రోజుకో మ‌లుపు తిరుగుతోంది. ర‌స‌వ‌త్త‌రంగా సాగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల చేత కంట‌నీరు పెట్టిస్తోంది. డాక్ట‌ర్ బాబు మార‌డ‌ని తెలుసుకున్న దీప త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌తో సిటీ వ‌దిలి వెళ్లిపోతుంది. ఈ రోజు ఎపిసోడ్ మ‌రింత ఆస‌క్తిక‌రంగా సాగ‌బోతోంది. వార‌ణాసి బంధువుల స‌హా‌యంతో ఓ పాత ఇంటిలో దీప‌ కొత్త కాపురం మొద‌లుపెడుతుంది. రోడ్డు ప‌క్క‌న ఇడ్లీ బండి పెట్టుకుని జీవ‌నం సాగించాల‌ని నిర్ణ‌యించుకుంటుంది. ఇదిలా వుంటే దీప త‌న‌కు చెప్ప‌కుండా ఊరు వ‌దిలి వెళ్లిపోయింద‌ని ఆమె తండ్రి ముర‌ళీకృష్ణ క‌న్నీరు మున్నీర‌వుతుంటాడు. ఓ సంద‌ర్భంలో దీప పెళ్లి ఫొటోని క‌నిపించ‌కుండా డాక్ట‌ర్ బాబు ప‌క్క‌న ప‌డేసిన ఫొటోని చూస్తూ ముర‌ళీకృష్ణ బాధ‌ప‌డుతుంటాడు. ఇదే స‌మ‌యంలో అక్క‌డ‌కి ఎంట్రీ ఇచ్చిన డాక్ట‌ర్ బాబు ఫొటోని లాగి కింద‌ప‌డేస్తాడు. దీంతో ఆ ఫొటో అద్దం ముక్క‌ల‌వుతుంది. ఊహించ‌ని ప‌రిణామానికి షాకైన ముర‌ళీకృష్ణ "డాక్ట‌ర్ బాబు ఏంటీ దైర్జ‌న్యం?" అంటూ ఆవేశంతో ఊగిపోతాడు. "ఆడ‌పిల్ల వాళ్లం క‌దా అని ఎప్పుడు ఏది అన్నా స‌హిస్తామ‌నుకుంటున్నావా.. మా స‌హ‌నానికి కూడా ఓ హ‌ద్దుంటుంది." అంటూ ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తాడు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య దీప గురించి వాదోప‌వాదాలు జ‌రుగుతాయి. దీప ఎక్క‌డుందో చెప్ప‌మంటూ డాక్ట‌ర్ బాబు ముర‌ళీకృష్ణ‌ను నిల‌దీస్తాడు. ఎక్క‌డుందో నాకు తెలియ‌ద‌ని చెప్పినా న‌మ్మ‌క‌పోవ‌డంతో భాగ్యం వచ్చి ఆయ‌న చెప్పేది నిజ‌మే అంటుంది. దాంతో అక్క‌డి నుంచి ఇంటికి వెళ్లిన డాక్ట‌ర్ బాబు ఏం చేశాడు? దీప ద‌గ్గ‌రి నుంచి హిమ డాక్ట‌ర్ బాబు  ద‌గ్గ‌రికి వ‌చ్చేసిందా? వంటి విష‌యాలు తెలుసుకోవాంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.  

"ముందు వంట‌ల‌క్క‌ను ద‌గ్గ‌ర‌కు తీసుకో".. కార్తీక్‌ను ర‌ఫ్ఫాడిన దీప ఫ్యాన్స్‌!

  స్టార్ మాలో ప్ర‌సారం అవుతున్న 'కార్తీక దీపం' సీరియ‌ల్ మ‌హిళాలోకాన్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఇందులో న‌టించే నిరుప‌మ్‌, ప్రేమి విశ్వ‌నాథ్‌ల‌ని స్టార్‌ల‌ని చేసింది. మ‌రీ ముఖ్యంగా వంట‌ల‌క్క పాత్ర‌లో న‌టించిన ప్రేమి విశ్వ‌నాథ్ స్టార్ సెల‌బ్రిటీగా మారిపోయింది. సోష‌ల్ మీడియాలో ఆమె కోసం భారీ స్థాయిలో ఫ్యాన్స్ ప‌ని చేస్తున్నారు. ఆమెకు వ్య‌తిరేకంగా ఎలాంటి పోస్ట్ ప‌డినా వెంట‌నే ఏకిపారేస్తున్నారు. తాజాగా డాక్ట‌ర్ బాబు పాత్ర‌లో న‌టించిన నిరుప‌మ్‌ని కూడా వ‌ద‌ల లేదు. సోమ‌వారం అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా మ‌హిళ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ నిరుప‌మ్ ఓ వీడియోను ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశాడు. "మీరు లేకుండా మేం లేమ‌ని తెలిసినా మిమ్మ‌ల్ని ఎంతో వేధిస్తుంటాం, ఏడిపిస్తూ వుంటాం. మీ ప‌ట్ల జంతువుల్లా ప్ర‌వ‌ర్తిస్తూ వుంటాం. అయినా ఓపిక‌తో భ‌రిస్తారు. ఎంతో స‌హ‌నంతో మ‌మ్మ‌ల్ని మార్చుకుంటారు. మార్పు మాలో రావాలి. మీకు మ‌రింత గౌర‌వం ద‌క్కాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటూ ప్ర‌పంచంలో వున్న వాళ్లంద‌రికీ హ్యాపీ ఉమెన్స్ డే."‌ అని వీడియోను పోస్ట్ చేశాడు నిరుప‌మ్‌. ఈ వీడియోపై వంట‌ల‌క్క ఫ్యాన్స్ మామూలుగా రెస్పాండ్ అవ‌లేదు. "ముందు వంట‌ల‌క్క‌ని ద‌గ్గ‌ర‌కు తీసుకుని మ‌ళ్లీ మాట్లాడు.. ఇది ఓకే కానీ మీరు దీప‌ని ఎప్పుడు న‌మ్ముతారు? ఆమెను ఎప్పుడు చేర‌దీస్తారు?" అంటూ డాక్ట‌ర్ బాబుపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఈ కామెంట్స్‌కి స‌మాధానం చెప్ప‌లేక నిరుప‌మ్ గ‌ప్‌చుప్‌ అయిపోయాడు. 

బిగ్ బాస్ సీజ‌న్ 5లోనూ మ‌ళ్లీ వాళ్ల‌దే హ‌వా!

  బిగ్ ‌బాస్ సీజ‌న్ 4లో అత్య‌ధిక శాతం అన్‌నోన్‌ ఫేసెస్ క‌నిపించాయి. ఇందులో మ‌రీ ముఖ్యంగా యూట్యూబ్ స్టార్స్‌దే హ‌వా క‌నిపించింది. యూట్యూబ్‌లోపాపుల‌ర్ అయిన వాళ్ల‌నే ఎక్కువ‌గా ఈ షోలో తీసుకున్నారు. గంగ‌వ్వ‌, జోర్దార్ సుజాత‌, దేత్త‌డి హారిక, దిల్‌సే మెహ‌బూబ్‌, అరియానా గ్లోరీ, దివి వ‌డ్త్య‌, అఖిల్ సార్థ‌క్‌ వంటి యూట్యూబ్ స్టార్స్‌ని ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే. బిగ్‌బాస్ సీజ‌న్ 5కి కూడా యూట్యూబ్‌లో సంచ‌ల‌నం సృష్టిస్తున్న స్టార్స్‌నే ఈ ద‌ఫా కూడా ఎంపిక చేస్తున్నారు. త్వ‌ర‌లో ప్రారంభం కాబోతున్న సీజ‌న్ 5 కోసం గ‌త కొన్ని రోజులుగా కంటెస్టెంట్‌ల ఎంపిక జ‌రుగుతోంది. కామ‌న్‌మెన్‌లుగా ఎంట్రీ ఇచ్చి త‌మ వీడియోల‌తో సెల‌బ్రిటీలుగా మారిపోయిన వారిని ఈ ద‌ఫా కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి తీసుకురాబోతున్నారు. అత్య‌ధిక శాతం యూట్యూబ్ స్టార్స్‌తో ఈ సీజ‌న్‌ని జాన్‌లో ప్రారంభించ‌బోతున్నారు. ప్ర‌స్తుతం కంటెస్టెంట్‌ల‌కు సంబంధించిన క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది. ఇప్ప‌టికే యూట్యూబ‌ర్ ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ పేరు దాదాపుగా ఖ‌రారైపోయింది. 'ఇన్ఫినిట‌మ్ మీడియా' నుంచి మ‌రో కంటెస్టెంట్‌ని ఎంపిక చేస్తున్నార‌ట‌. 'ట్విన్స్‌', 'బ‌బ్లూ వ‌ర్సెస్ సుబ్బులు' వంటి వెబ్ సిరీస్‌ల‌తో పాపుల‌ర్ అయిన బ‌బ్లూ మయా అలియాస్ చికెన్ బ‌బ్లూ (సాయికుమార్ బబ్లూ) ఈ సారి హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడ‌ట‌. ఇక ఇదిలా వుంటే యాంక‌ర్ ర‌వి కూడా ఈ సారి ఖ‌చ్చితంగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లో స్టార్ మా నుంచి వెలువ‌డే అవ‌కాశం వుంది. 

ఫ్యామిలీకి దీప గురించి చెప్పిన సౌంద‌ర్య‌.. షాక్‌లో కార్తీక్!

  'కార్తీక దీపం' ఎండ్ స్టేజ్‌కి వ‌చ్చేసిందా? అంటే జ‌రుగుతున్న ప‌రిణామాలు అలాగే క‌నిపిస్తున్నాయి. మంగ‌ళ‌వారం ఎపిసోడ్ మ‌రింత కీల‌క మ‌లుపు తిర‌గ‌బోతోంది.  డాక్ట‌ర్‌ బాబు ఎంత చెప్పినా విన‌క‌పోవ‌డంతో విసుగెత్తిన దీప త‌న పిల్ల‌ల‌ని తీసుకుని వార‌ణాసి ఆటోలో వేరే ఊరు వెళ్లిపోతుంది. ఉంటున్న ఇల్లు ఖాళీ చేసి పిల్ల‌ల‌తో స‌హా ఊరు మారుతుంది. పాత ఇల్లు, కొత్త వాతావ‌ర‌ణం.. సోఫాలో కూర్చుని దీప ఆలోచిస్తుంటే.. హిమ‌, శౌర్య ఫొటోలు తీసి తుడుస్తూ వుంటారు. "అమ్మా ఇక్క‌డ ఏయిర్ పోర్ట్ వుందా?" అని దీపని అడుగుతుంది శౌర్య‌. దీప "ఎందుకు అత్త‌మ్మా" అంటుంది. "నాన్న రావాల‌నుకుంటే.." అని న‌సుగుతుంది శౌర్య‌. దీంతో దీప‌కు ప‌ట్ట‌రాని కోపం వ‌చ్చేస్తుంది. "మాటి మాటికి నాన్నా.. నాన్నా అన‌కండి. మీ జీవితంలో నాన్న అధ్యాయం ముగిసిపోయింది." అంటూ మండిప‌డుతుంది. దీప కోపం చూసి పిల్ల‌లు ఆశ్చ‌ర్యపోతారు. క‌ట్ చేస్తే ఆనంద‌రావు కోడ‌లు దీప‌ని, పిల్ల‌ల్ని ఇంటికి తీసుకొచ్చేద్దామ‌ని సౌంద‌ర్య‌తో చెబుతాడు. పెద్దోడికి ఈ విష‌యం నువ్వే చెప్పాలంటాడు. ఈ సంభాష‌ణ జ‌రుగుతుండ‌గానే కార్తీక్ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు. "ఏంటీ ఏదో చెప్పాలంటున్నారు?" అని అడిగితే, "అది మీ అమ్మే చెబుతుంది" అంటాడు ఆనంద‌రావు. అయినా చెప్ప‌మ‌న‌డంతో "కోడ‌లుని ఇంటికి తీసుకొచ్చేద్దాం రారా కార్తీక్" అంటాడు. "మీరు ఆవేశ‌ప‌డ‌కండి" అంటుంది సౌంద‌ర్య‌. "అదేంటి నువ్వే క‌దా నాన్నని ఫోర్స్ చేయాలి. మ‌రి నువ్వేంటి వ‌ద్ద‌ని వారిస్తున్నావ్" అంటాడు కార్తీక్‌.  ఎంత‌కీ ఆనంద‌రావు విన‌క‌పోవ‌డంతో దీప లేద‌నీ, ఊరు వ‌దిలి ఎక్క‌డికో వెళ్లిపోయింద‌ని సౌంద‌ర్య చెప్పేస్తుంది. దీంతో షాక్ కు గురైన ఆనంద‌రావు కార్తీక్ చేయి వ‌దిలేసి సోఫాలో కుప్ప‌కూలిపోతాడు.. త‌ల్లి చెప్పిన మాట‌లు వినిని ఒక్క‌సారిగా షాకైన‌ కార్తీక్ శూన్యంలోకి చూస్తూ మెట్ల‌పై అచేత‌నంగా కూర్చుండి పోతాడు. ఇది ఈ రోజు ఆస‌క్తిక‌ర‌ ఎపిసోడ్‌. ‌

రానా 'నెం.1 యారి' సీజ‌న్ 3తో వ‌చ్చేస్తున్నాడు!

  ఓ ప‌క్క క్రేజీ చిత్రాల్లో న‌టిస్తూనే హీరో ద‌గ్గుబాటి రానా గేమ్ షోల‌తో అద‌ర‌గొడుతున్న విష‌యం తెలిసిందే. స్టార్ మా, జీ తెలుగు చాన‌ళ్లు విభిన్న‌మైన షోల‌తో ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తుంటే.. జెమినీ టెలివిజ‌న్ కోసం రానా 'నెం.1 యారీ' అంటూ కొత్త షోతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు, విశేషంగా ఆక‌ట్టుకున్నారు. రియ‌ల్ ఫ్రెండ్షిప్ స్టోరీస్‌తో స్టార్ట్ అయిన ఈ షో సీజ‌న్ వ‌న్ క్రేజీ క్రేజీ సెల‌బ్రిటీ ఫ్రెండ్స్ ముచ్చ‌ట్ల‌తో బుల్లితెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంది. ఇక సీజ‌న్ 2లో నోస్టాల్జియాతో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఈ సీజ‌న్‌లో తిరిగి రానా త‌న స్కూల్ డేస్‌కి వెళ్లిపోయాడు. త‌న‌తో పాటే అంద‌రినీ త‌న స్కూల్ డేస్‌కి తీసుకెళ్లాడు. రానా చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ అంతా  ఒక్కొక్క‌రుగా హాజ‌రై సీజ‌న్ 2ని మ‌రింత ఎంట‌ర్‌టైన్ చేశారు. రానాతో క‌లిసి అంతా చిన్ననాటి సంగుతుల్ని గుర్తు చేసుకున్నారు. అల్ల‌రి చేశారు. అయితే ఇప్పుడు 'నెం.1 యారీ' సీజ‌న్ 3 వ‌చ్చేస్తోంది. ఇందులో కొత్త‌గా యారి క్ల‌బ్‌ని స‌ద్ధం చేస్తున్నాడట రానా. లైఫ్ మీద కొత్త అప్రోచ్‌తో, ఫ్రెండ్షిప్ మీద కొత్త ప‌ర్‌స్పెక్టివ్‌తో "వీ ఆర్ బ్యాక్" అంటూ స‌రికొత్త సీజ‌న్‌కి శ్రీ‌కారం చుడుతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమోని సోమ‌వారం విడుద‌ల చేశారు. ఇది ప్ర‌స్తుతం నెట్టింట‌ సంద‌డి చేస్తోంది. ఈ నెల 14 నుంచి ఈ కొత్త సీజన్ ఎప్ప‌టిలాగే శ‌నివారం రాత్రి 9 గంట‌ల‌కు ప్ర‌సారం కానున్న‌ది.

తల్లయిన సుధీర్.. "పాపా, బాబా?" అనడిగిన రష్మి!

  ఈటీవీలో ప్ర‌సారం అవుతున్న జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో 'ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌'. ఈ షోకి రోజా, మ‌నో న్యాయ నిర్ణేత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా, ర‌ష్మీ గౌత‌మ్ యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఈ షోలో సుధీర్‌, గెట‌ప్ శ్రీ‌ను, రామ్ ప్ర‌సాద్ చేసిన కామెడీ టాప్ లేపుతోంది. స్కిట్‌లో భాగంగా సుడిగాలి సుధీర్‌కి ర‌ష్మీ గౌత‌మ్ ముందే రామ్‌ప్ర‌సాద్, గెట‌ప్ శ్రీ‌ను శ్రీ‌మంతం చేసేశారు. ర‌ష్మీ గౌత‌మ్‌కు, సుడిగాలి సుధీర్‌కు మ‌ధ్య ఏదో జ‌రుగుతోందంటూ ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఆమె ముందే స్కిట్లో సుడిగాలి సుధీర్‌కు శ్రీ‌మంతం చేయ‌డం ఆక‌ట్టుకుంటోంది. రామ్‌ప్ర‌సాద్ బొట్టు, కాళ్ల‌కు పారాణి పెట్టి శ్రీ‌మంతం చేయ‌డంతో లోప‌లికి వెళ్లిన సుధీర్ చేతుల్లో ఓ పాపాయి బొమ్మ‌ని వెంట తీసుకుని వ‌స్తూ ప్రెగ్నెంట్ లేడీగా నైటీలో క‌నిపించ‌డంతో రోజాతో పాటు ర‌ష్మి ఆ దృశ్యాన్ని చూసి పొట్ట‌చెక్క‌ల‌య్యేలా న‌వ్వారు. బిడ్డ‌ని చేతుల్తో సుడిగాలి సుధీర్ ప‌ట్టుకుని వ‌స్తుండ‌గా "వ‌ట ప‌త్ర శాయికి.." అంటూ బ్యాగ్రౌండ్‌ సాంగ్ వేశారు.. ఇంత‌లో రోజా క‌ల్పించుకుని "చూడ్డానికి రెండు క‌ళ్లు చాల‌ట్లేదు" అన్నారు. ఆ వెంట‌నే "నువ్వు అబ్బాయివి.. అలాంటిది నీకు గ‌ర్భం కావ‌డం, మేము నీకు సీ‌మంతం చేయ‌డం.. నీకు బాబు పుట్ట‌డం ఏంటీ?" అనేశాడు రామ్  ప్ర‌సాద్‌. ఇంత‌లో ర‌ష్మీ క‌ల‌గ‌జేసుకుని "ఇంత‌కీ బాబా, పాపా?" అని అడిగితే రామ్ ప్ర‌సాద్ "ఉండ‌వ‌మ్మా ఈ బిడ్డ‌కి తండ్రెవ‌రో తెలియ‌డం లేదు." అన‌డంతో సుడిగాలి సుధీర్ ఫ్యూజులు ఔట్ అయ్యాయి. వ‌చ్చే శ‌నివారం ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది. 

మోనిత చేయించిన హ‌త్య గురించి ఆమె ముందే కార్తీక్‌కు చెప్పేసిన‌ అంజి!

  'కార్తీక దీపం' కీల‌క ద‌శ‌కు చేరుకుంది. కార్తీక్ త‌న‌కు నిజం చెప్పే ఛాన్స్ ఇవ్వ‌క‌పోవ‌డం, సౌంద‌ర్య చెప్పిన మాట‌లు కూడా న‌మ్మ‌క‌పోవ‌డంతో ఇ‌క లాభం లేద‌నుకున్న దీప త‌న ఇద్ద‌రు పిల్ల‌ల్ని తీసుకుని ఊరు వ‌దిలి వెళ్లిపోతుంది. వార‌ణాసి ఆటోలో వెళ్తున్న దీప‌కు అత్త సౌంద‌ర్య క‌నిపిస్తుంది... పిల్ల‌లు నానమ్మా అంటారు.. క‌ల‌వాల‌ని దీప‌కు వున్నా వార‌ణాసికి ఆటో పోనివ్వ‌మ‌ని చెప్తుంది దీప. దీంతో ఆటో ముందుకు క‌దులుతుంది. క‌ట్ చేస్తే.. దీప‌ గురించి ఆలోచిస్తూ కారులో వెళుతున్న కార్తీక్‌కి ఎదురుగా అంజి బైక్ పై వ‌స్తూ క‌నిపిస్తాడు. అంజిని పిలిచి కారెక్క‌రించుకుని మోని‌త ఇంటికి తీసుకెళ‌తాడు కార్తీక్‌. మోనిత ముందు "ఇప్ప‌డు నిజం చెప్ప‌రా" అని బెదిరించ‌డంతో అస‌లు నిజం మొత్తం చెప్పేస్తాడు అంజి. "నీకు మోనిత ఎలా తెలుసు?  దీప‌కు ఏం చెప్పావ్‌?  మా అమ్మ‌‌‌కు ఏం చెప్పాల‌నుకున్నావ్‌? అన్నీ బ‌య‌ట‌పెట్టేయ్" అని అంజిని నిల‌దీయ‌డంతో మోనిత చేయించిన హిమ హ‌త్య గురించి చెప్పేస్తాడు అంజి. అది విన్న‌ట్టే విని డాక్ట‌ర్ బాబు, "ఇలా దీప నీతో క‌థ‌లు చెప్పిస్తోందా?" అని షాకిస్తాడు. అది కాద‌ని అంజి ఎంత చెప్పినా ప‌ట్టించుకోకుండా బ‌య‌టికి నెట్టేస్తాడు. అంజి చెప్పింది కార్తీక్‌ న‌మ్మ‌క‌పోవ‌డంతో మోనిత ఊపిరి పీల్చుకుంటుంది. క‌ప‌ట నాట‌కం ఆడుతూ కార్తీక్ గుండెల‌పై వాలి "ఇప్ప‌డు అర్థ‌మైందా నా వెనక ఎంత భ‌యంక‌ర‌మైన కుట్ర జ‌రుగుతోందో?".. అని క‌ప‌ట‌ప్రేమ‌ని ఒల‌క‌బోస్తూ వుంటుంది. ఈ యాక్టింగ్ కి క‌రిగిపోయిన కార్తీక్ "ఊరుకో మోనితా ఊరుకో" అని మోనిత‌ని ఓదారుస్తాడు. సోమ‌వారం ఈ ఎపిసోడ్ స్టార్ మాలో ప్ర‌సారం కానుంది.  

స్మాల్ స్క్రీన్‌పై రీ-ఎంట్రీకి తార‌క్ రెడీ!

  స్టార్ మా చాన‌ల్‌లో బిగ్ బాస్ సీజ‌న్ 1కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌డం ద్వారా తొలిసారి స్మాల్ స్క్రీన్‌పై ద‌ర్శ‌న‌మిచ్చిన జూనియ‌ర్ ఎన్టీఆర్‌, నాలుగేళ్ల త‌ర్వాత రీ-ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అవును. ఈసారి జెమినీ టీవీ కోసం హోస్ట్ సీట్‌లో కూర్చోబోతున్నాడు. హిందీలో అమితాబ్ బ‌చ్చ‌న్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ట‌యిన గేమ్ షో 'కౌన్ బ‌నేగా క్రోర్‌ప‌తి' తెలుగు వెర్ష‌న్ 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు'కు ఆయ‌న హోస్ట్‌గా క‌నిపించ‌నున్నారు. జెమినీ టీవీ యాజ‌మాన్యం అధికారికంగా ఈ విష‌యం ప్ర‌క‌టించ‌క‌పోయినా, ఇప్ప‌టికే ఇది బ‌హిరంగ ర‌హ‌స్యంగా మారింది. తార‌క్ ఫ్యాన్స్ కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాలో దీనిని వైర‌ల్‌గా మారుస్తున్నారు. నిజానికి ఈ గేమ్ షో ఇదివ‌ర‌కు స్టార్ మా చాన‌ల్‌లో 'మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు' పేరుతో నాలుగు సీజ‌న్ల పాటు ప్ర‌సార‌మైంది. మూడు సీజ‌న్ల‌కు నాగార్జున హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తే, 2017లో వ‌చ్చిన నాలుగో సీజ‌న్‌కు మెగాస్టార్ చిరంజీవి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించారు. ఆ త‌ర్వాత స్టార్ మా ఆ షోను ఆపేసింది. కార‌ణం మునుప‌టి సీజ‌న్ల‌తో పోలిస్తే నాలుగో సీజ‌న్‌కు టీఆర్పీ త‌క్కువ రావ‌డం. చిరంజీవి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తే, బ్లాక్‌బ‌స్ట‌ర్ అవుతుంద‌నుకుంటే అందుకు విరుద్ధంగా తుస్సుమ‌ని లెక్క‌లు తారుమార‌వ‌డం నిర్వాహ‌కుల‌ను షాక్‌కు గురిచేసింది. ఇప్పుడు ఈ గేమ్ షో స్టార్ మా నుంచి జెమిని టీవీకి మారింది. దాంతో పేరును కొద్దిగా మార్చారు. 'మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు'ను 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు'గా చేంజ్ చేశారు. వ‌చ్చే ఏప్రిల్‌లోనే ఈ షో ప్ర‌సారం కానున్న‌ట్లు స‌మాచారం. లేటెస్ట్‌గా ఈ షో లోగో టీజ‌ర్‌ను వ‌దిలింది జెమిని టీవీ. "మీ జీవితాలని మార్చే గేమ్ షో , మీ ఆశలని నిజం చేసే గేమ్ షో "ఎవరు మీలో కోటీశ్వరులు" త్వరలో మీ  జెమినీ టీవీ లో రాబోతుంది సిద్ధంగా ఉండండి." అంటూ లోగోను ఆవిష్క‌రించ‌డంతో పాటు, ప‌క్క‌నే హోస్ట్ సీట్‌లో కూర్చున్న మ‌నిషిని సిలౌట్ రూపంలో చూపించింది. ఆ హోస్ట్ తార‌క్ అని తెలిసిపోతోంది. వ్యూయ‌ర్స్‌ను త‌న వాగ్ధాటితో మెస్మ‌రైజ్ చేయ‌గ‌ల శ‌క్తి తార‌క్‌ను ఉంద‌ని నమ్మిన నిర్వాహ‌కులు ఆయ‌న‌కు భారీ మొత్తం ఆఫ‌ర్ చేసి, ఒప్పించార‌నేది ఇండ‌స్ట్రీ వ‌ర్గాల మాట‌. మ‌రో నెల‌లో ప్రారంభం కానున్న ఈ షోతో తార‌క్ ఏం చేస్తాడో.. వెయిట్ అండ్ సీ...

పోలీసుల కౌన్సిలింగ్‌కి డుమ్మా కొట్టిన యూట్యూబ్ స్టార్‌‌?

  యూట్యూబ్ స్టార్ ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ త‌న విభిన్న‌మైన వీడియోల‌తో పాపుల‌ర్ అయ్యారు. త్వ‌ర‌లో బిగ్ ‌బాస్ సీజ‌న్ 5 కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్న జ‌స్వంత్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో అడ్డంగా దొరికి పోయి పోలీసుల‌కు చిక్క‌డం ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డం తెలిసిందే. ఆ త‌రువాత అత‌నికి బెయిల్ మంజూరు చేసిన పోలీసులు కౌన్సిలింగ్ కోసం హాజ‌రు కావాల‌ని సూచించార‌ట‌. తాజాగా అత‌న్ని పోలీసులు కౌన్సిలింగ్‌కి పిలిచారు. అయితే వారి ఆదేశాల‌ని ష‌ణ్ముఖ్‌ జ‌స్వంత్ బేఖాత‌రు చేశార‌ట‌. కౌన్సిలింగ్‌కి డుమ్మా కొట్టాడ‌ని చెబుతున్నారు. దీంతో జూబ్లీ హిల్స్ పోలీసులు అత‌నిపై ప్రొసీడింగ్‌కు సిద్ధ‌మ‌వుతున్నార‌ట‌. గ‌త కొన్ని రోజుల క్రితం ష‌ణ్ముఖ్ జూబ్లీ హిల్స్ రోడ్ నెం. 10లో కారుతో రెండు కార్ల‌ని, ఓ బైక‌ర్‌ని ఢీ కొట్టాడు. అత‌ను తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు.   ఆ స‌మ‌యంలో అత‌ను మ‌ద్యం సేవించి వుండ‌టంతో బ్రీత్ ఎన‌లైజ‌ర్‌తో టెస్ట్ చేశారు. మ‌ద్యం సేవించిన‌ట్టు నిర్ధార‌ణ కావ‌డంతో అత‌నిపై సెక్ష‌న్ 337, 279 కింద కేసు న‌మోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ త‌రువాత బెయిల్‌పై విడుద‌ల చేశారు. తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ బిగ్ ‌బాస్ సీజ‌న్ 5 ఎంట్రీ ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

అవినాష్‌ను విదిలించుకొని సొహేల్‌తో డాన్స్ చేసిన‌ అరియానా!

  బిగ్ బాస్ సీజ‌న్ 4 ముగిసిన‌ప్ప‌ట్నుంచీ ఇండ‌స్ట్రీలో ముక్కు అవినాష్‌, అరియానా గ్లోరీ గురించి తెగ చెప్పుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం గోవాలో వాళ్లు చేసిన షికార్లు, బైక్ రైడింగ్‌లు, అవినాష్ నువ్వు నా బంగారం అంటూ అరియానా వ‌గ‌లు పోవ‌డం లాంటివి మంచి మ‌సాలా ఇచ్చాయి. అవినాష్‌, అరియానా మ‌ధ్య స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్ జ‌రుగుతోంద‌ని అనుకోవ‌డానికి ఇవి ఆస్కారం ఇచ్చాయి. టీవీ షోల‌లో ఆ ఇద్ద‌రూ క‌లిసి చేస్తున్న హంగామా కూదా దీనికి ఊతం ఇస్తోంద‌నేది నిజం. కాగా, వ‌చ్చే ఆదివారం స్టార్ మాలో ప్ర‌సారం కానున్న కామెడీ స్టార్స్ షోలో ఆ ఇద్ద‌రి మ‌ధ్య పుడ‌క‌లా బిగ్ బాస్ 4 ఫైన‌లిస్ట్ సొహేల్ ర్యాన్ ప్ర‌వేశించిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది. ఈ షోలో ముక్కు అవినాష్ ఓ స్కిట్ చేశాడు. అందులో సొహేల్ కూడా భాగ‌స్వామి అయ్యాడు. ఇంత‌లో అందాల సిరి హ‌న్మంత్ కూడా వ‌చ్చేసింది. సిరి, సొహేల్ మాట్లాడుకుంటుంటే, వారి మ‌ధ్య‌లోకి అరియానా వ‌చ్చి సొహేల్‌ను వీపు మీద చ‌రిచి, "నీ సంగ‌తేంట్రా.. ఇక్క‌డ లైనెయ్య‌లే, హౌస్‌లో లైనెయ్య‌లే.. ఎప్ప‌డు అమ్మాయిలు క‌న్పిచ్చినా చూస్తుంటావ్‌రా" అని సీరియ‌స్‌గా అడిగింది. "హౌస్‌లో లైనేద్దామంటే మ‌ద్దెలో వొచ్చిండు గ‌దా" అని అవినాష్‌ను చూపెట్టాడు సొహేల్‌. దాంతో అవినాష్ త‌ల ప‌ట్టుకున్నాడు. ఆ త‌ర్వాత "తెల్లాతెల్లాని చీర‌.. జారుతున్నాది సందెవేళ" పాట‌కు సొహేల్‌-వ‌ర్షిణి, అవినాష్‌-అరియాన రెండు జంట‌లుగా డాన్స్ చేశారు. ఉన్న‌ట్లుండి చ‌టుక్కున అవినాష్‌ను వ‌దిలేసి త‌ను కూడా సొహేల్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి డాన్స్ చేసింది అరియానా. దాంతో ఇద్ద‌రు భామ‌ల‌తో సొహేల్ డాన్స్ చేస్తుంటే, చూడ‌లేక తను వ‌ర్షిణిని లాగాడు అవినాష్‌. వ‌ర్షిణి అవినాష్‌ను విదిలించి కొట్టి, సొహేల్‌తోటే డాన్స్ వేసింది. అవినాష్ ఊరుకోకుండా, ఈసారి అరియానా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి ఆమెను లాగాడు. ఆమె కూడా విదిలించేసింది. చేసేది లేక ఫ్లోర్ మీద కూల‌బ‌డి, ఒక‌రినొక‌రు హ‌త్తుకుంటూ డాన్స్ చేస్తున్న ఆ ముగ్గురి వంకే చూస్తుండిపోయాడు అవినాష్‌. అత‌డి బాధ‌ను మ‌రింత పెంచేస్తూ జ‌డ్జి శ్రీ‌దేవి కూడా సొహేల్‌తో జ‌త క‌లిసింది. అవినాష్ ఇప్పుడు నెత్తిన గుడ్డేసుకొని బేల ముఖం పెట్టాడు.. ఈ ప్రోమో ఇప్పుడు ఆన్‌లైన్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. దీనికి సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ చూడాలంటే ఆదివారం మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల దాకా వెయిట్ చెయ్యాల్సిందే..

"మీర‌నుకున్నంత ఈజీ కాదు మా లైఫ్‌".. శివ‌జ్యోతి భావోద్వేగం!

  న్యూస్‌ ఛాన‌ల్ వీ6తో వెలుగులోకి వ‌చ్చింది శివ‌జ్యోతి. తెలంగాణ మాండ‌లికంలో తీన్‌మార్ వార్త‌లు చ‌‌దువుతూ త‌న‌దైన స్టైల్లో బిత్తిరి స‌త్తితో క‌లిసి ఆ ప్రోగ్రామ్‌కే వ‌న్నె తెచ్చింది. ప‌లు అవార్డుల్ని, వ్యూయ‌‌ర్స్ ప్ర‌శంస‌ల్ని ద‌క్కించుకుని అన‌తికాలంలోనే పాపుల‌ర్ అయింది. ఆ త‌రువాత బిగ్ బాస్ సీజ‌న్ 3లో అవ‌కాశం రావ‌డంతో వీ6తో త‌న ఉద్యోగానికి రాజీనామా చేసి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్క‌డి నుంచి మ‌రింత‌గా పాపులారిటీని ద‌క్కించుకుంది. ప్ర‌స్తుతం టీవి9లో న్యూస్ ప్ర‌జెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. తాజాగా జీ తెలుగు ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛాన‌ల్ ఉమెన్స్ డే సంద‌ర్భంగా 'మ‌గువా లోకానికి తెలుసా నీ విలువా' పేరుతో ఓ  ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌దీప్ మాచిరాజు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించారు. వివిధ రంగాల్లో ధైర్యసాహ‌సాల్ని ప్ర‌ద‌ర్శించి ముద‌డుగు వేస్తూ ప‌ది మందికి ఆద‌ర్శంగా నిలిచిన మ‌గువ‌ల‌ని ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌త్యేకంగా ఆహ్వానించారు. ఈ కార్యక్ర‌మంలో శివ‌జ్యోతి కూడా పాల్గొంది. అయితే స్టేజ్ పైకి భ‌ర్త‌తో క‌లిసి ఎంట్రీ ఇచ్చిన ఆమె ఎందుకో హ‌ర్ట్ అయింది.  "ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ వుంద‌నుకోండీ.. ఆమె ఎక్కువ సంపాదిస్తోంది అనుకోండి. తెలియ‌కుండానే ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ.. ఏ దానికేందిరా అది సంపాదిస్తోంది. దాని మొగుడు కూర్చుని తింటుండు.. అంటారు. మీరు అనుకున్నంత ఈజీ కాదు మా లైఫ్‌లు." అంటూ శివ‌జ్యోతి భావోద్వేగానికి లోనుకావ‌డం అక్క‌డున్న వారంద‌రినీ షాక్‌కు గురిచేస్తోంది. దీనికి సంబంధించిన ప్రోమో ప్ర‌స్తుతం నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతోంది. 

ఫొటో ఫీచ‌ర్‌: బేబీ బంప్‌తో బిగ్ బాస్ బ్యూటీ!‌

  ఈ మ‌ధ్య బేబీ బంప్‌తో ఫొటో షూట్‌లు చేసుకోవ‌డం ఓ ఫ్యాష‌న్‌గా మారిపోయింది. స్టార్ హీరోయిన్‌ల నుంచి  రియాలిటీ షో కంటెస్టెంట్ల‌ వ‌ర‌కు బేబీ బంప్ తో ప్ర‌త్యేకంగా ఫొటోల‌కు పోజులిచ్చేస్తున్నారు. ఇప్పుడిదొక ట్రెండ్‌గా మారిపోయింది. తాజాగా ఈ జాబితాలో న‌టి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ హ‌రితేజ కూడా చేరిపోయింది. అ ఆ, ప్ర‌తిరోజు పండ‌గే, హిట్ వంటి చిత్రాల్లో న‌టించి త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది హ‌రితేజ‌. బిగ్‌బాస్ సీజ‌న్ 1లో పాల్గొని మ‌రింత పాపుల‌ర్ అయింది. ఇటీవ‌లే బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ రీయూనియ‌న్‌లో భాగంగా స్టార్ మా చాన‌ల్‌ ఏర్పాటు చేసిన 'బిగ్‌ బాస్‌ ఉత్స‌వం 2'లో పాల్గొన్న హ‌రితేజ‌కు బిగ్‌బాస్ సీజ‌న్ 1 కంటెస్టెంట్స్ వేదిక‌పైనే శ్రీ‌మంతం చేయ‌డం ఆక‌ట్టుకుంది. ఈ సంద‌ర్భంగా భావోద్వేగానికి లోనైంది హ‌రితేజ. ఇదిలా వుంటే త్వ‌ర‌లో పండంటి పాపాయికి జ‌న్మ‌నివ్వ‌బోతున్న ఆమె బేబీ బంప్‌తో బ్లాక్ డ్రెస్‌లో ఫొటోల‌కు పోజులిచ్చింది.  బిగ్‌బాస్ సీజ‌న్ 1లో టాప్ 5లో నిలిచిన హ‌రితేజ తాజాగా బేబీ బంప్‌తో ప్ర‌త్యేకంగా ఫొటో షూట్ చేయించుకుంది. ఆ ఫొటోల‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. ఒక్క పిక్చ‌ర్ మిన‌హా మిగ‌తావాటిని బ్లాక్ అండ్ వైట్‌లో పోస్ట్ చేసింది. వాటికి "Never lose the kid in ur heart" అంటూ క్యాప్ష‌న్ జోడించింది. ఈ ఫొటోలు నెట్టింట సంద‌డి చేస్తున్నాయి. వీటిని చూసిన నెటిజ‌న్స్ నైస్, క్యూట్ అంటూ కామెంట్‌లు పెడుతున్నారు. 

న‌మ్మించి 4 కోట్లు మోసం చేశాడు.. భోరుమ‌న్న‌ జ‌య‌ల‌లిత‌

  'లారీడ్రైవ‌ర్‌' చిత్రంలో బోరింగు పాప పాత్ర‌లో న‌టించి పాపుల‌ర్ అయ్యారు న‌టి జ‌య‌ల‌లిత‌. అంత‌కు ముందు వంశీ 'ఏప్రిల్ 1 విడుద‌ల‌' చిత్రంలో భాగ్యంగానూ క‌నిపించి ఆక‌ట్టుకున్న ఆమె ఆ త‌రువాత వ్యాంప్‌ త‌ర‌హా పాత్ర‌ల్లో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం సినిమాల్లో అర‌కొర‌గా క‌నిపిస్తున్న జ‌య‌ల‌లిత బుల్లితెర సీరియ‌ల్స్‌లో ఆక‌ట్టుకుంటున్నారు. 'బొమ్మ‌రిల్లు' శ్రీ‌రామ్‌ న‌టిస్తూ నిర్మిస్తున్న 'ప్రేమ ఎంత మ‌ధురం' సీరియ‌ల్‌లో త‌ల్లి పాత్ర‌లో హుందాగా క‌నిపిస్తూ త‌న అభిన‌యంతో అల‌రిస్తున్నారు. గ‌త 35 ఏళ్లుగా ఇండ‌స్ట్రీలో న‌టిగా కొన‌సాగుతున్న ఆమె వినోద్‌కుమార్ అనే వ్య‌క్తిని పెళ్లాడి దారుణంగా మోస‌పోయారు. రెండేళ్ల క్రితం కొంత మందిని న‌మ్మి 4 కోట్లు పోగొట్టుకున్నారు.  ఇదే విష‌యాన్ని అలీ వ్యాఖ్యాత‌గా వ్య‌వహ‌రిస్తున్న 'ఆలీతో స‌ర‌దాగా' షోలో వెల్ల‌డించారు. "వాళ్లు విజ‌య‌న‌గ‌రం రాజులు.. జీఎస్టీలు క‌ట్ట‌లేక‌పోతున్నాం. సీరియ‌ల్స్ చేయ‌డం క‌ష్టంగా వుంది అంటే నేను వాళ్ల‌ని గుడ్డిగా న‌మ్మేశా. నా ద‌గ్గ‌ర వున్న డ‌బ్బుతో మీరు చేసుకోండి.. నాకు షేర్ ఏమీ వ‌ద్దు అని చెప్పి వాళ్ల‌కు డ‌బ్బులు ఇవ్వ‌డం మొద‌లుపెట్టా.. అలా కొంత కాలం గ‌డిచాక 2018 డిసెంబ‌ర్ నాటికి నాద‌గ్గ‌ర 4 కోట్ల రూపాయ‌ల‌ వ‌ర‌కు డ‌బ్బులు వ‌సూలు చేసి వాడు చేతులెత్తేసి వెళ్లిపోయాడు. ఇప్పుడు నేను కారు లేక క్యాబ్‌ల‌లో తిరుగుతున్నాను. ఓ వ్య‌క్తిని న‌మ్మి మోస‌పోయాను." అని భావోద్వేగానికి లోనై భోరుమ‌న్నారు. ఆమెను మ‌రో న‌టి వ‌ర‌ల‌క్ష్మి ఓదార్చారు. ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట సంద‌డి చేస్తోంది. 

సొహేల్‌-అరియానా రొమాన్స్‌.. చూడాలి అవినాష్ ఫేస్‌!

  జ‌బ‌ర్ద‌స్త్ మాజీ క‌మెడియ‌న్ ముక్కు అవినాష్ ప్ర‌స్తుతం స్టార్ మాలో ప్ర‌సారం అవుతున్నవ‌రుస షోల‌ల్లో క‌నిపిస్తూ ర‌చ్చ చేస్తున్నాడు. అయితే అవినాష్ పూర్తి స్థాయిలో ఆక‌ట్టుకుంటుంన్న కామెడీ షో 'కామెడీ స్టార్స్‌'. ఈ షోకి వ‌ర్షిణి సౌంద‌ర‌రాజ‌న్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా, జ‌డ్జెస్‌గా శేఖ‌ర్ మాస్ట‌ర్‌, న‌టి శ్రీ‌దేవి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ ఆదివారం ఈ షోలోకి స్పెష‌ల్ గెస్ట్‌గా బిగ్ ‌బాస్ సీజ‌న్ 4 కంటెస్టెంట్ సొహేల్‌ ఎంట్రీ ఇస్తున్నాడు. సొహేల్ హీరోగా, అరియానా హీరోయిన్‌గా అవినాష్ 'క‌థ వేరుంట‌ది' పేరుతో సినిమా చేస్తానంటూ చేసే స్కిట్‌ న‌వ్వులు పూయించేలా వుంది. అరియానా హీరోయిన్ అన‌గానే చ‌ల్ న‌డువ్ అనడం.. వెంట‌నే త‌న‌ని కూల్ చేయ‌డం కోసం "ఏయ్ సింగ‌రేణి ముద్దు బిడ్డా క‌థ వేరుంట‌ది".. అంటూ అవినాష్ కూల్ చేయ‌డం.. "అగ్గిపుల్ల‌ లాంటి ఆడ‌పిల్ల నేనూ".. అంటూ ఇంత‌లో అరియానా ఎంట్రీ.. వెంట‌నే అవినాష్ "ఇదేంట్రా అగ్గిపుల్ల అంటే నిజంగానే అగ్గిపుల్లొచ్చింది".. అన‌డం... ఆ త‌రువాత బిగ్‌ బాస్ హౌస్ త‌రహాలో సొహేల్‌‌, అరియానాల మ‌ధ్య వాడీ వేడీ ర‌చ్చ జ‌ర‌గ‌డం.. మ‌ధ్య‌లో ఇద్ద‌రిని కూల్ చేయ‌డానికి అవినాష్ ఎంట్రీ ఇస్తే అత‌న్ని ప‌క్క‌కు తోసేయ‌డం న‌వ్వులు పూయిస్తోంది. క‌ట్ చేస్తే సొహేల్‌‌, అరియానా "జ‌న‌వ‌రి మాసం"... అంటూ పాటేసుకోవ‌డం.. ఇద్ద‌రూ రొమాంటిక్ మూడ్‌లోకి వెళ్లిపోయి స్టెప్పులేస్తుండ‌టంతో అవినాష్ ఫేస్‌లో ఎక్స్‌ప్రెష‌న్స్ మారిపోవ‌డం.. అది గ‌మ‌నించి సొహేల్ "అవినాష్‌కి కాలుతోంది" అంటూ డ్యాన్స్ ఆపేయ‌డం ఆక‌ట్టుకుంటోంది.