మ‌రింత ఆల‌స్యం కానున్న బిగ్ బాస్ 5?

  తెలుగులో బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్'. ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఐదో సీజన్ కోసం సిద్ధమవుతోంది. అయితే ఈసారి బిగ్ బాస్ షో మరింత ఆలస్యం కానుందని సమాచారం. గతేడాది కరోనా కారణంగా సీజన్ 4 చాలా ఆలస్యంగా మొదలైంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న బిగ్ బాస్ నిర్వాహకులు ఈ ఏడాది ముందుగానే బిగ్ బాస్ షోని మొదలుపెట్టాలనుకున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ ఉదృతి నేపథ్యంలో జూన్‌లో మొదలవ్వాల్సిన ఈ షో ఇప్పుడు చెప్పిన టైమ్‌కి ప్రసారమయ్యే ఛాన్స్ లేదని అంటున్నారు.  అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ షోను ఆగస్టు నెల వరకు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కరోనా సెకండ్ వేవ్ ఈ షో వాయిదాకు ముఖ్య కారణంగా చెబుతున్నారు. నిజానికి ఇప్పటికే మహారాష్ట్ర, కేరళ సహా చాలా రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించారు. అన్ని ఇండస్ట్రీలలో షూటింగ్ లు ఆగిపోయాయి.  టీవీ షూటింగ్ లు జరుగుతున్నప్పటికీ రియాలిటీ షోల షూటింగ్ లను మాత్రం ఆపేయాల్సిన పరిస్థితి. ఇప్పటికే ఎన్టీఆర్ హోస్ట్ చేయాలనుకున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో కూడా ఆగిపోయింది. ఇదే కోవలో బిగ్ బాస్ సీజన్ 5 కూడా వాయిదా పడింది. ఈసారి కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

"మీరు తాత".. యాంక‌ర్ ర‌వికి ప‌వ‌న్ కూతురి షాక్‌!

  పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ల ముద్దుల కూతురు ఆద్య.. యాంకర్ రవిల మధ్య జరిగిన సంభాషణ అందరినీ నవ్విస్తోంది. కొన్నాళ్లుగా రేణు బుల్లితెరపై జడ్జ్ గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. జీతెలుగులో ప్రసారమవుతోన్న 'డ్రామా జూనియర్స్' షోకి సింగర్ సునీత, ఎస్వీ కృష్ణారెడ్డిలతో పాటు రేణు దేశాయ్ కూడా న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ షోకి ఆద్యను గెస్ట్ గా ఆహ్వానించారు.  మదర్స్ డే సందర్భంగా ఈ స్పెషల్ ఎపిసోడ్ ను డిజైన్ చేశారు. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ క్రమంలో ఆద్యకు యాంకర్ రవి గ్రాండ్ వెల్కమ్ చెప్పగా.. కూతుర్ని స్టేజ్ పై చూసిన రేణు ఆద్య దగ్గరకు వెళ్లి ఆమెని హగ్ చేసుకుంది. ఈ ప్రోమోలో ఆద్యను బాగా హైలైట్ చేశారు. 'వకీల్ సాబ్' బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ తో షోలోకి ఎంట్రీ ఇచ్చిన ఆద్య తనదైన మాటలతో ఆకట్టుకుంది. ఈ షోకి మరో జడ్జ్ అయిన సునీతతో కలిసి గొంతు కలిపి 'నీలి నీలి ఆకాశం' పాటను పాడింది ఆద్య.  ఆ తరువాత యాంకర్ రవి తన గురించి తనే ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటూ.. "నా పేరు రవి నేను ఇక్కడ హోస్ట్ ను" అని చెప్పాడు. వెంటనే సునీత కలుగజేసుకొని.. "రవి మీ అమ్మను అక్కా అని పిలుస్తాడు. కాబట్టి నువ్ రవిని మామ అని పిలువు" అంటూ ఆద్యకు చెప్పింది. ర‌వి కూడా "ఒక్క‌సారి మావ‌య్యా అని పిలువ‌మ్మా?" అన‌డిగాడు. వెంటనే రియాక్ట్ అయిన ఆద్య.. "మీరు తాతా" అని కౌంటర్ ఇచ్చింది. దీంతో రవి షాక‌వుతూ ఆమెని అలాగే చూస్తుండిపోతే, మిగ‌తావారంతా ప‌డీ ప‌డీ న‌వ్వారు. ఈ ప్రోమో చూసిన నెటిజన్లు పవన్ కూతురు కదా.. ఆ మాత్రం చలాకీతనం ఉంటుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

ఒక‌వైపు ఆర్థిక స‌మ‌స్య‌లు.. ఇంకోవైపు బ్యాన్‌.. బుల్లితెర నటి క‌ష్టాలు!

  'పసుపు కుంకుమ' సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ భామ పల్లవి గౌడ. ఈ సీరియల్‌లో అంజలి అనే పాత్రలో నటించిన ఈ బ్యూటీ ఆ తరువాత 'సావిత్రి' అనే సీరియల్ చేసింది. అయితే కొద్దిరోజులకే ఆమె సీరియల్ నుండి తప్పుకుంది. దీనికి కారణం ఏంటనే విషయం బయటకు చెప్పలేదు. నిజానికి తాను యానిమేషన్ రంగంలోకి వెళ్లాల‌నుకున్నాన‌నీ కానీ అనుకోకుండా టీవీ రంగంలోకి వచ్చాన‌నీ చెప్పింది. త్వరలోనే మళ్లీ తెలుగు సీరియల్స్ చేస్తానని వెల్లడించింది.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో తనపై బ్యాన్ విధించిన విషయాన్ని ప్రస్తావించింది. 'సావిత్రి' సీరియల్ చేసే చేసే సమయంలో వేరే ఏ తెలుగు సీరియల్ లో నటించనని అగ్రిమెంట్ చేసుకున్నట్లు వెల్లడించింది. అయితే ఆ సీరియల్ లో నటించినందుకు తనకు పేమెంట్స్ సరిగ్గా ఇవ్వలేదని.. రెండు నెలల పాటు అలానే చేశారని తెలిపింది. అదే సమయంలో తనకు వేరే సీరియల్ లో నటించే అవకాశం వస్తే.. ఒప్పుకుంటానని 'సావిత్రి' నిర్మాతలతో చెబితే వాళ్లు ఒప్పుకోలేదని స్పష్టం చేసింది.  కనీసం పెండింగ్ పేమెంట్ అయినా ఇవ్వమని అడిగానని.. అది కూడా సెటిల్ చేయలేదని చెప్పుకొచ్చింది. ఆర్థిక‌ సమస్యల వలన వేరే సీరియల్ చేస్తానని చెప్పడంతో ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్ లో తనను బ్యాన్ చేశారని చెప్పుకొచ్చింది. మరోపక్క తన వ్యక్తిగత జీవితంలో కూడా పల్లవి చాలా సమ‌స్య‌లు ఎదుర్కొంటోంది. మనస్పర్థల కారణంగా భర్తతో విడిపోయింది. రీసెంట్ గా విడాకులు కూడా తీసుకున్నారు. ప్రస్తుతం తన జీవితంలో జరిగిన చేదు సంఘటనల నుండి బయటపడడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పింది ప‌ల్ల‌వి. 

"అది గూండా రాజ్యంలా క‌నిపిస్తోంది".. నటి కస్తూరి ట్వీట్ వైరల్!

  ఒకప్పటి హీరోయిన్, నేటి బుల్లితెర నటి కస్తూరి శంకర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. సామాజిక అంశాలు, ప్రజలకు జరిగే అన్యాయాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తుంటారు. రాజకీయ విశ్లేషణలు కూడా చేస్తుంటారు. స్వతహాగా లాయర్ కావడంతో అన్ని విషయాలపై సమగ్ర అవగాహనతో మాట్లాడుతుంటారు. కస్తూరి శంకర్ చేసే కామెంట్స్ ఒక్కోసారి వివాదాలకు దారి తీస్తుంటాయి.  తాజాగా కస్తూరి శంకర్ పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఘటనపై స్పందించారు. బెంగాల్ లో ఎన్నికల తరువాత కూడా హింస యథేచ్ఛగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అక్కడ జరిగే గొడవలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పశ్చిమ మిడ్నాపూర్ లో కేంద్రమంత్రి మురళీధరన్ పర్యటన సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొందరు దుండగులు విదేశాంగశాఖ సహాయమంత్రి కాన్వాయ్ పై రాళ్లతో, కర్రలతో దాడి చేశారు.  ఈ ఘటనపై నటి కస్తూరి ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రమంత్రి పరిస్థితే ఇలా ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. ఆమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంతోమంది సెక్యూరిటీతో వచ్చే కేంద్ర మంత్రికే ఇలా జరిగితే.. వారి కింద పని చేసే నాయకులు, పార్టీ కార్యకర్తల పరిస్థితేంటో ఊహించుకోలేకపోతున్నానని అన్నారు. వాళ్లు అసలు మనుషులేనా.. గూండా రాజ్యంలా కనిపిస్తోందంటూ కస్తూరి ఫైర్ అయింది. ప్రస్తుతం ఈమె 'గృహ‌ల‌క్ష్మి' అనే సీరియల్ లో నటిస్తోంది. 

బాల‌య్య‌ జోలికి వెళ్లకపోతేనే బెటర్!

  బుల్లితెరపై రెండు ద‌శాబ్దాల నుంచి స్టార్ యాంకర్ గా రాణిస్తున్నారు సుమ. టీవీ షోలైనా, సినిమా ఈవెంట్స్ అయినా.. సుమ ఉండాల్సిందే. ఆమె డేట్స్ దొరకకపోతే అప్పుడు వేరే వాళ్లకు అవకాశాలు వస్తాయి. అంతగా తన సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం ఈమె స్టార్ మా ఛానెల్ లో ప్రసారమవుతోన్న 'స్టార్ట్ మ్యూజిక్' అనే షోకు యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఇతర భాషల్లో సక్సెస్ అయిన షోను ముందుగా ఝాన్సీ హోస్ట్ చేశారు. ఆ తరువాత శ్రీముఖి వచ్చింది. వీరిద్దరు యాంకరింగ్ చేసిన సమయంలో రాని టీఆర్పీ సుమ హోస్ట్ చేస్తున్నప్పటి నుండి వస్తోంది. దీంతో సుమతోనే షోని కంటిన్యూ చేస్తున్నారు.  తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ షోకి 'ఇంటింటి గృహలక్ష్మి', 'చెల్లెలి కాపురం' సీరియల్ నటులు గెస్టులుగా వచ్చారు. ముందుగా సుమ వాళ్లకు చిన్న మిర్రర్స్ ఇచ్చి ముద్దులు పెట్టమని చెప్పింది. ఆ తరువాత ముద్దులు మసకమసకగా ఉన్నాయేంటని ప్రశ్నించగా.. చీకట్లో ముద్దులు పెట్టామని సీరియల్ నటులు చెప్పుకొచ్చారు. ఆ తరువాత సీరియల్ నటులు స్కూల్ పిల్లలుగా మారి స్కిట్ చేయగా.. టీచర్ గా చేసిన సుమ.. మాస్క్ లు లేని స్టూడెంట్స్ ను చూస్తూ.. మీరు చెడ్డీలు వేసుకున్నా, వేసుకోకపోయినా మాస్క్ లు మాత్రం కచ్చితంగా వేసుకోవాలని అన్నారు.  ఆ తరువాత అటెండెన్స్ తీసుకుంటూ.. మొదట "పవన్ కళ్యాణ్ గారు" అనగా.. "ప్రజెంట్ మామ్" అన్నారు. ఆ తరువాత "బాలకృష్ణ గారు" అనగా.. "సినిమాకెళ్లాడు టీచర్" అని ఓ నటి చెబుతుంది. అప్పుడు సుమ "పోనీలే వెళితే వెళ్లారు.. మనం ఆయన జోలికి వెళ్లకపోతేనే బెటర్" అని కామెంట్స్ చేసింది. ఇదంతా కూడా ఎంతో ఫన్నీగా సాగింది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ షో ప్రసారం కానుంది. 

మా నాన్నకు ఆ పిచ్చి.. దాని వ‌ల్లే ఆస్తులు పోగొట్టుకున్నాం!

  ఒక‌వైపు బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తోన్న అనసూయ.. మరోపక్క వెండితెరపై నటిగా తన సత్తా చాటుతోంది. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనపై జరిగే ట్రోలింగ్‌కు ఘాటుగా కౌంటర్లు ఇస్తుంటుంది అనసూయ. తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. అనసూయ తన వ్యక్తిగత జీవితం గురించి గతంలో చాలా సార్లు చెప్పింది. అమ్మానాన్న, చెల్లెళ్లు, భర్త గురించి ఎన్నో విషయాలు చెప్పుకొచ్చింది.   అయితే లేటెస్ట్‌గా కొన్ని కొత్త విష‌యంలు పంచుకుంది అనసూయ. తన చిన్నతనంలో చాలా కష్టాలు పడ్డానని చెబుతోంది. అద్దె ఇంట్లో ఉండేవాళ్లమని.. డబ్బులు సరిపోక బస్టాప్ వరకు నడుచుకుంటూ వెళ్లేదాన్ని అని వివరించిన అనసూయ.. తన తండ్రి గురించి చెబుతూ తమను ఎలా పెంచారో చెప్పుకొచ్చింది. స్వతంత్రంగా, ధైర్యంగా ఉండాలని చెప్పేవారని.. ఆటోవాళ్లతో ఎలా మాట్లాడతామో, ఎలా హ్యాండిల్ చేస్తామోనని దూరం నుండి చూసేవారని ఆ మధ్య అనసూయ తెలిపింది.  తాజాగా తన తండ్రి గురించి మరికొన్ని విషయాలు చెప్పుకొచ్చింది. చిన్నప్పుడు చాలా రిచ్ గానే పెరిగామని.. ఈ విషయం ఇప్పటివరకు ఎక్కడా చెప్పలేదని తెలిపింది. తమ దగ్గర చాలా గుర్రాలు ఉండేవని.. తన తండ్రికి హార్స్ రేసింగ్, గ్యాంబ్లింగ్ అంటే పిచ్చి అని.. అలా ఆస్తులన్నీ పోగొట్టుకున్నామని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనసూయ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ భాషల సినిమాల్లో నటిస్తోంది! 

ఢీ కంటెస్టెంట్ల బాగోతాలు.. వీడియోలు బయటపెట్టిన ప్రదీప్!

  బుల్లితెరపై అత్యధిక టీఆర్పీ వచ్చే షోలలో 'ఢీ' ఒకటి. ఈ షోలో కంటెస్టెంట్లుగా పాల్గొన్న చాలా మంది టాప్ కొరియోగ్రాఫర్లుగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఈ షోపై నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒకప్పటిలా షో ఉండడం లేదని.. డాన్స్ కరువైందని విమర్శలు చేస్తున్నారు. 'ఢీ' షోలో బయట కనిపించేది వేరు.. లోపల జరిగేది వేరు అంటూ రాకేష్ మాస్టర్ ఇటీవల సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. 'ఢీ' కంటెస్టెంట్లంద‌రూ ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తిస్తుంటారని.. క్రమశిక్షణతో ఉండరని రాకేష్ మాస్టర్ అన్నారు. జ‌డ్జిలు, యాంకర్లు కూడా అంతేనని అన్నారు. మనకు కనిపించే షో అంతా కూడా ఎడిట్ చేసిన వర్షెన్ అని.. కానీ సెట్స్‌లో కంటెస్టెంట్లు, యాంకర్లు, జడ్జిలు చేసే హల్చల్ అంతా ఇంతా కాదని చెప్పుకొచ్చారు  తాజాగా అందులో కొన్ని విషయాలను యాంకర్ ప్రదీప్ బయటపెట్టాడు. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో అందరూ రీల్స్ వీడియోలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అలానే 'ఢీ' కంటెస్టెంట్లు షూటింగ్ గ్యాప్‌ లో రీల్ వీడియోలతో రచ్చ చేస్తున్నారని.. కొన్ని వీడియోలు చూపించాడు ప్రదీప్.  ఓ వీడియోలో మణికంఠ, నైనికలు చేసిన ముద్దు సీన్ చూసి అందరూ షాకయ్యారు. ఇక ఈ వీడియోపై వచ్చిన మీమ్స్ చూసి అందరూ నవ్వుకున్నారు. 'జాతిరత్నాలు' సినిమాలో "చిట్టి" సాంగ్‌కి మణికంఠ, నైనిక డాన్స్ చేస్తుంటే.. అది చూసిన జిత్తు మాస్టర్ ఇచ్చే ఎక్స్‌ప్రెష‌న్స్‌పై ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేశారు. ఇక ప్రసాద్, నైనిక చేసిన రొమాంటిక్ డాన్స్ వీడియోపై అభి మాస్టర్ కుమిలి కుమిలి ఏడ్చినట్టు చూపించారు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్ లో వైరల్ అవుతోంది!

సీరియ‌ల్స్ స‌క్సెస్‌.. ప్రొడ్యూస‌ర్‌గా ఫెయిల్‌!

  బుల్లితెరపై చాలా కాలంగా కొనసాగుతున్న సీరియల్స్ లో 'వదినమ్మ' ఒకటి. దర్శకనిర్మాత, నటుడు ఈటీవీ ప్రభాకర్, సుజిత జంటగా నటిస్తోన్న ఈ సీరియల్ ప్రేక్షకాదరణ పొందింది. ఈ క్రమంలో నటుడిగా, దర్శకనిర్మాతగా తన ప్రస్థానం గురించి ప్రభాకర్ తాజాగా ముచ్చటించారు. 'వదినమ్మ' సీరియల్ లో అసలైన హీరో తను కాదని.. వదినమ్మే సీరియల్ హీరో అని చెప్పుకొచ్చాడు. మేమంతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ అని అన్నారు. సీరియల్ కి మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పడానికి సాక్ష్యం 500 వందల ఎపిసోడ్స్ పూర్తి కావడమేనని అన్నారు.  మిగిలిన సీరియల్స్ కి భిన్నంగా ఫ్యామిలీ రిలేషన్స్ తో ఈ సీరియల్ ను నడిపిస్తున్నామని.. ప్రొడ్యూసర్ గా తనకు ఉండే కష్టాలు ఉంటాయని.. పాజెక్ట్ కి కావాల్సిన ప్రతిదీ అరేంజ్ చేయాలని అన్నారు. ఇంతకుముందులా కాకుండా.. ప్రేక్షకులు అంతకుమించి క్వాలిటీను కోరుకుంటున్నారనీ, ఫ్రేమ్ లో ఒకరిద్దరు ఉంటే ఒప్పుకోవడం లేదని.. ప్రతీ ఫ్రేమ్ లో ఆర్టిస్ట్ లు ఫుల్ గా కనిపించాలని కోరుకుంటున్నారని అన్నారు.  పరిమిత ఫండింగ్ తో క్వాలిటీ సీరియల్ చేయడం మహాకష్టమని చెప్పుకొచ్చారు. తను నిర్మించిన సీరియల్స్ సూపర్ సక్సెస్ అయ్యాయని.. కానీ నిర్మాతగా, ఫైనాన్స్ పరంగా సక్సెస్ కాలేకపోయానని అన్నారు. మిగతా నిర్మాతలు ఆర్థికంగా ఎలా సక్సెస్ అవుతున్నారో.. అడిగి తెలుసుకోవాలని అన్నారు. సినిమా, టీవీ అనేది పక్కన పెడితే తనకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు. 

మిర్ర‌ర్‌ ముందు హాట్ పోజ్‌.. విష్ణుప్రియ‌ ఫోటో వైరల్!

  బుల్లితెరపై యాంకర్లుగా సందడి చేస్తున్న వారిలో విష్ణుప్రియ ఒకరు. ముందుగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన ఈ బ్యూటీ ఆ తరువాత దగ్గుబాటి రానా హోస్ట్ చేసిన షోలో కనిపించింది. అప్పటినుండి ఈమెకి కొన్ని షోలలో అవకాశాలు రావడంతో బుల్లితెరపై దూసుకుపోతుంది. 'పోవే పోరా' షోలో సుడిగాలి సుధీర్‌తో కలిసి విష్ణుప్రియ చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఒకరిపై ఒకరు పంచ్ లు వేసుకుంటూ.. కాలేజ్ స్టూడెంట్స్ తో కలిసి తెగ అల్లరి చేస్తుంటారు.  కొన్నాళ్లకు వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందనే వార్తలు వినిపించాయి. వీటిపై స్పందించిన విష్ణుప్రియ.. సుధీర్ అంటే తనకు ఇష్టమని, ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత క్లోజ్ అయిన మొదటి వ్యక్తి అతనేనని చెప్పింది. అయితే ఇద్దరి మధ్య ప్రేమ లేదని.. స్నేహితులం మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. ఈ మధ్యకాలంలో విష్ణుప్రియ పెద్దగా షోలలో కనిపించడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటోంది.  తనకు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటుంది. తరచూ తన హాట్ హాట్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ యూత్‌ను ఎట్రాక్ట్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ హాట్ ఫోటోను షేర్ చేసింది. అందులో ఆమె అద్దం ముందు నుంచొని టాప్‌ను పైకి లేపి.. నాభి అందాలను ఎక్స్‌పోజ్ చేసే విధంగా సెల్ఫీ తీసుకుంది. ఈ ఫోటోలో అమ్మడు కాస్త సన్నబడినట్లు కనిపిస్తోంది. అందుకే ఈ స్లిమ్ పిక్‌ను షేర్ చేసినట్లుంది. ప్రస్తుతం ఈ హాట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

అనసూయ.. రోజుకి లక్షన్నర!

  బుల్లితెరపై యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటుతోంది. స్పెషల్ సాంగ్స్, స్పీకర్ రోల్స్ అంటూ బిజీగా గడుపుతోంది. నిడివి తక్కువ రోల్ అయినప్పటికీ తనదైన ముద్ర వేస్తోంది. దీంతో చాలా మంది దర్శకులు ఆమె కోసం పాత్రలు రాసుకుంటున్నారు. తాజాగా ఈ బ్యూటీ నటించిన 'థ్యాంక్ యు బ్రదర్' సినిమా మే 7న‌ 'ఆహా'లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో సినిమా గురించి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది.  ఈ సినిమాను కరోనా సమయంలో చిత్రీకరించడంతో తక్కువ సిబ్బందితో తెరకెక్కించారు. చాలా రోజుల క్రితమే సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టినప్పటికీ.. సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఫైనల్‌గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తరువాత థియేటర్లు బంద్ అయ్యాయి. దీంతో ఓటీటీలో సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. ఇది చిన్న సినిమానే అయినప్పటికీ అనసూయకి పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం అనసూయ రోజూవారీ రెమ్యునరేషన్ తీసుకుందట.  రోజుకి లక్షన్నర చొప్పున పారితోషికం తీసుకుందట. అలా సినిమా కోసం 17 రోజులు కేటాయించిందట. అంటే మొత్తంగా రూ.25 లక్షల వరకు తీసుకుందని అంటున్నారు. ఈ లెక్కన చూసుకుంటే కొత్త హీరోయిన్లకు ఇచ్చే రెమ్యునరేషన్ కంటే అనసూయకే ఎక్కువ వస్తుందన్నమాట. మొన్నామధ్య 'చావు కబురు చల్లగా' సినిమాలో ఐటెం సాంగ్ లో నటించినందుకు రూ.6 లక్షల వరకు తీసుకుందట ఈ హాట్ యాంకర్. 

ఎమోష‌న‌ల్ సీన్‌.. ఇమ్మాన్యుయేల్‌ను హత్తుకున్న రోహిణి!

  'జబర్దస్త్' స్టేజ్ మీద కమెడియన్‌గా కెరీర్ మొదలుపెట్టి సెలబ్రిటీలుగా మారిన వారు చాలా మంది ఉన్నారు. సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, గెటప్ శ్రీను ఇలా చాలా మందికి సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. సుధీర్ అయితే మెజీషియన్‌గా, సింగర్‌గా, యాంకర్‌గా ఇలా తనలోని అన్ని కోణాలను బుల్లితెరపై ఆవిష్కరించాడు. ఇప్పుడు ఇమ్మాన్యుయేల్ కూడా సందర్భం వచ్చిన ప్రతీసారి తనలోని టాలెంట్‌ను బయటపెడుతున్నాడు.  కమెడియన్‌గా పంచ్‌లు వేస్తూ నవ్వించడమే కాదు.. ఎమోషనల్ సీన్స్ లో కూడా బాగా నటిస్తున్నాడు ఇమ్మాన్యుయేల్. అంతేకాకుండా.. ఇత‌డిలో మరో టాలెంట్ కూడా ఉంది. అద్భుతంగా మిమిక్రీ చేయగలడు. ఆడ గొంతుతో మొత్తం పాట పాడగలడు. ఆ మధ్య ఓసారి 'క్యాష్' ప్రోగ్రామ్ లో ఆడ గొంతుతో అలరించాడు. ఇప్పుడు మరోసారి ఆడ గొంతులో పాడి ఆశ్చర్యపరిచాడు.  'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలో మదర్స్ డే సందర్భంగా అమ్మ పాటను పాడి అందరినీ ఎమోషనల్ గా ఆకట్టుకున్నాడు ఇమ్మాన్యుయేల్. పాటలో ఫీమేల్ వెర్షన్ కూడా తనే పాడడంతో అక్కడున్నవారంతా షాక్ అయ్యారు. ఇమ్మాన్యుయేల్ పాట విన్న రోహిణి వెంటనే స్టేజ్ పైకి పరుగెత్తుకొచ్చి అతడిని హత్తుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది. రోహిణి పలు టీవీ సీరియల్స్ లో నటించడంతో పాటు బిగ్ బాస్ షోలో పాల్గొంది. కానీ హౌస్‌లో ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. 

యాంకర్ రవి కారును ఆపేసిన మందుబాబు!

  బుల్లితెరపై యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న రవి పలు షోలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. లాస్యతో కలిసి రవి చేసిన 'సంథింగ్ సంథింగ్' షోతో మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు. ఆ తరువాత యాంకర్ శ్రీముఖితో కలిసి హోస్ట్ చేసిన 'పటాస్' షో రవికి మరింత క్రేజ్ తీసుకొచ్చింది. ప్రస్తుతం రవి 'డ్రామా జూనియర్స్', 'కామెడీ స్టార్స్' వంటి షోలతో బిజీగా గడుపుతున్నాడు. దాదాపు ఐదేళ్ల తరువాత మళ్లీ లాస్యతో కలిసి టీవీ షోలలో పాల్గొంటున్నాడు. ఇదిలా ఉండగా.. తాజాగా రవి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.  ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. హైదరాబాద్ కావూరి హిల్స్ ఏరియాలో ఫుల్‌గా మద్యం సేవించిన ఓ వ్యక్తి రోడ్డు మీదకు వచ్చి వాహనాలను అడ్డుకుంటూ కాసేపు హడావిడి చేశాడు. అటుగా వెళ్తున్న యాంకర్ రవి కారుని కూడా ఆపడంతో కారులో ఉన్న రవి చేసేదేం లేక సదరు వ్యక్తి చేస్తోన్న హంగామాను ఫోన్‌లో బంధించాడు. ఆ తరువాత వీడియోకి 'సర్దార్‌ గబ్బర్ సింగ్' సినిమాలోని ఓ పాటని యాడ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు.  ''మంచి, చెడు చెబుదామంటే మొహానికి మాస్క్ లేదు.. మైండ్ కంట్రోల్‌లో లేదు కానీ ఇంత దారుణమైన పరిస్థితుల్లో కూడా ఆయన ముఖం మీద చిరునవ్వు చూస్తే ఎక్కడో కాస్త ఆనందంగా ఉంది. అవును.. నిజమే.. మన ఆనందాన్ని మనమే వెతుక్కోవాలి'' అంటూ క్యాప్షన్ జోడించాడు రవి. "అతడ్ని దేవుడు సేఫ్ గా ఉంచాలని కోరుకుంటున్నా" అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

భ‌ర్త మ‌ర‌ణాన్ని త‌ల‌చుకొని భోరుమ‌న్న‌ సురేఖావాణి!

  బుల్లితెర నటిగా కెరీర్ ఆరంభించి ఆ తరువాత సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి పాపులారిటీ సంపాదించుకున్నారు నటి సురేఖా వాణి. ఎన్నో సినిమాల్లో నటించిన సురేఖ తనదైన అభిన‌యంతో అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. తన కూతురు సుప్రీతతో కలిసి తీసుకున్న ఫోటోలను, డాన్స్ వీడియోలను అభిమానులతో షేర్ చేస్తూ ఉంటారు. రీసెంట్ గా ఈమె తన స్నేహితురాలు నటి రజితతో కలిసి 'అలీతో సరదాగా' షోకి అతిథిగా హాజరయ్యారు.  ఈ షోలో తన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను సురేఖా వాణి బయటపెట్టారు. అంతేకాకుండా.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త సురేష్ మృతి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. కొన్ని అపార్ధాలు, మనస్పర్థల కారణంగా తన అత్తింటి కుటుంబం తమకు దూరంగా ఉంటోంద‌ని.. క్లిష్ట పరిస్థితుల్లో కూడా వాళ్లు ఒక్క రూపాయి సాయం చేయలేదని వాపోయారు. తన కూతురు, తనే అన్నీ సమకూర్చుకున్నామని.. అయినప్పటికీ తనను, తన కూతుర్ని వాళ్లు నిందించారని.. తన భర్త మృతి విషయంలో తనదే తప్పంటూ బ్లేమ్ చేశారని చెప్పుకొచ్చారు.  తన భర్త చనిపోయినప్పుడు.. కనీసం అతడి తల్లి కానీ, అన్నదమ్ములు కానీ చూడడానికి రాలేదని తెలిపారు. కనీసం ఈ ప్రోగ్రాం చూశాకైనా.. వాళ్లు సిగ్గు తెచ్చుకోవాలని మండిపడ్డారు. అనంతరం తన భర్త మరణం గురించి మాట్లాడుతూ.. శరీరంలో రక్తం గడ్డ కట్టడంతో ఓ సర్జరీ చేయించామని.. అది జరిగిన నెల రోజులకే ఆయన కన్నుమూశారని గుర్తు చేసుకుంటూ ఏడ్చేశారు. ఇక తన రెండో పెళ్లి గురించి వస్తోన్న వార్తలపై స్పందిస్తూ.. సోషల్ మీడియాలో ఏదేదో రాస్తున్నారని.. వాళ్లనే పెళ్లి సంబంధాలు కూడా చూడమని చెప్పానని వ్యంగ్యంగా మాట్లాడారు. 

నో క్లీవేజ్ షో.. నో ఎక్స్‌పోజింగ్!

  బుల్లితెరపై హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది రష్మీ. ప్రస్తుతం పలు టీవీ షోలతో అమ్మడు చాలా బిజీ అయింది. ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది రష్మీ. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ యూత్‌ని బాగా ఎట్రాక్ట్ చేస్తోంది. బుల్లితెరపై తన సత్తా చాటినప్పటికీ వెండితెరపై మాత్రం సరైన గుర్తింపు సంపాదించలేకపోయింది. కానీ వస్తోన్న సినిమా అవకాశాలు మాత్రం అందిపుచ్చుకుంటోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన 'బొమ్మ బ్లాక్‌బస్టర్' అనే సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.  ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలలో రష్మీ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తమ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో చెప్పలేకపోతున్నామని వెల్లడించింది. థియేటర్‌లో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారని.. కానీ థియేటర్లో వస్తుందా లేక ఓటీటీలో వస్తుందా అనే విషయంలో క్లారిటీ లేదని చెప్పింది. ఇక వెండితెరపై ఇప్పటివరకు తను చాలా గ్లామరస్ గా కనిపించడం, గ్లామరస్ రోల్స్ లో నటించడంతో అందరూ తనను సెక్సీ అంటూ కామెంట్స్ చేస్తున్నారని.. తొలిసారి తను 'బొమ్మ బ్లాక్‌బస్టర్' సినిమాలో డీగ్లామరస్ రోల్ లో నటించానని తెలిపింది.  ఇందులో క్లీవేజ్ షో, నడుము చూపించడాలు ఉండవంటూ చెప్పుకొచ్చింది. సినిమాలో తను వేసుకునే కాస్ట్యూమ్స్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటాయని.. గ్లామర్ షోకి దూరంగా ఉండే పాత్ర అని చెప్పింది. చాలా మంది తనను యాక్టింగ్‌కి స్కోప్ ఉన్న పాత్రలు చేయరా..? అని అడుగుతున్నారని.. అందుకే ఛాలెంజింగ్ రోల్స్ లో నటిస్తున్నానని.. తనపై విమర్శలు చేసే వారికోసమే ఈ సినిమా చేశానని స్పష్టం చేసింది. 

పెళ్లికూతురు గెట‌ప్‌లో అరియానా.. మేట‌ర్ ఏంటి?

  యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టి అతి తక్కువ సమయంలో సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకుంది అరియానా గ్లోరీ. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి తన పాపులారిటీ పెంచుకున్న ఈ భామ.. బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొంది. తన ముక్కుసూటితనంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఈమె బిహేవియర్‌కి చాలా మంది ఫిదా అయ్యారు. సెలబ్రిటీలు సైతం అరియానాను ఇష్టపడ్డారు. తాజాగా అరియానాకు చెందిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  ఆ న్యూస్ ఏంటంటే.. ఈ బ్యూటీ త్వరలోనే మిసెస్ కాబోతుందని టాక్ . అయితే ఈమె పెళ్లి చేసుకునే అబ్బాయి ఎవరనే దానిపై క్లారిటీ లేదు. మరోపక్క ఈ ఏడాదిలోనే తన పెళ్లి ఉంటుందని కమెడియన్ అవినాష్ చెప్పాడు. మంచి ముహుర్తాలు ఉంటే పెళ్లికి రెడీ అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఈ క్రమంలో అరియానా పెళ్లి మ్యాటర్ బయటకి రావడంతో ఫ్యాన్స్.. అరియనాకు అవినాష్‌తో పెళ్లి అంటూ ఫిక్స్ అయిపోయారు. బిగ్ బాస్ షోలో వీరిద్దరూ ఎంతో క్లోజ్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఆ ప్ర‌చారాన్ని ఈ జంట కొట్టిపారేసింది. తామిద్దరం మంచి స్నేహితులమని చెప్పుకొచ్చింది.  అయితే ఈ పెళ్లి వార్తలపై మాత్రం ఈ జంట ఇంకా స్పందించలేదు. కానీ అరియానా సన్నిహితులు మాత్రం ఈ వార్తల్లో నిజం లేదని అంటున్నారు. ఇటీవల అరియానా ఓ గోల్డ్ జువెల్లర్ బ్రాండ్ కోసం ఫోటో షూట్ చేసిందని.. ఆ కమర్షియల్ యాడ్ కోసం పెళ్లికూతురు గెటప్‌లో దర్శనమివ్వడంతో అందరూ తనను అపార్ధం చేసుకున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం రాజ్ తరుణ్ సినిమాలో అరియానా  ఓ కీలకపాత్ర పోషిస్తోంది. అలానే పలు టీవీ షోల్లో పాల్గొంటోంది. 

థాంక్యూ రాహుల్‌.. నాకు ఏడుపొచ్చేస్తోంది!

  బిగ్ బాస్ షోతో చాలా మంది తారలు ఫేమస్ అయ్యారు. ప్రజలకు తెలియని ఎంతో మంది టాలెంట్స్‌ను బిగ్ బాస్ వేదిక వెలుగులోకి తీసుకొచ్చింది. ఆ కేటగిరీలోకి రాహుల్ సిప్లిగంజ్, అషురెడ్డి కూడా వస్తారు. బిగ్ బాస్ షోలో పాల్గొన్న తరువాత వారి క్రేజ్ అమాంతం పెరిగింది. బిగ్ బాస్ సీజన్ 3 విజేతగా నిలిచిన రాహుల్ తన పాటలతో రోజురోజుకి పాపులారిటీ పెంచుకుంటున్నారు. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నన్ని రోజులు రాహుల్.. పునర్నవి భూపాలంతో చాలా సన్నిహితంగా ఉండేవాడు. ఆమె కూడా రాహుల్‌ని ముద్దులు, కౌగిలింతలతో ముంచెత్తేది.  దీంతో ఇద్దరి మధ్య ఏదో ఉందని.. పెళ్లి కూడా చేసుకోవడానికి రెడీ అవుతున్నారంటూ వార్తలు ఊపందుకున్నాయి. హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత కూడా ఈ జంట పార్టీలు, ఈవెంట్స్ అంటూ హల్చల్ చేసింది. అయితే సడెన్‌గా సీన్ లోకి అషురెడ్డి ఎంట్రీ ఇచ్చింది. రాహుల్-అషురెడ్డి సన్నిహితంగా మెలగడంతో రాహుల్ ఆమెతో ప్రేమలో పడ్డాడేమో అని అందరూ అనుకున్నారు. దీనికితోడు రాహుల్.. అషురెడ్డిని ఎత్తుకున్న ఫోటోలు వైరల్ అవ్వడంతో వీరి రిలేషన్ జనాల్లో హాట్ టాపిగ్‌గా మారింది.  ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో అషురెడ్డితో డేటింగ్ విషయంపై స్పందించాడు రాహుల్. తనకు అషురెడ్డి చాలా స్పెషల్ అని చెప్పుకొచ్చిన అత‌ను.. అషు చూపించే కేరింగ్ తనకు చాలా ఇష్టమని అన్నాడు. అయితే తమ మధ్య డేటింగ్ లాంటిది ఏమీ లేదని.. తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చాడు. ఈ మధ్య ఓ సారి డబ్బులు అవసరమై అషుని పది వేలు అడిగానని.. ఆమె వెంటనే డబ్బు పంపించిందని.. వేరే వాళ్లను ఇలా అడగలేనని చెప్పుకొచ్చాడు. ఈ ఇంటర్వ్యూ చూసిన అషు ఎమోషనల్ అయింది.  ''థాంక్యూ రాహుల్.. నాకు ఏడుపొచ్చేస్తోంది.. నువ్వు ఎప్పటికీ స్పెషల్'' అంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో రాసుకొచ్చింది. 

ప‌స్ట్ టైమ్ బుల్లితెరపై పవన్ కూతురు.. వీడియో వైరల్!

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్‌ల సంతానం అకీరా, ఆద్య. పవన్ తో విడాకులు తీసుకున్న తరువాత రేణు తన పిల్లలతో కలిసి పూణేలో ఉంటున్నారు. అకీరా, ఆద్యలను చూడడానికి పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు పూణే వెళ్తుంటారు. దీనికి సంబంధించిన ఫోటోలను రేణు తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంటారు. అలానే అకీరా, ఆద్య తమ తండ్రితో సమయం గడపడానికి అప్పుడప్పుడు హైదరాబాద్ వస్తుంటారు. 'వకీల్ సాబ్' సినిమా షూటింగ్ సమయంలో కూడా ఆద్య.. పవన్ కళ్యాణ్ ను కలిసింది. కూతురంటే పవన్ కి చాలా ఇష్టం.  అయితే అకీరా, ఆద్య పబ్లిక్ గా పెద్దగా కనిపించరు. కనీసం అకీరా మెగాఫ్యామిలీలో జరిగే ఫంక్షన్స్ కు, ఈవెంట్స్ కు హాజరవుతుంటాడు కానీ ఆద్య అయితే చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. అలాంటిది ఈమె ఓ టీవీ షోలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మధ్యకాలంలో రేణుదేశాయ్ టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. జీ తెలుగులో ప్రసారమవుతోన్న 'డ్రామా జూనియర్స్' షోకి జడ్జిగా రేణు దేశాయ్ వ్యవహరిస్తున్నారు. ఈ షో నిమిత్తం త‌ర‌చూ హైద‌రాబాద్‌కు వ‌చ్చి వెళ్తున్నారు రేణు. మదర్స్ డే సందర్భంగా ఈ షోని స్పెషల్ గా డిజైన్ చేశారు.  ఈ షోకి ఆద్యను గెస్ట్ గా తీసుకొచ్చారు. మొదటిసారి ఆద్య బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆద్య స్టేజ్ పైకి రాగానే.. రేణుదేశాయ్ వెళ్లి తన కూతుర్ని హత్తుకుని, ఆమె బుగ్గ‌పై ముద్దు పెట్టింది. తిరిగి ఆద్య కూడా అమ్మ‌కు కిస్ ఇచ్చింది. "యు ఆర్‌ మై బెస్ట్ గిఫ్ట్ ఎవర్'' అని రేణు.. ఆద్యను ఉద్దేశించి చెప్పగా.. ''మమ్మీ ఈజ్ ది బెస్ట్ మామ్ ఎవర్'' అని ఆద్య తన తల్లిపై ప్రేమను కురిపించింది. ఈ ప్రోమోను నెటిజ‌న్స్ తెగ చూసేస్తున్నారు. మే 9న మదర్స్ డే కానుకగా.. రాత్రి 8 గంటలకు ఈ షో జీతెలుగులో ప్రసారం కానుంది!

ఇమ్మాన్యుయేల్‌.. నీది మామూలు టాలెంట్ కాదురా బాబూ!

  'జబర్దస్త్' షోతో చాలా మంది కమెడియన్స్ లైమ్ లైట్ లోకి వచ్చారు. తమదైన కామెడీతో ప్రేక్షకులను నవ్విస్తున్నారు. ఒక్కోసారి వారిలో ఉండే టాలెంట్ చూపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. తాజాగా కమెడియన్ ఇమ్మానుయేల్ కూడా ఇలాంటి లిస్ట్ లో చేరిపోయాడు. చూడడానికి నల్లగా ఉన్నా.. అదే తన బలంగా చేసుకొని బుల్లితెరపై దూసుకుపోతున్నాడు. 'జబర్దస్త్' షోలో వర్షతో కలిసి ఇమ్మాన్యుయేల్ చేసే కామెడీ మాములుగా ఉండదు.  ఈ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఒక్క 'జబర్దస్త్' షోలో మాత్రమే కాకుండా ఏ షోలైనా వీరిద్దరికీ స్పేస్ ఇవ్వాల్సిందే. అంతగా వీరి క్రేజ్ పెరిగింది. ఈ క్రమంలో తాజాగా తనలోని మరో కోణాన్ని బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు  ఇమ్మాన్యుయేల్. ఈ మధ్యకాలంలో చాలా ఈవెంట్స్ లో ఈ కమెడియన్ కనిపిస్తున్నాడు. చూడడానికి అమాయకంగా ఉన్నా.. అతడికి ఉన్న క్రేజ్ తో ముందువరుసలో ఉంటున్నాడు. తాజాగా 'శ్రీదేవి డ్రామా కంపెనీ' అనే టీవీ షోలో పాల్గొన్నాడు ఇమ్మాన్యుయేల్.  మదర్స్ డే సందర్భంగా మే 8న ప్రసారం కానున్న ఈ షోలో అమ్మ పాట పాడి అందరినీ ఆకట్టుకున్నాడు  ఇమ్మాన్యుయేల్. 'నాని' సినిమాలో 'పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మా' అనే పాట అందుకున్న ఇమ్మాన్యుయేల్.. పాటలో వచ్చే ఫిమేల్ వెర్షన్ ను కూడా తనే పాడి ఆశ్చర్యపరిచాడు. ఈ పాట విన్నవారంతా ఫిదా అయ్యారు. ప్రతీ ఒక్కరూ ఈ పాటకు కనెక్ట్ అయ్యారు. హైపర్ ఆది అయితే.. 'నీది మామూలు టాలెంట్ కాదురా బాబు' అంటూ  ఇమ్మాన్యుయేల్ ను తెగ పొగిడేశాడు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

పెళ్లి త‌ర్వాత తార‌క్ మారిపోయాడు!

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిజజీవితంలో చాలా సరదాగా ఉంటారు. పెళ్లికి ముందు అయితే ఎన్టీఆర్ తో ఆ ఎంజాయ్మెంట్ వేరేలా ఉండేదని అంటున్నాడు నటుడు సమీర్. పలు టీవీ సీరియల్స్, సినిమాల్లో నటించిన సమీర్.. ఎన్టీఆర్ కి మంచి స్నేహితుడు. తాజాగా ఓ చాన‌ల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమీర్.. ఎన్టీఆర్ క్యారెక్టర్ గురించి, తోటి నటులతో ఆయన ప్రవర్తించే తీరుపై స్పందిస్తూ కొన్ని పర్సనల్ విషయాలను బయటపెట్టారు. స్నేహానికి విలువనిచ్చే ఎన్టీఆర్ ఇండస్ట్రీలోని చాలా మంది నటీనటులతో ఎంతో సన్నిహితంగా ఉంటారు.  వర్క్ విషయంలో ఎంత సీరియస్ గా ఉంటారో మిగతా సమయంలో అంతకంటే ఎక్కువ సరదాగా ఉంటారని.. ఆయనతో కలిసి పనిచేవాళ్లు చెబుతుంటారు. నటుడు సమీర్ కి కూడా తారక్ చేసే అల్లరి పనుల గురించి బాగా తెలుసు. తాజాగా వీటి గురించి కొన్ని కబుర్లు చెప్పారు. పెళ్లికి ముందు ఎన్టీఆర్ పలు రకాల పార్టీలు చేస్తూ ఇంట్లోనే ఎక్కువగా ఎంజాయ్ చేసేవారని సమీర్ అన్నారు. ఎన్నోసార్లు ఆ పార్టీలకు తమను కూడా ఆహ్వానించారని చెప్పారు. రాజీవ్ కనకాల, శ్రీనివాస్ రెడ్డి, రాఘవ వంటి ఆర్టిస్ట్ లకు వీకెండ్స్ లో తారక్ నుండి ఫోన్ వచ్చేదని.. పార్టీ చేసుకుందాం వెంటనే ఇంటికి రావాలని ఆయన చెప్పేవారని సమీర్ గుర్తుచేసుకున్నారు.  అయితే పెళ్లి తరువాత ఎన్టీఆర్ పార్టీలు మానేశారని చెప్పుకొచ్చారు. షూటింగ్ లో ఎన్టీఆర్ చాలా సరదాగా ఉంటారని.. ఎవరైనా తప్పు చేస్తే సరదాగా షర్ట్ విప్పించి షూటింగ్ లో అలాగే ఉంచేవారని.. ఆయన ఇచ్చే పనిష్మెంట్ చాలా సరదాగా ఉండడంతో.. ఎవరికీ కోపం వచ్చేది కాదని తెలిపారు. ఎన్టీఆర్ లాంటి టాలెంటెడ్ నటుడిని ఎక్కడా చూడలేదని.. అయితే ఎన్టీఆర్ చేసే అల్లరి పనుల వలన రాజమౌళితో తిట్లు పడిన సందర్భాలు ఉన్నాయని సమీర్ చెప్పుకొచ్చారు.