నేను చూసిన రాణివి నువ్వే!

  'సుడిగాడు' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మోనాల్. ఆ తరువాత వివిధ భాషల్లో పదికి పైగా చిత్రాల్లో నటించినప్పటికీ.. సరైన గుర్తింపును మాత్రం సంపాదించలేకపోయింది. గతేడాది ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొని కాస్త క్రేజ్ తెచ్చుకుంది. అయితే హౌస్ లో ఉన్నంతకాలం ఆమె అఖిల్ సార్థ‌క్‌తో ఎంత క్లోజ్ గా ఉందో తెలిసిందే. బయటకి వచ్చిన తరువాత కూడా ఈ జంట చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుండడంతో ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందనే మాటలు వినిపిస్తున్నాయి.  ఇదిలా ఉండగా.. ఈరోజు మోనాల్ పుట్టినరోజు సందర్భంగా అఖిల్ ఆమెకు విషెస్ చెప్పిన తీరు నెటిజ‌న్స్‌ను ఆకట్టుకుంటోంది. ఇన్స్టాగ్రామ్ లో మోనాల్ తో కలిసి తీసుకున్న ఫోటోలను షేర్ చేస్తూ.. తను రాణులకు సంబంధించిన చాలా కథలు విన్నానని.. "కానీ నిజజీవితంలో చూసిన రాణివి మాత్రం నువ్వే." అంటూ మోనాల్ ని తెగ పొగిడేశాడు. ఇంతకుమించి మోనాల్ గురించి ఎలా అభివర్ణించాలో తనకు తెలియడం లేదని.. తనకు ఇలాంటి అద్భుతమైన వ్యక్తిని పరిచయం చేసిన బిగ్ బాస్ కి థాంక్స్ చెప్పాడు.  ఎల్లపుడూ నీ వెంటే ఉంటానంటూ.. ఎలాంటి పరిస్థితి ఎదురైనా నీకు అండగా ఉంటానంటూ మోనాల్ ని ఉద్దేశిస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. అఖిల్ పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు మోనాల్ కి విషెస్ చెబుతూ అఖిల్ ఎమోషనల్ మాటలకు ఫిదా అవుతున్నారు. త్వరలోనే ఈ జంట 'గుజరాతి అమ్మాయి తెలుగు అబ్బాయి' అనే పేరుతో తెరకెక్కుతోన్న సిరీస్ లో నటించబోతున్నారు. 

డాక్టర్ బాబు సినిమా ఛాన్స్.. నాని కొట్టేశాడు!

  టాలీవుడ్ లో నేచురల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరో నాని.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సోలోగా పైకొచ్చాడు. అలాంటి నాని తన సినిమా ఛాన్స్ కొట్టేశాడని అంటున్నారు 'కార్తీక దీపం' సీరియల్ ఫేమ్ నిరుపమ్. నిజానికి నాని దర్శకుడు కావాలనే ఆశతో ఇండస్ట్రీకి వచ్చాడు. కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేశారు. ఈ క్రమంలో ఎన్నో కథలను కూడా రాసుకున్నాడు.  కానీ ఊహించని విధంగా అతడికి 'అష్టా చమ్మా' సినిమాలో హీరోగా ఛాన్స్ రావడంతో మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకొని అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ సినిమా రిజల్ట్ తో నానికి వరుస అవకాశాలు వచ్చాయి. 'ఈగ', 'పిల్ల జమీందార్' లాంటి సినిమాల తరువాత ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అయితే హీరోగా నానికి మొదటి ఛాన్స్ రావడానికి పరోక్షంగా నటుడు నిరుపమ్ కారణమయ్యాడని తెలుస్తోంది.  నిజానికి 'అష్టా చమ్మా' సినిమాలో హీరో ఛాన్స్ ముందుగా తన దగ్గరకు వచ్చిందని నిరుపమ్ చెప్పాడు. మొద‌ట ఆడిష‌న్స్‌ను ర‌మ్మ‌ని చెప్పి, త‌ర్వాత రోజు బ‌య‌లుదేర‌బోతుంటే రావ‌ద్ద‌ని చెప్పార‌ని ఆలీతో స‌ర‌దాగా షోలో వెల్ల‌డించాడు. అప్పుడే ఓ సీరియల్ సైన్ చేయడంతో 'అష్టా చమ్మా' మేకర్లు తనకు ఛాన్స్ ఇవ్వలేదని.. సీరియల్స్ తో బిజీగా ఉన్నావ్ గా.. సినిమా ఆడిషన్స్ వద్దులే అంటూ తనను లైట్ తీసుకున్నార‌ని నిరుపమ్ చెప్పుకొచ్చాడు. మొదట ఇంట్రెస్ట్ చూపించిన డైరెక్ట‌ర్ మోహ‌న‌కృష్ణ తరువాత తాను సీరియ‌ల్ యాక్ట‌ర్‌న‌నే ఉద్దేశంతో ప‌క్క‌న పెట్టిన‌ట్లున్నార‌ని బాధ‌ప‌డ్డాడు.

కొత్తింటికి మారిన బిగ్ బాస్ బ్యూటీ!

  యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి అతి తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది అరియానా గ్లోరీ. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో చేసిన ఒక్క ఇంటర్వ్యూతో అరియానా బాగా ఫేమస్ అయిపోయింది. గతేడాది బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా పాల్గొనే ఛాన్స్ ను దక్కించుకుంది. ఈ షోలో అమ్మడు తన ముక్కుసూటితనంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. పలు సెలబ్రిటీలు సైతం అరియనా యాటిట్యూడ్ కు ఫిదా అయ్యారు.  హౌస్ లో ఉన్నన్ని రోజులు ఆమెకి ఓట్లు వేసి ఫైనల్స్ వరకు తీసుకొచ్చారు. కానీ ఆమె ట్రోఫీ అందుకోలేకపోయింది. హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత అరియానాకు ఇండస్ట్రీలో అవకాశాలు బాగానే వస్తున్నాయి. పలు టీవీ షోలలో కనిపించడంతో పాటు సినిమాలు కూడా సైన్ చేస్తోంది. రీసెంట్ గా ఈ బ్యూటీ పెళ్లికూతురు గెటప్ లో కనిపించడంతో ఆమె పెళ్లి చేసుకోబోతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.  ఇదిలా ఉండగా.. తాజాగా అరియానా కొత్తింటికి షిఫ్ట్ అయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో అరియానా తన మంకీ బొమ్మను చూపిస్తూ.. చింటూని బాగా మిస్ అయ్యానంటూ సందడి చేసింది. ఎక్కడపడితే అక్కడ సామాన్లతో నిండిపోయి గజిబిజిగా ఉన్న ఇంటిని చూపిస్తూ.. కొత్త ఇంటికి మారాం.. చూడండి ఇదీ మా పరిస్థితి అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో చెప్పుకొచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. కొత్తిల్లు కొన్నారా అంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు. కానీ అరియనా మాత్రం సమాధానం చెప్పలేదు!

క్యూట్ పోజుల‌తో రచ్చ చేస్తోన్న రష్మీ!

  'జబర్దస్త్', 'ఎక్ట్రా జబర్దస్త్' షోల ద్వారా యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది రష్మీ గౌతమ్. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. బుల్లితెరపై దూసుకుపోతున్న రష్మీ సినిమా ఆఫర్లు కూడా అందిపుచ్చుకుంటోంది. దాదాపు ఎనిమిదేళ్లుగా తన సత్తా చాటుతోన్న రష్మీ.. తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకోగలిగింది. ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.  తాజాగా బ్లాక్ డ్రెస్ లో తీసుకున్న కొన్ని ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అతి తక్కువ సమయంలో ఈ ఫోటోలకు లక్షల్లో లైక్స్ వస్తున్నాయి. ఈ ఫొటోల్లో అమ్మడు క్యూట్ పోజుల‌తో, కొద్దిపాటి క్లీవేజ్ షోతో రచ్చ చేసింది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు చాలా అందంగా ఉన్నావని.. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోవంటూ కామెంట్స్ చేస్తున్నారు.  ఓపక్క 'ఎక్స్‌ట్రా జబర్దస్త్' షోతో పాటు 'ఢీ' షోలో టీమ్ లీడర్ గా వ్యవహరిస్తోన్న రష్మీ సామాజిక అంశాలపై కూడా స్పందిస్తుంటుంది. మూగ జీవాలను కాపాడాలంటూ ఎప్పటికప్పుడు రష్మీ పోస్ట్ లు పెడుతూనే ఉంటుంది. అలానే లాక్ డౌన్ సమయంలో ఆకలితో ఇబ్బంది పడుతున్న వీధి కుక్కలకు ఆహరం అందేలా రష్మీ చర్యలు చేపట్టింది. 

మోనాల్ వ‌ల్లే షో చూడ్డం మానేశాం.. ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు!

  హీరోయిన్ గా ఒకట్రెండు సినిమాలు చేసిన గుజరాతీ ముద్దుగుమ్మ మోనాల్ నటిగా సరైన సక్సెస్ ను అందుకోలేకపోయింది. దీంతో టాలీవుడ్ నుండి షిఫ్ట్ అయి ఇతర భాషల్లో సినిమాలు చేసుకుంది. అదే సమయంలో ఆమెకి బిగ్ బాస్ సీజన్ 4లో ఛాన్స్ రావడంతో తిరిగి ఇక్కడకి వచ్చింది. హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన వెంటనే ట్రయాంగిల్ లవ్ స్టోరీతో వార్తల్లో నిలిచింది. అఖిల్, మోనాల్, అభిజిత్ లకు సంబంధించి రోజూ వార్తలు వచ్చేవి. అయితే కొన్నిరోజులకే అభిజీత్ దూరం పెట్టడంతో అఖిల్ తో మోనాల్ మరింత క్లోజ్ అయింది.  దీంతో ఇద్దరి మధ్య ఏదో ట్రాక్ నడుస్తోంద‌ని ఫిక్స్ అయిపోయారు జనాలు. హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత కూడా వీరిద్దరూ కలిసి సోషల్ మీడియాలో రచ్చ చేయడం, చనువుగా ఉండడం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ షో అనంతరం మోనాల్ కి వరుస అవకాశాలు వస్తున్నాయి. 'అల్లుడు అదుర్స్' సినిమాలో ఐటెం సాంగ్ చేసింది. అలానే బుల్లితెరపై ప్రసారమవుతోన్న 'డాన్స్ ప్లస్' షోకి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది. అయితే మోనాల్ ని జడ్జ్ గా తీసుకున్నప్పటి నుండి ఆమెను ట్రోల్ చేస్తూనే ఉన్నారు నెటిజన్లు.  ఆమెకి జడ్జ్ గా ఉండే అర్హత లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా డాన్స్ ప్లస్ షోకి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో మోనాల్ స్టేజ్ పైకి వెళ్లి ఓ కంటెస్టెంట్ తో కలిసి డాన్స్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు మోనాల్ ని మరింత టార్గెట్ చేశారు. మోనాల్ వలనే ఈ షో చూడడం మానేశామంటూ మండిపడుతున్నారు. అందరూ డాన్స్ మాస్టర్స్ జడ్జ్ గా వ్యవహరిస్తుంటే ఈమెను ఎలా తీసుకున్నారంటూ మోనాల్ ను ఉద్దేశిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ట్రోలింగ్ పై మోనాల్ స్పందిస్తుందేమో చూడాలి!

'జబర్దస్త్' జడ్జ్ ఇంద్రజ అసలు పేరును ఊహించ‌గ‌ల‌రా?

  తెలుగులో ఒకప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేసిన నటి ఇంద్రజ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అవకాశాలు తగ్గడంతో ఇండస్ట్రీకి దూరమైన ఈమె.. తన సెకండ్ ఇన్నింగ్స్ ను ఇటీవ‌ల‌ మొదలుపెట్టారు. ఈ క్రమంలో పలు చిత్రాల్లో నటించారు. ఈ మధ్యకాలంలో 'శ‌త‌మానం భ‌వ‌తి', 'సాఫ్ట్‌వేర్‌ సుధీర్', 'అల్లుడు అదుర్స్' వంటి చిత్రాలలో నటించారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఇంద్రజ 'జబర్దస్త్' షోకి జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో కొన్ని స్కిట్ లలో ఆమెని పొగుడుతూ కామెంట్స్ చేస్తుంటారు.  ఇంద్రజ పేరుని ఆ ఇంద్రుడే పెట్టాడంటూ ఆమె అందాన్ని పొగుడుతుంటారు. అయితే ఇంద్రజ అసలు పేరు అది కాదట. సినిమాల్లో గుర్తింపు సంపాదించుకోవడం కోసం తన పేరుని ఇంద్రజగా మార్చుకున్నార‌ట‌. 1978వ సంవత్సరంలో చెన్నైలో జన్మించిన ఇంద్రజ అసలు పేరు రాజాతి. ఆమె నటి మాత్రమే కాదు.. సింగర్ కూడా. స్కూల్ లో చదువుకునే సమయంలోనే ఇంద్రజ సంగీత పోటీలతో పాటు నాటక పోటీలలో పాల్గొని బహుమతులు సొంతం చేసుకున్నారు.  తెలుగుతో పాటు మలయాళంలో కూడా ఇంద్రజ మంచి పేరు సంపాదించుకున్నారు. పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన ఆమె.. తమిళంలో కొన్ని రియాలిటీ షోలకు హోస్ట్ గా వ్యవహరించారు. ఇప్పుడు 'జబర్దస్త్' షోకి తాత్కాలికంగా జడ్జ్ గా హాజరవుతున్నారు. రోజా రీఎంట్రీ ఇస్తే.. ఇంద్రజ ఈ షోకి దూరం కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇంద్రజ కొన్ని తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు. 

యాక్ట‌ర్లూ అంత ఓవరాక్షన్ వ‌ద్దు! వైర‌ల్ అయిన టీవీ న‌టి పోస్ట్‌!!

  దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. అందరూ వ్యాక్సిన్ కోసం కోవిడ్ సెంటర్ల ముందు బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీలు టీకా తీసుకుంటూ దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. వ్యాక్సిన్ వేయించుకోవడం వలన ఎలాంటి ప్రాణహాని ఉండదంటూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.  ఇక్కడవరకు బాగానే ఉంది కానీ.. వ్యాక్సిన్ తీసుకుంటూ కొందరు సెలబ్రిటీలు చేసే ఓవరాక్షన్ చూడలేకపోతున్నామంటూ ప్రముఖ టీవీ నటి ఆషా నేగి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరీ అంత ఓవర్ యాక్టింగ్ అవసరం లేదని.. చాలా చిరాకుగా ఉంటుందంటూ ఇన్స్టాగ్రామ్ లో రాసుకొచ్చింది. అయితే ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేసిందో చెప్పలేదు. కానీ ఈ పోస్ట్ పై స్పందించిన పలువురు నెటిజన్లు నటి అంకిత లోఖండే గురించని అభిప్రాయ పడుతున్నారు.  ఇటీవల అంకిత వ్యాక్సిన్ తీసుకుంటూ వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె భయపడుతూ, దేవుడిని ప్రార్ధిస్తూ టీకా వేసుకుంది. దీంతో పాటు ఆమె మరొక సెటైర్ కూడా వేసింది. "ఇక అంతా అడుగుతున్నారు.. వీడియోగ్రాఫర్‌ ని మీరే తీసుకువెళ్తారా.. లేక ఆస్పత్రి వాళ్లే ఏర్పాటు చేస్తున్నారా అని'' అంటూ పోస్ట్ చేసింది ఆషా.

చెప్పుల దండేసి ఊరేగిస్తామంటూ.. నిరుపమ్‌కి బెదిరింపులు!

  'కార్తీకదీపం' సీరియల్ లో డాక్టర్ బాబు పాత్రతో సూపర్ ఫేమస్ అయిపోయాడు నిరుపమ్ పరిటాల. బుల్లితెర ప్రేక్షకుల్లో ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా నిరుపమ్ తన భార్య మంజులతో కలిసి 'అలీతో సరదాగా' షోకి అతిథులుగా విచ్చేశాడు. ఈ సందర్భంగా ఎన్నో విషయాలను పంచుకున్నాడు. తన ఇంటి పేరు పరిటాల కావడంతో పరిటాల రవి పేరుని చాలా సందర్భాల్లో వాడేశానని నిరుపమ్ చెప్పాడు.  'ఇంద్ర' సినిమా ఫస్ట్ డే థియేటర్ కు వెళ్లినప్పుడు కానిస్టేబుల్ తన బైక్ కీ తీసుకొని వెళ్లిపోతుండగా.. అతడి దగ్గరకి వెళ్లి పరిటాల రవికి ఫోన్ చేస్తా అంటూ బెదిరించానని.. దీంతో కీ ఇచ్చేసి నెక్స్ట్ డే మూవీ టికెట్స్ కూడా ఆయనే ఇచ్చారని అప్పటి సంగతులు గుర్తు చేసుకున్నాడు. నిరుపమ్ తో పాటు అతడి భార్య మంజుల కూడా పరిటాల పేరుని వాడేశానని అన్నారు. లైసెన్స్ తీసుకున్న సమయంలో పరిటాల రవి మీకు బంధువులు అవుతారా? అని అడిగారని.. అవునని చెప్పడంతో వెంటనే లైసెన్స్ ఇచ్చారని చెప్పుకొచ్చారు.  ఇక ఓ సీరియల్ చేస్తోన్న సమయంలో త‌న‌కు బెదిరింపులు వ‌చ్చిన విష‌యాన్ని నిరుపమ్ బయటపెట్టాడు. చంపేస్తాం.. నువ్ ఎలా ఉంటావో చూస్తామంటూ మెయిల్స్, కాల్స్ వచ్చేవని.. చెప్పుల దండ వేసి సన్మానం చేస్తామంటూ ఓ రేంజ్ లో వార్నింగ్ లు ఇచ్చేవారని తెలిపాడు. ఆ పాత్ర మీద వాళ్లు చూపించే అతి ప్రేమ అనుకోవచ్చని.. సీరియల్ ని సీరియల్ లా చూస్తే ఇంతలా రియాక్ట్ అవ్వరని.. కాస్త ఎక్కువ‌ కావడం వలన ఇలాంటి ఇబ్బందులు వస్తాయని నవ్వుతూ చెప్పుకొచ్చాడు. 

నా లైఫ్ ఫ్యామిలీకే అంకితం!

  బుల్లితెరపై యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది శ్రీముఖి. పలు షోలలో యాంకరింగ్ చేస్తూ బిజీగా మారింది. వరుస షోలతో బిజీగా ఉన్న సమయంలోనే ఆమెకి బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం వచ్చింది. ఫైనల్స్ వరకు వచ్చిన ఆమె రన్నరప్ గా నిలిచింది. అప్పుడప్పుడు సినిమాల్లో కనిపించే ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు తన ఫోటోషూట్లను షేర్ చేస్తూ తన గ్లామర్ తో యూత్ ను ఆకట్టుకుంటోంది.  రీసెంట్ గా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న ఈ భామ ప్రేమ, పెళ్లి వంటి విషయాలపై స్పందించింది. తను పెళ్లి చేసుకోవాలంటే ముందు ఆర్థికంగా సెటిల్ అవ్వాలని చెబుతోంది ఈ బ్యూటీ. నిజానికి శ్రీముఖి గతంలో ఓ వ్యక్తితో రిలేషన్ లో ఉంది. కానీ అతడు తనకు పెళ్లైన విషయాన్ని చెప్పకుండా మోసం చేయడంతో ఆ రిలేషన్ కి బ్రేకప్ చెప్పేశానని తెలిపింది. ఫ్యూచర్ లో కూడా ప్రేమ పెళ్లి చేసుకుంటానని చెబుతోంది శ్రీముఖి.  అయితే మరో రెండేళ్ల వరకు పెళ్లి ఆలోచన చేయనని అంటోంది. ప్రస్తుతం తాను బిజీగా ఉండడం వలన ఇంట్లో కూడా ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పింది. పెళ్లి తరువాత లైఫ్ మొత్తం ఫ్యామిలీకే అంకితం చేస్తానని అంటోంది. అయితే పెళ్లికి ముందు ఆర్థికంగా సెటిల్ అవ్వాలని.. ఆ ఒక్కటి చేసిన తరువాతే పెళ్లి చేసుకుంటానని చెబుతోంది. తను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఇన్నోసెంట్ గా ఉండాలని.. తనతో చనువుగా ఉండాలని మనసులో కోరికను బయటపెట్టింది. 

హాట్ ఫోటోలతో 'విష్ణు'మాయ‌!.. సినిమా ఛాన్సుల కోస‌మా?

  బుల్లితెర యాంకర్లుగా రాణిస్తున్న చాలా మందికి వెండితెరపై కూడా వెలిగిపోవాలని కోరిక. ఇప్పటికే అనసూయ, రష్మీ లాంటి యాంకర్లు సినిమా అవకాశాలతో బిజీ అయ్యారు. ఇప్పుడు విష్ణుప్రియ, వర్షిణి లాంటి యాంకర్లు సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే విష్ణుప్రియ 'చెక్ మేట్' అనే సినిమాలో లీడ్ రోల్ లో నటించింది. అయితే ఇప్పటివరకు ఈ సినిమా విడుదల కాలేదు. ఇదిలా ఉండగా.. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.  ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ దర్శకనిర్మాతల దృష్టిలో పడే ప్రయత్నం చేస్తోంది. కొద్దిరోజుల క్రితం ఇన్నర్ వేర్ తో ఫోటో షూట్ లో పాల్గొని వాటిని అభిమానులతో పంచుకుంది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. తాజాగా ఈ భామ చీర కట్టుకొని ఓ ఫోటో షూట్ చేసింది. చీరలో తన అందాలను ఆరబోస్తూ ఫోటోలను ఫోజులిచ్చింది.  క్లీవేజ్ షో చేస్తూ విష్ణుప్రియ ఇచ్చిన ఫోజులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ స్టిల్స్ చూసిన వారంతా సినిమా అవకాశాల కోసమే అమ్మడు ఇంతగా ప్రయత్నిస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ఫోటోలు చూసైనా.. మన మేకర్లు అమ్మడుకు అవకాశాలు ఇస్తారేమో చూడాలి. ప్రస్తుతం విష్ణుప్రియ బుల్లితెరపై 'పోవే పోరా' షోతో బిజీగా ఉంది. 

ముక్కు అవినాష్ పెళ్లి ఫిక్స్ కానీ..!

  'జబర్దస్త్' షోతో బుల్లితెరకు పరిచయమైన కమెడియన్ ముక్కు అవినాష్. తన కామెడీ టైమింగ్ తో క్రేజ్ తెచ్చుకున్న అవినాష్ కి బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొనే ఛాన్స్ వచ్చింది. హౌస్ లో అవినాష్ ఎంట్రీ ఇచ్చిన తరువాత తన కామెడీతో అందరినీ ఎంటర్టైన్ చేశాడు. తన పాపులారిటీ బాగా పెంచుకున్నాడు. దీంతో వరుస ఆఫర్లు అందుకుంటూ బుల్లితెరపై దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉండగా.. తాజాగా అవినాష్ పెళ్లికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  బిగ్ బాస్ నాలుగో సీజన్ సమయంలోనే అవినాష్ పెళ్లి విషయం హాట్ టాపిక్ అయింది. హౌస్ లో ఉన్నన్ని రోజులు కూడా అవినాష్ తన పెళ్లి గురించే మాట్లాడుతుండేవాడు. అదే సమయంలో అరియనా గ్లోరీతో ట్రాక్ నడుపుతున్నట్లు కనిపించేవాడు. అంతేకాదు.. హౌస్ లోకి వచ్చిన వాళ్ల అమ్మతో తన పెళ్లి చేయమని కోరాడు. దీంతో అప్పట్లో అవినాష్ పెళ్లి వార్తలు హైలైట్ అయ్యేవి. ఇటీవల ఈ టాప్ కమెడియన్ కి పెళ్లి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. బుల్లితెర వర్గాల్లో ఈ వార్త చక్కర్లు కొడుతోంది.    నిజానికి ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకోవాలని అవినాష్ భావించాడట. కానీ ఇప్పడు వచ్చే ఏడాదికి పెళ్లి వాయిదా వేసుకున్నట్లు టాక్. ప్రస్తుతం కరోనా ప్రభావం తీవ్రంగా ఉండడంతో అవినాష్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీకి సంబంధం లేని ఓ తెలంగాణ అమ్మాయిని అవినాష్ పెళ్లి చేసుకోబోతున్నాడని సమాచారం. ప్రస్తుతం అవినాష్ 'కామెడీ స్టార్స్' అనే షోతో పాటు పలు షోలలో సందడి చేస్తున్నాడు. 

కీర్తి సీమంతంలో డాక్టర్ బాబు దంప‌తులు.. ఫోటోలు వైరల్!

  బుల్లితెరపై అత్యధిక టీఆర్పీతో దూసుకుపోతున్న సీరియల్‌ 'కార్తీకదీపం'. నటుడు నిరుపమ్ పరిటాల డాక్టర్ బాబు పాత్రలో, ప్రేమి విశ్వనాథ్.. దీప పాత్రలో జీవించేస్తున్నారు. రీసెంట్ గా డాక్టర్ బాబు రియల్ లైఫ్ మరదలికి సీమంతం జరిగింది. ఈ ఫంక్షన్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నటుడు, రచయిత ఓంకార్ పరిటాల వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నిరుపమ్ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.  ఆయన భార్య మంజుల కూడా సీరియల్స్ లో నటిస్తోంది. ఆమె సోదరి కీర్తి, సోదరి భర్త ధనుష్ కూడా సీరియల్ నటులే. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. కీర్తి ఓ ప్రముఖ ఛానెల్ లో ప్రసారమవుతున్న 'హిట్లర్ గారి పెళ్లాం' అనే సీరియల్ లో నటిస్తోంది. కీర్తి భర్త‌ ధనుష్ కూడా సీరియల్స్ లో హీరోగా నటిస్తున్నాడు. అత‌ను కొన్ని సినిమాల్లోనూ న‌టించాడు. రీసెంట్ గా కీర్తి సీమంతం ఆమె నివాసంలోనే ఘనంగా జరిగింది.  కరోనా కారణంగా అతి తక్కువమంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో వేడుక జరిగింది. ఈ వేడుకలో నిరుపమ్ తన భార్య మంజులతో కలిసి సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను మంజుల త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక కీర్తి కన్నడ సీరియల్స్ తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. తెలుగులో సైతం ఆమె పలు సీరియల్స్ లో నటించింది. 

బిగ్ బాస్ విన్న‌ర్ పెళ్లెప్పుడంటే...

  బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొన్న నటుడు అభిజిత్ ఫైనల్స్ వరకు వెళ్లి.. విజేతగా ట్రోఫీ అందుకున్నారు. ఈ షోతో అభిజిత్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో లైవ్ లోకి వస్తూ అభిమానులతో ముచ్చటిస్తుంటాడు అభిజిత్. తాజాగా లైవ్ లోకి వచ్చిన అభిజిత్.. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితి గురించి మాట్లాడాడు. రోజుకి నాలుగు లక్షల కేసులు వస్తున్నాయంటే మాట్లాడడానికే చాలా బాధగా ఉందని అన్నాడు.  ప్రపంచంలో మన దేశమే దారుణమైన స్థానంలో ఉందంటూ అభిజిత్ అన్నాడు. ఇలాంటి సమయంలో బయటకు వెళ్లకుండా ఉండడమే మంచిదని.. ఇప్పుడు ఎవరి ప్రాణాలు వారు కాపాడుకోవడమే ముఖ్యమని చెప్పాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సేవలు అందిస్తోన్న డాక్టర్లు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు అభిజిత్ ధన్యవాదాలు తెలిపాడు. అనంతరం అభిజిత్ ను సినిమా, పెళ్లి వంటి విషయాల గురించి నెటిజన్లు ప్రశ్నించారు.  అప్పుడెప్పుడో మూడు ప్రాజెక్ట్ లు లైన్ లో ఉన్నాయని చెప్పిన అభిజిత్.. ఇప్పటివరకు వాటిని అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇప్పుడు ఇంట్లోనే ఉంటూ కొత్తవాటిని నేర్చుకుంటున్నానని.. ప్రస్తుతం స్పానిష్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నట్లు చెప్పాడు. అలానే స్క్రిప్ట్ లు వింటున్నానని.. ఇప్పుడే ఏం చెప్పలేనని అన్నాడు. పెళ్లెప్పుడు అని అడిగిన నెటిజన్ కు నవ్వుతూ.. ఇప్పుడప్పుడే ఉండదులే అంటూ బదులిచ్చాడు. 

'జబర్దస్త్' భజన.. మామూలుగా లేదుగా!

  బుల్లితెరపై 'జబర్దస్త్' షోకి ప్రత్యేకమైన స్థానం ఉంది. తెలుగులో నెంబర్ వన్ కామెడీ షోగా దూసుకుపోతోంది. గత ఎనిమిదేళ్లుగా ప్రసారమవుతోన్న ఈ షోకి ప్రేక్షకాదరణ రోజురోజుకి పెరుగుతోంది. అయితే కొన్నిసార్లు మల్లెమాల, జబర్దస్త్ షోల మీద జనాల్లో వ్యతిరేకత వచ్చింది. ఆర్టిస్ట్ లను అగ్రిమెంట్ పేరుతో బంధిస్తున్నారని.. ముఖ్యంగా అవినాష్ విషయంలో మల్లెమాలపై నెగెటివిటీ క్రియేట్ అయింది. బిగ్ బాస్ షోకి వెళ్లడానికి అవినాష్ ని మల్లెమాల సంస్థ అనుమతించలేదని.. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవడానికి పది లక్షల రూపాయలు కట్టించుకున్నారని అవినాష్ స్వయంగా బిగ్ బాస్ హౌస్ లో చెప్పాడు.  దీంతో 'జబర్దస్త్' షోపై నెగెటివ్ కామెంట్స్ వినిపించాయి. దీంతో మల్లెమాల సంస్థ 'జబర్దస్త్' ఇమేజ్ ని పెంచే పనిలో పడింది. స్పెషల్ ఈవెంట్స్ లో 'జబర్దస్త్' షో గొప్పదనం గురించి చెబుతున్నారు. నిజానికి ఈ షో చాలా మందికి లైఫ్ ఇచ్చింది. కానీ అందులో నియంతృత్వ పోకడలున్నాయంటూ విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. నాగబాబు సైతం 'జబర్దస్త్' షోని వదిలేస్తూ నెగెటివ్ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. వచ్చేవారం ప్రసారం కాబోతున్న ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో రాకింగ్ రాకేశ్‌.. బండ్ల గణేష్ అవతారమెత్తి 'జబర్దస్త్' పై తన భక్తిని చాటుకున్నాడు.  ఈ షో ఒక అద్భుతమని.. ఎందరికో జీవితాలను ప్రసాదించిందని తెగ పొగిడేశాడు. అనంతరం జడ్జ్ మనో.. "కొన్ని కోట్ల మంది ఈ షో వలన రిలాక్స్ అవుతున్నారనేది పచ్చి నిజం" అంటూ కామెంట్ చేశాడు. 'జబర్దస్త్ లేకపోతే ఇక్కడ ఎవరం ఉండేవాళ్లం కాదని' హైపర్ ఆది అన్నాడు. "ఈరోజు మాతో పాటు మా కుటుంబాలన్నీ హ్యాపీగా ఉన్నాయంటే కారణం జబర్దస్త్" అని సుధీర్ అన్నారు. ఇలా ఒక్కొక్కరు 'జబర్దస్త్'పై పాజిటివ్ కామెంట్స్ చేస్తుండగా.. 'కేజీఎఫ్' బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేసి వారి మాటలను మరింత ఎలివేట్ చేసే ప్రయత్నం చేశారు. 

బిగ్ బాస్ బ్యూటీ డాన్స్ వీడియో.. వైర‌ల్ చేస్తున్న ఫ్యాన్స్‌!

  సోషల్ మీడియాలో దేత్తడి హారిక షేర్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. పొట్టి దుస్తుల్లో అమ్మడు డాన్స్ చేస్తూ రెచ్చిపోయిన ఈ వీడియోను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. తెలంగాణ యాసతో, బోల్డ్ మాటలతో షార్ట్ ఫిలిమ్స్ చేసి క్రేజ్ సంపాదించుకుంది హారిక. అప్పుడప్పుడు తన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ తన ఫాలోయింగ్ మరింత పెంచుకుంటుంది. ఈ క్రమంలో ఆమె పోస్ట్ చేసిన డాన్స్ వీడియో చూసి అందరూ షాకవుతున్నారు.  కేవలం యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాపులర్ అయిన కొందరు వ్యక్తుల్లో హారిక ఒకరని చెప్పాలి. 'దేత్తడి' అనే యూట్యూబ్ ఛానెల్ మొదలుపెట్టి డిఫరెంట్ వీడియోలు రిలీజ్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అతి తక్కువ సమయంలోనే బాగా ఫేమస్ అయింది. ఈ ఫేమ్ కారణంగానే ఆమెకి బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొనే ఛాన్స్ వచ్చింది. తన మేనరిజం, బాడీ లాంగ్వేజ్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది.  బిగ్ బాస్ ఫైనల్స్ వరకు చేరుకొని ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. అప్పటినుండి సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా ఉంటోంది. తన టాలెంట్ ను బయటపెడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో ఇటీవ‌ల‌ ఓ డాన్స్ వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో పొట్టి బట్టలేసుకుని తన అందంతో ఎట్రాక్ట్ చేస్తోంది. అదిరిపోయే స్టెప్పులతో మెప్పించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

అనసూయని పెళ్లి చేసుకుంటే ఎంత బాగుండేదో..! ఊహ‌ల్లో హైప‌ర్ ఆది!!

  బుల్లితెరపై ప్రసారమయ్యే 'జబర్దస్త్' షోలో యాంకర్ అనసూయ-హైపర్ ఆది జోడీకి స్పెషల్ క్రేజ్ ఉంది. అనసూయపై రొమాంటిక్ పంచ్ లు వేస్తూ.. ప్రేక్షకులను నవ్విస్తుంటాడు హైపర్ ఆది. 'జబర్దస్త్' వేదికపై వీరిద్దరి రొమాంటిక్ ముచ్చట్లు చాలానే ఉన్నాయి. ఎన్నో ప్రోగ్రామ్స్ లో అనసూయతో కలిసి రొమాంటిక్ డాన్స్ లు వేస్తూ బుల్లితెరను షేక్ చేసిన‌ హైపర్ ఆది ఇప్పుడు అదే అనసూయను ఉద్దేశించి పెళ్లి గురించి కామెంట్స్ చేశాడు. హైపర్ ఆది పంచ్ ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డబుల్ మీనింగ్ డైలాగులకు రొమాన్స్ జోడించి దూసుకుపోతుంటాడు.  ఈ క్రమంలో తాజాగా విడుదలైన 'జబర్దస్త్' ప్రోమోలో యాంకర్ అనసూయను ఉద్దేశిస్తూ హైపర్ ఆది చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అనసూయని పెళ్లి చేసుకుంటే ఎంత బాగుండేదో అంటూ తన కోరికను బయటపెట్టాడు. మే 13న ప్రసారం కాబోయే 'జబర్దస్త్' ప్రోగ్రామ్ కి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.  ఇందులో హైపర్ ఆది, శాంతి స్వరూప్ లు ఓ స్కిట్ చేశారు. హైపర్ ఆది భార్యగా శాంతి స్వ‌రూప్‌, మరదలిగా అనసూయ స్టేజ్ పైకి వచ్చారు. అనసూయను చూస్తూ.. 'ఏంటి మీ చెల్లి తల ఎత్తదా..?' అని హైపర్ ఆది.. శాంతి స్వరూప్ ని అడుగుతాడు. దానికి అనసూయ 'మా నాన్నగారు ఎత్తొద్దన్నారు' అని చెప్తుంది.  ఆ తరువాత 'మా చెల్లి చపాతీలా ఉంటుంది' అని శాంతి స్వరూప్ చెప్పగా.. 'ఆవిడ చపాతీలా ఉంటే.. నువ్వు చపాతీ కర్రతో కొట్టినట్లు ఉంటావు' అంటూ పంచ్ వేసేశాడు ఆది. దీంతో వెంటనే అనసూయ రియాక్ట్ అవుతూ 'మా అక్క పరువు తీయొద్దు. తను నాకు ఎన్నో ఇచ్చింది.. తను చదువు మానేసి నాకు పలకిచ్చి పంపింది' అంటూ కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ చెప్పింది. దీంతో హైపర్ ఆది వెంటనే 'అది పెళ్లి చేసుకోవడం మానేసి నీకిచ్చి చేసినా బాగుండేది' అనేశాడు. అన‌సూయ స‌హా అంద‌రూ ఒక్క‌సారి షాకై, ఆ త‌ర్వాత ఆది పంచ్‌కు నవ్వేశారు. ఈ ప్రోమో తెగ వైర‌ల్ అవుతోంది.

ఇటు భార్య‌తో రొమాన్స్‌.. అటు న‌వ్యతో కెమిస్ట్రీ!

  బుల్లితెరపై వచ్చే షోలలో ఈ మధ్యకాలంలో రొమాన్స్ డోస్ కాస్త ఎక్కువైంది. లవ్ ట్రాక్స్, డబుల్ మీనింగ్ డైలాగులు ఇప్పటికే చాలా ఎక్కువయ్యాయి. అయితే యాంకర్ సుమ నిర్వహించే షోలావు ఇలాంటివి పెద్దగా కనిపించవు. కానీ తాజాగా విడుదలైన 'క్యాష్' ప్రోమోలో మాత్రం రొమాన్స్ ఓ రేంజ్ లో పండించారు. ఈ ప్రోమో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. రియల్ జంట, రీల్ జంట అంటూ వచ్చే వారం ప్రసారం కాబోయే ఓ ఎపిసోడ్ లో సుమ గెస్ట్ లను ఓ రేంజ్ లో ఆడుకున్నారు.  రియల్ జంటలో భాగంగా 'దేవత' సీరియల్ ఫేమ్ అర్జున్, అతని భార్య సురేఖలను గెస్ట్ లుగా తీసుకురాగా.. రీల్ జంటలో భాగంగా రవికృష్ణ, నవ్యలను తీసుకొచ్చారు. షోలో భాగంగా సురేఖను.. మీ ఆయన రాత్రి తొమ్మిది గంటలకు వస్తానని చెప్పి పన్నెండు అయినా రాకపోతే ఏం చేస్తావని సుమ అడిగారు. దానికి సురేఖ వెంటనే.. వీడియో కాల్ చేస్తా అని అనడం, దానికి రవి "నెట్ ఆఫ్ చేస్కో" అని సలహా ఇవ్వడం అందరినీ నవ్వించింది. ఆ తరువాత నవ్యని.. "లవ్ మ్యారేజ్ చేసుకుంటావా..? ఎరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటావా..?" అని సుమ ప్రశ్నించింది. దాని నవ్య.. "అరేంజ్డ్" అని.. లవ్ చేసినా.. పెద్దలను కన్విన్స్ చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పింది.    వెంటనే సుమ "మరి ఎవరినైనా లవ్ చేస్తున్నావా..?" అని అడిగింది. దానికి నవ్య.. రవికృష్ణ వైపు చూసి లేదని చెప్పింది. దీంతో సుమ "అటు వైపు ఎందుకు చూశావ్?" అంటూ నవ్యని ఏడిపించేసింది. మ‌ధ్య‌లో ర‌వికృష్ణ "యాక్ష‌న్" అని చెప్ప‌గా, అర్జున్‌, న‌వ్య‌స్వామి రొమాంటిక్ సీన్‌కు ప‌ర్ఫామ్ చేయ‌డం, దాన్ని చూసి సురేఖ ఉడుక్కోవ‌డం అల‌రించింది. చివర్లో అర్జున్ తన భార్యకు ప్రపోజ్ చేస్తూ.. గులాబీపువ్వుని ఇచ్చాడు. ఆ పువ్వుని మునిపంటితో బంధించేసింది సురేఖ. అప్పుడు అర్జున్ తన నోటితో ఆ పువ్వుని లాగేసుకోవడంతో అందరూ నోరెళ్లబెట్టేశారు. దీనికి సంబందించిన ప్రోమో యూట్యూబ్ లో వైరల్ అవుతోంది. 

ఆడి కారు, లగ్జరీ లైఫ్.. క్లారిటీ ఇచ్చిన 'జబర్దస్త్' కమెడియన్!

  'జబర్దస్త్' షో ద్వారా చాలా మంది కమెడియన్స్ లైమ్ లైట్ లోకి వచ్చాయి. బుల్లితెరపైనే కాకుండా సినిమా అవకాశాలు కూడా అందుకుంటున్నారు. ముఖ్యంగా అమ్మాయిల గెటప్స్ వేస్తూ నవ్వించే కమెడియన్స్ కి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే వీరిలో చాలా మంది ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆర్థికంగా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇదిలా ఉండగా.. హైపర్ ఆది టీమ్ లో లేడీ గెటప్ వేసే శాంతి స్వరూప్ కోట్లు సంపాదించాడని చాలా కాలంగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. అతడొక ఆడి కారు కొన్నాడని టాక్. అయితే ఈ విషయాలపై శాంతి స్వరూప్ క్లారిటీ ఇచ్చాడు.  తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా హోమ్ టూర్ వీడియో చేసి అందులో తన ఆస్తుల విషయాల గురించి మొత్తం క్లారిటీగా చెప్పాడు. తను ప్రస్తుతం కృష్ణానగర్ లోని ఓ అద్దె ఇంట్లో ఉన్నట్లు చెప్పాడు. ఆ ఇంటి రెంట్ ఆరు వేల రూపాయలని.. ఒకే గదిలో ఉంటున్నట్లు చూపించాడు. తన హాల్, కిచెన్, బెడ్ రూమ్ అని ఒక రూమ్ లోనే అన్నీ ఎరేంజ్ చేసుకున్నట్లు చెప్పాడు. తనకొచ్చిన అవార్డులను చూపించాడు.  తనకు గొప్పగా బ్రతకాలనే ఆలోచన ఎప్పుడూ లేదని.. ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండడమే ఇష్టమని చెప్పాడు. తనకు ఎన్నో కోట్ల ఆస్తులున్నాయని, ఒక ఆడి కారు కూడా ఉందని వచ్చిన రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని చెబుతూ.. తనకు ఒక్క స్కూటీ మాత్రం ఉందని చెప్పాడు. సంపాదించిన మొత్తంలో కొంత డబ్బుని ఇంటికి పంపించడం కంటే గొప్ప సంతోషం మరొకటి లేదని ఎమోషనల్ గా మాట్లాడాడు. 

టీవీ స్టార్స్ పెళ్లి.. పోలీస్ కేస్‌!

  బాలీవుడ్ టెలివిజన్ రంగంలో పాపులర్ నటీనటులు సుగంధ మిశ్రా, సంకేత్ భోస్లే ఇటీవలే ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కోవిడ్ పరిస్థితుల కారణంగా వారిద్దరూ ఏప్రిల్ 26న సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు. అయితే ఇప్పుడు వారిద్దరిపై పంజాబ్ ప్రభుత్వ అధికారులు కేసు నమోదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. కరోనా వైరస్ ను నిర్మూలించడానికి పంజాబ్ ప్రభుత్వం విధించిన నిబంధనలను పట్టించుకోకుండా సుంగంధ, సంకేత్ వివాహమా చేసుకున్నారు.  దీంతో రూల్స్ అతిక్రమించినందుకు వీరిద్దరిపై కేసు నమోదు చేశారు పోలీసులు. అంతేకాకుండా పెళ్లి జరిగిన రిసార్ట్ ఓనర్లుపై కూడా కేసు నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం విధించిన ఆంక్షలను అతిక్రమించారనే ఆరోపణలతో ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు. అలానే డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టాలను అతిక్రమించారని మరికొన్ని కేసులు నమోదు చేశారు.  అయితే ఈ కేసుకి సంబంధించి ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు వెల్లడించారు. పెళ్లికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో ఆధారంగా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. పెళ్లిలో ప్రభుత్వం విధించిన రూల్స్ కి వ్యతిరేకంగా ఎక్కువమంది పాల్గొన్నారని అధికారులు చెబుతున్నారు.